clashes
-
కాకినాడ జిల్లా: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. ముగ్గురి మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం జరిగింది. ఇంటి స్థలం విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై మరో కుటుంబం దాడి చేసింది. ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఏం జరిగిందంటే?గ్రామంలోని ఎస్సీపేట చెరువు సమీపంలో పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబం ప్రయత్నించింది దీంతో ఇరువురి కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రకాశ్‌రావు అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రరావు, ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన సంజీవ్, పండు, దావీదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాదంలో మంచు ఫ్యామిలీ.. రాజీకి మనోజ్, విష్ణు రెడీ?
క్రమశిక్షణకు మారుపేరైన మంచు కుటుంబంలో.. వివాదం రాజుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పైగా మీడియా మీద మోహన్‌బాబు దాడి తర్వాత వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. -
సంభాల్ హింస: ఎంపీ సహా 400 మందిపై కేసు
ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సంభాల్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జియావుర్ రెహమాన్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.కాగా సంభాల్ పట్టణంలో మొగల్ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. చదవండి: ఘొర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామాపోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. స్పందించిన పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్, హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక సోమవారం సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్ చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడటంపై నిషేధం విధించారు.#WATCH | Delhi: On Sambhal stone pelting incident, Samajwadi Party MP Akhilesh Yadav says "Our MP Zia ur Rahman was not even in Sambhal and despite that an FIR was lodged against him...This is a riot done by the government...Right after the order was passed by the Court, police… pic.twitter.com/qwPGtpho1m— ANI (@ANI) November 25, 2024 -
శ్రీసత్యసాయి జిల్లా రేగాటిపల్లిలో కూటమి నేతల మధ్య రగడ
-
దుర్గాపూజ సందర్భంగా ఘర్షణలు
బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ఆదివారం దుర్గామాత విగ్రహం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు సోమవారం కూడా కొనసాగాయి. మహారాజ్‌గంజ్ ప్రాంతంలోని మన్సూర్ గ్రామంలో విగ్రహం ఊరేగింపులో డీజే భారీ శబ్ధం విషయమై వివాదం మొదలైంది. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనల్లో 22 ఏళ్ల వ్యక్తి చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. సోమవారం కొన్ని చోట్ల అల్లరి మూకలు కర్రలు, రాడ్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వీధుల్లో గుంపులుగా తిరుగుతూ లక్నో సేవా ఆస్పత్రికి, ఆ సమీపంలోని మెడికల్ స్టోరుకు నిప్పుపెట్టారు. ఆస్పత్రిలోని ఎక్స్‌రే యంత్రాన్ని ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. మరో చోట బైక్ షోరూంను అగ్నికి ఆహుతి చేయడంతో పలు వాహనాలు బూడిదయ్యాయి. పలువురి ఇళ్లకు, దుకాణాలకు నిప్పుపెట్టారు. ‘పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. అసాంఘిక శక్తులను గుర్తించాం’అని బహ్రెయిచ్ ఎస్పీ వృందా శుక్లా చెప్పారు. ఓ వ్యక్తికి చెందిన దుకాణం/ఇంటి నుంచే ఊరేగింపు పైకి కాల్పులు జరిపినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. హర్ది పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో సురేశ్ కుమార్ వర్మను, మరో పోలీస్ ఔట్‌పోస్ట్ ఇన్చార్జిని అధికారులు సస్పెండ్ చేశారు. మహ్సి ప్రాంతంలో రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా బ హ్రెయిచ్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయడంతోపాటు బహ్రెయిచ్ జిల్లా సరిహద్దులను అధికారులు మూసివేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. ఘటన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో సమావేశ మయ్యారు. ‘మహ్సిలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని వదిలిపెట్టం. అల్లరి మూకలను గుర్తిస్తాం. నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా కఠిన చర్యలుంటాయి’అని సీఎం చెప్పారు. అదేవిధంగా, విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సజావుగా కొనసాగేలా మత సంస్థల పెద్దలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించామన్నారు.అంత్యక్రియల సమయంలో ఉద్రిక్తతఆదివారం ఘర్షణల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సో మవారం అంత్య క్రియ లు జరిగాయి. శ్మశాన వాటికకు వెళ్లే క్రమంలో మహ్సి తహశీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి నిరసనకు దిగారు. అతడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేపట్టేది లేదని భీష్మించారు. అతడి మరణానికి కారణమైన వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని, వారి ఇళ్లను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సంజీవ్ , అదనపు డీజీపీ అమితాబ్ యాశ్ అక్కడికి చేరుకున్నారు. అమితాబ్ యాశ్ పిస్టల్ చేతబట్టుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించడం కనిపించింది. అనంతరం, బాధితుడి అంత్యక్రియలు ముగిశాయి.ప్రభుత్వంపై మండిపడ్డ ప్రతిపక్షాలుబహ్రెయిచ్లో ఘటనలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం చేతకానితనమే ఘర్షణలకు కారణమని ఆరోపించారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను ఆమె కోరారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే మహ్సిలో గొడవలు జరిగాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
మా యుద్ధం హెజ్బొల్లాతోనే.. మీతో కాదు!
Israel–Hezbollah Conflict Latest News: ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ రక్తమోడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాకా జరిగిన దాడిలో.. వంద మందికి పైగా చిన్నారులు, మహిళలు సహా మొత్తం 500 మంది మరణించారు. రెండు వేల మంది దాకా గాయాలపాలయ్యారు. అక్టోబర్ 7న గాజా సంక్షోభం మొదలయ్యాక.. ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(IDF) ప్రకటించుకుంది. పైగా ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించడం గమనార్హం.‘‘ముప్పు మాదాకా(ఇజ్రాయెల్) చేరడాని కంటే ముందు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఈ మేరకు ఆయన ఓ సందేశం విడుదల చేశారు. ‘‘లెబనాన్ ప్రజల్లారా.. మా యుద్ధం మీతో కాదు. మా యుద్ధం హెజ్బొల్లాతో. ఆ సంస్థ చాలాకాలంగా మిమ్మల్ని రక్షణ కవచంలా ఉపయోగించుకుంటోంది. మీరు ఉండే ఆవాసాల్లోనే ఆయుధాలను దాస్తోంది. హెజ్బొల్లా మా నగరాలను, ప్రజలనే లక్షంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగానే మేం వాళ్లపై దాడులు చేస్తూ.. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నాం’’ అని ఓ సందేశం విడుదల చేశారు. Message for the people of Lebanon: pic.twitter.com/gNVNLUlvjm— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 23, 2024హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా నెతన్యాహు కోరారు. ‘‘వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి మీరు మీ ప్రాణాలను రక్షించుకోండి. మా ఆపరేషన్ ముగిశాక.. మళ్లీ మీ నివాసాలకు తిరిగి వెళ్లొచ్చు’’ అని లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారుఇక.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధంలోకి లాగొద్దని ఆయన నెతన్యాహూను ఉద్దేశించి హితవు పలికారు.ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ లెబనాన్ మరో గాజా అయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల జోక్యంతోనైనా పరిస్థితులు చల్లబడాలని ఆయన కోరుకుంటున్నారు. గతేడాదే మొదలైంది..కిందటి ఏడాది జులైలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ షుక్రును ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దానికి ప్రతీకారంగా ఆగష్టు నుంచి వీలు చిక్కినప్పుడల్లా రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ సరిహద్దులో హెజ్బొల్లా విరుచుకుపడుతోంది. తాజాగా.. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిపోయి 37 మంది చనిపోగా.. వేల మంది గాయపడ్డారు. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోయారు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్.. ఆ దేశ భద్రతా ఏజెన్సీ మోస్సాద్ ఈ దాడులకు దిగాయని లెబనాన్ ఆరోపించింది. ఈ పరిణామం ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించింది. కిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా.. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు.హెజ్బొల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ ‘ఆపరేషన్ నార్తన్ ఆరోస్’ కొనసాగిస్తోంది. తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలిటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: వీళ్ల వైరం ఏనాటిదంటే..! -
రాళ్ల దాడులు, లాఠీచార్జి... ర్యాలీ హింసాత్మకం
కోల్‌కతా: ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కోల్‌కతాలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. ఇటు ఇసుక వేస్తే రాలనంత మంది విద్యార్థి నిరసనకారులు, అటు వారిని అడ్డుకునేందుకు వేలాదిగా మోహరించిన పోలీసులతో పరిస్థితి యుద్ధరంగాన్ని తలపించింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా వారికి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సచివాలయానికి దారితీసే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో దిగ్బంధించారు. వాటిని బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో ఖాకీలు లాఠీలకు పని చెప్పారు. గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడి, లాఠీచార్జిలో ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. మహిళలపై అకృత్యాలను అడ్డుకోవడం చేతగాని మమతా సర్కారు విద్యార్థులపై మాత్రం ప్రతాపం చూపుతోందంటూ దుయ్యబట్టింది.‘‘పోలీసు హింసాకాండకు బాధ్యత వహి స్తూ మమతా బెనర్జీ తక్షణం రాజీనామా చేయాలి. వైద్యురాలి హత్యలో నిజాలు వెలు గు చూసేందుకు వీలుగా పాలీ టెస్టులకు సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే రా ష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించింది. బుధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ర్యాలీ బీజేపీ గేమ్ప్లానేనని చెప్పేందుకు ఇదే నిదర్శనం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను దిగజార్చేందుకే ఆ పార్టీ కంకణం కట్టుకుంది’’ అంటూ మండిపడింది. బంద్ జ రగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ కుండబద్దలు కొట్టారు! ఉదయం నుంచే... విద్యార్థి సంఘమైన పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయ ర్యాలీ తలపెట్టారు. మరోవైపు డీఏ తదితర డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల అసమ్మతి వేదిక ‘సంగ్రామీ జౌతా మంచా’ కూడా మంగళవారమే చలో సచివాలయానికి పిలుపునిచ్చింది. నిరసనకారులంతా కోల్‌కతాలో పలు ప్రాంతాల నుంచి ఒక్క ఉదుటున సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీటిని భగ్నం చేసేందుకు ఏకంగా 6,000 మందికి పై చిలుకు బలగాలు రంగంలోకి దిగాయి. హౌరా బ్రిడ్జి, సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌తో పాటు నగరంలో పలుచోట్ల బారికేడ్లతో పోలీసులు ముందుగానే రోడ్లను దిగ్బంధించారు. బారికేడ్లపైకెక్కి దూకేందుకు ప్రయత్నించిన నిరసనకారులను నిలువరించేందుకు లాఠీచార్జీ చేయ డంతో చాలామంది గాయపడ్డారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు రాళ్లతో పాటు ఇటు కలు కూడా విసరడంతో 30 మంది దాకా పోలీసులు గాయపడ్డారు. ఎంజీ రోడ్, హేస్టి ంగ్స్ రోడ్, ప్రిన్సెప్ ఘాట్ తదితర ప్రాంతాలన్నీ ఘర్షణలకు వేదికగా మారాయి. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. ‘‘మేమేమీ చట్టాలను అత్రికమించలేదు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే విచక్షణారహితంగా కొట్టారు’’ అంటూ విద్యార్థులు మండిపడ్డారు. 33 మంది మహిళలతో పాటు మొత్తం 126 మంది ఛాత్ర సమాజ్ సభ్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి 200 పైచిలుకు మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రేపిస్టులకు మమత అండ: నడ్డా విద్యార్థుల శాంతియుత ర్యాలీపై పోలీసులు జులుం ప్రదర్శించారని బీజేపీ అధ్యక్షుడు జే పీ నడ్డా ఆరోపించారు. ‘‘మమత పాలనలో రేపిస్టులు, క్రిమినల్స్‌కు వ్యవస్థే అన్నివిధాలా అండగా నిలుస్తోంది. మహిళల భద్రత కో సం గళమెత్తడం బెంగాల్లో క్షమించరాని నేరంగా మారింది’’ అంటూ ఎక్స్ పోస్టులో ఎద్దేవా చేశారు. వైద్యురాలిపై హత్యాచారానికి పాల్ప డ్డ వారిని మమత సర్కా రే కాపాడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. చెవిటి సర్కారు: బీజేపీ మమతను కరడుగట్టిన నియంతగా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అభివర్ణించారు. న్యాయం కావాలంటూ ప్రజలు చేస్తున్న ఆక్రందనలు ఆమె చెవిటి సర్కారుకు విన్పించడం లేదని మండిపడ్డారు. అరాచక ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్‌కు పిలుపునిచి్చనట్టు తెలిపారు. విద్యార్థుల ర్యాలీపై పోలీసుల అణచివేతకు నిరసనగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాల్ బజార్ ప్రాంతంలో బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆయన విఫలయత్నం చేశారు. టియర్ గ్యాస్ ధాటికి స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అరెస్టు చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలంటూ సాయంత్రం దాకా అక్కడే బైఠాయించారు. మరోవైపు బుధవారం రాష్ట్రమంతటినీ స్తంభింపజేయడంతో పాటు సెపె్టంబర్ 6 దాకా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విపక్ష నేత సువేందు అధికారి ప్రకటించారు. బీజేపీకి చెందిన నలుగురు విద్యార్థి నేతలను మంగళవారం రాత్రే పోలీసులు మాయం చేశారని ఆయన ఆరోపించారు. వాటిని పోలీసులు ఖండించారు. వాళ్లను హత్యాయత్నం అభియోగాలపై అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీఎన్ఏ, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై...ఎయిమ్స్ వైద్యుల అభిప్రాయం వైద్యురాలి కేసులో సీబీఐ నిర్ణయం కోల్‌కతా: కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించిన డీఎన్ఏ, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని సీబీఐ నిర్ణయించింది. ప్రధాన నిందితు డు సంజయ్ రాయ్ తనంత తానుగా నే ఘోరానికి పాల్పడ్డాడా, అతని వెనక ఎవరన్నా ఉన్నారా అన్నదానిపై పక్కాగా నిర్ధారణకు వచ్చేందుకు వారిచ్చే నివేదిక ఉపయోగపడొచ్చని భావిస్తోంది. సంజయ్‌కి సన్నిహితుడైన ఏఎస్సై అనూప్ దత్తా కూడా ఈ ఘోరంలో అతనికి సా యపడ్డట్టు సీబీఐ అనుమానిస్తోంది. దత్తాకు పాలి టెస్టులు చేసేందుకు కోర్టు ను ఇప్పటికే అనుమతి కోరింది. మరో వైపు ఘోష్ హయాంలో ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై తాజాగా ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ‘కమిషనర్’ బైక్‌పై నిందితుడు! కోల్‌కతా: అత్యాచారం, హత్య జరిగిన రాత్రి ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోల్‌కతా పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్టరైన బైక్‌ను వాడినట్టు తేలడం ఆందోళనకరమని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ అన్నారు. వైద్యుల భద్రతపై టాస్‌్కఫోర్స్ తొలి సమావేశం భాగస్వామ్యపక్షాలతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరపాలని నిర్ణయం న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్‌్కఫోర్స్ తొలి సమావేశం మంగళవారం జరిగింది. భద్రతపై ప్రొటోకాల్ రూపొందించడానికి భాగస్వామ్యపక్షాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 10 మంది సభ్యులతో ఈ టాస్‌్కఫోర్స్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ సెక్రెటరీ నేతృత్వంలో జరిగిన తొలి సమావేశానికి సభ్యులందరితోపాటు కేంద్ర హోం శాఖ, ఆరోగ్య శాఖ కార్యదర్శులు సైతం హాజరయ్యారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతపై చర్చించారు. తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఇప్పటికే వివిధ భాగస్వామ్యపక్షాలతో మాట్లాడామని, తమకు దాదాపు 400 సలహాలు సూచనలు అందాయని టాస్‌్కఫోర్స్ సభ్యులు ఈ సందర్భంగా చెప్పారు. -
స్కూల్ కమిటీ ఎన్నికల్లో మళ్లీ కూటమి కుట్ర
సాక్షి, అమరావతి/నెల్లూరు సిటీ/కొనకనమిట్ల: ప్రశాంతంగా జరగాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు టీడీపీతోపాటు కూటమి నాయకులు రాజకీయరంగు పులిమారు. ఈ నెల 8వ తేదీన 40,150 పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆ రోజు 631 స్కూళ్లలో గ్రామస్థాయి కూటమి నాయకులు గొడవలకు దిగారు. దీంతో కోరం లేక 631 స్కూళ్లలో ఎన్నికలు నిలిచిపోయాయి. ఆ ఎన్నికల్ని విద్యాశాఖ అధికారులు శనివారం నిర్వహించగా.. కూటమి నేతలు మళ్లీ పాత పరిస్థితినే తీసుకొచ్చారు. పలుచోట్ల ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపిన తల్లిదండ్రులు వైఎస్సార్సీపీ మద్దతుదారులన్న నెపంతో మళ్లీ ఎన్నికలు నిలిపేసేందుకు యత్నించారు. పలుచోట్ల దళిత తల్లిదండ్రులపై దాడులు చేశారు. కొన్నిచోట్ల తమకు బలం లేదన్న అక్కసుతో ఎన్నికల్ని నిలిపేయించారు. టీడీపీ నాయకుల అరాచకాలతో కొన్నిచోట్ల పేరెంట్స్ తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి నాయకుల కుట్రలకు కొన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు సైతం వత్తాసు పలకడం గమనార్హం. మొత్తంమీద టీడీపీ నేతల కుట్రలతో 282 పాఠశాలల్లో కమిటీ ఎన్నికలు నిలిచిపోయాయి. దళితులపై దౌర్జన్యం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గొల్లకందుకూరు పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలను టీడీపీ నేతలు మరోసారి వాయిదా వేయించారు. ఇక్కడ వైఎస్సార్సీపీ వర్గానికి 15 ఓట్లు ఉండగా, టీడీపీ వర్గానికి 6 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయంతో టీడీపీ నేతలు స్థానిక దళితులైన ఇద్దరు పేరెంట్స్‌ను భయభ్రాంతుల్ని చేశారు. దళితుడైన నారాయణ ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తుండటంతో దాడిచేశారు. ఎన్నికల్లో పాల్గొంటే అంతు చూస్తామని బెదిరించారు. మరో దళితుడు వెంకటరమణయ్యను రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంఈవో ఎన్నికలను మరోసారి వాయిదా వేశారు. టీడీపీ వర్గీయుల అరాచకాలను నిరసిస్తూ 13 మంది పేరెంట్స్ తమ పిల్లలను మరో పాఠశాలలో చేర్చాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని కాట్రగుంట పంచాయతీ పేరారెడ్డిపల్లి యూపీ పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల్ని ఆపాలని టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతోపాటు వైఎస్సార్సీపీ మద్దతుదారులే కమిటీ సభ్యులుగా ఎన్నికవడంతో ఉక్రోషం పట్టలేని టీడీపీ కార్యకర్త కె.బసవయ్య పాఠశాల సభ్యులున్న గదిలోకి వెళ్లి టేబుల్‌పై ఉన్న పేపర్లు చించి బయటవేశాడు. 99.38 శాతం ఎన్నికలు పూర్తి ఎస్పీడీ శ్రీనివాసులు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు 99.38 శాతం పాఠశాలల్లో పూర్తయ్యాయని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. జీరో ఎన్రోల్మెంట్, పాఠశాలల మూసివేత, కోరం లేకపోవడం వంటి కారణాలతో 282 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. -
బ్రిటన్‌లో వలసదారులపై దాడులు తీవ్రం
లండన్: వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు ఇచ్చిన పిలుపుతో బ్రిటన్వ్యాప్తంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. లివర్‌పూల్, హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్పూల్, స్టోక్ ఆన్ ట్రెంట్, బెల్ఫాస్ట్, నాటింగ్‌హామ్, మాంచెస్టర్లలో శనివారం వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. పలు చోట్ల పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగారు. 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివాదుల చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధాని కెయిర్ స్టార్మర్ ఆదేశించారు. నేరపూరిత చర్యలకు తగు మూల్యం తప్పదని హోం మంత్రి వివెట్ కూపర్ హెచ్చరించారు. ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ (ఈడీఎల్) అనే గ్రూపు ఈ గొడవలకు కారణమని చెబుతున్నారు. వారం క్రితం సౌత్‌పోర్ట్‌లో కత్తిపోట్లకు ముగ్గురు చిన్నారులు బలైన ఘటన అనంతరం వలసదారులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. శరీరం రంగును బట్టి దాడులు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఏం మాట్లాడుతున్నావ్!.. ఎమ్మెల్యే Vs ఎమ్మెల్సీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం రచ్చరచ్చగా మారింది. వికారాబాద్ జెడ్పీ భవన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మధ్య మాటల యుద్ధం సాగింది.అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. భవన నిర్మాణ కాంట్రాక్టు మహేందర్ రెడ్డి దే కదా ! జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ యాదయ్య వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ యాదయ్యను పట్నం మహేందర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఏం మేం మాట్లాడవద్దా అంటూ ఎమ్మెల్యే యాదయ్య కౌంటర్ ఇచ్చారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరి మధ్య కలుగజేసుకొని వివాదం సద్దుమణిగించారు. -
సురేఖ-సీతక్క లొల్లిపై క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఇద్దరూ ఉమ్మడి వరంగల్‌కు చెందిన మహిళా నేతలు. పైగా మంత్రులు. కానీ, ఒకరంటే ఒకరికి పడడం లేదు. కనిపిస్తే కనీసం పలకరించుకోవడం లేదు సరికదా.. కలిసి పని చేయడం లేదు కూడా. మేడారం జాతర, లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య విబేధాలు పబ్లిక్‌గా బయటపడ్డాయి.. అంటూ తాజాగా ఓ కథనం వెలువడింది. అయితే దీనిపై ఈ మంత్రులిద్దరూ స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందట. రాజకీయాలు, పాలనా విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయట. పైచేయి సాధించేందుకు ఇద్దరూ పోటాపోటీ వ్యూహాలను అమలు చేస్తున్నారట. గతంలో మేడారం జాతర సమయంలో వీరి మధ్య మొదలైన పంచాయితీ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ఇన్చార్జి మార్పు విషయంలో తీవ్రస్థాయికి చేరిందట.. అంటూ ఓ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. అయితే దీనిపై ఇద్దరూ మండిపడ్డారు.తమ మధ్య విబేధాలు అనే వార్తలను సంయుక్తంగా ఈ ఇద్దరు మంత్రులు ఖండించారు. పరస్పర అవగాహనతో కలిసి మేం ముందుకు సాగుతున్నామని, మహిళా మంత్రుల మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని స్పందించారు. పైగా ఆ కథనాలు మహిళా గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతికి, రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలి అని మంత్రులిద్దరూ హితవు పలికారు. -
సందేశ్‌ఖాలిలో మళ్లీ హింస
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవగానే పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలిలో ఆదివారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసేందుకు అగర్హటి గ్రామానికి వెళ్లిన బలగాలపై మహిళలు దాడికి దిగారు. మహిళా సిబ్బంది గాయపడ్డారు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని విడిపించుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను బలగాలు అడ్డుకున్నాయి. జనవరి 5వ తేదీన రేషన్ కుంభకోణం కేసులో తనిఖీల కోసం సందేశ్‌ఖాలీకి వెళ్లిన ఈడీ బృందంపై దాడి, అనంతరం టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. -
Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
న్యూఢిల్లీ/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల క్రతువులో మరో అంకం ముగిసింది. సోమవారం ఐదో విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమబెంగాల్లో అక్కడక్కడలా స్వల్ప ఘర్షణలు, ఒడిశాలో కొన్నిచోట్ల ఈవీఎంలలో చిన్న సమస్యలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 59.06 శాతం పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో అత్యధికంగా 73.14, మహారాష్ట్రలో అత్యల్పంగా 54.22 శాతం పోలింగ్ జరిగింది. జమ్మూ కశీ్మర్లోని బారాముల్లాలో ఏకంగా 59 శాతం పోలింగ్ నమోదవడం విశేషం! ఇది ఆ లోక్‌సభ స్థానం చరిత్రలోనే అత్యధికం. గత నాలుగు విడతల్లో కలిపి 66.95 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారంతో జమ్మూ కశీ్మర్, మహారాష్ట్రల్లో అన్ని స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తమ్మీద ఇప్పటిదాకా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 428 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగతా 115 స్థానాలకు మే 25, జూన్ 1న ఆరు, ఏడో విడతల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. బెంగాల్లో ఘర్షణలు పశ్చిమబెంగాల్లో పలుచోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒడిశాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్తున్న ఆటోను అడ్డుకుని డ్రైవర్‌ను నరికి చంపారు. యూపీలో 14 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ఎలాంటి ఘర్షణలూ లేకుండా ముగిసింది. ముంబై సౌత్ పరిధిలో ఒకొ పోలింగ్ బూత్‌లో 56 ఏళ్ల ఎన్నికల అధికారి గుండెపోటుతో మరణించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాం«దీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, స్మృతీ ఇరానీ, కౌశల్ కిశోర్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, ప్రతాప్సింగ్వర్మ తదితరులు ఐదో విడతలో బరిలో ఉన్నారు. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత
లాస్ఏంజెలిస్: పాలస్తీనా–ఇజ్రాయెల్ రగడ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాస్ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బైడెన్ ప్రభుత్వ ఇజ్రాయెల్ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకుని నిరసనలను సాగిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతబట్టుకుని మంగళవారం అర్ధరాత్రి టెంట్లపైకి దాడికి దిగారు. బాణసంచా కూడా కాల్చినట్టు లాస్ఏంజెలెస్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతోపాటు అందిన వస్తువులను విసురుకున్నారు. వర్సిటీని పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకుని తమను లోపలికి రానివ్వడం లేదన్న ఇజ్రాయెల్ అనుకూల విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. హింసాత్మక ఘటనల కారణంగా వర్సిటీలో బుధవారం తరగతులు రద్దయ్యాయి. సోమవారం కొలంబియా వర్సిటీ కూడా ఈ ఘర్షణలకు వేదికవడం తెలిసిందే. హామిల్టన్ హాల్లో దాదాపు 20 గంటలపాటు తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. వర్సిటీతోపాటు సిటీ కాలేజీలో ఆందోళనలకు దిగిన దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో టెంట్లు వేసి నిరసన సాగిస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించారు. కొద్ది వారాలుగా అమెరికాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు వర్సిటీలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్ ఐలాండ్స్ క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థి వర్గంతో బ్రౌన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి వర్సిటీలోకి ఇజ్రాయెల్ వ్యక్తుల పెట్టుబడులను స్వీకరించరాదనేది వారిలో ప్రధాన షరతు. ఆందోళనకారుల డిమాండ్‌కు ఇలా ఒక యూనివర్సిటీ తలొగ్గడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు! -
Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
పార్లమెంట్లో ఎంపీలు తీవ్రంగా విమర్శలు చేసుకోవటం వింటున్నాం. కానీ చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకోవటం చూశారా? మాల్దీవుల పార్లమెంట్లో అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు బాహాబాహికి దిగారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కేబినెట్లోని మంత్రుల సంబంధించి పార్లమెంట్ ఆమోదం కోసం ఆదివారం ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తీవ్రమైన ఘర్షణ చెలరేగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం మాల్దీవుల ప్రజా ప్రతినిధుల ఘర్షణ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. *Viewer discretion advised* Parliament proceedings have been disrupted after clashes between PPM/PNC MPs and opposition MPs. pic.twitter.com/vhvfCBgQ1s — Adhadhu (@AdhadhuMV) January 28, 2024 అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC), ప్రభుత్వ అనుకూల పార్టీ ప్రొగ్రెసీవ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్(PPM) ఎంపీలకు... ప్రతిపక్ష పార్టీ మాల్దీవీయిన్ డెమోక్రటిక్ పార్టీ (MDP)ఎంపీల మధ్య గొడవ జరిగింది. అయితే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కేబినెట్లో నలుగురు మంత్రుల ఆమోదానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియజేశారు. ఈ క్రమంలోనే పీఎన్సీ ఎంపీ షహీమ్.. ఎండీపీ ఎంపీ ఇసా కాలు పట్టుకొని నేలపై పడగొట్టాడు. దీంతో ఇసా... షహీమ్ మెడపై పిడిగుద్దులు గుద్దాడు. సహచర ఎంపీలు వారిగొడవను శాంతింపచేశారు. తీవ్రంగా గాయపడ్డ షహీమ్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మంత్రి వర్గంలోని మంత్రులకు ఆమోదం తెలపకపోవటంతో పాటు స్పీకర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ చేశాయి. మరోవైపు కెబినెట్లో మంత్రులకు ఆమోదం తెలపకపోవటం ప్రజా సేవలకు విఘాతం కల్పించడమేనని ప్రతిపక్షాలపై అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ పార్టీ మండిపడుతోంది. చదవండి: Dinosaurs: పక్షులు డైనోసార్ల వంశమా? -
పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో టీడీపీలో వర్గవిభేదాలు, అంతర్గత వివాదాలు బయట పడుతున్నాయి. తెలుగుదేశం తమ్ముళ్లు బహిరంగానే కుమ్ములాటకు దిగుతున్నారు. తాజాగా కాకినాడు జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉప్పాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీల సమావేశం జరిగింది. ఈ క్రమంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతల ఆందోళన దిగారు. ఇలా ఎందుకు జరిగిందని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నాయకులు నిలదీశారు. దీంతో ఇది టీడీపీ కార్యక్రమం అంటూ వర్మ సమాధానం చెప్పాడు. వర్మ సమాధానంపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు తెగేసి చెప్పారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలావరకు ఫైనల్ అయిందని టీడీపీ నేత బోండా ఉమ మహేశ్వర రావు అన్నారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది, అవే ప్రకటించారని అన్నారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారని అన్నారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. చదవండి: మాకు చెప్పకుండానే రెండు సీట్లు ప్రకటించారు -
ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్
ముంబై: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా రోడ్డు) మహారాష్ట్ర సర్కార్ బుల్డోజర్ చర్యకు దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేసింది. మీరా రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్‌లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి ఊరేగింపు నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్రలో చేపట్టిన ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్డులో కార్లు, బైక్‌లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు. చదవండి: Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు ఈ ర్యాలీలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్ నిందితుల స్థలాల వద్ద బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. కాగా బుల్డోజర్ యాక్షన్ అనేది ముందుగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రారంభించింది. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వంటి వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాలను బుల్డోజర్తో కూల్చివేస్తూ వస్తుంది. తరువాత ఇదే పద్దతిని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుసరిస్తన్నాయి. తాజాగా రాజస్థాన్‌కు బుల్డోజర్ యాక్షన్ వ్యాపించింది. -
మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. 13 మంది మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. తెంగ్నౌపాల్ జిల్లాలో అల్లరిమూకలకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనా ప్రాంతంలో దాదాపు 13 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. “ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు లీతు గ్రామంలో 13 మృతదేహాలను కనుగొన్నాయి. మృతదేహాల పక్కన ఎలాంటి ఆయుధాలను గుర్తించలేదు. లీతు ప్రాంతంలో మరణించిన వ్యక్తులు స్థానికులు కాదు. వారు వేరే ప్రాంతం నుండి వచ్చి మరొక సమూహంతో కాల్పులు జరిపి ఉండవచ్చు. చనిపోయిన వారి వివరాలు ఇప్పటికి తెలియదు” అని ఓ అధికారి తెలిపారు. భారత ప్రభుత్వానికి మెయిటీ మిలిటెంట్ వర్గమైన UNLF మధ్య డిసెంబర్ 3న జరిగిన 'శాంతి ఒప్పందాన్ని' తెంగ్నౌపాల్ జిల్లాలోని కుకీ-జో గిరిజన సమూహాలు స్వాగతించాయి. ఈ పరిణామాల తర్వాత డిసెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను మణిపూర్ ప్రభుత్వం ఆదివారం పునరుద్ధరించింది. ఇదే జిల్లాలో కాల్పుల ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మణిపూర్‌లో మే నెల నుంచి అల్లర్లు చెలరేగుతున్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. మెయితీ తెగలకు గిరిజన హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ చొరవతో కొన్ని రోజులుగా పరిస్థితి కాస్త మెరుగుపడింది. కానీ తాజాగా మళ్లీ కాల్పుల ఘటన జరగడం ఆందోళనకు దారి తీస్తోంది. ఇదీ చదవండి: Mizoram Election Results 2023: సీఎం జోరంతంగాపై విజయ ఢంకా -
జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ
సాక్షి, కాకినాడ జిల్లా: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ కూడా తనవైపే ఉన్నాడని, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్రకు సీటు ఇస్తే పొత్తులో ఉండనంటూ జ్యోతుల స్పష్టం చేయడంతో సమావేశాన్ని సూర్యచంద్ర బహిష్కరించారు. దీంతో జ్యోతుల తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య తోపులాట చోటు చేసుకుంది. జనసేన-టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. కాగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వెలుపల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించిన నాటినుంచి ఇదే తీరు కనిపిస్తోంది. గత మంగళవారం.. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సమన్వయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు బండబూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సమన్వయ సమావేశమని ప్రకటించినా.. ఇరుపక్షాలు ఎదురెదురుగా బల్లలు, కుర్చీలు వేసుకుని వాదోపవాదాలకు దిగారు.. తాజాగా జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. చదవండి: మరోసారి బయటపడ్డ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు -
టీడీపీ జనసేన సమావేశంలో గందరగోళం..
-
ఇదేం మేనిఫెస్టో?: హరిరామజోగయ్య
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు కూడా మేనిఫెస్టోలో లేవని అన్నారాయన. పొత్తులో ఉన్న జనసేన టీడీపీలు ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో విడుదల చేశాయి. అయితే అది అంత ఆకర్షనీయంగా లేదని హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. ‘‘మేనిఫెస్టోలో ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు లేవు. ఇరు పార్టీలు తయారు చేసిన మినీ మేనిఫెస్టో అంత ఆకర్షనీయంగా, జనరంజకంగా లేదు. కనీసం నాలుగు కోట్ల మంది సంతృప్తి పడే విధంగా మేనిఫెస్టో రూపొందించడం శ్రేయస్కరం. .. పైగా అధికార వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ మేనిఫెస్టో ఏమాత్రం సరితూగదని లేఖలో ప్రస్తావించారాయన. సమన్వయంగా సాధించేది ఏంటి? తెలుగు దేశం పార్టీతో పొత్తుపై వ్యతిరేకత నెమ్మదిగా బయటకు వస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న సమన్వయ సమావేశాలు అందుకు వేదిక అవుతున్నాయి. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత రాజమండ్రి జైలు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటించారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరుగా ఉంటోందని జనసేన కేడర్ చెబుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమన్వయ సమావేశాల్లో ఇరు పార్టీల కేడర్ నుంచి కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు పరస్పరం ఎదురవుతున్నాయి. ‘‘ఇన్నాళ్లు టీడీపీని ఎందుకు విమర్శించారు? ఇప్పుడు ఎందుకు చంకనెక్కారు?. ఇంకెన్నాళ్లు ఎజెండా పక్కనబెట్టి పక్క పార్టీ జెండా మోద్దాం?. అసలు జనసేనకు ఎన్ని సీట్లిస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు?. రెండు పార్టీల మ్యానిఫెస్టో అంటూ ఒకటే తయారు చేస్తున్నారు.. దానికి గ్యారంటీ ఏంటీ?. తెలంగాణ తరహాలో జనసేన అభ్యర్థులుగా టీడీపీ నేతలే బరిలో దిగుతారా?. అసలు పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు?. మీకే నియోజకవర్గాల్లో గ్యారంటీ లేకుంటే.. రెండు పార్టీల భవిష్యత్తుకు ఏం గ్యారంటీ ఉంటుంది?. క్షేత్ర స్థాయిలో జనసేన క్యాడర్‌ను తెలుగుదేశం నేతలు అసలు పట్టించుకోవడం లేదు, దానికేమంటారు?. కొన్ని చోట్లయితే మరీ వివక్ష చూపిస్తున్నారు, సభలు పెట్టుకుంటే వచ్చి జెండా పట్టుకోమంటున్నారు?’’.. ఇలా పలు ప్రశ్నలు లెవనెత్తినట్లు సమాచారం. -
కల్లోలాలు మంచివి కావు
న్యూఢిల్లీ: ఘర్షణలు, కల్లోలాలు ఏ పక్షానికీ మంచి చేయబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలకు విచి్ఛన్న ప్రపంచం పరిష్కారాలు చూపజాలదన్నారు. ఇది శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొనాల్సిన సమయమని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు నానాటికీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం ఇక్కడ మొదలైన జీ20 పార్లమెంటరీ స్పీకర్ల 9వ సదస్సు ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో పలు చోట్ల ప్రస్తుతం ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు. కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయమిది’’ అని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ పోరుకు తక్షణం తెరపడాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసంతో మానవ విలువలకు పెద్ద పీట వేయడమే ఇందుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదమే మార్గం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపడమే ఏకైక మార్గమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. మా దేశంలో వేలాదిగా అమాయకులను బలి తీసుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే మానవత్వానికి మాయని మచ్చ‘ అని పునరుద్ఘాటించారు. ఇంత జరిగినా ఉగ్రవాదాన్ని నిర్వచించే అంశం మీద కూడా ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయానికి రాలేకపోవడం శోచనీయమన్నారు. మహిళా భాగస్వామ్యానికి ప్రోత్సాహం భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నట్టు మోదీ తెలిపారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో సగం మేరకు వాళ్లే ఉన్నట్టు పార్లమెంటుల స్పీకర్లకు వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ ఇటీవలే పార్లమెంటులో చట్టం కూడా చేసినట్టు చెప్పారు. ‘నేడు భారత్ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యంతో కళకళలాడుతోంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మహిళల చురుకైన పాత్ర దేశ ప్రగతికి చాలా కీలకం‘ అని అన్నారు. భారత్‌లో 28 భాషల్లో ఏకంగా 900కు పైగా టీవీ చానళ్లు, దాదాపు 200 భాషల్లో 33 వేలకు పైగా వార్తా పత్రికలు ఉన్నాయని వారికి వివరించారు. ప్రపంచమంతటా దేశాల నాయకత్వ స్థానంలో మహిళలు ఎక్కువగా ఉంటే బహుశా ఇన్ని యుద్ధాలు జరిగేవి కాదని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ దుతర్తే పచెకో అభిప్రాయపడ్డారు. -
కవ్విద్దాం.. రెచ్చగొడదాం..
సాక్షి, అమరావతి: ఎన్ని జాకీలతో పైకి లేపినా లోకేశ్ యువగళం పాదయాత్రకు జనాదరణ రాకపోవడంతో ఘర్షణలు సృష్టించడం ద్వారా లబ్ధి పొందడానికి తెలుగుదేశం పార్టీ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీ కనిపించినా, వైఎస్సార్సీపీ జెండా కనిపించినా ఓర్వలేని రీతిలో పాదయాత్రలో టీడీపీ రౌడీలు విధ్వంసం సృష్టిస్తున్నారు. రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. లోకేశ్ నిర్వహించే సభలు, యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇలా వైఎస్సార్సీపీ శ్రేణులను కవ్వించడం, రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. తద్వారా ఘర్షణలు చలరేగేలా చేసి పాదయాత్రపై ప్రజల దృష్టి పడాలని కోరుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం వైఎస్సార్సీపీ శ్రేణుల్ని కవ్వించి, చివరికి వారిపైనే దాడులకు దిగారు. లోకేశ్ బహిరంగ సభ జరిగే ప్రాంతంలో ఉన్న సీఎం జగన్ ఫ్లెక్సీపైకి టీడీపీ రౌడీ మూకలు రాళ్లు విసరడం, అడ్డుకున్న పోలీసులను సైతం గాయపరచడం, యాత్ర వెళ్లే రూటులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనా విచక్షణారహితంగా దాడులు చేయడం ద్వారా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. గత కొన్ని నెలలుగా చంద్రబాబు, లోకేశ్ యాత్రల సందర్భంగా టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగడం, మళ్లీ తమపైనే దాడులు జరిగాయని ఎదురుదాడి చేయడం పరిపాటిగా మారింది. పథకం ప్రకారమే ఉద్రిక్తతలు సీఎం జగన్‌ను బూతులు తిట్టడం ద్వారా మీడియా దృష్టిలో పడేందుకు లోకేశ్ నోటికి పనిజెప్పారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో అధికార పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చింపి వేయించడం ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఏవైనా సూచనలు చేస్తే పోలీసులతో గొడవలకు దిగడం నిత్యకృత్యంగా మారింది. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం తన వెనుక ఉన్న అల్లరి మూకల ద్వారా లోకేశ్ చేయిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ఇథియోపియాలో వైమానిక దాడి.. 26 మంది మృతి
నైరోబీ: ఇథియోపియాలోని కల్లోలిత అంహారా ప్రాంతంలోని ఓ పట్టణ కూడలిలో జరిగిన వైమానిక దాడిలో 26 మంది మరణించారు. మరో 55 మంది గాయాలపాలయ్యారు. ఈ మేరకు ఆ దేశానికి చెందిన సీనియర్ వైద్యాధికారి సోమవారం వెల్లడించారు. స్థానిక మిలీషియా ముఠాలను నిర్వీర్యం చేసేందుకు దేశ ఆర్మీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ఫినోట్ సెలామ్లోని కమ్యూనిటీ సెంటర్‌పై ఆదివారం ఉదయం వైమానిక దాడి జరిపింది. ఇదిలా ఉండగా గతవారం అమ్హారా ప్రాంతంలోని కీలక పట్టణాలను సైనిక చర్య ద్వారా ఇథియోపియా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులకు ఆహారం అందించి ఓ ట్రక్కుపై వెనక్కు వస్తున్న కొందరు వ్యక్తులను లక్ష్యంగా వైమానిక దాడులు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. చదవండి: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా కకర్ ప్రమాణం -
అగ్ని గుండంగా రాష్ట్రం.. ఇదీ మణిపూర్ కథ..!
మణిపూర్ చరిత్ర అంటే రాజులు, సంస్థానాలు, ఆక్రమణలు, చొరబాట్లు మాత్రమే కాదు. భిన్న సంప్రదాయాలు, సంస్కృతులు కలిగిన జాతుల కలబోత. విభిన్న తెగల వారు ఒకే చోట సహజీవనం చేసే మణిహారం. మెయిటీలు, కుకీల మధ్య మూడు నెలలుగా జరుగుతున్న ఘర్షణలు రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ చరిత్ర అందరిలోనూ ఆసక్తిని పెంచింది. మణిపూర్ లోయ ప్రాంతంలో మెయిటీలు, నాగా, జొమి ఇలా 124 తెగలు నివసిస్తూ ఉంటే మణిపూర్ కొండల్లో 38 గిరిజన తెగలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కుకీల ప్రాబల్యం ఎక్కువ. ఈ వర్గాల మధ్య ఘర్షణలు ఇప్పుడు కొత్తేం కాదు. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో మెయిటీలు, కుకీల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. చరిత్రలోకి తొంగి చూస్తే మణిపూర్‌కు సంబంధించిన చారిత్రక ఆధారాలు క్రీ.శ. 33వ సంవత్సరం నుంచి ఉన్నాయి. అయితే, అంతకు ముందు సైతం ఇంఫాల్ లోయలో మానవ నాగరికత వెల్లివిరిసినప్పటికీ అక్కడ ఉన్న వారంతా మెయిటీ వర్గీయులు అని చెప్పడానికి వీల్లేదు. టిబెట్, బర్మా నుంచి మెయిటీలు వలస వచ్చినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భారత్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన నింగ్‌డౌ వంశీకులు మణిపూర్ లోయను పాలించారు. మణిపూర్ రాజులు, ప్రజలు 18 వ శతాబ్దం వరకు సనామహిజం అనే దేశీయ మత విశ్వాసాల్ని ఆచరించారు. 15వ శతాబ్దంలో లోయను పాలించిన క్యంబ అనే రాజు విష్ణమూర్తి దేవాలయాన్ని నిర్మించాడు. అప్పట్నుంచి లోయలోకి బ్రాహ్మణుల రాక ప్రారంభమైంది. అప్పట్లోనే మణిపూర్ లోయను పాలించిన రాజులు హిందువులుగా మారారా అన్న చర్చ ఉంది. అయితే 1704వ సంవత్సరంలో రాజు చరియారోంగ్బా తన కుటుంబంతో సహా హిందూమతంలోకి మారారు. అప్పట్నుంచి ఇంఫాల్ లోయలో హిందువుల ప్రాబల్యం పెరిగింది. నింగ్‌డౌ వంశీకులే 1724లో ఈ ప్రాంతానికి మణిపూర్ (మణిమాణిక్యాలకు నిలయం) అని పేరు పెట్టారు. కుకీల ప్రస్తావన తొలిసారి ఎప్పుడంటే కొన్ని వందల శతాబ్దాల కిందటే మణిపూర్ లోయ ప్రాంతంలో మెయిటీల ఉనికి ఉంది. కానీ కుకీల ప్రస్తావన 17వ శతాబ్దంలో తొలిసారిగా తెలిసింది. 1777లో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారెన్ హేస్టింగ్స్ ఉన్నప్పుడు చిట్టగాంగ్‌లో బ్రిటీషర్లపై ఒక తెగ దాడి సందర్భంగా తొలిసారిగా కుకీల ప్రస్తావన వినిపించింది. బ్రిటీష్ రచనల్లో కుకీలను పాత కుకీలు, కొత్త కుకీలుగా విభజించారు. ఆంగ్లో, బర్మా యుద్ధం (1824–1826) జరిగినప్పుడు బర్మా నుంచి వచ్చినవారే కొత్త కుకీలు అని బ్రిటీష్ రచనల ద్వారా తెలుస్తోందని రచయిత, చరిత్రకారుడు మలేమ్ నింగ్‌తౌజ వెల్లడించారు. అప్పట్నుంచే మెయిటీల డిమాండ్ 1819లో మణిపూర్‌పై బర్మా దురాక్రమణకు దిగింది. దీంతో మణిపూర్ రాజులు బ్రిటీష్ సాయం కోరారు. అప్పట్నుంచి 1891 వరకు మణిపూర్ తెల్లదొరల సంరక్షణలో ఉంది. తర్వాత సంస్థానా«దీశుల చేతికొచ్చింది. సంస్థాలన్నీ భారత్‌లో విలీనమయ్యాయి. స్వాతంత్య్రం తర్వాత 1949 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి మణిపూర్ అధికారికంగా భారత్‌లో అంతర్భాగమైంది. ఆ సమయంలో మెయిటీలకు ఎస్టీ హోదా ఇవ్వాలన్న చర్చ వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కుకీలకు తెల్లదొరల అండ బ్రిటిష్ పాలకుల అండదండలతో కుకీలు మణిపూర్ కొండప్రాంతాల్లో స్థిరపడ్డారు. నాగా తెగల దాడుల నుంచి లోయ ప్రాంతాలను రక్షించే పనిలో ఉండేవారు. ఓ రకంగా బ్రిటీష్ పాలకుల కిరాయి సైన్యంగా పని చేసేవారు. తెల్లదొరలు తమ వ్యూహంలో భాగంగా ఒక తెగకి వ్యతిరేకంగా మరో తెగని, వారికి వ్యతిరేకంగా ఇంకో తెగవారిని ప్రోత్సహించారు. కొండ ప్రాంతాల్లో కుకీల ప్రాబల్యం పెరిగిపోవడానికి బ్రిటీష్ వారి వ్యూహాలే కారణమని మలేమ్ నింగ్‌తౌజ అభిప్రాయపడ్డారు. నేటి ఘర్షణలకు మూలం మణిపూర్ ఘర్షణలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. లోయ ప్రాంతాల్లో నివసించే మెయిటీలు ఎస్టీ హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉంటే కొండప్రాంతంలో ఎస్టీ హోదా ఉన్న కుకీలు తమకు ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం కావాలని పట్టుబడుతూ ఉండడంతో మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. 1949 తర్వాత మయన్మార్ నుంచి అక్రమ వలసదారులు భారీగా వచ్చి కుకీ సమాజంలో కలిసిపోయారని అదే నేటి ఘర్షణలకు మూలమని రచయిత, చరిత్రకారుడు నింగ్‌తౌజ తెలిపారు. మణిపూర్ చరిత్రతో నేటి ఘర్షణలకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఏర్పాటు చేసుకున్న అక్రమ వలసదారుల్ని ఏరివేయడానికి రాష్ట ప్రభుత్వం చేపట్టిన చర్యలు కుకీలలో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో మణిపూర్‌కు చెందిన కొన్ని సంస్థలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ప్రదర్శన నిర్వహిస్తూ 1951 తర్వాత అక్రమంగా వచ్చిన వలసదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యలు, సవాళ్లతోనే మణిపూర్ జాతుల సంఘర్షణ సంక్లిష్టంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్