సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గన్‌ఫౌండ్రికి చెందిన శైలేందర్, ఓంప్రకాష్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. బీ ఫామ్ తీసుకునేందుకు వచ్చిన ఓం ప్రకాష్‌పై శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి యత్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. టీడీపీ నుంచి వచ్చిన ఓంప్రకాష్‌కు టికెట్ ఎలా కేటాయిస్తారని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యకర్తలకు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ అన్యాయం చేస్తున్నారని నినాదాలు చేశారు. (చదవండి: గ్రేటర్ వార్: సందిగ్ధతకు తెర దించిన ఒవైసీ..)
Comments
Please login to add a commentAdd a comment