‘ప్రభాస్‌-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..! | Prabhas And Pooja Hegde Not On Good Terms? Radha Shyam Makers Clarity | Sakshi
Sakshi News home page

Radhe Shyam: ‘ప్రభాస్‌-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..!

Published Wed, Sep 22 2021 1:11 PM | Last Updated on Wed, Sep 22 2021 1:49 PM

Prabhas And Pooja Hegde Not On Good Terms? Radha Shyam Makers Clarity - Sakshi

Radhe Shyam Makers Respond On Clashes Betwen Prabhas-Pooja Hegde: 'ప్రభాస్‌-పూజా హెగ్డే మధ్య విభేదాలు తలెత్తాయా? ఇప్పటి వరకు నుంచి మిస్టర్‌ కూల్‌గా ఉన్న ప్రభాస్‌కు పూజా కోపం తెచ్చింపిందా' గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఈ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. టాప్‌ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ టాప్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది.ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో రాధేశ్యామ్‌ సినిమాలో  నటిస్తుంది. అయితే సెట్‌లో మాత్రం పూజా తీరు ఏ మాత్రం బాగోలేదని, టాప్‌ హీరోయిన్‌ అన్న ఈగోతో ప్రతిరోజు షూటింగ్‌కు లేట్‌ వస్తుందని వార్తలు గుప్పుమన్నాయి.

పూజా తీరుతో ఎంతో కూల్‌గా ఉండే ప్రభాస్‌ సైతం విసిగిపోయారని, దీంతో ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్‌ సీన్స్‌ సైతం విడివిడిగా షూట్‌ చేస్తున్నట్లు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ‘రాధేశ్యామ్‌’టీం స్పందించింది. ప్రభాస్‌కు, పూజా హెగ్డేకు మధ్య విబేధాలు అన్న వార్తల్లో నిజం లేదని, అంతేకాకుండా పూజా మంచి టైం సెన్స్‌ పాటిస్తుందని, ఆమెతో పనిచేయడం కంఫర్ట్‌గా ఉందని మేకర్స్‌ తెలిపారు.

ఇక తెరపై వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతమని, పూజా-ప్రభాస్‌ల కెమిస్ట్రీ అలరిస్తుందని తెలిపారు. దీంతో పూజా షూటింగ్‌కు లేట్‌గా వచ్చి అందరిని ఇబ్బంది పెడుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నరాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్‌ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్‌ సినిమా 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement