Uv Creations
-
తొలి సినిమానే వంద కోట్ల బడ్జెట్.. ‘మెగా’, ‘అక్కినేని’ హీరోలతో సాహసం!
దర్శకుడిగా తొలి అవకాశం కోసం చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ కొందరిని మాత్రం మొదటే బంపర్ ఆఫర్ వరిస్తుంది. ఏ రేంజ్ ఆఫర్ అంటే ఆ యువ దర్శకుల తొలి సినిమాలకే భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగిపోతున్నాయి. అఖిల్ హీరోగా ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ చేయనున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిల్మ్స్ (కేజీఎఫ్, సలార్, కాంతార’ వంటి సినిమాలను నిర్మించిన సంస్థ) ఈ సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తీయనున్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నారు. అలాగే సాయి దుర్గా తేజ్ హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపపొందుతోంది. ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్ల రూపాయలపైనే అని వినికిడి. నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే కిశోర్ అనే యువ దర్శకుడికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రవి అనే ఓ కొత్త దర్శకుడితో దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.. -
హారర్ మూవీకి సై
గ్లామర్, డీ–గ్లామర్... ఏ పాత్రని అయినా సునాయాసంగా చేసేస్తారు శ్రుతీహాసన్. అయితే ఇప్పటివరకూ సినిమా మొత్తం పూర్తిగా తన చుట్టూ తిరిగేలా ఉన్న కథల్లో ఈ బ్యూటీ కనిపించలేదు. అంటే... పూర్తి స్థాయి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ శ్రుతీహాసన్ చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఏకంగా కథానాయిక ్రపాధాన్యంగా సాగే రెండు చిత్రాల్లో ఆమె కనిపించే చాన్స్ ఉంది. ఒకటి ‘చెన్నై స్టోరీ’. ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.అయితే ఈ సినిమా నుంచి శ్రుతి తప్పుకున్నారనే వార్త కూడా ఉంది. ఆ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ విషయానికొస్తే... శ్రుతీహాసన్ హీరోయిన్గా యూవీ క్రియేషన్స్ బేనర్ ఈ సినిమానిప్లాన్ చేస్తోందట. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుందని, పూర్తి స్థాయి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని సమాచారం. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి... వార్తల్లో ఉన్న ప్రకారం యూవీలో సినిమాకి శ్రుతీహాసన్ సై అన్నారా? అనేది నిర్మాణ సంస్థ కానీ శ్రుతి కానీ చెబితేనే తెలుస్తుంది. -
'భజే వాయువేగం' సినిమా రివ్యూ
ఈ వేసవి అంతా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సరైన సినిమా పడలేదు. అలాంటిది ఈ వారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో అందరి దృష్టి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పైనే ఉంది. కానీ యూవీ క్రియేషన్స్ తీసిన 'భజే వాయువేగం' కూడా ఓ మాదిరి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)కథేంటి?వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. అనాథగా మారిన ఇతడిని, తండ్రి స్నేహితుడు (తనికెళ్లి భరణి) దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్)లానే వెంకట్‌ని కూడా పెంచి పెద్ద చేస్తాడు. సిటీలో అద్దె ఇంట్లో ఉండే అన్నదమ్ములిద్దరూ.. ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేస్తాడు. అందులో గెలుస్తాడు. కానీ విలన్ గ్యాంగ్ ఇతడిని మోసం చేస్తారు. దీంతో ఊహించని పరిస్థితుల్లో వాళ్లపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది. మరి చివరకు ఏమైంది? వెంకట్ తాను అనుకున్నది సాధించాడా? లేదా? ఇతడితో డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి సంబంధమేంటి? అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?'భజే వాయు వేగం' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్స్‌లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఊహించని విధంగా కెరీర్, వ్యక్తిగత, రాజకీయ పరంగా సమస్యల్లో ఇరుక్కుని ఎలా గెలిచి నిలబడ్డాడు అనేదే కథ. ఓవరాల్‌గా చూస్తే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కథ పరంగా చూస్తే కొన్ని సీన్స్ ఊహించేలా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే బాగుంది. పెద్దగా ల్యాగ్ చేయకుండా వచ్చిన సీన్స్ టైటిల్‌కి తగ్గ న్యాయం చేశాయి.ఫస్టాప్ విషయానికొస్తే.. పోలీస్ స్టేషన్లో హీరో అరెస్ట్ అయి ఉండే సీన్‌తో మూవీ మొదలైంది. ఆ తర్వాత ఏడాది వెనక్కి వెళ్లి.. హీరో గతమేంటి? అతడి చుట్టూ ఉండే వాతావరణం ఏంటనేది చూపించారు. స్టోరీ సెటప్ కోసం ఫస్టాప్ అంతా ఉపయోగించుకున్నారు. కానీ హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ పరమ రొటీన్‌గా అనిపించింది. రెండు పాటలు ఓకే గానీ హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలేదు. ఓ మాదిరిగా వెళ్తున్న మూవీ కాస్త ఇంటర్వెల్ వచ్చేసరికి ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి చివరివరకు చాలా బాగా తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ముగించారు. అది కాస్త అసంతృప్తిగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఎవరెలా చేశారు?'ఆర్ఎక్స్ 100'తో చాలా ఫేమ్ తెచ్చుకున్న కార్తికేయ.. ఆ తర్వాత మాత్రం సరైన హిట్ పడక ఎదురుచూపులు చూస్తున్నాడు. 'భజే వాయువేగం' అతడికి హిట్ ఇచ్చినట్లే! బాధ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ బాగా పలికించాడు. హీరోయిన్ ఐశ్వర్య మేనన్ యాక్టింగ్ చేసేంత స్కోప్ ఈ మూవీలో దక్కలేదు. కాకపోతే ఈమె పాత్రని కూడా కథలో భాగం చేయడం కొంత ఉపశమనం. ఇక హీరోతో పాటు సరిసమానంగా ఉండే అన్న పాత్ర చేసిన రాహుల్ టైనస్.. న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఫెర్ఫార్మ్ చేశాడు. విలన్‌గా చేసిన రవిశంకర్ యధావిధిగా అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ ఉన్నప్పటికీ ఆయన తగ్గ సీన్స్ పడలేదు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి అదరగొట్టేశాడు. తొలి మూవీనే కమర్షియల్‌గా తీస్తున్నప్పటికీ అనవసర సీన్స్ జోలికి పోకుండా డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ డెలివరీ చేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'భజే వాయువేగం'.. మరీ సూపర్‌గా కాకపోయినా మిమ్మల్ని పక్కాగా థ్రిల్ చేసే మూవీ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
మంత్రాన్ని తలపించేలా సినిమా టైటిల్.. ఆసక్తిగా పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండడం చూస్తే థియేటర్లలో ఫుల్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ఓం భీమ్ బుష్ అనే పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. The hilarious trio of @sreevishnuoffl, @PriyadarshiPN & @eyrahul are back 👨🏻🚀👨🏻🚀👨🏻🚀 And they are bringing the 𝐍𝐄𝐖 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐎𝐅 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐌𝐄𝐍𝐓 - #OmBheemBush - No Logic Only Magic 🪄 Directed by @HarshaKonuganti ❤️🔥 Grand Release Worldwide on March 22nd 💫… pic.twitter.com/8x6wMICA3R — UV Creations (@UV_Creations) February 22, 2024 -
'విశ్వంభర'లో అడుగు పెట్టిన టాప్ హీరోయిన్.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. తాజాగా ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు. చాలా రోజుల నుంచి విశ్వంభర చిత్రంలో త్రిష నటించబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసింది. తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ నుంచి ఇలా అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. గతంలో వీరిద్దరూ స్టాలిన్ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ వస్తుంది. ఇందులో అనుష్క, హనీ రోజ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా త్రిష కూడా తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. '18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదీ నాకు ఎంతో గొప్ప గౌరవం. చిరు సార్ నాకు హృదయపూర్వక స్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు.' అని తెలిపింది. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్ కీరవాణి అందిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానుంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) What an honour it is to reunite with the one and only MEGASTAR after 18 years.Thank you so much for the warmest welcome Chiru sir❤️@KChiruTweets https://t.co/PSrJ4O7LEW — Trish (@trishtrashers) February 5, 2024 -
'విశ్వంభర' వీడియోకి సూపర్ రెస్పాన్స్.. దీన్ని డిజైన్ చేసిందెవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీకి 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి సందర్భంగా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయగా.. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ దగ్గర నుంచి విజువల్స్ వరకు అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. అలానే వీడియోలోని గ్రాఫిక్స్, కాన్సెప్ట్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న ఈ వీడియోని ఎవరు డిజైన్ చేశారో తెలుసా? (ఇదీ చదవండి: గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?) 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియోరి డిజైన్ చేసింది అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్‌గా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో పలు సినిమాలకు పనిచేశాడు. ప్రభాస్ 'సాహో'తో పాటు 'రాధేశ్యామ్'కి కూడా అనిల్ పనిచేశారు. రాధేశ్యామ్ సినిమాలోని నీ రాతలే పాటకు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ అనిల్ చేశాడు. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తీయబోతున్నారు. ఈ ప్రాజెక్టుతో అనిల్.. దర్శకుడు కాబోతున్నాడు. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోంది. 'విశ్వంభర' కాన్సెప్ట్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన అనిల్.. మరి దర్శకుడిగా ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి? (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర'.. ఇంతకీ దీని అర్థమేంటి?) -
చిరు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘విశ్వంభర’.. అన్ని కోట్లా?
ఈ ఏడాది చిరంజీవి ఖాతాలో ఓ భారీ హిట్‌తో పాటు ఫ్లాప్ కూడా పడింది. జనవరిలో రిలీజైన వాల్తేరు వీరయ్య.. దాదాపు రూ. 225 కోట్లకు పైగా వసూళ్లను గ్రాస్ వసూళ్లను సాధించి..చిరు సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించింది. అయితే అదో జోష్‌తో భోళా శంకర్ పేరుతో ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. చిరు కెరీర్లో భారీ డిజాస్టర్‌గా భోళా..నిలిచింది. దీంతో మెగాస్టార్ తన ప్లానింగ్ మొత్తాన్ని మార్చేశాడు. బ్రోడాడీ రీమేక్ ప్లాన్‌ని పక్కకి పెట్టి..బింబిసార డైరెక్టర్ వశిష్ట కథకు ఓకే చెప్పాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి సినిమా సెట్లో సందడి చేస్తున్నారు. చిరు కేరీర్‌లోనే భారీ బడ్జెట్ భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత పవర్ఫుల్ స్టోరీతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు చిరంజీవి. అందుకే తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్‌ని ఖారురు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ. 250-300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. చిరు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. అలాంటి పాత్రలో చిరంజీవి సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి విచిత్రమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. చిరు కెరీర్లోనే ఇప్పటి వరకు గోదావరి జిల్లాలకు చెందిన వాడిగా ఎప్పుడు నటించలేదు. ఈ చిత్రంలో మొదటి సారిగా గోదావరి యాసలో మాట్లాడుతూ.. అలరించబోతున్నాడట. చిరు పాత్ర పేరు దొరబాబుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
మెగా 156 షురూ
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ‘మెగా 156’(వర్కింగ్ టైటిల్) సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ అయింది. యువీ క్రియేష¯Œ ్సపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మారేడుమిల్లిలో మొదలైంది. ముందుగా చిరంజీవి పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. అతి త్వరలోనే ఈ సెట్స్‌లో చిరంజీవి పాల్గొంటారని సమాచారం. ఫాంటసీ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్ అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి, కెమెరా: ఛోటా కె.నాయుడు. -
అఖిల్‌పై రూ. 100 కోట్లు.. కొత్త డైరెక్టర్‌తో ప్రయోగం!
సినిమా ఫలితం ఎలా ఉన్నా.. టాలీవుడ్ మార్కెట్లో అఖిల్ అక్కినేనికి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒక్క హిట్ పడితే చాలు..అఖిల్ స్టార్ హీరో అయిపోవడం ఖాయం. కానీ దురదృష్టవశాత్తు..అఖిల్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ భారీ హిట్ లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి రూ. 10 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. అంతేకాదు.. ఓటీటీ స్ట్రీమింగ్ సైతం వివాదంలో చిక్కుకొని..ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దీంతో అఖిల్ కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏజెంట్ ఫలితాన్ని మర్చిపోయి..కొత్త సినిమాపై దృష్టిపెడుతున్నాడట. రూ. 100 కోట్లతో కొత్త సినిమా ఏజెంట్ రిలీజై ఆరు నెలలు దాటినా..అఖిల్ కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ తదుపరి సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఫ్లాప్ హీరో, కొత్త డైరెక్టర్ అయినప్పటికీ..దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ప్రయోగం చేయబోతోంది యూవీ క్రియేషన్స్. ప్రస్తుతం అఖిల్‌కు టాలీవుడ్ మార్కెట్లో ఉన్న విలువ కంటే ఇది చాలా ఎక్కువ. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే రూ. 100కోట్లు పెట్టడానికి కూడా నిర్మాతలు భయపడడం లేదట. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. 2025లో రిలీజ్? అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. నాగార్జున సైతం ఈ చిత్రాన్ని దగ్గరుండి చూసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నా సామిరంగ, బిగ్‌బాస్ 7 షోతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన ఫ్రీ అయిపోతారు. అప్పుడు మరోసారి కథ విని..ఫైనల్ వెర్షన్‌ని లాక్ చేస్తారట. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
వశిష్ఠతో చిరంజీవి జర్నీ ప్రారంభం ఎప్పుడంటే..?
మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబినేషన్లో వస్తున్న మెగా 156 సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ భారీ బడ్జెట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయిందట. బింబిసార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ చాలా గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్‌తో చిరంజీవి కోసం కథ రెడీ చేశాడు. UV క్రియేషన్స్ ద్వార విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 25 నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రానుంది. షూటింగ్ ప్రారంభమే భారీ యాక్షన్ సీన్స్‌తో మొదలు కానుందట.. ఈ కథలో ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఊహకందని యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట ఈ సినిమా గురించి ఇలా తెలిపారు. 'చిరంజీవిగారు పూర్తి స్థాయి ఫాంటసీ కథలో నటించి చాలా రోజులైంది. అందుకే ఆయన కోసం పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలబోసి అద్భుతమైన కథను సిద్ధం చేశా.' అని హింట్ ఇచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారులను మెచ్చే అంశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్గా నటించే ఛాన్స్ ఆమెకు అంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చినా ప్రముఖంగా అనుష్క పేరు వినిపిస్తోంది. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఈ విజువల్ వండర్‌ను కెమెరామెన్ ఛోటా కె. నాయుడు చిత్రీకరించనున్నారు. -
అనుష్క పుట్టినరోజు గిఫ్ట్.. ఆ హిట్ సినిమా పార్ట్-2 ప్రకటన
టాలీవుడ్లో అనుష్క పేరు వినగానే స్టార్ హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అనే అంశం గుర్తుకు వస్తుంది. ఒక సినిమాలో హీరోయిన్ అంటే రెండు సీన్లు, మూడు పాటలకు మాత్రమే పరిమితం కాదు.. అవసరమైతే తనే ఒక సినిమాని ఒంటిచేత్తో నడిపించగలదు. ఈ విషయాన్ని అనేకసార్లు నటి అనుష్క నిరూపించింది. అందుకే ఆమెకు ఇక్కడ అంత క్రేజ్.. సినీ కెరియర్ ఆరంభంలో అందాలు ఆరబోసినా... ఆ తర్వాత అరుంధతిలో జేజమ్మగా దుమ్ములేపింది. ఆ తర్వాత దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అనగానే ఫస్ట్ ఛాయిస్ అనుష్క పేరు గుర్తొచ్చేలా ఆమె మాయ చేసింది. 'వేద' సినిమాలో సరోజ పాత్రలో తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగించింది అనుష్క.. బిల్లాలో తన గ్లామర్‌తో కిక్ ఇచ్చింది. తాజాగా విడుదలైన 'మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి'లో అన్విత పాత్రలో అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టింది. అనుష్క సినీ కెరియర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం భాగమతి.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. నేడు (నవంబర్ 7) అనుష్క పుట్టినరోజు సందర్భంగా భాగమతి 2 చిత్రం గురించి యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రకటన అధికారికంగా వస్తే తన కెరియర్లో 50వ చిత్రంగా రికార్డుకెక్కనుంది. -
కొత్త సినిమాకు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌ను ఓకే చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన 'భోళా శంకర్' సినిమా సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్‌కి కూడా నచ్చలేదని చెప్పవచ్చు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్‌పైనా విమర్శలు వచ్చాయి. మెగస్టార్ లాంటి పెద్ద నటుడితో సినిమా తీస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని ఆయనపై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా చిరంజీవి కూడా రీమేక్స్ సినిమాలను మరోసారి తీయకండని ఫ్యాన్స్ కూడా కోరారు. (ఇదీ చదవండి: సీఎం యోగి పాదాలను తాకడంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్) దీంతో ఆయన నుంచి వచ్చే కొత్త ప్రాజెక్ట్‌లు ఎలా ఉంటాయని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇందులో భాగంగా యూవీ క్రియేషన్స్ నుంచి చిరంజీవి తర్వాతి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన కథను 'బింబిసార' మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ కథను రెడీ చేశారు. మెగా 157 సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటంచారు. సోషియో ఫాంటసీగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో పంచభూతాల గుర్తులను వశిష్ట చూపించాడు. టైటిల్ ఇదేనా..? డైరెక్టర్ వశిష్ఠ, మెగాస్టార్ కాంబో నుంచి వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో అనగా అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల మాదిరిగా ఉండబోతోందని సమాచారం. ఆ సినిమాలో శ్రీదేవి దేవకన్యలా భూమి మీదకు వచ్చి మానవుడైనా చిరంజీవిని ప్రేమించగా. అప్పుడు ఎదురైన ఇబ్బందులను చిరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడో చూశాం. (ఇదీ చదవండి: చిరంజీవిని మెప్పించిన డైరెక్టర్ వశిష్ఠ గురించి పూర్తి వివరాలు) ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్ట్‌తో కొందరు దేవకన్యలు భూమిపైకి రావడం వంటి ముఖ్యమైన కాన్సెప్ట్‌తో మెగా 157 ఉండనున్నట్లు సమాచారం. పంచభూతాలను చిరు ఎలా అధిగమిస్తాడనే కథాంశం మీద స్టోరీ లైన్ ఉండవచ్చు. ఈ సినిమాలో చాలామంది హీరోయిన్స్ కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్నది అయితే తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. #Mega157 🔮 This time, its MEGA MASS BEYOND UNIVERSE ♾️ The five elements will unite for the ELEMENTAL FORCE called MEGASTAR ❤️🔥 Happy Birthday to MEGASTAR @KChiruTweets Garu ❤️@DirVassishta @UV_Creations#HBDMegastarChiranjeevi pic.twitter.com/llJcU6naqX — UV Creations (@UV_Creations) August 22, 2023 -
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మగధీరుడు ఆయనే!
ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు.. స్థానం వేరు చిరంజీవి సినిమారంగంలో ఒక లెజెండ్. ఆయన తుపాన్‌లా రాలేదు. చిరు జల్లులా వచ్చి తుపాన్‌లా మారాడు. ఆయన 'స్వయంకృషి'తో ఎదిగిన నటుడు. తన యాక్షన్, డ్యాన్స్‌లతో ఎందరిలోనో స్ఫూర్తినింపిన 'ఆచార్యు'డు. ఇండస్ట్రీలో ఎదురైన ప్రతి 'ఛాలెంజ్' లను 'మగధీరుడు' లాగా ఎదుర్కుంటూ 'విజేత'గా నిలిచిన 'మగమహారాజు' . అభిమానుల గుండెల్లో ఆయనొక 'ఖైదీ'. బాక్సాఫీసు వసూళ్ల 'వేట'లో 'ఛాలెంజ్' విసిరితే 'రోషగాడి'లా 'జాతర' చూపించాడు. సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. వస్తూనే ఉంటారు కూడా.. అలాంటి వాల్లకు ఒక్కరే స్ఫూర్తి ఆయనే మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక కథనం. చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. ఇప్పటి తరం ట్విటర్లో ఫ్యాన్ వార్ చేసుకునే వారికి తెలియకపోవచ్చు అప్పట్లో కవర్‌పేజీలో వచ్చే చిరంజీవి ఫోటో కోసం అభిమానుల మధ్య జరిగే వార్ గురించి. ఇప్పడు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకుని తిరిగేవారికి తెలియకపోవచ్చు వాళ్ల హీరోలకు కూడా ఫేవరేట్ హీరో చిరంజీవే అని.. మా హీరో రికార్టులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు ఆ రికార్డులను క్రియేట్ చేసిందే చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు.. అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ల దాక అందరూ ఆయన ఫ్యాన్సే.. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర..కోట్లాదిమందికి అతనొక ఆరాధ్య నటుడు అయ్యాడు. ఫిబ్రవరి 11, 1978 లో పునాదిరాళ్ళు చిత్రంతో సినీ ప్రస్థానం మెదలుపెట్టిన మెగాస్టార్. పునాదిరాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. తొలి సినిమానే ప్లాప్ అయింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించాడు. తర్వాత బాపు దర్శకత్వంలో 'మన వూరి పాండవులు' సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరుకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇదే మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలతో పాటు విలన్‌గా నటించిన చిరంజీవికి ఒక నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ 1980 వ దశకం నుంచి ఆయనకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన 'మొగుడు కావాలి' సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డుకెక్కింది. ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. ఆ సమయం నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. 'చిరంజీవి-ఎన్టీఆర్'కు ప్రత్యేకం ఆ తర్వాత వచ్చిన 'తిరుగులేని మనిషి' చిత్రం తన కెరియర్లో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. అందులో 'చిరంజీవి-ఎన్టీఆర్' కలిసి నటించిన ఏకైకా సినిమా ఇది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తే.. చిరంజీవి ఆయన బావమరిది పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత 'ఊరికిచ్చిన మాట' సినిమాతో చిరంజీవికి మాస్ ఇమేజ్ బీజం పడినా.. ఆ తర్వాత 'చట్టానికి కళ్లులేవు' చిత్రంతో పూర్తి మాస్ హీరోగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాను తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబ్లీ లిస్ట్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కట్నం అనే ఇష్యూ మీది శుభలేఖ అనే సినిమాను తీశారు. ఈ రెండు సినిమాలతో చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఓన్ చేసుకున్నారు. శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును చిరు అందుకున్నారు. ఇలా చిరంజీవి నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్న సమయంలో అసలు సెన్సేషన్ 1983లో మొదలైంది. ఇండస్ట్రీలో సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసిన చిరు సినిమా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. అప్పట్లో కమర్షియల్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజా థియేటర్లో 80రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగింది ఈ సినిమా.. హైదరాబాద్ శాంతి థియేటర్లో 365 రోజులు ఏకదాటిగా కొనసాగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి, మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు.. ఒక యాక్టర్, స్టార్‌కు మధ్య ఉన్న గీతను చెరిపేసి చిరంజీవిని ఓవర్‌నైట్ సూపర్ స్టార్‌ను చేసింది ఈ సినిమా.. ఇందులోని చిరు లుక్‌నే రామ్‌చరణ్ మొదటి సినిమా చిరుతలో కూడా ఆ షాడో ఉండేలా చూపించాడు పూరి. ఇంతలా మెగస్టార్ జీవితంలో ఖైదీ సినిమా పాత్ర ఉంది. అక్కడి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతుండగా 2007లో శంకర్ దాదా జిందాబాద్‌తో సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ఎంట్రీ 2008 ఆగష్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. తిరుపతిలో చిరంజీవి పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో మెగాఫ్యాన్స్ పోటెత్తారు. ఆ సభ కోసం సుమారు పది లక్షల మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆ సభ రాత్రి 10 గంటలకి పూర్తయితే తిరుపతి నుంచి తెల్లారే వరకూ వాహనాలు వెళుతూనే వున్నాయి. కనీవినీ ఎరుగని ట్రాఫిక్ జామ్ తిరుపతిలో ఏర్పడింది. అంతవరకు ఏ సినీ, రాజకీయ నాయకుడి సభకు రానంత జనం వచ్చారు. ఈ సభలోనే చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు. ఆయన పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చే నాటికి ఉమ్మడి ఏపీలో 2004 నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి మొదటిసారి సీఎం కావడమే కాకుండా ప్రజల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వైఎస్సార్ పాలన కొనసాగింది. అలా ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఏపీలో వైఎస్సార్ ఉన్నారు. 2009లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీగా ఉమ్మడి ఏపీలో ఉన్నాయి. అలాంటి సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటికే ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుని మళ్లీ 2009 ఎన్నికల బరిలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి గారిపైనా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన్ని దింపి చిరంజీవిని సీఎం చేయాలనే జ్వాల, కోరిక జనంలో లేవు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం నుంచి అభ్యర్థులను చిరంజీవి నిలబెట్టారు. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరు పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు. అలా మొత్తంగా కేవలం 294 స్థానాలకు గాను 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పరిమితం అయింది. 2009 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2011 ఆగష్టులో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనమయ్యింది. ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా కూడా చిరంజీవి కొనసాగారు. తిరుపతి సభ నుంచే చిరుకు మొదటి దెబ్బ పార్టీ ఆవిర్భావ సభరోజు పది లక్షలకు మంది పైగా వచ్చిన జనం అదే తిరుపతిలో చిరంజీవి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. బస్టాండ్‌కు దగ్గర్లో మెగాస్టార్ సభ పెడితే జనం వెయ్యి మంది కూడా లేరు. అప్పుడు ఆయన ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలకు దిగారు. ఆ సమయం నుంచే చిరంజీవిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సినిమా వేరు.. రాజకీయాలు వేరని చాలామంది పొలిటికల్ విశ్లేషకులు తెలిపారు. రజనీకాంత్‌కు చిరంజీవి ఇచ్చిన సలహా సినిమా హీరోకు ఉన్న ఇమేజ్, రాజకీయ నాయకుడి ఇమేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే విషయాన్ని చిరంజీవి గ్రహించి రాజకీయాల్లోకి రావాలనుకున్న రజీనికాంత్, కమల్ హాసన్‌కు ఒక సూచన ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వకండని ఆయన ఇలా సూచించారు. 'రాజకీయాల్లోకి రావాలన్న మీ ఆలోచన విరమించుకోండి. సూపర్‌స్టార్‌గా అందరివాడు అనిపించుకున్న మీరు పాలిటిక్స్‌లోకి వచ్చి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. మనలాంటి వారు ఈ రాజకీయాల్లో నెగ్గాలంటే చాలా కష్టం. అందుకే రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల వైపు వచ్చాను. ఇక నుంచి సినిమాలే నా ఫస్ట్ లవ్.' అని చిరంజీవి అన్నారు. 2017లో రీ ఎంట్రీ రాజకీయాల నుంచి చిరంజీవి పూర్తిగా దూరం అయి తన అభిమానుల కోసం 2017లో 'ఖైదీ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఒక హీరో సినిమా ప్రపంచానికి సుమారు 10 సంవత్సరాలు దూరం అయితే... అదే సమయంలో చాలామంది యంగ్ హీరోలు పోటీపడుతూ బ్లాక్‌బస్టర్ హిట్లు ఇస్తూ కొత్తకొత్త అభిమానులను సంపాధించుకుంటున్న తరుణంలో పదేళ్లు బ్రేక్ తీసుకున్న హీరో వెనక్కు వస్తే మునపటి ఇమేజ్ ఉండదని పలువురు కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారందరికీ ఖైదీ 150 సినిమాతో చిరు సమాధానం చెప్పారు. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్ధలుచేసింది. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. రాజకీయాల్లో చిరంజీవి ఓడిపోవచ్చు కానీ సినిమాల్లో ఎప్పటికీ మెగాస్టారే అని ఆయన సినిమా ఓపెనింగ్స్ చెప్తాయి. ఎందుకంటే నాడు చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా సమూలంగా మారిపోయింది. డ్యాన్స్‌లు, ఫైట్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లో ఆయన కొత్తదనాన్ని తీసుకొచ్చారు. తెలుగు సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్లిన.. ప్రపంచం గర్వించే సినిమాలు ఇంకెన్నీ తీసినా వాటి వెనుకాల చిరంజీవి అనే ఒక మహాశక్తి పాత్ర ఎంతోకొంత ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా తెలుగు సినిమాలో ఎన్ని మారినా.. ఎంతమంది వచ్చినా ఆయన స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు. భవిష్యత్‌లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చిత్రపరిశ్రమకు అందించాలని కోరుకుంటూ పద్మ విభూషణ్ చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు. -సాక్షి వెబ్ డెస్క్ -
చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే
భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తదుపరి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. వరుస పరాజయల తర్వాత కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే.. కొత్త సినిమా ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే, మెగాస్టార్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి తెలిపారని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్‌తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్) ముందుగా అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజున నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన వచ్చేస్తోంది. దానిలో భాగంగానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చెయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌తో గుడ్‌న్యూస్ తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు మెగాస్టార్ మూవీకి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. యూవీ క్రియేషన్స్-చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌తో బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మెగాఫోన్ పట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. (ఇదీ చదవండి: ఫైనల్‌గా వశిష్ఠకే దక్కిన మెగా 157 ప్రాజెక్ట్) The universe conspires for beautiful things to happen ✨ One man inspires us to achieve the universe itself 💫 Stay tuned to @UV_Creations ❤️ Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij — UV Creations (@UV_Creations) August 21, 2023 -
‘ఆదిపురుష్’ ఎఫెక్ట్..‘సలార్’పై ప్రభాస్ కీలక నిర్ణయం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. కానీ ఆయన ఖాతాలో మాత్రం సరైన హిట్ పడడం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయి విజయం ప్రభాస్‌కు దక్కలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక ‘ఆదిపురుష్’తో ఎలాగైన పాన్ ఇండియా హిట్ కొడతాడని ఆశపడ్డ ప్రభాస్ ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పాటు పలు వివాదాలు తెచ్చిపెట్టాయి. అంతేకాదు ఈ చిత్రంతో తన సోదరుడు ప్రమోద్‌కు సంబంధించిన యూవీ క్రియేషన్స్‌కు లబ్ది చేకూర్చాలని ప్రభాస్ ప్రయత్నించాడు. కానీ అది కూడా బెడిసి కొట్టింది. ఆదిపురుష్ ఎఫెక్ట్ యూవీ క్రియేషన్స్‌పై భారీగా పడింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘సలార్’ బిజినెస్ విషయంలో తలదూర్చకూడదని డిసైడ్ అయ్యారట. (చదవండి: ట్రీట్మెంట్ కోసం హీరో వద్ద అప్పు.. క్లారిటీ ఇచ్చిన సమంత) ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాఫ్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నాన్ థియేట్రికల్స్ బిజినెస్‌తో పాటు డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ.200 కోట్లు పెట్టి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం రెండు ప్రముఖ బ్యానర్లు పోటీ పడుతున్నాయి. ఇంత బజ్ ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం బిజినెస్ విషయంలో దూరంగా ఉన్నారట. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకొని సైడ్ అయిపోరాట. (చదవండి: క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రభాస్ దాదాపు 100 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 28 ఈ చిత్రం మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. -
అనుష్క అభిమానులకు బ్యాడ్ న్యూస్
అనుష్క శెట్టి తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతుంది. నిశ్శబ్దం(2020) చిత్రం తర్వాత ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. త్వరలోనే ఆమె తెరపై కనిపించబోతున్నారని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విడుదల వాయిదా పడింది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. గతంలోనే చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ డేట్‌ని అనౌన్స్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. (చదవండి: ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్) పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా ఆగస్ట్ 4న విడుదల చేయడం లేదని, కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటనను విడుదల చేసింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నందుకు అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేసింది. ఈ చిత్రానికి పి.మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో చెఫ్‌గా అనుష్క, స్టాండప్ కమెడియన్‌గా నవీన్ పోలిశెట్టి నటించారు. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ట్రైలర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించే చాన్స్ ఉంది. We apologize from the bottom of our hearts for this unforeseen delays. We will soon be serving #MissShettyMrPolishetty, a comedic feast, with a side of laughter... Stay tuned for the New release date and trailer... pic.twitter.com/LpMbdrVTsm — UV Creations (@UV_Creations) July 29, 2023 -
డిజాస్టర్ అయినా తగ్గేదేలే అంటున్న అఖిల్
-
కథ విన్నారా?
హీరో చిరంజీవి, ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? చిరంజీవి కథ విన్నారా? అంటే ఫిల్మ్‌నగర్ అవునంటోంది. చిరంజీవికి వశిష్ఠ ఇటీవల ఓ కథ చెప్పారట. ఆ స్టోరీ చిరంజీవిని ఇంప్రెస్ చేయడంతో ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట వశిష్ఠ. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇక ప్రస్తుతం ‘భోళా శంకర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. -
ప్రభాస్ అన్న ప్రేమ దక్కడం నా అదృష్టం: సంతోష్ శోభన్
ప్రభాస్ అన్న నాకు ఇచ్చే సపోర్ట్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. నా గత చిత్రాల ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు. కళ్యాణం కమనీయం సినిమా పాట రిలీజ్ చేస్తున్నారు. నేను ఆయన అభిమానిని. మా మధ్య ఉన్నది అభిమాని, స్టార్ మధ్య ఉన్న బంధం. ప్రభాస్ అన్న ప్రేమ దక్కినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి’ అని యంగ్ హీరో సంతోష్ శోభన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా సంతోష్ శోభన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఏక్ మినీ కథ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు "కళ్యాణం కమనీయం" కథ విన్నాను. నా మిత్రుడు, ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అజయ్ దర్శకుడు అనిల్ కుమార్ ను పరిచయం చేశారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది. మనం రెండు రకాల సినిమాలు చూస్తుంటాం. ఒకటి ఆస్పిరేషనల్, రెండోది రిలేటబుల్. ఇది మనందరికీ రిలేట్ అయ్యే కథ. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. కథ చెప్పగానే సంతోషంగా ఒప్పుకున్నాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ►సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసుకోవాలనేది నా కల. అది ఈ చిత్రంతో తీరుతోంది. బిగ్ స్టార్స్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇది చిత్ర పరిశ్రమకు పెద్ద సంక్రాంతి. ఈ పండక్కి విడుదలవుతున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు చిత్రాలతో పాటు ‘కళ్యాణం కమనీయం’ కూడా ఆదరించండి ►నేను ఇప్పటిదాకా చేసిన సోషల్ కామెడీ మూవీస్ లో నా పాత్రలు రియాల్టీకి కొంత దూరంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో నేను చేసిన శివ క్యారెక్టర్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. ఇందులో ఫేక్ నెస్ లేదు. ఆ సిట్యువేషన్ కు తగినట్లు శివ క్యారెక్టర్ నిజాయితీగా రెస్పాండ్ అవుతుంది. ►ఇందులో శృతి జాబ్ చేస్తుంది శివకు ఉద్యోగం ఉండదు. అయితే ఇదొక్కటే కథలో కీలకం కాదు. ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితంలో ఎదురైన పరిస్థితులను తట్టుకుని ఎలా ముందుకు సాగారు అనేది చూపిస్తున్నాం. రెగ్యులర్ ఫార్మేట్ సినిమా కొలతలు "కళ్యాణం కమనీయం" లో ఉండవు. ఈ సినిమా ఒక ఎక్సీపియరెన్స్ లా ఉంటుంది. ► లైఫ్ అంటే ఒకరి మీద మరొకరం ఆధారపడటం. నాన్న మాకు దూరమైనప్పుడు అమ్మ మమ్మల్ని ఏ కష్టం తెలియకుండా పెంచింది. అప్పుడు అమ్మ మీద ఆధారపడ్డాను. లైఫ్ లో ఒక సందర్భం వస్తే భార్య సంపాదన మీద భర్త కొంతకాలం లైఫ్ లీడ్ చేస్తాడు. అది వాళ్లిద్దరికి మధ్య సమస్య. భార్యా భర్తలకు ఇష్టమైతే వాళ్ల జీవితాన్ని ఎలాగైనా గడుపుతారు. నేను నిజ జీవితంలో జాబ్ లేకుంటే బాధపడాలి. నేను ఆ క్యారెక్టర్ లో నటిస్తున్నా కాబట్టి పర్సనల్ గా తీసుకోలేదు. ► ఈ చిత్రంలో పాటలు కథను ఎక్కడా బ్రేక్ చేయవు. కథ కూడా పాటలతో ముందుకు వెళ్తుంది. శ్రావణ్ భరద్వాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఆకర్షణ అవుతుంది. ► యూవీ క్రియేషన్స్ సంస్థ నా ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది. ఇక్కడ మూడు చిత్రాలు చేశాను. మరో ముప్పై చేసేందుకైనా సిద్ధం. నా లైఫ్ లో పేరున్న దర్శకులు మారుతి, మేర్లపాక గాంధీ లాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ల దగ్గర ఎంత నేర్చుకున్నానో ఈ చిత్ర దర్శకుడు అనిల్ దగ్గర అంతే నేర్చుకున్నాను ► కథల ఎంపికలో నిర్ణయం నాదే. నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్స్ క్రెడిట్ తీసుకుంటా. అప్పుడే మనశ్సాంతిగా ఉంటుంది. ప్రస్తుతం నందినీ రెడ్డి గారి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ లో అన్ని మంచి శకునములే అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది కాకుండా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా చేస్తున్నాను. -
నవీన్ అన్నా ఉన్నావా? చచ్చావా? ..నవ్వులు పూయిస్తోన్న ‘జాతిరత్నం’వీడియో
‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నవీన్పొలిశెట్టి. 2021 మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. . ఈ మూవీ విడుదలై ఏడాదిన్నరకు పైనే అవుతున్నా హీరో నవీన్ పొలిశెట్టి నుంచి ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో `అనగనగ ఒక రాజు` మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాలకు సంబంధించి ఇటీవల ఎలాంటి అప్డేట్స్ రాలేదు. తాజాగా నవీన్ పొలిశెట్టి ఓ ఫన్నీ వీడియో ద్వారా తన సినిమాల అప్డేట్స్ని ఇచ్చాడు. నవీన్ పొలిశెట్టి స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతూ `అరేయ్ ఏం చెప్పమంటావురా `జాతిరత్నాలు` తరువాత ఫ్యాన్స్ లవ్వు అరే ఇంటి నుంచి బయట అడుగు పెట్టడానికి లేదు పరిస్థితి.. అనగానే ఫ్యాన్స్ అంటూ ఇద్దరు నవీన్ పొలిశెట్టి వద్దకు వచ్చారు. అందులో ఒకతను నవీన్ అన్నా ఉన్నావా? చచ్చావా? అనడంతో కంగుతిన్న నవీన్ `ఉన్నారా.. షూటింగ్ చేస్తున్నా.. అనడం.. అయితే నెక్స్ట్ మూవీ అప్ డేట్ ఏదీ అని మరో అభిమాని ప్రశ్నించడం..దానికి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్న కదా షూటింగ్ జరుగుతోంది. చాలా బాగా వస్తున్నయ్ అని నవీన్ అనడం...ఆ వెంటనే అది అందరికి తెలిసిందే కదా.. అప్ డేట్ లు లేవు పదా అని ఫ్యాన్స్ వెళుతుండటం.. మరో అభిమాని కొడుకుతో కలిసి తనెవరో తెలుసా.. జాతిరత్నాలు టైమ్ లో ఎత్తుకుని సెల్ఫీ ఇచ్చారు. అప్పుడు వీడు థర్డ్ స్టాండర్డ్.. త్వరగా అప్ డేట్ ఇవ్వండి లేదంటూ వీడి కొడుకు థర్డ్ స్టాండర్డ్ కి వచ్చేలా ఉన్నాడని పంచ్ వేయడం నవ్వులు పూయిస్తోంది. వీడియో చివరల్లో న్యూ ఇయర్ లో న్యూ మూవీస్ అప్ డేట్ లని నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో అందించబోతున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 2022లో తనకున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకున్న నవీన్ పోలిశెట్టి ఈ కొత్త ఏడాదిలో వరుస రిలీజ్ లతో తెరపై సందడి చేయబోతున్నారు. -
ప్రతి క్షణం ప్రమాదం
నయనతార లీడ్ రోల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కనెక్ట్’. సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రధారులు. ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘కనెక్ట్’ తెలుగు వెర్షన్‌ను యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియాలో ప్రభాస్ షేర్ చేశారు. దేశంలో లాక్డౌన్ విధించడానికి 24 గంటల ముందు అంటూ ట్రైలర్ సాగుతుంది.‘నాన్నా నేను చెప్పేది విను.’, ‘నీతో ఉన్నది మన అమ్ము కాదు.. అక్కడ ఉన్న ప్రతిక్షణం నీ ప్రాణానికి ప్రమాదం’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
ఉత్కంఠభరితంగా నయనతార కనెక్ట్ మూవీ.. అర్థరాత్రి ట్రైలర్ రిలీజ్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో హారర్ చిత్రం కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కరోనా లాక్డౌన్ సమంలో అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇదే సమయంలో నయన్ ఆన్లైన్ మీటింగ్‌లో పాల్గొననగా వారికి దెయ్యం ఉన్నట్లు కొన్ని శబ్దాలు వినిపించడం వంటివి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. 2.22 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 99 నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండటం మరో విశేషం. పూర్తిగా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌కు తగ్గట్లే సినిమాలోనూ సస్పెన్స్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
యూవీ క్రియేషన్స్‌తో కార్తికేయ సినిమా.. పోస్టర్ రిలీజ్
‘‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి రాజశేఖర్. Super proud & excited to be associated with the Prestigious @UV_Creations banner 😇 Directed by @Dir_Prashant, #Kartikeya8 Title revealing soon 🏎️✨️ pic.twitter.com/SqKI2IOOyR — Kartikeya (@ActorKartikeya) April 8, 2022 -
అనుష్క కొత్త సినిమా అప్డేట్.. ఆ బ్యానర్లో హ్యాట్రిక్ చిత్రం
Anushka Shetty Movie With Naveen Polishetty In UV Creations Banner: దక్షిణాదిలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మోస్ట్ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరో సినిమాకు సంతకం చేయలేదు. దీంతో అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా అనుష్క ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమాలో నటిస్తోందంటూ వార్తలు వస్తున్నప్పటికీ అవి పుకార్లో నిజమో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఆమె ఫ్యాన్స్. చదవండి: మరోసారి ప్రభాస్‌తో అనుష్క..! ఈ నేపథ్యంలోనే అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. కానీ తర్వాత నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ను ఇచ్చింది యూవీ క్రియేషన్స్ సంస్థ. ఏప్రిల్ 4 నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది. ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఈ సినిమాను 'రారా.. కృష్ణయ్య' దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్ట్ చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లోనే అనుష్క మిర్చీ, భాగమతి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు అనుష్క 48వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా యూవీ బ్యానర్లో హైట్రిక్ చిత్రం. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సక్సెస్ పార్టీలో అనుష్క సందడి, ఫొటోలు వైరల్ -
రాధేశ్యామ్: 'నిన్నేలే' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
Ninnele Full Video Song Out Now: ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ చిత్రం నుంచి నిన్నేలే నిన్నేలే అనే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. 'నిన్నేలే నిన్నేలే.. నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే' అంటూ ఎంతో భావోద్వేగంతో ఈ సాంగ్ సాగుతుంది. Come and fall in love 💕 with melodious songs from blockbuster, #RadheShyam #MusicalOfAges#Ninnele (Telugu): https://t.co/ow8TLqHQbH#Unnaalae (Tamil): https://t.co/NDDX3Xq6eu#Ninnalle (Kannada): https://t.co/e1aCqRN8nP#Ninnaale (Malayalam): https://t.co/KfCGZw2rTG pic.twitter.com/r2yyUEdLed — Radhe Shyam (@RadheShyamFilm) March 13, 2022 -
రాధేశ్యామ్ విడుదల కూడా వాయిదా ! ఇదిగో క్లారిటీ..
UV Creations Confirm The Release Date Of Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతోంది. అయితే తాజాగా భారీ మల్టీస్టారర్ మూవీ రౌద్రం.. రణం.. రుధిరం (ఆర్ఆర్ఆర్) చిత్రం వాయిదా పడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాధేశ్యామ్ చిత్రం కూడా పోస్ట్‌పోన్ అవుతున్నట్లు పుకార్లు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ప్రభాస్ అభిమానులైతే తీవ్ర షాక్‌కు గురయ్యారు. అయితే ఈ పుకార్లపై రాధేశ్యామ్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ స్పందించింది. ఈ ఊహగానాలను పటాపంచలు చేస్తూ కీలక ప్రకటన చేసింది. 'రాధేశ్యామ్ విడుదల కావడం లేదన్న ప్రచారాన్ని నమ్మకండి. ఈ నెల 14 తేదినే సినిమాను రిలీజ్ చేస్తున్నాం' అని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసింది యూవీ క్రియేషన్స్. This New Year Witness the Biggest war between Love & Destiny 💕🚢 from #RadheShyam #HappyNewYear2022#Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @radheshyamfilm pic.twitter.com/pfLSo2VkNM — UV Creations (@UV_Creations) January 1, 2022 -
రాధేశ్యామ్ నుంచి ఆసక్తికర అప్డేట్.. బీజీఎంకు తమన్
Radhe Shyam Movie Background Music Director Thaman: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతోంది. కాగా, ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కూడా భారీ హైప్‌కు ఒక కారణం. ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులు నమోదు చేశాయి. ఇటీవలే పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు వెల్లడించిన పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో ఒప్పందం చేసుకున్నారు మేకర్స్. రాధేశ్యామ్ సినిమాకు దక్షిణాది భాషలకు తమన్ బీజీఎం అందిస్తాడని యూవీ క్రియేషన్స్ తెలిపింది. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సినిమాలోని బీజీఎం హైలెట్‌గా నిలిచింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు అఖండ బీజీఎం గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నారు. తమన్ బీజీఎం సూపర్ అంటూ ఆకాశానికెత్తారు ఆడియెన్స్. ఇదంతా చూస్తుంటే 'రాధేశ్యామ్' సినిమాకు కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ రేంజ్లో ఉండాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. We are pleased to welcome the young music maestro @MusicThaman to score the BGM of #RadheShyam for South Languages!#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs pic.twitter.com/S2T1r568IE — UV Creations (@UV_Creations) December 26, 2021 ఇదీ చదవండి: ఎవరికి రాసి పెట్టుందో.. 'రాధేశ్యామ్' గురించి పలు ఆసక్తికర విషయాలు -
అనుష్కతో నవీన్ పొలిశెట్టి సినిమా ఆగిపోయిందా? ఇదిగో క్లారిటీ ..
Naveen Polishetty Confirms New Film With Anushka Shetty: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి.. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. జాతిరత్నాలుతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నవీన్- అనుష్క జంటగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా రానుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై యూవీ క్రియేషన్స్ వారు క్లారిటీ ఇచ్చారు. నవీన్ పొలిశెట్టి బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే అనుష్క ఈ చిత్రంలో నవీన్‌కి జోడీగా కనిపించనుంది. నలభై ఏళ్ల మహిళ, పాతికేళ్ల అబ్బాయితో ఎలా ప్రేమలో పడుతుంది? ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా కథ. పి. మహేశ్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. View this post on Instagram A post shared by Naveen Polishetty (@naveen.polishetty) -
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
Anushka Shetty: పుకార్లకు చెక్ పెట్టిన అనుష్క.. ఆ సినిమా ఆగిపోలేదు
‘అనుష్క ఇక సినిమాల్లో నటించదు.. ఆమె పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అవుతుంది. అందుకే ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై చేయాల్సిన సినిమా నుంచి తప్పుకుంది’ అంటూ వచ్చిన పుకార్లకు బర్త్‌డే సందర్భంగా చెక్‌పెట్టింది అనుష్క. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఆగిపోయిందనుకున్న సినిమాను అధికారికంగా ప్రకటించింది. అనష్కకు 48వ చిత్రం ఇది. మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క ‘మిర్చి’,‘భాగమతి’అనే రెండు సినిమాలు చేసింది. తాజాగా ఆ బ్యానర్లో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది లేడి ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. .ఈ సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించారని అప్పట్లో ప్రచారం జరిగింది. Happy Birthday Sweety! 💕 We are delighted to announce our "Hattrick Combination" with the Sweet and Very Special @MsAnushkaShetty 🥳🎉. Directed by #MaheshBabuP Produced by @UV_Creations#HBDAnushkaShetty #Anushka48 #HappyBirthdayAnushkaShetty pic.twitter.com/nOv4LWvonh — UV Creations (@UV_Creations) November 7, 2021 -
తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించిన చెర్రి, నాని డైరెక్టర్‌తో ఆర్సీ 16
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ, కొరటాల డైరెక్షన్లో ‘ఆచార్య’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే చెర్రి శంకర్ సినిమాను ప్రారంభించాడు. ఇలా చెర్రి తన సినిమాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇంకా ‘ఆర్ఆర్ఆర్, ఆచార్య’ చిత్రాలు విడుదల కాలేదు, శంకర్‌తో సినిమా పూజా కార్యక్రమాలు మాత్రమే జరుపుకుంది.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు చెర్రి. దసరా సందర్భంగా తన నెక్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. చదవండి: భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్, ఫుల్ సాంగ్ వచ్చేసింది View this post on Instagram A post shared by UV Creations (@uvcreationsofficial) యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కబోయే ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని చెర్రి తన ట్విటర్ వెల్లడిస్తూ.. ‘ఈ కాంబినేషన్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నాడు. అలాగే యూవీ క్రియేషన్స్ కూడా తమ అధికారిక ట్విటర్ పేజీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రకటన ఇచ్చింది. మరోవైపు గౌతమ్ సైతం.. చెర్రీతో కలిసి పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ‘జెర్సీ’ మూవీ సమయంలో గౌతమ్ పనితనాన్ని ప్రశంసిస్తూ చరణ్ దంపతులు ఓ లేఖ రాశారు. తాజాగా ఆ లేఖను గౌతమ్ షేర్ చేస్తూ.. ‘ఎంతోకాలంగా ఈ లేఖను దాచిపెట్టుకున్నాను. చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు దీన్ని బయట ప్రపంచానికి చూపించాలనుకున్నా. ఇంత త్వరగా ఈ అవకాశం వస్తుందని అనుకోలేదు. లవ్ యూ చరణ్ సర్’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. చదవండి: ఆసుపత్రి నుంచి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్, ఆనందంలో మెగా ఫ్యామిలీ A combination I’m definitely looking forward to! @gowtam19 @UV_Creations @NVRCinema #RCwithGowtam https://t.co/OEfOUIs5xY — Ram Charan (@AlwaysRamCharan) October 15, 2021 I have treasured this note since quite some time and was hoping to share it with the world when I get an opportunity to work with you. Never knew it will come so soon.Thank you for all the love sir.@AlwaysRamCharan #HappyDussehra pic.twitter.com/7buA1Y9pB7 — gowtam tinnanuri (@gowtam19) October 15, 2021 -
‘ప్రభాస్-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..!
Radhe Shyam Makers Respond On Clashes Betwen Prabhas-Pooja Hegde: 'ప్రభాస్-పూజా హెగ్డే మధ్య విభేదాలు తలెత్తాయా? ఇప్పటి వరకు నుంచి మిస్టర్ కూల్‌గా ఉన్న ప్రభాస్‌కు పూజా కోపం తెచ్చింపిందా' గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఈ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. టాప్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది.ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది. అయితే సెట్లో మాత్రం పూజా తీరు ఏ మాత్రం బాగోలేదని, టాప్ హీరోయిన్ అన్న ఈగోతో ప్రతిరోజు షూటింగ్‌కు లేట్ వస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. పూజా తీరుతో ఎంతో కూల్‌గా ఉండే ప్రభాస్ సైతం విసిగిపోయారని, దీంతో ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ సైతం విడివిడిగా షూట్ చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ‘రాధేశ్యామ్’టీం స్పందించింది. ప్రభాస్‌కు, పూజా హెగ్డేకు మధ్య విబేధాలు అన్న వార్తల్లో నిజం లేదని, అంతేకాకుండా పూజా మంచి టైం సెన్స్ పాటిస్తుందని, ఆమెతో పనిచేయడం కంఫర్ట్‌గా ఉందని మేకర్స్ తెలిపారు. ఇక తెరపై వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతమని, పూజా-ప్రభాస్‌ల కెమిస్ట్రీ అలరిస్తుందని తెలిపారు. దీంతో పూజా షూటింగ్‌కు లేట్‌గా వచ్చి అందరిని ఇబ్బంది పెడుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నరాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
‘ఏక్ మినీ కథ’ హీరో దూకుడు.. మరో 3 సినిమాలకు సంతకం
యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్. ఇటీవల ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యానర్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో యూవీ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ.. దీని ద్వారా తొలి సినిమాగా ‘ఏక్ మినీ కథా’ నిర్మించింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. ఇక యూవీ కాన్సెప్ట్స్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది కూడా. ఈ మూవీలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ ఈ బ్యానర్లో మరో మూడు చిత్రాలకు సంతకం చేశాడట. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్‌కు యూవీ కాన్సెప్ట్స్‌లో మరో 3 సినిమాలు చేసే అవకాశం రావడం లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఉగాది కానుక వచ్చేసింది
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఉగాది కానుక వచ్చేసింది. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల చేస్తామని గతేడాది నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ మధ్య ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులంతా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ విమర్శలు కురిపించారు. ‘నిద్రలే యూవీ క్రియేషన్స్’అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్లో ట్రెండ్ చేశారు. ఉగాది రోజైనా అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తానికి అభిమానుల డిమాండ్ నెరవేరింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభాస్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం.ఎన్నో ఫెస్టివల్స్.. కానీ ప్రేమ ఒక్కటే అంటూ ప్రభాస్ లవ్లీ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ నవ్వుకుంటూ ఎంతో ఉల్లాసంగా, కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. Many Festivals. One Love! 💞 Here's wishing everyone a very #HappyUgadi, Gudi Padwa, Baisakhi, Vishu, Puthandu, Jur Sithal, Cheti Chand, Bohag Bihu, Navreh & Poila Boshak! #30JulWithRS Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/EejlKDylNh — UV Creations (@UV_Creations) April 13, 2021 -
ఆ నిర్మాణ సంస్థపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. ట్విటర్లో రచ్చ రచ్చ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఆ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వడంలో మాత్రం యూవీ క్రియేషన్స్ ఆలస్యం చేస్తుంది. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. రాధేశ్యామ్ సినిమా కంటే వెనకాల షూటింగ్ మొదలుపెట్టిన హీరోల మూవీస్ అప్డేట్స్ వచ్చాయి. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ కూడా అయ్యాయి. కానీ రాధేశ్యామ్ సినిమా నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో సినిమాకు సంబందించిన చిన్న గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. టీజర్ ను కానీ ట్రైలర్ ను కానీ , కనీసం సాంగ్స్ కానీ రిలీజ్ చేయడంలేదు. దాంతో అభిమానులంతా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థపై గుర్రుగా ఉన్నారు. తమ కోపానంతా సోషల్ మీడియా ద్వారా వెల్లగక్కుతున్నారు. ‘నిద్రలే యూవీ క్రియేషన్స్’అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ నుంచి అప్డేట్ వచ్చే వరకూ ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని వాళ్లు అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా ‘రాధేశ్యామ్’ తెరకెక్కుతుంది. కనీసం ఉగాది రోజైనా 'రాధేశ్యామ్' ట్రైలర్ ను విడుదల చేస్తే... అభిమానుల ఆవేశం కొంతవరకూ చల్లారే ఆస్కారం ఉంటుంది. -
మహేశ్ డైరెక్షన్లో స్వీటీ చిత్రం?
‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవీ’, ‘భాగమతి’ వంటి సూపర్‌డూపర్‌హిట్ చిత్రాలతో ఫుల్ క్రేజ్ సాధించిన స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క. ఇప్పటికే దక్షిణాదిన భారీ బడ్జెట్‌తో కూడిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా అనేదానిపై దర్శకనిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. (సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!) అయితే ‘నిశ్శబ్దం’ సినిమా గురించి కాస్త పక్కన పెడితే.. అనుష్క మరో భారీ లేడీ ఓరియెంట్ చిత్రానికి కమిట్ అయిందని సమాచారం. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. ఇప్పటికే యువీ క్రియేషన్స్‌లో మిర్చి, భాగమతి చిత్రాలను స్వీటీ చేసిన విషయం తెలిసిందే. సందీప్ కిషన్‌తో ‘రారా కృష్ణయ్య’ తీసిన పి. మహేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రభాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమా అప్డేట్ ఏదీ? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో డార్లింగ్‌ను నిలదీస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు రాధాకృష్ణ అప్పట్లోనే ప్రకటించాడు. దీంతో ఉగాదికి సినిమా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూడగా వారి ఆశలు అడియాశలే అయ్యాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన అభిమానులు యూవీ క్రియేషన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్యానర్‌ను నిషేధించాలంటూ #BanUVCreationsను ట్రెండ్ చేశారు. యూవీ(UV) అంటే "అప్డేట్స్ ఉండవు" అని అర్థం అంటూ సెటైర్లు విసిరారు.(డార్లింగ్ ఈజ్ బ్యాక్) దీంతో స్పందించిన యూవీ క్రియేషన్స్ అప్డేట్స్ ఆలస్యమవుతున్నందుకు గల కారణాలను వివరించింది. ఈ మేరకు ట్విటర్లో.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా పనులన్నీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితి పూర్తిగా సద్దుమణిగిన తర్వాత మరెన్నో అప్డేట్స్ను పంచుకుంటామని పేర్కొంది. అప్పటివరకు అందరూ ఓపిక పట్టాలని కోరింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటూ తాము సురక్షితంగా ఉండటంతోపాటు దేశాన్ని కాపాడాలని కోరుతూ ట్వీట్ చేసింది. ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు.(అల్లు అర్జున్, విజయ్ డైట్ తెలుసుకోవాలి: హృతిక్) -
ప్రభాస్ 20 : తాజా అప్డేట్
హైదరాబాద్ : సాహో తర్వాత ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ నుంచి తాజా అప్డేట్ను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ ఛేజింగ్ సీన్లో ప్రభాస్ పాల్గొన్న దృశ్యాలను షూట్ చేసినట్టు యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. గ్లోబల్ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా ప్రభాస్ 20 మూవీని నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంతర్జాతీయ ప్రొఫెషనల్స్ సహకారంతో ఈ సీన్‌ను తెరకెక్కించామని, ఇక యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని, మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఇక చిత్ర బృందం 20 రోజుల షెడ్యూల్ కోసం జార్జియా బయలుదేరింది. మార్చి 15 నుంచి 20 రోజుల పాటు జార్జియాలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్, పూజా హెగ్డేలతో పాటు ప్రధాన తారాగణంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ అనంతరం కొద్దిరోజుల విరామం అనంతరం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతుంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. A cute chase sequence with a terrific international crew has been completed. A long schedule in Europe awaits now. More updates soon! #Prabhas20 — UV Creations (@UV_Creations) March 10, 2020 చదవండి : హ్యపీ బర్త్‌డే స్వీటెస్ట్ అమృత: ప్రభాస్ -
పలాస కథ
మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో ‘పలాస 1978’ చిత్రాన్ని విడుదల చేసేందుకు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ముందుకొచ్చాయి. పలాసలో జరిగిన వాస్తవ సంఘటనలు, కొన్ని నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి కథ, కథనాలున్న ఈ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీలకు బాగా నచ్చడంతో గీతా ఆర్ట్స్, యూవీ ప్రొడక్షన్స్ పతాకాలపై విడుదల చేయనున్నారు. ‘‘మంచి సినిమాలను అందరికీ చేరువయ్యేలా చూడాలని అల్లు అరవింద్‌గారు భావించడంతో ‘పలాస 1978’ ఈ చిత్రాన్ని జీఏటు యూవీ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాం’’ అని బన్నీ వాసు తెలిపారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె. -
ఓవర్సీస్లో దుమ్మురేపిన సాహో
ప్రభాస్ నటించిన సాహో.. కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. బాహుబలి సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. రెండేళ్ల గ్యాప్ తరువాత సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ చిత్రం కావడం.. హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించడంతో సాహోపై అంచనాలు ఆకాశన్నంటాయి. ఈ రోజు విడుదలైన సాహోతో.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. (‘సాహో’ మూవీ రివ్యూ) అయితే ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను సంతృప్తి పరిచేలా ఉందంటూనే.. కొంత డివైడ్ టాక్‌ను మూటగట్టుకుంది. అయినా.. వసూళ్లపరంగా రికార్డులను క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రం దాదాపు 60-70 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. ఓవర్సీస్లోనూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఒక్కరోజులోనే మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసి ఔరా అనిపించింది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మరి మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. యూవీ క్రియేషన్స్‌పై సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. -
సాహో ఫస్ట్ డే కలెక్షన్స్!
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం, భారీ బడ్జెట్ చిత్రంగా మునుపెన్నడూ చూడని యాక్షన్ ఎపిసోడ్‌తో సాహో రిలీజ్ అవ్వడంతో రికార్డులు బద్దలు అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో.. మొదటి రోజే వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. (‘సాహో’ మూవీ రివ్యూ) జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడటంతో.. అవేంజర్ ఎండ్‌గేమ్(53కోటు), థగ్స్ ఆఫ్ హిందూస్తాన్(52.25) రికార్డులను క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ కూడా రావడంతో సినిమా వసూళ్లపై ప్రభావం చూపేలా ఉందని అంటున్నారు. కానీ ఫస్ట్ డే కలెక్షన్లలో మాత్రం రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి దాదాపు 60-70కోట్లు కలెక్ట్ చేయవచ్చని తెలుస్తోంది. తెలుగులో 35, హిందీలో 15-20, తమిళంలో 15కోట్లు మలయాళంలో 5కోట్ల వరకు వసూళ్లను సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటించింది. యూవీ క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాడు. -
ఆసియాలో అతి పెద్ద స్క్రీన్
దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే తొలిసారిగా.. ప్రపంచంలో మూడో భారీ స్క్రీన్‌ని ప్రేక్షకులు చూడబోతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ‘వీ’ సెల్యూలాయిడ్ మల్టీ సినీ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘సాహో’ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ ఆరంభం కానుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో మూడు సినిమా థియేటర్లను ఈ కాంప్లెక్స్‌లో నిర్మించారు. ఇందులో ఒక థియేటర్లో మాత్రం భారతదేశంలోనే ఎక్కడా లేనంత స్క్రీన్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ప్రపంచస్థాయిలో తీసుకుంటే ఇది మూడో భారీ స్క్రీన్ అని ప్రచారం జరుగుతోంది. ఆసియా ఖండంలో కూడా ఇదే మొదటి స్క్రీన్ అని సమాచారం. 106 అడుగులు వెడల్పు, 94 అడుగులు నిలువు స్క్రీన్ ఏర్పాటుతో పాటు 670 సీట్లు కెపాసిటీతో త్రీడీ సౌండ్ సిస్టమ్‌తో అత్యంత అ«ధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. మిగిలిన రెండు థియేటర్లు 180 సీట్లు కెపాసిటీతో నిర్మించారు. సుమారు 7 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ గ్రూప్ థియేటర్స్‌ను నిర్మించారు. ఈ మల్టీ సినీ కాంప్లెక్స్ ప్రభాస్ చేతుల మీదుగా ప్రారంభం కానుందని సమాచారం. -
అతడు నిజంగానే డై హార్డ్ ఫ్యాన్
సాహో చిత్రంలోంచి డై హార్డ్ఫ్యాన్స్ అనే డైలాగ్ ప్రస్తుతం ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అది ప్రభాస్ అభిమానుల కోసం దర్శకుడు ప్రత్యేకంగా రాసిన సంగతి తెలిసిందే. డార్లింగ్‌కు బయట నిజంగానే డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సిరీస్‌తో జాతీయస్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్‌కు.. దేశమంతటా అభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనితో.. అతను ఓన్లీ ఫ్యాన్ కాదు డై హార్డ్ ఫ్యాన్ అని తెలుస్తోంది. ఒరిస్సాకు చెందిన ఓ అభిమాని 486 రూబిక్ క్యూబ్స్‌తో దాదాపు 13 గంటలు శ్రమించి.. ప్రబాస్ ముఖచిత్రం వచ్చేట్లుగా సమకూర్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక సాహో రికార్డుల విషయానికొస్తే.. సెకన్లలో టిక్కెట్లు అమ్ముడైపోతున్నట్టు తెలుస్తోంది. బుక్‌మైషోలో సాహోకు 360k (3,60,000) లైక్స్ వచ్చినట్లు పేర్కొంది. బాలీవుడ్లో ఖాన్ చిత్రాలకు మాత్రం 150-200k లైక్స్ వస్తాయని ..కానీ సాహో మాత్రం వారి సినిమాలను దాటేసిందని తెలిపింది. సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ మూవీ ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. -
‘సాహో’కి సైడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్ని భాషల్లో ఒకే డేట్లో రిలీజ్ చేయాలంటే ఇతర చిత్రాలతో పోటి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అన్ని భాషల్లోనూ నిర్మాతలు సాహో రిలీజ్‌కు లైన్ క్లియర్ చేశారు. ఆగస్టు 30న రిలీజ్ కావాల్సిన తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఈ విషయంపై సాహో నిర్మాతలు స్పందించారు. సాహో భారీ రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసినందుకు అన్ని భాషల నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రల్లో నటించారు. Extremely thankful for producers across all the languages for clearing the way for #Saaho and helping for a bigger release. Action begins in cinemas from 30th Aug!#Prabhas @ShraddhaKapoor @sujeethsign @arunvijayno1 @UV_Creations @itsBhushanKumar @TSeries #30AugWithSaaho pic.twitter.com/PGPxaone89 — UV Creations (@UV_Creations) August 6, 2019 -
సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’
బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో నుంచి ఇండియన్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ దేశమంతటా ఉన్నారు. అందుకే బాహుబలి చిత్రాల తరువాత మళ్లీ ఆరేంజ్‌లో ఉండే విధంగా ‘సాహో’ను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్‌తో అంచనాలను పెంచేసింది చిత్రయూనిట్. రీసెంట్గా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి సోషల్ మీడియాలో సునామీ పుట్టించేందుకు సాహో టీమ్ రెడీ అయింది. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను విడుదల చేయనుంది చిత్రబృందం. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. ఏ చోట నువ్వున్నా.. అంటూ సాగే ఈ పాటను రేపు విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘సాహో’ నిర్మాతల చేతికి ‘సైరా’ ఏపీ హక్కులు!
టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మరో చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో మెగా తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. చిరు గత చిత్ర ఖైదీ నంబర్ 150 ఘనవిజయం సాధించటం, భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈసినిమా కావటంతో సైరాకు అదే స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. గట్టి పోటి మధ్య సాహో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సైరా ఏపీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సాహో ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
‘సాహో’కు షాక్.. వాళ్లు తప్పుకున్నారు
బాహుబలితో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఈ చిత్రంతో ఇండియన్ సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. తన తదుపరి చిత్రాలను కూడా ఆ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. రీసెంట్గా సాహో చిత్రబృందానికి చుక్కెదురైంది. సాహో చిత్రానికి గాను శంకర్, ఇషాన్ నూరని, లాయ్ మెన్డోన్సా త్రయాన్ని సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండగా.. ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సంగీత దర్శకులు ప్రకటించడం సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరి వీరి నిష్క్రమణకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. యూనిట్ నుంచి బయటకు వెళ్తూ.. ప్రభాస్, సుజిత్, వంశీ, ప్రమోద్, శ్యామ్‌లకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. మరి వీరి స్థానంలో ఎవరిని తీసుకుంటారో వేచి చూడాలి. We wish to inform all our fans that Shankar Ehsaan Loy have opted out of composing the music for #Saaho here’s wishing #Prabhas @Sujeetsign #Vamsi #Pramod #Shyam all the luck for the film :) — Shankar Ehsaan Loy (@ShankarEhsanLoy) May 27, 2019 -
చైతు మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడా?
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. గతకొంతకాలం నుంచి చైతూకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సరైన హిట్ లేక అక్కినేని హీరోలు సతమతమవుతున్నారు. సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు అనకున్నంతగా విజయాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం నాగ చైతన్య మజిలీ, వెంకీమామా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీని దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మస్తున్న చిత్రంలో చైతు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
ఫుల్ ఫోకస్!
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలతో ఫుల్ ఎంటర్టైన్ చేశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ ఏడాది నానీతో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేశారు. ఈ సినిమా తర్వాతి ప్రాజెక్ట్ గురించి మేర్లపాక గాంధీ బయటకు చెప్పలేదు. అయితే ఫుల్ ఫోకస్‌తో సైలెంట్‌గా కథ రెడీ చేస్తున్నారట. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనుందని సమాచారం. ఇంతకుముందు మేర్లపాక దర్శకత్వంలోనే వచ్చిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని యూవీ క్రియేషన్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. -
ప్రభాస్ సినిమా కోసం లుక్ టెస్ట్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరగుతోంది. అయితే సాహో సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు ప్రభాస్. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించేందుకు ఇప్పటికే ఓకె చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం పూజా హెగ్డేకు లుక్ టెస్ట్ నిర్వహించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పూజ బాగా సన్నబడటంతో ప్రభాస్ సరసన లుక్ ఎలా ఉంటుందో అన్న అనుమానంతో ఫొటోషూట్ చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ షూట్‌కు సంబంధంచి యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ జానర్లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా కనిపించనున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
హైదరాబాద్‌లో ‘సాహో’ హీరోయిన్
బాహుబలి తరువాత ప్రభాస్ ఇండియన్ హీరోగా ఎదిగాడు. తన తరువాతి సినిమా సాహోను భారీ బడ్టెట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె దుబాయ్‌లో భారీ షెడ్యుల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యుల్‌లో యాక్షన్, ఛేజింగ్ సీన్స్‌ను చిత్రీకరించారు. తాజాగా మరో షెడ్యుల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తోన్న శ్రద్ధా కపూర్ తాజా షెడ్యుల్‌లో పాల్గొన్నారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాల్ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
నా పెళ్లి గురించి మీకెందుకు : నిహారిక
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యూవీ క్రియేషన్స్ యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఓ వ్యక్తి మేడమ్ మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం.. మీ వెడ్డింగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దీనిపై ఏమైనా చెబుతారా అని అడగగా.. నిహారిక స్పందిస్తూ.. ‘అసలు ఎవరు నిన్ను లోనికి రానిచ్చింది. నా పెళ్లి గురించి మీకెందుకయ్యా.. నిహారిక ఎవర్ని చేసుకుంటుంది, ఎప్పుడు చేసుకుంటుంది,ఎందుకు చేసుకుంటుంది.. చూస్తే షాక్ అవుతారు.. షేక్ అవుతారు.. కిందపడి లేస్తారు.. పిచ్చా మీకేమైనా.. మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా’ అంటూ అతనిపై విరుచుకుపడ్డారు. తర్వాత అతడు మేము అడుగుతుంది మీ హ్యాపి వెడ్డింగ్ మూవీ గురించి మేడమ్ అని చెప్పగా.. నిహారిక సారీ చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. హ్యాపి వెడ్డింగ్ ట్రైలర్ జూన్ 30న రిలీజ్ కాబోతుందన్నారు. అప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడో చెబుతామంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. హ్యాపి వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్ కోసం రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రంలో సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం ఉదయం 10.35 గంటలకు విడుదల చేయనున్నారు. -
నా పెళ్లి గురించి మీకెందుకు..?
-
సుమంత్ అశ్విన్, నిహారికల ‘హ్యాపి వెడ్డింగ్’ టీజర్ విడుదల
-
‘హ్యాపి వెడ్డింగ్’.. ఫస్ట్ ఇన్విటేషన్
‘తూనీగ తూనీగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చా రు స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్. లవర్స్, కేరింత లాంటి విజయవంతమైన చిత్రాలు అతని ఖాతాలో ఉన్నప్పటికీ గత కొంతకాలం పాటు సరైన హిట్‌లేక వెనుకబడ్డారు. అయితే ప్రస్తుతం ఈ కుర్ర హీరో ‘హ్యాపి వెడ్డింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ‘ఫస్ట్ ఇన్విటేషన్’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్గా నటిస్తున్నారు. ‘ఒక మనసు’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు నిహారిక. కమర్షియల్‌గా ఆ సినిమా విజయవంతం కాకపోయినా నటన పరంగా నిహారికకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తరువాత మళ్లీ తెలుగులో ఇంకో సినిమా చేయలేదు. తమిళంలో విజయ్‌సేతుపతితో కలిసి ఓ సినిమా చేసినా, అది తెలుగులో విడుదల కాలేదు. అయితే ఈ ‘హ్యాపి వెడ్డింగ్’ సినిమా నిహారికకు, సుమంత్‌కు విజయం అందిస్తుందో లేదో వేచి చూడాలి. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. Wedding shenanigans begin💍@UV_Creations & #PocketCinema cordially invites you to the #HappyWedding of #SumanthAshwin @IamNiharikaK. With best compliments from @lakshmankarya Sangeet by #ShakthiKarthik & @musicthaman 🎶#HappyWeddingFirstInvitationhttps://t.co/ro4nifDBex — UV Creations (@UV_Creations) June 21, 2018 -
37 కార్లు, 4 ట్రక్కులతో భారీ యాక్షన్ సీన్స్
బాహుబలితో ఇండియన్ స్టార్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సాహో మూవీని హాలీవుడ్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రోజు రోజుకూ పెరిగిపోతూ ఉన్నా... నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ఓ షెడ్యుల్ కోసం అబుదాబిలో ఉంది చిత్రబృందం. ప్రస్తుతం అబుదాబిలో భారీ యాక్షన్ ఛేజింగ్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగానే 37 కార్లను, 4 ట్రక్కులను వినియోగిస్తున్నారట. ఈ భారీ చేజింగ్ సన్నివేశాలు హాలివుడ్ తరహాలో ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. -
సాహో హిందీ హక్కులు ఆయనకే
బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్‌కు హిందీ చిత్రసీమలోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా యూవీ క్రియేషన్స్ పతాకంలో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా హిందీ హక్కులను బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ దక్కించుకున్నారు. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే అల్ట్రా మోడర్న్ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని భూషణ్ అభిప్రాయ పడ్డారు. తనకు సినిమా హిందీ హక్కులు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ‘ప్రభాస్ ఆలిండియా స్టార్‌గా ఎదిగారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న సాహోను హిందీ ప్రేక్షకులు తప్పక ఆదరిస్తార’ని భూషణ్ అన్నారు. ‘సినిమా మొదలైనప్పటి నుంచే ‘సాహో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా మా సినిమా అభిమానులకు గొప్ప విజువల్ అనుభూతి అందిస్తుంద’ని ప్రభాస్ అన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా, నీల్ నితీష్ ముకేష్, జాకీష్రాఫ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండేలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-ఎహషాన్-లాయ్ త్రయం సంగీతం అందిస్తోన్న సాహో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, సాహో హిందీ హక్కులను భూషణ్ కుమార్ ఎంత మొత్తానికి దక్కించుకున్నాడనేది వెల్లడి కాలేదు. -
విజయ్ దేవరకొండ `టాక్సీవాలా' ఫస్ట్ లుక్
-
గేర్ మార్చిన విజయ్ దేవరకొండ
సాక్షి, సినిమా : టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తర్వాతి చిత్రం టాక్సీవాలా ఫస్ట్ లుక్ ఇచ్చేశాడు. టాక్సీవాలా ఫస్ట్ గేర్ పేరుతో ఓ చిన్న వీడియో బైట్‌ను వదిలారు. ఫుల్ జోష్‌తో టాక్సీలో దూసుకెళ్తున్న విజయ్ లుక్కును రివీల్ చేశారు. జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఎస్కేఎన్, గీతా ఆర్ట్స్ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యాబ్ డ్రైవర్ రోల్లో కనిపించబోతుండగా.. మాళవికా నాయర్, షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
ఐ యామ్ బ్యాక్.. ఏదో ఒకరోజు..!
సాక్షి, సినిమా : టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సినీ ప్రయాణం చాలా వైవిధ్యభరితంగా ముందుకు సాగుతోంది. అర్జున్ రెడ్డి తర్వాత ఇతగాడి క్రేజ్ అమాంతం పెరిగిపోవటంతో చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉండగా... అందులో ఓ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇట్స్ టైమ్.. ఐ యామ్ బ్యాక్... అంటూ విజయ్ దేవరకొండ తన ట్విటర్లో ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను ఉంచాడు. దుమ్ము రేపుతున్న టాక్సీ పోస్టర్ కింద ‘ఫస్ట్ లుక్ ను ఏదో ఒక రోజు విడుదల చేస్తాం’ అన్న క్యాప్షన్ కింద కనిపిస్తోంది. రాహుల్ సంకృత్యన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యాబ్ డ్రైవర్ రోల్లో కనిపించబోతుండగా.. షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆసక్తికర టైటిల్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. It's time. I am back. pic.twitter.com/2jQMmMr926 — Vijay Deverakonda (@TheDeverakonda) 9 February 2018 -
' భాగమతి' మూవీ స్టిల్స్
-
లెక్కలు తేలాలి.. ఒక్కడినీ పోనివ్వను..
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న మరో ఆసక్తికర చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. షూటింగ్ పనుల్ని పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోఉంది. ‘బాహుబలి’ తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న భాగమతి ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. ట్రైలర్ ప్రకారం ఓ ప్రభుత్వాధికారిగా అనుష్క కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఓ ప్రాజెక్టు కోసం అనుష్క చేసిన కృషి.. దాని తర్వాత ఎదురైన సమస్యలను ఇందులో చూపించారు. 'ఎవడు పడితే వాడు రావడానికి.. ఎపుడు పడితే అపుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడినీ పోనివ్వను..' అంటూ అనుష్క చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఆసక్తి రేకెత్తించే ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
’భాగమతి’ ట్రైలర్ విడుదల
-
‘భాగమతి’ త్వరలో మిమ్మల్ని చూడబోతుంది!
స్వీటీ అనుష్క తాజా సినిమా ‘భాగమతి’.. న్యూఇయర్ సందర్భంగా ఈ సినిమా లుక్‌ను తాజాగా ట్విట్టర్లో విడుదల చేశారు. త్వరలోనే ’భాగమతి’ మిమ్మల్ని చూడబోతున్నాదంటూ విడుదల చేసిన ఈ లుక్కు విశేషంగా ఆకట్టుకుంటోంది. ’బాహుబలి’లో దేవసేనగా అలరించిన అనుష్క ఈ సినిమాలో కూడా గంభీరమైన పాత్రతో ప్రేక్షకులు ముందుకురాబోతున్నట్టు తెలుస్తోంది. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం చిత్రయూనిట్ విడుదల చేసిన ‘భాగమతి’ టీజర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. #Bhaagamathie wishes you a Happy New Year 2018. She Will See You Soon!#NYWithBhaagamathie pic.twitter.com/6wKAicMA7G — UV Creations (@UV_Creations) 1 January 2018 -
ఆ థీమ్ మ్యూజికే హైలెట్..!
బాహుబలి సీరీస్ లో దేవసేనగా అలరించిన స్వీటీ అనుష్క, త్వరలో భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ భాగమతి లుక్ లో ఎలా కనిపించనుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. స్వీటీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ బుధవారం భాగమతి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. టీజర్ లో హామర్ (సుత్తి) థీమ్ హైలెట్ గా నిలవనుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫస్ట్ లుక్ లో అనుష్క చేతిలో సుత్తి పట్టుకొని కనిపించింది. ఇప్పుడు టీజర్ లోనూ అనుష్క అదే లుక్ లో కనిపించనుంది. #TholipremaTeaser #bhaagamathieteaser Both r coming tom morning !! Wat a start mama !! #themeoftholiprema ♥️ with Lyrics By @ManiShreewriter amazingly sung by @kaalabhairavudu Followed by #thehammertheme 🔨 for #bhaagmathie From the heart to U all Let’s do the kicking pic.twitter.com/NFSJKizCK7 — thaman S (@MusicThaman) 19 December 2017 So proud and happy to score for this !! #hammertheme from the score of #bhaagamathie will be on the teaser which is releasing tom !! Can’t wait u guys to listen to IT !! @UV_Creations u guys r the best ♥️#hammertheme 🔨 #bgm Godbless Thaman pic.twitter.com/XXIONRpRUB — thaman S (@MusicThaman) 19 December 2017 -
ప్రభాస్ 'సాహో' రిలీజ్ డేట్ ఇదేనట!
'బాహుబలి' సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న తాజా సినిమా 'సాహో'.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలు దేశంలో ఎంత పెద్ద విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమాల అనంతరం ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో 'సాహో' దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఇలా భారతీయ చిత్ర పరిశ్రమలన్నింటిలోనూ ఈ సినిమాపై చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'సాహో' సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని చిత్రనిర్మాతలు భావిస్తున్నారట. రానున్న దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రయూనిట్ శ్రమిస్తోందని, అయితే, వీఎఫ్ఎక్స్ మిక్సింగ్ కోసం కొంచెం ఎక్కువ సమయం పడితే.. 2019లో ఈ సినిమా వచ్చే అవకాశముంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ వంటి హాలీవుడ్ సినిమాలుకు పనిచేసిన కేన్నీ బేట్స్ నేతృత్వంలో కళ్లుచెదిరేరీతిలో స్టంట్ సీక్వెన్స్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. -
ప్రభాస్ సినిమాపై ఇంట్రస్టింగ్ అప్ డేట్
బాహుబలి సక్సెస్ తో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ఆ ఇమేజ్ ను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలన్నీ జాతీయ స్థాయి చిత్రాలుగా రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సాహోను భారీ బడ్జెట్ తో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. సాహో తరువాత చేయబోయే సినిమా కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. సాహో తరువాత జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. మరోసారి యువీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా జోతిష్య శాస్త్రం, హస్త సాముద్రికం నేపథ్యంలో తెరకెక్కనుందట. పీరియాడిక్ ఫాంటసీగా తెరకెక్కనున్న సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతమందిచనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ప్రభాస్.. ఒకేసారి రెండు సినిమాల్లో..!
బాహుబలి సినిమాతో యూనివర్సల్ స్టార్ గామారిపోయిన ప్రభాస్, ఇక మీద అభిమానులను వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాను ప్రారంభించాడు. టీజర్ కోసం కొద్ది రోజుల షూటింగ్ కూడా చేసిన యూనిట్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ప్రభాస్ హాలీడే ట్రిప్ ముగిసిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన జిల్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాధా కృష్ణన్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సాహోతో పాటు రాధాకృష్ణన్ సినిమా షూటింగ్ లోనూ ఒకేసారి పాల్గొనేలా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. త్వరలోనే ఈ రెండు సినిమాలపై అధికారిక ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది. -
‘బాహుబలి’ ఫీవర్ మధ్య ప్రభాస్ ట్విస్టు
-
‘బాహుబలి’ ఫీవర్ మధ్య ప్రభాస్ ట్విస్టు
‘సాహో’ అంటూ అభిమనులకు పలుకరింత 2018లో రిలీజ్.. అలరిస్తున్న ప్రభాస్ కొత్త లుక్ దేశమంతా ‘బాహుబలి-2’ ఫీవర్‌తో ఊగిపోతున్న సమయంలో ‘సాహో’ అంటూ ప్రభాస్ కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ’బాహుబలి-2’ సినిమా శుక్రవారం విడుదల అవుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందే ‘సాహో’ టీజర్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. గత ఐదేళ్లుగా ‘బాహుబలి’ప్రాజెక్టులో లీనమైన ప్రభాస్ మరో సినిమా చేయని సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ప్రభాస్ ఎలాంటి చిత్రంలో నటిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో 2018లో సరికొత్త లుక్‌తో అభిమానులను అలరిస్తానంటూ కొత్త టీజర్‌తో ప్రభాస్ ప్రామిస్ చేశాడు. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సాహో’ టీజర్ గురువారం అధికారికంగా యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ టీజర్లో ఏముందంటే.. ఓపెన్ చేస్తే, జూమ్ అవుట్... అవుట్... అవుట్... కట్ చేస్తే ప్రభాస్ కన్ను. మళ్లీ కొంచెం జూమ్ అవుట్ చేస్తే... ముఖంపై రక్తంతో ఓ కుర్చీలో కూర్చున్న ప్రభాస్! అప్పుడు ఓ డైలాగ్. వాయిస్ ఓవర్ (విలన్): ఆ రక్తం చూస్తేనే అర్థమవుతుంది రా... వాణ్ణి చచ్చేంతలా కొట్టారని! (విలన్) అనుచరుడు: సార్... అది వాడి రక్తం కాదు, మన వాళ్లది. కుర్చీలో వెనక్కి పడి ఉన్న ప్రభాస్ మెల్లగా ముఖంపై రక్తాన్ని తుడుచు కుంటూ స్ట్రయిట్‌గా కూర్చుని డైలాగ్ చెబుతారు. అదేంటంటే... ప్రభాస్: ఇట్స్ షో టైమ్! శంకర్-ఎహసన్-లాయ్ త్రయం అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్. -
విజయ్ హీరోగా హారర్ కామెడీ
ప్రస్తుతం సౌత్ ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలో హారర్ కామెడీల ట్రెండ్ నడుస్తోంది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోలకు ఈ జానర్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి. అందుకే దర్శకులు కూడా ఈ తరహా కథలతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శకులు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన ఎక్కడికి పోతావు చిన్నవాడా కూడా ఇదే జానర్లో సక్సెస్ అయ్యింది. తాజాగా ఇదే జానర్లో మరో ఇంట్రస్టింగ్ సినిమా పట్టాలెక్కనుంది. సక్సెస్ఫుల్ బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న ద్వారకతో పాటు మరో సినిమా చేస్తున్న విజయ్, ఆ సినిమాలు పూర్తవ్వగానే యువి క్రియేషన్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
ప్రభాస్ సరసన నూతన తార!
చెన్నై: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్ నటించబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరుపుకోనుందట. ప్రభాస్ హోం ప్రొడక్షన్స్ యువి క్రియేషన్స్, గోపీకృష్ణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సరికొత్త కాన్సెప్ట్ లవ్ స్టోరీతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లోకేషన్లు కూడా ఇప్పటికే నిర్మాతలు ఫిక్స్ చేసేశారు. ఇక ప్రభాస్ సరసన నటించే కథానాయికి కోసం సెర్చింగ్ జరుగుతోందని దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు. అయితే ఈ సినిమాలో నూతన తారను పరిచయం చేయటానికి ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించి ఆడిషన్ కార్యాక్రమం జరుగుతోందని తెలిపారు. మరికొద్దిరోజుల్లో హీరోయిన్ ఎంపిక ఫైనలైజ్ అవుతుందన్నారు. కాగా కథ గురించి మాత్రం దర్శకుడు రాధాకృష్ణ పెదవి విప్పలేదు. అయితే ఈ చిత్రంలో హీరో చేయి చూసి జాతకాలు చెప్పేస్తుంటాడట. అలా చెప్పే విషయాలు అన్ని నిజం అవుతుంటాయట. ఆ విద్య వల్ల కథానాయకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా కాన్సెప్ట్ అట. కాగా బాహుబలి-2 తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే రాధాకృష్ణ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఫ్లాప్ హీరో కోసం సక్సెస్ఫుల్ టీం
జీనియస్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో 'హవీష్'. తొలి సినిమాతోనే భారీ ప్రచారం దక్కినా.., సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు ఈ యంగ్ హీరో. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని మరోసారి రామ్‌లీలా సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఈ సారి కూడా లక్ వర్కవుట్ కాలేదు. మరోసారి డిజాస్టర్ టాక్ రావటంతో కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఓ సక్సెస్ఫుల్ టీం తెరకెక్కించబోయే సినిమాలో హవీష్‌కు హీరోగా ఛాన్స్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. భలే భలే మొగాడివోయ్ సినిమాతో దర్శకుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న మారుతి, ప్రస్తుతం వెంకటేష్ హీరోగా బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత హవీష్ హీరోగా ఓ సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మిర్చి, రన్ రాజా రన్ లాంటి చిత్రాలను నిర్మించిన సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మించనుంది. మరి ఈ సినిమాతో అయిన హవీష్ హీరోగా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. -
తెరపై వినోదాల విందు... ఎక్స్‌ప్రెస్ రాజా
2016 సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రంలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్... ఎంటర్టైన్మెంట్... ఎంటర్టైన్మెంట్ అని ఏ ముహూర్తాన అన్నారో కానీ, గత దశాబ్ద కాలంగా ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రాలు మినిమమ్ గ్యారంటీతో సూపర్‌డూపర్ హిట్స్ అవుతున్నాయి. అగ్ర హీరోలు సైతం ఎంటర్టైన్మెంట్నే నమ్ముకోవడం విశేషం. ఇది ఇలా ఉండగా ఇటీవల విడుదలైన ఏ చిత్రాన్ని తీసుకున్నా అన్నీ ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట వేసినవే. 2016 సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వాటిలో ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రంలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. దానికి తోడు యువి క్రియేషన్స్ సంస్థ తమ చిత్రాల్లో తప్పనిసరిగా వినోదం ఉండేలా చూసుకుంటుంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాయి. ఇప్పుడు ఆ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఈ నెల 14న విడుదలవుతున్న సందర్భంలో ప్రమోషన్ కూడా తారస్థాయిలో చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం కౌంట్ డౌన్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల అందరి ప్రశంసలూ అందుకుంటున్న ప్రముఖ హాస్యనటులు ఈ చిత్రంలో నటించారు. ఇందులో ప్రభాస్ శ్రీను - మావయ్య శ్రీనుగా నటిస్తున్నారు. మొట్ట మొదటిసారి హీరోతో సమానంగా నవ్వులు కురిపించే పాత్రలో నటిస్తున్నారు. వైజాగ్‌లో పనీపాటా లేనివారి జాబితాలో రెండవ స్థానం దక్కించుకుని మొదటి స్థానం కోసం గొడవ పడే చక్కటి పాత్రలో ఆయన నటించారు. ప్రభాస్ శ్రీను కెరీర్లోనే ఈ పాత్ర నిలిచిపోయేలా ఉంటుంది. ధన్‌రాజ్ ‘ఇనుము’ అనే పాత్రలో నటిస్తున్నారు. ధన్‌రాజ్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. నవ్వించటంతో పాటూ ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ మధ్య అందరి ప్రశంసలు అందుకుంటున్న బ్రహ్మాజీ ‘బిల్‌గేట్స్’ పాత్రలో, ‘షకలక’ శంకర్ ‘బీభత్స నటరాజ్’ పాత్రలో డ్రామా ఆర్టిస్ట్‌గా నటించారు. ‘షకలక’ శంకర్ ఇందులో మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ చేసిన గెటప్ సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. ఈ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ మొదటి చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో కమెడియన్‌గా స్థిరపడిన సప్తగిరి ఈ చిత్రంలో ‘పొల్యూషన్ గిరి’గా మరొక్కసారి తన విశ్వరూపం చూపించారు. సప్తగిరి నటన ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇలా కథతో పాటూ కథనంతో పాటూ ఎంటర్టైన్మెంట్ని నమ్మి నిర్మించిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఫ్యామిలీతో సినిమాకి వెళ్లాలంటే చక్కటి వినోదం ఉండాలి. అలాంటి ఫుల్‌మీల్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు కూడా అందుకుంటుంది. ఈ సంక్రాంతిని వినోదాల ఎక్స్‌ప్రెస్ చేస్తుందనడంలో సందేహం లేదు. -
పోలీస్ గెటప్‌లో ప్రభాస్..?
ఈ తరం స్టార్ హీరోలందరూ ఏదో ఒక సందర్భంలో పోలీస్ గెటప్‌లో కనిపించిన వారే. టాప్ స్టార్స్‌గా ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పటికే పోలీస్ గెటప్‌లో అదరగొట్టారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి టాలీవుడ్ కండల వీరుడు ప్రభాస్ కూడా ఎంటరవ్వబోతున్నాడు. ప్రస్తుతం బాహుబలి సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ తన తరువాతి సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. రన్ రాజా రన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు సుజిత్, ఆ సినిమా తరువాత మరో సినిమా అంగీకరించకుండా ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్‌కు కథ వినిపించి ఓకే అనిపించుకున్న సుజిత్, ఆ స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నాడు. బాహుబలి తరువాత రిలీజ్ అయ్యే సినిమా కావటంతో అభిమానుల అంచనాలను అందుకునే స్థాయిలో సినిమాను రూపొందించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ భారీగా నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. -
మిర్చి బ్యానర్లో చెర్రీ
బ్రూస్ లీ పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడుతున్నాడు. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ సినిమా మరింత ఆలస్యం అవుతుండటంతో వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఫారిన్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న చెర్రీ, తిరిగి రాగానే తను తరువాత చేయబోయే సినిమాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన తనీ ఒరువన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. అల్లు అరవింద్, డివివి దానయ్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాతో పాటు వీలైనంత త్వరగా మరో సినిమాను కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు మగధీరుడు. మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు వరుస సూపర్ హిట్స్ అందించిన ఈ బ్యానర్లో సినిమా చేయటం, తన కెరీర్‌కు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట చరణ్. ఈ సినిమాకు అదే బ్యానర్లో జిల్ సినిమాను డైరెక్ట్ చేసిన రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. -
ఫెయిల్యూర్ హీరోలకు లక్కీ బ్యానర్
సినీ రంగంలో సెంటిమెంట్ లు చాలా ఎక్కువ. అందుకే ఒక సక్సెస్ ఇస్తే చాలు ఆ కాంబినేషన్ ను రిపీట్ చేయటం.. అదే జానర్ లో సినిమాలు చేయటం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఓ ఇంట్రస్టింగ్ సెంటిమెంట్ ఇప్పుడు టాలీవుడ్ తెర మీద హల్ చల్ చేస్తుంది. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న హీరోలను భారీ హిట్స్ తో ఒడ్డున పడేస్తుంది ఓ నిర్మాణ సంస్థ.. మిర్చి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ప్రొడక్షన్ కంపెనీ 'యువి క్రియేషన్స్'. హీరో ప్రభాస్ మిత్రులు నెలకొల్పిన ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ప్రభాస్ హీరోగా 'మిర్చి'ని తెరకెక్కించారు. కొత్త దర్శకుడు కొరటాల శివను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో తొలి ప్రయత్నంలో మంచి సక్సెస్ సాధించింది యువి క్రియేషన్స్. అదే జోష్‌లో శర్వానంద్ హీరోగా షార్ట్ ఫిలిం మేకర్ సుజిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'రన్ రాజా రన్' సినిమాను తెరకెక్కించారు. యువి బ్యానర్‌పై చిన్న సినిమాగా తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని సాధించింది ఈ మూవీ. ఈ సినిమాతో అప్పటి వరకు ఫ్లాప్‌లతో బాధ పడుతున్న శర్వానంద్ కూడా హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. అలాగే 'భలే భలే మొగాడివోయ్' సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. చాలా రోజులుగా హిట్ లేక కష్టాల్లో ఉన్న నాని.. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన భలే భలే మొగాడివోయ్ సినిమాతో సక్సెస్ మూడ్ లోకి వచ్చాడు. ఇలా కష్టాల్లో ఉన్న హీరోలను హిట్ ట్రాక్ ఎక్కిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. -
ప్రభాస్...బన్నీ ఇద్దరికీ భలే భలేమగాడివోయ్ భలే నచ్చేసింది
- బన్నీ వాసు ‘‘ఏ సినిమాకైనా దర్శకుడు హార్స్లాంటివాడు. ఆ హార్స్ సరిగ్గా వెళుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతది అని ఓ సందర్భంలో అల్లు అరవింద్‌గారు అన్నారు. ఆ మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఓ నిర్మాతగా సినిమాకి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను’’ అని బన్నీ వాసు అన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యువీ క్రియేషన్స్ వంశీ , జీఏ2 బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలతో పాటు ఇతర విశేషాలను బన్నీ వాసు చెప్పుకొచ్చారు. * విభిన్న ఇతివృత్తాలతో యూత్‌ఫుల్ చిత్రాలు చేయాలన్నదే మా జీఏ2, యూవీ క్రియేషన్స్ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మా ముందు పెట్టింది అల్లు అరవింద్‌గారే. జీఏ2కి నేను, శిరీష్, యూవీకి వంశీ నిర్మాతలం. కాన్సెప్ట్ విషయంలో, సినిమాలు తయారు చేసే విధానంలో అరవింద్‌గారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. ‘‘కథను నమ్ముకుని బడ్జెట్ పెట్టాలి. హీరోను బట్టి బడ్జెట్ పెట్టొద్దు’’ అని అరవింద్‌గారు చెప్పిన మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. * రెండేళ్ల క్రితం మారుతి ‘భలే భలే మగాడివోయ్’ కథ చెప్పాడు. కథ వింటున్నప్పుడు లెక్కలేనన్ని సార్లు నవ్వుకున్నాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. నేను విన్నదానికన్నా విజువల్‌గా ఇంకా బాగుంది. మారుతి కథ చెప్పినప్పుడు వంద శాతం నవ్వొస్తే, నాని ఆ కథను తన నటన ద్వారా ఆవిష్కరించిన తీరుకి రెండు వందల శాతం నవ్వొచ్చింది. * మారుతి ఈ కథ చెప్పినప్పుడే నాని అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే, ఈ సినిమా మొత్తం హీరో ఎంటర్టైన్మెంట్ మీద సాగుతుంది. నాని హండ్రడ్ పర్సంట్ మంచి టైమింగ్ ఉన్న హీరో. ఈ సినిమాలో తనకు మతిమరుపు ఉంటుంది. అది ప్రేయసికి తెలియనివ్వకుండా భలే మ్యానేజ్ చేస్తుంటాడు. అందుకే ‘భలే భలే మగాడివోయ్’ అని టైటిల్ పెట్టాం. నాని బ్రహ్మాండంగా చేశాడు. అరవింద్‌గారు ఎడిటింగ్ టైమ్‌లో చూసి, ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు నానీకి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చెయ్యి. తనతో ఇంకో సినిమా చేద్దాం’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి ‘అందాల రాక్షసి’లో సీరియస్‌గా కనిపిస్తుంది. ఇందులో కామెడీ కూడా చేసి, బాగా నటించింది. * హీరోకి మతిమరుపు అంటే ‘గజిని’ సినిమా గుర్తుకు రావడం సహజం. కానీ, ఆ సినిమాకీ ఈ సినిమాకీ పోలికే లేదు. అది యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం కామెడీ వేలో సాగుతుంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ అంటూ ఉండవు. కథలో భాగంగానే కామెడీ సాగుతుంది. * ఈ చిత్రాన్ని ప్రభాస్ చూసి, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఎడిటింగ్ టైమ్‌లో బన్నీ (అల్లు అర్జున్) చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. సీన్స్‌లో కానీ డైలాగ్స్‌లో కానీ వెతికినా కూడా ద్వంద్వార్థాలు కనిపించవు. ఈ చిత్రం చూడ్డానికి థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకు వెళతారు. * మారుతి, నేను రూమ్మేట్స్. వంశీ, నేను లాస్ట్ టెన్ ఇయర్స్‌గా డిస్ట్రిబ్యూషన్లో పార్టనర్స్. నాని, వంశీ ఫ్రెండ్స్. సో.. నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేసిన చిత్రం ఇది అనొచ్చు. వంశీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడానికి ముందుంటాడు. సంగీత దర్శకుడిగా గోపీసుందర్‌ని తీసుకుందామని వంశీ, మారుతీయే అన్నారు. పాటలు సక్సెస్ అయ్యాయి. రీ-రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది, * ‘ప్రేమకథా చిత్రమ్’లో ఓ రెండు రీళ్లు పడీ పడీ నవ్వుకుంటాం. ఈ సినిమాలో అలా నవ్వుకోవడానికి నాలుగు రీళ్లు ఉంటాయి. సినిమా మీద నమ్మకంతో ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాం. * వంశీ, నేను వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. మున్నా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం, ప్రభాకర్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నాం. ఓ రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి.