
స్వీటీ అనుష్క తాజా సినిమా ‘భాగమతి’.. న్యూఇయర్ సందర్భంగా ఈ సినిమా లుక్‌ను తాజాగా ట్విట్టర్‌లో విడుదల చేశారు. త్వరలోనే ’భాగమతి’ మిమ్మల్ని చూడబోతున్నాదంటూ విడుదల చేసిన ఈ లుక్‌కు విశేషంగా ఆకట్టుకుంటోంది. ’బాహుబలి’లో దేవసేనగా అలరించిన అనుష్క ఈ సినిమాలో కూడా గంభీరమైన పాత్రతో ప్రేక్షకులు ముందుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం చిత్రయూనిట్ విడుదల చేసిన ‘భాగమతి’ టీజర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#Bhaagamathie wishes you a Happy New Year 2018.
— UV Creations (@UV_Creations) 1 January 2018
She Will See You Soon!#NYWithBhaagamathie pic.twitter.com/6wKAicMA7G
Comments
Please login to add a commentAdd a comment