Bhaagamathie
-
ప్రభాస్ ఫ్యాన్స్ కు మళ్ళీ షాక్
-
హీరోలను ఢీ కొట్టే రేంజ్ అనుష్క సొంతం
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో హీరోలకు సమానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క. ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్గా అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తన నటన హైలైట్ గా సాగిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఒక స్పెషల్ మూవీగా సెలబ్రిటీల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూనే కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అందుకుందీ సినిమా. అటు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించడం ఆమెకే సాధ్యమైందని అనుకోవచ్చు. 'వేదం' సినిమాలో సరోజ క్యారెక్టర్లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గానూ ఆమె 'ఫిలిమ్ ఫేర్' అవార్డును అందుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది. అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా 'భాగమతి-2' ని యూవీ క్రియేషన్స్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆడియెన్స్, ఇండస్ట్రీ.. అందరికీ ఇష్టమైన స్వీట్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి కెరీర్ ఇలాగే ఘన విజయాలతో సాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు హర్. అనుష్క బర్త్‌డే.. స్ఫెషల్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అనుష్క పుట్టినరోజు గిఫ్ట్.. ఆ హిట్ సినిమా పార్ట్-2 ప్రకటన
టాలీవుడ్లో అనుష్క పేరు వినగానే స్టార్ హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అనే అంశం గుర్తుకు వస్తుంది. ఒక సినిమాలో హీరోయిన్ అంటే రెండు సీన్లు, మూడు పాటలకు మాత్రమే పరిమితం కాదు.. అవసరమైతే తనే ఒక సినిమాని ఒంటిచేత్తో నడిపించగలదు. ఈ విషయాన్ని అనేకసార్లు నటి అనుష్క నిరూపించింది. అందుకే ఆమెకు ఇక్కడ అంత క్రేజ్.. సినీ కెరియర్ ఆరంభంలో అందాలు ఆరబోసినా... ఆ తర్వాత అరుంధతిలో జేజమ్మగా దుమ్ములేపింది. ఆ తర్వాత దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అనగానే ఫస్ట్ ఛాయిస్ అనుష్క పేరు గుర్తొచ్చేలా ఆమె మాయ చేసింది. 'వేద' సినిమాలో సరోజ పాత్రలో తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగించింది అనుష్క.. బిల్లాలో తన గ్లామర్‌తో కిక్ ఇచ్చింది. తాజాగా విడుదలైన 'మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి'లో అన్విత పాత్రలో అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టింది. అనుష్క సినీ కెరియర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం భాగమతి.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. నేడు (నవంబర్ 7) అనుష్క పుట్టినరోజు సందర్భంగా భాగమతి 2 చిత్రం గురించి యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రకటన అధికారికంగా వస్తే తన కెరియర్లో 50వ చిత్రంగా రికార్డుకెక్కనుంది. -
భాగమతి నటి ఫేక్ వీడియో.. కేసు నమోదు
సినిమాను రూపొందించటమే కాదు ఆ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయటంలోనూ సినీ వర్గాలు సరికొత్త దారులు వెతుకుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రయత్నం బెడిసి కొడుతుంది. తాజాగా ఓ మలయాళ నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. భాగమతి సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన ఆశా శరత్ ఇటీవల తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆశా మేకప్ లేకుండా కనిపించిన ఆ వీడియోలో ‘తన భర్త కనిపించటం లేదని, ఆచూకి తెలిసిన వారు కేరళలోని కట్టప్పన్ పోలీస్ స్టేషన్లో తెలియజేయాల’ని కోరారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు నిజమే అనుకున్నారు. విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన ఆశా శరత్ నెమ్మదిగా అసలు విషయాన్ని బయటపెట్టారు. తాను ఆ వీడియోను కేవలం ‘ఎవిడే’ సినిమా ప్రమోషన్లో భాగంగానే రిలీజ్ చేశానని, నిజంగా తన భర్త కనిపించకుండా పోలేదని వెల్లడించారు. దీంతో ఆశా చేసిన పనిపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఇలాంటి పోస్ట్‌లతో నిజమైన వీడియోలను కూడా ప్రజలు నమ్మడం మానేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళకు చెందిన లాయర్ శ్రీజిత్, ఫేక్ వీడియో సర్క్యూలేట్ చేసినందుకు ఆశా శరత్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇడుక్కి పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. -
ఎప్పటికీ నా మనసులో ఉంటావ్ : అనుష్క
తన దగ్గర సహాయకుడిగా పనిచేసిన రవి వర్ధంతి సందర్భంగా హీరోయిన్ అనుష్క భావోద్వేగానికి గురయ్యారు. ‘మనం ఎవరినైతే అమితంగా ప్రేమిస్తామో.. వారు మనల్ని ఎప్పటికీ విడిచిపోరు. కొన్నింటిని మరణం కూడా దూరం చేయలేదు. ఏడేళ్లు గడుస్తున్న రవి ఇప్పటికీ నువ్వు మాతో ఉన్నట్టుగానే ఉంది. మరణం తరువాత ఏమవుతుందో తెలియదు. కానీ నువ్వు ఎప్పటికీ నా మనసులో ఉంటావు’ అంటూ రవితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు అనుష్క. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. భాగమతి సినిమా తరువాత నటనకు గ్యాప్ ఇచ్చిన స్వీటీ త్వరలో సైలెన్స్ అనే బహుభాషా చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు సైరాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు కూడా అనుష్క ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. View this post on Instagram “Those who love never truly leave us ,Harry.There are things that death cannot touch”........The Past 14years has been quite a journey ... when u realise the people closest to u are no more a part of ur life all I can say is they take a part of u with them ...it’s been 7 years and it still keeps me wondering a beautiful soul (Ravi🥰) I have no clue of the afterlife but he always live in my heart .... A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on May 17, 2019 at 1:08pm PDT -
గడ్డకట్టే చలిలో స్వీటీ!
భాగమతి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం విదేశాల్లో జరగనుందట. ఇప్పటికే ఆ లోకేషన్లు కూడా ఫైనల్ చేశారు. వీటిలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మైనస్ డిగ్రీలలో ఉంటుందని, అంత చలిలో కూడా షూటింగ్ చేసేందుక అనుష్క అంగీకరించిందని తెలుస్తోంది. ఈ సినిమాకు సైలెన్స్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీలో అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
షాకింగ్ : పైరసీలో భాగమతి, రంగస్థలం టాప్
సినీ పరిశ్రమను పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బయటికొచ్చేస్తుంది. కొన్ని సినిమాలైతే విడుదలకు ముందే పైరసీ భారినపడుతున్నాయి. దీనిపై పరిశ్రమ వర్గాలు ఎన్నిరకాలు చర్యలు చేపట్టిన పైరసీకి అడ్డుకట్ట పడటం లేదు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని కొన్ని ముఠాలు చిత్ర పరిశ్రమను హడలెత్తిస్తున్నాయి. జర్మన్ కేంద్రంగా పనిచేస్తున్న టెక్సిపియో సంస్థ గత ఆరేళ్ల నుంచి పైరసీ వెబ్సైట్లపై అధ్యయనం చేస్తోంది. ఆ డేటా ఆధారంగా 2018లో ప్రథమార్ధంలో విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధికంగా పైరసీకి గరయిన టాప్-10 సినిమాల జాబితాను ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది. పైరసీ జాబితాలో అనుష్క నటించిన భాగమతి 19లక్షల డౌన్లోడ్లతో అగ్రభాగాన నిలువగా, రామ్ చరణ్ , సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం 16 లక్షలతో రెండో స్థానంలోనిలిచింది.టెక్సిపియో ప్రతినిధి మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు సంబంధించిన పైరసీ షేరింగ్ భారత్‌లోనే కాకుండా యూఎస్, శ్రీలంక, సౌదీ అరేబియా, యూఏఈ, పశ్చిమాసియా దేశాల్లో అధికంగా ఉన్నట్టు తమ పరిశీలనలో బయటపడిందన్నారు. అదే విధంగా భారత్‌లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, ముంబై నగరాల్లో పైరసీ ఎక్కువగా చూస్తున్నారని తెలిపారు. పైరసీ టాప్-10లో నిలిచిన ఇతర సినిమాలు 3. భరత్ అనే నేను 4. మహానటి 5. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 6. తొలిప్రేమ 7. ఛలో 8. అజ్ఞాతవాసి 9. జై సింహా 10. టచ్ చేసి చూడు -
నాకదే ఇష్టం.. ఏ పని పెట్టుకోను: నటి
సాక్షి, చెన్నై: హీరోయిన్ అనుష్క నటించిన భాగమతి చిత్రం మంచి విజయం సాధించింది. అందంతో రంజింపజేయాలన్నా.. వీరనారిగా కత్తి పట్టి రణరంగంలో కదం తొక్కాలన్నా ఈ స్వీటికే చెల్లుతుంది. తాజాగా మాలీవుడ్లోకి ఈ ముద్దుగుమ్మ అగుడు పెట్టనుంది. సూపర్‌స్టార్ మమ్ముట్టితో ఆమె జత కట్టనున్నారు. ఆ సినిమాలో నటించడానికి నటి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఈ మధ్యకాలంలో అనుష్క ప్రేమ, పెళ్లి గురించి గాసిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా బ్యూటీ ఇచ్చిన బేటి చూద్దాం. ‘ఏ రంగం వారికైనా తమ విరామ సమయాన్ని ఏ విధంగా గడపాలో ఒక ప్రణాళిక ఉంటుంది. కొందరు ఫ్యామిలీతో, మరికొందరు స్నేహితులతో గడపాలని కోరుకుంటారు. అంతేకాక వారితో కలిసి బయట ప్రపంచంలో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. నేను మాత్రం విరామం లభిస్తే ఏకాంతాన్ని కోరుకుంటాను. అదంటే నాకు చాలా ఇష్టం. విరామం దొరికితే ఏ పని పనెట్టుకోను. షూటింగ్ సమయంలో మన గురించి ఆలోచించడానికి సమయం ఉండదు. 24 గంటలూ కథా పాత్రలోనే జీవించాల్సి ఉంటుంది. అలా ఏ మాత్రం విరామం లభించినా ఏకాంతంగా కూర్చుని నా గురించి నేను ఆలోచించుకుంటాను. నాలో నేనే మాట్లాడుకుంటాను. ఏకాంతంగా ఆలోచించే సమయంలో ఏదైనా తప్పు చేస్తే దాన్ని గ్రహించుకునే అవకాశం, సరిదిద్దుకునే మార్గం తెలుస్తోంది’ అని నటి అనుష్క పేర్కింది. -
భాగమతి దర్శకుడికి బంపర్ ఆఫర్
పిల్ల జమీందార్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అశోక్. తరువాత సుకుమారుడు, చిత్రాంగథ సినిమాలతో నిరాశపరిచినా.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి సినిమాతో మరోసారి సత్తా చాటాడు. డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో అశోక్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. త్వరలో ఈ యువ దర్శకుడు ఓ అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. 1914 నాటి కథతో తెరకెక్కనున్న ఈసినిమాను పెన్ ఎన్ కెమెరా ప్రొడక్షన్స్ కంపెనీ, కెనడియన్ ఫిలిం కౌన్సిల్ తో కలిసి నిర్మించనుంది. బ్రిటీష్ పరిపాలన కాలంలో కొమగట మరు అనే స్టీమ్ షిప్లో కెనడా వెళ్లేందుకు కొందరు భారతీయులు ప్రయత్నించగా అక్కడి ప్రభుత్వం వారు దేశంలోకి ప్రవేశించేందుకు అనుమంతించలేదు. ఈ సంఘటననే కథగా ‘కొమగట మరు 1914’ అనే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నాడు అశోక్. -
అనుష్క చిత్రం అంటే కాసుల వర్షమే..
సాక్షి, చెన్నై: ఇంతకంటే మంచిది మరొకటి ఉంటుందా అంటోంది నటి అనుష్క. నటనపై ఆధారపడి, సినిమాల్లో సంపాదించుకుంటూ సినిమా శాశ్వతం కాదు, వేరే వ్యాపారం చేసుకోవాలి అంటూ ఈ రంగాన్నే విమర్శించేవారు కొందరు. సినిమానే ఆస్తులు, అంతస్తులు, ఆనందం అన్నీ ఇచ్చింది అని మర్యాదనిచ్చే వారు మరి కొందరు. ఇక నటి అనుష్క ఈ రెండవ కోవకు చెందినదిన వారని చెప్పక తప్పదు. నటిగా 13 ఏళ్ల అనుభవం. అంచెలంచెలుగా ఎదిగి అగ్ర హీరోయిన్గా రాణిస్తున్న అనుష్క చిత్రం అంటే కాసుల వర్షమే అనే పేరును సంపాందించుకున్నారు. అందం, అభినయం కలబోసిన అద్భుత నటి అనుష్క. తాజాగా భాగమతి చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపారు. అందరూ స్వీటీ అని ప్రేమగా పిలుచుకునే ఈ బ్యూటీ తన సినీ అనుభవాన్ని ఒక భేటీలో పంచుకున్నారు. అవేమిటో చూద్దాం. సినిమాల్లో నటించడం కూడా ఉద్యోగం లాంటిదే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మాదిరిగానే సినిమాల్లో మేము పనిచేస్తున్నాం. అయితే ఇతరుల కంటే మాదే అత్యుత్తమ పని. ఎందుకంటే సినిమాలను ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమించే సినిమారంగంలో ఒక నటిగా నేనుండడం ఘనతగా భావిస్తున్నాను. ఒక్క పారితోషికం మాత్రమే కాకుండా ఇక్కడ చాలా సౌకర్యాలను అనుభవిస్తున్నాను. ఇక కష్టనష్టాలనేవి అన్ని రంగాల్లోనూ ఉంటాయి. అయితే సినిమారంగంలో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకుంటే హీరోయిన్లను రాణులుగా చూస్తారు. మా మాటలను ఎంతగానో విశ్వసిస్తారు. మేము ఎం చెబుతామోనన్న ఆసక్తి చూపుతారు. సాధారణ అమ్మాయిల కంటే మేము చెప్పేవి ఆదర్శంగా తీసుకుని, వాటిని అనుసరిస్తారు. ఇతర రంగాల్లో ఉద్యోగం చేసేవారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పని చేసి అలసిపోతారు. మేము మాత్రం 24 గంటలు స్టూడియోల్లో మగ్గి పని చేసినా అలుపు ఉండదు. అలాంటి ఇష్టమైన వృత్తి సినిమా రంగం. ఇంతకంటే ఉత్తమమైన పని వేరేమీ ఉండదు. -
అర్ధరాత్రి భాగమతి హల్చల్
అందం, అభినయంతో కట్టిపడేయడమే కాదు.. అరుంధతిలా.. జేజెమ్మలా.. ఇప్పుడు భాగమతిలా చెలరేగిపోగలనని నిరూపించిన అందాల హీరోయిన్ అనుష్క విశాఖ నగరంలో సందడి చేసింది. భాగమతి సినిమా విజయ యాత్రలో భాగంగా సోమవారం అర్ధరాత్రి చిత్రాన్ని ప్రదర్శిస్తున్న జగదాంబ థియేటర్‌కు యూనిట్ సభ్యులతోపాటు చేరుకున్న అనుష్క సెకండ్ షో చూస్తున్న ప్రేక్షకులను చిత్రంలోని డైలాగులతో అలరించింది. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఎవరుపడితే వాళ్లు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా..భాగమతి అడ్డా..లెక్కతేలాలి. ఒక్కడ్నీ పోనివ్వను. అంటూ స్వీటీ అనుష్కశెట్టి డాల్బీ సౌండ్ రేంజ్లో డైలాగ్ చెప్పేసరికి విశాఖ ప్రేక్షకులు జేజెమ్మకు జేజేలు పలికారు. భాగమతి సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అనుష్క విజయోత్సవ యాత్రకు శ్రీకారం చుట్టారు. సోమవారం విజయవాడ, రాజమండ్రి థియేటర్లలో సందడి చేసిన అనుష్క జగదాంబ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి కొద్ది సేపు సినిమా వీక్షించారు. అనంతరం సినిమాలో పాపులర్ డైలాగ్‌లను స్వయంగా చెప్పి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. అనుష్క వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు జగదాంబ థియేటర్‌కు భారీగా చేరుకున్నారు. సరిగ్గా రాత్రి 11.05 గంటలకు అనుష్క రావడంతో థియేటర్ అభిమానులు కేరింతలు కొట్టారు. అనుష్కతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ముందుగా థియేటర్ నిర్వాహకులు అనుష్కకు ఘనంగా స్వాగతం పలికారు. -
రుద్రమదేవి రికార్డు బద్దలు కొట్టిన భాగమతి
టాలీవుడ్ దేవసేన అనుష్క నటించిన భాగమతి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదైలనప్పటి నుంచి భారీగా వసూళ్లను రాబడుతోంది. తొలిరోజునే పాజిటాక్ తెచ్చుకున్న ‘భాగమతి’ అన్ని ఏరియాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటివారం లోనే సుమారు రూ.20 కోట్లు వసూలు చేసి నిర్మాతకు భారీ లాభాలనే ముట్టచెప్పింది. గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రమదేవి’ అమెరికాలో 9.71 లక్షల డాలర్లను వసూలు చేసింది. తాజాగా ‘భాగమతి’ ఆరికార్డును చెరిపేసింది. ఇప్పటికే 9.80 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకున్న భాగమతి మిలియన్ మార్క్‌కు అతి సమీపంలో ఉంది. దక్షిణాదిన హీరోయిన్ ప్రధాన పాత్రలో రూపొందించిన సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. భారీ కలెక్షన్లతో తన పేరుతో ఉన్న రికార్డును తానే తిరగరాసింది. మొత్తానికి చాలా మంది టాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డును అనుష్క అందుకుంది. -
భాగమతిపై చరణ్ పొగడ్తలు
రామ్‌చరణ్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్లు, కొత్త విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అందరినీ అలరిస్తారు. ఏదైనా సినిమా విడుదలౌతుందంటే ఆయా వ్యక్తులకు శుభాకాంక్షలు తెలపడం, ఫోన్ చేసి అభినందిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో అందరితో సన్నిహితంగా మెలిగే వ్యక్తి అని పేరు కూడా సంపాదించుకున్నారు. అందుకే చరణ్ అంటే అభిమానులకు ఎనలేని ప్రేమ. తాజాగా రామ్ చరణ్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి చిత్రం పై పొగడ్తల వర్షం కురిపించారు. గత రాత్రి భాగమతి చూశానని, అనుష్క అద్భుతంగా నటించిందంటూ ఆకాశానికెత్తాశారు. సాంకేతిక అంశాలు, చిత్ర నిర్మాణం సూపర్‌గా ఉందన్నారు.చాలా మంచి సినిమా తీసిన అందరికీ అభినందనలు అంటూ ఫేస్బుక్లో పోస్టు చేశారు. భయంతో రాత్రి తన సతీమణి ఉపాసన నిద్ర కూడా పోలేదని చలోక్తి విసిరాడు. గతంలో బాహుబలి సమయంలోను చిత్ర బృందానికి తన అభినందనలు తెలిపాడు. శ్రీమంతుడు సినిమా సమయంలోను చరణ్ మహేష్‌బాబును అభినందించిన సంగతి తెలిసిందే. -
‘భాగమతి’ సక్సెస్ మీట్
-
మేకింగ్ ఆఫ్ మూవీ - భాగమతి
-
‘భాగమతి’కి భారీ వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: అనుష్క తాజాచిత్రం ‘భాగమతి’ భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటిరోజు మొత్తం రూ. 12 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో 1,56, 538 డాలర్లు వసూలు చేసింది. దక్షిణాదిలో మహిళ ప్రాధాన్యమున్న చిత్రాల్లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పాజిటివ్ టాక్, రివ్యూలు రావడంతో మార్నింగ్ షోల తర్వాత ప్రేక్షకాదరణ మరింత పెరిగింది. దీంతో మున్ముందు కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. తమ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ‘భాగమతి’ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు జి.అశోక్ దర్శకత్వం వహించారు. అనుష్కకు జోడిగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించాడు. తమన్ సంగీతం అందించాడు. -
‘భాగమతి’ మూవీ రివ్యూ
టైటిల్ : భాగమతి జానర్ : థ్రిల్లర్ తారాగణం : అనుష్క, ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ సంగీతం : తమన్.ఎస్ దర్శకత్వం : జి. అశోక్ నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ అరుంధతి, రుద్రమదేవి, పంచాక్షరి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న అనుష్క లీడ్ రోల్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ భాగమతి. పిల్ల జమీందార్, సుకుమారుడు లాంటి క్లాస్ సినిమాలను తెరకెక్కించిన అశోక్ తొలిసారిగా తన స్టైల్ మార్చి చేసిన సినిమా భాగమతి. అనుష్కను భాగమతిగా చూపించిన దర్శకుడు అశోక్ సక్సెస్ సాధించాడా..? ఇటీవల లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న అనుష్క ఈ సినిమాతో లుక్స్ పరంగా ఆకట్టుకుందా..? భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భాగమతి ఆ అంచనాలను అందుకుందా..? కథ : సెంట్రల్ మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ (జయరామ్) నిజాయితీ గల రాజకీయనాయకుడు. ఆయనకు ఉన్న ఇమేజ్ చూసి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎలాగైన ఈశ్వర్ ప్రసాద్ ను కట్టడి చేయాలని భావిస్తారు. అందుకోసం ఎలాగైన ఈశ్వర్ ప్రసాద్ అవినీతి పరుడని నిరూపించాలని.. ఆ బాధ్యతను సీబీఐ జాయింట్ డైరెక్టర్ వైష్ణవి నటరాజన్(ఆశా శరత్)కు అప్పగిస్తారు. వైష్ణవి, ఈశ్వర్ ప్రసాద్ ను ఇరికించేందుకు ఆయన దగ్గర రెండు సార్లు సెక్రటరీగా పనిచేసిన చెంచలా ఐఏఎస్ (అనుష్క)ను విచారించాలని నిర్ణయించుకుంటుంది. తన ప్రియుడ్ని చంపిన కేసులో జైల్లో ఉన్న చెంచలను ప్రజల మధ్య విచారించటం కరెక్ట్ కాదని, ఊరికి దూరంగా అడవిలో ఉన్న భాగమతి బంగ్లాలో విచారించాలని నిర్ణయిస్తారు. (సాక్షి రివ్యూస్)బంగ్లాలోకి ఎంటర్ అయిన తరువాత చెంచల వింతగా ప్రవర్తిస్తుంది. తనను ఎవరో కొడుతున్నారని అరుస్తూ, అప్పుడప్పుడూ అరబిక్ భాషలో మాట్లాడుతూ పోలీసులను భయపెడుతుంది. చెంచల అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి..? మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ మీద మచ్చ వేయాలన్న కుట్ర ఎందుకు జరిగింది..? చెంచల తన ప్రియుడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది..? ఈ సమస్యల నుంచి చెంచల ఎలా బయటపడింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : అరుంధతి, రుద్రమదేవిగా చరిత్ర సృష్టించిన అనుష్క భాగమతిగా మరోసారి అదే స్థాయి పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఐఏఎస్ ఆఫీసర్ చెంచలగా హుందాగా కనిపించిన స్వీటీ, భాగమతిగా రౌద్ర రసాన్ని కూడా అద్భుతంగా పలికించింది. (సాక్షి రివ్యూస్)భాగమతి గెటప్ లో అనుష్క మరోసారి అరుంధతి సినిమాని గుర్తు చేసింది. మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్‌గా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో జయరామ్ నటన ఆకట్టుకుంటుంది. హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ ది చిన్న పాత్రే అయినా తనదైన హావ భావాలతో మెప్పించాడు . సీబీఐ జేడీ పాత్రలో ఆశా శరత్ నటన బాగానే ఉన్నా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న నటి కాకపోవటంతో అంతగా కనెక్ట్ కాలేదు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, ధనరాజ్, విధ్యుల్లేఖ రామన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : గత ఏడాది చిత్రాంగద లాంటి థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక్ ఈ ఏడాది, అనుష్క లీడ్ రోల్ లో తెరకెక్కిన భాగమతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే భారీ ప్రచారం లభించటంతో అదే స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఆ అంచనాలు అందుకునే స్థాయి భాగమతిని తీర్చి దిద్దాడు అశోక్. భారీ కథ కాకపోయినా.. అద్భుతమైన టేకింగ్, థ్రిల్లింగ్ విజువల్స్‌లో ఆడియన్స్‌ను కట్టి పడేశాడు. ముఖ్యంగా భాగమతి బంగ్లాలో జరిగే సన్నివేశాలు వావ్ అనిపిస్తాయి. ఆడియన్స్‌కు షాక్ ఇచ్చే ట్విస్ట్‌లు కూడా చాలానే ఉన్నాయి. ఒక దశలో అనుష్క విలనేమో అనేంతగా కథను మలుపు తిప్పాడు దర్శకుడు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పార్ట్ లు పార్ట్ లుగా రావటం. కొన్ని జరగని సంఘటనలు జరిగినట్టుగా భ్రమ కలిగించటంతో ఆడియన్స్ కాస్త తికమక పడే అవకాశం ఉంది. (సాక్షి రివ్యూస్) సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ తమన్ మ్యూజిక్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. మది సినిమాటోగ్రాఫి కూడా సినిమాను మరో మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నేపథ్య సంగీతం అనుష్క నటన మైనస్ పాయింట్స్ : అక్కడక్కడ తికమక పెట్టే కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అనుష్క ‘భాగమతి’లో మెరుపులా బాహుబలి!
‘బాహుబలి’లో దేవసేనగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతంచేసుకున్న అనుష్క తాజాగా ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. యాక్షన్ థిల్లర్‌గా పలు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ప్రమోషనల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. అనుష్క హాట్‌గా, గ్లామరస్‌గా కనిపించిన ఈ ప్రమోషన్ వీడియోలో ఓ స్పెషల్ ఎఫెక్ట్ ఇప్పుడు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకు కారణం.. ఈ వీడియోలో ప్రభాస్ అనూహ్యంగా దర్శనమివ్వడమే.. షూటింగ్ స్పాట్‌కు వచ్చిన ప్రభాస్ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఉండగా.. అలా చూపించి చూపించనట్టు ఇందులో చూపించారు. ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నా.. అతను బహుబలి గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు.. ఈ విషయాన్ని గుర్తించిన అభిమానులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మూడు నిమిషాల 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక నిమిషం 50 సెకన్ల వద్ద ప్రభాస్ తళుక్కున మెరుస్తాడు. పలు సినిమాల్లో కలిసి నటించి.. ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీని బాగా పండించిన అనుష్క-ప్రభాస్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని, ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఇటు అనుష్క, అటు ప్రభాస్ చెప్తున్నారు. మొత్తానికి ఏదీఏమైనా ఈ వీడియోలో ప్రభాస్ కనిపించడం ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో ఏమైనా కనిపిస్తారా? అన్న ఊహాగానాలకు తావిస్తోంది. -
అనుష్క ‘భాగమతి’లో మెరుపులా బాహుబలి!
-
'భాగమతి' మూవీ స్టిల్స్
-
‘భాగమతి’ ప్రి రిలీజ్ వేడుక
-
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘భాగమతి’
అనుష్క ప్రధాన పాత్రలో పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ భాగమతి. అరుంధతి, రుద్రమదేవి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటిన అనుష్క భాగమతితో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లతో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అనుష్క లీడ్ రోల్ లోనటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, జయరామ్, విద్యుల్లేఖ రామన్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిపబ్లిక్ డే కానుకగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి భాగమతి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రభాస్ మంచి మిత్రుడు అంతే..!
సాక్షి, చెన్నై: హీరో ప్రభాస్ తనకు మంచి మిత్రుడు అంతే. అంతకు మించి తమ మధ్య ఏమీ లేదు అని నటి అనుష్క స్పష్టం చేశారు. ఈ బాహుబలి జంట గురించి చాలా కాలంగా రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అనుష్క చాలాసార్లు స్పందించినా, తాజాగా మరోసారి వివరణ ఇచ్చారు. అనుష్క నటిస్తున్న తాజా చిత్రం భాగమతి. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్, ఆషాశరత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇలా ఉండగా భాగమతి చిత్ర పరిచయ కార్యక్రమం బుధవారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా అనుష్క విలేకరులతో ముచ్చటించారు. భాగమతి సస్పెన్స్, థ్రిల్లర్ సన్నివేశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రం అని తెలిపారు. ఇందులో తాను సంజన అనే ఐఏఎస్ అధికారిణిగా నటించానని చెప్పారు. తన పెళ్లి గురించి వదంతులు ప్రచారం చేస్తున్నారని సరైన వ్యక్తి తారసపడినప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. నటుడు ప్రభాస్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇంకా స్టార్ హీరోల రాజకీయ రంగప్రవేశం గురించి తనను ప్రశ్నలు అడుగుతున్నారని, అది వారి వ్యక్తిగత నిర్ణయం అని, దీనిపై తాను మాట్లాడనని అన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా నటన పైనేనని అనుష్క పేర్కొన్నారు. -
గుడ్ లక్ స్వీటీ..!
బాహుబలి-2 తర్వాత అనుష్క ‘భాగమతి’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్ సోమవారం విడుదల అయింది. ఈ ట్రైలర్‌ను యంగ్ హీరో ప్రభాస్ తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. అంతేకాక అనుష్క నటనను పొగడ్తలతో ముంచెత్తారు. అనుష్క చాలా కష్టపడుతుంది.. డెడికేషన్ ఎక్కువ అని హీరో ప్రభాస్ అన్నారు. ప్రభాస్ తన ఫేస్బుక్లో ‘ట్రూ హార్డ్‌వర్క్, డెడికేషన్.. గుడ్ లక్ స్వీటీ, అశోక్, యూవీ క్రియేషన్స్ టీంకి కూడా గుడ్‌లక్’ అని పోస్టు చేశాడు. గతంలో భాగమతి టీజర్ విడుదలైనప్పుడు కూడా ప్రభాస్ అనుష్కపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమాకు పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహించారు. కాగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన భాగమతి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా.. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్‌రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించారు. -
' భాగమతి' మూవీ స్టిల్స్
-
లెక్కలు తేలాలి.. ఒక్కడినీ పోనివ్వను..
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న మరో ఆసక్తికర చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. షూటింగ్ పనుల్ని పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోఉంది. ‘బాహుబలి’ తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న భాగమతి ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. ట్రైలర్ ప్రకారం ఓ ప్రభుత్వాధికారిగా అనుష్క కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఓ ప్రాజెక్టు కోసం అనుష్క చేసిన కృషి.. దాని తర్వాత ఎదురైన సమస్యలను ఇందులో చూపించారు. 'ఎవడు పడితే వాడు రావడానికి.. ఎపుడు పడితే అపుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడినీ పోనివ్వను..' అంటూ అనుష్క చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఆసక్తి రేకెత్తించే ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
’భాగమతి’ ట్రైలర్ విడుదల
-
‘భాగమతి’ త్వరలో మిమ్మల్ని చూడబోతుంది!
స్వీటీ అనుష్క తాజా సినిమా ‘భాగమతి’.. న్యూఇయర్ సందర్భంగా ఈ సినిమా లుక్‌ను తాజాగా ట్విట్టర్లో విడుదల చేశారు. త్వరలోనే ’భాగమతి’ మిమ్మల్ని చూడబోతున్నాదంటూ విడుదల చేసిన ఈ లుక్కు విశేషంగా ఆకట్టుకుంటోంది. ’బాహుబలి’లో దేవసేనగా అలరించిన అనుష్క ఈ సినిమాలో కూడా గంభీరమైన పాత్రతో ప్రేక్షకులు ముందుకురాబోతున్నట్టు తెలుస్తోంది. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం చిత్రయూనిట్ విడుదల చేసిన ‘భాగమతి’ టీజర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. #Bhaagamathie wishes you a Happy New Year 2018. She Will See You Soon!#NYWithBhaagamathie pic.twitter.com/6wKAicMA7G — UV Creations (@UV_Creations) 1 January 2018 -
అనుష్క గురించి ప్రభాస్..!
స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో భాగమతి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ బుధవారం రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ విజువల్స్ తో రూపొందించిన భాగమతి టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పలు సినీ ప్రముఖులు అనుష్క పాత్రల ఎంపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ టీజర్ పై స్పందించిన హీరో ప్రభాస్, అనుష్కను ఆకాశానికెత్తేశాడు. ‘ప్రతీ సినిమాలోనూ కొత్తదనం చూపించేందుకు ప్రయత్నించే వారిలో అనుష్క ముందుంటుంది. స్వీటీతో పాటు యువి క్రియేషన్స్ యూనిట్ కు శుభాకాంక్షలు’ అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో భాగమతి టీజర్ తో పాటు కామెంట్ చేశాడు బాహుబలి ప్రభాస్. -
అనుష్క ‘భాగమతి’ టీజర్
బాహుబలి సీరీస్ లో దేవసేనగా అలరించిన స్వీటీ అనుష్క, త్వరలో భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ భాగమతి లుక్ లో ఎలా కనిపించనుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. స్వీటీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ భాగమతి టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ పాత కాలం బంగ్లాలోకి అనుష్క ప్రవేశించటం తరువాత తన చేతికి తానే సుత్తితో మేకు కొట్టుకోవటం లాంటి షాట్స్ తో టీజర్ ను కట్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫి మది విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనుష్క ‘భాగమతి’ టీజర్ విడుదల -
అనుష్క ‘భాగమతి’ టీజర్ విడుదల