ఎప్పటికీ నా మనసులో ఉంటావ్‌ : అనుష్క | Anushka Shetty Emotional Post About Her Assistant | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ నా మనసులో ఉంటావ్‌ : అనుష్క

May 18 2019 2:21 PM | Updated on May 18 2019 2:21 PM

Anushka Shetty Emotional Post About Her Assistant - Sakshi

తన దగ్గర సహాయకుడిగా పనిచేసిన రవి వర్ధంతి సందర్భంగా హీరోయిన్ అనుష్క భావోద్వేగానికి గురయ్యారు. ‘మనం ఎవరినైతే అమితంగా ప్రేమిస్తామో.. వారు మనల్ని ఎప్పటికీ విడిచిపోరు. కొన్నింటిని మరణం కూడా దూరం చేయలేదు. ఏడేళ్లు గడుస్తున్న రవి ఇప్పటికీ నువ్వు మాతో ఉన్నట్టుగానే ఉంది. మరణం తరువాత ఏమవుతుందో తెలియదు. కానీ నువ్వు ఎప్పటికీ నా మనసులో ఉంటావు’ అంటూ రవితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేశారు అనుష్క.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అనుష్క కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. భాగమతి సినిమా తరువాత నటనకు గ్యాప్‌ ఇచ్చిన స్వీటీ త్వరలో సైలెన్స్‌ అనే బహుభాషా చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు సైరాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు కూడా అనుష్క ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement