‘సైలెన్స్‌’.. ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తోంది! | Anushka Shetty Tweet About Silence Movie | Sakshi
Sakshi News home page

‘సైలెన్స్‌’.. ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తోంది!

Published Wed, Jul 3 2019 3:56 PM | Last Updated on Wed, Jul 3 2019 3:56 PM

Anushka Shetty Tweet About Silence Movie - Sakshi

స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ సైలెన్స్‌. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వస్తాడు నా రాజు ఫేం హేమంత్ మధుకర్‌ దర్శకుడు.  భాగమతి తరువాత అనుష్క చేస్తున్న ఈ సినిమా కావటంతో సైలెన్స్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి.  ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయ్యింది. త్వరలో ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని అనుష్క సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. రెడ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న స్టేజ్‌ మీద తను అస్పష్టంగా కనిపిస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన అనుష్క, ‘త్వరలోనే స్పాట్‌లైట్‌ (వెలుగులోకి వస్తాను)’అంటూ ట్వీట్ చేశారు. ఈ కామెంట్‌కు సైలెన్స్‌ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. దీంతో ఇది సైలెన్స్‌ ఫస్ట్‌ లుక్‌కు సంబంధించిన హింటే అని అభిమానులు సంబర పడిపోతున్నారు.

థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరో కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు  మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ కనిపించనున్నారు. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. తెలుగులో నిశబ్ధం పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తమిళ, హిందీ, ఇంగ్లీష్ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Into the spotlight soon 🙌 #SILENCE 😍

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement