silence
-
అందుకే మన్మోహన్ సైలెంట్‌గా ఉండేవారట!
విషయం వీక్‌గా ఉన్నప్పుడే.. పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనేది ఓ నానుడి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో అది పూర్తి వ్యతిరేకంగా. స్టేట్స్ మన్‌గా సెన్సేషన్సలిజానికి వీలైనంత దూరంగా ఉండేవారాయన. ఆయన వస్తున్నారంటే.. మీడియా కూడా పెద్దగా హడావిడి చేసేది కాదు. దీనిని అలుసుగా తీసుకునే ప్రతిపక్షాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరోలా ప్రొజెక్ట్ చేశాయి. ఆయన్ని రకరకాలుగా నిందించాయి. అయితే ఆయన మౌనం వెనుక కారణాలు లేకపోలేదు.. ‘‘మన్మోహన్ అనే వ్యక్తి ఓ సైలెంట్ పీఎం.. దేశానికి డమ్మీ పీఎం. ఆయనకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడమంటే భయం. మన్మోహన్ సింగ్ కాదు.. ఆయన మౌనమోహన్ సింగ్. అధిష్టానం చేతిలో ఆయనొక కీలు బొమ్మ. జన్‌పథ్ నుంచే దేశ పాలన అంతా సాగుతోంది’’.. యూపీఏ రెండు టర్మ్‌ల పాలనలో ప్రతిపక్షాలు తరచూ ఈ విమర్శలు చేసేవి. కానీ.. ప్రధానిగా ఆయన ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చారు. వాటిని నిశితంగా విశ్లేషిస్తే.. ఆయన ప్రెస్మీట్లో అనవసర అంశాలు కనిపించవు. దేశ, అంతర్జాతీయ, ఆర్థిక సంబంధిత అంశాలపై అలవోకగా మాట్లాడేవారు. అలాగే పాలనాపరమైన నిర్ణయాలను ప్రకటించేవారు. మైకుల ముందు మన్మోహన్ సింగ్(Manmohan Singh) ముక్కుసూటిగా మాట్లాడేవారు. విషయం ఏది ఉన్నా.. నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పేవారు. రాజకీయ విమర్శలు చేయడం అత్యంత అరుదుగా ఉండేది. అయితే.. నెమ్మదిగా మాట్లాడడం ఆయనకంటూ ఓ మైనస్ అయ్యింది.ఇక.. డిజిటల్ మీడియా ఆయన హయాంగా ఉన్న టైంలోనే అభివృద్ధి చెందింది. కానీ, సమకాలీన రాజకీయ నేతల్లో సోషల్ మీడియాను పరిమితంగా ఉపయోగించారాయన. సంప్రదాయ మీడియా మీదే ఆయన దృష్టంతా ఉండేది. మన్మోహన్ తన పుస్తకం ‘‘ఛేజింగ్ ఇండియా’’లోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా తన నాయకత్వ లక్షణాలను సమర్థించుకున్నారు కూడా.‘‘ఆ టైంలో మీడియా ఫోకస్ అంతా వేరేలా ఉండేది. ఆయన ప్రెస్ మీట్ అంటే పెద్ద హడావిడి ఉండేది కాదు. ఆయన సూచన మేరకే అలా జరిగేది!. తనను ప్రధానిగా కూడా ప్రమోట్ చేసుకోవడానికి అంతగా ఆయన ఆసక్తి చూపించేవారు కాదు. అందుకు రాజకీయ పరమైన కారణాలూ ఉండొచ్చు. ఇప్పుడున్నట్లు సోషల్ మీడియా ఉండి ఉంటే.. ఆయన ఎంతటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తో.. హుషారైన వ్యక్తో ప్రతీ ఒక్కరికీ తెలిసి ఉండేది’’ అని ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఆయన నిష్క్రమణ తర్వాత మరికొందరు జర్నలిస్టులు ఆయనతో ఇంటెరాక్షన్ సమయంలో అనుభవాల్ని పంచుకోవడమూ చూస్తున్నాం.పదేళ్లపాటు.. 2004-2014 మధ్య యూపీఏ తరఫున ప్రధానిగా ఆయన 117సార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. మీడియా సమావేశాలు, విదేశీ పర్యటనల్లో విలేకరులతో ఇంటెరాక్షన్, దేశీయ పర్యటనలు, వార్షిక సమావేశాలు, రాజకీయ.. ఎన్నికల ప్రచారాలు మొత్తం కలిపి ఉన్నాయి. ప్రత్యేకించి విదేశీ పర్యటనలో.. తిరుగు ప్రయాణాల్లో.. ఆయన విమానాల్లోనే జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే అవి విమర్శలకు సైతం తావిచ్చాయి కూడా. అలాగే మీడియా ముందుకు వచ్చేందుకు ఏనాడూ ఆయన తటపటాయించేవారు కాదు.. అది ఎంత పెద్ద అంశమైనా అనర్గళంగా మాట్లాడేవారు. మీడియా ముఖంగా ఆయన కఠినంగా మాట్లాడింది లేదు. అయితే ఈ మృదు స్వభావమే ఆయన్ని మీడియాలో పెద్దగా హైలెట్ చేయలేకపోవడానికి ప్రధాన కారణమైంది. అదే సమయంలో.. డిగ్నిఫైడ్ లీడర్‌గా ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టింది.మన్మోహన్.. పుట్టిపెరిగిన పరిస్థితులు కూడా ఆయన రిజర్వ్డ్ నేచర్‌కు మరో కారణం. బ్రిటిష్ ఇండియాలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన మన్మోహన్.. విభజన తర్వాత భారత్‌కు వలస వచ్చారు. అయితే బాల్యంలో ఆయన అల్లరి మాములుగా ఉండేది కాదట. ఈ విషయాన్ని ఆయన బాల్య స్నేహితుడు రాజా ముహ్మద్ చాలా ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మన్మోహన్ తండ్రి డ్రైఫ్రూట్స్ వ్యాపారి. దీంతో ఆయన తన జేబులో ఏవో ఒకటి తీసుకుని వచ్చేవారట. వాటి కోసం జరిగిన అల్లరి అంతా ఇంతా కాదని చెప్పారాయన.మన్మోహన్ ప్రధాని అయ్యాక.. తన బాల్య స్నేహితుడిని చూసేందుకు నేరుగా ఆయన నివాసానికే వెళ్లారు రాజా ముహ్మద్. ఇక తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ దగ్గరే పెరిగారాయన. ఆ టైంలోనే ఆయనలోని అల్లరి మరుగున పడింది. ఆమె సంరక్షణలో ఆయన ఎంతో క్రమశిక్షణ అలవర్చుకున్నారు. కరెంట్ లేని ఓ గ్రామంలో కిరోసిన్ దీపపు వెలుగులోనే చదువుకునేవారు. స్నేహితులతో కలిసి ఆయన బయటకు వెళ్లడం.. ఆడడం అరుదుగా ఉండేవి. ఉన్నత విద్య సమయంలో.. ఆర్వాత ఉన్నత పదవులు అధిరోహించిన టైంలోనే ఆయన ఒద్దికగా ఉన్నారు. ప్రధానిగా దిగిపోయాక.. రాజకీయాలకు ఆ కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది!. పైగా చిన్నప్పటి నుంచి ఆయన ఓ విషయాన్ని అలవర్చుకున్నారు. ఎక్కువ వినడం.. ఎక్కువగా అర్థం చేసుకోవడం.. తక్కువగా మాట్లాడం.. వెరసి మౌనమునిగా బతకడం. ఇదే ఆయన తుదిశ్వాస విడిచేవరకు పాటిస్తూ వచ్చారు. మేధావులు మౌనం వహించినప్పుడు.. మూర్ఖుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం::నెల్సన్ మండేలాఒక మూర్ఖుడి ఆవేశం కన్నా ఒక మేధావి మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదకరం:::నేతాజీ సుభాష్ చంద్రబోస్ -
మౌనం ఒక వరం...!
మౌనంగా ఉండటం చాలా మందికి తెలీదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కొందరు పూజలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది మత గ్రంథాలు చదువుతూ ఒక పక్క మాట్లాడుతూ మరోప్రక్క అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఏదో ఉదయమే చదివితే చాలు అనే ధ్యాసలో ఉంటారు. మరి కొంతమంది ఎటువంటి పూజలు కాని మత గ్రంథాలు చదవటం కాని చేయరు. అనునిత్యం పైకి అనకుండా మనసులోనే తమ దైవాన్ని స్మరించుకుంటారు. వారు ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. చిరునవ్వుతోనే సమాధానం ఇస్తూ ఉంటారు. ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ముఖ్యంగా ఎవరు ఏమైనా అంటే దానికి సమాధానం ఇవ్వకుండా ఉంటే మేలు. లేకపోతే మాటకు మాట పెరిగి వాగ్వివాదం పెరిగి చూసేవారికి అసహనం కలుగుతుంది. సమాధానం ఇవ్వకుండా ఉంటే మౌనంగా ఉండొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. వృద్ధాప్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. కొందరికి అన్ని కావాలి. ఎవరు, ఏమిటీ అని ఆరా తీస్తారు. అది వారి పెద్దరికానికి తగదు. పూజలు చేస్తేనే పుణ్యం అనే భ్రమలోనుంచి వారు బయటకు రావాలి. చేత కానప్పుడు మదిలోనే భగవంతుని స్మరించవచ్చు. అంతేకాని వితండవాదం చేయకూడదు. మన మాట పిల్లలు విననప్పుడు మనం మారు మాటాడకూడదు. వారు ఏదయినా అడిగితేనే మనం సలహా ఇవ్వాలి. అయినా ఈ రోజులలో పెద్దల మాట ఎవరూ పట్టించుకోరు. మనం సాధ్యమైనంత వరకు మనసులోనే మౌనంగా మన ఇష్టదైవాన్ని తలచుకుంటే అదే పదివేలు. మౌనమే మనం అలవర్చుకోవాలి. మౌనాన్ని మించిన విద్య లేదు. మౌనం అన్నిటికి పరిష్కారం.– కనుమ ఎల్లారెడ్డి, విశ్రాంత పౌరశాస్త్ర అధ్యాపకులు (చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం) -
Savitha Rao: నిశ్శబ్దానికి రక్షకులు కావాలి
ముంబైలో 46 లక్షల వాహనాలున్నాయి. వాటిలో 70 శాతం రోజుకు కనీసం ఏడుసార్లు హారన్ మోగిస్తే ఎంత శబ్దకాలుష్యమో ఆలోచించారా అని ప్రశ్నిస్తుంది సవితారావు. ముంబైకి చెందిన ఈ సామాజిక కార్యకర్త ‘నిశ్శబ్దం తరఫునపోట్లాడేవాళ్లు కావాలి’ అని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ అనే పుస్తకం రాసి శ్రుతి మించిన ధ్వని వల్ల వచ్చే శారీరక, మానసిక అనారోగ్యాలను తెలియచేసింది. ‘చప్పుళ్ల చెత్తను పారపోద్దాం రండి’ అంటున్న ఆమె పరిచయం.మన హైదరాబాద్‌లో ట్రాఫిక్‌పోలీసు వారు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే అవి గుర్తించి చలాన్లు పంపుతాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రమంతటా 255 ‘నాయిస్ డిటెక్టర్లు’ బిగించారు. ఒక వాహనం అవసరానికి మించి హారన్ మోగించినా, నియమిత డెసిబెల్స్ మించి చప్పుడు చేసినా వెంటే ఈ నాయిస్ డిటెక్టర్ గుర్తించి వారికి జరిమానా విధిస్తుంది. ఇది 1000 రూపాయల వరకూ ఉంటుంది. ‘మెట్రో నగరాల్లో అర్థం పర్థం లేని హారన్ మోతలను నివారించాలంటే ఇలాంటి చర్యలు అవసరం. ముంబైలో ముఖ్యంగా అవసరం’ అంటోంది సవితా రావు.నో హారన్ ప్లీజ్రోడ్డు మీద వెళుతుంటే గతంలో చాలా వాహనాల వెనుక ‘ప్లీజ్ సౌండ్ హారన్’ అని ఉండేది. ఇప్పుడు సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు ‘నో హారన్ ప్లీజ్’ అంటున్నారు. ముంబైకి చెందిన సవితా రావు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ పేరుతో ఈ అంశంపై చైతన్యం కోసం పుస్తకమే రాశారు. ‘ఇండియా పాజిటివ్ సిటిజెన్ ఇనిషియేటివ్’ పేరుతో సంస్థ ్రపారంభించిన సవితా రావు ΄పౌరులుగా ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయవలసిన బాధ్యత ఉందని, అందుకే ‘వన్ యాక్షన్, వన్స్ ఏ వీక్, ఎవ్రీ వీక్’ అనే భావన వారిలో కలిగించాలని పని చేస్తోంది. అంటే రోజూ దేశం, సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేయక΄ోయినా కనీసం వారంలో ఒకసారి చేస్తూ, ప్రతి వారం చేయగలిగితే చాలా మార్పు సాధించవచ్చని ఆమె అంటారు. ఉదాహరణకు రాంగ్ సైడ్ వాహనం నడపక΄ోవడం, ట్రాఫిక్ నియమాలను పూర్తిగా పాటించడం కూడా సమాజానికి పెద్ద మేలు అంటారామె. అయితే ఆ చిన్నపాటి దుర్గుణాన్ని కూడా సరి చేసుకోరు చాలామంది అని వా΄ోతారు.నిశ్శబ్దం మన హక్కు‘ఇవాళ నిశ్శబ్దం కలిగిన వాతావరణం అరుదైపోయింది. పెళ్లిళ్లకు వెళ్లినా, పార్కుకు వెళ్లినా, రెస్టరెంట్‌కు వెళ్లినా, జిమ్‌కు వెళ్లినా పెద్ద శబ్దంతో ఏవో ఒక పాటలు, సంగీతం చెవిన పడుతుంటాయి. ఆఖరకు ఆస్పత్రులకు వెళ్లినా ఔట్ పేషంట్ల విభాగం దగ్గర అందరూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ చాలా చప్పుడు చేస్తుంటారు. నిశ్శబ్దం పాటించడం ఒక సంస్కారం అని మరిచి΄ోయాం. ఇక పండగలు వస్తే మైకుల ద్వారా జరుగుతున్న గోల చాలా తీవ్రమైనది. వీధి చివర కనపడే చెత్త మాత్రమే కొందరికి కనిపిస్తుంది. కాని ఇది కనపడని చెత్త. కనపడని కాలుష్యం. ఇది ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది’ అంటారు సవితా రావు.అనారోగ్య మెట్రోలు‘దేశ ఆర్థిక పురోగతికి 2030 నాటికి పట్టణ, నగరాలే ఆయువుపట్టు అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాని ఈ మెట్రో నగరాల్లో ఉన్న పౌరుల ఆరోగ్యం సరిగ్గా లేక΄ోతే అవి ఎలా పురోగమిస్తాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వారిని కాటేస్తోంది. హారన్ వాడకం చాలా తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే మన దేశ పట్టణాల్లో, నగరాల్లో డయాబెటిస్, బి.పి.లతో అత్యధిక జనం బాధపడుతున్నారు. శబ్ద కాలుష్యం వల్ల గుండె, చెవి, మెదడు ఆరోగ్యం దెబ్బ తింటుంది. అనవసర ఆందోళన మొదలవుతుంది’ అంటారు సవితా రావు.చప్పుళ్లు సృష్టించే అభివృద్ధి‘ప్రభుత్వాలు విమానాశ్రయాలను వృద్ధి చేస్తున్నాయి. విమానయాన సంస్థలు వందల కొత్త విమానాలకు అర్డర్లు ఇస్తున్నాయి. రైలు మార్గాల విస్తరణ, ఇక లక్షలాది టూ వీలర్లు ఇవన్నీ ఏ స్థాయిలో శబ్ద కాలుష్యం సృష్టిస్తాయో ఆలోచిస్తున్నామా? శబ్ద కాలుష్యం వల్ల మరణాలు సంభవించక΄ోయినా ఆయుష్షు క్షీణిస్తోందని డబ్లు్య.హెచ్.ఓ చెబుతోంది. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ముందు బండిని దాటేయాలన్న దుశ్చర్యతో అదేపనిగా హారన్ కొట్టి శబ్ద కాలుష్యం సృష్టించేవారిపై జరిమానా విధించాలా వద్దా?’ అని ప్రశ్నిస్తారు సవితా రావు.ఆమె రాసిన పుస్తకం ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ శబ్ద కాలుష్య దుష్ప్రభావాలు తెలపడమే కాదు ప్రభుత్వం, స్థానిక సంస్థలు,పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, ΄పౌరులు కలిసి దీని నుంచి సమష్టి ప్రయత్నంతో ఎలా బయటపడాలో కూడా తెలియచేస్తోంది. -
నిజ్జర్‌కు నివాళా?.. కెనడాకు భారత్ ‘కనిష్క’ కౌంటర్
ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ (హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించటంపై భారత్ స్పందించింది. ఈ మేరకు వాంకోవర్‌లోని భారత్ కాన్సలేట్ జనరల్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఉగ్రవాద ముప్పును ఎదుర్కొవటంలో భారత్ ముందజంలో ఉంది. అదీకాక, ఉగ్రవాద ముప్పు పరిష్కారానికి ప్రపంచ దేశాలతో కలసి పనిచేస్తాం. 1985లో ఎయిరిండియా విమానం 182 (కనిష్క)పై ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన బాంబు దాడి ఘటనకు జూన్ 23తో 39 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ దాడిలో 86 మంది చిన్నారులతో సహా 329 మంది ప్రాణాలు కోల్పోయారు. .. ఖలిస్తానీ ఉగ్రవాదులు కనిష్క ఎయిరిండియా విమానంపై చేసిన బాంబ్ దాడిలో మృతి చెందినవారికి స్మారకంగా నివాళులు అర్పిస్తాం. జూన్ 23న స్టాన్లీ పార్క్‌లోని సెపర్లీ ప్లేగ్రౌండ్‌లో జరిగే ఈ స్మారక కార్యకమంలో భారతీయులు పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలి’ అని భారత్ కాన్సలేట్ జనరల్ పేర్కొంది.India stands at the forefront of countering the menace of terrorism and works closely with all nations to tackle this global threat. (1/3)— India in Vancouver (@cgivancouver) June 18, 2024 ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ నివాళులు అర్పించింది. ఈ మేరకు మంగళవారం కెనడా పార్లమెంట్( హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించింది.ఖలిస్తానీ టైగర్ ఫోర్స్( కేటీఎఫ్) చీఫ్ హర్దిప్ సింగ్ నిజ్జర్ గతేడి జూన్ 18 కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు జరిగిన కాల్పుల్లో మృతి చెందారు. భారత్ విడుదల చేసిన 40 మంది తీవ్రవాదుల జాబితాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉండటం గమనార్హం. నిజ్జర్‌ను హత్య చేసిన వారిలో నలుగురు భరతీయులు.. కరణ్ బ్రార్, అమన్‌దీప్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్ నిందితులుగా ఉన్నారు.తీవ్రవాది హర్దిప్ హత్యతో భారత్ హస్తం ఉందిన కెనడా ఆరోపలు చేసింది. ఈ ఆరోపణను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక.. అప్పటి నుంచి ఇరు దేశాల దౌత్య పరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి.ఇక.. ఇటీవల ఇటలీలో జరిగిన జీ-7 సమ్మిట్‌లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రత విషయాల్లో భారత్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉందని ట్రూడో తెలిపారు.ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్.. భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్‌కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరింది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే హత్య చేయబడ్డారు. -
Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
సిమ్లా: చైనా భారత భూబాగాన్ని ఆక్రమించి ఇళ్లు, రోడ్డు నిర్మిస్తోందని, అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నా రు. హిమాచల్‌ప్రదేశ్‌లోని రొహ్రులో శనివారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘56 అంగుళాల ఛాతి ఎటుపోయింద’ని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందన్నా రు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే దాని ద్వారా అందిన ప్రజాస్వామ్యం, హక్కులను లాగేసుకుంటారని అన్నారు. మోదీ ప్రభుత్వం ధనవంతుల కొమ్ముకాస్తుందని, కాంగ్రెస్ పేదల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు. -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న 'మిస్టరీ థ్రిల్లర్' సినిమా
మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించిన 'సైలెన్స్' (Silence... Can You Hear It?) అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమా 2021లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అది కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్నడం విశేషం. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి సైలెన్స్ చిత్రం మెప్పించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'సైలెన్స్ 2 ది నైట్ ఔల్ బార్ షూటౌట్' మీ ముందకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అబన్ బరూచా దేవ్‌హన్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయీ, ప్రాచీ దేశాయ్ కలిసి నటించారు. ఏప్రిల్ 16 నుంచి సైలెన్స్ 2 సినిమా జీ5లో డైరెక్ట్‌గా విడుదల కానుంది. ప్రస్తతం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నగరంలో జరుగుతున్న వరుస హత్యల వెనకున్న హంతకులను పట్టుకునే మిస్టరీని ఏసీపీ అవినాష్ వర్మగా నటించిన మనోజ్ ఏ విధంగా చేదించాడనేది కథకు ప్రధాన మూలం. కథలో ఎన్నో ట్విస్ట్‌లతో పాటు థ్రిల్లింగ్‌ను పంచే సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 16న విడుదల కానున్న సైలెన్స్ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందన జీ5 ప్రకటించింది. -
సంక్షోభం వస్తే ఆయన సైలెంట్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఇందుకు వేదికైంది. ‘ కూతురు లాంటి మణిపూర్ తీవ్ర విద్వేషాగ్నిలో చిక్కుకున్నపుడు తండ్రి స్థానంలో ఉన్న ప్రధాని మోదీ.. ఆమెన కాపాడాల్సిదిపోయి, పట్టించుకోకుండా మరో వైపు తిరిగి నిల్చున్నారు. మోదీ మౌనంగా ఎందుకున్నారని దేశం యావత్తు ప్రశ్నిస్తోంది. ఆయన ఇలా మౌనముద్రలో ఉండటం ఇదే తొలిసారి కాదు. గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో దేశంలో ఎక్కడ సంక్షోభం ఎదురుపడ్డా ఆయన ఇలాగే సైలెంట్ అయిపోయారు’ అని కేజ్రీవాల్ విమర్శించారు. ‘ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిల్చిన మహిళా మల్లయోధులు బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ యాదవ్‌పై లైంగిక ఆరోపణలు చేసినపుడూ మోదీ మౌనవ్రతం చేశారు. ఇదే మహిళా రెజ్లర్లు పతకాలు గెల్చినపుడు వారితో ఫొటోలు దిగేందుకు మొదట ముందుకొచ్చింది మోదీనే. ‘మీరు నా బిడ్డలు’ అని భరోసా ఇచ్చారు. కానీ తీరా వాళ్లు ధర్నాలు చేస్తుంటే మోదీ మౌనముద్రలోకి జారుకున్నారు. కనీసం ప్రధాని హోదాలో ‘నేనున్నాను. ఎంక్వైరీ చేయించి సంబంధిత వ్యక్తుల్ని శిక్షిస్తానని హామీ ఇవ్వలేకపోయారు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కోసం మహిళలు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక మణిపూర్ అంశంలోనూ ఇంతే ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ యూజర్లకు మరో తీపికబురు అందించారు.మార్క్ జుకర్‌బర్గ్ . ఇటీవలి కాలంలో పలు అప్డేట్స్, కొత్త ఫీచర్లతో వాట్సాప్ యూజర్లను ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా వాట్సాప్‌లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే కొత్త గోప్యతా ఫీచర్‌ను ప్రకటించింది. ఇటీవలి తెలియని నంబర్ల నుండి వచ్చిన కాల్స్‌పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేటుగాళ్లకు చెక్ చెప్పేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?) మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటన ప్రకారం వినియోగదారులకు ఇన్కమింగ్ కాల్లపై ఎక్కువ నియంత్రణ ఇవ్వడం, స్పామ్, స్కామ్స్ బారిన పడకుండా సెక్యూరిటీ అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం . సైలెన్స్ అన్నోన్ కాలర్స్‌తో, వాట్సాప్ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తులనుంచి అవాంఛిత కాల్‌లను ఆటోమేటిక్‌గా స్క్రీన్ అవుట్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. దీంతో మోసాలు బాగా తగ్గుతాయని వెల్లడించింది. (50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం) WhatsApp announced silence unknown callers feature and privacy checkup! The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9Aa — WABetaInfo (@WABetaInfo) June 20, 2023 ఎలా పని చేస్తుంది సెటింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్నోన్ నంబర్లనుంచి వచ్చే కాల్స్ ఫోన్లో రింగ్ అవ్వవు. కానీ కాల్ లిస్ట్‌లో కనిపిస్తాయి. ఫలితంగా ఏదైనా ముఖ్యమైన కాల్స్ విషయంలో వినియోగ దారులు తర్వాత రివ్యూ చేసుకోవచ్చన్నమాట. దీనికి ముందు ప్రైవసీ చెకప్ అనే ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
భారత్ పార్లమెంట్లో మైకుల మూగనోము
లండన్: భారత పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్‌సభలో మైక్రోఫోన్లు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తరచుగా మూగబోతుంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ సోమవారం లండన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రిటిష్ ఎంపీలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. తాను నిర్వహించిన భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావించారు. ప్రజలను కూడగట్టడానికి ఇదొక రాజకీయ కార్యాచరణగా ఉపయోగపడిందని అన్నారు. భారత లోక్‌సభలో మైకులు పని చేస్తుంటాయి గానీ తరచుగా మొరాయిస్తుంటాయని వ్యా ఖ్యానించారు. మాట్లాడేటప్పుడు మధ్యలోనే ఆగిపోతుంటాయని, తనకు చాలాసార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. చైనా సైన్యంలో భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిందని, దానిపైనా ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదన్నారు. పార్లమెంట్లో గతంలో జరిగిన అర్థవంతమైన చర్చలు, సంవాదాలు ఇప్పుడు లేకుండాపోయాయని ఆక్షేపించారు. -
చలో ఢిల్లీకి తెలంగాణ జనసమితి పిలుపు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధినేత ప్రోఫెసర్ కోదండరాం రేపు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. తాము విభజన హామీలు, కృష్ణ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మౌన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. సుమారు 150 మందితో గంటపాటు మౌనదీక్ష చేపడతామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీ కోసమే తాను ఈ మౌన దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జనసమితి అధినేత కోదండరాం జనవరి 30న ఢిల్లీలో మౌన దీక్ష చేయనున్నారు. జనవరి 31వ తేదిన కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అభివృద్ధి వాస్తవాలు అనే అంశంపై కానిస్టిట్యూషన్ క్లబ్లో సెమినార్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. (చదవండి: మోదీ సర్కారే టార్గెట్.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న కేసీఆర్) -
భావోద్వేగ క్షణం: 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమ్మగొంతు విని....
ఒక్కక్షణం నిశబ్దం చాలా భరించలేని విధంగా ఉంటుంది. అలాగని గందరగోళంగా ఉన్నా భరించలేం. కానీ కొంతమంది పుట్టుకతో వినపడని వాళ్లు ఉంటారు. వాళ్లు ఆ నిశబ్దాన్నిఎలా భరించగలుగుతారో తెలియదు. ఆ నిశబ్దం కారణంగా వారు ఏమి గ్రహించలేక మాటలు కూడా నేర్చుకోవడం అసాధ్యంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక వ్యక్తి చిన్నప్పుడే ఒక ఆరోగ్య సమస్యతో వినికిడి శక్తిని కోల్పోయాడు. అలాంటి వ్యక్తి తొలిసారిగా తన తల్లి గొంతు వినగానే ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఎడ్వర్డో అనే వ్యక్తి మెనింజైటిస్ అనే వ్యాధి కారణంగా వినకిడి శక్తిని కోల్పోయాడు. దీంతో అతను దశాబ్దాలుగా నిశబ్దంలోనే గడిపాడు. ఎట్టకేలకు నిశబ్దాన్ని చీల్చుకుని ఒక చిన్న మైనర్ సర్జరీ తదనంతరం తొలిసారిగా తల్లి గొంతును విన్నాడు. 35 ఏళ్ల నిశబ్ద అనంతరం తొలిసారిగా తన అమ్మ గొంతు విని ఒక్కసారిగా భావోద్వేగంతో కళ్లు చెమ్మగిల్లాయి. ఈ మేరకు ఎడ్వర్డో తల్లి తన పక్కనే కూర్చిని పదేపదే తన కొడుకును పేరుతో పిలిస్తూ ఏడ్చేసింది. అక్కడే ఉన్న మిగతా బంధువులంతా ఆ అద్భుత క్షణాన్ని చూస్తూ భావోద్వేగం చెందారు. సదరు వ్యక్తి తన చెవులు వినిపిస్తున్నందుకు ఆనందంతో తన కూతురు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఎడ్వర్డో అమ్మ మీతో మాట్లాడుతోందని ఒకరు, ఇది హార్ట్ టచ్ చేసే ఘటన అని మరోకరు రకరకాలుగా కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: ట్రైయిన్‌లో టీ ఇలానా వేడి చేసేది! బాబోయ్...) -
Verbal Fast: ఈ ఉపవాసం ఎందుకంటే..
వెర్బల్ ఫాస్ట్.. #VerbalFast ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్. అసలు ఇదేం ఉపవాసం? అని.. దాని ఉద్దేశం ఏంటో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి.. ఇలాంటి ఉపవాసం గురించి గూగుల్‌లో కూడా ఎలాంటి హిస్టరీ లేదు. 45 ఏళ్ల అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్.. సంచలన నిర్ణయం ద్వారానే ఇది తెర మీదకు వచ్చింది. సోషల్ మీడియా వేదిక వర్బల్ ఫాస్ట్‌ను పాటించబోతున్నట్లు ప్రకటించాడు వెస్ట్. ఈ మేరకు ‘యే ’గా తన పేరును మార్చుకున్న ఆయన.. నెలరోజులపాటు ఈ ఉపవాసం ఆచరిస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. Verbal Fast అంటే.. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం. మౌన వ్రతం లాంటిదే!. అదీ నిర్దేశించుకున్న టైం వరకు!. నిమిషాల నుంచి రోజుల తరబడి ఈ ఉపవాసం కొనసాగించవచ్చు. అయితే.. కాన్యే వెస్ట్ మరో అడుగు ముందుకు వేసి ఈ నెల రోజులపాటు ఆల్కాహాల్‌కు దూరంగా ఉంటానని ప్రకటించాడు. అంతేకాదు.. అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండడంతో పాటు శృంగారంలోనూ పాల్గొనబోనని ప్రకటించాడు. దీంతో వెస్ట్ ఫ్యాన్స్.. ఈ ఫాస్ట్ ట్రెండ్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే.. ఎవరితో మాట్లాడకపోయినప్పటికీ.. సోషల్ మీడియాకు మాత్రం దూరంగా ఉండడని స్పష్టం చేశాడు. ప్రముఖ ఈ-సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ మాజీ భర్త అయిన కాన్యే వెస్ట్ అలియాస్ యే.. ఈ ఉపవాసం ఎందుకు చేపడతున్నాడన్న దానిపై స్పష్టత లేదు. కాకపోతే ఈ మధ్య విద్వేషపూరిత వ్యాఖ్యలతో ఆయన సోషల్ మీడియా అకౌంట్లు.. ఆంక్షలను ఎదుర్కొన్నాయి. యూదులకు వ్యతిరేకంగా కాన్యే వెస్ట్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆ దెబ్బకు.. కాన్యే వెస్ట్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. అయితే.. ఎలన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టాక తిరిగి.. వెస్ట్ అకౌంట్లు యాక్టివ్ అయ్యాయి. తిరిగి వచ్చిన వెస్ట్.. ఇలా వెర్బల్ ఫాస్ట్‌తో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక యూదులపై చేసిన వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పీచెప్పనట్లు చెప్పాడు వెస్ట్. మరోవైపు ఈ అమెరికన్ ర్యాపర్ వ్యాఖ్యలు ఆయన బ్రాండింగ్‌పై కూడా పెను ప్రభావం చూపెట్టింది. అక్టోబర్‌లో జర్మనీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ అడిడాస్.. ఆయనతో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. గ్యాప్, బాలెన్సియాగా సైతం ఆయనతో బ్రాండింగ్ ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. ఇదీ చదవండి: విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు -
మసీదులో ఏమైనా జరుగుతోందా? అమిత్ షా చర్యతో అంతా చప్పట్లు
బారాముల్లా(జమ్ము కశ్మీర్): కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన చేష్టలతో కశ్మీరీల జేజేలు అందుకున్నారు. బుధవారం సాయంత్రం ఉత్తర కశ్మీర్ బారాముల్లాలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అయితే.. కాసేపటికే ఆయనకు ఏదో శబ్దం వినిపించింది. మసీదులో ఏమైనా జరుగుతుందా? అని ఆయన పక్కనున్న నేతలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలోని మసీదు నుంచి అజాన్ అని వాళ్లు చెప్పగానే.. ఆయన తన ప్రసంగాన్ని ఆపేశారు. కాసేపటి తర్వాత అయిపోయిందా? అజాన్ అయిపోయింది ఇప్పుడు నేను ప్రసగించొచ్చా..? అంటూ అక్కడున్నవాళ్లను ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లు, ఈలలతో ఆయన్ని అభినందించారు. Halting the Speech Midway by Hnbl Home Minister due to #Azaan is Great Gesture and has Won the Hearts of Kashmiris, this Clearly Indicates the Respect for the Religion and Sentiments of Kashmiris. @AmitShah @AshokKoul59 #NayaKashmir pic.twitter.com/853g8IXXgq — Sheikh Iqbal (@ListenIqbal) October 5, 2022 అంతకు ముందు ర్యాలీలో ప్రసంగించే ముందు అమిత్ షా బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ను తొలగించారు. తాను ప్రజలతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను అంటూ ప్రసంగించడం గమనార్హం. ఇక ర్యాలీ తర్వాత వురికి వెళ్లిన ఆయన.. అక్కడ మే నెలల జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పోలీస్ అధికారి ముదాసిర్ షేక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన సమాధికి నివాళులర్పించారు. కేంద్రం నుంచి ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మాటిచ్చారాయన. VIDEO: Just before addressing the gathering in #Baramulla, J&K today, Home Minister @AmitShah ji had his bullet proof glass removed. pic.twitter.com/gSMM4uMtMi — Dr Jitendra Singh (@DrJitendraSingh) October 5, 2022 ఇదిలా ఉంటే.. హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన బుధవారంతో ముగిసింది. కశ్మీర్ భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులతోనూ సమావేశం అయ్యారు ఆయన. ఇక ఈ పర్యటనలోనే ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే పాక్‌తో ఎట్టిపరిస్థితుల్లో చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. -
నిశ్శబ్దం: ఓ అద్భుత ఆంతరంగిక వాణి
ప్రకృతి మనకు అందించే శ్రవణానందకర శబ్దాలను విని ఆనందించేటందుకు, మనలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేటందుకు, రసాస్వాదనకు ఒక ప్రశాంత స్థితి, ఒక నిర్మలత కావాలి. అది నిశ్శబ్ద వాతావరణంలోనే కుదురుతుంది. ఆ కోణంలో చూసినపుడు మన సృజనశక్తులు జాగృతమై చైతన్యవంతమయ్యే ఓ అద్భుత స్థితికి కావలసిన ఆవరణను కల్పించేదే నిశ్శబ్దమంటే. ఒక చేతిలోని పదునైన ఉలిని ఒక కఠినమైన రాయిపై ఉంచి, మరొక చేతిలోని సుత్తితో లాఘవంగా, ఒడుపుగా తన మనసులోని అద్భుత రూపానికి జీవకళ ఉట్టిపడేటట్టుగా ఆకుంఠిత దీక్షతో శిల్పి పనిచేస్తుంటాడు. కావలసిన రంగులుంచుకున్న పళ్ళేన్ని ఒక చేతిలో, కుంచెను మరొకచేతిలో పట్టుకున్న ఓ చిత్రకారుడు తన ఊహాచిత్రానికి ఓ చక్కని రూపునిచ్చే తపోదీక్షలో ఉంటాడు. కలాన్ని తన చేతి వేళ్ళ మధ్య ఉంచుకుని ఆలోచనా క్షీరసాగరాన్ని మధనం చేస్తూ భావ సంక్లిష్టత, అస్పష్టతలనే కెరటాల గరళాన్ని అధిగమిస్తూ సాహిత్యామృతాన్ని అందించే యత్నం చేస్తుంటాడు రచయిత. ఈ సృజన ఒక నిశ్శబ్ద వాతావరణంలోనే సాధ్యమవుతుంది. నిశ్శబ్దంలో మనలోని ఏకాగ్రత, స్థిరత్వం, నిశ్చలతలు బలోపేతమవుతాయి. అపుడు మనం దృష్టి్ట కేంద్రీకరించగలుగుతాం. ఆంగ్ల భాషలో నిశ్శబ్దానికి, మౌనానికి అర్ధభేదం లేదు. నిశ్శబ్దం అనే ఒకేరకమైన మాటను వాడతారు. కాని, తెలుగుభాషలో ఈ రెండిటికి ఎంతో తేడా ఉండటమే కాదు ఎంతో లోతైన, విస్తృతమైన అర్థంలో వాడతాం.. కొన్ని సందర్భాలలో, ప్రదేశాలలో మనం నిశ్శబ్దంగా ఉండాలి. పాఠాలను, ప్రసంగాలను, సంగీత కచేరిలో సంగీతాన్ని వింటున్న వేళల్లో, గ్రంథాలయం లాంటి ప్రదేశాలలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దం పాటించటంలో మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. తప్పనిసరైన నియమం. అయితే, మౌనం మనం పాటించేది. వ్యక్తిగతం. మన ఇష్టపూర్వకంగా స్వీకరించేది. ధ్యానం ఒక నిశ్శబ్ద పయనం. మన అంతరంగమనే సాగరంలోకి వెళుతూ దాని ఘోషను వినగలిగే ఓ అద్భుత అవకాశం. ఈ మౌనం మనం నియమించుకున్న నిశ్శబ్దం ఒక ప్రశాంతమైన వాతావరణం. మన నడవడికను నెమరు వేసుకునే సందర్భం. మంచి, చెడులను తెలుసుకునేందుకు మనకై మనం పెట్టుకున్న నిబంధన. నిరంతర సుదీర్ఘ ప్రయాణం. అది మనల్ని ఉన్నతంగా ఆలోచింపచేస్తుంది మానవ దౌర్బల్యాలను, బలహీనతలను దాటగలిగే మానసిక స్థైర్యాన్ని ఈ నిశ్శబ్ద వాతావరణం మనకు ప్రసాదిస్తుంది. మన సాహిత్యకారులు నిశ్శబ్దం తాండవిస్తోంది అని వర్ణిస్తుంటారు. శబ్దశూన్యతే నిశ్శబ్దం అయినప్పుడు నర్తిస్తున్నదనటంలో అర్థమేమిటి? అపార్థాలతో కాపురం చేసే భార్యాభర్తల మధ్య మాటలుండవు. కాని, ఇరువురి మనసుల్లో అభివ్యక్తం కాని అనంతమైన ఆలోచనలు, భావాలు వారి మనోసంద్రపు తీరాన్ని తాకి మళ్లీ వెనకకు పోతుంటాయి. పై చెప్పిన మాటకు అర్థమిదే. భావాలు, మనోభావాలు ఘనీభవించిన స్థితే ఇక్కడ నిశ్శబ్దమంటే. పరపాలనలో మగ్గే ప్రజ తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కూడ అధికారాన్ని, నియంత్రణను చూపుతూ, తమధన, మాన, ప్రాణాలను దోచుకునే పాలకుల దౌర్జన్యం, దోపిడీ కొంతవరకే ఓర్చుకోగలరు. వాటిని నిశ్శబ్దంగా భరిస్తుంటారు. వారి స్వాతంత్య్ర కాంక్ష అగ్నిపర్వతపు లావాలా పొగలు కక్కుతుంటుంది. ఈ నిశ్శబ్దం విస్ఫోటనమైన వేళ వచ్చే పర్యవసనం భయంకరంగా ఉంటుంది. అది బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఒక్కోసారి కొన్ని వందల మాటల్లో చెప్పలేనిది కూడ ఒక అర్థవంతమైన నిశ్శబ్దం సూచిస్తుంది. అది మన మనసుకు అద్దం పడుతుంది. నిశ్శబ్దం ఓ అద్భుతమైన శక్తి. మన అనేకమైన మిశ్రమ భావాలకు భాష్యం చెప్పగలదీ నిశ్శబ్దం. నిశ్శబ్దమిచ్చే ఏకాంతంలో, ఆలోచనలో సత్యశోధన చేయగలం. సత్యాన్ని దర్శించగలం. అందుకే నిశ్శబ్దం ఒ అద్భుత ఆంతరంగిక వాణి. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు. -
మహాస్వామి వారి మౌన బోధనం
జగద్గురు ఆదిశంకరులు కూడా మౌనంగానే శిష్యులకు బోధించేవారట. వారి చిన్ముద్రలోనే శిష్యులకు సమస్తసమూ బోధపడేవిట. సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల కారణంగా ఏర్పేడేదే సంసారం. వీటికి దూరంగా ఉండటమే చిన్ముద్ర సందేశం. ఈ సందేశాన్ని ఉత్తమ విద్యార్థులైన రుషులు అర్థం చేసుకున్నారట. అందుకే వారందరూ మూకుమ్మడిగా ఆయననే తమ ఉత్తమోత్తమ గురువుగా, ఉత్తరోత్తరా కూడా ఆయనే తమ గురువుగా ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కంచి పరమాచార్యను కూడా వారి భక్తులు, శిష్యులు ఇప్పటికీ తమ గురుపరంపరలో ఆద్యునిగా ఆరాధిస్తున్నారు. సేవిస్తున్నారు. సాంత్వన పొందుతున్నారు. ప్రాచీన ఆలయాల ప్రాకారాలపై చెక్కి ఉన్న దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే దక్షిణామూర్తి ఒక యువకుడు. చెట్టు మూలంలో కూర్చుని ఉంటాడు. శిష్యులందరూ వృద్ధులు. ఆయనేమో మౌనంగా చిన్ముద్రలో ఉంటాడు. ఆ మౌన వ్యాఖ్యతోనే శిష్యుల సందేహాలు పటాపంచలౌతాయట. చెట్టు ఒక ప్రసిద్ధమైన సంకేతం. ఎడతెరిపి లేని జనన మరణాలతో కూడిన సంసారమనే వక్షం. సంసారానికి మూలమైన పరమాత్మ అనేది శుద్ధ చైతన్యమని మన సిద్ధాంతం. ఈ చైతన్యంలో ప్రకటమయ్యే సృజనాత్మక శక్తినే ప్రకృతి లేదా మాయ అన్నారు. చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని అర్థం. ఈ చెట్టు మూలంలో ఉన్న దక్షిణామూర్తి ఎల్లప్పుడూ మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉంటాడు. ఆ మౌనముద్రలోనే అంత పెద్ద శిష్యుల సందేహాలన్నీ పటాపంచలు కావడానికి ప్రత్యక్ష ఉదాహరణమే శ్రీశ్రీశ్రీ కంచిçకామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి. ఆయన సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపులు. స్వామివారి సన్నిధికి వచ్చి ఆయనను దర్శించుకుని, తమకున్న కొండంత కష్టాల గురించి ఆయనతో మొరపెట్టుకుని ఆయన అనుగ్రహంతో వాటిని తొలగించుకుని తిరిగి సాధారణ జీవితాన్ని గడిపిన వారు కోకొల్లలు. స్వామివారు కాష్ఠమౌనంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు తమ సమస్యలను నివేదించుకునేవారు. ఆయన మౌనంగానే ఉండి తమకు అంతా తెలుసునన్నట్లు వారివంక చిరునవ్వుతో చూసేవారు. సాక్షాత్తూ దైవస్వరూపులైన స్వామి వారి కరుణాపూరిత దృక్కులు చాలదా వారి దుఃఖాలను బాపటానికి! మానవ సంబంధాలలో అత్యుత్తమ మైనది గురుశిష్య బాంధవ్యం. అర్థరహిత, స్వార్థరహితమైన బాంధవ్యం. ఆ గురుశిష్య సంబంధానికి అర్థబలంతో అంగబలంతో పనిలేదు. అహంకారంతో పనిలేదు. స్వార్ధరహితం. ఇలా రహిత పద్ధతిగా ఏర్పడేది ఒక్క గురుశిష్య బాంధవ్యం మాత్రమే. దానిలో ఏమీ మిగలదు. ఎందుకంటే అశరీర పద్ధతే లక్ష్యం కాబట్టి. సశరీర ధర్మాలుగానీ, సశరీర బాంధవ్యాలు గానీ లేకుండా చేసే పద్ధతిగా నిన్ను పరిణమింపచేయడమే దాని ఉద్దేశ్యం. వింతైన విషయం ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం ఉన్నప్పుడే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమౌతుంది. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక మార్గముంది. ప్రకటించటం అంటే తెలియచెప్పటం. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక పద్ధతుంది. మౌనవ్యాఖ్య. దానిని గురించి శాస్త్రాలలో, ఉపనిషత్తులలో ధర్మ పద్ధతిగా, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనే సాంప్రదాయ రీతులలో దానిని గురించి విశేషంగా మాట్లాడటాన్ని వ్యాఖ్య అన్నారు. గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి.. దక్షిణామూర్తిని గమనిస్తే ‘వటమూల నివాసిని’ వటవృక్షమంటే మర్రిచెట్టు. వటవృక్షం దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. అశ్వత్థ వృక్షం విష్ణు సమానం. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి. ‘‘వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం! సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్!!’’ ఇటువంటి జ్ఞానానికి అధికారి ఎలా ఉండాలట? జ్ఞానదాత అంటే సద్గురువే. అటువంటి సద్గురువు, నడిచేదైవంగా పేరు పొందిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామికి జేజేలు. ఆయన సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించిన వారికే కాదు, పరోక్షంగా ఆయన బోధల వల్ల ప్రేరణ పొందిన వారికి కూడా ఆయన జీవన్ముక్త స్థితి, భక్తవత్సలత గురించీ బాగా తెలుసు. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా, తమ అనుగ్రహంతో, ఆశీర్వాదపూర్వకంగా మార్చిన కర్మయోగి, జ్ఞానయోగి. గీతాబోధకు ప్రత్యక్ష నిదర్శనం. నడిచేదైవానికి సహస్రకోటి ప్రణామాలు. సూక్తి సుధ ► మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. ► ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు.మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది ’కష్టం’ గా మారుతుందంతే. ► దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. ఎదుటివారి మనసులో మనం ఉన్నపుడు దూరం, దగ్గర అనేవి సమస్యలు కానేకావు. ► మంచో చెడో ఒకడుగు ముందుకెయ్యడానికి ప్రయత్నించు. గెలుపైతే ముందుకెళ్ళు. ఓటమైతే ఆలోచన మార్పు చేయి. ► ఎవరైనా తమతో స్నేహం చేసేవారికి వారివద్దనున్న గుణాన్నే పంచగలరు. మంచివాడు మంచిని, చెడ్డవారు చెడును, కోపిష్టి కోపాన్ని, అజ్ఞానుడు అజ్ఞానాన్ని, తెలివి వంతుడు తన తెలివిని పంచగలడు. ఇందులో నీకు ఎలాంటి స్నేహం కావాలో ఎంచుకోవడం నీ బాధ్యత. నీ స్నేహాన్నిబట్టే సమాజం నిన్ను అంచనా వేస్తుంది. – ఎన్. రమేశన్, ఐ.ఎ.ఎస్. -
మంచి మాట: మౌనం మంచి భాషణం
మనిషిని అత్యంత శక్తిమంతునిగా చేసే ప్రక్రియలలో మౌనం ఒకటి. మాటలతో సాధించలేనిది, మౌనంతో సాధించవచ్చంటారు. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి చెబుతోంది. వాక్కుని నియంత్రించడం, మాట్లాడటం తగ్గించడమే మౌనం. ఇది ఓ అపూర్వమైన కళ. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దివ్య శక్తినిస్తుంది. బాహ్య, ఆంతర్గత సౌందర్యాలను పెంచి, మనోశక్తులను వికసింప చేస్తుంది. ఎదుటివారిలో పరివర్తనను తీసుకురావడమే కాకుండా, ఆధ్యాత్మికశక్తి ఉత్పన్నమై మనస్సుకి శాంతినిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. మౌనేన కలహం నాస్తి’ అన్నారు పెద్దలు. అంటే ‘మాట్లాడకుండా ఉండేవారికి గొడవలు రావు’ అని అర్థం. మాట వెండి అయితే, మౌనం బంగారం అని ఓ సామెత కూడా ఉంది. మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకోవడం కంటే మౌనంతో ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. మౌనం ఇన్ని మహత్తర శక్తులనివ్వడం వల్లనే యోగసిద్ధాంతంలో పతంజలి మహర్షి మౌనానికి ప్రాధాన్యాన్నిచ్చారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారెందరో మౌనాన్నే ఆభరణంగా చేసుకుని భాసించారు. మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు సెలవిచ్చారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అనేక సంవత్సరాలు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరని ఆయన స్పష్ట్టం చేశారు. ఇంట్లో పనులు చేస్తూ, టీవీలో కార్యక్రమాన్నిచూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ చేసేది మౌనం అనిపించుకోదు. ఆయా పనులు చేస్తున్నపుడు మన మనసు మన అధీనంలో ఉండదు. ఫలితంగా రకరకాల ఆలోచనలు మనల్ని వేధిస్తాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. ఇలా ఏదో పని చేస్తూ మౌనం పాటించడం వల్ల ఫలితం శూన్యం. మౌనమంటే అచ్చంగా మౌనంగా ఉండడం. కళ్ళుమూసుకుని మాటని, మనసుని ఓ పది నిమిషాల పాటు మౌనంలోకి జార్చడం. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనం రోజంతా రకరకాల మనుషులతో మాట్లాడతాం. ఈ క్రమంలో అనేక మాటలు, వాదనలు, కోపాలు, అరుపులతో గడిపేస్తాం. అక్కడితో అయిపోతుందా అంటే ఆగదు. అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటిని కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుని వదిలించుకోవచ్చు. అయితే ఇలా కనులు మూసుకున్నపుడు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా ఉంటాయి. అది ఎదుటి వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు‘ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకుని మసలుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. బుద్ధుని మాటల్లో చెప్పాలంటే, ‘మౌనం’ అంటే మంచి భాషణం. మంచి భావం. అంతేకాని మాట్లాడకపోవడం కాదు’. అందుకే మౌనం అనేది దైవభాషగా కొనియాడబడుతోంది. దీనిని లిపి లేని విశ్వభాషగా, ధార్మిక దివ్యత్వానికి ద్వారంగా చెబుతారు. మౌనమే దివ్యత్వ దర్శనానికి ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుందని జగద్గురు శంకరాచార్యుల వారు ప్రవచించారు. మానవుని ఆత్మశక్తిని పెంచే ఈ మౌనాన్ని మూడు రకాలుగా విభజించారు. వీటిలో మొదటిది వాగ్ మౌనం. వాక్కును నిరోధించడమే వాగ్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. దీని వల్ల పరుషమైన మాటలు, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు, అసందర్భ ప్రేలాపాలు హరించబడతాయి. రెండోది అక్షమౌనం. ఇది ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. మూడవది కాష్ఠమౌనం. ఇది మానసిక మౌనం. మౌన ధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా నియంత్రించినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచడం దీని ముఖ్యోద్దేశం. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
అవునా కాదో మీరే తేల్చండి! మౌనం వీడిన బాలీవుడ్ నటి
సాక్షి, ముంబై: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇటీవల కోర్టు తీర్పుపై బాలీవుడ్ ప్రముఖ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఎట్టకేలకు మౌనం వీడారు. కోర్టు తీర్పు, జరిమానాపై తొలిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పబ్లిసిటీ స్టంట్, కోర్టు సమయం వృధా అంటూ 5జీ టెక్నాలజీ అమలుపై తన పిటిషన్ తిరస్కరించడంపై ఆమె నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు దీనిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని తన పోరాటం ప్రచారం, ప్రాపకం కోసం అవునో కాదో మీరే తేల్చాలని ఆమె పిలుపునిచ్చారు. ఇండియాలో 5 జీ టెక్నాలజీ అమలుకు సంబంధించి రెండు నెలల క్రితం తన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చిన తర్వాత బాలీవుడ్ నటి సోమవారం ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. మనుషులకు, జంతువులు 5జీ టెక్నాలజీ మొబైల్ టవర్ల దుష్పరిణామాలపై ఎంత సురక్షితమో తెలియజేయాలని ఆర్‌టీఐతోపాటు, వివిధ ఏజెన్సీలను కోరామని, ఆ వివరాలను మీరూ పరిశాలించాలని, ఓపికగా తను షేర్ చేసిన వీడియోలోని అంశాలని గమనించాలంటూ తన 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని వీడియోలో వివరించారు. దేశంలో 5జి మొబైల్ టెక్నాలజీ అమలు, రేడియో ఫ్రీకెన్సీ రేడియేషన్ (ఆర్ఎఫ్) దుష్పరిణామాలపై ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోలో ప్రస్తావించారు. 5జీ టెక్నాలజీ వల్ల ఇటు చిన్నా పెద్దా, స్త్రీ పురుషులు, పసివాళ్లు, అటు మూగజీవాలకు కూడా సురక్షితమని సర్టిఫై చేస్తూ, తమ వాదనను బలపరచే అధ్యయనాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జుహీ చావ్లా కృషి చేస్తున్నాననీ, 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఈ కేసులో జుహీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) -
ఉదాశీనయ్యలు–శీను బాబు
ఉదాశీన శీలురు యుగయుగాలుగా ఉన్నారు. వారి ఉదాశీనతవల్లే బోలెడు ఘోరాలు రాజ్యమేలాయి. నిండుసభలో ఇంటికోడల్ని అవమానించినపుడు పెద్దలు మేధావులు.. చెప్పతగినవారు, చెప్పాల్సిన వారు నోరు చేసుకుని ఉంటే కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగి ఉండేది కాదు. త్రేతా యుగంలో కైక వరాలకు దశరథుడు శిరసా వహించినపుడు అయోధ్యలో ఉన్న శిష్టులో వశిష్టులో రంగంలోకి దిగి ఉంటే రామాయణం మరోలా ఉండేది. రాచమర్యాదలకు పోయి ఎవరూ పర్ణశాలల నించి బయటికి రాలేదు. రాజునైనా చక్రవర్తినైనా సమయం వచ్చినప్పుడు దండించే ఖలేజా మేధావి వర్గానికి ఉండి తీరాలి. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే రోజుల్లోనే పెద్దలు చూసీ చూడనట్టు, వినీ విననట్టుండే వారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక ధర్మం ఒంటికాలుమీద కుంటుతున్న కలియుగం మాట చెప్పాలా? ఇప్పుడు ఈ బుద్ధి పెద్దలకు నైజంగా మారింది. దీన్నే లౌక్యం అంటున్నారు. గోడమీది పిల్లలువలె ఎటైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటున్నారు. రెండువైపులకి సరిపోయే తర్కం అందు బాటులో పెట్టుకుంటున్నారు. సుఖంగా జీవితం వెళ్లిపోవడమే పర మార్థంగా భావిస్తున్నారు. నిజానికి అలాంటివారే మేధావులుగా చెలా మణీ అవుతున్నారు. సూటిగా ప్రశ్నించే దక్షతని వదులుకుంటున్నారు. అన్యాయాన్ని అధర్మాన్ని వేలెత్తి చూపడం నేరమా? కొన్ని వర్గాలకి ప్రత్యేక కవచాలుంటాయా? ఉంటే వారికెవరిచ్చారు? వీటిని నిగ్గు తేల్చాల్సిన మేలి మలుపు ఆధునిక కాలంలో వచ్చింది. ‘అందరూ సమానమే. కొందరు మరింత ఎక్కువ సమానం’ అనే పాత నానుడిని తిరగరాసుకోవాలి. ఒకనాటి మన పండితరాయలు ముంగండ అగ్రహారీకుడు. ఢిల్లీ షాజహాన్ కొలువులో ఉన్నత పదవులు నిర్వహించాడు. క్షుణ్ణంగా లోకం తెలిసినవాడు. లోకంలో నాలుకతో, కళ్లతో ఎంతటి విషయాన్నైనా చప్పరించే వాళ్లుంటారో చక్కగా వివరించి చెప్పాడు. పండిత రాయలు వీధి వెంట వెళ్తుంటే, ఓ చెట్టు నీడన ఎంగిలి విస్తళ్లు తింటూ ఓ గాడిద కనిపించింది. పనిమాలా దాన్ని పలకరించి, ఏం పాపం ఈ ఆకులు తింటున్నావని సానుభూతితో అడిగాడు. గాడిద, ‘చాల్చాలు నా బతుక్కి ఇదే గొప్ప’ అన్నది. ‘ఓసీ వెర్రిమొహమా! ఆ తెలివితక్కువ తనమే నిన్ను గాడిదని చేసింది’ అనగానే, గాడిద ప్రశ్నార్థకంగా చూసింది. ‘పో... వెళ్లు. వెళ్లి రాజుగారి అశ్వశాలలో చేరిపో.. రోజూ ముప్పూటలా ఉత్తమజాతి గుగ్గిళ్లు దాణాగా పెడతారు’ అని పండిత రాయలు సలహా ఇచ్చాడు. గాడిద ఆ సలహాకి ఉలిక్కి పడి, ‘ఆహా, ఎవరైనా చూస్తే నా నడుం విరగ్గొడతారు. నేను నీకేం అపకారం చేశాను స్వామీ’ అని బాధపడింది. పండితరాయలు చిరునవ్వు నవ్వి, ‘అందుకే నీ బతుకు ఇట్లా అఘోరించింది. నువ్ అశ్వశాలలో, గుర్రాల పంక్తిలో ఉంటే నువ్వు గుర్రానివే! గుగ్గిళ్లు వేసే సేవకులు అంతే ఆలోచిస్తారు’ అంటూ ధైర్యం ఇచ్చాడు రాయలు. ‘ఎప్పుడైనా రాజుగారి దండ నాయకుడు శాలకి వస్తేనో’ అంది గాడిద. ‘వస్తే రానీ, తోకల్ని లెక్కేసుకుపోతాడు. వాడికి శాల్తీలు సరిపోతే చాలు’ వివరించాడు రాయలు. గాడిదకి కొంచెం కొంచెం ధైర్యం వస్తోంది. ‘సరే, ఏ మంత్రిగారో వస్తే...?’ అన్నది గాడిద. ‘వస్తేరానీ, చూస్తారు.. వెళ్తారు’ అన్నాడాయన. ‘స్వయంగా రాజుగారే వచ్చి, చూసి వచ్చే పండుగకి నేను ఊరే గడానికి దీన్ని సిద్ధం చేయండని పురమాయించి వెళితే...’ అనడిగింది గాడిద. ‘పిచ్చి మొహమా.. ఎందుకు ప్రతిదానికీ అలా కంగారుపడతావ్. ఏమీ కాదు. రాజుగారు దూరం నించి వేలు చూపించి వెళ్తారు. ఇహ ఆ క్షణం నించీ నీ మాలీస్ వేరు. తిండి వేరు’. ‘తీరా ఆ రోజు వస్తే...’ అనడిగింది గాడిద. ‘వస్తే బ్రహ్మాండంగా నిన్ను అలంకరిస్తారు. వజ్రాల బొంతలు కప్పుతారు. రాజు ఎక్కే సమ యానికి అది నువ్వో, గుర్రమో అర్థం కాకుండా చేస్తారు’. ‘వీధిన వెళ్లేప్పుడు పెద్దలు, తమలాంటి పండితులు’ అని గొణి గింది గాడిద. ‘ఓసీ పిచ్చిదానా! మన ప్రజలు మరీ ముఖ్యంగా తెలివితేటలు ఉన్నవారు చాలా ఉదాశీనులు, ఓర్పువంతులు. వాళ్లంతా చూసి నిన్ను గుర్తుపట్టినా.. రాజుగారు సరదాపడ్డారు కాబోలు. మనకెందుకులే అని నోరు మెదపరు. రాజుగారు ఠీవీగా ఊరేగుతారు’ అంటూ దాని వెన్ను చరిచాడు రాయలు. మేధావుల ఉదాశీనత దేశానికి పట్టిన బూజు. పెద్దల మెదళ్లకి బొజ్జలొస్తే శీనయ్యలు ఉదాశీను బాబులు అవుతారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మాట మితం.. కరోనా ఖతం!
సాక్షి, హైదరాబాద్: మౌనం కరోనా నియంత్రణలో కీలకంగా పనిచేస్తుందని ప్రపంచ వ్యాప్తంగా జరిపిన తాజా పరిశోధనలు చెబుతున్నాయి. వీలున్నంత తక్కువ మాట్లాడడం వల్ల పాజిటివ్ వ్యక్తుల నుంచి ఇతరులకు ఈ వైరస్ వ్యాప్తిచెందే అవకాశం తక్కువని ’ద బీఎంజే’ తన జర్నల్‌లో ప్రచురించింది. అమెరికా, బ్రిటన్, చైనాలతోపాటు పలు దేశాల్లో జరిపిన పరిశోధనల్లో మౌనంగా ఉండడం, మాట్లాడడం, పాటలు పాడడం, గట్టిగా అరవడం వల్ల వైరస్ వ్యాప్తికి గల అవకాశాలను వివరించింది. ఈ జర్నల్ ప్రకారం.. ఇండోర్‌లో ఉండే పని ప్రదేశాలు, ప్రార్థనా మందిరాల్లో రిస్కే. ఎక్కువ వెంటిలేషన్ ఉంటే కొంత ప్రమాదం తగ్గుతుంది. ఇండోర్ ప్రదేశాల్లో, వెంటిలేషన్ సరిగా లేని దగ్గర ఎక్కువ సేపు ఉండి మాట్లాడుకోవడం, పాటలు పాడుకుంటూ, కేకలు వేయడం వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఓ సంగీత కచేరిలో పాల్గొన్నగాయకుడి ద్వారా 52 మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది. తుంపర్లు 9 మీటర్ల వరకు గాలిలో ఎగిరి... పాజిటివ్ ఉన్న వ్యక్తులు తుమ్మినప్పు డు, దగ్గినప్పుడు మాత్రమే కాకుండా మాట్లాడినప్పుడు, ఇతర సందర్భాల్లో వచ్చే తుంపర్లు గరిష్టంగా 9 మీటర్ల వరకు వాటి పరిమాణం తగ్గకుండా గాల్లో ఎగిరి ప్రయాణిస్తాయి. ఆ తర్వాత వాటి సైజ్ తగ్గినా పెద్ద తుంపర్ల కంటే చిన్న తుంపర్ల ద్వారా వైరస్ ఎక్కువగా సోకుతుంది. ఏదో 2–3 మీటర్లు భౌతికదూరం పాటించినంత మాత్రాన సురక్షితం అనుకోవడం సరైంది కాదని, మిగిలిన జాగ్రత్తలు పాటించాలని ఈ జర్నల్ వెల్లడించింది. వివిధ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలివి: ► వెంటిలేషన్ బాగా ఉన్న ప్రదేశంలో మాస్క్ ధరించి మాట్లాడకుండా ఎంతసేపు ఉన్నా వైరస్ వ్యాప్తి జరగదు. మాట్లాడినా ప్రమాదం లేదు. కానీ పాటలు పాడడం, కేకలు వేయడం వల్ల వ్యాప్తికి కొంత అవకాశం ఉంది. అదే జన సమ్మర్ధం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కొంచెం అధికం. ► వెంటిలేషన్ ఎక్కువగా ఉన్నా ఇండో ర్ అయితే, ముఖానికి మాస్క్ లేకపోతే, ఎక్కువ సేపు అక్కడే ఉంటే, మామూలుగా మాట్లాడితే వైరస్ సోకే అవకాశాలున్నాయి. ► ఇదే పరిస్థితుల్లో పాటలు పాడి, గట్టిగా అరిస్తే మాత్రం వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. ► ఫేస్ మాస్కులున్నా ఎక్కువమంది ఉన్న ప్రదేశాల్లో వెంటిలేషన్ సౌకర్యం సరిగా లేకపోతే మాటలు, పాటలు, అరుపులు వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. ► జన సమ్మర్థం ఎక్కువ ఉండి, ముఖానికి మాస్క్ లేకుండా చాలాసేపు ఉంటే మౌనంగా ఉన్నా వైరస్ సోకే అవకాశం కొంతమేర ఉంది. ► అందుకే వీలున్నంత తక్కువ మాట్లాడడం, మాస్కు ధరించడం, ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం గడపకపోవడం, వెంటిలేషన్ ఉన్న అవుట్ డోర్ ప్రదేశాలను ఎంచుకోవడం ద్వారా కరోనా మహమ్మారి మన దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి
ముంబై: ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి (ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో ఫేమస్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌ను ఉటంకిస్తూ దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంపై విమర్శలు గుప్పిస్తూ సోమవారం పార్టీ పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం రాసింది. మాంద్యం మూలంగా దీపావళి రోజు కళకళలాడాల్సిన మార్కెట్లలో నెలకొన్న స్తబ్దతను మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ ఆ డైలాగ్‌ను శివసేన వాడుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజకీయంగానూ మహారాష్ట్రలో ఒక రకమైన నిశ్శబ్దమే నెలకొని ఉండటమే ఇక్కడ విశేషం. రాష్ట్రంలో అధికారాన్ని సమంగా పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరిస్తుందా?, బీజేపీ ఒత్తిడి తెస్తే ఆ డిమాండ్‌ను శివసేన వదిలేస్తుందా?’ తదితర ప్రశ్నలకు ప్రస్తుతం నిశ్శబ్దమే సమాధానంగా వస్తోంది. హరియాణాలో స్మూత్.. ‘మహా’ ఉత్కంఠ ఒకేసారి ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హరియాణాల్లో నిజానికి హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటులో కొంత అస్థిరత, ఉత్కంఠ నెలకొనాల్సి ఉండగా.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగింది. ప్రాంతీయ పార్టీ జననాయక జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో బీజేపీ సీఎం ఖట్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీజేపీ– శివసేన కూటమికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతున్నాయి. శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ వస్తుందని బీజేపీ ఆశించింది. అలా జరిగితే బీజేపీకి సమస్య ఉండకపోయేది. కానీ, అలా జరగలేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడ్తున్న ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రేకు ప్రభుత్వంలో ‘సముచిత’ గౌరవం లభించాలన్నది సేన ఆలోచన. ముఖ్యమంత్రిత్వం తప్పితే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి కూడా శివసేన సుముఖంగా లేదని తెలుస్తోంది. సంకీర్ణ ధర్మం పాటించాలి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పార్టీ నేత సంజయ్ రౌత్ తదితరులు తమ డిమాండ్లు చెప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల ముందే.. పొత్తు చర్చల సమయంలోనే ఈ విషయమై ఒక అంగీకారానికి వచ్చాం’ అని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేస్తున్నారు. అధికార పంపిణీకి సంబంధించిన ఫార్మూలాను అమలు చేస్తామని ప్రభుత్వ ఏర్పాటుపై జరిపే చర్చలకు ముందే తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని సేన ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై బీజేపీ నుంచి స్పందన లేదు. కానీ, ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తే ఉంటారనే విషయంలో ఎలాంటి రాజీ లేదనే సంకేతాలు మాత్రం ఇస్తోంది. జూనియర్ పార్ట్నర్గా శివసేన సంకీర్ణ ధర్మం పాటించాలని, ప్రభుత్వంలో చేరి ఆదిత్య ఠాక్రే సీనియర్ అయిన సీఎం ఫడ్నవిస్ వద్ద పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 1989లో శివసేన బీజేపీల తరఫున బాల్ ఠాక్రే, ఎల్కే అద్వానీల మధ్య పొత్తు కుదిరినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే, 2009 నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, శివసేనలు వరుసగా 122, 63 సీట్లు గెల్చాయి. త్వరలో∙బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు సోమవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, విపక్ష కూటమి అయిన కాంగ్రెస్(44), ఎన్సీపీ(54)లు కలిసి సాధించిన సీట్ల కన్నా తాము ఎక్కువ సీట్లలోనే గెలిచామని ఆయన వివరించారు. బుధవారం బీజేపీ చీఫ్ అమిత్ ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. రాముడు సత్యమే మాట్లాడేవాడు.. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే విషయంలో అమిత్– ఉద్ధవ్‌ల మధ్య గతంలోనే ఒక అంగీకారానికి వచ్చిన విషయంపై నిజాలు మాట్లాడాలని సంజయ్‌రౌత్ డిమాండ్ చేశారు. ‘బీజేపీ ఎప్పుడూ శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటుంది. రాముడు సత్యవాక్పరిపాలకుడు. ఇప్పుడు బీజేపీ కూడా 50:50 ఫార్ములాపై నిజాలు మాట్లాడాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలిసిన ఇరు పార్టీల నేతలు బీజేపీ నేత, సీఎం ఫడ్నవిస్, శివసేన నాయకుడు దివాకర్ రౌతె సోమవారం రాష్ట్ర గవర్నర్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. చర్చల వివరాలు వెల్లడి కాలేదు కానీ.. అవి మర్యాదపూర్వకమైనవేనని రాజ్‌భవన్ అధికారులు చెప్పారు. అక్టోబర్ 21న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు! ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ వ్యాఖ్యానించారు. సామ్నాలో బీజేపీపై విమర్శలు సోమవారం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం కూడా బీజేపీపై నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. దీపావళి సమయంలో మార్కెట్లలో స్తబ్దత నెలకొనడంపై స్పందిస్తూ.. ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి(ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ అనే షోలే సినిమా డైలాగ్‌ను ఉటంకించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే కథనాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘అమ్మకాలు తగ్గిపోయాయి. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఉద్యోగాలు పోతున్నాయి. దీపావళి సమయంలోనే మార్కెట్లలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు, పలు విదేశీ కంపెనీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా అమ్మకాలు జరిపి మన డబ్బుల్తో తమ ఖజానాలను నింపుకుంటున్నాయి’ అని పేర్కొంది. -
‘సైలెన్స్’.. ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది!
స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ సైలెన్స్. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వస్తాడు నా రాజు ఫేం హేమంత్ మధుకర్ దర్శకుడు. భాగమతి తరువాత అనుష్క చేస్తున్న ఈ సినిమా కావటంతో సైలెన్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయ్యింది. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని అనుష్క సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రెడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టేజ్ మీద తను అస్పష్టంగా కనిపిస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన అనుష్క, ‘త్వరలోనే స్పాట్లైట్ (వెలుగులోకి వస్తాను)’అంటూ ట్వీట్ చేశారు. ఈ కామెంట్‌కు సైలెన్స్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. దీంతో ఇది సైలెన్స్ ఫస్ట్ లుక్కు సంబంధించిన హింటే అని అభిమానులు సంబర పడిపోతున్నారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరో కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ కనిపించనున్నారు. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. తెలుగులో నిశబ్ధం పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తమిళ, హిందీ, ఇంగ్లీష్ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram Into the spotlight soon 🙌 #SILENCE 😍 A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on Jul 2, 2019 at 8:11pm PDT -
ఆ కోరిక అనుష్కకూ పుట్టిందా?
తమిళసినిమా: మనిషి ఆశాజీవి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా తనకెలాంటి ఆశ లేదంటే అది నిజం కాదు. ఇకపోతే స్వీటీగా దక్షిణాది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న బ్యూటీ అనుష్క. ఇప్పుడీ అమ్మడికీ ఒక ఆశ పుట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ అమ్మడు తమిళం కంటే తెలుగు చిత్రాలనే ఎక్కువగా నమ్ముకుంది. అనుష్కకు నేమ్, ఫేమ్ తీసుకొచ్చిందీ తెలుగు చిత్ర పరిశ్రమనే. కోలీవుడ్‌లో సింగం చిత్రంతోనే విజయానందాన్ని ఆశ్వాదించింది. ఈ అందాలరాశిలోని అభినయాన్ని బయటకు తీసిందీ టాలీవుడ్‌నే. అరుంధతి చిత్రాన్ని, అందులోని అనుష్క నటనను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి నటి భాగమతి చిత్రం తరువాత రెండేళ్లు ముఖానికి రంగేసుకోలేదు. ఇంజిఇడపళగి చిత్రంలోని పాత్ర కోసం పెంచుకున్న బరువును తగ్గించుకోవడానికి అనుష్క చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గత అందాలను సంతరించుకున్న అనుష్క తాజాగా సైలెన్స్ అనే సైంటిఫిక్, సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఈ బ్యూటీ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించేసింది. అయితే ఈ చిత్ర షూటింగ్ చివరి రోజునే అనుష్క గాయాలపాలైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈమెను వైద్యులు రెండు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తింది. సైలెన్స్ చిత్ర షూటింగ్ కోసం అమెరికాలో ఉండడంతో తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి పట్టించుకోకపోతే ఇంకా రచ్చ చేస్తారనుకుని తాను బాగానే ఉన్నానని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సంగతి ఇలా ఉంటే ఆ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం సైలెన్స్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిషు అంటూ నాలుగు భాషల్లో తెరకెక్కుతోంది. నటుడు మాధవన్ హీరోగా నటిస్తున్న ఇందులో నటి అంజలి, శాలినిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. నటి అనుష్క ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు తాను దక్షిణాది చిత్రాలతోనే సంతృప్తిగా ఉన్నానని తెలిపింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఆశనే వ్యక్తం చేయడం విశేషం. బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాంకచోప్రా, దీపికా పదుకొనే వంటి వారు హాలీవుడ్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకోవడం, తాజాగా నటి శ్రుతిహాసన్ కూడా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని రాబట్టుకోవడంతో హాలీవుడ్ ఆశ పుట్టి ఉండవచ్చునంటున్నారు సినీ వర్గాలు. ఇప్పుడు సైలెన్స్ చిత్రంతో తొలిసారిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతోంది కాబట్టి తదుపరి హాలీవుడ్‌పై గురి పెట్టాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చునని చర్చ జరుగుతోంది. -
స్పానిష్ సినిమా రీమేక్‌లో స్వీటీ
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు. సైజ్ జీరో సినిమా కారణంగా లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇటీవల బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న సైలెన్స్ సినిమాను ప్రారంభించిన అనుష్క, తదుపరి చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసేందుకు అనుష్క ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. తన సోదరి మరణం వెనుక రహస్యాన్ని చేధించేందకు ఓ యువతి చేసిన సాహసాలే ఈ సినిమా కథ. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ దర్శకుడిగా మారనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఎప్పటికీ నా మనసులో ఉంటావ్ : అనుష్క
తన దగ్గర సహాయకుడిగా పనిచేసిన రవి వర్ధంతి సందర్భంగా హీరోయిన్ అనుష్క భావోద్వేగానికి గురయ్యారు. ‘మనం ఎవరినైతే అమితంగా ప్రేమిస్తామో.. వారు మనల్ని ఎప్పటికీ విడిచిపోరు. కొన్నింటిని మరణం కూడా దూరం చేయలేదు. ఏడేళ్లు గడుస్తున్న రవి ఇప్పటికీ నువ్వు మాతో ఉన్నట్టుగానే ఉంది. మరణం తరువాత ఏమవుతుందో తెలియదు. కానీ నువ్వు ఎప్పటికీ నా మనసులో ఉంటావు’ అంటూ రవితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు అనుష్క. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. భాగమతి సినిమా తరువాత నటనకు గ్యాప్ ఇచ్చిన స్వీటీ త్వరలో సైలెన్స్ అనే బహుభాషా చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు సైరాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు కూడా అనుష్క ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. View this post on Instagram “Those who love never truly leave us ,Harry.There are things that death cannot touch”........The Past 14years has been quite a journey ... when u realise the people closest to u are no more a part of ur life all I can say is they take a part of u with them ...it’s been 7 years and it still keeps me wondering a beautiful soul (Ravi🥰) I have no clue of the afterlife but he always live in my heart .... A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on May 17, 2019 at 1:08pm PDT -
మౌనం వీడారు
ఈపాటికి యూఎస్‌లో సైలెంట్‌గా ‘సైలెన్స్’ టీమ్ షూటింగ్ చేసుకుంటూ ఉండాల్సింది. కానీ జరగలేదు. ఈ విషయంపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీమ్ ఇప్పుడు మౌనం వీడారు. ఈ నెలాఖర్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ చిత్రం తెరకెక్కనుంది. అనుష్కా, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య తారాగణంగా కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు దర్శకుడు హేమంత్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఆల్మోస్ట్ యూఎస్‌లోనే జరగుతుందని తెలిసింది. కొంతమంది అమెరిక్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘సైలెన్స్’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
అందుకే అనుష్క అమెరికాకు వెళ్తోంది!
చెన్నై : సైలెన్స్ కోసం హీరోయిన్ అనుష్క అమెరికాకు పరిగెట్టడానికి సిద్ధం అవుతోంది. ఏంటీ అర్థం కాలేదా? ఈ స్వీటీ నటనకు దూరం అయి చాలా కాలమైంది. దక్షిణాదిలో అగ్రనటిగా వెలుగొందుతున్న ఈ బ్యూటీ దాదాపు రెండేళ్లకు పైగా ముఖానికి రంగేసుకోకపోవడం విశేషమే. అందుకు కారణం తన దృడకాయమే. ఇంజి ఇడుప్పళగి చిత్రంలోని పాత్ర కోసం స్లిమ్‌కు చిరునామాగా ఉండే అనుష్క బరువెక్కిన విషయం తెలిసిందే. అది ఎంత అంటే సుమారు 100 కిలోల బరువు పెరగడంతో అది ఆ తరువాత తన కెరీర్‌కు భారంగా మారింది. అదే బరువుతో భాగమతి చిత్రం చేసి విజయాన్ని అందుకున్నా, ఆ తరువాత పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఎలాగైతేనేం నిరంతర శ్రమతో మళ్లీ యథాస్థితికి మారి కొత్తందాలను సంతరించుకుంది. అయితే ఈ ప్రహసం పూర్తి కావడానికి రెండేళ్లు పైనే పట్టింది. దీంతో భాగమతి తరువాత అనుష్క మరో చిత్రం చేయలేదు. అది తను తీసుకున్న నిర్ణయం కావచ్చు, సరైన అవకాశాలు వచ్చి ఉండకపోవచ్చు. అలాంటిది ఎట్టకేలకు ఒక చిత్రానికి పచ్చజెండా ఊపింది. ఆ చిత్రం పేరే సైలెన్స్. ఇది తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో తెరకెక్కనుంది. మాధవన్ హీరోగా నటిస్తున్న ఇందులో అనుష్కతో పాటు, అంజలి, షాలినిపాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుందని సమాచారం. కాగా దీని షూటింగ్‌ను అధిక భాగం అమెరికాలో నిర్వహించనున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ కోసం చిత్ర యూనిట్ గత ఫిబ్రవరిలోనే అమెరికా వెళ్లాల్సిందట. అయితే అనుష్కకు వీసా రావడంలో జాప్యం జరగడంతో వాయిదా వేసినట్లు సమాచారం. ఇప్పుడు అనుష్కకు వీసా సిద్ధం అవడంతో త్వరలోనే సైలెన్స్ చిత్ర యూనిట్ అమెరికాకు బయలుదేరనుందని తెలిసింది. అనుష్క రెండు అనే చిత్రంతో నటుడు మాధవన్‌కు జంటగా తొలిసారిగా కోలీవుడ్‌కు కథానాయకిగా పరిచయమైంది. ఆ తరువాత ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నటించనుంది. అన్నట్టు ఈ బ్యూటీ తాను స్లిమ్‌గా మారిన విధానాన్ని ఒక పుస్తకంగా రాసిందట. దాన్ని ఆంగ్ల భాషలో త్వరలో విడుదల చేయనుందట. ఇక పోతే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రల్లో నటించబోతోందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే అందులో వాస్తవం లేదని అనుష్క వర్గాలు పేర్కొన్నారు. -
హీరోయిన్ అనుష్క మూగబాసలు
ముద్దబంతి పువ్వులో మూగ బాసలు అని పాటలో విన్నాం. ఇక హీరోయిన్ అనుష్క మూగబాసలు చూడబోతున్నాం. అవును అనుష్కను వెండితెరపై చూసి ఏడాది పైనే అవుతోంది. ఇది ఆమె అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అవుతుంది. భాగమతి తరువాత ఏ చిత్రంలోనూ నటించని ఆ స్వీటీ పెరిగిన తన బరువును తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడిందనే ప్రచారం జోరుగానే జరుగుతోంది. అంతే కాదు ఆ మధ్య ఆలయ దర్శనం చేసుకుంటే, అనుష్క దోశ నివారణ పూజలు నిర్వహించిందని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందనిలాంటి నిరాధార వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోని ఈ బ్యూటీ ఆ మధ్య బరువు తగ్గడం కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ ఆమె ప్రయత్నం ఫలించి నాజూగ్గా రెట్టించిన అందాన్ని పోగేసుకుని తిరిగొచ్చింది. తాజాగా సైలెన్స్ అనే త్రిభాషా చితంలో నటించడానికి సిద్ధమైంది. మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు రానా అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరుగుతోంది. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఇందులో నటి అనుష్క మూగ, చెవుడు కలిగిన యువతిగా నటించబోతోందట. ఇందుకుగానూ ఈ అమ్మడు మూగ భాషలో శిక్షణ పొందుతోంది. అమెరికాలో మూగ భాషలో తర్ఫీదు తీసుకుంటుందని సమాచారం.అసలు మాటలే లేకుండా తన సైగలతో, ముఖ కవళికలతో సైలెన్స్ చిత్రం ద్వారా అలరించడానికి ఈ బ్యూటీ తయారవుతోందన్నమాట. -
మ్యాడసన్ @ సైలెన్స్
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ముఖ్య తారలుగా హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న చిత్రం ‘సైలెన్స్’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ‘కిల్ బిల్, హేట్‌ఫుల్ ఎయిట్, రిసర్వోయర్ డాగ్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు మ్యాడసన్. ‘‘టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. ఓ వినూత్నమైన సినిమాను చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని ఆశిస్తున్నాం. యూఎస్ఏలోని సీయోటల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిత్రీకరణ జరపబోతున్నాం. ఈ సినిమా టీజర్‌ను మేలో యు.ఎస్.ఏలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
అనుష్క ‘సైలెన్స్’లో హాలీవుడ్ స్టార్
అనుష్క, మాధవన్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ‘ సైలెన్స్’. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడసన్ తొలిసారి ఈ ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంస్థతో కలిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో ఈ సినిమాని నిర్మిస్తోంది. కిల్ బిల్, హేట్ ఫుల్ ఎయిట్ మరియు రిసర్వోయర్ డాగ్స్ చిత్రాల్లో నటించిన హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడసన్, అనుష్క, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సీఈవో విశ్వప్రసాద్ మాట్లాడుతూ.... ‘ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందర్నీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే ఓ వినూత్నమైన సినిమా చూసామనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.ఎస్.ఎ లోని సీయోటల్ లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు షూటింగ్ చేయనున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఈ మూవీ టీజర్ ను మేలో గ్రాండ్ గా యు.ఎస్.ఎ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. సీయోటెల్ హెడ్ క్వార్టర్స్ గా స్ధాపించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ . ఈ సంస్థ టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ మరియు హాలీవుడ్ ఇండస్ట్రీలలో పలు సినిమాలు నిర్మిస్తోందని నిర్మాత వెల్లడించారు. -
సైలెంట్‌గా ఉన్నారు
సినిమాలో కీలక పాత్ర ఉంది. నిడివి తక్కువే. మామూలుగా అయితే కొందరు ఆర్టిస్టులు నిడివి గురించి ఆలోచించిన నో అంటారు. కానీ నో ప్రాబ్లమ్ నేనున్నా అంటారు రానా. ఇంతకుముందు చాలా సినిమాల్లో అతిథిగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చాలా సినిమాల్లో గెస్ట్‌గా కనిపించారు. లేటెస్ట్గా అనుష్క, మాధవన్ సైలెంట్ థ్రిల్లర్ చిత్రంలోనూ అతిథిగా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ విషయం గురించి సైలెంట్‌గా ఉన్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందట. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న సైలెంట్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలో జరగనుంది. హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క, రానా స్క్రీన్ షేర్ చేసుకోబోయే చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. -
కొత్త లుక్‌లో..
ఏడాది కావస్తోంది అనుష్క స్క్రీన్‌పై కనిపించి. ‘భాగమతి’ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఎక్కడా కనిపించలేదు. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందనున్న సైలెంట్ థ్రిల్లర్ ‘సైలెన్స్’లో నటించడానికి అంగీకరించారు కానీ ఆ చిత్రం షూటింగ్ స్టార్ట్ కావడానికి టైమ్ ఉంది. ఈ సినిమాలో కంప్లీట్ న్యూ లుక్‌లో కనిపించే విషయంపై శ్రద్ధ పెట్టారట అనుష్క. అందుకే మీడియా బయట ఎక్కడా కనిపించడం లేదు. మాధవన్, అనుష్క ముఖ్య పాత్రల్లో ‘వస్తాడు నా రాజు’ చిత్రానికి దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ సినిమాకు దర్శకుడు. కోన వెంకట్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ లేటెస్ట్ థ్రిల్లర్ గురించి కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో రాబోతున్న తొలి క్రాస్ఓవర్ చిత్రం ‘సైలెన్స్’. (మన భాష నటులతో సమానంగా లేదా ఎక్కువ సంఖ్యలో వేరే ప్రాంతం, భాష నటులు సినిమాలో కనిపించడాన్ని క్రాస్ఓవర్ అంటారు). అనుష్క, మాధవన్ మరో ఇద్దరు ప్రముఖ ఆర్టిస్టులు మినహా ఈ సినిమాలో మొత్తం హాలీవుడ్ నటులు కనిపించనున్నారు. ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం కోసం అనుష్క ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆమె సరికొత్త లుక్ కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది’’ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
మ్యూజికల్ రైడ్
ఈ ఏడాది అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి మంచి ఊపు మీద ఉన్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. అటు మాలీవుడ్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తున్న గోపీసుందర్ తాజాగా మరో తెలుగు సినిమాకు స్వరాలు సమకూర్చడానికి సిద్ధం అయ్యారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్కా, మాధవన్ ప్రధాన పాత్రలుగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘సైలెన్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది యూఎస్‌లో ప్రారంభం కానుంది. ‘‘తెలుగులో ఇప్పటికే గోపీ సుందర్ మంచి సంగీతం అందించారు. ఆయన మా సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీ. మంచి మ్యూజికల్ రైడ్‌గా ఉంటుందీ చిత్రం’’ అన్నారు కోన వెంకట్. -
అంతా నిశ్శబ్దం
అనుష్క నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? అన్నది కొన్ని నెలలుగా జవాబు దొరకని ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అనుష్క నెక్ట్స్ చేయబోయే చిత్రం పేరు ‘సైలెన్స్’. మూకీ సినిమా అని అర్థమయ్యే ఉంటుంది. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ ముఖ్య›పాత్రల్లో ‘సైలెన్స్’ అనే సైలెంట్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి. రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి రచయితగా, సహాయ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలోని సీటెల్ ప్రాంతంలో జరగనుంది. అనుష్క, మాధవన్ ఇదివరకు ‘రెండు’ (2006) అనే తమిళ సినిమాలో తొలిసారి కలసి నటించారు. ఇప్పుడు 12ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ కలసి నటించబోతున్నారు. సైలెంట్ థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. -
అదిగో మూజలెల్లి!
నాకు ఏ పండుగ వచ్చినా ఇద్దరు అక్కలను, ఒక చెల్లెను తీసుకురావడం మళ్లీ పండుగ తరువాత వారిని తొలి రావడం, వాళ్లు ఉన్న అయిదు, ఆరురోజులు ఇల్లంతా సందడి సందడిగా ఉండి వాళ్లు వెళ్లగానే అంతా నిశ్శబ్దంగా ఉండటం, ఏమితోచక పోవడంతో నాకు కూడా పండుగలు కాని ఏదైనా కార్యక్రమాలు కాని ఎప్పుడెప్పుడు జరుగుతాయా! అక్కలను ఎప్పుడు తీసుకరావాలి అనిపించేది. అది 1994 సంవత్సరం సంక్రాంతి పండుగ. మా అక్కలు యశోదక్క, సత్తెక్క మరియు చెల్లి నర్సవ్వను తీసుకొని వచ్చాను. ఇంట్లో వాళ్ళు వారి వారి పిల్లలతో సందడిగా, ఆటలు మాటలతో హుషారుగా ఉంటే నేను అలా బయటికి వెళ్లొస్తా అని వెళ్లి ఒక అయిదారుగంటలు స్నేహితులతో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గొడవ గొడవ జరుగుతోంది.ఏందబ్బా ఇంతమంది కూడిండ్రు, ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటూ లోపలికి పోయేసరికి ‘‘ఇంకోసారి నన్ను పండుగకు తీసుకురావద్దు. నేను రాను’’ అన్నది మా సత్తెక్క. ‘‘మేము ఏమన్నా అన్నామా! నీ బిడ్డే ఆ ముసలామెను అంటే ఆమె మనల్ని తిట్టబట్టే’’ అని అమ్మ అంటుంది. ‘‘ఏదో చిన్నపిల్ల తెల్వక అన్నది అని చెప్పొచ్చు కదా. మీరు కూడా తిట్టబడ్తిరి. అందుకే ఇంకోసారి నేను రాను’’ అంటోంది అక్క ‘‘ఏ! ఆగండి, అసలేం జరిగింది?’’ అని నేను అడిగేసరికి–‘కాదురా తమ్మీ! మన పక్కింటి ఎల్లవ్వను మన పద్మ (అక్క బిడ్డ) ముసలెల్లి ముసలెల్లి అన్నదట. అందుకే ఆమెతో పాటు మన అమ్మ నన్ను నా బిడ్డను తిడుతున్నరు. నేనింకోసారి రాను’’ ఏడుపందుకుంది అక్క ‘‘మరి గా ముసలిదాని జోలి గీ పిల్లకెందుకు, మనింట్లో మనముండక’’ అంటోంది అమ్మ.‘‘నా బిడ్డకు తెలుసా! చెప్పరా తమ్మీ’’ అన్నది అక్క. ‘‘అట్లగాదక్కా! గా పక్కింటి ముసలామె జోలి మన పద్మకెందుకొచ్చింది. ఆ ముసలామె కోపానికెందుకొచ్చింది, నాకేమి అర్థం అయితలేదుగని ఒకసారి పద్మను పిలువు అడుగుదాం’’ అన్నాను. ‘‘పద్మా... పద్మా నువ్వెమన్నవు బిడ్డా? మామయ్యకు చెప్పు’’‘‘నేను మా చెల్లిని అంటే గామె నన్ను కొట్టింది మామయ్యా’’‘‘మరి ముసలెల్లి అంటే కోపం రాదారా పద్మా. తప్పు కాదా’’‘‘మూజలెల్లిని అంటే ఆమెకేంది?’’‘‘ఆమె పేరు పెట్టి అనుకుంట ఆమెకేంది అంటవేమిరా. ఆమెకు కోపం రాదా?’’‘‘నేనామెనెందుకన్నా. మూజలెల్లిని అన్నా’’‘‘అరే! పరేశాను చేస్తందేమిరో, ఇదేదో తిరకాసు ఉన్నట్లుంది’’నాకు ఏదో అనుమానమొచ్చి ‘‘ఏదీ ఏ ముసలెల్లిని అన్నవో చూపిద్దువురా’’ అన్నాను.గబగబా నన్ను బయటికి వేలుపట్టుకొని తీసుకొచ్చి ఇంటిపక్కన ఎల్లవ్వ గోడపైకి చూపిస్తూ...‘‘అగ్గో గా మూజలెల్లి’’అన్నది.అటు చూసిన నాకు, అక్కలకు, అమ్మకు అక్కడ పోగైన మందికి, తిట్టిన ఎల్లవ్వకు నవ్వు ఆగుతలేదు.‘‘ఓసినీ పోరీ! అప్పుడే చూపెడితే అయిపోయేది కదా’’ అంటుంది ఇటుపక్క ఇంటిఅయిలమ్మ.అందరి నవ్వుకు కారణం అక్కడ ఉన్నది....ఊసరవెల్లి! అది జరిగి ఇన్ని సంవత్సరాలయినా ఇప్పటికీ బాగా నవ్వుకుంటాం. – మినుముల భిక్షపతిగౌడ్, సముద్రాల, జనగామ జిల్లా -
నిర్ణయం
‘‘నాన్నగారి అంత్యక్రియలు తమ్ముడిని నిర్వహించమంటాను. నాకు బి.పి. షుగర్ ... పన్నెండు రోజులు చన్నీటి స్నానం నాకు పడదు ... ఉదయం లేవగానే నీరసంగా ఉంటుంది. కాఫీ, టిఫిన్లు పడనిదే ఏపనీ చేయలేను.’’ చెప్పాడు శివశంకరం, గోపాలరావు పెద్దకొడుకు.‘‘తండ్రి అంత్యక్రియలు, తదనంతర కార్యక్రమాలు చేయడం పెద్దకొడుకు విధి, కర్తవ్యం ... అప్పుడే నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. అన్నయ్య చేయవలసిన విధిని నన్ను నిర్వర్తించమనడం భావ్యంకాదు ...’’ కొంచెం కోపంగా అన్నాడు రెండో కొడుకు భానుమూర్తి. బ్రతికి ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కొడుకుల వాదోపవాదాలు విని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసేవాడు గోపాలరావు. ప్రస్తుతం వారి వాదనలకు స్పందించలేని స్థితిలో ఉంది గోపాలరావు భౌతికకాయం.కొడుకుల నిర్వాకం తల్లి చెవిన వేసింది గోపాల్‌రావు కూతురు భ్రమరాంబ.తనయుల మనస్తత్వం తెలిసిన తల్లి శాంతకుమారి మౌనంగా రోదించింది.పరిస్థితిని గమనిస్తున్న గోపాలరావు తమ్ముడు రాజేశ్వరరావు రంగంలోకి దిగాడు. అతనే అన్నయ్యకు సీరియస్ గా వుందనివినగానే పరుగు పరుగున వచ్చి పిల్లలకు ఫోను చేశాడు. అన్నయ్య చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించాక అంత్యక్రియలు నిర్వహించడానికి పంతులుగారిని పురమాయించాడు.‘‘నువ్వు అలా అనకూడదురా శివం. తండ్రికి అంత్యక్రియలు చేయడం పెద్దకొడుకుగా నీ విధి. కర్మ చేస్తున్న పన్నెండు రోజులు కర్త ఆరోగ్యం ఆ పరమేశ్వరుడే కాపాడతాడు. చనిపోయిన నీ తండ్రి ఆత్మ నీకు శక్తినిస్తుంది.వాదోపవాదాల కిది సమయంకాదు. మరేం ఆలోచించకండి. ఇద్దరూ వెళ్ళి స్నానం చేసిరండి ... క్విక్’’ అంటూ తన నిర్ణయం ప్రకటించాడు రాజేశ్వరరావు. బంధువులందరూ తనవైపే చూస్తూండటంతో తలవంచక తప్పలేదు శివశంకరానికి.గోపాలరావు అంత్యక్రియల కార్యక్రమం య«థావిధిగా సాగింది. గోపాలరావు, శాంతకుమారి దంపతులకు ఇద్దరు మగపిల్లల తరువాత ఆడపిల్ల పుట్టింది.గోపాలరావు జిల్లా పరిషత్ స్కూల్ టీచరుగా చేసి రిటైరయ్యాడు. విజయవాడలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.పెద్దకొడుకు శివశంకరం ఎంటెక్ చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులో వున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.రెండో కొడుకు భానుమూర్తి సి.ఎ. చేసి చార్టర్డ్ అకౌంటెంట్‌గా హైదరాబాద్ లోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని భార్య కాలేజీ లెక్చరర్. వారికి ఓ అమ్మాయి. డబ్బుకు లోటులేని జీవితం.గోపాలరావు అల్లుడుప్రకాశరావు. రాజమండ్రి మునిసిపల్ ఆఫీసులో ఉద్యోగం. కూతురు భ్రమరాంబ స్కూల్ టీచర్‌గా చేస్తోంది. వారి సంతానం ఒక అబ్బాయి. గోపాలరావు హైబీపీతో బాధపడుతున్నాడు. ఆ రోజు రాత్రి హఠాత్తుగా విపరీతమైన గుండెనొప్పితో కూలబడ్డాడు గోపాలరావు. విజయవాడ లోనే వుంటున్న మరిదికి ఫోన్ చేసింది శాంతకుమారి. రాజేశ్వరరావు వెంటనే బయలుదేరి వచ్చి అన్నగారిని అంబులెన్స్‌లో కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలించాడు. ఆసుపత్రికి చేరుకునే సరికే గోపాలరావు విగతజీవుడయ్యాడని నిర్ధారించారు డాక్టర్లు.గోపాలరావు కొడుకులకీ, అల్లుడికీ విషాదవార్త తెలియజేశాడు రాజేశ్వరరావు. తెల్లవారుజామునే ముగ్గురూ కుటుంబ సమేతంగా కార్లలో విజయవాడ వచ్చారు. తండ్రి శవంపై పడి రోదించారు. శివశంకరం ఆఫీసు పని తప్ప మరే పనిలోనూ కలుగజేసుకోడు. ఎన్ని గంటలైనా విసుగూ, విరామం లేక ఆఫీసు వ్యవహారాలు చక్కబెట్టే శివశంకరానికి ఇంటి పని అంటే పరమ చిరాకు. ఇంటి విషయాలన్నీ అతని భార్యే నిర్వర్తిస్తుంది. బాధ్యతారాహిత్యం అతని నరనరాల్లో జీర్ణించుకుంది. ఎప్పుడో నెలకోసారి తప్ప తల్లిదండ్రులతో మాట్లాడి ఎరుగడు. తన సంతానం విషయంలోనూ ఎప్పుడూ పట్టించుకోలేదు.తండ్రి పోయాడని బాబయ్య చెప్పింది వినగానే ఒక్కసారి గుండెల్లో కలుక్కుమంది శివశంకరానికి. తండ్రి శవాన్ని చూసి రోదించాడు. బాబయ్య ఓదార్చి ప్రక్కకు తీసుకెళ్ళి చేయవలసిన కార్యక్రమాలు వివరించాడు. పది రోజుల నిత్యవిధి తెలియజేశాడు. అన్నీ విన్న శివశంకరం నీరసించిపోయాడు. పన్నెండు రోజులు రోజూ ఉదయమే కృష్ణ ఒడ్డుకు వెళ్లి స్నానాలు చేస్తే ఆరోగ్యం పాడవుతుందని భావించాడు. ఆరోగ్యం పాడయితే ఆఫీసు పని దెబ్బతింటుంది ... అమ్మో ... గుండెపై చేత్తో రాసుకున్నాడు. తమ్ముడిచేత కార్యక్రమాలు చేయించి తను ప్రేక్షకపాత్ర వహిస్తే సరిపోతుందని తలచాడు. తండ్రికి అంత్యక్రియలు, తదుపరి కార్యక్రమాలు చేయడం తనవల్ల కాదని భానుమూర్తి భావించాడు. పెద్దల జోక్యంతో తండ్రికి అంత్యక్రియలు, దశదిన కార్యక్రమాలు జరిపే భారం మీదవేసుకోక తప్పదని గ్రహించాడు శివశంకరం దహన కార్యక్రమం పూర్తిచేసుకుని శ్మశానం నుండి తిరిగి వచ్చారు అన్నదమ్ములు. దీపానికి దండం పెట్టుకున్నారు. భోజనాల తరువాత అంత్యక్రియలకు హాజరైన బంధువులు నిష్క్రమించారు. సాయంత్రం దశదిన కార్యక్రమాలు, ఆ తరువాత రెండు రోజులు చేయవలసిన కార్యక్రమాలు తెలియజేసి మొత్తం కార్యక్రమానికి, దానాలకు లక్ష రూపాయలవుతుందన్నారు పంతులుగారు.‘‘అమ్మో ... అంత ఖర్చే ... దానాలు అంతంత ఇవ్వనవసరం లేదు. మొత్తం ఇరవై వేలలో కానిచ్చేయండి’’ అన్నాడు భానుమూర్తి. లెక్కలు వేయడంలో ఎక్స్పర్ట్ అతను. శివశంకరం ఇరవై వేలు మరీ తక్కువని ముప్పయి వేలలో పూర్తి చేయమన్నాడు. విషయం శాంతకుమారి చెవిన పడింది.‘‘మీ నాన్నగారి జీవితం ఏ లోటూ లేకుండా సాగింది. ఆయన చనిపోయాక చేయవలసిన కర్మలలో ఏలోటూ రాకూడదు. కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగాలి. దానాలు కూడా స్వీకరించినవారికి సంతృప్తికరంగా ఉండాలి. మీ నాన్నగారి పేర సేవింగ్స్ బ్యాంకులో నాలుగైదు లక్షల బ్యాలెన్స్ వుంది. ఆ డబ్బు తీయండి. మీ చేతినుండి ఏమీ ఇవ్వనవసరం లేదు.పంతులు గారు చెప్పినట్లు లక్ష రూపాయలు ఖర్చుపెడదాం’’ తనయులను ఆదేశించింది శాంతకుమారి.అన్నదమ్ములు మరి మాట్లాడలేదు.రెండవ రోజునుండి వర్క్ ఫ్రవ్‌ు హోవ్‌ు ప్రారంభించాడు శివశంకరం. క్లయింట్స్ ఇన్కవ్ుటాక్స్ ఫైల్స్ అర్జెంటుగా చూడాలంటూ మూడవ రోజు హైదరాబాద్ వెళ్లి తొమ్మిదవ రోజు తిరిగి వచ్చాడు భానుమూర్తి. పది రోజులు స్కూలు మానేయడంతో పిల్లల చదువులు పాడయిపోతాయని సణుక్కున్నారు కోడళ్లు. శాంతకుమారి దుఃఖం వర్ణనాతీతం. ఆ పది రోజులు ఇంట్లో అందరికీ భారంగా గడిచాయి.గోపాలరావు బంధుమిత్రులు పదో రోజు ధర్మోదకాల కార్యక్రమాలలో పాల్గొన్నారు.పన్నెండోరోజు సాయంత్రం శివశంకరం, భానుమూర్తి హైదరాబాద్ ప్రయాణమయ్యారు. తల్లికి తోడుగా భ్రమరాంబ మరో రెండు రోజులుండి రాజమండ్రి వెళ్లిపోయింది. ఒంటరిగా మిగిలిన శాంతకుమారికి భవిష్యత్తు శూన్యమనిపించింది. మాటిమాటికీ భర్త గుర్తుకు వస్తున్నాడు. గదుల్లో తిరుగుతుంటే భర్త వెన్నంటి వున్నట్లు ఫీలవసాగింది. కుర్చీలో కూర్చుంటే ఎదురుగా భర్త ఉన్నట్లు, కబుర్లు చెపుతున్నట్లు అనిపిస్తోంది. డైనింగ్ టేబుల్ పై కంచంలో అన్నం వడ్డించుకుంటే ... ఎదురుగా భర్త లేనిలోటు మనసును పిండింది. ముద్ద నోట్లోకి వెళ్ళక కంచం వదిలి లేచిపోయిందిశాంతకుమారి. మంచం మీద బోర్లా పడుకుని విలపిస్తుంటే తలగడ తడిసిపోయింది. సాయంత్రానికి నీరసం ఆవహించింది. ఫోను మ్రోగింది. బలవంతంగా రిసీవర్ ఎత్తి ‘‘హల్లో’’ అంటే ‘‘ఏం చేస్తున్నావమ్మా’’ అంటున్న కూతురు.ఏడుపు శబ్దం వినిపించి ఉలిక్కిపడింది భ్రమరాంబ.‘‘బాధపడకమ్మా... తేరుకోవాలి... పోయినవాళ్లతో మనం పోలేం కదా... గుండె చిక్కబట్టుకో... పిల్లల్ని, మనవల్ని గుర్తుతెచ్చుకో... నాతో రమ్మంటే రానన్నావు... నేనొచ్చి అక్కడ వుందామంటే నేను లేందే ఆయనకు, పిల్లలకు ఇక్కడ క్షణం గడవదు... అన్నం తిన్నావా...’’ ఆప్యాయంగా మాట్లాడింది కూతురు.‘‘ఊ’’ అని శాంతకుమారి ఎక్కువ మాట్లాడలేకపోయింది. ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ... మరో పది రోజుల తరువాత ఓ ఆదివారం భ్రమరాంబ భర్తతో కలిసి తల్లిని చూడడానికి వచ్చింది.చిక్కిశల్యమైన శాంతకుమారిని చూసి కంటతడి పెట్టింది. అత్తగారిని తమ ఇంటికి వచ్చేయమన్నాడు అల్లుడు.శాంతకుమారి ఆ ఇల్లు వదలిరాలేనంది. ‘‘నెమ్మదిగా కోలుకుంటున్నాను. ఆయన జ్ఞాపకాలు వెన్నంటుతున్నాయి. ఆయన స్మృతుల మధ్య బ్రతుకుతున్నాను. ఈ ఇంటికి తాళం వేయలేను.’’ అల్లుడి అభ్యర్థనను సున్నితంగా త్రోసిపుచ్చింది అత్తగారు.ప్రకాశరావు భార్యతో ఏంచేయాలా అని ఆలోచించాడు. ఆరు గదుల ఇంట్లో అత్తగారు ఒక్కరే ఉండటం కష్టమే ననుకున్నాడు. ఎవరైనా తోడుంటే బాగుండుననియోచించాడు. త్రీ బెడ్ రూవ్‌ు, హాలు, కిచెన్ ఉన్న ఇంటిని పరిశీలించాడు.‘‘దక్షిణం వైపు ఉన్న రెండు బెడ్రూమ్లని కలిపి చిన్న ఫ్యామిలీకి అద్దెకివ్వవచ్చు. పెరటివైపు గుమ్మం పెడితే సరిపోతుందని’’ అత్తగారిని ఒప్పించాడు.ఆరోజే మేస్త్రీని పిలిచి ఆ ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. తల్లికి ధైర్యం చెప్పి సోమవారం ఉదయం భ్రమరాంబ భర్తతో కలిసి రాజమండ్రి వెళ్ళిపోయింది. వారం రోజుల్లో గుమ్మం పెట్టే కార్యక్రమం పూర్తయింది. బెడ్రూవ్ు కి, హాలుకి మధ్య ఉన్న తలుపు క్లోజ్ చేస్తే పెరటి వైపు రెండు గదుల పోర్షన్ సెపరేట్ అయింది.టు–లెట్ బోర్డు పెట్టిన మరునాడు ఒక జంట చూడటానికి వచ్చారు.వారిద్దరికీ నెల రోజుల క్రితమే వివాహం జరిగిందని చెప్పారు. అతని పేరు చంద్రకాంత్ ... భార్య మంజుల... చంద్రకాంత్ ఎవ్ుఎస్సీ చదివాడు. ప్రయివేటు స్కూల్లో టీచరుగా చేస్తున్నాడు.ఈ వివరాలు చెప్పి ‘‘అద్దె ఎంత’’ అని అడిగారిద్దరూ.ఇద్దరి మాటతీరు శాంతకుమారిని ఆకట్టుకుంది. చంద్రకాంత్ పెద్దగా మాట్లాడకపోయినా మంజుల గలగలా మాట్లాడుతోంది.‘‘నేను ఇంటిపై సంపాదించాలని అద్దెకివ్వడం లేదు. నాకు కాస్త మాట సహాయం చేస్తారని అద్దె కిస్తున్నాను. మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి’’ చెప్పింది శాంతకుమారి. వారు చెప్పిన మొత్తానికి శాంతకుమారి అంగీకరించింది.రెండురోజుల్లో మంచిరోజు చూసుకుని ఆ పోర్షన్ లోకి ప్రవేశించారు చంద్రకాంత్ దంపతులు.‘‘ఏం చేస్తున్నారు అత్తయ్యగారూ’’ అంటూ భర్త స్కూలుకు వెళ్లగానే శాంతకుమారిని పలకరించింది మంజుల.శాంతకుమారి వెనకే ఇంట్లో తిరుగుతూ ఆమె కుటుంబ విషయాలు ఆరాతీసింది.చాలాకాలం నుండి పరిచయమున్న వ్యక్తిలా కలివిడిగా తిరుగుతున్న మంజులను చూసి అబ్బురపడిందిశాంతకుమారి. తన భర్త మంచితనం, ఉపకార స్వభావం, ఎవరికీ కలలోనైనా హాని తలపెట్టని తత్వం వివరించింది శాంతకుమారి.తన తండ్రి చిన్న ఉద్యోగస్తుడనీ, తాను డిగ్రీ చదివానని, భర్త పోస్ట్‌గ్రాడ్యుయేట్ అని వివరించింది మంజుల.సాయంకాలం భర్త స్కూలునుండి వచ్చేవరకు శాంతకుమారితో కబుర్లు చెపుతూ గడిపింది మంజుల. మరోవారం తరువాత ఆదివారం మధ్యాహ్నం భోజన సమయానికి అప్పడాలు వేయించి మంజులకు ఇచ్చింది శాంతకుమారి ‘‘ఇంగువ అప్పడాలు మావారికి చాలా ఇష్టం ... మీరూ రుచిచూడండి’’ అంటూ.ఆ మరునాడు ...‘‘మావారి జీతం మా కుటుంబ నిర్వహణకి అంతంతమాత్రంగా సరిపోతుంది. నేను ఖాళీగా కూర్చోకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలనుకుంటున్నాను. నా చదువుకి పెద్ద ఉద్యోగాలేం రావు. నిన్న మీరిచ్చిన అప్పడాల రుచి చూశాక నాకో ఐడియా వచ్చింది. అప్పడాలు చాలా రుచిగా వున్నాయి. మీరు సహాయం చేస్తే అప్పడాలు తయారుచేసి షాపులకు సరఫరా చేద్దామనుకుంటున్నాను. మీదగ్గర పిండి కలపడం నేర్చుకుంటాను. అలాగే వడియాలు పెట్టడం నేర్పండి ...’’ అడిగింది మంజుల మాటల సందర్భంలో.‘‘దానికేం భాగ్యం ... నా చేతిలో విద్య. నీతో నేనూ చేతులు కలుపుతా ... అప్పడాలు పిండి కలపడమే కాదు ... వత్తిపెడతాను కూడా ... నాకూ కాస్త కాలక్షేపమవుతుంది’’ అంగీకరించింది శాంతకుమారి.నాలుగు రోజుల తరువాత ...ఓ మంచిరోజున విఘ్నేశ్వరుని పూజించి, శాంతకుమారి కాళ్ళకు దండంపెట్టి, మొదటి అప్పడం వత్తింది మంజుల.తనూ అప్పడాల కర్ర తీసి పని ప్రారంభించింది శాంతకుమారి.వత్తిన అప్పడాలను ఎప్పటికప్పుడు డాబాపై ఎండబెట్టింది మంజుల.వారం రోజుల తరువాత అప్పడాల ప్యాకెట్లు తయారుచేసి ‘‘అమ్మకం అయ్యాకే డబ్బు ఇస్తామన్న’’ ఒప్పందంపై అప్పడాల ప్యాకెట్లు షాపుల్లో పంచింది మంజుల.తరువాత గుమ్మడికాయ వడియాలు తయారుచేసి షాపులకు పంచింది.కొన్నవాళ్లు మళ్లీ అవే అప్పడాలు కావాలని షాపుల్లో ఎంక్వయిరీలు చేస్తుండడంతో నెల రోజులలోనే మంజుల బ్రాండ్ అప్పడాలకు గిరాకీ పెరిగింది. షాపు ఓనర్లే ఫోను చేసి మరికొన్ని ప్యాకెట్లు పంపమని ఆర్డర్లు పంపసాగారు. మంజుల, శాంతకుమారిలకు తీరిక లేకుండాపోయింది. ఆలోచించే తీరిక లేని శాంతకుమారి మానసిక వేదన క్రమంగా ఆవిరవసాగింది.చంద్రకాంత్, మంజులలు ఇంట్లో వ్యక్తుల్లా కలిసిపోవడంతో శాంతకుమారికి మానసిక ధైర్యం లభించింది. ఆరు నెలలు గడిచాయి. ఏభైవేల రూపాయలు తెచ్చి శాంతకుమారి చేతిలో పెట్టింది మంజుల, ‘‘అత్తయ్యగారూ ... మీ రుణం తీర్చలేనిది’’ అంటూ.‘‘నా మానసిక వేదనకి ఉపశమనం కలిగించావు. నువ్వు చేసిన ఉపకారం నిర్వచించలేనిది’’ అని మంజుల ను ఆశీర్వదించి డబ్బు తిరిగి యిచ్చింది శాంతకుమారి.మంజుల వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుండడంతో శాంతకుమారి మంజులను అభినందించింది.శాంతకుమారిని చదవమంటూ భారత, భాగవత, రామాయణ గ్రంథాలు తెచ్చియిచ్చాడు చంద్రకాంత్. శాంతకుమారికి గ్రంథపఠనంతో కాలం పరుగెడుతున్నట్లే తెలియడంలేదు. గ్రంథపఠనం ఆమెకు వింత అనుభూతినిచ్చింది. మానసిక ప్రశాంతత కూర్చిందిగోపాలరావు మరణించి సంవత్సరం గిర్రున తిరిగింది.సంవత్సరీకాలకు శివశంకరం, భానుమూర్తి, భ్రమరాంబ కుటుంబ సమేతంగా వచ్చారు.బంధువులందరూ వచ్చి వెళ్లారు.శాంతకుమారి ఆదేశంతో గోపాలరావు సంవత్సరీకాల కార్యక్రమం శాస్తోక్త్రంగా జరిపించబడింది.శాంతకుమారి అన్ని విషయాలలో మంజుల సహాయం తీసుకోవడం శివశంకరం భార్య వినీతకు నచ్చలేదు.‘‘ఆ మంజుల మీ అమ్మగారిని బాగా బుట్టలో వేసుకొంది. మీ అమ్మగారు కూడా ఆ మంజులనే ప్రతి విషయంలోనూ సంప్రదిస్తున్నారు. అత్తయ్యగారు అత్తయ్యగారు అంటూ మంజులరాసుకు పూసుకు తిరుగుతోంది. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్లిపోయాక పెద్దావిడతో మరింత సఖ్యత పెంచుకుని అత్తయ్యగారి దగ్గరున్న డబ్బూ, నగలూ ఆమె హస్తగతం చేసుకున్నా అడిగే దిక్కుండదు. మీ అమ్మగారిని ఆస్తి పంపకం చేయమని మన వాటా మనం పట్టుకుపోవడం శ్రేయస్కరం’’ చెప్పింది వినీత.భార్య మాటలను సీరియస్ గా తీసుకున్నాడు శివశంకరం. తమ్ముడితో సంప్రదించాడు. అన్నయ్య చెప్పిన విషయం వినగానే తమ్ముడి మనసులో మంజులపై అనుమాన బీజం మొలకెత్తింది.అన్నదమ్ములిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. కొడుకులిద్దరూ ఆస్తి పంచమనగానే శాంతకుమారి ఆశ్చర్యపోయింది. ‘‘ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది’’ అడిగింది నీరసంగా.‘‘ఈ ఇల్లు అమ్మేసి చెరిసగం తీసుకుని హైదరాబాదులో మరింత విలువైన ఆస్తిని కొనుక్కుంటాం. నాన్నగారి పేర ఉన్న డిపాజిట్లు, నీ దగ్గరున్న బంగారం కేష్ చేసుకుని షేర్లలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరిని లాభాలొస్తాయి. అయినా ఆర్థిక విషయాలు నీకంత అర్థంకావు. తమ్ముడు సీఏ కదా, వాడికి పెట్టుబడుల విషయం బాగా తెలుసు ... ఇక నీ విషయం ... నువ్వు మాతో హైదరాబాదు వచ్చేద్దువు గాని ... సంవత్సరంలో ఆరు నెలలు మా యింట్లో, మరో ఆరునెలలు తమ్ముడి ఇంట్లో ఉండవచ్చు ... మాతో వుంటే నీకు ఖర్చు ఏమీ ఉండదు కనుక నీ పెన్షన్ బ్యాంకులో దాచుకోవచ్చు. ఆస్తి పంచకపోతే ఇవన్నీ కుదరవు ... ఇప్పుడు వెంటనే మాతో వచ్చేయి. ఇల్లు అమ్మకం పెడదాం. రేపే బ్యాంకులోడబ్బు డ్రా చేసేద్దాం ...’’ విపులంగా వివరించాడు శివశంకరం.తనయుల మనసులో భావాన్ని తల్లి గ్రహించగలిగింది.ఇల్లు అమ్మి ఆస్తి పంచేసి కొడుకుల పంచన చేరితే తన విలువ దిగజారుతుందని ఆమెకు తెలుసు.కాస్సేపు ఆలోచించింది శాంతకుమారి. భర్తను మనసులో తలచుకుంది.బ్రతికుండగా భర్త ఇచ్చిన విలువైన సలహాలు గుర్తుచేసుకుంది. ‘‘ధనమూలమిదం జగత్’’ అన్న విషయం శాంతకుమారికి తెలుసు.తనిప్పుడు కొడుకుల అభ్యర్థనకు తలొగ్గితే భావిజీవితం బాధాకరంగా ఉండక తప్పదని భావించింది.మనసు ధృఢపరచుకుంది.తాము ఏంచెప్పినా కాదనలేని బలహీనురాలు తమ తల్లి అని భావిస్తున్న కొడుకులవైపు సాలోచనగా చూసి సులోచనాలు సవరించుకుంది. తల పైకెత్తింది. ఆమె గొంతు గంభీరంగా మారింది.‘‘మీ మాట కాదంటున్నందుకు అన్యధా భావించకండి. బ్యాంకు డిపాజిట్లను పుణ్యకార్యాలకు, దానధర్మాలకు వినియోగిద్దామనుకుంటున్నాను. నేను బ్రతికున్నంతకాలం ఈ ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను. మీ నాన్నగారు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలపరచుకున్న ఈ గూడుని వదలి నేనుండలేను. నేను బ్రతికుండగా ఈ యిల్లు అమ్మే ప్రసక్తి లేదు. నా తదనంతరం ఈ యిల్లు, మిగిలిన బ్యాంకు బ్యాలన్స్ మీ ఇద్దరే కాదు భ్రమరాంబతో కలిపి ముగ్గురూ పంచుకోండి. మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు హైదరాబాదు వచ్చి మీ ఇళ్లలో ఉండగలిగినన్ని రోజులుంటాను. మీకు సెలవులు కుదిరినప్పుడు మనవళ్లతో వచ్చి నన్ను సంతోషపెట్టండి. ఇదే నా తుది నిర్ణయం ...’’ ఆత్మవిశ్వాసంతో ప్రకటించింది శాంతకుమారి. - ఇంద్రగంటి నరసింహమూర్తి -
వైరల్: గంటల తరబడి సైలెంట్‌గా చదువుకుంటున్నాడు!
ఈ కాలంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో.. ఎందుకు అవుతుందో తెలియనే తెలియదు. కుర్రకారు ఇష్టాయిష్టాలు ఎప్పుడు, ఎలా మారతాయో కూడా అంత ఈజీగా అంచనా వేయలేం. వైరల్ అవడం అంటే ఏంటి.. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడం అంతేకదా! ఒక్కోసారి యూట్యూబ్‌లో పెట్టే వీడియోలకు క్షణాల్లో వీక్షకుల సంఖ్య కోట్లకు చేరుకుంటుంది. ఆ వీడియోలకు క్రేజ్ అలా ఉంటుంది మరి. సాధారణంగా పాటలు.. డ్యాన్స్ షోలు.. కామెడీ.. ఆట పట్టించే వీడియోలు, సమాచారం ఉన్న వీడియోలు.. ఇలా చాలా రకాల వీడియోలను యువత ఇష్టపడుతుంది. అయితే వీటన్నింటికీ భిన్నంగా దక్షిణ కొరియాకు చెందిన ఓ కుర్రాడు యూట్యూబ్‌లో తెగ హల్చల్ చేస్తున్నాడు. మరోలా చెప్పాలంటే సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంతకీ ఆ పిల్లాడు ఆ వీడియోల్లో ఏం చేస్తున్నాడనే కదా మీ అనుమానం. చదువుకుంటున్నాడు.. అవును గంటల తరబడి సైలెంట్‌గా చదువుకుంటున్నాడు. తాను చదువుకునేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాడు. అంతే వేల మంది అతడి వీడియోలను తెగ చూసేస్తున్నారు. ఆ అబ్బాయి పేరు బోట్ నో జామ్. యూట్యూబ్‌లో తన చానెల్‌కు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 3.3 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారట. తాను పోలీస్ అధికారి అయ్యేందుకు పరీక్షల కోసం సిద్ధం అవుతున్నానని చెబుతున్నాడు. ఇప్పుడు దక్షిణ కొరియాలో బోట్ ఒక సెన్సేషన్ అయ్యాడు. చూశారా.. సైలెంట్ కూడా ఎలా సెన్సేషన్ అయిపోతుందో. -
గుర్తుపెట్టుకోవలసిన సంతోషం
కాసేపటి తర్వాత ఇద్దరు మిత్రులూ మళ్లీ మౌనంగా నడక సాగించారు. దారిలో ఓ చోట ఓ నీటి గుంట కనిపించింది. ఇద్దరూ కలిసి ఆ నీటిగుంటలోని నీటిని తాగేందుకు గుంటలోకి దిగారు. ఇద్దరు మిత్రులు ఒక ఎడారిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఉన్నట్టుండి వారి మధ్య ఓ విషయమై వాదన మొదలైంది. అది తారస్థాయికి చేరింది. కోపం తట్టుకోలేకపోయిన వ్యక్తి తటాలున తన మిత్రుడిపై చెయ్యి చేసుకున్నాడు. అయితే దెబ్బలు తిన్న వ్యక్తి ఏమాత్రం ఆవేశపడకుండా ఓ పక్కకు వెళ్లి దగ్గర్లోనే ఉన్న ఇసుక దిబ్బపై ప్రశాంతంగా కూర్చుని, అక్కడున్న ఓ పుల్లను తీసుకుని ఆ ఇసుకతిన్నెపై ఇలా రాశాడు. ‘‘ఈ రోజు నా ప్రాణస్నేహితుడు నన్ను బలంగా కొట్టాడు’’ అని! కొట్టిన మిత్రుడికి తన మిత్రుడి వైఖరి అర్థం కాలేదు. కాసేపటి తర్వాత ఇద్దరు మిత్రులూ మళ్లీ మౌనంగా నడక సాగించారు. దారిలో ఓ చోట ఓ నీటి గుంట కనిపించింది. అంతకు కొద్దిసేపటి క్రితం తమ ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని వారు మరచిపోయారు. ఇద్దరూ కలిసి ఆ నీటిగుంటలోని నీటిని తాగేందుకు గుంటలోకి దిగారు. ఇంతలో మిత్రుడితో దెబ్బ తిన్న వ్యక్తికి తన కాలిని ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. నిజానికి అది లాగడం కాదు, అతని కాలు బురదలో కూరుకుపోతోంది. మిత్రుడి స్థితి గమనించిన రెండో వ్యక్తి అతనిని ఎలాగో కష్టపడి గుంటలోంచి పైకి చేర్చాడు. ప్రాణాలతో బయటపడ్డ ఆ మిత్రుడు అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ రాతిమీద కూర్చొని, అక్కడే ఉన్న ఓ రాయి తీసుకుని దానితో తాను కూర్చున్న రాతిమీద ఓ పక్కగా ఇలా రాశాడు: ‘‘ఈరోజు నా మిత్రుడు నన్ను రక్షించాడు’’ అని.ఇది చూసిన మిత్రుడు ‘‘నేను నిన్ను కొట్టినప్పుడు ఇసుకలో రాశావు. ఇప్పుడేమో కాపాడితే రాతి మీద రాశావు! వీటి అర్థమేమిటీ’’ అని అడిగాడు. అప్పుడు ఆ మిత్రుడు ఇలా జవాబిచ్చాడు.‘‘ఎవరయినా మనల్ని గాయపరచినప్పుడు దానిని ఇసుకపై రాయాలి. అప్పుడు క్షమించడమనే గాలి దానిని చెరిపేస్తుంది. ఒకవేళ ఎవరైనా మంచో మేలో చేస్తే దానిని రాతి మీద రాయాలి. అది కాలాలను దాటి ఎప్పటికీ చెక్కుచెదరక ఉంటుంది’’ అని! జీవితంలో కూడా మరచిపోవలసిన బాధలను ఇసుక మీద రాసుకోవాలి. గుర్తుపెట్టుకోవలసిన సంతోషాలను రాతి మీద బలంగా రాసుకోవాలి. అప్పుడే జీవన మాధుర్యాన్ని అనుభవించగలం. -
మౌనం మంచిదే... కానీ?
ఆత్మీయం మాట వెండి అయితే, మౌనం బంగారం అని ఆంగ్లంలో ఓ సామెత ఉంది. బంగారానికి నానాటికీ విలువ పెరిగినట్టుగానే మౌనానికి కూడా విలువ పెరుగుతుందే కాని తరగదు. మౌనం వల్ల శరీరక్రియ క్రమబద్ధమై ముఖం తేజోవంతమయ్యి, చుట్టూ కాంతి వలయం కనపడుతుంది. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం మానవుని ఆయుష్షును పెంచడమే కాక ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అందుకే మునులు అందరి మన్ననలు పొందారు. మృతులకు ఆత్మశాంతి కలిగించేందుకు రెండు నిమిషాలు మౌనం పాటించడం మనకు తెలిసిందే! పుస్తకం పెదవి విప్పకుండా మౌనంగానే పుటలకొద్దీ విలువైన సమాచారాన్ని బోధిస్తుంది. అయితే... మాట్లాడటం ఒక అందమైన కళ. మౌనం అంతకన్న అద్భుతమైన కళ అని గాంధీ మహాత్ముడంటే, మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చునని స్వామి వివేకానంద బోధించారు. ఎందుకంటే మనస్సుని భౌతిక ప్రపంచం వైపు వెళ్లకుండా పరమాత్మలో లీనం చేసేదే నిజమైన మౌనం. మౌనం వల్ల అజ్ఞానం నశిస్తుంది. అంతఃకరణ శుద్ధి అవుతుంది. ధనాత్మక శక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యోగా తరగతులు బోధించేటప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఒనగూరే లాభాలను కూడా తప్పనిసరిగా చెబుతారు. ప్రకృతిని గమనిస్తే వృక్షాలు, పశు, పక్షి, జంతుజాలాదులన్నీ మౌనంగానే పుడతాయి, పెరుగుతాయి, ఫలదీకరణ చెందుతాయి. లోకాలను చుట్టి వచ్చే ఆదిత్యుడు, తారాచంద్రులు మౌనంగానే సంచరిస్తూ, మౌనంగానే తమ విధులను నిర్వహిస్తున్నారు. ఆత్మదర్శనానికి మౌనదీక్ష తప్పనిసరి! అలాగని అన్ని వేళల్లోనూ మౌనాన్నే ఆశ్రయించడం సరికాదు. ముఖ్యంగా నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది కాబట్టి ఆ సమయంలో మౌనాన్ని ఆశ్రయించరాదు. ►నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది. -
నారావారు నోరు మెదపరు.
-
నారావారు నోరు మెదపరు
రాష్ట్రం అన్నీ కోల్పోతున్నా అదే మౌనం పదో షెడ్యూల్ ఆస్తుల్లో వాటా పోతున్నా మాట్లాడని బాబు ► కేంద్రాన్ని గట్టిగా నిలదీయకుండా మీనమేషాలు ► రెవెన్యూలోటు భర్తీకి నిధులడగరు ► ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దంటారు ► కమీషన్లకోసం పోలవరం మేమే కడతామంటారు ► విభజన చట్టంలోని ఏ ఒక్క హామీకోసం గట్టిగా ప్రయత్నించరు ► రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లరు ► ఢిల్లీలో కేంద్రానికి పొగడ్తలు... రాష్ట్రంలో బీద అరుపులు సాక్షి, అమరావతి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి హక్కుగా రావాల్సిన అంశాలపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విభజన చట్టంలోని పదవ షెడ్యూలులో గల 142 సంస్థలకు చెందిన రూ.36,835.43 కోట్ల ఆస్తుల పంపిణీ విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ఆయన గట్టిగా ప్రయత్నించకపోవడమే కారణమని అధికార, ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి. జనాభా నిష్పత్తి మేరకు ఈ ఆస్తుల్లో ఏపీకీ 58 శాతం వాటా రావాల్సి ఉండగా... ఇప్పుడు కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో ఆస్తుల్లోవాటా కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పకపోవడం దారుణమని అధికారులు, మేధావులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఇన్ని వేల కోట్లు ఆస్తులు ఏపీకి రాకుండా జరిగిన అన్యాయాన్ని కనీసం ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ అంశంపై ఒక విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయలేదంటే రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఆయనకెంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లినా, ప్రధానమంత్రిని కలిసినా రాష్ట్రానికి సంబంధించిన నిధులను రాబట్టే విషయంలో గట్టిగా పట్టుబట్టకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని ఉద్యోగులు, రాష్టŠట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తేవాల్సిన ముఖ్యమంత్రే ప్రత్యేకహోదా సంజీవని కాదంటూ పలుమార్లు వ్యాఖ్యానించడం, లేని ప్యాకేజీని ఇచ్చినట్లు ప్రచారం చేసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం... రైల్వేజోన్ విషయంలో నోరు మెదపకపోవడం, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించలేకపోవడం, విభజన చట్టంలోని పలు హామీలు అమలు కాకపోయినా పట్టించుకోకపోవడం ముఖ్యమంత్రి ఉదాసీనతకు అద్దం పడుతోందని దుయ్యబడుతున్నారు. రాష్ట్రానికి సంజీవనిలాంటి పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి ఇస్తామని చెప్పినా, పట్టుబట్టి మేమే నిర్మిస్తామంటూ తెచ్చుకోవడంతో వేల కోట్ల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్నో అవమానాలను భరిస్తున్నానంటూ పదే పదే చెప్పే చంద్రబాబు... రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసం గత మూడేళ్లుగా ఢిల్లీలో నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు పదవ షెడ్యూలులో గల సంస్థల ఆస్తుల విషయంలోను సీఎం ఇదే ధోరణి అనుసరించడం దారుణమని ఉద్యోగులు వాపోతున్నారు. ఏపీకి వాటాకోసం ప్రయత్నించని సీఎం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిగా ఉన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటైన పలు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇనిస్టిట్యూషన్స్‌కు చెందిన ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వాటాకోసం గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా గట్టి ప్రయత్నం చేయకపోవడంతో రూ.36,835.43కోట్ల విలువైన ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ తెలంగాణలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఆ సంస్థలన్నీ ఏర్పాటైనందున ఆ ఆస్తుల్లో ఏపీకి తప్పకుండా వాటా ఉందని విభజన చట్టంలో పొందుపరిచారు. పదవ షెడ్యూలులో గల 142 సంస్థలకు మొత్తం రూ.36,835.43 కోట్ల విలువగల ఆస్తులున్నట్లు అధికారులు లెక్కగట్టారు. ఇందులో 120 సంస్థలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసినందున ఈ సంస్థల్లో రాష్ట్రానికి జనాభా నిష్పత్తి మేరకు ఏపీకీ 58 శాతం వాటా రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో ఆస్తుల్లోవాటా కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పకపోవడం దారుణమని అధికారులు, మేధావులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌పై పదేళ్ల పాటు హక్కు ఉన్నప్పటికీ ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి దొరికిపోవడంతో అర్ధంతరంగా హక్కులన్నీ వదిలేసుకుని విజయవాడకు వచ్చేశామని, ఇప్పుడు ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నా నోరు మెదపకపోతే ఎలాగని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి మౌనంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి నిధుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని, చివరకు ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో... రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తగ్గేదిలేదంటూ మంత్రివర్గంలో చర్చించినట్లు తమ అనుకూల పత్రికల్లో రాయించుకోవడం తప్ప ఆ దిశగా ప్రయత్నాలేమీ జరగడంలేదని విమర్శిస్తున్నారు. ఎన్నో కోల్పోయాం.. ఇంకా కోల్పోతున్నాం.. విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేకహోదా, రైల్వేజోన్, పోలవరం, ఇతర హామీల అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి బలమైన ప్రయత్నాలు చేయకపోవడంతో ఇప్పటికే తీరని నష్టం జరిగింది. రాష్ట్రం విడిపోయిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు పూర్థి స్థాయిలో రెవెన్యూ లోటు భర్తీ చేయకపోయినా ముఖ్యమంత్రి దానిపై మాట్లాడిన దాఖలాలు లేవు. అధికారులు ఆర్థిక లోటు రూ.16,078 కోట్లుగా తేల్చగా.. ఇప్పటివరకు కేవలం రూ.3,979 కోట్లకు మించి సాధించలేకపోయారు. అలాగే విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టుల్లో 90 శాతం కేంద్రం భరించబోమని ప్రకటించినా సీఎం మౌనం వహించడాన్ని అధికారులు, మేధావులు తప్పుబడుతున్నారు. విభజనచట్టంలో పేర్కొన్న దుగరాజపట్టణం ఓడరేవును సాధించలేకపోయారు. అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇప్పటివరకూ అడుగు ముందుకు పడలేదు. అధ్యయనానికి మరో కమిటీ ఏర్పాటు చేసినా ఎటువంటి పురోగతీ లేదు. రైల్వే జోన్ ఏర్పాటుతోపాటు విభజన చట్టంలోని హామీలకోసం ఇప్పటివరకూ గట్టిగా పోరాడలేదు. రాజధానిలో ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.43 వేల కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే ఇస్తామని పేర్కొంది. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయడం లేదు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చుతున్నారని, కేంద్రం నుంచి చట్టం మేరకు రావాల్సిన నిధులను, సంస్థలను, విభజన నష్టాలను రాబట్టలేకపోతున్నారని మేధావులు, అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తూతూమంత్రంగా ధిక్కార పిటిషన్ ఉన్నత విద్యామండలి నిధుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులపై కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిందని, ఈ ఆదేశాలు సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కారం కిందకు వస్తాయని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని, ఈ అంశాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి పేర్కొనడం పట్ల అధికారవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ వెళ్లి స్వయంగా ప్రధానిని కలిసి పట్టుబట్టి సాధించాల్సిన ముఖ్యమంత్రి... తూతూమంత్రంగా కేంద్రమంత్రులను కలవమనడం వల్ల ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ఏదో చేస్తున్నామన్న భావన కల్పించడానికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెబుతున్నారని విమర్శిస్తున్నారు. పదవ షెడ్యూల్ మేరకు హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమైన సంస్థల్లో కొన్ని ► ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ ► డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ► సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ► ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ► బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ► ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ► ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ► ఏపీ ఉర్దూ అకాడమీ ► హిందీ అకాడమీ ► తెలుగు అకాడమీ ► సంస్కృత అకాడమీ ► జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ► ఏపీ వక్ఫ్ బోర్డు ► ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ► ఏపీ ఉమెన్స్ కమిషన్ ► డాక్టర్ వైఎస్సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ -
నారావారు నోరు మెదపరేం!
-
మితభాషి ఉర్జిత్
దేశ ప్రజలపై ఉత్పాతంలా వచ్చిపడిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పూర్వాపరా లేమిటో, దాని పర్యవసానాలేమిటో తెలుసుకుందామని ఎంతో ఆశతో ఎదురు చూసినవారికి బుధవారం జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం అసంతృప్తి కలిగించి ఉంటుంది. నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు గురించి ప్రకటించడం... మరికొన్ని గంటల్లో అమల్లోకి రావడం, ఆ మరుసటి రోజు నుంచి ఏటీఎంల ముందూ, బ్యాంకుల ముందూ పడిగాపులు పడటం మినహా సామాన్య పౌరులకు ఏం జరిగిందో, జరుగుతున్నదో అర్ధంకాలేదు. చాలా సందేహా లకు ఈనాటికీ జవాబులేదు. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సవాళ్లు విసురుకున్నారు. దేశ ప్రజలంతా ఈ నిర్ణయాన్ని వేనోళ్ల కీర్తిస్తున్నారని మోదీ మొదలుకొని కింది స్థాయి బీజేపీ నేతల వరకూ చెబితే... ఇది అనాలోచిత నిర్ణయమని విపక్షాలన్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనైనా ప్రభుత్వం దీనిపై సవివరమైన ప్రకటన చేస్తుందని, విపక్షాలు ఆ దిశగా ఒత్తిడి తెస్తాయని ఆశించినవారు ఆ సమావేశాల తంతు చూసి దిగ్భ్రమచెందారు. మొదలైన దగ్గర నుంచి ముగిసేవరకూ అవి వాయిదాల్లోనే గడిచిపోయాయి. ఇన్నాళ్లకు ఆర్ధిక శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ కమిటీ వంతు వచ్చింది. ఈ కమిటీ ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అసలు హాజరవుతారా లేదా అన్న సందేహాలు చాలామందికొచ్చాయి. అయితే ఆయన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కమిటీ సభ్యులడిగిన ప్రశ్నలకు జవాబులూ ఇచ్చారు. కానీ అవి సభ్యుల్ని సంతృప్తి పరచలేదని అంటున్నారు. సమయం సరిపోకపోవడంతో మరోసారి కూడా వారిని కమిటీ ముందుకు పిలుస్తారని చెబుతున్నారు. వాస్తవానికి ఇదే విషయంపై ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) కూడా ఈ నెల 20న సమావేశం కాబోతోంది. దానికి కూడా ఉర్జిత్ హాజరుకావలసి ఉంటుంది. స్థాయీ సంఘాలకు విపక్ష సభ్యుల నేతృత్వం ఉన్నప్పుడు... ఆ సంఘాలు సమీక్షించే అంశాలు సంచలనాత్మకమైనవి అయినప్పుడు ప్రశ్నలెప్పుడూ విచ్చుకత్తు ల్లాగే ఉంటాయి. సూటి ప్రశ్నకు సూటి జవాబు రాని స్థితి సాధారణంగా రెండు సందర్భాల్లో ఉంటుంది. సంధించిన ప్రశ్నకు జవాబు లేకపోవడంవల్ల లేదా జవాబివ్వడానికి పరిమితులు అడ్డొచ్చినప్పుడు నోరు పెగలదు. ఇచ్చే సమాధానం మరిన్ని ప్రశ్నలకు దారితీసే ప్రమాదం ఉంటే ఇక చెప్పనవసరమే లేదు. ఏ అవస్థ వల్ల ఉర్జిత్ సవివరమైన జవాబివ్వలేకపోయారో లేదా అరకొరగా ఇచ్చి ఊరు కున్నారో ఆయనే స్వయంగా చెబితే తప్ప ప్రజలకు తెలిసే అవకాశం లేదు. నిజానికి ఆయన జవాబివ్వని ప్రశ్నలేవీ జటిలమైనవి కాదు. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి ఎంత నగదు తిరిగొచ్చిందన్న ప్రశ్నకు సాధారణ బ్యాంకు ఉద్యోగి జవాబు చెప్పలేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇన్ని నెలల తర్వాత కూడా ఉర్జిత్ పటేల్ చెప్పలేకపోవడం అయోమయాన్ని కలిగిస్తుంది. తిరిగొచ్చిన నోట్ల విలువను మరోసారి లెక్కేయమని కింది బ్యాంకులకు రిజర్వ్‌బ్యాంక్ సూచిం చినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అందువల్లే జవాబు ఇవ్వలేకపోతే ఆ సంగతి కమిటీకి చెప్పడంవల్ల కలిగే నష్టమేమిటో అర్ధంకాదు. ఎప్పటికల్లా బ్యాంకింగ్ కార్య కలాపాలు సాధారణ స్థితికి చేరతాయన్న ప్రశ్న కూడా ఇటువంటిదే. ఈ రెండు అంశాలూ నిజానికి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నవి. వాటికి కనీసం స్థాయీ సంఘంలోనైనా జవాబులు రాకపోతే ఏమనుకోవాలి? ఉర్జిత్ ఆమాత్రం ఆలోచించ లేకపోయారా? స్థాయీ సంఘం సమావేశంలో ఉర్జిత్ నుంచి విస్పష్టమైన జవాబులు వచ్చి ఉంటే ఆయన పతాక శీర్షికలకు ఎక్కేవారు. ఆయనిచ్చిన వివరణలపై చానెళ్ల చర్చలు హోరెత్తేవి. కానీ ఆయనకు అలాంటి ఆసక్తి ఉన్నట్టు లేదు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మాత్రం అనుకోకుండా వార్తలకెక్కారు. మౌన మునిగా పేరుబడిన ఆయన కీలక సమయాల్లో చురుగ్గా ఉండగలనని, సమర్ధుడైన మధ్యవర్తిగా వ్యవ హరించి పరిస్థితిని చక్కదిద్దగలనని నిరూపించారు. సభ్యులు కటువుగా మాట్లాడు తుంటే రాజ్యాంగపరమైన సంస్థగా ఆర్బీఐని గౌరవించాల్సిన అవసరం ఉన్నదని హితవు పలకడమే కాక, ఒక ప్రశ్నకు ఇరకాటంలో పడిన ఉర్జిత్‌ను ఉద్దేశించి ‘దానికి మీరు జవాబు ఇవ్వనవసరం లేదు’ అని ఊరడించారట! ఉర్జిత్‌ను ఒకప్పుడు రిజర్వ్‌బ్యాంకుకు తీసుకొచ్చింది తానేనన్న ఆపేక్ష వల్లనో, ఆర్బీఐకి తాను సైతం గవర్నర్‌గా పనిచేసి ఉండటంవల్ల ఏర్పడిన సెంటిమెంటు వల్లనో మన్మోహన్‌లో కద లిక వచ్చి ఉంటుంది. ఈ సందర్భంగా మన పార్లమెంటరీ కమిటీల పనితీరు గురించి మాట్లాడు కోవాలి. ప్రజాపద్దుల కమిటీ ఉండటమన్న సంప్రదాయం బ్రిటిష్‌వారి కాలంలోనే మొదలుకాగా, వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కమిటీలు 1993 నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చాయి. వీటిని అమెరికా ప్రతినిధుల సభ కమిటీలతో, బ్రిటన్ పార్లమెంటు కమిటీలతో పోల్చవచ్చు. అయితే ఆ రెండుచోట్లా కమిటీలు పారదర్శకంగా పనిచేస్తాయి. ఆ కమిటీ సమావేశాలకు పౌరులు హాజరుకావొచ్చు. వాటి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. భవిష్యత్తులో ఎవరైనా చూడటానికి వీలుగా ఆ రికార్డుల్ని భద్రపరుస్తారు. ఆ రెండు దేశాల్లోని కమిటీల తరహాలోనే మన కమిటీలు కూడా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానాల్లోని లొసుగులను వెలికి తీస్తాయి. అందుకోసం ఎవరినైనా పిలుస్తాయి. ఏ పత్రాన్నయినా తమ ముందుంచ మని కోరతాయి. కానీ ఈ కార్యకలాపాలన్నీ గోప్యంగా జరుగుతాయి. ఇది సబబేనా? అమెరికా, బ్రిటన్ తరహాలో కమిటీలు పనిచేస్తే ప్రభుత్వ నిర్ణయాల్లోని మంచిచెడ్డలు పౌరులకు తెలుస్తాయి. కమిటీల ముందు నీళ్లు నమిలేవారి ఆంత ర్యాలు బయటపడతాయి. ప్రజల నిఘా ఉంటే కమిటీల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని చెప్పుకుంటాం. కానీ వాటి అనుబంధ సంఘాలు ఆ సంస్కృతికి అనుగుణంగా లేకపోవడం వింత కాదా? పార దర్శకత ప్రజాస్వామ్యానికి బలమే తప్ప విఘాతం కాదని గుర్తించడం అవసరం. అందుకనుగుణంగా మార్పులు చేయడం తప్పనిసరి. -
ఆర్బీఐ మౌనం అందుకేనా!
ఢిల్లీ: పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గడువు ఎల్లుండితో ముగుస్తోంది. అయితే ఇప్పటివరకు బ్యాంకుల్లో ఎన్ని నోట్లు డిపాజిట్ అయ్యాయి అన్న విషయంపై ఆర్బీఐ మౌనం పాటిస్తోంది. డిసెంబర్ 10 వరకు డిపాజిట్ అయిన సొమ్ము 12.44 లక్షల కోట్లుగా వెల్లడించిన ఆర్బీఐ.. అనంతరం జరిగిన డిపాజిట్లపై స్పందించడం లేదు. నవంబర్ 8న రద్దయిన నోట్ల విలువ 14.2 లక్షల కోట్లు కాగా.. సుమారు 2 లక్షల కోట్ల వరకు బ్యాంకుల్లో డిపాజిట్ కాదని కేంద్రం అంచనా వేసింది. డిసెంబర్ 10 నాటికే 12 లక్షల కోట్లు డిపాజిట్ అయినందున కేంద్రం అంచనా తప్పింది. ఈ క్రమంలో రద్దయిన నోట్ల విలువ కంటే అధికంగా బ్యాంకుల్లో డిపాజిట్లు జరిగాయా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో అంచనాలు తప్పడం మూలంగానే ఆర్బీఐ మౌనం పాటిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మోడీ మౌనంలోని ఆంతర్యం ఏమిటి?
పాట్నా: దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. రెండురోజులుగా దేశంలో దళితులపై దాడులు .జరుగుతున్నా మోదీ స్పందించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని లాలూ ప్రశ్నించారు. మోదీ ప్రోత్సాహంతోనే దేశంలో పేదలు,దళితులపై దాడులు జరుగుతున్నాయని ట్వీట్ చేశారు. లాలూ కుమారుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని ముందుగా దళితుల దాడులపై స్పందించాలని ట్వీట్ చేశారు. దానికి రిప్లేగా లాలూ ఈ ట్వీట్ చేశారు. గుజరాత్ లోని ఉనాలో దళితులు ఆవుల చర్మం ఒలిచారని వారిపై కొందరు గోసంరక్షణ కార్యకర్తలు దాడి చేసిస విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు బిహార్ లోని ముజఫర్ పూర్ లో ఇద్దరు దళతులపై దాడులు జరిగాయి. -
24మంది భార్యలు.. 200మంది పిల్లలు!
బీజింగ్ః బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండి, జీవితకాలాన్ని వీలైనంత పెంచుకునేందుకు ప్రతివారూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు చేసిన ప్రయత్నాలు , వారి సాధన ఒక్కోసారి తగిన ఫలితాలను కూడ ఇస్తుంటుంది. కానీ అరవై ఏళ్ళ ఆయుర్దాయం ఉండటమే కష్టంగా మారిన తరుణంలో ఓ వ్యక్తి వందేళ్ళు బతికితే ఎంతో గొప్పగా ఫీలవుతాం. నిజంగా గ్రేట్ అని సంబర పడిపోతాం. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి 256 సంవత్సరాలు బతికాడంటే నమ్ముతారా? ఎప్పుడూ ఎవ్వరూ జీవించనంతకాలం ఆయన బతికినట్లు ఇటీవల ఓ పత్రికా కథనం ద్వారా ఆధారాలు దొరికాయి. చైనాకు చెందిన లీ చింగ్ యన్ 1933 మే 6న మరణించాడు. అయితే అప్పటికి ఆయన వయసు 256 ఏళ్ళని, అన్నేళ్ళు జీవించడం చరిత్రలోనే మొదటిసారి అని ఓ పత్రిక తన వ్యాసంలో పేర్కొంది. ఆ సుదీర్ఘ వయస్కుడి వివరాలు ఏ ఒక్కరో శోధించినవి కాదని, ఆయన అన్నేళ్ళు బతికాడనేందుకు ఎన్నో సాక్ష్యాధారాలను సేకరించి మరీ నిర్థారించింది. లీని ఆయన 150వ పుట్టినరోజు సందర్భంగా 1827 లో అభినందిచినట్లు ఓ డాక్యుమెంటేషన్ లో చెంగ్డూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వు చుంగ్ రాశారని, చైనా ప్రభుత్వ రికార్డుల్లోనూ లీ చింగ్ 150వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినట్టు ఉందని, అనంతరం ఆయన 200 పుట్టినరోజు సందర్భంగా 1877లోనూ లీని అభినందిస్తూ ఎన్నో వ్యాసాలు, పత్రాలు వెలువడ్డాయని తెలుస్తోంది. ఆయనకు పొరుగునే ఉన్న ఓ వ్యక్తి... తమ చిన్ననాటినుంచే ఆయన్ను వృద్ధుడుగా చూసినట్లు తెలిపినట్లు సదరు పత్రిక వెల్లడించింది. సిచుయాన్ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్ పదేళ్ళ వయసునుంచే ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ అనేక ప్రాంతాల్లో తిరిగాడట. ఆ సమయంలో దాదాపు నలభై ఏళ్ళ పాటు అడవుల్లో దొరికే మూలికలు, గోజీపండ్లు వంటి ఆహారాన్నే భుజించాడట. ఆయుర్వేద వైద్యుడిగా అనేకచోట్ల కాలం గడిపిన ఆయన.. 71 ఏళ్ళ వయసులో 1749 లో చైనీస్ సైన్యం లో యుద్ధ కళల శిక్షకుడిగా, సలహాదారుడుగా చేరాడు. తర్వాత కనీసం వంద సంవత్సరాల పాటు ఆయన మంచి ఆహారంతోపాటు, ఔషధాలు, రైస్ వైన్ తీసుకున్నాడు. తన కమ్యూనిటీలో ప్రత్యేక సభ్యుడుగా ఉండే లీ.. 23 సార్లు వివాహం చేసుకోవడంతోపాటు, సుమారు 200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడట. కుటుంబంలో 11 తరాలను చూసిన ఆయన... 1933లో మరణించాడు. ఆయన్ను ఎవరైనా తన సుదీర్ఘ జీవితకాలం గురించి సీక్రెట్ ఏమిటి అని అడిగితే మాత్రం... నిశ్శబ్దమైన మనసుతో ఉండి, తాబేలులా కూర్చొని, పావురంలా హుషారుగా పరిగెడుతూ, కుక్కలా నిద్రపోవడమే కారణమని చెప్పేవాడట. ఆయన పుస్తకంలో (జీవితం) ఒక పేజీ చదివినా... ఈ కాలంవారికి ఎంతో స్ఫూర్తిదాయకం అయ్యే అవకాశం ఉంది. -
రాజన్‌పై మౌనం వీడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ రాజన్ పునర్నియామకంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి మౌనం వీడారు. ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ రెండవసారి ఎంపికను సమర్థిస్తారా అని అడిగినపుడు.. ఈ విషయం పరిపాలనకు సంబంధించిన విషయమన్నారు. దీంట్లో మీడియాకు సంబంధంలేదని వ్యాఖ్యానించారు. రాజన్ పై బీజేపీ ఎంపీ, సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వరుస సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని స్పందించడం ఇదే మొదటిసారి. రాజన్ నియామకం ఎడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన వ్యవహారమని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో మీడియాకు అంత ఆసక్తి అవసరం లేదనుకుంటున్నానంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. మరోవైపు సెప్టెంబర్ లోనే ఈ విషయాన్ని పరిశీలిద్దా మని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తో చెప్పారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది కనుక అప్పుడు చూద్దామన్నట్టు చెప్పారు. అయితే ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ రాజన్ ను తక్షణమే తొలగించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. రాజన్ ఉద్దేశపూర్వకంగానే దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నారని, దేశంలో నిరుద్యోగం పెరిగిందంటూ తీవ్రమైన ఆరోపణల పరంపర ను కొనసాగించారు. ఈ విషయంలో పట్టువీడని స్వామి ..మోదీకి ఇప్పటికే రెండుసార్లు లేఖలు కూడా రాశారు. కాగా రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా రెండోసారి అర్హుడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు నెటిజన్లు రాజన్ సమర్థతతపై అనేక సర్వేల్లో సానుకూలంగా స్పదించారు. రాజన్ మూడేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబర్ ముగియనుంది. -
ఇంకా మౌనమెందుకు?
* ‘హోదా’ ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసినా మాట్లాడరేం? * రాష్ట్రానికి ఇంతకన్నా అన్యాయం ఏం జరగాలి? * మీరు మాట్లాడాలంటే ఇంకా రాష్ట్రం ఎంత నష్టపోవాలి? * పోరాటానికి ఎందుకు వెనుకాడుతున్నారు? * కలసి పోరాడదాం.. రమ్మన్నా స్పందించరేం? * చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని, నూతన రాజధానికి ఎలాంటి రాయితీలు ఉండబోవని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా మొండిచేయి చూపాక కూడా సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని, పోరాటానికి ఎందుకు సిద్ధం కావట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా కేంద్రాన్నిగానీ, బీజేపీనిగానీ ఏమీ అనొద్దని టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని చంద్రబాబు ఎందుకు నియంత్రిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయమై చంద్రబాబు మౌనంగా ఉండటం వెనకున్న ఆంతర్యమేమిటన్నారు. ‘చంద్రబాబు ఇంకా ఎందుకు మాట్లాడ్డం లేదు? రాష్ట్రానికి ఇంతకన్నా అన్యాయం ఏం జరగాలి? ఆయన మాట్లాడాలంటే ఇంకా రాష్ట్రం ఎంత నష్టపోవాలి?’ అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపైగానీ, రాజధానికి రాయితీలివ్వబోమన్న విషయంపైగానీ మాట్లాడ్డం లేదంటే చంద్రబాబుకు ఇంతకన్నా ముఖ్యమైన విషయాలు ఏముంటాయన్నారు. ప్రాణవాయువులాంటి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలొస్తాయని, తమకు ఉద్యోగాలొస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పరిస్థితి కేంద్రం ప్రకటనతో దిక్కుతోచనివిధంగా అయిపోయిందన్నారు. పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రాలకు వెళుతున్నారేతప్ప ఏపీలో ఒక్కరూ ముందుకు రావట్లేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చుంటే.. వారంతా క్యూ కట్టేవారన్నారు. స్వప్రయోజనాల కోసమే నోరుమెదపట్లేదు.. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు మాట్లాడ్డం లేదని పద్మ ధ్వజమెత్తారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో అరెస్టు చేస్తారనో... లేదా తన అవినీతిపై విచారణకు ఆదేశిస్తారనో భయపడిపోయి కేంద్రాన్ని గట్టిగా అడుగలేకుండా ఉన్నారని విమర్శించారు. తాను పోరాడకపోగా తన పార్టీలో ఒకరిద్దరు నేతలు రాష్ట్రప్రయోజనాలపై ఆవేదనతో మాట్లాడుతుంటే వారి నోళ్లను నొక్కేస్తున్నారన్నారు. కేంద్రమంత్రుల ప్రకటనల వల్ల రాష్ట్రం నిండా మునిగిందన్న విషయం చంద్రబాబుకు తెలిసి కూడా ఇంకా వారు సాయం చేస్తారేమోనని అర్రులు చాచడమేమిటన్నారు. ప్రత్యేకహోదా సాధనకోసం పోరాడుదాం రమ్మని రెండురోజులుగా వైఎస్సార్సీపీ పిలుపునిస్తున్నా చంద్రబాబుగానీ, టీడీపీ నేతలుగానీ స్పందించట్లేదని ఆమె విమర్శించారు. తమ పోరాటంలో కలసిరావాలని లేదా అధికారపక్షమే పోరాటం చేస్తే కలసి నడవటానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అందరం కలసికట్టుగా ఉద్యమించి బంద్‌కు పిలుపునిస్తే రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకహోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ఢిల్లీకి తెలుస్తుందని సూచించారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి టీడీపీ ఏ కార్యాచరణ రూపొందిస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. -
మౌనం
ధ్యానమార్గం యోగసాధనలో ధ్యానానికి తిరుగులేని ప్రాధాన్యం ఉంది. ధ్యానం అంటే ఒకరకంగా మానసికంగా మౌనావస్థకు చేరుకోవడమే. అంటే, ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగా కూడా మౌనం పాటించనిదే ధ్యానం చేయడం సాధ్యం కాదు. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు. మౌనం పాటించడం వల్లనే వారిని మునులు అంటారు. రోజుల తరబడి మౌనం పాటించడం లౌకిక జీవితం గడిపే సామాన్యులకు సాధ్యం కాదు. వారానికోసారి లేదా పర్వదినాల్లో, ప్రత్యేక సందర్భాల్లో సామాన్యులు కూడా మౌనవ్రతం పాటించడం మంచిదని పెద్దలు చెబుతారు. పెద్దల మాట మేరకు కొందరు లౌకిక జీవితం గడుపుతూనే, అప్పుడప్పుడు మౌనవ్రతం పాటిస్తూ ఉంటారు. ఇంతకీ మౌనవ్రతం ఎందుకు పాటిస్తారు? మౌనం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అంటారా..? మౌనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చిరాకు, కోపం, వేదన వంటి ప్రతికూల భావోద్వేగాలు క్రమంగా సద్దుమణిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధ్యానానికి అలాంటి ప్రశాంత పరిస్థితే అవసరం. అందుకే, ధ్యాన సాధనకు ఉపక్రమించేవారు తొలుత మౌనాన్ని ఆశ్రయించాలి. -
జీవో 97పై నోరు మెదపని చంద్రబాబు
-
జె.కె.రోలింగ్ రాయని డైరీ
పిల్లలు పడుకున్నట్లున్నారు. అలికిడి వినిపించడం లేదు. పిల్లలతో పాటు స్కాట్లాండ్ రాజధాని పట్టణం ఎడిన్‌బరో కూడా నెమ్మదిగా నీలి రంగు పడక దీపాల మాంత్రిక భ్రాంతివర్ణంలోకి ఫ్యాంటసైజ్ అయినట్లుంది! శరత్కాలపు నులివె చ్చని చలిలో ఈ మహానగరపు చీకట్లు.. నిశ్శబ్దాన్ని వెలిగిస్తున్నాయి. నాకిష్టమైన చీకటి. నాకిష్టమైన నిశ్శబ్దం. చీకటి గదిలో నేనొక్కదాన్నీ నిశ్శబ్దాన్ని వింటూ కూర్చున్నాను. ఆలోచనలు వాటికవే వచ్చి నన్ను అల్లుకుంటున్నాయి. లైటు వేసుకుని రాయడానికి కూర్చుంటే.. ఆ ఆలోచనలన్నీ సీతాకోక చిలుకలై ఎగిరిపోతే! వాటిని వెతికిపట్టి తేవడం ఎలా? పిల్లలు నమ్ముతారా.. రాత్రి మీ కోసం ఒక కథ రాయాలనుకున్నాను.. కానీ ఆ కథ రాత్రికి రాత్రే ఎగిరిపోయిందని చెబితే ఊరుకుంటారా? ఏ ఒడ్డుకు చేరుకుందో పడవ వేసుకుని వెళ్లి మరీ తెమ్మంటారు. కదలకుండా అలా కూర్చునే ఉన్నాను. హారీ పోట్టర్ తర్వాత ఇంకేం లేకుండా పోదు కదా అన్న ఆందోళన ఒక్కటే నాలో కదులుతోంది. ఇంకొక్కటైనా రాయాలి పిల్లల కోసం. పిల్లల కోసం మాత్రమే కాదు, పెద్దవాళ్లను ‘ఛూ మంత్రకాళి’ అని పిల్లలుగా మార్చేయడం కోసం కూడా. వయసులు వేర్వేరు కావచ్చు. పిల్లలు, పెద్దలు ఎప్పటికీ వేర్వేరు కాదు. ఊహా జగత్తు.. పిల్లల్ని వాస్తవాలలో తేలియాడిస్తుంది. అదే ఊహా జగత్తు.. పెద్దల్ని ‘టే’ నదీ తీరప్రాంత గ్రామం అబర్ఫెల్డీ తీసుకెళ్లి అక్కడి వారాంతపు సంతలో వారి చేత మ్యాజిక్ వాండ్ కొనిపిస్తుంది. వారిని ఆడిస్తుంది. పాడిస్తుంది. బుగ్గలు ఉబ్బేలా బూర ఊదిస్తుంది. ‘పిల్లల్ని గాలికి వదిలిపెట్టినట్టు అలా ఊహా లోకాల్లోకి వదిలిపెడతామా మిస్ రోలింగ్!’ అని హారీ పోట్టర్ తొలికాపీ చూసి పెదవి విరుస్తూ పన్నెండు మంది పబ్లిషర్లూ ఒకేమాట అన్నప్పుడు నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఊహల్లేకుండా పెరిగిన పిల్లలు వాళ్లు. అలాగే ఉంటారు. అలాగే అంటారు. ఊహకు స్వేచ్ఛను ఇస్తే వికసిస్తుంది. ఊహను బంధిస్తే వికటిస్తుంది. అబర్ఫెల్డీ వెళ్లొచ్చి అప్పుడే వారం! హా.. హా.. యాభై ఏళ్ల ఒక వారం అనాలేమో! ‘జూలైలో అయిపోయింది కదా మీ బర్త్‌డే, మళ్లీ ఇప్పుడెందుకు సెలబ్రేట్ చేస్తున్నారు మిస్ రోలింగ్’ అని అడిగారు నా యాభయ్యవ జన్మదిన వేడుకలకు ప్రత్యేక ఆహ్వానంపై అబర్ఫెల్డీకి ప్రయాణమై వచ్చినవారు. నవ్వాను. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నవ్వు మాత్రమే ఉంది. కొద్దిగా భయం కూడా ఉందేమో! అప్పుడే యాభై!! యాభై అంటే సగమా? సంపూర్ణమా? పిల్లల కోసం మరో పుస్తకం రాసేందుకు త్వరపడవలసిన సమయమా? -
కాషాయంలో పచ్చ మంట
-
చెక్కు చెదరని బుద్ధవాక్యం
గ్రంథపు చెక్క బుద్ధప్రతిమలానే సాంచీస్థూపం కూడా ఏదో అనాది, శాశ్వత సందేశాన్ని వింటున్నట్లుగా, ఆ సందేశాన్ని ధ్యానిస్తున్నట్లుగా అక్కడొక అపూర్వమైన నిశ్శబ్దం, ప్రశాంతి నెలకొని ఉన్నాయి. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండ మీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధస్థూపాలన్నిటిలో కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యంలాగా ఈ నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖ సంఘటనతోటీ సాంచికీ సంబంధం లేదు. బుద్ధుడు తన జీవిత కాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనా యాత్రికుడు జువాన్ జంగ్ భారతదేశంలో తాను చూసిన ప్రతి ఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో వివరంగా నమోదు చేసినప్పటికీ సాంచి గురించి కనీసం ఒక్కవాక్యం కూడా ప్రస్తావించలేదు. బుద్ధపాద స్పర్శకు నోచుకోనప్పటికీ, బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధసంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచీ చరిత్రలో నిలబడింది. బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్లేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్లేటప్పుడో ఈ అడవిలో ఈ కొండను చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండ మీద రాస్తే నలుగురు చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ ‘దృష్టి’ ఉంది. అందుకే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండ మీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు కూడా అతడు ఈ స్థూపనిర్మాణం చేపట్టాడు. - వాడ్రేవు చినవీరభద్రుడు ‘నేను తిరిగిన దారులు’ పుస్తకం నుంచి. -
రాష్ట్రం ముక్కలవుతున్నా..
పదవులు పట్టుకు వేలాడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మిగతా జిల్లా ప్రజాప్రతినిధుల రాజీనామాలతోనైనా కలగని చలనం సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ర్ట విభజనకు ఆజ్యం పోసి, తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీ నిలువునా చీల్చినా ఆ పార్టీకి చెందిన జిల్లా ప్రజాప్రతినిధుల్లో చలనం రాలేదు. అదే పార్టీకి చెందిన పక్క జిల్లాల నేతలు రాజీనామాలు చేస్తున్నా వీరికి చీమకుట్టినట్టయినాలేదు. పదవులే పరమావధిగా, ప్రజల మనోభావాల కన్నా అధికారమే తమకు అధికమని ఇంకా కుర్చీలు పట్టుకుని వేలాడుతున్నారు. తుది వరకు పోరాడుతామని ప్రజల్ని మభ్యపెట్టి తప్పించుకున్నారు. ఆఖరి బంతి వరకు చూడండంటూ రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. నియంతృత్వ పోకడతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సోనియాగాంధీకి దాసోహమయ్యారు. లోకసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాలు చేస్తున్నా జిల్లాలో ఒక్క కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ముందుకు రాలేదు. దీంతో వారి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి అరకు ఎంపీ వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషోర్ చంద్రదేవ్ అయితే అధిష్టానం మనిషిగా కేంద్ర కేబినెట్ పదవిని వెలగబెడుతున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు రాజధాని ఎక్కడని ఒకరు, అటూ ఇటూ కాని ధోరణితో మరొకరు వ్యవహరిస్తూ వచ్చారు. కొన్నాళ్లు విభజనకు అనుకూలమని, సొంత జిల్లాలో ఎదురైన చేదు అనుభవాలతో ఆ తర్వాత సమైక్యమని నాటకమాడారు. ఇంకొకరు అధిష్టానానిదే తమ నిర్ణయమని ప్రేక్షక పాత్ర పోషించారు. ఇలా ఇరువురు చెరో విధంగా జిల్లా ప్రజలతో ఆడుకున్నారు. ఒక వైపు లోక్‌సభ దద్దరిల్లిపోతున్నా వీరు కనీసం స్పందించలేదు. పూర్తిగా తమ సీట్లకే అతుక్కుపోయారు. నోరు కుట్టేసుకుని సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని చోద్యం చూస్తూ గడిపారు. వీరి తీరు చూసి జిల్లా వాసులు క్షోభించారు. ఇలాంటి ప్రతినిధులనా మనం ఎన్నుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాటకు విలువ ఇవ్వకపోయినా ఆత్మాభిమానాన్ని చంపుకొన్న వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, బొత్స ఝాన్సీలక్ష్మీ ఇది తమకు అలవాటే అన్నట్టు వ్యవహరించారు. ఎమ్మెల్యేలూ అంతే... ఇక మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, వి.టి.జనార్దన్ థాట్రాజ్, సవరపు జయమణి కూడా ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. పొరుగు జిల్లా విశాఖకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు రాజీనామాలకు దిగినా జిల్లా నేతలకు చలనం రాలేదు. ప్రజలిచ్చిన పదవులను అనుభవిస్తున్నారే తప్ప ప్రజాభిష్టానికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై నా, నిరసనలు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. లోక్‌సభలో విభజన బిల్లుకు ఆమోద ముద్ర పడిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రి బొత్స ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని సమైక్యవాదులు మళ్లీ ఆందోళనలు చేసి, ఆస్తుల ధ్వంసానికి పాల్పడతారేమోనన్న అనుమానంతో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్త్తు ఏర్పాటు చేశారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలనూ అధికారులు తీసుకున్నారు. -
వ్యూహాత్మక మౌనం పాటించిన టీడీపీ
-
ప్రధాన ప్రతిపక్షం మాత్రం సైలెంట్