అంతా నిశ్శబ్దం | Anushka, Madhavan to begin shooting for Silence next year | Sakshi
Sakshi News home page

అంతా నిశ్శబ్దం

Published Fri, Nov 9 2018 6:09 AM | Last Updated on Fri, Nov 9 2018 6:09 AM

Anushka, Madhavan to begin shooting for Silence next year - Sakshi

అనుష్క

అనుష్క నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఏంటి? అన్నది కొన్ని నెలలుగా జవాబు దొరకని ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అనుష్క నెక్ట్స్‌ చేయబోయే చిత్రం పేరు ‘సైలెన్స్‌’. మూకీ సినిమా అని అర్థమయ్యే ఉంటుంది. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క, మాధవన్‌ ముఖ్య›పాత్రల్లో ‘సైలెన్స్‌’ అనే సైలెంట్‌ థ్రిల్లర్‌ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

రచయిత కోన వెంకట్‌ ఈ చిత్రానికి రచయితగా, సహాయ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ శాతం అమెరికాలోని సీటెల్‌ ప్రాంతంలో జరగనుంది. అనుష్క, మాధవన్‌ ఇదివరకు ‘రెండు’ (2006) అనే తమిళ సినిమాలో తొలిసారి కలసి నటించారు. ఇప్పుడు 12ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ కలసి నటించబోతున్నారు. సైలెంట్‌ థ్రిల్లర్‌ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది స్టార్ట్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement