మోడీ మౌనంలోని ఆంతర్యం ఏమిటి? | Lalu Prasad hits out at Modi for 'silence' on Dalit atrocities | Sakshi
Sakshi News home page

మోడీ మౌనంలోని ఆంతర్యం ఏమిటి?

Published Fri, Jul 22 2016 6:16 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

Lalu Prasad hits out at Modi for 'silence' on Dalit atrocities

పాట్నా: దేశంలో  దళితులపై జరుగుతున్న దాడుల పట్ల  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. రెండురోజులుగా దేశంలో దళితులపై దాడులు .జరుగుతున్నా మోదీ స్పందించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని లాలూ ప్రశ్నించారు. మోదీ ప్రోత్సాహంతోనే  దేశంలో పేదలు,దళితులపై దాడులు  జరుగుతున్నాయని ట్వీట్ చేశారు.

లాలూ కుమారుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని ముందుగా దళితుల దాడులపై స్పందించాలని ట్వీట్ చేశారు. దానికి రిప్లేగా లాలూ ఈ ట్వీట్ చేశారు. గుజరాత్ లోని ఉనాలో దళితులు ఆవుల చర్మం ఒలిచారని వారిపై కొందరు గోసంరక్షణ కార్యకర్తలు దాడి చేసిస విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు బిహార్ లోని ముజఫర్ పూర్ లో ఇద్దరు దళతులపై దాడులు జరిగాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement