Dalit atrocities
-
దళిత కుటుంబంపై కర్ణాటక మంత్రి దాడి
బెంగుళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మంత్రి డి. సుధాకర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సుబ్బమ్మ, ఆశ అనే ఇద్దరు మహిళలు ఎఫ్ఐఆర్లో తెలిపిన వివరాల ప్రకారం మంత్రి సుధాకర్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి బెంగళూర్ యలహంక ప్రాంతానికి చేరుకుని మహిళలు నివాసముండే స్థలంలోని ఆస్తులను కూల్చే ప్రయత్నం చేశారు. జేసీబీ వాహనంతో సహా వచ్చిన ఆ గుంపులో సుమారు 40 మంది ఉండగా వారిలో 15 మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలంలో ఇళ్ల పైకప్పులు ప్రహారి గోడలను కూలుస్తుండగా దళితులైన తల్లీ కూతుళ్లు సుబ్బమ్మ, ఆశ వచ్చి వారిని నిలదీయగా ఆ గుంపు కులం పేరుతో దూషిస్తూ వీరిపై దాడికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీంతో మంత్రి సుధాకర్‌పైనా ఆయన అనుచరులు శ్రీనివాస్, భాగ్యమ్మల తో సహా మరో 35 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది -
ఘోరం.. దళిత కుటుంబంపై కాల్పులు
దామోహ్: తన భార్య వైపు చూస్తున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ దళితుడు, అతడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా అతడి ఇద్దరు సోదరులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దామోహ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేవ్‌రన్ గ్రామానికి చెందిన దళిత వ్యక్తి(32) తరచూ తన భార్య వైపు చూస్తున్నాడంటూ అదే గ్రామానికి చెందిన జగ్దీశ్ పటేల్ ఆగ్రహంతో ఉన్నాడు. ఇదే కారణంతో మంగళవారం ఉదయం గ్రామానికే చెందిన మరికొందరితో కలిసి తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో సదరు దళితుడు, అతని తల్లిదండ్రులు(60, 52) చనిపోగా సోదరులు (30, 28) గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు జగదీశ్ పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ డీఆర్ తేనివార్ చెప్పారు. నిందితులపై అట్రాసిటీ కేసు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. చదవండి: టీఎంసీ యువనేతపై కాల్పులు.. బైక్‌పై వచ్చి క్షణాల్లో.. -
రాజీకి పిలిచి ఘోర అవమానం.. గుండు గీయించి చెప్పులదండతో..
భోపాల్: మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. శక్యా కమ్యూనిటికీ(ఎస్సీ) చెందిన ఇద్దరు యువకులకు గుండు గీయించారు గ్రామ పంచయితీ పెద్దలు. అనంతరం వారి మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. దబోహా గ్రామంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఏం జరిగిందంటే..? రామ్‌వీర్ శక్య, సంతోష్ శక్య, ధర్మేంద్ర శక్య అనే ముగ్గురు దబోహ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వీరు గ్రామంలో దిలీప్ శర్మతో గొడవపడ్డారు. ఘర్షణలో అతని తలకు తీవ్ర గాయాలయ్యయి. ఈ ఘటన అనంతరం ముగ్గురూ గ్రామం నుంచి పరారయ్యారు. నెలన్నర తర్వాత శక్యా కమ్యూనిటీకి చెందిన హరిరామ్ ఈ ముగ్గురి తరఫున దిలీప్‌తో రాజీ కుదిర్చేందుకు వెళ్లాడు. ఈ వ్యవహారంపై పంచాయితీ పెద్దలు చర్చించారు. ముగ్గురు కలిసి రూ.1.5 లక్షలు దిలీప్ వైద్య ఖర్చుల నిమిత్తం చెల్లించాలని సర్పంచ్ మురళీలాల్ ఆదేశించారు. అంతేకాదు ముగ్గురికీ గుండు గీసి, చెప్పులదండతో ఊరేగించాలని తీర్మానించారు. అనంతరం దీన్ని అమలు చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. దిలీప్ శర్మ, అతని తండ్రిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇద్దరు బాధిత యువకులను ఆస్పత్రికి తరలించారు. వారి ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కల్పించారు. చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..! -
దళితులను నిర్బంధించి చిత్రహింసలు.. మహిళకు గర్భస్రావం!
చిక్కమగళూరు: కర్ణాటకలోని చిక్కమగళూరులో ఓ వ్యక్తి తన ప్లాంటేషన్‌లో దళితులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన సంచలనం రేపుతోంది. జగదీశగౌడకు జెనుగడ్డె గ్రామం వద్ద కాఫీ ప్లాంటేషన్ ఉంది. ఇతడి నుంచి రోజువారీ కూలీలైన బాధితులు రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ సొమ్మును తిరిగి చెల్లించలేకపోవడంతో మొత్తం 16 మందిని జగదీశ తన ప్లాంటేషన్‌లో నిర్బంధించాడు. జగదీశ గౌడ దెబ్బలతో ఒక మహిళకు గర్భస్రావం అయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులు జగదీశ గౌడ, అతడి కుమారుడు తిలక్ కోసం గాలింపు చేపట్టారు. తమ బంధువులను జగదీశ గౌడ చిత్రహింసలు పెడుతున్నారంటూ కొందరు వ్యక్తులు ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే ఆ ఫిర్యాదును వారు వెనక్కి తీసుకున్నారని బలెహొన్నూర్ పోలీసులు చెప్పారు. ఆ మరునాడు బాధితురాలైన గర్భవతిని ఆస్పత్రిలో చేర్పించి, చిక్కమగళూరులో మరోసారి వీరు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము వెళ్లి బందీలుగా ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన మొత్తం 16 మందిని విడిపించామన్నారు. వీరిని 15 రోజులుగా నిర్బంధంలోనే ఉంచినట్లు తేలిందన్నారు. వీరిలో రెండు నెలల గర్భవతి అయిన అర్పిత కూడా ఉంది. జగదీశ గౌడ ఈమె ఫోన్ లాగేసుకుని ఒక రోజు నిర్బంధించాడని, కొట్టడంతో గర్భస్రావం అయిందని ఆమె తల్లి ఆరోపించింది. జగదీశ గౌడ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న వారు ఎటో వెళ్లిపోవడంతో అతడు తమను నిర్బంధించినట్లు బాధితులు తెలిపారని చిక్కమగళూరు ఎస్పీ ఉమా ప్రశాంత్ చెప్పారు. కాగా, జగదీశ గౌడ బీజేపీ నేత అంటూ వచ్చిన వార్తలను బీజేపీ ఖండించింది. జగదీశ గౌడతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా ప్రతినిధి వరసిద్ధి వేణుగోపాల్ తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
దళిత యువకుడికి ఘోర అవమానం.. పరారీలో మాజీ సర్పంచ్!
లక్నో: ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. అందరి ముందు యువకుడిపై గ్రామ సర్పంచ్ చెప్పుతో దాడి చేసి, చంపేస్తామని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై దాడి నేపథ్యంలో భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఛాపర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. దినేష్ కుమార్(27) అనే దళిత యువకుడిపై.. తాజ్పుర్ గ్రామ సర్పంచ్ శక్తి మోహన్ గుర్జార్, రేటా నగ్లా గ్రామ మాజీ సర్పంచ్ గాజే సింగ్‌లు దాడి చేశారు. చెప్పుతో కొడుతూ చంపేస్తామని యువకుడిని బెదిరించారు. వీడియోలు తీసి ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. భారతీయ శిక్షా స్మృతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నగర ఎస్పీ అర్పిత్ విజయ్‌వర్గియా తెలిపారు. గ్రామ సర్పంచ్ శక్తి మోహన్‌ను అరెస్ట్ చేశామని, రెండో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. In UP's Muzaffarnagar, a village head and his people thrashed a SC youth with slippers in public and threatened him with death while abusing caste slurs. They also recorded the incident and made it viral to humiliate the SC people. pic.twitter.com/MeiPTfo9KF — Mission Ambedkar (@MissionAmbedkar) August 20, 2022 ఇదీ చదవండి: Viral Video: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో.. -
నూతన్ నాయుడుకు చుక్కెదురు
విశాఖ లీగల్: పెందుర్తి దళిత యువకుడు శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ కుమార్ నాయుడుతో పాటు ఆయన భార్య ప్రియ మాధురితో సహా మరికొందరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. నగరంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట నాగేశ్వరరావు మంగళవారం తీర్పు నిచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసు ప్రాథమిక స్థాయిలో ఉన్నందున బెయిలు మంజూరు సాధ్యం కాదన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాసు తమ వాదనలు వినిపించారు. కాగా, పసిపిల్లలను విక్రయించిన కేసులో సృష్టి ఆస్పత్రి వైద్యులకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. (12 కోట్లు వసూలు చేసిన నూతన్ నాయుడు) చదవండి: కడుపులో నొప్పి అంటూ నూతన్ డ్రామాలు! -
నూతన్ నాయుడు చేసింది తీవ్రమైన నేరం..
సాక్షి, అమరావతి : శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడుపై ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పేరు చెప్పి అధికారుల నుంచి సహాయం పొందేందుకు నూతన్ నాయుడు యత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరు చెప్పి పలువురి అధికారులకు ఫోన్ చేశాడని.. డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని పీవీ పేర్కొన్నారు. తన పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేశాడని మండిపడ్డారు. తన పేరుతో అధికారులకు ఫోన్ చేయడాన్ని ఆయన ఖండించారు. నూతన్ నాయుడు చేసింది తీవ్రమైన నేరమని ఆయన అన్నారు. ‘ఆగస్ట్ 29న నా పేరును ఉపయోగించి, నా మాటను అనుకరిస్తూ ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు కాల్ చేశారు. ఒక పేషేంట్ వస్తున్నారు, 15 రోజులు పాటు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్‌తో చెప్పారు. నా గొంతును అనుకరిస్తూ మాట్లాడటంతో అనుమానం వచ్చి ప్రిన్సిపాల్ సుధాకర్ నాకు కాల్ చేశారు. ఎవరో నా మాట అనుకరిస్తున్నారు అనే విషయాన్ని డీజీపీ, అడిషనల్ డీజీపీ, విశాఖ సీపీకి ఫిర్యాదు చేశాను. ఆ ఫోన్ నెంబర్ హైదరాబాద్ అడ్రస్ ఉందని విచారణలో తేలింది. ఆ నంబర్‌కు కాల్ చేస్తే‘అడిషనల్ సీఎస్ సీఎం’ అని వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నా మాట అనుకరిస్తూ ఫోన్ చేస్తున్న వారి మాటలు నమ్మకండి’అని రమేష్ పేర్కొన్నారు. (చదవండి : శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్) కాగా, నూతన్ నాయుడు గురువారం అరెస్టయిన విషయం తెలిసిందే. శిరోముండనం కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. కాగా, దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
దళిత యువకుడిపై చేయి చేసుకున్న ఎస్ఐ, ఏఎస్ఐ
రంగంపేట (తూర్పు గోదావరి): దళిత యువకుడిపై ఇన్చార్జి ఎస్ఐ, ఏఎస్ఐ చేయిచేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెదరాయవరం గ్రామానికి చెందిన మోర్త నవీన్ అనే యువకుడు గ్రామానికి చెందిన ఓ యువతిని వేధించినట్టు ఫిర్యాదు అందటంతో గురువారం రాత్రి అతడిని రంగంపేట పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతడిని విచారించే క్రమంలో ఇన్చార్జి ఎస్ఐ వి.కిశోర్, ఏఎస్ఐ సుబ్బారాయుడు చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సుమారు 200 మంది దళితులు స్టేషన్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఇరువర్గాల పెద్దలు రాజీ కుదిర్చిన తరువాత కూడా యువకుడిని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పెద్దాపురం సీఐ జయకుమార్ రంగంపేట చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఇన్చార్జి ఎస్ఐ కిశోర్, ఏఎస్ఐ సుబ్బారావులతో క్షమాపణ చెప్పించడంతో దళితులు ఆందోళన విరమించారు. ఇన్చార్జి ఎస్ఐని బాధ్యతల నుంచి తొలగించామని, అధికారుల సూచన మేరకు ఏఎస్ఐపై నివేదిక సమర్పిస్తామని సీఐ చెప్పారు. ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం: ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఏఎస్ఐ స్టేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకునేందుకు యత్నించారు. వెంటనే సీఐ జయకుమార్, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు తలుపులు పగులగొట్టి సుబ్బారావును రక్షించి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో బిగ్ బాస్ ఫేమ్, సినీ నిర్మాత నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపి రైల్వేస్టేషన్లో గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన నాటి నుంచి నూతన్ నాయుడు పరారీలో ఉన్నాడన్నారు. ఘటన జరిగాక మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ పేరు చెప్పి పైరవీలు చేశాడని చెప్పారు. దీంతో నూతన్ నాయుడిపై చీటింగ్ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామన్నారు. శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ► శిరోముండనం కేసులో ఆగస్టు 29న ఏడుగురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేయగా కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌కి ఫోన్ చేసి తాను మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్‌నని ప్రియా మాధురి (నూతన్ భార్య)కి రెండు వారాలపాటు ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి ఉందంటూ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరాడు. ► కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌కి పి.వి.రమేష్ పరిచయం ఉండడంతో అనుమానం వచ్చి ఆయనకు ఫోన్ చేసి మీ పేరుతో ఎవరో ఫోన్ చేస్తున్నారని చెప్పారు. ► దీంతో పి.వి. రమేష్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ నంబర్ని ట్రేస్ చేయగా.. ముంబై వెళుతున్న నూతన్ నాయుడు ఉడిపి రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో నిర్వాకం
-
నూతన్ నాయుడు ఇంట్లో నిర్వాకం
పెందుర్తి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని, పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో గిరిప్రసాద్‌నగర్‌లోని నూతన్‌కుమార్ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్ అనే యువకుడు నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఆగస్టులో పని మానేశాడు. అయితే శుక్రవారం శ్రీకాంత్‌కు నూతన్‌కుమార్ భార్య మధుప్రియ ఫోన్ చేసి ‘నువ్ సెల్‌ఫోన్ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలి’ అని పిలిచింది. ► అక్కడకు వెళ్లిన శ్రీకాంత్‌ను నిర్బంధించి అతడిపై తప్పుడు ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సెలూన్ నిర్వాహకుడు రవిని పిలిపించి మధుప్రియ సమక్షంలో శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు. ► తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినా«థ్ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు. అతడి వాంగ్మూలం మేరకు నిందితురాలు మధుప్రియ సహా నలుగురిని జరిగిన ఘటనపై విచారిస్తున్నారు. ► ఈ ఘటనలో నూతన్‌కుమార్‌నాయుడు పాత్రపై లోతుగా విచారణ చేస్తున్నారు. కాగా నూతన్ కుమార్ నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేశారు. గతేడాది ఓ చానల్లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలో పాత్రధారి. ఇటీవల విడుదలైన పరాన్నజీవి చిత్రానికి దర్శకుడు. విశాఖ నగర మాజీ మేయర్, ప్రస్తుత టీడీపీ నేతకు వ్యాపార భాగస్వామి అని సమాచారం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సన్నిహితుడు, వీరాభిమాని. ► ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. ఘటనను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చెప్పారు. తననేమైనా చేస్తారని భయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుడు కర్రి శ్రీకాంత్‌కోరాడు. -
దళితులపై హింస.. బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కొక్కరిగా సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. ఈ తరుణంలో తాజాగా వాయవ్య ఢిల్లీ నియోజక వర్గ ఎంపీ ఉదిత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ బంద్ తర్వాత దళితులపై హింస పెరిగిపోయిందంటూ ప్రకటించి బాంబు పేల్చారు. ‘ఏప్రిల్ 2న భారత్ బంద్ తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయి. ఈ మేరకు ఆధారాలతోసహా కథనాలు కూడా వెలువడుతున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ శనివారం ఉదిత్ ఓ ట్వీట్ చేశారు. ‘బార్మర్, జలోరే, జైపూర్, గ్వాలియర్, మీరట్, బులంద్‌షహర్, కరోలి.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితులపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు హింసిస్తున్నారు’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన పేర్కొన్న ప్రాంతాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండటంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. పైగా గ్వాలియర్‌కు చెందిన ఓ దళిత ఉద్యమవేత్తను పోలీసులు ఉత్త పుణ్యానికి దారుణంగా హింసించారంటూ ప్రత్యేకించి ఉదిత్ రాజ్ చెప్పటం చర్చనీయాంశంగా మారింది. కాగా, దళిత చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఏప్రిల్ 2న దళిత సంఘాలు భారత్ బంద్ చేపట్టాగా.. ఏడు రాష్ట్రాల్లో అది హింసాత్మకంగా మారటం.. 11 మంది మృతి చనిపోవటం.. పలువురు గాయపడటం తెలిసిందే. Dalits r tortured at large scale after 2ndApril country wide agitation . Peoplefrom badmer,jalore,jaipur,gwalior,meerut , bulandshahr,karoli &other parts calling that not only anti reservatists but police also beating &slapping false cases. — Dr. Udit Raj, MP (@Dr_Uditraj) 7 April 2018 My confedetion worker in gwalior is being tortured whereas he had not done anything wrong . He is crying for help. — Dr. Udit Raj, MP (@Dr_Uditraj) 7 April 2018 -
'మోదీ బాబాలాగ ఉంటే కుదరదు'
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్ పార్టీ మరోసారి టార్గెట్ చేసింది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న దళితులపై దాడి ఘటనపై మోదీ తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. ఇంత జరుగుతున్నా మోదీ మౌనబాబాలాగ ఉంటే సరిపోదని విమర్శించింది. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ మహారాష్ట్రలో దళితులకు వ్యతిరేకంగా హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న కులపోరాటాలపై మోదీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కోరేగావ్ వద్ద జరిగిన యుద్ధంలో అగ్రవర్ణాలపై దళితులు విజయం సాధించి రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పెద్ద సంఖ్యలో దళితులు రాగా.. వారిని కొంతమంది అగ్రకులవర్గాల వారు వ్యతిరేకించారు. పైగా అది ఆంగ్లేయుల విజయం అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఘర్షణలో ఓ అగ్రకులానికి చెందిన యువకుడు మృతిచెందాడు. దీంతో రెండు వర్గాల ఘర్షణగా మారి మహారాష్ట్రలో దళితులు ఉద్యమ రూపంలో ఆందోళన చేస్తున్నారు. ఇది మూడు రోజులైనా ఇప్పటి వరకు చల్లారలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మౌనం వీడాలని ఖర్గే అన్నారు. మోదీ లోక్‌సభ సభ్యుడు అని ఆయన సభకు ఎందుకు రావడం లేదని, ఆయనను వెంటనే రావాలని ఆదేశించాలని స్పీకర్ కోరారు. మరోపక్క, బీజేపీ నేత అనంత్ కుమార్ దీనిపై స్పందిస్తూ కుల చిచ్చును కాంగ్రెస్ పార్టీ మరింత రాజేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో శాంతిని కోరుకోవడానికి బదులు ఆ ఆపర్టీ విభజన రాజకీయాలు చేస్తున్నారని, బ్రిటీష్ వారికి ఏ మాత్రం తీసిపోనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
బీహార్‌లో దారుణం
సాక్షి,పాట్నాఃబీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో శనివారం జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో దళిత దంపతులను, ఓ బాలికను దుండగులు హతమార్చారు. బెగుసరాయ్ జిల్లా ధరమ్‌పూర్ గ్రామంలో దళితులైన రాంచందర్ పాశ్వాన్ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు ఇటుకలతో దారుణంగా కొట్టి చంపారు. దళిత జంట నిద్రిస్తుండగా దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. హత్యాకాండకు నిరసనగా గ్రామస్తులు రోడ్లు దిగ్భందించి, టైర్లను తగులబెట్టారు. మరో ఘటనలో సివాన్ జిల్లాలోని చచపోలి గ్రామంలో దళిత బాలికను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. తన ప్రేమను నిరాకరించడంతో ఆగ్రహించిన లఖన్‌రామ్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. రెండు కేసులకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
మోడీ మౌనంలోని ఆంతర్యం ఏమిటి?
పాట్నా: దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. రెండురోజులుగా దేశంలో దళితులపై దాడులు .జరుగుతున్నా మోదీ స్పందించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని లాలూ ప్రశ్నించారు. మోదీ ప్రోత్సాహంతోనే దేశంలో పేదలు,దళితులపై దాడులు జరుగుతున్నాయని ట్వీట్ చేశారు. లాలూ కుమారుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని ముందుగా దళితుల దాడులపై స్పందించాలని ట్వీట్ చేశారు. దానికి రిప్లేగా లాలూ ఈ ట్వీట్ చేశారు. గుజరాత్ లోని ఉనాలో దళితులు ఆవుల చర్మం ఒలిచారని వారిపై కొందరు గోసంరక్షణ కార్యకర్తలు దాడి చేసిస విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు బిహార్ లోని ముజఫర్ పూర్ లో ఇద్దరు దళతులపై దాడులు జరిగాయి.