బీహార్‌లో దారుణం | Dalit couple, girl killed in Bihar | Sakshi
Sakshi News home page

బీహార్‌లో దారుణం

Published Sat, Sep 23 2017 7:37 PM | Last Updated on Sat, Sep 23 2017 7:38 PM

Dalit couple, girl killed in Bihar

సాక్షి,పాట్నాఃబీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో శనివారం జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో దళిత దంపతులను, ఓ బాలికను దుండగులు హతమార్చారు. బెగుసరాయ్‌ జిల్లా ధరమ్‌పూర్‌ గ్రామంలో దళితులైన రాంచందర్‌ పాశ్వాన్ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు ఇటుకలతో దారుణంగా కొట్టి చంపారు. దళిత జంట నిద్రిస్తుండగా దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

హత్యాకాండకు నిరసనగా గ్రామస్తులు రోడ్లు దిగ్భందించి, టైర్లను తగులబెట్టారు. మరో ఘటనలో సివాన్‌ జిల్లాలోని చచపోలి గ్రామంలో దళిత బాలికను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. తన ప్రేమను నిరాకరించడంతో ఆగ్రహించిన లఖన్‌రామ్‌ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. రెండు కేసులకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement