బెంగుళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మంత్రి డి. సుధాకర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
సుబ్బమ్మ, ఆశ అనే ఇద్దరు మహిళలు ఎఫ్ఐఆర్‌లో తెలిపిన వివరాల ప్రకారం మంత్రి సుధాకర్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి బెంగళూర్ యలహంక ప్రాంతానికి చేరుకుని మహిళలు నివాసముండే స్థలంలోని ఆస్తులను కూల్చే ప్రయత్నం చేశారు. జేసీబీ వాహనంతో సహా వచ్చిన ఆ గుంపులో సుమారు 40 మంది ఉండగా వారిలో 15 మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపారు.
సంఘటనా స్థలంలో ఇళ్ల పైకప్పులు ప్రహారి గోడలను కూలుస్తుండగా దళితులైన తల్లీ కూతుళ్లు సుబ్బమ్మ, ఆశ వచ్చి వారిని నిలదీయగా ఆ గుంపు కులం పేరుతో దూషిస్తూ వీరిపై దాడికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో మంత్రి సుధాకర్‌పైనా ఆయన అనుచరులు శ్రీనివాస్, భాగ్యమ్మల తో సహా మరో 35 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు.
ఇది కూడా చదవండి: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది
Comments
Please login to add a commentAdd a comment