SC ST Prevention of Atrocities Act
-
‘ఇన్ఫోసిస్ సేనాపతి’పై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(Indian Institute of Science)లో ఓ ప్రొఫెసర్ విషయంలో హనీట్రాప్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ పరిణామం చోటు చేసుకుంది.గతంలో.. సంచలన అభియోగాల మీద ప్రొఫెసర్‌గా పని చేసిన దుర్గప్పను ఐఐఎస్సీ(IISc) విధుల నుంచి తొలగించింది. అయితే.. సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్(Senapathy Kris Gopalakrishnan)తో పాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం సహా మరికొందరు తనపై కుట్ర చేశారని, హనీట్రాప్ కేసులో ఇరికించారని దుర్గప్ప ఆరోపిస్తున్నారు. అంతేకాదు కులం పేరుతో తనను దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు..సోమవారం కోర్టును ఆశ్రయించారు. దీంతో.. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. బెంగళూరు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ ఆరోపణలపై ఇటు గోపాలకృష్ణన్కానీ, అటు ఐఐఎస్ బోర్డుకానీ స్పందించలేదు. ప్రస్తుతం గోపాలకృష్ణన్ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు.1981, జులై 2వ తేదీన ఇన్ఫోసిస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నారాయణమూర్తితో పాటు సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్, మరో ఐదుగురు కలిసి ఈ కంపెనీని పుణే(మహారాష్ట్ర)లో తొలుత ప్రారంభించారు. -
Supreme Court: కులం పేరిట వేధిస్తేనే... ఎస్సీ, ఎస్టీ కేసు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు‘ అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ‘బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్ 3(1)(ఆర్) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం‘ అని స్పష్టం చేసింది. ‘షాజన్ కేసులో అదేమీ కని్పంచడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు‘ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. -
Mallareddy: మల్లారెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దళిత కుటుంబంపై కర్ణాటక మంత్రి దాడి
బెంగుళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మంత్రి డి. సుధాకర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సుబ్బమ్మ, ఆశ అనే ఇద్దరు మహిళలు ఎఫ్ఐఆర్లో తెలిపిన వివరాల ప్రకారం మంత్రి సుధాకర్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి బెంగళూర్ యలహంక ప్రాంతానికి చేరుకుని మహిళలు నివాసముండే స్థలంలోని ఆస్తులను కూల్చే ప్రయత్నం చేశారు. జేసీబీ వాహనంతో సహా వచ్చిన ఆ గుంపులో సుమారు 40 మంది ఉండగా వారిలో 15 మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలంలో ఇళ్ల పైకప్పులు ప్రహారి గోడలను కూలుస్తుండగా దళితులైన తల్లీ కూతుళ్లు సుబ్బమ్మ, ఆశ వచ్చి వారిని నిలదీయగా ఆ గుంపు కులం పేరుతో దూషిస్తూ వీరిపై దాడికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీంతో మంత్రి సుధాకర్‌పైనా ఆయన అనుచరులు శ్రీనివాస్, భాగ్యమ్మల తో సహా మరో 35 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది -
కర్ణాటకలో ఘాతుకం.. మైనర్ బాలికపై..
బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గలో ఒక చర్చి ప్రతినిధి తన కళాశాలలో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నందుకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా గురువారానికి ఫెర్నాండెస్ ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. శివమొగ్గలోని ఓ చర్చిలో పనిచేస్తోన్న ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ చర్చి అనుబంధ కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతొ వేధింపులకు గురిచేస్తున్నట్లు స్థానిక కోటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తలిదండ్రులు. పోలీసులు ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ పై పోక్సో చట్టం తోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండుకు తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్ బాలిక బంధువులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు తరలి వచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. -
టీడీపీ నేతల బరితెగింపు
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరి తెగించారు. మంగళవారం రాత్రి బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడి దౌర్జన్యం చేశారు. అడ్డొచ్చిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నానా దుర్భాషలాడారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని సాకుగా తీసుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరితో పాటు పలువురు ఆ పార్టీ నాయకులు అలజడి సృష్టించారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 2019 సంవత్సరంలో రైతులకు ఉచితంగా సబ్మెర్సిబుల్ మోటార్లు పంపిణీ చేశారు. అప్పట్లో మిగిలిపోయిన మోటార్లు ప్రస్తుతం కర్ణాటకకు తరలుతున్నాయంటూ తాజాగా సోషల్‌మీడియాలో ఓ పోస్టు వచ్చింది. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ చౌదరితో పాటు ఆ పార్టీ నాయకులు హైడ్రామాకు తెర తీశారు. మోటార్లు తరలుతున్న వాహనాన్ని ఉన్నం మారుతీ చౌదరి వెంబడించినట్లు, అది కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం లక్ష్మంపల్లికి వెళ్లినట్లు కట్టుకథ అల్లారు. సోదరుడు ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరి, మరికొందరు టీడీపీ నాయకులతో కలసి మారుతీ చౌదరి నేరుగా లక్ష్మంపల్లిలోని బలహీన వర్గానికి చెందిన వడ్డే శారదమ్మ ఇంటి వద్దకు చేరుకున్నాడు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడుతున్న టీడీపీ నేతలను శారదమ్మ, కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తూ లోపలికి చొరబడ్డారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక దళిత యువకుడు విరుపాక్షిని కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. గాయపడిన అతను ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శారదమ్మ ఇంటి వద్దకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. రాత్రి సమయంలో ఇంట్లోకి ఎలా చొరబడతారని, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్ఐ యువరాజ్ బుధవారం పోలీసు సిబ్బందితో కలిసి లక్ష్మంపల్లిలో పర్యటించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల అదుపులో ఉన్నం మారుతీ చౌదరి, నేతలు ఉన్నం బ్రదర్స్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై వడ్డే శారదమ్మ, హరిజన విరుపాక్షి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరి, యర్రంపల్లి సత్తి, గోళ్ల వెంకటేశులు, కైరేవు తిమ్మరాజు, కరిడిపల్లి రంగప్పలతో పాటు మరో పదిమందిపై 147, 148, 354, 422 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉన్నం మారుతీ చౌదరితో పాటు టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నాయకులు కౌంటర్ కేసుకు తెర తీశారు. ఉన్నం మారుతీ చౌదరి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు కరిడిపల్లి రంగప్ప తననూ కులం పేరుతో దూషించి, దాడికి యత్నించారంటూ బాధితులపైనే బుధవారం మధ్యాహ్నం శెట్టూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
కులం పేరుతో దూషించారు.. ప్రాణహానీ ఉంది: నిర్మాత ఫిర్యాదు
తాను నిర్మిస్తున్న సినిమాను వివిధ కారణాలతో ఆపేందుకు ప్రయత్నించడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ తనను ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిసీ దర్శకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాలు.. నల్లకుంటలో నివసించే మంచాల ప్రమోద్(27) సినిమాలు నిర్మించేందకు గాను శ్రీనగర్ కాలనీకి వచ్చి సొంత బ్యానర్‌పై ‘కంటోన్మెట్ పోస్టాఫీస్’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నీకు ఎందుకంటూ బాల సతీష్, రాజేష్ చిలువురి అనే ఇద్దరు వ్యక్తులు మానసికంగా వేధిస్తూ తనను సినీ పరిశ్రమ నుంచి దూరం చేసేందుకు యత్నించడమే కాకుండా తన సినిమా నిర్మాణాన్ని ఎలాగైనా ఆపాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అలాగే తనను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తూ ఆత్మహత్యకు కూడా ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. గణపతి కాంప్లెక్స్ వద్ద తనతో పాటు సహాయ దర్శకుడు బి. రవితేజపై కూడా కులం పేరుతో దుషించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల సతీష్, రాజేష్ చిలువూరిలపై బంజారాహిల్స్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు
సాక్షి, అనంతపురం: సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాస్తవానికి ప్రకాష్‌ను రెండు రోజుల క్రితమే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లలో 5 క్రిమినల్ కేసులు కానిస్టేబుల్ ప్రకాష్‌పై నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు, దాడి, అక్రమ ఆయుధాల సరఫరా వంటి కేసులు ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళను లొబర్చుకొని ఆమె నుంచి రూ.10లక్షల నగదు, 30 తులాల బంగారు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రకాష్‌పై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. ఆరోపణలు నిజమని తేలడంతో కానిస్టేబుల్ ప్రకాష్‌ను డిస్మిస్ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (పోలీసులపై తప్పుడు కథనాలు.. ఈనాడుకు ఎస్పీ ఫకీరప్ప నోటీసులు) డిస్మిస్ వెనుక కక్ష సాధింపు ఉందని ఎల్లో మీడియా ద్వారా ప్రకాష్ అసత్య ప్రచారం చేశాడు. సీఎం జగన్ చెన్నేకొత్తపల్లి పర్యటన సమయంలో ప్రకాష్.. ఎస్పీ ఆపీస్ సేవ్ ఏపీ పోలీస్ అంటూ ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశాడు. అందుకే ప్రకాష్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారంటూ ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన ఎస్పీ ఫక్కీరప్ప ప్రకాష్ ప్రవర్తన బాగాలేకపోవడంతో డిస్మిస్ చేసినట్లు స్పష్టం చేశారు. అయితే కక్ష సాధింపుతోనే డిస్మిస్ చేశారని ప్రకాష్ ఆరోపించారు. ఎస్పీతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలను డిఐజీ రవిప్రకాస్ చూస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యే కందికుంటపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
సాక్షి, కదిరి (సత్యసాయి జిల్లా): కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌పై పట్టణ పోలీసులు గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎన్జీఓ కాలనీ చివరలో బుధవారం జరిగిన స్థల వివాదంలో కుటాగుళ్లకు చెందిన ఎరికల గంగులప్పను కులం పేరుతో దూషించినందుకు కందికుంటపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ మధు తెలిపారు. అలాగే గంగులప్ప ఆస్తిని కాజేయాలని చూసిన కందికుంటపై బాధితుడి ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదు చేసినట్లు వివరించారు. భూ వివాదంలో అక్కడికొచ్చి దౌర్జన్యం చేయడం, పెట్రోలు తెచ్చి తగలబెట్టాలని చూడటం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న వారందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. చదవండి: (కదిరి టౌన్ సీఐ మధును చంపాలి) -
జాగు చేయక.. బాగు చేసేలా..
జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నం: 18002021989 హెల్ప్‌లైన్ నం:14566 రాష్ట్రస్థాయి హెల్ప్‌లైన్ నం: 040–23450923 సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనులపై అత్యాచారాల (అట్రాసిటీస్) నిరోధక చట్టం అమలును కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, బాధితులకు పరిహారం అందించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన హెల్ప్‌డెస్క్‌ను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అఘాయిత్యాలను అరికట్టడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌తో పాటు ప్రతి రాష్ట్రంలో ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఒకట్రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా అన్ని కాల్సెంటర్లను ప్రారంభించేందుకు ఆ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల విషయంలో ఆయా వర్గాల్లో అవగాహన కల్పించేలా మరింత ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ హెల్ప్‌డెస్క్ ప్రారంభించిన ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా 4,776 మంది యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా... 295 మంది వినతులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 27 వినతులు (గ్రీవెన్స్) నమోదు అయ్యాయి. ఫిర్యాదుల నమోదు ఇలా... హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదులను అత్యంత సులభంగా సమర్పించవచ్చు. ముందుగా https://nhapoa.gov.in/ లింకు ద్వారా అత్యాచారాల నిరోధానికి జాతీయ సహాయ కేంద్రం (నేషనల్ హెల్ప్‌డెస్క్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) పేజీ తెరవాలి. అనంతరం రిజిస్టర్ యువర్ గ్రీవెన్స్ ఆప్షన్‌ను ఎంచుకుని బాధితుడి వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ తదితర పూర్తి సమాచారాన్ని అందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ మొత్తంగా ఏడు దశల్లో జరుగుతుంది. అనంతరం బాధితుడి ధ్రువీకరణతో ఫిర్యాదు సమర్పణ పూర్తవుతుంది. వినతుల నమోదు తర్వాత వెబ్‌పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు క్షణాల్లో వినతులు/ఫిర్యాదుల చిట్టా మొత్తం చేరుతుంది. అక్కడ పరిశీలన పూర్తి చేసిన తర్వాత అంచెలంచెలుగా అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కరించి కేంద్ర అధికారులకు రాష్ట్ర అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టు (చేపట్టిన చర్యలతో నివేదిక) సమర్పించాల్సి ఉంటుంది. వినతులు, ఫిర్యాదుల నమోదులో కేవలం బాధితులే కాకుండా అట్రాసిటీ చట్టాల అమలుపై పనిచేస్తున్న స్వచ్ఛంధ సంస్థలు కూడా భాగస్వాములు కావొచ్చు. వెబ్‌పోర్టల్ ద్వారానే కాకుండా జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నంబర్, హెల్ప్‌లైన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఇక రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులకు కూడా ఫిర్యాదులు పంపవచ్చు. రాష్ట్రంలో secyscdts@gmail.com ద్వారా మెయిల్ పంపడంతో పాటు 040–23450923 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి వినతులు చెప్పుకోవచ్చు. కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అమలు కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్, వెబ్‌పోర్టల్, కాల్ సెంటర్ల నిర్వహణలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 చొప్పున నిధులు ఖర్చు చేస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం వందశాతం నిధులను కేంద్రమే భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్స్, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పూర్తిస్థాయి ప్రత్యేక కోర్టులు (ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్), స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పూర్తిస్థాయి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర కేటగిరీల్లో ఖర్చు చేయాలి. బాధితులకు న్యాయ సహాయం, పరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని ఈ నిధుల కింద ఖర్చు చేయకూడదు. -
ఎస్సీ విద్యార్ధుల చేత టాయిలెట్లు కడిగించిన ప్రధానోపాధ్యాయురాలు
Chennai Police complaint has been registered against Govt School headmistress తిరుపూర్: తమిళనాడులోని తిరుపూర్‌కు చెందని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్ధులచేత బలవంతంగా టాయిలెట్లు శుభ్రం చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్ధులు శుక్రవారం చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (సీఈఓ) ఆర్ రమేష్‌కు పిర్యాదు చేయడంతో, ప్రధానోపాద్యాయురాలు సప్పెండ్ అయ్యింది. తమిళనాడులోని తిరుపూర్‌లోని ఇడువై గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు, 400 మంది విద్యార్ధులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు గీత (45) మూడేళ్లగా ఈ పాఠశాలలో పనిచేస్తుంది. ఐతే 9, 10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఆమెపై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈవో) ఆర్ రమేష్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు తమను కులం పేరుతో దుర్భాషలాడిందని, మరుగుదొడ్లు శుభ్రం చేయమని బలవంతం చేసిందని విద్యార్థులు ఆరోపించినట్లు రమేష్ తెలిపారు. పాఠశాలను సందర్శించి విచారణ చేసిన అనంతరం ఆమెను సస్పెండ్ చేసినట్లు, సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు పిర్యాదు చేసినట్లు రమేష్ మీడియాకు తెలిపారు. కాగా ప్రధానోపాధ్యాయురాలుపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (వేధింపుల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు(వేధింపుల నిరోధక) చట్టం–1989 సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఒక హెల్ప్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా టోల్–ఫ్రీ నంబర్ 14566 దేశవ్యాప్తంగా నిత్యం అందుబాటులో ఉంటుందని సామాజిక న్యాయ, సాధికారత శాఖ ఆదివారం వెల్లడించింది. మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. వాయిస్ కాల్ లేదా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ) చేయవచ్చని తెలిపింది. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషల్లో సేవలు పొందవచ్చని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు ముగింపు పలికి, రక్షణ కల్పించేలా చట్టంపై అవగాహన కల్పించడమే హెల్ప్‌లైన్ ఉద్దేశమని వివరించింది. ప్రతి ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేస్తామని, బాధితులకు సాయం అందిస్తామని తెలియజేసింది. -
ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డికి రిమాండ్
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రైనీ మహిళా ఎస్ఐపై అదే పీఎస్‌కు చెందిన ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి లైంగికదాడికి యత్నించిన కేసులో అతన్ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ నిమిత్తం మహబూబాబాద్ సబ్ జైలుకు పంపినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో ఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు తెలిపారు. విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను నియమించామన్నారు. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై ఐపీసీ 354, 354ఏ, 354బి, 354డి, 376(2), 511 ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, తప్పుచేసిన వారికి తప్పకుండా శిక్షపడుతుందన్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించనున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. -
ఆలయంలోకి ప్రవేశించొద్దని పెళ్లి బృందంపై దాడి..
భోపాల్: దేశంలో దళితులపై వివక్షతను రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికి కొన్ని చోట్ల దళితులు, గిరిజనులు వివక్షతను ఎదుర్కొంటున్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు .. ఇండోర్ జిల్లాకు చెందిన వికాస్ కల్మోడియా అనే గిరిజన యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో, అతను స్థానిక ఆలయానికి చేరుకున్నాడు. కొంత మంది యువకులు పెళ్లి బృందాన్ని ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వరుడి బంధువులు ఆలయంలో ప్రవేశించేది లేదని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా, వివాహ బృందంపై దాడికి తెగపడ్డారు. ఈ క్రమంలో వరుడి తండ్రి ఓం ప్రకాశ్ తమపై దాడిచేసిన యువకులపై స్థానిక మన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివాహ బృందాన్ని భారీ భద్రత మధ్య ఆలయ దర్శనం కల్పించారు. ఆ తర్వాత నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరితో పాటు మరో 9 మంది గుర్తు తెలియని యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసులను నమోదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న మన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా విచారించాలి
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు పారదర్శకంగా సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ చట్టం–1989 (సవరణ చట్టం–2015) అమలుపై రాష్ట్రస్థాయి హైపవర్ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం (వర్క్‌షాప్) శుక్రవారం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రెవెన్యూ, పోలీస్, ప్రాసిక్యూషన్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు హాజరైన ఈ వర్క్‌షాప్‌ను డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, బాలల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు ఆయన తమకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. సామాజిక మార్పు, చైతన్యం తీసుకురావడం కోసం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రాసిక్యూషన్, పోలీస్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ విభాగాలు ప్రధాన స్తంభాలుగా నిలబడి సమన్వయంతో పనిచేస్తే ఎస్సీ, ఎస్టీ కేసుల్లో సత్వర న్యాయం అందించవచ్చన్నారు. ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఏపీఎస్సీసీఎఫ్సీ వైస్ చైర్మన్, ఎండీ శామ్యూల్ ఆనంద్‌కుమార్, హైకోర్టు రిజి్రస్టార్ భానుమతి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ పాల్గొన్నారు. -
యువరాజ్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
చండీగఢ్: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. గతేడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో సందర్భంగా యువరాజ్ సింగ్.. తోటి క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హరియాణాకు చెందిన ఓ లాయర్ హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్లో యువరాజ్‌పై పిర్యాదు చేశారు. ఆయనపై భారతీయ శిక్షాస్మృతిలోని 153, 153 ఏ, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లోని 3 (1) (ఆర్), 3 (1) ఎస్) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గత సంవత్సరం జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్లో పాల్గొన్నన్నారు యువరాజ్ సింగ్. ఈ క్రమంలో తోటి ఆటగాడైన యజువేంద్ర చహల్‌ను ఉద్దేశించి మాట్లాడాడు యువరాజ్ సింగ్. ఆ సమయంలో యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ప్రసావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో యువరాజ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై స్పందించిన యువరాజ్.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లోనే ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని, నిమ్న కులాలను లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై లాక్డౌన్ అనంతరం విచారణ జరిపి, వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన హిస్సార్ పోలీసులు.. ప్రస్తుతం యువరాజ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయడం గమనార్హం. త్వరలోనే యువరాజ్‌కు నోటీసులు పంపి ఆయనను విచారిస్తామని ఓ అధికారి వెల్లడించారు. చదవండి: యువీకి సరికొత్త తలనొప్పి 'నా తండ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి' -
కి‘లేడీ’: ఎస్సైలనే బ్లాక్మెయిల్ చేస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఎస్సైలను బ్లాక్మెయిల్ చేసి.. డబ్బులు వసూలు చేసిన కిలాడి లేడీ లతా రెడ్డిని బుధవారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసిన లతా రెడ్డి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించింది. పోలీసు అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేదాన్నని తెలిపింది. వివరాలు.. టైలర్‌గా పని చేస్తోన్న లతా రెడ్డి.. తరచుగా ఏదో ఒక సాకుతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఎస్సైలతో పరిచయం పెంచుకునేది. కొద్ది రోజుల పాటు వారితో చనువుగా మెలిగేది. ఆ తర్వాత సమయం చూసుకుని వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సదరు ఎస్సైల మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించేది. ఎస్సైలు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎస్సైలను బెదిరించి డబ్బు వసూలు చేసింది. అయితే నిందితురాలు ఇంతా జరిగినా ఒక్క ఎస్సై కూడా ఆమె మీద ఫిర్యాదు చేయకపోవడం విశేషం. చివరకు ఓ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వనస్థలిపురం పోలీసులు లతా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా.. -
కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒకరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. దళిత పోలీస్ అధికారిని దూషించిన కేసులో ఇటీవల అరెస్ట్ అయిన జేసీని శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో పోలీసులు ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. (జేసీ ప్రభాకర్‌రెడ్డికి డీఎస్పీ వార్నింగ్!) త్రీటౌన్ పీఎస్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. దళిత సీఐ దేవేంద్రను ఎందుకు దూషించారు? పోలీసు అధికారులపై పదేపదే ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారు? కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించలేదు? జనంతో ఎందుకు ర్యాలీ నిర్వహించారు? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నలు సంధించారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేశారు. (దురుసు ప్రవర్తన.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్) -
టీడీపీ సీనియర్ నేతలపై ఎస్సీ,ఎస్టీ కేసు
సాక్షి, తూర్పుగోదావరి : టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, పిల్లి అనంతలక్ష్మి దంపతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కుమారుడు రాధాకృష్ణకు భార్య ఉండగానే రెండో పెళ్లి చేసేందుకు యనమల, చినరాజప్ప, పిల్లి అనంతలక్ష్మి దంపతులు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భర్తకు రెండో పెళ్లి చేయించేందుకు యత్నించారని మంజుప్రియ వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంజు ప్రియ ఫిర్యాదుతో తొండంగి పోలీస్‌స్టేషన్‌లో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1 పిల్లి రాధాకృష్ణ, ఏ2 పిల్లి సత్యనారాయణ, ఏ3 పిల్లి అనంతలక్ష్మి, ఏ4 యనమల కృష్ణుడు, ఏ5 యనమల రామకృష్ణుడు, ఏ6 చినరాజప్ప, ఏ7 సరిదే హరిలుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ( రెండో పెళ్లికి యత్నం; టీడీపీ నేతలే పెద్దలు ) కాగా, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతుల కుమారుడు రాధాకృష్ణకు బుధవారం అర్ధరాత్రి రెండో వివాహం చేసేందుకు యత్నించారు. దీనికి మాజీమంత్రులు యనమల, చినరాజప్ప తదితర టీడీపీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రాధాకృష్ణ ఇదివరకే తనను పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టాక తనను మోసంచేసి, ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నాడని సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన పిల్లి మంజుప్రియ బుధవారం కాకినాడ ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
‘జొన్నవిత్తుల’పై కేసు నమోదు
నాంపల్లి: సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంటరానితనాన్ని పునరుద్ధరణ చేసే విధంగా బ్రహ్మణ సమాజాన్ని పురమాయించేలా తెలుగులో పద్యం రాశారంటూ తెలంగాణ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అతని రచనలు ఎస్సీ, ఎస్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. జొన్నవిత్తుల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.(ఆర్జీవీ... ఓ రామబాణం) -
లాక్డౌన్: దళితులపై పెరిగిన దాడులు
చెన్నై: తమిళనాడు రాష్ట్రం వేధింపుల రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నన్ని దాడులు మరే రాష్ట్రంలో జరగడం లేదని మధురైకి చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజుల్లో నలుగురు దళితులు హత్యకు గురయ్యారంటూ సామాజిక కార్యకర్త కథీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన కొందరు లాక్డౌన్ సమయాన్ని దళితులపై దాడి చేసేందుకు ఓ అవకాశంగా వినియోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కథీర్ మాట్లాడుతూ.. ‘40-50 మంది జనాలు గుంపులుగా ఏర్పడి నిమ్నవర్గాల వారిపై దాడులకు పాల్పడుతున్నారు. లాక్డౌన్ సమయంలో ఇది ఎలా సాధ్యమయ్యింది?. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి దేశంలో గృహహింస పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే కేవలం గృహ హింస మాత్రమే కాక కులం పేరుతో జరిగే వేధింపులు కూడా బాగా పెరిగాయి. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేవలం ఒక్క నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 100 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో కొన్ని అత్యాచారం, హత్య, పరువు హత్య వంటి తీవ్ర నేరాలు కూడా ఉన్నాయి’ అని అన్నారు. దేశంలో మొదటి దశ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత మార్చి 29న ఆరనిలోని మోరప్పంతంగల్ గ్రామంలో పరువు హత్య చోటు చేసుకుందని కథీర్ తెలిపారు. ‘గ్రామంలోని ఒద్దార్ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ అనే యువకుడు వన్నియార్ కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. దాంతో సదరు యువతి తల్లిదండ్రులు సుధాకర్ మీద దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు యువతి తండ్రితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో హైకోర్టు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. ఫలితంగా ఈ తరహా కేసుల్లో నిందితులు సులభంగా బెయిల్ పొంది.. శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు’ అంతేకాక ఈ ఘటనల గురించి ప్రచారం చేసిన రిపోర్టర్ల మీద కూడా దాడులు చేస్తున్నారరని కథీర్ ఆరోపించారు. పట్టణాల నుంచి గ్రామాలకు వస్తోన్న నిమ్న వర్గాల వారి మీద కూడా దాడులు పెరిగాయని కథీర్ వెల్లడించారు. ‘పట్టణాల నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు గురవుతున్నారు. అంతేకాక ఉన్నత వర్గాల ప్రజల దళితుల కాలనీల చుట్టు కంచెలు ఏర్పాటు చేసి వారిని గ్రామంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దుకాణాదారులు వారికి నిత్యావసరాలు అమ్మడం లేదు’ కరోనా మహమ్మారి సమయంలో కూడా, కులతత్వం ఆగిపోలేదని.. ఈ వివక్షను, దాడులను ఆపడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని కథీర్ కోరారు. (వలస కూలీలను బూటుకాలితో తన్నిన పోలీస్) -
‘ఎస్సీ, ఎస్టీ చట్టం’ రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం –2018 చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిరూపించలేకపోతే సదరు వ్యక్తికి బెయిల్ మంజూరు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరులంతా సమానమనీ, సోదరభావాన్ని పెంపొందించుకోవాలనీ, ముందస్తు బెయిల్ అవకాశాన్ని దుర్వినియోగం చేయడం పార్లమెంట్ ఉద్దేశాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ ఈ చట్టంలోని సెక్షన్ 18ఏ కింద పార్లమెంట్ ç2018లో సవరణలు చేసింది. అంతకుముందు డాక్టర్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు కొన్ని నిబంధనలను విధించింది. వీటిలో ప్రధానమైవి.. ‘నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండటం. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ చేపట్టడం, అరెస్టు చేయడానికి అనుమతి పొందాల్సి రావడం’. ప్రభుత్వోద్యోగుల విషయంలో అయితే నియామక అధికారి ఆమోదం, ప్రభుత్వేతర ఉద్యోగైతే సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆమోదం పొందాకే అరెస్టు చేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిష్ప్రయోజకంగా మార్చిందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వపు హక్కులకు భంగకరమంటూ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ ఇంకొందరు కోర్టుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీల పట్ల దేశంలో కొనసాగుతోన్న వివక్ష కారణంగా చట్టం రూపకల్పనకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ప్రాథమిక విచారణ అక్కర్లేదని స్పష్టంచేసింది. -
ఎస్సీ, ఎస్టీ చట్టసవరణకు సుప్రీం కోర్టు మద్దతు
-
ఆ చట్టానికి సుప్రీం బాసట..
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి సర్వోన్నత న్యాయస్ధానం మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదుకు సీనియర్ పోలీస్ అధికారి అనుమతి అవసరం లేదని, ప్రత్యేక పరిస్ధితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఉండేలా చట్ట సవరణలో వెసులుబాటు కల్పించారు. ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదంటూ దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో ఆ చట్టానికి కోరలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది. శబరిమల వివాదంపై.. శబరిమల వివాదంపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఒకరి మతం, విశ్వాసాల విషయంలో మరొక మతస్తులు ఫిర్యాదు చేయవచ్చా అనే అంశం సహా పలు కోణాల్లో విచారణను సర్వోన్నత న్యాయస్ధానం చేపట్టనుంది. ఈ వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించేలా సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరిపించనుంది. ఈ విచారణలో పిటిషనర్లకు ఏడు రోజులు, ప్రతివాదులకు ఏడు రోజుల పాటు సుప్రీంకోర్టు సమయాన్ని కేటాయించింది. చదవండి : తీగలాగితే డొంక కదిలింది! -
‘సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోకి’
ఢిల్లీ: సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంచార, విముక్త జాతులను ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావాలని బుధవారం ఆయన రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. సమసమాజ స్థాపన లక్ష్యంగా అణగారిన వర్గాల ప్రజలు దౌర్జన్యాలు, దుర్మార్గాల పాలిట పడకుండా మన రాజ్యాంగ నిర్మాతలు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని గుర్తు చేశారు. సమాజంలో అణచివేతకు, నిరాదరణకు గురయ్యే వర్గాల ప్రజలను అత్యాచారాలు, దౌర్జన్యాల నుంచి కాపాడటం ఈ చట్టం ఉద్దేశమని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను మాత్రమే ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చి మిగిలిన సంచార, విముక్త జాతులను విస్మరించడం దురదృష్టకరమని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సమాజంలో ఈనాటికీ సంచార ఇతర విముక్త జాతుల ప్రజలు దయనీయమైన జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వారు తరచుగా దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్నారని గుర్తుచేశారు. అత్యాచార నిరోధక చట్టం కింద ఉన్న ఎస్సీ, ఎస్టీల కంటే.. వారి పరిస్థితి దారుణంగా ఉందని ఆయన చెప్పారు. ఈ జాతులకు చెందిన ప్రజలను దోపిడీ, దౌర్జన్యాల నుంచి కాపాడటానికి ఇప్పుడు దృఢ నిశ్చయంతో చర్యలు చేపట్టాలన్నారు. అప్పుడే వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సంచార, విముక్త జాతులన్నింటినీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
దళితవర్గాలకు ఉపశమనం
షెడ్యూల్ కులాల, తెగల(అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. ఈ చట్టం కింద ఫిర్యాదులొచ్చినప్పుడు తక్షణం అరెస్టు చేయొద్దని, దాఖలైన కేసు ఈ చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అన్నది తొలుత పరిశీలించాలని గత ఆదేశాల్లో సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులొచ్చినప్పుడు వారి నియామక అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలని, ప్రైవేటు ఉద్యోగుల విషయంలోనైతే సీనియర్ సూపరింటెండెంట్(ఎస్ఎస్పీ) అనుమతి తీసుకోవాలని కూడా నిర్దేశించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవనుకున్న పక్షంలో నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చునని తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ భూషణ్ గవాయ్‌ల నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ మార్గదర్శక సూత్రాల్లో ముందస్తు బెయిల్ అంశం మినహా మిగిలినవాటిని వెనక్కి తీసుకుంది. సుప్రీంకోర్టు నిరుడు ఇచ్చిన తీర్పు దళిత, గిరిజన వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఇప్పటికీ అంటరానితనం బలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి తీర్పు తమ మనుగడకు చేటు కలిగిస్తుందని ఆ వర్గాలు కలవరపడ్డాయి. ఆ తీర్పును నిరసిస్తూ నిరుడు ఏప్రిల్ 2న దేశవ్యాప్త బంద్ జరగడం, అందులో హింస చెలరేగి 11మంది ప్రాణాలు కోల్పోవడం, విధ్వంసం చోటుచేసుకోవడం అందరికీ గుర్తుంది. పర్యవసానంగా కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతోపాటు పలు సంస్థలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధిపత్యకులాల్లో కులదురహంకారం బలంగా ఉన్నదని, దళితులను తోటి మనుషులుగా పరిగణించే మనస్తత్వం కరువైందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1955లో తొలిసారి ఈ వివక్షను అంతమొందించేందుకు అంటరాని తనం(నేరాల)చట్టం తీసుకొచ్చింది. 1976లో దానికి ఎన్నో మార్పులు, చేర్పులు చేసి పౌరహక్కుల చట్టంగా కొత్త చట్టాన్ని రూపొందించారు. ఆచరణలో లోటుపాట్లను గుర్తించాక 1995లో దానికి మరికొన్ని నిబంధనలు జోడించారు. కానీ ఎన్ని మార్పులు చేసినా ఆశించిన ఫలితం రాలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదు. దళితులకు కనీస హక్కులు నిరాకరించడం, వారి ప్రాణాలు తీయడం, ఇబ్బందులకు గురిచేయడం వంటివి ఉన్నకొద్దీ పెరుగుతూ పోయాయి. దేశంలోని పలుప్రాంతాల్లో దళితుల ఊచకోతలు యధేచ్ఛగా సాగాయి. ఈ తీరు గమనించాక 1989లో మరింత పకడ్బందీ నిబంధనలతో షెడ్యూల్ కులాల, తెగల(అత్యాచారాల నిరోధక) చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే కేవలం చట్టాల వల్ల మనుషుల్లో మార్పు రాదు. అవి సక్రమంగా అమలైనప్పుడే, నిందితులకు సత్వరం శిక్షలు పడే వ్యవస్థ ఉన్నప్పుడే ఎంతోకొంత ఫలితం వస్తుంది. దాన్ని చక్కదిద్దే దిశగా చర్యలు తీసుకోవాల్సిన తరుణంలో అసలు చట్టాన్నే నీరుగారిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని సుప్రీంకోర్టు గమనించలేకపోయింది. అయితే ఈ చట్టం దుర్వినియోగం కావడం లేదని చెప్పడం అసత్యమే అవుతుంది. కానీ ఆ నిర్ధా రణకు రావడానికి సుప్రీంకోర్టు చూపిన కారణాలు సబబుగా లేవు. ఈ చట్టం కింద దాఖలవుతున్న కేసుల్లో శిక్షల శాతం తక్కువ గనుక అది దుర్వినియోగమవుతున్నట్టేనని భావించడం సహేతుకం కాదు. అదే గీటురాయి అన్ని చట్టాలకీ వర్తింపజేస్తే వాటిలో ఎన్ని మిగులుతాయో చెప్పడం కష్టం. కేవలం తప్పుడు కేసులు పెట్టడం ఎక్కువగనకే ఫలానా చట్టంకింద శిక్షలు పడటం తక్కువన్న నిర్ధారణకు రాలేం. అందునా వివక్షను అంతమొందించడానికి ఉద్దేశించిన షెడ్యూల్ కులాల, తెగల చట్టం కింద ఫిర్యాదులొచ్చినప్పుడు పోలీసులు వాటిని వెంటనే స్వీకరించి నిందితులపై చర్యలు తీసుకుంటారని ఆశించలేం. ఎందుకంటే ఇలాంటి నేరాలకు పాల్పడేవారంతా సమాజంలో ఎంతో పలుకుబడిగలవారు అయి ఉంటారు. ఎవరినైనా కొనగల స్థాయిలో ఉంటారు. తమనెవరూ ఏం చేయలేరనే భరోసాతో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగడం అంత సులభం కాదు. ఎవరి ఒత్తిళ్లకూ, ఏ ప్రలోభాలకూ లొంగని వ్యక్తిత్వం ఉండే అధికారులు మాత్రమే నిష్పక్షపాతంగా వ్యవహరించగలుగుతారు. ఇవేమీ లేనప్పుడు ఫిర్యాదు చేయడానికెళ్లిన దళితులకు బెదిరింపులు ఎదురవుతాయి. కొన్నిసార్లు వారికి డబ్బు ఆశ చూపి రాజీ పడమని చెబుతారు. ‘పెద్దవాళ్ల’తో పెట్టుకుంటే ముందూమునుపూ ముప్పు కలుగుతుందంటారు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో తాత్సారం చేస్తారు. చివరకు కేసు పెట్టినా అందులో దర్యాప్తు సక్రమంగా ఉండదు. న్యాయస్థానాల వరకూ వెళ్లాక సాక్షుల్ని బెదిరిస్తారు. విచారణ ఏళ్ల తరబడి సాగడం వల్ల దళితులే నిరాశకులోనై ఆసక్తిని కోల్పోతారు. ఇవేమీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నిందితులకు శిక్ష పడుతుంది. ఎస్సీ, ఎస్టీ చట్టంకింద వచ్చే ఫిర్యాదుల్లో 50 శాతం వరకూ న్యాయస్థానాలముందుకే పోవని నాలుగేళ్లక్రితం ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ జరిపిన అధ్యయనంలో తేలింది. కనుక శిక్షల శాతం తక్కువుండటాన్ని బట్టి దాని దుర్వినియోగాన్ని నిర్ధారించడం పొరపాటు. దీనికితోడు దేశవ్యాప్తంగా దళితులపై వేధింపుల ఉదంతాలు నానాటికీ పెరుగుతున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నివేదిక చెబుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవడం స్వాగతించదగ్గది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి తగిన దర్యాప్తు జరపడం పోలీసుల విధి అని సుప్రీంకోర్టు తాజా తీర్పులో తెలియజేసింది. అయితే ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేదని తేలినపక్షంలో బాధ్యులైనవారిపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉండాలి. ఎందుకంటే దాన్నిబట్టే నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరవుతుంది. కనుక ఈ విషయంలో తగిన దృష్టి పెట్టాలి. -
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలనం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల్లో 2018లో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుంది. గతేడాది మార్చి 20న ఇచ్చిన తీర్పు పునఃసమీక్ష కోరుతూ కేంద్రం దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. గత ఉత్తర్వులను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో యథావిధిగా తక్షణ అరెస్ట్ అమల్లోకి వస్తుంది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు దర్యాప్తు కూడా అవసరం లేదు. పిటిషన్ విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎస్సీ,ఎస్టీలు ఇప్పటికీ సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. సమానత్వం కోసం వీరు చేస్తోన్న పోరాటం ముగియలేదని వ్యాఖ్యానించింది. -
ఎస్సీ, ఎస్టీ చట్టం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు గతంలో ఇచి్చన తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేలా ఉందన్న కేంద్రం వాదనపై తీర్పును సుప్రీం రిజర్వ్‌లో ఉంచింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దురి్వనియోగం చేస్తున్నారంటూ, అట్రాసిటీ కేసులో డీఎస్పీ స్థాయి అధికారి విచారణను తప్పనిసరి చేస్తూ 2018లో తీర్పు ఇచి్చన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వచ్చే వారానికల్లా ఇరు పారీ్టలు లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని సూచిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎమ్ఆర్ షా, జస్టిస్ బీఆర్ గవైల ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. తాము చట్టప్రకారమే కొన్ని సూచనలిస్తామని, అవి సమానత్వాన్ని పెంపొందించేలా ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టాన్ని దురి్వనియోగం చేస్తున్నారన్న కారణంతో చట్టాన్ని తీసేయలేమని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేసింది. కుల ప్రాతిపదికన ఒక వ్యక్తిని (బాధితుడిని) అనుమానిస్తారా ? ఇతర సామాజిక వర్గాల వారు కూడా తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయవచ్చు అని అభిప్రాయపడింది. ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తే విచారణ అవసరం లేదని, కానీ ఎస్సీ,ఎస్టీ వర్గాల వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే అధికారి విచారణ అవసరం అనడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. -
‘ఎస్సీ, ఎస్టీ’ తీర్పుపై సమీక్షకు ఓకే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గత ఏడాది ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. కేసును వచ్చే వారం త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టులకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు 2018 మార్చి 20న కొన్ని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఈ చట్టం దుర్వినియోగమవుతోందని అభిప్రాయపడ్డ అత్యున్నత న్యాయస్థానం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్షణం అరెస్ట్ చేయడం కుదరదని తీర్పునిచ్చింది. ప్రభుత్వ అధికారులు ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అవడం వల్ల వారి విధి నిర్వహణ కుంటుపడుతోందని పేర్కొంది. అంతేకాకుండా, ముందస్తు బెయిల్ ఇవ్వడంపై ఎలాంటి నిషేధాలు లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసేందుకు ఉన్నతస్థాయి అధికారి అనుమతి అవసరమని కూడా ఆ తీర్పులో పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఈ తీర్పు సమస్యాత్మకమైందని, సమీక్షించాలని కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై మే 1వ తేదీన వాదనలు పూర్తి కాగా తాజా తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ వచ్చిన చట్టంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ముస్లిం న్యాయవాదుల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం చేసిన ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఇన్ మ్యారేజీ) చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన పలు పిటిషన్లకు తాజా పిటిషన్‌ను జత చేశారు. ఇదిలా ఉండగా.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
నన్నపనేని వ్యాఖ్యలపై దళితుల ఆగ్రహావేశాలు
సాక్షి, కాకినాడ సిటీ : దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారిని తక్షణం అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శిక్షించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో దళితులు గురువారం ఆందోళన చేశారు. నగరంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. నన్నపనేని దిష్టిబొమ్మను ర్యాలీగా తీసుకెళ్లి ఇంద్రపాలెం వంతెన సమీపం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా దహనం చేశారు. నన్నపనేని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు దళితులను కించపరచడం, దళితుల మధ్య చిచ్చు పెట్టడం అలవాటుగా మారిపోయిందని ఆయన విమర్శించారు. గతంలో దళితుల్ని తీవ్రంగా అవమానించిన చంద్రబాబు, పల్నాడులో దళితుల కోసం పోరాడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ చింతమనేని ప్రభాకర్ దళితులను ఎలా కించపరిచారో అందరికీ తెలిసిందేనన్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ పాలనలో దళితులు కనీసం ధర్నా కూడా చేయనీయలేదన్నారు. పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబు కాదా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు దళితులపై తప్పుడు కేసులు, రౌడీషీట్లు పెట్టి వేధింపులకు గురి చేశారని, కనీసం ఇప్పుడైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకొని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి బీఎన్ రాజు, హరిబాబు, శ్యామ్ దయాకర్, బోను దేవా, బాబీ, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు దిష్టిబొమ్మతో ర్యాలీ.. జీజీహెచ్ వద్ద ఉన్న పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ మీదుగా ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేడ్కర్ విగ్రహం వరకు చేశారు. -
పరారీలో చింతమనేని ప్రభాకర్
సాక్షి, పశ్చిమగోదావరి : దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం అయింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నట్లు సమాచారం. గురువారం పినకడిమిలో దళిత యువకులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న చింతమనేని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. (చదవండి : దళిత యువకులపై దాడికి యత్నం) -
శంకర్‌రెడ్డి దొరికాడు..
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెజవాడ శంకర్‌రెడ్డి పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటంతో పాటు లైంగి కంగా వేధింపులకు పాల్పడగా ఫిబ్రవరి 2న అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ ఘటనతో పరారీలో ఉన్న హెచ్ఎంను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మంరూరల్ ఏసీపీ రామోజీ రమేష్ వివరాలను వెల్లడించారు. హెచ్ఎం శంకర్‌రెడ్డి పాఠశాలలోని పలువురు విద్యార్థినులపై చేతులు వేయటం, వారిని తనపై కూర్చోబెట్టుకోవటం, లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిబ్రవరి 2న బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న హెచ్ఎం పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతన్ని డీఈఓ సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న హెచ్ఎం గుజరాత్, హైదరాబాద్ ప్రాంతాల్లో తలదాచుకోగా పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చేపట్టారు. ఇటీవల రైలులో ఖమ్మం వస్తున్న విషయాన్ని తెలుసుకుని సిబ్బంది అప్రమత్తం కాగా గమనించి పరారయ్యాడు. మంగళవారం ఉదయం కూసుమంచిలో తనకు తెలిసిన వారిని కలిసేందుకు రాగా సమాచారం తెలుసుకుని ఎస్ఐ అశోక్ అతన్ని అరెస్ట్ చేశారు. విద్యార్థినులను వేధించిన ఫిర్యాదుపై తాము అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, బాధితుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. శంకర్‌రెడ్డిపై పోస్కో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. -
అగ్రవర్ణాల దాడిలో గాయపడ్డ దళితుడి మృతి
నైనిటాల్ : ఉత్తరాఖండ్‌లో గతనెల 26న ఓ వివాహ రిసెప్షన్లో తమ ఎదురుగా భోజనం చేసినందుకు అగ్ర వర్ణాల చేతిలో భౌతిక దాడికి గురైన దళిత యువకుడు మరణించాడు. దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తక్కువ కులానికి చెందినప్పటికీ తమ సరసన భోజనం చేశాడనే ఆగ్రహంతో జితేంద్ర అనే దళితుడిని తెహ్రి జిల్లా ష్రికోట్ గ్రామంలో అగ్రకులాల వ్యక్తులు చితకబాదారని పోలీసులు తెలిపారు. కాగా, బాధితుడు తొమ్మది రోజుల పాటు డెహ్రడూన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. జితేంద్ర సోదరి ఫిర్యాదుతో ఏడుగురు నిందితులు గజేంద్ర సింగ్, శోభన్ సింగ్, కుషాల్ సింగ్, గబ్బర్ సింగ్, గంభీర్ సింగ్, హర్బీర్ సింగ్, హుకుం సింగ్‌లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
నటి భానుప్రియపై మరో ఫిర్యాదు
సాక్షి, తూర్పుగోదావరి : పనిమనిషి వివాదం సద్దుమణగకముందే మరో సమస్యలో చిక్కుకున్నారు సినీ నటి భానుప్రియ. ఆమె మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు దళిత, ప్రజా సంఘాల నేతలు. ఈ మేరకు సోమవారం పెద్దాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. వివరాలు.. వడ్లమూరుకు చెందిన ఇద్దరు దళిత మైనర్ బాలికలతో భానుప్రియ వెట్టి చాకీరి చేయించుకున్నారంటూ భానుప్రియతో పాటు ఆమె తల్లి, సోదరుని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌తో పాటు.. చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయాలంటూ దళిత, ప్రజా సంఘాలు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ తన కుమార్తెను వేధిస్తున్నారంటూ భానుప్రియ, ఆమె సోదరుని మీద సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభావతి కుమార్తె తన ఇంట్లో దొంగతనం చేసిందని.. ఆ విషయం అడిగినందుకు తమ మీద తప్పుడు కేసులు పెట్టిందంటూ భానుప్రియ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రభావతి, ఆమె కుమార్తెను అరెస్ట్ చేశారు. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో చేర్చాలని వచ్చిన పిటిషన్‌పై స్టే విధించడం కుదరదని మరోసారి స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్, తదుపరి వాదనలపై ఫిబ్రవరి 19న విచారణ చేపడతామని జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరమున్నందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలను వెంటనే నిలిపి వేయాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలపై ధర్మాసనం ఈమేరకు స్పందించింది. కాగా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం–2018 కింద నిందితులకు ఎలాంటి ముందస్తు బెయిల్ నిరాకరించరాదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పార్లమెంటు ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణల బిల్లుకు గతేడాది ఆగస్టు 9న ఆమోదం తెలిపింది. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టే జారీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో జోడిస్తూ తీసుకువచ్చిన సవరణలపై స్టే ఇవ్వాలన్న అప్పీల్‌ను నిలిపివేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌తో పాటు అన్ని అంశాలను ఫిబ్రవరి 19న విచారణ చేపడతామని న్యాయస్ధానం వెల్లడించింది. ఈ అంశాన్ని లోతుగా విచారించాల్సిన అవసరం ఉన్నందున దీనికి సంబంధించిన అన్ని అంశాలను వచ్చే నెల 19న వాద, ప్రతివాదనలను కోర్టు పరిశీలిస్తుందని జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ పేర్కొంది. చట్టానికి చేసిన మార్పులను తక్షణమే నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించగా, ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విచారణ లేకుండానే అరెస్టులు వద్దంటూ గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ చట్టాన్ని బలోపేతం చేస్తూ గత ఏడాది ఆగస్ట్ 9న పార్లమెంట్ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై స్టేకు ససేమిరా
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి చేసిన సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేధింపుల కేసులో నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వొద్దనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఈ సవరణల్లో పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. 2018 మార్చి 20వ తేదీన ఎస్సీ, ఎస్టీ చట్టంలో సుప్రీంకోర్టు సవరణలు చేసింది. ఈ సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని పునర్ నియమించాలని సూచించింది. ఈ పిటిషన్లపై విచారణకు జస్టిస్ యూయూ లలిత్‌ను చేర్చి తిరిగి ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది. గతేడాది ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ లలిత్ భాగమైనందున ఆయనను ఇందులో చేర్చాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ అరెస్టులను నిలువరించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చుతూ కేంద్ర ప్రభుత్వం నూతన సవరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై స్టేకు సుప్రీం నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద నిందితుడికి ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సవరణ, 2018పై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్ధానం గురువారం నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను, మార్చి 20న ఈ అంశంపై సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లను కలిపి విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఈ చట్టాన్ని నిర్వీర్వం చేస్తుందనే ఆందోళనతో గత ఏడాది ఆగస్ట్ 9న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ చట్టం తీవ్రంగా దుర్వినియోగమవుతుందంటూ దీనికి సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ అరెస్ట్‌లను నిలువరించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చుతూ ప్రభుత్వం నూతన సవరణలు చేపట్టింది. కాగా ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగిపై దాఖలైన కేసుల్లో నిర్ధిష్ట అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే అరెస్ట్ చేయాలనే నిబంధనలు సహా సుప్రీం కోర్టు పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని పరిష్కరిస్తూ ఈ చట్టానికి కోరలు తెచ్చేలా పార్లమెంట్లో ప్రభుత్వం సంబంధిత చట్టానికి నూతన సవరణలు ప్రతిపాదించింది. -
‘వారం లోగా చింతమనేనిని అరెస్ట్ చేయాలి’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాలంటూ కమ్యూనిస్ట్ నేతలు డీజీపీని కలిశారు. కొన్ని నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కేస్‌లో చింతమనేనిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ, సీపీఎం నాయకుడు వైవీ, న్యూడెమోక్రసి నేతలు నెల్లిమర్ల ప్రసాద్, డేగా ప్రసాద్‌లు డీజీపీని కలిసి.. చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందిగా కోరారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అండ చూసుకునే చింతమనేని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రౌడీయిజం చేసే ఎమ్మెల్యేలను చంద్రబాబు కాపాడుతున్నారంటూ ఆరోపించారు. వారం రోజుల్లోగా చింతమనేనిని అరెస్ట్ చేయకపోతే విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు -
ఎస్సీ, ఎస్టీ చట్టం : విచారణ తర్వాతే అరెస్ట్‌లు
భోపాల్ : ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారణ లేకుండా రాష్ట్రంలో అరెస్ట్‌లు ఉండవని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో చెలరేగిన నిరసనల నేపథ్యంలో సీఎం ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం చేయడాన్ని మధ్యప్రదేశ్‌లో అనుమతించబోమని, విచారణ అనంతరమే అరెస్టులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. త్వరలోనే ఈ దిశగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 6న అగ్రవర్ణ సంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలో కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం వరకూ నిరసన ర్యాలీ చేపట్టామని బ్రహ్మ సమాగమ్ సవర్ణ జన్‌కళ్యాణ్ సమాజ్ కన్వీనర్ ప్రహ్లాద్ శుక్లా చెప్పారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకున్నారన్నారు. -
దళిత నాయకుడిపై దురుసు ప్రవర్తన
అమరచింత (కొత్తకోట) : స్వాతంత్య్ర దినోత్స వాన్ని పురస్కరించుకుని బుధవారం అమరచింత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వివిధ పార్టీల నాయకులు గ్రామాభివృద్ధిపై ఉపన్యసించారు. ఇందులో భాగంగానే బీఎల్ఎఫ్ మండల కన్వీనర్ తిమ్మోతి దళితవాడల అభివృద్ధి మరుగున పడిందని సభాముఖంగా సమస్యలు తెలియజేస్తుండ గా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మేర్వరాజు అడ్డుతగిలి తిమ్మోతి చేతిలోని మైకును లాక్కుని దురుసుగా ప్రవర్తించడంతో మున్సిపల్ ఆవరణ ఉద్రిక్తత చోటుచేసుకుంది. చేతిలోని మైకును లా క్కోవడం ఏమిటని దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మేర్వరాజుపై దాడికి యత్నించగా ఎస్ఐ రామస్వామి మున్సిపల్ కమిషనర్ పాండునాయక్ వివాదాన్ని సద్దుమణిగించే ప్ర యత్నం చేశారు. దీంతో దళిత సంఘాలు, రాజకీ య పార్టీల నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి మేర్వరాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీసి తహసీల్దార్ పాం డునాయక్, ఎస్ఐ రామస్వామిలకు వినతిపత్రా లు అందజేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు రాజు, అయూభ్‌ఖాన్, గోపి, మహం కాళి విష్ణు, చింతలన్న, ఫయాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, అజయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రోజులు దగ్గరపడ్డాయి.. మతతత్వాన్ని పెంచిపోషిస్తూ గోరక్ష పేరుతో దళితులపై దాడులు చేస్తున్న మతోన్మాద పార్టీలకు రో జులు దగ్గరపడ్డాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. అమరచింత మీదుగా ధన్వాడకు వెళ్తున్న ఆమె స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దళిత నాయకుడి చేతిలోని మై కును బీజేపీ నాయకుడు లాక్కోవడం దారుణమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అణ గారిన కులాలను భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను విస్మరిం చి న సీఎం కేసీఆర్ అధికార దాహంతో సంక్షేమ ప థకాల పేర్లు వల్లిస్తూ ప్రజలను మోసగిస్తున్నారన్నా రు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశంలో, రా ష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే యడం తథ్యమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాష, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్‌ఖాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
‘ఎస్సీ, ఎస్టీల బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: దళితులపై వేధింపులను నిరోధించే బిల్లులో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6న ఈ బిల్లు లోక్‌సభలో గట్టెక్కగా, గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపింది. కోర్టు ఆదేశించినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా, ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదుచేసేలా నిబంధనలను తిరిగి చేర్చారు. నిందితులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఈ చట్టంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. -
మోదీ మనసులో దళితులు లేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు స్థానం లేదని, ఆయన ప్రభుత్వానివి దళిత వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండో రోజు జరిగిన ‘సింహగర్జన’ ధర్నాలో రాహుల్ పాల్గొన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ జరిగే పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే దళితులపై దాడులను ప్రోత్సహిస్తూ, చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. చట్ట పరిరక్షణ సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే పూర్తి భద్రత ఏర్పడుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాల మధ్య అసమానతలు ఉన్నాయని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరేంటో తెలపాలని రాహుల్‌ను మంద కృష్ణ కోరారు. ఈ ధర్నాలో సమితి కన్వీనర్లు జేబీ రాజు, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్ సహా పలు రాష్ట్రాల దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. -
9న భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు రూలింగ్‌కు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఈనెల 9న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న ఇచ్చిన ఉత్తర్వులతో నీరుగార్చిన ఎస్సీ,ఎస్టీ చట్ట నిబంధనలను పునరుద్ధరించాలని అఖిల భారత అంబేడ్కర్ మహాసభ (ఏఐఏఎం) నేతృత్వంలో దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, దళితుల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేస్తూ భారత్ బంద్‌లో పాల్గొనరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో శాంతి, సామరస్యం, సోదరభావాలను కొనసాగించేలా సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టులను నిలువరిస్తూ నిర్ధిష్ట చర్యలను చేపట్టాలన్న సుప్రీం ఉత్తర్వులను పక్కనపెడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పటిష్టం చేసే బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ,ఎస్టీ బిల్లు, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన క్రమంలో ఈ బిల్లులు చారిత్రాత్మకమైనవని మంత్రి పేర్కొన్నారు. దళితుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. -
ఎస్సీ,ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ బిల్లును లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లును సభ ముందుంచగా విపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు ఓటింగ్‌లో వీగిపోయాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను సభ ఆమోదించిన అనంతరం వాయిదా పడింది. అంతకుముందు బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించిన సభ్యులకు మంత్రి తవర్ చంద్ గెహ్లాట్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం దళితులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లను సుప్రీం కోర్టు ప్రశ్నించిన వెంటనే రిజర్వేషన్ కొనసాగేలా ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసినందునే బిల్లును తేవడంలో జాప్యం జరిగిందని విపక్ష సభ్యులకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద దాఖలైన కేసుల పరిష్కారానికి రాష్ట్రాలు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తాయని, బాధితులకు ఎఫ్ఐఆర్ నమోదైన వారం రోజులకే పరిహారం అందేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచామని చెప్పారు. -
సబబైన నిర్ణయం
దళిత వర్గాల రక్షణకు ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టంలోని కొన్ని నిబంధన లను పునరుద్ధరిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఆ చట్టం దుర్వినియోగమవుతున్నదని అభిప్రాయపడుతూ, దాన్ని నివారించటం కోసమని మొన్న మార్చిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ లలిత్‌ల నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినప్పటినుంచీ దళిత వర్గాల్లో ఆందోళన ఏర్పడింది. ఈ మార్గదర్శకాలు చట్టం ఉద్దేశాన్ని దెబ్బతీసి, దాన్ని నీరుగారుస్తున్నా యన్నది ఆ వర్గాల ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో దళితుల్లో ఏ స్థాయిలో ఆగ్రహావేశాలున్నాయో ఏప్రిల్ 2న జరిగిన దేశవ్యాప్త బంద్ నిరూపించింది. అందులో హింస చెలరేగి 9మంది ప్రాణాలు కోల్పోవటంతోపాటు భారీయెత్తున విధ్వంసం చోటుచేసుకుంది. ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఆదేశాలను వెంటనే నిలుపుదల చేయటం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పటంతో ఈ విషయంలో ఆర్డినెన్స్ లేదా సవరణ బిల్లు తీసుకురావాలన్న డిమాండు బయల్దేరింది. అయితే తీర్పు వెలువరించినవారిలో ఒకరైన జస్టిస్ ఏకే గోయెల్‌కు రిటైరయ్యాక జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చీఫ్ పదవి అప్పగించటంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన్ను పదవి నుంచి తప్పించాలని, చట్టంలోని నిబంధనలు పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 9న దేశవ్యాప్త బంద్ పాటించాలని దళిత సంఘాలు నిర్ణ యించాయి. బహుశా ఈ ఏడాది చివరిలో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సవరణ బిల్లు తీసుకురావటం తప్పనిసరని ఎన్డీఏ ప్రభుత్వం కూడా భావించి ఉండొచ్చు. దళిత సంఘాల డిమాండ్లు, బీజేపీ రాజకీయ అవసరాల సంగతలా ఉంచి సుప్రీంకోర్టు అభిప్రా యపడినట్టు చట్టం నిజంగా దుర్వినియోగం అవుతున్నదా అన్న సంగతిని చూడాల్సి ఉంది. తన ముందుకొచ్చిన కేసును విచారిస్తూ ధర్మాసనం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందులో అవాస్తవ మేమీ లేకపోవచ్చు. ఇలాంటి దుర్వినియోగం ఆరోపణలు చాలా చట్టాల విషయంలో తరచు వస్తూనే ఉన్నాయి. అయితే అత్యాచారాల నిరోధక చట్టం కింద పడే శిక్షల శాతాన్నిబట్టి మాత్రమే ఆ నిర్ణయా నికి రావటం అహేతుకం. సుప్రీంకోర్టు ఆ నిర్ణయానికి రావటంతోపాటు ఫిర్యాదులొస్తే నిందితులను వెనువెంటనే అరెస్టు చేయరాదని సూచించింది. ప్రభుత్వోద్యోగులపై అయితే వారి నియామక అధి కారి నుంచి, ప్రైవేటు ఉద్యోగుల విషయంలో అయితే సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ఎ స్పీ)నుంచి ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేసింది. అంతేకాదు... కేసు నమోదు చేసే ముందు ఆ ఫిర్యాదు ఈ చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్నది పరిశీలించాలని కోరింది. తొలిసారిగా 1955లో అమల్లోకొచ్చిన అంటరానితనం(నేరాల) చట్టం, దాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ 1976లో తీసుకొచ్చిన పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ఆ చట్టం స్థానంలో 1989లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం, దానికి చేర్పుగా 1995లో జారీ అయిన నిబంధ నలు.. ఇవేవీ దళిత కులాలపై, ఆదివాసీలపై సాగుతున్న దురంతాలను నివారించలేకపోయాయి. దళితులపై ఏదైనా జరిగాక చర్య తీసుకోవటం కాక, అవి చోటుచేసుకోకుండా చూడటమే చట్టం ప్రధానోద్దేశమని ప్రభుత్వం అప్పట్లో చెప్పినా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అఘా యిత్యాలు ఏటికేడాదీ పెరుగుతూనే ఉన్నాయి. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) ఏటా వెలువరించే నివేదికలే ఇందుకు సాక్ష్యం. ఇవిగాక ఎఫ్ఐఆర్ నమోదు వరకూ రాకుండా పోతున్న కేసులు మరెన్నో ఉంటున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్తాన్‌లలో 2016లో దళితులను హత్య చేసిన ఘటనలు అధికంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకపక్క దురంతాలిలా పెరుగుతుంటే మరోపక్క అత్యాచారాల నిరోధక చట్టం కింద దాఖలైన కేసుల్లో శిక్షల శాతం తగ్గుతోంది. 2016లో ఎస్సీ కేసుల్లో 25.7 శాతం, ఎస్టీ కేసుల్లో 20.8 శాతం మాత్రమే శిక్షలు పడ్డాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. భారత శిక్షాస్మృతి(ఐపీసీ) కింద పడుతున్న శిక్షల శాతం గత దశాబ్దకాలంలో పెరగ్గా... అత్యాచారాల నిరోధక చట్టం కేసుల్లో మాత్రం శిక్షలు తగ్గుముఖం పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి ఆధిపత్య కులాలవారు అతిగా ప్రవర్తిం చినా దళిత కులాలవారు కేసు పెట్టడానికి జంకుతారు. వారితో గొడవ పడితే తమకు రోజు గడవటం కష్టమని జరిగిన అవమానాలను దిగమింగుకుంటారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా పోలీసులు కేసును రిజిస్టర్ చేయకుండా అవతలిపక్షానికి కబురంపి రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు. తప్పనిసరై ఎఫ్ఐఆర్ నమోదు చేశాక కూడా దళితులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి కేసు నిజమైనదే అయినా తగిన సాక్ష్యాలు దొరకలేదని, పొరపాటున చేసిన ఫిర్యాదన్న సాకు చూపి బుట్టదాఖలా చేస్తుంటారు. అన్నీ దాటుకుని న్యాయస్థానం వరకూ వెళ్లినా ‘కోర్టు వెలుపల పరిష్కరించుకోమ’ని ఒత్తిళ్లు వస్తుంటాయి. దళితుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు జరిగిన ఘటనకు దళితేతరులు ఇద్దరు సాక్ష్యమిస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీస్స్టేషన్లలో చెబుతుంటారు. చట్టంలో ఇందుకు సంబంధించిన నిబంధనేదీ లేకపోయినా ఇదొక సంప్రదాయంగా అమలవుతోంది. పైగా పోలీసులకు అవగాహన లేకనో, మరే కారణం చేతనో ఫిర్యాదు ఎంత తీవ్రమైనదైనా... ఉద్దేశపూర్వకంగా అవమానించటం, చిన్నబుచ్చటం, భయపెట్టడం వంటి అంశాలను ప్రస్తావించే చట్టంలోని సెక్షన్ 3(1)(10)కింద మాత్రమే కేసు నమోదు చేస్తుంటారని అహ్మదాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం అధ్యయ నంలో వెల్లడైంది. ఇప్పుడు కేంద్రం సవరణ బిల్లు తీసుకురావటం మాత్రమే కాదు... క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇలాంటి పెడ ధోరణులను అరికట్టడానికి ఏం చేయాలో కూడా ఆలోచించాలి. దళి తులు, ఆదివాసీ వర్గాల్లో అభద్రతా భావన తొలగించటమే ధ్యేయం కావాలి. -
ఇచ్చిన హామీలకే దిక్కులేదు: అద్దంకి
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై ప్రభుత్వం కేంద్రం తీసుకు వస్తున్న ఆర్డినెన్స్ చాలా బలహీనంగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..మోదీ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని అన్నారు. ఈ డ్రామాలతో తమను మోసం చెయ్యలేరని చెప్పారు. ఈ నెల 8న జరిగే సింహ గర్జన సభ, 9న తలపెట్టిన బంద్‌ను నిర్వీర్యం చెయ్యడానికి మోదీ ఆర్డినెన్సు తెస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాను మోదీ ఎలా తుంగలో తొక్కారో అందరికి తెలిసునని, మోదీ తెచ్చే ఆర్డినెన్స్ కూడా అలానే ఉంటుందన్నారు. ఆగస్ట్ 8న సింహగర్జన సభకు అన్ని రాష్ట్రాల నేతలను ఆహ్వానిస్తామని తెలిపారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్లో మనువాదులు ఉన్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దళితులపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని,అందుకే మాకు...మోదీపై నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. -
ఈ సమావేశాల్లోనే ఆ బిల్లును చేపడతాం : రాజ్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ, ఎస్టీ బిల్లును ప్రవేశపెడతామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని, ఈ చట్టం నిర్వీర్యమయ్యేందుకు ప్రభుత్వం అనుమతించబోదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టంచేశారని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని నీరుగార్చేలా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటివరకూఎలాంటి చర్యలూ చేపట్టలేదన్న కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శలు గుప్పించిన క్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ మేరకు పేర్కొన్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ సభ్యులంతా నేడు, రేపు సభలోనే ఉండాలని కోరుతూ బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. -
దళితుల చట్టానికి కోరలు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న భారత్ బంద్ పాటించాలని దళిత సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి చేరువయ్యేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తాజా బిల్లులోని ముఖ్యాంశాలు..ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దాష్టీకాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చే నిబంధన తొలగింపు. కేసు నమోదుకు ప్రాథమిక విచారణ అక్కర్లేదు. నిందితుల అరెస్ట్‌కు ఎలాంటి అనుమతులు తీసుకోనవసరంలేదు. నిందితులకు పలు రక్షణలు కల్పిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న చట్టంలో మార్పులు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దుచేస్తూ పాత నిబంధనలను పునరుద్ధరించాలని దళితులు కోరుతున్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో చట్టం బలహీనమైందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోని కొన్ని మిత్ర పక్షాలు కూడా ప్రభుత్వ ఉదాసీన వైఖరిని వ్యతిరేకించాయి. ఈ ఏడాది చివరన జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం పాత నిబంధనలను పునరుద్ధరించింది. కేబినెట్ నిర్ణయంపై కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. బంద్ పాటించాలనుకున్న ఆగస్టు 9న వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. అవసరమైతే ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామని ప్రధాని మోదీ చెప్పినట్లు పాశ్వాన్ వెల్లడించారు. ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు తాజా బిల్లు చెంపపెట్టు అని అన్నారు. కుష్టు ఉందని విడాకులు ఇవ్వలేరు.. కుష్టు వ్యాధి సోకిందని భాగస్వామికి విడాకులు ఇవ్వడం ఇకపై కుదరదు. ఇందుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. కుష్టు నయంకాని వ్యాధి అని భావిస్తున్న సమయంలో తీసుకొచ్చిన చట్టంలో ఆ వ్యాధితో బాధపడుతున్న జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వొచ్చని ఉందని కేంద్ర న్యాయశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘అధునాతన చికిత్సతో ఇప్పుడు కుష్టును పూర్తిగా నివారించడం సాధ్యమే. అందువల్ల విడాకులకు కుష్టును ఒక కారణంగా చూపుతున్న సదరు చట్టంలోని నిబంధనను కొనసాగించడం సమర్థనీయం కాదు’ అని న్యాయశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి రావెల దీక్ష
సాక్షి, గుంటూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. రావెల చేపట్టిన దీక్షకు దళిత, గిరిజన సంఘాల కార్యకర్తలు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ సంఘీభావం ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రి ఏడు గంటల వరకూ తన దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు -
ప్రే‘ముంచాడు’.. కటకటాలపాలయ్యాడు
శ్రీకాకుళం రూరల్ : ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. లోబరుచుకుని కులం పేరుతో దూషించి చివరకు ముఖం చాటేశాడో ఏఆర్ కానిస్టేబుల్! సుమారు ఆరు సంవత్సరాలు ఈ కేసు వివిధ స్థాయిల్లో విచారణ చేపట్టిన అనంతరం ఎట్టకేలకు న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఏఆర్ కానిస్టేబుల్‌కు ఏడాది జైలు శిక్షణ విధించింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం రాత్రి జిల్లా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శ్రీకాకుళం నగర పరిధిలోని గొంటివీధికి చెందిన కొర్లకోట తులసీబాయ్ హోంగార్డుగా శ్రీకాకుళంలోనే ప్రస్తుతం పనిచేస్తోంది. జి.సిగడాం మండలం మదపాం గ్రామానికి చెందిన సెగళ్ల రాజు ఏఆర్ కానిస్టేబుల్‌గా జిల్లా సబ్జైల్లో 2013లో పనిచేస్తుండేవారు. అక్కడే తులసీబాయ్ కూడా హోంగార్డుగా పనిచేసేవారు. అక్కడే వీరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం కాస్తా అందరికీ తెలిసిపోవడంతో పెళ్లి చేసుకోవాలని రాజును తులసీబాయ్ కోరింది.‘నువ్వు ఎస్సీ కుటుంబానికి చెందిన దానివి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా కుటుంబం రోడ్డున పడుతుంది’ అని రాజు ముఖం చాటేశాడు. దీంతో 2013లో ఆమె టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాజుపై ఫిర్యాదు చేసింది. టూటౌన్ సీఐ రాధాకృష్ణ కేసు నమోదు చేశారు. ఎస్సీఎస్టీ డీఎస్పీ సి.హెచ్.పెంటారావు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ కేసును రాజీ కుదిర్చేందుకు రాజు తీవ్రంగా శ్రమించారు. తనకు చెల్లి ఉందని, ఆమెకు వివాహం చేసేందుకు రెండేళ్లు సమయం కావాలని తులసీబాయ్ని కోరారు. తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ఆమె రెండేళ్లు ఎదురుచూసింది. అయినా ఆమెకు నిరాశే ఎదురైంది. ఈ విషయం తెలియడంతో ఎస్పీ ఖాన్ హయాంలో ఆయన్ను ఆరు నెలలు సస్పెండ్ చేశారు. సుమారు ఆరేళ్లు ఈ కేసు వివిధ స్థాయిల్లో తిరిగి చివరకు ఓ కొలిక్కి వచ్చింది. సోమవారం ఈ కేసును పిపి ఐ.నాగమల్లేశ్వరరావు వాదించగా జడ్జి వి.గోపాలకృష్ణ విచారణ అనంతరం సెగెళ్లరాజుకు ఏడాది పాటు సాధారణ కారాగార జైలు శిక్షణ విధించినట్లు కోర్టు లైజన్ ఎస్ఐ జగన్నాథరావు తెలిపారు. -
నేను దీక్ష చేస్తా : మాజీ మంత్రి రావెల
సాక్షి, గుంటూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పుకు నిరసనగా ఈ నెల 23న దీక్ష చేయనున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు వల్ల చట్టం బలహీన పడిందని, కోరలు పీకిన పులి లాగా అట్రాసిటీ చట్టం తయారైందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో, దేశ వ్యాప్తంగా దళితులలో అభద్రతభావం ఏర్పడిందని చెప్పారు. ఏపీలో కూడా దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆందోళనలో ఉన్న గిరిజనులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో అట్రాసిటీ చట్టానికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తాను దీక్షకు కూర్చోనున్నట్లు రావెల ప్రకటించారు. -
ఢిల్లీలో మరో సింహగర్జన: మందకృష్ణ
హన్మకొండ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణకు ఢిల్లీ వేదికగా మరో సింహగర్జన నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణ కమిటీ చైర్మన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సోమవారం ఆయన అట్రాసిటీ చట్టం పరిరక్షణ కమిటీ కన్వీనర్లు బెల్లయ్యనాయక్, చెన్నయ్యతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని అక్షరం పొల్లుపోకుండా అమలు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రావడానికి ముందు ఉద్యమం కారంచేడు సంఘటనతో మొదలైందని గుర్తు చేశారు. ఆ గ్రామంలో భూస్వామ్య ఆధిపత్యం పోరులో ఆరుగురు దళితులను హత్య చేశారన్నారు. అప్పటి పోరాటం ఫలితంగా కులం పేరుతో దూషించినా, అత్యాచారం చేసినా కఠిన శిక్ష పడేలా 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. కారంచేడు సంఘటన జూలై 17న జరిగిందని అదే రోజు ఢిల్లీలో మరో సింహగర్జనను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు రాహుల్ గాంధీ, దేవెగౌడ, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌తో పాటు తమిళనాడులోని డీఎంకే, ఏఐడీఎంకేతోపాటు జమ్ముకాశ్మీర్, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నాయకులందరిని ఆహ్వానిస్తామన్నారు. సింహగర్జనకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, సభ జరిగిన రోజు కడియం శ్రీహరిని స్వయంగా కలసి ఆహ్వానించామని, అయితే వారు ఎందుకు రాలేదో చెప్పాలని అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సింహగర్జనకు ఎందుకు రాలేదో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పాలన్నారు. -
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అందరి ఆకాంక్షలు నెరవేరుతాయని, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా అట్టడుగున ఉన్న ప్రజానీకం ఆశలు తీరుతాయని ఆశించినా నెరవేరలేదని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసే అర్హులైన దళిత నాయకుల్లేరా.. లేక మీకు ఇష్టం లేకనే దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదా అని ఆమె ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, సంపత్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌తో కలసి ఆమె మాట్లాడారు. ఓవైపు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు.. మరోవైపు రాజకీయ అణచివేతకు పాల్పడుతూ ఆ వర్గాలను నిరాశ, నిస్పృహల్లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిపాలన తనను నిరాశకు గురిచేసిందన్నారు. ఎలాంటి తప్పు చేయకుండానే దళిత ఎమ్మెల్యే సంపత్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, ప్రజా సమస్యలపై మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్క తీర్మానంతో మొత్తం ప్రతిçపక్షాన్నే అసెంబ్లీ నుంచి గెంటివేయడం ప్రజాస్వామ్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు. తాను కూడా స్పీకర్‌గా పనిచేశానని, ఎంతోమంది సభ్యులు వారి అభిప్రాయాలను వెలిబుచ్చేవారని, అంతమాత్రాన వారి నోరునొక్కే విధంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేకపోవడం, భావస్వేచ్ఛను హరించడం దురదృష్టకరమన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించడం లేదని, 4వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంటే తనకు గౌరవమని, గత పర్యటనలో తాను నేరెళ్ల వెళ్లినప్పుడు అక్కడి ప్రజల కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో పేదలు, మైనార్టీలు, రైతులు, దళితులు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలను అణచివేసేలా పాలన సాగుతోందని విమర్శించారు. చారిత్రక చట్టాన్ని తెచ్చింది మేమే.. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించే చారిత్రక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని మీరాకుమార్ గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తాను కూడా ఎంపీనని, ఆ సమయంలో బిహార్ రాష్ట్రంలోని జహానాబాద్ జిల్లాలో 27 మంది దళితులను కాల్చి చంపారన్నారు. ఈ ఘటనలతోనే ఎస్సీ, ఎస్టీల మనోభావాలను కాపాడేందుకు పటిష్ట చట్టం కావాలని తాను నాడు రాజీవ్‌కు చెప్పానని, అప్పుడే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడా చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని, అయినా ఆ సమావేశాల్లో చట్టం తెచ్చే ప్రయత్నం బీజేపీ చేయలేదన్నారు. సమావేశాల తర్వాత కూడా ఆర్డినెన్స్ తెచ్చే అవకాశమున్నా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం విషయంలో కోర్టులో బలమైన వాదనలు కూడా వినిపించేందుకు బీజేపీ ముందుకు రాలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడ దళితులపై దాడులు జరుగుతున్నా వెలుగులోకి తెస్తున్న మీడియాను ఆమె అభినందించారు. మీరా సానుకూలత వల్లే తెలంగాణ: ఉత్తమ్ మీరాకుమార్ నాడు స్పీకర్‌గా సానుకూలంగా వ్యవహరించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. తెలంగాణ బిల్లును ఆమోదించే విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరాకుమార్ వెనక్కు వెళ్లలేదని, ఆమె అలా వ్యవహరించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదన్నారు. తెలంగాణ ప్రజలపై ఉన్న మక్కువతోనే ఆమె రాష్ట్రంలో తరచూ పర్యటిస్తున్నారని, తెలంగాణ ప్రజలు కూడా మీరాకుమార్ను గుండెల్లో పెట్టుకున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. -
విపక్షాల మాటలు నమ్మొదు : దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టులో తమ వాదనను వినిపించిందని, కానీ విపక్షాలు కుట్ర పన్ని విషప్రచారం చేస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఆయన సోమవారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు కలసి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై విషం కక్కుతున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దళితుల అభ్యున్నతికి కోసం మోదీ ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను అమలు చేశారని చెప్పారు. -
దళిత, గిరిజనులు ఏకం కావాలి
-
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేస్తాం
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ చట్టంలో లోపాలను సవరించి బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా పదవీ విరమణ పొందిన కె.రాములును మంగళవారం ఇక్కడ ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాములు చాలా నిబద్ధతతో పనిచేశారని, అందుకే ఆయనకు ఎస్సీ కమిషన్ సభ్యుడిగా సముచిత గౌరవం దక్కిందని గెహ్లాట్ అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అన్నివర్గాలకు న్యాయం చేస్తున్నామని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారం అన్నారు. ఏపీలోని గరగపర్రు లో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టినందుకు 265 దళిత కుటుంబాలను వెలి వేశారని ఆ గ్రామాన్ని ఇంతవరకు సీఎం చంద్రబాబు సందర్శించకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. అనంతరం హోంమం త్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడారు. కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్, ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ మురుగన్, రిటైర్డ్ ఐఏఎస్ కాకి మాధవరావు, ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. -
30 లక్షల మందితో దళిత సింహగర్జన
రాజేంద్రనగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకునేందుకు దళిత సోదరులు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం గండిపేట మండలంలోని బండ్లగూడ కాళీమందిర్ వద్ద నిర్వహించిన దళిత సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జూన్ 10వ తేదీన దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ వరంగల్‌లో భారీ సభను నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 30 లక్షల మందితో దళిత సింహగర్జన మహాసభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి దళితులంతా హాజరై విజయవంతం చేయాలన్నారు. తమ హక్కులను సాధించుకునేందుకు పోరాటం ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జీ వనం నర్సింహమాదిగ, గండిపేట ఇన్చార్జి ఐత రమేష్‌బాబు, గండిపేట మండల అధ్యక్షుడు యాదవరావు, ప్రవీణ్‌మాదిగ, శివ, మాదిలేటి మాదిగ, శంకర్రావు, సత్యనారాయణ, నరేందర్, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
బలమైన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీసుకురావాలి
పరిగి (వికారాబాద్) : దళితులను వివక్ష, దాడుల నుంచి దూరం చేసేందుకు బలమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి. వివేక్ తెలిపారు. మంగళవారం పరిగిలోని కొప్పుల శారదా గార్డెన్లో అంబేడ్కర్ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలమైన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి దళితుడు బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. నేటికి దళితులు వేధింపులకు, దాడులకు గురవుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష పోవాలంటే ప్రతి దళితుడు తమ పిల్లలను చదివించాలని సూచించారు. చదువుకున్న వ్యక్తులు మిగతా వారిని చదువకునేలా అవగాహన కల్పించాలన్నారు. అంబేడ్కర్ జీవిత కాలంలో 23 డిగ్రీలు పొందారని ఆయన గుర్తు చేశారు. అనంతరం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీలు సంఘటితంగా ఉన్నప్పుడే తమ హక్కులు తాము సాధించుకోగలరని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అంబేడ్కర్ చూపిన బాటలో అందరూ నడవాలని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో మొదటి ప్రసంగం అంబేడ్కర్ గురించే చేశానని ఆయన గుర్తు చేశారు. అనంతరం రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొప్పుల మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేస్తుందని తెలిపారు. దళితులు బాగుపడాలంటే చదువొక్కటే మార్గమని తెలిపారు. అక్షరాస్యత అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం 281 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దళితులు సంక్షేమ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రవికుమార్, రాష్ట్ర దళిత నాయకులు అద్దంకి దయాకర్, మందాల భాస్కర్, దేవదాస్ మాట్లాడుతూ.. దళితులు పోరాటాల ద్వారా తమ హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభజించి పాలించే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. అనంతరం అంబేడ్కర్ విజ్ఞాన వేదిక అధ్యక్ష, ప్ర«ధాన కార్యదర్శులు టీ. వెంకటయ్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ సామాజిక వర్గానికి ఎవరితోనూ శతృత్వం లేదని, తమ జనాభా ప్రాతిపదికన తమకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో తమ ప్రాధాన్యత తమకు ఇవ్వాలన్నారు. అనంతరం నాయకులు మాలల రణభేరి సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్ద్రావ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాదయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎస్పీ బాబయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్, సీనియర్ నాయకులు వెంకటయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై వెనక్కితగ్గని సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టంపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరిచింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా గురువారం సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు నూరు శాతం కట్టుబడి ఉన్నామని కోర్టు కేంద్రానికి తెలిపింది. దళితులపై వేధింపులకు పాల్పడే దోషులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరైనవి కావని, వాటిపై స్టే విధించాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. తమ రివ్యూ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదలాయించాలని కేంద్రం కోర్టును కోరింది. అయితే ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ కేసును నిర్థారించే న్యాయమూర్తుల కులాలకు సంబంధించి న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన ట్వీట్‌ను కేంద్రం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, ఏమైనా ఈ అంశం ముగిసిపోయిందని (క్లోజ్డ్) కోర్టు వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద బాధితులు ఫిర్యాదు చేయగానే తక్షణ అరెస్టులను నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు,పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. భారత్ బంద్‌ను నిర్వహించి నిరసన వ్యక్తం చేశాయి. పార్టీ దళిత ఎంపీలు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం ఏప్రిల్ 3న సుప్రీం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. -
దళితుడితో మూత్రం తాగించారు!
లక్నో : తమ పంటను కోయలేదని అగ్ర కులాలకు చెందిన కొందరు వ్యక్తులు ఓ దళితుడితో మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 23న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బదౌన్ జిల్లాలోని అజంపూర్ బిసౌరియా గ్రామంలోని వాల్మికీ సామాజిక వర్గానికి చెందిన సీతారాం వాల్మికీ తనకున్న కొద్ది పొలంలో గోధమ సాగు చేశారు. తన పంట కోతకు రావడంతో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే అదే ఊరిలో అగ్ర కులానికి చెందిన కొందరు రైతులు మాత్రం తమ పొలంలోని పంటను కోసిన తర్వాతే నీ పంటని కోసుకోవాలని సీతారాంని బెదిరించారు. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో అతనిపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. వారి మాట విననందుకు తనపై చెప్పులతో దాడి చేశారని తెలిపారు. అంతేకాకుండా మీసాలను బలంగా లాగుతూ.. బలవంతగా తనతో మూత్రం తాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పాశవికంగా ప్రవర్తించిన వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే స్థానిక ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో ఎస్పీని ఆశ్రయించడంతో ఆయన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు అతనిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కేసులో గ్రామానికి చెందిన విజయ్ సింగ్, పింకు సింగ్, శైలేంద్ర సింగ్ ప్రధాన నిందితులుగా ఉన్నారని పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. -
వాసుపల్లిపై రణం
వాసుపల్లి లొల్లి అధికార టీడీపీలో పెను దుమారం రేపుతోంది..దక్షిణ ఎమ్మెల్యేగా, పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్న ఆయనపై సొంత పార్టీలోని దళితులే తిరుగుబాటు బావుటా ఎగరేసే పరిస్థితికి ఆయన వ్యవహారశైలే కారణమన్నది స్పష్టం.నోటి దురుసు, అనాలోచిత నిర్ణయాలతో ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటున్న ఎమ్మెల్యే.. ఈ సారి ఏకంగా దళిత బాణానికే టార్గెట్‌గా మారారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కోవలసిన దుస్థితిలో పడ్డారు.తమను కులం పేరుతో దూషించారన్న ఆరోపణతో సొంత పార్టీలోని పలువురు దళిత నేతలు నిప్పులు కక్కుతున్నారు. కేసు పెట్టడమే కాకుండా.. పార్టీ నాయకత్వానికి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు. వాసుపల్లికి వ్యతిరేకంగా మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో భారీ సభకూ సిద్ధమవుతున్నారు.ఎన్నికలు ఏడాది దూరంలోనే ఉన్న సమయంలో తలెత్తిన ఈ తిరుగుబాటు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే ఇప్పుడు రాజీ మంత్రం జపిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై ఆ పార్టీ దళిత నేతల తిరుగుబాటు దుమారం రేపుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తిరుగుబాటు చేసిన నేతలను దారికి తెచ్చుకునేందుకు ఒక్కొక్కరికి రెండేసి హుద్‌హుద్ ఇళ్లతో పాటు రూ.30 వేల నగదు ఇస్తామని ఎర వేస్తున్నారు. దారికొచ్చిన వారితో స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అయితే వాసుపల్లి ఆగడాలతో విసిగివేసారిన పార్టీ సీనియర్ నేత రామారెడ్డితో సహా దళిత నేతలు మాత్రం రాజీకొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఆయన తీరు వల్లే 23వ వార్డు సీనియర్ దళిత నేత సాలిగ్రామం కనకరాజు మనోవేదనతో మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలపై ఫిర్యాదులు పార్టీలో మంత్రి గంటా తర్వాత నగర పార్టీలో ఇన్నాళ్లు చక్రం తిప్పిన వాసుపల్లికి సొంత పార్టీలోనే సెగ మొదలైంది. ప్రత్యేక హోదా ఉద్యమంతో పార్టీ గ్రాఫ్ ఒకవైపు పడిపోతుంటే.. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో తలెత్తిన తిరుగుబాటు వాసుపల్లితోపాటు పార్టీకీ తలనొప్పిగా మారింది. 23వ వార్డు అధ్యక్షుడి మార్పు విషయంలో ఎదురు తిరిగిన పార్టీ నేతలను దారికి తెచ్చుకునేందుకు వాసుపల్లి నానాతంటాలు పడుతున్నారు. కులం పేరుతో దూషించారంటూ పార్టీ సీనియర్ నేత, కనకమహాలక్ష్మి దేవస్థానం ట్రస్టీ ఓదూరి శివయ్య, అర్బన్ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ రేజేటి చిట్టిబాబు, ఎమ్మార్పీఎస్ అర్బన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొత్తరమూడి శ్రీనివాస్‌లు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. జిల్లా మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడులతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళావెంకట్రావు, సీఎం చంద్రబాబుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రచార పోరాటం ఫిర్యాదులతో ఆగకుండా దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో సభలు, సమావేశాలు నిర్వహించి వాసుపల్లి అవినీతి, భూకబ్జాలు, దళితులపై దౌర్జన్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. అప్పటికి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని న్యాయం చేయకపోతే పార్టీలోని దళిత నేతలను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని భావిస్తున్నారు. బుధవారం నగరానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి మల్లవరపు నాగయ్య మాదిగ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దళితులను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే సాగించిన దాడులు, దౌర్జన్యాలను ఆయనకు వివరించారు. అంతేకాకుండా వచ్చే నెల రెండో తేదీన నగరానికి వస్తున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దృష్టికి కూడా తీసుకెళ్లి ఆయనతో నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించనున్నట్టు తొత్తరమూడి శ్రీనివాస్ వెల్లడించారు. ఎదురు ఫిర్యాదు వాసుపల్లిపై నమోదైన కేసు విచారణలో భాగంగా త్రీటౌన్ సీఐ ఇమ్మా నియేలురాజు బు«ధవారం టీడీపీ కార్యాలయం, సంఘటన జరిగిన ప్రాంతాల్లో విచారణ జరిపారు. ఫిర్యాదు చేసిన వారితో పాటు ఆ సమయంలో ఉన్న వారి నుంచి వివరాలు సేకరించారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యేతో విబేధించిన పార్టీ సీనియర్ నేత రామారెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన తనను కులం పేరుతో దూషించారంటూ ప్రస్తుత వార్డు అధ్యక్షుడు బంగారు రవిశంకర్ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరినట్టయ్యింది. ‘కనకరాజు మృతికి ఎమ్మెల్యే వైఖరే కారణం’ ఎమ్మెల్యే వైఖరి కారణంగానే 23వ వార్డు దళిత నేత సాలిగ్రామం కనకరాజు చనిపోయాడని దళిత నేతలు ఆరోపిస్తున్నారు. చెంగలరావు పేట హైస్కూల్ పక్కనే సీట్ కవర్లు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న కనకరాజు బడ్డీని తన ఫ్లెక్సీకి అడ్డు వచ్చిందన్న అక్కసుతో ఎమ్మెల్యే బలవంతంగా తీయించేశారని.. తన పొట్టమీద కొడతారా? అని ప్రశ్నించిన పాపానికి ఎమ్మెల్యే ఆయన్ను నానాదుర్భాషలాడారని ఆరోపించారు. దాంతో తీవ్ర మనోవేదనతో కనకరాజు మృతి చెందాడని వివరించారు. ఆ కుటుంబానికి రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కుమార్తె పెళ్లికి ఆర్థిక సాయం చేస్తానని, అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారని.. అయితే కనీసం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి గానీ, చివరకు చంద్రన్న బీమా నుంచి కానీ ఒక్క పైసా ఆర్థిక సహాయం చేయలేదని వారు వివరించారు. ఇంతకంటే దళితుల పట్ల వాసుపల్లి వివక్ష మరొకటి ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. -
మోదీకి మరో బీజేపీ ఎంపీ షాక్
న్యూఢిల్లీ: ‘‘అంబేద్కర్ చూపిన మార్గంలోనే తన ప్రభుత్వం నడుస్తోంద’న్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను సొంత పార్టీ ఎంపీలే నమ్మడంలేదు. రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర జరుగుతోందని బీజేపీ ఎంపీ సావిత్రి బాయి, పార్టీలో దళితులకు గౌరవం లేదన్న మరో ఎంపీ చోటేలాల్ వ్యాఖ్యలపై దుమారం చల్లారకముందే మరో బీజేపీ ఎంపీ.. ప్రధానిపై లేఖాస్త్రం సంధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నగీనా స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎంపీ యశ్వంత్ సింగ్ శనివారం మోదీకి రాసిన లేఖలో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు. బీజేపీ దళితులకు చేసిందేమీలేదు: ‘‘గడిచిన నాలుగేళ్లలో మన ప్రభుత్వం దేశంలోని 30 కోట్ల మంది దళితులకు చేసింది ఏమీలేదు. రిజర్వేషన్ వల్ల నేను ఎంపీగా గెలవడం తప్ప ప్రత్యేకంగా సాధించింది ఏమీలేదు. కేవలం దళితుడిని కావడంవల్లే నా సామర్థ్యాన్ని పార్టీ వినియోగించుకోవడంలేదు..’’ అని ఎంపీ యశ్వంత్ సింగ్ పేర్కొన్నారు. ఇదే లేఖలో.. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదంటూ సుప్రీంకోర్టుకు ఓ సూచన చేశారు. ఎస్సీ, ఎస్టీ ఎంపీల అసంతృప్తి: ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళిత, గిరిజన ఎంపీలు ఒక్కొక్కరిగా సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. బహ్రెయిచ్ ఎంపీ సావిత్రి బాయి మొన్న ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. ‘దశాబ్దాల తరబడి ఇస్తున్న రిజర్వేషన్లపై సమీక్ష జరపాలని దేశంలో ఒక వర్గం ఒత్తిడి తెస్తున్నా.. బీజేపీ మౌనంగా ఉండటంలో అర్థమేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాబర్ట్‌గంజ్ బీజేపీ ఎంపీ చోటేలాల్.. మోదీకి రాసిన లేఖలో యూపీ సీఎం యోగి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తన జిల్లాలో అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఎం సిబ్బంది తనను గల్లాపట్టి నెట్టేశారని ఆరోపించిన చోటేలాల్.. పార్టీలో దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్ని వాపోయారు. ఆ మరుసటి రోజే.. ఇటావా స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న గిరిజన బీజేపీ ఎంపీ అశోక్ దోహ్రీ.. యూపీలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, భారత్ బంద్‌లో పాల్గొన్న దళితులపై యోగి సర్కార్ తప్పుడుకేసులు బనాయిస్తున్నదంటూ ప్రధాని మోదీకి లేఖరాశారు. ఇప్పుడు నగీనా ఎంపీ యశ్వంత్.. బీజేపీ పాలనలో దళితులకు న్యాయం జరగలేదని బాంబు పేల్చారు. తాజా ఆరోపణలపై బీజేపీ అధిష్టానం స్పందించాల్సిఉంది. పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు (యశ్వంత్ సింగ్, అశోక్ దోహ్రీ, సావిత్రి బాయి, చోటేలాల్) -
పెళ్లి సాయంత్రం చేసుకుందామని చెప్పి..
శ్రీకాకుళం రూరల్: యువతిని నమ్మించి మోసగించడమేగాక, ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్ప డిన వ్యక్తితో పాటు, అతడి కుటుంబ సభ్యులకు 15 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాడలిలో నివసిస్తున్న పెద్దమ్మ రామాయమ్మను చూసేందుకు భామిని మండలం గణసర గ్రామానికి చెందిన ఎస్టీ యువతి రామలక్ష్మి తరుచూ వెళ్తుండేది. ఈ క్రమంలో హిరమండలం పాడలికి చెందిన యర్లంకి రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటూనని యువకుడు నమ్మబలికాడు. ఈ దశలో కోరిక తీర్చాలని బతిమిలాడినా ససేమిరా అనేసరికి పారిపోయి పెళ్లిచేసుకుందామని ఒప్పించి వైజాగ్‌కు మకాం మార్చాడు. మార్చి 13న రామలక్ష్మి.. పెద్దమ్మ ఇంటికి వెళుతున్నానని చెప్పి రామకృష్ణతో వైజాగ్ వెళ్లిపోయింది. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని లాడ్జిలో ఓ రూమ్ తీసుకుని బస చేశారు. పెళ్లి సాయంత్రం చేసుకుందామని మాయమాటలు చెప్పి కోరిక తీర్చాలని ఒత్తిడి చేయగా ఆమె ససేమిరా అనే సరికి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆ మాటలు నమ్మి మోసపోయింది. రాత్రికి మళ్లీ ఇద్దరూ కొత్తూరు వెళ్లిపోయారు. మీ ఇంటికి వెళ్లిపోవాలని రామలక్ష్మికి చెప్పడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇంటికి తీసుకెళ్లాలని పట్టుబట్టడంతో ఆమెను వారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయంపై గ్రామ పెద్దల వద్ద రామలక్ష్మి తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. మార్చి 19న పంచాయతీ పెట్టడంతో యువతిని పెళ్లి చేసుకుంటానని రామకృష్ణ ఒప్పుకున్నాడు. వారం రోజులు రామలక్ష్మి ఇంటి వద్దే ఉండిపోయాడు. తర్వాత తన తల్లిదండ్రులను గణసరకు తీసుకొచ్చాడు. ఈ వివాహానికి ఒప్పుకోలేమని వాళ్లు చెప్పి వెళ్లిపోయారు. హిరమండలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తన తల్లిదండ్రులు వస్తున్నారని, అక్కడ పెళ్లి చేసుకుంటామని నమ్మించి మార్చి 21న రామలక్ష్మి కుటుంబ సభ్యులను తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి ప్రస్తావన రావడంతో రామకృష్ణ కుటుంబసభ్యులంతా రామలక్ష్మి కుటుంబ సభ్యులపై మూకుమ్మడి దాడిచేసి పరారయ్యారు. రామలక్ష్మికి జరిగిన అన్యాయంపై బత్తిలి పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదుచేయగా.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ అండ్ రేప్ కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ డీఎస్సీ పెంటారావు కేసు దర్యాప్తు చేసి రామకృష్ణతో పాటు కుటుంబసభ్యులను న్యాయస్థానానికి తీసుకొచ్చారు. బుధవారం ఈ కేసు విచారించిన నాలుగవ అడిషినల్ జడ్జి వీరికి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. నిందితులు యర్లంకి రామకృష్ణ, భాస్కరరావు, ప్రభావతితో పాటు వారి బంధువు ముంజేటి దర్మారావును అరెస్టుచేసి సబ్ జైల్‌కి తరలించారు. -
యువకుల బుల్లెట్లకు దళితులు బలి
సాక్షి, న్యూడిల్లీ : రాకేశ్ జాటవ్‌కు 40 ఏళ్లు. రోజు కూలి చేసుకుని బతికే సంసారి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీ, భీమ్‌నగర్ దళిత వాడలో నివసిస్తున్నాడు. ప్రతిరోజు లాగే సోమవారం నాడు కూడా ఉదయం ఎనిమిది గంటలకు రెడీ అయ్యాడు. కూతురు టిఫిన్ బాక్సులో చపాతీలు కట్టివ్వగా తీసుకొని సమీపంలోని కూలీ అడ్డాకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నానికి పక్కింటాయన పరుగెత్తుకుంటూ వచ్చి ‘మీ నాన్నకు బుల్లెట్ తగిలింది. కింద పడిపోయాడు’ అంటూ 18 ఏళ్ల కూతురు కాజల్‌కు చెప్పారు. కూతురు పరుగెత్తుకుంటూ కుమ్హార్ పురలోని కూలీల అడ్డకు వెళ్లింది. దూరం నుంచే ఓ పోలీసు ఆమెను అడ్డుకున్నారు. రక్తం మడుగులో నుంచి అప్పుడే రాజీవ్ జాటవ్ శరీరాన్ని లేపి అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్నారు. ‘అప్పటికి నాన్న ఊపిరి కొట్టుకుంటుందో లేదో, నాకు తెలియదు. ఛాతిలో నుంచి బుల్లెట్ దూసుకపోయిందంటూ అక్కడి వారు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ తర్వాత నేను ఆస్పత్రికి వెళ్లేలోగా నాన్న చనిపోయాడు’ అని కాజల్ మీడియాకు వివరించింది. భారత్ బంద్ సందర్భంగా గ్వాలియర్ సిటీలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన ముగ్గురు దళితుల్లో రాకేశ్ జాటవ్ ఒకరు. మిగతా ఇద్దరు దళితులు కూడా బుల్లెట్ గాయాలకే మరణించారు. వారిలో 22 ఏళ్ల దీపక్ ఒకరు. అతను గ్వాలియర్ నగరంలోని గొల్లకొత్తార్ ప్రాంతానికి చెందిన వాడు. మరొకరు 26 ఏళ్ల విమల్ ప్రకాష్. గ్వాలియర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెవారియా ఫూల్ గ్రామస్థుడు. ఈ ముగ్గురులో ఎవరికి కూడా బంద్తోగానీ, ఘర్షణతోగానీ సంబంధం లేదని తేలింది. రాకేశ్ జాటవ్ రోడ్డు మీద వెళుతుండగా ఛాతిలోకి బుల్లెట్ దిగింది. జీవితంలో ఎస్సై కావాలనుకుంటున్న విమల్ 40 కిలోమీటర్ల దూరంలోని దాబ్రాలో కోచింగ్ తరగతులకు హాజరై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇక ఆటోనడిపే దీపక్ రోడ్డు పక్కన ఆటో ఆపుకొని నిలబడి ఏదో గొడవ జరుగుతోందని అనుకుంటున్నంతలోనే మెడలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి అక్కడికక్కడే చనిపోయారు. అన్న చనిపోతున్న దృశ్యాన్ని పక్కనే ఉన్న 20 ఏళ్ల తమ్ముడు సచిన్ చూశాడు. పోలీసులు వచ్చే వరకే అన్న చనిపోయాడని తెలిపాడు. తాము ఘర్షణలను ఆపేందుకు లాఠీలతో బెదిరించామేగానీ, ఒక్క బుల్లెట్‌ను కూడా పేల్చలేదని పోలీసులు స్పష్టం చేశారు. రాళ్లు విసురుతున్న దళితులపైకి అగ్రవర్ణాలకు చెందిన గుర్తుతెలియని యువకులు తుపాకులతో కాల్పులు జరపడంతో వారు మరణించినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము ముందుగా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని, ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని నీరు కార్చవద్దని నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళుతుంటే అగ్రవర్ణాలకు చెందిన యువకులు తుపాకులతో బెదిరించారని, వారిని ఎదుర్కోవడం కోసం తాము రాళ్లు రువ్వాల్సి వచ్చిందని దళితులు చెబుతున్నారు. దళితులే తమ ఇళ్లపైకి దాడులకు దిగారని అగ్రవర్ణాల వారు ఆరోపిస్తున్నారు. అల్లర్లకు కారణం ఎవరైనా గుర్తుతెలియని యువకులు దళితులపైకి తుపాకులతో కాల్పులు జరుపుతున్న దశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. వాటి ఆధారంగా పోలీసులు పలువురిని అరెస్ట్‌చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అరెస్టైన వారిలో ఇరువర్గాల వారున్నారని పోలీసులు చెప్పారు. సోమవారం నాటి బంద్ సందర్భంగా జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిన విషయం తెల్సిందే. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ముగ్గురు మరణించగా, భింద్ జిల్లలో ఇద్దరు, రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఇద్దరు, యూపీలో ఒకరు మరణించారు. -
ఆ రివ్యూ పిటిషన్‌ను విచారించలేం
-
11కు చేరిన మృతులు
జైపూర్/భోపాల్: ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పును నిరసిస్తూ సోమవారం జరిగిన హింసలో మృతుల సంఖ్య 11కు చేరింది. మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు మంగళవారం రాజస్తాన్‌లో హింస చోటుచేసుకుంది. కరౌలి జిల్లాలోని హిందౌన్ పట్టణంలో దాదాపు 5 వేల మంది ఆందోళనకారులు దళిత వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్‌కుమారి జాతవ్, మాజీ ఎమ్మెల్యే భరోసిలాల్ జాతవ్‌ల ఇంటికి నిప్పంటించారు. దీంతో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. తీర్పుతో మాకు సంబంధం లేదు: కేంద్రం ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో మార్పులతో తమకు సంబంధం లేదని, వెనకబడిన వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు పూర్తి నిబద్ధతతో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత్ బంద్ హింసపై లోక్‌సభలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేస్తూ.. ‘ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాదు. మేం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని అధ్యయనం చేసి.. మరింత పటిష్టం చేయాలని నిర్ణయించాం’ అని చెప్పారు. చట్టాన్ని బలహీనపర్చే కుట్ర: కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలహీనపర్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ప్రజల్ని మోసగించేందుకు కేంద్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో కేంద్ర ప్రభుత్వం కక్షిదారుగా ఉందని, అదనపు సొలిసిటర్ జనరల్ కేంద్రం తరఫున వాదించారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు. -
బీజేపీ ఆఫీసుల్లో అంబేద్కర్ ఫొటోలున్నాయా?
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నలో పని చేస్తోన్న మోదీ ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. విద్వేషం, లాఠీలు, తూటాలు, తప్పుడు వాగ్ధానాలతో దేశాన్ని నడిపించలేరని అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శివమొగ్గలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘దళితులను, గిరిజనులను ఈ బీజేపీ సర్కార్ దారుణంగా మోసం చేస్తున్నది. దేశంలోని ఎస్సీ, ఎస్టీలందరికీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తున్నదో.. అంతకు రెట్టింపు నిధులను కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలకు ఖర్చుచేస్తున్నది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. బీజేపీకి దళితులంటే ఎంత ప్రేమ ఉందో’ అని రాహుల్ అన్నారు. పరీక్షా పత్రాల నుంచి డోక్లాం సమస్య దాకా అన్నింటా మోదీ వైఫల్యం చెందారని, యడ్యూరప్ప లాంటి అవినీతిపరులను పక్కనే ఉంచుకొని మోదీ నీతివచనాలు వల్లిస్తారని కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా చేశారు. ఖర్గే ఫైర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టులో మార్పులు, భారత్ బంధ్ నేపథ్యంలో తలెత్తిన హింస తదితర అంశాలపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ఉందా? బీజేపీ పార్టీ కార్యాలయాల్లో అంబేద్కర్ బొమ్మకూడా కనబడదు. అలాంటి వీళ్లు దళితులను ఉద్ధరించడానికే చట్టాల్లో మార్పులు చేశామంటే నమ్మాలా?’ అని ఖర్గే ఫైర్ అయ్యారు. -
దళితులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది..
సాక్షి, విజయవాడ : నాలుగేళ్లుగా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, చంద్రబాబులాంటి వ్యక్తులు దళితులను కించపరుస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని, దీనికోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు గతంలో...దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నారని, రాష్ట్రవ్యాప్తంగా దళితుల భూములను టీడీపీ నేతలు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మార్చొద్దని, దళితులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టం... ‘ఆ’ తీర్పుపై స్టే ఇవ్వలేం!
-
‘అతేదైనా’ అనర్ధదాయకమే!
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ఈ మధ్య న్యాయ వ్యవస్థ క్రియాశీలత రోజు రోజుకు పెరుగుతోంది. చట్ట సభలకు సంబంధించిన వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటోంది. ఆ మధ్య దేశంలోని నదుల అనుసంధానం గురించి స్వయంగా ఉత్తర్వులు జారీ చేయగా, ఆ తర్వాత దేశంలోని డీజిల్ కార్లపై నిషేధం విధించింది. క్రికెట్ పాలక మండలి బాధ్యతలను చేతుల్లోకి తీసుకొంది. ముంబైలో గోకుల అష్టమి సందర్భంగా మానవ పిరమిడ్లు 20 అడుగులు మించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, అందుకు ఈ చట్టం కింద అతి తక్కువ శిక్షలు పడడమేనని సుప్రీం కోర్టు చెబుతోంది. అది అబద్ధం. ఎందుకంటే, టెర్రరిస్టుల వ్యతిరేక చట్టం కింద ఇంతకన్నా చాలా తక్కువ శిక్షలు పడుతున్నాయి. వరకట్న వ్యతిరేక చట్టం 498 ఏ చట్టం ఇంకా ఎక్కువ దుర్వినియోగం అవుతోంది. ఎస్సీ, ఎస్టీల చట్టానికి వ్యతిరేకంగా సోమవారం దేశంలోని దళితులు బంద్ నిర్వహించడం, అది హింసాత్మకంగా మారడం, దాదాపు పది మంది మరణించడం తెల్సిందే. సుప్రీం కోర్టు అతి వల్లనే ఇది జరిగిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని సడలించక పోయినట్లయితే దళితుల ఆందోళన జరిగేది కాదు, అమాయకుల ప్రాణాలు పోయేవి కావు. జడ్జీలను జడ్జీలే నియమించుకునే చిత్రమైన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ భారత్‌లో ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. ఇలాంటి న్యాయ వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇది చట్ట సభల పరిధిలోనిది, అది కార్యనిర్వహణ వ్యవస్థ పరిధిలోనిది, కనుక తాము జోక్యం చేసుకోమంటూ గతంలో తీర్పులు చెప్పిన సుప్రీం కోర్టు ఇప్పుడు అన్నింట్లో జోక్యం చేసుకోవడానికి కారణం ఏమిటో అంతు చిక్కడం లేదు. పార్లమెంటరీ, కార్యనిర్వహణా వ్యవస్థలు దేశంలో బలహీనపడ్డాయని భావించడం వల్లనా? బలమైన రాజకీయ పార్టీ అధికారంలో లేదని భ్రమించడం వల్లనా? తమ క్రియాలత్వానికి మరింత పదును పెట్టాలని భావించడం వలనా! ప్రజాస్వామ్య వ్యవస్థలో తమదే పైచేయని నిరూపించుకోవడానికా? ఎదేమైనా కొంత అతిగానే కనిపిస్తుంది. -
తీర్పుపై స్టే ఇవ్వలేం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో నిబంధనలు మార్చుతూ ఈ నెల 20న ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే తీర్పును సమీక్షించాలని కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించలేమని, 10 రోజుల అనంతరం సమగ్రంగా పరిశీలిస్తామంది. చట్టంలోని ఏ నిబంధనను నీరుగార్చే ప్రయత్నం చేయలేదని, అమాయకుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించే ఉద్దేశంతోనే రక్షణ ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. ఆందోళనకారులు తీర్పును సరిగా చదవలేదని, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వారిని పక్కదారి పట్టించి ఉండవచ్చని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యు యు లలిత్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. మార్చి 20న ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ ఈ ధర్మాసనమే తీర్పు వెలువరించింది. జీవించే హక్కుకు భంగం కలగకూడదు.. ‘అమాయకుల్ని శిక్షించకూడదనే మేం చెప్పాం. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని నిబంధనల్ని ఆసరాగా చేసుకుని అమాయకుల్ని భయభ్రాంతులకు గురిచేయకూడదు. జీవించే హక్కుకు భంగం కలిగించడాన్ని మేం కోరుకోవడం లేదు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ చట్టానికి లేదా ఫిర్యాదులకు మేం వ్యతిరేకం కాదని చాలా స్పష్టంగా చెప్పాం’ అని తీర్పును ధర్మాసనం మరోసారి గుర్తుచేసింది. రివ్యూ పిటిషన్‌పై తీర్పు వెలువరించే వరకూ.. మార్చి 20 నాటి తీర్పును నిలుపుదల చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వినతిని కోర్టు తోసిపుచ్చింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్రం వేసిన రివ్యూ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ... ఈ కేసులో ప్రధాన పిటిషన్‌లోని అసలు కక్షిదారులతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా వింటామని తెలిపింది. రివ్యూ పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర కక్షిదారులు రెండు రోజుల్లోగా లిఖితపూర్వకంగా కోర్టుకు అనుమతి తెలిపాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల్లో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా సోమవారం ఎస్సీ, ఎస్టీ సంఘాలు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ లేకుండానే పరిహారం ఇవ్వొచ్చు ‘ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లో పేర్కొన్న నేరాలకు సంబంధించిన అంశాలు మాత్రమే తీర్పు పరిధిలోకి వస్తాయి. ఐపీసీ కింద కేసు పెట్టదగిన నేరాల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు విచారణ అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని ఏ నిబంధనను మేం బలహీనపరచలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే వేధింపుల బాధితులకు నష్టపరిహారం చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద నమోదైన నేరాలపై విచారణ పూర్తి చేయడానికి ఇచ్చిన ఏడు రోజుల గడువు కేవలం గరిష్ట పరిమితి మాత్రమే... మీరు కావాలంటే పది నిమిషాల్లో లేదా అరగంట, గంటలో ఆ పని పూర్తి చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు. ఇతర చట్టాల్లో ఉన్నట్లే ముందస్తు బెయిల్ కోసం నిబంధనల్ని ప్రవేశపెట్టాం’ అని బెంచ్ స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ధారణ లేకుండా మీపై ఆరోపణలు చేస్తే మీరు పనిచేయగలరా? ప్రభుత్వాధికారిపై అలాంటి ఆరోపణలు చేస్తే అతను లేదా ఆమె పనిచేయగలరా? అని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. ‘అలాంటి పరిస్థితుల్లో వారు పనిచేయలేరు. పరిష్కార మార్గం చూపకుండా అమాయకుల హక్కుల్ని దూరం చేయలేం’ అని కోర్టు పేర్కొంది. రివ్యూ పిటిషన్‌ను తక్షణమే విచారించాలి: కేంద్రం ఈ సందర్భంగా రివ్యూ పిటిషన్‌ను తక్షణమే విచారించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టును కోరారు. సోమవారం జరిగిన హింసలో వందల కోట్ల ఆస్తినష్టం జరిగిందని, పలువురు ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం వేధింపుల బాధితుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ.. నిజమైన కేసుల్లో నిందితుడ్ని విడుదల చేయమని తాము చెప్పలేదని తెలిపింది. -
దళితులపై దాడులను ఖండించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : భారత్ బంద్ సందర్భంగా దళితులపై వివిధ రాష్ట్రాలలో జరిగిన దాడులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుకు గురైన దళితులకు, ప్రభుత్వం, సమాజం అన్నివిధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అణిచివేతకు గురైన దళితులకు అండగా ఉండడం కోసమే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారని, భారత ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో దళితులకు రక్షణగా ఉండడం కోసం ప్రత్యేక చట్టాలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. దళితులకు కల్పించిన హక్కులు, తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అములు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు తమ హక్కులను కాలరాసే విధంగా, తమ రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలకు తూట్లు పొడిచే విధంగా ఉన్నాయని దళితులు భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దళితుల అభిప్రాయాలను, మనోవేదనను న్యాయ స్థానాలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం కూడా న్యాయస్థానం మార్గదర్శాకాలపై స్పందించాలని కోరారు. ప్రధాని మోదీ వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు దళితుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయస్థానానికి చెప్పాలని ప్రధానిని కోరారు. తమ హక్కులకు, చట్టాలకు భంగం కలుగుతందనే బాధలో దళితులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలన్నారు. దళితుల వెంట తాము ఉన్నామనే భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస కర్తవ్యమని చెప్పారు. -
‘దేశం భగ్గుమంటోంది’
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై తన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టును కోరింది. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో అత్యవసర తరహా పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తీర్పుపై పునరాలోచన చేయాలని కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించారు. దళిత సంఘాల ఆందోళనతో దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితి సజావుగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాటి భారత్ బంద్ సందర్భంగా పలువురు మరణించారని, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని వేణుగోపాల్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే శాంతిభద్రతల పర్యవేక్షణ ప్రభుత్వ బాధ్యత అని అమికస్ క్యూరీ అమరేంద్ర శరణ్ అటార్నీ జనరల్ వాదనతో విభేదించారు.దేశంలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు క్షీణించాయనే పేరుతో సుప్రీం కోర్టు తన ఉత్తర్వులపై స్టే ఇవ్వడం సరికాదని శరణ్ వాదించారు. మరోవైపు ఇదే అంశంపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ దళితుల హక్కులతో పాటు వారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడిఉందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రజ్వరిల్లచేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని సమూలంగా మార్చాలన్న సుప్రీం కోర్టు తీర్పుతో కేంద్రం విభేదిస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన వివరణ హేతుబద్ధతతో తాము ఏకీభవించబోమని అన్నారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దళిత సంఘాల రిట్ పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తామని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. నిజాయితీతో కూడిన ప్రభుత్వ అధికారులను ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తప్పుడు కేసులు మోపి బ్లాక్ మెయిల్‌కు గురిచేయడాన్ని నిరోధిస్తూ చట్ట నిబంధనలను మార్చాలని మార్చి 20న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. దీనిపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసి బహిరంగ విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరింది. -
సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఆందోళన
సాక్షి, కరీంనగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు తప్పుడుగా నమోదవుతున్నాయంటూ, ఇందులో ప్రాథమిక విచారణ అవసరమని, తక్షణ అరెస్టులు ఆపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ సోమవారం దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైనట్లు దళిత ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మెండి చంద్రశేఖర్, దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయమే దళిత, ప్రజా సంఘాలకు చెందిన నేతలు పెద్దఎత్తున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు రం గప్రవేశం చేసి దళితులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌తోపాటు దళితులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పో లీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. దళిత సంఘాల నేతలు సుద్దాల లక్ష్మణ్, మేడి మహేశ్, ఇంజం వెంకటస్వామి, కల్లెపల్లి శంకర్, మాదరి శ్రీనివాస్, గోష్కి శంకర్, మేడి అంజయ్య, గోష్కి అజయ్, గంటల రేణుక, మాల మాలతి, యనమల మంజుల, తీట్ల ఈశ్వరి, సముద్రాల అజయ్, బడుగు లింగయ్య, గసికంటి కుమార్, బొలుమాల సదానందం, బొగ్గుల మల్లేశం, కోహెడ వినోద్, గాలిపెల్లి శ్రీనివాస్, సానది వెంకటేష్, గంటల మహేందర్, గోర్రె రాజయ్య, పోత్తూరి రమేశ్, మైసని మనోహర్, చిన్న రుద్రవరపు పాల్గొన్నారు. సంఘాల ఆధ్వర్యంలో.. కేవీపీఎస్, ఆర్పీఐ, టీఎంఆర్పీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చేలా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లగుడ్డలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.సురేష్, చందు, చిరంజీవి, రాజయ్య, కుతాడి శివరాజ్, లింగంపల్లి బాబు, వెంకన్న, కృష్ణ, ఆంజనేయలు తదితరులు పాల్గొన్నారు. -
భారత్ బంద్ హింసాత్మకం.. రాజకీయ కుట్ర!
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో తీవ్ర హింస చెలరేగింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 10 మంది మరణించగా, వందల మందికి గాయాలయ్యాయి. బంద్ పిలుపు మేరకు మెజారిటీ రాష్ట్రాల్లోని దళిత సంఘాలు సోమవారం ఉదయం నుంచే నిరసనలు చేపట్టాయి. ఎక్కడిక్కడ రైళ్లు, బస్సులను అడ్డుకుని, రహదారులను దిగ్భందించారు. వేల సంఖ్యలో గుమ్మికూడిన దళితులు ర్యాలీలు చేపట్టారు. పలు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో అప్రకటిత కర్వ్యూ వాతావరణం నెలకొంది. తొలుత రోడ్లపై టైర్లను తగులబెట్టిన నిరసనకారులు.. అదే క్రమంలో కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నంలో చాలా చోట్ల పోలీసులు లాఠీచార్జ్ చేయగా, మరికొన్ని చోట్ల కాల్పులు జరిగినట్లు తెలిసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులను తక్షణమే అరెస్టు చేయరాదంటూ గత నెల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల్లోని దళిత సంఘాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ఉధృతంగా సాగుతుండగానే.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళతామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హింసాయుత ఘటనలు అధికంగా చోటుచేసుకోవడం గమనార్హం. అటు పంజాబ్, హరియాణా, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రలో భారత్ బంద్ తీవ్ర ఉద్రికతలకు దారితీసింది. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా షాపులు మూయించారు. ఆస్తుల విధ్వంసానికి దిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే హింస చెలరేగడం రాజకీయ కుట్రేలో భాగంగానే జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనా?) మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్: అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఈ నిషేధం కొనసాగుతున్నది. రాష్ట్రాలు కోరితే అవసరమైన మేరకు కేంద్ర బలగాలు, సైన్యాన్ని పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో అన్నారు. మాయ, మమత సంతాపం: దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడం, 10 మంది చనిపోవడం బాధాకరమని బీఎస్సీ చీఫ్ మాయావతి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీలు అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్ నగర్, మీరట్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలకు సంబంధించి పలువురు బీఎస్పీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని మాయావతి ఖండించారు. దక్షిణాదిలో అంతంతమాత్రమే: దళిత సంఘాల భారత్ బంద్ పిలుపు మధ్య, ఉత్తర భారతాన్ని ప్రభావితం చేసినంతగా దక్షిణ భారతాన్ని చేయలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఎన్నికల రాష్ట్రం కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. -
ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ రాష్ట్రంలో ఇటీవల ఇతర వెనకబడిన కులాలకు చెందిన ఎజావ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన కన్న కూతురునే ఓ దళితుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందన్న కారణంగా చంపేశారు. ఊరిలో పెళ్లి ఊరేగింపులకు తమకు అనుమతివ్వాలంటూ దళితులు డిమాండ్ చేసినట్లయితే వారి అంతు చూస్తామని ఉత్తరప్రదేశ్ ఠాకూర్లు హెచ్చరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లయితే విధ్వంసం సష్టిస్తామని మహారాష్ట్రలోని మరాఠీలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికే ఈ చట్టాన్ని ఎత్తివేయాలని అగ్రవర్ణమైన వర్ణియార్లు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని ‘పట్టాలి మక్కల్ కాచ్చి’ డిమాండ్ చేస్తోంది. దేశంలోని దళితుల పట్ట వివిధ సామాజిక వర్గాలకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ వార్తలు స్పష్టం చేస్తున్నాయి. దళితుల పట్ల దేశంలో ఇంకా ఇలాంటి అభిప్రాయాలు కొనసాగుతున్నందునే ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని నీరుకార్చాల్సిన అవసరం లేదన్నది స్పష్టం అవుతోంది. ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందని భావించాల్సిన అవసరం లేదు. నిజంగా దుర్వినియోగం అవుతుంటే అందుకు కారణాలేమిటో క్షుణ్నంగా పరిశీలించి చట్టంలో ఆమోదయోగ్యమైన మార్పులు తీసుకరావచ్చు. అంతేగానీ చట్టాన్ని సవరణ పేరిట పలుచన చేయరాదు. సుప్రీం కోర్టు పలచన చేసిందన్న కారణంగానే, దాని సమీక్షను కోరుతూ కేంద్రం రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలంటూ నేడు ఎస్సీ, ఎస్టీలు భారత్ బంద్‌ను పాటిస్తున్నాయి. మొన్నటి వరకున్న చట్టం నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీల చట్టం కింద ఫిర్యాదు అందితే తక్షణం కేసు నమోదు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నిందితులను అరెస్ట్‌చేసే అవకాశం ఉండింది. ఈ కేసులో నిందితులకు బెయిల్ కూడా వెంటనే లభించేది కాదు. ఈ చట్టం దుర్వినియోగం అవుతుందున్న కారణంగా బాధితుల నుంచి ఫిర్యాదు అందితే దానిపై వారం రోజుల్లో సమగ్ర దర్యాప్తు జరిపి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత నిందితులపై చర్య తీసుకోవాలని, ఇక ప్రభుత్వ అధికారులపై కేసు దాఖలైతే వారిని అరెస్ట్ చేయడానికి వారి పైఅధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో దళితులపై రోజురోజుకు దాడుల ఘటనలు పెరుగుతున్నప్పటికీ వారిపై ఎస్సీ, ఎస్టీల చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువ. ఇక వాటిల్లో శిక్ష పడుతున్న సందర్భాలు చాలా తక్కువ. మొత్తం కేసుల్లో 25 శాతం కేసులకు మించి నిందితులకు శిక్షలు పడడం లేదు. ఎందుకంటే నిందితుల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు బాధితులతో రాజీలు కుదుర్చడమే అందుకు కారణం. ఇక ఈ కేసుల్లో తక్షణ అరెస్ట్‌లు కూడా లేకపోతే నిందితులపై కేసులు దాఖలు చేయడం తగ్గిపోతుంది. దాఖలైనా రాజీలే ఎక్కువ జరిగి శిక్షలు మరింత తగ్గిపోతాయి. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితులపై గోరక్షకులు దాడులు జరపగా, వాటిల్లో 20 శాతం కేసుల్లో కూడా ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని ప్రయోగించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని మరింత కఠినం చేయాలని ‘నేషనల్ కొహలిషన్ ఫర్ స్ట్రెన్తనింగ్ ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్’ డిమాండ్ చేస్తోంది. కుల మతాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికి గౌరవంతో జీవించే హక్కు ఉంది. భారత రాజ్యాంగంలోని 14వ అధికరణం కులాని, అగ్రవర్గాన్ని కాకుండా అంటరాని తనాన్ని నిషేధిస్తోంది. అందుకనే 1955లో దేశంలో అంటరానితనం నిషేధిత చట్టం అమల్లోకి వచ్చింది. అదే 1974లో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మారింది. 1989లో ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంగా రూపాంతరం చెందింది. వర్ణ వ్యవస్థ ఆధిపత్యంగల భారత్‌లో ఆశించిన మార్పు రాకపోవడంతో చట్టాన్ని సవరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు చట్టాన్ని కఠినతరం చేస్తూ రాగా, ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని సడలించింది. చట్టం దుర్వినియోగం అవుతుందన్న కారణంగా ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని 498ఏ, ప్రివెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ యాక్టివిటీ చట్టాలు ఎస్సీ,ఎస్టీల చట్టంకన్నా ఘోరంగా దుర్వినియోగం అవుతున్నాయి. -
భారత్ బంద్
-
భారత్ బంద్‌లో కాల్పుల కలకలం
-
భారత్ బంద్: బాల్కనీలో నిల్చుంటే.. బుల్లెట్ తగిలి!
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నీరుగార్చవద్దంటూ దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బంద్ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘భారత్ బంద్’ ఆందోళనలో హింస చోటుచేసుకుంది. పోలీసులతో నిరసనకారులు ఘర్షణ పడటం, పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలోని మోరెనా ప్రాంతంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు ఇక్కడ రైల్వేట్రాక్‌లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు నిరసనకారులను నియంత్రించేందుకు ఒక దశలో గాలిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. నిరసనకారులు, పోలీసులు ఘర్షణ పడుతున్న సమయంలో సమీపంలో ఉన్న భవనం బాల్కనీలోంచి రాహుల్ పాఠక్ అనే వ్యక్తి ఈ గొడవను చూస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో.. ఓ బుల్లెట్ దూసుకొచ్చి ఆయనకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడని సమాచారం. ఇటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హరియాణా, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రలో భారత్ బంద్ తీవ్ర ఉద్రికతలకు దారితీసింది. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా షాపులు మూయించారు. ఆస్తుల విధ్వంసానికి దిగారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులకు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ జరపడంతో పలువురు గాయపడ్డారు.