
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి అద్దంకి దయాకర్(పాత చిత్రం)
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై ప్రభుత్వం కేంద్రం తీసుకు వస్తున్న ఆర్డినెన్స్ చాలా బలహీనంగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..మోదీ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని అన్నారు. ఈ డ్రామాలతో తమను మోసం చెయ్యలేరని చెప్పారు. ఈ నెల 8న జరిగే సింహ గర్జన సభ, 9న తలపెట్టిన బంద్‌ను నిర్వీర్యం చెయ్యడానికి మోదీ ఆర్డినెన్సు తెస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాను మోదీ ఎలా తుంగలో తొక్కారో అందరికి తెలిసునని, మోదీ తెచ్చే ఆర్డినెన్స్ కూడా అలానే ఉంటుందన్నారు.
ఆగస్ట్ 8న సింహగర్జన సభకు అన్ని రాష్ట్రాల నేతలను ఆహ్వానిస్తామని తెలిపారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో మనువాదులు ఉన్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దళితులపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని,అందుకే మాకు...మోదీపై నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment