ADDANKI DAYAKAR
-
Allu Arjun Arrest: సాక్షి డిబేట్ లో మాటకు మాట
-
తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడానికి కారణం అదే
-
మా ఓటమికి కారణం ఇదే.. కీలక అంశాలు బయటపెట్టిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
-
KSR Live Show: 2300 భవనాలు కూల్చివేత.. వరల్డ్ క్లాస్ సిటీని చేయడానికే..
-
పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్రే: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ దాడుల ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈడీ దాడులు.. బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు.మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్ర. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బీజేపీ భయపెట్టాలని చూస్తోంది. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడులు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టి మానసికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది.కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో ముందుకు సాగింది. డీకే శివ కుమార్‌పై కూడా ఇలాగే దాడుల ప్రయోగం చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా వదలకుండా కేంద్రంలోని బీజేపీ.. ఈడీ దాడులు చేయించింది. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత -
మా టార్గెట్ నాగార్జున, బీఆర్ఎస్ కాదు.. కాంగ్రెస్ నేతలైనా వదలం
-
తిరోగమనం పై తీవ్ర నిరసన ‘తిరిగి చూడు’పాట
‘తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని... కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషి’... ఈ పాట ఇప్పుడు చాలామంది అభిమానులను సంపాదించుకుంది. రాజకీయవేత్త అద్దంకి దయాకర్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘ఇండియా ఫైల్స్’ కోసం కీరవాణి పాడి, సంగీతం అందించిన ఈ పాటను రాసింది మౌనశ్రీ మల్లిక్. స్వీయ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. గద్దర్ కథ అందించిన ‘ఇండియా ఫైల్స్’లోని పాటలు యూట్యూబ్‌లో విడుదలై లక్షల వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మౌనశ్రీ మల్లిక్ వెల్లడించిన అభిప్రాయాలు....→ ‘ఇండియా ఫైల్స్’ కోసం ‘తిరిగి చూడు’, ‘జై ఇండియా’ పాటలు రాశాను. రెండూ పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉంది. ‘ఇండియా ఫైల్స్’ కథలో అద్దంకి దయాకర్ గారిది సామాజిక కార్యకర్త పాత్ర. సమాజంలో పేరుకుపోతున్న మూఢత్వాన్ని, తిరోగమనాన్ని చూసి మార్పు రావాలంటే ఏం చేయాలో తెలియ చేయమని తన గురువు (సుమన్)ను అడుగుతాడు. దేశమంతా తిరిగి చూస్తే నీకే జవాబు దొరుకుతుంది అని గురువు సూచిస్తాడు. అద్దంకి దయాకర్ దేశాన్ని తిరిగి చూసే సందర్భంలో వస్తుందీ పాట.→ ‘పుణ్యపుడమిలో పరిఢవిల్లిన మేధలేదిపుడెందుకో... ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకో’ అని ఈ పాటలో రాశాను. ఒకప్పుడు మేధావులతో నిండిన ఈ దేశంలో జ్ఞానవికాసానికి బదులు ఛాందసం మొలకెత్తడం బాధాకరం. అందుకే ‘గాయపడిన భరతజాతికి వైద్యమేదో చదువుకో’ అని కూడా రాశాను. నాలుగు చరణాల ఈ పాటను విని దర్శకుడు బొమ్మకు మురళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ కనకదుర్గ చాలా సంతోషపడ్డారు. కీరవాణిగారైతే ఎంత మెచ్చుకున్నారో తెలియదు. దీనిని నేనే పాడతానని చెన్నైలో తన సంగీత దర్శకత్వంలో రికార్డు చేశారు. పాట రిలీజై ఇంత స్పందన రావడం సంతృప్తిగా ఉంది.→ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం ‘ఇండియా ఫైల్స్’ కథాంశం. రాజ్యాంగం సరిగా అమలైతే పేదవాడు పేదవాడిగా ఉండిపోడని ఈ సినిమాలో చెబుతాం. ‘ప్రశ్నించే వారికి స్వేచ్ఛ ఉండాలి’ అని ఇదే సినిమాలోని ‘జై ఇండియా’ గీతంలో రాశాను.→ మాది వరంగల్ జిల్లా వర్థన్న పేట. జర్నలిస్ట్‌గా పని చేశాను. చిన్నప్పుడు పేదరికంలో రేడియో ఒక్కటే వినోదంగా ఉండేది. అందులో వినిపించే పాటలే నన్ను కవిని, గీతకర్తను చేశాయి. సామాజిక చైతన్యం కలిగిన కవిగా సాహిత్యవేత్తగా రాణిస్తూనే టీవీ, సినిమాల్లో పని చేస్తున్నాను. కె. రాఘవేంద్రరావు గారు పాటలకు ప్రాధాన్యం ఉన్న ‘కోకిలమ్మ’, ‘కృష్ణతులసి’ సీరియల్స్‌లో నా చేత వరదలాగా పాటలు రాయించడంతో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు టీవీ సీరియల్స్‌కు టైటిల్ సాంగ్ అనగానే నా పేరే గుర్తుకు వస్తోంది. → చిన్న సినిమాలకు చాలా పాటలు రాశాను. ‘గుడ్ మార్నింగ్’ సినిమాకు నేను రాసిన పాటకు 2012లో గీతా మాధురికి నంది అవార్డు వచ్చింది. ‘ఇండియా ఫైల్స్ పాటలతో వచ్చిన గుర్తింపుతో ఇకపై సినిమా రంగంలో మరింత ఉత్సాహంగా పాటలు రాయాలని అనుకుంటున్నాను. -
తప్పక వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నాం: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ సరైన పద్దతిని పాటించలేదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. పార్టీ మారుతున్న వారిని ఆపే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నేతలను చూస్తుంటే నవ్వు వస్తోందని సెటైరికల్ కామెంట్స్ చేశారు.కాగా, అద్దంకి దయాకర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్లో తమ నేతలను కాపాడుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులను తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటోంది. దీంతో, వారిని ఆపే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నేతలను చూస్తుంటే నవ్వు వస్తోంది. రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్దతిని పాటించలేదు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి.పార్టీ ఫిరాయింపులు అనేవి కేవలం తెలంగాణలోనే జరగడం లేదు. దేశ రాజకీయాల్లో ఒక తంతుగా మారింది. టీడీఎల్పీని, సీఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నప్పుడు వారిని సిగ్గుగా అనిపించలేదా?. అప్పుడు కేటీఆర్‌కు చట్టం, న్యాయం ఎందుకు కనిపించలేదు. రాజకీయాల్లో బీఆర్ఎస్కు ఒక న్యాయం. ఇతరులకు మరో న్యాయమా?. చట్టపరమైన అంశాలను కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కోగలదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా ఫైల్స్‌లాంటి సినిమా అవసరం
‘‘ప్రస్తుత సమాజానికి ‘ఇండియా ఫైల్స్’ లాంటి సినిమా చాలా అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్ లీడ్ రోల్లో ఇంద్రజ, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ ఇతర ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండియా ఫైల్స్’. బొమ్మకు హిమమాల సమర్పణలో డా. బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘అద్దంకి దయాకర్ నటన చూడలేదు. కానీ ఆయనకు ప్రతి సబ్జెక్ట్, సమస్యల పట్ల ఉన్న అవగాహన నాకు తెలుసు. దయాకర్ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలి’’ అన్నారు. ‘‘గద్దర్‌గారు ΄ాడి, నటించిన ΄ాటకి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎంఎం కీరవాణి. డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ– ‘‘నటనంటే తెలియని నాకు 40 రోజులు శిక్షణ ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ కల్పించిన మురళిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ సినిమా సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది... ఆలోచింపజేస్తుంది’’ అన్నారు బొమ్మకు మురళి. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ మాట్లాడారు. -
అద్దంకి దయాకర్ ‘ఇండియా ఫైల్స్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటనపై అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. అవకాశం ఇవ్వకుండా ఆపినా కార్యకర్తగానే ఉంటానని అన్నారు. అభిమానులెవరూ కలత చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ భవిష్యత్తులో అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. అందరం కలిసి ప్రజాపాలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ బుధవారం ప్రకటించించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు, యువనేత బల్మూరి వెంకట నర్సింగరావు(బల్మూరి వెంకట్)తోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తొలుత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. అయితే అద్దంకికి పార్టీ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. చివరి నిమిషంలో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించింది. గురువారం ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 29వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్‌ల కేటాయింపు -
Congress: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. అద్దంకి దయాకర్‌కు ఝలక్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు, యువనేత బల్మూరి వెంకట నర్సింగరావు(బల్మూరి వెంకట్)తోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే అభ్యర్ధుల ప్రకటనలో కాంగ్రెస్ స్వల్ప మార్పులు చేసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. తొలుత అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. చివరి నిమిషంలో సీనియర్లు చక్రం తిప్పడంతో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం వరించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా.. ఆ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఈనెల 18న నామినేషన్లకు చివరి తేదీ. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. చదవండి: అందుకే ఆగాం, లేకుంటేనా.. : హరీష్‌రావు ఇక 2021 ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వెంకట్.. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అధిష్టానం సూచన మేరకు టికెట్ రేసు నుంచి వైదొలగారు. సమీకరణల్లో భాగంగా అక్కడ హుజూరాబాద్ మండలం సింగాపురానికి చెందిన వొడితెల ప్రణవ్‌కు పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరి పేర్లను ప్రకటించింది అధిష్టానం. -
అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా, మంగళవారం అనూహ్యంగా వెంకట్ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌తో పాటు వెంకట్‌ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ ఇద్దరి పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. నిజానికి మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, బుధవారం అధికారిక ప్రకటన వస్తుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. జగ్గారెడ్డికి బీ ఫారాలపై సంతకాల అధికారం ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు సమర్పించనున్న బీఫారాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి సంతకాలు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీఫారాలిచ్చే అధికారాన్ని ఏఐసీసీ జగ్గారెడ్జికి ఇచి్చంది. ఇక నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల చేత ప్రతిపాదిత సంతకాలు చేయించే వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అతిపిన్న వయస్కుడిగా మండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసనమండలికి ఎన్నికైన వారిలో ఇంత చిన్న వయస్సు ఉన్న వారెవరూ లేరు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటివరకు 33 ఏళ్ల వయసులో ఒకరు గుజరాత్ శాసనమండలికి ఎన్నిక కావడమే రికార్డు అని, ఇప్పుడు ఆ రికార్డును వెంకట్ అధిగమిస్తారని గాంధీభవన్ వర్గాల సమాచారం. -
సీఎం ఎంపిక బాధ్యత అధ్యక్షుడు ఖర్గేదే: డీకే
-
హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు.. పార్టీలు కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అద్ధంకి దయాకర్‌కు హ్యాండిచ్చింది. మరోవైపు, తనకు సీటు ఇవ్వకపోవడంపై దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్ గెలుపు కోసం పనిచేస్తాను. ప్రతీ నిర్ణయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. నా మద్దతుదారులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు.. ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో, ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా.. పటాన్చెరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు జరిగింది. దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్‌కు అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో, రాజనర్సింహ శాంతించారు. మరోవైపు.. ఎన్నికల్లో పొత్తుల అంశంలో కాంగ్రెస్-సీపీఎం మధ్య చర్చలు విఫలమయ్యాయి. చివరి రోజు వరకు మిర్యాలగూడ టికెట్‌ను సీపీఎం కోసం కాంగ్రెస్ పార్టీ ఆపింది. చర్చలు ఫలించకపోవడంతో అభ్యర్థిని ప్రకటించింది. కాగా, సీపీఎం పొత్తు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థానాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. "పార్టీ నిర్ణయమే ప్రధానం మరియు నేను దానిని అంగీకరిస్తున్నాను. రేపు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు నేను హాజరవుతాను & పార్టీని గెలిపించడానికి కృషి చేస్తా." : అద్దంకి దయాకర్ గారు. pic.twitter.com/unPMA83qHt — Telangana Congress (@INCTelangana) November 9, 2023 -
అద్దంకి దయాకర్ కు బిగ్ షాక్
-
జనసేనకు జనం మద్దతు తెలుపుతారా..?
-
జానారెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించారు: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. జానారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పదనుకుంటే బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని కామెంట్స్ చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీపై పోరుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఇక, జానారెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి కలకలం సృష్టించాయి. జానారెడ్డి కామెంట్స్‌పై తాజాగా టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్తో పొత్తు అనేది వెయ్యి శాతం సాధ్యం కాదు. జానారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అనే చర్చను ఎవరూ నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక, అంతకు ముందు కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్తో కాంగ్రెస్‌కు పొత్తు ఉండదని క్లియర్ కట్‌గా చెప్పారు. ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో నా కొడుకు పోటీ చేస్తాడు: జానారెడ్డి -
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ పదవులు, వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. అద్దంకి నేతృత్వంలో ఐదు రోజులుగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సహా ఇతర కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీ అయిన తెలంగాణ సామాజిక కాంగ్రెస్ బృందం బీసీ, ఎస్సీ, ఎస్టీల అంశాలు, సమస్యలపై చర్చించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో అద్దంకి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు, పార్టీ పదవులు, రాజ్యాంగ పదవుల్లో న్యాయం చేయా లని చేసిన విజ్ఞప్తిపై పార్టీ పెద్దలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతేగాక తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి గల కారణాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని అద్దంకి వివరించారు. వీటితో పాటు ఎనిమిదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ధన రాజకీయాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో ధరణి కారణంగా దళితులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. (చదవండి: మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!) -
డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి
రాజకీయాలలో నోరు జారితే ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారుతుంది. అందులోను ముఖ్యమైన స్థానాలలో ఉన్నవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి పలు విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. అలాగే నేతలు పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతుంటారు. కానీ కొన్ని సందర్భాలలో అది పెద్ద సమస్య అవుతుందని చెప్పడానికి తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న ఉదంతాలనే ఉదాహరణలుగా తీసుకోవచ్చు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో నేత అద్దంకి దయాకర్‌లు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా పేరొందిన రాజగోపాలరెడ్డి, వెంకటరెడ్డిలు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కీలకంగా ఉన్న నేతలు. రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ సమయంలో ఆయన సోదరుడు ఎంపీ అయిన వెంకటరెడ్డి ఏమి చేస్తారన్న ప్రశ్న వచ్చింది. ఆయన కాంగ్రెస్‌ను వీడనని చెప్పారు. కానీ అదే సమయంలో ఆయన మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో ఎంతవరకు పార్టీకి సహకరిస్తారన్నదానిపై సందేహాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తుంటారు. వెంకటరెడ్డి ఈ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎలా పడితే అలా విమర్శలు చేయడం వల్ల జరిగే నష్టాన్ని సరిగా అంచనా వేసుకున్నట్లు లేరు. రాజకీయ నేత ఎవరైనా తమకు ఎలా అవకాశాలు వస్తాయా? తద్వారా తాము అనుకున్నవైపు వెళ్లవచ్చని చూస్తుంటారు. రాజగోపాలరెడ్డి బిజెపిలోకి వెళ్లినా, వెంకటరెడ్డి ఇప్పటికిప్పుడు ఆ ఆలోచన చేయలేకపోతున్నారు. ఆయన కూడా కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినా, పార్టీ మారతారా?లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే తనను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి తరుణంలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక నిమిత్తం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చండూరు వద్ద ఒక సభ నిర్వహించారు. రాజగోపాలరెడ్డి కి వ్యతిరేకంగా జరిగిన ఈ సభను తనకు తెలియకుండా పెడతారా అని వెంకటరెడ్డి నిరసన తెలిపారు. తాను ఆ సభకు వెళ్లనని కూడా స్పష్టం చేశారు. అయినా వీరి అండ లేకపోయినా, జన సమీకరణలో కాంగ్రెస్ నేతలు సఫలం అయ్యారు. కానీ ఆ సభలో వెంకటరెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. ఆయన ఒక అసభ్య పదాన్ని కూడా వాడారు. దాంతో వెంకటరెడ్డి మరింత మండిపడ్డారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మరో సందర్భంలో కాంగ్రెస్‌లో సీనియర్, జూనియర్ అన్న పాయింట్ పై మాట్లాడుతూ హోంగార్డు ఎంత సీనియర్ అయినా, ఐపిఎస్ కాలేరు కదా అని వ్యాఖ్యానించారు. సహజంగానే కాంగ్రెస్ సీనియర్లలో ఇది కాక పుట్టిస్తుంది. అసలే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న వెంకటరెడ్డి వెంటనే దీనిని అందుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో హోంగార్డుల వంటి తాము ఎందుకని, ఐపిఎస్ హోదా ఉన్న నాయకులే గెలిపించుకుంటారులే అని బదులు చెప్పారు. అసలు సభ పోయి, ఈ వివాదమే మునుగోడులో ప్రధాన అంశం అయి కూర్చుంది. ఒక వైపు కాంగ్రెస్‌లో టికెట్ కోసం కొందరు నేతల మధ్య పోటీ, దానిని తేల్చుకోలేక సతమతమవుతున్న తరుణంలో వెంకటరెడ్డి వివాదం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. అద్దంకి దయాకర్ , రేవంత్ రెడ్డిలు తమ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. అయినా వెంకటరెడ్డి శాంతించలేదు. దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న కొత్త డిమాండ్ పెట్టారు. అలాగే రేవంత్ వ్యాఖ్యలపై పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాందీ వద్దే తేల్చుకుంటానని ఆయన ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కూడా అధిష్టానానికి కొందరు నేతలు రేవంత్‌పై పిర్యాదు చేయకపోలేదు. అందరిని కలుపుకుని వెళ్లాలని రేవంత్‌ను డిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు. అయినా రేవంత్ తొందరపాటుతో నోరు జారారు. అదే వెంకటరెడ్డికి ఆయుధం అయింది. ఒక దశలో రాజగోపాలరెడ్డిపై వెంకటరెడ్డినే పోటీకి నిలబెట్టాలన్న ఆలోచన కూడా చేశారని అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి అసలు తాను మునుగోడులో ప్రచారం చేయవలసిన అవసరం లేని దశకు వెంకటరెడ్డి వెళ్లారు. ఆయన భవిష్యత్తులో పార్టీలో ఉంటారో, ఉండరో కానీ, ఆయా అంశాలపై చికాకు సృష్టిస్తారన్న భావన కలుగుతుంది. వ్యూహాత్మకంగా వెంకటరెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేయవలసిన కాంగ్రెస్ నేతలు, అందుకు విరుద్దంగా ఆయన వ్యూహంతో సతమతమవుతున్నారు. ఇదే వెంకటరెడ్డి కొంతకాలం క్రితం రేవంత్ ను పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు తీవ్రమైన ఆరోపణ చేశారు. పార్టీ తెలంగాణ ఇన్ చార్జీ మాణిక్కం ఠాగూర్‌కు పాతిక కోట్లు ఇచ్చి పదవి కొనుకున్నారని ఆయన ఆరోపించారు. దానిపై తొలుత ఠాకూర్ సీరియస్ అయినా, ఆ తర్వాత సర్దుకుని, వెంకటరెడ్డికి స్టార్ కాంపెయినర్ హోదా ఇచ్చారు. ఆ సందర్భం అలాంటిది. పార్టీలో ఉన్నంతవరకు వెంకటరెడ్డితో తగాదా పెట్టుకుంటే వచ్చే ఇబ్బందులు ఏమిటో పార్టీ నేతలకు తెలుసు. ఎవరైనా నేత పార్టీకి దూరంగా ఉండాలని అనుకున్నా, పార్టీ నుంచి వైదొలగాలని అనుకున్నా, దాగుడుమూతల గేమే ఆడతారు. పరిస్థితి మొత్తం తనకు అనుకూలంగా ఉందని ఆయన భావించే వరకు రాజకీయం ఇలాగే ఉంటుంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాలరెడ్డి పార్టీని వీడడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక రాబోతోంది. అది కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం అవుతుంది. ఇలాంటి సమయంలో ఈ రచ్చ పార్టీకి పెద్ద తలనొప్పి అవుతుంది. దయాకర్ ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్‌తో సన్నిహితంగానే ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో రేవంత్‌కు దగ్గరైనట్లు ఉన్నారు. అయినా అనకూడని మాట అని వివాదంలో ఇరుకున్నారు. రేవంత్ మొదటి నుంచి దురుసుగా మాట్లాడే వ్యక్తే. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఆరోపణలు గుప్పించడమే కాకుండా, కొంత అభ్యంతర భాషను కూడా వాడుతుంటారు. దానికి ప్రతిగా టిఆర్ఎస్ నేతలు కూడా అంతే ఘాటుగా మాట్లాడుతుంటారు. అది రాజకీయ వివాదంగానే ఉంటుంది. కానీ సొంత పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సహజంగానే వాటికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వెంకటరెడ్డికి రేవంత్ వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. దీనివల్ల బిజెపి పక్షాన పోటీచేయనున్న తన సోదరుడు రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా వెంకటరెడ్డి తప్పించుకునే అవకాశం వచ్చింది. ఉప ఎన్నికలో బిజెపి గెలిస్తే వెంకటరెడ్డి రాజకీయ నిర్ణయాలు ఒక రకంగా ఉండవచ్చు. అలాకాకుండా రాజగోపాలరెడ్డి ఓటమి చెందితే, ఆయనకు వచ్చే ఓట్ల ఆధారంగా పరిస్థితిని అంచనా వేసుకుని రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చు. ఎటు వచ్చినా తమ రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా కోమటిరెడ్డి చూసుకోగలుగుతారు. కాగా కాంగ్రెస్‌ను వీడడంపై రాజగోపాలరెడ్డి ద్రోహి అంటూ మునుగోడులో పోస్టర్లు వెలిశాయి. ఇది రేవంత్ కుట్ర అని ఆయన విమర్శిస్తున్నా, ఉప ఎన్నికలో విజయం సాధించేవరకు ఆయన ఇలాంటి చిక్కులు ఎదుర్కోక తప్పదు. కాగా టిఆర్ఎస్లో కూడా అసమ్మతి చికాకుగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే కె.ప్రభాకరరెడ్డికి మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆయనకు పోటీగా కొందరు నేతలు జట్టుకట్టి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఇంకా ప్రభాకరరెడ్డి వైపే కేసీఆర్ ఆలోచన చేస్తే, స్థానికంగా ఆయనను వ్యతిరేకించే నేతలు టిఆర్ఎస్ విజయానికి ఎంత కృషి చేస్తారన్న డౌటు వస్తుంది. టిఆర్ఎస్, బిజెపిలు పోటాపోటీ సభలు నిర్వహించాయి. అమిత్ షా సభకు ఒక రోజు ముందుగానే కెసిఆర్ సభ నిర్వహించి బిజెపికి సవాల్ విసిరారు. భావి తెలంగాణ రాజకీయానికి దిక్సూచి వంటి మునుగోడు ఉప ఎన్నికకు తేదీ ఇంకా రాకముందే రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో పోరు, మరో వైపు సొంత పార్టీలో అసమ్మతి తలనొప్పులతో కాంగ్రెస్,టిఆర్ఎస్లు ఇబ్బంది పడుతున్నాయి. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
బానిస రాజకీయాలకు బీజేపీ తెర లేపింది
-
‘అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్.. ఆత్మగౌరవం ఇదేనా..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్‌తనానికి ఓటమి ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ పాదుషాలు అర్థం చేసుకోలేరనే విషయం అమిత్‌షా మునుగోడు ప్రసంగంతో రుజువైందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్రమంత్రి అమిత్ షాపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అబద్ధాలకు పెద్దకొడుకు అమిత్ షా. ఆయనకు అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలు పట్టవు. గాడిద గాత్రానికి ఒంటె ‘ఓహో..’అంటే, ఒంటె అందానికి గాడిద ‘ఆహా’అన్నట్టుగా మోదీ ప్రభుత్వ పనితీరు గురించి అమిత్ షా చెప్పుకున్నారు. నల్లచట్టాలతో దేశ రైతులకు ఉరితాడు బిగించేందుకు ప్రయత్నించిన మోదీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలకు పాల్పడుతోంది. ఫసల్ బీమా యోజన పథకంలో తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నిస్తున్న అమిత్ షాకు ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ ఈ పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో తెలియదా? ఫసల్ బీమాతో ఐదేళ్లలో ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.40 వేల కోట్ల లాభాన్ని పొందాయి. ఫసల్ బీమా యోజన తెలంగాణకు ఎలా పనికొస్తుందో అమిత్ షా చెప్తే ఇక్కడి ప్రజలు వినే తరించేవారు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గోల్డ్ మెడల్ తెలంగాణకు రూపాయి ఇవ్వలేదు ‘వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన బీజేపీ మునుగోడుకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందని ఆశించాం. గోల్మాల్ గుజరాత్‌కు తప్ప గోల్డ్‌మెడల్ తెలంగాణకు రూపాయి కూడా ఇచ్చే సంస్కారం బీజేపీ ప్రభుత్వానికి లేదు. అమిత్ షా లాంటి నాయకులు తెలంగాణ గడ్డమీద అసత్యాలతో ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు నమ్మరు’అని కేటీఆర్ హెచ్చరించారు. ‘తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను అర్థం చేసుకునేశక్తి బీజేపీకి లేదని అమిత్ షా ప్రసంగం ద్వారా నిరూపితమైంది’అని కేటీఆర్ తన ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని - తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ! https://t.co/SpFCHAszYe — KTR (@KTRTRS) August 22, 2022 ఇది కూడా చదవండి: అమిత్ షాపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు -
మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందన
-
ఆలోచించి మాట్లాడండి.. మర్రి శశిధర్ రెడ్డికి అద్దంకి దయాకర్ సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అద్దంకి దయాకర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము చేసిన కామెంట్స్ పెద్దదిగా చేయకుండా సద్దుమణిగే విధంగా ఉంటే బాగుండేది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ పావుగా మారుతోంది. సీనియర్ నేతలు మాట్లాడితే కాదు అనే వారు ఎవరూ లేరు. అంతర్గత అంశాల మీద మీరే సలహాలు ఇవ్వాలి. కానీ, పీసీసీని ఇలా అంటే పార్టీకి నష్టం కదా?. ఏదైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ ఉంది. ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ కూడా ఉంది. ఒక సీనియర్ నాయకుడిగా మీరు(మర్రి శశిధర్ రెడ్డి) ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నన్ను కూడా మీరు అన్నందుకు స్పందిస్తున్నాను. రేవంత్ చెప్తే నేను స్పందించడం లేదు’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మునుగోడులో గోల్ కొట్టేదెవరు..? కాంగ్రెస్,టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు... -
కోమటిరెడ్డికి మరోసారి క్షమాపణ చెప్పిన అద్దంకి దయాకర్
-
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
-
రేవంత్ బహిరంగ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్ ఏంటంటే..
సాక్షి, హైదరాబాద్: చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ క్షమాపణ చెప్పారు. అయితే రేవంత్ క్షమాపణలను తాను పట్టించుకోనని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. తనపై పరుష పదజాలం వాడిన అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ తర్వాతే రేవంత్ క్షమాపణపై స్పందిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చదవండి: (కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ) ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్ శనివారం మరోసారి ఎంపీ కోమటిరెడ్డికి క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. 'పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. క్రమశిక్షణ కమిటీ నాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. నోటీసులకు వివరణ ఇచ్చా.. క్షమాపణ కూడా చెప్పా. భవిష్యత్‌లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటాను' అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. (వైరలైన అద్దంకి దయాకర్ వీడియో) -
కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. రేవంత్‌కు ఊహించని ఫోన్ కాల్!
సాక్షి, హైదరాబాద్: వలసలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. చండూరు సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డినుద్దేశించి టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలమే రేపుతున్నాయి. మూడు దశాబ్దాలుగా పార్టీలో కీలక హోదాల్లో పనిచేస్తున్న నేత గురించి దయాకర్ అనుచితంగా మాట్లాడటం పట్ల ఆ పార్టీ సీనియర్ నేతలు గరంగరంగా ఉన్నారు. వేలాదిమంది ప్రజలు, కార్యకర్తల సమక్షంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకుల సాక్షిగా దయాకర్ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరమైనవని, ఆయనను వారించే ప్రయత్నం కూడా ఎవరూ చేయకపోవడం కచ్చితంగా పార్టీకి నష్టం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరైన సభలో ఈ విధంగా మాట్లాడటం పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు పంపుతాయని అంటున్నారు. ఇదే విషయమై నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు ఏఐసీసీ పెద్దలకు ఫోన్ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన్ను పార్టీలోంచి వెళ్లిపొమ్మనే హక్కు దయాకర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించినట్టు సమాచారం. షోకాజ్ నోటీసు జారీ దయాకర్ అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసింది. ఈ విషయమై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పీసీసీ నాయకత్వంతో చర్చించినట్టు సమాచారం. దయాకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే దయాకర్‌కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దయాకర్ మాట్లాడిన ఆ సభలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఉండటంతో ఆయననే సాక్షిగా చూపుతూ నోటీసు జారీచేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. క్షమాపణ చెబుతున్నా: అద్దంకి వెంకట్‌రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతుండటంతో దయాకర్ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను పొరపాటున చేసిన వ్యాఖ్యలతో వెంకట్‌రెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందున ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానన్నా రు. కోమటిరెడ్డి అభిమానులు క్షమించా లని, మళ్లీ తప్పు జరగకుండా చూసుకుంటానని అన్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వక ముందే వివరణ ఇవ్వాలనుకున్నానని, ఆ లోపే అది వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇస్తానన్నారు. వరుస తప్పిదాలకు పాల్పడుతున్న దయాకర్‌పై పార్టీ కఠినచర్యలు తీసుకో వాలని కోమటిరెడ్డి అభిమానులు కోరుతుండటం గమనార్హం. షోకాజ్ నోటీసు జారీ అయిన నేపథ్యంలో టీపీసీసీ క్రమ శిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డిని శనివారం గాంధీభవన్‌లో దయాకర్ కలిశారు. ఎంపీ కోమటిరెడ్డినుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై క్షమాప ణలు చెబుతున్నట్టు తెలిపారు. కోమటి రెడ్డిని కలసి క్షమాపణలు చెబుతానని, ఏఐ సీసీకి, కోమటిరెడ్డిలకు లేఖ కూడా రాస్తానని చిన్నారెడ్డికి వెల్లడించారు. ఇది కూడా చదవండి: నడి వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు -
నోరు జారా.. క్షమించండి: అద్దంకి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పాడు. అభ్యంతరకరవ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించారు అద్దంకి దయాకర్. శుక్రవారం చండూరు సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డిని సైతం ఉద్దేశిస్తూ.. పార్టీలో ఉంటే ఉండూ లేకుంటే.. అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశాడాయన. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో అద్దంకి దయాకర్‌పై విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేతలు పలువురు అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా సీనియర్ల సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఎవరూ నిలువరించకపోవడంపై ఏఐసీసీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో.. వెంకటరెడ్డి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా. ఏదో ఆవేశంలో నోరు జారాను. క్షమించండి. పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ నేను భావించను. నా వ్యాఖ్యలపై అధిష్టానానికి వివరణ ఇవ్వాలని అనుకున్నా. ఈ లోపే షోకాజ్ నోటీసు ఇచ్చారు. మరోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటా అని అద్దంకి దయాకర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. సీనియర్ నేత మల్లు రవి సైతం అద్దంకి క్షమాపణలపై స్పందించారు. కాంగ్రెస్ సోషల్ జస్టిస్ సమావేశంలో అద్దంకి దయాకర్ చేసిన వాఖ్యల పై చర్చ జరిగింది. అద్దంకి చేసిన వాఖ్యలు ప్రజల్లో తప్పుడు చర్చకు దారి తీశాయి. వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పాలని నిర్ణయించాం. షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి అద్దంకి సిద్దంగా ఉన్నారు అని మల్లు రవి తెలిపారు. ఇదీ చదవండి: టార్గెట్ రేవంత్.. మరోసారి తెరపైకి మాజీ ఎంపీ కుమారుడి టాపిక్! -
దయాకర్‌కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి పార్టీ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి ఈ నోటీసుల్విలని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. ఆదివారం గాంధీభవన్‌లో సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సంఘం సభ్యులు కమలాకర్‌రావు, మాజీ మంత్రి వినోద్, గంగారాంలు పాల్గొన్నారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేసిన కె.మదన్మోహన్రావును పార్టీ లైన్ దాట వద్దని క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. ఆయన పార్టీ పేరుతో కాకుండా మదన్ యూత్ ఫోర్స్ పేరుతో కార్యక్రమాలు చేయడం, పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండానే ఎల్లారెడ్డిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం వంటివి ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటూ క్రమశిక్షణ సంఘం ఆయనకు లేఖ పంపనుంది. కాగా, మదన్మోహన్ను సస్పెండ్ చేసిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌కు ఆ అధికారం లేదని అభిప్రాయపడ్డ కమిటీ, డీసీసీ అధ్యక్షులకు వచ్చే ఫిర్యాదులను రాష్ట్ర కమిటీకి తెలియ జేయాలని, అలా నేరుగా సస్పెండ్ చేయవద్దంటూ ఆయనకు కూడా లేఖ రాయాలని నిర్ణయించింది. (చదవండి: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్‌బై?) ఇక, దుబ్బాక నియో జకవర్గానికి చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి సంబంధించిన వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అంశంపై సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కమిటీ సూచించింది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తన పరిధి దాటి వరంగల్‌లో రాజకీయం చేస్తున్నారని.. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన క్రమశిక్షణ సంఘం, రాఘవరెడ్డి పాలకుర్తికే పరిమితం కావాలని సూచిస్తూ ఆయనకు లేఖ రాయాలని నిర్ణయించింది. (చదవండి: అన్నీ కొరతలే.. అద్భుతం: కేటీఆర్ ట్వీట్) -
కెఎస్ఆర్ లైవ్ షో 17 November 2021
-
టీఆర్ఎస్ నేతలు తెలంగాణ పరువు తీస్తున్నారు: అద్దంకి దయాకర్
-
కాంగ్రెస్‌లో తుంగతుర్తి లొల్లి ముగిసేనా?
సాక్షి, సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పరిష్కారానికి టీపీసీసీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్. సంపత్‌కుమార్, ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ నియోజకవర్గంలో పార్టీ పరంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఇరువర్గాలతో చర్చించి సమస్య పరిష్కారానికి సూచనలు చేస్తూ టీపీసీసీకి నివేదిక అందించనుంది. తుంగతుర్తిలో రెండుగా చీలిన కాంగ్రెస్ ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలి ఒకవర్గంపై మరొకవర్గం ఆరోపణలు చేసుకోవడం తారస్థాయికి వెళ్లింది. గత ఎన్నికల్లో నియోజకర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన అద్దంకి దయాకర్ ఇటీవల మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి(ఆర్డీఆర్)పై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. తనను, తన వర్గాన్ని నియోజకవర్గంలో ఆర్డీఆర్ తిరగనివ్వడంలేదని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను దామోదర్‌రెడ్డి దూషించాడని హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్‌లో కూడా అద్దంకితో పాటు ఆయన వర్గం ఫిర్యాదు చేసింది. దీనిపై ఆర్డీఆర్ వర్గం కూడా అగ్గివీుద గుగ్గిలమైంది. అద్దంకి దయాకర్‌పై నియోజకవర్గ వ్యాప్తంగా బాహాటంగా విమర్శలు గుప్పించింది. అలాగే అద్దంకిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో రెండు వర్గాల మధ్య నియోజకవర్గంలో సయోధ్య కుదుర్చేందుకు టీపీసీపీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతోనైనా రెండు వర్గాల మధ్య రాజీకుదురుతుందోలేదో వేచి చూడాల్సిందే. -
చింటూ, పింటూలు ఇప్పుడు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్ : గతంలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకొనే చింటూ (కేటీఆర్), పింటూ (హరీష్‌రావు)లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్‌లు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. వారి మాటల్లోనే.. ‘ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తున్న కేసీఆర్ వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. రైతు బంధు లేదు. వర్షాలు పడినా ఆదుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. కార్మికులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ విషయంలో ఎంత చెప్పినా తక్కువే. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. మీడియాపైన విపరీతమైన ఒత్తిడి వల్ల నిజాలు బయటకు రావడం లేద’ని విమర్శించారు. మంత్రులకు పదవీ భయం? ఇంకా ‘దేశంలో ఎక్కడా ఇలాంటి దుర్మార్గ పాలన లేదు. అప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధ పాలన చేస్తున్నారు. ప్రతీ విషయంలో మేమే పోటుగాళ్లమంటూ ముందుకు వచ్చే కేటీఆర్, హరీష్‌లు ఎక్కడ పోయారు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వీళ్లు ఒక్కమాట కూడా మాట్లాడటం లేదెందుకు? ఒకాయన జాయ్ 2019 అంటూ విలాసాలు చేస్తున్నారు. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంటే ఆ శాఖ మంత్రి ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. డెంగీతో అనేక మంది చనిపోతుంటే ఆరోగ్య మంత్రి పదవి భయంతో గొంతు మీద వేలాడుతున్న కత్తిని చూసి భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ప్రజలు తిరగబడకపోతే న్యాయం జరగదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేయాలి. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంద’ని వారు వివరించారు. -
కేసీఆర్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది: అద్దంకి
సాక్షి, హైదరాబాద్: బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న అంబేద్కర్ వాదుల మహాగర్జనలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో కేసీఆర్‌ను మించిన నియంత లేడని, అంబేద్కర్ కాలి గోటికి కూడా ఆయన సరిపోరని విమర్శించారు. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఎటు పోయిండు అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడం లేదని నిలదీశారు. రాజ్యాంగంపై గౌరవం లేదు కానీ దేశానికి ప్రధానమంత్రి అవుతానని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ కలుస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేసీఆర్ అణిచివేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతను కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగoలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా నిర్వహిస్తున్న ఈ మహాగర్జనలో మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరాం, వీహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, చాడ వెంకటరెడ్డి, ఎల్ రమణ, విమలక్క, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే: అద్దంకి
సిద్ధిపేట జిల్లా: గడిచిన శాసనసభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలుపొంది రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. గురువారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అద్దంకి దయాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధిపేట రావడం జరిగిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. పేద కుటుంబాలకు నెలకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.72 వేలు ఇస్తామని చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు పేదరికం నిర్మూలించడానికి నెలకు రూ.6 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందన్నారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని వెల్లడించారు. 16 ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతా అంటున్న కేసీఆర్ ఎందుకు ఎంపీగా పోటీ చేయలేదని ప్రశ్నించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ రూ.100 కోట్లకు ఒక్కో టిక్కెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వివేక్, మొదలుకొని మొన్నటి గుత్తా సుఖేందర్ రెడ్డి వరకు ఎవ్వరికీ టికెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. తల్లిని బిడ్డను వేరు చేసి కేసీఆర్ పాలన చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. హరీష్ రావు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తే 30 మంది ఎమ్మెల్యేలు పోతారని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు బతకాలని ప్రజలు కోరుకుంటుంటే టీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్షాలను చంపాలని చూస్తోందని అన్నారు. ఆ పథకం సంజీవని లాంటిది: ఇంద్ర శోభ పేద ప్రజలకు నెలకు రూ.6 వేలు ఇస్తామని కాంగ్రెస్ తెచ్చిన పథకం ప్రజలకు సంజీవని లాంటిదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇంద్ర శోభ వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే నల్లధనం తెస్తానని దేశప్రజలను మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అని తూర్పార బట్టారు. కేసీఆర్ 16 ఎంపీలు గెలవకున్నా కూడా ఆయన సీఎం పదవి ఎక్కడికీ పోదన్నారు. మెదక్ జిల్లా రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. -
విజయం కోరుతూ.. అరగుండుతో ప్రచారం
సాక్షి, యాదాద్రి భువనగిరి : ఎన్నికల వేళ తమ అభిమాన నాయకున్ని గెలిపించుకునేందుకు కార్యకర్తలు విభిన్న రీతిలో ప్రచారం చేస్తుంటారు. కొందరు గుడికి వస్తాననో.. మరికొందరు కానుకలు వేస్తాననో వేడుకుంటారు. తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ విజయాన్ని కోరుతూ ఓ అభిమాన్ని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. తుంగతుర్తిలోని లక్ష్మిదేవి కాల్వ గ్రామానికి చెందిన బండి మధు అనే కార్యకర్త అరగుండు, అర మీసంతో ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తన అభిమాన నాయకుడు అద్దంకి దయాకర్ గెలవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తాను ఈ విధంగా ప్రచారం చేస్తున్నట్లు మధు తెలిపారు. కాగా తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌పై దయాకర్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో మంచి వాగ్ధాటి గల నేతగా గుర్తింపు పొందిన దయాకర్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. -
సగం మీసం, సగం గుండుతో ప్రచారం..
సాక్షి, అడ్డగూడూరు : టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన బండి మధు మండల పరిధిలోని డి.రేపాక గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్‌తో కలిసి వినూత్న ప్రచారం నిర్వహించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా సగం మీసం, సగం గుండు తీయించుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్‌కు ఓటువేయాలని ప్రచారం నిర్వహించాడు. -
ఆ ఇద్దరికి సీట్లు ఇవ్వకపోతే దూకేస్తాం!
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి) : కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్, వడ్డెపల్లి రవిలకు టికెట్లు కేటాయించాలని పోటాపోటీగా అభిమానులు సెల్ టవర్లు ఎక్కి గురువారం నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగారం మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మొల్కపురి శ్రీకాంత్ తుంగతుర్తి అసెంబ్లీ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు ఇవ్వాలని సూర్యాపేట, జనగామ ప్రధాన రహదారి ఫాతిమా స్కూల్ పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి మూడు గంటల పాటు హల్చల్ సృష్టించాడు. స్థానిక పోలీసులు సెల్ టవర్‌ను దిగాలని ఎంత సముదాయించినా దిగక పోవడంతో స్థానికులు ఆందోళన పడ్డారు. ఎట్టకేలకు అద్దంకి దయాకర్ సెల్ఫోన్లో మాట్లాడి టికెట్ తనకే వస్తుందని తెలపడంతో టవర్ దిగాడు. శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వడ్డెపల్లి రవికే టికెట్ ఇవ్వాలని.. తుంగతుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వడ్డెపల్లి రవికి ఇవ్వాలని మండల కేంద్రానికి చెందిన ఎనుగుల కొమురమల్లు, విజయ్‌లు స్థానిక బీసీ కాలనీలో ఉన్న సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదిష్టానం వెంటనే తుంగతుర్తి అసెంబ్లీ టికెట్‌ను వడ్డెపల్లి రవికి కేటాయించాలని డిమాండ్ చేశారు. వీరికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సర్వోత్తమ్‌రెడ్డిలు ఫోన్లో మాట్లాడి టికెట్ రవికే వస్తుందని తెలపడంతో సెల్ టవర్ దిగారు. పోటాపోటీగా సెల్‌టవర్ ఎక్కి కాంగ్రెస్ అభిమానులు నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అద్దంకి దయాకర్‌కు టికెట్ ఇవ్వాలని.. మోత్కూరు (తుంగతుర్తి) : తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ అభ్యర్థిగా అద్దంకి దయాకర్‌కు ఇవ్వాలని కోరుతూ గురువారం సాయంత్రం మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలోని ఇద్దరు యువకులు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశారు. అంతటి ఉపేందర్, బొర్ర నాగార్జున అనే యువకులు సెల్‌టవర్ ఎక్కి అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నినాదాలుచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సెల్‌టవర్ ఎక్కిన వారిపై కేసు తిరుమలగిరి మండల కేంద్రంలో ముగ్గురు మర్రికుంట తండాలో ఒక్కరు అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవిలకు తుంగతుర్తి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని సెల్‌ఫోన్ టవర్లు ఎక్కి నిరసన తెలిపిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు నాగారం సీఐ రవీందర్ తెలిపారు. నలుగురిని తిరుమలగిరి తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఆరోనెలల్లోపు ఎలాంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ బి.డానియేల్ ఉన్నారు. -
ఇచ్చిన హామీలకే దిక్కులేదు: అద్దంకి
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై ప్రభుత్వం కేంద్రం తీసుకు వస్తున్న ఆర్డినెన్స్ చాలా బలహీనంగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..మోదీ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని అన్నారు. ఈ డ్రామాలతో తమను మోసం చెయ్యలేరని చెప్పారు. ఈ నెల 8న జరిగే సింహ గర్జన సభ, 9న తలపెట్టిన బంద్‌ను నిర్వీర్యం చెయ్యడానికి మోదీ ఆర్డినెన్సు తెస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాను మోదీ ఎలా తుంగలో తొక్కారో అందరికి తెలిసునని, మోదీ తెచ్చే ఆర్డినెన్స్ కూడా అలానే ఉంటుందన్నారు. ఆగస్ట్ 8న సింహగర్జన సభకు అన్ని రాష్ట్రాల నేతలను ఆహ్వానిస్తామని తెలిపారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్లో మనువాదులు ఉన్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దళితులపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని,అందుకే మాకు...మోదీపై నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. -
బంగారు కాదు.. ఆత్మహత్యల తెలంగాణ
శాలిగౌరారం (నకిరేకల్) : టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని బంగారు కాదు.. ఆత్మహత్యల తెలంగాణగా మార్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్ధంకి దయాకర్ ధ్వజమెత్తారు. బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలోనూ రైతన్నల పరిస్థితి తీవ్ర దుర్భిక్షంగా మారిందన్నారు. రైతుల సంక్షేమం ప్రకటనలకే పరిమితం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలనుంచి గట్టెక్కలేక తీవ్ర ఇబ్బందికర పరిస్థితితుల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతుబంధు పథకం భూస్వామ్య పెట్టుబడిదారులకే ఎక్కువగా ఉపయోగపడేలా ఉందేతప్ప చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం లేదన్నారు. కౌలుదారులకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేసినప్పుడే పేద రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రజలపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తట్టుకోలేక కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తూ పాలన సాగిస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి 2019లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు చింత ధనుంజయ్య, గూని వెంకటయ్య, వంగూరి వెంకన్న, సత్తయ్య, బిక్షం, ప్రశాంత్, సురేశ్, నాగరాజు, మహేశ్, కిరణ్‌కుమార్, బడేసాబ్, నగేశ్, రాజేశ్, కిరణ్, శంకర్, నాగార్జున్, పరమేశ్ పాల్గొన్నారు. -
ఖాసీం రజ్వీని మించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసుల నిర్బంధంతో.. రజా కార్ల నేత ఖాసీం రజ్వీని మించి ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచకంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, దరువు ఎల్లన్నలతో కలసి గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్లనివ్వకుండా అడ్డు కోవడమేంటని.. దీనికి ప్రభుత్వం సమా ధానం చెప్పాలని దయాకర్ డిమాండ్ చేశారు. పోలీసులను ఓయూకు పంపడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరో పించారు. ఓయూలో ఏ గొడవ, అల్లర్లు చేయకుండానే పోలీసులు దాడికి దిగార న్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలే∙బుద్ధి చెప్తారన్నారు. మురళి ఆత్మహత్యపై అను మానాలున్నాయని, సిట్టింగ్ జడ్జితో లేదా రిటైర్డు జడ్జితో విచారణ జరిపించాల న్నారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
‘మురళి ఆత్మహత్యపై అనుమానాలున్నాయ్’
హైదరాబాద్ : ఓయూ విద్యార్థి మురళి ముదిరాజ్ ఆత్మహత్య వెనక అనుమానాలున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిథి అద్దంకి దయాకర్ తెలిపారు. గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..ఈ ఘటనపై సర్కార్ సిట్టింగ్ జడ్జితో గానీ, రిటైర్డ్ జడ్జితో కానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఓయూకు రెండు మూడు కంపెనీల పోలీస్ లు ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసులను ఓయూకు పంపడం వెనక సర్కార్ కుట్ర దాగివుందని ఆరోపించారు. బాహుబలిలోని త్రిశూల వ్యూహం లెక్క పోలీసులను క్యాంపస్ లోకి పంపించారని వెల్లడించారు. తాము ఓయూలో ఎలాంటి గొడవ చేయలేదని, తామే గదిలోకి వెళ్లి గడి పెట్టుకుని స్వచ్ఛంద నిర్బంధం చేసుకున్నామని తెలిపారు. కేవలం మురళి కుటుంబానికి న్యాయం చేయమని, ఆర్థిక సాయం చేయమని మాత్రమే కోరామని తెలిపారు. డిసెంబర్ 3న శ్రీకాంత చారి సూసైడ్ చేసుకున్నాడు, అదేరోజు మురళి సూసైడ్ చేసుకున్నాడని వివరించారు. ఈ పాలన రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ పాలన లెక్క అన్పిస్తుందని చెప్పారు. జైల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయాలని, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్థులు మరో మిలిటెంట్ ఉద్యమానికి సిద్ధం కావాలని మరో నేత దరువు ఎల్లన్న పిలువునిచ్చారు. -
కాంగ్రెస్ వల్లే సీఎం అయిన కేసీఆర్
నల్గొండ జిల్లా / శాలిగౌరారం (తుంగతుర్తి) : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పలువురు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ త్యాగంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ‘తల్లిపాలుతాగి రొమ్ము గుద్దినట్లు’ వ్యవహరించాడని విమర్శించారు. నాడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కేసీఆర్ ‘మరణదీక్ష’ చేసినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే టీఆర్ఎస్కు భయమేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మురారిశెట్టి కృష్ణమూర్తి, అన్నెబోయిన సుధాకర్, బండపల్లి కొమరయ్య, బండారు మల్లయ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చింత ధనుంజయ్య, షేక్ ఇంతియాజ్, నోముల విజయ్‌కుమార్, కడమంచి వెంకటయ్య, బొమ్మగాని రవి పాల్గొన్నారు. -
మంత్రుల కుమారుల దౌర్జన్యాలు పెరిగాయి
టీపీసీసీ నేత అద్దంకి దయాకర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రుల కుమారుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మంత్రుల కుమారులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలను అరికట్టకపోతే కేసీఆర్‌కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నయీం కేసుల నుంచి అధికారులను రక్షించే పనిని కొందరు మంత్రులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడానికి టీఆర్ఎస్కు అధికారం కట్టబెడితే దానిని అడ్డం పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది: టీపీసీసీ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని టీపీసీసీ అధికార ప్రతి నిధి ప్యాట రమేశ్ ఆరోపించారు. మిషన్ భగీరథ పథకమంతా అవినీతిమయమేనని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వేపై టీఆర్ఎస్ నాయకుల విమర్శలు ఆ పార్టీ అభద్రతా భావానికి నిదర్శనమని ఆరోపించారు. -
టీఆర్ఎస్ నేతల ఆగడాలను అడ్డుకోవాలి
కాంగ్రెస్ నేతల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: అధికారం అండచూసుకుని అరాచకాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతలను కఠినంగా శిక్షించాలని, వారికి మద్దతిస్తున్న మంత్రులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, సుధాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం వారు మా ట్లాడుతూ, గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌం టర్ తర్వాత.. అతడి నేరాల్లో భాగస్వా ములైన వారిపై చర్యలేమీ తీసుకోలేదని ఆరోపించారు. నయీంతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రభుత్వమే కాపాడుతుందన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడ మే కాకుండా, బాధితులపై దాడికి పాల్పడి న టీఆర్ఎస్ నాయకుడిని మంత్రి జగదీశ్ రెడ్డి కాపాడటం దారుణమన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ఓ పిచ్చి నిర్ణయం తీసుకుంటే, దాన్ని కేసీఆర్ సమ ర్థించడం దురదృష్టకరమన్నారు. -
మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు
హైదరాబాద్ : తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన సంఘం పదో వార్షికోత్సవ సందర్భంగా పూర్తి స్థాయి కమిటీని నియమించారు. రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులుగా ఏశమళ్ళ సృజన్ కుమార్, నల్లవెల్లి సంజీవ , పిల్లి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా భైరి రమేశ్, ధార సత్యం, అధికార ప్రతినిధిగా సైదులు, రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్‌గా అశోద భాస్కర్, రాష్ట్ర కో-అర్డినేటర్‌గా కె.సాయి గిరి, యువత అధ్యక్షుడుగా దర్శ సతీష్ లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. -
మోత్కూరులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మోత్కూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 7వ వర్ధంతి నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ముఖ్య అతిధిగా హాజరై ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన ప్రాజెక్టులకే పేర్లు మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా బాలెం మధు కూడా పాల్గొన్నారు. -
ఔరంగజేబు కంటే కేసీఆర్ పెద్ద నియంత: టీపీసీసీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరంగజేబు కంటే పెద్ద నియంతలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్కు అధికారం కాం గ్రెస్ వేసిన భిక్షేనని.. కాంగ్రెస్ తెలంగాణ కోసం చేసిన త్యాగం వల్లే ఈ రోజు వారు పదవులు అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో దయాకర్ మీడియాతో మాట్లాడారు. ‘‘తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన ఔరంగజేబు కూడా తన రాజ్యానికి చెందిన ప్రజలను ప్రేమించాడు.. గౌరవిం చాడు. కానీ కేసీఆర్‌కు ప్రజలంటే కూడా లెక్కలేదు. ఒకే రోజు సమగ్ర సర్వే పేరుతో నియంతలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల జాతీయత, ప్రాంతీయత ఒక్కరోజులో తేల్చేస్తారా? ఆరోజు లేకుంటే మేం లెక్కలో లేనట్లేనా? ఇది ఫాసిస్టు విధానం కాదా? కనీసం 2, 3 రోజుల సమయం కూడా ఇవ్వరా? తెలంగాణ ఇంతకుముందు ఈ దేశంలో లేదా? లేక కొత్త దేశంగా ఆవిర్భవించిందా? తెలంగాణలో ఇంతకుముందు విధానాలు, నిబంధనలేమీ లేన ట్లుగా మాట్లాడుతున్నారు’’ అని పేర్కొన్నారు. రాష్ట్రానికి చేరిన సద్భావనాయాత్ర తీవ్రవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ నెల 9న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ప్రారంభమైన రాజీవ్‌గాంధీ జ్యోతి సద్భావనా యాత్ర గురువారం రాష్ట్రానికి చేరుకుంది. యాత్రలో భాగంగా గాంధీభవన్‌కు చేరుకున్న సుమారు 200 మంది నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు షబ్బీర్‌అలీ, తదితరులు ఘన స్వాగతం పలికారు. గాంధీభవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ చిత్రపటం ముందు సద్భావనా జ్యోతిని ఉంచి నివాళులు అర్పించారు. తమిళనాడులో ప్రారంభమైన ఈ యాత్ర ఏపీ, కర్ణాటక, మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా మీదుగా రాజీవ్ జయంతి రోజైన ఈ నెల 20న ఢిల్లీకి చేరుకుంటుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ జ్యోతిని అందుకుని న్యూఢిల్లీలోని వీర్‌భూమి వద్ద నివాళులు అర్పిస్తారు. -
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం
తిరుమలగిరి, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం తథ్యమని ఆ పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థి అద్దంకి దయాకర్ అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్మారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని, బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని, కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సంకెపల్లి పద్మనాభరెడ్డి, ఎస్.రఘునందన్‌రెడ్డి, మల్లయ్య, నరోత్తమ్‌రెడ్డి, సుజన్, సతీశ్‌రెడ్డి, కె.సతీశ, రవీందర్, రామ్మూర్తిగౌడ్, సల్ల వెంకన్న, ఉప్పలయ్య, శ్రీనివాస్‌రెడ్డి, షకీల్, నాని పాల్గొన్నారు. తడిసిన ధాన్యం పరిశీలించిన దయాకర్ మోత్కూరు : అకాలవర్షంతో మోత్కూరు మార్కెట్లో తడిసిన ధాన్యం రాశులను కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థి అద్దంకి దయాకర్ శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట నాయకులు పైళ్ల సోమిరెడ్డి, బుం గపట్ల యాకయ్య, బయ్యని పిచ్చయ్య, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, వంగాల సత్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, చింతల ఉపేందర్‌రెడ్డి, ఎండీ సమీర్ ఉన్నారు. -
పొలిటికల్ జెఎసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌తో సాక్షి వేదిక