సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ సరైన పద్దతిని పాటించలేదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. పార్టీ మారుతున్న వారిని ఆపే ప్రయత్నం చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలను చూస్తుంటే నవ్వు వస్తోందని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
కాగా, అద్దంకి దయాకర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్, కేటీఆర్ బీఆర్‌ఎస్‌లో తమ నేతలను కాపాడుకోలేకపోతున్నారు. బీఆర్‌ఎస్ నాయకులను తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటోంది. దీంతో, వారిని ఆపే ప్రయత్నం చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలను చూస్తుంటే నవ్వు వస్తోంది. రాజకీయాల్లో బీఆర్‌ఎస్ సరైన పద్దతిని పాటించలేదు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి.
పార్టీ ఫిరాయింపులు అనేవి కేవలం తెలంగాణలోనే జరగడం లేదు. దేశ రాజకీయాల్లో ఒక తంతుగా మారింది. టీడీఎల్పీని, సీఎల్పీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నప్పుడు వారిని సిగ్గుగా అనిపించలేదా?. అప్పుడు కేటీఆర్‌కు చట్టం, న్యాయం ఎందుకు కనిపించలేదు. రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌కు ఒక న్యాయం. ఇతరులకు మరో న్యాయమా?. చట్టపరమైన అంశాలను కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కోగలదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment