
హైదరాబాద్: ఎస్ఎల్బీసీకి వెళ్లిన బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే వారు రాజకీయాలు చేయడం కోసమే అక్కడకు వెళ్లినట్లు ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ఘటనను ప్రకృతి విలయలాగా చూడాలి కానీ రాజకీయాలు చేస్తామనడం సరైంది కాదన్నారు. ‘హరీష్ రావు రాజకీయాలు చేయడం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని వాడుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది.
కాళేశ్వరం టన్నెల్ కూలినప్పుడు ప్రాణ నష్టం జరిగింది.. మీరు ప్రతిపక్షాలకు అనుమతి ఇచ్చిన చరిత్ర లేదు. మేము పోయి రాజకీయం చేయలేదు. శ్రీశైలంలో పవర్ హౌస్ పెయిల్ అయినప్పుడు ఆ జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, మల్లు రవిని పోనియ్యలేదు. మీరు పర్మిషన్ అడగకున్నా slbc కి పోతం అంటే పోనిచ్చినం. హరీష్ రావు రెస్క్యూ టీమ్ కు సలహాలు ఇవ్వనక్కర్లేదు. అక్కడ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఎనిమిది మంది కుటుంబాలను ఎలా ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. రెస్క్యూ ను ప్రభుత్వం రిజాల్వ్ చేస్తుంది’ అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment