SLBC Tunnel
-
కడావర్ డాగ్స్‌తో మరోసారి గాలింపు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారి జాడ తెలుసుకునేందుకు గురువారం మధ్యాహ్నం మరోసారి కడావర్ డాగ్స్‌ను తీసుకెళ్లి ప్రమాదస్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో సొరంగం ఎండ్ ఫేస్ చివరలో ఈ డాగ్స్‌తో గాలించారు. ఇప్పుడు వెనుకవైపు 160 మీటర్ల దూరంలో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాల వాసనలను గుర్తించేందుకు మరోసారి డాగ్స్‌ను టన్నెల్‌లోనికి తీసుకెళ్లారు. మొత్తం 13.940 కి.మీ వరకు తవ్విన సొరంగంలో 13.500 వరకు లోకోట్రైన్ వెళ్లగలుగుతోంది. అక్కడి నుంచి 250 మీటర్ల వరకూ పేరుకుపోయిన మట్టి, శిథిలాల్లో సుమారు 60 మీటర్ల మేరకు మట్టిని తొలగించగలిగారు. ఇందుకోసం నాలుగు ఎస్కవేటర్లు పనిచేస్తున్నాయి. ప్రత్యేక అధికారి శివశంకర్ నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక బృందాల నిపుణులతో కలసి సమీక్షిస్తున్నారు. భారీగా కొనసాగుతున్న నీటి ఊట.. సొరంగంలో ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంతో నిమిషానికి 3,900 లీటర్ల నీరు ఊరుతోంది. భారీ ఎత్తున వస్తున్న నీటిని సొరంగం నుంచి బయటకు తరలించేందుకు ప్రతీ 2.5 కి.మీ. పాయింట్లో ఒకటి చొప్పు న 150 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లను వినియోగిస్తున్నారు. అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను గ్యాస్కట్టర్లతో కట్ చేస్తూ లోకోట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. స్వగ్రామానికి చేరిన మనోజ్‌కుమార్ మృతదేహం జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజినీర్ మనోజ్‌కుమార్(50) మృతదేహం ప్రత్యేక అంబులెన్స్‌లో గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నవ్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన బంగార్మావ్ చేరుకుంది. మనోజ్‌కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అధికారులు అందజేశారు. -
సొరంగంలో మరో మృతదేహం లభ్యం
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మృతుడిని జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్ (50)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సహాయ బృందాలు మనోజ్‌కుమార్ మృతదేహాన్ని సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాయి. నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అప్పగించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ సురేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో మనోజ్‌కుమార్ స్వగ్రామం యూపీలోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్ గ్రామానికి తరలించారు. మనోజ్‌కుమార్ 2009 నుంచి జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వర్ణలత, కుమార్తె శైలజ (24), కుమారుడు ఆదర్శ్ (17) ఉన్నారు. ఎక్స్కవేటర్ ద్వారా తవ్వకాలతో మృతదేహం బయటకు.. సొరంగంలోని 14వ కి.మీ. సమీపంలో ఫిబ్రవరి 22న పైకప్పు కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లలో 8 మంది ఆచూకీ గల్లంతవడం తెలిసిందే. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఈ నెల 9 ఒక మృతదేహాన్ని (గురుప్రీత్‌సింగ్) వెలికితీయగా డీ2 ప్రాంతానికి సుమారు 190 మీటర్ల దూరంలో వెనక వైపు, కన్వేయర్ బెల్టుకు సమీపంలో మనోజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. సొరంగానికి కుడి వైపున కన్వేయర్ బెల్టు ఉండగా బెల్టు సమీపంలో ఇప్పటికే ఒకవైపు నుంచి తవ్వకాలు చేపడుతూ సహాయక బృందాలు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఎడమ వైపున మట్టి వేశాయి. ఎక్స్కవేటర్ సాయంతో అక్కడి మట్టిని తొలగిస్తుండగా మంగళవారం మృతదేహం కనిపించింది. ప్రమాదానికి ముందు లోకో ట్రైన్లో కాంక్రీట్ సెగ్మెంట్లు, సామగ్రిని తీసుకెళ్లారని, ప్రమాద సమయంలో లోకోట్రైన్తో సహా చెల్లాచెదురై వెనక్కి కొట్టుకొచ్చి ఉంటుందని సహాయక సిబ్బంది అంటున్నారు. ఇదే ప్రాంతంలో నాలుగు ఎక్స్కవేటర్ల సాయంతో ముమ్మరంగా తవ్వకాలు, మట్టి తొలగింపు చేపట్టారు. -
SLBC టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు
-
SLBC టన్నెల్లో మరో మృతదేహం వెలికితీత
సాక్షి, నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మరో మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు మృతుడిది ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్‌గా గుర్తించారు ఇతను జేపీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వారి స్వగ్రామానికి తరలించనున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.లోకో ట్రాక్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించా. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్‌బాడీని గుర్తించిన రెస్క్యూ బృందాలు.. తవ్వకాలు చేపట్టాయి. ఘటన స్థలం నుంచి మృతదేహాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకి తీసుకువచ్చారు. శిథిలాలను గ్యాస్ కట్టర్‌తో తొలగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోయి నెల రోజులకు పైగా గడిచినా, ప్రమాదంలో మరణించిన ఎనిమిది మంది కార్మికులలో ఇద్దరిని వెలికితీశారు.ఇక ఆరుగురి మృతదేహాలను వెలికితీయడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 8 మంది లోపల చిక్కుకుపోగా, ఇప్పటివరకు రెండు మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు.కాగా, నిన్న(సోమవారం) అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం ఎస్ఎల్బీసీ ప్రమాదం, సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రభుత్వం సొరంగంలో సహాయక చర్యలు నిలిపివేస్తారన్న అందరి అంచనాలు తారుమారయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించలేమని సహాయక బృందాలు చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో మరికొన్ని రోజులపాటు ఆపరేషన్‌లో పాల్గొననున్నారు. 30 మీటర్ల వద్ద అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తే సహాయక సిబ్బంది ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లనుందని నిపుణులు హెచ్చరించారు.సొరంగం కుప్పకూలిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో సహాయక సిబ్బంది సోమవారం 31వ రోజు సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడి భాగాలను ప్లాస్మా కట్టర్‌తో కట్ చేసి బయటకి తెస్తున్నారు. మట్టి, రాళ్ల దిబ్బలు, బురద పూడిక, ఉబికి వస్తున్న నీటిని వాటర్ జెట్ల ద్వారా బయటికి పంపిస్తున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి ప్రమాదం జరిగిన 14 కిలోమీటరు వద్ద గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా మారింది. ఈ క్రమంలో విద్యుత్, వెంటిలేషన్ పనులను పునరుద్ధరిస్తున్నారు.ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాద జోన్‌గా అధికారులు గుర్తించారు. నేషనల్ జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్డీఆర్ఐ నిపుణుల నివేదిక ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ కొనసా గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎక్స్‌ఫర్ట్ కమిటీని కూడా నియమించి వారి సూచనలు, సలహాల మేరకు పనులు కొనసాగించనున్నారు. కేరళ నుంచి వచ్చిన కాడవర్స్ డాగ్స్ గుర్తించిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో చేపడుతున్న సహాయక చర్యలకు టీబీఎం భాగాలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. అదేవిధంగా సొరంగం తవ్వకాలకు మినీ హిటాచీ, కన్వేయర్ బెల్టు, డీవాటరింగ్ పైపులు కూడా అడ్డు పడుతున్నాయి. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణమధ్య రైల్వే, హైడ్రా, ర్యాట్ హోల్స్ మైనర్స్, ఆర్మీ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. -
డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంతోపాటు, అందులో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి సత్వర అనుమతులకు ప్రయత్నించాలని నీటిపారుదల శాఖను ఆదే శించింది. ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని 43.93 కి.మీల సొరంగ మార్గంలో తరలించి లింక్ కాల్వ ద్వారా డిండి జలాశయంలోకి పోయాల్సి ఉంది. సొరంగాన్ని రెండు టన్నెల్ బోర్ మెషీన్ల (టీబీఎం) సహాయంతో రెండు వైపులా (ఇన్లెట్, అవుట్లెట్) నుంచి తవ్వుకుంటూ పోతున్నారు. శ్రీశైలం జలాశయ ఇన్లెట్ నుంచి 13.93 కి.మీల పనులు పూర్తి కాగా,అవతలి వైపు నుంచి మరో 20.43 కి.మీల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. మధ్యలో 9.55 కి.మీల మేర సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది. ఇకపై టీబీఎంతో రెండు వైపులా తవ్వకాలను విరమించుకొని ప్రత్యామ్నాయంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించనున్నారు. రెండు వైపుల నుంచి సొరంగాన్ని నేరుగా అనుసంధానం చేసేందుకు ఇప్పటి వరకు తవ్వకాలు జరిగాయి. ఇకపై నేరుగా తవ్వకాలను కొనసాగించరు. రెండు వైపులా తవ్వకాలు ఆగిపోయిన చివర పక్కభాగం నుంచి డ్రిలింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు జరుపుకుంటూపోయి రెండు చివరలను అనుసంధానం చేస్తారు దీంతో కిలోమీటర్ వరకు సొరంగం పొడవు పెరిగే అవకాశముంది. రెండు టీబీఎంలను సొరంగంలో ఇప్పుడున్న ప్రాంతంలోనే సమాధి చేస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగించండి కార్మికులను వెలికితీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలను ఏప్రిల్ 10లోగా ముగించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్‌ను ఆదేశించారు. నెలరోజులుగా ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా ముఖ్యమంత్రికి వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ కళ్లకు కట్టేలా ప్రమాదం జరిగిన రోజు నుంచి, ఇప్పుడున్న పరిస్థితులపై ఫొటోలతో సహా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్ ఉన్నట్టు గుర్తించామన్నారు. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం..అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అవసరమైన అనుమతులు తీసుకోవాలి ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వీరిలో గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్ని మార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన అనుమతులు తీసుకోవాలి కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం కుప్ప కూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వారిలో గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్నిమార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సీఎం చెప్పారు. తెలంగాణ,ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
సొ‘రంగం’ వదిలేస్తారా?
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం సరిగ్గా ఎక్కడ కుప్పకూలిందో అక్కడ తవ్వకాలు జరిపేందుకు అవకాశాలు లేవా?.. సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొందరు అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు. ఇప్పటివరకు సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం నుంచి పక్కకు కొట్టుకువచ్చిన బండరాళ్లు, మట్టి, బురద, తుక్కును తొలగించారు. ఇక సొరంగం ఎక్కడైతే కూలిందో అక్కడ శిథిలాలను తొలగించాల్సి ఉండగా, అక్కడ తవ్వకాలు జరిపితే మళ్లీ సొరంగం కుప్పకూలి సహాయక సిబ్బందికి ప్రమాదం వాటిల్లవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగించాలా? లేక నిలుపుదల చేయాలా? అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మొత్తం 12 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారికి తోడుగా రాడార్లు, డ్రోన్లు, రోబోలు, ఎక్సవేటర్లను వాడినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షలో సహాయక చర్యల కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెలరోజులు గడిచినా.. ఎమ్మార్పి–ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు సొరంగం–1 తవ్వకాలు పూర్తయ్యాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)తో తవ్వకాలను అక్కడి నుంచి ముందుకు కొనసాగిస్తుండగా గత నెల 22న సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి నెల రోజులు గడిచిపోగా ఇప్పటివరకు ఒక కార్మికుడి మృత దేహాన్ని మాత్రమే వెలికితీయగలిగారు. భూగర్భంలో 400 మీటర్ల దిగువన సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పైకప్పు కూలినప్పుడు భారీ పరిమాణంలో బండరాళ్లు, మట్టి, శిథిలాలు ప్రమాద స్థలానికి రెండువైపులా గుట్టల్లా ఏర్పడ్డాయి. బయటికి వెళ్లే మార్గం వైపు పేరుకుపోయిన శిథిలాల తొలగింపు పనులు మాత్రమే చేపట్టగా, శనివారం నాటికి కార్మికుల ఆచూకీకి సంబంధించి డీ1 నుంచి డీ2గా గుర్తించిన ప్రాంతాల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. దీంతో ఆదివారం కన్వేయర్ బెల్ట్ నుంచి డీ2 ప్రాంతం దిశగా తవ్వకాలు ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు కొంత ప్రమాదకరమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుని సింగరేణి రెస్క్యూ బృందాలు సాహసించి పనులు కొనసాగిస్తున్నాయి. కూలిన చోట శిథిలాల కిందే మిగతా కార్మికులు! కేరళ నుంచి రప్పించిన కడావర్ డాగ్స్ పసిగట్టిన ప్రాంతాలన్నింటిలో తవ్వకాలు పూర్తి చేయగా, డీ2 ప్రాంతంలో ఓ మృతదేహం లభ్యమైంది. మిగిలిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినా ఇతర కార్మికుల జాడ తెలియరాలేదు. దీంతో గల్లంతైన మిగతా కార్మికులు కచ్చితంగా సొరంగం కూలిన ప్రాంతంలో భారీ బండరాళ్లు, బురద, మట్టి శిథిలాల కిందే ఉండవచ్చని సహాయ చర్యల్లో పాల్గొంటున్న అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అక్కడ తవ్వకాలు జరిపితే సొరంగానికి పైన 400 మీటర్ల వరకు ఉన్న బండరాళ్లు, మట్టి మళ్లీ కూలి పడతాయా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సొరంగానికి రక్షణలో భాగంగా కాంక్రీట్ సెగ్మెంట్లతో లైనింగ్ చేశారు. అయితే డీ1 ప్రాంతం నుంచి ఆవలి వైపు ఏర్పాటు చేసిన ఓ కాంక్రీట్ సెగ్మెంట్‌కి పగుళ్లు వచ్చాయి. రెండు వైపులా పేరుకుపోయిన ఉక్కు, ఇతర శిథిలాలు సపోర్టుగా ఉండడంతో ప్రస్తుతానికి ఆ సెగ్మెంట్ కూలిపోకుండా ఉంది. ఒక వేళ శిథిలాలను తొలగిస్తే వెంటనే దానితో పాటు సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉంటుందని, సహాయక సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు ఒకట్రెండు రోజులు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషిoచాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఎన్జీఆర్ఐ నివేదిక కోసం నిరీక్షణ సొరంగం కూలిన ప్రాంతంలో ఉపతరితల భాగం ఎంత మేర పటిష్టంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? తవ్వకాలను ముందుకు కొనసాగించవచ్చా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే సహాయక చర్యలు ముందుకు కొనసాగనున్నాయి. దీనిపై ఇప్పటికే ఉపగ్రహ సహాయంతో అధ్యయనాలు నిర్వహించిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణులు ఈ నెల 25 లేదా 26న నివేదిక ఇస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.కాగా ప్రత్యామ్నాయంగా సొరంగానికి ఉపరితలం నుంచి బోర్ హోల్ చేసి గల్లంతైన కార్మికులను బయటకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్జీఆర్ఐ ఇవ్వనున్న నివేదికపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. సోమవారం నాటి సమీక్షకు ఎన్జీఆర్ఐ నిపుణులను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రమాదం నుంచి రక్షణ కోసం ఫెన్సింగ్ సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో సొరంగంలో పేరుకుపోయిన బురద, మట్టి శిథిలాలు ఒక్కసారిగా కొట్టుకువచ్చి సిబ్బందిని ముంచెత్తే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే తప్పించుకోవడానికి బురదకు ఫెన్సింగ్ చేస్తున్నారు. బురద లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఫెన్సింగ్ ఉబ్బినట్టు అవుతుంది. దీనిని సంకేతంగా భావించి సహాయక సిబ్బంది అక్కడినుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫెన్సింగ్ వల్ల బురద ఒక్కసారిగా జారిపడకుండా సిబ్బందికి కొంత సమయం లభిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం డీ2 ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. -
SLBC సహాయక చర్యలపై రేవంత్ ఆరా.. ఐదు కోట్లు విడుదల!
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్‌లోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలపై తాజాగా అక్కడ జరుగుతున్న సహాయకచర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలు ఆలస్యం కావడానికి గల కారణాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇదే సమయంలో సహాయక చర్యల కోసం రూ.5కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.ఇదిలా ఉండగా.. నెల రోజుల క్రితం ఫిబ్రవరి 22వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా మొత్తం 42 మందిని సురక్షితంగా మధ్యాహ్నాంలోపు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగిలాలు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది. మార్చి 9వ తేదీన ఒక్క మృతదేహాం మాత్రమే దొరికింది. అది గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహంగా నిర్ధారించారు. మిగతా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీలో అనుమానిత ప్రాంతాలుగా D1-D2 మార్క్ చేసి.. విస్త్రతంగా తవ్వకాలు జరుపుతున్నారు. దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. భారీగా వస్తున్న ఊటనీరు, బురదతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.సొరంగంలో 13.85వ కి.మీ. వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కి.మీ. నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు, బంధువులకు.. గుర్ప్రీత్ సింగ్ మృతదేహాం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి. నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి. -
‘ఎస్ఎల్బీసీ’పై రేపు సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు నెల రోజులుగా జరుగుతున్న సహాయక చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వ్యూహం మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం శాసనసభ కమిటీ హాల్లో సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 ఏజెన్సీల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఈ సమావేశానికి పిలిచింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) మాజీ డీజీ/ఆర్మీ మాజీ ఈఎన్సీ జనరల్ హర్పాల్ సింగ్, సొరంగాలకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ నిపుణుడు క్రిస్ కూపర్, బీఆర్ఓ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, మరో సొరంగాల నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రాలను సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ భేటీకి రప్పిస్తోంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత పురోగతి సాధించారు? ఇంకా తీసుకోవాల్సిన చర్యలేమిటి? గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు ఇంకేం చేయాలి? అనే అంశాలపై ఆయా శాఖలు/సంస్థల అధికారులు ఈ సమీక్షలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అవసరమైతే సహాయక చర్యలను సోమవారం ఒక రోజు నిలుపుదల చేసి ఈ కీలక సమావేశానికి హాజరు కావాలని వారిని ప్రభుత్వం కోరింది. గత నెల రోజులుగా 650 మంది సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయగా గల్లంతైన 8 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.సొరంగం కుప్పకూలిన ఫాల్ట్ జోన్‌లోని మట్టి, బండ రాళ్ల శిథిలాల కింద మిగిలిన ఏడుగురు నలిగిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతుండగా ఆ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహిస్తే మళ్లీ సొరంగం కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆచితూచి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొననున్నారు. సహాయక చర్యలకు రూ.5 కోట్లు విడుదల ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సహా యక చర్యలకు రూ. 5 కోట్లను మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశా రు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో జీరో పాయింట్ వద్ద 40 మీటర్ల పరిధిలో సహాయక చర్యలు చేపట్టడం ప్రమాదకరమని అధికారులు తేల్చారు. ఆ ప్రాంతంలో సిమెంట్ సెగ్మెంట్స్ కుంగినట్లు నిర్ధారణ కు వచ్చి ‘డీ1’వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక అక్కడ సహాయక చర్యలు కష్టమేన ని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆచూకీ లభించని ఏడుగురి గుర్తింపుపై నీలినీడలు కమ్ముకున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
SLBC: 28వ రోజూ అన్వేషణ.. ఏడుగురి జాడ ఎక్కడ?
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 28 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం కాగా, మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది. ఇంకా అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోల పని ప్రారంభం కాలేదు. రోబోలకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటం జఠిలంగా మారింది.ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 28 రోజులు గడిచింది. సాంకేతిక పరిజ్జానాన్ని, నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ సహయక చర్యలు కొనసాగిసాగుతున్న ఏడుగురి మృతదేహాల ఆచూకీ దొరకడం లేదు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు. రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆధునాతనమైన వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు.జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో రెండు ఎస్కవేటర్లతో పెద్దఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్, సింగరేణి జీఎం బైద్య నిత్యం ఉదయం, సాయంత్రం సహాయ బృందాల హెడ్స్‌తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు. గడిచిన 28 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన భాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.భారీగా ఊరుతున్న సిపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్ తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా, బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 800 టన్నుల స్టీల్‌ను లోకో ట్రైన్ ద్వారా, 800 టన్నుల మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊటనీరుతో సహాయకచర్లకు అడుగడుగున ఆటంకాలుఎదురవు తున్నాయి.రోబోల వినియోగానికి నెట్ వర్క్ సమస్యతో పాటు.. మిగిలిన పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు క్యాడవర్ డాగ్స్‌ను టన్నెల్లోకి పంపి శోదన చేయించారు.అయితే జీరో పాయింట్ వద్ద మనుషులు వెళ్లి పనిచేయటం ప్రమాదమని సహాయక బృందాలు అభిప్రాయపడుతున్నాయి. అవిశ్రాంతంగా చేస్తున్న తమ కృషి ఫలిస్తుందని ధీమాతో సహాయక చర్యలు మాత్రం షిఫ్ట్ ల వారీగా కొనసాగిస్తూనే ఉన్నారు. -
SLBC: రోబోలతో సెర్చ్ ఆపరేషన్.. టన్నెల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే
సాక్షి, మహబూబ్‌నగర్ జిల్లా: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 23 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం అయింది. మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది.రోబోల వినియోగంతో సహాయక చర్యలు ముమ్మరం అవుతాయని భావిస్తున్నా ఇంకా రోబోల పని ప్రారంభం కాలేదు. అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోలు మూడింటిని వినియోగించనున్నారు. ఒక్కో మిషన్ నిమిషానికి వెయ్యి క్యూబిక్ మీటర్ల సామర్ద్యం గల బురద, మట్టిని తొలగిస్తోంది. మానవుల కంటే 15 రెట్లు అధికంగా ఈ రోబోల పని చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు.రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిత్యం ఉదయం, సాయంత్రం సహయ బృందాల హెడ్స్‌తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు.గడిచిన 23 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీగా ఊరుతున్న సీపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్‌తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊట నీరుతో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. -
వడివడిగా బురద తొలగింపు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగతా ఏడుగురు కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదస్థలంలో చివరి 40 మీటర్లలో తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉండగా, ఇందుకోసం రోబోలతో ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే సొరంగంలోకి ఆటోమేటివ్ స్లడ్జ్ రిమూవల్ రోబో మిషినరీని తీసుకెళ్లారు. శనివారం దానికి అనుసంధానంగా పనిచేసే వ్యాక్యూమ్ ట్యాంక్‌ను సొరంగంలోకి తరలించారు. దీని ద్వారా వేగంగా బురద, మట్టిని కన్వేయర్ బెల్టు మీదుగా బయటకు తరలించవచ్చని భావిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో ఆదివారం ప్రారంభమవుతాయని చెబుతున్నారు. డీ1 వద్ద తవ్వకాలు పూర్తయితేనే.. ఇప్పటికే కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2 ప్రాంతంలో పూర్తిస్థాయిలో తవ్వకాలు చేపట్టారు. అక్కడ గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభించగా, మిగతా వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మరో పాయింట్ డీ1 వద్ద సింగరేణి, ర్యాట్‌హోల్ మైనర్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. డీ1 వద్ద 9 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగిస్తేనే మిగతా కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. డీ1 వద్ద టీబీఎంలో సెగ్మెంట్ ఎరెక్టర్ ఉండే చోట కార్మికులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో తవ్వకాలు పూర్తికావచ్చని, అప్పుడే కార్మికుల జాడ తెలిసే వీలుందని తెలుస్తోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
SLBC టన్నెల్ సహాయక చర్యల్లో రోబోల వినియోగం
-
SLBC టన్నెల్లోకి అటామనస్ హైడ్రాలిక్ పవర్ రోబో
సాక్షి, మహబూబ్‌నగర్/నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యు ఆపరేషన్ కొనసాగుతోంది. మనుషులకు బదులుగా రోబోలతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్‌ను వినియోగిస్తున్నారు.దీంతో మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు.టన్నెల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, నిన్న (శుక్రవారం) మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్‌ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్‌గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు.టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్‌గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. -
టన్నెల్లో రోబో రెస్క్యూకు రూ. 4కోట్లు
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్ బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఈ దురదృష్టకర సంఘటన జరగని పక్షంలో రెండేళ్లలో సొరంగం పూర్తయ్యే దన్నారు. ప్రమాదం జరిగిన దగ్గరనున్న 40 మీటర్లు అత్యంత ప్రమాదకరమని, అందుకే రోబోల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. టీబీఎం లోపల తవ్వకాలు..టన్నెల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, శుక్రవారం మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్‌ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్‌గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్‌గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సొరంగం వద్దే ఉండి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.మేడిగడ్డ బరాజ్‌పై ఎన్డీఎస్ఏ నివేదిక వారంలోగామేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లో పగుళ్లు రావడానికి సంబంధించి వారం పది రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక వస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బరాజ్‌లో నీరు నిల్వ చేసి వినియోగించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఓ విలేకరి మంత్రి దృష్టికి తీసుకుని రాగా..నీరు నిల్వ చేస్తే.. డ్యామ్ కొట్టుకొని పోయి దిగువన ఉన్న సీతారామ ప్రాజెక్టుతో సహా 44 వేల గ్రామాలు, భద్రాచలం కొట్టుకొనిపోవాలని వారు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. డ్యామ్‌ల రక్షణపై నివేదికలు ఇవ్వడంలో ఎన్డీఎస్ఏ సుప్రీం అని.. దాని సూచనలు పాటిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాజెక్టును నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్‌కు నీళ్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి చెప్పారు. -
టన్నెల్లో రోబోలతో రెస్క్యూ షురూ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద స్థలం వద్ద మట్టి, శిథిలాలు, బురద తొలగింపునకు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం అన్వి రోబోటిక్స్‌కు చెందిన నిపుణులు ఆటోమేటెడ్ స్లడ్జ్ రిమూవల్ రో బోను సొరంగం లోపలకు తీసుకెళ్లారు. రాళ్లను క్రష్ చేసి తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు మరో రోబో, బురదను తొలగించేందుకు ఒకటి చొప్పున మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఆటో మేటెడ్ స్లడ్జ్ రిమూవల్ రోబోæ సొరంగంలో పను లు మొదలుపెట్టింది. పూర్తిగా ఉక్కుతో తయారైన ఈ రోబోట్ హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ రోబోకు ముందుభాగంలో ఉన్న గ్రైండర్ సహాయంతో పెద్ద రాళ్లు, శిథిలాలను కట్ చేస్తూ ము క్కలుగా చేయడంతోపాటు బురదను వ్యాక్యూమ్ సక్కర్ ద్వారా తొలగించి నేరుగా కన్వేయర్ బెల్టుపై వేస్తుంది. గంటకు వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టి, బురదను తొలగిస్తుందని చెబుతున్నారు.ప్రమాద స్థలంలో ఏఐ ఆధారిత రోబో సాయంతో తవ్వకాలు, మట్టి తొలగింపు చేపడుతుండగా, 100 మీటర్ల దూరం నుంచి రిమోట్ ఆపరేటింగ్ ద్వారా రోబోలను పర్యవేక్షించనున్నారు. సొరంగం ఇన్లెట్ వద్ద ఉండే మాస్టర్ రోబో మిగతా రోబోలతో కమ్యూనికేట్ చేస్తుంది. ఆల్ఇండియా రోబోటిక్ అసోసియేషన్ ఈ ఆపరేషన్‌కు సహకారం అందిస్తోంది. చివరి 20 మీటర్ల వద్ద తవ్వకాలు సొరంగంలో ప్రమాదం చోటుచేసుకున్న 13.85 కి.మీ. పాయింట్ వద్ద చివరి 20 మీటర్ల స్థలంలో సొరంగం పైకప్పు వదులుగా ఉండటంతో మళ్లీ కూలే అవకాశాలు ఉన్నాయని, అక్కడ పనిచేసే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదకరమని జియోలాజికల్ సర్వే అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చివరి 20 మీటర్ల ప్రదేశంలో రోబోల ద్వారా రెస్క్యూ చేపడుతున్నారు. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య ట్రెంచ్ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడే టీబీఎం మధ్య భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ స్థలంలోనే మిగతా కార్మికులు ఉంటారని భావిస్తున్నారు. ఆ ప్రాంతమంతా పూర్తిగా మట్టి, శిథిలాలతో కూరుకుపోయి ఉంది. మట్టి, బురద, శిథిలాలను తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. -
రంగంలోకి రోబోలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ కనిపెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రోబోలను బుధవారం నుంచి రంగంలోకి దింపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఎన్వీ రోబో టిక్స్ బృందం మంగళవారం సొరంగం వద్దకు చేరుకుంది. మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు. వాటిని ఆప రేట్ చేసే మాస్టర్ రోబోను సొరంగం వద్దకు తీసుకొచ్చారు. రోబోటిక్ నిపుణులు విజయ్, అక్షయ్ నేతృత్వంలో రోబోల అనుసంధానం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముమ్మరంగా గాలింపు సొరంగంలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని ఇప్పటికే వెలికి తీయగా, మిగతా ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2 నుంచి డీ1 స్పాట్ల మధ్యలో ట్రెంచ్‌ను తవ్వుతున్నారు. టీబీఎం కట్టర్ హెడ్ భాగానికి వెనుకవైపు నుంచి డీ1 వరకు సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో ప్రతీ 10 మీటర్లకు ఒక చోట తవ్వకాలు జరుపుతూ గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా చోట్ల మళ్లీ కడావర్ డాగ్స్‌తో గాలింపు చేపడుతున్నారు. 18 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సొరంగం వద్దే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మనుషుల కన్నా 15 రెట్ల వేగం సొరంగం లోపల 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా.. చివరి 20 మీటర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. పైకప్పు వదులుగా ఉండి మళ్లీ కూలే అవకాశం ఉండటంతో రోబోల ద్వారా రెస్క్యూ పనులను చేపట్టనున్నారు. సొరంగంలోని పెద్ద రాళ్లను, శిథిలాలను తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు ఒకటి, బురదను తొలగించేందుకు మరొక రోబోను వినియోగించనున్నారు. సొరంగం చివరన 200 మీటర్ల విస్తీర్ణంలో సుమారు 6 వేల క్యూబిక్ మీటర్ల మట్టి, బురద పేరుకుని ఉంది. రోబోల ద్వారా మూడు రోజుల్లో మొత్తం మట్టి, శిథిలాలను తొలగించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. రోబోల రెస్క్యూ ఆపరేషన్‌ను సొరంగంలోపల 200 మీటర్ల దూరం నుంచి పర్యవేక్షించేందుకు వీలుంటుంది. ఇందుకోసం ఇన్‌డెప్త్ ఏఐ కెమెరా, లైటర్ టెక్నాలజీ వినియోగించనున్నారు. -
SLBC Tunnel: టన్నెల్లోకి ప్రవేశించిన రోబోలు
సాక్షి, నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. సహాయ చర్యల్లోకి రోబోలతో పాటు వాటి బృందాలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేడు ఒకటో, రెండో మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం అన్వి రోబో బృందంతో పాటు మొదటి షిప్ట్‌లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్లో బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లాయి. టన్నెల్ నుంచి ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినీ జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు.ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కారి్మకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కారి్మకుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది.సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3›–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి.13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్‌చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు.సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. -
SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత!
సాక్షి, మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ (40)గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.గత నెల 22న ఎస్ఎల్బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.సహాయచర్యల్లో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ (స్నిఫర్స్) కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో, శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో మొదట కుడిచేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజినీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటూ ఇటూ మరో ముగ్గురి జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉందని సహాయ బృందాలు తెలిపాయి. మిగిలినవారు సొరంగం చిట్టచివరి భాగం వద్ద టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.మూడేళ్లుగా గుర్‌ప్రీత్‌సింగ్ విధులు ఎస్ఎల్బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్‌ప్రీత్‌సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్‌తరాన్. రాబిన్స్ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేందర్ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్‌ప్రీత్‌సింగ్ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. -
ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల్లో పురోగతి
-
SLBC: ఒక మృతదేహం వెలికితీత
నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసుకొచ్చింది. అతన్ని టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్.కాగా, గత నెల 22వ తేదీన శైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. -
మరోసారి టన్నెల్ లోకి కేరళ కడవర్ డాగ్స్ |
-
SLBC టన్నెల్ లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్
-
SLBC: కాంక్రీట్‌లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు
Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్‌ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్‌సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్జీఆర్ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
టన్నెల్ లో టెన్షన్.. ఇదే చివరి ప్రయత్నం
-
SLBC టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్బీసీ సహాయక చర్యల అప్డేట్స్..టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్మంత్రి ఉత్తమ్ కామెంట్స్..సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదు14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందిచివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులుఅక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకు సైతం ప్రమాదంఅందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం 👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నేటితో సహాయక చర్యలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఇక, టన్నెల్లో జీపీఆర్ గుర్తించిన అనుమానిత ప్రాంతాలనే క్యాడవర్ డాగ్స్ మళ్లీ గుర్తించాయి. మరోవైపు.. టన్నెల్లో సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేడు మరోసారి సమీక్షించనున్నారు. హెలికాప్టర్లో మంత్రి ఉత్తమ్ దోమలపెంట చేరుకోనున్నారు.👉ఇక, హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో టీబీఎం చుట్టుపక్కల, అక్కడి నుంచి మరికొంత దూరంలో కొన్ని ప్రదేశాలను గుర్తించినట్లు సమాచారం. ఇంతకుముందు క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలనే ఇవి కూడా గుర్తించినట్లు తెలిసింది.👉ఇదిలా ఉండగా.. సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు టీబీఎం కత్తిరింపునకు అవసరమైన సామగ్రిని లోకో ట్రైన్ ద్వారా సొరంగంలోకి తెప్పించుకున్నారు. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు కూలిపడిన మట్టి దిబ్బ వరకు పొక్లెయిన్ వెళ్లేలా టీబీఎంను ఒకవైపు కత్తిరిస్తున్నారు. టీబీఎం భాగాలను కత్తిరించే పనిలో సహయక సిబ్బంది వేగం పెంచారు. రోజుకు సుమారు ఐదు అడుగుల మేర తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో రెండు రోజుల్లో మట్టి కూలిన ప్రదేశం వరకు పొక్లెయిన్ చేరుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన టీబీఎం సామగ్రిని లోకో ట్రైన్‌తో బయటకు పంపిస్తూ రాకపోకలకు క్లియర్ చేస్తున్నారు. -
SLBC: ఆ ప్రదేశంలో ఆగిన క్యాడవర్ డాగ్స్.. రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మూడు మృతదేహాల స్పాట్స్‌ను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే క్యాడవర్ డాగ్స్ ఆగాయి. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్‌ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను దోమలపెంటకు రప్పించింది.నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్‌సింగ్‌తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది.శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్‌తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు.12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతం షిఫ్టుల వారిగా సహయక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇవాళ టన్నెల్లో చిక్కుకున్న వారి అచూకీ కనుగొనేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన రెండు క్యాడవర్ డాగ్స్‌ను సొరంగంలోకి పంపించారు. ఉదయం ఏడున్నర గంటలకు లోకో ట్రైన్లో వాటిని లోపలికి తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రెండున్నరకు బయటకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను డాగ్స్ గుర్తించినట్టు చెబుతున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన ఎన్వీ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. వారితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్లి అందులో అధ్యయనం చేశారు. మరో వైపు కన్వేయర్ బెల్ట్ కూడ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావటంతో సహయచర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మాకట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్‌గన్‌తో తొలగిస్తున్నారు. కాని జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్దఎత్తున సీఫేజ్ వాటర్ వస్తుండటంతో సహయక చర్యలకు కొంత అవరోధం ఏర్పడుతుంది. మరోవైపు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీఫేజ్ వాటర్‌ను త్వరిత గతిన బయటికి పంపే ప్రక్రియను చేపడుతున్నారు. మొత్తంగా టన్నెల్లో ఇరుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ 8 మంది ఆచూకీ దొరకపోవటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. గడచిన 14 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
ఎస్ఎల్ బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ కోసం జాగిలాలు
-
ఆపరేషన్ ‘కడావర్ డాగ్స్’
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్‌ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించింది. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను గురువారం సాయంత్రానికి దోమలపెంటకు రప్పించింది. నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్‌సింగ్‌తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్‌తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలించనుంది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.కొనసాగుతున్న టీబీఎం భాగాల తొలగింపు..సొరంగం లోపల 13.650 కి.మీ. పాయింట్ వద్ద టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) భాగాలు చెల్లాచెదురై టన్నెల్ మార్గానికి అడ్డుగా ఉండటం తెలిసిందే. దీంతో ఆయా భాగాలను ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి సుమారు 150 మీటర్ల వరకు టీబీఎం భాగాలు ఉండగా వాటి మధ్యలోనే కార్మికులు చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి టీబీఎం భాగాలను కట్ చేస్తూ, మట్టిని తొలగిస్తూ కార్మికుల కోసం అన్వేషిస్తున్నారు.కన్వేయర్ బెల్టును ప్రమాదస్థలం వరకు కొనసాగించేందుకు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో ఫౌండేషన్, జాయింట్ మెషీన్, కమిషన్ పనులు పూర్తవగా ఎలక్ట్రికల్ పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయానికి కన్వేయర్ బెల్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందని చెబుతున్నారు.నేడు రంగంలోకి టన్నెల్ ప్రత్యేక నిపుణులు..సొరంగంలో ప్రమాద స్థలంలో చిక్కుకున్న కార్మికుల వెలికితీత కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఐఐటీ చెన్నైకి చెందిన టన్నెల్ నిపుణులు శుక్రవారం దోమలపెంటకు రానున్నారు. ఇప్పటికే ఎన్వీ రోబోటిక్స్‌కు చెందిన నిపుణులు ప్రమాదస్థలానికి పరిశీలించారు. ప్రత్యేక పరికరాలు లేదా ఏఐ రోబోల ద్వారా కార్మికుల వెలికితీత సాధ్యమవుతుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎన్జీఆర్ఐ, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీకి చెందిన నిపుణులు అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని సొరంగం పైభాగంలో భూమి పరిస్థితులపై సర్వే పనులను కొనసాగిస్తున్నారు.13 రోజులుగా శిథిలాల కిందే..ఎస్ఎల్బీసీ సొరంగం కుంగిన ప్రమాదంలో 8 మంది కారి్మకులు, ఇంజనీర్లు గత 13 రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో 12 ఏజెన్సీలు, సంస్థలు సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు లేకుండానే 14 కి.మీ. వరకు ఏకధాటిగా టీబీఎం ద్వారా సొరంగం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రమాదస్థలంలో రెస్క్యూ బృందాలకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. టన్నులకొద్దీ పేరుకుపోయిన మట్టి, శిథిలాలను బయటకు తరలించేందుకు రోజుల సమయం పడుతోంది. దీంతో ఈ తరహా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న అనుభవమున్న అంతర్జాతీయ సంస్థలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తమ వారి ఆచూకీ నేటికీ లభించకపోవడంతో బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి పరిస్థితి ఎలా ఉందోనంటూ ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. -
SLBC టన్నెల్ ల్లో 13వ రోజు సహాయక చర్యలు
-
SLBC Tunnel: భూ వాస్తవాల విస్మరణే ప్రమాదానికి కారణం
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగ కాలువ (ఎస్ఎల్బీసీ) నిర్మాణం పూర్తయితే... దేవరకొండ, నకిరేకల్, నల్లగొండ, నార్కెట్‌పల్లి మండలా ల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరొ స్తుంది. 500కు పైగా ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు తాగునీరు వస్తుంది.అందుకే ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టాయి. అయితే గత నాలుగేళ్లకు పైగా ఎస్ఎల్బీసీ సొరంగంలో రూఫ్ (పై స్లాబ్) నుండి భారీ నీటి జలలు (ఊటలు) వస్తున్నాయి. ఈ జల ప్రవా హాన్ని శాస్త్రీయంగా అరికట్టడంలో జరిగిన తీవ్రమైన వైఫ ల్యమే ఈ ఘోర విపత్తుకు కారణం. ప్రమాదాన్ని అంచనా వేయడంలో రాబిన్సన్, జేపీకంపెనీలు; తెలంగాణ నీటిపారుదల శాఖ విఫల మయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ గత పదేళ్ల పాలనలో 11 కిలోమీటర్లు దాటి సొరంగం తవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొరంగ నిర్మాణం కోసం భారీ ఎత్తున వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. కానీ పొంచి ఉన్న భారీ విపత్తును గుర్తించడంలో విఫలమైంది. సొరంగం పైకప్పు నిమిషానికి 5 నుండి 8 వేల లీటర్ల నీటినీ, బురదనూ కుమ్మరిస్తోంది. ప్రభుత్వానికి నీటి ఊటను శాశ్వతంగా పరిష్కరించే ఆలోచనే లేదు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోని, ప్రకృతి నియమాలకు అనుగుణంగా నిర్మించని నిర్మాణాలు ఎంత గొప్పవైనా... ప్రకృతి వాటిని ధ్వంసం చేస్తుంది. ఇందుకు ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసినందునే, అన్నారం– సుందిళ్ళ బ్యారేజీలలో భారీ లీకేజీ, సీపేజీలు కొనసాగుతున్నాయి. ప్రకృతి నియ మాలను అర్థం చేసుకొని నిర్మించిన నిర్మాణాలనే ప్రకృతి పరిరక్షిస్తుంది. తద్విరుద్ధమైన ఎంతటి అధునాతన నిర్మాణా న్నైనా ప్రకృతి ధ్వంసం చేస్తుంది. కాళేశ్వరం (మేడిగడ్డ) నిర్మించిన నాలుగేళ్లకే అది ఐదు అడుగుల మేర భూగర్భంలోకి ఎందుకు కుంగిపోయింది? ఎందుకు నిట్ట నిలువునా మూడున్నర అడుగుల వెడల్పుతో చెక్కలై, పునాది నుండి చీలిపోయింది? ఏడో బ్లాక్‌లోని 11 గేట్లు కూల్చి మళ్లీ నిర్మించాలని, ఇటీవలే విడుదలైన ఎన్డీఎస్ఏ తుది నివేదికఎందుకు పేర్కొంది? బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునాదుల్లోంచి సిమెంట్, కెమికల్ గ్రౌటింగ్ చేసినా... భారీనీటి లీకేజీ, సీపేజీ ఎందుకు ఆగకుండా జరుగుతోంది? 14 పంపుల్లో సగం పంపులుఎందుకు బద్దలైపోయాయి? డైమండ్ డ్రిల్లింగ్‌తో, నియ మానుసారం భూగర్భ మట్టి పరీక్షలు ఎందుకు జరుపలేదు? బలహీన ఇసుక పునాదుల పైన బ్యారేజీలు ఎందుకు నిర్మించారు? డిజైన్, ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలకు చెందిన ఏ ప్రకృతి నియమాన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించు కోలేదు. ‘కేసీఆర్ మమ్మల్ని డమ్మీలు చేశార’ని ఇంజనీర్లు ముక్తకంఠంతో పీసీ ఘోష్ కమిషన్ ముందు సాక్ష్యమి చ్చారు. కాళేశ్వరం బ్యారేజీల విపత్తు తలెత్తిందే అందువల్ల. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 లోపు పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఇంజినీర్లకు డెడ్ లైన్ విధించింది. ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం (మేడిగడ్డ) విపత్తులతో పోలవరం ప్రాజెక్టుకూ సారూప్యముంది. పోలవరంలో డెడ్ లైన్ల పేరుతో బడా రాజకీయ పెద్దల జోక్యం ఎక్కువైంది. నేటి విపత్తులకు కారణమైన కాళేశ్వరం, ఎస్ఎల్ బీసీలో ఏ తప్పులైతే చేశారో, పోలవరం స్పిల్‌వే (గేట్ల అడుగు భాగం) పునాది నిర్మాణంలో అవే తప్పులు Výæత చంద్ర బాబు ప్రభుత్వ హయాంలో జరిగాయి. అప్పట్లో ప్రతి సోమవారం పోలవరం అంటూ మీడియా ఎదుటహంగామా చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికీ, స్థిరత్వానికీ తగిన సమయం ఇవ్వడం కన్నా ఈ హడావిడే ఎక్కువ. ఫలితంగా భారీ వరద తాకిడికి, భూగర్భంలో 460 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. ఎస్ఎల్బీసీ అత్యంత క్లిష్టమైన సొరంగంగా ఎందుకు మారింది? దేశంలో నిర్మించిన ఇతర రైల్వే, రోడ్డు తదితర సొరంగాలకు దీనికి మధ్య ఎలాంటి సారూప్యతలూఎందుకు లేవు? సొరంగంపై నుండి నాలుగేళ్లకు పైగా నీరు, బురద రావడం అతి సంక్లిష్టమైన వ్యవహారం. టీబీఎం తవ్వడం ప్రారంభించగానే, అప్పటికే నాలుగేళ్లుగా నిట్ట నిలువుగా కుమ్మరిస్తున్న భారీ నీటి ఊటతో షియర్ జోన్ భూ భౌగోళిక స్థితి... భారీ విపత్తుగా మారింది. అక్కడి మట్టి అంతా పూర్తిగా నీటిని నింపుకొని తేమగా మారి పెను విపత్తుకు దారితీసింది. ఏ చిన్న ఒత్తిడితో కూడిన కదలిక జరిగినా కుప్ప కూలడానికి సిద్ధమైంది. టీబీఎం మిషన్ పని ప్రారంభించడంతో, నీటి తాకిడికి గురవుతున్న ప్రాంతం భారీ కదలికలకు గురైంది. ఇది సొరంగం పైకప్పు కుప్పకూలడానికి తక్షణ ప్రేరకంగా పని చేసింది. ‘టన్నెల్ íసీస్మిక్ ప్రొడ క్షన్ సిస్టమ్’తో రాబోయే భారీ విపత్తులను గుర్తించడంలో విఫలమవ్వడం విపత్తుకు మరొక కారణం.నీటి ప్రవాహ తాకిడికి, నాలుగు వందల టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. విపత్తు జరిగి పది రోజులైనా నీటి నిల్వను, ఊటను, బురదను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. సొరంగం పైనుంచి కుమ్మరిస్తున్న ఊట నీరు, మరిన్ని భారీ విపత్తు లకు నెలవుగా మారింది. ఇది రెస్క్యూ బృందాల సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. కుప్పకూలిన పైకప్పు భూభౌతిక స్థితి... షియర్ జోన్ స్వభావానికి చెందినది. ఈ ప్రాంతంలోని భూమి భారీ నీటిని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. నీటి జలల ప్రవాహానికి ఇక్కడి మట్టి అత్యంత అనువుగా ఉంటుంది. సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి ఎగువన ఉన్న భూమి ఉపరితలానికి, ఒక నిర్దిష్ట చదరపు ప్రాంతపు రిడ్జిని కలిగి ఉంటుంది. ఆ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షపు తీవ్రత బట్టి షియర్ జోన్లోకి చేరుకునే నీటి పరిమాణంలో హెచ్చు తగ్గులు ఆధారపడి ఉంటాయి. ఈ ప్రాంతంలోని మట్టి... వదులుగా, ఖాళీలు, సందులను కలిగి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడి మట్టి తన గుండా వర్షపు తీవ్రతను బట్టి నీరు ప్రవహించడానికి అనువుగా ఉంటుంది. ఫిబ్రవరి చివర – మార్చి మొదటి వారం మధ్య... కుప్పకూలిన సొరంగ మార్గంపై నుండి నిమిషానికి 5 వేల నుండి 8 వేల లీటర్ల నీరు సొరంగంలోకి ప్రవహిస్తూ ఉంది. ఆ నీరే సొరంగంలో వివిధ ప్రాంతాల్లో 1.5 అడుగుల నుండి 2.5 అడుగుల లోతు వరకూ ఉంది. జూలై నుంచి అక్టోబర్ వరకూ భారీ వర్షాలు కురుస్తాయి. అప్పుడు నిమిషానికి సొరంగంలోకి 20 వేల నుండి లక్ష 50 వేల లీటర్ల వరకూ నీరు చేరవచ్చు. ఆ పైన భారీ నీరు నిట్ట నిలువునా సొరంగంలోకి జలపాతంలో దూకవచ్చు. ఇంత భారీ జల ప్రవాహాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ ఎలా అరికడు తుంది? వందల మీటర్ల ఎత్తు నుండి భూగర్భం గుండా మహాశక్తితో సొరంగం పైకప్పుపై విరుచుకుపడే జలపాత మది. ఇక, ఎస్ఎల్బీసీలో ఉత్తర భారతానికి చెందిన చౌక వలస కూలీలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందికీ తెలంగాణ ప్రభుత్వం 2–3 కోట్ల రూపాయల వరకూ పరిహారం ఇవ్వాలి. టీబీఎంతో సొరంగం తవ్వే ఉత్తర భారత కార్మి కులను... కాంట్రాక్టరు,్ల కంపెనీలు కడు హీనంగా చూస్తున్నా యని అక్కడ పనిచేస్తున్న వారి ఆవేదన వెల్లడించింది. ప్రాణ హాని ఉన్న ఈ పనికి రోజుకు 800 రూపాయల కూలీ మాత్రమే ఇస్తున్నారు. వారికి ఎలాంటి ప్రమాద బీమాలు లేవు. రక్షణలూ, చట్టబద్ధమైన పరిహారాలూ లేవు. అనేక మంది కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇది అడ్డూ అదుపూ లేని దోపిడీ. అతి దుర్మార్గం. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టబద్ధమైన హక్కులన్నీ వారికి కల్పించాలి.-నైనాల గోవర్ధన్వ్యాసకర్త నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులుమొబైల్ : 97013 81799 -
SLBC టన్నెల్ ప్రమాదం: వీడని ఉత్కంఠ.. 13 రోజులైనా జాడే లేదు
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 13 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. మూడు షిప్టుల్లో 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13 రోజులు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా తవ్వకాలు చేపట్టారు. టీబీఎం మిషన్‌పై బుర తొలగింపునకు వాటర్ గన్స్ ఉపయోగిస్తున్నారు. రోబోల వినియోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా, కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్‌చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. -
SLBC టన్నెల్ లో 12వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. సొరంగం లోపల 13 కి.మీ. దూరంలో ఉన్న మట్టి, శిథిలాలను వేగంగా తొలగించేందుకు ఆధారమైన కన్వేయర్ బెల్టును మంగళవారం మధ్యాహ్నానికి సహాయక బృందాలు అందుబాటులోకి తెచ్చాయి. సింగరేణి సంస్థకు చెందిన నిపుణులు కన్వేయర్ బెల్టు జాయింట్ మెషీన్, డ్రమ్ పరికరాలను బిగించి పునరుద్ధరించారు. కన్వేయర్ బెల్టు ద్వారా గంటకు 800 టన్నుల మేర మట్టిని తరలించేందుకు వీలుంటుంది. అయితే ఇది టనెŠన్ల్ బోర్ (టీబీ) మెషీన్లో అంతర్భాగంగా పనిచేస్తుంది. ఇప్పుడు టీబీఎం ముక్కలుగా మారటంతో సింగరేణి మైనింగ్ రెస్క్యూ బృందాలు, ఆర్మీకి చెందిన మినీ బాబ్‌క్యాట్ డోజర్ల సాయంతో గంటకు 20 టన్నుల వరకు మట్టిని బయటకు తరలించే వీలుందని చెబుతున్నారు. సొరంగంలోని ప్రమాద స్థలంలో సుమారు 8 నుంచి 10 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పేరుకుపోయినట్టు అంచనా వేస్తుండగా, ఈ మొత్తం శిథిలాలను తొలగించేందుకు కనీసం రెండు రోజులైనా పడుతుందని చెబుతున్నారు. దీంతో ఏ క్షణమైనా కార్మికుల ఆనవాళ్లు లభించే అవకాశం ఉంది. రంగంలోకి రోబోటిక్స్ నిపుణులు సొరంగం కుప్పకూలిన చోట మట్టిని తొలగిస్తే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుండటంతో సహాయక చర్యల్లో రోబోలను వినియోగించాలని భావిస్తున్నారు. ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎన్వీ రోబోటిక్స్‌కు చెందిన నిపుణులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏఐ టెక్నాలజీతో కూడిన రోబోల ద్వారా సహాయక చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సొరంగం లోపల ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న సహాయ సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ మెడికల్ విభాగం సహకారం అందిస్తున్నాయి. అలాగే సొరంగం కుప్పకూలడంపై ప్రమాద స్థలానికి ఎగువ భాగంలో నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ నిపుణుల బృందం సర్వే చేపడుతోంది. ఎస్డీఆర్ఎఫ్ డీజీపీ నాగిరెడ్డి మంగళవారం సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్యాబిన్ ప్రదేశంలో చిక్కుకుని ఉంటారా? ప్రమాద స్థలంలో జీపీఆర్ గుర్తించిన నాలుగు పాయింట్లలో తవ్వకాలు జరిపినా కార్మికుల జాడ కనిపించలేదు. రాడార్ సూచించిన సమీపంలోని ప్రాంతాలను సైతం జల్లెడ పడుతున్నారు. సింగరేణి మైనింగ్ రెస్క్యూ టీం, ర్యాట్ మైనర్స్ మాన్యువల్ డిగ్గింగ్ పద్ధతిలో సాధారణ గడ్డపార, సమ్మెట, తట్ట సామగ్రితోనే తవ్వకాలు చేపడుతున్నారు.ఈ క్రమంలో టీబీఎం క్యాబిన్ ఉంటుందని భావిస్తున్న చోట తవ్వకాలు జరపగా, కార్మికుల ఆనవాళ్లు లభించినట్టుగా తెలిసింది. ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రితో పాటు వైద్య శాఖకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. -
కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో మరో ముందడుగు పడింది. సహయకచర్యలకు ఆటంకంగా ఉన్న బురద, శిథిలాలు తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించారు. దీంతో సహయక చర్యలు వేగవంతం కానున్నాయి. టన్నెల్లో 11 రోజుల క్రితం గల్లంతైన 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహయక చర్యలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగనున్నాయి. త్వరలో తప్పిపోయిన వారి ఆచూకీ దొరుకుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన వారి ఆచూకీ కోసం 11 రోజులుగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్‌హోల్ మైనర్స్, ఎన్జీఆర్ఐ ఇలా 12 విభాగాలకు చెందిన దాదాపు 650 సభ్యులతో నిర్విరామంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ప్రమాద సమయంలో పెద్దమొత్తంలో సీపేజ్ వాటర్, మట్టి పడటంతో టన్నెల్లో బురద పేరుకుపోయి సహయక చర్యలకు ఆటంకంగా మారింది. అదే సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ధ్వంసం అయ్యింది. మిషన్‌కు అను సంధానంగా పనిచేసే కన్నేయర్ బెల్ట్ సైతం దెబ్బతింది.దీంతో టన్నెల్లో ఉన్న శిథిలాలు, బురద అలాగే ప్లాస్మా కట్టర్స్ ద్వారా తొలగిస్తున్న టీబీఎం మిషన్ పరికరాల తొలగింపు సమస్యగా మారింది. ఇప్పటి వరకు లోకో ట్రైన్ ద్వారా రెండు బోగీలలో వాటిని తొలగిస్తూ వచ్చారు.ఒకసారి లోకో ట్రైన్ లోపలికి వెళ్లి రావటానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అంటే ఈ లెక్కన బురద, శిథిలాలు తొలగించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సహయక చర్యలు వేగవంతం కావాలంటే కన్వేయర్ బెల్ట్ పునరద్దరణే శరణ్యమని నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కూడ ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. దీంతో వెంటనే కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణ పనులు చేపట్టారు. ఇంజనీయర్లు రెండు రోజులు శ్రమించి ఇవాళ సాయంత్రం దాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం వ్యర్దాలను ఈ బెల్ట్ ద్వార బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో టన్నెల్లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం దాదాపు10 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి, బురద ఉన్నట్టు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణతో తప్పిపోయిన వారి ఆచూకీ త్వరలోనే గుర్తించవచ్చని అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండటంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా కన్వేయర్ బెల్ట్ ను పునరుద్దరించి సహయకచర్యలు చేపట్టడం మాత్రం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా మారింది. -
టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురండి..!
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. టన్నెల్ ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లేకపోవడం ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. టన్నెల్ సహాయక చర్యలో ఆర్మీ, సింగరేణ రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ లు పాల్గొన్నాయన్నారు ఏజీ. ఘటన జరిగిన నాటి నుంచి 24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నామని హైకోర్టు తెలిపారు సుదర్శన్ రెడ్డి. సహాయక చర్యలను ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏజీ వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. ఈ పిల్ పై విచారణ ముగించింది. కాగా, ఎస్ఎల్బీసీ టన్నెల్లో పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో టీబీఎం మిషన్ కటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే, నేడు కన్వేయర్ బెల్టు పునరుద్దరణ చర్యలను అధికారులు చేపట్టారు. పిల్లర్ వేసి కన్వేయర్ బెల్టును విస్తరించనున్నారు. ఇక, టన్నెల్లో ఊరుతున్న నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది.మరోవైపు.. టన్నెల్లో ఏడు మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్ టెక్నాలజీ విఫలం కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. పది రోజులుగా టన్నెల్లో ఉన్న వారి కోసం కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.గత నెల 22వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. కార్మీకులను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు 10 రోజులుగా చేస్తున్నప్రయ త్నాలు ఇంకా ఫలించలేదు. -
SLBC: సహాయక చర్యలు కొనసాగింపు.. కన్వేయర్ బెల్టు విస్తరణ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో టీబీఎం మిషన్ కటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే, నేడు కన్వేయర్ బెల్టు పునరుద్దరణ చర్యలను అధికారులు చేపట్టారు. పిల్లర్ వేసి కన్వేయర్ బెల్టును విస్తరించనున్నారు. ఇక, టన్నెల్లో ఊరుతున్న నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది.👉మరోవైపు.. టన్నెల్లో ఏడు మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్ టెక్నాలజీ విఫలం కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. పది రోజులుగా టన్నెల్లో ఉన్న వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.👉ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు ఆదివారం సాయంత్రం వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. సొరంగంలో చిక్కుకున్న వాళ్లు ఎక్కడున్నారో.. బతికి ఉన్నారో లేదో అంచనాకు రాలేదన్న సీఎం.. మరో రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రకృత్తి విపత్తులు జరిగినప్పుడు.. అండగా నిలవాల్సిన విపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు.👉సహాయక చర్యలు, తవ్వకాలకు నిరంతర నీటి ఊట అడ్డంకిగా మారుతోంది. పూడిక, కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. షిఫ్ట్‌కు 120 మంది చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు.అనుమానిత ప్రాంతాలు తాజాగా గుర్తింపు👉ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇతర ప్రాంతాలను.. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ సహాయంతో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తాజాగా గుర్తించింది. నలుగురు కార్మీకులు టన్నెల్ బోరింగ్ యంత్రం (టీబీఎం)కు వెనుక మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నట్టు అనుమానిస్తుండగా, మరో నలుగురు టీబీఎం ఉన్న ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్జీఆర్ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు ఆదివారం ఊహా చిత్రం రూపొందించారు. దీని ఆధారంగా డయాగ్రామ్‌ను తయారు చేసి, దాని ఆధారంగా మూడు దశల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు వ్యూహం సిద్ధం అయ్యింది. -
SLBC టన్నెల్ ను మంత్రులతో కలిసి పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
-
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం.. రంగంలోకి రోబోలు! : సీఎం రేవంత్
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మీకులను బయటకు తీసేందుకు తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మరో రెండు, మూడురోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. రోబోలను సైతం వినియోగించి కార్మీకులను వెలికితీసే ప్రయత్నాలను చేస్తామని వెల్లడించారు. మళ్లీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలను చేపడుతున్నామని వివరించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్దనున్న ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలునాయక్‌తో కలిసి నిపుణులతో సహాయక చర్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ‘ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చిరకాల వాంఛగా ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. పదేళ్లలో కనీసం 3 కి.మీ కూడా పూర్తిచేయలేదు. బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టు కంపెనీని ఇబ్బంది పెట్టారు. కరెంట్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్‌ను కట్ చేయడంతో మోటార్లు నడవని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని జాగ్రత్తలు తీసుకుని పనులు ప్రారంభించింది. టన్నెల్ బోరింగ్ మిషిన్ మరమ్మతు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అమెరికా పంపి స్పేర్‌పార్ట్స్‌ను తెప్పించాం. ప్రాజెక్టు పూర్తయితే రూపాయి ఖర్చు లేకుండానే 30 టీఎంసీల నీరు గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు అందుతుంది. మేము శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా దుర్ఘటన జరిగింది. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు. ఇది మనందరి సమస్య..విపత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ అండగా ఉండాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి.. ‘దేశ భద్రత కోసం కష్టపడే ఆర్మీ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తోంది. టన్నెల్ నిపుణులు, ప్రైవేటు ఏజెన్సీలతో పాటు దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం 11 సంస్థలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి, వారందరినీ అభినందిస్తున్నా. ప్రమాద స్థలంలో మట్టి, నీరు ఎక్కువగా ఉండటం, కన్వేయర్ బెల్టు రిపేరులో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం సాయంత్రానికి బెల్టు అందుబాటులోకి వస్తుంది. జీపీఆర్ గుర్తించిన చోట కార్మీకుల ఆనవాళ్లు దొరకలేదు. ప్రభుత్వం ఇంకా పట్టుదల, చిత్తశుద్ధితో సహాయక చర్యలను చేపడుతోంది. ప్రమాదం జరిగిన గంటలోనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులను సంఘటన స్థలానికి పంపా. ప్రధాని మోదీతోనూ మాట్లాడా.. దేశంలోని వ్యవస్థలతో పాటు మంత్రులు ఇక్కడే ఉండి పనిచేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీతో మాట్లాడా. కేంద్రం సహకారంతోనూ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచి్చన వారిపై సానుభూతి, మానవత్వంతో వ్యవహరిస్తున్నాం. సహయక చర్యలను చూసేందుకు వస్తున్న ప్రతిపక్షాలతో పాటు ఎవరినీ నియంత్రించ లేదు, నిర్భంధించ లేదు. పూర్తి పారదర్శకంగా ఉన్న మమ్మల్ని తప్పుబడుతున్నారు..’ అని రేవంత్ విమర్శించారు. రెండు ఉదంతాలకు మధ్య తేడా ఉంది.. ‘గతంలో బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు పనుల్లో 9 మంది చనిపోతే ఐదేళ్ల తర్వాత వాళ్ల మృతదేహాలు దొరికిన విషయం మర్చిపోయారా? శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనలో చనిపోయిన వారిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడిగా నేను వస్తుంటే అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పటి ఘటనకు, ఇప్పటి ప్రమాదానికి తేడా ఉంది. అక్కడ నిర్లక్ష్యం ఉంది. తాగి నడిపి మనిషిని గుద్దితే జరిగిన ప్రమాదం లాంటిది కాళేశ్వరం ఉదంతం.. తాగి వస్తున్న వాడిని బతికించేందుకు చెట్టును గుద్దిన ఘటన లాంటిది ఈ ప్రమాదం. ఈ రెండింటి మధ్య కూడా తేడా ఉంది. కేసీఆర్ ఎక్కడా కని్పంచడం లేదు. ప్రతిపక్షంగా నిలదీసే బాధ్యత ఆయనకు లేదా? నేను ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నానని కిషన్‌రెడ్డి అంటున్నాడు. మా వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. టీం లీడర్‌గా నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. హరీశ్ నీ పాస్‌పోర్టు బయటపెట్టు.. ‘ప్రమాదం జరిగితే నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లానని హరీశ్ అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హరీశ్ దుబాయ్‌లో దావత్ చేసుకున్నది నిజం కాదా? అబుదాబిలో రెండురోజులు దావత్లో మునిగి తేలారు. మత్తు దిగినాక వచ్చి ఇష్టం వచి్చనట్టు మాట్లాడుతున్నారు. హరీశ్.. మీ పాస్‌పోర్టును బయట పెట్టండి. ఎయిర్‌పోర్టులో వివరాలు చూడండి. నేను వస్తే రెస్క్యూ చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే రాలేదు. ఇట్ల సోయి లేకుండా మాట్లాడవచ్చా?..’ అని రేవంత్ మండిపడ్డారు. అనుమానిత ప్రాంతాలు తాజాగా గుర్తింపుసాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇతర ప్రాంతాలను.. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ సహాయంతో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తాజాగా గుర్తించింది. నలుగురు కార్మీకులు టన్నెల్ బోరింగ్ యంత్రం (టీబీఎం)కు వెనుక మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నట్టు అనుమానిస్తుండగా, మరో నలుగురు టీబీఎం ఉన్న ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్జీఆర్ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు ఆదివారం ఊహా చిత్రం రూపొందించారు. దీని ఆధారంగా డయాగ్రామ్‌ను తయారు చేసి, దాని ఆధారంగా మూడు దశల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు వ్యూహం సిద్ధం అయ్యింది. -
‘SLBC దగ్గరకు వెళ్లేందుకు సీఎంకు టైం లేదు’
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడకు వెళ్లే టైం లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన రఘునందన్ రావు.. గత ఎనిమిది రోజులుగా సీఎం రేవంత్.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సందర్భించే తీరిక లేదన్నారు. తెలంగాణలో పాలన పడకేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చారు.. రేవంత్ ఒకవేళ కలిస్తే ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదు. పేరుకే పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారు. సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ గా ఉన్న మహేస్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నా. జీహెచ్ఎంసీలో ఒక అధికారికి ఐదేళ్లుగా డిప్యూటేషన్ మీద పని చేస్తున్నారు. ఇక మున్సిపల్ పాలనపై సీఎం రేవంత్ కు పట్టులేదు. మమునూరు ఎయిర్ పోర్ట్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు. గద్వాల ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో తన ఫోటో కాంగ్రెస్ ఫ్లెక్సీలో వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కిషన్ రెడ్డి సౌమ్యుడు.. ఆయన గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు. ఆరు మంత్రి పదవులు భర్తీ చేసుకోలేని పరిస్థితి రేవంత్‌ది‘త్రిభాషా సిద్ధాంతానికి పునాదులు వేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉర్దూ భాష ఎందుకు రాస్తున్నారు. 90 శాతం జనాలకు ఉర్దూ రాకపోయినా ఎందుకు బోర్డులపై రాస్తున్నారు. ఎవరికి భయపడి ఉర్దూ భాష రాస్తున్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ అనుమతి తీసుకొని రేవంత్ తెలుగులో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ లో ఏ భాషలో మాట్లాడతారు. వ్యక్తిగత విమర్శలపై మేం మాట్లాడగలం . సిద్ధాంతం మీద, ప్రజా సమస్యలపై చర్చకు సిద్దం. వేదిక, సమయం చెప్పాలని సీఎం రేవంత్ కు సవాల్ విసురుతున్నా. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టింది.. ఇక్కడ కేంద్రానికి ఏం సంబంధం.. రేవంత్ ను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం మరిచిపోయినట్లున్నారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ భయపడుతున్నారు’ అంటూ రఘునందన్ రావు మండిపడ్డారు. -
SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
-
SLBC సహాయక చర్యలపై అధికారులతో మంత్రులు, సీఎస్ రివ్యూ
-
SLBC Tunnel: 24 గంటల్లో బయటికి!
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల్లో నలుగురిని ఆదివారం బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో ఒకచోట నలుగురు, మరోచోట నలుగురు కార్మికుల ఆనవాళ్లను గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్ ) గుర్తించింది. సొరంగం పైకప్పు కూలిపడిన సుమారు 150 మీటర్ల స్థలంలో ముందు భాగంలో నలుగురు, చివరి భాగం (ఎండ్ పాయింట్)లో నలుగురు ఉన్నట్టుగా ‘నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’ నిపుణులు అంచనా వేశారు. ముందు భాగంలో ఉన్న నలుగురిని బయటికి తీసేందుకు సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మ్యాన్యువల్‌గా తవ్వకాలు చేపట్టారు. కొన్ని గంటల్లోనే వీరిని వెలికితీసే అవకాశం ఉందని తెలిసింది. ఇక చివరి భాగంలో ఉన్న నలుగురు టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) హెడ్‌కు సుమారు 15 మీటర్ల వెనకాల చిక్కుకొని ఉన్నట్టుగా భావిస్తున్నారు. అక్కడ సుమారు 18 అడుగుల ఎత్తున మట్టి, శిథిలాలు పేరుకుని ఉండటంతో.. అక్కడున్న నలుగురిని బయటికి తీసేందుకు ఒకటి, రెండు రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. బురద, ఊట నీటితో ఆటంకం.. సొరంగం పైకప్పు కూలిన ప్రాంతంలో సుమారు 18 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు మట్టి, బురద, శిథిలాలు పేరుకుని ఉన్నాయి. అందులో కాంక్రీట్ సెగ్మెంట్లు, టీబీఎం భాగాలు, రాళ్లు, మట్టి కాకుండా అసాధారణ అవశేషాలు ఉన్న స్పాట్లను జీపీఆర్ గుర్తించింది. ఆయా చోట్ల మ్యాన్యువల్‌గా తవ్వకాలు చేపట్టగా.. తవి్వన కొద్దీ ఏర్పడుతున్న బురద, ఊట నీటితో ఇబ్బంది ఎదురవుతోంది. సొరంగంలో నిమిషానికి సుమారు 5 వేల లీటర్ల సీపేజీ వస్తుండటంతో పది పంపులతో డీవాటరింగ్ పనులు చేపడుతున్నారు. హైడ్రాకు చెందిన మినీ డోజర్‌తో బురదను తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్టు మరమ్మతుకు మరో 2 రోజులు: సొరంగంలో 13 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. అక్కడి నుంచి మినీ డోజర్ ద్వారా బురద, మట్టి తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి ముందు 200 మీటర్ల వరకు చేరుకునేందుకు రెస్క్యూ సిబ్బంది సిద్ధం చేసిన ఫ్లోటింగ్ బెల్టు మీదుగా నడిచి వెళుతున్నారు. ఈ శిథిలాలు, మట్టి తొలగించేందుకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాక ఆలస్యం అవుతోంది. కన్వేయర్ బెల్టు ఎండ్ పార్ట్ వద్ద మెషీన్ పూర్తిగా ధ్వంసం కావడం, బెల్టును తిరిగి వినియోగంలోకి తేవాలంటే కొత్త ఫౌండేషన్ వేయాల్సి ఉండటంతో.. ఇందుకోసం మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. సహాయక చర్యల్లో ఆధునిక సాంకేతికతను, పరికరాలను వినియోగిస్తున్నారు. శిథిలాల్లో అవశేషాలను గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్), మానవ రక్తం ఆనవాళ్లను గుర్తించే ఆక్వా–ఐ, ప్రోబోస్కోప్, టీబీఎం విడిభాగాలు, శిథిలాలను కట్ చేసేందుకు అల్ట్రా థర్మికల్ కటింగ్ మెషీన్, ప్లాస్మా కట్టర్స్, సొరంగంలోని బురద, మట్టిని తొలగించేందుకు ఆర్మీకి చెందిన రెండు మినీ బాబ్ క్యాట్ మెషీన్లు, ఎస్కవేటర్‌ను వినియోగిస్తున్నారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ ఐజీ మోహ్సెన్ షహది పర్యవేక్షిస్తున్నారు. శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎన్జీఆర్ఐ నిపుణులతో సమీక్షించారు. డాక్టర్‌గా చెబుతున్నా.. వాళ్లు బతికుండే అవకాశం లేదు: ఎమ్మెల్యే వంశీకృష్ణ సొరంగంలో కార్మికులు మట్టి, బురద, శిథిలాల కింద కూరుకుపోయారని.. ఒక డాక్టర్‌గా చెబుతున్నానని, వాళ్లు బతికి ఉండేందుకు అవకాశం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. కార్మికులను బయటికి తీసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని.. ఒకట్రెండు రోజుల్లో బయటికి తీసే అవకాశం ఉందని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సర్వే కోసం నేడు ఎన్ఆర్ఎస్సీ బృందం.. సొరంగంలో కుప్పకూలిన ప్రాంతానికిపైన భూఉపరితలం వద్ద ‘నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’ అధికారులు సర్వే చేపట్టారు. ఈ ప్రాంతానికి సమీపంలో మల్లెల తీర్థం జలపాతం ఉండటం, దానికి నల్లవాగు (ఏనిగే)కు మధ్యలో సుమారు 400 మీటర్ల లోతున టన్నెల్లో ప్రమాదం జరగడంతో... టన్నెల్లో భారీగా నీటి ఊటకు కారణాలపై పరిశీలన చేపట్టారు. అయితే ఎన్జీఆర్ఐ పరికరాల ద్వారా 150 మీటర్లలోతు వరకు మాత్రమే మట్టి పొరలు, రాళ్ల ఆకృతుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. సొరంగం 400 మీటర్ల లోతులో ఉన్న నేపథ్యంలో... పరిశోధించేందుకు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’ చెందిన నిపుణులు ఆదివారం రంగంలోకి దిగనున్నారు. వెళ్లి చూస్తే పరిస్థితి ఎంత క్లిష్టమో తెలుస్తుంది: మంత్రి జూపల్లి కృష్ణారావు సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటికి తీసే చర్యల్లో పురోగతి కనిపించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం దోమలపెంట సొరంగం వద్ద మంత్రి ఉత్తమ్‌తో కలసి అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోపల చిక్కుకున్న కార్మికులు బతికి ఉండే అవకాశం 99శాతం లేదన్నారు.రెస్క్యూ బృందాలు ప్రమాదంలో పడొద్దన్న ఉద్దేశంతో జాగ్రత్తగా పనులు చేపడుతున్నామని, అందుకే ఆలస్యం అవుతోందని జూపల్లి తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ విమర్శలు చేస్తున్నవారు ఒకసారి టన్నెల్లో ప్రమాదస్థలానికి వెళ్లి చూస్తే.. పరిస్థితి ఎంత కష్టంగా ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు. -
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. నలుగురిని గుర్తించాం: మంత్రి జూపల్లి
సాక్షి, మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని.. జీపీఆర్ ద్వారా నలుగురు కార్మికులను మార్క్ చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రేపు(ఆదివారం) రాత్రిలోపు వారి ఆచూకీ దొరికే అవకాశముందని.. మిగిలిన వారి జాడ తెలుసుకునేందుకు మరింత సమయం పడుతుందన్నారు. మొత్తం 8 మంది కార్మికులలో నలుగురిని గుర్తించామని, మిగతా నలుగురు టీబీఎం మిషన్ అవతలి వైపున ఉన్నట్లు చెప్పారు. గ్యాస్ కట్టర్ల ద్వారా టీబీఎం మిషన్ మొత్తం కట్ చేశామని వెల్లడించారు. టన్నెల్ బోరు మిషన్ కట్ చేసి రెస్క్యూ చేస్తున్నారన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని.. ఘటనపై ప్రతిపక్షాలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. మరో వైపు, టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్‌వో ప్రమాద స్థలంలో ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే.ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు. -
సంఘటన స్థలానికి సీఎం వెళ్లకపోవడం దురదృష్టకరం: మహేశ్వర్ రెడ్డి
-
5 కీలక స్పాట్స్ ను గుర్తించిన GPR
-
ఏ క్షణంలోనైనా బయటికి!
సాక్షి, నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసేందుకు చేపడుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపిస్తోంది. టన్నెల్లో ప్రమాదం జరిగి, సుమారు 18 అడుగుల మేర మట్టి, శిథిలాలతో నిండిపోయిన ప్రాంతంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) ద్వారా స్కానింగ్ చేశారు. ఈ క్రమంలో ఐదు చోట్ల అనుమానిత అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రమాద స్థలంలో మట్టి, రాళ్లు, బురద, టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం), ఇతర పరికరాల శిథిలాలతో నిండిపోగా.. అందులో కొన్నిచోట్ల మానవ దేహాలుగా భావిస్తున్న కొన్ని సున్నితమైన వస్తువులు ఉన్నట్టుగా రాడార్ సిగ్నల్స్ ద్వారా నిర్ధారించారు.ఆ చోట్ల తవ్వకాలు చేపడుతున్నారు. దీనితో ఏ క్షణంలోనైనా కార్మికులను బయటికి తీసే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ఇప్పటికే అధునాతన క్రిటికల్ కేర్ అంబులెన్స్‌లు, వైద్యులు, ఆక్సిజన్‌ను అందుబాటు లో ఉంచారు. ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్‌కుమార్ గుప్తా, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, సింగరేణి సీఎండీ బలరాం తదితరు లు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 13.2 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్.. టన్నెల్లో కన్వేయర్ బెల్టు ఇంకా సిద్ధం కాకపోవడంతో.. సహాయక బృందాల రాకపోకలు, శిథిలాలు, మట్టి, బురద తొలగింపునకు లోకో ట్రైన్ ఒక్కటే ఆధారంగా మారింది. దానిపై రెస్క్యూ టీం సభ్యులను, బురద, మట్టి, శిథిలాలను మూడు కోచ్‌ల్లో తరలిస్తున్నారు. ఈ లోకోట్రాక్ 13.50 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉన్నా... చివరి 300 మీటర్ల ప్రాంతంలో 2 అడుగుల మేర మట్టి, బురద పేరుకుని ఉంది. దీనితో 13.2 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. ఇప్పుడు మిగతా ట్రాక్‌పై ఉన్న బురదను మినీ డోజర్‌తో తొలగిస్తూ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. నాలుగు షిఫ్టులుగా పనులు టన్నెల్లో మొత్తం 250 మంది రెస్క్యూ సిబ్బంది నాలుగు షిఫ్టులుగా పనిచేస్తున్నారు. శిథిలాల కింద టీబీఎం ముక్కలై పోయి 40 మీటర్ల దూరం వరకు చెదిరిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకునేందుకు అడ్డుగా ఉన్న ఈ టీబీఎం మెషీన్ భాగాలు, శిథిలాలు, పైపులు, గడ్డర్లను సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో గ్యాస్ కట్టర్స్, వెల్డర్స్ కలసి క ట్ చేసి తొలగిస్తున్నారు. ఇందుకోసం అదనంగా 200 మంది సింగరేణి కార్మికులు ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. ఇక సొరంగంలో కిందకి వంగిపోయిన ఎయిర్ బ్లోయర్‌ను కట్ చేసి సరిచేశారు. మొత్తం పది మోటార్లతో డీవాటరింగ్ ప్రక్రి య చేపడుతున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిలో జార్ఖండ్‌కు చెందిన కార్మికుల కుటుంబ సభ్యులు మూడు రోజుల కింద దోమలపెంటకు చేరుకోగా.. పంజాబ్‌కు చెందిన గురుప్రీత్‌సింగ్ కుటుంబసభ్యులు శుక్రవారం చేరుకున్నారు.జీపీఆర్ గుర్తించింది.. కచి్చతమని చెప్పలేం: సింగరేణి సీఎండీ బలరాంసొరంగంలోని ప్రమాద స్థలంలో జీపీఆర్ స్కానింగ్‌లో అనుమానిత స్పాట్లను నిపుణులు గుర్తించారని.. అయితే దీనిపై కచి్చతమైన నిర్ధారణకు రాలేదని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఎస్ఎల్బీసీ వద్ద ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో కొన్ని స్పాట్లు అంచనా వేశారు. వాటిపై ఇంకా స్టడీ చేయాల్సి ఉంది. వారిని బయటికి తీసేందుకు సమయం పడుతుంది. సొరంగంలో గ్యాస్ కట్టింగ్, వెల్డింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి’’ అని బలరాం తెలిపారు.తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. ఎస్ఎల్బీసీ సొరంగంలో కార్మికుల మృతదేహాలు లభించాయంటూ వస్తున్న వార్తలు, ప్రచారాన్ని నమ్మవద్దు. ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో జీపీఆర్ విధానంలో గుర్తించిన స్పాట్లు పూర్తిగా నిర్ధారణ కాలేదు. వాటిని ఇంకా నిపుణులతో పరిశీలించాల్సి ఉంది. వీలైనంత త్వరగా కార్మికులను బయటికి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. – నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ -
SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి
నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో భాగంగా చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది.. ఈరోజు(శుక్రవారం) SLBC టన్నెల్లో తప్పిపోయిన 8 మంది కార్మికులు ఆచూకీ కోసం ఆపరేషన్ చేపట్టారు.. ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఆపరేషన్ చేపట్టగా.. కొన్ని మీటర్ల లోతులో శకలాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు.టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేశారు. బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టి జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కొన్ని శకలాలను గుర్తించారు. అవి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు..ఈరోజు కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు. ఈ క్రమంలోనే కొన్ని శకలాలు ఆచూకీ లభించింది. దాదాపు మూడు మీటర్ల లోతు మట్టిలో మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించారు.జీపీఆర్ టెక్నాలజీ ద్వారా..టన్నెల్ ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) ఆపరేషన్ ఆరంభించింది. దీనిలో భాగంగా భూమిలో కూరుకుపోయి ఉంటే వారి స్థితిని తెలుసుకునేందుకు ఆధునాతన టెక్నాలజీ జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ ద్వారా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ మిషన్ ఆధారంగా ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ ను పూర్తిగా స్కాన్ చేశారు.మరో రెండు రోజుల్లో పడుతుంది..ఈ టన్నెల్ చిక్కుకున్న వారి సమాచారం కావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందన్నారు సింగరేణి సీఎండీ బలరాం. ఎస్ ఎల్ బి సి టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుంది సీఎం సింగరేణి సిఎండి బలరాం. ఎన్జిఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించారు, కానీ కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరామన్నారు. అప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. -
SLBC టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
-
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్‌లో ఈరోజు ఏం చేస్తారంటే?
సాక్షి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చుజీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి... అక్కడున్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు కానుంది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బయటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు నేడు (శుక్రవారం) విశ్లేషించనున్నారు.బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిపుణుల పర్యవేక్షణలో.. సొరంగంలోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు, విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు, కార్మికుల సహాయంతో లోకో ట్రైన్‌లోని మూడు కోచుల్లో మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పునకు రీయిన్‌ఫోర్స్‌మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు.సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మూడు షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక టన్నెల్లో ఊట నీటిని తొలగించేందుకు డీవాటరింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తోడేస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు రానున్నాయి.సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకుని, బయటకు వచ్చేందుకు... లోపల ఉన్న శిథిలాలు, మట్టిని బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్ వరకు చేర్చేందుకు 300 మీటర్ల మేర రెస్క్యూ సిబ్బంది మోసుకెళ్లాల్సి వస్తుండటం కష్టంగా మారింది. కన్వేయర్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి టీబీఎం మెషీన్‌తోపాటే కన్వేయర్ బెల్టు కూడా పనిచేస్తుంది. టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ఉండగా.. రాళ్లు, మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ నుంచి బయటికి వస్తాయి. ఇప్పుడు టీబీఎం లేకుండా కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తేవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతోపాటు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం ప్రమాదస్థలానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టన్నెల్ వద్ద వంద మంది వరకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సుశిక్షితులైన సిబ్బందిని రప్పిస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. -
SLBC టన్నెల్ ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
-
అత్యవసర మార్గం లేకే సహాయక చర్యల్లో జాప్యం
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సొరంగాల నిర్మాణంలో అత్యవసర మార్గాలను నిర్మిస్తారని.. కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు అది లేకపోవడమే ఇటీవల జరిగిన ప్రమాదంలో 8 మంది ఆచూకీ దొరకకపోవడానికి కారణమని జాతీయ స్థాయిలో టన్నెల్ ప్రమాదాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించిన నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గురువారం ఎస్ఎల్బీసీ క్యాంపు సైట్ వద్దకు చేరుకున్న ఆర్మీ వెస్టర్న్ కమాండెంట్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) మాజీ అదనపు డీజీ కె.పి. పురుషోత్తం ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.భూగర్భంలో 43 కి.మీ. పొడవున నీటిని సరఫరా చేసే సొరంగం దేశంలోకెల్లా ఎస్ఎల్బీసీ ఒక్కటేనన్నారు. నేషనల్ హైవేలు, రైల్వేలైన్లు, సముద్రమార్గాలను భూగర్భంలో నిర్మించినప్పటికీ నీటి సరఫరా కోసం అంతదూరంపాటు చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణం అత్యంత క్లిష్టమైనదని వారు అభిప్రాయపడ్డారు.టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) టెక్నాలజీతో సాగే నిర్మాణం మంచిదే అయినప్పటికీ.. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం నొక్కి చెప్పిందన్నారు. ప్రమాదంలో కార్మికులు, ఇంజనీర్లపై మట్టిపెళ్లల శిథిలాలు పడి ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. కార్మికులు గల్లంతైన చోట జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఒకట్రెండు రోజుల్లో ఫలితం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తెలంగాణ ప్రాజెక్టులను సర్వనాశనం చేసింది మీరే
అచ్చంపేట రూరల్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేయడం కంటే.. వారి జేబులు నింపుకోవడంపైనే శ్రద్ధ చూపారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులదేనని చెప్పారు. గురువారం దోమలపెంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.నల్లగొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ నీటి నుంచి కాపాడటంతోపాటు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించి పరుగులు పెట్టించారన్నారు. సొరంగ పనులు ముందుకుసాగడానికి గత ప్రభుత్వం కరెంట్ కూడా అందించలేదని చెప్పారు. ఎస్ఎల్బీసీ వద్ద ఎంతో నిష్ణాతులైన రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు. పూర్తిగా పారదర్శకంగా దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్ నిపుణులతో సమన్వయం చేసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామని తెలిపారు.11 ఏజెన్సీలను కోఆర్డినేట్ చేసి పనులు పర్యవేక్షిస్తున్నామన్నారు. రెండుమూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని, రెండు,మూడు నెలల్లో టన్నెల్ పనులు పునఃప్రారంభించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల నుంచి పనులు జరుగుతున్నాయని, ఇప్పుడు అనుమతులు అడగటం సిగ్గు చేటని, వారుచెప్పే మాటల్లో అర్థం లేదన్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతున్నవి అబద్ధపు మాటలని చెప్పారు.గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేయకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిగ్గుండాలన్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏ ప్రతిపక్ష నాయకుడికి చూసేందుకు అనుమతి ఇవ్వలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు సైతం అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. తాము భిన్నంగా వ్యవహరిస్తున్నామని, సొరంగ సంఘటనను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నాయకులకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. హెలికాప్టర్లో తిరగాలన్న మోజు లేదుతాను పాలన మరిచి హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నానని బీఆర్ఎస్ నాయకులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం సిగ్గు చేటని, తాను సొరంగంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను కాపాడటానికే హెలికాప్టర్ ఉపయోగిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకే ఇక్కడకు వస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. తాను పైలట్‌నని, హెలికాప్టర్లో తిరిగే మోజు తనకు లేదన్నారు.గత ప్రభుత్వంలో శ్రీశైలం పవర్‌హౌస్‌లో 9 మంది చనిపోతే ఎవరూ పట్టించుకోలేదని, అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి అక్కడకు వెళ్తుంటే దారిలో అరెస్టు చేశారన్నారు. సొరంగ ఘటనను రాజకీయ లబ్ధికోసం బీఆర్ఎస్ మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉండి ఎస్ఎల్బీసీకి కరెంటు కట్ చేయడంతోనే డీవాటర్ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, గత పాలకులు సక్రమంగా పనిచేసి ఉంటే ప్రాజెక్టు ఎన్నడో పూర్తయ్యేదన్నారు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, వి.హన్మంతరావు పాల్గొన్నారు. -
సొరంగంలో జీపీఆర్ పరీక్షలు
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చు. దీంతో గల్లంతైన కార్మికులు శిథిలాల కింద ఎక్కడున్నారో గురువారం రాత్రిలోగా తెలిసిపోయే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. శిథిలాల తవ్వకాలు ప్రారంభం..బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిపుణుల పర్యవేక్షణలో.. సొరంగంలోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు, విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు, కార్మికుల సహాయంతో లోకో ట్రైన్‌లోని మూడు కోచుల్లో మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పునకు రీయిన్‌ఫోర్స్‌మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు.సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మూడు షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక టన్నెల్లో ఊట నీటిని తొలగించేందుకు డీవాటరింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తోడేస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు రానున్నాయి.కన్వేయర్ బెల్టు మరమ్మతు కష్టమే..సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకుని, బయటకు వచ్చేందుకు... లోపల ఉన్న శిథిలాలు, మట్టిని బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్ వరకు చేర్చేందుకు 300 మీటర్ల మేర రెస్క్యూ సిబ్బంది మోసుకెళ్లాల్సి వస్తుండటం కష్టంగా మారింది. కన్వేయర్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి టీబీఎం మెషీన్‌తోపాటే కన్వేయర్ బెల్టు కూడా పనిచేస్తుంది. టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ఉండగా.. రాళ్లు, మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ నుంచి బయటికి వస్తాయి. ఇప్పుడు టీబీఎం లేకుండా కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తేవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.సింగరేణి నుంచి మరో 200 మందిగోదావరిఖని (రామగుండం): సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతోపాటు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం ప్రమాదస్థలానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టన్నెల్ వద్ద వంద మంది వరకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సుశిక్షితులైన సిబ్బందిని రప్పిస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.ఈ పరికరం ఎలా పనిచేస్తుంది?జీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి... అక్కడున్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు కానుంది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బయటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు శుక్రవారం విశ్లేషించనున్నారు. -
‘రాజకీయాలు చేయడం కోసం వెళ్లారా?’
హైదరాబాద్: ఎస్ఎల్బీసీకి వెళ్లిన బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే వారు రాజకీయాలు చేయడం కోసమే అక్కడకు వెళ్లినట్లు ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ఘటనను ప్రకృతి విలయలాగా చూడాలి కానీ రాజకీయాలు చేస్తామనడం సరైంది కాదన్నారు. ‘హరీష్ రావు రాజకీయాలు చేయడం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని వాడుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది.కాళేశ్వరం టన్నెల్ కూలినప్పుడు ప్రాణ నష్టం జరిగింది.. మీరు ప్రతిపక్షాలకు అనుమతి ఇచ్చిన చరిత్ర లేదు. మేము పోయి రాజకీయం చేయలేదు. శ్రీశైలంలో పవర్ హౌస్ పెయిల్ అయినప్పుడు ఆ జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, మల్లు రవిని పోనియ్యలేదు. మీరు పర్మిషన్ అడగకున్నా slbc కి పోతం అంటే పోనిచ్చినం. హరీష్ రావు రెస్క్యూ టీమ్ కు సలహాలు ఇవ్వనక్కర్లేదు. అక్కడ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఎనిమిది మంది కుటుంబాలను ఎలా ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. రెస్క్యూ ను ప్రభుత్వం రిజాల్వ్ చేస్తుంది’ అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. -
Uttam Kumar: 11 విభాగాల నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు
-
నాకు హెలికాప్టర్లో తిరగాలి అన్న షోకు లేదు
మహబూబ్ నగర్: మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను రెండు, మూడు నెలల్లో పునః ప్రారంభిస్తామన్నారు మంత్రి.‘ పదేళ్ల పాటు అధికారుంలో ఉన్న బీఆర్ఎస్.. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ అనుమతుల గురించి మాట్లాడుతోంది. హరీష్ రావు మాటలు పూర్తి అబద్ధాలు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీల గ్రావిటీ ద్వారా వస్తుంటే బీఆర్ఎస్ వాళ్లు పనులు వదిలిపెట్టి వెళ్లారు. వారు సరైన పని చేసి ఉంటే తెలంగాణలో 30 టీఎంసీల నీళ్లు వచ్చి, మూడు నాలుగు లక్షల ఎకరాల నల్గొండ భూములు సాగులోకి వచ్చేవి.మేము ప్రజాస్వామ్యుతంగా జరిగిన ప్రమాదంపై అందరూ చూసేందుకు అనుమతి ఇస్తున్నాం. వారి హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న మాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. వాళ్ల హయాంలో 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రపు పనులు చేశారు. వారి హయాంలోనే నీటి పారుదల శాఖ నిర్వీర్యం అయ్యింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బ్లాస్ట్ జరిగి.. 9 మంది చనిపోతే ఒక్కరు కూడా పరామర్శకు రాలేదు. ఆరోజు రేవంత్ రెడ్డి వస్తుంటే కారులో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దేవాదులలో ఏడుమంది చనిపోతే, అస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయి. హరీష్ ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడారా?, ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేకున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.దేవాదులలో ఏడు మంది చనిపోతే.. ఆస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయి హరీష్ రావు ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడావా..ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేకున్న పరిస్థితి.ఇక్కడికి వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి లో 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నిరంది ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీకి కరెంట్ కట్ చేస్తే డి ఓటరింగ్ చేయలేక పనులు ఆగిపోయాయి అప్పుడు జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఏమి చేశాడు. నాకు హెలికాప్టర్ లో తిరగాలి అన్న షోకు లేదు.. నేను ఓ పైలట్ ను. భారతదేశంలో టన్నెల్ ప్రమాదాలలో అత్యంత నిపుణులను కలిగిన 11 ఏజెన్సీలను తీసుకువచ్చి సమర్థవంతంగా మా ప్రభుత్వం సహి చర్యలు నిర్వహించింది. బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు ప్రత్యేక అబద్ధాలు ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను’ ’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. -
ప్రమాద స్థలానికి దగ్గరగా వెళ్లిన రెస్క్యూ బృందాలు
-
SLBC ఘటనలో ప్రభుత్వం విఫలమైంది: హరీష్రరావు
-
SLBC లోపలి దృశ్యాలు: సౌండ్లు చేస్తూ ముందుకు..
నాగర్ కర్నూల్, సాక్షి: SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన.. కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. ‘‘ఎవరైనా ఉన్నారా?’’ అంటూ శబ్ధాలు చేస్తూ కార్మికుల జాడ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ నెల 22వ తేదీన ప్రమాదం జరిగింది. టన్నెల్ బోరింగ్ మెషీన్‌తో పనులు ప్రారంభించగానే.. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు సొరంగమంతా ఊగిపోయింది. పైభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా.. మరో ఎనిమిది మంది లోపలే చిక్కుపోయారు. అప్పటి నుంచి సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. ఉబికి వచ్చిన నీటితో మట్టి తడిసి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఐదు రోజులు గడిచినా.. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. నీరుందని, పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయిందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలో సొరంగంలో పేరుకుపోయిన మట్టిని, నీటిని తొలగిస్తూ వచ్చారు. సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న బోరింగ్ మెషిన్, ఇతర పరికరాలను ఢ్రిల్లింగ్ చేసి తొలగించి ముందుకు సాగారు. అయితే భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు.. టన్నెల్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలను సహాయక బృందాలు విరమించుకున్నాయి. ఈ క్రమంలో..మంగళవారం రాత్రి ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు సహాయక బృందాలు(Rescue Teams) చేరుకున్నాయి. అక్కడంతా బురద, మట్టి పెల్లలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ, ఎన్డీఎఫ్, ఎస్డీఎఫ్ టీమ్‌లతో పాటు వెళ్లిన కార్మికులు ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చేశారు. ఈ ఉదయం ఆక్సిజన్ సాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువగా వెళ్లారు. దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి జీరో పాయింట్‌కు చేరుకోగలిగారు. అయితే కార్మికుల ఇంకా తెలియకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రసుత్తం ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు కొనసాగిస్తున్నారు. -
SLBC టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
అప్రమత్తంగా..ఆచితూచి..
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ఒకటో సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన 8 మంది కార్మీకుల అన్వేషణలో భాగంగా గురువారం నుంచి సొరంగం లోపల తవ్వకాలను ప్రారంభించనున్నారు. గత ఆరు రోజుల్లో ఏడు రెస్క్యూ బృందాలు సొరంగం లోపలికి వెళ్లి పరిస్థితులను అంచనా వేసి బయటకు తిరిగి వచ్చాయి. అయినా కార్మికుల జాడ తెలుసుకోవడంలో పెద్దగా పురోగతి సాధ్యం కాలేదు. ఈ పరిస్థితుల్లో తవ్వకాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపితే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి తేలికపాటి పరికరాలతో రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరిపించాలని నిర్ణయించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) మాజీ డీజీ/ఆర్మీ మాజీ ఈఎన్సీ జనరల్ హర్పాల్ సింగ్, సొరంగాలకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ నిపుణుడు క్రిస్ కూపర్, బీఆర్ఓ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, మరో ప్రముఖ సొరంగాల నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రతో కూడిన నిపుణుల బృందం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ర్యాట్ హోల్ మైనర్లతో కలిసి సొరంగం లోపలికి వెళ్లింది. సాయంత్రం 4.10 గంటలకు బయటకు వచ్చింది. అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశమై విస్తృతంగా చర్చించింది. నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం వ్యూహాన్ని ఖరారు చేసింది.. చివరి వరకు నెమ్మదిగా తవ్వకాలు గల్లంతైన కార్మీకుల ఆచూకీ తెలుసుకోవడంలో భాగంగా సొరంగం కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, రాళ్లు, శిథిలాలు, తుక్కును తేలికపాటి పరికరాలతో తవ్వకాలు జరిపి తొలగించవచ్చని నిపుణుల బృందం సూచించింది. సొరంగం కూలిన సమయంలో అక్కడున్న కార్మీకులు బయటకు వచ్చేందుకు పరుగెత్తి ఉంటారని, వారు శిథిలాల కింద ఈ వైపే ఉండి ఉంటారనే తమ అంచనాను వివరించింది. ఈ నేపథ్యంలో రెసూ్క్క బృందాలు తవ్వకాలు ప్రారంభిస్తే ఒకటీ రెండురోజుల్లోనే కార్మీకుల ఆచూకీ లభ్యం కావచ్చని భావిస్తున్నారు. తవ్వకాలు, శిథిలాల తొలగింపు చర్యలు ఈ వైపు నుంచి ప్రారంభించి సొరంగం చివరి భాగం వరకు నెమ్మదిగా కొనసాగించాలని నిపుణులు సూచించారు. తవ్వకాలు కొద్దిగా పురోగమించిన వెంటనే సొరంగం పైకప్పు మళ్లీ కూలకుండా రక్షణగా రీఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జనరల్ హర్పాల్ సింగ్‌లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)కి చెందిన ఒకే బ్యాచ్ అధికారులు కావడం గమనార్హం. ఉత్తమ్‌కుమార్ రెడ్డి గతంలో భారత వాయుసేనలో కెపె్టన్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే పరికరాల తరలింపు.. సొరంగం లోపల తవ్వకాలు, శిథిలాల తొలగింపు పనులకు కార్మీకులు ముందుకు రావడం లేదు. సొరంగం మళ్లీ కూలుతుందేమోనని భయపడుతున్నారు. దీంతో సింగరేణి రెస్క్యూ బృందాలను అత్యవసరంగా రప్పిస్తున్నారు. గురువారంలోగా వారు ప్రమాద స్థలానికి చేరుకోనున్నారు. ఇక సొరంగంలోని మట్టి, శిథిలాల్లో కూరుకుపోయిన టన్నుల కొద్దీ బరువు ఉన్న తుక్కును కట్ చేయడానికి రైల్వే శాఖ నుంచి యుద్ధ ప్రాతిపదికన హెవీ స్టీల్ గ్యాస్ కట్టర్లను రప్పిస్తున్నారు. బుధవారం రాత్రికే ఈ పరికరాలన్నీ సొరంగంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇక టీబీఎం ముక్కలు ముక్కలే.. సొరంగం కూలడంతో శిథిలాల కింద కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)ను హెవీ స్టీల్ గ్యాస్ కట్టర్ సహాయంతో ముక్కలు ముక్కలుగా కట్ చేసి సొరంగం నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీనిని తొలగిస్తేనే గల్లంతైన కార్మీకుల ఆచూకీని కనుక్కోవడానికి వీలుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ రెస్క్యూ ‘మార్కోస్’ ప్రత్యేకత గురువారం నుంచి జరిగే సహాయక కార్యక్రమాల్లో ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ (మార్కోస్) కూడా పాల్గొననుంది. అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ రెస్క్యూ నిర్వహించే ఈ దళం బీఆర్ఓ, ఆర్మీ, నేవీ నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ర్యాట్ హోల్ మైనర్స్తె కలిసి పని చేయనుంది. కాగా అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీని వినియోగిస్తూ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెస్క్యూ సిబ్బందికి అవసరమైన ఆక్సిజన్, లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. -
SLBC వద్దకు ఆపరేషన్ మార్కోస్ టీమ్.. ప్రస్తుత పరిస్థితి ఇలా..
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఆపరేషన్ మార్కోస్ టన్నెల్ రంగంలోకి దిగుతోంది. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ రానుంది.ఈ కమాండ్స్ నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపడతారు. ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో కార్మికులు బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కాని, పక్క నుంచి కానీ.. వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టన్నెల్ బురదమయం..ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కాపాడేందుకు సహాయచర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ సహా పలు సహాయక బృందాలు వారి వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు మాత్రమే చేరుకున్నాయి. అక్కడ.. ధ్వంసమైన టీబీఎం పరికరాలు ఉండటంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు.. 11.5 కి.మీ నుంచి ఎయిర్ సప్లయ్ పైప్‌లైన్ వ్యవస్థ ధ్వంసమైంది. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ నిపుణులు బురద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం టన్నెల్లో 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట వస్తోంది. సొరంగ మార్గంలో 10వేల క్యూబిక్ మీటర్ల బురద ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్‌తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముందని చెబుతున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు ఉండటంతో అక్కడ అడుగు వేయడానికి వీలులేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. కూలిపోయే ప్రమాదం.. అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది. -
ఎస్ఎల్బీసీ టన్నెల్లో.. సవాల్‌గా మారిన సహాయక చర్యలు (ఫొటోలు)
-
‘సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే..’
హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రమాద స్థలిని సందర్శించడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇప్పటివరకూ తాము అక్కడకు వెళ్లకపోవడానికి సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో మాత్రమేనన్నారు. ఎల్లుండి(గురువారం) ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ ను సందర్శిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము అక్కడకు వెళ్లే క్రమంలో పోలీసులు ఎటువంటి ఆటంకం కల్గించకూడదని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలిఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలన్నారు.8 మందిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం..టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 18, 19 మీటర్ల ఎత్తులో బురద పేరుకుపోయిందని, దేశంలో చాలా టన్నెల్ ప్రమాదాలు జరిగాయని, కాకపోతే అత్యంత క్లిష్టమైన టన్నెల్ ప్రమాదం ఇదేనన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. -
SLBC టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి ప్రత్యేక కెమెరాలు
సాక్షి,నాగర్‌కర్నూల్:శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి మంగళవారం(ఫిబ్రవరి 25) బయలుదేరారు. కాసేపట్లో ఆయన టన్నెల్ వద్దకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా టన్నెల్ వద్ద పరిస్థితిని పరిశీలించనున్నారు. టన్నెల్ వద్ద సహాయక చర్యలు రోజురోజుకు కష్టంగా మారుతున్నాయి. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. లోపల పేరుకుపోయిన మట్టి, శిథిలాల ఎత్తు మరో మీటరు మేర పెరిగిపోయింది. దానికితోడు నీటి ఊట ఆగకుండా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం అత్యాధునిక ఎండోమోడ్ కెమెరాలను లోపలికి పంపారు. 9 వేర్వేరు బృందాలుగా 600 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 72 గంటలు గడిచినా ఎనిమిది మంది ఆచూకీ దొరకకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా కూలిపడటంతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 43.93 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు తవ్వకం పూర్తయింది. అక్కడ పనులు చేస్తుండగా శనివారం ఉదయం 8.30 గంటలకు సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతయ్యారు. వారిని రక్షించడానికి ఆదివారం మధ్యాహ్నం వరకు చేసిన 3 ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. నాలుగో ప్రయత్నంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు సొరంగం లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బయటికి వచ్చింది. ఐదో ప్రయత్నంగా సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మరో రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. సొరంగం కూలిన ప్రాంతంలో ఆదివారంతో పోలి్చతే సోమవారం నాటికి మట్టి, శిథిలాల ఎత్తు, పరిమాణం గణనీయంగా పెరిగాయి. దీనితో అక్కడే మరోసారి సొరంగం పైకప్పు కూలి ఉంటుందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. సొరంగం లోపల 200–250 మీటర్ల మేర 15–20 అడుగుల ఎత్తులో మట్టి, శిథిలాలు పేరుకుపోయి ఉన్నట్టు చెబుతున్నారు. నేడు మరో ప్రత్యేక బృందం ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఇతర సిబ్బంది మొత్తం కలిపి మొత్తం 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున విపత్తుల నిర్వహణ, ఉపరితల రవాణా శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం మంగళవారం ఉదయానికల్లా టన్నెల్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. పైనుంచి రంధ్రం చేయడానికి జీఐఎస్ నో ఎల్‌ఎస్‌బీసీ సొరంగాన్ని భూగర్భంలో 400 మీటర్ల దిగువన నిర్మిస్తున్నారు. దీనితో ఆ మేరకు భూఉపరితలం నుంచి సొరంగం వరకు రంధ్రం చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరిపింది. కానీ సొరంగాన్ని పరిశీలించిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) నిపుణుల బృందం ఈ ఆలోచనకు నో చెప్పింది. సొరంగంపై తీవ్ర ఒత్తిడి ఉందని, భూఉపరితలం నుంచి సొరంగం దాకా రంధ్రం వేసేందుకు ప్రయత్నిస్తే మరింతగా కుప్పకూలుతుందని ఐదో రెస్క్యూ బృందంతో కలిసి లోపలికి వెళ్లి వచ్చిన జీఎస్ఐ జియాలజిస్టులు తేల్చారు. మట్టి, శిథిలాల తొలగింపుపై రెస్క్యూ బృందానికి వీరు చేసే సూచనలు కీలకంగా మారనున్నాయి. సొరంగంలోకి రాకపోకలకే 4 గంటలు.. గల్లంతైన కార్మీకుల జాడ దొరక్కపోయినా సొరంగం లోపలి పరిస్థితులపై ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. తొలుత కేవలం లోపలి పరిస్థితిని దూరం నుంచి మాత్రమే అంచనా వేయగలిగామని.. నాలుగు, ఐదో ప్రయత్నంలో సొరంగం కూలిన చోట పేరుకున్న మట్టి, శిథిలాల సమీపం వరకు రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయని వివరించారు. లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లిరావడానికే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోందని వెల్లడించారు. నిరంతరం కొనసాగుతున్న నీటి ఊట సొరంగంలో నీరు నిరంతరం ఊరుతూ, కూలిన ప్రాంతాన్ని నింపేస్తోంది. ఇన్లెట్ నుంచి లోపలికి వెళ్లే నీరు గ్రా>విటీ ద్వారా అవుట్లెట్ వైపు వెళ్లేలా సొరంగాన్ని వాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తవి్వన మేరకు సొరంగం కూలిన ప్రాంతమే చివరిది కావడంతో.. ఊట నీళ్లు అక్కడే పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీనితో నిరంతరంగా ఆ నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. కార్మీకుల కుటుంబాల్లో ఆందోళన.. నేడు సర్కారు కీలక ప్రకటన? ప్రమాదం జరిగి సోమవారం అర్ధరాత్రి సమయానికి సుమారు 65 గంటలు దాటింది. కానీ సొరంగంలో గల్లంతైనవారి జాడ తెలియరాలేదు. దీనితో కార్మీకుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. సోమవారం ఇద్దరు కార్మీకుల కుటుంబ సభ్యులు సొరంగం వద్ద చేరుకుని.. తమవారి సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కార్మీకుల యోగక్షేమాలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సొరంగం లోపలికి డ్రోన్, మినీ జేసీబీ.. నీళ్ల కింద ఉన్న వస్తువులను గుర్తించే సోనార్ టెక్నాలజీ ఆధారంగా కార్మీకుల జాడను తెలుసుకునేందుకు ఆదివారం ప్రయతి్నంచగా.. ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. నీటిలో మనుషుల రక్తం, అవశేషాలను గుర్తించే పోలీసు జాగిలాలు (స్నిఫర్ డాగ్స్)ను సొరంగంలోకి తీసుకెళ్లినా.. ప్రమాద స్థలంలో నీరు, బురద ఉండటంతో ముందుకు వెళ్లలేకపోయాయి. చివరిగా ఐదో రెస్క్యూ బృందంతో ఒక అత్యధునిక డ్రోన్, ఇద్దరు ఆపరేటర్లను సొరంగం లోపలికి పంపించారు. రెస్క్యూ బృందాలు వెళ్లలేని చోట్ల దీనితో జరిపే పరిశీలన ఆధారంగా లోపలి పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక సొరంగం కూలిన చోట పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించడానికి సోమవారం లోకో ట్రైన్ సాయంతో మినీ జేసీబీని లోపలికి పంపించారు. దీనితో మట్టి, శిథిలాల తొలగింపు చర్యల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రమాదంలో దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్‌కి సైతం మరమ్మతులు ప్రారంభించారు. మట్టి, శిథిలాలను కన్వెయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల్లో ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, నాగర్‌కర్నూల్ జిల్లా మాజీ కలెక్టర్ ఇ.శ్రీధర్‌లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం మూడు రోజులుగా సొరంగం వద్ద మకాం వేసి నిరంతరంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ బృందాలతో నిరంతరం సమీక్షిస్తూ.. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తోంది. సొరంగంలోకి ‘ర్యాట్ హోల్ మైనర్స్’ సొరంగంలో సహాయక చర్యల్లో మరో ప్రయత్నంగా మరో రెస్క్యూ బృందం ‘ర్యాట్ హోల్ మైనర్స్’తో కలసి లోపలికి వెళ్లింది. ఉత్తరాఖండ్‌లోని సిలి్కయార సొరంగం 2023 నవంబర్‌లో కుప్పకూలింది. దానిలో లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ బృందం బయటికి తీసుకురాగలిగింది. దీంతో ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యల కోసం ‘ర్యాట్ హోల్ మైనర్స్’ను ప్రభుత్వం రప్పించింది. ఈ బృందం సొరంగంలో, పేరుకుపోయిన మట్టిలో ఎలుక బొరియల తరహాలో రంధ్రాలు చేసి లోపలికి వెళ్లి కార్మీకులను బయటకి తీసుకువచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే సొరంగం రెండో వైపు పూర్తిగా మూతబడి ఉండటం, పెద్ద మొత్తంలో ఊట నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తి ఉండటంతో ‘ర్యాట్ హోల్’ విధానంలో రెస్క్యూ ఆపరేషన్ శ్రేయస్కరం కాదనే భావన వ్యక్తమవుతోంది. అయితే ర్యాట్ హోల్ మైనర్లు సొరంగంలో ఏ వ్యూహాన్ని అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. వారు సొరంగం నుంచి బయటికి వస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. ఇక మంగళవారం ఉదయానికల్లా మరో ‘ర్యాట్ హోల్ మైనర్స్’ బృందం టన్నెల్ వద్దకు చేరుకోంది. -
8 మంది కార్మికులను రక్షిస్తాం
సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట/ చందంపేట: ‘ప్రపంచంలో టన్నెళ్లను నిర్మించడంలో నిపుణులైనవారిని పిలిపించి 8 మంది కార్మికులను రక్షిస్తాం. ఉత్తరాఖండ్‌లో 41 మందిని 17 రోజుల్లో బయటికి తీశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పరిష్కారం చూపిన వారిని ఇక్కడికి రప్పించాం’అని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.సోమవారం ఆయన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదని కేటీఆర్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం, మంత్రులు ఇక్కడే ఉన్నారని, సీఎం రావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే రాలేదని అన్నారు. ‘కాళేశ్వరం కట్టినప్పుడు ఏడుగురు జలసమాధి అయితే మీరు వెళ్లి చూశారా?’అని ప్రశ్నించారు. ‘మీ నాన్నలా ఫామ్‌హౌస్‌లో పండుకోలేదు’అని దుయ్యబట్టారు.26 మంది పసిపిల్లలు ట్రైన్ కింద పడి ముద్దలైతే పక్కనే ఫామ్‌హౌస్‌లో ఉండి కూడా వెళ్లి చూడలేకపోయారని, కొండగట్టు ఘాట్‌రోడ్డు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 66 మంది చనిపోతే ఎవరైనా వెళ్లి పలకరించారా..? అని నిలదీశారు. ‘ప్రతిపక్ష నాయకులుగా మీరు ఎవరైనా వచ్చి పరామర్శించారా? మీకు బాధ్యత లేదా? ఇలాంటి ఘటనలపై విమర్శలు మాని.. సలహాలు, సూచనలు ఇవ్వండి’అని మంత్రి హితవు పలికారు.టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం..: ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఇంకా బతికి ఉన్నారనే ఆశలు ఉన్నాయన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. లోపల ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడామన్నారు. టన్నెల్లో చిక్కుకుపోయిన జావీద్‌కు తాను, అధికారులు ఫోన్ చేశామని, రింగ్ అయి తర్వాత స్విచ్ఆఫ్ వస్తోందని తెలిపారు.అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ నిపుణులను పంపించాలని ఆ సంస్థ యజమానిని కోరామన్నారు. రేపటి కల్లా నీళ్లు తగ్గితే కన్వేయర్ బెల్టు ద్వారా మట్టిని బయటకు పంపించే పనులు మొదలుపెడతామన్నారు. ఈ చర్యలను సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. కాగా, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్ కూడా ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
ఎస్ఎల్బీసీ సొరంగం.. మళ్లీ కూలింది!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలింది! లోపల పేరుకుపోయిన మట్టి, శిథిలాల ఎత్తు మరో మీటరు మేర పెరిగిపోయింది. దానికితోడు నీటి ఊట ఆగకుండా కొనసాగుతోంది. దీనితో సహాయక చర్యల కొనసాగింపు మరింత కష్టంగా మారింది. సొరంగంలో చిక్కుకుపోయిన వారి కోసం చేపట్టిన ఐదో రెస్క్యూ ప్రయత్నమూ విఫలమైంది. దీనితో బాధితుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా కూలిపడటంతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 43.93 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు తవ్వకం పూర్తయింది. అక్కడ పనులు చేస్తుండగా శనివారం ఉదయం 8.30 గంటలకు సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతయ్యారు. వారిని రక్షించడానికి ఆదివారం మధ్యాహ్నం వరకు చేసిన 3 ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. నాలుగో ప్రయత్నంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు సొరంగం లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బయటికి వచ్చింది. ఐదో ప్రయత్నంగా సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మరో రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. సొరంగం కూలిన ప్రాంతంలో ఆదివారంతో పోలి్చతే సోమవారం నాటికి మట్టి, శిథిలాల ఎత్తు, పరిమాణం గణనీయంగా పెరిగాయి. దీనితో అక్కడే మరోసారి సొరంగం పైకప్పు కూలి ఉంటుందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. సొరంగం లోపల 200–250 మీటర్ల మేర 15–20 అడుగుల ఎత్తులో మట్టి, శిథిలాలు పేరుకుపోయి ఉన్నట్టు చెబుతున్నారు. నేడు మరో ప్రత్యేక బృందం ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఇతర సిబ్బంది మొత్తం కలిపి మొత్తం 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున విపత్తుల నిర్వహణ, ఉపరితల రవాణా శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం మంగళవారం ఉదయానికల్లా టన్నెల్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. పైనుంచి రంధ్రం చేయడానికి జీఐఎస్ నో ఎల్‌ఎస్‌బీసీ సొరంగాన్ని భూగర్భంలో 400 మీటర్ల దిగువన నిర్మిస్తున్నారు. దీనితో ఆ మేరకు భూఉపరితలం నుంచి సొరంగం వరకు రంధ్రం చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరిపింది. కానీ సొరంగాన్ని పరిశీలించిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) నిపుణుల బృందం ఈ ఆలోచనకు నో చెప్పింది. సొరంగంపై తీవ్ర ఒత్తిడి ఉందని, భూఉపరితలం నుంచి సొరంగం దాకా రంధ్రం వేసేందుకు ప్రయత్నిస్తే మరింతగా కుప్పకూలుతుందని ఐదో రెస్క్యూ బృందంతో కలిసి లోపలికి వెళ్లి వచ్చిన జీఎస్ఐ జియాలజిస్టులు తేల్చారు. మట్టి, శిథిలాల తొలగింపుపై రెస్క్యూ బృందానికి వీరు చేసే సూచనలు కీలకంగా మారనున్నాయి. సొరంగంలోకి రాకపోకలకే 4 గంటలు.. గల్లంతైన కార్మీకుల జాడ దొరక్కపోయినా సొరంగం లోపలి పరిస్థితులపై ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. తొలుత కేవలం లోపలి పరిస్థితిని దూరం నుంచి మాత్రమే అంచనా వేయగలిగామని.. నాలుగు, ఐదో ప్రయత్నంలో సొరంగం కూలిన చోట పేరుకున్న మట్టి, శిథిలాల సమీపం వరకు రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయని వివరించారు. లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లిరావడానికే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోందని వెల్లడించారు. నిరంతరం కొనసాగుతున్న నీటి ఊట సొరంగంలో నీరు నిరంతరం ఊరుతూ, కూలిన ప్రాంతాన్ని నింపేస్తోంది. ఇన్లెట్ నుంచి లోపలికి వెళ్లే నీరు గ్రా>విటీ ద్వారా అవుట్లెట్ వైపు వెళ్లేలా సొరంగాన్ని వాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తవి్వన మేరకు సొరంగం కూలిన ప్రాంతమే చివరిది కావడంతో.. ఊట నీళ్లు అక్కడే పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీనితో నిరంతరంగా ఆ నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. కార్మీకుల కుటుంబాల్లో ఆందోళన.. నేడు సర్కారు కీలక ప్రకటన? ప్రమాదం జరిగి సోమవారం అర్ధరాత్రి సమయానికి సుమారు 65 గంటలు దాటింది. కానీ సొరంగంలో గల్లంతైనవారి జాడ తెలియరాలేదు. దీనితో కార్మీకుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. సోమవారం ఇద్దరు కార్మీకుల కుటుంబ సభ్యులు సొరంగం వద్ద చేరుకుని.. తమవారి సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కార్మీకుల యోగక్షేమాలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సొరంగం లోపలికి డ్రోన్, మినీ జేసీబీ.. నీళ్ల కింద ఉన్న వస్తువులను గుర్తించే సోనార్ టెక్నాలజీ ఆధారంగా కార్మీకుల జాడను తెలుసుకునేందుకు ఆదివారం ప్రయతి్నంచగా.. ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. నీటిలో మనుషుల రక్తం, అవశేషాలను గుర్తించే పోలీసు జాగిలాలు (స్నిఫర్ డాగ్స్)ను సొరంగంలోకి తీసుకెళ్లినా.. ప్రమాద స్థలంలో నీరు, బురద ఉండటంతో ముందుకు వెళ్లలేకపోయాయి. చివరిగా ఐదో రెస్క్యూ బృందంతో ఒక అత్యధునిక డ్రోన్, ఇద్దరు ఆపరేటర్లను సొరంగం లోపలికి పంపించారు. రెస్క్యూ బృందాలు వెళ్లలేని చోట్ల దీనితో జరిపే పరిశీలన ఆధారంగా లోపలి పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక సొరంగం కూలిన చోట పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించడానికి సోమవారం లోకో ట్రైన్ సాయంతో మినీ జేసీబీని లోపలికి పంపించారు. దీనితో మట్టి, శిథిలాల తొలగింపు చర్యల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రమాదంలో దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్‌కి సైతం మరమ్మతులు ప్రారంభించారు. మట్టి, శిథిలాలను కన్వెయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల్లో ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, నాగర్‌కర్నూల్ జిల్లా మాజీ కలెక్టర్ ఇ.శ్రీధర్‌లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం మూడు రోజులుగా సొరంగం వద్ద మకాం వేసి నిరంతరంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ బృందాలతో నిరంతరం సమీక్షిస్తూ.. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తోంది. సొరంగంలోకి ‘ర్యాట్ హోల్ మైనర్స్’ సొరంగంలో సహాయక చర్యల్లో మరో ప్రయత్నంగా మరో రెస్క్యూ బృందం ‘ర్యాట్ హోల్ మైనర్స్’తో కలసి లోపలికి వెళ్లింది. ఉత్తరాఖండ్‌లోని సిలి్కయార సొరంగం 2023 నవంబర్‌లో కుప్పకూలింది. దానిలో లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ బృందం బయటికి తీసుకురాగలిగింది. దీంతో ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యల కోసం ‘ర్యాట్ హోల్ మైనర్స్’ను ప్రభుత్వం రప్పించింది. ఈ బృందం సొరంగంలో, పేరుకుపోయిన మట్టిలో ఎలుక బొరియల తరహాలో రంధ్రాలు చేసి లోపలికి వెళ్లి కార్మీకులను బయటకి తీసుకువచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే సొరంగం రెండో వైపు పూర్తిగా మూతబడి ఉండటం, పెద్ద మొత్తంలో ఊట నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తి ఉండటంతో ‘ర్యాట్ హోల్’ విధానంలో రెస్క్యూ ఆపరేషన్ శ్రేయస్కరం కాదనే భావన వ్యక్తమవుతోంది. అయితే ర్యాట్ హోల్ మైనర్లు సొరంగంలో ఏ వ్యూహాన్ని అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. వారు సొరంగం నుంచి బయటికి వస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. ఇక మంగళవారం ఉదయానికల్లా మరో ‘ర్యాట్ హోల్ మైనర్స్’ బృందం టన్నెల్ వద్దకు చేరుకోంది. -
SLBC టన్నెల్ ప్రమాదంపై కేటీఆర్ ట్వీట్
-
SLBC సొరంగంలో పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి జూపల్లి
-
ఎన్నికలే ముఖ్యమా రేవంత్.. SLBC వద్దకెళ్లే తీరక లేదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ(SLBC) టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? అని ప్రశ్నించారు. సహాయక చర్యలు కొల్లికి రాకముందే వారు బతికుండే అవకాశమే లేదనడం సర్కార్ చేతులెత్తేసిన తీరును నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్..‘టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయమే. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్‌నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుంది?. రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుంది?.ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు వెళ్లే సమయం లేదా?. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా?. ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా?. ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి!! సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా?.రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్‌కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెడతారు. జై తెలంగాణ అంటూ’ కామెంట్స్ చేశారు.SLBC టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమే.. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది ? రెస్క్యూ ఆపరేషన్ ఎలా…— KTR (@KTRBRS) February 24, 2025 -
SLBC టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
టన్నెల్ లో పరిస్థితి ఘోరం.. 50 మీటర్లు మించి వేళ్లలేకపోతున్న ఆర్మీ, NDRF సిబ్బంది
-
టన్నెల్ తవ్వే మెషీన్ పనికొస్తుందో లేదో చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపడటంతో మట్టి, శిథిలాల కింద కూరుకుపోయిన టన్నెల్ బోర్ మెషీన్ (టీబీఎం) పరిస్థితి ఏమిటనే సందేహాలు వస్తున్నాయి. ప్రమాదంలో టీబీఎంకు బాగా నష్టం జరిగితే పనికిరాకుండా పోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెస్క్యూ శ్రీ ఆపరేషన్ తర్వాత తిరిగి టన్నెల్ తవ్వకం పనులు కొనసాగాలంటే టీబీఎం యంత్రం పనిచేయాల్సిందే. దీనిపై జేపీ అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ గౌర్‌ను ‘సాక్షి’ప్రశ్నించగా.. టీబీఎం పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. మట్టి, శిథిలాలు తొలగించి పరీక్షించిన తర్వాతే మెషీన్ పనికి వస్తుందా? లేదా? అన్నది గుర్తించగలమని చెప్పారు. అందుకు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేమన్నారు. ప్రస్తుతానికి సొరంగంలో చిక్కుకున్నవారిని బయటికి తేవడమే తమ ధ్యేయమని తెలిపారు. సమస్యలన్నీ అధిగమించి సొరంగం నిర్మాణ పనులను పునరుద్ధరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
సహాయక చర్యలకు నీటి లీకేజీ అడ్డంకి..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సహాయక చర్యలకు భారీగా వస్తున్న నీటి ఊట అడ్డంకిగా మారుతోందని తెలిపారు. ఆ నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తూనే.. లోపలున్న వారికోసం నిరంతరం ఆక్సిజన్‌ను పంపింగ్ చేస్తున్నామని వివరించారు. ఉత్తమ్ ఆదివారం మంత్రి జూపల్లితో కలసి టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘టన్నెల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది.రాతిపొరలు వదులై మట్టి కూలడంతో అక్కడి నుంచి కూడా నీరు వస్తుండటంతో అంతా బురదమయంగా మారింది. రెస్క్యూ ఆపరేషన్‌కు సవాలుగా మారుతోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు సాంకేతిక నిపుణులు 24 గంటలపాటు ప్రయత్నిస్తున్నారు. భారీ యంత్రాలను టన్నెల్లోకి పంపి రక్షించే పరిస్థితి లేదు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. మట్టికుప్పలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలను సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కూడా సీఎంతో మాట్లాడారు..’’అని ఉత్తమ్ తెలిపారు. ఘటనపై బీఆర్ఎస్ రాజకీయం.. ప్రమాదం విషయం తెలియగానే ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించిందని, ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఈ ఘటనపై చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. టన్నెల్ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. -
రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ(SLBC Tunnel) సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్(Rat Hole Miners)ను రంగంలోకి దింపింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ సిల్క్ యారా సొరంగం కుప్పకూలి లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులను.. ఈ ర్యాట్ హోల్ మైనర్స్ 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీరికోసం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ప్రత్యేకంగా రప్పించింది.నసీం, ఖలీల్ ఖురేషీ, మున్నా, మహమ్మద్ రషీద్, ఫిరోజ్ ఖురేషీ, మహమ్మద్ ఇర్షాద్.. ఈ ఆరుగురితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం ఢిల్లీ నుంచి ఆదివారం రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సోమవారం ఉదయం వారు ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకుని, లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేపట్టనున్నారు.కేవలం ఒక్కరోజులో బయటికి తెచ్చి..: 2023 నవంబర్ 13న సిల్కియారా సొరంగం ముఖ ద్వారం కుప్పకూలడంతో 41 మంది లోపల చిక్కుకున్నారు. అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని బయటకు తీసుకురాలేకపోయారు. చివరికి ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్‌ను రంగంలో దింపింది. వారు కేవలం ఒక్క రోజులోనే కారి్మకులను సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకున్న బృందమే ఉత్తరాఖండ్ ఆపరేషన్‌లో పాల్గొనడం గమనార్హం. ఏమిటీ ర్యాట్ హోల్ మైనింగ్? మేఘాలయ వంటి రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బోరియలు చేసినట్లుగా రంధ్రాలు తవ్వి.. భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ జీవనోపాధి కోసం వందల మంది ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు ర్యాట్ హోల్ మైనింగ్ అక్రమమని, సురక్షితం కాదని కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు వారే సహాయక చర్యలకు దిక్కుకానున్నారు. -
సొరంగంలో ఆశలు గల్లంతు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్/ సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. కార్మీకులను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు ఆదివారం రోజంతా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రమాదం జరిగి 40 గంటలైనా కార్మీకుల జాడగానీ, వారి యోగక్షేమాలుగానీ తెలియకపోవడంతో... వారు సురక్షితంగా బయటపడే అవకాశం తక్కువనే చర్చ జరుగుతోంది. ఆదివారం ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలతో కలసి లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లి.. సుమారు 6 గంటల తర్వాత తిరిగి వచి్చన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా.. పరిస్థితి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. సొరంగం లోపలి వరకు వెళ్లి బయటికి వచి్చనవారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిన చోట దాదాపు 200 మీటర్ల మేర మట్టి, బురద నీరు, శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో 12 కిలోమీటర్ల వద్ద సైతం మోకాలి లోతు నీళ్లు ఉన్నాయి. కూలిన మట్టి, శిథిలాలను తొలగిస్తేగానీ గల్లంతైన కార్మికులను చేరుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలేమీ ప్రారంభం కాలేదు. ఏదైనా అద్భుతం జరిగితే కానీ.. సొరంగం లోపల పరిస్థితి భీతావహంగా ఉండటం, మళ్లీ పైకప్పు కూలవచ్చనే ఆందోళనల నేపథ్యంలో రెస్క్యూ కష్టసాధ్యంగా మారింది. దోమలపెంట వద్దనున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ఒక్క లోకో ట్రైన్ మాత్రమే ఆధారం. దాని ద్వారా 12.6 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది. అక్కడి నుంచి కన్వేయర్ బెల్టు మీద లోపలికి చేరుకోవాల్సి వస్తోంది. సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం వరకే సహాయక బృందాలు వెళ్లగలిగాయి. శిథిలాలు కొట్టుకురావడంతో వాటిని తొలగించకుండా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నీటి ఊటను మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. నిమిషానికి 10 వేల లీటర్ల నీటిని ఎత్తిపోసే మోటార్లను వినియోగిస్తున్నారు. లోపలికి వెళ్లి బయటికి వచి్చన రెస్క్యూ బృందాలతో ‘సాక్షి’ మాట్లాడింది. గల్లంతైన కార్మీకుల మీద కాంక్రీట్ సెగ్మెంట్లు, మట్టి, శిథిలాలు పడి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. లేదా వారు సొరంగం కూలిన ప్రాంతానికి ఆవలివైపు చిక్కుకుని ఉన్నా.. రెండు వైపులా మూతపడి ఉండటంతో ఆక్సిజన్ లభించడం కష్టమేనని భావిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సొరంగం కూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం దాకా వెళ్లిన రెస్క్యూ సిబ్బంది.. కార్మికులను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని అంటున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. ఎస్ఎల్బీసీ సొరంగం–1 ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల శనివారం ఉదయం 8.30 గంటలకు పైకప్పు కూలిపడింది. ఆదివారం అర్ధరాత్రి సమయానికి 40 గంటల కీలక సమయం గడిచిపోయింది. దీనితో కార్మీకుల క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, అగ్నిమాపక శాఖ, ఆర్మీకి చెందిన రెస్క్యూ సిబ్బంది మూడు వేర్వేరు బృందాలుగా ఏర్పడి సొరంగం లోపలికి లోకో ట్రైన్ ద్వారా వెళ్లారు. వారు తిరిగి వచ్చి గల్లంతైన కార్మీకుల యోగక్షేమాల గురించి చెబుతారేమోనని.. సొరంగం బయట అధికారులు, నేతలు, మీడియా ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ మంత్రితోపాటు రెస్క్యూ సిబ్బంది నిరాశ వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ఆర్మీ ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ బైసన్ డివిజన్‌కు చెందిన ఇంజనీర్ టాస్‌్కఫోర్స్ (ఈటీఎఫ్) ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ వైద్య బృందాలను సైతం టన్నెల్ వద్ద అందుబాటులో ఉంచారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తున్నారు.శిథిలాలు, బురద తొలగించేదెలా?సొరంగం కూలిపడి పేరుకుపోయిన మట్టిని, శిథిలాలను తొలగించనిదే కార్మీకుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకోలేని పరిస్థితి. కానీ నీటి ఊటల కారణంగా.. మట్టిని తొలగించిన కొద్దీ పైకప్పు మళ్లీ కూలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సొరంగం భూఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల దిగువన ఉందని, కూలిన చోట మట్టిని తీసినకొద్దీ.. పైన వదులుగా ఉన్న మట్టి మళ్లీ సొరంగంలోకి పడిపోతుందని రెస్క్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సొరంగంపైన భూమి ఉపరితలం నుంచి డ్రిల్లింగ్ చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపినా.. 400 మీటర్ల లోతున రంధ్రం చేయడానికి చాలా రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సొరంగంలో పేరుకున్న మట్టి, నీళ్లు, ఇతర శిథిలాలను తొలగించేందుకూ కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.పైకప్పు కూలిన చోట.. కాంక్రీట్ సెగ్మెంట్ లేదు! సొరంగంలో ప్రమాదం జరిగిన చోట పైకప్పుకు రక్షణగా కాంక్రీట్ సెగ్మెంట్లు లేవని తెలిసింది. టన్నెల్ చివరన పనులు జరిగిన చోట సుమారు 100 మీటర్ల మేర కాంక్రీట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేయలేదని సమాచారం. అంతేగాకుండా సొరంగంలో నాలుగేళ్లుగా నీటి ఊటలు (సీపేజీ) కొనసాగుతుండటంతో మట్టి వదులుగా మారడం, తవ్వకం పనుల్లో రక్షణ గోడ నిర్మించకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో పైకప్పు కుప్పకూలిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటేనే.. సొరంగం లోపల చిక్కుకున్న కార్మీకులను బయటికి తెచ్చేందుకు ఏదైనా వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఆచరణలో పెడితేనే ఫలితమిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక వ్యూహం లేకుండా రెస్క్యూ బృందాలు లోపలి వరకు వెళ్లి వచి్చనట్టు తెలిసింది. సొరంగంలో పేరుకున్న మట్టిని తొలగించి కన్వేయర్ బెల్టుల ద్వారా, లేదా లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపితే గానీ చిక్కుకున్న కార్మీకుల జాడ కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. అడ్డంకులన్నీ అధిగమించి కార్మీకులను చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టీబీఎం మెషీన్ దగ్గరికి చేరుకోవడమే కష్టంగా ఉంది సొరంగంలో పైకప్పు కూలిన చోట ఉన్న టీబీఎం మెషీన్ వద్దకు చేరుకోవడమే కష్టంగా ఉంది. ఇప్పటివరకు రెండు సార్లు లోపలికి వెళ్లి వచ్చాం. మెషీన్ వద్ద 200 మీటర్ల దాకా భారీగా బురద పేరుకుని ఉంది. దాన్ని దాటడం వీలుపడటం లేదు. టన్నెల్ పైకప్పు మళ్లీ కుంగకుండా సేఫ్టీ కోసం రాక్ బోల్టింగ్ చేస్తున్నాం. నీటి తొలగింపు కొనసాగుతోంది. – కలేందర్, సింగరేణి మైనింగ్ సేఫ్టీ సూపర్వైజర్ వారి జాడ కనిపించలేదు.. టన్నెల్లో భారీగా మట్టి, శిథిలాలు పేరుకుపోవడంతో మెషీన్ దగ్గరికి వెళ్లేందుకు కుదరడం లేదు. చిక్కుకున్న వారి జాడ ఏదీ కనిపించలేదు. ఎలాంటి అరుపులు సైతం వినిపించలేదు. – రాందేవ్, సుబేదార్, ఆర్మీ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది టన్నెల్ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది. 200 నుంచి 500 మీటర్ల మధ్య టన్నెల్ బోరింగ్ మెషీన్ బురదలో కూరుకుపోయింది. 35 మందిమి సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి తీసుకొని వెళ్లాం. రాత్రంతా కష్టపడి దగ్గరకు చేరుకోగలిగాం. – రవినాయక్, ఎన్డీఆర్ఎఫ్ టీం, విజయవాడ పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి.. మేం పనుల కోసం టన్నెల్ చివరికి చేరుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి. సిమెంట్ దిమ్మెలు కూలి, పెద్ద ఎత్తున మట్టి కుంగింది. మేమంతా భయంతో వెనక్కి పరుగెత్తుకు వచ్చాం. చేతులు, కాళ్లు, ముఖానికి చిన్న గాయాలయ్యాయి. – చమేల్ సింగ్, ప్రమాదం నుంచి బయటపడిన ఫోర్‌మెన్ ఏం జరుగుతోందో అర్థం కాలేదు శనివారం ఉదయం టన్నెల్లో ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు కొందరు మెషీన్ వైపు ఉన్నా, ఏమీ చేయలేక భయంతో వెనక్కి వచ్చాం. వాళ్లు మట్టి, బురదలో మునిగారు. ప్రాణాలతో బయటికి వస్తారో, లేదో తెలియదు. – ఎడుమలై, ప్రమాదం నుంచి బయటపడ్డ కన్వేయర్ బెల్ట్ ఫోర్‌మెన్ మా వాళ్ల పరిస్థితి ఏంటో తెలియదు.. టీబీఎం ముందు భాగంలో 8 మంది ఉన్నారు. మేం వెనక భాగంలో ఉన్నాం. ఒక్కసారిగా పైకప్పు కూలడంతో భయాందోళన నెలకొంది. మాతో కలసి పనిచేసే వాళ్ల పరిస్థితి ఏమిటో తెలియదు. చాలా బాధగా ఉంది. – జగదీశ్ పాండా, ప్రమాదం నుంచి బయటపడ్డ మెకానికల్ ఫోర్‌మెన్ -
టన్నెల్ ప్రమాదం.. వారి పరిస్థితి ఆశాజనకంగా లేదు: మంత్రి జూపల్లి
సాక్షి, నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలోకి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్ లోకి వెళ్లిన మంత్రి.. దాదాపు ఐదు గంటల పాటు సొరంగంలోనే గడిపారు. స్వయంగా సహాయక చర్యల్లో పాలు పంచుకుని తిరిగి బయటికి వచ్చారు. ప్రమాద స్థలం దగ్గర నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఇంటర్ కాం ఫోన్లో మంత్రి జూపల్లి మాట్లాడారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు.ప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఇంజనీరింగ్, సహాయక బృందాలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బయట నుంచి ప్రమాదస్థలికి సొరంగంలో మధ్య దూరం 13.5 కి.మీ. సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో రెండు మూడు గంటల సమయం పడుతుందన్నారు.. ‘‘100 మిటర్లలోనే సమస్య ఉంది. నీరు, బురద ఎక్కువగా ఉంది. రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది’’ అని మంత్రి పేర్కొన్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 33 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లగలిగాయి. 50 మీటర్లకు మించి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది వెళ్లలేకపోతున్నాయి. భారీగా మట్టి, బురద పేరుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో నేవీ సిబ్బంది కూడా పాల్గొనున్నారు. రాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు నేవీ బృందం చేరుకోనున్నారు.శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. -
ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్
-
ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే?
-
ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లోకి నేవీ సిబ్బంది
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. 36 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువగా వెళ్లగలిగిన ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్50 మీటర్లకు మించి ెవెళ్లలేకపోతున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎప్, ైహైడ్రా సిబ్బందిాభారీగా మట్టి, బురద ేపేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకంప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లోకి నేవీ సిబ్బందిరాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు చేరుకోనున్న నేవీ సిబ్బందిసహాయక చర్యలు కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం ఎస్ఎల్బీసీ సొరంగంలో మంత్రి జూపల్లి కృష్ణారావుఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్ లో టన్నెల్ లోకి వెళ్లిన మంత్రిమధ్యాహ్నం 1 గంట నుంచి ఆరు గంటలుగా సొరంగంలోనే జూపల్లిప్రమాద స్థలం దగ్గర నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఎజెన్నీ ప్రతినిధులతో ఇంటర్ కాం ఫోన్ లో మాట్లాడిన మంత్రి జూపల్లిస్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న మంత్రిసోరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న మంత్రిప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రిఇంజనీరింగ్, సహాయక బృందాలకు మంత్రి దిశానిర్ధేశంబయట నుంచి ప్రమాదస్థలికి సొరంగంలో మధ్య దూరం 13.5 కి.మీరెస్క్యూ బృందంలో ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలుటన్నెల్ సైట్ దగ్గర 23 మంది ఆర్మీ నిపుణులుఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలుప్రమాద స్థలిలో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉంది: కలెక్టర్ సంతోష్రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లేందుకు ఆటంకం ఏర్పడిందిభారీ మోటార్ల ద్వారా నీటిని బయటకి పంపుతున్నాంప్రమాదంలో చిక్కుకున్న వారి కనెక్టివిటీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ావాడుతున్నాం రేవంత్‌కు రాహుల్ ఫోన్..SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీసొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరాదాదాపు 20 నిమిషాలు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివెంటనే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో తెలిపిన సీఎంమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంఘటన స్థలానికి చేరుకొని తరలించడం, NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్లను మోహరించామన్న రేవంత్గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్న సీఎంప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను అభినందించిన రాహుల్ గాంధీ మంత్రి ఉత్తమ్ కామెంట్స్.. టన్నెల్ చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. రాత్రి నుంచి కేంద్ర బృందాలు రాష్ట్ర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 14 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళగలిగాం. టెన్నెల్ బోర్ మెషిన్ లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. టన్నెల్ నీటిమయం..ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, సీనియర్ ఐఏఎస్ శ్రీధర్.మరోసారి తన లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందం.12వ కిలోమీటర్ నుంచి పూర్తిగా బురదమయం.నీటితో కూడుకున్న టన్నెల్.నీటిని బయటికి తీసేందుకే సమాలోచనలు.నీరంతా బయటకి తోడిన తర్వాతే భవిష్యత్తు సహాయక చర్యలు చేపట్టే అవకాశం.వారంతా ప్రాణాలతో ఉన్నారా? లేదా?లోపలికి ఆక్సిజన్ అందుతోందా?.అనే అనుమానాలు వ్యక్తమువుతున్నాయి. రాత్రి పరిస్థితి ఇది..👉ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న రాత్రి 12 గంటలకు వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల లోపలికి వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్బంగా మోకాళ్ల లోతు బురద ఉన్నట్టు వారు గుర్తించారు. 👉ఇక, ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. చిక్కుకున్నది వీరే.. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్ఈ), రోజువారీ కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్‌సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడిన వారు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే.మంత్రుల పర్యవేక్షణ..👉మరోవైపు.. దోమలపెంట వద్దకు నేడు మంత్రులు ఉత్తమ్, జూపల్లి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షించనున్నారు.ఇటీవలే పనులు పునః ప్రారంభమై... 👉శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. 👉ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. 👉శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్‌బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్‌కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్‌కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా..👉సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. -
కొత్త లిఫ్టులతో 62 వేల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: దేవరకొండ, మిర్యాలగూడ నియోజక వర్గాల్లోని కొత్త ఎత్తిపోతల పథకాలతో మొత్తం 62,742 ఎక రాలకు సాగునీరు అందుతుందని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కృష్ణా, మూసీ నుండి నీళ్లను తరలించడం ద్వారా కొత్త ఆయకట్టు సృష్టించడంతో పాటు ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టులు దోహదప డతాయని చెప్పారు. ఈ నియోజకవర్గాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై బుధవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వ హించారు. కొత్త ఎత్తిపోతల జాబితాలో దేవర కొండలోని పొగిళ్ల, కంబాలపల్లి, అంబభవాని, ఏకేబీఆర్, పెద్దగట్టు లిఫ్టులు, మిర్యాలగూడలో దున్నపోతులగండి– బాల్నేపల్లి – చంప్లతండా, టోపుచెర్ల, వీర్లపాలెం, కేశవాపూర్ – కొండ్రాపూర్ ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటితో 47,708 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని చెప్పారు. 2026 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయాలిశ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనుల ను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. 30 టీఎంసీలను తరలించడానికి వీలుగా సొరంగం పనులను వేగవంతం చేయాలన్నారు. మొత్తం 44 కి.మీ సొరంగంలో 9.55 కి.మీలు ఇంకా పెండింగ్‌లో ఉందని, టన్నెల్ బోర్ మిషన్‌కు అవసరమైన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రికి తెలి పారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మధ్యవర్తిత్వ పర్యవేక్షణ లేకుండా నిర్మించిన అతిపెద్ద సాగునీటి సొరంగంగా ఇది మారుతుందని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.4,637 కోట్లతో సవరించిన అంచనాలకు పరిపాలన అనుమతి జారీ చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ ప్రభావిత నల్లగొండ జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. చెక్‌డ్యామ్‌ల కుంభకోణంపై విచారణగత ప్రభుత్వంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో అవకతవకతలు జరిగాయని, పెద్ద సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు దెబ్బతిన్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణకు మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నీటి లభ్యత, సామర్థ్యంపై సరైన అంచనా లేకుండా చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో అవి దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. కాగా సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులను పూర్తి చేసి పటిష్టం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, బి.లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
ఇక సాఫీగా సొరంగం పనులు!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాలపై ఆధారపడి చేపట్టిన ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులకు కరెంట్ కష్టాలు తొలగనున్నాయి. ఇన్లెట్ సొరంగంలోకి చేరే నీటిని తొలగించడానికి (డీ వాటరింగ్) అయ్యే కరెంటు చార్జీలను ఇకపై ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో సొరంగం పనులు సాఫీగా ముందుకు సాగేందుకు మార్గం సుగమం అయ్యింది. గడిచిన రెండేళ్లుగా నీటిని తోడుతున్న ఏజెన్సీ కరెంట్ బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తోంది. ఈ కారణంగా టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో, సొరంగం పనులు ముందుకు సాగడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వలు సమృధ్ధిగా పెరగడంతో అటువైపుగా ఉన్న ఇన్లెట్ సొరంగంలోకి భారీగా నీరు చేరింది. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)కు ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మరో 10 కిలోమీటర్లు తవ్వాలి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పదిహేనేళ్లయినా సరి గా ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టును 2005లో రూ.2,813 కోట్లతో చేపట్టగా, 15 ఏళ్లయినా పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం రూ.3,152 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. ఒక సొరంగం పూర్తి కాగా రెండో టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.93 కి.మీ. కాగా, మరో 10.10 కి.మీలకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. అయితే ఈ టన్నెల్ తవ్వకానికి శ్రీశైలం ప్రాజెక్టులో చేరే నీటి నిల్వలతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గడిచిన రెండేళ్లుగా ప్రాజెక్టుకు విపరీతమైన వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండి ఇన్లెట్ టన్నెల్లోకి భారీగా సీపేజీ నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిల్వ ఎక్కువ ఉన్నప్పుడు నిమిషానికి 5 వేల నుంచి 7 వేల లీటర్ల మేర నీరు ఉబికి వస్తోంది. దీంతో రెండు, మూడు స్టేజీల్లో 20 హెచ్‌పీ, 30 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. దీంతో నెలకు రూ.2 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఏజెన్సీ బిల్లులు చెల్లించడంలో విఫలమవుతోంది. ఇప్పటికి రూ.58 కోట్ల మేర బిల్లులు (ఇరిగేషన్ శాఖ నుంచి ఏజెన్సీకి రావాల్సినవి) పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో డీ వాటరింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. రెండేళ్లుగా సొరంగం తవ్వకం పనులు కూడా నిలిచిపోయాయి. టీబీఎంకు ముప్పు నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ ప్రక్రియ జరగక, ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో టన్నెల్లో నీటిమట్టం పెరుగుతోంది. ఇది మరింత పెరిగితే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న టీబీఎం మునగడం ఖాయం. ఇదే జరిగితే టీబీఎం ముఖ్యమైన పరికరాలతోపాటు విద్యుత్ వ్యవస్థ, కన్వేయర్ వ్యవస్థలు బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో భారీ ఆర్థిక నష్టంతో పాటు పనులు కొనసాగించేందుకు మరింత గడువు అవసరమవు తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం కేబినెట్ భేటీ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఈ అంశాన్ని ప్రభు త్వం దృష్టికి తెచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన కేబినెట్ ఇకపై ఏజెన్సీ కాకుండా ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని, కరెంట్ కట్ చేయరాదని విద్యుత్ శాఖను ఆదేశించింది. టన్నెల్ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖకు సూచించింది. కాగా ఎస్ఎల్బీసీ టన్నెల్, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు జి. దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్‌ప్రసాదరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డిండి ఎత్తిపోతలను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. -
విత్తన సదస్సుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ నుంచి జులై మూడు వరకు హైదరాబాద్‌లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం దానిపై ఏర్పాటైన కార్యనిర్వాహక కమిటీ తొలి సమావేశం జరిగింది. సాధ్యమైనంత త్వరలో పనులన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నందున భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ విత్తన పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సదస్సులో భారతదేశం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. ఎఫ్ఏవో సహకారంతో సదస్సుకు ముందు జూన్ 24, 25 తేదీలలో ఆఫ్రికా దేశాల విత్తన ప్రతినిధులతో విత్తనోత్పత్తిపై ప్రత్యేక సదస్సు ఉంటుందని, దీనికి తెలంగాణ విత్తన పరిశ్రమ నుంచి కూడా విత్తన ప్రతినిధులు పాల్గొంటున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. విత్తన ఎగుమతులు, దిగుమతులకు మంచి వేదిక కానున్నదన్నారు. జూన్ 27న విత్తన రైతుల ప్రత్యేక సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విత్తనోత్పత్తి, విత్తన నాణ్యతపై రైతులకు మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, తెలంగాణ నుంచి 1500మంది విత్తన రైతులు, గుజరాత్, కర్ణాటకలకు చెందిన విత్తన రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు. అంతర్జాతీయ విత్తన సదస్సు ముఖ్యాంశాలు.. విశేషాలు - వేదిక – హెచ్ఐసీసీ, నోవాటెల్, హైదరాబాద్ - ప్రపంచంలో విత్తన నాణ్యత ఎలా ఉందనే అంశంపై చర్చలు - తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులకు ప్రోత్సాహకం - జూన్ 26 నుంచి 28 వరకు విత్తన ప్రదర్శన - జూన్ 27న తెలంగాణ విత్తన రైతుల ప్రత్యేక సమావేశం - 70 దేశాల నుంచి 800 మంది విత్తన ప్రముఖులు - ఆఫ్రికా ఖండపు దేశాల ప్రతినిధులతో తెలంగాణ విత్తన పరిశ్రమ ప్రతినిధుల ప్రత్యేక సమావేశం - 94 ఏళ్ల ఇస్టా చరిత్రలో తొలిసారిగా ఆసియా ఖండంలో హైదరాబాద్‌లోనే నిర్వహణ - సదస్సుకు నోడల్ ఆఫీసర్‌గా కేశవులు నియామకం. ఎస్ఎల్బీసీపై వివరణ కోరిన సీఎస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో అవాంతరాలు, ఆగిన పనులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నీటి పారుదల శాఖ నుంచి వివరణ అడిగారు. ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటివరకు జరిగిన పనులు, పెండింగ్ పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరారు. టన్నెల్ పనులు ఏడాదిగా ఆగాయని, దీనికి తోడు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ప్రాజెక్టు అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్న వైనంపై ‘సాక్షి’ప్రచురించిన కథనాలపై ఆయన స్పందించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఇంకా అవసరమైన నిధులు, ఏజెన్సీ ఇదివరకు అడ్వాన్సులు కోరుతూ పెట్టిన అర్జీల అంశాలతో నీటి పారుదల శాఖ నోట్ సిద్ధం చేస్తోంది. పనుల పూర్తికి కనీసం రూ.80కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఏజెన్సీ కోరుతోంది. దీనిపై త్వరలోనే జరిగే కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఎస్ఎల్బీసీ పూర్తికి మరో రెండేళ్లు
సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్బీసీ) సొరంగ పనుల పూర్తికి మరో రెండేళ్లకుపైగా పట్టే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీజలాలను వినియోగించుకొని తెలంగాణలోని అవిభాజ్య మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకున్నది. 2020 అక్టోబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపూర్తి చేసి తీరుతామంటూ పనులు చేపట్టిన జయప్రకాశ్ అసోసియేట్ అనే సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి సొరంగం పనుల్లో ఎప్పుడూ ఓ ఆటంకం ఎదురవుతోంది. తాజాగా టన్నెల్ బోరింగ్ మిషన్ పాడవడంతో దాని మరమ్మతులకు మరో రూ.60కోట్లు అడ్వాన్స్ కోరగా ప్రభుత్వం అందుకు సమ్మతించింది. అవాంతరాలు.. జాప్యం 2004లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు రూ.2,813 కోట్లతో టెండర్లు పిలవగా 2005 ఆగస్టులో రూ.1,925 కోట్లకు జయప్రకాశ్ అసోసియేట్ ఏజెన్సీ పనులు దక్కించుకుంది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదల కారణంగా పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. పనుల ఆలస్యం కారణంగా వ్యయం రూ.4,200 కోట్లకు పెరిగింది. ఇందులో ఇప్పటివరకు రూ.2,200 కోట్లు ఖర్చు చేశారు. మిగతా పనులు కొనసాగుతుండగా, ఇటీవల ఔట్లెట్ టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురైంది. ఈ బోరింగ్ మిషన్ బేరింగ్, కన్వెయర్బెల్టు పాడవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ బోరింగ్ మిషన్ మరమ్మతులకే ఏడు నెలలు పట్టనున్న నేపథ్యంలో డెడ్లైన్లో పనుల పూర్తి సాధ్యమా అన్నదానిపై అనేక సందేహాలున్నాయి. -
రెండున్నరేళ్లు.. 4.5 కిలోమీటర్లు!
• నత్తనడకన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు • ఇంకా రూ.650 కోట్ల పనులు ఎక్కడికక్కడే సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వినియోగించుకుని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందించేం దుకు చేపట్టిన ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ –ఎస్ఎల్బీసీ)’ సొరంగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి పన్నెండేళ్లు గడుస్తున్నా 70% పనులు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. మొత్తం టన్నెల్ పనులు పూర్తయ్యేందుకు మరో ఎనిమిదేళ్లు పట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. 30 టీఎంసీల నీటిని తీసుకునేలా.. ఎస్ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీల నీటిని తీసుకునేలా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారు. 2005 ఆగస్టులో దీనికి టెండర్లు పిలవగా రూ.1,925 కోట్లకు ప్రముఖ కాంట్రాక్టు సంస్థ పనులు దక్కించుకుంది. 2010 నాటికే ఈ పనులను పూర్తి చేయాల్సి ఉన్నా... భూసేకరణ సమస్యలు, వరదలు పనులను ఆలస్యం చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉండగా... మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా.. ఇప్పటికి 27.91 కి.మీ. టన్నెల్ పూర్తయింది. ఏడాదికి 2 కిలోమీటర్ల కన్నా తక్కువే..! రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కిలోమీటర్ల టన్నెల్ పూర్తవగా.. తర్వాత రెండున్నరేళ్లలో తవ్వింది 4.83 కిలోమీటర్లే. అంటే ఏడాదికి సగటున 2 కి.మీ. కన్నా తక్కువగానే పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన మిగతా 15.98 కి.మీ. పనులు జరిగేందుకు మరో 8 ఏళ్లు పడతాయన్నది నీటి పారుదల వర్గాల అంచనా. ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుం డగా... శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు 3 నెలలుగా నిలిచిపోయాయి. కన్వెయర్ బెల్ట్ మార్చా ల్సి ఉండటం, ఇతర యంత్రాలను మార్చాల్సి రావ డంతో వాటిని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. పైగా టన్నెల్ తవ్వకం ఆలస్యమవుతోంది. ఇక నల్లగొండ జిల్లా పరిధిలో తవ్వాల్సిన రెండో సొరంగం పూర్త యినా.. కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం గా ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 1,298.91 కోట్లు ఖర్చు చేయగా.. 67.46 శాతం పనులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రాజెక్టుకు 343.35 కోట్లు కేటాయించినా.. ఎస్కలేషన్ చెల్లింపుల కోసమే రూ.235.16 కోట్లు ఇచ్చారు. మొత్తంగా మరో రూ.635 కోట్ల పనులు పూర్తి చేయాలి. అమెరికా పర్యటన రద్దు..టన్నెల్ ఆసియా సదస్సుకు హాజరు! టన్నెల్ పనులను సీరియస్‌గా తీసుకున్న ప్రభు త్వం... టన్నెల్ పనులు ఎక్కువగా జరుగుతున్న అమెరికాకు ఈఎన్సీ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది. కానీ వీసా సంబం ధిత కారణాలతో అది రద్దయింది. డిజైన్, కన్స్ట్రక్షన్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) ముంబైలో నిర్వహిస్తున్న టన్నెల్– ఆసియా సదస్సుకు ఇంజనీర్ల బృందాన్ని పంపిం ది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు గురువారం ఈఎన్సీ మురళీధర్, నాగార్జున సాగర్ సీఈ సునీల్, ప్రాణహిత సీఈ హరిరామ్, మరో ఇద్దరు ఇంజనీర్లు హాజరయ్యారు. టన్నెల్ నిర్మాణాల్లో తీసుకోవాల్సిన చర్యలు, వేగంగా పనులు వంటి అంశాలపై ఇందులో చర్చించారు.