
నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో భాగంగా చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది.. ఈరోజు(శుక్రవారం) SLBC టన్నెల్‌లో తప్పిపోయిన 8 మంది కార్మికులు ఆచూకీ కోసం ఆపరేషన్ చేపట్టారు.. ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఆపరేషన్ చేపట్టగా.. కొన్ని మీటర్ల లోతులో శకలాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు.
టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేశారు. బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టి జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కొన్ని శకలాలను గుర్తించారు. అవి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు.
.ఈరోజు కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు. ఈ క్రమంలోనే కొన్ని శకలాలు ఆచూకీ లభించింది. దాదాపు మూడు మీటర్ల లోతు మట్టిలో మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించారు.
జీపీఆర్ టెక్నాలజీ ద్వారా..
టన్నెల్ ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) ఆపరేషన్ ఆరంభించింది. దీనిలో భాగంగా భూమిలో కూరుకుపోయి ఉంటే వారి స్థితిని తెలుసుకునేందుకు ఆధునాతన టెక్నాలజీ జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ ద్వారా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ మిషన్ ఆధారంగా ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ ను పూర్తిగా స్కాన్ చేశారు.
మరో రెండు రోజుల్లో పడుతుంది..
ఈ టన్నెల్ చిక్కుకున్న వారి సమాచారం కావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందన్నారు సింగరేణి సీఎండీ బలరాం. ఎస్ ఎల్ బి సి టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుంది సీఎం సింగరేణి సిఎండి బలరాం. ఎన్జిఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించారు, కానీ కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరామన్నారు. అప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment