nagar kurnool
-
హైటెక్ కుర్రాడు..! 14 ఏళ్లకే ఆవిష్కరణలు..
ఎందుకు? ఏమిటి? ఎలా? అనే ఆసక్తి చిన్న వయసులోనే గగన్చంద్రలో మొదలైంది. ఆ ఆసక్తే గగన్‌ను ఆవిష్కరణల బాటలో నడిపిస్తోంది. ‘హైబ్రీడ్ త్రీ ఇన్ వన్’ సైకిల్ రూపకల్పనతో ప్రశంసలు అందుకుంటున్నాడు....సోలార్ విద్యుత్తు, బ్యాటరీ, అవసరమైనప్పుడు పెట్రోల్‌తోనూ నడిచే హైబ్రీడ్ త్రీ ఇన్ వన్ సైకిల్‌కు రూపకల్పన చేశాడు 14 ఏళ్ల గగన్ చంద్ర. ఎలాంటి ఖర్చు లేకుండా బ్యాటరీతో 35 కి.మీ దూరం వరకు ప్రయాణించడంతో పాటు సోలార్ విద్యుత్ సాయంతో రోజంతా ప్రయాణించేలా సైకిల్‌ను రూపొందించాడు.సాధారణ సైకిల్‌కు ఎలక్ట్రికల్ బ్యాటరీ, సోలార్ ప్యానెల్, హబ్ మోటారును అమర్చి హైబ్రీడ్ సైకిల్‌ను తయారుచేశాడు. ఈ సైకిల్‌కు డిజిటల్ స్పీడో మీటర్, సెంట్రల్ లాక్ సిస్టమ్ తోపాటు నావిగేషన్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాడు. అధునాతన వాహనాల మాదిరిగానే ఈ సైకిల్‌కు ఉన్న జీపీఎస్ ద్వారా ఎక్కడి నుంచైనా ట్రాకింగ్ చేయవచ్చు. మొబైల్ వాయిస్ కమాండ్, అలెక్సా ద్వారా మ్యూజిక్, కాల్స్ ఆపరేట్ చేసేలా సైకిల్‌ను రూపొందించాడు. సైకిల్లో కంట్రోల్ బాక్స్‌ను గగన్ సొంతంగా తయారుచేశాడు. అవసరమైన సామాగ్రిని ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. మొత్తం రూ. 20వేల వరకు ఖర్చయిందని, భవిష్యత్తులో ఈ ఖర్చును మరింత తగ్గిస్తాను అంటున్నాడు గగన్.నల్లమల అటవీ ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండల కేంద్రానికి చెందిన గౌరమోని గగన్ చంద్ర 9వ తరగతి విద్యార్థి. ఇటీవల పుదుచ్చేరిలో నిర్వహించిన ‘సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్’లో మూడో బహుమతి అందుకున్నాడు. వివిధ రాష్ట్రాల నుంచి 250 మంది ఈ సైన్స్ ఫేర్‌లో పాల్గొన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించనున్న జాతీయస్థాయి సైన్స్ ఫేర్‌కు ఎంపికయ్యాడు.‘నా కొడుకు రెండో తరగతి నుంచే పాత వస్తువులతో ప్రయోగాలు చేసేవాడు. వాడి పడేసిన వస్తువులతో లైట్లు, మోటార్లు, కూలర్లు తయారు చేసేవాడు. ఇల్లు చిన్నగా ఉండటంతో వాటిని పడేసేదాన్ని. అప్పుడప్పుడూ కోపడ్డాను. ఇప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉంది’ అంటుంది గగన్ తల్లి నాగరాణి.ఇక ఎలక్ట్రికల్ కారు ఎలక్ట్రికల్ సైకిల్ కొనేందుకు వెళ్తే అరవై వేలు చెప్పారు. దాంతో నేనే ఇరవై వేలతో సొంతంగా తయారుచేసుకున్నాను. విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంకా తక్కువ ఖర్చులో అయ్యేలా చూస్తాను. భవిష్యత్తులో ఎక్కువ మంది ప్రయాణించేలా, తక్కువ ఖర్చులో ఎలక్ట్రికల్ కారును రూపొందించాలనుకుంటున్నాని చెబుతున్నాడు గగన్ చంద్ర.–పాదం వెంకటేశ్, సాక్షి, నాగర్‌కర్నూల్ (చదవండి: ఊబకాయం సమస్యకి వంటనూనె కారణమా..? మోదీ అందుకే అలా ..) -
‘మైనింగ్’ అనుమతులు రద్దు చేయండి
బల్మూర్/వెల్దండ: మైనింగ్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని మైలారం గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో రోడ్డెక్కారు. వివరాల్లోకి వెళితే.. మైలారం గుట్టపై సర్వే నంబర్ 121లోని 35 ఎకరాల్లో మైనింగ్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి గ్రామంలో రిలే దీక్షలు చేపట్టేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు కొందరిని ముందస్తుగా అరెస్టు చేశారు. మరోవైపు గ్రామస్తుల ఆందో ళనకు మద్దతు ప్రకటించేందుకు, మైలారం గుట్టను పరిశీలించడానికి ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వస్తుండగా.. వెల్దండలో పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు.దాదాపు గంటసేపు వారిని స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలియగానే కోపోద్రిక్తులైన గ్రామస్తులు ప్రధాన రహదారిపై ముళ్ల కంచె వేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ గ్రామస్తులను విడుదల చేయడంతోపాటు గ్రామానికి ఎమ్మెల్యే వచ్చి..మైనింగ్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గుట్టపై ప్రజాభిప్రాయం లేకుండానే మైనింగ్ తవ్వకాలకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని నిలదీశారు. ఆరు గంటలపాటు ఉద్రిక్తత ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఐ రవీందర్, ఎస్ఐ రమాదేవి ఆధ్వర్యంలో లింగాల, ఉప్పునుంతల, అమ్రాబాద్, అచ్చంపేట, సిద్దాపూర్ పోలీసులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మైలారం గ్రామం మీదుగా అప్పాయిపల్లి, అంబగిరి, చెన్నంపల్లి గ్రామాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత గ్రామానికి చెందిన మైలారం గుట్ట పోరాట సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, లింగయ్యగౌడ్, లక్ష్మయ్య, సుమిత్ర తదితరులను పోలీసులు విడుదల చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.ఖనిజ లవణాలపై గద్దల్లా వాలుతున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్దేశవ్యాప్తంగా ఖనిజ, లవణాలను తవ్వేందుకు గద్దల్లా వాలిపోతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రకృతిని నాశనం చేసే మైనింగ్ తవ్వకాలను ప్రభుత్వాలు నిలిపివేయకుండా వ్యాపారులకు మద్దతు తెలపడం ఏమిటని ప్రశ్నించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి అనంతరం హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి మైలారంలో మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం తగదని చెప్పారు. -
కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడటం వెనుక.. ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించబడిన పశు వైద్యశాల ప్రహరీ గోడ నిర్మాణమేనని సమాచారం.పశు వైద్యశాల వెనకాలే సాయిరెడ్డి ఇల్లు ఉండగా, ఆయన ఇంటికి దారి లేకుండా పశు వైద్యశాల ప్రహరీ గోడను నిర్మించారంటూ వివాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన సాయి రెడ్డి కల్వకుర్తి వచ్చి పురుగుల మందు తాగాడు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపు సాయిరెడ్డి మృతి చెందాడు. సాయిరెడ్డి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్లో తనను సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది. -
సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి.. అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
సాక్షి నాగర్ కర్నూలు: కొండాపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయితీ కార్యాలయం, గ్రంథాలయం, పశువైద్యశాల, బీసీ కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. నాలుగు వరుసల బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మిల్క్ బల్క్ కూలింగ్ సెంటర్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.కాగా, సీఎం రేవంత్‌రెడ్డి గత 20 ఏళ్లుగా దసరా పండుగ రోజు స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులతో కలిసి జమ్మికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో రావడం విశేషం. సీఎం సొంత ఇంటి నుంచి జమ్మి చెట్టు వరకు రోడ్డును ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ లైట్లను అమర్చారు. -
శ్రీశైలం వెళ్తున్నారా.. ఎస్పీ విజ్ఞప్తి ఇదే
నాగర్ కర్నూలు, సాక్షి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో అక్కడక్కడ డ్యామేజ్ అయింది. దీంతో వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వివిధ జిల్లాల నుంచి వయా కల్వకుర్తి, అచ్చంపేట మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు కొన్ని రోజులపాటు తాత్కాలికంగా తమ దర్శన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను వెళ్దండ మండలం కోట్రా జంక్షన్ వద్ద, వంగూరు మండలం కొనేటిపురం టోల్ ప్లాజా దగ్గర ఆపివేయడం జగురుతుందని తెలిపారు. కాబట్టి శ్రీశైలం వెళ్లే భక్తులు, వాహనదారులు ఈ విషయంలో పోలీసువారికి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. భారీ వర్షాలతో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనులు కల్వర్ట్ దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్స్ తకిఖాన్, రాము కాపాడారు. జిల్లాలోని కోడెర్లో భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలిపోయింది. ఇంటిలో ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బిజినపల్లి మండలం లట్టుపల్లి సమీపంలో కేఎల్ఐ కాలువ తెగటంతో వందలాది ఎకరాల పంటలు నీట మునిగింది. -
'కల్కి' దర్శకుడి భారీ సాయం.. ఏకంగా రూ.66 లక్షలు!
'కల్కి' సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ సాయం చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంతూరు ఐతోల్లో తన తాత సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇచ్చాడు. తన తండ్రి చదువుకున్న ఈ స్కూల్‌కి తన వంతుగా ఈ సాయం చేసినట్లు పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కల్కిలో ఆఫర్.. రిజెక్ట్ చేశా: కీర్తి సురేశ్)ఈ క్రమంలోనే అదనపు గదులు నిర్మించేందుకు దాదాపు రూ.66 లక్షల మేర ఖర్చయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎప్పుడు ముందుంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. తాజాగా ఈ గదుల ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి నాగ్ అశ్విన్ హాజరయ్యాడు.'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. 'మహానటి' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఈ మధ్య 'కల్కి'తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం) -
నాగర్ కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
నాగర్ కర్నూలు, సాక్షి:నాగర్ కర్నూలు జిల్లా ఘోర రోడ్డ ప్రమాదం చోటచేసుంది. ఆదివారం ఉదయం అమ్రాబాద్ మండలం మన్నునూర్ సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనతతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
మేడి పండే కాదు, మేడి కల్లు కూడా సూపర్
-
TG: ‘ఘంటసాల’ విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఆర్డీవో మాజీ చైర్మన్
సాక్షి,మహబూబ్‌నగర్:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) మాజీ చైర్మన్ డాక్టర్.జిసతీష్‌రెడ్డి బుధవారం(మే29) తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత జిల్లాలోని దిండి చింతపల్లి గ్రామంలో ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర్రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో శంకర నేత్రాలయ ఐ సర్జరీ క్యాంపులో జరిగిన ఫేర్వెల్ వేడుకలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. -
నాగర్ కర్నూల్: ఈదురుగాలుల బీభత్సం.. గోడ కూలి నలుగురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండలం ఇంద్రకల్లో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కూలీ కుటుంబాల బతుకులను చేసింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం అకాలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు కూలి నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.ఇంద్రకల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణానికి 6 మంది కూలీలు వెళ్లారు. గోడలు కడుతుండగా ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పని ముగించుకొని నిర్మాణంలో ఉన్న గోడ పక్కనే కూర్చున్నారు. తీవ్రమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా గోడకూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమా..
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏయే అంశాలు ఆ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు? అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిన తర్వాత బీఆర్ఎస్ బలం పెరిగిందా? మరింత తగ్గిందా? అసలు గులాబీ శ్రేణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం చాలా ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను లోక్ సభకు చేయకుండా చర్యలు తీసుకుంది. పోటీ చేసే అభ్యర్థులను దాదాపు మెజార్టీ స్థానాల్లో మార్చింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అసలెందుకు ఈ స్థానాల్లో ఆ పార్టీ ఆశలు పెట్టుకుందంటే అందుకు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయంటోంది ఆపార్టీ. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాస్ట్ ఈక్వేషన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ మాజీ పోలీస్ అధికారి స్థానికంగా బలం ఉంది. అదీకాక నియోజకవర్గంపై పట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. సికింద్రాబాద్ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు స్థానికంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పద్మారావు గౌడ్. అంతే కాకుండా బీజేపీఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ది సరిగా చేయలేదన్న విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలని ఆపార్టీ అంచనా వేస్తోంది.పెద్దపల్లి లో కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గులాబీ పార్టీ అంచనాలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుండి పోటీ చేసి ఓడిన కొప్పుల ఈశ్వర్ కచ్చితంగా ఇక్కడ గెలుస్తారని భావిస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం పై కొంత జనంలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అందుకే పెద్దపల్లిలో పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంది. మెదక్పాలో ర్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం తో పాటు, ఇక్కడ కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉండటం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట గజ్వేల్ లో భారీగా ఓట్లు పడి మెజారిటీ ఎక్కువ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. గెలవక పోయిన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరిలో రెండో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలపై ఇలానే లెక్కలేసుకున్న బీఆర్ ఎస్ పార్టీకి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తెలంగాణ ప్రజలు కట్టబెడతారన్నది జూన్ 4న తేలనుంది. -
డీకే అరుణతో నాకు పోటీ ఏంటి? పొంతనేంటి?: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్‌ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని.. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్ధి డీకే అరుణపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మంత్రిగా ఉండి నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్న డీకే అరుణ.. నేడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. తనను అవమానించానని డీకే అరుణ మాట్లాడుతున్నారని.. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని అన్నారు. ‘కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మది. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. మీరే కథానాయకులై నన్ను 33 వేల మెజారిటీతో గెలిపించారు. పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు. అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది.? ఎందుకు కోపం ఉంటుంది.? నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు. ప్రత్యర్ధులు లేరు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంతా. 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు అండగా నిలబడండి. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా. పార్టీలకు అతీతంగా ముందుకు రండి.పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా. వందరోజుల్లోనే మమ్మల్ని కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన నిన్ను చెంపలు వాయించాలి. తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్‌తో నేను సీఎంగా బాధ్యత తీసుకున్నా. నేను వచ్చాక నాలుగు నెలలల్లో 26వేల కోట్లు వడ్డీలు కట్టా. అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ... 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నాం. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతున్నాడు. ఈ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? ఈ సవాల్‌కు హరీష్ సిద్ధమా.? నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగున. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడొద్దు. కొడంగల్ నుంచి వంశీచంద్ రెడ్డికి 50వేల మెజారిటీ ఇవ్వండి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణకు ప్రధాని రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో... తెలంగాణలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న మోదీ రాత్రికి రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు. శనివారం ఉదయం నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. మళ్లీ 18న జగిత్యాలలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శుక్ర, శనివారాల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చనే అంచనాల మధ్య ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ ఇప్పటికే ఈ నెల 4న ఆదిలాబాద్‌లో, 5న పటాన్‌చెరువులో రూ.15వేల కోట్ల పైచిలుకు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం. ఇదీ మోదీ షెడ్యూల్... ► శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు... ► రోడ్డుమార్గాన మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని రోడ్డుషో స్టార్టింగ్ పాయింట్‌కు... ► సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు మల్కాజిగిరిలో రోడ్డుషో ► రోడ్డుమార్గాన 6.40 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ► శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు ► మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల దాకా అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు ► ఒంటిగంటకు నాగర్‌కర్నూల్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.05 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గాకు బయలుదేరుతారు. ► తిరిగి 18వ తేదీ రాష్ట్రానికి వస్తారు. ఆ రోజు షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. ఔ నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాని మోదీ రెండు రోజుల నగర పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4.40 నుంచి 7 గంటల మధ్య బేగంపేట, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్‌రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మీర్జాలగూడ టి–జంక్షన్, మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్, తార్నాక, గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. అదేవిధంగా శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య ప్రధానమంత్రి రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఆ సమయంలో వీవీ విగ్రహం, మెట్రో రెసిడెన్షీ లేన్, ఎంఎంటీఎస్ రాజ్‌భవన్, పంజగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, హెచ్‌పీఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పీఎన్టీ ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించింది. మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశా రు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆ«దీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. ప్రధాని పయనించే మార్గాల్లో పోలీసులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేడే మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాక్షి, సిటీబ్యూరో, మల్కాజిగిరి/ సనత్‌నగర్: మల్కాజిగిరిలో నేడు సాయంత్రం 5.15 గంటలకు జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొద్దిరోజుల్లో వెలువడనున్న తరుణంలో ప్రధానమంత్రి రోడ్ షో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపనుంది. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలు మల్కాజిగిరిలో రోడ్‌షో ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు ఇ ప్పటికే ఏర్పాటు చేశారు. రోడ్ షో ఇలా... ► ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభం కానున్నది. ► సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్‌షో జరుగుతుంది. ► మల్కాజిగిరి చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌కు ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ► దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ► ప్రజలతోపాటు పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► రోడ్‌షోలో భాగంగా సుమారు ముప్ఫై కార్లతో కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతాచర్యల్లో భాగంగా రోడ్ షో జరిగే ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్, ప్యారా గ్లైడింగ్‌లను నిషేధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రోడ్ షో ముగిసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. రహదారి మళ్లింపులు ఇలా.. ► మెట్టుగూడ నుంచి మీర్జాలగూడ క్రాస్ రోడ్, నేరేడ్మెట్ వైపునకు వచ్చే ప్రయాణికులు శాంతినగర్ టీ జంక్షన్ వద్ద మళ్లించి, లాలాపేట మీదుగా జెడ్‌టీసీ, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్ మీదుగా నేరేడ్మెట్కు చేరుకోవాలి. ► నేరేడ్మెట్, వినాయక్‌నగర్, సఫిల్‌గూడ జంక్షన్ మీదుగా మల్కాజ్గిరి క్రాస్ రోడ్స్‌కు వచ్చే వాహనదారులు ఆనంద్‌బాగ్ క్రాస్ రోడ్స్ వద్ద మలుపు తీసుకొని ఉత్తమ్ ఆర్యూబీ మీదుగా ఉత్తమ్ నగర్, ఏఓసీ రూట్, సికింద్రాబాద్ మీదుగా వెళ్లిపోవాలి. ► జెడ్‌టీసీ జంక్షన్ నుంచి ఆనంద్‌బాగ్‌కు వచ్చే వాహనాలు జెడ్‌టీసీ వద్ద మళ్లించి, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్, నేరేడ్మెట్, వినాయక్‌నగర్ మీదుగా వెళ్లిపోవాలి. పార్కింగ్లు ఇక్కడే.. రోడ్ షోకు హాజరయ్యేవారు తమ వాహనాలను అనుటెక్స్ పెట్రోల్ బంక్, అషూర్ఖానా మైదానం, ప్రశాంత్ నగర్, జైన్ కన్స్ట్రక్షన్, సఫిల్‌గూడ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల లోపు పార్కింగ్ చేయాలి. ఆ సమయం తర్వాత పార్కింగ్ చేయడానికి అనుమతి లేదు. -
వీడిన సస్పెన్స్..! లోక్‌సభ అభ్యర్థిగా డీకే అరుణ..
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ఖరారైంది. ఈ లోక్‌సభకు సంబంధించి డీకే అరుణతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మధ్య టికెట్ పోరు కొనసాగడంతో అధిష్టానం పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బుధవారం రెండో జాబితాను ప్రకటించగా.. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణకు చోటు దక్కింది. నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ పేరును తొలి జాబితాలోనే ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారుకావడంతో ప్రచారం జోరందుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: 'బీజేపీ టికెట్' నగేశ్‌కే.. -
లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో తెలుసు: కేటీఆర్
సాక్షి, నాగర్ కర్నూల్: కుడితిలో పడ్డ ఎలుకల పరిస్థితిగా కాంగ్రెస్ స్థితి ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో మీకే తెలుసు. రేవంత్‌రెడ్డి తిరిగి పాతమూలాలకు పోతున్నట్టు ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి’’ అంటూ ప్రశ్నించారు. ‘‘పథకాలు అమలు కోసం కొత్త కొర్రీలు పెడుతున్నారు. మార్చి 17 వరకు వేచి చూద్దాం.. అవసరమైతే 6 నెలలు ఆగుదాం. ఇంకా రైతు బంధు ఎప్పటికీ వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో కేసీఆర్ పాలనపై తప్పుడు ప్రకటన చేయించారు. మోదీ హవా లేదు.. బోడీ లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని పార్టీ బీజేపీ. కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీకి అప్పగించిన చరిత్ర కాంగ్రెస్‌ది. మనం ప్రతిఘటిస్తే తిరిగి తీర్మానం చేశారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా అప్పర్ భద్రాకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది ’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘కారు సర్వీసింగ్‌కు పోయింది.. తిరిగి మంచి స్పీడుతో వస్తుంది. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచి కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా అండగా ఉంటాం. తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచే కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా తామంతా గంటలో వచ్చి అండగా ఉంటాం’’ అంటూ కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే.. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న మర్రి జనార్దన్‌రెడ్డి?
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: బీఆర్ఎస్కు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి షాక్ ఇవ్వనున్నారా?. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి చవి చూసిన జనార్దన్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసేందుకు ఢిల్లి పెద్దలలో మర్రి మంతనాలు జరిపారు. దీంతో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయోమయంలో పడ్డారు. నేడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్దన్‌రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి 87,161 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్.. టీపీసీసీ భారీ ప్లాన్! -
తుమ్మంపేటలో టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు
-
నాగర్ కర్నూల్ , తుమ్మంపేట గ్రామంలో టీటీఏ సేవా డేస్!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించింది టీటీఏ టీమ్. తుమ్మంపేట గ్రామంలో పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. టీటీఏ నాయకులు సైదులు స్వగ్రామంలో ప్రభుత్వ స్కూల్‌కు స్టేజ్ నిర్మాణం పూర్తి చేసి పాఠశాలకు అందించారు. టీటీఏ నాయకులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించారు. స్కూల్ అభివృద్ధిలో సహాయసహాకారాలు అందిస్తున్న టీటీఏ బృందానికి టీచర్లతో పాటు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా ఉన్నటీటీఏ సంస్థను గ్రామస్థులు, పలువురు నాయకులు ప్రసంశించారు. రానున్న రోజుల్లో ఈ స్కూల్ ను దత్తత తీసుకోనున్నామని టీటీఏ సభ్యులు తెలిపారు. ప్రిన్సిపాల్ అడిగిన గ్రీన్ బోర్డ్ త్వరలో అందిస్తామని ప్రామిస్ చేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు ధైర్య ప్రదర్శన చేసిన పిల్లలకు మోమొంటోలు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన ప్రతి క్లాస్ లో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేసారు. ఇక కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గణిత శాస్త్ర నిపుణులు రామానుజం జయంతి సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగాలను టీటీఏ నాయకులు మనోహర్, నరసింహ పేరుక తిలకించారు. ఇక విద్యార్థుల ప్రతిభకు అబ్బురపడి పిల్లలను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. (చదవండి: 'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్‌చైర్స్ పంపిణీ) -
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు
పేదలకు సహాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణ లో నల్లమల అడవుల సమీపంలో గల నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హై స్కూల్ లో బ్రహ్మగిరి సేవా సొసైటీ వారి సంవంట సహకారంతో స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ సిస్టమ్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్‌కు మొత్తం రూ. 25 వేలు ఆర్థిక సహాయం, అలాగే వారికి వైద్య సేవలు అందేలా గోర్సేవా(Gorseva)తో సమన్వయం చేశారు. అలాగే మన్ననురు రేంజుకు చెందిన భోగాపుర్ గ్రామంలో చెంచు గిరిజనులను ఆటా టీమ్ సందర్శించి, వారితో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సహాయం లాంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆటా పాలుపంచుకుంటుంది అన్నారు. ఇక్కడి గిరిజనులకు సేవ కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తో చర్చించామని తెలిపారు. ప్రభుత్వం తరుపున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభ్యర్థించామని అన్నారు. గిరిజనులు మమ్మల్ని స్వాగతించిన తీరు నిజంగా అధ్బుతమన్నారు. ఇక్కడి వారికి ఇంకేమైనా సహాయం కావాలన్నా ఆటా తరుపున చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, స్థానిక కో ఆర్డినేటర్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!) -
మాయలు, మంత్రాలు.. ఆనక హత్యలు!
సాక్షి, మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ, బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ, విడిపోయిన భార్యభర్తలను కలుపుతానంటూ.. 11 మంది అమాయకపు ప్రాణాలను తీసిన రాక్షసుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రామాటి సత్యనారాయణ యాదవ్(47) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన తండ్రి, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి నాటువైద్యం ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించాడు. ఆపై మంత్రతంత్రాలతో గుప్త నిధులు వెలికి తీసిస్తానంటూ, బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రజల్ని నమ్మబలికాడు. వారి ఆస్తులను, ఇంటి స్థలాలను కాజేశాడు. అదే తన వృత్తిగా కొనసాగిస్తూ.. ప్రజల్ని మభ్యపెడుతూ, చివరికి ప్రశ్నించిన వారి ప్రాణాలను తీస్తూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఇద్దరు భార్యాభర్తలు విడిపోయిన వారిని కలుపుతానంటూ, వారి ఇంటి స్థలం తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆపై ఆ మహిళా కనిపించకుండా పోవడంతో.. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన వివరాలను సేకరించి, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరికి గత కొన్ని రోజులుగా ఎవరి కంట పడకుండా తప్పించుకుంటున్న నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఓ రియల్టర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి.. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్ (10) ఉన్నారని తెలుస్తోంది. రెండేళ్ల కిందట నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది. అయినా ఆ టైంలో పోలీసుల్లో కదలిక లేకపోవడం గమనార్హం. ఇవి కూడా చదవండి: మిస్టరీగా మారిన 'కాంగో జాతీయుడి లాకప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది? -
‘పారాచూట్‌లా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడు, అప్పుడు నాకు అన్యాయం జరగలేదా?’
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవి వదులుకుంటానని కూచకుళ్ళ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన కూచుకుళ్ల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ పరంగా సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యలను పట్టించుకోవడంతోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు కూచుకున్న ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ ఖరారు చేయడంతో నాగం జనార్ధన్ రెడ్డి హస్తం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూచుకుళ్ల ఆదివారం మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్లో గెలుపు సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టికెట్ తన కుమారుడు రాజేష్ రెడ్డికి ఇచ్చారని తెలిపారు. 1998-2018 వరకు 20 ఏళ్లపాటు తాను కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు. 2018లో అధికారం కోసం ఆశపడి పారాచూట్‌లా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడని నాగంను ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఆ రోజు తనకు అన్యాయం జరగలేదా అని ప్రశ్నించారు. నాగం నడవలేడు, మెట్ల ఎక్కలేడ కానీటికెట్ కావాలని పట్టుబట్టాడని మండిపడ్డారు. నిన్నటి వరకు నాగం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్, ప్రాజెక్టులపై కేసులు వేశాడని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిత్యం తిట్టిన పార్టీలోనే నేడు చేరుతున్నాడని విమర్శించారు. -
కాంగ్రెస్‌కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్‌కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్లో చేరనున్నారని సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డిని మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5:00 గంటలకు నాగం నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి నిరాశ ఎదురవ్వడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని నాగం జనార్దన్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు. ఇదీ చదవండి: వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ -
కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి?
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం సాయంత్రం నాగం ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని మాజీమంత్రి, పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదని విచారం వ్యక్తం చేశారు. 2018 నుంచి నాగర్‌కర్నూల్‌లో పార్టీ బలోపేతం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టానని, కానీ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్‌రెడ్డి కుమారుడికి పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. బోగస్ సర్వేల పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు మోసం చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలెవరైనా తనను సంప్రదిస్తే, కార్యకర్తల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు. చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
అందుకే నా రాజీనామా.. బీఆర్ఎస్కు కూచుకుళ్ల గుడ్‌బై
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎన్నికల వేళ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారం బీఆర్ఎస్కు రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పంపారాయన. పార్టీలో సముచిత స్థానం దక్కినప్పటికీ.. స్థానిక సమస్యల కారణంగానే బయటకు రావాల్సి వచ్చిందంటూ లేఖలో ప్రస్తావించారాయన. ‘‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి వెళ్లి కలిసేవాడ్ని. కానీ, కేసీఆర్ ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పదిసార్లు వెళ్లినా.. కనీసం కలవలేదు. పార్టీ పరంగా నాకు సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని లేఖలో పేర్కొన్నారాయన. స్థానికంగా ఎటువంటి ప్రయారిటీ లేదని.. ఎమ్మెల్సీ అంటే ఒక స్టిక్కర్ వేసి మీరు పడి ఉండండి అని కేసీఆర్ అంటున్నారని ఆరోపించారాయన. కేటీఆర్‌ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని లేఖలో విమర్శించారు కూచుకుళ్ల. మరోవైపు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగకపోవడమే కూచుకుళ్ల రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారతారనే ప్రచారం గత నాలుగైదు నెలలుగా నడుస్తోంది కూడా. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. కాంగ్రెస్ తరపునే తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్ నగర్ జిల్లా ఛైర్మన్‌గా పనిచేశాడు. ఐదుసార్లు నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి నాగం జనార్ధన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారాయన. బీఆర్ఎస్కు రాజీనామా నేపథ్యంలో.. ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నెల చివర్లో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనే బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. -
నాగర్‌కర్నూల్‌లో కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నం
-
నాగర్ కర్నూల్: అభివృద్ధి మంత్రం ‘ఉత్త’ ముచ్చటేనా?
నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్దానం వచ్చే ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఉండటంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన నాగం వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటంతో కాంగ్రెస్ సీట్ల పంచాయితీ మొదలయ్యింది. దీంతో వచ్చే ఎన్నికలు ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. జిల్లాను అభివృద్ధి చేసినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకత! 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన పోటీ ఖరారైంది. రీసెంట్గా విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రికి టికెట్ దక్కింది. కాగా మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్‌ను జిల్లాగా మార్చారు. జిల్లాకు మెడికల్ కళాశాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి ప్రారంభించారు. సొంత నిధులతో మూడు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేటు స్దాయిలో తీర్చిదిద్దారు. దీంతో అభివృద్ది విషయంలో మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకురావటంలో సఫలీకృతులవుతున్నారు. నల్లమట్టి అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నల్లమట్టిలో వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో తన అనుచరులు ముఖ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్‌లో నిర్వాసితులకు సకాలంలో సరైన పరిహారం ఇవ్వలేదనే అసంతృప్తితో నిర్వాసితులు ఉన్నారు. మాదిగ సామాజిక ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుంది. భూ నిర్వాసితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ తలనొప్పికానుంది. డబుల్బెడ్రూం ఇళ్లు, రుణమాఫి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. పైకి బాగానే ఉన్నా.. నేతల మధ్య అంతర్గత విభేధాలు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడుతుండటం కొంతమైనస్గా మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో తన క్యాడర్‌ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలీసుల సహయంతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఎమ్మెల్సీ మీడియా ముందే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దామోధర్‌రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డారు. ఆయనను సంప్రదించకుండానే నాగం జనార్దర్రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సీటు ఖరారు చేయటంతో ఆగ్రహించిన దామోధర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు. ఇటీవల రెండవ సారి దామోధర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రస్తావిస్తే దాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి హైదరాబాద్‌లో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తూ తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్నానని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న తనని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలను లోక్‌సభకు పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారట.. ఆ లిస్టులో మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే గుసగసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు ఇక్కడ బలహీనంగా ఉండటం ఎమ్మెల్యే ఆర్దికంగా బలంగా ఉండటం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మర్రి ప్రకటించటం చూస్తే గెలుపుపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్దం అవుతుంది. కాగా అప్పుడే మర్రి జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ పేరిట పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇబ్బందికరంగా కాంగ్రెస్ సీట్ల పంచాయతి.. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాగం జనార్దన్‌రెడ్డి వయస్సు మీదపడటం.. కాంగ్రెస్ క్యాడర్లో చాలా మంది బీఆర్ఎస్ గూటికి చేరటం ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజేష్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని నాగం పట్టుబడుతుండటంతో సమస్య జఠిలమవుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంతసానుకూల వాతావరణం వస్తుందన్న తరుణంలో సీట్ల పంచాయితీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అధిష్టానం నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చితే తప్పా కుమ్మలాటలు ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడర్ కూడ లేదు. ఆ పార్టీలో దిలీపాచారి, కొండమణేమ్మలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దిలీపా చారికి డిపాజిట్ కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పనిచేసిన కొండ మణేమ్మకు నాగం జనార్దన్‌రెడ్డితో పొసగక పోవటంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఆపార్టీ తన ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. భౌగోళిక పరిస్థితులు: కూలీపనులు,వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు.ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఆలయాలు: వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం -
కాంగ్రెస్‌లో టికెట్ల పోరు.. నీదా..! నాదా..! ఎవరరిది..?
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండటంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండగా.. మరోవైపు వారి చేరికకు ముందే చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. త్వరలో ఇరువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారు వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్‌లో అంతర్గత పోరు తప్పదన్న సంకేతాలను చూపుతోంది. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో కొల్లాపూర్ వేదికగా నిర్వహించేందుకు తలపెట్టిన ‘పాలమూరు ప్రజాభేరి’ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం ఇరువర్గాలుగా నేతలు తమ బలప్రదర్శనను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త, పాత నేతలు సర్దుకుంటారా..! కాంగ్రెస్‌లోకి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పార్టీ టికెట్ కోసం అంతర్గత పోరు తప్పేలా కనిపించడం లేదు. జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతుండగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ నేత చింతలపల్లి జగదీశ్వర్‌రావు భారీ ర్యాలీతో బలప్రదర్శన చేపట్టారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాల ని పిలుపునిచ్చారు. ఏళ్లుగా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల నిర్వహణ, సభ్యత్వాలను పెంచి పార్టీ బలాన్ని పెంచానని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీలో ఉండటం ఖాయమని ప్రకటించడంతో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న జూపల్లికి పార్టీలో అంతర్గత పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉన్న తరుణంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన కేడర్‌లో నెలకొంది. సర్వేల చుట్టూ రాజకీయాలు.. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కాగా.. వచ్చే ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని నాగం చెబుతున్నారు. పార్టీలో అంతర్గత పోరును కట్టడి చేసేందు కు సర్వేల ద్వారా టికెట్లను ఖరారు చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్వే మొదలైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అ యితే సర్వేలతో పనిలేకుండా ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి అవకాశం ఇవ్వాలని నాగం, జగదీశ్వర్‌రావులు డిమాండ్ చేస్తున్నారు. సమీకరణాలపై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోకి నేతల చేరికలతోపాటు పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వారి చేరికకు ముందే కొత్త, పాత నేతల మధ్య వైరం పెరుగుతుండటం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన సమావేశానికి హాజరైన నాగం జనార్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కకుండా చేస్తే వారిని ఓడిస్తామనే సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే ఇందుకోసం వ్యతిరేకులను అంతా ఏకం చేసే యోచనలో సైతం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో టికెట్ కోసం ఇరువర్గాల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు, వారి పట్టింపుల నడుమ చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పార్టీ ఆదేశించిన విధంగా కొత్త, పాత నేతలు నడుచుకుంటారా.. అంతర్గత కుమ్ములాటలు ఎటువైపు దారితీస్తాయోనన్నది ఉత్కంఠగా మారింది. -
మోదీ ది బాస్ అని ప్రపంచ దేశాల నేతలే కొనియాడుతున్నారు: నడ్డా
-
నాగర్ కర్నూల్ జిల్లాలో బీజేపీ బహిరంగ సభ
-
బంగాళాఖాతం చుట్టు తిరిగిన కేసీఆర్
-
నాగర్ కర్నూలులో పర్యటించిన సీఎం కేసీఆర్
-
నాగర్ కర్నూల్లో విషాదం: పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వారు ఫోన్ మాట్లాడుతుండగా సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులు పాపగంటి నాగయ్య, రమేష్‌గా గుర్తించారు అధికారులు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయాలు అలుముకున్నాయి. (చదవండి: దిద్దుబాటు చర్యలు) -
నగర్ కర్నూల్: కొల్హాపూర్ ప్రభుత్వాస్పత్రిలో కొరవడిన వైద్యం
-
సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం చోటుచేసుకుంది. జాతరకు భక్తులు పోటెత్తడంతో.. గుండెపోటుతో అమన్‌గల్‌కు చెందిన విజయ అనే మహిళ మృతిచెందింది. దీంతో సలేశ్వరం జాతరలో మరణించిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కసలాట జరిగి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. మృతులను నాగర్ కర్నూల్ జిల్లాకే చెందిన గొడుగు చంద్రయ్య (55), వనపర్తి జిల్లాకు చెందిన యువకుడు అభిషేక్‌గా (32) గుర్తించారు. కాగా నల్లమల్ల అడవుల్లోని సలేశ్వరంలో కొలువై ఉన్న శివుడిని (లింగమయ్య) దర్శించుకోవాలంటే దట్టమైన అడవీ, కొండలు, లోయల మార్గంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 4 కి.మీ. దూరం కాలినడకన నడవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సలేశ్వరం యాత్రకు భక్తులు పోటెత్తారు. లింగమయ్య నామస్మరణతో నల్లమల కొండలు మార్మోగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఈ యాత్ర కేవలం 3 రోజులు మాత్రమే కొనసాగనుండటం, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సలేశ్వరంలో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడి లోయల్లో భక్తులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు స్తంభించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తుల అసంతృప్తి సలేశ్వరం యాత్ర ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారం పది రోజులపాటు నిర్వహించవలసిన జాతరను కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలను చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సలేశ్వరం జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమవ్వగా శుక్రవారం వరకు జాతర కొనసాగనుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమస్తారు. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మన్ననూరులో ఉద్రిక్తత
సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: జిల్లాలోని మన్ననూరు గురుకులంలో దారుణం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్లాస్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని నిఖిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో నిఖిత ఘర్షణ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థిని మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. మానసిక వేదనే నిఖిత సూసైడ్‌కు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొట్టి చంపారని నిఖిత తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో మన్ననూరు గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: రంగారెడ్డి: ఉసురు తీసిన కంత్రీగాళ్లు -
లాభాల గాడిద పాలు.. రోజూ లీటరున్నర వరకు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’.. అంటూ వేమన అప్పట్లో గాడిదపాలను విలువలేనివిగా భావించి అలా పద్యం రాశాడేమోగానీ వాటి పాల వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాల గురించి తెలిసుంటే రూ. కోట్లిచ్చును ఖరము పాలు అని రాసేవాడేమో.. ఎందుకిదంతా చెప్పడమంటే.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువరైతు రాష్ట్రంలోనే మొదటి గాడిద డెయిరీ ఫాంను ఏర్పాటు చేసుకొని భారీ లాభాలు ఆర్జిస్తున్నాడు మరి! ఆ యువరైతు విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. లీటర్ రూ. 4– 5 వేలు రోజుకు ఒక గాడిద గరిష్టంగా లీటర్ వరకు పాలు ఇస్తుంది. ఉదయం, సాయంత్రం రెండుసార్లు పితికితే లీటరున్నర వరకు పాలు వస్తాయి. ఈ పాలను ఎక్కువగా ఆయుర్వేద మందులు, కాస్మొటిక్స్ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ మేరకు కంపెనీలు పలు ఏజెన్సీల ద్వారా అంతర్జాతీయంగా కొనుగోలు చేస్తున్నాయి. లీటర్ గాడిద పాలకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ధర పలుకుతోంది. పాల ఉత్పత్తి, గాడిదల ఆరోగ్యంపై ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుండగా.. ఫామ్ నిర్వాహకులు స్థానిక పశు వైద్యాధికారి సాయంతో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పెద్దమొత్తంలో పాలు ఉత్పత్తి అయితే ఇంకా అధిక ధరతో నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన పులిదండ నగేష్ కుటుంబం వినూత్న వ్యాపార ఆలోచనను ఆచరణలోపెట్టి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సంప్రదాయ ఆవు, గేదె పాల డెయిరీలకు పూర్తి భిన్నంగా గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన నగే‹Ùకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు అఖిల్ డిగ్రీ చేయగా చిన్నకొడుకు వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నగేష్ తల్లిదండ్రులు నర్సోజీ, లలితమ్మ. వారి కులవృత్తి (మాంసం విక్రయించడం) కూడా చేసేవారు. పలు రకాల పంటల సాగుతోపాటు పలు వ్యాపారాలు చేసినా ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకోకపోవడంతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో అఖిల్ యూట్యూబ్‌లో అన్వేíÙస్తుండగా డాంకీ ఫామ్పట్ల ఆసక్తి కలిగింది. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్న క్రమంలో అఖిల్ రాజస్తాన్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్లో గుర్రాలు, గాడిదల పెంపకం, పాల ఉత్పత్తుల గురించి శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. నెలకు వారం చొప్పున మూడు నెలలు శిక్షణ తీసుకున్నాడు. అనంతరం గుజరాత్‌లోని ఖతియవాడి, హలరీతోపాటు ఫ్రాన్స్ (పోటియో రకం) నుంచి గాడిదలను దిగుమతి చేసుకున్నాడు. ఒక్కోదానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వెచ్చించి మొత్తం 60 గాడిదలు తెచ్చుకున్నాడు. ఇందులో 57 ఆడ.. మూడు మగవి. ఈ నెలలో మరో 20 గాడిదలను (ఆడ 16, మగ 4)ను తీసుకురావడంతో వాటి సంఖ్య 80కి చేరింది. ఫామ్‌తోపాటు గాడిదలకు దాణా కోసం వివిధ రకాల గడ్డి పెంచేందుకు బిజినేపల్లి మండల కేంద్రంలోని వృద్ధాశ్రమం సమీపంలో దాదాపు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. అందులో ఒక పెద్ద షెడ్ (ఐదు భాగాలు), మరో 3 చిన్న షెడ్లు ఏర్పాటు చేసి గాడిదలను వేర్వేరుగా పెట్టాడు. వాటికి కావాల్సిన దాణా కోసం దాదాపు 15 ఎకరాల్లో సీఎస్వీ 33 ఎంఎఫ్ (జొన్న రకం), దశరథ గడ్డి, 4జీ బులెట్ (సూపర్ నేపియర్ రకం), మొర్ర గడ్డి తీగ పెంచుతున్నాడు. వీటితోపాటు ఎండు వరి గడ్డి, మక్కసొప్ప, బుడ్డ (పల్లి) పొల్లు, మక్క, గోధుమ, బార్లీ, పిండిని గాడిదలకు ఆహారంగా ఇస్తున్నాడు. గాడిదలను చూసుకునేందుకు రెండు కుటుంబాలను తమిళనాడు నుంచి రప్పించి వారికి వసతి కల్పిస్తున్నాడు. మంచి బ్రీడ్, ఎజెన్సీ చూసుకోవాలి గతేడాది నవంబర్ 13న ఫామ్ అందుబాటులోకి వచి్చంది. ప్రస్తుతం 23 గాడిదలు పాలు ఇస్తున్నాయి. పోటియో (ఫ్రాన్స్) గాడిదలు రోజుకు 2 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. గాడిద పాలు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. అయితే వాటిని ఫ్రిజ్లోనే ఉంచాలి. ఏజెన్సీ వాళ్లు ప్రస్తుతం 15 రోజులకు లేదా నెలకోసారి వచ్చి పాలు తీసుకెళ్తున్నారు. గాడిద పాల వ్యాపారం లాభదాయకమే. అయితే మంచి బ్రీడ్, ఏజెన్సీని ఎంచుకోవాలి. – పులిదండ నగేష్, గాడిద ఫాం నిర్వాహకుడు -
70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా
ప్రకృతి వ్యవసాయదారుడిగా మారిన బ్యాంకింగ్ నిపుణుడు ఇమ్మానేని రంగప్రసాద్ తన పొలాన్ని ఉద్యాన పంటల జీవవైవిధ్య క్షేత్రంగా మార్చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మస్’ పేరుతో అభివృద్ధి చేశారు. 30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లతో పాటు నాటుకోళ్లు, ఆవుల పెంపకం చేపట్టారు. పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా అమృతాహారాన్ని అందించడమే లక్ష్యమంటున్న రంగప్రసాద్ కృషిపై కథనం. హైదరాబాద్‌కు చెందిన ఇమ్మనేని రంగప్రసాద్ బ్యాంకింగ్ నిపుణుడు. డా. కిరణ్మయి మైక్రోబయాలజిస్టు. ఈ దంపతులకు సేంద్రియ/ప్రకృతి సేద్యం అంటే మక్కువ. ఈ మక్కువతోనే హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో సమీకృత సేంద్రియ ఉద్యాన పంటల క్షేత్రానికి ఎంతో శ్రమించి రూపుకల్పన చేశారు. ఏడాది పొ డవునా రసాయనిక అవశేషాల్లేని చాలా రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నాటు కోడిగుడ్లను నగరవాసులకు అందించాలని సంకల్పించారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మ్స్’ పేరుతో జీవవైవిధ్య ఉద్యాన క్షేత్రంగా అభివృద్ధి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల కాలువను అనుకొని ఉండటంతో ఈ క్షేత్రానికి సాగు నీటి కొరత లేదు. తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేత ఎమ్మెస్ సుబ్రహ్మణ్యం రాజు సూచనలు, సలహాలతో ఈ క్షేత్రం మెరుగైన ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం. దేశ విదేశీ రకాలెన్నో... అనేక రకాల నేలలు, ఎత్తుపల్లాలతో కూడిన ఈ పొ లాన్ని అనేక విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగంలో ఒక్కో రకం ప్రధాన పంటలను, వాటి మధ్య అనేక అంతర పంటలను సాగు చేస్తున్నారు. ఏడాది పొ డవునా దిగుబడులు తీసుకునేందుకు వీలుగా వారానికోసారి ఆకుకూరలు, 15 రోజులకోసారి కూరగాయ మొక్కలు నాటుతూ (స్టాగ్గర్డ్ ప్లాం టేషన్ చేస్తూ) ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, క్యాబేజి, కాళీఫ్లవర్ వంటి పంటలు 15 రోజులకోసారి విత్తుతున్నారు. కాకర, బీర, సొర, టమాటో, బెండ వంటి పంటలను నెలకోసారి విత్తుతున్నారు. ఐఫార్మ్స్లో ఆరుబయట ఎత్తు మడులపై పెరుగుతున్న కసూరి మేతి, ఎర్ర ముల్లంగి, దిల్, గ్రీన్ లెట్యూస్, రెడ్ లెట్యూస్, పర్పుల్ కార్న్, బేబీ కార్న్, మిక్స్డ్ కలర్ కార్న్.. వంటి విదేశీ జాతుల కూరగాయలు వినియోగదారులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే నల్ల కంది, సుగంధ పసుపు, మామిడి అల్లం వంటి పంటలు కూడా ఈ క్షేత్రంలో సాగవుతున్నాయి. అంతర పంటలు.. మొరంగడ్డ తీగతో మల్చింగ్... మామిడి, జామ, సీతాఫలం, బొ΄్పాయి తదితర పండ్ల మొక్కల మొదళ్లలో మొరంగడ్డ (చిలగడదుంప) తీగ ముక్కలను నాటడం ద్వారా కలుపును నివారించడమే కాకుండా సజీవ ఆచ్ఛాదన కల్పిస్తుండటం మరో విశేషం. తీగ ముక్క నాటిన ఆరు నెలల్లో చిలగడదుంపలను తవ్వి వినియోగదారులకు అందిస్తూ ఆదాయం కూడా పొ ందుతున్నారు. పండ్ల తోటల్లో ఖరీఫ్‌లో, రబీలో కూడా అంతర పంటలను సాగు చేస్తున్నారు సజీవ ఆచ్ఛాదన, కలుపు నివారణ, అదనపు ఆదాయం.. అంతర పంటల ద్వారా ఈ మూడు ప్రయోజనాలు సాధిస్తున్నారు. జామ తోటలో మొక్కల మధ్య చిలగడదుంప, సాళ్ల మధ్య వేరుశనగ వేశారు. వేరుశనగలతో వంట నూనె ఉత్పత్తి చేయడానికి ఎద్దు గానుగను ఏర్పాటు చేసుకుంటున్నామని రంగప్రసాద్ తెలిపారు. శాశ్వత పందిరికి దొండ తీగలు పాకించి.. పందిరి కింద సాళ్ల మధ్య ఖాళీలో వెల్లుల్లి, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. బొ΄్పాయి తోట మధ్యలో 9 రకాల తులసి రకాలను పెంచుతున్నారు. సీతాఫలంలో బాలానగర్, ఎన్ఎంకె గోల్డ్, రామాఫలం, లక్ష్మణఫలం రకాలు నాటారు. ఈ నాలుగూ ఒకేసారి కాపునకు రావు. ఒకటి పూర్తయ్యాక మరొకటి ఫలాలనిస్తాయి. ఎటు చూసినా 10 అడుగుల దూరంలో మామిడి మొక్కలు నాటారు. మధ్యలో ఖరీఫ్‌లో కంది, రబీలో చిలగడదుంప సాగు చేస్తున్నారు. అందరూ ఎక్కువగా ఇష్టపడే బేనిషాన్, హిమాయత్ మొక్కలు పెట్టాం. ఎక్కడెక్కడి నుంచో అరుదైన రకాలను సైతం తెచ్చి అన్నీ కలిపి 70 రకాలను నాటామని రంగప్రసాద్ తెలిపారు. భవిఫ్యత్తులో అన్ని రకాల మామిడి పండ్లతో కూడిన బుట్టలను ప్రజలకు సరఫరా చేయనున్నట్లు సుబ్రమణ్యరాజు తెలిపారు. ఒకసారి విత్తితే.. వరుసగా రెండు పంటలు! ఆకుపచ్చ క్యాబేజీ, ఎరుపు బ్రోకలీ వంటి కొత్తరకం పంటలను ఐఫార్మ్స్లో పండిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఒకే మొక్కకు రెండు సార్లు దిగుబడి తీస్తున్నారు. ఒక పంట తీసుకున్న తర్వాత అదే మొక్క నుంచే 50 రోజుల్లో కార్శి(రటూన్ క్రాప్) పంట తీస్తున్నారు. గో ఆధారిత ప్రకృతి సేద్య నిపుణులు సుబ్రహ్మణ్యం రాజు పర్యవేక్షణలో ఈ ప్రయోగాత్మక సాగు జరుగుతోంది. ఆయన ఏమంటున్నారంటే.. మొదటి పంటగా క్యాబేజీ, బ్రోకలీ కోసిన తర్వాత మొక్కలను అలాగే ఉంచి, ఎప్పటిలాగే క్రమం తప్పకుండా నీరు ఇవ్వాలి. 2 వారాల్లో కొత్త పిలకలు వస్తాయి. పెద్దదాన్ని ఉంచి, మిగిలినవన్నీ తీసివేయండి. 400–500 గ్రాముల క్యాబేజీ, బ్రోకలీ కావాలంటే రెండు రెమ్మలు ఉంచండి. ప్రతి పది రోజులకు పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్, ఆవు మూత్రం పిచికారీ చేయడం ద్వారా పోషకాహారం ఇవ్వండి. పంట కాలంలో మూడు సార్లు పిచికారీ చేయాలి. రెండో పంట కోసం 40–50 రోజుల వరకు వేచి ఉండండి. ఈ కార్శి పంట వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రెండో పంటకు బెడ్ తయారీ అవసరం లేదు. అదనపు శ్రమ లేదు. తక్కువ కలుపు. తక్కువ వ్యవధి. కాబట్టి చాలా తక్కువ ఖర్చు. సీజన్ లో కన్నా ధర ఎక్కువగా వస్తుంది. నాటు కోళ్లు సమీకృత సేద్యం ద్వారానే ఉత్తమ ఫలితలు వస్తాయని రంగప్రసాద్ నమ్మిక. 35 దేశీ ఆవులతో కూడిన గోశాల ఈ క్షేత్రంలో ఉంది. సుమారు 400 నాటుకోళ్ల ఫారాన్ని నెలకొల్పారు. నాటు కోళ్లతో పాటు గిన్నెకోళ్లు, టర్కీ కోళ్లు, అసీల్ తదితర జాతుల కోళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆరోగ్యదాయకన రీతిలో ఆరుబయట తిరుగుతూ పెరిగేలా కోళ్లకు ఏర్పాట్లు చేశారు. నాటు కోడి గుడ్లను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు అందించాలన్నదే రంగప్రసాద్ లక్ష్యం. సంతృప్తికర∙ఉత్పాదకత పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, జీవన ఎరువులు, జీవన పురుగుమందులను అవసరాన్ని బట్టి వాడుతున్నారు. తద్వారా పోషకలోపాలు లేకుండా, చీడపీడల బెడద లేకుండా.. సంతృప్తికరమైన రీతిలో పంటల ఉత్పాదకత సాధిస్తున్నట్లు సుబ్రహ్మణ్య రాజు(76598 55588) వివరించారు. హైదరాబాద్‌లోని ఆర్గానిక్ షాపులకు అందించడంతో పాటు ఎంపికచేసుకున్న గేటెడ్ కమ్యూనిటీలకు స్వయంగా తీసుకెళ్లి వారానికోసారి తమ సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు రంగప్రసాద్. సేంద్రియ ఆహారోత్పత్తులను నేరుగా పొ లం నుంచి పొ ందగోరే గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాల సంక్షేమ సంఘాలు ఉచితంగా తమ క్షేత్రాన్ని సందర్శించవచ్చని సమీకృత సేంద్రియ సాగుదారుడు రంగప్రసాద్(98851 22544) ఆహ్వానిస్తున్నారు. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
రజాకార్లను తరిమినోళ్లం.. కేసీఆర్‌ను ఓడించలేమా?
సాక్షి, నాగర్‌కర్నూల్: సీఎం కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతోనే బీఆర్ఎస్ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మార్కండేయ ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేసిన దళితులు, గిరిజనులపై బీఆర్ఎస్ నేతలు దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. భూస్వాములు, దొరలను నిలువరించిన ఈ గడ్డ దళితులపై దాడులను చూస్తూ ఊరుకోదన్నారు. రజాకార్లను తరిమికొట్టిన, ఆంధ్రా నాయకులను పొలిమేర దాటించిన వాళ్లం రేపు కేసీఆర్‌ను ఓడించలేమా? అని ప్రశ్నించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ’లో రేవంత్ మాట్లాడారు. దళితులకు కాంగ్రెస్‌తోనే అండతెలంగాణకు తొలి సీఎం దళితుడేనని చెప్పి దరిద్రపు సీఎం వచ్చారని.. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి జరపని వ్యక్తి దళితుల పేరుచెప్పి సీఎం కుర్చీలో కూర్చున్నారని రేవంత్ విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలమూరు బిడ్డ, ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌ను గొంతుమీద కాలుపెట్టి తొక్కడానికి ప్రయత్నిస్తే.. ఆయన బయటికొచ్చి దళిత బిడ్డల పౌరుషాన్ని చూపుతున్నారన్నారు. దొరలకు బీఆర్ఎస్, పెట్టుబడిదారులకు బీజేపీ అండగా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉంటుందని చెప్పారు. తమ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా దళితుడికి అవకాశం ఇచ్చామని, పంజాబ్‌కు దళితుడిని సీఎం చేశామని పేర్కొన్నారు. మేం నెత్తిమీద కాలుపెట్టి తొక్కుతాం 2018 ఎన్నికల సమయంలో కుర్చీ వేసుకుని మార్కండేయ ప్రాజెక్టును పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారని.. ఇప్పటివరకు తట్టెడు మట్టికూడా తీయలేదని రేవంత్ చెప్పారు. ‘‘ప్రాజెక్టు కట్టకుండా ఫాంహౌస్‌లో పడుకున్న సీఎంను ఈడ్చుకురావడానికే నాగం జనార్దన్‌రెడ్డి అక్కడికి పోయిండు. చేతనైతే ప్రాజెక్టు కట్టాలి్సందే. చేతకాకపోతే మీరు వచ్చాక కట్టుకోండి అని చెప్పి ఉండాల్సింది. కానీ ప్రాజెక్టుపై ప్రశ్నించిన గిరిజనుడు వాల్యానాయక్, దళితుడు రాములుపై దాడి చేస్తారా? వారి గొంతుపై కాలు పెట్టి తొక్కుతారా? దాడి చేసినవారికి ఈ ధైర్యం ఎక్కడిది. కేసీఆర్ నుంచే వచ్చింది. భూస్వాములు, దొరలను నిలువరించిన ఈ గడ్డ దళితులపై దాడులను చూస్తూ ఊరుకుంటుందా? 1,200 మంది శవాల పునాదుల మీద గద్దెనెక్కి ఇప్పుడు కాలుపెట్టి తొక్కుతారా? ఎన్నికలప్పుడు మా ఊరు, వాడ, బస్తీ, చెంచుపెంటలు, గూడెలకు వస్తావు కదా.. అప్పుడు నీ నెత్తిమీద కాలు పెట్టి తొక్కుతాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. మేం కడితే.. మీరు ఫొటోలు దిగుతారా? పాలమూరులో జూరాల, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ చెప్పారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ పూర్తిచేస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాల్వల దగ్గర ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాలు, మూడెకరాల భూమి, మాదిగ వర్గీకరణ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై సర్కారు దౌర్జన్యం: మాణిక్‌రావు ఠాక్రే రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వ దౌర్జన్యం దుర్మార్గమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే మండిపడ్డారు. వాల్యానాయక్, రాములుపై జరిగిన దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల వికాసం, పేదలు, గిరిజనులు, దళితుల అభివృద్ధి కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. కానీ ఇప్పుడు అన్నీ అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ తోడ్పాటుతోనే బీఆర్ఎస్ శ్రేణుల దుర్మార్గాలు: భట్టి రాష్ట్రం వచ్చాక దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత నాగం జనార్దనరెడ్డి కళ్ల ముందే దౌర్జన్యం జరిగిందని.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల దుర్మార్గాలకు ప్రభుత్వ సహకారమే దీనికి కారణమని మండిపడ్డారు. కాగా.. నాగర్‌కర్నూల్ సభలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నదీమ్ జావేద్, నేతలు మల్లు రవి, షబ్బీర్‌అలీ, నాగం జనార్దనరెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, రా>ములు నాయక్, శివసేనరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతం, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్‌లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
-
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
మన్ననూర్: గుర్తుతెలియని దుండగుల చేతిలో ఓ చెంచు యువకుడు హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాచారానికి చెందిన దాసరి లింగస్వామి (24) అచ్చంపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాడు. లింగస్వామి అచ్చంపేట నుంచి స్వగ్రామం మాచారం కాలనీకి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వచ్చి ఇంటి ముందు బైక్ నిలిపే క్రమంలో అకస్మాత్తుగా కొందరు దుండగులు దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా లింగస్వామిని పొడిచారు. ఈ ఘటనలో అతనిపై 34 కత్తిపోట్లు పడగా.. గుండెపై 3 అంగుళాల మేరకు గాయం కావడంతో లింగస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వీరబాబు పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసు జాగిలాన్ని రప్పించగా.. హత్య జరిగిన ప్రదేశం నుంచి అమ్రాబాద్ వైపు రోడ్డు మార్గంలో కొంతదూరం వెళ్లి వెనుదిరిగింది. మృతదేహాన్ని అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి తల్లి, నలుగురు అక్కలు ఉన్నారు. లింగస్వామి హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రేమ వ్యవహారమే కారణమా..? లింగస్వామి హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతనికి గతంలో ఓ యువతితో పెళ్లి కుదిరింది. అయితే ఇదివరకే మరో వ్యక్తితో నిశ్చితార్థం అయిన అమ్రాబాద్ మండలానికి చెందిన ఓ యువతితో లింగస్వామి కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో యువతితో నిశ్చితార్థం జరిగిన యువకుడు, లింగస్వామి గతంలో ఒకసారి సెల్ఫోన్లో వాదులాడుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ఎవరితో శత్రుత్వం లేదని, ఈ ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా.. -
పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ..
-
ఉద్రిక్తత: భూమి విషయంలో గొడవ.. కొట్టుకున్న రెండు గ్రామాల రైతులు
సాక్షి, నాగర్ కర్నూలు: జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుడికిల, నార్లాపూర్ గ్రామాల రైతులు పోడు భూముల వ్యవహారంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు గ్రామాల రైతులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం పదిమందికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాలకు ప్రజల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పోడు భూముల సర్వే సందర్భంగా భూమి తమది అంటే తమది అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ కట్టెలతో కొట్టుకుంటూ దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో.. ఆ పనిచేసిందెవరు?
సాక్షి, జడ్చర్ల: డిగ్రీ విద్యార్థిని మునావత్ మైన(19) ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు కళాశాలలో అసలేం జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో చరిత్ర కలిగి ఉండి ఇటీవలే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల. దీనికితోడు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు, హెర్బేరియం గుర్తింపు తదితర కార్యక్రమాలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు ఉండగా.. మరోవైపు కొందరు ఆడపిల్లల పట్ల అనుచిత భావన కలిగి ఉన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గురుశిష్యుల బందాన్ని తప్పుగా అర్థం చేసుకోలేరన్న భావనను కొందరు లెక్చరర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి. వైరల్ అయిన ఫొటోలు విద్యార్ధిని మైన ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఓ విద్యార్ధినితో ఓ లెక్చరర్ కలిసి ఉన్న ఫొటోలు గురువారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెస్టారెంట్ తదితర ప్రాంతాల్లో ఉన్న సమయంలో కొందరు వారిని అనుసరించి దూరంగా ఉండి తీసినట్లుగా ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ ఫొటోలలో ఉన్న విద్యార్థిని ఎవరన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. సంబంధిత వార్త: Viral Video: అవమాన భారం.. తీసింది ప్రాణం వీడియో ఎవరు తీశారు? విద్యార్థిని మైనా ఆత్మహత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్న వీడియోను ఎవరు తీశారన్నది తెలియాల్సి ఉంది. డిగ్రీ కళాశాల తరగతి గదిలో ఆ రోజు ఎందుకు గొడవ జరిగింది. ప్రిన్సిపాల్, లెక్చరర్లు చెబుతున్నదే నిజమా.. మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారించాల్సి ఉంది. అసలు ఈ గొడవలో దాడికి పాల్పడిన విద్యార్థిని, ఫొటో తీశారని చెబుతున్న మరో విద్యార్థిని, లెక్చరర్ల పాత్ర ఎంత మేరకు ఉందో కూడా విచారించాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకున్న మైన తాను తీసిన ఫోటోలను ఎవరికి పంపిందో కూడా తెలియాల్సి ఉంది. లెక్చరర్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిఘా వేసి బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా..? అన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఓ లెక్చరర్, ఓ విద్యార్థిని ఎక్కడెక్కడ తిరిగిన ఫొటోలో తీయాల్సిన అవసరం ఎవరికి ఉండి ఉందో కూడా తేలాల్సిన అవసరం ఉంది. విద్యాబోధన గాలికొదిలారా..? విద్యా బోధనను గాలికి వదిలేసి, బోధనేతర కార్యక్రమాలపై లెక్చరర్లు దృష్టి సారించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్సిపాల్ చిన్నమ్మ అడ్మినిస్ట్రేషన్‌లో కొంత వీక్‌గా ఉన్నారన్న ప్రచారం ఉంది. పోలీసులు, ఉన్నత విద్యాధికారులు జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కళాశాల ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడిన మైన ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నాగర్‌కర్నూల్ సీఐ హన్మంతు ‘సాక్షి’ వివరణ కోరగా.. ప్రస్తుతానికి అలాంటిదేమి లేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కళాశాలలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆదేశాల మేరకు కలెక్టర్ వెంకట్రావ్ సస్పెండ్ చేశారు. -
పాలమూరులో వైద్య కళాశాలలు
-
మునుగోడు బరిలో ఉంటాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిజినేపల్లి: త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తా రన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా తాము పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెడతామని వెల్లడించారు. చదవండి: బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి: రేవంత్ -
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం
-
జూపల్లి కృష్ణారావు ఇంటికి కేటీఆర్
-
కాంగ్రెస్ కు చరిత్ర తప్ప మిగిలింది శూన్యం: మంత్రి కేటీఆర్
-
బుల్లితెరపై కందనూలు కుర్రాడు.. పదేళ్ల కష్టం తర్వాత..
సాక్షి, మహబూబ్‌నగర్: కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒకరోజు ఫలితం ఉంటుందని నిరూపించాడు నాగర్‌కర్నూల్‌కు చెందిన రాఘవ. తాను పడ్డ పదేళ్ల కష్టానికి నేడు బుల్లితెర హీరో అయ్యాడు. కొందరు స్నేహితుల సహకారంతో నేడు ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న గీతగోవిందం సీరియల్లో హీరోగా.. రంగులరాట్నం అనే మరో సీరియల్లోనూ సెకండ్ లీడ్రోల్లో నటిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి.. రాఘవ డిగ్రీ వరకు నాగర్‌కర్నూల్‌లోనే చదివారు. 2012లో కొందరు స్నేహితులతో కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు. 2013లో హైదరాబాద్ బస్సెక్కా రు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌తో కొన్నాళ్లు కథలు రాశారు. అయిదేళ్ల పాటు మోడలింగ్, షార్ట్‌ఫిలిమ్స్‌లోనూ ప్రయత్నాలు చేశారు. టిక్‌టాక్‌తోనే.. స్నేహితుడు శేఖర్ సలహా మేరకు 2018లో టిక్‌టాక్‌లో అడుగుపెట్టి సుమారు 250 వీడియోలు చేశారు. ఈ వీడియోలతో తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాఘవకు మంచి పేరొచ్చిందనే చెప్పాలి. తన ఫిజిక్, నటన సూర్యను పోలి ఉండటంతో జూనియర్ సూర్య అంటూ కామెంట్లు మేలు చేశాయి. వీడియోలు చూసిన ఓ డైరెక్టర్ ఫోన్లో సంప్రదించి అవకాశం ఇచ్చారు. చదవండి: ‘గృహలక్ష్మి’ సీరియల్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్.. మొదటిసారి యాడ్‌లో.. దీపక్ అనే యాడ్స్ డైరెక్టర్ కడపకు చెందిన పీఎస్కే టీ పౌడర్ యాడ్‌లో నటించేందుకు అవకాశం ఇవ్వడంతో 2019లో యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇదే ఏడాది నందగోకుల్ నెయ్యికి సంబంధించిన యాడ్లోనూ నటించారు. సీరియల్స్‌లో అవకాశం.. 2020 అక్టోబర్ 2న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాఘవకు ఫోన్ వచ్చింది. గీతగోవిందం సీరియల్లో హీరో కావాలని.. ఆడిషన్స్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. సెలెక్టయినా లాక్డౌన్ రావడంతో ఈ ప్రాజెక్టు వాయిదాపడింది. 2021లో అనిల్ అనే డైరెక్టర్ రంగులరాట్నం సీరియల్ తీస్తుండడంతో అందులో సెకండ్ హీరోగా రాఘవను ఎంపిక చేయగా మొదట ఇదే సీరియల్ టెలికాస్ట్ అయింది. జనవరి 2, 2022న గీతగోవిందం ప్రారంభం కాగా ఫిబ్రవరి 2న సీరియల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో అవ్వడమే లక్ష్యం.. ప్రస్తుతం రెండు సీరియల్స్‌లో నటిస్తున్నా. వీటితో పాటే ఇతర ప్రయత్నాలు చేస్తున్నా. సినీ హీరో అవ్వడమే లక్ష్యం. ఈ ప్రయాణంలో చాలామంది స్నేహితులు సహకరించారు. ప్రోత్సహించడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. వారి సహకారం ఎప్పటికీ మర్చిపోను. – రాఘవ, సీరియల్ హీరో -
మళ్లొస్తా నల్లమలకు..
సాక్షి, నాగర్‌కర్నూల్: చెంచుల సంక్షేమం, జీవ నోపాధికి నిబద్ధతతో కృషి చేస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ఆదివాసీల స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నామని, తర్వాత మిగతా గిరిజన ఆవాసాలకూ ఈ కార్యక్రమాలను విస్తరిస్తా మని తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమ లలోని లోతట్టు అటవీప్రాంతం అప్పాపూర్ గ్రామాన్ని గవర్నర్ శనివారం సందర్శించారు. దట్టమైన అడవిలో చెంచులను వారి నివాసా ల్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంద ని, ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని అన్నారు. మళ్లీ ఒకసారి నల్లమల ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఓ గవర్నర్‌గా కాకుండా డాక్టర్‌గా చెంచుల ఆరోగ్యం, జీవన స్థితిగతుల పట్ల తనకెప్పుడూ ఆందోళనగా ఉంటుందన్నారు. చెంచుల ఆరోగ్య సంరక్షణతో పాటు పోషకాహారం అందించేందుకు న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ స్కీంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, మందులు, ఆస్పత్రి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వివరించారు. 6 గ్రామాలకు రూ. 1.5 కోట్లు నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండేసి గ్రామాల చొప్పున మొ త్తం 6 గ్రామాలను దత్తత తీసుకున్నామని గవర్నర్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారం తో ఆయా గ్రామాల్లో సోలార్ విద్యుత్, పాఠశా లల మరమ్మతులు, గిరిజనుల ఇళ్ల మరమ్మతు ల పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక కార్యక్రమాల అమలుతో పాటు ఇంటింటికీ 10 చొప్పున రాజశ్రీ కోళ్లను పంపిణీ చేశామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 6 గ్రామాలకు రూ.1.5 కోట్లు కేటాయించామని తెలిపారు. గవర్నర్ పర్యటకు నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గైర్హాజరయ్యారు. మరోవైపు సమావేశానికి హాజరైన చెంచులకు అధికారులు భోజన వసతి కల్పించకపోవడంతో చెంచులు ఆకలితోనే వెనుదిరిగారు. 2 గ్రామాలకు 2 మొబైల్ బైక్ అంబులెన్స్‌లు అప్పాపూర్‌లోని చెంచు ఆవాసాలను సందర్శించిన గవర్నర్.. ఇంటింటికీ మంచినీటి సరఫరాను ప్రారంభించారు. చెంచుల ఆరాధ్య దైవం బైరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమంతో పాటు అప్పాపూర్, భౌరాపూర్ గ్రామా లకు రెండు మొబైల్ బైక్ అంబులెన్స్‌లను అం దజేశారు. ఉన్నత విద్యను చదువుతున్న చెంచు విద్యార్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం తో పాటు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన సర్పంచ్ చెంచులపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ అమ్రాబాద్ మండలం సార్లపల్లి సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ వేదికపైనే గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందించారు. గిరిజన గ్రామాల్లో సర్పంచుల తీర్మానాలకు విలువ లేకుండా పోయిందన్నారు. గిరిజన గ్రామాల సర్పంచులను వివిధ శాఖల అధికారులు హేళనగా చూస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా చెంచులకు తాగునీరు అందిస్తున్నామంటున్నారని.. అది అబద్ధమని, బోర్ల ద్వారా వచ్చే చిలుము నీటితో అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పారు. చెంచుపెంటల్లో సారాయి, మద్యం లేకుండా చేస్తేనే తామంతా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. -
మేమొచ్చాక 2 లక్షల ఉద్యోగాలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ‘డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు అవుతుంది. వచ్చే మార్చికల్లా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం..’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. అంతవరకు ఓపిక పట్టాలి అని, తెలంగాణలో కాంగ్రెస్ ఉంటేనే పేదలకు అండ దొరుకుతుందని పేర్కొన్నారు. మంత్రివర్గంలో నలుగురు మహిళలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్రమంతటా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతానన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు – మన పోరు’కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. 50 ఏళ్లయినా ‘పాలమూరు’ పూర్తవుతుందా? ‘కరువు ప్రాంతమైన పాలమూరులో వలసలు ఆపేందుకు ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఎనిమిదేళ్లయినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన 50 ఏళ్లయినా ప్రాజెక్టును పూర్తిచేసేలా కనిపించడం లేదు. నీళ్లిస్తే పంటలెందుకు ఎండుతున్నాయో నీళ్ల నిరంజన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. ..’అని డిమాండ్ చేశారు. వైఎస్‌ను నకల్ కొట్టాలని చూస్తున్నారు ‘చేపల వేటను వృత్తిగా బతికే ముదిరాజుల్లో ఎదిగిన ఒక్కడినీ ఓర్వలేక బొందపెట్టాలని చూస్తే.. జనం కర్రు కాల్చి వాత పెట్టారు. టీఆర్ఎస్ నాయకుల నెత్తి మీద రూపాయి పెడితే ఏక్ అణాకు కూడా అమ్ముడుపోరు. లాల్చీ వేసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి కాలేరు, గడ్డం పెంచుకుంటే భగత్ సింగ్ కాలేరు. పంచె కట్టుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేరు. ఈ మధ్య నకిలీ పంచెగాళ్లు వైఎస్‌ను నకల్ కొట్టాలని చూస్తున్నారు. ఓట్ల కోసం ‘పీకే’డ్రామాలు ఆడుతున్నారు..’అని విమర్శించారు. కేసీఆర్ ఆరోగ్యంతో ఉండాలి.. కాంగ్రెస్ చేతిలో ఓడిపోవాలి ‘కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఫొటోలు బయటకు విడిచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవాలి. నల్లమల అడవి గాలి పీల్చి, కృష్ణా నీటిని తాగిన పాలమూరు బిడ్డకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశాన్ని సోనియా ఇచ్చారు. ఒక్క ఓటుతో మీ బిడ్డను ఆశీర్వదించండి..’అని రేవంత్ కోరారు. శ్రీనివాస్‌గౌడ్‌ను కుక్క కూడా కరవదు ‘కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించేందుకు నేను శాయశక్తులా కృషి చేశా. కానీ కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం, కోట్ల కోసం పార్టీ మారిండు. ఏ ముఖం పెట్టుకుని కొల్లాపూర్‌లో తిరుగుతుండు ఆ సన్నాసి. నాగర్‌కర్నూల్‌లో మర్రో.. తిర్రోడో ఎమ్మెల్యే ఉన్నడు. బంకమట్టిని కూడా వదలడం లేదు. అచ్చంపేటలో గువ్వలోడు గబ్బిలాలోడు కూడా అంతే. అబ్రహాం గురించి నేను చెప్పను. ముందస్తు అంటూ ఆయనే ప్రకటనలు చేస్తున్నడు. అలంపూర్‌లో సంపత్‌కుమార్ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రోడ్డు మీద పోయే కుక్క కూడా కరవదు. ఆయన హత్యకు రూ.15 కోట్ల సుపారీ ఇచ్చారంటా. ఇసుక, మట్టి, భూముల ఆక్రమణలు, గుడి భూముల ఆక్రమణలు చేసి ఎంత మందిని బాధపెట్టారో ఆయన. ఇక జిల్లా ఎంపీల పరిస్థితి చూస్తే.. ‘మంచోడని మంచం ఎక్కిస్తే.. మంచం అంతా పాడుచేసిండంటా..’అట్లుంది..’అంటూ రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సమావేశంలో పార్టీ నేతలు బోస్‌రాజు, అంజన్‌కుమార్ యాదవ్, సంపత్‌కుమార్, మల్లు రవి, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, జిల్లా అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్
సాక్షి, నాగర్‌కర్నూల్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ విశిష్టతను కాపాడుతూనే వన్యప్రాణుల పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ చంద్రప్రకాశ్ గోయల్ తెలిపారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద నల్లమల ముఖద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు 70 కి.మీ. రహదారిని ప్లాస్టిక్ రహితంగా మార్చడంతో పాటు ఆ ప్లాస్టిక్‌ను మన్ననూర్‌లో రీసైక్లింగ్ చేయిస్తామన్నారు. ఇందుకోసం 15 మంది స్థానిక చెంచులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. టైగర్ రిజర్వులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం దేశంలోనే తొలిసారన్నారు. అనంతరం మన్ననూర్లోని వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రం, బయోల్యాబ్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. అమ్రాబాద్ జంగిల్ సఫారీలో ప్రయాణించిన అధికారులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. నల్లమలలో చెంచు మహిళలకు ఉపాధి కల్పించేందుకు అపోలో ఫౌండేషన్ ఏర్పాటుచేసిన ప్యాకేజింగ్ వర్క్‌షాపు, అచ్చంపేట అటవీశాఖ కార్యాలయంలో చౌసింగా మీటింగ్ హాల్, ఔషధ మొక్కలతో ఏర్పాటుచేసిన మెడిసినల్ గార్డెన్‌ను ప్రారంభించారు. అలాగే అచ్చంపేటలో నిర్మించనున్న అటవీ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ ఉన్నారు. బోల్తాపడిన కారు నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన కారు మార్చాల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. మృతులు మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి (22), పిఎ పల్లికి చెందిన శిరీష (20), కొండమల్లే పల్లి అన్నేపక అరవింద్ (23) గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుప్రతికి తరలించారు. టీచర్ మృతి మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బోరాజ్ చెక్‌పోస్టు వద్ద జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఉపాధ్యాయురాలు పద్మ మరణించారు. బైక్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. -
ఏపీ, తెలంగాణ మధ్య తీగల వంతెన.. పిల్లర్లు లేకుండానే..
అచ్చంపేట (నాగర్‌కర్నూల్): తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య మరో వారిధికి మార్గం సుగమమైంది. దశాబ్దాల కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021– 22 బడ్జెట్లో రూ.600కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జి కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల– సిద్దేశ్వరం వద్ద అధునాతన ‘ఐకానిక్’ (తీగల) వంతెన ఏర్పాటుకు నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల సంస్థ గత నెల 21న డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలోని 76/400 కి.మీ., కల్వకుర్తి (కొట్ర) నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ., రహదారిగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మిస్తారు. ఇప్పటికే టూరిజం హబ్‌గా ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో కలికితురాయిగా మారుతుంది. కృష్ణానది బ్యాక్‌వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జి ఏర్పాటు కాబోతుంది. మూడు ప్రతిపాదనలు కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జి ఏర్పాటుకు కన్సల్టెంట్ సంస్థ మూడు ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది. ఇందులో మూడో ఆప్షన్‌కు ఆమోదం ముద్ర వేసింది. మొదటి ఆప్షన్ సోమశిల కాటేజీల నుంచి 1,800 మీటర్ల బ్రిడ్జికి, రెండో ఆప్షన్ సోమశిల వెళ్లే రహదారిలో కుడివైపు కృష్ణానది బ్యాక్‌వాటర్ నుంచి రోడ్డు, 750 మీటర్ల బ్రిడ్జికి ప్రతిపాదించారు. మూడో ఆప్షన్లో ప్రతిపాదించిన సోమశిల రీ అలాన్‌మెంట్ 9.20 కి.మీ రహదారి 600 మీటర్ల ఐకానిక్ బ్రిడ్జి ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది.æ కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పథకం కింద 173.73 కి.మీ., జాతీయ రహదారిలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 87.600 కి.మీ., రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు రూ.1,200 కోట్లు కేటాయించింది. సిద్దేశ్వరం రెండు కొండల మధ్య ఏర్పాటు కానున్న తీగల వంతెనతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరడంతోపాటు సోమశిల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. తీగల వంతెన అంటే.. సోమశిల– సిద్దేశ్వరం రెండు కొండల మధ్య (600 మీటర్లు) తక్కువ దూరం ఉండటంతో ఈ స్థలం ఎంపిక చేశారు. రెండు కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్ బ్రిడ్జి మాదిరిగా అటు ఇటు రెండు పెద్ద టవర్లు నిర్మిస్తారు. ఈ రెండు టవర్లకు కేబుల్స్ బిగించి బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్ నుంచి బ్రిడ్జి సప్‌సెంట్ అవుతుంది. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది. దివంగత సీఎం హయాంలోనే.. సోమశిల బ్రిడ్జి నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో కొల్లాపూర్ ఎక్స్‌రోడ్డులో శిలాఫలకం వేశారు. అప్పట్లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు రూ.93 కోట్లు కేటాయించారు. కొన్ని సాంకేతిక కారణాలతో అప్పట్లో పనులు మొదలుకాలేదు. తిరిగి 2012లో బ్రిడ్జి నిర్మాణానికి రూ.193కోట్లు, రోడ్డుకు రూ.60 కోట్లు కేటాయించగా రోడ్డు పనులు పూర్తిచేశారు. బ్రిడ్జి నిర్మాణం అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. అభివృద్ధికి బాటలు.. జాతీయ రహదారి, సోమశిల బ్రిడ్జితో నాగర్‌కర్నూల్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. అధునాతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకంగా ఈ ప్రాంతంలో రిసార్ట్స్ ఏర్పాటవుతాయి. వెనకబడిన ఈ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. నల్లమల అందాలు తిలకించేందుకు ఇప్పటికే పర్యాటకులు వస్తున్నారు. బ్రిడ్జి ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. – రాములు, ఎంపీ, నాగర్‌కర్నూల్ -
కేసీఆరే నిజమైన అంబేడ్కర్‌వాది
సాక్షి, మహబూబ్‌నగర్: ‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చూపిన మార్గంలో 14 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ సాధించిన వ్యక్తి సీఎం కేసీఆర్.. డాక్టర్ బాబాసాహెబ్ గారినే కేసీఆర్ అవమానించిండు అని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.. కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము లేక విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ కంటే నిజమైన అంబేడ్కర్‌వాది ఎవరూ లేరు’అని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌లో రైతు వేదిక, 40 డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో సీఎం మాట్లాడారని.. తెలంగాణకు నిధుల కేటాయింపు విషయమై ప్రశ్నించారని.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే కేంద్రం నుంచి ఉలుకూపలుకు లేదన్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా లేక, విషయ పరిజ్ఞానం లేక, భావ దారిద్య్రంతో కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్లు కొందరు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే దేశమంతా ‘దళితబంధు’ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ప్రధానమంత్రిని ప్రత్యేకంగా రాష్ట్రానికి పిలిచి సన్మానం చేస్తామన్నారు. తెలంగాణనూ సమదృష్టితో చూడాలని కోరుకుంటా.. ‘నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటా’అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వయంగా చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 105 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశాయన్నారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి రాజ్యాంగ సవరణకు ఒక కమిటీ వేశారని, మోహన్ భాగవత్ కొత్త రాజ్యాంగం కావాలన్నారని.. వారు కూడా రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లా అని నిలదీశారు. ‘ప్రధాని మోదీ శనివారం సమతామూర్తి విగ్రహాన్ని అవిష్కరించేందుకు వస్తున్నారు. ఆయన కలలోకి వెళ్లి తెలంగాణను కూడా సమదృష్టితో చూడాలని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కర్ణాటక, మహారాష్ట్రలతో సమానంగా తెలంగాణను చూడాలని ఆ రామానుజచార్యుల వారిని కోరుకుంటా’అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సహకరించడం లేదు.. ‘విద్య విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. దేశంలో 150 మెడికల్ కాలేజీలు, 8 ఐఐఎం కళాశాలలు, వందకు పైగా నవోదయ పాఠశాలలు మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పొరాడు అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాధించింది కేసీఆరే. కేంద్రం కలసి వచ్చినా రాకపోయినా ప్రజాశీర్వాదంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి కేటీఆర్ -
‘యాసంగి’ యమా స్పీడ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ పంటల సాగు జోరందుకుంది. వానాకాలంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం పెరగడంతో సాగు పనులు చకచకా సాగుతున్నాయి. యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 46,49,676 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకు 8,06,511 ఎకరాల్లో (17 శాతం) వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 4,63,744 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది రెట్టింపు వేగంతో పంటల విస్తీర్ణం పెరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నాటికి లెక్కతేలనున్న వరి విస్తీర్ణం ధాన్యం కొనుగోలుపై కేంద్రం పలు ఆంక్షలు విధించిన క్రమంలో యాసంగి సీజన్లో వరిసాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సూచనలు చేస్తోంది. వాస్తవానికి యాసంగిలో రాష్ట్రంలో సగటున 52.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యేది. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయలేమని కేంద్రం తేల్చిచెప్పడంతో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల దృష్టి పెట్టారు. ఈక్రమంలో ఈ ఏడాది వరిసాగును 21 లక్షల ఎకరాలకు తగ్గించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది. దీంతో ఈ సీజన్లో వరిసాగు 31.01 లక్షల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు 1,737 ఎకరాల్లోనే వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా వరినాట్లు డిసెంబర్లో మొదలై జనవరి రెండో వారంకల్లా గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుతం వరినాట్లు ప్రారంభ దశలో ఉండటంతో విస్తీర్ణం ఏమేరకు తగ్గుదల ఉంటుందో చూడాలి. నాగర్‌కర్నూల్‌లో అత్యధికం... యాసంగి సీజన్ పంటల సాగులో నాగర్‌కర్నూల్ జిల్లా ముందు వరుసలో ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికే 76 శాతం మేర పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 61 శాతం, వనపర్తి జిల్లాలో 39 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 36 శాతం, గద్వాల జిల్లాలో 35 శాతం పంటలు సాగైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈ నెల రెండోవారం నుంచి సాగు పుంజుకునే అవకాశాలున్నాయి. నెలాఖరుకల్లా సాధారణ సాగు విస్తీర్ణాన్ని చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
చలో నల్లమల.. 17 నుంచి టూర్ ప్రారంభం
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవి గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణులను ప్రత్య క్షంగా వీక్షేందుకు, ఇక్కడ స్థానికంగా ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అవకాశం కల్పిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. నల్లమలలోని అరుదైన, ప్రత్యేకమైన వన్యప్రాణులు, పక్షులు, జీవ, వృక్షజాతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అటవీ సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించేలా ప్రత్యేక జంగిల్ స్టే ప్యాకేజీలను అమలుపర్చబోతోంది. జంగిల్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌తో పాటు స్థానిక గిరిజనులతో మమేకమయ్యేలా ప్యాకేజీలను రూపొందించింది. ఈనెల 17 నుంచి ఆన్లైన్ ద్వారా బుకింగ్ ప్రారంభంకానుంది. 24 కి.మీ. మేర జంగిల్ సఫారీ.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలు గా సఫారీ వాహనంలో అడవిలోకి తీసుకెళ్తారు. అమ్రాబాద్ మండలంలో హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై ఉన్న గుండం చెక్‌పోస్టు నుంచి ఫర్హాబాద్ వ్యూపాయింట్ వరకు తీసుకెళ్తారు. నల్లమలలో జంగిల్‌సఫారీ ఇక్కడ నుంచి నల్లమల అటవీప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. అక్కడి నుంచి ఫర్హాబాద్ పెంట మీదుగా ఫర్హాబాద్ చెక్‌పోస్టు వరకు సఫారీ ప్రయాణం కొనసాగుతుంది. సుమారు 24 కి.మీ.మేర సాగే ఈ సఫారీలో పులులతో పాటు వివిధ వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే అవకాశముంది. స్థానికంగా ఉండే చెంచులే టూరిస్టు గైడ్లు.. నల్లమలలో స్థానికంగా నివసించే చెంచులతో మమేకమై వారితో ముచ్చటించేందుకు ఏటీఆర్ అవకాశం కల్పిస్తోంది. చెంచుల స్థితిగతులు, జీవనవిధానంపై నాటిక రూపంలో ప్రదర్శనలు, పాటలను ఆలపిస్తారు. వారు తినే ఆహారం, స్థానికంగా ఉన్న వెరైటీలను సందర్శకులకు కూడా రుచి చూపిస్తారు. మన్ననూరు నుంచి ఉమామహేశ్వర ఆలయం వరకు అడవిలోని కొండల మధ్య ట్రెక్కింగ్‌కు సైతం చెంచులే తీసుకెళ్తారు. నల్లమల అందాలను మనసారా ఆస్వాదించేలా ఫారెస్ట్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌లను ఏటీఆర్ అధికారులు రూపొందించారు. రెండు రోజుల పాటు అడవిలో గడిపేలా ఈ ప్యాకేజీ ఉంటుంది. -
రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం
కుత్బుల్లాపూర్: డ్రగ్స్ సరఫరా చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఓ ముఠాకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెక్ పెట్టారు. మేడ్చల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు రూ.2 కోట్ల విలువైన 5 కిలోల మెఫిడ్రోన్/మిథాంఫిటమిన్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రయ్య, మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విజయభాస్కర్ శనివారం ఈ వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి న్యూ బాలాజీనగర్‌లోని ఎస్వీ సెలెక్షన్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ తీసుకోవడం తీసుకోవడంతోపాటు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న మేడ్చల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్.. ఈ దాడుల్లో క్యాబ్ డ్రైవర్ పవన్ అలియాస్ చిటుకూరి ప్రశాంత్‌రెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 5 గ్రాముల మత్తు పదార్థం లభించింది. అదుపులోకి తీసుకుని విచారించగా, కన్నారెడ్డి అలియాస్ మహేశ్ కన్నారెడ్డి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో బొంగులూర్ గేటు సమీపంలోని గురుదత్తా లాడ్జిపై దాడులు చేయగా కన్నారెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 921 గ్రాముల మెఫిడ్రోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఈ వ్యవహారంతో సంబంధమున్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మరాజ్పేట మండలం బావాజీపల్లి గ్రామానికి చెందిన కొండమూరి రామకృష్ణగౌడ్ ఇంటిపై దాడులు చేశారు. అతడి వాహనాన్ని తనిఖీలు చేయగా, 4 కిలోల మెఫిడ్రోన్ పట్టుబడింది. బావాజీపల్లికి చెందిన బండారు హన్మంత్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి అలియాస్ ఎస్.కె.రెడ్డి తనకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అతను చెప్పారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్‌గా పనిచేసిన ఎస్.కె.రెడ్డి పటాన్చెరులో ఓ మూతబడిన పరిశ్రమను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా, కుత్బుల్లాపూర్, బాలానగర్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల వద్ద నిఘా ఏర్పాటు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు లేదా తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, తగిన నగదు పారితోషికం అందిస్తామని అధికారులు తెలిపారు. -
పాఠశాలల్లో కరోనా కలకలం
తుంగతుర్తి/దేవరకొండ/కట్టంగూర్/నాగర్‌కర్నూల్ క్రైం/లింగాలఘణపురం: రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. తాజాగా సూర్యాపేట, నల్లగొం డ, నాగర్‌కర్నూల్, జనగామ జిల్లాల్లోని పాఠశాలల్లో తొమ్మి ది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం జెడ్పీ ఉన్న త పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి బుధవా రం కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కమలాపూర్ ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి పాజిటివ్‌గా తేలింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ప్రా«థమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. నాగర్‌కర్నూల్‌లో నలుగురు విద్యార్థినులకు.. తరగతులు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీహెచ్ఎస్ (బాలికల)లో చేసిన పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌గా తేలింది. మిగతా విద్యార్థులకు గురువారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నాగారం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పరీక్షలు నిర్వహించగా ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడిన వారికి మెడికల్ కిట్లు అందించి, పాఠశాలలను శానిటైజ్ చేశారు. -
Nagarkurnool: బస్సు నడుస్తున్న సమయంలోనే ఊడిపోయిన చక్రాలు
కల్వకుర్తి రూరల్: ఆర్టీసీ బస్సు నడుస్తున్న సమయంలోనే వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయాయి. ఈ ఘటన ఆదివారం మార్చాలలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా తోటపల్లి నుంచి 20 మంది ప్రయాణికులతో ఓ ఆర్టీసీ బస్సు కల్వకుర్తికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. దానిని వెనక్కి తీసుకురావడానికి కల్వకుర్తి డిపో నుంచి మరో బస్సు (ఏపీ 28జెడ్ 2271)ను అధికారులు పంపించారు. అయితే ఆ బస్సు మార్చాల సమీపంలోని కాటన్‌మిల్ వద్దకు చేరుకోగానే అకస్మాతుగా వెనుక ఉన్న రెండు చక్రాలు ఊడిపోయాయి. అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కకు నిలిపివేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు అందులో ప్రయాణికులెవరూ లేరు. -
పీర్ల పండుగలో ‘గోరటి’ సందడి
తెలకపల్లి: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న.. శాసనమండలికి ఎంపికైన తర్వాత తొలిసారి వచ్చిన పీర్ల పండుగలో సందడి చేశారు. ఆయన స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారంలో పీర్ల చావడిలో గురువారం రాత్రి ఫాతేహా నిర్వహించారు. పీర్లకు దట్టీలు సమర్పించి, మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ యువకులతో కలిసి అగ్ని గుండం చుట్టూ ఆడిపాడారు. టీఆర్ఎస్ను గద్దె దించుతాం: ఠాగూర్ సాక్షి, నాగర్‌కర్నూల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గద్దె దించుతా మని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం నిర్వహించిన పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నిరంగాల్లో గుణాత్మకమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందన్నారు. పార్టీలో సెప్టెంబర్ 30లోగా ప్రతి బూత్‌కు ముగ్గురుసభ్యుల చొప్పున కమిటీ నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ నేతలు మల్లు రవి, బోసు రాజు, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, మహేశ్‌గౌడ్, నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాసేపట్లో పెళ్లి.. షాకిచ్చిన వధువు
అమ్రాబాద్: కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా..తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వధువు తేల్చి చెప్పడంతో పీటల మీద పెళ్లి ఆపేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన 19 ఏళ్ల యువతి ఇంటర్ పూర్తి చేయగా..ఆమెకు వంకేశ్వరం గ్రామానికి చెందిన బద్రు అనే యువకుడితో ఇటీవల వివాహం నిశ్చయించారు. ఇరు కుటుంబాలు వీరి వివాహానికి బుధవారం ముహూర్తం నిర్ణయించారు. దీంతో పెళ్లికూతురు, ఆమె తరఫు బంధువులు వరుడు స్వగ్రామం వంకేశ్వరానికి చేరుకున్నారు. కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో ఈ పెళ్లి ఇష్టం లేదని, తనకు బాగా చదువుకోవాలని ఉందని వధువు చెప్పడంతో అక్కడికి చేరుకున్న బంధువులు అ వాక్కయ్యారు. వధువుకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎంత సర్ది చెప్పినా ఆమె వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని ఆపేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తకుండా చూశారు. -
ఆ ఇంట అన్నీ విషాదాలే.. ఆరు నెలల్లో నలుగురు మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్: ఆ ఇంట అన్నీ విషాదాలే. ఆరు నెలల క్రితం అన్న, ఐదు నెలల క్రితం చిన్నారి, నేడు తండ్రి, కొడుకుల మరణం.. ఇలా ఆ కుటుంబంలో నలుగురు మగవారు అందులో ముగ్గురు ఇంటికి పెద్దదిక్కుగా ఉండగా మృత్యువాత పడటం గ్రామస్తులను కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం గ్రామానికి చెందిన సరళమ్మ, చిన్నబాలయ్యగౌడ్ (60) దంపతులకు దివ్యాంగుడు బాలరాజ్ (40), శివకుమార్ (35) కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం కాలేదు. గద్వాల మున్సిపల్ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేసేవాడు. అనారోగ్యంతో ఆరు నెలల క్రితమే చనిపోయాడు. చిన్నబాలయ్యగౌడ్ (ఫైల్), శివకుమార్ (ఫైల్) ఈయనకు చెందిన మెడికల్ బిల్లులు తీసుకుని శుక్రవారం ఉదయం చిన్నబాలయ్యగౌడ్, శివకుమార్ బైక్‌పై గద్వాలకు బయలుదేరారు. బిజినేపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే మరో బైక్‌పై ఎదురుగా వస్తున్న కొటాల్‌గడ్డకు చెందిన వినోద్‌కుమార్, రాఘవేందర్ ఢీకొన్నారు. దీంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు యువకులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై శివకుమార్ భార్య సంధ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేష్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతదేహాలను పరిశీలించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చిన్నబాలయ్యగౌడ్, శివకుమార్‌ల మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.20 వేలు అందజేసి, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వరుస సంఘటనలతో విషాదం కాగా, చిన్నబాలయ్యగౌడ్ మనవడు ఐదు నెలల క్రితమే గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. ఆరు నెలల క్రితం పెద్ద కుమారుడు, ఇప్పుడు తండ్రి, చిన్న కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అలాగే సంధ్య ప్రసుతం ఏడు నెలల గర్భిణి. ఇలా వరుస సంఘటనలతో ఆరు నెలల వ్యవధిలో ఆ కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నాగర్ కర్నూల్: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
-
నాగర్ కర్నూల్: రెండు కార్లు ఢీకొని...ఏడుగురి మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్/హైదరాబాద్/ఉప్పునుంతల: శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళుతున్న నలుగురు.. మల్లన్నను దర్శించుకుని తిరిగొస్తున్న మరో నలుగురు.. రెండు కార్లూ వేగంగా దూసుకెళ్తున్నాయి. రెప్పపాటులో భారీ ప్రమాదం.. రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొని నుజ్జునుజ్జు అయ్యాయి. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (765 నంబర్)పై నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పిరట్వాన్‌పల్లి–చెన్నారం గేటు మధ్య శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న కారులో ఉన్న శివకుమార్ (30), ఆయన తల్లి సుబ్బలక్ష్మి (61), లవమూర్తి (41), అతడి కుమారుడు వెంకటరమణమూర్తి (15) చనిపోయారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో వంశీ (32), వెంకటేశ్ (29), కార్తీక్ (30) మృత్యువాత పడ్డారు. నరేశ్ అనే యువకుడు గాయపడ్డాడు. నరేశ్‌ను మొదట అచ్చంపేట ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎల్.శర్మన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తోటి ఉద్యోగి వద్ద కారు తీసుకుని.. మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌కు చెందిన శివకుమార్ సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్లో షిఫ్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇప్పటికే వివాహం కాగా విడాకులు తీసుకున్నాడు. మళ్లీ వివాహం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. మంగళవారం పెళ్లిచూపులకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్లి మొక్కుకుని రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ప్యారడైజ్ హోటల్లోనే పనిచేసే భాస్కర్ వద్ద కారు తీసుకున్నాడు. తన తల్లి సుబ్బలక్ష్మి, మిత్రుడు లవమూర్తి, ఆయన కుమారుడు వెంకటరమణమూర్తిలతో కలసి శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలానికి బయలుదేరారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శివకుమార్ స్వస్థలం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. 15 ఏళ్ల క్రితమే వారి కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. శివకుమార్ తండ్రి కూడా నాలుగేళ్ల కింద రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. ఇక ప్రమాదంలో మరణించిన లవమూర్తి స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం జిల్లా తుని. శ్రీశైలం మల్లన్న దర్శనానికి రావాలని శివకుమార్ కోరడంతో.. కుమారుడు వెంకటరమణమూర్తిని వెంట తీసుకుని వచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులంతా కలిసి వెళ్లి.. హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన వంశీ, నిజాంపేటకు చెందిన వెంకటేశ్, పటాన్‌చెరుకు చెందిన కార్తీక్, అమీన్పూర్ మండలం గండిగూడకు చెందిన నరేశ్ నలుగురు స్నేహితులు. వారంతా 2011లో కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో కలిసి ఇంటర్మీడియట్ చదివారు. అంతా కలిసి గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయలుదేరి శ్రీశైలం వెళ్లారు. రాత్రికి అక్కడే ఉండి దర్శనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లి.. నిజాంపేటకు చెందిన తలారి శంకరయ్య, బాలామణిల రెండో కుమారుడు వెంకట్. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. అక్కడికి వెళ్లాక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తిరిగి ఇంటికి రాకుండానే కన్నుమూశాడు. ఇక వంశీ యూత్ కాంగ్రెస్ నాయకుడు. ఇంకా వివాహం చేసుకోలేదు. తండ్రి వీరాస్వామి, తల్లి అనసూయతో కలిసి జీడిమెట్లలో ఉంటున్నాడు. గండిగూడకు చెందిన నరేశ్ ఓ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత నరేశ్ తమకు ఫోన్ చేశాడని, బాగానే ఉన్నట్టు చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతివేగమే కారణం? హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఇతియోస్ కారు, శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న ఫిగో కారు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు 100– 120 కిలోమీటర్ల వేగంతో వస్తూ అదుపు తప్పిందని, ఎదురుగా వస్తున్న ఫిగో కారును బలంగా ఢీకొట్టి, కుడివైపు దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు తెలిసింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో రెండు కార్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. మృతదేహాలు కార్లలోనే చిక్కుకున్నాయి. బయటికి తీసేందుకు పోలీసులు గంటన్నరకుపైగా శ్రమించాల్సి వచ్చింది. ఇక కార్లలో ఎయిర్ బెలూన్లు ఉన్నప్పటికీ తెరుచుకోలేదని.. మృతిచెందిన వారిలో ఎవరూ సీట్ బెల్టు పెట్టుకున్న దాఖలాలు లేవని పోలీసులు చెప్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సాయం నాగర్‌కర్నూల్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రుడి కుటుంబానికి రూ.50 వేలు పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని, తగిన సహాయం అందించాలని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. -
తాడు సాయంతో వాగు దాటుతున్న స్థానికులు : నాగర్ కర్నూల్
-
Photo Story: ‘నీళ్ల’కంఠుడు.. పూర్తిగా మునిగిన శివాలయం
చుట్టూ గుట్టలు.. పచ్చని పొలాలు.. మధ్యలో అలుగు పారుతున్న ఊకచెట్టు వాగు.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం సమీపంలో కనువిందు చేస్తున్న జలదృశ్యమిది. వాగు మధ్యలోని శివుడి విగ్రహం చుట్టూ నీళ్లు పారుతున్న చిత్రం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. – కొత్తకోట రూరల్ (వనపర్తి జిల్లా) నిజామాబాద్ జిల్లా కందకుర్తిలోని గోదావరి నదిలో గల పురాతన శివాలయం వరదనీటిలో పూర్తిగా మునిగింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం గోదావరి, మంజీర, హరిద్ర నదుల వరద నీటితో జలకళను సంతరించుకుంది. – రెంజల్(బోధన్) సోమశిల సమీపంలోని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో గల సంగమేశ్వరాలయం నీట మునిగింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వదులుతుండడంతో నది నీళ్లు గుడిని తాకాయి. మంగళవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం దాదాపు 4 అడుగుల మేర గుడి నీటిలో మునిగింది. సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. – కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా) -
నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటి?: నిరంజన్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, హమాలీ పని రూపంలో ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటని బాధత్యరాహిత్యంగా వ్యాఖ్యానించారు. వరల్డ్ స్కిల్ యూత్ డే రోజు మంత్రి నిరంజన్‌రెడ్డి నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావటం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. -
భూ వివాదం: కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి,నాగర్‌కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాలు..బిజినేపల్లి మండలం సల్కరిపేటకు చెందిన జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. తన భర్త మృతి చెందడంతో భూమికోసం రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతుంది. వారసత్వంగా రావలసిన భూమి తనకు ఇవ్వకుండా తన బావ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారులకు మొరపెట్టుకుంది. భూమి దగ్గరికి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విన్నవించుకుంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగి పోయిన మహిళ కిరోసిన్ డబ్బాతో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కురుమయ్య కిరోసిన్ బాటిల్ లాక్కున్నాడు. అప్పటికే కిరోసిన్ కొంత ఆమెపై పడింది. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలియజేసింది. సమస్యను పరిష్కరిస్తానని ఇలాంటి కార్యకాలపాలకు పాల్పడవద్దని అన్నారు. -
నల్లమలలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం
అమ్రాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు నల్లమల అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. పదర ఎస్ఐ సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లికి చెందిన శ్రీనివాసులు, పద్మ దంపతుల కుమార్తె శమంత (27), అదే గ్రామానికి చెందిన అయ్యన్న, లింగమ్మ దంపతుల కుమారుడు సురేశ్(28) ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎనిమిదేళ్ల క్రితం శమంతకు సికింద్రాబాద్‌కు చెందిన సతీష్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన శమంత జూన్ 24న నాలుగేళ్ల చిన్న కుమారుడిని తీసుకుని సురేశ్‌తో వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ కేసు నమోదైన నేపథ్యంలో శనివారం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సురేశ్, శమంత తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులు సహాయంతో సిగ్నల్స్ ఆధారంగా మద్దిమడుగు అటవీ ప్రాంతంలో వెతికారు. ఆ సమయంలో అక్కడ బాలుడి ఏడుపు శబ్ధం విని.. ఘటనస్థలానికి చేరుకున్నారు. అప్పటికే పురుగుల మందు తాగి, ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు, వివరాలు సేకరించారు. -
మద్యానికి బానిసైన తండ్రి.. తల్లిని వేధిస్తున్నాడన్న కోపంతో..
ఊర్కొండ (నాగర్ కర్నూల్): తరచూ తల్లిని వేధిస్తుండటాన్ని తట్టుకోలేక తండ్రిని తనయుడు నరికి చంపిన ఘటన మండలంలోని ఇప్పపహాడ్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇప్పపహాడ్కు చెందిన డబ్బా రాములు (52), భార్య రామచంద్రమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. వీరి కుమారులు యాదగిరి, విష్ణు హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అయితే మద్యానికి బానిసైన రాములు తాగినప్పుడల్లా భార్యను వేధించడంతోపాటు చితకబాదేవాడు. మూడురోజుల క్రితం తాగి వచ్చి కొట్టడంతో రామచంద్రమ్మ కుమారులకు సమాచారం అందించింది. వారు గ్రామానికి చేరుకుని తండ్రితో వాగ్వాదానికి దిగి మందలించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పెద్దకుమారుడు యాదగిరి పొలానికి వెళ్లగా.. చిన్న కుమారుడు విష్ణు ఇంటి వద్దే ఉన్నాడు. రాములు భార్యను కొట్టడంతో కోపోద్రిక్తుడైన చిన్న కుమారుడు విష్ణు గొడ్డలితో తండ్రిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే పెద్ద కుమారుడు యాదగిరి, రామచంద్రమ్మ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి సీఐ సైదులు, స్థానిక ఎస్ఐ విజయ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. నిందితుడు విష్ణు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వివాహేతర సంబంధం: మత్తుకు బానిసై కన్నతండ్రే..
నాగర్‌కర్నూల్ క్రైం: ఆలనాపాలనా చూడాల్సిన తండ్రే.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న కొడుకులను కడతేర్చేందుకు ప్రయత్నించాడు. నిద్రపోతున్న ఇద్దరు కుమారుల మణికట్టు కోయగా.. ఓ కుమారుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా మంతటిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ మండలం మంతటికి చెందిన శివశంకర్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి గడ్డంపల్లికి చెందిన స్వప్నతో ఎనిమిదేళ్ల కింద వివాహం కాగా, మల్లికార్జున్ (7), ప్రణయ్ ఇద్దరు కుమారులు ఉన్నారు. శివశంకర్ మద్యానికి బానిస కావడంతో పాటు వివాహేతర సంబంధానికి అలవాటుపడటంతో స్వప్న 3 నెలల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకులను శివశంకర్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న ఇద్దరి కుమారుల కుడిచేతి మణికట్టును కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తాను చనిపోతున్నానంటూ తండ్రి పుల్లయ్యకు ఫోన్‌చేసి చెప్పగా.. వెంటనే వారు పక్క గదిలోకి వెళ్లి చూశారు. అప్పటికే మల్లికార్జున్ మృతి చెంది ఉన్నాడు. గాయపడిన ప్రణయ్‌ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. గ్రామంలో చెరువుకట్ట వద్ద శివశంకర్‌ను గుర్తించిన గ్రామస్తులు ఇంటికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఇన్చార్జి సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐలు విజయ్‌కుమార్, రాజులు పరిశీలించి వివరాలు తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ( చదవండి: బెంగళూరులో హత్య, హైదరాబాద్‌లో గాలింపు! ) -
గిరిజనులను కుళ్లబొడిచిన ఫారెస్ట్ అధికారులు
సాక్షి, నాగర్‌కర్నూలు: అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆదివాసీ గిరిజనులు మన్ననూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇప్పపువ్వు కోసం అడవికి వెళ్లగా ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకొని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో పది మంది గిరిజనులకు గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా అటవీ అధికారులు గిరిజనులను మన్ననూర్ బేస్ క్యాంప్‌లో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని కర్రలతో అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. గిరిజనులు చేసిన దాడిలో పలువురు ఫారెస్ట్ అధికారులకు గాయాలు అయ్యాయి. తమవారిపై అటవీ అధికారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినందుకు గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి అటవీశాఖ సిబ్బంది తమను వేధిస్తున్నారని గిరిజనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో దొరికే ఇప్పపువ్వు కోసం తాము వెళితే పోలీసులు అకారణంగా తమను గాయపరిచారని బాధితులు తెలిపారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో పోలీసులు చేసిన దాడికి నిరసనగా జాతీయ రహదారిపై ధర్నా చేశారు. దీంతో జాతీయ రహదారిపై పలు వాహనాలు నిలిచిపోయాయి. చదవండి: భార్యా భర్తల గొడవ.. బామ్మర్తి చేతిలో బావ హతం -
నాగర్‌కర్నూలు: మన్ననూర్ టైగర్ఫారెస్ట్లో గిరిజనులపై దాడి
-
కారుతో ఢీ కొట్టి.. ఆపై గొడ్డలితో నరికి
నాగర్‌కర్నూల్: ఆస్తి కోసం తోడబుట్టిన అన్ననే కారుతో ఢీకొట్టి.. ఆపై గొడ్డలితో దారుణంగా నరికి చంపిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అనేఖాన్‌పల్లి తండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. తండాకు చెందిన బాదావత్ హనుమంతు (40), బాదావత్ శంకర్ అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇదే క్రమంలో మంగళవారం మరోమారు ఆస్తి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో ప్రాణాలైనా తీసేందుకు సిద్ధమని, ఆస్తి మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని తమ్ముడు శంకర్ హెచ్చరించాడు. ‘నీ చేతనైన పని చేసుకో’ అని అన్న హనుమంతు బదులిచ్చాడు. దీంతో అన్నను ఎలాగైనా హతమార్చాలనుకున్న తమ్ముడు సమయం కోసం ఎదురుచూశాడు. బుధవారం హనుమంతు వ్యక్తిగత పనులపై వట్టెం గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు శంకర్ మార్గమధ్యలో బైక్‌ను కారుతో ఢీకొట్టాడు. దీంతో కిందపడిన అన్నను గొడ్డలితో తల, కాలిపై నరికి హతమార్చాడు. మృతుడికి భార్య యామిని, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటనపై ఎస్ఐ వెంకటేష్‌ని వివరణ కోరగా.. హత్య జరిగిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: మహిళతో రెడ్ హ్యండెడ్‌గా దొరికాడు.. భార్య నగలన్నీ ఆమెకు -
కానిస్టేబుల్ హల్చల్.. విధుల్లో బూతుపురాణం..!
సాక్షి. నాగర్‌కర్నూల్ క్రైం: ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని రాష్ట్ర డీజీపీ సూచిస్తున్నప్పటికీ కొందరు పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఓ పోలీస్ కానిస్టేబుల్ కొందరు యువకులను దుర్భాషలాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఆ వివరాలు.. దీపావళి పండుగ సందర్బంగా పట్టణంలోని రాంనగర్ కాలనీలో గల రామస్వామి ఆలయం ఎదుట బాణాలు కాల్చిన యువకులు అక్కడే కూర్చున్నారు. పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. అందులో ఒకరు శివశంకర్ వచ్చిరాగానే అక్కడున్న యువకులపై దూషణకు దిగాడు. అక్కడనుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. చదవండి: సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ యువకులు వెళ్తుండగానే ఇక్కడ కూర్చోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చార్రా అంటూ బూతులు తిట్టాడు. దీంతో యువకులు ఏంతప్పు చేశామని దూషిస్తున్నారంటూ ప్రశ్నించారు. మరింత రెచ్చిపోయిన కానిస్టేబుల్ తనకు బీపీ లేపొద్దంటూ తిట్ల దండకానికి దిగాడు. అక్కడున్న వారిలో ఒకరు సెల్ఫోన్లో ఈతతంగాన్ని చిత్రీకరించి సోషల్‌మీడియాలో పెట్టారు. బీజేపీ నాగర్‌కర్నూల్ ఇన్చార్జ్ దిలీపాచారి, పలువురు ప్రజా సంఘాలు దీనిపై తీవ్రంగా స్పందించారు. కానిస్టేబుల్‌పై చర్య తీసుకోవాలంటూ అదే మాద్యమాల్లో డిమాండ్ చేశారు. అనుచిత ప్రవర్తన.. పోలీస్ సస్పెన్షన్ విధుల నుంచి తొలగించాం యువకులతో అనుచితంగా వ్యవహరించిన కానిస్టేబుల్ శివశంకర్‌ను బ్లూకోల్ట్స్ విధుల నుంచి తప్పించామని సీఐ గాంధీనాయక్ తెలిపారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేశామని వెల్లడించారు. -
విషాదం: కోడి కూర వండలేదని..
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దసరా పండగ రోజు కోడికూర వండలేదని భార్యను హతమార్చాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సన్నయ్య మద్యానికి బానిసగా మారాడు. దసరా పండగ రోజు (ఆదివారం) మద్యం తాగివచ్చి, భార్య సీతమ్మ(38)ను కోడికూర వండమని చెప్పగా.. ఆమె వండలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సన్నయ్య భార్యను కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లిపోయాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులుకు సమచారం ఇవ్వగా.. అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: (నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో) -
తల్లి గొంతు కోసి..
-
భారీ వర్షాలు: నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆటో
-
డిండి వాగులో చిక్కుకున్న దంపతులు
సాక్షి, నాగర్ కర్నూల్ : భారీ వర్షాలు జిల్లాను ముంచెత్తున్నది. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు నీటిలో చిక్కుకున్నారు. సభావత్, వెంకట్ రాములు,అనే దంపతులు డిండి వాగులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి, సీఎస్‌లతో మాట్లాడి వారిని రక్షించడానికి ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెలికాప్టర్‌ను కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగులోనే చిక్కుకొని ఉండగా.. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నత అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకోనుంది. ('డిండి' దారెటు?)