సాక్షి, నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, చేతల్లో పూర్తిగా నర్వీర్యమై పోయిందని ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 35 వేల కోట్లతో భారీ ఎత్తున చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క రిజర్వాయర్ కూడా పూర్తి చేయకపోవటం టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని అన్నారు. టీఆర్ఎస్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ఎకరాకు రూ.6000 పెట్టుబడి సాయం చేసి బీజేపీ ఆదుకుంటుందని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వృద్ధ రైతులకు పెన్షన్ స్కీము ప్రవేశపెట్టిన ఘనత బీజేపీదేనని కొనియాడారు. విదేశాల్లో దాచిన 4 లక్షల కోట్ల ధనాన్ని భారతదేశానికి తెప్పించిన ఘనత కూడా బీజేపీదేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment