jithender reddy
-
‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: జితేందర్ రెడ్డినటీనటులు:రాకేశ్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలునిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డిదర్శకుడు: విరించి వర్మసంగీతం: గోపి సుందర్ఎడిటర్: రామకృష్ణ అర్రంవిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే.. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ ఇది. 1980లో జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అయితే జితెందర్(రాకేశ్ వర్రె) బాల్యం ఎలా గడిచింది? నక్సల్స్‌ని ఎందుకు ఎదురించాడు? కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా రాకేశ్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? ఆయనపై ఆరెస్సెస్ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? అతన్ని చంపడానికి నక్సల్స్ వేసిన ప్లాన్ ఏంటి? జితేందర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగిత్యాలలో ఎలాంటి మార్పులు జరిగాయి? కాలేజీ స్నేహితురాలు, లాయర్ శారద(రియా సుమన్) అతనికి ఎలా తోడుగా నిలిచింది? చివరకు నక్సల్స్ చేతుల్లో ఎలా మరణించాడు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. జితేందర్ రెడ్డి గురించి జగిత్యాలతో పాటు కరీంనగర్ చుట్టుపక్క ప్రాంతాల వారికి బాగా తెలుసు. నక్సల్‌పై ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే కరీంనగర్ జిల్లా మినహా ఆయన గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి పూర్తిగా తెలిసినవారు అంతగా లేరు. జితేందర్ రెడ్డి ఏబీవీపీ నాయకుడని, నక్సల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి వారి చేతుల్లోనే మరణించారనే విషయం మాత్రమే తెలుసు. ఈ చిత్రంలో జితేందర్ రెడ్డి గురించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చెప్పారు. అయితే వీటిల్లో నిజం ఎంత అనేది పక్కకు పెడితే..సినిమా పరంగా చూస్తే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ని తెరపై చక్కగా, అందరికి అర్థమయ్యేలా చూపించాడు. జితేందర్ రెడ్డి బాల్యం మొదలు కొని చనిపోయే వరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటలన్నింటిని రెండున్నర గంటల సినిమాలో చూపించేశాడు. జితేందర్‌కి చిన్నప్పటి నుంచే దేశ భక్తి ఎక్కువని రిజిస్టర్ చేయడానికి ప్రారంభంలోనే పలు సీన్లను యాడ్ చేశాడు. సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగానే వాడుకున్నాడు. యువకుడి ఎన్కౌంటర్ సీన్ తర్వాత కథపై ఆసక్తి పెంచుతుంది.ఫస్టాఫ్‌లో జితేందర్ రెడ్డి బాల్యంతో పాటు ఆయన స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిన తీరును చూపిస్తూనే నక్సల్స్‌కి ఎలా టార్గెట్ అయ్యారనేది చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లలో నాటకీయత ఎక్కువైనట్లు కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాగదీతగానూ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. చాలా చోట్ల గూస్బంప్స్ సీన్లు ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నక్సల్స్‌పై చేసే ఫిర్యాదు సీన్, ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్ సన్నీవేశాలు అదిరిపోతాయి. అయితే ఈ కథ మాత్రం ఓ వర్గం వారికి ఎంత బాగా నచ్చుతుందో అంతే స్థాయిలో మరో వర్గం నుంచి వ్యతిరేకత రావొచ్చేమో. సినిమాలో కీలకమైన పాత్రల్లో కూడా అంతగా గుర్తింపులేని నటీనటులను పెట్టుకోవడం కూడా కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి.ఎవరెలా చేశారంటే..జితేందర్ రెడ్డి పాత్రకు రాకేశ్ వర్రే న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. తెరపై నిజంగానే జితెందర్ రెడ్డిని చూసినట్లుగా అనిపిస్తుంది. ఆర్సెసెస్ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నక్సలైట్‌గా ఛత్రపతి శేఖర్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. లాయర్‌గా రియా సుమన్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జితేందర్ రెడ్డి పర్సనల్ పీఏ పాత్రలో రవిప్రకాశ్ బాగా మెప్పించాడు. రవి ప్రకాశ్ తండ్రి పాత్రను పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ హృదయాలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కొన్ని విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - Rating: 2.75/5 -
ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది.. తప్పు చేశా: రాకేశ్
ఉయ్యాలా జంపాల, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే హీరోగా నటించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో రాకేశ్ వర్రే ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని మాట్లాడారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.రాకేశ్ వర్రే మాట్లాడుతూ.. 'నేను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీలో సెట్ అవ్వడానికి చాలా రోజులు టైమ్ పట్టింది. కానీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేద్దామని పేకమేడలు ప్రాజెక్ట్ చేశా. ఆ తర్వాత నాకు అర్థమైంది. ఆ ప్రాజెక్ట్ చేయకుండా ఉండాల్సిందని. అదే నేను వేసిన రాంగ్ స్టెప్. నాకు ఒక సక్సెస్ వస్తే చాలనుకున్నా. కానీ ఇక్కడ మార్కెట్ అనేది ముఖ్యం. పేకమేడలు మాకు మూడేళ్లు పట్టింది. చేస్తూనే ఉన్నాం. ఎవరైనా మాకు బ్రాండ్ ఉండి ఉంటే ఏడాదిన్నరలోనే పూర్తి చేసేవాళ్లం. ఇక్కడ మనకు బ్రాండ్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. రాకేశ్ వర్రే ఒక బ్రాండ్ అయ్యాకే కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తా. తప్పకుండా చేస్తా. ఇది నేను నేర్చుకున్న గుణపాఠం. పేకమేడలు సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నా' అని అన్నారు. కాగా.. పేకమేడలు చిత్రానికి రాకేశ్ వర్రే నిర్మాతగా వ్యవహరించారు. కాగా.. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. అంతే కాకుండా ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడటం ట్రైలర్లోనూ చూపించారు. కాగా.. ఈ చిత్రంలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. -
జితేందర్ రెడ్డి మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్
-
Jithender Reddy Trailer: జగిత్యాల టైగర్ అంటారు.. పేరు జితేందర్ రెడ్డి!
‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న హిస్టారికల్ మూవీ.. గ్లింప్స్ అదుర్స్!
మిర్చి, బాహుబలి, ఎవరికి చెప్పొద్దు లాంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..'చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి ఒక చరిత్రే జితేందర్ రెడ్డి జీవితం. రాకేష్ ఈ సినిమాతో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో జీవించారు. ప్రతి ఒక్కరికి జితేందర్ రెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది. చరిత్ర అంటే జరిగిన నిజాన్ని తెలుసుకోవడం. అలాంటి ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ల చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ..'ఇందులో నా క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్‌గా చాలా సినిమాల్లో నటించా. కానీ ఇది కచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గ్లింప్స్ చూసిన తర్వాత సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. విరించి వర్మ గతంలో చేసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ..'నేను గతంలో చేసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్ మంచి హ్యూమర్ ఉన్న సినిమాలు. అది మాత్రమే కాదు మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న డ్రామా అంటే చాలా ఇష్టం. అదేవిధంగా జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కోసం ఆయన విలేజ్‌కు వెళ్లి ఆయన స్నేహితులతో, ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుని ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చా. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. -
కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి.. రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని చేరిన జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. బీజేపీకి సిద్ధాంతం లేదని కొందరు పార్టీ మారినవారు అంటున్నారని, ఆయన కొడుక్కి సీటు ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు.. లేదంటే లేనట్లా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘పార్టీలోకి రాగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి సీటిచ్చి కూర్చోబెడితే బీజేపీ సిద్ధాంతం మంచింది.. లేకుంటే మంచిది కాదు. ఎంపీ సీటు దక్కకుంటే సిద్ధాంతాలు లేని పార్టీనా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పార్టీకి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ తప్ప.. ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం బాధాకరం. ఏ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీ, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పార్టీ మారి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారు. బీజేపీపై ఈ వ్యాఖ్యలు పొరపాటున వ్యాఖ్యానించారని భావిస్తున్నా. చేవెళ్ల ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేదీలేంటి?. మీరిద్దరూ కలిసి కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లకు ఎంత ఖర్చు పెడాతారని చెప్పారు. మా పార్టీలో చాలారోజులు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగడంలేదు. ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలేవి?. సర్వే నంబర్ 343లో ఉన్న ప్రభుత్వ భూమిఎంత? ఎన్నిఫ్లోర్లు ఇవ్వాలి? ఎన్ని ఇచ్చారు?. కడితే ఎంత ఖర్చవుతుంది.. అమ్మితే ఎంత వస్తుంది?. గత ప్రభత్వ హయాంలో ఏం చేశారు.. ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయి. అసలు ఏరకంగా మీరిద్దరూ కలసి ఎన్నికలకు కమర్షియల్ చేయాలనుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచిన ఎంపీలందరిలో ఎక్కువ లబ్ధి పొందింది వారే. భూమికి భూమి ఎక్కడా ఇవ్వలేదు.. కానీ ఆయనకు మాత్రం ఇచ్చారు. 25 ఫ్లోర్లకు అనుమతులిస్తే.. 33 ఫ్లోర్లు అయ్యాయి. పీసీసీ హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో గుట్టలు కొడతారా? గుడులు మింగుతారా? ఏఐసీసీకి లేఖ రాస్తామని? చర్యలు తీసుకుంటామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్లు? జితేందర్ రెడ్డి,రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? కంపెనీల ప్రయోజనాలు ఏంటి?. ఎన్నికలకు మీరు పంపిచే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత వస్తోందనే వివరాలు ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో జాబితాలో కేవలం జితేందర్ రెడ్డి కుమారుడి ఒక్కరి పేరే వచ్చింది. అప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంది.. ఇప్పుడు లేదా?. షేక్‌పేటలోని సర్వే నంబర్ 403ఒక సంచలనం. అందులో ఎలా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి.. వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయనే అంశాలపై విచారణ జరగాలి. వారు చేసే అడ్డగోలు దందాపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జితేందర్‌రెడ్డి వెంట్రుక కూడా కొనలేరని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇప్పుడున్న స్పీకర్ గతంలో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రూ.500 కోట్ల స్కామ్‌లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరి ఆర్థిక నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు పంపించే డబ్బు సంచులతోనూ అప్రమత్తంగా ఉండాలి’ అని రఘునందన్ రావు అన్నారు. -
ఇంట్రస్టింగ్‌గా జితేందర్ రెడ్డి వీడియో.. ఆయనెవరో తెలిసేది ఆరోజే!
'ధీరుడు ఒకసారే మరణిస్తాడు.. కానీ, పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అన్న డైలాగుతో రిలీజైన 'జితేందర్ రెడ్డి' షార్ట్ వీడియో ఆసక్తిని పెంచుతోంది. అసలు ఎవరు ఈ 'జితేందర్ రెడ్డి'? ఆయన గురించి తెలుసుకోవడానికి ఏముంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి ప్రేమ కథలను దర్శకత్వం వహించిన విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'జితేందర్ రెడ్డి'. ఇటీవలే రిలీజైన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచగా సెప్టెంబర్ 18న విడుదలైన 'జితేందర్ రెడ్డి' వీడియో సినిమాపై అంచనాలను పెంచేసేంది. 'జితేందర్ రెడ్డి' అనే నేను అంటూ ఆయన చేసిన హామీ, అలాగే ఆ వీడియోలో చూపించిన 'ధీరుడు ఒకసారే మరణిస్తాడు కాని పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అన్న మాట ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. కాగా ఈ సినిమాలో 'జితేందర్ రెడ్డి'గా చేసింది ఎవరు? అని తెలుసుకోవాలంటే ఈ నెల 21 వరకు ఆగాల్సిందే! ఎందుకంటే ఆరోజే చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి వి.ఎస్ జ్ఞాన శేఖర్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చదవండి: గాఢంగా ప్రేమించిన ప్రియుడు మరో అమ్మాయితో.. బ్రేకప్‌పై స్పందించిన నటుడి భార్య -
'ఉయ్యాలా జంపాలా' దర్శకుడి యాక్షన్ మూవీ
'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ.. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత కొత్త మూవీ ప్రకటించాడు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న 'జితేందర్ రెడ్డి' సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని ప్రముఖ డైరెక్టర్ దేవకట్టా.. శనివారం విడుదల చేశారు. (ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్‌బాస్ 7'.. కారణం అదే?) 1980లో జరిగే ఓ పీరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా నడిచే యాక్షన్ డ్రామా. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ విరించి వర్మ.. తీసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్. ఈసారి మాత్రం పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. హీరోతోపాటు ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తారు. (ఇదీ చదవండి: శోభా కన్నీళ్లు.. టాప్-5లో ఉండవని నాగ్ కౌంటర్!) -
జితేందర్ రెడ్డి ట్వీట్ పై ఈటల కౌంటర్
-
జితేందర్ రెడ్డి ట్వీట్ పై బీజేపీ సీనియర్ నేతల అసహనం
-
తెలంగాణలో దారితప్పుతున్న బీజేపీ బండి!
హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రధాన పోటీ అని భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఆ పార్టీ గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ పెద్దగా అసంతృప్తి ఛాయలు పెద్దగా కనిపించని రాష్ట్ర బీజేపీలో ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ముదిరినట్లే ఉంది. తెలంగాణ బీజేపీలో కూడా పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవనేది తాజాగా బయటపడింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనే విషయం బహిర్గతమైంది. జితేందర్‌రెడ్డి వివాదాస్పద ట్వీట్! మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమయ్యింది. దున్నపోతుల్ని వ్యాన్‌లోకి ఎక్కించే ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన జితేందర్‌రెడ్డి.. తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌తో సహా పలువురిపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న జితేందర్‌రెడ్డి.. ఇప్పుడు అందులో భాగంగా దున్నపోతుల వీడియో-దానికి క్యాప్షన్ ఇవ్వడం ఒక్కసారిగా అలజడి రేపింది రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో.. అధిష్టానానికి జితేందర్‌రెడ్డి వ్యవహారం! ఈ ట్వీట్ వ్యవహారం ఇప్పటికే అధిష్టానానికి చేర్చారు స్థానిక నేతలు. అసలు దున్నపోతుల వీడియో.. ఈ ట్రీట్మెంట్ అవసరం అని ఎవరిని ఉద్దేశించి పెట్టారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాన్ని ట్విట్టర్లో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి జితేందర్‌రెడ్డి వెనుకాల ఎవరున్నారనే కోణంలో అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా జితేందర్‌రెడ్డి అసంతృప్తా.. ఆక్రోషమా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ యత్నం దీన్ని అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో క్రమేపీ బలాన్ని తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్.. బీజేపీలో విభేదాల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్న కాంగ్రెస్.. బీజేపీ తాజా వివాదంపై స్పందించింది. తెలంగాణ బీజేపీలో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరొకవైపు బీజేపీలో కొత్తగా చేరిన నేతలు మాత్రం అంతర్మథనంలో పడ్డారు. బీజేపీలో పట్టాలు తప్పిన క్రమశిక్షణ అధిష్టానం ఆదేశాలతో గీత దాటుతున్న నేతలకు వార్నింగ్ లెటర్ విడుదల చేశారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు. క్రమశిక్షణా రాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరి సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం చేస్తున్న నేతలను సహించేది లేదన్నారు. పార్టీపైనా, పార్టీ నాయకత్వంపైనా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తే పార్టీకి నష్టం చేసినట్లే అని ఆయన పేర్కొన్నారు. ‘ పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదు. పార్టీలో ఒక 'లక్ష్మణ రేఖ' ఉందని మర్చిపోకూడదు. మా పార్టీకి చెందిన కొందరు నాయకులు, పార్టీకి నష్టం చేకూరేలా చేస్తోన్న అవాంఛనీయ బహిరంగ ప్రకటనలు, మీడియా లీకులు, యథాలాపంగా చేస్తోన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు, చేస్తోన్న వాళ్లు తాము అసలు ఏ పార్టీలో ఉన్నామో మర్చిపోతున్నారా?, ఇది బీఆర్ఎస్-కాంగ్రెస్ కాదు.. బీజేపీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. పార్టీనీ, పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా విమర్శించే సంస్కృతి, వ్యవస్థ బీజేపీలో లేవు. ఉండవు. ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తోన్న వాళ్లంతా పార్టీలో కీలక హోదాలలో ఉన్నవారే. వాళ్లకు తమ గొంతు వినిపించడానికి పార్టీ తగిన అవకాశాలు ఉన్నాయి.. ప్రత్యేక వేదిక కూడా ఉంది’ అని పేర్కొన్నారు. This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q— AP Jithender Reddy (@apjithender) June 29, 2023 చదవండి: ఇదీ తెలంగాణలో సంగతి.. మోదీ వద్ద చర్చ! -
బీజేపీ నేత జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్
-
విచారణకు హాజరుకావాలని జితేందర్‌రెడ్డి పీఏ రాజుకు నోటీసులు
-
మా ఇంటికి ఎవరొచ్చినా బస కల్పించడం నా బాధ్యత: జితేందర్‌రెడ్డి
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ రియాక్షన్
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలపై ఆరోపణలు రావడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని పేర్కొన్నారు. కేసు వెనక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పే వారిపై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్, పోలీసులు కథ రక్తి కట్టిస్తున్నారని, మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ వేయాలన్నారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారంతా ఒకప్పుడు మంత్రి అనుచరులేనని, వారితో తమకెలాంటి సంబంధం లేదన్నారు. సుపారీ ఇవ్వగలిగే శక్తి టీఆర్ఎస్ నేతలకు తప్ప ఎవరికీ లేదన్నారు. మున్నూరు రవిపై ఎక్కడా ఆరోపణలు లేవు మరోవైపు మాజీ ఎంపీ జితేంతర్ రెడ్డి మాట్లాడుతూ.. మున్నూరు రవి తమ ఇంటికి రావడం ఇదేం తొలిసారి కాదని అన్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఢిల్లీకి కార్యకర్తలు ఎవరొచ్చినా అతిథ్యం ఇస్తానని తెలిపారు. ఉద్యమ కారులకు వసతి కల్పించడం తన బాధ్యత అని అన్నారు. మున్నూరు రవిపై ఎక్కడా ఆరోపణలు లేవని, క్రిమినల్ చర్రిత లేదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ నాయకత్వానికి వివరిస్తున్నామని తెలిపారు. బీజేపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ఈ ప్లాన్ అని విమర్శించారు. తాను విచారణకు సిద్దమేనని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకుంటే రిటైర్డ్ జడ్జీతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి ఇదిలా ఉండగా.. మహబూబ్‌నగర్‌లోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఆయన ఇంట్లోని కారు అద్దాలు ధ్వంసం చేశారు. గేటు ముందు టైర్‌ను తగల బెట్టారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని జితేందర్‌రెడ్డి తన ట్విటర్‌లోషేర్ చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో కిడ్నాప్ ఘటన అనంతరం మహబూబ్‌నగర్‌లో దుండగులు తన ఇంటిపై దాడి చేసి బెదిరించారని ఈ విషయంపై మహబూబ్‌నగర్ పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని, వీరిని జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్నట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన విషయం తెలిసిందే. జితేందర్ రెడ్డి డ్రైవర్, పీఏ రాజు వీరికి షెల్టర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఈ హత్య కుట్రకు సంబంధించి జితేందర్‌రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుతామని సీపీ ఎవల్లడించారు. ఈ నేపథ్యంలోనే జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. -
ఈటలపై నిందలను ప్రజలు నమ్మడం లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం వేసిన నిందలను ప్రజలెవరూ విశ్వసించడం లేదు. కేసులకు భయపడి ఆయన బీజేపీలో చేరాడనడంలో వాస్తవం లేదు. హుజూరాబాద్‌లో ఆయనకు ప్రజాబలం మెండుగా ఉంది. ఈ నియోజకవర్గాన్ని ఆయన అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చేశారు. అదే ఆయనను గెలిపిస్తుంది. గ్యాస్, పెట్రో ధరలు, దళితబంధు నిలుపుదలలో టీఆర్ఎస్ మాపై చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలే. రాబోయే ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు’అని బీజేపీ నేత, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్చార్జి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నిక నేపథ్యంలో ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. సాక్షి: ఈటల రాజేందర్ ప్రచారానికి ప్రజల్లో స్పందన ఎలా ఉంది? జితేందర్: ఈటలకు హుజూరాబాద్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బడుగుల ప్రతినిధిగా ఆయనకు ఉన్న గుర్తింపు కలసివస్తోంది. ఇందుకు జనాల నుంచి వస్తున్న అపూర్వ స్పందనే కారణం. సాక్షి: ఈ ఉపఎన్నికలో అటు వైపు మంత్రి హరీశ్‌రావు ప్రచారం చేస్తున్నారు. మరి రాజేందర్ విజయంపై మీ పార్టీ ధీమాగా ఉందా? జితేందర్: టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. గతంలో హుజూర్నగర్, దుబ్బాక ఉప ఎన్నికల్లో వారిచ్చిన హామీలేవీ నిలుపుకోలేదు. హుజూరాబాద్‌లో మౌలిక సదుపాయాలతో పాటు అన్నిరంగాల్లో రాజేందర్ చేసిన అభివృద్ధి చాలా బాగుంది. సాక్షి: కేసులకు భయపడే రాజేందర్ మీ పార్టీలో చేరారన్న ప్రచారంపై మీ స్పందనేంటి? జితేందర్: అసలు ప్రభుత్వం వేసినవి అన్నీ నిందలే. ఈటల సౌమ్యుడు. అందుకే, ఆయనను పార్టీలో చేర్చుకున్నాం. నియోజకవర్గ ప్రజలెవరూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను నమ్మడం లేదు. సాక్షి: దళితబంధును మీపార్టీ వారే ఆపారన్న ఆరోపణలను మీరెలా తిప్పికొడతారు? జితేందర్: అవన్నీ అసత్యాలు. ప్రభుత్వం పథకం ప్రారంభించి రెండు నెలలు దాటుతోంది. ఇంతకాలం లబ్ధిదారుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో డబ్బులు ఎందుకు వేయలేదు. ఖాతాల్లో ఫ్రీజ్ అయిన డబ్బులను విడుదల చేయాలని మాత్రమే సీఈసీని మేం లేఖ ద్వారా కోరాం. సాక్షి: గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు మీకు ప్రతికూలంగా మారతాయన్న ఆందోళన ఉందా? జితేందర్: గ్యాస్, పెట్రోల్ అంతర్జాతీయ ధరల మీద ఆధారపడి ఉంటాయి. కేంద్రంతోపాటు రాష్ట్రాలూ పన్నులు వేస్తున్నాయి. ఆ నిధులను మేం రక్షణ, కేంద్ర పథకాలు, మౌళికసదుపాయాల కోసం వినియోగిస్తాం. వీళ్లు మాత్రం ఆ నిధులను కాళేశ్వరానికి మళ్లించి కమీషన్లు తీసుకుంటున్నారు. సాక్షి: రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు ఇవ్వడం లేదన్న విమర్శలపై మీరేమంటారు? జితేందర్: కరీంనగర్ రైల్వేలైన్, ఆర్వోబీలు, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీల్లో సగం రాష్ట్రవాటా ఉండాలి. మా వంతు నిధులు మేం భరిస్తున్నాం. రాష్ట్రం ముందుకు రాకుండా మమ్మల్ని నిందించడం తగదు. సాక్షి: కేంద్ర వ్యవసాయ చట్టాలతో జమ్మికుంట, హుజూరాబాద్ మార్కెట్లు మూతబడతాయన్న టీఆర్ఎస్ ఆరోపణలపై ఏమంటారు? జితేందర్: రైతులంతా మా చట్టాలతో చాలా సంతోషంగా ఉన్నారు. ముందు మీరు మార్కెట్లలో రైతుల నుంచి వసూలు చేసే సెస్ భారం తగ్గించాలని కోరుతున్నాం. సాక్షి: గతంలో ఇక్కడ బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి గెలిస్తే అది ఎవరిబలం? జితేందర్: అది ఇద్దరి బలం. స్థానికంగా రాజేందర్‌కు తిరుగులేని ప్రజాదరణ ఉంది. అందులో అనుమానమేమీ లేదు. విజయం సాధిస్తే అందులో సింహభాగం ఈటలదే అవుతుంది. సాక్షి: రాజేందర్‌కు పార్టీలో కీలక నేతలు సరిగా సహకరించడం లేదన్న ఆరోపణలపై ఏమంటారు? జితేందర్: అవన్నీ సత్యదూరమైన మాటలు. ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జీలు ఐదున్నరనెలలుగా కష్టపడుతున్నారు. స్టార్ క్యాంపెయినర్లు, కేంద్రమంత్రులు కూడా ఈటల వెంట ఉన్నారు. సాక్షి: ఈ ఉప ఎన్నిక తరువాత ఈటల కాంగ్రెస్‌లోకి వెళతారన్న ప్రచారంపై ఏమంటారు? జితేందర్: ఈటల గెలిచాక. టీఆర్ఎస్సే వెళ్లి కాంగ్రెస్‌లో విలీనమవుతుంది. సాక్షి: దుబ్బాక, బల్దియా తరహాలో ప్రత్యేక వ్యూహాలేమైనా అనుసరిస్తున్నారా? జితేందర్: మాకు ఎలాంటి వ్యూహాలు లేవు. ప్రజల అండదండలే మాకు శ్రీరామ రక్ష. గతం కంటే భారీ మెజారిటీతో ఈటల గెలుస్తారు. -
ఆ నలుగురు నేతల గుప్పిట్లో బీజేపీ
ఆ పార్టీలో ఆ నలుగురు నేతలు తమ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారట. దీంతో కొత్త, పాత నేతల మద్య విభేదాలు భగ్గుమంటున్నాయి. బయట అందరితో కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించినా లోలోపల గోతులు తీస్తారనే ప్రచారం ఉంది. జిల్లాలో పార్టీ బలపడేందుకు అవకాశాలు ఉన్నా ఆ నలుగురు నేతల తీరు ఇబ్బందిగా మారిందని కార్యకర్తలు అంటున్నారు. మరో వైపు తన కుమారుడిని రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరా నేతలు... ఎక్కడ జరుగుతోంది ఈ వ్యవహారం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి మంచి పట్టుంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. పార్టీ బలపడేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ నేతల మధ్య సమన్వయలోపం.. ఆధిపత్య పోరు.. వర్గ విభేదాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయి. గతంలో అలంపూర్ నుంచి రవీంద్రనాథ్‌రెడ్డి బీజేపీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 జితేందర్‌రెడ్డి బీజేపీ నుంచి ఎంపీగా మహబూబ్‌నగర్ నుంచి గెలిచారు. 2008లో జరిగిన ఉపఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలిచారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో ఆచారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కల్వకుర్తి, మహబూబ్‌నగర్ సెగ్మెంట్లతో పాటు పలు పట్టణాల్లో పార్టీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. గత లోక్‌సభ ఎన్నికల ముందు మాజీమంత్రి డీకే అరుణ, మాజీఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు వారి అనుచరులు బీజేపీలో చేరిన తర్వాత జిల్లాలో పార్టీ బలం మరింత పెరిగింది. పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. (అగ్గిరాజేస్తున్న ఆధిపత్య పోరు) 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి అధికార టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. గెలవకపోయినా పార్టీ క్యాడర్‌కు ఓ కొత్త ఊపునిచ్చింది. మహబూబ్‌నగర్, మక్తల్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ కంటే అధికంగా ఓట్లు సాధించారు. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన ఆ పార్టీ మక్తల్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా నారాయణపేట, భూత్పూరు, అమరచింతలో అధిక స్థానాలు గెలుచుకుంది. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షపదవి రావటంతో మరింత విశ్వాసం పెరిగింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీజేపీలో చేరారు. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఇబ్బందిగా ఆ నలుగురు.. ఇక దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలవటంతోపాటు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవటంతో జోష్ మీద ఉన్న ఆపార్టీ జిల్లాలో కూడా దూకుడు పెంచింది. పార్టీ కార్యక్రమాలను, ప్రజాసమస్యలపై తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. మరోవైపు ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, ఆయా నియోజకవర్గాల్లోని బలమైన నేతలను పార్టీలోకి ఆకర్షించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొదటి నుంచి పార్టీలో ఉన్న నలుగురు నేతల తీరు ఇబ్బందిగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, సీనియర్ నాయకులు నాగూరావునామాజీ, ఆచారి, కొండయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు వీరు సహకరించటం లేదనే ప్రచారం సాగుతుంది. గతంలో పార్టీలో చేరి మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసిన నాగం జనార్దన్‌రెడ్డికి ఈ నేతలతో పాటు రాష్ట్రనేతల్లో కొందరు పొమ్మనలేక పొగపెట్టారట. పలు సందర్భాల్లో అవమానపరిచారనే ఉద్దేశ్యంతో ఆయన పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విషయంలో కూడా ఈ పాతనేతల తీరు అభ్యంతరకరంగా ఉండటంతో ఆయన పార్టీని వీడారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పర్యటనలో అవమానం జరిగిందని పార్టీ అధ్యక్షుడు ఎర్రశేఖర్ రాజనామా చేయటం సంచలనం రేపింది. జిల్లాలో అధ్యక్షుడి పర్యటన వివరాలు కూడా తనకు తెలియకుండా ఈ నేతలు పావులు కదిపారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓ నాయకుడు మండల పార్టీ అధ్యక్షులకు ఫోన్లు చేసి తాము చెప్పినట్టు ఏర్పాట్లు చేయాలని హుకూం జారీ చేశాడట. లోలోపల గోతులు.. రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన వివరాలు తెలిపేందుకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎర్రశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ నేతలు నారాయణపేట జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన ఉంటే నీవు ఎలా మీడియా సమావేశం పెడతావని.. కొత్తగా వచ్చిన నేతల పెత్తనం నడవదనే ధోరణితో మాట్లాడారట. అందుకే మీడియా సమావేశం రద్దు చేశారు. కానీ రాష్ట్ర నాయకుడు మాత్రం నారాయణపేటకు వెళ్లి అక్కడ మీడియా సమావేశం పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన వివరాలు కూడా జిల్లా అధ్యక్షుడికి తెలియకుండా కేవలం పాత నేతల కనుసన్నల్లోనే నిర్వహించారు. మొత్తంగా ఈ పాత నేతలు కొత్తవారిని పార్టీలో ఎదకకుండా తొక్కెయటానికి వ్యూహాలు సిద్ధం చేస్తారనే టాక్ఉంది. అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తూ లోలోపల గోతులు తీస్తారనే ప్రచారం ఉంది. మహబూబ్‌నగర్ పట్టణ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా గ్రూపు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. బరిలో మాజీ ఎంపీ తనయుడు.. ఓ వర్గం నేతలు పార్టీ కార్యాలయం ముందే ఆందోళనకు దిగారు. జిల్లాలో పార్టీ బలపడెందుకు మంచి అవకాశాలు ఉన్నా నేతల మద్య విభేదాలు, అధిపత్యపోరు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. కొన్ని సెగ్మెంట్లో కొత్త, పాత నేతలు ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. మాజీఎంపీ జితేందర్‌రెడ్డి తన తనయున్ని వచ్చే ఎన్నికల్లో ఏదో నియోజకవర్గం నుంచి బరిలో దింపుతారనే ప్రచారం సైతం పార్టీలో కొనసాగుతుంది. అదే జరిగితే ఏ నియోజకవర్గంలో తమపై ప్రభావం పడుతుందోననే ఆందోళన సైతం కొందరు నేతల్లో నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ జిల్లాలో బలపడుతున్న బీజేపీ పార్టీకి కొందరు నేతల తీరు తీవ్రంగా నష్టం కలిగించే ప్రమాదం ఉందని పార్టీలోని సీనియర్లే గుసగుసలాడుతున్నారు. మరి జాతీయ ఉపాధ్యక్షహోదాలో ఉన్న డీకే అరుణ, పార్టీ హై కమాండ్‌తో మంచి సన్నిహితం ఉన్నమాజీఎంపీ జితేందర్‌రెడ్డి కొత్తపాత నేతల మద్య సమన్వయం చేసి పార్టీ బలోపేతం కోసం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. -
ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషనన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. గతంలో ఒలంపిక్ అసోషియేషన్ ఆఫ్ తెలంగాణకు నాయకత్వం వహించిన కె. రంగారావు నామినేషన్‌ను స్వీకరించగా.. జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిజెక్టు చేశారు. దీనిపై జయేష్ రంజన్, జితేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ అధ్యక్ష ఎన్నికలు కాస్త రాజకీయనాయుడికి, ప్రభుత్వ అధికారికి మధ్య పోటీగా మారనున్నాయి. -
స్ట్రాంగ్ రూం వద్ద 144 సెక్షన్ అమలు: జితెందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్నిపల్ ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్ బాక్సులను ఎన్నికల నోడల్ అధికారుల గురువారం స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను తరలించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి.. అధికారుల సమన్వయంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలించామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి 5వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, మూడేంచేల బలగాలతో భద్రత చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 25న ఫలితాలు విడుదల నేపథ్యంలో పటిష్టమైన బంధోబస్తును కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఇద్దరికీ సవాలే..!
ఆ ఇద్దరు సీనియర్లు.. టీఆర్ఎస్ లోకసభ పక్ష నేతగా పని చేసిన అనుభవం ఒకరిది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మాజీ మంత్రిగా సుదీర్ఘ అనుభవం మరొకరిది. రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇరువురూ తమ పార్టీలను వీడి గత లోక్‌సభ ఎన్నికల ముందు కాషాయ కండువా కప్పుకున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ పార్టీని బూత్ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. అందులో ఒకరు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మరొకరు మాజీ మంత్రి డీకే అరుణ. సాక్షి, మహబూబ్‌నగర్: గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సీనియర్లు జితేందర్‌రెడ్డి, డీకే అరుణలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బాగా కలిసొచ్చేందనే చెప్పాలి. రోజురోజుకు బలోపేతమవుతోన్న ఆ పార్టీ పలు పట్టణాల్లో అధికార టీఆర్ఎస్ను ఢీకొట్టేలా తయారైంది. అయితే.. ఈనెల 22న జరగనున్న ‘పుర’పోరు వీరికి ప్రతిష్టాత్మకంగా మారింది. వీరిద్దరి సారథ్యంలో బీజేపీ ఎన్ని పీఠాలు కైవసం చేసుకుంటుందో అనే చర్చ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరువురు నేతలు మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్, గద్వాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డిలను సమన్వయం చేసుకుంటూ బీజేపీ అభ్యర్ధిత్వాల ఖరారుతో పాటు ప్రచార వ్యూహాలపై సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. టార్గెట్ ‘టెన్’.. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా కనీసం పది పుర పీఠాలు కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలో అధిష్టానం గెలుపు బాధ్యతను డీకే అరుణ, జితేందర్రెడ్డిలకే ప్రధానంగా అప్పగించింది. ఇద్దరు సీనియర్లు కావడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ నాయకులు పార్టీలో లేకపోవడంతో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలతో పాటు అభ్యర్థిత్వాల ఖరారు విషయంలోనూ వీరినే ముందుంచింది. ఈ ‘పుర’ ఫలితాలపైనే ఇరువురు నేతల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందనే ప్రచారమూ కాషాయ శ్రేణుల్లో జరుగుతోంది. ఆశించిన ఫలితాలు సాధిస్తేనే కేంద్రంలో ఉన్న బీజేపీ నేతల ఆశీస్సులు అందే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఎన్నికలు ఇరువురు నేతలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ క్రమంలో డీకే అరుణ తన సొంత జిల్లా కేంద్రమైన గద్వాలతో పాటు అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. దాదాపు అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులను ఢీ కొనే స్థాయిలో బీజేపీ అభ్యర్థిత్వాలు ఖరారుకు కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో మిగతా మున్సిపాలిటీల్లోనూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రచారానికి ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈ నెల 16నుంచి తనకు కేటాయించిన మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం చేసి.. మిగతా చోట్ల సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇటు జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్, నారాయణపేట, మక్తల్, భూత్పూర్, కోస్గి మున్సిపాలిటీలపై కాషాయం జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, మక్తల్, భూత్పూర్, అమరచింత, ఆత్మకూరు, కోస్గిలో బలంగా ఉంది. ఇతర మున్సిపాలిటీలను అటుంచితే.. మహబూబ్‌నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న స్థానిక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఢీ కొట్టడం జితేందర్‌రెడ్డికి సవాల్‌గా మారింది. ఇటు గద్వాలకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. దీంతో ఆ పుర పీఠంపై గులాబీ జెండా ఎగురుతుందా? కాషాయం జెండా ఎగురుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదీలావుంటే... 1999లోనే బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన జితేందర్‌రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటు 1996 నుంచి రాజకీయాల్లో ఉన్న డీకే అరుణకు ఉమ్మడి జిల్లాలో బలమైన కేడర్ ఉంది. చదవండి: అలాంటి వారిని గుర్తించలేరా? : డీకే అరుణ -
‘కేసీఆర్‌ను ఓడించి.. వాళ్లను గెలిపిద్దాం’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని, ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రతికి ఉండగానే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్‌పై యుద్ధం చేసే ప్రతి ఒక్కరినీ తాను అభినందిస్తానని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు మొట్టమొదటి సారిగా సవాల్ విసిరిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు. సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని కేసీఆర్ అంటే.. ఎంతమందిని డిస్మిస్ చేసినా తాము సమ్మెలో పాల్గొంటామని కార్మికులు ధిక్కరించారు. ఆర్టీసీని అమ్ముతామని కేసీఆర్ అంటే... ఆర్టీసీని కాపాడుకుంటామని కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఆర్టీసీని ఖతం చేయాలనుకుంటే కేసీఆర్ ఖతం అవుతాడు. కేసీఆర్ ఒంటరై ఓటమికి దగ్గరగా ఉన్నాడు. కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం... కేసీఆర్ వర్సెస్ సమస్త తెలంగాణ సమాజంగా మారింది. హిట్లర్ లాగా కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి గానీ మనం చేసుకోవద్దు. కేసీఆర్ తప్పా అన్ని పార్టీలు మనకు మద్దతుగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్‌ను ఓడగొట్టి వేరేవాళ్ళని గెలిపిద్దామ’ని మందకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను సాగనంపుదాం సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని బీజేపీ నాయకుడు జితేందర్‌రెడ్డి అన్నారు. స్వప్రయోజనాల కోసం ఆర్టీసీని వాడుకుని ఇప్పుడు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కోదండరాంను కూడా కేసీఆర్ పక్కనపెట్టేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో రక్షణ ఉంటుందని.. ఆర్టీసీ కార్మికులు స్టీరింగ్ కాదు సుదర్శన చక్రం తిప్పుతారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక వీధి లైట్స్ కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు జి. వివేక్ ఆరోపించారు. కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, వారి ఉద్యమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. -
పాలమూరుకు కేసీఆర్ చేసింది ఏమీ లేదు
కందనూలు: టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూర్‌కు చేసింది ఏమీలేదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా ప్రసిడెంట్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదుకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉమ్మడి పాలమూరుకు శిలాఫలకాలు తప్పా, చేసింది శూన్యం అని విమర్శించారు. ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులను ఆగమేఘాల మీద పూర్తి చేస్తూ, దక్షిణ తెలంగాణను ప్రాజెక్టులను పూర్తి చేయకుండ నియంతలా ప్రవర్థిస్తున్నారని ఆరోపించారు. పాలమూర్ ఎత్తిపోతల పథకం కింద చేపడుతున్న రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయమైన పరిహారం చెల్లించకుండ, పోలీసులతో హింసించడం ఎంత వరకు సమజసం అన్నారు. మల్లాన్నసాగర్ ప్రజలకు రేట్లు పెంచి పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.12లక్షలకు చెల్లిస్తూ ఇక్కడి ప్రజలకు ఎందుకు ద్రోహం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాకు రావల్సిన నీళ్లు రాక పాలమూరు ఆత్మగోశిస్తుందని అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం వైపు చూస్తున్నారని, స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. అంతకు ముందు బీజేపీ మొదటి సభ్యత్వం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన దళితుడు మీసాల మషన్న ఇంటికి వెళ్లి ఇచ్చారు. ఆనంతరం బస్టాండ్ వద్ద ఇద్దరు ముస్లిం మహిళలకు పార్టీ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు సుధాకర్ రావు, దిలీపాచారి, పార్లమెంట్ కన్వీనర్ సుధాకర్ రెడ్డి, నాయకులు పోల్దాస్ రాము, దుర్గాప్రసాద్, శేఖర్ రెడ్డి,కృష్ణగౌడ్,అభిలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైంది
సాక్షి, నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, చేతల్లో పూర్తిగా నర్వీర్యమై పోయిందని ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 35 వేల కోట్లతో భారీ ఎత్తున చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క రిజర్వాయర్ కూడా పూర్తి చేయకపోవటం టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని అన్నారు. టీఆర్ఎస్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ఎకరాకు రూ.6000 పెట్టుబడి సాయం చేసి బీజేపీ ఆదుకుంటుందని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వృద్ధ రైతులకు పెన్షన్ స్కీము ప్రవేశపెట్టిన ఘనత బీజేపీదేనని కొనియాడారు. విదేశాల్లో దాచిన 4 లక్షల కోట్ల ధనాన్ని భారతదేశానికి తెప్పించిన ఘనత కూడా బీజేపీదేనని అన్నారు. -
అమెరికాలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి
నార్త్ కరోలినా : అమెరికాలో నార్త్ కరోలినాలోని రాలేలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతిచెందాడు. నూకల జితేందర్ రెడ్డికి శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో డ్యూక్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే జితేందర్ రెడ్డి మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య కిరణ్, కుమారుడు రిషి ఉన్నారు.