తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది.
లోక్‌సభలో ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో గురువారం టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ.. కేంద్ర తాగునీటి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాటర్‌గ్రిడ్ పథకానికి అయ్యే మొత్తం వ్యయం రూ. 42,474 కోట్లలో సగం నిధులను భరించాల్సిందిగా కేంద్రాన్ని తెలంగాణ సీఎం కోరారని, ఆ విధంగా నిధులు ఇవ్వలేమని పేర్కొన్నారు.
అయితే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి అందే నిధులను వాటర్‌గ్రిడ్ పథకానికి వినియోగించుకోవచ్చని చెప్పారు. అవసరమైతే విదేశీ సంస్థల నుంచి ఆర్థికసాయం పొందే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని తెలిపారు.