Water grid
-
వాటర్ గ్రిడ్‌కు ఆద్యులు మహానేత వైఎస్సార్
‘పోలవరం’ కోసం పరితపించారు.. డెల్టా ఆధునికీకరణకు నడుం బిగించారు.. రైతు శ్రేయస్సు లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టారు.. ఆరోగ్యశ్రీతో పేదలకు పునర్జన్మ ఇచ్చారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం తీసుకువచ్చారు.. విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తూ ‘పశ్చిమ’పై ఎనలేని ప్రేమను చూపించారు.. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం పోటీపడి పరుగులు తీసేలా చర్యలు తీసుకున్నారు.. అడుగడుగునా ఆయన గురుతులతో మదిమదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. బుధవారం ఆయన జయంతి సందర్భంగా మహానేత.. అందుకో మా జ్యోత అంటూ జిల్లావాసులు నివాళులర్పిస్తున్నారు. సాక్షి, ఏలూరు: జిల్లా అభివృద్ధి, గోదావరి వాసుల సంక్షేమం లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషిచేశారు. ఆయన హయాంలో నిత్య సమీ క్షలతో సంక్షేమ ప్రగతిని సామాన్యులను అందించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన రూపకల్పన చేసిన పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు జిల్లా గతిని మారుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలుమార్లు జిల్లాకు వచ్చిన ఆయన అడగకుండానే వరాలు ఇచ్చారు. జిల్లా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. జీవనాడి పోలవరం: 2004లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10,151 కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేశారు. నిర్వాసితుల ఆందోళనల మధ్య హెడ్‌వర్క్స్ పనులు ప్రారంభించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల తవ్వకాలను వేగంగా పూర్తిచేశారు. ఆయన హయాంలో 70 శాతం వరకు కాలువల పనులు పూర్తయ్యాయి. పోలవరంలో రూ.3.75 కోట్లతో నెక్లెస్ బండ్, ముంపు జలాలను గోదావరిలోకి మళ్లించడానికి రూ.58 కోట్లతో కొవ్వాడ అవుట్ ఫాల్‌స్లూయిజ్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ.2,700 కోట్లతో ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని కూడా వైఎస్ ప్రారంభించారు. తాళ్లపూడి మండలంలో సుమారు రూ.500 కోట్లు వెచ్చించి నిర్మించిన తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాల్లోని 22,348 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాణధార ‘చింతలపూడి’ మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీటి అందిచేందుకు రూ.1,701 కోట్ల అంచనాలతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. 2008 అక్టోబర్ 30న పథకానికి శంకుస్థాపన చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. జలయజ్ఞంలో 75వ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనున్న ఈ ఎత్తిపోతల పథకం వల్ల 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. పోగొండతో జలకళ బుట్టాయగూడెం మండలంలోని పోగొండ రిజర్వాయర్‌ను 2008లో రూ.28 కోట్ల అంచనాలతో వైఎస్సార్ మంజూరు చేశారు. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పథకం మంజూరు చేశారు. దీనిద్వారా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం మండలాల్లో దాదాపు 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ‘ఉద్యాన’ వెలుగులు తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడం ద్వారా యువతకు విద్యా, ఉద్యోగావకాశాలు కలి్పంచారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి రూ.600 కోట్లు మంజూరు చేసి చరిత్ర సృష్టించారు. ఆరోగ్య ప్రదాత మెట్ట ప్రాంత ప్రజల ఆరోగ్యానికి భరోసా కలి్పస్తూ జంగారెడ్డిగూడెంలో సుమారు రూ.7.54 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మించారు. డెల్టాకు వరాల జల్లు నరసాపురంలో రూ.10 కోట్లతో సుమారు 600 మందికి ఇళ్లు నిర్మించారు. నరసాపురం వద్ద వశిష్ట వంతెన నిర్మాణానికి రూ.194 కోట్ల నిధులు మంజూరుచేసినా తర్వాత పాలకులు దీనిపై దృష్టి సారించలేదు. అంతర్జాతీయంగా రాణించేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు. యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ.20 కోట్లతో రివిట్మెంట్ నిర్మించడానికి ఆయన తీసుకున్న చొరవతో ఆ ప్రాంత ప్రజలు ముంపు నుంచి బయటపడ్డారు. ఏలూరుకు వరదల నుంచి విముక్తి ఏలూరులో సుమారు రూ.90 కోట్లతో తమ్మిలేరు ఏటిగట్టును పటిష్ట పర్చడం ద్వారా న గరవాసులకు వరదల నుంచి విముక్తి కలి్పంచారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి సుమారు 100 ఎకరాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. వాటర్ గ్రిడ్‌కు ఆద్యులు పెనుగొండ: జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వాటర్ గ్రిడ్‌కు ఆద్యులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2008లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా డెల్టాలో తాగునీటి సమస్య నివారణకు వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలు చేశారు.ఆయన సూచనల మేరకు అప్పటి అత్తిలి ఎమ్మెల్యేగా నేను కసరత్తు చేశాను. దాదాపు రూ.300 కోట్ల అంచనాలు సైతం రూపొందించాం. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం పథకం అటకెక్కింది. ఇప్పుడు తండ్రి ఆశయాన్ని సీఎం జగన్ పట్టాలెక్కిస్తున్నారు. జిల్లాలో మరో 50 ఏళ్ల పాటు తాగునీటి సమస్య లేకుండా వాటర్‌గ్రిడ్‌ను కానుకగా అందించనున్నారు. నాటి కలను నేడు సాకారం చేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో ఎందరికో ఇళ్ల స్థలాలు అందించారు. అదే స్ఫూర్తితో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వైఎస్సార్ ఆశయాల మేరకు పేదల సొంతింటి కలను సాకారం చేయనున్నాం. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాగునీటి కష్టాలను శాశ్వతంగా తొలగించేలా వాటర్ గ్రిడ్ పథకాన్ని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధ్దతిలో చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ► హైబ్రిడ్ యాన్యుటీ పద్ధ్దతి అంటే.. కాంట్రాక్టరుకు నిర్మాణ వ్యయంలో నామమాత్రం మొత్తాన్ని ఇప్పుడు చెల్లించి మిగిలింది సాధారణ బ్యాంకు వడ్డీతోగానీ అంతకంటే తక్కువ వడ్డీరేటుతో లెక్కకట్టి 10–12 ఏళ్ల పాటు చెల్లించడం. ► రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు కూడా అవసరమైన నీటిని అందించేందుకు వీలుగా భారీ వాటర్ గ్రిడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ► కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం తలపెట్టింది. అంతేకాక, ఫ్లోరైడ్ వంటి సమస్యను పరిష్కరించడంతోపాటు తీర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు ఉప్పునీరు కాకుండా కాపాడినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత ఆరు జిల్లాల్లో.. రోజూ ఒక మనిషికి పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వంద లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల నీటిని అందించేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం మేర కాంట్రాక్టర్లకు పనులు చేపట్టే సమయంలో, మిగిలిన 70 శాతం నిధులను 12 ఏళ్ల పాటు విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలతో కలిపి మొత్తం ఆరు జిల్లాల్లో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. ఏటా 90 టీఎంసీలు అవసరం – వాటర్ గ్రిడ్‌లో భాగంగా ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. మొత్తం 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు ఎలాంటి మార్పులు లేకుండా వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ ఏడాది పొడవునా నీటి సరఫరాకు 90 టీఎంసీల నీరు అవసరం కాగా నీటి వనరుల కోసం 52 రిజర్వాయర్లను గుర్తించారు. రూ.12,308 కోట్లతో తొలిదశ – శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు లేకపోవడంవల్ల కిడ్నీ వ్యాధులు అత్యధికంగా నమోదవుతున్నాయన్న అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటిని అందించనున్నారు. – జీవనది గోదావరి చెంతనే ప్రవహిస్తున్నా.. ఆక్వా సాగుతో సముద్రతీర ప్రాంతాల భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. దీంతో మంచినీటి కోసం తపిస్తున్న ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలను కూడా వాటర్ గ్రిడ్ ద్వారా ఆదుకోనున్నారు. – ఇక.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతాల్లో ప్రతి ఏటా వందలాది గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి. దీంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. దీనికి శాశ్వతంగా చెక్ పెట్టాలని సర్కారు భావిస్తోంది. – అలాగే, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో సున్నపు రాయి నిక్షేపాలు, ఫ్లోరైడ్ కారణంగా ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి కష్టాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. మంచినీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు తొలి విడతలో ఈ ప్రాంతాలను వాటర్ గ్రిడ్‌లో ఎంపిక చేశారు. తొలి విడత పనులకు రూ.12,308 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఉద్దానంలో 100 శాతం ప్రభుత్వ నిధులతో.. – రాష్ట్రమంతటా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టాలని నిర్ణయించినా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు అందుబాటులో లేక పెద్దఎత్తున నమోదవుతున్న కిడ్నీ జబ్బులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మాత్రం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. మొదలైన టెండర్ల ప్రక్రియ తొలి విడత వాటర్‌గ్రిడ్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రాథమికంగా మొదలు పెట్టారు. తొలి విడతలో ఆరు జిల్లాలో ఆరు ప్యాకేజీల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టడంపై ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ అధికారులు ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్టŠట్) నోటిఫికేషన్ జారీచేశారు. కాంట్రాక్టర్లు తమ ఆసక్తిని తెలియజేసేందుకు ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంది. 16లోగా జ్యుడీషియల్ ప్రివ్యూకు వివరాలు వాటర్ గ్రిడ్ పనులకు టెండర్లు నిర్వహించేందుకు తొలుత జ్యుడీషియల్ ప్రివ్యూకు ఈనెల 16లోగా వివరాలు పంపాలని నిర్ణయించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి అనుమతి రాగానే జూన్ మొదటి వారం కల్లా టెండర్లు నిర్వహించి ఆ తర్వాత పనులను ప్రారంభించేందుకు ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
పల్నాడులో తీరనున్న దాహార్తి
మాచర్ల: ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్నాటి గ్రామాల దాహార్తి తీరనుంది. తొమ్మిది నియోజకవర్గాల పరిధిలోని 34 మండలాలు, 902 గ్రామాలకు మంచినీటిని అందించే వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.2,665 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ గ్రిడ్ అందుబాటులోకి వస్తే మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అన్న మాటే వినిపించదు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ ప్రాంతమైన విజయపురిసౌత్‌లోని మేకల గొంది వద్ద వాటర్ గ్రిడ్ నిర్మించనున్నారు. త్వరలోనే వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 34 మండలాలకు లబ్ధిచేకూరే ఈ పథకాన్ని చేపట్టాలని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) కోరడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ తగ్గిపోయినప్పుడూ ఎండాకాలం సైతం నీటి నిల్వలు రిజర్వాయర్‌లో ఉన్నప్పుడు ఈ వాటర్ గ్రిడ్‌లోని పథకాలు చేపట్టేందుకు సర్వేచేయించి పల్నాటి ప్రాంతంలోని ప్రజలకు మేలు చేకూర్చే విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరిక మేరకు జి.ఓ.నెం. ఈ నెల 16న జారీ చేసి సంబంధిత వాటర్ గ్రిడ్ పధకానికి సంబం«ధించి చేపట్టబోయే పనుల వివరాలను పేర్కొన్నారు. మాచర్ల నియోజక వర్గంలోని 5 మండలాలు, గురజాల నియోజక వర్గంలోని 4 మండలాలు, వినుకొండలో 4, నర్సరావుపేటలో 2, చిలకలూరి పేటలో 3, సత్తెనపల్లిలో 4, పెదకూరపాడులో 4, గుంటూరు రూరల్ లో 3, ప్రకాశం జిల్లాలో 5 మండలాలు ఈ వాటర్ గ్రిడ్ పధకం ద్వారా మంచినీటిని ప్రజలకు అందించటం జరుగుతుందన్నారు. నర్సరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి పురపాలక సంఘ కార్యాలయాలకు వాటర్ స్కీంను అనుసంధానం చేస్తారు. విజయపురిసౌత్‌లోని మేకల గొంది వద్ద మొదటిగా సాగర్ రిజర్వాయర్‌లో హెడ్ వర్క్స్ నిర్మిస్తారు. అంచనాలను ప్రభుత్వం ఆమోదించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. -
వాటర్‌గ్రిడ్‌తో నీటి సమస్యలకు చెక్
పులివెందుల: రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీంతో సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో నియోజకవర్గ అభివృద్ధి పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పులివెందులను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ప్రతి మండలంలో గోడౌన్లు, నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీఎం సహాయ నిధి కింద 9 మందికి మంజూరైన రూ.20 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్–2019లో కడపకు చెందిన ఆర్.కె.సిద్ధార్థ రెడ్డి, పి.వి.సాయిశ్రీనివాస్‌లు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా వారిని అభినందించారు. -
నీటి సమస్యకు పరిష్కారం.. వాటర్ గ్రిడ్
జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో ఇటు ప్రజలు.. అటు రైతాంగం అల్లాడుతోంది. గత పాలకులు ముందు చూపు కొరవడి, ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి. పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయలేని పరిస్థితి. శాశ్వతంగా నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. వాటర్ గ్రిడ్ ఏర్పాటే దీనికి పరిష్కార మార్గంగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపింది. ఇది కార్యరూపం దాల్చితే జిల్లా వాసులకు నీటి కష్టాలకు చెక్ పెట్టినట్టే. సాక్షి , నెల్లూరు : జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే ఏకైక రిజర్వారుగా సోమశిల ప్రాజెక్ట్ ఉంది. ఏటా ఈ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసి కండలేరు, కనిగిరి, తెలుగుగంగతో ఇతర ప్రధాన కాల్వలకు, జిల్లా తాగునీటి అవసరాలకు కేటాయిస్తున్నారు. కండలేరు ద్వారా తిరుపతికి, తెలుగుగంగ ద్వారా చెన్నై నగరాలకు నీటిని తరలిస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో ఐదేళ్లుగా కరువు వెంటాడుతూనే ఉంది. గతేడాది కూడా జిల్లాలో 26 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన క్రమంలో జిల్లాలో తాగునీటి అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించింది. రెండు నెలలుగా ట్యాంకర్ల ద్వారా కరువు మండలాల్లోని 436 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తోంది. సమీపంలో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని ట్యాంకర్లలో నింపుకొని సరఫరా చేస్తోంది. ఇందుకు సంబంధించి రైతుకు నెలకు రూ. 9 వేలు చెల్లిస్తోంది. మరో నెల రోజుల పాటు ట్యాంకర్లతో నీటి సరఫరా కొనసాగే అవకాశం ఉంది. అడుగంటిన 70 శాతం బోర్లు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయిన నేపథ్యంలో జిల్లాలోని 18,500 చేతి పంపుల్లో దాదాపు 70 శాతం నీరులేక నిరుపయోగంగా మారిపోయాయి. వర్షాకాలం వచ్చి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నా.. జిల్లాలో ఆశించిన మేరకు వర్షాలు కురవని పరిస్థితి. ఇదే తరహా ఇబ్బందులు ఏటా జిల్లాలో ఉంటున్నాయి. వీటి అన్నింటికి శాశ్వత పరిష్కారం చూపేలా గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనుంది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధ్యక్షతన గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులు, ఇరిగేషన్ అధికారులు, సోమశిల ప్రాజెక్ట్ అధికారులు, పశు సంవర్థక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు సమావేశమయ్యారు. జిల్లాలోని 46 మండలాలు, 7 మున్సిపాలిటీలు, నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పరిశ్రమలకు, పశువులకు అవసరమైన నీటి వినియోగంపై అంచనాలు సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రతి ఇంటికీ తాగునీటి అవసరాలకు కోసం వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు చేసి, కనెక్షన్ ఇవ్వడానికి, దానికి అవసరమైన ఏర్పాట్ల నిర్వహణకు సుమారు రూ. 4,600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సోమశిల నుంచి తాగు, పరిశ్రమల నీటి అవసరాలకు 10 టీఎంసీలు ఏడాది పొడువునా అవసరం అవుతాయని గుర్తించారు. జిల్లాలోని అన్ని కెనాల్స్, బ్రాంచ్ కెనాల్స్‌కు సోమశిల నుంచి నీరు విడుదల కావాల్సి ఉండడంతో సోమశిల నీటి కేటాయింపులపై దృష్టి సారించి ప్రతి ఏటా పది టీఎంసీల వినియోగించుకోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఏటా సోమశిలకు వచ్చే ఇన్‌ఫ్లో, ఆవుట్ ఫ్లోను పరిశీలించి నీటి కేటాయింపులు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాటు వాటర్ గ్రిడ్ ద్వారా రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నదే వాటర్ గ్రిడ్ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రతిపాదనలు పంపారు. తక్షణ అవసరాలపైనా దృష్టి రానున్న ఆరు నెలల కాలంలో కనీనం ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కృష్ణా నది ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి సోమశిలకు నీరు చేరితే రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లిలకు కండలేరు ద్వారా, మిగిలిన నియోజకవర్గాల్లోని మండలాలకు సోమశిల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనిని కొనసాగిస్తే డెడ్ స్టోరేజ్‌లో కూడా నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. -
ఔటర్ చుట్టూ జలహారం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి మణిహారంలా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) చుట్టూ జలవలయం లా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 158 కిలోమీటర్ల మార్గంలో విస్తరించిన ఓఆర్ఆర్ చుట్టూ రూ.3 వేల కోట్లతో ఈ వాటర్‌గ్రిడ్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం 3,000 ఎంఎం డయా వ్యాసార్థంగల మైల్డ్ స్టీల్‌తో సిద్ధం చేసిన భారీ మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమా యత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నీటిని నగరం నలుచెరగులా సరఫరా చేసేం దుకు వీలుగా ఈ గ్రిడ్‌ను నిర్మించనున్నారు. ఈ జలవలయం పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిపుణులు రంగంలోకి దిగనున్నారు. మరో మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధంచేసి పనులు మొదలుపెట్టే దిశగా జలమండలి సన్నాహాలు చేస్తోంది. భారీ జలవలయం.. దాహార్తి దూరం.. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీతోపాటు.. ఔటర్‌కు లోపల ఉన్న 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు 1.20 కోట్ల మంది దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ఈ భారీ రింగ్ మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, ఐటీ, హార్డ్‌వేర్ పార్క్‌లు, నూతనంగా ఏర్పాటుకానున్న టౌన్ షిప్‌లు, కాలనీలకు 24 గంటలు తాగునీటిని అందించడంతోపాటు.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతీ వ్యక్తికి తలసరిగా నిత్యం 150 లీటర్ల తాగునీటిని (లీటర్ పర్ క్యాపిటాడైలీ) అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ వాటర్‌గ్రిడ్ పథకానికి జలమండలి శ్రీకారం చుట్టనుంది. ఏ మూలకైనా తరలించేలా.. ఈ నీటిని ఔటర్ లోపల ఏ మూలకైనా తరలించే అవకాశం ఉంది. ఈ గ్రిడ్ వ్యవస్థతో జల మండలి పరిధిలోని 500 స్టోరేజీ రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఆయా జలాశయాల నుంచి వచ్చే నీరు పంపింగ్ అంతగా అవసరం లేకుం డా గ్రావిటీ(భూమ్యాకర్షణ శక్తి) ద్వారా నేరుగా గ్రిడ్ పైప్లైన్లోకి చేరేలా నేలవాలు అధికంగా ఉండే చోటనే అనుసంధానించనుండటం విశేషం. ఈ వాటర్‌గ్రిడ్ కాన్సెప్ట్ అమెరికా, బ్రిటన్ దేశాల్లోని పలు మహానగరాల్లో అమలులో ఉంది. ఆయా నగరాల అనుభవాలను కూడా పరిశీలించిన తర్వాతే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. 7 చోట్ల వాటర్‌గ్రిడ్ జంక్షన్లు.. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాల నీటిని ఈ వాటర్‌గ్రిడ్ భారీ పైప్‌లైన్‌కు అనుసంధానించేందుకు ఔటర్ చుట్టూ 7 చోట్ల గ్రిడ్ జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. పటాన్చెరు వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్‌కు మంజీరా నీళ్లు, కండ్లకోయ వద్ద ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్ పైప్‌లైన్‌కు అనుసంధానించనున్నారు. శామీర్‌పేట్ వద్ద కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్‌కు కలపనున్నారు. వెలిమాల జంక్షన్ వద్ద సింగూరు జలాలను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్ నీటిని కిస్మత్పూర్ వద్ద, బొంగ్లూరు జంక్షన్ వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టు నుంచి తరలించే కృష్ణా జలాలను కలుపుతారు. ఇక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న దేవులమ్మనాగారం(చౌటుప్పల్) నుంచి తరలించే కృష్ణా జలాలను పెద్ద అంబర్పేట్ ఔటర్ జంక్షన్ వద్ద గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. దీంతో ఆయా జలాశయాల నుంచి తరలించే నీటితో నిత్యం 600 మిలియన్ గ్యాలన్ల శుద్ధి చేసిన తాగునీరు ఈ గ్రిడ్‌లో నిరంతరం అందుబాటులో ఉంటుంది. -
కీలక శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
2 వేల మందిని నియమిస్తామన్న సీఎం సాక్షి, అమరావతి: అన్ని ముఖ్యమైన శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయ డానికి త్వరలో 2 వేల గ్రూప్–1, గ్రూప్–2 నియామకాలు జరుపుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో చేపడుతు న్న పనులపై సీఎం మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వివరాలను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సాధ్యమైనంత త్వరలో ఈ నియామకాలు జరుపుతామని అందులో పేర్కొన్నారు. ప్రజలందరికీ మంచినీటి వసతి కల్పించేందుకు వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం దాని స్థానంలో ప్రత్యేక తాగునీటి సరఫరా సంస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తు న్నట్టు తాజా సమావేశంలో తెలిపారు. ఈ నెలలో జరిగే కలెక్టర్ల సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. భూవివాదాల పరిష్కారానికి భూసేవ పేరుతో త్వరలో ల్యాండ్‌హబ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుందని సీఎం తెలిపారు. ప్రతీ స్థలానికి, పొలానికి భూధార్ పేరుతో యునిక్ ఐడీ నంబర్‌ను కేటాయిస్తామని చెప్పారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఒక మున్సిపాలిటీ, ఒక మండలంలో అమలు చేసి పరిశీలించాలని సూచించారు. -
‘సాగునీటి’ టెండర్లలో భారీ అక్రమాలు
విచారణకు సభాసంఘం ఏర్పాటు చేయాలి: ఉత్తమ్ ⇒ కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్ ⇒ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేస్తున్నారు ⇒ వృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తున్నారు ⇒ వాయిదాల్లో రుణమాఫీతో రైతులకు అందని రుణాలు సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్, వాటికి కేటాయింపులు చూస్తుంటే కాంట్రాక్టర్ల కోసమే వాటిని చేపడుతున్నారా అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానిం చింది. సోమవారం శాసనసభలో ద్యవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. వాటర్‌గ్రిడ్, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలపై సభాసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల తెలంగాణ చేస్తున్నారు రాష్ట్రం ఏర్పాటయ్యాక కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నారని.. మూడేళ్లలో అప్పులు రూ.లక్ష కోట్లు దాటాయని ఉత్తమ్ పేర్కొ న్నారు. ఇవేగాక కార్పొరేషన్ల పేరిట చేస్తున్న అప్పులు రూ.31 వేల కోట్లు, డిస్కంల అప్పు రూ.9 వేల కోట్లు అదనమని.. ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని అభివర్ణించారు. గత బడ్జెట్లో రూ.4,404 కోట్లు మిగులు చూపించారని, వాస్తవానికి రూ.238 కోట్లు లోటు ఉందని పేర్కొన్నారు. జీఎస్డీపీ వృద్ధిని కూడా ఎక్కువ చేసి చూపించారని విమర్శించారు. ఆవేదనలో రాష్ట్ర రైతులు రుణమాఫీని వాయిదాల రూపంలో చెల్లిం చడంతో రైతులకు బ్యాంకులు తక్కువగా రుణాలు ఇచ్చాయని.. వడ్డీ భారాన్ని ప్రభుత్వం రైతులపైనే వేసిందని ఉత్తమ్ విమర్శించారు. కేంద్రం నుంచి ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు పైసా ఇవ్వలే దన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి 2013–14లో 107 లక్షల టన్నులుంటే.. 2015–16 నాటికి 51 లక్షల టన్నులకు పడిపోయిందని గుర్తు చేశారు. పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరకు అదనంగా వరికి రూ.200, జొన్నకు రూ.200, కందికి రూ.450 బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కనీసం నష్టం అంచనా కూడా వేయలేదని మండిపడ్డారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, మహిళా రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 2,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. హామీలన్నీ గాల్లోనే.. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలు గాల్లోనే ఉన్నాయని, అమలు చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. కేజీ టు పీజీ విద్య కలగానే మిగిలిపోయిందని, దళితులకు ఒక్క ఎకరా భూమిని కూడా పంపిణీ చేయలేదని.. దళిత పారిశ్రామిక వేత్తలకు ఒక్క రూపాయీ ఇవ్వలేదని మండిపడ్డారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు హామీ ఏమైందన్నారు. మహదేవ్‌పూర్‌లో వన్యప్రాణుల చట్టాన్ని అతి క్రమించిన వారిలో మంత్రుల కుమారులు న్నట్లు ఆరోపణలున్నాయని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ లైన్లతోనే విద్యుత్ ఉత్పత్తి పెరగలేదంటూ వ్యంగ్యంగా విమర్శించారు. అసహన ధోరణి మంచిదికాదు బడ్జెట్ అంచనాలను, సవరించిన అంచనాలను పరిశీలిస్తే సంక్షేమానికి భారీగా కోత పడుతోందన్న ఎమ్మెల్యే సంపత్‌ను సీఎంతప్పుపట్టారని, ఇంత అసహన ధోరణితో మాట్లాడటం సరికాదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, సీఎం సమాధానం అనంతరం సంపత్ మాట్లాడుతూ.. సంక్షేమంపై ప్రభుత్వ లెక్కలను తప్పుపట్టారు. దీనికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి చట్టం చేసిన తరువాత ఖర్చు చేయకపోవడం ఉండదని పేర్కొన్నారు. ఈ దశలో ఉత్తమ్ జోక్యం చేసుకుని ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని, అందరూ భజన సంఘంగా ఉండరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. -
ప్రజల రుణం తీర్చుకోవడమే నా ఎజెండా
కమలాపూర్‌ను అన్ని రంగాల్లోఅభివృద్ధి చేస్తా ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కమలాపూర్ : ముక్కూ, ముఖం తెలియని నాడు అండగా ఉండి ఇంతగా ఆశీర్వదించిన మండల ప్రజల రుణం తీర్చుకోవడమే తన ఎజెండా అని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కమలాపూర్ మండలంలో పర్యటించి రూ.2.37 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ కమలాపూర్‌ను వరంగల్ అర్బన్ జిల్లాలో కలిసిన తర్వాత మొద టి సారిగా మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానన్నారు. కమలాపూర్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాకు తీసిపోని విధంగా విద్య, ఇన్‌ఫ్రాస్టక్చ్రర్, పరిశ్రమలు, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యంగా సీడ్ బౌల్ అఫ్ తెలంగాణలో భాగంగా కమలాపూర్ మండలాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇప్పటికే మండలానికి హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వచ్చిందని, బీపీసీఎల్, ఐఓసీ ఫిల్లింగ్ స్టేషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాటర్‌గ్రిడ్ (మిషన్ భగీరథ)రాకముందే కమలాపూర్‌లో రూ.20 కోట్లతో ఫిల్టర్‌బెడ్ నిర్మించి దానిని మిషన్ భగీరథకు అనుసంధానం చేసి 2018 లోగా మండల ఆడబిడ్డలకు కానుకగా ఇంటింటికి నల్లా ఇస్తానన్నారు. గతంలో వాగులపై బ్రిడ్జిలు లేక వర్షం వస్తే మండలం ఐలాండ్‌గా మారేదని, ఇప్పుడా పరిస్థితి లేకుండా మండల వ్యాప్తంగా రూ.40 కోట్లతో 10 బ్రిడ్జిలు నిర్మించామని తెలిపారు. రూ.170 కోట్లతో హుజూరాబాద్ నుంచి పరకాల వరకు ఫోర్‌లేన్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ సంపత్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్, తదితరులు పాల్గొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే వరంగల్‌లోకి.. కమలాపూర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లాకు కూత వేటు దూరంలో ఉంద ని, నిత్యం మండల ప్రజలు ఏ పని కోసమైనా వరంగల్‌కే వెళ్తారని, ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యానికే మం డలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలి పామని మంత్రి ఈటల పేర్కొన్నారు. దీనిపై మండల ప్రజలు కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కానీ త్వరలో అంతా సర్దుకుంటుందన్నారు. -
'వాటర్ గ్రిడ్'పై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: దళిత వాడల నుంచే ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వాటర్ గ్రిడ్ పథకంపై ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ కోసం అన్ని మోటార్లను బీహెచ్ఈఎల్ నుంచి కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. 2017 డిసెంబర్ నాటికి గోదావరి, కృష్ణా నీళ్లు ఇంటింటికి చేరేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వాటర్ గ్రిడ్ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనుకున్న వేగంతో పనులు జరగని చోట వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు పూర్తి చేయాలన్నారు. నీరు పారుదల ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని వాడాలని కేసీఆర్ సూచించారు. -
2017లోగా ఇంటింటికీ తాగునీరు
మార్చి వరకు మొదటి దశలో పూర్తి నాణ్యతతో పనులు చేయాలి మిషన్‌భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల హుస్నాబాద్/తిమ్మాపూర్/చిగురుమామిడి : రాష్ట్రంలోని ప్రతీ ఇంటింటికీ 2017లోగా తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్‌భగీరథ పనులు వేగవంతంచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్ మండలంలోని రాములపల్లె, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ, చిగురుమామిడి మండలంలోని సుందరగిరి వద్ద జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పైపులైన్ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ప«థకం ద్వారా త్వరలోనే ఇంటింటికీ సురక్షితమైన నీటిని అందించనున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. జిల్లాలో రూ.6,170కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది మార్చి వరకు మొదటి దశలో పలు గ్రామాలకు, జూన్‌లో రెండో దశ, సెప్టెంబర్‌లో మూడో దశకు, డిసెంబర్ వరకు మిషన్ భగీరథను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. పనులు నాణ్యతగా సాగాలని, నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ అమరేంద్ర, డీఈఈ త్రినాథ్, బాలరాజ్, జేఈ రంజిత్, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న ఉన్నారు. -
రెండేళ్లయినా దొరల బడ్జెటేనా?
మాజీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం విమర్శ సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా టీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్ దొరల బడ్జెట్‌లాగే ఉందని, బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం దక్కలేదని మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ వారు తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, సాగునీటి పారుదల శాఖలకే అధిక నిధులు కేటాయించారు. వారు చేపట్టింది వాటర్ గ్రిడ్ కాదు.. అవినీతి గ్రిడ్. రెండు పడకల ఇళ్లకు నిధులేవి? తెలంగాణ అమరవీరులకు గుర్తింపేదీ? ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలే తప్ప.. ప్రజావాణికి చోటులేదు. నిరుద్యోగుల వేదన అరణ్య రోదనగానే మిగిలింది..’ అని మధుయాష్కీ పేర్కొన్నారు. పొన్నం మాట్లాడుతూ ‘చేనేత కార్మికులు, గీతకార్మికులు, ఇతర బడుగు బలహీన వర్గాలకు అంది స్తున్న ఆసరా పెన్షన్లను ఇంటి పన్ను బకాయిల కింద పట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఎన్నికలు ఉన్నాయని ఇంటి పన్నులు మాఫీ చేసిన మీరు, గ్రామీణ ప్రాంతాలను ఎందుకు విస్మరిస్తున్నారు’ అని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ బడ్జెట్లో ఆ వర్గాల ప్రజలకు న్యాయం దక్కలేదన్నారు. -
వాటర్ గ్రిడ్ అంతా అవినీతి మయం: భట్టి విక్రమార్క
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం అంతా అవినీతి మయం అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వైరా రిజయర్వాయర్ వద్ద విలేకరుల తో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ కుమార్తె కవితకు చోటు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టాడని ధ్వజమెత్తారు. వాటర్ గ్రిడ్ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీని బహిరంగ విచారణకు రావాలని సవాల్ విసిరారు. -
'వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయండి'
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బుధవారం వేములవాడ మండలం అగ్రహారం వద్ద వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న క్వారీల్లో బ్లాస్టింగ్ల వలన పనులకు అంతరాయం కలుగుతున్నందున వాటిని నిలిపివేయాలని కోరారు. -
వాటర్‌గ్రిడ్‌కు నిధులు ఇవ్వలేం
లోక్‌సభలో ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో గురువారం టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ.. కేంద్ర తాగునీటి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాటర్‌గ్రిడ్ పథకానికి అయ్యే మొత్తం వ్యయం రూ. 42,474 కోట్లలో సగం నిధులను భరించాల్సిందిగా కేంద్రాన్ని తెలంగాణ సీఎం కోరారని, ఆ విధంగా నిధులు ఇవ్వలేమని పేర్కొన్నారు. అయితే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి అందే నిధులను వాటర్‌గ్రిడ్ పథకానికి వినియోగించుకోవచ్చని చెప్పారు. అవసరమైతే విదేశీ సంస్థల నుంచి ఆర్థికసాయం పొందే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. -
కేంద్ర మంత్రిని కలిసిన కేటీఆర్
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ లో కలిశారు. స్థానిక సంస్థలను ఆదుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్.. కేంద్ర మంత్రిని కోరారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా నిధులన్నీ గ్రామ పంచాయితీలకే వెళుతున్నాయని.. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఈ సందర్భంగా కేటీఆర్.. బీరేంద్ర సింగ్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా రాష్ట్రాల పంచాయితీ రాజ్ మంత్రులతో సమావేశం కానున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి స్థానిక సంస్థలకు బడ్జెట్ లో నిధులు కేటాయించేలా ఒత్తిడి తెస్తామని అన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్... మిగతా రాష్ట్రాలు కూడా ఈ సమస్యను తమ దృష్టికి తీసుకు వచ్చాయని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం అందరికీ ఆదర్శప్రాయం అని కేంద్ర మంత్రి కితాబిచ్చారు. -
ఏప్రిల్‌కల్లా 9నియోజకవర్గాలకు వాటర్ గ్రిడ్
-
దొంగ చేతిలో వాటర్ గ్రిడ్ తాళం
సందర్భం ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నీటి సరఫరా పనుల్లో ఏ ప్రమాణాలనూ వాప్కోస్ పాటించలేదు. అలాంటి వాప్కోస్ను తెలంగాణకు శాశ్వతంగా సాగు, తాగునీటిని అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్యవేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా? వాటర్ అండ్ పవర్ కన్సె ల్టెన్సీ (వాప్కోస్) తెలంగాణలో అత్యంత వివాదాస్పద మైన సంస్థగా ప్రజలముందు నిలుస్తోంది. కార్పొరేట్ దోపిడీ లీలలు ప్రజలు పోరాడి సాధిం చుకున్న తెలంగాణలో వెలుగు చూడటమే కలవరపెడుతోం ది. వైఎస్ హయాంలో వాప్ కోస్ డీపీఆర్ ఆధారంగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టును చేపట్టగా 9 వేల కోట్ల పనులయ్యాయి. తెలంగా ణకు ఎనలేని మేలు చేసే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణా నికి తుమ్మిడి హెట్టి అన్ని విధాల అనువైనదని ఆనాడు వాప్కోస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం వాప్కోస్ గత డిజైన్లోనే 1,500 కోట్ల పనులు చేసిందనేది గమనిం చాలి. ప్రాణహితపై వాప్కోస్ ఇచ్చిన నివేదికను ఆ సంస్థే తలకిందులు చేసి, కాళేశ్వరం-మేడిగడ్డకు ప్రధాన ప్రాజెక్టును మార్చి వేల కోట్ల దుర్వినియోగం చేసి, నిర్మించిన భారీ కాలువలు నిరుపయోగమయ్యాయి. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు, విశ్రాంత ఇంజనీర్లు, వారి సంఘాలు, మేధావులు, ప్రజలందరు ఈ రీడిజైన్‌ను వ్యతిరేకించి ఉద్యమిస్తూనే ఉన్నాయి. వ్యాప్కోస్ మేడిగడ్డ సర్వేకు అనేక కోట్ల ఫీజు తీసుకొని, లైడార్ లేజర్ సర్వే చేసి, కాళేశ్వరం నుండి ఎల్లంపెల్లికి కాల్వ, సొరంగానికి 150 క్రాసింగ్‌లు, అడ్డంకులున్నాయని, అసాధ్యమని తేల్చి, ప్రతిపాదించిన ప్రభుత్వమే ఈ రీడిజైనింగును రద్దు చేసింది. ఎల్లంపెల్లి నుండి దారిలో ఉన్న జిల్లాలు, హైద రాబాద్‌కు నీరందించే పథకంలో వాప్కోస్ చేస్తున్న ఘోరమైన తప్పులపై మెట్రో వాటర్ వర్క్స్ దుమ్మెత్తి పోసింది. వాప్కోస్ ఏ ఒక్క తప్పును సరిదిద్దుకోకపోగా, జవాబిచ్చే బాధ్యతనూ విస్మరించింది. 'మౌలానా అబ్దుల్ కలాం హైదరాబాద్ సుజల స్రవంతి' గోదావరి తాగునీటి పథకం దశ-1తో ఎల్లంపెల్లి నుండి హైదరాబాద్‌కు నీళ్లు తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పథకంపై సర్వేకు వాప్కోస్ను నియ మించారు. ఈ పథకం అకౌంట్స్ జనరల్ 17.11.2012న వాప్కోస్ తప్పులపై షోకాజ్ నోటీస్ జారీచేశారు. వాప్ కోస్ అర్హత, అనుభవం లేని ఇంజనీర్లను వినియోగిస్తుం దని. ఒక ప్యాకేజీలో ఉన్న అదే పేర్లు గల ఇంజనీర్లనే మరో ప్యాకేజీలో వినియోగిస్తుందని నిర్దిష్టంగా వాప్ కోస్‌ను ఆ లేఖలో తీవ్రంగా మందలించింది. మెట్రో వాటర్‌వర్క్స్ డీజీఎం వాప్కోస్ ప్రాజెక్టు డెరైక్టర్‌కు రాసిన మరో లేఖలో వాప్కోస్ తప్పులను తూర్పారబట్టారు. అర్హత, ఏ మాత్రం అనుభవం లేని యువ ఇంజనీర్లను నియమిస్తున్నారు. 14 మంది సీని యర్ ఇంజనీర్లు ఉండవలసిన చోట, కేవలం ఎలాంటి అర్హత, అనుభవం లేని అప్పుడే చదువులు పూర్తి చేసు కున్న ఆరుగురు జూనియర్ ఇంజనీర్లను, సర్టిఫికెట్లు కూడా రాని ఇంజనీర్లను వాప్కోస్ కారు చౌక జీతాలు చెల్లించి కుదుర్చుకుంది. అనుభవలేమితో ప్రాజెక్టుల భవిష్యత్తునే వాప్కోస్ ప్రశ్నార్థకం చేస్తోంది. కేంద్ర నీటిశాఖ నిబంధనల ప్రకారం వ్యాప్కోస్ పనిచేస్తున్న రాష్ట్రాలలో అత్యున్నత సాంకేతిక సౌకర్యా లతో సెంట్రల్ లాబొరేటరీ ఉండాలి. అన్ని సాంకేతిక వసతులున్న మొబైల్ లాబొరేటరీ ఉండాలి. కానీ వాప్ కోస్కు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయిది పక్కకు పెడితే ఏ స్థాయి పరిశోధనా సంస్థాలేదు. ప్రమాణాలను పాతరేసిన వీరి తప్పుడు నివేదికల ఆధారంగా వేల కోట్లతో ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మిస్తే ఎన్నిచోట్ల పేలుతున్నాయో చూస్తూనే ఉన్నాం. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయి స్కీమ్ ప్రాజెక్టు ఫేస్-1, ప్యాకేజీ-2లో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న పీఎస్ కాశీనాథ్ (రిటైర్డ్ సీఈ) వాప్కోస్కు, హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బీకి తేది 3.8.2013న లేఖ రాశారు. ప్రతి ప్యాకేజీలో 14 మంది 15 సంవత్సరాలు ఆపై అర్హత, అనుభవంగల ఇంజనీర్లుండాలని, సెంట్రల్ ట్యాబ్, మొబైల్ ట్యాబ్ ఉండాలనీ, అయితే అమలు చేయవల సిన వాప్కోస్ పీడీ దీనికి విరుద్ధంగా ప్యాకేజ్-1ను ఏ మాత్రం అనుభవం లేని ఉప కాంట్రాక్టర్లకిచ్చారు. ఉప కాంట్రాక్టర్లకు ఇవ్వడం అగ్రిమెంట్ నిబంధనలకు విరు ద్ధం. జీతాలివ్వని వారిని, జీతాల గురించి దీనంగా అడ గడానికి వెళ్లిన పేద ఇంజనీర్లను, వాప్కోస్ పీడీ, నాకు మీ జీతాలతో ఎలాంటి సంబంధం లేదని బుకా యించారు. సర్వే పనులు సాగుతున్న చాలా పని స్థలాల వద్ద వాప్కోస్కు ఎక్కడా ఒక కార్యాలయం, ప్రాజెక్టు మేనే జర్ లేరు. 3, 4 గురు అనుభవంలేని ఇంజనీర్లతో కాలం వెళ్లబుచ్చుతోంది. అదే సమయంలో ప్రభుత్వాల నుండి 14 మంది సీనియర్ ఇంజనీర్ల పేర కోట్లు కాజేస్తోంది. వాప్కోస్ దోపిడీ తెలంగాణ ప్రభుత్వంలోనూ మారక పోగా మరింత పెరిగింది. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ల గురించి వాప్కోస్ లక్ష్యాలుగా చెప్పుకొంటుంది. కానీ ఈ ఏ అర్హతలు వాప్ కోస్కు లేవు. ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు జరి గిన నీటి సరఫరా పనులలో పై ఏ నియమాలను, ప్రమా ణాలను వాప్కోస్ పాటించలేదు. పైగా తుంగలో తొక్కింది. ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నిర్మిం చిన పైపులతో నీళ్లందించినప్పుడు పాటించిన ప్రమా ణాలెంతటివనేది తేలుతుంది. అలాంటి వాప్కోస్ను తెలంగాణ జనావళికి శాశ్వతంగా ఉపయోగపడే సాగు, తాగునీరును అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్య వేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా? ప్రమా ణాలు పాటించని, పైసలే ప్రమాణాలైన వాప్కోస్కు ఎలాంటి టెండర్లు లేకుండా తెలంగాణ వాటర్ గ్రిడ్ కన్సెల్టెన్సీగా నెలకో కోటితో ప్రభుత్వం కట్టబెట్టి నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేమిటో తెలంగాణ ప్రభు త్వమే వెల్లడించాలి. వ్యాసకర్త: తెలంగాణ జలసాధన సమితి కార్యదర్శి, నైనాల గోవర్ధన్. మొబైల్:9701381799 -
వాటర్ గ్రిడ్‌ను కోరుతూ.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి
వాటర్ గ్రిడ్‌ను తమ ఊరిలో ఏర్పాటు చేయాలంటూ ఇబ్రహీంపట్నం మండల ప్రజలు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ నివాసాన్ని ముట్టడించారు. అంతకు ముందు మెట్‌పల్లిలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. -
కేటీఆర్‌తో బెంగాల్ బృందం భేటీ
♦ వాటర్ గ్రిడ్ పై బెంగాల్ ఆసక్తి ♦ రాష్ట్రానికి వచ్చిన ముగ్గురు అధికారుల బృందం ♦ తమ రాష్ట్రంలో ప్రాజెక్టు ప్రారంభంపై చర్చలు సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ పథకం అధ్యయనానికి రాష్ట్రానికి విచ్చేసిన పశ్చిమబెంగాల్ అధికారుల బృందం తెలంగాణలో పర్యటించింది. అక్కడి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్‌కు చెందిన అధికారుల బృందం బుధవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావును కలుసుకుంది. తెలంగాణ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తితో ఉన్నారని ఈ బృందం పేర్కొంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు లక్ష్యాలు.. అమలు తీరు, విధివిధానాలను మంత్రి అధికారులకు వివరించారు. తెలంగాణలోని ఆడపడుచులెవరూ తాగునీటికి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగా ణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు గురించే మాట్లాడుకుంటున్నాయని, కేంద్ర ప్రభుత్వం తమ ఆలోచనను అభినందించిందని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల సమీకరణకు అవలంబించిన విధానాలను మంత్రి అధికారులకు వివరించారు. బెంగాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలనుకుంటే అందుకు సంబంధించిన ఇంజనీరింగ్, సాంకేతిక సహకారాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బెంగాల్లో ప్రస్తుతమున్న నీటి సమస్యను అధిగమించేందుకు తమ సీఎం మమతా బెనర్జీ వాటర్ గ్రిడ్ లాంటి పథకమే శాశ్వత పరిష్కారమని భావిస్తున్నారని అధికారుల బృందం మంత్రికి వివరించింది. అంతకు ముందు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఈఎన్సీ సురేందర్‌రెడ్డి బెంగాల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బెంగాల్ నుంచి వచ్చిన డెరైక్టర్ అనిమేశ్ భట్టాచార్య, ఈఈ పిడేయ్ ఏ రాయ్‌తో పాటు ఆర్డబ్ల్యూఎస్ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ నేపథ్యంపైనే అధిక ప్రశ్నలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్సప్లై అండ్ సేవరేజ్ బోర్డులో మేనేజర్(ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రాత పరీక్షను ఆదివారం నిర్వహించింది. గతంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను ఆన్లైన్లోనే టీఎస్పీఎస్సీ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొలిసారి ఆఫ్‌లైన్‌లో పరీక్షను నిర్వహించింది. అభ్యర్థుల్లోని సాధారణ నైపుణ్యాలు, సామర్థ్యాలు పరీక్షించేలా ప్రశ్న పత్రాన్ని రూపొందించింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ అన్ని అంశాల నుంచి ప్రామాణిక ప్రశ్నలను అడిగారు. చరిత్ర నుంచి సుమారు 35 ప్రశ్నలు! ప్రశ్న పత్రంలో తెలంగాణ నేపథ్యం ఉన్న భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ, భారతదేశ చరిత్రకు సంబంధించి సుమారు 35 వరకు ప్రశ్నలు అడిగారు. తెలంగాణ సంస్కృతికి సంబంధించి పలుకుబడిలో ఉన్న ప్రశ్నలనే ఇచ్చారు. ఉదాహరణకు ‘దసరా పండగ రోజు ఒకరికొకకు ఇచ్చుకునే జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు?’, ‘బతుకమ్మ పండగ తొలిరోజును ఏమంటారు?’తోపాటు కాకతీయులు తవ్వించిన చెరువులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలపై ప్రశ్నలు ఇచ్చారు. సాలార్ జంగ్ సంస్కరణలపై రెండు మూడు ప్రశ్నలు ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిలో ప్రధానంగా పండగలు, జాతరల గురించి అడిగారు. ‘ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే ప్రముఖ జాతర?’, ‘కొండగట్టు దేనికి ప్రసిద్ధి?’, ‘మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత యాత్రా స్థలం ఏది?’ మొదలైన ప్రశ్నలతోపాటు 1969 ఉద్యమంపై, భౌగోళిక సూచికగా నమోదైన హైదరాబాద్ హలీమ్‌పై, కుతుబ్‌షాహీ సాహిత్యంపై ప్రశ్నలు ఇచ్చారు. భారత దేశ చరిత్రలో సంస్కరణ ఉద్యమాలు, ఆర్యసమాజంపై ప్రశ్నలు ఇచ్చారు. జాగ్రఫీలో తెలంగాణ నేలలు, వర్షపాతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఖనిజాలు, విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, చెరువులు, ప్రాజెక్టులు తదితర అంశాలతోపాటు ఇండియన్ జాగ్రఫీపై ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ఆర్థిక అంశాలు, ప్రభుత్వ పథకాలు, విధానాలపై ప్రశ్నలు ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు! జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంశంలో జాతీయ అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. నోబెల్ బహుమతిపై, బ్రహ్మోస్ క్షిప ణి, జలాంతర్గా మి నుంచి ప్రయోగించే బాలెస్టిక్ క్షిపణిపై, అంతర్జాతీయ దినోత్సవాల గురించి ప్రశ్నలు ఇచ్చారు. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. సుమారు 15 ప్రశ్నలు ఈ అంశాలకు సంబంధించినవే. పాలిటీ విభాగంలో అన్ని అంశాల్లోంచి ప్రశ్నలు ఇచ్చారు. గతంలో టీఎస్పీఎస్సీ పరీక్షల కంటే కొద్దిగా క్లిష్టంగానే ప్రశ్నలు రూపొందించారు. ఇంగ్లిష్ విభాగంలో సులువైన ప్రశ్నలు ఇచ్చారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఎంటర్ప్రిటేషన్లో ప్రశ్నలు అభ్యర్థులు తార్కిక నైపుణ్యాలు పరీక్షించే విధంగా ఉన్నాయి. క్లిష్టం, సందిగ్ధం! క్రీడలకు సంబంధించి లోతుగా ప్రశ్నలు ఇచ్చారు. ‘కల్టివేటెడ్ స్టైలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ క్రికెటర్ ఎవరు?’, ‘వరంగల్‌కు చెందిన ఏ ఆటగాడు బాల్‌బ్యాడ్మింటన్ ఆటను విప్లవీకరించాడు?’ అనే ప్రశ్నలు ఈ తరం విద్యార్థులకు పెద్దగా తెలిసే అవకాశం లేదని సబ్జెక్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే ‘ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు వల్ల ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ?’ అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లు, మరో ప్రశ్నలో తెలంగాణ ప్రభుత్వ పథకం పేరును ఇంగ్లిష్‌లో వాటర్ గ్రిడ్‌కు బదులు జలహారంగా ఇవ్వడం ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను సందిగ్ధానికి గురిచేసిందని నిపుణులు పేర్కొన్నారు. -
చెప్పినవన్నీ చేస్తున్నాం
♦ కేజీ టు పీజీ మినహా 99.5 శాతం హామీలు అమల్లోకి..: సీఎం కేసీఆర్ ♦ వరంగల్ టీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో బీ ఫారం అందజేత సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ మినహా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను 99.5 శాతం నెరవేరుస్తున్న ఘనత టీఆర్ఎస్దేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని, మేనిఫెస్టోలో లేని ఎన్నో మంచి పథకాలను ప్రారంభించామని చెప్పారు. విద్యుత్ కోతలతో అల్లాడిన రాష్ట్రాన్ని అసలు కోతలే లేని స్థితికి తెచ్చామన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నుంచీ ముందు వరుసలో ఉన్న వారికి పదవులు ఇస్తామని, అదే క్రమంలో వరంగల్ అభ్యర్థిగా పసునూరు దయాకర్‌కు అవకాశమిచ్చామని పేర్కొన్నారు. శనివారం వరంగల్ జిల్లా నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మనమే నంబర్‌వన్.. కేజీ టు పీజీ మినహా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను 99.5 శాతం నెరవేరుస్తున్న ఘనత టీఆర్ఎస్దేనని... రాష్ట్ర విభజన తర్వాత ఆరేడు నెలల పాటు ఐఎఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు జరగకున్నా అనేక మంచి పనులు చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సంక్షేమ పథకాల అమలులో దేశంలో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. మీడియా సంస్థ సీఎన్ఎన్ నంబర్‌వన్ స్టేట్ అవార్డు కూడా ప్రకటించింది. ఇండియా టుడే అవార్డును ఈ నెల ఆరో తేదీన ఢిల్లీలో అందుకోబోతున్నాం. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు కోతల మూలంగా పడిన బాధ వర్ణనాతీతం. ఆరు నెలల్లోనే కరెంటు కోతలు లేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 38 లక్షల మంది సామాజిక పింఛన్లు ఇస్తున్నాం. మేనిఫెస్టోలో లేకున్నా చరిత్రలో మొదటి సారిగా హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి కాలేజీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల కోసం ఎవరూ డిమాండ్ చేయకున్నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్‌కార్డుదారులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తాం. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యంగా ప్రారంభమైనా ఈ ఏడాది 60 వేలు నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది ఈ సంఖ్య పెంచుతాం..’’ అని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలో నిర్మించిన ఏడు ఇళ్లు ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్క డబుల్ బెడ్రూంతో సమానమని పేర్కొన్నారు. అందరికీ అవకాశం.. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నుంచీ ముందు వరుసలో ఉన్న వారికి పదవులు ఇస్తాం. వరంగ ల్ లోక్‌సభ ఉప ఎన్నిక టికెట్‌ను చాలా మంది ఆశించారు. రవికుమార్, పరంజ్యోతి, పరమేశ్వర్, ప్రొఫెసర్ సాంబయ్య తదితరులు టికెట్ అడిగారు. ఏ పార్టీ అయినా ఒక్కరికే అవకాశం ఇవ్వగలుగుతుంది. అదే వరుసలో పసునూరి దయాకర్‌కు అవకాశం ఇచ్చాం. ఆయనకు రెండు మూడు పర్యాయాలు పోటీ చేసే అవకాశం దగ్గరగా వచ్చినా చివరి నిమిషంలో దక్కలేదు. అయినా ఉద్యమంలో, ఎన్నికల సందర్భంలో విధేయతతో పనిచేశాడు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపశిల్పి కూడా. టికెట్ కోసం పోటీ పడిన నేతలందరినీ పిలిచి ఎవరికి అవకాశం ఇచ్చినా అందరూ కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశా. సమయం వచ్చినపుడు నాయకుల అర్హతలను బట్టి అందరికీ అవకాశాలు ఇస్తాం..’’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ సర్కారు చేసిన మంచి పనులను అందరూ గుర్తిస్తున్నారని, సర్వే ప్రకారం అద్భుత విజయం సాధించబోతున్నామని చెప్పారు. దయాకర్ డబ్బులున్న వ్యక్తి కాదని, పార్టీయే ఎన్నికల ఖర్చును భరిస్తుందని పేర్కొంటూ... దయాకర్‌కు కేసీఆర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎంపీ వినోద్‌కుమార్, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తల సమక్షంలో పసునూరి దయాకర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ బీఫారం అందజేశారు. వాటర్ గ్రిడ్‌పై రాష్ట్రాల ఆసక్తి రూ. 40 వేల కోట్లతో రెండున్నరేళ్లలో వాటర్‌గ్రిడ్‌ను పూర్తి చేసేందుకు రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాటర్‌గ్రిడ్ పథకంపై బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. గతంలో సాగునీటి ప్రాజెక్టుల్లో గందరగోళం జరిగిందన్నారు. రూ.7,500 కోట్లు ఖర్చు చేసిన దేవాదుల ప్రాజెక్టు నుంచి కనీసం 60-70 రోజులు కూడా నీరు తీసుకునే పరిస్థితి లేదని... ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తిచేసి త్వరలో ఇరిగేషన్ పాలసీ ప్రకటిస్తామని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు లిఫ్ట్ రీడిజైనింగ్ కొలిక్కి వచ్చిందని, ఎల్ఎండీ కాలువకు రూ. 130 కోట్లతో వచ్చే జూన్ నాటికి మరమ్మతు పూర్తిచేసి నీరు అందిస్తామని చెప్పారు. 28 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ద్వారా భవిష్యత్తులో కోతలు లేని రాష్ట్రంగా చేసుకుంటామన్నారు. -
ఆర్నెలల్లో 3వేల గ్రామాలకు తాగునీరు
♦ నిర్దిష్ట లక్ష్యాలతో వేగంగా వాటర్ గ్రిడ్ పనులు ♦ అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో కేటీఆర్ సమీక్ష ♦ సెగ్మెంట్ల వారీగా నీరిచ్చే తేదీలను ప్రకటించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్ గ్రిడ్) ద్వారా రాబోయే ఆర్నెళ్లలోపే సుమారు మూడు వేల గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించబోతున్నామని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సోమవారం అన్ని జిల్లాల సూపరింటిండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తొలిదశను ఏప్రిల్ 30కల్లా పూర్తి చేసి గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాలతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు గ్రామాలకు సురక్షిత తాగునీటి సరఫరా ప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసేందుకు ఇంజనీర్లంతా పట్టుదలతో పనిచేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సెగ్మెంట్ల వారీగా తేదీలు ప్రకటించండి... వాటర్ గ్రిడ్ పరిధిలోని సెగ్మెంట్ల వారీగా ఏఏ ప్రాంతాలకు నీటి సరఫరాను ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయాన్ని తేదీలతో సహా ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ అన్ని జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. డెడ్లైన్లు పెట్టుకొని పనులు పూర్తిచేయాలని సూచించారు. జిల్లాస్థాయిలో అవసరమైన అన్ని సదుపాయాలను క ల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఔట్సోర్సింగ్ పద్ధతిన తాత్కాలిక నియామకాలను చేపట్టాలని సూచించారు. అటవీ అనుమతులపై ఆరా... జిల్లాల వారీగా పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి కేటీఆర్... ప్రాజెక్ట్‌కు సంబంధించి అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులు, భూసేకరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది.. తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ఏర్పాటుచేసిన జిల్లా జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలు ఎలా జరుగుతున్నాయని ఎస్ఈలను మంత్రి ప్రశ్నించారు. డిజైన్లను ఆమోదించే అధికారాలను జిల్లా సూపరింటిండెంట్ ఇంజనీర్లకే అప్పగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గ్రిడ్ పనులతో పాటు గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ ఏర్పాటును కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
వాటర్ గ్రిడ్‌లో అవినీతి ఆరోపణలపై కేటీఆర్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వాటర్ గ్రిడ్‌లో అవి నీతి, అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. 1,800 పేజీలతో కూడిన వాటర్ గ్రిడ్ డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను బయటపెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. నిర్మల్ మండలం వెల్మల్ వద్ద వాటర్‌గ్రిడ్ ఇంటెక్వెల్ పనులు పరిశీలించారు. దిలావర్పూర్ మండలం మాడేగాంలో గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రతి ఇంటికి శుద్ధ జలాలు అందించేందుకు రూ.35 వేల కోట్లతో ఓ భగీర థ ప్రయత్నం చేస్తున్నాం. 1.25 లక్షల కి.మీ. పైప్లైన్లు, 50 వరకు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటర్ గ్రిడ్ ద్వారా తెలంగాణ ప్రజలకు నీళ్లిస్తాం. ప్రతిపక్షాలకు కూడా మూడు చెర్ల నీళ్లు తాగిస్తాం’ అన్నారు. ‘ఇంటింటికీ శుద్ధ జలాలు అందిస్తే.. నీటి పన్నులు చెల్లించేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పనులు పూర్తయ్యాక పన్ను ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తాం. అఖిలేష్ యాదవ్ పిలిస్తేనే నేను యూపీకి వెళ్లా. కోడిగుడ్డుపై ఈకలు పీకితే ఎలా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ప్రజల్లో కలుస్తున్నం దుకు సంతోషం. గ్రిడ్ పనులకు డీపీఆర్లున్నా యా అని అడుగుతున్నారు. డీపీఆర్‌లు లేకుండానే నాబార్డు, హడ్కో వంటి సంస్థలు రుణాలిస్తాయా? ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరు తాగునీటి ప్రాజెక్టుకు రూ.7వేల కోట్లు ఇస్తూ సంతకం పెట్టిన అప్పటి ఓ మంత్రి తన సొంత జిల్లా నల్లగొండలో ఫ్లోరోసిస్ బాధితులకు సురక్షిత జలాలు ఇవ్వలేకపోయారు. మీ మాదిరిగా కాంట్రాక్టర్ల కోసం కాకుండా ప్రజల కోసం పైప్లైన్లు వేస్తున్నాం. తెలంగాణకు టీఆర్ఎస్ కన్నతల్లి అయితే కాంగ్రెస్ మంత్రసాని. వచ్చే జూన్ నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రూ.2వేల కోట్లతో పనులు చేపట్టాం. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం’ అన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిందన్నారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి, రాథోడ్‌బాపూరావు, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించిన కేటీఆర్
మాడేగావ్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సిద్దిపేట స్ఫూర్తితో వాటర్ గ్రిడ్ ను విజయవంతం చేస్తామని ప్రకటించారు. వాటర్ గ్రిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ35 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం చేయడం లేదని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్షం అన్నారు. వాటర్ గ్రిడ్ పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి లతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
‘గ్రిడ్’ గుట్టు బయటపెడతాం
♦ ఈ అక్రమాలను త్వరలో మీడియా ముందుంచుతాం ♦ సర్కారుపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేతలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వాటర్ గ్రిడ్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బట్టబయలు చేస్తామని, ఆ వివరాలను త్వరలో మీడియా ముందు ఉంచుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు గ్రిడ్ గురించి మాట్లాడితే ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. వాటర్ గ్రిడ్ డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు)ను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులని విమర్శించిన టీఆర్ఎస్ పార్టీ ఈ గ్రిడ్ పనులను ఆంధ్ర కంపెనీకే అప్పగిస్తోందని, ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టు కంపెనీ ఎవరిదో తెలపాలని డిమాండ్ చేశారు. పాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు డిమాండ్ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు డిజైన్లు మార్చుతూ తెలంగాణలోని 16లక్షల ఎకరాల ఆయకట్టును ప్రశ్నార్థకంగా మార్చుతున్నారని విమర్శించారు. నిత్యం పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క బాధిత కుటుంబాన్నైనా పరామర్శించకపోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదన్నారు. జైపూర్ పవర్ ప్లాంటును తమ ప్రభుత్వమే మంజూరు చేసిందని గుర్తు చేశారు. వారు ప్రభుత్వ పందులు రైతు భరోసా యాత్ర చేపట్టిన కాంగ్రెస్ నాయకులను రాబందులంటూ విమర్శించిన టీఆర్ఎస్ మంత్రులే ప్రభుత్వ పందులని కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.1,450 చొప్పున కొనుగోలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను ప్రభుత్వం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన అభివృద్ధి పునాదులపై నిలబడి ప్రదర్శనలిస్తున్నారని అభివర్ణించారు. ‘ప్రాణహిత’ను నిర్వీర్యం చేసేందుకే.. వాటర్‌గ్రిడ్ పైపుల కంపెనీకి మార్కెటింగ్ చేసేందుకే మంత్రి కేటీఆర్ యూపీ వెళ్లి అక్కడి సీఎంను కలిశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ పనులు చేయనున్న కాంట్రాక్టు కంపెనీలకు కేటీఆర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవేళ వాటర్‌గ్రిడ్ ఆదర్శవంతమైన ప్రాజెక్టే అయితే యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్వయంగా తెలంగాణకు వచ్చి పరిశీలించాలే గానీ, ఎలాంటి ప్రయోజనం లేని యూపీ సీఎంను కలిసేందుకు ప్రత్యేక విమానంలో మందీ మార్భలంతో వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వాటర్‌గ్రిడ్‌లో ముడుపుల కోసమే ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. వాస్తు పండితుల మాటలు వినే కేసీఆర్ కరువు మండలాలను ప్రకటించడం లేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల అమలు చేసేందుకు కమిటీలతో పనిలేదని, కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. శాసనసభా పక్ష ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధిపై సీఐడీ విచారణ చేపట్టిందంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమే అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, రాష్ట్ర నాయకులు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, జి.వినోద్, కోదండరెడ్డి, నర్సారెడ్డి, సి.రాంచెంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
రైతు బంధువులు కాదు.. రాబందులు వాళ్లు
కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్ మూడేళ్లలో వాటర్‌గ్రిడ్ పూర్తి... ప్రజలకు నల్లాల ద్వారా నీరు తాగిస్తాం రైతు కష్టాలకు 42 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు కారణం కాదా? సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ నేతలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేతలు చేపడుతున్న రైతు భరోసా యాత్రపై మండిపడ్డారు. వాళ్లు రైతు బంధువులు కాదని, బతికున్న వాళ్లను పీక్కుతినే రాబందులని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి గల్లంతవుతోందన్న భయం వల్లే.. అభివృద్ధిపథంలో వెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు ఉదయసముద్రం ప్రాజెక్టు వద్ద వాటర్‌గ్రిడ్ పనులకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలతో కలసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పీజీ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే ముందుందని, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా మూడేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలకు న ళ్లాల ద్వారా నీళ్లు తాగించి, ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని వ్యాఖ్యానించారు. మీ ఊళ్లో అడుగుదామా? తనకు జానారెడ్డి అంటే ఎంతో గౌరవమని కేటీఆర్ చెప్పారు. ‘‘అయితే ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందిస్తూ.. ‘నీకేం తెలుసు నా సంగతి.. మీ అయ్యను అడిగితే చెప్తడు’ అని అన్నారు. మా అయ్యనెందుకు? ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ఉన్న అయ్యలనడిగితే మీ చరిత్ర, కాంగ్రెస్ నేతల చరిత్ర చెప్తరు..’’ అని అన్నారు. ‘‘నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు.. లేదంటే మీ ఊర్లోనయినా అడుగుదాం. నల్లగొండ జిల్లా విషపు నీళ్లు తాగడానికి కారణమెవరో తేల్చుదాం’’ అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఉత్తరకుమార్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. ‘‘ఈయన కార్లో కాదా ఎన్నికలప్పుడు రూ.3 కోట్లు దొరికింది.. ఎక్కడివి ఆ కట్టలు మర్చిపోయిండా? అలాంటి ఆయన టీఆర్ఎస్ను అవినీతిలో దేశముదురు అంటాడా? మేం మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఉద్యమంలో సింగిల్‌గా ప్రారంభమైనా, ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది కేసీఆర్లున్నరు. మాకు ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారం ఇస్తే.. మీరు 15 నెలలకే బొబ్బలు పెడ్తరా?’’ అని విరుచుకుపడ్డారు. రైతుల వెతలకు ఆ పార్టీలే కారణం ‘‘ఉమ్మడి రాష్ట్రాన్ని 42 ఏళ్లు కాంగ్రెస్, 17 ఏళ్లు టీడీపీ పాలించాయి. ఇప్పుడు తెలంగాణలో రైతుల అవస్థలకు ఆ రెండు పార్టీలు కారణం కాదా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు. అయితే ఒకేసారి మాఫీ చేయడానికి ప్రభుత్వం దగ్గర మూటలుండవని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలెవ్వరూ తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్లు కాదన్నారు. వాళ్లంతా తెలంగాణ వద్దన్నోళ్లు, ఒకవేళ వచ్చినా ముఖ్యమంత్రులం అవుదామని కలలు కన్నోళ్లు అని విమర్శించారు. వాటర్‌గ్రిడ్‌కు రూ.36 వేల కోట్లు ఖర్చవుతాయా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, అయితే గతంలో సీఎం కిరణ్ ఒక్క చిత్తూరు జిల్లా మంచినీటి పథకానికే రూ.7 వేల కోట్లతో ప్రతిపాదనలు పెట్టినప్పుడు, కేబినెట్లో ఉండి ఎలా సంతకాలు చేశారని ప్రశ్నించారు. వాటర్‌గ్రిడ్ గురించి ఎక్కడో ఉన్న యూపీ అఖిలేశ్‌కు అర్థమయింది కానీ... జానారెడ్డికి, ఉత్తమ్‌కు మాత్రం అర్థం కావడం లేదన్నారు. భూస్వామ్య విధానాన్ని తెచ్చే కుట్ర: జగదీశ్‌రెడ్డి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో పాత భూస్వామ్య విధానాన్ని తెచ్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు అధికార పార్టీ నాయకులను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారన్నారు. అయితే వారి ట్రాప్‌లో తాము పడబోమని చెప్పారు. గత పాలకుల చేతగాని తనం వల్లే రాష్ట్రంలో తాగునీరు కూడా లేకుండా పోయిందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 150 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. సభలో ఆశ వర్కర్ల నిరసన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతున్న సమయంలో ఆశ వర్కర్లు నిరసన తెలియజేశారు. సభా ప్రాంగణంలో నల్లజెండాలు ప్రదర్శించి, ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. తమకిచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. నేతలు సముదాయించినా వినకపోవడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి వారిపై మండిపడ్డారు. ‘మీరు సమస్య పరిష్కారానికి వచ్చినట్టు కనిపించడం లేదు. ఎవరో పంపితే ఇక్కడకు వచ్చి ఉంటారు. ఎక్కువసేపు గొడవ చేస్తే పార్టీ కార్యకర్తల్లో తిరుగుబాటు వస్తుంది. అప్పుడు మీరు తట్టుకోలేరు.’ అని వ్యాఖ్యానించారు. -
'రూ. 2 కోట్ల పైలాన్‌కు 36 పగుళ్లు'
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో రూ.2 కోట్లు పెట్టి ప్రభుత్వం నిర్మించిన వాటర్‌గ్రిడ్ పథకం పైలాన్‌కు మూడు నెలల్లోనే 36 పగుళ్లిచ్చాయని, ఇక రూ.40 వేల కోట్లతో చేపట్టిన ఆ పథకం తీరు ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చౌటుప్పల్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం వాటర్‌గ్రిడ్ పథకం పైలాన్‌ను సందర్శించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లీ బిడ్డల పాలనలో అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే నేటికీ కనిపిస్తోందన్నారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే దొంగ నోట్ల కేసులో, మరో ఎమ్మెల్యే ఇసుక దందాలో ఇరుక్కున్నారని ఆరోపించారు. -
ప్రపంచానికే ఆదర్శంగా వాటర్‌గ్రిడ్
అక్రమాలకు తావివ్వకుండా చూస్తున్నాం: కేటీఆర్ ♦ తెలంగాణకు భవిష్యత్తులో తాగునీటి కష్టాలుండవు ♦ అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని వెల్లడి ♦ 18ఏళ్ల క్రితమే సిద్ధిపేటలో ఇంటింటికీ నీరివ్వడమే దీనికి ఆదర్శం సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే ఓ ఆదర్శ పథకంగా నిలిచిపోయేలా వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1.25 లక్షల కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మిస్తుండడం సాహసోపేతమని... నీటి కోసం పాలమూరు కష్టాలు, నల్లగొండకు ఫ్లోరైడ్ బాధలు భవిష్యత్తులో ఉండవని చెప్పారు. మంగళవారం శాసనసభలో వాటర్‌గ్రిడ్‌పై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రూపొందిన నీటి పథకాలను వాటర్‌గ్రిడ్‌తో అనుసంధానిస్తున్నామని చెప్పారు. నల్లగొండలో పరిస్థితి మారకుంటే మానవ రహిత ప్రాంతంగా మారుతుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 18 ఏళ్ల కింద సిద్ధిపేటలో ఇంటింటికి తాగునీటిని అందించిన సీఎం కేసీఆర్... ఇప్పుడు రాష్ట్రమంతటా దాన్ని విస్తరించే క్రమంలో రూ.36 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును ప్రారంభించారని వెల్లడించారు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసేలా 26 సెగ్మెంట్లుగా విభజించి ప్రతి దానికి కాలపరిమితి విధిస్తున్నామని తెలిపారు. అవినీతికి తావులేకుండా ఈపీసీ విధానానికి స్వస్తి చెప్పామని... ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకే అన్నిరకాల బాధ్యతలు అప్పగించే విధానాన్ని నిలిపివేశామని చెప్పారు. ప్రాజెక్టు అధ్యయన బాధ్యతతోపాటు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతను వ్యా ప్కోస్కు అప్పగించామన్నారు. ఇప్పటికే 80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లిస్తున్నందున ఈ ప్రాజెక్టు అవసరమే లేదని కొందరు అంటున్నారని... 80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లు అందుతున్న విషయం వాస్తవమైతే తాను రాజీనామాకు సిద్ధమని పేర్కొన్నారు. వినియోగదారులపై భారం మోపుతారా? వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు వినియోగించే విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందా, వినియోగదారులపై మోపుతారా అని అధికారపార్టీ సభ్యుడు గంగుల కమలాకర్ ప్రశ్నించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీటి సేకరణ మొత్తాన్ని పెంచాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించే సమావేశాలకు ఎమ్మెల్యేలను పిలవాలని మరో సభ్యుడు కిషోర్ కోరారు. గతంలో ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవమున్న తనలాంటి వారి సేవలు తీసుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టు గుజరాత్లో అమలవుతున్నందున అక్కడ పనిచేసిన రిటైర్డ్ అధికారుల సేవలు తీసుకోవాలని ధర్మారెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌తో కూడా అనుసంధానించాలని మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్ కోరారు. -
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభలో ప్రధాన ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక్క ఎంఐఎం పార్టీ మాత్రమే సమావేశాలలో పాల్గొంది. వ్యాట్ సవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వాటర్ గ్రిడ్ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు నుంచి జిల్లాల్లో రైతు భరోసాయాత్రలు చేపడుతున్నారు. -
వేగంగా వాటర్‌గ్రిడ్ పనులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్‌గ్రిడ్)ను మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పనులు పూర్తయిన ప్రాంతాల్లో వెంటనే నీటి సరఫరా చేస్తామని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు తె లిపారు. వాటర్‌గ్రిడ్‌కు సుమారు 200 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, విద్యుత్ పనుల ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే వాటిని చేపట్టేందుకు రూ.100 కోట్లు అడ్వాన్స్‌ను ఇచ్చామని చెప్పారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సోమవారం విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. వాటర్‌గ్రిడ్ పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేసేలా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రెండు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వారంలోగా రెండు విభాగాల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి డిస్కమ్‌లు, జిల్లాలవారీగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. విద్యుత్ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైతే షార్ట్ టెండర్లు పిలవాలని మంత్రి సూచించారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్లకు సంబంధించిన వివరాలను వెంటనే విద్యుత్ శాఖకు అందజేయాలని వాటర్‌గ్రిడ్ అధికారులను ఆదేశించారు. -
రూ.లక్షన్నర కోట్లకు పైగా!
వచ్చే ఏడాది బడ్జెట్‌పై ముందస్తు కసరత్తు రికార్డు స్థాయిలో పెంచే సంకేతాలు ముందుగానే ఆరా తీసిన ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ.25 వేల కోట్లు డబుల్ బెడ్రూం ఇళ్లు, వాటర్‌గ్రిడ్‌కు భారీ కేటాయింపులు హైదరాబాద్: వచ్చే ఏడాది బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ లక్షన్నర కోట్లు దాటిపోనుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ ఏడాది ఎంత ఖర్చు చేస్తాం, వచ్చే ఏడాది ఎంత బడ్జెట్ ప్రవేశపెడదామని సీఎం ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న తెలంగాణ జల వినియోగ విధానంపై చర్చ జరుగుతున్న సమయంలో బడ్జెట్ కేటాయింపులపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. రాబోయే మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల చొప్పున సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినేట్ భేటీ అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దీంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఎంచుకున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్లు, గ్రామజ్యోతి, సంక్షేమ పథకాలన్నింటికీ భారీ మొత్తంలో నిధుల అవసరం ఉంది. ఈ ఏడాది డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలని ఇటీవలి కేబినేట్లోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ భారీ కేటాయింపులు, ఖర్చులకు అనుగుణంగా ఆర్థిక అవసరాలు, అంచనాలెలా ఉన్నాయని కేసీఆర్ ఆరా తీయడంతో పాటు బడ్జెట్ ప్రస్తావన లేవనెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరుసటి రోజున క్యాంపు కార్యాలయంలో తనను కలసి సమస్యలను విన్నవించేందుకు వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులతోనూ సీఎం ఆర్థిక పరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వచ్చే ఏడాది బడ్జెట్ రూ.1.58 లక్షల కోట్లకు చేరుతుందని.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. దీంతో వచ్చే బడ్జెట్ రికార్డు స్థాయి లో పెరిగిపోనుంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఏడాది పది నెలల కాలానికి రూ. లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం వరుసగా అదే పంథాను కొనసాగిస్తుండటం గమనార్హం. 2014-15లో రాష్ట్ర బడ్జెట్ రూ.1,00,637 కోట్లు. ఈ ఏడాది మార్చిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,689 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. -
709 తాత్కాలిక ఉద్యోగాలు
హైదరాబాద్ సిటీ: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్‌గ్రిడ్) నిర్మాణ బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్)లో తాత్కాలిక ఉద్యోగాలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడిన నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం సర్క్యులర్ జారీచేశారు. ఆర్‌డబ్ల్యుఎస్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 47 సీనియర్ అసిస్టెంట్ల స్థానాల్లో 47మంది జూనియర్ అసిస్టెంట్లను, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణ నిమిత్తం కొత్తగా 662 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్ ఇన్ ఛీఫ్‌ను సర్కారు ఆదే శించింది. ఉద్యోగాలకు అర్హతలు ఇలా.. ప్రభుత్వం జారీచేసిన ఔట్ సోర్సింగ్ నియమ నిబంధనల మేరకే జూనియర్ అసిస్టెంట్ నియామకాలు, వారి వేతనాలు ఉండాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీ విషయంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టి, రోజువారీగా కన్సాలిడేటెడ్ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 662 వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 636 పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు, మొత్తం పోస్టుల్లో సగం డిగ్రీ అభ్యర్థులకు, సగం పోస్టులు డిప్లమో అభ్యర్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో 26పోస్టుల్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సు చేసిన డిగ్రీ/డిప్లమో అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు కలిగిన ఏదేని యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు 60ఏళ్ల వయస్సు దాటిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోరు. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు రోజువారీ వేతనం రూ.735 చొప్పున నెలలో 25రోజులకు 18,375 చెల్లిస్తారు. డిప్లమో అభ్యర్థులకు రోజుకు రూ.550 చొప్పున నెలలో 25రోజులకు కలిపి రూ.13,750 వేతనాన్ని చెల్లిస్తారు. -
కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదు
బొమ్మలరామారం : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫొటోలకు ఫోజులివ్వడం, ప్రచార ఆర్భాటమే తప్ప తన ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. టీఆర్ఎస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. బొమ్మలరామారంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనదన్నారు. రుణమాఫీకాక, కొత్తగా బ్యాం కు రుణాలు అందక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేసీఆర్‌కు వారి ఉసురు తగులుతుందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాణహిత డిజైన్ మార్పు చేస్తున్నారని, అలాగే మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌లకు కేటాయిస్తున్న నిధుల్లో రూ.30వేల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబాన్ని ధనవంతంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం పేదరికంలో ఉంచుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వైఖరికి నిరసనగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి మోకు మదుసూదన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సింగిర్తి మల్లేషం, తిరుమల భాస్కర్‌గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చీర సత్యనారయణ, నాయకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మోటే గట్టయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాటిమాటే నిజమైంది..
♦ పదేళ్ల కిందటే సిద్దిపేటను బంగారు తునక చేస్తానన్న కేసీఆర్ ♦ సాగు, రైల్వే, జిల్లా కేంద్రం సాధనే ప్రధాన లక్ష్యం ♦ హరితహారానికి నెల వేతనం విరాళం ♦ రాష్ట్రనీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు సిద్దిపేటజోన్ : నాటి కేసీఆర్ మాట నేడు నిజం కాబోతున్నదని రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పదేళ్ల కిందట సిద్దిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. సిద్దిపేటను బంగారు తునకగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ మాట నేడు వాస్తవ రూపం దాలుస్తోందన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేటకు సాగునీరు, రైల్వేలైన్‌తో పాటు జిల్లా కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని కేసీఆర్ తనకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి ఆశీర్వదించారన్నారు. భవిష్యత్తులో సిద్దిపేట బంగారు తునకగా మారనుందని ఆనాడే చెప్పారని, నేడు ఆదిశగా కృషి జరుగుతోందన్నారు. సిద్దిపేట ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎత్తిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. హరితహారం సిద్దిపేట వాసులకు కొత్తకాదన్నారు. 1966-67లో ఎమ్మెల్యేగా కేసీఆర్ హరితహారానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నేడు నాటనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఇంటింటికి తాగునీటిని మానేరు డ్యామ్ నుంచి తెప్పించిన కేసీఆర్ నేడు వాటర్‌గ్రిడ్‌తో తెలంగాణ వ్యాప్తంగా తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కలెక్టర్ నేతృత్వంలో హరితహారం వేగవంతంగా కొనసాగుతోందన్నారు. అధికారులు వేతనాన్ని విరాళంగా అందించి ఆదర్శంగా నిలిచారన్నారు. మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల వేతనాన్ని హరితహారానికి అందించనున్నట్లు సభాముఖంగా పేర్కొన్నారు. అందరి సహకారంతో జిల్లాలో 3.50 కోట్ల మొక్కలను పెంచనున్నట్లు అందుకు 1.25 కోట్ల ట్రీగార్డులను సేకరించినట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి జోగు రామన్న, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబూమోహన్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, స్థానిక నాయకులు రాజనర్సు, చిన్న, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, పాల సాయిరాం, కనకరాజు, నగేష్, చిప్ప ప్రభాకర్, కూర బాల్‌రెడ్డి, మల్లికార్జున్, శేషు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
నీతి ఆయోగ్ నుంచి నిధులివ్వండి
* నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియాకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి * మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాలకు ప్రశంస సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నుంచి నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను కోరారు. ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన అరవింద్ పనగరియా గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలి శారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పథకాల నిర్వహణ, ప్రభుత్వవిధానాలు తది తర అంశాలపై చర్చ జరిగింది. గతంలో నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం నిధులు మంజూరు చేసేదని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నిధులివ్వాలని, మళ్లీ వాటిని వడ్డీతోపాటు రాష్ట్రాల నుంచి తీసుకోవాలని సూచించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, హరితహారం పథకాలను సీఎం వివరించారు. కొత్త పారిశ్రామిక విధానంతోపాటు రాష్ట్రం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ లాంటి కార్యక్రమాలను అరవింద్ పనగరియా ప్రశంసించారు. ముఖ్యమంత్రి చేసిన వినతులపట్ల పనగరియా సానుకూలంగా స్పందించారు. సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు ప్రదీప్‌చంద్ర, బీపీ ఆచార్య, నర్సింగ్‌రావు, ఎంజీ గోపాల్, సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎంతో సమావేశానికి ముందు పనగరియా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కిషన్నగర్ను సందర్శించారు. -
వాటర్‌గ్రిడ్‌కు మరో రూ.18,965 కోట్లు
ఆర్‌డబ్ల్యూఎస్‌లో బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్ట్(వాటర్‌గ్రిడ్)కు మరో రూ. 18,965కోట్ల మంజూరుకు సర్కారు పరిపాలన ఆమోదం తెలిపింది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని సెగ్మెంట్ల నిర్మాణం కోసం రూ.10,570 కోట్లు, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని సెగ్మెంట్ల కోసం రూ.8,395 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 26 సెగ్మెంట్లలో కొన్నింటి కోసం ఈ నెల 1న రూ. 15,603 కోట్లు మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతోపాటుగా ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఇంజనీర్లు, నాన్ టెక్నికల్ సిబ్బంది బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం వేరొక ఉత్తర్వును జారీచేసింది. -
మంజీర తీరాన... మహా జలహారం
మెదక్: మంజీర తీరాన మహా జలహారం రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న వాటర్‌గ్రిడ్ పథకం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్టును రూపొందించారు. సుమారు పది లక్షల మందికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూపకల్పన చేశారు. గ్రిడ్ పైలాన్ కూడా సిద్ధమైంది. పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ ఈ పైలాన్‌ను శుక్రవారం ప్రారంభించే అవకాశం ఉంది. జిల్లాలో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు రూ.750 కోట్లు కేటాయించారు. 873 గ్రామాల్లో సుమారు పది లక్షల మందికి తాగు నీరందించేలా రూపకల్పన చేశారు. సింగూర్ ప్రాజెక్ట్ దిగువన గల పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట శివారులోని బ్యాక్ వాటర్ నుంచి సెకండ్ లెవల్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నారాయణఖేడ్, అందోల్, మెదక్ నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తారు. ఈ పథకం కింద నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, అందోల్‌లోని ఐదు మండలాలు, మెదక్‌లోని నాలుగు మండలాలతోపాటు మెదక్ మున్సిపాలిటీ, జోగిపేట నగర పంచాయతీలకు తాగునీరందిస్తారు. రోజుకు గ్రామీణ ప్రాంతంలో ఒక్కో వ్యక్తికి వంద లీటర్లు, మున్సిపల్ ప్రాంతంలో 130 లీటర్ల తాగునీటిని అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పెద్దారెడ్డిపేట నుంచి ప్రారంభమయ్యే పైప్‌లైన్ మధ్యలో ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, గ్రౌండ్ లెవల్ ట్యాంకులు నిర్మించనున్నారు. రామాయంపేట మండలం వరకు సెకండ్ లెవల్ గ్రిడ్ ద్వారా తాగునీరందుతుందని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేశ్‌కుమార్ తెలిపారు. నేడు పైలాన్ ఆవిష్కరణ.. మెదక్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో వాటర్ గ్రిడ్ పైలాన్ సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించనున్నారు. -
ప్రతి వ్యక్తికీ రోజుకు 100 లీటర్ల మంచినీరు
ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : తెలంగాణాలో ఉన్న 8,700 గ్రామాల్లో కేవలం 470 గ్రామాల్లోనే 100 శాతం మరుగుదొడ్లు ఉండడం సిగ్గుపడాల్సిన విషయమని, రాబోయే రాజుల్లో ప్రతీ గ్రామంలో మరుగుదొడ్లు, మురుగునీరు, మంచినీటి వ్యవస్థలను నిర్మించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.టి. రామారావు పేర్కొన్నారు. బేగంపేట హరిత హోటల్లో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నిర్మల్ గంగా పురస్కార్ అవార్డు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని, ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల మంచినీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే ఘన, ద్రవ వ్యర్ధాలను సమర్థవంతంగా రీసైకిల్ చేసి పరిశుభ్రమైన పల్లెల నిర్మాణానికి బాటలు వేయనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌తో పాటు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, ప్రజలు వారికి పూర్తి సహకారం అందించి తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల నిర్మాణంలో 100 శాతం ఫలితం సాధించి ఉత్తమ పనితీరు కనపరిచిన 36 గ్రామపంచాయతీల ప్రతినిధులకు నిర్మల్ గంగా పురస్కార్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్, సెర్ప్ అదనపు సీఈవో మురళి, ఎమ్మెల్యే బడిగే శోభ, యునిసెఫ్ ప్రతినిధులు, గ్రామకార్యదర్శులు పాల్గొన్నారు. -
పరిపుష్ట పంచాయతీరాజ్
వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పంచాయతీరాజ్ శాఖను పరిపుష్ట స్థాయికి తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ వ్యవస్థ సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించిన వార్షిక నివేదికను బుధవారం ఆయన సచివాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 8,600 గ్రామాలకు గాను 2,700 గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయగలగడం రికార్డుగా మంత్రి పేర్కొన్నారు. పుష్కలంగా ‘ఆసరా’ పింఛన్లు.. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు తెలంగాణలో 29 లక్షల మందికే పింఛన్లు ఇచ్చారని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 36 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో కేవలం రూ.800 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం రూ.4,000 కోట్లు పింఛన్ల కోసం కేటాయించామన్నారు. అలాగే.. గ్రామాల్లో రూ.5,470 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.1,800 కోట్లతో తారురోడ్ల పునరుద్ధరణ, రూ.2,200 కోట్లతో కొత్తరోడ్లు, రూ.250 కోట్లతో బ్రిడ్జీల నిర్మాణం, రూ.600 కోట్లతో మట్టిరోడ్ల నిర్మాణం.. తదితర కార్యక్రమాలను చేపట్టామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ రహదారులకు ఇరువైపులా సుమారు 36 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని కూడా గ్రామీణాభివృద్ధి విభాగం చేపట్టిందన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికీ మంచినీటి నల్లా ఇచ్చి.. సీఎం ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 17 ఇంటేక్ వెల్స్ రక్షితస్థాయికి వచ్చాయన్నారు. సుమారు లక్ష కిలోమీటర్ల మేర కొత్తగా పైప్‌లైన్ వే స్తామన్నారు. తొలిదశ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.15,600 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చామని, మరో రూ.8 వేల కోట్లకు వారంలోగా అనుమతి మంజూరు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఈ-పంచాయత్‌ల ఏర్పాటు మినహా గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ చేరుకోగలిగామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో మురళి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. తైవాన్‌కు కేటీఆర్ రెండు రోజుల పర్యటనకు కేటీఆర్ బుధవారం రాత్రి తైవాన్‌కు బయల్దేరి వెళ్లారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తైవాన్‌లోని ఐ టీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ప్రతినిధులతో ఆయ న సమావేశమవుతారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇండియా-తైవాన్ బిజినెస్ కో-ఆపరేటివ్ ఫోరమ్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి పారిశ్రామిక పార్కులు సందర్శిస్తారు. -
వాటర్‌గ్రిడ్: ఇంటింటికీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టారు. దాదాపు రూ.40 వేల కోట్ల అంచనాతో నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.26 లక్షల కిలోమీటర్ల పొడవునా పైప్లైన్లు నిర్మించనున్నారు. మొత్తంగా 25 వేల జనావాసాలకు 56 నీటిశుద్ధి ప్లాంట్ల ద్వా రా 39 టీఎంసీల తాగునీటిని సరఫరా చేస్తారు. సగటున ప్రతి వ్యక్తికి గ్రామాల్లో వంద లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యామ్ నుంచి తన నియోజకవర్గమైన సిద్ధిపేటకు నీటిని తరలించిన తరహాలోనే.. ఈ పథకానికి స్వయంగా ఆయనే రూపకల్పన చేయడం గమనార్హం. దీనిపై మంత్రులను సిద్ధిపేట ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లిన కేసీఆర్.. వారికి స్వయంగా తానే అవగాహన కల్పించారు కూడా. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలిక్ పనులు, బావుల నిర్మాణం, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు వంటి వాటికి అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేసారి అనుమతులు ఇచ్చేలా కేసీఆర్ ఆదేశించారు. -
అప్పు సీలింగ్ రూ. 15,295 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ తదితర పథకాలకు నిధుల సమీకరణలో ఉన్న తెలంగాణ సర్కార్‌కు కేంద్రం ‘అప్పుల సీలింగ్’ విధించింది. రూ. 15,295 కోట్లకు మించి అప్పులు చేయవద్దంటూ కళ్లెం వేసింది. 2015-16 వార్షిక సంవత్సరంలో అప్పుల సీలింగ్‌కు సంబంధించి కేంద్రం ఈ మేరకు లేఖ విడుదల చేసింది. అంటే.. జీఎస్డీపీలో 3 శాతానికి పరిమితం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఈ సీలింగ్‌ను విధించినట్లు అందులో పేర్కొంది. కొంతకాలంగా ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన నీతి అయోగ్ బృందం సభ్యులతోనూ సీఎం కె.చంద్రశేఖరరావు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలోనూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ, కేంద్రం ప్రభుత్వం రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదు. అంచనాలకు అడ్డ కత్తెర..! తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక బడ్జెట్టులో రూ.16,969 కోట్లు ద్రవ్యలోటు చూపించింది. జీఎస్డీపీలో 3.49 శాతం రుణాలు తెచ్చుకునే అంచనా వేసింది. కానీ.. తాజా సీలింగ్ ప్రకారం అందులో రూ.1,674 కోట్లు కోతపడడంతో అంచనాలు తలకిందులయ్యాయి. వార్షిక ఆదాయపు అంచనాలపై ఈ ప్రభావం పడడం ఖాయంగా కన్పిస్తోంది. 14వ ఆర్థిక సంఘం తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా గుర్తించింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటికీ కత్తెర పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు భారీ మొత్తంలో నిధులు అవసరముంది. దీంతో రుణ సమీకరణ తప్పనిసరిగా మారింది. అందుకే ఎఫ్ఆర్బీఎం వెసులుబాటుకు సర్కారు పట్టువీడకుండా ప్రయత్నాలు చేసింది. జీఎస్డీపీలో 3.9 శాతం వరకు ద్రవ్యలోటుకు అనుమతిస్తే.. రూ.18,962 కోట్లు రుణంగా తెచ్చుకొని బడ్జెట్టులో లోటు పూడ్చుకోవచ్చని ఆరాట పడింది. కానీ.. అదేమీ పట్టించుకోకుండా కేంద్రం సీలింగ్ విధించడం గమనార్హం. -
వాటర్‌గ్రిడ్‌పై విస్తృతంగా ప్రచారం
ప్రాజెక్టు సమీక్షలో అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుైపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖామంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లోనూ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ ఆ జిల్లా పరిధిలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను, మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ప్రయోజనాలను, లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తే, త్వరలోనే వారికి సురక్షిత మంచినీరు అందుతుందన్న నమ్మకం కలుగుతుందన్నారు. ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్ల్లాలోని రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, అటవీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే ముఖ్యమంత్రి సమీక్షించనున్నందున అవసరమైన సమాచారాన్ని సేకరించాలని, జరిగిన పనులకు సంబంధించిన నివేదికలను కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేగంగా ఇంటేక్‌వెల్స్ పనులు.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంటేక్‌వెల్స్ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వేసవిలోగా సాధ్యమైన మేర పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు రూపకల్పనకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేసిన కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు, మంత్రులు ప్రాజెక్టులోని అంశాల పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యేవరకు ఇదేస్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి అధికారులను కోరారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి తదితరులున్నారు. -
హడ్కో అవార్డు అందుకున్న కేటీఆర్
న్యూఢిల్లీ : తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హడ్కో అవార్డు అందుకున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ఆయన ఈ అవార్డు తీసుకున్నారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ప్రత్యేక అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రక్షిత మంచినీటి పథకాన్ని 4ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇక నేపాల్‌లో చిక్కుకున్న భరత్పూర్ మెడికల్ విద్యార్థులను ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుస్తామని కేటీఆర్ తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణవారిని రక్షించేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. -
వాటర్‌గ్రిడ్‌కు ‘హడ్కో’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ప్రత్యేక అవార్డును ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు అభినందనలు తెలుపుతూ హడ్కో అధికారులు లేఖ పంపారు. హడ్కో వ్యవస్థాపక దినోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
తాండూరుకు కృష్ణమ్మ!
► వాటర్‌గ్రిడ్‌తో తరలిరానున్న జలాలు ► ప్రభుత్వానికి రూ.53 కోట్లతో ప్రతిపాదనలు ► ఇంటింటికీ నల్లా కనెక్షన్లు తాండూరు : తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌లో భాగంగా తాండూరువాసులకు కృష్ణాజలాలు అందనున్నాయి. దాంతో వచ్చే రెండు, మూడేళ్లలో అందరికీ ఫిల్టర్ వాటర్ అందుబాటులోకి రానున్నది. వాటర్ గ్రిడ్‌తో పైప్‌లైన్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వాటర్‌గ్రిడ్ కోసం తాండూరు మున్సిపల్ అధికారులు సుమారు రూ.53కోట్ల నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి షాద్‌నగర్, పరిగి, యాలాల మీదుగా తాండూరు పట్టణానికి, ఇక్కడి నుంచి చివరి పాయింట్ పెద్దేముల్‌కు కృష్ణాజాలలు పైప్‌లైన్ ద్వారా సరఫరా (గ్రావిటీ) కానున్నాయి. పట్టణంలో 65వేలకుపైగా జనాభా ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీకి చెందిన ఆరు రిజర్వాయర్లు ద్వారా ప్రతి రోజు 6 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీరు సరఫరా అవుతుంది. మొత్తం 14వేలకుపైగా గృహాలు ఉన్నాయి. ఇందులో 7వేల గృహాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటర్‌గ్రిడ్ ద్వారా పట్టణ శివారులోని ఖాంజాపూర్ గుట్టపై 10లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇక్కడనే ఒక సంపు కూడా నిర్మిస్తారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఖాంజాపూర్ గుట్టపై నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరతాయి. ప్రస్తుతం ఉన్న ఆరు రిజర్వాయర్లకు అదనంగా రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఖాంజాపూర్ గుట్ట సంపు నుంచి రిజర్వాయర్ల ద్వారా కృష్ణాజలాలు సరఫరా జరుగుతుంది. 6 ఎంఎల్డీ నుంచి 11ఎంఎల్డీకి తాగునీటి సామర్థ్యం పెరగనున్నది. దాంతోపాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వడానికి ఆస్కారం కలుగుతుంది. రెండు, మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ద్వారా తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నట్టు చెబుతున్నారు. 15ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా డిజైన్ చేసినట్టు తాండూరు మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ తెలిపారు. -
భారీ పథకాలకు రుణాలివ్వండి
ప్రపంచబ్యాంకును కోరిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొన్నింటిలో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొత్త విద్యుత్తు ప్లాంట్లపై తమ ఆసక్తిని కనబరిచింది. అందుకు అవసరమైన నిధుల సమీకరణకు తమ సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మతో ప్రపంచ బ్యాంకు అధికారి అంకుర్‌శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం సమావేశమైంది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ప్లానింగ్ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యతలు... ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను సీఎస్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో ఆర్థిక వనరులు పరిపుష్టంగా ఉన్నాయని.. అందుకే 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ మిగులు రాష్ట్రంగా గుర్తించిందని తెలిపారు. కానీ.. కొత్త రాష్ట్రం కావటంతో ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు నిధుల సర్దుబాటు అవసరాన్ని అంశాల వారీగా విశ్లేషించారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, విద్యుత్తు ప్లాంట్లతో సిద్ధించే భవిష్యత్తు ప్రయోజనాలు.. ఆర్థిక లాభనష్టాలను చర్చించారు. ప్రపంచబ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాజెక్టులకు ఆర్థికంగా సాయం అందించాలని అధికారులు కోరారు. ఈ చర్చల సందర్భంగా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి ప్రపంచబ్యాంకు నుంచి రుణసాయం కోరినట్లు అధికారులు వివరించారు. కాగా, రాష్ట్రంలోని గిరిజనులు, ఇతర అట్టడుగువర్గాల అభ్యున్నతికి వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ బృందం త్వరలోనే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఉట్నూరు, నల్లగొండ జిల్లాలోని చందంపేట, దేవరకొండ ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయనుంది. -
అవినీతిని ఉపేక్షించం...
♦ అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్‌గ్రిడ్ పనులు ♦ జిల్లాలో ఐదు సెగ్మెంట్ల ద్వారా నీటి సరఫరా ♦ రోడ్డు పనుల్లో అక్రమాలకు తావివ్వొద్దు ♦ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ♦ వరికోలు, పులిగిల్ల, హసన్‌పర్తి పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ♦ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. నాణ్యత, నిధుల విషయంలో రాజీలేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో పనులు చేపడుతున్నామని... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆదివారం జిల్లాకు వచ్చిన ఆయన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులతో కలిసి పరకాల మండలంలోని వరికోల్ గ్రామంలో గ్రామీణ రోడ్ల నిర్మాణ పథకం, రోడ్ల మరమ్మత్తు పనులకు పులిగిల్లలో శంకస్థాపన చేశారు. హసన్‌పర్తి మండలంలో రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపముఖ్యమంత్రి కడియం, మంత్రి చందులాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్, కలెక్టర్ కరుణ, జెడ్పీచైర్‌పర్సన్ పద్మతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాటర్‌గ్రిడ్, గ్రామీణ రోడ్లు, ఆసరా పింఛన్లు, హరిత హారం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకం ప్రభుత్వ సాహసోపేత నిర్ణయమన్నారు. తాగు నీరు పొందడం ప్రజల హక్కు అని, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అవినీతి రహితంగా నిర్వహించేందుకు అధికారులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. వాటర్ గ్రిడ్వల్ల తాగునీటితోపాటు పారిశ్రామిక ప్రగతి కూడా ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల వల్ల 5 మీటర్ల లోతుకు నీరు వెళ్లిందని నివేదికలు చెబుతున్నాయని వివరించారు. జిల్లాలో ఐదు సెగ్మెంట్ల నుంచి తాగు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎల్ఎండీ సెగ్మెంట్... ఎల్ఎండీ సెగ్మెంట్ ద్వారా వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నియోజకవర్గాలు, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కొన్ని మండలాలు, ఒక కార్పొరేషన్, నగర పంచాయతీలకు రూ.720 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ తెలిపారు. పాలేరు.. డోర్మకల్, మహబూబాబాద్, నర్సంపేట, నియోజకవర్గాలతోపాటు ములుగులోని కొత్తగూడ, పాలకుర్తిలోని రాయపర్తి, తొర్రూరు మండలాలకు కలిపి మొత్తం 17 మండలాలు, ఒక మునిసిపాలిటీ, ఒక నగర పంచాయతీ పరిధిలో రూ.1800 కోట్లతో నీరందించే ప్రణాళికలు రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. గోదావరి, రామప్ప ... గోదావరి, రామప్ప సెగ్మెంట్ ద్వారా ములుగు నియోజకవర్గం, భూపాలపల్లిలోని గణపురానికి నీరిదించేందుకు రూ.286 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేటీఆర్ వివరించారు. ఎల్‌మడుగు.. ఈ సెగ్మెంట్ద్వారా రూ.342.66 కోట్లతో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాలకు, ఒక నగర పంచాయతీకి నీరందిస్తామని మంత్రి వెల్లడించారు. నీటి ఎద్దడిపై అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం వే సవిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు నిర్మాణం విషయంలో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై క ఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత పరిశీలనకు ప్రత్యేక తనిఖీ ృందాలు ఏర్పాటు చేయూలని సూచంచారు. నాణ్యత విషయంలో లోపాలు ఉన్నట్లయితే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నీటిని పూర్తి స్థారుులో వ్యవసాయానికి వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రస్తుత తాగునీటి పనులకు మరో రూ.1.20కోట్లు విడుదల చే యాలని కోరారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజక వర్గంలో రూ.6 కోట్ల తాగునీటి పనులకు ప్రతిపాదనలు పంపించామని, ఇప్పటివరకు రూ.2 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని చెప్పారు. మిగతా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ నియోజక వర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.80లక్షలు విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ కొత్త బావుల తవ్వకానికి నిధులు ఇవ్వాలని కోరారు. అధికారుల పడిగాపులు... కలెక్టరేట్లో మధ్యాహ్నం 2గంటలకు మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం ఇవ్వడంతో అన్నిశ ాఖల అధికారులు మధ్యాహ్నం ఒంటి గంటకే కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పరకాల, హసన్‌పర్తి కార్యక్రమాలతోపాటు ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలెక్టరేట్లో సమావేశం సాయంత్రం 4గంటల తర్వాత ప్రారంభమైది.సుమారు రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. దీంతో కలెక్టరేట్లో వివిధ శాఖల ఉద్యోగులు సుమారు 7గంటలపాటు పడిగాపులు కాశారు. -
వాటర్‌గ్రిడ్ డీపీఆర్ బయట పెట్టాలి
షబ్బీర్ అలీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్డు(డీపీఆర్)ను ప్రజల ముందు పెట్టాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సీఎల్పీ ఉపనాయకులు టి.జీవన్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకంలో ప్రాథమికస్థాయిలోనే అనేక అవకతవకలకు అవకాశం కలిగేవిధంగా ఉల్లంఘనలు ఉన్నాయని, అతిక్రమణలకు కారణాలు చెప్పకుండా కాంగ్రెస్‌పార్టీపై ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రకటించేనాటికి రూ.25 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇదివరకు చెప్పారని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని చెప్పి 40 వేల కోట్లకు ఏ సర్వే ఆధారంగా అంచనాలను పెంచారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం రూ.10,156 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొందని వివరించారు. న్యాయశాఖలో వివిధ పోస్టుల నియామకంలో ముస్లిం న్యాయవాదులపై వివక్షను ప్రదర్శించారని, దీనిని అరికట్టాలని కోరుతూ కేసీఆర్‌కు షబ్బీర్ అలీ లేఖను రాశారు. -
'కాంగ్రెస్‌కు క్లారిటీ కల్పిస్తాం'
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వాటర్‌గ్రిడ్ మిషన్‌ను ప్రారంభించామని, రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆరోపణలు చేస్తోందని మంత్రి కే టీ రామారావు అన్నారు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. వాటర్‌గ్రిడ్‌పై కాంగ్రెస్ నేతలకు అవగాహనలేకపోతే పూర్తి క్లారిటీ కల్పిస్తామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చిత్తూరుకు భారీగా నిధులు మళ్లీస్తే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోన్న పట్టిసీమ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు. రూ.10 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని కాంగ్రెస్ నేతలు చేపడితే అన్ని కాంట్రాక్టులు వారికే కేటాయిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. -
అది కరప్షన్ గ్రిడ్..
ఉత్తమ్, జానా, భట్టి, షబ్బీర్ విమర్శ రూ.40వేల కోట్లు ఎందుకని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం అని చెప్పుకుంటున్న వాటర్‌గ్రిడ్.. టీఆర్ఎస్కు కరప్షన్గ్రిడ్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాటర్‌గ్రిడ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించి అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నాయకుడు షబ్బీర్ అలీ తదితరులు గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 70 శాతం గ్రామాలకు సురక్షిత తాగునీరు అందుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన గ్రామాలకు నీటిని అందించవచ్చని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కానీ, 40 వేల కోట్లతో కొత్తగా వాటర్‌గ్రిడ్ అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటివరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా తయారుచేయలేదు కానీ, టెండర్లు వేసి పంచుకోవడానికి మాత్రం అన్నీ సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. పథకంలో 14 ప్యాకేజీలు ఉంటాయని చెప్పి ఇప్పుడు 6 ప్యాకేజీలకు ఎందుకు కుదించారని ప్రశ్నించారు. ‘లెస్’ టెండర్ పేరుతో పంచుకోవడానికే మంత్రి కేటీఆర్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాటిని తగ్గించారని ఆరోపించారు. తెలంగాణ కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నా, మొత్తం వాటర్‌గ్రిడ్ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకే ఎందుకు కట్టబెట్టారని నిలదీశారు. వాటర్‌గ్రిడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ ప్రజలకోసం కాదని, మంత్రి కేటీఆర్‌కు కమీషన్ల కోసమేనని ఆరోపించారు. కేటీఆర్ స్థాయిని, వయసును మరచి అధికార అహంకారంతో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ లాంటి జాతీయస్థాయి నాయకుడిపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసులకు జానారెడ్డి నివాళి అర్పించారు. మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ శాసనమండలిలో ప్రతిపక్షనేతగా షబ్బీర్ అలీని గుర్తిస్తూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటన విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ ప్రకారం ప్రతిపక్షనేతగా షబ్బీర్ అలీని నియమించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా షబ్బీర్ అలీ గుర్తింపును అన్ని విభాగాలను పంపించారు. గ్రిడ్‌తో అదనపు భారం: జీవన్ రెడ్డి వాటర్‌గ్రిడ్ పేరుతో ప్రజలపై రూ. 35 వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేవలం రూ. 2 వేల కోట్లతోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ప్రతి ఇంటికి తాగు నీటిని అందించవచ్చని చెప్పారు. టీపీసీసీలో యువరక్తం.. యువత, పార్టీకోసం పనిచేసేవారితోనే టీపీసీసీ కార్యవర్గాన్ని భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏఐ సీసీ నేతలు కొప్పుల రాజు, జైరాం రమేశ్‌తో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్లో సమావేశమయ్యారు. టీపీసీసీ కార్యవర్గం నియామకంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఒక అభిప్రాయానికి వచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేయగలిగే వారినే టీపీసీసీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. 60 ఏళ్లకు మించని వారినే పదవుల్లోకి తీసుకోనున్నారు. ఎక్కువగా యువతకు అవకాశం ఇవ్వాలనుకున్నా కొందరు సీనియర్లను కూడా తీసుకుంటే బాగుంటుం దనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. జిల్లాకు ఇద్దరు చొప్పున 20 మందితోనే పూర్తిస్థాయి కార్యవర్గం ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
పని తక్కువ..ప్రచారం ఎక్కువ
ప్రభుత్వ తీరుపై విపక్షాల ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాల అమలులో ఎలాంటి పురోగతి లేకపోయినా, ప్రభుత్వం ప్రచారం ఎక్కువ చేసుకుంటోంది. ఇదేదో బ్రహ్మపదార్థమంటూ ప్రజలను భ్రమల్లో ముంచుతోంది. వాటర్ గ్రిడ్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికి నీళ్లు ఇస్తామని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సీఎం కేసీఆర్ అంటున్నారు.. అదీ సాధ్యం కాదు.. ఇదీసాధ్యం కాదు’ అని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి పేర్కొన్నారు. ‘ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీరందక అవస్థలు పడుతుంటే .. వాటర్ గ్రిడ్ నిర్మించి మూడేళ్ల తర్వాత నీళ్లిస్తామనడం.. ఆకలితో ఉన్నవారికి కారంతోనైనా అన్నం పెట్టకుండా మూడేళ్ల తర్వాత బిర్యానీ పెడతాం’ అన్నట్టుగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో సోమవా రం బడ్జెట్‌పై నిర్వహించిన చర్చలో.. కొత్త పథకాల అమలులో జాప్యం, గత బడ్జెట్లో కేటాయింపుల్లో 43శాతానికి మించని ఖర్చు లు, తాజా బడ్జెట్లో లోపించిన వాస్తవికత తదితర అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎండగట్టాయి. వాటర్ గ్రిడ్‌పై ప్రభుత్వ హామీని నెరవేరుస్తామని, ఒకవేళ నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని విపక్షాలు ఓ ఆయుధంగా వాడుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విపక్షాలకు సలహాఇచ్చారు. అధ్యయన కమిటీ ల పేరుతో కేజీ టు పీజీ ఉచిత పథకం అమలును ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ తప్పుపట్టారు. గతంలో హేతుబద్ధీకరణ జరిపి ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, మళ్లీ ప్రభుత్వం అందుకు సిద్ధమైందని ఆరోపించారు. కడియం శ్రీహరి సమాధానమిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని సరిచేసేందుకే ఉపాధ్యాయుల హేతబద్ధీకరణ చేపడుతామని, ఒక్క పాఠశాలను మూసివేయమని చెప్పారు. కార్పొరేట్ విద్య, వైద్య విధానాన్ని రద్దు చేసి ఆ సంస్థలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కె.దిలీప్‌కుమార్ సూచించారు. ప్రమాదాలపై ఏర్పాటు చేసే ఎంక్వైరీ కమిటీ చట్టం కింద మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం కోసం రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కి చట్టబద్ధత లేదని షబ్బీర్ విమర్శించారు.ఈ కమిటీ సిఫారసులు చెల్లుబాటు కావన్నారు. -
ఇంకా సర్వే దశ దాటలేదు!
నత్తనడకన ‘వాటర్‌గ్రిడ్’ కొన్ని జిల్లాల్లో లైన్ సర్వేకు ఖ రారు కాని టెండర్లు కొన్ని సెగ్మెంట్లలో ముందుకు రాని కాంట్రాక్టర్లు వచ్చినవారితోనే పనిచేయిస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ఓ వైపు ప్రభుత్వం దూకుడుగా ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు గ్రిడ్‌కు సంబంధించిన పనులేమో క్షేత్రస్థాయిలో నత్తనడకన జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ప్రాజెక్టు (వాటర్‌గ్రిడ్) తొలిదశకు సంబంధించిన లైన్ సర్వే ప్రక్రియ మొదలై ఆర్నెల్లు గడుస్తున్నా.. ఇంతవరకు కొన్ని జిల్లాల్లో లైన్ సర్వే కొలిక్కిరాలేదు. కొన్ని సెగ్మెంట్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కాక లైన్ సర్వే చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అర్హతగల కాంట్రాక్టర్లు ముందుకురాని సెగ్మెంట్లలో అధికారులు వారికి.. నచ్చిన వాళ్లతోనే సర్వే పనులు చేయించాలని యోచిస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే వాటర్‌గ్రిడ్ లైన్సర్వేలో ‘లైడార్’వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. ప్రస్తుతం జిల్లాల్లో లైన్ సర్వే పనులన్నీ సంప్రదాయ విధానంలోనే జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాకనే.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 45 వేల కిలోమీటర్ల సెకండరీ పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఈ పైప్‌లైన్ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లైన్ సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆయా మార్గాల్లో ఎత్తుపల్లాలు, పొడవు, వెడల్పు..తదితర సర్వే అంశాల అధారంగానే నిర్మాణ పనులను నిర్వహిస్తారు. లైన్ సర్వే పూర్తికాకుంటే ప్రాజెక్టు అంచనాల రూపకల్పన, పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభించేందుకు వీలుకాదు. ఈ నేపథ్యంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం గతేడాది అక్టోబర్‌లోనే లైన్ సర్వే కోసం టెండర్ల(ఈవోఐ)ను పిలిచింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 58 ఏజెన్సీలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ఇందులో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు 35 ఏజెన్సీలు మాత్రమే అర్హత(ఫైనాన్షియల్, టెక్నికల్) సాధించాయి. అయితే.. ఏజెన్సీలు తమ టెండర్లలో పేర్కొన్న ధరల్లో అతితక్కువ ధర(కిలోమీటరుకు రూ.3,500)నే సర్కారు ఖరారు చేసింది. దీంతో లైన్ సర్వే పనులు చేపట్టేందుకు కేవలం 18 ఏజెన్సీలే ముందుకు వచ్చాయి. ఇలా వచ్చిన ఏజెన్సీలతోనే ఆయా జిల్లాల్లోని సెగ్మెంట్లలో పనులు చేపట్టారు. అయితే.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని సెగ్మెంట్లలో సర్వే పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆయా సెగ్మెంట్లలో సర్వే పనులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కానందునే అర్హత కలిగిన కంపెనీలు పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదని సమాచారం. దీంతో మరలా టెండర్లు పిలిచేందుకు ఇష్టపడని అధికారులు తమకు నచ్చిన ఏజెన్సీలతోనే పనులు చేయించేందుకు మొగ్గుచూపుతున్నారు. ‘లైడార్’పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం తెలంగాణ వాటర్‌గ్రిడ్ లైన్‌సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు ‘లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్)’ టెక్నాలజీని వినియోగించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలిసింది. లైడార్ టెక్నాలజీకి బదులుగా సంప్రదాయ (టోటల్ స్టేషన్ అండ్ డీజీపీఎస్) పద్ధతులనే అవలంబించాలని నిర్ణయించినట్లు సమాచారం. లేజర్ కిరణాలతో రిమోట్ సెన్సింగ్(లైడార్) ద్వారా భూ ఉపరితలాన్ని సర్వే చేసే ప్రక్రియకు, సంప్రదాయ విధానం కంటే అధికంగా ఖర్చవుతుండడమే ఇందుకు కారణంగా ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి కావాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అధునాతన పద్ధతులతోనే సాధ్యమని, సంప్రదాయ పద్ధతుల ద్వారా నిర్దేశిత సమయంలో లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమని వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. -
‘వాటర్ గ్రిడ్’కు ప్రత్యేక విభాగం
⇒ కొత్తగా డివిజన్లు, సబ్ డివిజన్ల ఏర్పాటు ⇒52 మంది వివిధ కేడర్ల ఇంజనీర్ల కేటాయింపు ⇒ఉత్తర్వులు విడుదల చేసిన రేమండ్ పీటర్ ⇒ఇక వేగంగా కొనసాగనున్న పనులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వాటర్ గ్రిడ్’ పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ నీటి సరఫరా పథకం పునర్విభజనలో భాగంగా ఆర్‌డబ్ల్యూఎస్‌కు తోడు వాటర్‌గ్రిడ్ పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను ఇకనుంచి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్టు (టీడీడబ్ల్యూఎస్పీ)’ చేపట్టనుంది. ఇంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు సర్కిళ్లు, 25 డివిజన్లు, 67 సబ్డివిజన్లు ఉండగా, వాటర్‌గ్రిడ్ కోసం 9 సర్కిళ్లు, 20 డివిజన్లు, 92 సబ్డివిజన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం జిల్లాలో మూడు డివిజన్లు, 15 సబ్ డివిజన్లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ఆర్డబ్ల్యూఎస్ కింద నిజామాబాద్, బాన్సువాడ డివిజన్లు ఉండగా,టీఎస్‌డబ్ల్యూఎస్‌పీ కింద నిజామాబాద్,బాన్సు వాడ, ఆర్మూరు డివిజన్లు వాటర్‌గ్రిడ్ కోసం పనిచేస్తాయి. వాటర్‌గ్రిడ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక చీఫ్ ఇంజినీర్, 10 ఎస్ఈలు, 31 మంది ఈఈలు, 104 మందిడిప్యూటీ ఈఈలు, 346 ఏఈఈ/ఏఈలను నియమించనుండగా, జిల్లాకు ఒక ఎస్ఈ, ముగ్గురు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లతో పాటు డిప్యూటీ ఈఈలు, ఏఈఈలను కేటాయించారు. నిజామాబాద్ కేంద్రంగా వాటర్‌గ్రిడ్ కోసం ఒక క్వాలిటీ కంట్రోల్ డివిజన్, నిజామాబాద్, బాన్సువాడలలో రెండు సబ్డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 35 రెగ్యులర్ వర్క్ఇన్స్పెక్టర్లకు తోడు 17 మందిని ఔట్సోర్సింగ్ ద్వారా కొత్తగా నియమిస్తే ఆ సంఖ్య మొత్తం 52కు చేరుతుంది. అలాగే టీడీడబ్ల్యూఎస్పీ కింద వివిధ కేడర్లకు చెందిన ఇంజినీర్లుగా పదవీ విరమణ చేసిన వారిని సైతం నియమించుకోవచ్చని ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం సర్వేల ప్రక్రియ పూర్తి చేయగా.. త్వరలోనే ఆ పథకం పనులు చేపట్టే క్రమంలో పెద్ద ఎత్తున మార్పులు, విభజనలకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశం అవుతోంది. -
మూడేళ్లలో తాగునీటి ప్రాజెక్టు పూర్తి
సాక్షి, హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు (వాటర్ గ్రిడ్)ను పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పురోగతిపై గురువారం సచి వాలయంలో సీఎస్ రాజీవ్ శర్మతో సమీక్షించారు. లైన్ సర్వే జరిగిన తీరును, ప్రాజెక్టు కింద చేపట్టబోతున్న నిర్మాణాల వివరాలను, ఇందుకోసం ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారాన్ని ఈ సందర్భంగా మంత్రి సీఎస్‌కు వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం సేకరించాల్సిన భూముల వివరాలను అందజేశారు. రాష్ట్ర స్థాయిలో పనులు సాగేందుకు అవసరమైన అనుమతుల కోసం ఆర్డినెన్స్ ఇచ్చినప్పటికీ అటవీ శాఖ, ప్రభుత్వ భూముల సేకరణ నిమిత్తం ఆయా శాఖల నుంచి వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని మంత్రి కోరారు. వెంటనే స్పందించిన సీఎస్ అటవీశాఖ అధికారులను సమావేశానికి పిలిపించారు. ఈ నెల 27న గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని అటవీ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్ఈలు, డీఎఫ్ఓలతో సమీక్ష నిర్వహించి పక్కా గా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే స్థానిక అధికారుల సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో, మెదక్‌లో కొంతమేరకు ప్రభుత్వ భూముల సేకరణ పూర్తయిందని అధికారులు తెలిపారు. నిధుల సేకరణపై తెలంగాణ ప్రభుత్వం నాబార్డ్, జైకా, ఎల్ఐసీ వంటి సంస్థలతో చర్చలు ప్రారంభించిందని, ఆయా సంస్థలు ప్రాజెక్టు నిధులు ఇచ్చేం దుకు సానుకూలత వ్యక్తం చేశాయని, త్వరలోనే మరిన్ని సంస్థలతో చర్చలు జరుపుతామని మంత్రికి సీఎస్ వివరించారు. తెలంగాణ తాగునీటి ప్రాజెక్టును కాస్ట్ ఎఫిషియెన్సీ ప్రాజెక్టుగా మలిచేందుకు తమ శాఖ ప్రయత్నిస్తోం దని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా ఇంట్రా విలేజ్ లైన్ నెట్వర్క్ కోసం చేపట్టాల్సిన పనుల అంచనాలపై మరింత కసరత్తు చేస్తున్నారన్నారు. సీఎం ఆకాంక్షల మేరకు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న నమ్మకం తమకు ఉందని మంత్రి చెప్పారు. ఇంజనీరింగ్ సిబ్బంది చెబుతున్న విధంగా టెండర్లు పూర్తయిన 36 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన డిజై న్లు పూర్తయిన వెంటనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారుల సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ పనిచేస్తున్న తీరును చాలా రాష్ట్రాలు మెచ్చుకున్నాయని... సిబ్బం దికి మంత్రి అభినందనలు తెలిపారు. -
వాటర్‌గ్రిడ్ ఆర్డినెన్స్‌కు నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు భూసేకరణ నిమిత్తం ఆర్డినెన్స్‌ను తెస్తూ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(3) ప్రకారం తెలంగాణ వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్స్ ఆర్డినెన్స్ 3/2015ను గెజిట్‌లో ప్రచురించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
సగం నిధులివ్వండి
-
సగం నిధులివ్వండి
వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయపై ప్రధానికి కేసీఆర్ వినతి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వండి హైకోర్టు విభజనను వేగంగా చేపట్టండి ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించండి విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు సరఫరా లైన్లు ఏర్పాటు చేయండి విభజన హామీలు, రాష్ట్రానికి కేంద్ర నిధులపై సీఎం విజ్ఞప్తులు 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానికి కేసీఆర్ ఆహ్వానం! అనంతరం ముంబైకి బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ’ పథకాలకు 50 శాతం కేంద్ర నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టులతో పాటు మరిన్ని అంశాల్లో తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున వచ్చే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోదీతో కేసీఆర్ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వారు ఏకాంతంగా చర్చలు జరిపారు. ‘విభజన’ హామీలను నెరవేర్చండి: విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారు. భేటీలో ప్రధానంగా ఐదు అంశాలపై కేసీఆర్ విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం వీలైనంత త్వరగా హైకోర్టు విభజన చేయాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్లప్రాజెక్టుకు జాతీయ హోదాను వెంటనే ప్రకటించాలని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని అడిగారు. ఆ ప్రాజెక్టుకు జల సంఘం అనుమతులు రావాల్సి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరారు. రాష్ట్రానికి రండి: ‘మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్’ పథకాలను భేటీలో కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇంటింటికీ మంచి నీరు అందించే ఉద్దేశంతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని రూపొందించామని... అదేవిధ ంగా తెలంగాణలోని 45 వేల చెరువులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని రూపొందించామని ప్రధానికి వివరించారు. ఈ రెండు పథకాలకు అయ్యే నిధుల్లో 50 శాతాన్ని కేంద్రం నుంచి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మిషన్ కాకతీయ పథకం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీని కేసీఆర్ ఆహ్వానించినట్టు సమాచారం. విద్యుత్ సమస్యను తీర్చేందుకు వీలుగా మహారాష్ట్రలోని వార్ధా మీదుగా డిచ్పల్లి వరకు ట్రాన్స్మిషన్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని మోదీని కోరారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రూ.750 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు ఉన్నాయని... ఇందుకు కేంద్రం నుంచి కొన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్ నేరుగా ముంబైకి బయలుదేరారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆయన సమావేశం కానున్నారు. -
వాటర్‌గ్రిడ్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్
భూముల హక్కులు ధారాదత్తం ఆగమేఘాలపై సర్కారు నిర్ణయం నేడు గవర్నర్ ఆమోదానికి ఫైలు భూసేకరణ బదులు కొత్త చట్టం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను బలవంతంగానైనా సేకరిం చేందుకు తోడ్పడేలా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఆగమేఘాలపై నిర్ణయం తీసుకుంది. భూసేకరణకు బదులుగా భూ వినియోగదారుల హక్కుల సేకరణకు వీలుగా ‘తెలంగాణ వాటర్ పైప్‌లైన్స్ (భూ వినియోగదారుల హక్కుల సేకరణ) ఆర్డినెన్స్-2015’ను రూపొందించింది. ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్...వాటర్‌గ్రిడ్‌కు అవసరమైన నిధులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరేందుకు ప్రధాని మోదీతో సోమవారం సమావేశమయ్యేలోగానే ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఆమోదముద్ర వేయించేందుకు ప్రభుత్వం శరవేగంగా ఫైళ్లు కదుపుతోంది. సీఎం ఆదేశాలతో శనివారం ఉదయమే ఆర్డినెన్స్ ఫైలును నోట్ రూపంలో అధికారులు మంత్రుల ఆమోదానికి పంపి సంతకాలు సేకరించారు. దీంతో ఆదివారం ఈ ఫైలును గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశముంది. తెలంగాణ వాటర్‌గ్రిడ్ అమలుకు దీన్ని నిర్దేశించినట్లు నోట్లో ప్రస్తావించారు. గుజరాత్ మోడల్లో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ఆవాసాలు, పరిశ్రమల అవసరాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ. 26 వేల కోట్ల అంచనా వ్యయంలో ఈ బృహత్తర ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా, గోదావరి బేసిన్లో మొత్తం 36 నీటి వనరులను గుర్తించారు. దాదాపు 1.25 లక్షల కిలోమీటర్ల పైపులైన్ వేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలంటే భూసేకరణ అత్యంత కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగం గుర్తించింది. కేవలం గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా పైపులైన్ వేసేందుకు వీలుగా... ఎటువంటి భూములకు సంబంధించిన హక్కులనైనా సేకరించేలా (రైట్ ఆఫ్ వే) చట్టం ఉండాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న భూసేకరణ అవరోధాలను అధిగమించేందుకు గుజరాత్ ప్రభుత్వం 2000 సంవత్సరంలో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని నమూనాగా స్వీకరించాలని సూచించింది. గత ఏడాది నవంబర్ 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్వర్యంలో జరిగిన సమావేశంలోనే ఈ చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు వీలైనంత తొందరగా చట్టం లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలని రెవెన్యూ విభాగాన్ని పంచాయతీరాజ్ విభాగం కోరింది. చట్టం తేవాలంటే బిల్లు ప్రవేశపెట్టేందుకు బడ్జెట్ సమావేశాల వరకు నిరీక్షించాలి. ఈలోగానే ప్రాజెక్టు పనులను ప్రారంభించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉండటంతో సీఎం నిర్ణయం మేరకు అధికారులు ఆర్డినెన్స్‌కు సన్నాహాలు చేశారు. న్యాయ సలహా తీసుకొని గుజరాత్ చట్టం తరహాలోనే ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను రూపొందించారు. ఇష్టం లేకున్నా భూములివ్వాల్సిందే... కొత్త ఆర్డినెన్స్‌తో తమకు ఇష్టమున్నా.. లేకున్నా.. రేటు నచ్చినా నచ్చకపోయినా.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి, పైపులైన్లకు అవసరమైన భూములను యజమానుల నుంచి సర్కారు నిర్బంధంగా స్వాధీనం చేసుకుంటుంది. వీటిపై ఉన్న హక్కులన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. ప్రస్తుతమున్న చట్టం ప్రకారం భూములను సేకరించాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. కానీ భూముల గుర్తింపు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మొదలు ఫైనల్ నోటిఫికేషన్, బహిరంగ విచారణ.. వివిధ దశల్లో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఈ వ్యవధిలో ఎప్పుడైనా తన హక్కులకు భంగం కలిగినట్లుగా భావిస్తే సదరు భూ యజమానులు అభ్యంతరం తెలపటంతోపాటు కోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు గిట్టుబాటు కాకపోయినా... అదనంగా చెల్లింపులు కోరే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే.. ఈ హక్కులన్నీ కాలరాసినట్లవుతుంది. ప్రాజెక్టుకు అవసరంగా ప్రభుత్వం గుర్తించిన భూములన్నీ కేవలం నెల వ్యవధిలోనే సర్కారు స్వాధీనం చేసుకోవచ్చు. -
ఊపందుకున్న వాటర్‌గ్రిడ్ పనులు
•సింగూరులో రూ.280 కోట్లతో ఇన్‌టెక్ వెల్ నిర్మాణం •పల్లెలకు నీటి సరఫరాపై కొనసాగుతున్న సర్వే •నేడు మంత్రి కేటీఆర్సమీక్ష సాక్షి, సంగారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులకు జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇన్‌టెక్ వెల్, ఫిల్టర్బెడ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు ప్రారంభించారు. మెదక్, సంగారెడ్డి వాటర్‌గ్రిడ్‌లలో భాగంగా సింగూరు ప్రాజెక్టు వద్ద రెండు ఇన్‌టెక్ వెల్స్, ఫిల్టర్బెడ్లు నిర్మించనున్నారు. వచ్చేనెల పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 2,456 నివాస ప్రాంతాల్లోని ప్రజలకు రోజుకు ఒక్కొక్కరికి వందలీటర్ల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా జిల్లాలో రూ.2,400 కోట్లతో వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేశారు. మెదక్ వాటర్‌గ్రిడ్ ద్వారా మెదక్, అందోలు, నారాయణఖేడ్ నియోజక వర్గాలకు, సంగారెడ్డి గ్రిడ్ ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు మెదక్ గ్రిడ్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని మొదట భావించినా ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గజ్వేల్ నియోజక వర్గంతోపాటు సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాటర్‌గ్రిడ్‌లో మంజీర మంచి నీటి పథకాన్ని విలీనం చేసి నర్సాపూర్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయనున్నట్టు సమాచారం. వాటర్‌గ్రిడ్ నుంచి పైప్లైన్ల ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేస్తున్నారు. పైప్లైన్ల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును అధికారులు త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇదిలావుంటే గ్రిడ్‌కు అవసరమైన కరెంటును సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో సన్నద్ధమవుతోంది. సింగూరులో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ వద్ద వాటర్ పంపింగ్, ఫిల్టర్లు పనిచేసేందుకు ఎంత విద్యుత్ అవసరమవుతోంది అంచనా వేసి అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వాటర్‌గ్రిడ్ కోసం సింగూరు వద్ద ప్రత్యేకంగా సబ్‌స్టేషన్ నిర్మించనున్నట్టు సమాచారం. రూ.280 కోట్లతో ఇన్‌టెక్ వెల్, వాటర్ ఫిల్టర్లు.. సంగారెడ్డి, మెదక్ వాటర్‌గ్రిడ్‌లకు సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీర నీటిని వినియోగించనున్నారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా అవసరమైన తాగునీటిని కేటాయించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సంగారెడ్డి వాటర్‌గ్రిడ్‌కు 1.25 టీఎంసీలు, మెదక్ వాటర్‌గ్రిడ్‌కు మరో 1.25 టీఎంసీల నీరు అవసరమవుతాయని అంచనా. సంగారెడ్డి, మెదక్ వాటర్‌గ్రిడ్‌లకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సింగూరు ప్రాజెక్టు సమీపంలో వేర్వేరుగా ఇన్‌టెక్ వెల్, ఫిల్టర్లు నిర్మించనున్నారు. మంత్రి కేటీఆర్ ఆదివారం ఇన్‌టెక్‌వెల్ నిర్మించే ప్రాంతాన్ని సందర్శించ నున్నారు. -
వాటర్ గ్రిడ్‌కు సహకరిస్తాం..
కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ నిధులిచ్చేలా ప్రపంచబ్యాంక్ వంటి సంస్థలకు సిఫారసు చేస్తాం బడ్జెట్లో తెలంగాణకు వీలైనన్ని నిధులు కేటాయిస్తాం కేసీఆర్‌తో భేటీ అనంతరం కేంద్ర మంత్రి వెల్లడి బీఆర్జీఎఫ్, ఉపాధి హామీసహా పలు అంశాలపై చర్చ వాటర్ గ్రిడ్‌కు కేంద్ర నిధులివ్వాలని సీఎం విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చాలా చక్కటి పథకమని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ పేర్కొన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్లో అవకాశాన్ని బట్టి ఈ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఇది చాలా పెద్ద పథకం కావడంతో ఆర్థిక సహాయం కోసం ప్రపంచబ్యాంకు వంటి సంస్థలను సంప్రదించాలని.. అవసరమైతే కేంద్రం తరఫున సిఫారసు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హమీ ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీలోని కృషిభవన్‌లో కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వాటర్ గ్రిడ్ ఉద్దేశం, లక్ష్యాలను కేంద్ర మంత్రికికేసీఆర్ వివరించారు. ఈ పథకానికి రాష్ట్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలుచేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఇక తెలంగాణలో తొమ్మిది జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినా... బీఆర్జీఎఫ్ (బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్) కింద మూడు జిల్లాలకే నిధులు ఇస్తున్నారని, అన్ని జిల్లాలకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలు మండలాల సంఖ్య తగ్గిస్తున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి వద్ద కేసీఆర్ ప్రస్తావించారు. అదే విధంగా రాష్ట్ర విభజనకు ముందున్న గణాంకాల ప్రకారం పేదరికాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారని.. వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెలంగాణలో పేదరికాన్ని గుర్తించాలని కోరారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడారు. వాటర్ గ్రిడ్ గురించి కేసీఆర్ చెప్పారని, ఈ కొత్త పథకానికి వీలైనంత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత తెలంగాణ వాటాకు తమ శాఖ నుంచి వచ్చే నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బీఆర్జీఎఫ్ నిధుల కేటాయింపులపై విలేకరులు ప్రశ్నిం చగా... ‘‘ప్రస్తుతానికి తెలంగాణలోని నాలుగు జిల్లాలకు బీఆర్జీఎఫ్ కింద నిధులు కేటాయించాం. ఇందులో మూడు జిల్లాలు అదనపు నిధుల కోసం అడిగాయి. అయితే మేం జిల్లాను ఒక యూనిట్‌గా కాకుండా, బ్లాక్ ఆధారంగా నిధులు కేటాయిస్తున్నాం. అందులో మరికొన్ని జిల్లాలు రావొచ్చు. కొన్ని సంపన్న బ్లాకులు బయటికి వెళ్లొచ్చు..’’ అని బీరేంద్రసింగ్ చెప్పారు. ఉపాధి హామీ మండలాల తగ్గింపును ఒక జిల్లాలోనో, ఒక రాష్ట్రంలో చేయడం లేదని దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. -
‘వాటర్‌గ్రిడ్’ తొలిదశకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల తొలిదశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటికి అవసరమైన నిధులను మంజూరు చేస్తూ సంబంధిత ఫైళ్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సంతకం చేశారు. వాటర్‌గ్రిడ్ తొలిదశలో 14 సెగ్మెంట్లలో పనులను ప్రారంభించేందుకు రూ. 1,518.52 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో ఇంటేక్‌వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, రా వాటర్ పంపింగ్ మెయిన్స్, హైటెన్షన్ విద్యుత్ సరఫరా పనులు చేపడతారు. ఇక కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి 39.272 టీఎంసీల నీటిని వాటర్‌గ్రిడ్ కోసం కేటాయించేందుకు నీటి పారుదల శాఖ ఆమోదం తెలిపింది. నీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలనే విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొదటి దశ పనుల కోసం రూ. 14,350 కోట్ల మేర పరిపాలనా అనుమతులకు సీఎం ఆమోదం తెలిపారు. తొలిదశ పనుల్లో జూరాల రిజర్వాయర్ నుంచి కోయలకొండ వరకు 70 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతో పాటు సమీప ప్రాంతాలకు తాగునీరు అందిస్తారు. -
శ్రీశైలం జలాలే కీలకం
వాటర్‌గ్రిడ్ ద్వారా 3 జిల్లాలకు నీరు ఎల్లూరు లిఫ్ట్ నుంచే నీటితరలింపు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వాటర్‌గ్రిడ్’ పథకానికి శ్రీశైలం జలాశయమే కీలకం కానుంది. రాష్ట్రంలోని దాదాపు నాలుగోవంతు మండలాలకు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచే తాగునీటిని పంపింగ్ చేయనున్నారు. రక్షితమంచినీటి జలాలు అందించేందుకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని రెండు సెగ్మెంట్లుగా విభజించారు. రెండు సెగ్మెంట్లకూ కృష్ణానది నీటిని పంపింగ్ చేసేలా డిజైన్లు రూపొందించారు. అత్యంత కీలకమైన మొదటి సెగ్మెంటుకు మాత్రం శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా నీటిని పంపింగ్ చేస్తారు. దీనిద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని 128 మండలాలు, ఎనిమిది మున్సిపాలిటీల్లో దాహార్తి తీరనుంది. తొలుత వాటర్‌గ్రిడ్ కోసం ఎల్లూరు కోతిగుండు వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మించాలని నిర్ణయించినా, ఆప్రతిపాదన విరమించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూరు వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను తోడేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను ఉపయోగించనున్నారు. వాటర్‌గ్రిడ్ మొదటి సెగ్మెంటుకు ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 13.11 టీఎంసీలను వినియోగిస్తారు. మహబూబ్‌నగర్‌కు 5.10, నల్లగొండకు 4.59, రంగారెడ్డికి 3.41టీఎంసీల చొప్పున తరలిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి (53.85 టీఎంసీలు) చేరినా వాటర్‌గ్రిడ్ ద్వారా నీటి సరఫరాకు అంతరాయం లేకుండా డిజైన్ రూపొందించారు. పారిశ్రామిక అవసరాలనూ దృష్టిలో పెట్టుకుని నీటి కేటాయింపులు చేసినట్లు చెబుతున్నారు. కాగా, శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి తాగునీటిని పంప్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పథకం పూర్తిస్థాయిలో పనిచేయడం కష్టమేనన్న అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి వాటర్‌గ్రిడ్‌కు నీటిని తరలించడంపై స్థానికంగా నిరసనలూ వ్యక్తమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పది శాతం మేర నీటిని తాగునీటికి వాడొచ్చనే నిబంధన మేరకే వాటర్‌గ్రిడ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఏం డిపార్ట్‌మెంటండీ మీది..
పంచాయతీరాజ్ అధికారుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వికారాబాద్ : జిల్లా పంచాయతీ రాజ్ శాఖ పనితీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రిలోని వాటర్‌గ్రిడ్‌పై కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. వాటర్‌గ్రిడ్ రొటీన్ పని అనుకోవద్దని, మెల్లగా చేద్దాం అనుకుంటే కుదరదని అధికారులను హెచ్చరించారు. పీఆర్ డిపార్ట్మెంట్ ఎస్ఈ ఎక్కడ.. అని ప్రశ్నించగా, అతను రాలేదనే సమాధానం వచ్చింది. వెంటనే మంత్రి ఈఎన్సీని పిలిచి.. ఏమిటీ మీ శాఖ పనితీరు ఇలా ఉంది.. ఈ రోజు సమీక్ష ఉందని తెలిసి రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి నిధులొచ్చాయి కదా.. వాటికి టెండర్లు పిలిచారా.. అని ఆ శాఖ ఈఈ ని ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పలేకపోవడంతో.. మీరు ఆఫీసుకు వస్తున్నారా.. లేదా అని ప్రశ్నించారు. మీ శాఖ రివ్యూ జరుగుతుంటే మీ దగ్గర సమాచారం లేదు.. మీరు ఇదే పని చేస్తున్నారా.. లేదా రియల్ఎస్టేట్ ఏమైనా చేస్తున్నారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జిల్లాలో మొత్తం కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారో చెప్పండంటూ డీఈలు, ఏఈలను ప్రశ్నించగా ఎవరి నుంచీ సమాధానం రాలేదు. దీంతో మరింత విస్తుపోయిన మంత్రి.. ‘ఏం డిపార్టుమెంటండీ.. మీదీ..’ అంటూ నిర్లక్ష్యంగా ఉన్న వారినందరినీ బదిలీ చేయండని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మాట్లాడారు. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. -
వాటర్ గ్రిడ్ కు సవాళ్లు..!
⇒ జిల్లాలో ఎత్తయిన కొండలు, గుట్టలు ⇒ కడెం గ్రిడ్‌కు త్వరలో టెండర్లు ⇒ మిగితా మూడింటికి కొనసాగుతున్న సర్వే పనులు ⇒ పనుల పరిశీలనకు నేడు మంత్రి కేటీఆర్ రాక సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎత్తయిన కొండలు.. గుట్టలు.. అడవి.. చెట్టు.. పుట్టలు.. భౌగోళికంగా విభిన్న పరిస్థితులున్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులకు ప్రధాన సవాల్‌గా మారనుంది. సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రదేశాల్లో ఉన్న ఆవాసాలకు ఈ గ్రిడ్ల పైప్లైన్ల నిర్మాణం, వాటి నిర్వహణకు అనేక అడ్డంకులు అధిగమించాల్సి రానుందని ఆర్డబ్ల్యూఎస్ వర్గాలు భావిస్తున్నాయి.ఎత్తయిన ప్రదేశాలకు నీటిని తరలించడానికి సర్జ్ ట్రీట్మెంట్, జీరో వెలాసిటీ వాల్స్ వంటి నిర్మాణం అవసరమని అధికారులు గుర్తించారు. జిల్లాలో వాటర్ గ్రిడ్‌కు అవసరమైన నీటి వనరుల లభ్యత ఉన్నా, ఆ నీటిని జిల్లా ప్రజల చెంతకు చేర్చడానికి ఏ జిల్లాలో లేనివిధంగా అడ్డంకులు ఎదురవుతాయని గ్రామీణ నీటి సరఫరా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నార్నూర్, సిర్పూర్(యూ), తిర్యాణి, కెరమెరి, ఇంద్రవెల్లి, బోథ్, ఆదిలాబాద్ తదితర మండలాల పరిధిలో సుమారు వందకు పైగా ఆవాసాలకు ఈ గ్రిడ్ ద్వారా అసలు తాగునీటిని సరఫరా చేయడానికి వీలు లేని పరిస్థితి ఉంది.వీటి కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ శాఖ భావిస్తోంది. జిల్లాలో కొనసాగుతున్న ఈ వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్నారు. పూర్తయిన కడెం గ్రిడ్ సర్వే పనులు.. ఖానాపూర్ నియోజకవర్గానికి తాగునీటిని సరఫరా చేసేందుకు మొదటి విడతలో కడెం గ్రిడ్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనుల సర్వే ఇప్పటికే పూర్తి కాగా, రూ.370 కోట్లతో అంచనాలను సిద్ధం చేశారు. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన మూడు.. ఎస్సారెస్పీ, కొమురంభీమ్, ఎల్లంపల్లి గ్రిడ్ల సర్వే పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఈ మూడు గ్రిడ్ల సర్వే కోసం టెండర్లు పిలిస్తే ఏ ఒక్క ఏజెన్సీ కూడా ముందుకు రాలేదు. దీంతో అధికారులు నాలుగు ఏజెన్సీలను ఎంపిక చేసి నామినేషన్ పద్ధతిలోనే సర్వే పనులు అప్పగించారు. 26 బృందాలు ఈ సర్వే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇదీ వాటర్‌గ్రిడ్‌ల లక్ష్యం.. రానున్న మూడున్నరేళ్ల తర్వాత తాగునీటి కోసం ఏ ఒక్క మహిళా కూడా బిందెతో రోడ్డుపై రావద్దనే లక్ష్యంతో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, పట్టణ ప్రాంతల్లో 135 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో సుమారు రూ.3,940 కోట్లతో నాలుగు గ్రిడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మరో రూ.150 కోట్లతో ముథోల్ నియోజకవర్గానికి తాగునీటిని అందించేందుకు గడ్డెన్నవాగు గ్రిడ్‌ను కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి పర్యటన ఇలా.. కరీంనగర్ జిల్లా పర్యటనను ముగించుకుని హెలిక్యాప్టర్‌లో ఉదయం 11 గంటలకు చెన్నూరు మండలంలోని ఎల్ మడుగుకు చేరుకుంటారు. అక్కడ నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ పనుల ప్రదేశాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్‌కు చేరకుంటారు. గ్రిడ్ పనుల్లో భాగంగా కొమురం భీమ్ ప్రాజెక్టు వద్ద నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ ప్రదేశాన్ని సందర్శిస్తారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఈ సమీక్షలో కేటీఆర్‌తోపాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికార వర్గాల్లో హడావుడి నెలకొంది. చెన్నూరు మండలం సోమన్‌పల్లి, ఆసిఫాబాద్ వద్ద హెలిప్యాడ్లను నిర్మించారు. -
ఎలా చేద్దాం!
* వాటర్‌గ్రిడ్‌పై నేడు జిల్లా యంత్రాంగంతో మంత్రి కేటీఆర్ సమీక్ష * సమావేశానికి హాజరుకానున్న ప్రజాప్రతినిధులు * పంచాయతీ రాజ్ పనుల పురోగతిపైనా చర్చించనున్న మంత్రి సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వాటర్‌గ్రిడ్’పై కరసత్తు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యంత్రాంగం రూపొందించిన ప్రణాళికలను క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులతో సమీక్షించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు జిల్లాలవారీ పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో శనివారం ఆయన జిల్లాకు రానున్నారు. వికారాబాద్‌లోని మహవీర్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ విభాగాల్లో పనుల పురోగతితోపాటు వాటర్‌గ్రిడ్‌పై సుదీర్ఘంగా చర్చించనున్నారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీలు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రూ.2,500 కోట్లతో వాటర్‌గ్రిడ్.. ప్రతిష్టాత్మక వాటర్‌గ్రిడ్ కోసం జిల్లా యంత్రాంగం రూ.2,500 కోట్లతో ప్రణాళిక తయారు చేసింది. వాటర్‌గ్రిడ్ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంతోపాటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కృష్ణా నీటితో.. మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాలను గోదావరి నీటితో అనుసంధానం చేసేలా ఈ ప్రణాళిక తయారైంది. మొత్తంగా గ్రిడ్ ద్వారా జిల్లాలోని 1,044 హాబిటేషన్లకు తాగునీటిని అందించనున్నారు. ఈ ప్రణాళికకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక సర్వే మొదలైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి తుది ప్రణాళిక ఖరారుకు కొంత సమయం పట్టనుందని, కాగా క్షేత్రస్థాయిలో అన్ని వార్గాలనుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే గ్రిడ్ ప్రణాళికకు అసలురూపు రానుందని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఫిబ్రవరిలో ‘వాటర్‌గ్రిడ్’కు సీఎం శంకుస్థాపన
మార్చి నుంచి బీడీ కార్మికులకు పింఛన్: కేటీఆర్ సూర్యాపేట: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ వద్ద వాటర్‌గ్రిడ్ పనులకు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ చౌటుప్పల్ వద్ద జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనులు వారం రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. గత పాలకులు వదిలేసిన పాపాలను ఒక్కొక్కటిగా కడుగుతున్నామని చెప్పారు. బీడీ కార్మికులతోపాటు ఒంటరి స్త్రీలకు కూడా పింఛన్ పథకాన్ని అమలుచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఖమ్మం, వైరాలో విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాకోర్టులో ఓడినవారు హైకోర్టుకు వెళ్లి కేసీఆర్ పాలన సక్రమంగా లేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పింఛన్ల కోసం కొండరెడ్ల కనిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. -
తెలంగాణలో ఇంటింటికి మంచినీరు: కేటీఆర్
నల్గొండ: తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి మంచి నీటి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం నల్గొండ జిల్లా సూర్యాపేటలో మంత్రి కేటీఆర్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ... థర్మల్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలేకండా చేస్తామన్నారు. అలాగే గతంలో ఇచ్చిన హామీలు మేరకు త్వరలో పునర్విభజనలో భాగంగా సూర్యాపేటను జిల్లాగా మారుస్తామని కేటీఆర్ తెలిపారు. -
వాటర్‌గ్రిడ్‌కు ‘హడ్కో’ రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి రూ.5 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అంగీకరించింది. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై.. బుధవారం సీఎం కె.చంద్రశేఖరరావు సమీక్షిస్తున్న సమయంలోనే అక్కడికి వచ్చిన హడ్కో ప్రతినిధులు ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిని బట్టి వివిధ దశల్లో రుణ మొత్తాన్ని అందిస్తామని వారు హామీ ఇచ్చారు. వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటయ్యాక మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు. -
ప్రజలందరికీ తాగునీటి హక్కు:కేటీఆర్
⇒ ఇంతకుమించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదు ⇒ మహిళలకే ప్రాజెక్టు బాధ్యతలు ⇒ మంచి పేరు పెడితే బహుమతి ⇒ వాటర్‌గ్రిడ్‌పై మీడియా సమావేశంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: విద్యా హక్కు, సమాచార హక్కు మాదిరిగానే తెలంగాణ ప్రజలందరికీ తాగునీటి హక్కు(రైట్ టు డ్రింకింగ్ వాటర్)ను కల్పించాలన్నది సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్ష అని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. సీఎం ఆకాంక్షకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇంటింటికీ నల్లా ఇవ్వకుంటే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓట్లడగనని కేసీఆర్ చేసిన భీష్మ ప్రతిజ్ఞను సఫలం చేయడానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. వాటర్‌గ్రిడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే నిమిత్తం మంత్రి కేటీఆర్ మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వాటర్‌గ్రిడ్ కీలక అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మోదీ లేఖతోనే వాటర్‌గ్రిడ్‌కు నాంది.. రాష్ర్ట ప్రభుత్వం కొలువుదీరిన తొలివారంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి నాకు లేఖ వచ్చింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత నీరు అందించేలా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులను చేపట్టాలని, గుజరాత్లో తాము చేపట్టి, విజయవంతంగా నిర్వహిస్తున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును సందర్శించాలని అందులో సూచిం చారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీరందించే ప్రాజెక్టును 15 ఏళ్ల క్రితమే సిద్ధిపేట్‌లో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అయినప్పటికీ గుజరాత్ వాటర్‌గ్రిడ్‌ను, సిద్ధిపేట్ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ ప్రారంభానికి మునుపు గుజరాత్లో దుర్భర పరిస్థితులున్నాయి. నిత్యం 4 వేల ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేసేవారు. రైళ్ల ద్వారా కూడా నీటి సరఫరా జరిగేది. అలాంటిది, ప్రస్తుతం అక్కడి ప్రజలకు అవసరమైన మేరకు సురక్షిత తాగునీరు లభిస్తోంది. తెలంగాణలో నీరు దొరకని పరిస్థితి లేకున్నా.. సురక్షితమైన నీరు లభించక ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాకుండా గుజరాత్లో భౌగోళిక పరిస్థితులు తెలంగాణలోని పరిస్థితులకు భిన్నంగా ఉన్నా యి. అక్కడికన్నా ఇక్కడ ఎత్తు పల్లాలు అధిక ం. ఈ నేపథ్యంలో కరువు కాలంలోనూ నీరు లభ్యమయ్యేలా కృష్ణా, గోదావరి జీవనదుల నుంచి నీటిని తీసుకుని గ్రావిటీ ద్వారా గ్రామాలకు సరఫరా చేయాలని నిర్ణయించాం. ఈ తరహాలోనే విజయవంతంగా అమలవుతున్న సిద్ధిపేట్ ప్రాజెక్టునే మోడల్‌గా తీసుకున్నాం. ఇరిగేషన్ శాఖతో పేచీల్లేవ్.. వాటర్‌గ్రిడ్‌కు నీటిలభ్యతపై నీటిపారుదల శాఖతో ఎటువంటి పేచీల్లేవు. ప్రతి ప్రాజెక్టులో కనీసం 10 శాతం నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకునే హక్కుంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి 800 టీఎంసీలు పొందే హక్కుంది. ఇందులో 10 శాతం అంటే 80 టీఎంసీల నీటిని వాటర్‌గ్రిడ్‌కు వినియోగించుకోవచ్చు. వాస్తవానికి అవసరమైన నీరు 39 టీఎంసీలే. నిర్మాణాలు, పవర్‌స్టేషన్ల ఏర్పాటుకు భూమి తదితర అంశాలకు సంబంధించి నీటిపారుదల శాఖ నుంచి అన్ని అనుమతులు లభించాయి. వచ్చే నెల రెండో వారంలో పైలాన్.. మూడేళ్లలో వాటర్‌గ్రిడ్‌ను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఫిబ్రవరి రెండో వారంలో వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించడంతో పనులు ప్రారంభమవుతాయి. టర్న్‌కీ విధానం ద్వారా నీటి వనరుల నుంచి గ్రామాలకు సరఫరా చేస్తాం. వాటర్‌గ్రిడ్ పూర్తయితే ప్రతి గ్రామంలో ఒక్కో వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాల్టీల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల మంచినీరు అందుతుంది. గ్రిడ్ బాధ్యతలు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి 1,238 పోస్టులను కొత్తగా మంజూరు చేశాం. తగినన్ని వాహనాలు, ల్యాప్‌ట్యాప్‌లు అందించాం. నిధుల కొరత ఏర్పడకుండా మిగిలిన ప్రాజెక్టులకు కేటాయింపులు నిలిపేసైనా వాటర్‌గ్రిడ్ కోసం వెచ్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో 4 వేల గ్రామాలకు నీరందించే పనులకు రూ. 1,340 కోట్లను మంజూరు చేసింది. వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ తుది దశలో ఉంది. హడ్కో, జైకా సంస్థలు నిధులిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి. గ్రిడ్ నిర్వహణే సవాల్.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత లను మహిళలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే బాధ్యత కూడా వారికే అప్పగిస్తున్నాం. పేరు పెట్టండి.. బహుమతి పట్టండి వాటర్‌గ్రిడ్ పథకానికి మంచి పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మంచి పేరు సూచిం చిన వారికి ప్రభుత్వం తరఫున మంచి బహుమతిని అందిస్తాం. అభయహస్తం పథకానికి కొత్త రూపు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం 13.11 టీఎంసీల కృష్ణానీటిని వినియోగిస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి దశ పంప్‌హౌస్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలతో కలసి మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే నెలాఖరుకు అభయహస్తం పథకం బకాయిలు చెల్లించడంతో పాటు పథకానికి కొత్త రూపు ఇస్తాం. అభయహస్తం లబ్ధిదారులను ఆసరా పథకం కిందకు తెస్తాం. వడ్డీలేని రుణాలిచ్చి, బకాయిలు కూడా త్వరలో చెల్లిస్తామన్నారు. ఆసరా పథకంలో చెంచుల వయో పరిమితిని 50 ఏళ్లకు తగ్గించి పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. -
'వాటర్‌గ్రిడ్'కు స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ వాటర్‌గ్రిడ్ పనులను మంగళవారం పర్యవేక్షించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు సమీపంలో వాటర్‌గ్రిడ్ కోసం స్థలాన్ని కేటీఆర్ పరిశీలించారు. జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, నిరంజన్ రెడ్డి, తదితరులు కేటీఆర్‌కు జిల్లా పరిస్థితిని వివరించారు. అనంతరం కొల్లాపూర్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. వాటర్‌గ్రిడ్ పథకానికి సంబంధించిన అంశాలపై అధికారులతో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ చర్చించారు. -
ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్?
-
ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్?
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే జోరుగా బీజేపీ కేంద్ర నాయకులతోను, రాష్ట్రస్థాయి నాయకులతోను చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఇక ఎన్డీయేలోకి టీఆర్ఎస్ చేరడం ఖాయమని అంటున్నారు. ఇదే జరిగితే, ఓ మహిళా ఎంపీతో పాటు మరొకరికి కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కావాలని కోరాలని భావిస్తున్నారు. భారీ ప్రాజెక్టులు, పథకాలకు నిధులు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లాంటి పథకాలకు దాదాపు రూ. 50 వేల కోట్ల వరకు నిధులు కావల్సి ఉండటం, ప్రత్యేక హోదా లేకపోవడం... ఇలాంటి కారణాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కూడా ఈ దిశగా ఆలోచించేందుకు కారణమయ్యాయని అంటున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ గనక ఎన్డీయేలో చేరితే.. జాతీయ స్థాయిలో ప్రభావంతో పాటు రాష్ట్రానికి కూడా ప్రయోజనం ఉంటుందని యోచిస్తున్నట్లు సమాచారం. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రలో టీడీపీ ఇప్పటికే ఎన్డీయేలో ఉన్నందున.. వాళ్లకంటే తమకు నిధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటికే జోరుగా హస్తిన పర్యటనలు చేస్తున్నారు. మొదట్లో కొన్నాళ్ల పాటు మైనారిటీలను దృష్టిలో పెట్టుకుని కొంత ముందు వెనక ఆలోచించినా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంలో చేరితేనే మంచిదని భావిస్తున్నారు. అయితే, ఇదే తరుణంలో టీడీపీతో టీఆర్ఎస్కు ఇప్పటికి సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం, ఇటు తెలంగాణ బీజేపీ నేతలతో కూడా అంతగా సఖ్యత లేకపోవడం లాంటి కారణాల రీత్యా బీజేపీ ఎంతవరకు టీఆర్ఎస్ను దగ్గరకు చేర్చుకుంటుందన్నది మాత్రం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. -
‘వాటర్ గ్రిడ్’పై సమగ్ర చర్చ అవసరం
సందర్భం తెలంగాణ ప్రభుత్వం భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అందుబాటులో ఉన్న సమాచారం స్వల్పం. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆ సమాచారాన్నంతా బహిరంగపరచి, విస్తృత చర్చ, సంప్రదింపులు నిర్వహించాలి. భారీ వ్యయంతో కూడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు జల ప్రాజెక్టులను తెలం గాణ ప్రభుత్వం తలపెట్టింది. మొదటిది, పైపులు, పంపుల ద్వారా తాగునీటి, గృహ అవ సరాలను తీర్చే ‘‘వాటర్ గ్రిడ్’’. రెండవది, వ్యవసాయ, గృహ అవసరాలకు నీటి లభ్య తను మెరుగుపరచే లక్ష్యంతో గ్రామీణ చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ. రూ. 50,000 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, సామా జిక అంశాలపై నిర్మాణాత్మకమైన బహిరంగ చర్చ అవ సరం. ప్రతిపాదిత వాటర్ గ్రిడ్‌పై ఇంతవరకు అందు బాటులో ఉన్న సమాచారం స్వల్పం. దాని పైన ఆధా రపడి ప్రాజెక్టు డిజైనింగు, అమలు, వ్యయాల తగ్గింపు నకు తోడ్పడాలనేదే ఈ వ్యాసం లక్ష్యం. గ్రామీణ నీటి సరఫరా పథకాలు మనకు కొత్తేమీ కాదు. బావుల మరమ్మతు, కొత్త పంచాయితీ బావుల తవ్వకంతో తాగునీటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వ జోక్యం ప్రారంభమైంది. ఆ తర్వాత చేతి పంపులు, ఆ తదుపరి ఎమ్ 2 పంపులతో లోతైన బోరు బావులు,పెద్ద గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపు లైన్లు ప్రవేశిం చాయి. నేడు ఆర్ఓ (నీటి శుద్ధి) ప్లాంట్లు, వాటర్ క్యాన్లు సురక్షితమైన తాగునీటికి సంకేతంగా మారాయి. పలు గ్రామాలకు ఇంకా చేతి పంపులే తాగునీటికి ఆధారం. అయినా ఆర్ఓ ప్లాంట్లు, వాటర్ క్యాన్లే విస్తరిస్తున్న ధోరణి. ఈ మార్పునకు చాలానే కారణాలున్నాయి. వాటిలో నీటి లభ్యత, నాణ్యత ప్రధానమైనవి. ప్రజల ఆదాయాలు, నీటి నుంచి సంక్రమించే వ్యాధులపట్ల అవగాహన పెరగడం కూడా ప్రజల తాగునీటి ఎంపి కలో గణనీయమైన మార్పును తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు డిజైనింగ్, అమలులో దిగువ అంశాలను పరిగ ణనలోకి తీసుకోవాలని భావిస్తున్నాం. గ్రామీణ జనాభాలో 50% నేడు ఆర్ఓ ప్లాంట్ల తాగునీటిని వాడుతున్నారని, 2020 నాటికి 80% ఆ నీరే వాడుతారని అంచనా. కాబట్టి వాటర్ గ్రిడ్ పూర్తయ్యేస రికి తాగునీటికి గ్రిడ్ ప్రధాన వనరుగా ఉండకపోవచ్చు. ఒకే గ్రిడ్, ఒకే వనరు ప్రభుత్వ ప్రణాళికయితే వనరు, దూరం, గ్రిడ్ నుంచి గ్రామీణ తెలంగాణకు అం తటికీ నీటి రవాణా ఏర్పాట్లు వంటి విషయాల్లో చాలా సవాళ్లు ఎదురుకావచ్చు. లేక వాటర్ గ్రిడ్ పలు నీటి వన రులతో కూడిన ప్రాజెక్టయితే, అలాంటి వనరులను ఉప యోగించుకోవడంలో నాణ్యత, పరిమాణాలకు సంబం ధించి పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రిడ్ ద్వారా సరఫరా చేసే నీటి యూనిట్ వ్యయం మరో సవాలు కావచ్చు. గ్రిడ్ ద్వారా సరఫరా చేసే నీటిని ప్రజలు తాగు నీటిగా ఉపయోగించకపోతే, గృహావసరాలు తదితరా లకు జలరవాణాపై అంత భారీ పెట్టుబడులను పెట్టడం సమంజసం కాకపోవచ్చు. ఇప్పటికే పలుచోట్ల స్థానికంగా పైపులు, పంపుల వ్యవస్థలున్నాయి. అవి లేని చోట్ల ఆ ఖాళీలను పూరించ డానికి వాటర్ గ్రిడ్ సమంజసం కావచ్చు. అందుకోస మైతే ఈ ప్రాజెక్టును ప్రతిచోటా గాక, పంపునీటి కనెక్షన్లు లేని చోట్ల ప్రారంభించడమే తర్కబద్ధమవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. తెలంగాణ ప్రజ లందరి గృహ, తాగునీటి అవసరాలకు సరిపడేటంత సురక్షితమైన నీటిని అందించాల్సిన అవశ్యకతను ఎవ రూ ప్రశ్నించడం లేదు. ప్రాజెక్టును మరింత ఆమోదయో గ్యంగా, ఆర్థికంగా మనగలిగేదిగా చేయడం కోసమే పై అంశాలను లేవనెత్తాం. దిగువ సూచనలను చేస్తున్నాం. 1.గృహ, తాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రస్తుత మున్న మౌలిక సదుపాయాల స్థితిపై శీఘ్రమే వివ రమైన నివేదికను రూపొందించడం ముందుగా చేయాల్సిన పని. ఆ నివేదకలో ఈ అంశాలను చేర్చ వచ్చు: ఎ) సగటున రోజుకు 120 లీటర్ల ప్రమాణం ప్రకారం ఇప్పుడున్న తాగునీటి సదుపాయాలు, పంపిణీ, విస్తరణ; బి) ప్రస్తుతం ఉన్న శుద్ధి చేసిన తాగునీటి సదుపాయాలు, వాటి పంపిణీ, విస్తృతి; సి) వాటి పై పెట్టిన ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడు లు; డి) స్థానికంగా ఉన్న పంపు నీటి వ్యవస్థలు, వాటి సమర్థత; ఇ) స్థానికంగా వాటర్ గ్రిడ్లు ఉం డివుంటే వాటి విస్తృతి; ఎఫ్) శుద్ధిచేసిన నీటి ప్రస్తు త డిమాండు, సరఫరా. ఈ నివేదకను నెలలో తయారుచేయవచ్చు. ఆ తదుపరి ‘అందుబాటులో లేని వారికి ప్రాధాన్యం’ అనే ప్రాతిపదికన వాటర్ గ్రిడ్‌ను డిజైన్ చేయాలి. ఇప్పటికే ఉన్న పరిశుద్ధ నీటి వ్యవస్థలను బలోపేతం చేసి, విస్తరించడం ద్వారా త్వరితగతిన ఫలితాలను సాధించవచ్చు. 2. {Wy్ డిజైనింగ్‌కు, ఆమోదానికి, అమలుకు కాలం పడుతుంది. కాబట్టి జిల్లాకో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి, తదుపరి వాటిని వాటర్ గ్రిడ్‌తో అనుసంధానించవచ్చు. 3. ముందే చెప్పినట్టుగా శుద్ధిచేసిన క్యాన్లలోని తాగు నీటి వాడకం గ్రామీణ ప్రాంతాల్లో కూడా భవిష్యత్ ధోరణి. కాబట్టి ప్రజలు గ్రిడ్ నీటిని తాగకపో వచ్చు. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వ్యవస్థ లను బలోపేతం చేసి, నియంత్రణ వ్యవస్థను నెలకొల్పి, గ్రిడ్ నీరు నాణ్యమైనది, సురక్షితమైనది, ధర రీత్యా అందుబాటులో ఉండేదిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. 4.ఇలాంటి ప్రాజెక్టుకు నిర్దిష్ట కాలపరిమితిలో స్పష్ట మైన లక్ష్యం, టార్గెట్లు, ప్రయోజనాలను నిర్వచించే ప్రభావ విశ్లేషణ అవసరం. ప్రాజెక్టు ప్రభావాన్ని ప్రభుత్వంతోపాటూ పౌర సమాజం కూడా క్రమం తప్పక పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు మొదలు కావడానికి ముందే ప్రభు త్వం స్పష్టమైన, పారదర్శక క్రమాన్ని ప్రారంభించాలి. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు సమాచా రాన్నంతా బహిరంగపరచాలి. టెండర్ల ప్రక్రియకు ముం దే, ఇప్పుడే విస్తృత బహిరంగ చర్చ, సంప్రదింపులు చేపట్టడం మెరుగైన డిజైనింగ్‌కు, అమలుకు తోడ్పడు తుంది, ప్రజలందరికీ మేలు చేకూరుతుంది. (వ్యాసకర్త ఐరాసలో పనిచేసిన అంతర్జాతీయ జల నిర్వహణా నిపుణులు) email:bg@agsri.com -
ఆర్థిక చేయూతనివ్వండి
కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు అందించి ఆర్థికంగా చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు కేంద్ర మంత్రులను కోరారు. రాష్ట్రంలో చేపట్టనున్న పథకాలకు సాయం అందించాలని, మరికొన్ని సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేటీఆర్ టీఆర్ఎస్ ఎంపీ వినోద్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడుతో కలసి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, జౌళి శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్, గ్రామీణాభివృద్ధి మంత్రి భీరేంద్రసింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరిలతో వేర్వేరుగా భేటీ అయి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రులతో భేటీ వివరాలను వెల్లడించారు. వాటర్‌గ్రిడ్‌కు ఆర్థిక సాయం.. ఇంటింటికీ రక్షిత నీరు అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభిస్తోందని, ఇందుకయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్రం భరించాలని కేంద్ర మంత్రి భీరేంద్రసింగ్ను కోరినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఉపాధి హామీ పథకాన్ని కుదించరాదని, అవసరమైతే పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. స్పందించిన కేంద్రమంత్రి ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఆర్థిక ఏడాది చివరి త్రైమాసిక నిధులు రూ.223 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు బీఆర్జీఎఫ్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.228 కోట్లు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రానికి వచ్చే పింఛన్ కోటాను పెంచాలని కోరామని, దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయమన్నాం.. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్, దుబ్బాక, పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లలో ఎక్కడైనా హ్యాండ్లూమ్ క్లసర్లు ఏర్పాటుచేయాలని జౌళి శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్‌ను కోరినట్టు కేటీఆర్ తెలిపారు. టీ-హబ్ ఇంక్యుబేషన్ సెంటర్‌కు మౌలిక వసతుల కల్పనకు సహకారం అందించాలని కేంద్రమంత్రి సుజానా చౌదరికి, సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న ఈఎస్ఐ డిస్పెన్సరీని 200 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు విన్నవించామన్నారు. కేంద్ర సహకారం ఉంటుంది: దత్తాత్రేయ రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. తనతో కేటీఆర్ భేటీ అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. నేడు మహబూబ్‌నగర్‌కు కేటీఆర్ వాటర్‌గ్రిడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసే ఇంటేక్వెల్ సర్వే, డిజైన్లను ఆయన పరిశీలించనున్నారు. -
'సెలవుల్లో కూడా పని చేసేందుకు రెడీగా ఉండాలి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వాటర్ గ్రిడ్' పథకం పనులను అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని ఐటీ శాఖమంత్రి కె. తారక రామారావు అధికారులకు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు యుద్ధ ప్రాతిపదికన వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సెలవు రోజుల్లోనూ పని చేయడానికి అధికారులు, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఎలాంటి పాలనాపరమైన అనుమతులైనా ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందని అధికారులకు తెలియజేశారు. -
సబ్ కాంట్రాక్టర్లు ఇకపై కాంట్రాక్టర్లు
గుర్తింపు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసిన వారిని కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్, రహదారుల పనులు చేపడుతున్నందున సబ్ కాంట్రాక్టర్లను, కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లను ప్రోత్సహించే అవకాశాలను పరిశీలించాలని చీఫ్ ఇంజనీర్ల బోర్డు (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్) ప్రభుత్వానికి గతంలో సిఫార్సుచేసింది. క్లిష్టమైన కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళీకరించడంతో పాటు తెలంగాణకు చెందిన సబ్ కాంట్రాక్టర్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి కాంట్రాక్టర్లుగా అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. సబ్ కాంట్రాక్టర్లు నేరుగా టెండర్లు దాఖలు చేయడానికి వీలుగా, గతంలోని జీవోలను మార్పు చేయాల్సి ఉందని, గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏ ఒక్క ఏడాదైనా రూ. 2.5 కోట్ల టర్నోవర్ ఉంటే ఆ సబ్ కాంట్రాక్టర్లకు ప్రత్యేక తరగతి కాంట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అర్హత కల్పించాలని బోర్డు సూచించింది. స్థానిక సంస్థల పరిధిలో నిర్మాణ రంగంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్లకు అన్ని ఇంజనీరింగ్ పనుల్లో అర్హత కల్పించాలని సిఫార్సు చేసింది. సీఎంను కలసిన సబ్ కాంట్రాక్టర్ల బృందం.. సోమవారం సబ్ కాంట్రాక్టర్ల బృందం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించింది. ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి కోట్లలో రావాల్సిన బకాయిలు, తమను కాంట్రాక్టర్లుగా గుర్తించే విషయంలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ సబ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు విశ్వరాజ్పాల్, ఇతర నాయకులు హరినాథ్, శ్రీనాథ్, గౌతమ్‌రెడ్డి తదితరులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం వారి సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లింపు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సబ్ కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు రూ.3 కోట్ల వరకు టెండర్ వేసేందుకు ఉన్న అర్హతను రూ.10 కోట్లకు పెంచేందుకు సీఎం సానుకూలత తెలిపినట్లు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. -
నెలాఖరులోగా ‘వాటర్‌గ్రిడ్’ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. గ్రిడ్ పనుల కోసం వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులను వెంటనే పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వాటర్‌గ్రిడ్, పంచాయతీ రహదారుల నిర్మాణాలపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రిడ్ కోసం నిర్మించబోతున్న ఇంటేక్ వెల్స్ అంచనాలు, డిజైన్లను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ .. తదితర విభాగాల అధికారులతో కలిపి రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని వారంలోగా నియమించాలని, నెలాఖరుకల్లా వాటర్‌గ్రిడ్ పైలాన్ నిర్మాణం పూర్తిచేసి, ఫిబ్రవరిలో ఆవిష్కరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. -
కొండెక్కేదెలా..!
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : భౌగోళికంగా అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ప్రజల గొంతులు తడపడం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రధాన సవాల్‌గా మారనుంది. సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రెండు నియోజకవర్గాల గ్రామాలకు తాగునీరు అందించాలంటే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పైప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామీణ నీటి సరఫరా శాఖ గుర్తించింది. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన వాటర్‌గ్రిడ్ పనుల సమీక్షలో ఈ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. నిర్మల్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలోని నిర్మల్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలకు, 930 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరాకు ఎస్సారెస్పీ గ్రిడ్‌ను డిజైన్ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి బన్సపల్లి వద్ద నుంచి నీటిని ఎత్తిపోసుకోవాలని నిర్ణయించారు. ఈ బన్సపల్లి సముద్ర మట్టానికి 331 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల గ్రామాలు సుమారు 450 నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయాలంటే కనీసం 181 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. మహబూబ్ ఘాట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ఈ మేరకు పైప్లైన్లు నిర్మిస్తే.. రానున్న రోజుల్లో ఈ పైప్లైన్ల నిర్వహణలో అనేక సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం ఖాయమని ఆ శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఒక్కోసారి పైపులు పగిలి పోవడం వంటి ఘటనలు చోటు చేసుకుని నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించి గ్రిడ్ రూపకల్పనకు ప్రస్తుతం ఆర్డబ్ల్యూఎస్ శాఖలో రాష్ట్ర స్థాయిలో కూడా నిపుణులు అందుబాటులో లేరు. ఇందుకోసం ఉన్నత సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుని గ్రిడ్‌ను రూపకల్పన చేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజినీర్ ఇంద్రసేన ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. రాసిమెట్ట వద్ద పంపింగ్ కేంద్రం.. బన్సపల్లి వద్ద ఎస్సారెస్పీ నీటిని శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా నీటిని బూరుగుపల్లి(నేరడిగొండ మండలం)కి తరలిస్తారు. ఇక్కడ పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి, ఇక్కడి నుంచి మామడ మండల పరిధిలో ఉన్న రాసిమెట్టకు నీటిని పంపు చేస్తారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో 512 మీటర్ల ఉన్న ఈ రాసిమెట్టకు నీటిని ఎక్కిస్తే అక్కడి నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయడం సులభమవుతుందని ఆర్డబ్ల్యూఎస్ భావిస్తోంది. కొలిక్కి వచ్చిన కడెం గ్రిడ్ సర్వే.. జిల్లాలో వర్షాకాలంలోనూ ప్రజలు తాగునీటి కటకటను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. తాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాలో నాలుగు గ్రిడ్లకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు సర్వే కోసం టెండర్లు పిలువగా, ఒక్క కడెం గ్రిడ్‌కు మాత్రమే సర్వే చేసేందుకు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. ఖానాపూర్ నియోజకవర్గంలోని 594 గ్రామాల ప్రజల గొంతులు తడిపేందుకు రూపొందించిన ఈ గ్రిడ్ సర్వే పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. మిగిలిన గ్రిడ్ల సర్వేకు మరోమారు టెండర్లు పిలవాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ భావిస్తోంది. -
7 జిల్లాల్లో వాటర్ గ్రిడ్
దశలవారీగా రాష్ట్ర ప్రజలందరికీ మంచినీరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజలందరికీ వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి వసతి కల్పించాలన్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో.. తొలి దశలో ఏడు జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ఏర్పాటునకు పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. తొలి దశలో అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించనున్నారు. ఈ జిల్లాల్లో తాగునీటికి, పరిశ్రమలకు సరఫరా చేసేందుకు 73.134 టీఎంసీలు అవసరమని లెక్కకట్టారు. ఏడు జిల్లాలకుగాను అనంతపురం జిల్లా వాటర్ గ్రిడ్‌కు మాత్రం సవివరమైన ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు. దీనికి రూ.1,400 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. మిగతా ఆరు జిల్లాల్లో వాటర్ గ్రిడ్‌కు సవివరమైన ప్రాజెక్టు నివేదికలు తయారీ దశలో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు పెన్నా అహోబిలం, తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా నీటిని వాటర్ గ్రిడ్‌కు వినియోగించాలని ప్రతిపాదించారు. అలాగే చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా సుజల స్రవంతి, గండికోట ద్వారా నీటిని వాటర్ గ్రిడ్‌కు వినియోగించాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గండికోట మైలవరం నీటిని, కర్నూలు జిల్లాలో శ్రీశైలం నీటిని వాటర్ గ్రిడ్‌కు వినియోగించాలని ప్రతిపాదించారు. నెల్లూరు జిల్లాకు సోమశిల, కండలేరు నీటిని, గుంటూరు, ప్రకాశం జిల్లాల వాటర్ గ్రిడ్‌కు కృష్ణా జలాలను వినియోగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇదిలా ఉండగా మొత్తం 13 జిల్లాలకు వాటర్ గ్రిడ్‌కు తాగునీటి, పరిశ్రమల అవసరాలకోసం 232.10 టీఎంసీలు అవసరమని అధికారులు తేల్చారు. ఇందులో 13 జిల్లాల పట్టణ, గ్రామీణ మంచినీటి అవసరాలకు 166.42 టీఎంసీలు, పరిశ్రమలకోసం 65.68 టీఎంసీలు అవసరమని లెక్కకట్టారు. నీటి అవసరాలను కూడా 2044 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని లెక్కకట్టారు. వాటర్ గ్రిడ్లకు జలాశయాల్లో నీటిని వినియోగించడానికి అవసరమైన అనుమతిని సాగునీటి శాఖ ఇవ్వాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనాభా పెరుగుదలను ఈ విధంగా అంచనా వేశారు. 20112014 10 శాతం జనాభా పెరుగుదల 20142024 9 శాతం జనాభా పెరుగుదల 20242034 8 శాతం జనాభా పెరుగుదల 20342044 7 శాతం జనాభా పెరుగుదల తాగునీరు, పరిశ్రమలకు 73.134 టీఎంసీలు 13 జిల్లాలకు 232 టీఎంసీలు అవసరం అనంతపురం వాటర్ గ్రిడ్‌కు 1,400 రూ. కోట్ల అంచనా -
చుక్క చుక్కకూ లెక్క!
ఇంటింటికీ నల్లా కనెక్షన్.. మీటర్ పట్టణ ‘వాటర్ గ్రిడ్’లో భాగంగా ప్రతిపాదనలు 24 గంటల సరఫరాపై ‘నియంత్రణ’కే పట్టణ ‘గ్రిడ్’ పనులకు రూ. 3,038 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్‌గ్రిడ్ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తోపాటు మీటర్‌ను సైతం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి వినియోగంపై నియంత్రణ కోసం మీటర్లు బిగించాల్సిందేనని భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ పనుల కోసం రూ. 3,038 కోట్ల అంచనా వ్యయంతో ‘ప్రజారోగ్య ఇం జనీరింగ్ విభాగం’ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, ప్రధాన పైప్లైన్లు, సర్వీసు రిజర్వాయర్లు, అంతర్గత సరఫరా వ్యవస్థ, ఇళ్లకు నల్లా కనెక్షన్లు, మీటర్ల కోసం ఈ మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. నల్లా మీటర్ల కొనుగోలుకే రూ. 170.32 కోట్ల నిధులు కావాలని ఈ ప్రతిపాదనల్లో కోరింది. నీటి వృథాను అరికట్టడం, వినియోగం ఆధారంగా నీటి బిల్లులు వసూలు చేసేందుకు మీటర్లు తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు. రూ. 3 వేల కోట్లతో పట్టణ ‘గ్రిడ్’ హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాల పరిధిలో ఉన్న 67 నగరాలు, పట్టణ ప్రాంతాలకు ‘వాటర్ గ్రిడ్’ కింద నీటి సరఫరా కోసం రూ.3,038 కోట్ల అంచనా వ్యయంతో వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉందని ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తేల్చింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మూడు వేర్వేరు రకాల పనులను ప్రతిపాదించింది. అందుబాటులో సరిపడ నీళ్లున్నా.. సరఫరా వ్యవస్థ (డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్) లేక చాలా ప్రాంతాలకు నీటి సరఫరా జరగట్లేదు. ఈ నేపథ్యం లో 10 పట్టణాల్లో నీటి సరఫరా పనుల కోసం రూ.657.43 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. నీటి సరఫరా నియమావళి ప్రకారం పట్టణ ప్రాం తాల్లో రోజూ ప్రతి వ్యక్తికి 135 లీటర్ల సరఫరాకు స్థానికంగా సరిపడ నీటి లభ్యత లేదు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న 24 పట్టణాల్లో రూ.717.51 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతోపాటు కొన్ని పాత మున్సిపాలిటీల్లో ముడి నీటి సరఫరా మెయిన్ పైప్లైన్లు, నీటి శుద్ధీకరణ వ్యవస్థ, ఓవర్ హెడ్ ట్యాంకులు, సరఫరా వ్యవస్థ అందుబాటులో లేవు. రాష్ట్రంలోని 33 పట్టణాల్లో ఈ పనులకు రూ.1662.67 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. భవిష్యత్తు జనాభా అవసరాలకు.. వాటర్ గ్రిడ్ పథకం కింద 2050 నాటికి పెరగనున్న జనాభ అవసరాలను తీర్చేలా రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధిపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా పట్టణ నీటి సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు మరో రూ. 2,276.09 కోట్లు అవసరమని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సర్కారుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. -
నీటి పథకంపై నాన్చుడు
కిరణ్ హయూంలో రూ.7,390 కోట్లతో కండలేరు పథకం మంజూరు తొలి దశలో రూ.4,300 కోట్లతో 12 ప్యాకేజీలకు టెండర్లు పథకం పనులను అభయాన్స్‌లో పెట్టిన చంద్రబాబు రూ.ఎనిమిది వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు ప్రణాళిక ఇంతవరకూ ఏదీ తేల్చని ప్రభుత్వం తిరుపతి: జిల్లా ప్రజల దాహార్తి శాశ్వతంగా తీర్చే ప్రాజెక్టుపై స్పష్టత లేకపోవడంతో అధికార వర్గాల్లో అయోమయం నెలకొంది. వాటర్ గ్రిడ్ పనులను చేపడుతున్నట్లుగానీ .. కండలేరు పథకాన్ని రద్దు చేసినట్లుగానీ ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది. జిల్లాలో 1,380 పంచాయతీల పరిధిలో 11,580 గ్రామాలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్క తిరుపతి నగరం మినహా తక్కిన ప్రాంతాలకు భూగర్భ జలాలపై ఆధారపడే తాగునీటి పథకాలను చేపట్టారు. వర్షాభావ ప్రాంతమైన జిల్లాలో భూగర్భ జలమట్టం 21.35 మీటర్లకు పడిపోయింది. భూగర్భ జలాలు అందుబాటులో లేకపోవడంతో ఏడాది పొడవునా 1,713 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రూ.7.390 కోట్లతో కండలేరు పథకం.. నెల్లూరు జిల్లా కండలేరు రిజర్వాయర్ నుంచి 6.61 టీఎంసీల నీటిని ఎత్తిపోసి జిల్లాలో 45 మండలాల్లోని 8,468 గ్రామాలకు తాగునీటిని అందించే పథకానికి అప్పటి సీఎం కిరణ్ రూపకల్పన చేశారు. పథకం నిర్మాణ బాధ్యతలను ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐఎన్‌సీఏపీ)కి అప్పగించారు. రూ.7,390 కోట్ల అంచనా వ్యయంతో 576 కిలోమీటర్ల పొడవున పైపు లైన్లు నిర్మించి, 32 క్లస్టర్ రిజర్వాయర్లను ఏర్పాటు చేసి 8,468 గ్రామాలకు నీళ్లందించేలా అంచనాలను రూపొందించారు. కండలేరు నీటి ప్రాజెక్టు చేపట్టేందుకు జనవరి 4, 2014న టెండర్లు పిలిచింది. తొలి దశ కింద కండలేరు రిజర్వాయర్ నుంచి చిత్తూరులోని కలవకుంట రిజర్వాయర్ వరకూ 164 కిలోమీటర్ల పైపు లైను నిర్మించి 4,500 గ్రామాలకు నీళ్లందించేందుకు రూ.4,300 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఎనిమిది నుంచి 12 శాతం అధిక ధరలకు కోట్ చేసిన అస్మదీయ కాంట్రాక్టర్లకు టెండర్లను ఖరారు చేసి మొబిలైజేషన్ అడ్వాన్సు రూపంలో రూ.40 కోట్లను కట్టబెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రకటించడంతో పనులును ప్రారంభించలేకపోయారు. కథ మళ్లీ మొదటికి.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి దాహార్తి తీర్చుతామని ప్రకటించారు. కండలేరు నీటి ప్రాజెక్టును అభయాన్స్‌లో పెడుతున్నట్లు జూన్ 24న ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పశ్చిమ మండలాలకు హంద్రీ-నీవా, వెలిగల్లు రిజర్వాయర్ తూర్పు మండలాలకు గాలేరు-నగరి, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేలా అధికారులు నివేదిక రూపొందించారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు రూ.ఎనిమిది వేల కోట్ల అవసరం అవుతాయని అంచనా వేశారు. సుమారు 6.5 టీఎంసీల నీటిని వాటర్ గ్రిడ్‌కు కేటాయించాలని సూచించారు. వాటర్ గ్రిడ్‌పై పలుమార్లు సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. పనులను ఎప్పుడు చేపడతామన్నది ప్రకటించలేదు. కండలేరు నీటి ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు కూడా ఉత్తర్వులు జారీ చేయలేదు. ఏ పథకం ప్రభుత్వం చేపడుతుందో తెలియక ఇటు అధికారులు .. అటు ప్రజలు గందరగోళంలో పడ్డారు. -
గ్రేటర్‌కు శ్రీశైల గంగ!
ఎల్లూరు ఎత్తంగుట్ట నుంచి 5.5 టీఎంసీల తరలింపు ఔటర్ రింగురోడ్డు చుట్టూ గ్రేటర్ వాటర్ గ్రిడ్ జలమండలికి రూ.100 కోట్లు విడుదల ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి సిటీబ్యూరో:రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు శ్రీశైల గంగను రప్పించనున్నారు. శ్రీశైలం జలాశయానికి 16 కి.మీ. దూరంలో ఉన్న ఎల్లూరు ఎత్తంగుట్ట (648 మీటర్ల ఎత్తున్న కొండ) ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించి(లిఫ్టు).... అక్కడి నుంచి నగరానికి రప్పించి.... హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నింపేందుకు కసర త్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై జలమండలి అధికారులు సమగ్ర అధ్యయనం చేసి అం చనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇది పూర్తి చేస్తే విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ) ద్వారానే నగరానికి నీటిని తరలించవచ్చని పేర్కొన్నారు. సోమవారం సచి వాలయంలో జలమండలి ప్రాజెక్టులపై సీఎంసుదీర్ఘంగా సమీక్షించారు. నగర దాహార్తిని తీర్చేందుకు ప్రస్తుతం కృష్ణా జలాశయం నుంచి 11 టీఎంసీలు, సింగూరు నుంచి ఏడు టీఎంసీలు, గండిపేట్, హిమాయత్ సాగర్ల నుంచి మరో రెండు టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. ఇంకా 15 టీఎంసీల నీటికి కొరతగా ఉం దని సీఎం తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ జనాభా కోటికి చేరుకోవడంతో పాటు ఏటా పది లక్షల జనాభా పెరుగుతుండడం, ఐటీఐఆర్ ప్రాజెక్టు పూర్తికానున్న తరుణంలో మహానగర జనాభా అనూహ్యంగా పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరానికి కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకాలతో పాటు కృష్ణా నాలుగో దశ, శ్రీశైలం బ్యాక్‌వాటర్ పథకాలను పూర్తి చేసి నీటి కొరతను తీర్చాల్సి ఉందని స్పష్టంచేశారు. కృష్ణా మూడోదశను ఈ ఏడాది మార్చి నాటికి, గోదావరి మొదటి దశను జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కో కేంద్ర సాయం రదాం గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల నుంచి నగర తాగునీటి అవసరాలకు నీటిని సేకరించే విధంగా గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టాలని సీఎం సూచించారు. ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్రం నుంచి రాబట్టేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బోర్డు అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని మొత్తం నగరం చుట్టూ మంచినీటి పైప్లైన్లు వేయాలని సూచించారు. ఎక్కడి నుంచైనా నీళ్లు తెచ్చుకోవడానికి, శివారు, మారుమూల ప్రాంతాలకు సైతం నీటి సరఫరాకు వీలవుతుందన్నారు. హైదరాబాద్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని సీఎం తెలిపారు. నిధుల విషయంలో వెనుకాడబోదని స్పష్టం చేశారు. భారీ వర్షాల సమయంలో వర్షపు నీరు నగర రహదారులపై నిలవకుండా జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకొని సీవరేజి, వరదనీటి కాల్వల ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. జలమండలికి రూ.100 కోట్లు విడుదల జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు తక్షణం రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. శివారు ప్రాంతాల్లో నీటి పథకాలకు జీహెచ్ఎంసీ రూ.50 కోట్లు జలమండలికి కేటాయించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి జలమండలికి రావాల్సిన బకాయిల వసూలపై అధికారులు శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జలమండలి ఎమ్డీ జగదీశ్వర్, ఈఎన్సీ సత్యనారాయణ, డెరైక్టర్లు ప్రభాకర శర్మ, కొండారెడ్డి, రామేశ్వర్రావు పాల్గొన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకానికి రూ.1600 కోట్లు జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం రెండో దశ కింద నగర శివార్లలో మంచినీటి సరఫరా నెట్వర్క్ విస్తరణకు రూ.1600 కోట్లు విడుదలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల అంగీకరించినట్టు సీఎం కేసీఆర్ జలమండలి అధికారులకు తెలి పారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విష యం చెప్పారు. ఈ నిధులతో పటాన్చెరువు, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ మున్సిపాల్టీల పరిధిలో మంచినీటి పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర నిధులు సకాలంలో అందితే ఆ ప్రాంతాలకు రాబోయే రెండేళ్లలో దాహార్తి తీరనుంది. -
మిషన్ వాటర్‌గ్రిడ్
* పనులకు ఒకేసారి అనుమతులు * ప్రాజెక్టుపై సమీక్షలో కేసీఆర్ వెల్లడి * ఇన్‌టేక్ బావులు, సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, పైపులైన్ల ఏర్పాటు వేగవంతం * ఫిబ్రవరి నుంచే సమాంతరంగా నిర్మాణ పనులు * ప్రైవేటు భూముల్లోనూ పైపులైన్లు వేసేందుకు ప్రత్యేక చట్టం.. సత్వర నిర్ణయాల కోసం సంబంధిత శాఖల కార్యదర్శులతో కమిటీ * ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం * 25 వేల జనావాసాలకు 56 నీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా 39 టీఎంసీల తాగునీరు * ప్రతి వ్యక్తికీ గ్రామాల్లో వంద, నగరాల్లో 150 లీటర్లు * పరిశ్రమల అవసరాలకూ నీటి సరఫరా: కేటీఆర్ * నీటి కేటాయింపులపై ఇరిగేషన్ శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఆటంకాలు ఏర్పడకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలన్నీ ఒకేసారి అన్ని అనుమతులను(బ్లాంకెట్ పర్మిషన్లు) ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలిక్ పనులు, ఇన్‌టేక్ వెల్స్(బావుల) నిర్మాణం, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు వంటి వాటికి ప్రభుత్వమే ఏకమొత్తంగా అనుమతులు ఇస్తుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లోనూ విద్యుత్ లైన్లు, పైపులైన్ల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. వాటర్‌గ్రిడ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 29 ప్రాంతాల్లో ఇన్‌టేక్ బావులను నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే నెలలోనే నిర్మాణం చేపట్టి వేసవిలోగా వాటిని పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ బావుల నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ను అందించే పనులను కూడా సమాంతరంగా చేపట్టాలని విద్యుత్‌శాఖ వర్గాలకు నిర్దేశించారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే నిమిత్తం సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లోని హోటల్ గ్రాండ్ కాకతీయలో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుతో పాటు అటవీ, విద్యుత్, ఆర్అండ్బీ, పురపాలక, రెవెన్యూ, నీటి పారుదల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన పనులు, అవి నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ఈ సందర్భంగా సీఎం స్పష్టతనిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని, ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు ఇవ్వడం కోసం చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును దేశంలోనే మేటిగా నిలిపేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ఆయాశాఖల మంత్రులు, ఉన్నతాధికారులు తమ కు అప్పగించిన బాధ్యతలను, చేయాల్సిన పనులను సోమవారం నుంచే ప్రారంభించాలని చెప్పా రు. ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు రాలేదన్న కారణంతో వాటర్‌గ్రిడ్ పనులను ఆపొద్దని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు తెలి పారు. అనుమతుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలను సీఎం ఆదేశించారు. రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్ చట్టం ప్రైవేటు భూముల్లోనూ పైపులైన్లు వేయడం కోసం రైట్ ఆఫ్ వే..రైట్ ఆఫ్ యూజ్(ఆర్డబ్ల్యుఆర్యూ) చట్టం తేవాలని ప్రభుత్వం భావిస్తోం దని, చట్టం అమలు కోసం ఆర్డినెన్స్ తేనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. కాగా, ఇన్‌టేక్ వెల్స్, సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రాజెక్టుల వద్ద స్థలం అప్పగించేందుకు నీటి పారుదల శాఖ సంసిద్ధత వ్యక్తం చే సింది. విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి, పంపింగ్, లిఫ్టింగ్, వాటర్ ట్రీట్మెంట్ కోసం అవసరమయ్యే విద్యుత్‌ను అందించేందుకు విద్యుత్ శాఖాధికారులు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. కరెంట్ స్తంభాల ఏర్పాటుకు కూడా రైట్ ఆఫ్ వే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కూడా ఏకమొత్తంగా అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. ఒకే ఉత్తర్వుతో అనుమతులు వస్తాయని, విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా సబ్స్టేషన్లకు ప్రత్యేక సరఫరా లైన్లు వేయాలని నిర్దేశించారు. ఇక వాటర్‌గ్రిడ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 56 నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం నిర్మించనుంది. వరంగల్ జిల్లాలోని జనగాం, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, నల్గొండ జిల్లాలోని భువనగరి, ఆలేరు, మెదక్ జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గాలకు ఎల్లంపల్లి నుంచి మంచినీటిని అందించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. గ్రిడ్‌కు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి త్వరలోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. గ్రిడ్ పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత శాఖల కార్యదర్శులతో కమిటీని వేయనున్నట్లు చెప్పారు. గర్వ పడుతున్నాం: మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 25 వేల జనావాసాలకు జీవ నదుల నుంచి సురక్షితమైన మంచినీటిని అందించే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం చేపట్టినందుకు గర్వపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 29 నీటి వనరుల నుంచి 26 సెగ్మెంట్లకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఇందుకోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా విభాగాల అధికారులకు అవగాహన కల్పించేందుకు కూడా త్వరలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల మంచినీరు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని కూడా వాటర్‌గ్రిడ్ ద్వారా అందిస్తామన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నీటి కేటాయింపులపై కసరత్తు వాటర్‌గ్రిడ్ పథకానికి నీటి కేటాయింపుల విషయమై ఆర్డబ్ల్యూఎస్ విభాగం నివేదించిన గణాంకాలపై నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోం ది. వివిధ ప్రాజెక్టుల నుంచి అందించాల్సిన నీటి లెక్కలను పరిశీలి స్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీల నీటిని ఇవ్వాలన్న ప్రతి పాదనను ఆశాఖ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్లంపల్లి నుంచి ఇప్పటికే ఎన్టీపీసీ, పరిశ్రమలు, తాగునీటి అవసరాల కోసం 8 టీఎంసీలను కేటాయించిన దృష్ట్యా వాటర్‌గ్రిడ్‌కు 3 టీఎంసీల వరకే ఇవ్వగలమని చెబుతోంది. పక్కనే ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీలు వాడుకోవచ్చునని ప్రతిపాదిస్తోంది. -
వాటర్ గ్రిడ్.. కేసీఆర్ మానస పుత్రిక
-
'కేసీఆర్ మానస పుత్రిక వాటర్ గ్రిడ్ పథకం'
హైదరాబాద్: వాటర్ గ్రిడ్ పథకం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం వాటర్ గ్రిడ్ పై జరిగిన సమీక్షా సమావేశం జరిగిన అనంతరం ఆయన మాట్లాడారు. వాటర్ గ్రిడ్ కు అన్నిశాఖల నుంచి ఒకేసారి పర్మిషన్లు కోరుతున్నామన్నారు.అందుకోసం 29 రిజర్వాయర్లు ఉపయోగిస్తున్నామన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి ద్వారి ప్రతీ ఇంటికి రక్షిత నీటి సరఫరా ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. -
పార్టీ మారడమంటే తల్లికి ద్రోహం చేసినట్లే
నల్గగొండ : బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. పార్టీ మారడమంటే తల్లికి ద్రోహం చేసినట్లేనని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. గతంలో ఇలాగే పార్టీలు మారినవారు కాలగర్భంలో కలిసిపోయారని గుత్తా వ్యాఖ్యానించారు. కాగా గుత్తా ...బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అధికారుల బదిలీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారని గుత్తా ఆరోపించారు. వాటర్ గ్రిడ్లు కుంభకోణాలకు దారి తీస్తాయని ఆయన విమర్శించారు. పైప్లైన్ల కంపెనీలను పోషించేందుకే వాటర్ గ్రిడ్ పథకం అని గుత్తా అన్నారు. స్కామ్‌ల కోసమే దగ్గర నీటిని వదిలి...వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
గిద్దలూరు నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్
అర్ధవీడు (కంభం రూరల్) : గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన కాకర్ల గ్యాప్ నుంచి తాగునీటిని అందించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు. ఇందుకుగాను 600 కోట్ల వ్యయంతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం అర్ధవీడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ రవికుమార్ యాదవ్ అధ్యక్షతన ప్రజాసదస్సు నిర్వహించారు. మండలంలోని అన్ని పంచాయతీల ప్రజలు తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాభావం వల్ల వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటున్న విషయాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాకర్ల గ్యాప్ నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పైప్లైన్లు వేసి తాగునీటిని అందించే వాటర్‌గ్రిడ్‌ను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ైరె తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన వెంటనే గ్రామాలకు తాగునీరు అందించే వాటర్‌గ్రిడ్ ను అధికారులు ప్రారంభిస్తారని చెప్పారు. నిధులను దుర్వినియోగం చేయొద్దు మండల అభివృద్ధికి మంజూరయ్యే నిధులను అధికారులు దుర్వినియోగం చేయకుండా అత్యవసర సేవలకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచించారు. మండల ప్రజలు తాగునీటి సమస్యను ఎక్కువగా ప్రస్తావించడంతో.. ఎంపీడీఓ శామ్యూల్‌తోపాటు ఇతర అధికారులపై ఆగ్రహవ వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండలానికి మంజూరైన నిధుల్లో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని చెప్పారు. యాచవరంలో 40 చెంచు కుటుంబాలు వారు ఎమ్మెల్యేను కలిసి తమకు పక్కా గృహాలు, వ్యవసాయ భూములు మంజూరు చేయించాలని కోరగా తాను జనవరి మొదటి వారంలో శ్రీశైలం ఐటీడీఏ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాగుటూరులో టీడీపీ నేత కర్ణం కాశయ్య వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాశయ్య నుంచి తమకు ప్రాణ హాని ఉందని, రక్షించాలని కోరగా.. ఎస్పీతో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ శామ్యూల్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీపీ రవికుమార్ యాదవ్, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్ ఏరువ రంగారెడ్డి, నారు అశోక్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, మొహీద్దీన్పురం సర్పంచ్ బండారు రంగారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలిరెడ్డి, అయ్యవారిపల్లి సర్పంచ్ బాలరంగాచారి, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ శామ్యూల్, రమేష్‌రెడ్డి, పశువైధ్యాధికారి హరిబాబు పాల్గొన్నారు. -
వాటర్‌గ్రిడ్‌పై నేడు సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం సమీక్షించనున్నారు. సీఎం స్వయంగా సమీక్షకు పిలవడంతో.. గ్రిడ్ నిర్మాణ బాధ్యతలను చూస్తున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ఈ పథకంపై సమాచారాన్ని సిద్ధం చేశారు. తొలుత ఉదయం 10 గంటలకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆ శాఖ మంత్రి కేటీఆర్, చివరిగా సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్‌పై అధికారులతో సమీక్షించి ప్రణాళికలకు తుది రూపు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ నెల 10న అధికారులతో జరిపిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలుపైనే ప్రధానంగా సీఎం దృష్టి సారించనున్నట్లు తెలిసింది. -
నీటి మూటలు !
జిల్లాలో తొమ్మిది వాటర్ గ్రిడ్లను నిర్మించి, నీటి ఎద్దడి తీర్చాలని భావిస్తున్న సర్కార్ వాస్తవ పరిస్థితులను విస్మరిస్తోంది. నీటి లభ్యత, నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పరిశీలిస్తే ఇది ఎంతవరకు సాధ్యమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి విభాగం నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రక్షిత మంచినీటి పథకాలను నిలిపివేసిన ప్రభుత్వం, భారీ ఖర్చుతో వాటర్ గ్రిడ్లను ఎలా నిర్మిస్తుందన్న సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యమయ్యే మార్గాలను కాలదన్ని, గాలిలో మేడలు కడుతున్నారని, జిల్లాలో నీటి లభ్యత, వాటర్ గ్రిడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు వివరాలను పరిశీలిస్తే వాస్తవపరిస్థితులు అర్థమవుతాయని అభిప్రాయపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో 2945 హేబిటేషన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికీ జాతీయ గ్రామీణాభివృద్ధి మంచినీటి కార్యక్రమం నిబంధనల కింద ప్రతీ రోజూ 55 లీటర్లు అందజేయాలి. ఈ లెక్కన ప్రస్తుతం జిల్లాలో 1089 హేబిటేషన్లలో మాత్రమే రక్షిత మంచినీరు అందించగలుగుతున్నారు. మిగతా హేబిటేషన్ల విషయానికి వస్తే... 684 హేబిటేషన్లలో ఒక్కొక్కరికీ 30 నుంచి 40 లీటర్లు, 406 హేబిటేషన్లలో 20 నుంచి 30 లీటర్లు, 387 హేబిటేషన్లలో 10 నుంచి 20 లీటర్లు, 293 హేబిటేషన్లలో 10 లీటర్ల లోపే సమకూర్చగలుగుతున్నారు. 86 గ్రామాల్లో కనీసం లీటర్ రక్షిత మంచినీటిని కూడా అందించలేని పరిస్థితులున్నాయి. ఈ లెక్కన జిల్లాలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాలో 16 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో ఎనిమిది పథకాల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. పదుల సంఖ్యలో మంజూరు దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే కొంతమేర తాగునీటి సమస్య తీరుతుంది. ఈ పనులకు రూ.300 కోట్లు అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నిర్మాణ దశలో ప్రాజెక్టులకు నిధులు నిలిపేసింది. ప్రారంభం కాని పనుల్ని ఆపేయాలని ఆదేశాలిచ్చింది. మంజూరు దశలో ఉన్న వాటి ఊసెత్తడం లేదు. దీని కంతటికీ నిధుల సమస్యే కారణమని సర్కార్ పరోక్షంగా చెబుతోంది. ఈ మార్గాన్ని వదిలేసి సర్కార్ ప్రస్తుతం ఆచరణ సాధ్యం కాని వాటర్ గ్రిడ్లపై దృష్టి సారించింది. జిల్లాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ రోజుకి 150 లీటర్ల చొప్పున, పరిశ్రమలకు 15 శాతం నీరందించేందుకు గాను రూ.3,750 కోట్లతో తొమ్మిది వాటర్ గ్రిడ్లకు ప్రతిపాదనలు రూపొందించింది. రిజర్వాయర్ల ద్వారా నీటిని సంపులు, పైపులైన్ల ద్వారా గ్రామాలకు అందించాలన్నదే వాటర్ గ్రిడ్ల లక్ష్యం. కాకపోతే అందుకు తగ్గ నీటి వనరులెక్కడున్నాయన్నది డాలర్ల ప్రశ్న. జిల్లాలో ప్రస్తుతం 10 రిజర్వాయర్లున్నాయి. వీటిలో 18 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ఇందులో 16 టీఎంసీలు ఇరిగేషన్‌కు విడుదుల చేస్తుండగా... కేవలం రెం డు టీఎంసీలను మాత్రమే ప్రస్తుతం తాగునీటి కింద విడుదల చేస్తున్నారు. అదే తొమ్మిది వాటర్ గ్రిడ్లను ఏర్పాటు చేయాలంటే 16 టీఎంసీల నీరు లభ్యం కావల్సి ఉంది. ఈ లెక్కన మరో 14టీఎంసీల నీరు అదనంగా తాగునీటి కోసం కేటాయిం చాల్సి ఉంది. ఆ మేరకు నీటి వనరులెక్కడ ఉన్నాయన్నదే ప్రశ్న. అంటే భవిష్యత్‌లో మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తే తప్ప వాటర్ గ్రిడ్స్ యోచన అమలయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకే సర్కార్ నిధులు కేటాయించడం లేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. వీటికే దిక్కులేనప్పుడు కొత్త వాటి కోసం ఆలోచించడం అత్యాశే అవుతుంది. లేదంటే పోలవరం ప్రాజెక్టు నీరు తీసుకురావల్సి ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తయితేనే మార్గం సుగమమవుతుంది. నీటి లభ్యత అన్నది ఒక సమస్యైతే వాటర్ గ్రిడ్ల కోసం రూ.3,750కోట్లు ఖర్చు పెట్టడమనేది మరో సమస్య. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టగలదా అనేది సర్కార్కే ఎరుక. అటు నీటి వనరులు, ఇటు నిధులు సమకూర్చుకోవడంపై ఆలోచన చేయకుండా తొమ్మిది వాటర్‌గ్రిడ్‌ల ప్రతిపాదన ప్రణాళిక ఎలా తయారు చేశారన్నది అంతుచిక్కడం లేదు. ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు ముందుకొస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు మోక్షం కలిగే అవకాశం లేదు. అంతవరకైనా రక్షిత మంచినీటి పథకాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
‘ఫ్లోరైడ్’జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌కు కేంద్రం నిధులు
* లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా వెల్లడి * ఎంపీ సీతారాం నాయక్ ప్రశ్నకు మంత్రి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం కింద ఫ్లోరైడ్ సమస్య ఉన్న జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని చెబుతున్నందున ఆయా ప్రాం తాల్లో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలి పారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విష యం చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, అనేకమంది శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారని సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య నుంచి ప్రజలను రక్షించడానికి వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టిందని, దీనికి కేంద్రం ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సమాధానమిస్తూ, దేశంలో సుమారు 230 జిల్లాల్లో ఈ సమస్య ఉందని తెలిపారు. రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని వివరించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్లోరోసిస్ నివారణ పథకం అమలులో ఉందని చెప్పారు. 2017 నాటికి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలన్నిటికి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తు తం 3 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ పథకం అమలులో ఉందని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో రివర్స్ ఆస్మోసిస్(ఆర్వో) విధానంలో నీటిని శుద్ధి చేస్తుందని తెలిపారు. వాటర్ గ్రిడ్క సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. -
కృష్ణానీటి సరఫరాకు.. మార్గం సుగమం
సర్కార్ నిర్ణయంతో తొలగిన అడ్డంకులు ఔటర్ లోపల జలమండలి పరిధిలోనే నీటి సరఫరా శంషాబాద్‌లో కొనసాగుతున్న ట్రయల్ రన్ వారం రోజుల్లో సరఫరా జరిగే అవకాశం! శంషాబాద్: ఔటర్ రింగురోడ్డులోపల ఉన్న శివారు ప్రాంతాల నీటి సరఫరా బాధ్యతను జలమండలి పరిధిలోనే ఉంచాలని సర్కారు తీసుకున్న నిర్ణయంతో శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరాకు మార్గం సుగమమైంది. ‘వాటర్‌గ్రిడ్’తో కృష్ణా నీటి సరఫరాకు మరింత ఆలస్యమయ్యే అవకాశాలుండడంతో ప్రభుత్వం ఔటర్‌లోపల ఉన్న గ్రామాలను వీటి నుంచి మినహాయించింది. శంషాబాద్‌కు నీటి సరఫరా చేయడానికి చెల్లించాల్సిన రూ.13 కోట్ల వన్‌టైమ్ కనెక్షన్ డిపాజిట్ ప్రక్రియను సర్కారు వేగంగా పూర్తి చేయడానికి అంగీకరించడంతో నీటి సరఫరాకు జలమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 2008 అక్టోబరులో శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరాకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 8 కోట్లతో పనులు ప్రారంభించారు. 2013లో పనులు పూర్తయ్యాయి. రాజేంద్రనగర్ సర్కిల్ దుర్గానగర్ రిజర్వాయర్ నుంచి లక్ష్మీగూడ, మామిడిపల్లి మీదుగా శంషాబాద్‌కు నీటి సరఫరాను ప్రారంభించినా రెండుమూడు రోజులకే పరిమితమైంది. జలమండలిలో నీటి కొరతతో పాటు పంచాయతీ నుంచి వన్‌టైమ్ కనెక్షన్ డిపాజిట్ కింద రూ.13 కోట్లు చెల్లించాల్సి ఉండడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. స్పందించిన సర్కారు... మండలంలోని అన్ని ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్ ద్వారా నీటిని సరఫరా చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శంషాబాద్ పట్టణం వరకు అన్ని విధాలా పనులు పూర్తయి కూడా నీటి సరఫరా జరగడం లేదని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తోడు ఔటర్‌లోపల ఉన్న ప్రాంతాలన్నింటికీ జలమండలి నుంచే నీటి సరఫరా జరగాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరాకు అడ్డంకి తొలగినట్లయింది. నాలుగైదురోజులుగా జలమండలి అధికారులు నీటి సరఫరా కోసం ఆయా సంపులను శుభ్రపర్చడంతో పాటు ట్రయల్ రన్ షురూ చేశారు. మరో వారం రోజుల్లోపు నీటి సరఫరా జరిగే అవకాశాలున్నట్లు అధికారవర్గాలు వె ల్లడిస్తున్నాయి. ఔటర్ పరిధిలో శంషాబాద్‌తో పాటు సాతంరాయి గ్రామాలు మాత్రమే ఉండడంతో ప్రస్తుతం ఈ రెండింటికే నీటి సరఫరా జరగనుంది. మిగతా 22 గ్రామపంచాయతీలు, తండాలన్నింటికీ వాటర్‌గ్రిడ్ పథకంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. -
నీటి గ్రిడ్‌పై బోర్డా.. కార్పొరేషనా?
* సందిగ్ధంలో తెలంగాణ ప్రభుత్వం * కార్పొరేషన్ అయితే 12.5% సర్వీసు ట్యాక్స్ చెల్లించాలి * బోర్డు ఏర్పాటు చేస్తే నిధుల సమీకరణకు ఇబ్బంది * దీని అధ్యయన బాధ్యతలు ఇక్రా సంస్థకు అప్పగింత * పథక నిర్వహణ వ్యయం ఏటా 1,200 కోట్లు! * కోటికిపైగా కుటుంబాలకు తాగునీటి మహాయజ్ఞం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకం పూర్తయిన తరువాత నిర్వహణ వ్యయం భారీగా ఉండబోతోంది. ప్రతి సంవత్సరం రూ.1,200 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై ప్రభుత్వం ఇప్పుడే దృష్టి పెట్టింది. అదేవిధంగా గ్రిడ్ నిర్వహణకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలా... లేక బోర్డునా.. అనేది ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేయడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. ఇప్పుడు దానిపై పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తే.. సర్వీసు చార్జీ కింద 12.5 శాతం అనవసరంగా పన్నులు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ మాదిరిగా బోర్డు ఏర్పాటు చేయడం మంచిదనే అభిప్రాయం వస్తోంది. అలా చేస్తే గ్రిడ్‌కు అవసరమైన నిధుల సమీకరణ కష్టమవుతుందన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ‘ఇక్రా’ అనే సంస్థకు ఈ అధ్యయన బాధ్యత అప్పగించినట్లు సమాచారం. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలన్న యోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. 26 వాటర్ గ్రిడ్ల నుంచి అన్ని గ్రామాలకు పైపులైన్‌తో మంచినీటి సరఫరా చేయడానికిగాను తొలిదశలో ఆరు గ్రిడ్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే కార్యక్రమాలు సాగుతున్నాయి. కాగా, వాటర్‌గ్రిడ్ పథకం కోసం కనీసం 300 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ఒక వ్యక్తికి 30 నుంచి 40 లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. 40 శాతం గృహాలకే పైపులైనుతో నీటి సరఫరా జరుగుతోంది. వాటర్ గ్రిడ్ పూర్తిచేసి అన్ని గ్రామాలకు వందశాతం మేరకు పైపులైనుతో నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం గ్రామాల్లో మంచినీటి సరఫరా, చేతి పంపుల మరమ్మతులు తదితరాల కోసం 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.300 కోట్లు గ్రాంట్ల రూపంలో జడ్పీలు, మండలాలు, గ్రామ పంచాయతీలకు అందుతోంది. వాటర్ గ్రిడ్ పథకం పూర్తయ్యాక ఈ నిర్వహణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుతుందా... లేదా.. అన్నది ప్రశ్నార్థకమే. నిర్వహణ వ్యయం భారీగా పెరగడం వల్ల ఆ మేరకు ప్రజల నుంచి చార్జీల రూపంలో భారీ వసూళ్లు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం నెలనెలా గ్రామాల్లో 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది మూడింతలయ్యే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
మీ చెమట చుక్కలే.. ప్రజలకు నీటి చుక్కలు
‘వాటర్‌గ్రిడ్’పై అధికారులతో సీఎం కేసీఆర్ 17 ఏళ్లకిందే సిద్దిపేటలో చేయగలిగింది.. ఇప్పుడు చేయలేమా?... రేయింబవళ్లు కష్టపడైనా ప్రాజెక్టును విజయవంతం చేయాలి ‘వాటర్‌గ్రిడ్’ను దేశానికే ఆదర్శంగా నిలుపుదామని పిలుపు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/హైదరాబాద్: ‘‘అందరూ అసాధ్యమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసుకున్నం. అలాగే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతం చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుదాం. ఇందుకు ప్రతి అధికారి అర్జునుడిగా మారాలి. అధికారులంతా చెమట చుక్కలు రాలిస్తేనే.. ప్రజలకు కాసిన్ని మంచినీటి చుక్కలు అందుతాయి..’’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు 1997లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమగ్ర మంచినీటి పథకమే మూలమని సీఎం చెప్పారు. బుధవారం సిద్దిపేటకు వచ్చిన రాష్ట్ర మంత్రులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ అవగాహన కల్పించారు. సిద్దిపేటలో నీటి ప్రాజెక్టు పనులను 16 నెలల్లో పూర్తి చేయడంలో తాము అనుసరించిన పద్ధతులను సీఎం వివరించారు. 185 గ్రామాలకు నిరంతర సరఫరా.. సిద్దిపేటలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తనతో పాటు ఇంజనీర్లు ఎంతో శ్రమించి మంచినీటి ప్రాజెక్టును పూర్తి చేశామని కేసీఆర్ చెప్పారు. అందులో 90 శాతం తన ప్రణాళిక (డిజై న్)తోనే జరిగిందని, ఇందుకోసం తాను 37 సార్లు లోయర్ మానేరు డ్యామ్‌ను సందర్శించానని తెలిపారు. సిద్దిపేట నుంచి 145 గ్రామాలకు నీటి సరఫరాకు రూపకల్పన చేయగా.. ప్రస్తుతం 185 గ్రామాలకు నీరందుతోందని సీఎం చెప్పారు. ‘‘రెండు దశాబ్దాలనాడు సిద్దిపేటలో అప్పటి ఇంజనీర్లు చేయగా లేనిది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రమంతటా నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేయలేమా..?’’ అని అధికారులతో సీఎం వ్యాఖ్యానించారు. ‘మినిమం డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్)’ నుంచి ప్రతి నీటిబొట్టును గుట్టమీదకి చేర్చి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా పరిసర గ్రామాలకు నీరందించడమే వాటర్‌గ్రిడ్ లక్ష్యమన్నారు. అన్ని జిల్లాలో ఇంజనీర్లు తమ జిల్లాలోని కాంటూర్లపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆయా జిల్లాల్లో కాంటూర్ల వివరాలతో ప్రభుత్వం రూపొందించిన పుస్తకం ప్రతి ఇంజనీర్ జేబులో ఉండాలని స్పష్టం చేశారు. సదుపాయాలు కల్పిస్తాం.. వాట ర్‌గ్రిడ్ బాధ్యతలను తీసుకున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బందికి ఐపాడ్లు, ల్యాప్‌ట్యాప్‌లు తదితర అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. కాంట్రాక్టర్లకు కూడా అడ్వాన్సులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అధికారుల కాలికి ముల్లుగుచ్చుకుంటే.. పంటితో పీకేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... రాత్రింబవళ్లు కష్టపడైనా సరే ప్రాజెక్టును విజయవంతం చేయాల్సిన బాధ్యత వారిదేనని సీఎం పేర్కొన్నారు. మంత్రులకు అవగాహన కల్పించిన సీఎం బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు కరీంనగర్‌లోని మానేర్ డ్యాంను సందర్శించారు. అక్కడ నీరు తోడే పద్ధతి, 395 మీటర్ల ఎత్తులో ఉన్న మైలారం గుట్టపైకి లిఫ్టు చేసే విధానాన్ని చూపించారు. అనంతరం సిద్దిపేట ఫిల్టర్‌బెడ్‌లో శుద్ధి అయిన నీరు సమీప గ్రామాలకు సరఫరా అవుతున్న తీరును చూపారు. సిద్దిపేటలో రూ.4.8 కోట్లతో కోమటి చెరువు ఆధునీకరణ పనులకు, రూ. 2 కోట్లతో టూరిజం శాఖ చేపట్టిన సుందరీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కాగా వాటర్‌గ్రిడ్ బాధ్యతలను నిర్వహించే ఆర్డబ్ల్యూఎస్ విభాగం మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే ఉన్నా.. ఆయన ఈ కార్యక్రమాలకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే కొద్దిపాటి అస్వస్థత కారణంగా కేటీఆర్ రాలేకపోయారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. -
నా శ్రమ వృథా కాలేదు
సిద్దిపేట తాగునీటి సరఫరా పథకాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రమంతటా వాటర్‌గ్రిడ్ పథకం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్ల బృందంతో కలిసి బుధవారం బెజ్జంకి మండలం హన్మాజీపల్లికు వచ్చిన సీఎం సిద్దిపేటకు తాగునీరు సరఫరా చేస్తున్న ఇంటెక్ వెల్ కం పంప్‌హౌస్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్వయంగా తాగునీటి సరఫరా పథకం నిర్మాణానికి తాను పడిన శ్రమ, దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలను అధికారులకు వివరించారు. ‘సిద్దిపేటకు నీళ్లందించే ఈ పథకం కోసం నేనెంతో కష్టడిన. రెండ్రోజులు సర్వే చేయించా. సాంకతిక అంశాలు మినహా ఈ పథకాన్ని డిజైన్ చేసింది కూడా నేనే. ఇక్కడికి రావడానికి అప్పుడు సరైన దారి కూడా లేదు. మనుషులే కాదు, పశువులు కూడా తిరగని అటవీ ప్రాంతమిది. ఇక్కడినుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటకు గ్రావిటీ ద్వారా నీళ్లెట్ల తీసుకుపోవాల్నా అని ఆలోచించి ఒకరోజు అందరూ వద్దని చెప్పినా మొండిగా దగ్గర్లో ఉన్న గుట్టపైకి నడుచుకుంటూ పోయిన. అక్కడే రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్న. ఆరోజుల్లో ఇంత టెక్నాలజీ కూడా లేకుండే. ఇంటెక్వెల్ కం పంప్‌హౌస్, పైప్లైన్ల నిర్మాణానికి, గుట్టలపై రిజర్వాయర్ల ఏర్పాటుకు ఎంతో కష్టపడినం. అప్పటినుంచి 32 సార్లు ఈడికొచ్చిన. నాడు నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో తుపాకుల నడుమ వీటిని నిర్మించాల్సి వచ్చింది. పక్కనే ఉన్న మైలారంగుట్టపైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఎత్తున నిర్మించడమే దీని ప్రత్యేకత. ఆనాడు నేనుపడిన శ్రమ వృథా కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలోని 180 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నేటికీ నిరంతరాయంగా తాగునీటిని అందించగలుగుతున్నాం’ అని పేర్కొన్నారు. ఇంటెక్వెల్ కం పంప్‌హౌస్ నిర్మాణం గురించి వివరిస్తూ ‘డెడ్‌స్టోరేజీ లెవెల్లోనూ నీటిని సరఫరా చేసేలా పంప్‌హౌస్‌ను నిర్మించినం. కాలం కలిసిరాకపోయినా చివరి నీటి చుక్క వరకు పంపింగ్ చేసేలా తీర్చిదిద్దనం. దీనిని రోల్ మోడల్‌గా తీసుకుని వాటర్‌గ్రిడ్ పథకాన్ని మరింత సమర్ధవంతంగా రూపొందించండి. అందుకోసం ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోండి. పంప్‌హౌస్‌కు వెళ్లే దారి కనీసం 15 అడుగుల వెడల్పు ఉండేలా చర్యలు తీసుకోండి. ఎందుకంటే పంప్‌హౌస్‌కు వినియోగించే మోటార్లు అత్యంత బరువైనవి. ఏదైనా రిపేర్ వస్తే క్రేన్ ద్వారా డీసీఎంలోకి మార్చాల్సి ఉంటుంది. ఆరోజు ఈ ఆలోచన రాకపోవడం వల్ల పంప్‌హౌస్‌కు వెళ్లే దారిని ఇరుకుగా నిర్మించినం. మోటార్లు రిపేర్‌కు వచ్చినప్పుడు వాటిని తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఇబ్బంది అవుతోంది’ అని పేర్కొన్నారు. అనంతరం తాగునీటి సరఫరా, సాంకేతిక అంశాల గురించి సిద్దిపేట గ్రామీణ నీటిసరఫరా డీఈ నాగేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఉద్దేశించి ‘ఈ పథకంపై మీకు పూర్తి అవగాహన కలిగిందా?’ అని ప్రశ్నించారు. వారు లేవనెత్తిన సందేహాలనూ నివృత్తి చేశారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, సీఎం సహాయ కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎస్పీ శివకుమార్, పలువురు నీటిపారదల ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. కేటీఆర్ మినహా మంత్రులంతా రాక సిద్దిపేట తాగునీటి సరఫరా పథకాన్ని పరిశీలించేందుకు పలువురు రాష్ట్ర మంత్రులు బుధవారం హన్మాజీపల్లికి వచ్చారు. ఉదయం 11.30 గంటలకు మంత్రుల బృందం అక్కడికి వచ్చింది. జిల్లా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మినహా మిగిలిన మంత్రుల బృందమంతా అక్కడికి వచ్చింది. ఉప ముఖ్యమంత్రులు టి.రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, జోగు రామన్నతోపాటు శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి వీరిలో ఉన్నారు. వీరంతా ఇంటెక్వెల్ కం పంప్హౌస్వద్దకు వెళ్లి పథకాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత అందరూ కలిసి ఒకే బస్‌లో సిద్దిపేటకు వెళ్లిపోయారు. మంత్రుల బృందం వెళ్లిన ముప్పావు గంటకు ఈటెల రాజేందర్, సీఎంవో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో అక్కడికి వచ్చారు. సీఎం అసహనం ఉదయం 11.45 గంటలకు రావాల్సిన సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12.40గంటలకు హన్మాజీపల్లె చేరుకున్నారు. సీఎం హెలికాప్టర్ దిగిన వెంటనే అక్కడున్న టీఆర్ఎస్ మహిళా నాయకులు తోసుకువచ్చే ప్రయత్నం చేయగా వారిపై కసరుకున్నారు. ‘‘మీకు ఇక్కడేం పని. ఎందుకొచ్చారు? ఇది అధికారులకు సంబంధించిన కార్యక్రమమని తెలుసు కదా! అధికారుల కార్యక్రమానికి ఆటంకం కాదా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడికి ఇంజనీర్లు రాకపోవడంతో ‘‘చీఫ్ ఇంజనీర్లు యాడున్నరు?’’ అని పక్కనే ఉన్న వారిని అడిగారు. పంప్‌హౌస్ సమీపంలోని టెంట్ వద్ద ఉన్నారని అధికారులు బదులివ్వడంతో ‘‘ఆడ కూసుంటే ఎట్లా? ఈడికి వచ్చిన పని గుర్తులేదా? వెంటనే పిలవండి. పంప్‌హౌస్ దగ్గరకు ఎమ్మెల్యేలు, అధికారులు మినహా నాయకులను ఎవరినీ రానీయకండి’’ అని ఆదేశించారు. అధికారులపై రసమయి ఫైర్ సాంస్కృతిక వారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అధికారులపై మండిపడ్డారు. ఇంటెక్ వెల్ కం పంప్‌హౌస్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఒకరిద్దరు మంత్రులు ఫొటోలు ఉండటాన్ని గమనించిన బాలకిషన్ ‘‘మంత్రులందరూ ఇక్కడికి వస్తున్నారని మీకు తెలుసు కదా.. మిగిలిన మంత్రుల ఫొటోలు ఎందుకు పెట్టలేదు? ఇదేం పద్దతి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాసేపు అధికారులతో వాగ్వాదానికి దిగారు. -
శివార్లకు జలసిరి
* వాటర్‌గ్రిడ్‌తో పుష్కలంగా నీటి సరఫరా * ప్రణాళిక సిద్ధం చేస్తున్న జలమండలి * త్వరలో సీఎం సమక్షంలో కీలక భేటీ సాక్షి, సిటీబ్యూరో: రాజధానికి కూత వేటు దూరంలో ఉన్నా.. గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న 70 గ్రామాల ప్రజలకు శుభవార్త.. ఇకనుంచి ఆయా గ్రామాల వారికి నీరు పుష్కలంగా సరఫరా కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుంది . దీనికోసం జలమండలి బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు భారీ రేడియల్ మెయిన్స్, ట్రంక్‌మెయిన్స్ పైప్‌లైన్ నెట్వర్క్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన జలమండలి శివార్లపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సుమారు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి మహానగర వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అంచనాలు సిద్ధంచేసిన విషయం విదితమే. ఈ గ్రిడ్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో త్వరలో కీలక భేటీ జరగనున్నట్టు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. తీరనున్న దాహార్తి... గ్రేటర్‌కు ఆనుకొని ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న సుమారు 70 గ్రామ పంచాయతీలకు రింగ్‌మెయిన్ పైప్‌లైన్స్ నుంచి నీటిని తరలించనున్నారు. గ్రేటర్లో విలీనమైన శివారు మున్సిపాలిటీల పరిధిలోనూ జనం దాహార్తిని తీర్చేందుకు గ్రిడ్‌లో ప్రాధాన్యమిస్తున్నారు. శేరిలింగంపల్లిలో 70 శాతం ప్రాంతాలకు, రాజేంద్రనగర్‌లో 55 శాతం, కుత్బుల్లాపూర్‌లో 50, మల్కాజ్‌గిరిలో 35 శాతం, కూకట్‌పల్లిలో 30, ఉప్పల్‌లో 20, ఎల్బీనగర్లో 20, కాప్రాలో 80, అల్వాల్‌లో 70 శాతం ప్రాంతాలకు ఈ గ్రిడ్‌ద్వారా దాహార్తిని తీర్చే సదవకాశం రానుంది. ఆయా ప్రాంతాల్లో మంచినీటి పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణానికి ఈ గ్రిడ్ పథకంలో స్థానం కల్పించడం విశేషం. ఇదీ గ్రిడ్ స్వరూపం.. విశ్వనగరంగా అవతరించనున్న గ్రేటర్లో రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ మంజూరు చేసేందుకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని రూపొందించారు. సుమారు కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రిడ్ ఏర్పాటుకానుంది. ఇందుకు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపితే పథకం పనులు మొదలుకానున్నాయి. గ్రిడ్‌కు సంబంధించిన ప్రాథమిక కసరత్తును జలమండలి పూర్తిచేసింది. ఇందుకోసం ఓ మాస్టర్‌ప్లాన్ ప్రణాళిక చిత్రపటాన్ని కూడా రూపొందించింది. ఈ గ్రిడ్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన రేడియల్ మెయిన్లు, ట్రంక్‌మెయిన్స్, ప్రెజర్మెయిన్స్, నెట్వర్క్ పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, గ్రావిటీ ఆధారంగా నీటిసరఫరా తదితర అంశాలపై సమగ్ర డిజైనింగ్, డ్రాయింగ్లు పూర్తిచేసే సాంకేతిక పనులను ప్రముఖ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. గ్రిడ్ అంచనాలివే.. సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో 2021 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభా, ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమల విస్తరణ, పారిశ్రామికీకరణ అవసరాలకు వినియోగించే నీటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చేపట్టబోయే వాటర్‌గ్రిడ్ పనులు-వాటి అంచనా వ్యయాలిలా ఉన్నాయి. -
రూ.5831 కోట్లతో వాటర్‌గ్రిడ్
పల్లెలు, పట్టణాలు, నగరాల్లో తాగునీటి సమస్య శాశ్వత నివారణకు ప్రభుత్వం తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి ప్రణాళిక సిద్ధమైంది. రూ.5,831 కోట్ల వ్యయంతో జిల్లాలో ఏడు గ్రిడ్ల ద్వారా ప్రతీ ఇంటికి నల్లానీరు అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. మన జిల్లాతోపాటు వరంగల్, నల్గొండ జిల్లాల్లోని పలు మండలాలను కలుపుకుని రూపొందించిన ఈ గ్రిడ్ సర్వే పనులు మొదలయ్యాయి. కరీంనగర్ సిటీ/కోనరావుపేట : ముఖ్యమంత్రిగా తొలిసారి జిల్లాకు వచ్చిన కేసీఆర్, రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. సెంటిమెంట్‌గా అచ్చొచ్చిన కరీంనగర్లో ఈ పథకాన్ని ప్రకటిస్తున్నానని, తన హయాంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకం ఇదేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మొదటి ప్రాధాన్యతగా సిరిసిల్ల-వేములవాడ-చొప్పదండి గ్రిడ్‌ను ఎంచుకొన్నారు. ఈ గ్రిడ్‌కు సంబంధించిన సర్వే ప్రస్తుతం కొనసాగుతోంది. మరో 20 రోజుల్లో ఈ సర్వే పూర్తి చేసి, టెండర్ పిలిచే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ఈ గ్రిడ్ పరిధిలోని ప్రజలకు నీటిని అందజేయనున్నారు. ఒక్కో మండలంలో రెండు నుంచి మూడు బృందాలు సర్వే చేస్తున్నాయి. గ్రామంలో, ఇంటింటికీ పైప్‌లైన్, రిజర్వాయర్ స్టోరేజీ ప్రాంతాలను సర్వే చేస్తున్నారు. ముస్తాబాద్‌లో గురువారం హైదరాబాద్‌కు చెందిన పల్లవి సర్వేయర్స్ కంపెనీ ఇంజినీర్లు జీపీఎస్ ద్వారా శాటిలైట్ సర్వే చేపట్టారు. వేములవాడ మండలం తెట్టకుంట, మారుపాక శివారులోని 25 ఎకరాల ప్రభుత్వ భూమిని వాటర్‌గ్రిడ్ కోసం ఆర్డీవో భిక్షానాయక్ గురువారం పరిశీలించారు. సర్వేకు రీ టెండర్ మిగతా ఆరు గ్రిడ్లకు సంబంధించిన సర్వే చేపట్టేందుకు రీటెండర్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకుముందు నిర్వహించిన టెండర్లో ఇద్దరు పాల్గొన్నా... వారికి అర్హత లేకపోవడంతో వాయిదా వేశారు. త్వరలోనే రీటెండర్ పిలిచి సర్వే పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వనరుల ఎంపిక వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ఏడు గ్రిడ్లకు నీటిని అందించేందుకు వనరులను ఎంపిక చేశారు. జిల్లాలోని ఎస్సారెస్పీ, మధ్యమానేరు, ఎల్ఎండీ, ఎల్లంపల్లి, గోదావరి నుంచి నీటి సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కనిష్టంగా కరీంనగర్ గ్రిడ్ ఉండగా, హుస్నాబాద్, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండం గ్రిడ్లు గరిష్టస్థాయిలో ఉన్నాయి. కోరుట్ల-జగిత్యాల నియోజకవర్గాలకు సంబంధించి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయనున్నారు. సిరిసిల్ల-వేములవాడ-చొప్పదండి నియోజకవర్గాలకు మధ్యమానేరు నుం చి, హుజూరాబాద్, కరీంనగర్‌లకు ఎల్ఎండీ నుంచి, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురిలకు ఎల్లంపల్లి, కాళేశ్వరం గ్రిడ్‌కు గోదావరి నుంచి నీటిని సరఫరా చేయనున్నారు. ఈ పథకంలో మన జిల్లాతోపాటు వరంగల్, నల్గొండ జిల్లాల్లోని పలు మండలాలకు కూడా ఇక్కడినుంచే నీటిని అందించనున్నారు. హుస్నాబాద్-మానకొండూరు గ్రిడ్‌లో జిల్లాలోని 8 మండలాల తోపాటు వరంగల్ జిల్లాలోని 10 మండలాలు, నల్గొండ జిల్లాలోని 3 మండలాలకు నీరందనుంది. హుజూరాబాద్ గ్రిడ్ నుంచి కూడా వరంగల్‌లోని ఐదు మండలాలకు నీటిని సరఫరా చే సేలా ప్రతిపాదనలు రూపొందించారు. మహదేవపూర్, మహాముత్తారం, కాటారం, మల్హర్ మండలాలకు కాళేశ్వరం గ్రిడ్ నుంచి నీరందించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇంటింటికీ తాగునీరు గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న నీటి వనరులతో కొన్ని దళితవాడలకు, గిరిజన తండాలకు సరిపడా నీరందడం లేదు. ఈ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి సుమారు 20 నుంచి 40 లీటర్ల నీరు మాత్రమే అందుతోందని ప్రభుత్వం అంచనా వేసింది. వాటర్‌గ్రిడ్ పథకం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ మనిషికి 100 లీటర్లు అందించనున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ నీటి ఇబ్బందులు ఎక్కువే ఉన్నాయి. మున్సిపాలిటీల్లో నిత్యం నీటి సరఫరా జరగాల్సి ఉన్నా ఎక్కడా చేయడం లేదు. రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికీ నిత్యం తాగునీరందించాలని నిర్ణయించారు. పథకం పూర్తయితే పట్టణ ప్రాంతాల్లో ప్రతీ మనిషికి 135 లీటర్లు అందించనున్నారు. -
‘గ్రిడ్’ సంగతేంటి?
‘ఔటర్’ చుట్టూ సాధ్యం కాదు సాంకేతికంగా సమస్యలు ప్రత్యేక భూ సేకరణే మేలు హెచ్ఎండీఏ అభ్యంతరాలు సిటీబ్యూరో: ప్రభుత్వం ఓ కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చిందంటే ఏం చేయాలి? సంబంధిత అధికారులు సాధ్యాసాధ్యాలపై సరైన నివేదికలివ్వాలి. భవిష్యత్తు పరిణామాలనూ ఊహించగలగాలి. అందుకు తగ్గట్టుగా సక్రమంగా దిశా నిర్దేశం చేయాలి. అలా కాకుండా ఏలికల మెప్పు కోసం ప్రయత్నిస్తే ఏమవుతుంది? కొత్త వివాదాలకు... ‘వాటర్ గ్రిడ్’ ఏర్పాటుకు ఇటీవల జలమండలి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇలాగే ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగరం చుట్టూ ‘వాటర్ గ్రిడ్’ను నిర్మించాలని నిర్ణయించింది. నివేదిక రూపొందించాలని జ ల మండలిని ఆదేశించింది. సంబంధిత అధికారులు ప్రాథమికంగానైనా సర్వే చేయకుండానే ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని చుట్టూ 160 కి.మీ. మేర వాటర్ గ్రిడ్ (ట్రంక్ లైన్)ను ప్రతిపాదిస్తూ నివేదిక సిద్ధం చేశారు. ఔటర్ వెంట వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యమేనా? క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? తగినం త భూమి ఉందా? అన్న విషయాలపై హెచ్ఎండీఏతో సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నా యి. ఇది ఇరు విభాగాల మధ్య వివాదాలకు ఆజ్యం పోసినట్టయింది. ఔటర్ చుట్టూ తమకు 4 మీటర్ల మేర స్థలం కేటాయిస్తే చాలని... గ్రిడ్ ఏర్పాటు చేస్తామని జలమండలి అధికారులు ఇటీవల సీఎం వద్ద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఔటర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డును కలుపుతూ ప్రతిపాదించిన 33 రేడియల్ రోడ్ల వెంట పైపులైన్లు వేసి నగరమంతటికీ నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. అది కష్టమే ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని చుట్టూ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించనందున ఇతర నిర్మాణాలకు వీలు లేదని, ప్రత్యేకించి పైప్‌లైన్‌ను నిర్మిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘నిజానికి ఔటర్ ప్రధాన రహదారిని ఆనుకొని అవసరాల కోసం ఇరువైపులా 4 మీటర్ల మేర స్థలమే విడిచిపెట్టాం. ఇందులో ఎలక్ట్రికల్, టెలిఫోన్ కేబుళ్లతో పాటు గ్యాస్ పైపులైన్లకే అవకాశం ఉంది. దానిపక్కనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ (రైల్ కారిడార్) కోసం 25 మీటర్ల మేర స్థలం కేటాయించాం. ఆ రెండింటి మధ్యలో (యుటిలిటీస్ ప్రాంతంలో)వాటర్ పైపులైన్ వేస్తే భవిష్యత్‌లో మరిన్ని అనర్థాలకు దారితీస్తుంది. విద్యుత్ అంతరాయంతో పైపులైన్లో తరచూ జరిగే హెచ్చుతగ్గుల వల్ల ఒక్కోసారి పైపు పగిలి బ్లో అవుట్ మాదిరిగా నీరు ఎగజిమ్మే ప్రమాదం ఉంది. దీనివల్ల ఔటర్ ప్రధాన మార్గానికి నష్టం వాటిల్లడమే గాక, పక్కనే ఉన్న రైల్ కారిడార్‌కు కూడా ప్రమాదం వాటిల్లుతుంది. ఇది ప్రాణ నష్టానికి కూడా దారి తీయవచ్చు’ అని ఓఆర్ఆర్ అధికారులు చెబుతున్నారు. కృష్ణా నీటిని నగరానికి తెచ్చే క్రమంలో పైపులైన్‌ను ఇబ్రహీంపట్నంను బైపాస్ చేసి శెరిగూడ మీదుగా బొంగుళూరు వద్ద ప్రధాన రహదారికి కలిపారు. దీనివల్ల దూరంతో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గింది. ఇదే విధానాన్ని వాటర్ గ్రిడ్ విషయంలో అనుసరించాలని అంటున్నారు. భవిష్యత్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ కోసం ప్రత్యేకంగా భూమిని సేకరించి పైపులైన్ వేస్తే మేలని హెచ్ఎండీఏ అధికారులు సూచిస్తున్నారు. ఇదీ నిర్వాకం నగర శివారులోని బొంగుళూరు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు (నెం.25) వరకు రేడియల్ రోడ్డును అద్భుతంగా నిర్మించారు. ఆ మార్గంలో బి.ఎన్.రెడ్డి నగర్ వరకు మంచినీటి పైపులైన్ కోసం జ లమండలి తవ్వకాలు జరిపింది. ఫలితంగా ఆ రోడ్డు అధ్వానంగా తయారైంది. పైపులైన్ వే శాక ప్రమాణాల మేరకు పూడ్చకపోవడంతో రో డ్డు దిగబడిపోయి దారుణంగా తయారైంది. జలమండలి దీన్ని పట్టించుకోలేదని... ఔటర్‌ను ఆనుకొని పైపులైన్ వేసేందుకు అనుమతిస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్ హై వేకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్ఎండీఏ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ పంచాయతీ త్వరలో సీఎం వద్దకు వెళ్లనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. -
ఏప్రిల్‌దాకా ఉద్యోగుల బదిలీలుండవు
స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ వరకు ఉద్యోగులు, ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, హరితహారం, ఆహార భద్రతాకార్డుల మంజూరు, రహదారుల నిర్మాణం వంటి ప్రధాన కార్యక్రమాలు డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉన్నందున.. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఎక్కడికీ బదిలీ చేయబోమని, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాలపైనే దృష్టి కేంద్రీకరించాలని సీఎం ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టతనిచ్చారు. ఏప్రిల్ వరకు బదిలీల గురించి ఆలోచించవద్దని చెప్పినట్లు ఓ ఉన్నతాధికారి వివరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తరువాత సిబ్బంది కాని, ఉన్నతాధికారుల బదిలీలుకాని పెద్ద ఎత్తున చేపట్టని విషయం తెలిసిందే. ఇదివరలో ఒకే దఫాలో 99 మంది డీఎస్పీల బదిలీలు, ప్రారంభంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు మినహా,, రాష్ట్ర కేడర్లోకాని, దిగవస్థాయిలోకాని అధికారుల బదిలీలను పెద్దఎత్తున చేపట్టలేదు. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ జీరో అవర్ ఆరంభించారు. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్దరణపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరంలో పరిశ్రమలకు ఉపయోగపడే భూములున్నాయని, అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న విషయం తెలిసిందే. -
నేటితో ముగియనున్న టీ.అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సభలో మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్‌పై ప్రకటన చేయనున్నారు. సభలో మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్‌పై ప్రత్యేక చర్చ జరగనుంది. ఇక శాసనమండలి సమావేశాలు నిన్నే నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. -
వాటర్ గ్రిడ్‌కు నిధులు కేటాయించాలి: వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్రం నిధులు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు, అందరికీ ఆహారం కోసం పది శాతం నిధులు, అలాగే జాతీయ గ్రామీణ తాగునీటి పథకానికి పది శాతం నిధులు ఇస్తోందని, దీనిని పెంచే ఉద్దేశం ఏదైనా ఉందా అని వినోద్ ప్రశ్నించగా.. మంత్రి అలాంటి ప్రతిపాదనేదీ లేదన్నారు. అనంతరం వినోద్ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్‌కు నిధులు కేటాయించాలని కోరారు. -
నిపుణులను నియమించుకోండి
సాక్షి, హైదరాబాద్: వాటర్ గ్రిడ్ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు అని, దీని పనుల కోసం జాతీయస్థాయిలో ప్రకటనలు ఇచ్చి నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారకరామారావు అధికారులకు సూచించారు. అవసరమైతే ప్రైవేటు సెక్టార్ నుంచి సిబ్బందిని తీసుకోవాలన్నారు. మంగళవారం ఆయన గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పనులను వేగవంతం చేసేందుకు ఈ విభాగంలో ఖాళీగా ఉన్న 592 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రాజెక్టులో పనిచేయనున్న అధికారులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణనిచ్చి, ప్రాజెక్టు ప్రాధాన్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వాటర్‌గ్రిడ్ లైన్ సర్వే వివరాలు త్వరలోనే అందనున్నాయని, ప్రాజెక్టు నిమిత్తం అవసైరమెన ప్రాంతాల్లో భూసేకరణ వివరాలను ఒకట్రెండు రోజుల్లో అందజేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు స్థితిగతులపై తనతో పాటు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారని మంత్రి తెలిపారు. డిసెంబర్లో పైలాన్ ఆవిష్కరణ మొదటి దశలో చేపట్టనున్న ఆరు గ్రిడ్ల కోసం జనవరి 30నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, ఫిబ్రవరి 10 నుంచి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్లో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పైలాన్‌ను మునుగోడులో సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. -
మునుగోడు తీరినట్టే!
ఇక.. ఫ్లోరైడ్ బాధలకు చెక్ మునుగోడు నియోజకవర్గం నుంచే వాటర్‌గ్రిడ్ పథకం డిసెంబర్లో పైలాన్‌ను ఆవిష్కరించనున్న సీఎం జనవరి మొదటివారంలో ప్రారంభం కానున్న పనులు నీటి సరఫరా విభాగం అధికారుల సమీక్షలో నిర్ణయించిన కేసీఆర్ చౌటుప్పల్ ఎన్నికల ముందు ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి, ప్రజలకు రక్షిత జలాలను అందిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ ఎస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కరువు కాలంలో నీటి కొరత లేకుండా ప్రజలకు అవసరమైన నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి, రాష్ట్రంలోనే అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టనుంది. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో శనివారం నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు. మునుగోడులో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఏర్పాటుకు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ మాసంలో కేసీఆర్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. జనవరి మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పనులు ప్రారంభం కానున్నాయి. నేటికీ అందని రక్షిత జలాలు.. రాష్ట్రంలోనే అత్యంత ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతంగా జిల్లా గుర్తింపు పొందింది. డెబ్బైఏళ్లుగా ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా జిల్లావాసులకు తాగేందుకు రక్షిత జలాలు కరువయ్యాయి. నేటికీ సగం మంది విషపు నీటినే తాగుతున్నారు. దాదాపు 5లక్షల మంది బాధితులు ఫ్లోరైడ్ వ్యాధితో సతమతమవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉంది. సాధారణంగా నీటిలో ఫ్లోరైడ్ శాతం 0.5పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) ఉండాల్సి ఉండగా, ఇక్కడ లభించే నీటిలో 16నుంచి 18పీపీఎం వరకు ఉంది. ఫలితంగా ఈ నీటిని తాగిన జనం జీవచ్ఛవాలుగా మారిపోయారు. చేతులు, కాళ్లు వంకర్లు పోయాయి. నడవలేరు. వంగలేరు. నేలపై పడుకోలేరు. 5లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులు జిల్లాలో దాదాపు 5లక్షల మంది ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందులో సుమారు 4లక్షల మంది 1 - 18 ఏళ్ల వయస్సున్న వారు ఉన్నారు. సుమారు 75వేల మందికిపైగా పూర్తి స్థాయిలో ఫ్లోరైడ్ భారిన పడి నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1900 నివాస ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో ప్రస్తుతం 1180గ్రామాలకు మాత్రమే కృష్ణా జలాలను అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకా, 700లకుపైగా ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు రక్షిత నీటికోసం ఎదురు చూస్తున్నాయి. సుమారు 400పైచిలుకు గ్రామాల్లో కృష్ణాజలాలను అందించేందుకు పైపులైను పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజలకు రక్షిత జలాలను అందించాలనే లక్ష్యంతో వాటర్‌గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ముద్రపడ్డ మునుగోడులోనే వాటర్‌గ్రిడ్ పైలాన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనవరి మాసంలో పనులు ప్రారంభం కానున్నాయి. తాగుజలాలను కూడా ఫ్లోరైడ్ రహిత నీటినే అందించాలని తలంపుతో ఉన్న ప్రభుత్వం కృష్ణా నది నుంచి పాకాల-జూరాల ప్రాజెక్టును కూడా మునుగోడు నియోజకవర్గం మీది నుంచే వరంగల్‌లోని పాకాల చెరువు వరకు చేపట్టనుంది. నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపడితే, కృష్ణాజలాలు సాగుజలాలుగా అందనున్నాయి. -
ఆశలకూ, ఆచరణకూ లంగరు అందేనా?
త్రికాలమ్ ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలన్న కార్యక్రమం గొప్ప సామాజిక స్పృహతో రూపొందించినట్టిది. వాటర్ గ్రిడ్ నిర్మించి ప్రతి పల్లెకూ, ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలన్న ప్రణాళికలో ఆక్షేపించేందుకు ఏమీలేదు. ఈ పథకానికి ఫ్లోరైడ్ సమస్యతో తల్లడిల్లుతున్న నల్లగొండ జిల్లాలో శ్రీకారం చుట్టాలని నిర్ణయించడం సంతోషకరమైన వార్త. సుదీర్ఘమైన ఉద్యమం ఫలితంగా ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం ప్రజలకు కోటి ఆశలుంటాయి. సత్వరం పరిష్క రించవలసిన అనేక సమస్యలుంటాయి. ఉద్యమానికి సారథ్యం వహించి వందల హామీలు ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ అధినాయకుడు రాష్ట్రావతరణ తర్వాత అధికార పార్టీగా, ప్రభుత్వ సారథిగా విధులు చేపట్టిన క్షణం నుం చి ప్రజల కలల సాకారానికి కృషి ఆరంభం అవుతుంది. ప్రభుత్వ హృదయాన్ని ఆవిష్కరించేది వార్షిక బడ్జెట్; అందులోని ప్రాథమ్యాలు, కేటాయింపులు, ప్రత్యేక పథ కాలు, కొత్త చొరవలు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 5వ తేదీన తెలంగాణ శాసనసభకు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలలో కనిపించిన కొత్త చొరవలలో ముఖ్యమైనవి చెరువుల పునరుద్ధరణ, దళితులకు భూమిపంపిణీ, ప్రతిపల్లెకూ మంచినీటి సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన వాటర్ గ్రిడ్, విద్యుచ్ఛక్తి కొర తను అధిగమించాలన్న ఆకాంక్ష. అర్థవంతంగా సాగిన బడ్జెట్ చర్చ బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో సంపూర్ణంగా నెరవేరుతుందా లేదా అన్నది శాసనసభా వేదికపైన చర్చనీయాంశం కావాలి. చర్చ మొత్తం మీద ప్రయోజనకరంగానే సాగింది. తెలుగుదేశం పార్టీ (తెదేపా) సభ్యులను సస్పెం డ్ చేయడం ఒక్కటే అపశ్రుతి. తెదేపా సభ్యులపైన సభాపతి తీసుకున్న చర్యకూ, బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చకూ ప్రత్యక్ష సంబంధం లేదు. ఆ పార్టీ ప్రయోజనాలకీ, ఆ పార్టీ సభ్యుల సంచలనాత్మక ప్రవర్తనకూ సంబంధం ఉంది. తెదేపా నాయకుడు రేవంత్‌రెడ్డి కొండంతరెడ్డిగా ఎదిగేందుకు శాసనసభను వేదిక చేసుకోవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపైనా, ఆయన కుటుంబ సభ్యుల పైనా పదునైన విమర్శనాస్త్రాలు సంధించడం సైతం ప్రజాస్వామ్యబద్ధమే. వాక్చాతు ర్యం కలిగిన యువనాయకుడికి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకోవడానికి తగిన సామాజిక, రాజకీయ కారణాలు ఉండవచ్చు. అది ఎర్రబె ల్లి దయాకర్ వంటి నాయకులు తేల్చు కోవలసిన అంశం. బడ్జెట్ ప్రతిపాదనల మంచిచెడ్డలకూ, తెలుగుదేశం పార్టీ సభ్యు లు ప్రస్తావించిన అంశాలకూ పెద్దగా పొంతనలేదు. ఇందుకు భిన్నంగా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి చేసిన ప్రసంగంలో ప్రభుత్వానికి సూటిగా తగిలే విమర్శలూ, నిర్మాణాత్మకమైన సూచనలూ ఉన్నాయి. కాంగ్రెస్ సభ్యులతోపాటు భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు పార్టీ సభ్యులు చేసిన విమర్శలకు కూడా కేసీఆర్, ఈటెల ప్రసంగాలలో సమాధానాలు కనిపిస్తాయి. చట్టసభలలో జరిగే వాగ్యుద్ధాలలో నోరూ, అధికారం ఉన్నవారు పైచేయి సాధించడం సర్వసామాన్యం. ఫ్లోరోసిస్ ప్రాంతాలపై కరుణ దీనికంటే ప్రధానమైనవి బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా ప్రభుత్వం వెల్లడించిన సందేశం, తలబెట్టిన పథకాలూ, కార్యక్రమాలూ, కేటాయించిన నిధులూ, స్వప్నించే భవిష్యత్ చిత్రపటం, ఏ తీరాలకు ఈ ప్రతిపాదనలు నడిపిస్తాయో శాసనసభ్యులు చర్చించి నిగ్గుతేల్చాలి. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకూ, పోరా టం చేసిన కళాకారులకూ, జర్నలిస్టులకూ, న్యాయవాదులకూ, వైద్యులకూ, ఇతర అనేక వర్గాలవారికి మేలుచేయాలన్న విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలన్న కార్యక్రమం గొప్ప సామాజిక స్పృహతో రూపొందించినట్టిది. వాటర్‌గ్రిడ్ నిర్మించి ప్రతిపల్లెకూ, ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలన్న ప్రణాళికలో ఆక్షేపించేందుకు ఏమీలేదు. ఈ పథకానికి ఫ్లోరైడ్ సమస్యతో తరతరాలుగా తల్లడిల్లుతున్న నల్లగొండ జిల్లాలో శ్రీకా రం చుట్టాలని నిర్ణయించడం సంతోషకరమైన వార్త. ఆదివాసీల, మైనారిటీల రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరితే ఆనందదాయకమే. దళిత యువ తుల కోసం ప్రకటించిన కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా విస్తరించడం ఆహ్వా నించదగినదే. వెనుకబడినవర్గాల సంక్షేమంకోసం ప్రభుత్వం సంకల్పించిన చర్య లను ఖండించేవారు ఎవ్వరూ ఉండరు. ప్రభుత్వం ప్రకటించే పథకాలు ఆచరణ సాధ్యమా, కాదా అన్న కోణం నుంచి మాత్రమే ప్రశ్నించాలి. విపక్ష వాదనలూ సబబే లోటు బడ్జెట్ భవిష్యత్తుమీద నమ్మకానికి నిదర్శనం. ప్రణాళికా వ్యయం ప్రణా ళికేతర వ్యయానికి దాదాపు సమానంగా (48 శాతం) ఉండటం చిత్తశుద్ధికి సంకేతం. అంతమాత్రాన జానారెడ్డి లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యం లేదని చెప్పజాలం. ఊహాగానాలూ, ఆశలపల్లకీ అంటూ ప్రతిపక్ష నేత చేసిన హెచ్చరికలు పెడచెవిన పెట్టవలసినవి కావు. లోటు ఏ విధంగా పూరిస్తారు? రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం కంటే అధికంగా రుణాలు తీసుకోరాద నే నిబంధనను ఎట్లా అధిగమిస్తారు? కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.21వేల కోట్లు వస్తుందని రాజేందర్ అంచనా కూడా నమంజసంగా కనిపించదు. 2012-13లో రూ.7500 కోట్లు, 2013-14లో రూ.9000 కోట్లు ఉన్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ (కేంద్ర సాయం) 2014-15లో రెట్టింపు కంటే ఎక్కువ అవుతుందని ఆశించగలమా? అందులోనూ తెరాస ప్రభుత్వానికి, భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్కీ మధ్య సఖ్యత అంతంత మాత్రమేనని అనుకుంటున్న దశలో అంత ఉదారంగా సాయం అందుతుందనుకోవడం అవాస్త విక దృష్టి కాదా? ఇంతకంటే ఆసక్తికరమైనది ఎం.ఐ.ఎం. నాయకుడు అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్న. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు మాసాలలో లక్షకోట్లు ఎట్లా ఖర్చు చేస్తారు? లక్ష కోట్లు ఎట్లా సమీకరిస్తారనే ప్రశ్న ఇందులోనే ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంవత్సరానికి రూ.80 వేల కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేసినప్పటికీ అంత ఆదాయాన్ని వచ్చే నాలుగు మాసాలలో సమీకరిం చగలరా? ప్రభుత్వ భూములు విక్రయించి రూ.6500 కోట్లు సంపాదించడం అయ్యే పనేనా? ఇది ఫక్తు నేలవిడిచి సాము చేయడం కాదా? విద్యుత్‌పై అంచనాలు వాస్తవికమేనా? ఖరీఫ్ తరుణంలో రాష్ట్రం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కోబోతోంది. జూలై నాటికి అదనంగా 1500 మోగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని ఏ అంచనాపై, ఏ హామీపై ముఖ్యమంత్రి చెబుతు న్నారో తెలియదు. కొత్త ప్రాజెక్టు ఏదీ నిర్మాణంలో లేదు. ఈ సంవత్సరం మేలో ఉమ్మడి రాష్ట్రం టెండర్లు ఖరారు చేసి దక్షిణాది విద్యుదుత్పత్తిదారుల నుంచి మొత్తం 1800 మెగావాట్లు కొనుగోలు చేయడానికి బేరం కుదుర్చుకున్నది. అందులో భాగంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ వాటాకింద 950 మెగావాట్ల విద్యుత్తు అందుతోంది. ఇది వచ్చే సంవత్సరం మే 31వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత వినియోగం కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సకాలంలో చేసుకోవ డంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. టెండర్లు పిలవడంలో జాప్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్వరం టెండ ర్ల ప్రక్రియ పూర్తిచేసి 2100 మెగా వాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నది. అందుకే ఏపీలో రోజుకు 24 గంటల విద్యుత్తు సరఫరా ఉంటుందని చంద్రబాబునాయుడు సింగపూరులో ధీమాగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం జాప్యం కారణంగా 120 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు మాత్రమే బేరం కుదుర్చుకోగలిగింది. అంటే వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పుడు వస్తున్న 950 మెగావాట్లు నిలిచి పోయి 120 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వస్తుంది. పైగా అప్పటికి విద్యుత్తు అవసరం ఇప్పటికంటే వేయి మెగావాట్లు పెరుగుతుంది. ఇప్పటి స్థాయితో పోల్చితే కొరత 1830 మెగావాట్ల మేరకు ఉంటుంది. కృష్ణపట్నం 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన వాటా కింద 900 మెగావాట్లు కేంద్రం సహా యంతోనో, ఏపీ సర్కార్ సద్భావనతోనో తెచ్చుకోగలిగితే కొంతమేరకైనా గట్టెక్కే అవకాశం ఉంటుంది. కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పీయూష్ గోయల్‌ను కలుసుకొని పరిస్థితిని వివరించడానికి తెరాస ఎంపీలు సిద్ధం అవుతున్నారని వినికిడి. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి విద్యుత్ సమస్యను పరిష్కరించాలంటూ కొత్తగా మంత్రి మండలిలో చేరిన బండారు దత్తాత్రేయకు సన్మానం చేస్తూ కేసీఆర్ విజ్ఞప్తి చేయడం విడ్డూరం. ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానితో చర్చించవలసిన ముఖ్య మైన అంశమిది. ఏపీ అవ రోధాలు సృష్టించకుండా నిరోధించాలన్నా, వచ్చే రెండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా వ్యవసాయరంగానికి కోత లేకుండా విద్యుత్తు సర ఫరా చేయాలన్నా పీయూష్ గోయల్ నిర్ణయం తెలంగాణలో కూడా అమలు జరగా లన్నా కేసీఆర్ మోదీతో, గోయల్‌తో సాధ్యమైనంత వివరంగా చర్చించవలసి ఉంటుంది. సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం, యూనిట్‌కు రూ.6.72 చొప్పున కొనుగోలు చేయడానికి బేరం కుదుర్చుకోవడం మంచి పరిణామమే. ఇటువంటి అనేక చర్యలు సత్వరం తీసు కుంటే తప్ప ఖరీఫ్‌లో, ఆ తర్వాత రబీలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించడం సాధ్యం కాదు. నిధుల సమీకరణే ప్రస్తుత కర్తవ్యం బడ్జెట్ అంచనాలలో చూపించిన లోటు పూడ్చలేని పక్షంలో ఏ పద్దుకు కోత పెడతారోనన్నది ఆసక్తికరమైన అంశం. పంచాయతీరాజ్ రోడ్ల కోసం మునుపె న్నడూ లేని విధంగా రూ.2000 కోట్లు కేటాయించాలన్న నిర్ణయాన్ని సవరిస్తారా లేక ఇతర సంక్షేమ పద్దులకు గండి పెడతారా? ఉమ్మడి రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కి రూ.5000 కోట్లు కేటాయించడమే కష్టమైనప్పుడు తెలంగాణ రూ.12000 కోట్లు కేటా యించడం సాధ్యమా అన్న జానారెడ్డి ప్రశ్న కూడా సవ్యమైనదే. ఒక వేళ అంత మొత్తం కేటాయించి, విడుదల చేసినప్పటికీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కింద అనుసరించవలసిన విధివిధానాలూ, మార్గదర్శక సూత్రాలూ ఖరారు చేయకపోతే, ప్రభుత్వ శాఖలకు నిధులు అప్పజెప్పితే పాత కథే పునరావృత్తం అవుతుంది. నిధుల న్నిటినీ కలగలిపి (పూల్ చేసి) పద్ధతి ప్రకారం ఖర్చు చేయాలన్న కేసీఆర్ సంకల్పం నెరవేరదు. బడ్జెట్‌పైన చర్చ ముగిసింది కనుక అనంతరం తీసుకోవలసిన అనేక సత్వర చర్యలపైన ప్రభుత్వం అవశ్యం దృష్టి సారించాలి. ముఖ్యంగా విద్యుచ్ఛక్తి రంగంపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్న సంతోషం ప్రజలకు మిగలాలంటే ఆచరణసాధ్యమైన ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇచ్చి తక్కిన వాటిని పక్కకు పెట్టాలి. నిధుల సమీకరణకు నిరంతరం కృషి చేయాలి. కె. రామచంద్రమూర్తి -
ప్రతి ఇంటికీ పంపు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో తాగునీటి కొరతను తీర్చడానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం భారీ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్ గ్రిడ్ పథకాన్ని జిల్లాలోని అన్ని మండలాలకు అనుసంధానం చేస్తూ నిరంతరం నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల పనితీరు, వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనుల రూపకల్పన తీరు గురించి జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) జగన్మోహన్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. వచ్చే నాలుగేళ్లలో జిల్లాలోని ప్రతి ఇంటికి పంపు కనెక్షన్ ఇవ్వడంతోపాటు స్వచ్ఛమైన తాగునీరందించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్‌లు నిర్మించాలని సంకల్పించామన్నారు. 38 మండలాల ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్ నిర్మిస్తున్నామని, దీనికి రూ.2,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రజల తాగు అవసరాలకు సరిపడా నీరందించే అవకాశం ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి అనువైనదిగా ఎంచుకున్నామని, అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద నిరంతరం నీరు అందుబాటులో ఉంటున్నందున అక్కడ వాటర్‌గ్రిడ్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే అశ్వాపురం వద్ద గల రధం గుట్ట నుంచి గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు. ఇక్కడ నిర్మించే వాటర్‌గ్రిడ్ ద్వారా 20 మండలాల్లోని 400 గ్రామాలు, మరికొన్ని శివారు గ్రామాలకు నిరంతరం నీరు సరఫరా అవుతుందని తెలిపారు. గోదావరి నది నుంచి సంవత్సరానికి 3.2 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించేలా డిజైన్ చేసినట్లు వివరించారు. నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్‌గ్రిడ్ నిర్మించే ప్రాంతం నుంచి వినియోగదారుడి ఇంటి వరకు ప్రత్యేక పైపులైన్లను నిర్మిస్తామని చెప్పారు. జిల్లాలో తాగునీటి అవసరాలకు రూ.2,600 కోట్లు అవసరమని, వీటిని ప్రభుత్వం దశలవారీగా మంజూరు చేసే అవకాశం ఉందని అన్నారు. వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనుల సర్వేకు ప్రభుత్వం త్వరలో టెండర్లు ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు. మెయిన్ గ్రిడ్, సెకండరీ గ్రిడ్, అలాగే మూడు మండలాలకు కలిపి ఒక హెడ్ వర్క్‌ను నిర్మించాలని, ఈ సర్వే ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు. జిల్లాలోని 3,167 గ్రామాలలో ఇప్పటి వరకు 1885 గ్రామాలకు నిరంతరం, 1282 గ్రామాలకు పాక్షికంగా నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. వచ్చే జనవరి నాటికి ముదిగొండ మండలం ముత్తారం చెరువు వద్ద ఉన్న గుట్ట వద్ద హెడ్‌వర్క్స్‌ను నిర్మించి, అక్కడినుంచి వాటర్‌గ్రిడ్ నియమావళి ప్రకారం ప్రతి మనిషికి 100 లీటర్లు మంచినీటిని సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. దీని ద్వారా 11 గ్రామాలకు నిరంతరం తాగునీటి సౌకర్యం కలుగుతుందని, ప్రస్తుతం ఉన్న సీపీడబ్ల్యూ స్కీమ్‌ను వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశామని చెప్పారు. అశ్వాపురం- దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరిపై సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించిన ఆనకట్ట వద్ద నుంచి నీటిని మోటార్ల ద్వారా తోడి అక్కడే శుద్ధిచేసి జిల్లాలోని 26 మండలాలకు తాగునీటిని అందించనున్నామన్నారు. జిల్లాలో 580 కిలోమీటర్ల పొడవున ప్రధాన పైపులైన్, అక్కడి నుంచి గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు 4,431 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ నిర్మించాల్సి ఉంటుందని వివరించారు. జిల్లాలో పలు జలాశయాలు, చెరువుల్లో నీటిని నింపి అక్కడ నుంచి నిరంతరం తాగునీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించామని, దీని కోసం 11 ఉపగ్రిడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా ప్రజలకు ప్రతి ఏడాది తాగునీటి కోసం 8 టీఎంసీల నీరు అవసరమన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ప్రజలకు కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి ఇప్పుడున్న పథకాల ద్వారానే తాగునీరు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు పాలేరు రిజర్వాయర్ నుంచి తాగునీరు అందిస్తామని, ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేందుకు ఈ వాటర్‌గ్రిడ్ ఉపయోగపవడుతుందని అన్నారు. -
వాటర్‌గ్రిడ్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియను వేగవంత చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్‌లోని ఇంజినీర్ ఇన్ ఛీఫ్ కార్యాలయాలను గురువారం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 7గంటలవరకు ఆర్‌డబ్ల్యుఎస్ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టు సర్వే, ఎక్విప్మెంట్, ఉద్యోగ నియామకాలు తదితర కీలక అంశాలపై చర్చలు జరిగాయి. గ్రిడ్ పనులకు ప్రాథమికంగా రూ.2 వేల కోట్లు మంజూరు చేయడంతో పనుల వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్ ఇన్ ఛీప్ సురేందర్‌రెడ్డి, పలువురు చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. అనుకోకుండా మంత్రి కేటీఆర్ నేరుగా తమ కార్యాలయానికి రావడంతో ఉద్యోగులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. -
కేటాయింపు.. నామమాత్రం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్లో జిల్లాకు నామమాత్రంగా కేటాయింపులు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రంలోని తొలిపద్దుపై కోటి ఆశలు పెట్టుకున్న జిల్లా వాసులకు కేటాయింపుల్లో ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బడ్జెట్‌పై జిల్లా వాసుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుండగా.. అధికార పార్టీ నేతల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతోంది. రూ.లక్ష కోట్ల బడ్జెట్ బంగారు తెలంగాణకు బాటలు వేస్తుందని టీఆర్ఎస్ వాళ్లు అభిప్రాయపడుతుండగా.. అంతా అంకెల గారడీ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఈ బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులను పరిశీలిస్తే.. బాసర ట్రిపుల్ ఐటీకీ రూ.119 కోట్లు.. బాసరలోని ట్రిపుల్ ఐటి విద్యా సంస్థకు రూ.119.63 కోట్లు కేటాయించారు. కానీ ఈ సంస్థ నిర్వహణకే సగానికిపైగా నిధులు అవసరమని విద్యా సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది జీతభత్యాలు, ల్యాబ్‌లు, మెస్‌లు, విద్యుత్ బిల్లులు, నీటి వసతి వంటి అవసరాలకే సుమారు రూ.66 కోట్లు అవసరం ఉంటుంది. ఇక మిగిలేది రూ.54 కోట్లు మాత్రమే. ఈ నిధులు ఈ విద్యా సంస్థలోని అభివృద్ధికి ఏమాత్రం సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లైబ్రరీ, ల్యాబ్‌లు, పరిపాలన విభాగాలు, ఫ్యాకల్టీ క్వార్టర్లు వంటి భవనాల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సుమారు రూ.200 కోట్లు కేటాయిస్తారని విద్యా సంస్థ వర్గాలు భావించాయి. జోడేఘాట్ అభివృద్దికి రూ.25 కోట్లు.. గిరిజన పోరాటయోధుడు కొమురం భీం వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్టోబర్ 8న జోడేఘాట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్దికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు మరునాడు అక్టోబర్ 9న జీవో 87 విడుదల చేశారు. అయితే ఈ నిధులను ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి విడుదల చేశారే తప్ప, ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. తాజాగా ఈ నిధుల మంజూరు అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించారు. రోడ్లకు ప్రాధాన్యత.. జిల్లాకు అధికంగా మేలు.. రాష్ట్ర వ్యాప్తంగా 10,693 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఈ కేటాయిం పులతో ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్ జిల్లాకే ఎక్కువ మేలు జరి గే అవకాశాలున్నాయి. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రహదారిని, అన్ని గ్రామాలకు లింకు రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అత్యధికంగా లబ్ధిపొందేది ఆదిలాబాదే. జిల్లాలో లింకు రోడ్లు గ్రామాలు అధికంగా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రహదారులు లేని మండలాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు బ్రిడ్జీలకు మోక్షం.. జిల్లాలో ప్రధానమైన రెండు వంతెనల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జిల్లా మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. లోకేశ్వరం మండలం నుంచి నిజామాబాద్ జిల్లాను అనుసంధానించే వంతెనతో పాటు, సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని గూడెం-అహెరి బ్రిడ్జి నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చారు. ఈ రెండు వంతెనల నిర్మాణం పూర్తయితే చత్తీస్ఘడ్, మహరాష్ట్ర వైపు రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఆదివాసీ మరణాలపై ప్రస్థావన ఆదివాసీ మరణాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా ప్రస్థావించారు. వాటర్ గ్రిడ్, తాగునీటి సరఫరా అంశంపై ప్రసంగిస్తున్నప్పుడు ఆదివాసీలు తాగునీటి కోసం కిలో మీటర్ల దూరం నడవాల్సి వస్తోందని ప్రస్థావించారు. వాటర్ గ్రిడ్‌తో ఆదివాసీలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి లభించనుందని అన్నారు. ఇవీ.. సాగునీటి ప్రాజెక్టు కేటాయింపులు సాగునీటి రంగానికి రూ.9,356 కోట్లు కేటాయించిన సర్కారు ‘ప్రాణహిత’ ప్రాజెక్టు కేటాయింపులను మినహాయిస్తే.. జిల్లాకు రూ.335.83 కోట్ల నిధులను బడ్జెట్లో కేటాయించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాణహిత ప్రాజెక్టుకు రూ.1,790 కోట్లు కేటాయించగా, ఇందులో కొంత మొత్తాన్ని జిల్లా ప్యాకేజీలకు నిధులు వచ్చే అవకాశాలున్నాయి. ప్రాజెక్టుల వారీగా నిధులను పరిశీలిస్తే. ప్రాజెక్టులకు ఇలా.. ప్రాజెక్టు కేటాయింపులు ఎల్లంపల్లి రూ.237 కోట్లు కడెం రూ. 3 కోట్లు నీల్వాయి రూ. 54.77 కోట్లు సుద్దవాగు రూ. 2 కోట్లు కొమురంభీం రూ. 25 కోట్లు స్వర్ణ రూ. 10 లక్షలు మత్తడివాగు రూ. 50 లక్షలు సాత్నాల రూ. 10 లక్షలు పెద్దవాగు రూ. 13 లక్షలు ర్యాలీవాగు రూ. కోటి -
బడ్జెట్లో జిల్లాకు భారీ కేటాయింపులు?
నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు తెలంగాణ తొలి బడ్జెట్... రాజీలోని పోరాటంతో రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్ తొలిసారి ప్రవేశపెట్టబోతోన్న బడ్జెట్.. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కలల బడ్జెట్.. అందుకే ఇపుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకర్లు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో మెతుకుసీమపై ఎలాంటి వరాలు కురుస్తాయోనని జిల్లా వాసులంతా ఎదురుచూస్తున్నారు. మన ఆశలకు తగ్గట్టుగానే తొలి బడ్జెట్లో మనకే తొలి ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాకతీయల కాలంలో ఆతర్వాత నిజాం హయాంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు కాలంతో పాటే అంతర్థానమయ్యాయి. మాయమైన చెరువులకు మళ్లీ జీవం పోసి నాటి జలకళను తెప్పించి, బీడు భూములను తడిపే దిశగా కేసీఆర్ సర్కారు తొలి అడుగులు వేస్తోంది. ఉన్న ఒక్క మంజీరా జీవనదిని వలస వాదులు చెరబట్టి హైదరాబాద్‌కు తరలించుకుపోతే, ఉన్న చిన్న నీటి వనరులతోనే ఆయకట్టుకు నీరు పారించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కసరత్తు చేశారు. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇంతకాలం కాంట్రాక్టర్ల జేబులు నింపిన చెరువుల మరత్తుల పునరుద్ధరణ ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుల శాఖ మంత్రి హరీష్‌రావు ఈ జిల్లాకు చెందిన బిడ్డలే కావటంతో బడ్జెట్లో జిల్లాకే పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. రోడ్ల విస్తరణ కోసం రూ.1000 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు రూ. 500 కోట్లు వాటర్ గ్రిడ్లకు రూ. 500 కోట్లు, గ్రీన్‌హౌస్‌కు రూ.200 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు సమాచారం. ప్రాణహిత- చేవెళ్ల, సింగూరు, ఘణపురం ప్రాజెక్టులకు కూడా బడ్జెట్లో నిధుల వరద పారినట్టు తెలుస్తోంది. ఇవికాకుండ ‘మన ఊరు- మన ప్రణాళిక’ పథకం కింద సిద్ధం చేసిన ప్రతిపాదనల కోసం రూ.1,500 కోట్లు ఇచ్చి, తొలి తెలంగాణ బడ్జెట్ మెతుకు సీమ రైతాంగం ఆశలను చిగురించే విధంగా రూపొందించినట్లు తెలుస్తోంది. సామాజిక ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ జిల్లాలో ఇటీవలే నీటివనరులకు సంబంధించి నీటిపారుదలశాఖ సమగ్ర సర్వే నిర్వహించింది. జిల్లాలో మొత్తం 9,970 నీటి వనరులు ఉన్నట్లు తేలింది. వీటిలో 578 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 109 ఆనకట్టలు, 5,509 పంచాయతీరాజ్ కుంటలు, 274 ప్రైవేటు కుంటలు, 1,927 చెక్‌డ్యాంలు, 1,336 పర్కులేషన్ ట్యాంకులు, 237 ఇతర నీటి వనరులు ఉన్నాయి. వీటి మీదనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. జిల్లాలో గుర్తించిన చెరువుల, కుంటలను ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో దశల వారీగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని 20 శాతం చెరువుల, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులను చేపట్టనున్నారు. నీటివనరుల సమగ్ర సర్వే ఆధారంగా అధికారులు జిల్లాలో మొదటి దశలో చెరువులు, కుంటల మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. జిల్లాలో మొదటి దశ కింద 1,588 చెరువులు, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 175, దుబ్బాకలో 275, గజ్వేల్‌లో 239, అందోలులో 124, సంగారెడ్డిలో 107, పటాన్చెరులో 92, జహీరాబాద్‌లో 25 చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నారు. నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 551 చెరువుల మరమ్మతు పనులు చేపట్టే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి దశల వారీగా జిల్లాలోని ప్రతి ఇంటికీ తాగునీటి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. మొత్తం 446 కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీళ్లు అందించే యోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. దీనికోసం ప్రభుత్వం రూ.5,600 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. తాగునీటికోసం సింగూరు ప్రాజెక్టు నుంచి 8 టీఎంసీల నీళ్లను వాడుకునేందుకు రూపకల్పన చేసినట్లు సమాచారం. మండలానికి రెండు లేన్ల రోడ్లు బడ్జెట్లో జిల్లాలోని రోడ్లకు అధిక ప్రాముఖ్యత కల్పించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించినట్లుగా మెదక్ జిల్లాలో రోడ్ల విస్తరణకు రూ.1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు సమాచారం. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ కనీసం రెండు లేన్ల రోడ్లు నిర్మించే విధంగాబడ్జెట్లో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు, ఇస్మల్కాపూర్ నుంచి హైదరాబాద్ వరకు నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు సమాచారం. దీంతోపాటు గజ్వేల్, సంగారెడ్డి పట్టణాల్లో రింగ్ రోడ్డు నిర్మాణానికి బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. విత్తనోత్పత్తి హబ్‌గా జిల్లాలో గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లోరూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. గజ్వేల్ పట్టణంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగులో ఫారెస్ట్రీ కాలేజ్ , హార్టీకల్చర్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ తదితర సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూరగాయల సాగు చేయడానికి వీలుగా నిధుల కేటాయింపు జరిగినట్లు తెలిసింది. జిల్లాలో నాణ్యమైన విత్తన గింజలను పండించే విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమచారం. -
జిల్లాకు జలకళ
{పాజెక్టులు, రిజర్వాయర్లు, నదుల అనుసంధానం తాగునీటికి 18 టీఎంసీల నీరు రూ.8 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌కు తాజా ప్రతిపాదనలు జిల్లాకు తాగునీటి కష్టాలు తీరనున్నాయా? నదులు, రిజర్వాయర్లు అనుసంధానం చేస్తున్నారా? పడమటి మండలాలకు కూడా తాగునీరు అందించే దిశగా అడుగులేస్తున్నారా? తాగునీటితోపాటు వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన 18 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందా?.. ఇందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలో నీటి సమస్య తీర్చేందుకు అధికారులు క సరత్తు చేస్తున్నారు. కిరణ్ ప్రభుత్వ హయాంలో 7,200 కోట్లతో ఈ పథకానికి శంకుస్థాపన చేస్తే ప్రస్తుతం ఈ వ్యయం రూ.8 వేల కోట్లకు చేరింది. తిరుపతి సిటీ: చిత్తూరు జిల్లాలో శాశ్వత మంచినీటి పథకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజర్వాయర్లు, నదులు, చెరువులు అనుసంధానం చేసేం దుకు తెలుగుగంగ, ఇరిగేషన్ అధికారులతో పాటు పబ్లిక్ హెల్త్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా దాహార్తికి, ఇతర అవసరాలకు కావాల్సిన నీళ్లను ఎలా సమకూర్చుకోవాలనే దానిపై అభిప్రాయసేకరణ చేస్తున్నారు. జిల్లాలోని తెలుగుగంగ, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను ఒకే వేదికమీదకు తీసుకురావడంతో పాటు జిల్లాలోని కల్యాణి రిజర్వాయర్, కాళంగి రిజర్వాయర్, అరణియార్, బహుదా ప్రాజక్టు, పింఛా ప్రాజెక్టు, పెద్దేరు, ఉబ్బలమడుగు, మల్లిమడుగు ప్రాజెక్టులను కూడా ఇందు లో చేర్చుతున్నారు. వీటితో పాటు అతిపెద్ద ఆయకట్టు ఉన్న తొండమనాడు, కందుకూరు వ్యాసరాయ చెరువులను కూడా అనుసంధానంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. త ద్వారా జిల్లాకు అవసరమైన నీటిని అందించాలనే లక్ష్యంతోనే ఈపథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. నీటిని ఈ రిజర్వాయర్లకు తీసుకొచ్చి పైపుల ద్వారా అన్ని గ్రామాలకు పంపింగ్ చేయాలని భావిస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీరూ కరువే.. మూడేళ్లుగా జిల్లాలో సరైన వర్షపాతం నమోదు కావ డం లేదు. ముఖ్యంగా వేసవిలో అయితే పరిస్థితి దా రుణంగా ఉంటోంది. పడమటి మండలాల్లో కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదు. ఇక తిరుపతి విషయానికి వస్తే కల్యాణి డ్యాంలో నీరు ఎప్పుడూ డెడ్ స్టోరేజీలోనే ఉంది. తిరుపతి తాగునీటి అవసరాలకు ఎక్కువ భాగం తెలుగుగంగ మీదనే ఆధారపడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ జలాశయానికి నీటిని పంపింగ్ చేసి చిత్తూరు ప్రాంతానికి నీటిని ఇవ్వాలని ప్రతిపాదించారు. సాగుకూ కష్టమే.. ఇక వ్యవసాయ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తూర్పు మండలాల్లో కాస్తోకూస్తో భూగ ర్భ జలాలు ఉన్నాయి. పడమటి మండలాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే ప్రజలు ఊళ్లు వదిలి పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చే పనిలో పడింది. అందుకోసం ఇరిగేషన్, ప్రాజెక్టుల అధికారులను ప్రణాళికలు తయారుచేసేందుకు పురమాయిం చింది. జిల్లాకు తాగునీరుతో పాటు, సాగుకు, పరిశ్రమలకు సంవత్సరానికి ఎంత నీరు అవసరమవుతుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావ్, జిల్లామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా యుద్ధప్రాతిపదికన పనులు డిజైన్స్ తయారు చేయాలని అదేశించినట్లు అధికారులు చెప్పారు. పెరుగుతున్న అంచనా వ్యయం కిరణ్ హయాంలోనే జిల్లా తాగునీటి శాశ్వత పరిష్కానికి పురుడు పోసుకుంది. అన్ని ప్రాంతాలకు తాగునీటి అవసరాల నిమిత్తం రూ.7,200 కోట్లు కేటాయించారు. అయితే ఆ ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది. ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను తెరపైకి తెచ్చింది. కండలేరు నుంచి డెరైక్టుగా నీళ్లను ప్రాజెక్టుల్లోకి తీసుకొచ్చి తద్వారా పట్టణాలకు, గ్రామాలకు అందించాలనే లక్ష్యంతో ఉంది. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.8 వేలకోట్లు ఖర్చవుతాయని భావి స్తోంది. గతంతో పోల్చితే దాదాపు రూ.800 కోట్లు అంచనా వ్యయం పెరిగినట్లు తెలుస్తోంది. నివేదికలు ఇచ్చాం.. జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన నివేదికలు ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుగుగంగ ఎస్సీ సుబ్బారావు మంగళవారం ‘సాక్షి’కి వివరించారు. వాటర్‌గ్రిడ్ రాష్ట్ర కన్సల్టెంట్ కొండలరావ్ దీనిపై పూర్తి నివేదిక తీసుకొన్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తరువాత ప్రాజెక్టు వివరాలు ప్రకటిస్తామని అన్నారు. -
రూ.18,643 కోట్లతో గ్రేటర్ వాటర్‌గ్రిడ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జనాభా ప్రస్తుతం 88 లక్షలు. సమీప భవిష్యత్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టుతో నగరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సుమారు 25 లక్షల మేర పెరగనున్నాయి. మరో పదేళ్లలో మహానగర జనాభా రెండు కోట్లకు చేరుకుంటుం దని సర్కారు అంచనా వేస్తోంది. 2021 నాటికి మహానగరంతోపాటు శివారు ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు జలమండలి రూ.18,643 కోట్ల భారీ అంచనా వ్యయంతో వాటర్‌గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా మూడో దశ, నాలుగో దశ, గోదావరి మంచినీటి పథకాల కింద నగరానికి తరలించనున్న నీటిని నగరం నలుమూలలకు సరఫరా చేయడమే గ్రిడ్ ప్రధాన లక్ష్యం. గోదావరి, కృష్ణా జలాలను కొరత ఉన్న ప్రదేశాలకు మళ్లించడం గ్రిడ్‌తో సాధ్యపడుతుంది. గ్రేటర్ చుట్టూ వాటర్ గ్రిడ్ గ్రేటర్ తాగునీటి సమస్యపై డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రుల సమీక్ష మహానగరం చుట్టూ నలుచెరుగులా మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. గ్రేటర్ వాటర్‌గ్రిడ్ స్వరూపంపై ఆయన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ మంత్రి పద్మారావు, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిలతో కలసి మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో రెండుగంటలపాటు సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లతోపాటు ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నీరందించేందుకు ఈ గ్రిడ్‌ను రూపొందిస్తున్నామన్నారు. గ్రిడ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, నిధుల అంశాలపై వారంలోగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించనున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వేసవి రాకముందే నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కృష్ణా మూడోదశ, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి గోదావరి ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేస్తామని వారు వివరించారు. ఈ సమావేశంలో జలమండలి ఎండీ జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. వాటర్‌గ్రిడ్ సర్వేకు రూ.105 కోట్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ప్రాజె క్టు సర్వే నిమిత్తం రూ.105 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం పరిపాలన ఉత్తర్వులు జారీచేసింది. సర్వేలో భాగంగా పంపిణీ వ్యవస్థ, ఓహెచ్ఎస్ఆర్లు, 133 కేవీ సబ్స్టేషన్ల నుంచి ఫీడర్ లైన్ల ఏర్పాటు తదితర పనుల నిమిత్తం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. 5,227 కిలోమీటర్ల మెయిన్ గ్రిడ్ సర్వేకు రూ.4.20 కోట్లు, 45,809 కిలోమీటర్ల సెకండరీ నెట్వర్క్ కోసం రూ.18.32 కోట్లు, గ్రామస్థాయి సర్వే కోసం రూ.7.5 కోట్లు, జీపీఎస్ పరికరాలకు రూ.1.34 కోట్లు, స్టేషన్ పరికరాల కోసం రూ.5.17 కోట్లు, ఇంజినీరింగ్ ప్రిపరేషన్ నిమిత్తం రూ.67.50 కోట్లు, పర్మినెంట్ బేస్ స్టేషన్లకు రూ.50 లక్షలు, సాఫ్ట్వేర్ కోసం రూ.45.94 లక్షలు కేటాయిస్తూ నిధులను మంజూరు చేసింది. -
బడ్జెట్లో వాటర్‌గ్రిడ్‌కు ప్రాధాన్యం
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం దీపావళి తర్వాతే అసెంబ్లీ సమావేశాలుంటాయని వెల్లడి హైదరాబాద్: దీపావళి తర్వాత నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో సమర్పించే బడ్జెట్లో వాటర్‌గ్రిడ్ పథకానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇన్నేళ్లుగా తెలంగాణకు ప్రాధాన్యత లభించలేదని, ఇప్పుడు పూర్తిగా తెలంగాణ ధోరణిలోనే బడ్జెట్ ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే బడ్జెట్లో ప్రస్ఫుటం కావాలని సూచిం చారు. బడ్జెట్‌పై ఆర్థిక శాఖతోపాటు ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం సమావేశమైన కేసీఆర్.. సోమవారం నాడు మరోసారి మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్) కార్యాలయంలో వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులతో భేటీ నిర్వహించి బడ్జెట్‌కు తుది రూపునిచ్చారు. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఓ అధికారి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి నేరుగా సమాధానమివ్వలేదు. దీపావళి తర్వాత అని మాత్రమే చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశాలను ఆషామాషీగా నిర్వహించరాదని, ప్రభుత్వ ప్రాధాన్యతలన్నీ బడ్జెట్లో ప్రతిబింబించాల్సిన అవసరముందన్నారు. నాలుగు నెలల వ్యయం కోసం బడ్జెట్ అనుమతితోపాటు, ఆరు నెలల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోవాల్సి ఉందన్నారు. -
వాటర్ గ్రిడ్ కన్నా పేలియో చానెల్ మిన్న
ప్రముఖ నీటిపారుదలరంగ నిపుణుడు టి.హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: గుజరాత్లో సఫలమైన వాటర్ గ్రిడ్ పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే వాటర్ గ్రిడ్ నమూనా కంటే మెరుగైన, చౌక పద్ధతులను సూచిస్తున్నారు ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ ఈఎన్సీ, ఐక్యరాజ్య సమితి సలహాదారు టి.హనుమంతరావు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలంగాణలో లభ్యమయ్యే భూగర్భ జలాలను గ్రామగ్రామానికి చెరువుల ద్వారా అందించడానికి వీలుందని చెబుతున్నారు. తెలంగాణలో ఉన్న చె రువులతో పోలిస్తే గుజరాత్లో 20 వంతు మాత్రమే ఉన్నాయని, అక్కడ భూగర్భ జలాలు ఇంత సమృద్ధిగా లేవని పేర్కొంటున్నారు. అందువల్ల వాటర్ గ్రిడ్ గుజరాత్‌కు మాత్రమే పనికి వస్తుందని ఆయన అంటున్నారు. తాను రూపొందించిన ‘పేలియో చానెల్ టెక్నాలజీ’తో.. వియత్నాం, ఫిలిిప్పీన్స్ దేశాల్లోని గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించారని గుర్తుచేస్తున్నారు. ‘పేలియో చానెల్’ టెక్నాలజీతో గరిష్టంగా రూ.3.5 వేల కోట్లతో (పైపులైను వేసే వ్యయ అంచనాలు ప్రస్తుత ధరలకు అనుగుణంగా కాస్త ఎక్కువగా వేసినా) తెలంగాణలోని అన్ని పల్లెలకు తాగునీరు అందించవచ్చని హనుమంతరావు స్పష్టంచేశారు. ఒక్కో ఆవాసానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వ్యయంతో ప్రభుత్వం ఆశించిన మేరకు మంచినీటి సరఫరా చేయవచ్చంటున్నారు. భూగర్భ మట్టిపొరల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుందని, ఈ నీటి సరఫరాతో ఫ్లోరైడ్, ఇతర ఖనిజాల సమస్యలు కూడా తప్పుతాయంటున్నారు. ‘‘బోర్ల ద్వారా రాతి పొరల్లోని నీరు సేకరిస్తే.. ఫ్లోరైడ్ తదితర ఖనిజాల సమస్య తలెత్తుతుంది. తెలంగాణ ప్రభుత్వం భూఉపరితల నీటిని అందించేందుకు రూ.25 వేల కోట్ల వ్యయంతో 26 గ్రిడ్లతో పల్లెల్లోని ప్రజలకు ప్రతిరోజు ఒక్కో మనిషికి 100 నుంచి 135 లీటర్ల తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కార్యక్రమం చేపట్టడం మంచిదే. అయితే.. ఇక్కడున్న జలవనరుల దృష్ట్యా నీటి సేకరణ పద్ధతుల్లో భూగర్భ నీటిపై ఆధారపడి ఎక్కడికక్కడే సరఫరా చేయడం వల్ల భారీ వ్యయం అవుతుంది. కానీ అందులో కేవలం 10 నుంచి 15 శాతం నిధులతోనే ఈ బృహత్తర పథకాన్ని పూర్తి చేయవచ్చు’’ అని ఆయన వివరించారు. నిర్వహణ, అమలు సమస్యలు గ్రిడ్ కంటే కూడా చాలా తక్కువంటున్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమి అని, వర్షాలు పడినా భూమిలోకి ఇంకిపోయే నీరు తక్కువగా ఉంటుందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ 2012-13 ఆర్థిక గణాంక శాఖ ప్రచురించిన లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో... భూగర్భ జలాల వినియోగంతో దాదాపు 27 లక్షల హెక్టార్లలో పంటలు పండించారు. అంటే దాదాపు 700 టీఎంసీల భూగర్భ జలాల వినియోగంతో పంటలు పండించారు. ప్రస్తుతం ఉన్న భారీ, మధ్య తరహా ప్రాజెక్టులతోపాటు డెల్టాలో సాగైన భూమి కంటే దాదాపు రెట్టింపు పరిణామంలో భూగర్భ జలాలతో సాగ వుతోంది’’ అని ఆయన గుర్తుచేస్తున్నారు. పేలియో చానెల్ టెక్నాలజీతో వేసవిలోనూ, దుర్భిక్ష సంవత్సరాల్లోనూ భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయంటున్నారు. పేలియో చానెల్ టెక్నాలజీ తీరిదీ.. వర్షం నీరు.. నది లేదా వాగుల్లో ప్రవహిస్తుంది. వాటికి అడ్డుకట్టలు వేయడం వల్ల చెరువులు, సరస్సులను ఏర్పాటు చేయొచ్చు. దీంతో నీరు నిల్వ ఉంటుంది. అయితే వాగుల ప్రవాహం మాత్రం భూమార్గంలో పయనిస్తూనే ఉంటుంది. భూగర్భ వాగు లేదా నది ఏ మార్గంలో పయనిస్తుందన్న అంశాన్ని జియోఫిజికల్ సర్వేలతో నిర్ధారించవచ్చు. చెరువు దిగువ భాగంలో ఉండే ఆయకట్టు ప్రాంతంలో నుంచి ఈ నది/వాగు ప్రవహిస్తున్న ప్రాంతంలో మట్టిపొరల లోతు అధికంగా ఉన్నదాన్ని కనిపెట్టడం ద్వారా.. అక్కడ బావి తవ్వడం, ఆ బావిలో నీటిని గ్రామాల్లోని ప్రజలకు పైపులైను ద్వారా అందించడం వీలవుతుంది. ఇది భూభౌతిక సర్వేల ద్వారా నిర్ణయించే అవకాశం ఉంది. ఎందుకంటే పై భాగంలో నంత ఆయకట్టు ఉంటుంది.. ఆయకట్టు భూములతో కప్పబడి ఉన్నందున అది బయట నుంచి కనపడదు. చెరువు నుంచి దిగువ భాగంలో కిలోమీటరు దూరం వరకు సర్వే చేస్తే అది నీటి ప్రవాహ మార్గం స్పష్టంగా తేలుతుంది. వేసవిలో ఈ భూగర్భ జలాలు దిగువ ప్రాంతాలకు ప్రవహించకుండా ఉండేందుకు ఆయకట్టు చివరలో మట్టిపొరల్లో భూగర్భ ఆనకట్ట కట్టాల్సి ఉంటుంది. -
వాటర్ గ్రిడ్ నిర్మాణం సాధ్యమే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణం ముమ్మాటికీ సాధ్యమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పునరుద్ఘాటించారు. దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్‌ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. గుజరాత్లో విజయవంతమైన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు అక్కడి పంచాయతీరాజ్ వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర అధికారుల బృందంతో కలసి శనివారం ఆయున గుజరాత్ రాష్ట్రానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా.. తొలి రోజు శనివారం మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు గాంధీనగర్‌లో పర్యటించారు. ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, వాటర్ బోర్డు చైర్మన్ రాజీవ్ కే గుప్తాతో సమావేశమై ప్రాజెక్టు డిజైన్, నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంపై వివరంగా చర్చించారు. వాటర్ గ్రిడ్ ఆలోచన మొదలుకుని ఆచరణ దాకా ఆ రాష్ట్ర అధికారులు రూపొందించిన ప్రణాళికను పరిశీలించారు. నర్మదా డ్యామ్ నుంచి వివిధ ప్రాంతాలకు మంచినీటిని తరలించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీకి ముందు గాంధీనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో నీటిని సరఫరా చేసే ‘పానీ సమితి’ సభ్యులతో సవూవేశవుయ్యూరు. ప్రాజెక్టు ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యత, పరిమాణం, సౌకర్యాలపై జనం స్పందనను తెలుసుకున్నారు. గాంధీనగర్జిల్లా మానస తాలుకాలోని అమర్పూర్ గ్రామంలో ఈ-పంచాయతీ వ్యవస్థను మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. గతంలో ఉన్న విధానంతో పోల్చితే ప్రస్తుత ఈ-పంచాయతీ వ్యవస్థ వచ్చిన తర్వాత చోటు చేసుకున్న మార్పులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్న సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి వాకబు చేశారు. దేశంలోనే అత్యుత్తమ, అత్యాధునిక సాఫ్ట్వేర్, సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో ‘ఈ-పంచాయతీ’లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ తోపాటు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఉమాకాంత్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మంత్రి కేటీఆర్ ఆదివారం మరోసారి గుజరాత్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిశీలన కోసం మరో రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. -
ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుంటాం
* సీఎం కేసీఆర్‌ను కలిసిన కొరియన్ సంస్థ ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, వాటర్ గ్రిడ్ కనెక్టింగ్ సిస్టం, సోలార్ విద్యుత్ ప్లాంట్లు తదితర జాతీయస్థాయి ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుంటామని కొరియన్ ఎన్విరాన్మెంటల్ కార్పొరేషన్ (కేఈసీవో) ఆసక్తి చూపింది. కేఈసీవో డెరైక్టర్ జనరల్ జీ-సియోక్ జియోన్ తన సహచరులతో కలసి బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేశారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు తన కార్యాలయంతో సంప్రదింపులు కొనసాగించాలని సంస్థ ప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచించారు. కొరియన్ పర్యావరణ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. పర్యావరణ పరిరక్షణ, వనరుల పునర్వినియోగం ద్వారా ప్రజా జీవనాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. -
వాటర్‌గ్రిడ్ సర్వేకు రూ.105 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ పనుల సర్వేకు ప్రభుత్వం రూ.105 కోట్లు విడుదల చేసింది. సర్వే పనులు తొందరగా పూర్తి చేసి సమాంతరంగా గ్రిడ్ పనులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వాటర్‌గ్రిడ్‌పై అధికారులు నివేదించిన ప్రాథమిక అంచనాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి ఈ పథకం అత్యంత ప్రాధాన్యమైందని, ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచి నీటిని అందించాలన్నారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పాలేరు, కిన్నెరసాని, వైరా, రామప్ప, ఎల్ఎండీ, ఏఎండీ, కడెం, ఎల్లంపల్లి, కొమురంభీం, ఎస్సారెస్పీ, గడ్డెన్న, నిజాంసాగర్, మంజీర తదితర ప్రాజెక్టుల నుంచి పైపులైన్ల ద్వారా రాష్ట్రంలోని 25 వేల హాబిటేషన్లకు తాగునీటిని అందించాలన్నారు. మొత్తం 1.32 లక్షల కిలోమీటర్ల పొడవైన పైపులైన్ అవసరమవుతుందన్నారు. ఏరకం పైపులైను ఎంత కావాలో అంచనాలు రూపొందించి టెండర్లు పిలిచి వర్క్ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. పైపులూ తెలంగాణలోనే తయారు చేసేలా కంపెనీలను ఒప్పించాలని.. దీంతో రవాణా సులభం అవుతుందన్నారు. పైపుల తయారీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సహకారం అంది స్తామన్నారు. గ్రామాల్లో కరెంటు మోటర్లు బిగిం చాలని చెప్పారు. గ్రిడ్‌కు అవసరమయ్యే విద్యుత్తుకు ప్రతిపాదనలను, సబ్స్టేషన్లకు సంబంధించి అంచనాలను రూపొందించాలన్నారు. ఇన్‌టేక్ వద్ద, నీటిని శుద్ధి చేసే ప్లాంట్ల వద్ద సబ్స్టేషన్లను నిర్మించాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని తాగునీటికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నందున నీటి పారుదల శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. సమ్మర్ స్టోరేజీట్యాంకుల బాధ్యత ఆ శాఖకు అప్పగించారు. గ్రిడ్ పనుల నాణ్యత పరిశీలనకు సీఈ స్థాయి అధికారి సారథ్యంలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని సూచించారు. -
తెలంగాణ వాటర్ గ్రిడ్ పనులు ప్రారంభం
-
గ్రిడ్‌కు బిడ్డింగ్
తాగునీటి గ్రిడ్‌పై అంతర్జాతీయ బిడ్డింగ్‌కు టీ సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తాగునీటి గ్రిడ్’ ప్రాజెక్టు అమలు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సుమారు రూ. 27 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్టును తప్ప మరే పని చేపట్టరాదని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాన్ని ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు జైకా, నాబార్డు అందించే నిధులతో రానున్న నాలుగేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం సంకల్పించింది. వాటర్ గ్రిడ్‌పై గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం చేపట్టిన ప్రాథమిక సర్వే నివేదికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. గ్రావిటీతో ఎక్కువ ప్రాంతాలకు మంచినీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఇందుకోసం ఎత్తయిన కాంటూర్ల నిర్మాణం గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. పూర్తిగా ఎత్తిపోతలపై ఆధారపడకుండా చూడాలని నిర్దేశించారు. తాగునీటి అవసరాల కోసం ప్రత్యేక రిజర్వాయర్లు నిర్మించాలని సూచించారు. తెలంగాణవ్యాప్తంగా ఉపరితల పైపులైన్ల ద్వారా రక్షిత మంచినీటిని అందించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామాలు, పట్టణాలు, పరిశ్రమలకు ఎంత నీరు అవసరమన్న దానిపై అంచనాలు రూపొందించాలని సూచించారు. రాబోయే 30 ఏళ్ల వరకు ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా వాటర్ గ్రిడ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాలవారీగా అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించి, ఎక్కడి నుంచి నీటిని సరఫరా చేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలని చెప్పారు. ప్రస్తుతం 30 లీటర్ల తలసరి నీటిని మాత్రమే అందిస్తున్నారని, అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి వంద లీటర్ల చొప్పున సరఫరా చేసేలా పథకానికి రూపకల్పన చేయాలన్నారు. జూరాల, నాగార్జునసాగర్ వంటివి శాశ్వతంగా ఉంటాయని, గోదావరి ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా కొన్ని రోజులు మాత్రమే నీరందించే అవకాశముంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో స్టోరేజి ట్యాంకులు నిర్మించాలని సూచించారు. ప్రాజెక్టు అమలుపై ప్రతి 15 రోజులకోసారి నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, అధికారులు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ెహ లికాప్టర్లలో తిరిగి జిల్లాల్లో సర్వే చేయాలని, ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందించాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై వచ్చే సోమవారం(6న) మరోసారి సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. కాగా, ప్రజలకు తాగునీరు అందించే గ్రామీణ మంచినీటి సరఫరా, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ భూమి చుట్టుకొలత 33 వేల కిలోమీటర్లు కాగా, అంతకు నాలుగు రెట్ల పొడవైన పైపులైన్లు వేస్తామన్నారు. ఇది ప్రపంచ రికార్డు అవుతుందన్నారు. గూగుల్ ఎర్త్ సమకారంతో రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, కాంటూర్లను, భౌగోళిక పరిస్థితులను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ముఖ్య కార్యదర్శులు రేమండ్ పీటర్, ఎస్కే జోషితో పాటు ఇరిగేషన్, మున్సిపల్, ఆర్‌డబ్ల్యూస్ ఇంజనీర్లు పాల్గొన్నారు. వాటర్ గ్రిడ్ స్వరూపం 1,26,036 కిలోమీటర్ల పైపులైను, 5,227 కిలోమీటర్ల మెయిన్ ట్రంక్ లైను 45,809 కిలోమీటర్ల సెకండరీ నెట్వర్క్, 75 వేల కిలోమీటర్ల సరఫరా లైన్లు రాష్ర్టంలోని ప్రతి పల్లె. నగర పంచాయతీ, మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా వ్యయం రూ. 27 వేల కోట్లు (మరింత పెరగవచ్చు) రోజూ ఒక్కొక్కరికి వంద లీటర్ల చొప్పున నీటి సరఫరా {పత్యేక నీటి నిల్వ రిజర్వాయర్ల నిర్మాణం, సరఫరాకు 24 గ్రిడ్ల ఏర్పాటు డీపీఆర్, పరికరాలు, ఉద్యోగాల భర్తీకి రూ. 317 కోట్ల కేటాయింపు హైదరాబాద్‌ను మినహాయిస్తే 80 టీఎంసీల నీరు అవసరమని అంచనా మూడు నెలల్లో నివేదికలు సిద్ధం చేశాక అంతర్జాతీయ బిడ్డింగ్ నాలుగేళ్ల వ్యవధిలో గ్రిడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం విద్యుత్ కొనుగోలుకు ఆదేశం తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవసరమైన మేరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి జోషికి సూచించారు. వాటర్ గ్రిడ్‌పై సమీక్ష సందర్భంగా కరెంట్ పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. ఈ విషయంలో ఇంధన శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. -
20 లక్షల ఎకరాలకు నీరు వచ్చేది....
-
వాటర్ ‘గ్రిడ్’గండం!
పరిగి: కొత్త ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘వాటర్‌గ్రిడ్’ ప్రతిపాదన కారణంగా పరిగి నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన నీటి తరలింపు పథకానికి అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా పరిగి నియోజకవర్గ ప్రజలకు తాగునీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 0.5 టీఎంసీల నీటి కేటాయింపు కూడా జరిగిపోయింది. రూ. 50 లక్షలు మంజూరు చేసి సర్వే చేయించారు. రూ. 150 కోట్ల అంచనాలతో టెండర్లకు రంగం సిద్ధం చేసిన సమయంలో ఎన్నికలు రావటంతో.. ప్రాసెస్ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా జిల్లాలో వాటర్ గ్రిడ్ అమలు చేస్తే... కోయిల్‌సాగర్ కథ కంచికి చేరినట్లేనని అంటున్నారు. గ్రిడ్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు తాగు నీరందుతుంది కాబట్టి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అటు స్థానిక ప్రజల్లోనూ ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు పథకం ప్రారంభించి పూర్తి చేస్తే 18నెలల్లో పరిగికి తాగునీరు అందుతుంది. కానీ గ్రిడ్ అమలు కావాలంటే కొన్నేళ్లు పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కోయిల్ సాగర్‌ను గ్రిడ్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పథకానికి రూపకల్పన ఇలా... పరిగి నియోజకవర్గంలో గత దశాబ్ద కాలంగా వేసవి వచ్చిందంటే తీవ్ర నీటిఎద్దడి ఏర్పడుతూ వస్తోంది. ఇదే క్రమంలో 20కి పైగా గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య కూడా ఉందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి గత ఐదారు సంవత్సరాలుగా కోయిల్‌సాగర్ నుంచి నీళ్లందించేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రులకు , మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వం కోయిల్‌సాగర్ నుంచి నీరందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించింది. రంగంలోకి దిగిన అధికారులు నియోజకవర్గ పరిధిలోగల 442 ఆవాసాలకు నీరందించాలంటే 0.5 టీఎంసీల నీరు అవసరమని తేల్చారు. ఇందుకోసం రూ. 300 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. మొదటి విడతగా 243 ఆవాసాలకు నీరందించేందుకు నిర్ణయించి రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.50 లక్షలు మంజూరు చేయటంతో సర్వే పనులు పూర్తిచేసి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. ఈదశలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పనులకు బ్రేక్‌పడింది. వాటర్‌గ్రిడ్‌పై కసరత్తుతో... పరిగికి కోయిల్‌సాగర్ నీరందించేపథకానికి త్వరలో టెండర్లు పిలుస్తారని, పనులు ప్రారంభమవుతాయని పరిగి ప్రజలు కలలుగంటున్న తరుణంలో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను తెరపైకి తెచ్చింది. జిల్లా యూనిట్‌గా తీసుకుని వాటర్‌గ్రిడ్‌కు ప్రతిపాదనలు తయారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు జిల్లాలో ఉన్న సుమారు 50 లక్షల మందికి 10 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం మంజీరా, నాగార్జునసాగర్, జూరాల, సింగూర్ ప్రాజెక్టుల్లో ఎక్కడి నుంచి నీళ్లు తేవటం సులువవుతుందనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పరిగి నియోజకవర్గానికి కోయిల్ సాగర్ నీరందించే పథకం కథ కంచికి చేరినట్లైంది. -
‘వాటర్ గ్రిడ్’తో నీటి కష్టాలకు చెక్!
యాచారం: జిల్లాలో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వాటర్ గ్రిడ్ల ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వాట ర్ గ్రిడ్ అమలులో భాగంగా మొదట గ్రామా ల్లో జనాభాపై అధికారులు సర్వే చేస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం జనాభాతో పాటు 2050 వరకు వృద్ధిచెందే జనాభాకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఈ సర్వే చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ విజయలక్ష్మి ఆధ్వర్యంలో యాచారం, ఇబ్రహీంపట్నం, మంచా ల, హయత్‌నగర్ మండలాల ఏఈలు సర్వేలో నిమగ్నమయ్యారు. ప్రస్తుత జనాభా ఎంత.. 2050 వరకు ఏ మేరకు పెరుగుతుంది.. దీనికనుగుణంగా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తే నీటి సమస్య తీరుతుందనే విషయంలో ఏఈలు సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి నిత్యం 100 లీటర్లు.. ఆర్డబ్ల్యూఎస్ లెక్కల ప్రకారం పట్టణాల్లోని ఒక్కో వ్యక్తికి నిత్యం 135 లీటర్లు, గ్రామాల్లోని వ్యక్తికి 40 లీటర్ల నీరు అందించాలనే నింబంధన ఉంది. కానీ ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇందులో భాగంగానే గ్రామాల్లోని ప్రజలకు నిత్యం 100 లీటర్లు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం మనుషులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మూగజీవాల నీటి అవసరాలు, విద్యాలయాలు, పరిశ్రమలకు అవసరమయ్యే నీటి వినియోగంపైనా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 2011 లెక్కల ప్రకారం 4 లక్షల వరకు జనాభా ఉంటుందని లెక్కలు కట్టారు. ప్రస్తుతమున్న జనాభా మరో 30 ఏళ్లలో ఏ మేరకు పెరుగుతుందో.. అప్పుడు కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. ఏయే గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి...వాటికి ఏమేరకు నీటి కేటాయింపులు అవసరమనే అంశంపై సమగ్ర సర్వే జరుపుతున్నారు. సంపులు, ట్యాంకుల నిర్మాణాలపై దృష్టి.. ప్రస్తుతం గ్రామాల్లో లక్ష నుంచి రెండు లక్షల లీటర్ల మధ్యనే నీటి నిల్వ చేసుకునేలా ట్యాంకులు, సంపులు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తికి నిత్యం వంద లీటర్లు ఇవ్వడంతోపాటు ఇతర అవసరాల కోసం కూడా నీటి కేటాయింపులు జరపాల్సి ఉండడంతో కొత్తగా ఎక్కువ పరిమాణంలో ఉండే ట్యాంకులు, సంపుల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి సరఫరా అయ్యే కృష్ణాజలాలను గునుగల్ రిజర్వాయర్ నుంచి డివిజన్ ప్రజలకు అందిస్తున్నారు. జిల్లాలో నీటి అవసరాల దృష్ట్యా అక్కంపల్లి నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటిని తరలించేలా ఆలోచనలు చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. కాగా గ్రిడ్ల వల్ల ప్రజలకు సరిపడా తాగునీరు అందుతుంది వాస్తవమే కాని నీటి కేటాయింపులు ఎలాగా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాగర్‌లో నీటి నిల్వ తగ్గిపోతే.. ఎలాగా అనే విషయంలోనూ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. -
తెలంగాణలో మరో సర్వే!
-
వాటర్ గ్రిడ్ సమావేశానికి కేసీఆర్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తాగునీటి అందించే పథకం కోసం బుధవారం వాటర్‌గ్రిడ్‌పై సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 600కు పైగా ఇంజనీర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. నీటిపారుదల నిపుణుల నుంచి అభిప్రాయాలను, సలహాలను తెలంగాణ ప్రభుత్వం సేకరించనుంది. ఈ సమావేశం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జరిపిందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాటర్ గ్రిడ్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నారు.