
'సెలవుల్లో కూడా పని చేసేందుకు రెడీగా ఉండాలి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వాటర్ గ్రిడ్' పథకం పనులను అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని ఐటీ శాఖమంత్రి కె. తారక రామారావు అధికారులకు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు యుద్ధ ప్రాతిపదికన వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సెలవు రోజుల్లోనూ పని చేయడానికి అధికారులు, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఎలాంటి పాలనాపరమైన అనుమతులైనా ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందని అధికారులకు తెలియజేశారు.