రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి రూ.5 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి రూ.5 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అంగీకరించింది. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై.. బుధవారం సీఎం కె.చంద్రశేఖరరావు సమీక్షిస్తున్న సమయంలోనే అక్కడికి వచ్చిన హడ్కో ప్రతినిధులు ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిని బట్టి వివిధ దశల్లో రుణ మొత్తాన్ని అందిస్తామని వారు హామీ ఇచ్చారు. వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటయ్యాక మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు.