నీతి ఆయోగ్ నుంచి నిధులివ్వండి | Vice-President Arvind panagariya meets cm kcr | Sakshi
Sakshi News home page

నీతి ఆయోగ్ నుంచి నిధులివ్వండి

Published Fri, Jul 3 2015 12:17 AM | Last Updated on Wed, Oct 17 2018 6:01 PM

నీతి ఆయోగ్ నుంచి నిధులివ్వండి - Sakshi

నీతి ఆయోగ్ నుంచి నిధులివ్వండి

 * నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియాకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
 * మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాలకు ప్రశంస

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నుంచి నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను కోరారు. ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన అరవింద్ పనగరియా గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలి శారు.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పథకాల నిర్వహణ, ప్రభుత్వవిధానాలు తది తర అంశాలపై చర్చ జరిగింది. గతంలో నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం నిధులు మంజూరు చేసేదని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నిధులివ్వాలని, మళ్లీ వాటిని వడ్డీతోపాటు రాష్ట్రాల నుంచి తీసుకోవాలని సూచించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని సీఎం కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, హరితహారం పథకాలను సీఎం వివరించారు. కొత్త పారిశ్రామిక విధానంతోపాటు రాష్ట్రం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ లాంటి కార్యక్రమాలను అరవింద్ పనగరియా ప్రశంసించారు. ముఖ్యమంత్రి చేసిన వినతులపట్ల పనగరియా సానుకూలంగా స్పందించారు. సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు ప్రదీప్‌చంద్ర, బీపీ ఆచార్య, నర్సింగ్‌రావు, ఎంజీ గోపాల్, సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎంతో సమావేశానికి ముందు పనగరియా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కిషన్‌నగర్‌ను సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement