camp office
-
డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట చిరుద్యోగుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్‌లలో పనిచేసే చిరుద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఎదుట మరో విడత ఆందోళన చేపట్టారు. 15–20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి.. వారి స్థానంలో తాము చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూటమి ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తీసుకొస్తుండటంతో చిరుద్యోగులు ఇప్పటికే సెపె్టంబర్ 13, అక్టోబర్ 6 తేదీల్లో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. చిరుద్యోగుల ఆందోళన విషయాన్ని కార్యాలయ అధికారులు చిరుద్యోగుల సంఘ ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. ఉద్యోగులెవరినీ తొలగించకుండా శాఖాపరంగా చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ తన కార్యాలయ అధికారుల ద్వారా హామీ ఇచ్చినట్టు ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ లే»ొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ చోట్ల తొలగించిన ఉద్యోగుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని.. రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు చెప్పారని ఆయన తెలిపారు. -
బాబు దుబారా భరించలేనంత..!
సాక్షి, అమరావతి: ప్రజల సొమ్ము దుబారా చేయడంలో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. గతంలో 2014 – 19 మధ్య సీఎంగా ఉండగా ఆయన విలాసాలు, హంగు, ఆర్భాటం, సొంత ఇళ్లు, క్యాంప్ ఆఫీసులకు పెట్టిన ఖర్చు వంద కోట్లకు పైనే. ఆ ఐదేళ్లలో హైదరాబాద్‌లో రెండేసి బంగ్లాలు, రెండేసి క్యాంపు ఆఫీస్‌లు, విజయవాడలో రెండేసి క్యాంపు ఆఫీస్‌ల పేరుతో మరమ్మతులకు, సెక్యూరిటీ, సీసీ కెమేరాలు, పోలీస్ బరాక్‌లకు కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేశారు.హైదరాబాద్‌లో ఏడు నక్షత్రాల పార్క్ హయత్ హోటల్లో ఉంటూ ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబుకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ, స్టార్ హోటల్లో ఉంటూ కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం గమనార్హం. ఇవన్నీ టీడీపీ సోషల్ మీడియాకు మచ్చుకు కూడా కనిపించడంలేదు. పైగా వైఎస్ జగన్ భద్రత కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ దుష్ప్రచారానికి దిగారు.చంద్రబాబు 2014లో సీఎం అయిన తర్వాత హైదరాబాద్ మదీనాగూడలోని తన బంగ్లాను క్యాంపు ఆఫీస్‌గా ప్రకటించుకున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 65లోని తన ఇంటిని కూడా సీఎం క్యాంపు ఆఫీస్‌గా ప్రకటించుకున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. ఇక విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని, ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌ను కూడా క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. ఆ తరువాత లింగమనేని గెస్ట్ హౌస్‌ను సీఎం క్యాంపు, నివాస భవనంగా చేసుకున్నారు. వీటన్నింటికీ మరమ్మత్తులు చేయడంతో పాటు భద్రత ఏర్పాట్లు, సీసీ కెమేరాల ఏర్పాటు, పోలీస్ బరాక్ల నిర్మాణం, 24 గంటలు నిఘా ఏర్పాట్లు, విద్యుత్తు పనులు, విజయవాడ క్యాంపు ఆఫీస్‌లో కంట్రోల్ ఎక్విప్మెంట్, రహదారుల నిర్మాణాలకు చంద్రబాబు ఆ ఐదేళ్లలో ఏకంగా 126.76 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ సమయంలో ఇష్టానుసారం క్యాంపు ఆఫీస్‌లకు కోట్ల రూపాయలు వెచ్చించడాన్ని అప్పట్లోనే అధికార వర్గాలు తప్పుపట్టాయి. అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్ హౌస్‌ను ముఖ్యమంత్రి నివాసంగా మార్చుకుని అక్కడ రోడ్ల నిర్మాణం, భద్రత కోసం ఏకంగా రూ.10 కోట్లు వ్యయం చేశారు.కార్యాలయాల పేరుతో సెక్యూరిటీ తదితరాలకు 2014–19 మధ్య చంద్రబాబు చేసిన కొన్ని ఖర్చులు ఇలా.. ఇదంతా జీవోల ద్వారా చేసిన ఖర్చే..» హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని సీఎం కార్యాలయం (ఎల్ బ్లాక్)రూ.14.63 కోట్లు»సీఎం కోసంహైదరాబాద్ సెక్రటేరియట్లో హెచ్ బ్లాక్‌కు రూ.6.29 కోట్లు»హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ కోసం రూ.9.47 కోట్లు»సీఎం కార్యాలయం ఫర్నిచర్‌కు రూ.10.00 కోట్లు»మదీనాగూడ ఫామ్ హౌస్, జూబ్లిహిల్స్ అద్దె ఇంటికి రూ.4.37 కోట్లు»విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్, కలెక్టరేట్లో సీఎం క్యాంపు ఆఫీసులకు రూ.42.00 కోట్లు»లింగమనేని గెస్ట్ హౌస్‌కు రూ.10.00 కోట్లు»హైదరాబాద్‌లో పార్క్ హయత్ హోటల్లో బసకురూ.30.00 కోట్లు -
ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పార్టీ నేతలతో సమావేశం.. వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు
గుంటూరు, సాక్షి: ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నదానిపై వారితో చర్చలు జరిపారు. దీంతోపాటు రాబోయే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిత్వంపైనా వారి అభిప్రాయాలు తీసుకున్నారు.పార్టీ సూచనల మేరకు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిని నియమించారు. అలాగే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు.వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ సమావేశం జరిగింది. తొలుత వైఎస్సార్సీపీ జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. రేపు(గురువారం)కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆర్నెలలపాటు సమయం ఇవ్వాలని తొలుత జగన్ భావించారు. ఆ తర్వాతే చంద్రబాబు సర్కార్‌ను నిలదీయాలని భావించారు. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో అరాచకం మొదలైంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో.. బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు & నారా లోకేష్ ప్రొత్సహిస్తూ వస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు, అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. వైఎస్సార్సీపీపై ప్రతీకార దాడులు, అంతటా నేతల అధికార జులుం, వివిధ విభాగాలు.. వాటి అధిపతులు ఆఖరికి క్షేత్ర స్థాయి ఉద్యోగులపైనా వేధింపులు కొనసాగుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వంపై తక్షణ పోరును ప్రారంభించారు జగన్. మరోపక్క.. దాడులతో ఆందోళన చెందుతున్న పార్టీ కేడర్‌కు అధైర్య పడొద్దంటూ భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజులపాటు(ఇవాళ, రేపు) పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతుండడం విశేషం. -
సిద్ధిపేటలో హై టెన్షన్
-
హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్ లో BRS ఫ్లెక్సీ తొలగించిన కాంగ్రెస్
-
తాడేపల్లి : కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చంద్రబాబు ఆటవిక పాలనను ఎండగడుతూ జగన్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
పులివెందులలో ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జగన్ రాకతో పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో పోటెత్తిన జనం
-
గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీస్ కాల్చివేత
వేముల: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేతలు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీసును శనివారం రాత్రి కాల్చివేశారు. టీడీపీ వారు తన ఆఫీసును కాల్చివేసినట్లు కాంట్రాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తాము ఇక్కడ 4 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఏప్రిల్‌లో చేపట్టామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆపివేయాలని, తమకు అప్పజెప్పాలని ఒత్తిడి తెచ్చారaన్నారు.రెండు కిలోమీటర్ల పనులు ఇస్తామని చెప్పినప్పటికీ, నాలుగు కిలోమీటర్లూ తామే చేసుకుంటామని పట్టుబట్టారన్నారు. ఇందుకు తాను ఒప్పుకోకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆదివారం నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా క్యాంప్ ఆఫీసును కాల్చివేశారని తెలిపారు. సుమారు రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందుల క్యాంపు ఆఫీస్ కు తరలొచ్చిన జనసంద్రం..
-
నేడు వైఎస్ జగన్ ను కలిసిన కీలక నేతలు
-
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌తో పవన్.. క్యాంపు ఆఫీసు పరిశీలన
సాక్షి, విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. పవన్ ఆలోచనలు, అభిరుచి మేరుకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆఫీసు నిర్మాణం చేపట్టారు. పవన్ మెచ్చే విధంగా ఆయనకు నచ్చిన రంగుల్లో క్యాంపు ఆఫీస్ నిర్మాణం జరిగింది. ఇదంతా చూసిన తర్వాతే ఆఫీసుకు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం.కాగా, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి మంగళవారం తన ఆఫీసును పవన్ పరిశీలించారు. ఆఫీసు నిర్మాణంలో భాగంగా భవనంలో పైన అంతస్తులో నివాసం, కింద కార్యాలయం ఏర్పాటు చేశారు. అదే భవనంలో సమావేశం మందిరం కూడా అందుబాటులో ఉండటంతో ప్లాన్‌కు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం. తన ఆలోచనలు, అభిరుచులకు తగిన విధంగా క్యాంపు ఆఫీసులో పవన్ మార్పులు సూచించడంతో అందుకు తగినే విధంగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే ఆఫీసును వినియోగించుకున్నారు. మరోవైపు.. కాసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి పవన్ బయలుదేరారు. అలాగే, ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్ పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచిన విషయం తెలిసిందే. వై ప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా పవన్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఇక.. రేపు పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, గుంటూరు: అధికార మత్తులో టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్‌లోని ఫర్నిచర్‌పై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ నీతిమాలిన రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.‘‘ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంప్ కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు.‘‘వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరాం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. ఇదిలా ఉండగానే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైఎస్ జగన్‌ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి.’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. -
టీడీపీ-జనసేన హనీమూన్ నడుస్తోంది.. కొంతటైమిచ్చి పోరాడుదాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఎవరెన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్.. ‘‘40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారు అనేది మరిచిపోవద్దు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు వుంది. ఎన్నికలు ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలు పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ,బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోంది. మరి కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దాం.. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్‌లా, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి… ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ… ఇది అమలు జరిగిందా? లేదా? అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజూ ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో… ప్రతి సంవత్సరం కాలెండర్ విడుదలచేసి, ఆమేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకు వచ్చాం. ఇవన్నీ మనం చేసి, చూపించి… ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాం. కాని, ఎన్నికల్లో ఏమైందో తెలియదు.2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా ఇదేళ్లు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏమాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికీ మనంచేసిన మంచి బ్రతికే ఉంది. మనంచేసిన పాలనమీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మనపట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది. గడపగడపకూ మనంచేసిన మంచి ఇంకా బతికే ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.రాజకీయాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్. విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నదికూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయి. కానీ, ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ.. ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలి.అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగాలేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు. కాని మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏంచేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్లముందే చంద్రబాబుగారి పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూశాం.మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది చూడకుండా.. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని.. ప్రతి పథకం ప్రతి ఇంటికే అందించాం. అలాంటి పాలన మనదైతే.. ఈ రోజు కేవలం వాళ్ల పార్టీకి ఓటువేయకపోవడమే పాపం అన్నట్టుగా… రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు. ఆస్తులకు నష్టంచేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అవమానిస్తున్నారు. అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇవన్నీకూడా శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి.ఇంకోవైపు మనం మనకు ఓటు వేయకపోయినా వివక్ష చూపకుండా పథకాలకు ప్రతి ఇంటికీ డోలివరీ చేశాం. ఇప్పుడు వారు చేసిన పాపాలు ఊరికే పోవు. చంద్రబాబు రెండో పాపంకూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు. కేంద్రంలో 240 సీట్లకు అధికారపార్టీ పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్యరావడం, ఎన్టీయేలో కీలకంగా ఉన్న పరిస్ధితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకహోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోతే… రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు.మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్ ప్రకారం అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతిదీవెన, మత్స్యకారభరోసా వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి. ఇవి ఇప్పుడు వస్తాయో, రావో తెలియని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయి.ఈ పాపాలన్నీ పండేదాకా.. మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం గట్టిగా నిలబడి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కేవలం గుర్తు మాత్రమే చేస్తున్నాను. కష్టాలు రావడం సర్వ సహజం. ఎదుర్కొని నిలబడ్డం అన్నది మన చేతుల్లో అంశం.అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే. ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో… మనుషులు మీద దాడులు చేస్తున్న సమయంలో, ఆస్తులు నష్టంచేస్తున్నపరిస్థితుల్లో,అవమానిస్తున్న సమయంలో… ఉన్న ఒకే ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే.హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ వారికి టైం ఇద్దాం. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రజల్లోనే ఉంటాం.. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు ఇవ్వాళ్టికీ నాకు ఉంది. ఆ సత్తువ నాకు ఈ రోజుకీ ఉంది. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలి.జగన్ రాష్ట్ర పర్యటనత్వరలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని నిన్నటి నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీల భేటీలో ఆయన ఆ విషయాన్ని ధృవీకరించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను ఆయన పరామర్శిస్తారని తెలుస్తోంది. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్‌రెడ్డిని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు, రెడ్డి శాంతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చించారు. -
మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని, గత ఐదేళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు కచ్చితంగా బేరీజు వేసుకుంటారని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైఎస్సార్ సీపీకి ప్రజల మనసులో ఎప్పటికీ చోటు ఉంటుందని, పార్టీ పునర్ వైభవానికి ఇదే గట్టి పునాది అని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు ఎమ్మెల్సీలు, నేతలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఫలితాలపై ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ⇒ మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ⇒ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేయడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందేలా వైఎస్ జగన్ చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశాం. ప్రతి గడపకూ మంచి చేశాం. పార్టీ కచ్చితంగా పునర్ వైభవం సాధిస్తుందని మాకు గట్టి విశ్వాసం ఉంది. ⇒ రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్మెంట్పై అనుమానాలు, పోలింగ్ బూత్‌ల వద్ద మన ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గినా వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఉంది. గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మేమంతా నిస్సంకోచంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలుస్తాయి. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు తీరుపై కచ్చితంగా ప్రజలు దృష్టి సారిస్తారు. ఎన్నికల తీరుపై అనుమానాలుఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు జగన్ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో సైతం ఓట్లు రాకపోవడం సందేహించాల్సిన అంశమని, ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డాయన్నారు. ఈసీ ఒత్తిళ్లకు లొంగిపోయి హడావుడిగా పోలీసు అధికారులను బదిలీ చేసి కూటమికి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.పార్టీ శ్రేణులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకలు ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నాయని, పలుచోట్ల దాడులకు తెగబడుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నాయన్నారు. దీనిపై వెంటనే స్పందించిన వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలని నాయకులను ఆదేశించారు. పార్టీ తరపున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ ఘటనలను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తెచ్చి పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైస్ ఛైర్మన్ జకియా ఖానమ్, నూతనంగా గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎంపీలు మద్దిల గురుమూర్తి, తనూజ రాణి తదితరులున్నారు. ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రూహుల్లా, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, విడదల రజని, పేర్ని నాని, ఉషా శ్రీచరణ్, కె.నాగేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్ కుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, మాజీ ఎంపీ కేశినేని నాని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆగస్టు నుంచి ట్రైబల్ వర్సిటీలో క్లాసులు
ములుగు, రాయదుర్గం: సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో తొలి ఏడాది బీఏ (ఇంగ్లిష్), బీఏ (సోషల్ సైన్స్) కోర్సులను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా జాకారం సమీపంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క, ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీశాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిన 50 ఎకరాల స్థలాన్ని త్వరితగతిన అప్పగించినట్లయితే పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆ లస్యమైనప్పటికీ 337 ఎకరాలను రాష్ట్రం కేటాయించిందని చెప్పారు. అన్ని రకాల క్లియరెన్స్ వస్తే కాంపౌండ్ వాల్, డీపీఆర్, టెండర్ ప్రక్రియలను ప్రారంభిస్తామని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యువతలో గేమ్ చేంజర్‌గా మారనుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో 33 శాతం రిజర్వేషన్లను గిరిజనులకే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతి, వైద్యపరమైన మూలికలు, అడవి జీవన విధానాలు రీసెర్చ్‌లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మెంటార్ యూనివర్సిటీగా గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు. యూజీసీ అ«దీనంలోని వెళ్లేంతవరకు హెచ్‌సీయూ అసోసియే ట్ ప్రొఫెసర్ వంశీ కృష్ణారెడ్డిని ఓఎస్డీగా నియమించినట్టు వివరించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, కంట్రోలర్ ఎగ్జామినేషన్ పోరిక తుకారాం తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి హనుమకొండ కల్చరల్: పవిత్రమైన మహాశివరాత్రి రోజున వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని మహాశివుడికి అంకితం చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో కల్యాణమండపాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా శ్రీరుద్రేశ్వరశివలింగానికి అభిõÙకం నిర్వ హించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం క్యాంప్ ఆఫీసుకు కేశినేని నాని
-
సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఎంసీఆర్హెచ్ఆర్డీ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని (ఎంసీఆర్హెచ్ఆర్డీ) సందర్శించారు. అక్కడి బోధన సిబ్బందితో సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాల గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ డాక్టర్ శశాంక్ గోయల్ సంస్థ కార్యకలాపాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్‌కు వివరించారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను రేవంత్‌రెడ్డి సోలార్ పవర్ వాహనంలో కలియతిరుగుతూ పరిశీలించారు. సీఎం వెంట రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. ప్రగతిభవన్ రాచరికానికి చిహ్నంగా ఉందంటూ గతంలో విమర్శలు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనాన్ని సందర్శించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడంతో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్.. తన క్యాంపు కార్యాలయంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌ను వినియోగించడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంట్లోనే రేవంత్ నివాసముంటున్నారు. రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
క్యాంపు కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ
-
ప్రపంచంతో పోటీ పడండి
సాక్షి, అమరావతి: ప్రపంచంతో పోటీపడితేనే మన బతుకులు మారతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పేదరికం సమసిపోవాలంటే దానికి విద్య ఒక్కటే మార్గమని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనడానికి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గతనెలలో 15 రోజులపాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘అమెరికా పర్యటన ద్వారా గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడానికి మీకు ఆ అనుభవాలు ఉపయోగపడతాయి. ప్రపంచస్థాయికి ఎదగాలన్న కోరిక మీకు మరింత గట్టిపడుతుంది. ఈ పర్యటన మీ మనసులో ఒక ముద్ర వేస్తుంది. ప్రపంచం ఎలా ఉంది? మనం ఎక్కడ ఉన్నాం? ఎంత వెనుకబడి ఉన్నాం? అనేది అర్థమవుతుంది. ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. మనం చాలా వెనుకబడి ఉన్నాం.. ప్రపంచంతో మనం పోటీపడి నిలబడాలి. అప్పుడే మన బతుకులు మారతాయి. ఇందుకు చదువు ఒక్కటే సాధనం’ అని విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. విద్య అనే సాధనం ద్వారా పెద్ద పెద్ద కలలను కనాలని సూచించారు. ఆ కలల నుంచే వాస్తవాలు సాకారం అవుతాయన్నారు. ఇప్పటి నుంచే తెలుసుకోవాలి.. విద్యార్థులు చూసిన కొలంబియా యూనివర్సిటీ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 350 కాలేజీల్లో 21 కోర్సుల్లో సీటు సాధిస్తే ప్రభుత్వమే చదివిస్తుందని సీఎం జగన్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సంబంధిత కాలేజీల్లో ఫీజులు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకూ ఉంటాయన్నారు. వీటిలో సీటు తెచ్చుకుంటే జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా రూ.1.25 కోట్ల వరకు ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ‘సీఈవో వంటి స్థాయికి వెళ్లాలంటే ప్రతిభ, నైపుణ్యం ఉండాలి. మనం చదివే చదువులవల్లే ఇవి వస్తాయి. ప్రపంచ అత్యుత్తమ కాలేజీల్లో చదువుకోవడం ద్వారా మీ నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలు మీకు మంచిస్థానాల్లో ఉద్యోగాలు కల్పిస్తాయి. తద్వారా మీ జీవితాలు మారతాయి. అలాంటి కాలేజీల్లో విద్యాభ్యాసం కోసం, సీటు సాధించేందుకు మీరు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి’ అని సీఎం జగన్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ‘మీకు ఆసక్తి ఉన్న కోర్సు ఏంటి? ప్రపంచంలో ఈ కోర్సును అందిస్తున్న అత్యుత్తమ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి?’ అనేది ఇప్పటి నుంచే తెలుసుకోవాలని సూచించారు. ఆ కాలేజీల్లో సీటు రావాలంటేం ఏయే పరీక్షల్లో ఎన్ని మార్కులు రావాలో కూడా తెలుసుకోవాలన్నారు. జీమ్యాట్, జీఆర్ఈ, టోఫెల్ వంటి పరీక్షలు ఏమున్నాయో.. వాటికి ఎలా సన్నద్ధం కావాలో తెలియాలన్నారు. జీఆర్ఈ, జీమ్యాట్‌లకు కూడా ఉచిత శిక్షణ టోఫెల్‌కు ఎలా తీసుకువచ్చామో.. అలాగే జీఆర్ఈ, జీమ్యాట్‌లకు కూడా మెటీరియల్, ఉచిత శిక్షణను విద్యార్థులకు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. కొలంబియా యూనివర్సిటీ, వార్టన్, ఎల్ఎస్ఈ, ఇన్సీడ్.. ఇలాంటి యూనివర్సిటీలు, కాలేజీలు 350 ఉన్నాయని.. వీటిలో సీటు సాధించాలని హితబోధ చేశారు. ఆ కాలేజీల్లో కోర్సులు పూర్తి చేశాక విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పులు వస్తాయన్నారు. ఇది సాకారమైతే మీ, మీ కుటుంబాల బతుకులు మారడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంచినవారవుతారన్నారు. అంతేకాకుండా మీ స్థాయిలో మరో పది మందికి సహాయపడొచ్చని విద్యార్థులకు సీఎం హితబోధ చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ‘ఇక్కడున్న ఈ పిల్లలు చిన్నప్పుడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాలని కలలు కని ఉంటారు.. చాలా మందికి సీట్లు వచ్చాయి. ఆ విజన్ అక్కడితో పూర్తయ్యింది. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ నుంచి తర్వాత ఎక్కడికి అనేది విజన్ కావాలి’ అని సీఎం పేర్కొన్నారు. పాఠ్య ప్రణాళికలోకి 1,800 సబ్జెక్టులు మన పాఠ్యప్రణాళికలో లేని 1,800 సబ్జెక్టులను పాఠ్యప్రణాళికలోకి తెస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎంఐటీ, హార్వర్డ్ వంటి యూనివర్సిటీ నిపుణులతో తయారు చేయించిన సబ్జెక్టులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎడెక్స్‌తో ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. ఈ కోర్సులు చేసిన వారికి జాయింట్ సర్టిఫికేషన్ కూడా లభిస్తుందన్నారు. ఈ కోర్సులు నేర్చుకోవాలని.. దీనివల్ల ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ‘మీరు ఇలా విదేశాలకు వెళ్లి బయటి ప్రపంచం చూసినప్పుడు మరింత కష్టపడాలన్న స్ఫూర్తి మీలో కలుగుతుంది. ఈ పర్యటన మీకు మాత్రమే కాకుండా, మీ వల్ల ఇతరులకు కూడా స్ఫూర్తి కలిగిస్తుంది. ఒక స్థాయిలో ఉన్న మనం బాగా కష్టపడటం ద్వారా మరో స్థాయికి చేరుకుంటాం. మన కష్టమే మనల్ని పై స్థానాలకు తీసుకెళుతుంది. మీ అందరికీ అభినందనలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. పర్యటన ఎలా జరిగింది? అమెరికాలో పర్యటించిన విద్యార్థులు శివలింగమ్మ, చంద్రలేఖ, గణేశ్, జ్యోత్స్న, రాజేశ్వరి, గాయత్రి, రిషితారెడ్డి, యోగీశ్వర్, షేక్ అమ్మాజాన్, మనస్వినిలతోపాటు వారి తల్లిదండ్రులను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), కొలంబియా యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. ‘ఆణిముత్యాలు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 126 మంది విద్యార్థులను గుర్తించి వారికి పోటీపరీక్ష నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల భాషా పరిజ్ఞానాన్ని పరిశీలించి అమెరికా పర్యటనకు 10 మందిని ఎంపిక చేశామని సీఎంకు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం.. అమెరికా పర్యటన ఎలా జరిగిందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్, పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్, సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజనం డైరెక్టర్ నిధి మీనా, ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, ఐక్యరాజ్యసమితి సభ్యులు ఉన్నవ షకిన్ కుమార్, మంగ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అదృష్టంగా భావిస్తున్నా.. ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. నేను మహిళా సాధికారత, బాలికా విద్యపై ప్రసంగించాను. మీ విజన్ వల్ల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. మాకు చక్కటి అవకాశం కల్పించారు.. థ్యాంక్యూ సార్. – రాజేశ్వరి, విద్యార్థిని అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశమిచ్చారు.. మాకు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం కల్పించారు. విద్యా వ్యవస్థలో మీరు తీసుకొచ్చిన మార్పులన్నీ వివరించాం. మేం విమానం ఎక్కుతామని కలలో కూడా అనుకోలేదు.. కానీ మీరు సాధ్యం చేశారు. మీరు చెప్పిన ‘వన్ చైల్డ్.. వన్ టీచర్.. వన్ పెన్.. వన్ బుక్.. కెన్ చేంజ్ ద వరల్డ్’ మాటకు తిరుగులేదు.. మీ నమ్మకాన్ని నిలబెడతాం సార్. – అల్లం రిషితారెడ్డి, విద్యార్థిని యూఎన్వోను మీ వల్ల నిజంగా చూడగలిగా.. నేను యూఎన్వో గురించి సోషల్ బుక్స్‌లో చదువుకున్నాను. దాన్ని మీ వల్ల నిజంగా చూడగలిగాను. థ్యాంక్యూ సార్. ఏపీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందుతుందనేది నేను అమెరికాలో వివరించాను. – వంజివాకు యోగీశ్వర్, విద్యార్థి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిలబెట్టారు.. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా. డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి అనేక అంశాలపై మాట్లాడాను. అక్కడంతా ఆశ్చర్యపోయారు. మేం ఈ రోజు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నిలబెట్టారు. – సామల మనస్విని, విద్యార్థిని మీ గొప్ప ఆలోచన వల్లే.. విద్యావ్యవస్థలో చాలా మంచి మార్పులు తెచ్చారు. మీ గొప్ప ఆలోచన వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ రోజు మన రాష్ట్రం గొప్ప స్థాయిలో ఉందంటే అది మీ వల్లే. థ్యాంక్యూ సీఎం సార్. – షేక్ అమ్మాజాన్, విద్యార్థిని -
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై దాడి
సాక్షి,ఖమ్మం: మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న పూల కుండీలను పగలకొట్టి, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అయితే దీన్ని గమనించిన అక్కడి స్థానికులు వారించటంతో ఆ దుండగులు పరారయ్యారు. కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పొంగలేటి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది? -
రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘షర్మిలమ్మ అడ్రస్ ఈరోజు పాలేరు అయింది. తెలంగాణకు ప్రధాన గుమ్మం ఖమ్మం అయితే.. రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం అవుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. బాధ వచ్చినా చెప్పుకునే అడ్రస్ అవుతుంది ఈ కార్యాలయం’అని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సాయిగణేశ్నగర్లో పాలేరు నియోజకవర్గ వైఎస్సార్ తెలంగాణ పార్టీ క్యాంపు కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను మీ బిడ్డను, మీతో ఉంటాను అని.. పాలేరు ప్రజలకు ఇక్కడి మట్టి సాక్షిగా ప్రమాణం చేసిన షర్మిలమ్మను ఆశీర్వదించాలి’అని కోరారు. షర్మిల తెలంగాణ బిడ్డ కాదనే వారికి ఆమె ప్రేమ.. తెలంగాణలో షర్మిలమ్మ ఉనికి పోయిందనే వారికి ఆమె మానవత్వమే జవాబు చెబుతుందని పేర్కొన్నారు. వైఎస్‌ది జగమంత కుటుంబం పాలేరు నియోజకవర్గం వేదికగా నిర్మిస్తున్న పార్టీ కొత్త కార్యాలయం వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8న ప్రారంభించనున్నట్లు విజయమ్మ తెలిపారు. వైఎస్ తన కుటుంబాన్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించారని ఆమె చెప్పారు. ఆయనది జగమంత కుటుంబమని, రాజశేఖరరెడ్డి కుటుంబం అంటేనే ప్రజల కుటుంబమని చెప్పారు. రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం షర్మిల ప్రయత్నం చేస్తోందని అన్నారు. షర్మిలమ్మ పాలేరులో పోటీకి నిర్ణయించుకోవడం యాదృచ్ఛికం కాదని, అది దైవేచ్ఛగా భావిస్తున్నామని తెలిపారు. తమకు పులివెందుల ఎలాగో.. షర్మిలకు పాలేరు కూడా అలాగేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గడిపల్లి కవిత, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన జోయాలుక్కాస్ చైర్మన్
సాక్షి, తాడేపల్లి: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ అలుక్కాస్ వర్గిస్ జాయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా వర్గిస్ జాయ్‌తో స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్.. జోయాలుక్కాస్ చైర్మన్‌కు వివరించారు. ఈ సమావేశంలో జోయాలుక్కాస్ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్‌లు సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు భేష్! -
సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
Jagananna Thodu: ఆ కష్టం రావొద్దనే ఈ పథకం తీసుకొచ్చాం
సాక్షి, తాడేపల్లి: చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని, అందుకే వాళ్లకు అండగా నిలిచామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో జగనన్న తోడు పథకంలో భాగంగా.. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాల నగదు జమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిరు వ్యాపారులు వారి కష్టంపైనే ఆధారపడతారు. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం. చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం నిలుస్తోంది. ఒక్కో వ్యాపారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నాం. కొత్తగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటిదాకా 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారాయన. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్మెంట్ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని ఉద్ఘాటించారాయన. ‘‘పాదయాత్రలో.. తోపుడు బండ్ల వ్యాపారుల కష్టాలు చూశాను. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడి కష్టం కావొద్దనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చాం. లబ్ధీదారుల పూర్తి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈరోజే ఈ వడ్డీని జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్ వెల్లడించారు. అర్హత ఉండి కూడా పథకం అందుకోని వారు ఉంటే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్. ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేశారు. అంతకు ముందు పలువురు చిరువ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎలా బాగుపడ్డామనేది వివరించగా.. సీఎం జగన్ సంతోషించారు. ఇక ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం.. చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌కు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుంచి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు, ఎస్ఎల్బీసీ కన్వీనర్ (ఏపీ) నవనీత్ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరు అయ్యారు. -
CM YS Jagan Birthday: క్యాంప్ కార్యాలయంలో బర్త్‌డే వేడుకలు.. కేక్ కట్ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. సీఎంతో కేక్ కట్ చేయించిన మంత్రులు.. శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బర్త్‌డే విషెస్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. చదవండి: మేనమామ సీఎం జగన్‌కు చిన్నారుల ప్రత్యేక శుభాకాంక్షలు -
CM YS Jagan Birthday: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బర్త్‌డే వేడుకలు
-
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం
-
మంత్రి విశ్వరూప్ క్యాంపు కార్యాలయంపై ఆందోళనకారుల దాడి
-
సరిలేరు మాకెవ్వరూ... అనవసర ఖర్చుల్లో ‘ గ్రేటర్’
జీహెచ్ఎంసీ మేయర్ క్యాంప్ కార్యాలయానికి (ఇంటి వద్ద) కానోపి షెడ్ నిర్మాణం కోసమంటూ దాదాపు రూ. 4.18 లక్షల అంచనా వ్యయంతో టెండరు పిలిచారు. ఇలా జీహెచ్ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు తాము ఏవి కావాలనుకుంటే అవి చేయించుకుంటున్నారు. ఓవైపు జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా.. వారు మాత్రం దేనికీ వెనుకాడటం లేరు. ప్రస్తుత పరిస్థితికి ఇది ఓ మచ్చుతునక ! – సాక్షి,సిటీబ్యూరో బల్దియా అంటే అంతే మరి.. జీహెచ్ఎంసీ ఖజానాలో చేరాల్సిన సొమ్మును ఉద్యోగులు సొంతానికి వాడుకుంటారు. ఇతర శాఖల్లో పనిచేసినప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించినా ఎలాంటి వాహనం లేనివారికి ఇక్కడికి రాగానే వాహనం వచ్చి వాలుతుంది. ఇక ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులైతే బల్దియా భవనాన్ని తమ సొంత ఇల్లే అనుకుంటారు. ఇంటికైనా రంగులు వేయాలనుకుంటే వెనుకాముందు కాస్త ఆలోచిస్తారేమో కానీ.. ఇక్కడ మాత్రం బాగున్నవాటిని సైతం కూలగొట్టి గొప్పగా కట్టించుకుంటారు. ఇలా ఎందుకంటే.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. వ్యయానికి నిధుల పరిమితి లేదు. అందుకే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సైతం ఖరీదైనవి కొంటారు. పాలకమండలి కొత్తదా, పాతదా అన్న తేడా లేదు. పదవి పోయాక వాటికి ఇంటికి తీసుకెళ్తారు. అధికారులూ ఆడంబరాలకు పోతారు. చేసిన అప్పులకు రోజుకు సగటున కోటి రూపాయల వడ్డీ కడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ దర్పం ఏమాత్రం తగ్గకుండా బాగున్నవి కూల్చి కొత్తగా కడుతుండటం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవచ్చుకానీ.. వారికవి మామూలే. ప్రధాన కార్యాలయ భవనంలో గత రెండు మూడేళ్లుగా ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణ పని జరుగుతూనే ఉంది. కాళేశ్వరం, మిషన్ భగీరథల వంటి ప్రాజెక్టులు, ఎన్నో ఫ్లై ఓవర్లు పూర్తయినా.. ఇక్కడ ఎప్పుడూ ఏదో పని జరుగుతూనే ఉంటుంది. అందుకు కారణం .. వారికే తెలుసు. ఇక పనులే కాదు.. ఏవిషయంలోనూ ఖర్చులకు వెనుకాడరు. టీ , బిస్కెట్ల నుంచి ఉత్సవాల నిర్వహణల వరకు ఖర్చు గ్రాండ్‌గా ఉండాల్సిందే. పాత పాలకమండలి.. కొత్త పాలకమండలి.. అప్పటి అధికారులు, ఇప్పటి అధికారులు అనే తేడా ఏం లేదు. అందరూ అతిరథులే.. ఖర్చుల మహారథులే. చెప్పుకుంటే.. ఎంతెంతో.. ► బల్దియాలో చాలామంది ఘనాపాటీలే. జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక తొలి పాలకమండలి (2009–14)లో రెండు పార్టీల ఫ్లోర్‌లీడర్లు బల్దియాకు చెందిన సోఫాలు, జనరేటర్లు వంటివి సైతం ఇళ్లకు తరలించుకు వెళ్లారు. వారి కార్యాలయాల్లో ఉన్న వాటిని తమ పదవి పోగానే వాటిని సైతం ఇళ్లకు తీసుకెవెళ్లారు. ► కాగిత రహిత పాలన కింద ల్యాప్‌టాప్‌లు తీసుకొని తిరిగి ఇచ్చేయని వారెందరో. ► అధ్యయన యాత్రల పేరిట..వాటికి వెళ్లకుండానే అందుకయ్యే ఖర్చు దాదాపు లక్ష రూపాయలకు పైగా సొంత జేబుల్లో వేసుకున్నవారున్నారు. ప్రస్తుత పాలకమండలి అయితే.. ► మేయర్ క్యాంప్ కార్యాలయంలో(ఇంట్లో) కరెంట్ లేదంటూ భారీ ఇన్వర్టర్ను కోరడం రచ్చ కావడంతో వెనక్కు తగ్గారు. ► డిప్యూటీ మేయర్ కార్యాలయం ఆధునీకరణ చేపట్టారు. గత డిప్యూటీ మేయర్ కంటే తక్కువేం కాదంటూ రూ. 20 లక్షలు ఖర్చుచేస్తున్నారు. గత పాలక మండలి కూడా తక్కువేం కాదు.. ► గత పాలకమండలి(2016–21)లో డిప్యూటీ మేయర్ చాంబర్ ఆధునీకరణ పేరిట దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు ► ఖరీదైన సెల్ఫోన్లు పాలక మండలి సభ్యులతోపాటు మేయర్ పేషీల్లోని ఉద్యోగులు సైతం పొందారు. ► మేయర్ కోసం ఒకటో అంతస్తులో ఒక చాంబర్ ఉండగా, పైన ఏడో అంతస్తులో మరొకటి ఏర్పాటు చేసుకున్నారు. అధికారులూ అంతే.. ► బాగున్న పన్వర్హాల్ను ఆధునీకరణ పేరిట లక్షలు ఖర్చు చేసి.. అసౌకర్యంగా మార్చారు. ► ప్రతి సోమవారం ప్రజావాణి, ఫేస్ టూ ఫేస్ వంటి కార్యక్రమాలేవీ లేకున్నా హాస్పిటాలిటీ ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయి. పన్వర్ హాల్లో విలేకరుల సమావేశం పెట్టినా రూ. 20వేలు ఖర్చు చూపిస్తారు. ► ఎంతో మోజుపడి అద్దంలా చాంబర్లకు హంగులదుకున్న అధికారులు.. ఆ చాంబర్ల సౌఖ్యం పొందకుండానే బదిలీ అయి వెళ్లడం విచిత్రం. ► ఒక విభాగం ఆధునీకరణ పనుల కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. కొన్ని విభాగాల పనులుఇంకా జరుగుతున్నాయి. ► చెప్పుకుంటూ పోతే.. బల్దియాలో ఇలాంటిచిత్రవిచిత్రాలింకా ఎన్నెన్నో ! పొదుపు పాటించాలి.. దుబారా ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించాలి. ప్రస్తుతం నెలనెలా జీతాల చెల్లింపులకే ఇబ్బందులు పడుతున్న తరుణంలో వృథా ఖర్చుల్ని నిలిపివేస్తే మేలు. ప్రజలు చెల్లించిన పన్నుల నిధుల్ని ప్రజా సదుపాయాలకు వాడాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బల్దియా చట్టంలో ఖర్చు చేయొచ్చని లేదు.. మేయర్, డిప్యూటీ మేయర్ల చాంబర్లకు ఖర్చుచేయాలని బల్దియా చట్టంలో లేదు. క్యాంప్ కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేసుకోవచ్చుననీ లేదు. ఫ్లోర్‌లీడర్లు, వారికి కార్యాలయాలు, ఫర్నీచర్ వంటివి లేవు. హోదాకు తగ్గట్లు ఉండేందుకు గౌరవంతో చేసేవి మాత్రమే. – సీనియర్ అధికారి, జీహెచ్ఎంసీ మీసాలకు సంపెంగనూనె.. మింగ మెతుకు లేకున్నా.. మీసాలకు సంపెంగనూనె అన్నట్లుంది జీహెచ్ఎంసీ వ్యవహారం. జీహెచ్ఎంసీలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడింది. బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. అయినా ఆడంబర ఖర్చులు, దుబారా వ్యయం తగ్గించుకునే పరిస్థితిలో లేరు. చాంబర్ల మార్పులు, అనవసర రిపేర్లు, వాహనాల వినియోగం, లగ్జరీ ఐటెమ్స్ కొనుగోలు, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తగ్గకపోగా, పెరుగుతున్నాయి. అవినీతి పెచ్చరిల్లి పోతున్నది. – ఎం. శ్రీనివాస్, సీపీఎం నగర కార్యదర్శి సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నిర్మించాలి బల్దియా కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడితే ఎంతో ప్రయోజనం. పారిశుధ్య కార్మికుల స్వేదంతోనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది. కోట్లకు కోట్ల దుబారా ఖర్చుల్ని తగ్గించాలి. డిప్యుటేషన్ మీద వచ్చి పాతుకుపోయిన వారిని మాతృసంస్థలకు పంపించాలి. – యు.గోపాల్, అధ్యక్షుడు, జీహెచ్ఎంఈయూ చదవండి: అంతా మీ ఇష్టమైపోయింది.. పిలవని కార్యక్రమానికి రాలేను.. -
విద్యుత్ వెలుగులతో ముస్తాబయిన ఏపీ సీఎం జగన్ కార్యాలయం
-
7 పరిశ్రమలు.. రూ.11,239.16 కోట్లు పెట్టుబడుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.11,239.16 కోట్ల పెట్టుబడితో కొత్తగా ఏడు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమల ద్వారా కొత్తగా ప్రత్యక్షంగా 17,334 మందికి ఉద్యోగాలు రానుండగా పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఏర్పాటు కానున్న పరిశ్రమల వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటూనే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రిటైల్ పాలసీకి కూడా ఇదే సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలు, పెట్టుబడుల వివరాలు ఇవీ.. జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ రూ.7,500 కోట్ల పెట్టుబడి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామం తమ్మినపట్నం వద్ద జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ధరతో ఇచ్చేందుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. 2.25 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా నాలుగేళ్లలో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.401 కోట్లతో కొప్పర్తిలో ‘పిట్టి’ ప్రాజెక్టు కడప సమీపంలోని కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇక్కడ ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్తు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం రూ.401 కోట్లు పెట్టుబడి పెట్టి ప్రత్యక్షంగా 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. రూ.486 కోట్లతో కొప్పర్తిలో నీల్కమల్ పరిశ్రమ కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నీల్కమల్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్ఐపీబీ బోర్డు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పలు పరిశ్రమలు నెలకొల్పిన నీల్కమల్ ఇక్కడ అన్నిటికంటే పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.486 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇక్కడ ఫర్నీచర్, ఇతర గృహోపకరణాల తయారీ చేపట్టనున్నారు. తద్వారా ప్రత్యక్షంగా 2,030 మందికి ఉద్యోగాలు రానుండగా పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నాయుడుపేటలో రూ.627 కోట్లతో గ్రీన్‌టెక్ విస్తరణ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ విస్తరణకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఫోర్డ్, హ్యుందాయ్, ఫోక్స్‌వాగన్ తదితర కంపెనీలకు గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ స్టీల్, ఐరన్ ఉత్పత్తులను అందిస్తోంది. అత్యాధునిక రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ చేపట్టింది. జర్మనీ నుంచి ఐఎల్టీ ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రీన్‌టెక్ వినియోగించనుంది. ప్రస్తుతం 2,700 మందికి ఉద్యోగాలు కల్పించగా విస్తరణ ద్వారా అదనంగా 2,200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టగా విస్తరణ ద్వారా మరో రూ.627 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. తాడేపల్లిలో రూ.194.16 కోట్లతో రిటైల్ బిజినెస్ పార్క్ టెక్స్టైల్స్, గార్మెంట్స్ మార్కెట్ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్ పార్క్ నిర్మాణానికి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో రిటైల్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.194.16 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. పార్క్‌లో భాగంగా 900 వరకూ రిటైల్ యూనిట్స్ వస్తాయి. తద్వారా సుమారు 5 వేల మందికిపైగా ప్రత్యక్షం ఉద్యోగాలు, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాల హబ్‌గా ఈ పార్క్ ఏర్పాటు అవుతుంది. రాష్ట్రంలో తయారయ్యే వాటిలో దాదాపు 70 శాతం విక్రయాలు ఇక్కడనుంచే జరుగుతాయని అంచనా. పార్క్‌లో భాగంగా ఏర్పాటయ్యే ఒక్కో స్టోర్‌లో ఏటా సుమారు రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. రూ.30 కోట్లతో చిత్తూరు జిల్లాల్లో వస్త్ర పరిశ్రమ చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. సుమారు రూ.30 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే పరిశ్రమ ద్వారా 2,304 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో 90 శాతం మహిళలకే ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇక్కడ పురుషులు, పిల్లల దుస్తులు తయారవుతాయి. విశాఖలో సెయింట్ గోబియాన్ రూ.2,001 కోట్ల పెట్టుబడి విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో నిర్మాణం జరుగుతున్న సెయింట్ గోబియాన్ పరిశ్రమకు ఏర్పాటు కాలవ్యవధి పొడిగింపునకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. కోవిడ్ కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ గడువు పెంచాలన్న సెయిట్ గోబియాన్ వినతి మేరకు జూన్ 2022 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సెయింట్ గోబియాన్ మూడు దశల్లో రూ.2,001 కోట్ల పెట్టుబడి పెడుతుంది. తద్వారా 1,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ► ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి జి.జయరాం, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. -
YS Jagan: 3 ప్రాంతాల్లో చిన్నారులకు.. అత్యుత్తమ ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం మూడు చోట్ల అత్యాధునిక సదుపాయాలతో కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతితోపాటు కృష్ణా–గుంటూరు ప్రాంతంలో మూడు అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్లను నెలకొల్పాలని సూచించారు. చిన్న పిల్లల కోసం ఏర్పాటయ్యే పీడియాట్రిక్ కేర్ సెంటర్లను ఒక్కొక్కటి రూ.180 కోట్లతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కోవిడ్ థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చిన్నారులను భద్రంగా కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షలో సమగ్రంగా చర్చించారు. థర్డ్‌వేవ్‌పై అనాలసిస్, డేటాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. థర్డ్ వేవ్ వస్తుందా? లేదా? అన్నదానిపై శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదన్నారు. చిన్నారులకు టీకాల కార్యక్రమం సక్రమంగా కొనసాగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. థర్డ్‌వేవ్‌పై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, పిల్లలకు పౌష్టికాహార పంపిణీ సవ్యంగా కొనసాగేలా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించేందుకు ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఒకవేళ కోవిడ్ థర్డ్‌వేవ్ కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది? తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పీడియాట్రిక్ సింప్టమ్స్ (పిల్లల్లో కోవిడ్ లక్షణాలు) గుర్తించేందుకు ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. ఈమేరకు ఇప్పటి నుంచే శిక్షణ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి. టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలి. పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించేలా వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. జాతీయ ప్రమాణాలను అనుసరించి పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయాలి. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలి. అన్నీ సమకూర్చుకుని సిద్ధంగా ఉండాలి థర్డ్‌వేవ్ వస్తుందనే అనుకుని కావాల్సిన మందులను సిద్ధం చేసుకోండి. అప్పటికప్పుడు మందులు కావాలంటే దొరకవు. ముందుగానే కావాల్సిన నాణ్యమైన మందులను తెచ్చుకోవాలి. డాక్టర్లను గుర్తించడంతో పాటు అవసరమైతే రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. పౌష్టికాహారంపై పర్యవేక్షణ ప్రస్తుతం సంపూర్ణ పోషణ కింద డ్రై రేషన్ సవ్యంగా ఇస్తున్నామా? లేదా? గోరుముద్ద కింద కూడా డ్రై రేషన్ సవ్యంగా ఇస్తున్నామా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలి. ఇవన్నీ సక్రమంగా చేసుకుంటూ వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తే మనం ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటాం. పిల్లలకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రులను ముందుగానే ఎం ప్యానెల్ కోసం గుర్తించాలి. ప్రైవేట్ టీచింగ్ ఆస్పత్రులకు కూడా థర్డ్‌వేవ్‌పై సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి. ఆస్పత్రుల వారీగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు నివేదించాలి. – సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్పర్సన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టీ.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్టు (ఏపీహెచ్‌ఎస్‌ఎస్‌పి) ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఆయుష్ కమిషనర్ వి.రాములు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యాలయం కూల్చివేత
సాక్షి, వరంగల్ : వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు చెందిన హన్మకొండ హంటర్‌రోడ్డులోని క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారం కూల్చివేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగగా నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలే కారణమని గుర్తించారు. ఇందులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా ఉన్నట్లు ఇటీవల తేల్చారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి ఆదేశాలతో డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్మాణాన్ని పాక్షికంగా తొలగించారు. కాగా, నాలా విస్తరణ కోసం కార్యాలయ భవనాన్ని తొలగించడానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కాగా వరంగల్‌లో వరదల సంభవించిన సమయంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. (నాలాల ఆక్రమణపై కేటీఆర్ సీరియస్) నాలాలపై కొనసాగుతున్న కూల్చివేత వరంగల్ నగరంలోని నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, ప్రహారీల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం భద్రకాళి, ములుగు రోడ్డు, నయీంనగర్ నాలాలపై ఉన్న 22 ఆక్రమణలను బల్దియా సిబ్బంది తొలగించారు. ఇప్పటి వరకు 88 ఆక్రమణలు కూల్చివేసినట్లు ఏసీపీలు ప్రకాశ్ రెడ్డి, సాంబయ్య తెలిపారు. (ఓరుగల్లుపై కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ!) -
శాఖలవారీగా సీఎం వైఎస్ జగన్ సమీక్షలు
-
సీఎం జగన్.. బిజీబిజీ
సాక్షి, అమరావతి : నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారమంతా పాలనాపరమైన వ్యవహారాలతో తనమునకలుగా గడిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో, క్యాంపు కార్యాలయంలో పలుశాఖల అధికారులతో సమీక్షలు చేశారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపే.. ‘జగన్ ఓ మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను’ అని ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన రోజున ప్రకటించిన మాటలకు కట్టుబడి.. సుపరిపాలనా ఫలాలు ప్రజలకు వేగంగా అందించాలన్న తపనతో వివిధశాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశాక గురువారం తొలి రోజు నుంచే రాష్ట్ర పాలనపై పూర్తిగా పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేశారు. అధికారుల పరిస్థితి.. వారి పనితీరుపై కూడా ఆయన అవగాహనకు రావడం ప్రారంభించారు. పాలనను పరుగెత్తించాలనే తపన ఆయన కార్యశైలిలో అధికారులకు కనిపించింది. ప్రజలకు తాను ఇచ్చిన హామీల అమలుతో పాటు.. అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై ఆయన దృష్టి సారించారు. అధికారులతో సమావేశాలతో పాటు.. మధ్యలో వైఎస్సార్సీపీ వ్యవహారాలను కూడా ఆయన సమీక్షించారు. శుక్రవారం ఆయన షెడ్యూలు ఇలా సాగింది. - ఉదయం 9 గంటలకు : రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తోపాటు.. పలువురు పోలీసు అధికారులతో తన నివాసంలో సమావేశం - ఉదయం 10 గంటలకు : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్థికశాఖ అధికారులతో విస్తృత సమావేశం.. టెండర్ల ప్రక్రియ ప్రక్షాళనపై చర్చ, అధికారులకు పలు సూచనలు, ప్రభుత్వోద్యోగులు తమ పని గంటలకు మించి ఎవరూ పనిచేయరాదని నిర్దిష్ట ఆదేశాలు. - 11 గంటలకు : పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో రాజకీయపరమైన అంశాలపై చర్చలు - 11.30 గంటలకు : మళ్లీ అధికారులతో సమావేశం - మధ్యాహ్నం 1.30 గంటలకు : భోజన విరామం తర్వాత క్యాంపు కార్యాలయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మర్యాదపూర్వక భేటీలు - సాయంత్రం 4 గంటలకు : అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశం. అది ముగిసిన వెంటనే పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశం - సాయంత్రం 5 గంటలకు : మరికొందరు సందర్శకులను కలుసుకున్నారు. - రాత్రి 8 గంటలకు : తన అధికార కార్యక్రమాలన్నింటినీ ముగించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి సీఎం జగన్‌ను కలిసిన శ్రీలక్ష్మి తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి జగన్‌తో భేటీ అయ్యారు. -
సీఎంకు రెండు క్యాంప్ ఆఫీసులు ఉండవు
-
క్యాంపు కార్యాలయంగా చంద్రబాబు నివాసం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించుకున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఆధునాతన సౌకర్యాలతో విలాసవంతంగా నిర్మించిన ఈ భవనంలోకి చంద్రబాబు నాయుడు ఇటీవలే గృహప్రవేశం చేశారు. మే 31వ తేదీతో జీవో నెంబర్ 68 ద్వారా రహదారులు, భవనాల శాఖ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాన్ని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చడంతో భవన నిర్వహణ భారమంతా ఇప్పుడు ప్రభుత్వంపై పడనుంది. భవనానికి ఏర్పాటు చేసిన భద్రాత ఏర్పాట్లకయ్యే ఖర్చులతో పాటు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికయ్యే అన్ని రకాల వ్యయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించనుంది. ఇప్పటికే అప్పుల్లో, ఖర్చుల్లో ఉన్న ఏపీ సర్కారుకు తాజాగా మరింత భారమయ్యేలా భవనాల వ్యవహారం తయారయిందన్న విమర్శలున్నాయి. -
క్యాంపు కార్యాలయంగా చంద్రబాబు నివాసం
-
కేసీఆర్‌ను కలిసిన మోత్కుపల్లి
యాదాద్రి : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం సీఎం కేసీఆర్‌ను కలిసి తన కుమార్తె నిహారిక వివాహానికి హాజరుకావాలని లగ్నపత్రిక అందజేశారు. తెలుగుదేశం ఆవిర్భావంలో ఒకే పార్టీలో అత్యంత ప్రియమిత్రులుగా ఉన్న మోత్కుపల్లి, కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత వివాహ పత్రిక సందర్భంగా కలవడం అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. లగ్నపత్రికతో తన నివాసం ప్రగతిభవన్ కు వచ్చిన చిరకాల మిత్రులు మోత్కుపల్లిని కేసీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నవారందరినీ బయటకు పంపించి సుమారు గంటన్నరపాటు పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఈ ఇద్దరు నేతలు తమ గత స్మృతులను నెమరేసుకున్నారు. ఆమె పెళ్లికి ఖచ్చితంగా వస్తానని సీఎం మోత్కుపల్లికి మాట ఇచ్చారు. అలాగే తన కోరికను మన్నించి యాదాద్రిభువనగిరి జిల్లాను ప్రకటించినందుకు కేసీఆర్‌కు మోత్కుపల్లి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించేందుకు మల్లన్నసాగర్లో చేపట్టిన బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లు పూర్తచేయాలని కోరినట్లు తెలిసింది. కాగా వీరి కలయికపై రాజకీయంగా చర్చ మొదలైంది. కాగా ఇదే విషయంపై మోత్కుపల్లిని ప్రశ్నించగా తాను తన కుమార్తె వివాహానికి లగ్నపత్రిక అందించడానికి వెళ్లానే తప్ప ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. -
క్యాష్ లెస్ అమలులో జిల్లా రికార్డు
విజయవాడ : నగదు రహిత లావాదేవీల నిర్వహణలో భారతదేశం మొత్తం మీద జిల్లా రికార్డు సాధించిందని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శనివారం ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగదు రహిత లావాదేవీల అమలులో జిల్లా ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకోనుందన్నారు. జిల్లాలో 10,21,977మంది తెల్ల రేషన్కార్డుదారులలో డిసెంబర్లో 4,76,032 కార్డుదారులు నగదు రహితంగా రేషన్ తీసుకున్నారని వివరించారు. జిల్లాలో 46.5శాతం క్యాష్‌లెస్ లావాదేవీలు జరిపి దేశంలోనే పెద్ద రికార్డు సాధించామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లక్ష కంటే ఎక్కువ క్యాష్‌లెస్ లావాదేవీలు జరగలేదన్నారు. కృష్ణాజిల్లాలో ఎప్పటినుంచే ఈ–పోస్ అమలులో ఉండటం వల్ల ఇది సాధ్యమైందన్నారు. రేషన్ డీలర్లతో బ్యాంకింగ్ కార్యకలాపాలు జిల్లాలో 993 గ్రామాల్లో 2,161 రేషన్ డీలర్లతో బ్యాంకింగ్ కార్యకలాపాలను జరిపించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వీరిని బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్లుగా మార్పు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 600 మందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. ఈనెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంటులుగా నియమిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. వ్యాపార సంస్థల్లో కూడా పాస్ డివైజర్లు పట్టణాలు, గ్రామాల్లో సైతం ఈ–పాస్ డివైజర్లు అన్ని షాపులలో ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 32వేల షాపులను ఎంపిక చేశామని చెప్పారు. వారిలో రూ. 5 లక్షల వ్యాపారం కంటే అధికంగా లావాదేవీలు జరిపే వ్యాపారులతో వాణిజ్యపన్నుల శాఖాధికారులు, గ్రామాల్లో చిన్నచిన్న వ్యాపారులతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాస్ డివైజర్లు ఏర్పాటు చేయిస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 32 వేల షాపులలో పాస్ డివైజర్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని రానున్న 15 రోజుల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు. పోటో జెసీ 17 వీఐజీ 40ఏ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు -
ఒక బంగళా ఉంటే మరొకటి ఎందుకు?
హైదరాబాద్: ఒక బంగ్లా ఉన్నపుడు మరొకటి అవసరం లేదనేది తమ అభిప్రాయమని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉన్న బంగళా సరిపోక పోతే మరో బ్లాక్ నిర్మించుకుంటే సరిపోయేదన్నారు. ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద బంగళా కట్టిన సీఎం కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడం ఎందుకు ఆలస్యం అవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఈ నెల 30న భూనిర్వాసితుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరుగుతుందని తెలిపారు. సదస్సుకు కాళేశ్వరం, ఓపెన్‌కాస్ట్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్వాసితులందరినీ పిలుస్తున్నామన్నారు. నిర్వాసితుల గురించి మాట్లాడితే అభివృద్ధి నిరోధకులు అనే భావనను ప్రభుత్వం విడనాడాలన్నారు. వారి సమస్యలు వినకుండా దబాయింపుతో భూములు లాక్కోవడం సరికాదన్నారు. -
చంద్రబాబుకు నైతిక విలువల్లేవు
పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నైతిక విలువల్లేవని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పట్ల చంద్రబాబు ప్రవర్తించిన తీరు ఆయన నీచమైన బుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెబుతున్న సీఎం.. తాను అభివృద్ధి చెందారే కానీ.. రాష్ట్రం మాత్రం ఆయన పాలనలో వెనుకబడిపోయిందన్నారు. అవినీతిలో మాత్రం రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడం వెనుక చంద్రబాబు, ఆయన కుమారునిది ఎనలేని కృషి ఉందన్నారు. ప్రతిసారి జిల్లా పర్యటనలో జిల్లాను అభివృద్ధి చేశానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు జిల్లాకు ఏం చేశారో వివరించాలన్నారు. చంద్రబాబు మాటలు ప్రకటనల వరకే పరిమితమని, ఆచరణలో అవి అమలు కావన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలకు నిధులివ్వక పోవడం దారుణమన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. -
డబుల్ బెడ్రూంల సంగతేంది?: ఉత్తమ్
-
డబుల్ బెడ్రూంల సంగతేంది?: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు క్యాంపు కార్యాలయం ఉండగా.. దాన్ని కూల్చేసి కొత్త క్యాంపు కార్యాలయాన్ని నిర్మించడమేంటని మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కొత్త క్యాంపు ఆఫీసులోకి ప్రవేశించే ముందే పేదలకు నిర్మించి ఇస్తానన్న డబుల్ బెడ్రూం ఇళ్ల సంగతిని తేల్చాలని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించొద్దంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. -
నగదు రహిత లావాదేవీలకు సహకరించాలి
విజయవాడ : జిల్లాలో వ్యాపారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించి డిజిటల్ క్యాష్‌లెస్ ఎకనామీకి సహకరించాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. నగరంలో తన క్యాంపు ఆయన గురువారం బ్యాంకర్లు, హోల్ సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైతు బజార్ల ఏస్టేల్ అధికారులు, బ్యాంకర్లతో క్యాష్ లెస్ ఎకనామీపై సమావేశమయ్యారు. దేశంలో తొలిసారిగా ఈ జిల్లాలో నగదు రహిత వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు. జిల్లాలో సుమారు 60 వేల మంది వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వీరిలో 7,500 మంది మాత్రమే ఫోస్ మిషన్లు వినియోగిస్తున్నారని వివరించారు. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని తెలిపారు. వ్యాపారస్తులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు జిల్లాలో విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం, సబ్–కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విధానంలో స్మార్ట్ ఫోన్ల ద్వారా లేదా సాధారణ ఫోన్ ద్వారా నగదును బదిలీచేసే సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. దీన్ని సామాన్యులు సైతం కొద్దిపాటి అవగాహనతో వినియోగించుకోవచ్చన్నారు. యూరోపియన్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫీన్ల్యాండ్ వంటి దేశాలలో ఎటువంటి కరెన్సీ నోట్లు లేకుండా పూర్తిగా నగదు రహిత ఎకనామీ ఉపయోగిస్తున్నారని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి దీన్ని అమలు చేయాలన్సిన అవసరం ఉందన్నారు. నగదు రహితంగా వస్తువులు కొనుగోలు నిర్వహిస్తే సయయం ఆదా అవుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు, మండలాల్లో ప్రజలు నగదు రహితంగా కొనుగోలుపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే నగదు రహితంగా చౌకధరల దుకాణాలలో నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని, 90 శాతం పైగా ప్రజలకు బ్యాంకు ఖాతాలు అనుసంధానించామని పేర్కొన్నారు. జిల్లాలో 29వేల ఈ–పోస్ మిషన్లు పని చేస్తున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో క్యాష్ లెస్ పేమెంట్ విధానంపై పవర్‌పాయంట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. సబ్–కలెక్టర్ సలోనీ సిదాన, ఆర్డీవోలు పి.సాయిబాబు, చక్రపాణి, డీఎస్డీ వి.రవికిరణ్, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, బ్యాంకర్లు, అసోసియేషన్ ప్రతినిధులు వక్కలగడ్డ బాస్కరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో వేయింగ్ మెషీన్లు
విజయవాడ: అంగన్వాడీల్లో ఎలక్టాన్రిక్ వేయింగ్ మిషన్లు æ ద్వారా నమోదు చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ బాబు. ఎ తెలిపారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్ చక్రవర్తి, కార్యదర్శి జి. జయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకుగాను వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఎ¯ŒSఐసీ అధికారులను కోరారు. ఎత్తు, వయస్సకు తగ్గ బరువులను కచ్చితమైన ప్రమాణాలతో నమోదు చేసిడివైజ్ నుంచి సర్వర్‌కు అనుసంధానించాలని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో 100 అంగన్వాడీల్లో వాడీ కేంద్రాల్లో తక్షణమే ప్రవేశ పెడతామని వెల్లడించారు. అంగన్వాడీకేంద్రం సమీపంలోనే చౌకధరల దుకాణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీడియో కాన్పరె¯Œ్సలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శివపార్వతి, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె. కృష్ణకుమారి, డీఎస్వో రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ–మండీలుగా మార్కెట్ కమిటీలు
విజయవాడ : జిల్లాలోని 19 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఈ–మండీలుగా మార్చాలని కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శుక్రవారం మార్కెటింగ్, వ్యవసాయ ఈ–నామ్ సాంకేతిక సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు.ఎ మాట్లాడుతూ మార్కెట్ కమిటీల ద్వారా జరిగే ప్రతి లావాదేవీని ఈ–మండీ విధానంలో నిర్వహించాలని స్పష్టంచేశారు. ప్రతి మార్కెట్ కమిటీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కేంద్రంగా పని చేయాలని పేర్కొన్నారు. ఇందు కోసం ఆయా మార్కెట్ కమిటీలను రైతుల నుంచి లావాదేవీలు నిర్వహించేలా అభివృద్ధి చేయాలని సూచించారు. వ్యాపార కేంద్రాలుగా మార్కెట్ కమిటీలు రూపుదిద్దాలని కలెక్టర్ అన్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఏఎంసీల పరిధిలో పండించే పంటల వివరాలు సేకరించి రైతులు తమ పంట దిగుబడులను సమీపంలోని మార్కెట్ యార్డులో విక్రయించేలా చూడాలని స్పష్టంచేశారు. మధ్యవర్తుల ద్వారా జరిగే కొనుగోళ్ల వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. దూరాభారం వల్ల రైతులు నస్టపోతున్నారని తెలిపారు. ఆయా కమిటీల పరిధిలో జరిగే పంటల లావాదేవీల వివరాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ఇతర మార్కెట్ల పరిధిలో సాగయ్యే పంటలు, వాటి లావాదేవీ వివరాలు, రైతులకు లభిస్తున్న ధరలు తదితర వివరాలను ప్రతి మార్కెట్ యార్డ్ పరిధిలో ప్రదర్శించాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ జేడీ సి.రామాంజనేయులు, వ్యవసాయశాఖ జేడీ యు.నరసింహారావు, ఏఎంసీ సెక్రటరీ గోపాలకృష్ణ, డీడీవో శ్యామ్ సుందర్ ఈ–నామ్ కంపెనీ ప్రతినిధి ఎం.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు
విజయవాడ : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో జాతీయ మహిళా పార్లమెంట్ (సదస్సు) ఫిబ్రవరిలో పదో తేదీ నుంచి మూడు రోజులపాటు జరుగుతుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఈ సదస్సు ఏర్పాట్లపై స్థానిక తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమన్వయశాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆధ్వర్యంలో ఎంఐటీ స్కూల్స్ ఆఫ్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. 90 మంది మహిళా ఎంపీలు, మహిళా ఎమ్మెల్సీలు, మహిళా ఎమ్మెల్యేలు 400 మంది, పది మంది విధానసభ స్పీకర్లు, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన మహిళలు, వివిధ రాష్ట్రాల నుంచి 10 వేల మంది విద్యార్థినులు పాల్గొంటారని వివరించారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం డిసెంబర్లో నగరంలోని ఇందిరాగాం«ధీ మున్సిపల్ స్టేడియంలో 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరుగుతుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వేల మంది కూచిపూడి నృత్య కళాకారులు, వారి సహాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహిస్తునందున ఆధికారులు సమన్వయంతో ముందుకు రావాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ జి. వీరపాండియన్, సబ్‌కలెక్టర్ జి.సృ జన, అసిస్టెంట్ కలెక్టర్ డి.కె.బాలాజీ, డీఆర్వో సీహెచ్.రంగయ్య, డీటీసీ మీరాప్రసాద్, డీఈవో సుబ్బారెడ్డి, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, ఐసీడీఎస్ పీడీ కె.కృష్ణకుమారి, పశుసంవర్ధకశాఖ జేడీ డి.దామోదర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
క్యాంప్ ఆఫీస్‌లో బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో బుధవారం బతుకమ్మ ఆరో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, ఎంపీ కవిత పాల్గొన్నారు. కవిత బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్తేజపరిచారు. బతుకమ్మ పాటలతో క్యాంపు ఆఫీస్ మర్మోగిపోతోంది. -
ప్రాజెక్టులను నిర్మించితీరుతాం
అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు ‘సింగూరు’ నీరు జిల్లాకే వినియోగం ‘ఘనపురం’ను పట్టించుకోని నాటి పాలకులు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అడ్డుకుంటే వారికి ప్రజలే బుద్ధిచెబుతారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కరువు, కాటకాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాజెక్ట్‌ల నిర్మించి కాల్వల ద్వారా సాగు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఆదివారం ఆమె మెదక్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల ఘనపురం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక ఇప్పటి వరకు ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్ సిమెంట్‌లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించామన్నారు. సింగూరు నీటిని జిల్లాలో సాగునీటికే వాడాలని , హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం గోదావరి, కృష్ణ జలాలను రప్పించడం జరుగుతుందని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో అదనంగా ఆయకట్టు సాగవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆ పనులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా ఘనపురం ప్రాజెక్ట్‌ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆమె వెంట జెడ్పిటీసీ లావణ్యరెడ్డి ఉన్నారు. -
కేసీఆర్‌తో జైట్లీ లంచ్ మీటింగ్
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశం అయ్యారు. సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లిన జైట్లీ.. కేసీఆర్‌తో లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేత కే కేశవరావు, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
అనూహ్యంగా తెరమీదికొచ్చిన మరో ఎమ్మెల్యే
♦ 15న గులాబీ గూటికి నల్లగొండ ఎంపీ గుత్తా.. ♦ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, ముఖ్య కాంగ్రెస్ నేతలతో కలిసి ♦ అనూహ్యంగా తెరమీదికొచ్చిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ♦ ఆయన కూడా అదేరోజు అధికార పార్టీలోకి.. ♦ ఆదివారం సీఎం కేసీఆర్‌తో ఫాంహౌస్‌లో గుత్తా, భాస్కరరావు భేటీ ♦ అక్కడి నుంచి సీఎం కారులోనే క్యాంపు ఆఫీసుకు ♦ అక్కడ జిల్లా మంత్రితో చర్చల అనంతరం నిర్ణయం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉత్కంఠకు తెర పడింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ నెల 15న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆదివారం మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి సీఎం ఫాంహౌస్‌తో పాటు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన చర్చల్లో ముహూర్తం ఖరారైంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో పాటు ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన బుధవారం గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ గూటికి చేరుతున్నారన్న వార్తలు వచ్చిన నాటి నుంచి ఎప్పుడెప్పుడు నిర్ణయం జరుగుతుంది? అసలు చేరుతారా లేదా అనే సందేహాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లా రాజకీయ వర్గాల సస్పెన్స్ వీడినట్టయింది. అయితే, అధికార పార్టీలోనికి చేరే వారిలో ఉన్నట్టుండి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కూడా తెరమీదకు వచ్చారు. ఆయన కూడా ఈనెల 15నే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఫాంహౌస్ టూ క్యాంప్ ఆఫీస్ గుత్తా టీఆర్ఎస్లో చేరే అంశంపై ఆదివారం కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కరరావు, డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డిలు మెదక్ జిల్లాలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన అనంతరం ఈనెల 15న గుత్తా, భాస్కరరావులు టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని క్యాంపు ఆఫీసుకు వెళ్లిన సీఎం కేసీఆర్ తన కారులోనే ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కరరావులను కూడా తీసుకెళ్లారు. అక్కడ వీరికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా తోడయ్యారు. నలుగురూ చాలా సేపు చర్చించారు. పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. అయితే, గుత్తా, భాస్కరరావులు పార్టీలో చేరే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాల్సిన అవసరం లేదని, కేవలం జెడ్పీటీసీలు, ఇతర ముఖ్య నేతలను మాత్రమే ఆ వేదికపై పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పది రోజుల తర్వాత వాస్తవానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నారన్న వార్త ఈనెల 3న వెలుగులోనికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్2న ఆయన సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిలతో హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీ బి. వినోద్‌కుమార్ (కరీంనగర్), రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి , తిప్పర్తి ఎంపీపీ, డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డిలు పాల్గొన్నారు. ఈ భేటీలోనే గుత్తాను టీఆర్ఎస్లోనికి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన గుత్తా తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనా మా చేసే అంశంపై సీఎంను స్పష్టత అడిగారు. ఆ అంశంపై తర్వాత... చూద్దాంలే అని చెప్పిన సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన చర్చల్లో ఈ అంశంపై కూడా గుత్తాతో మాట్లాడినట్టు తెలిసింది. అయితే, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతారా లేక చేయకుండానే గులాబీ కండువా కప్పుకుంటారా అనేది మాత్రం స్పష్టం కాలేదు. ఈ విషయంలో నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా, తొలి నుంచీ తాను టీఆర్ఎస్లో చేరే అంశాన్ని గుత్తా ఎక్కడా ఖండించలేదు. వార్త బయటకు వచ్చిన రోజు విలేకరులు అడిగినప్పుడు కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేనని, భవిష్యత్ ఏం జరుగుతుందో ఊహించలేమని చెప్పిన గుత్తా ఎక్క డా అధికారికంగా నోరు విప్పలేదు. మి ర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు మాత్రం తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, టీఆర్ఎస్లో చేరుతున్నానన్న వార్తల్లో వాస్తవం లేదని మరుసటి రోజే ఖండించారు. కానీ, 15న టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. రవీంద్రకుమార్.. రసకందాయం కాగా, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అనూహ్యంగా సీన్లోకి వచ్చారు. ఆయన అధికార టీఆర్ఎస్లో చేరుతారని గత రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. ఆయన కూడా తాను టీఆర్ఎస్లో చే రడం లేదని చెప్పారు. కానీ, మళ్లీ మనసు మార్చుకుని అధికార పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయినట్టు తెలిసింది. ఆదివారం సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చల్లో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ చర్చల్లో ఆయన టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ విషయమై వివరణ కోరేందుకు రవీంద్రకుమార్‌కు ‘సాక్షి’ ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. అయితే, అనూహ్యంగా తెరమీదకు వచ్చిన రవీంద్రకుమార్ టీఆర్ఎస్లో చేరితే దేవరకొండ రాజకీయం రసకందాయంలో పడనుంది. -
రూ.3 వేల కోట్లు వస్తున్నాయి: కేసీఆర్
హైదరాబాద్: కేంద్ర నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.3 వేల కోట్లు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. క్యాంప్ ఆఫీసులో ఆదివారం సాయంత్రం ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తయినందున ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రభుత్వం ఏడాదికి రూ.25వేల కోట్లు సాగునీటికి కేటాయిస్తుందని, కరువు పీడిత జిల్లా రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తిచేయడం కోసం ప్రతినెల రూ.2వేల కోట్లు విడదుల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ లో ప్రాజెక్టు పనుల బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. పాలమూరు పంప్ హౌజ్ లు, రిజర్వాయర్లు 24 నెలల్లో పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రెండున్నరేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు. -
స్టేట్ గెస్ట్‌హౌస్‌గా క్యాంపు కార్యాలయం
సీఎం కొత్త భవనంలోకి మారగానే అతిథిగృహంగా ప్రస్తుత నివాసం పరిశీలించాల్సిన అధికారులకు సీఎం ఆదేశం ‘లేక్‌వ్యూ’ను ఏపీ సీఎంకు కేటాయించటంతో స్టేట్‌గెస్ట్‌హౌస్ అవసరం హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయం కోసం కొత్త భవన సముదాయం సిద్ధం కాబోతోంది. సుమారు రూ.33 కోట్ల వ్యయం తో దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో బేగంపేటలో దీన్ని నిర్మిస్తున్నారు. అది పూర్తికాగానే ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయం అందులోకి మారుతుంది. మరి... ప్రస్తుతం ఉన్న నివాసం, క్యాంపు కార్యాలయాన్ని ఏం చేస్తారు? స్పీకర్‌కు కేటాయిస్తారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసంగా మారుస్తారని... ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ దాని విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో లా ఆలోచిస్తున్నారు. ఆ భవనాన్ని రాష్ట్రప్రభుత్వ అధికారిక అతిథిగృహంగా మార్చాలని భావిస్తున్నారు. ఈమేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఆయన సూచన చేశారు. ప్రస్తుత నివాసాన్ని స్టేట్‌గెస్ట్ హౌస్‌గా మారిస్తే ఎలా ఉంటుందో పరిశీలించి చెప్పాల్సిందిగా ఆదేశించారు. వారి నుంచి వచ్చే నివేదిక ఆధారం గా ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. లేక్ వ్యూ గెస్ట్‌హౌస్ ఏపీకి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అధికారిక అతిథి గృహంగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ కొనసాగింది. నగరానికి వచ్చే ప్రముఖులకు దాన్ని విడిదిగా కేటాయించేవారు. అందుకుతగ్గట్టుగానే అది దర్పంగా ఉండటంతో మరో అతిథిగృహం అవసరం పడలేదు. ఒకేసారి ఇద్దరు.. ముగ్గిరికి కేటాయించాల్సిన పరిస్థితి వస్తే దాని సమీపంలోనే ఉన్న దిల్కుషా గెస్ట్‌హౌస్‌ను వినియోగించేవారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండటంతో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయం కోసం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం దాన్ని ఏపీ ముఖ్యమంత్రి పెద్దగా వినియోగించనప్పటికీ పదేళ్లపాటు ఏపీ ఆధీనంలోనే అది ఉండనుంది. దీంతో తెలంగాణకు అధికారిక అతిథిగృహం లేకుండాపోయింది. ప్రముఖులు వస్తే హోటళ్ల లో ఉంచాల్సి వస్తోంది. దీంతో కొత్త అతిథి గృహం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చాలారోజులుగా ఆలోచిస్తున్నారు. ఇటీవల సచివాల యం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఉన్నట్టుండి దిల్కుషా గెస్ట్‌హౌస్‌కు వెళ్లి దాన్ని పరిశీలించారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌గా దాన్ని మారి స్తే బాగుంటుందని ఆయన భావించి రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచనలు చేశా రు. కానీ ఆ భవనం పాతబడినందున దానికి మార్పుచేర్పులు చేయటం సరికాదని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను వినియోగిస్తున్న క్యాంపు కార్యాలయం, అధికారిక నివాసాన్ని గెస్ట్‌హౌస్‌గా మార్చటమే ఉత్తమమని ఆయన తాజాగా అధికారుల దృష్టికి తెచ్చారు. విశాలంగా ఉండటం, విడివిడిగా రెండు భవనాలు, అధునాతన వసతులతో ఉన్నందున అది స్టేట్ గెస్ట్‌హౌస్‌గా మారిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత నివాసం గురించి.. ⇒నిర్మాణం: 2004లో ప్రారంభమై 2005లో పూర్తి ⇒విస్తీర్ణం : 2 ఎకరాలు, నిర్మాణ వ్యయం : దాదాపు రూ.2 కోట్లు ⇒నివాసం: తొలుత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2005 నుంచి 2009 వరకు వినియోగించారు. ⇒తర్వాత రోశయ్య కేవలం క్యాంపు కార్యాలయాన్ని వినియోగించుకున్నారు. ⇒కిరణ్ కుమార్‌రెడ్డి 2010 నుంచి 2014 వరకు వాడారు. ⇒కేసీఆర్ 2014 నుంచి వినియోగిస్తున్నారు. వాస్తులోపం పేరుతో క్యాంపు కార్యాలయాన్ని వాడట్లేదు. -
ఏపీ సీఎం కార్యాలయంలో సూరీడు
సాక్షి, విజయవాడ బ్యూరో: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడు గురువారం ఏపీ సీఎం కార్యాలయానికి వెళ్లారు. 3గంటలకుపైగా సూరీడు సీఎం కార్యాలయంలోనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చాలాసేపు భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రను కూడా సూరీడు కలిసినట్లు తెలిసింది. తిరిగివెళ్లేటప్పుడు ఆయన సీఎం కార్యాలయం మెయిన్ గేటు నుంచి బయటకు రాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. సూరీడు కోసం మీడియా బయట వేచి ఉండడంతో మంత్రులు పుల్లారావు, అచ్చెన్నాయుడు నడుచుకుంటూ బయటకు వచ్చి మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ మెయిన్‌గేటు వరకూ వెళ్లారు. ఆ సమయంలో వెనుక గేటు నుంచి సూరీడును బయటకు పంపించారు. మీడియాను పక్కదారి పట్టించేందుకు మంత్రులు ఇలా బయటకు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యం కలిగించింది. 2009లో డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత ఇప్పటివరకూ ఎక్కడా కనిపించని సూరీడు ఇంతకాలానికి బాబు క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. -
సీఎం అధికార నివాసం వద్ద హైడ్రామా
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార నివాసం వద్ద సోమవారం రాత్రి రాజకీయ హైడ్రామా కొనసాగింది. రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, భారీ అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేక్రమంలో ఫిరాయింపు రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు విపక్ష పార్టీకి చెందిన ఐదుగురు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేల చేరికలను గర్హిస్తున్న ఆయనే.. విపక్ష ఎమ్మెల్యేలను తన నివాసానికి పిలిపించుకుని రహస్యంగా మంతనాలు సాగించారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ, కడప జిల్లా జమ్మలమగుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డిలు సోమవారం రాత్రి చంద్రబాబుతో భేటీఅయినవారిలో ఉన్నారు. సోమవారం మధ్యహ్నం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామాచేసిన అనంతరం భూమా తన కూతురుతో కలిసి విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరికాసేపటికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు కూడా బాబుతో భేటీ అయ్యారు. కాగా, ఆదినారాయణ రెడ్డి చేరతారనే ఊహాగాలను ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మలు తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లను పార్టీలో చేర్చుకుంటే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు సర్దిచెప్పడంతో చివరికి కాస్త మెత్తబడ్డట్లు తెలిసింది. -
‘దిల్కుషా’లో మేయర్ క్యాంప్ ఆఫీస్?
బంజారాహిల్స్ : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ క్యాంపు ఆఫీస్ కోసం జీహెచ్ఎంసీ అధికారులు స్థలాన్వేషణ మొదలుపెట్టారు. ఇందుకోసం రాజ్‌భవన్ పక్కన ఉన్న దిల్కుషా గెస్ట్‌హౌస్, గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్‌ను శనివారం గ్రేటర్ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సెంట్రల్ జోన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల పరిశీలించారు. వీటిలో దిల్కుషా గెస్ట్‌హౌజ్ వైపు మేయర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ రెండు గెస్ట్‌హౌస్‌లలో ఒకదాన్ని రెండు రోజుల్లో ఎంపిక చేసి అందులో మౌలిక సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. మేయర్ కోసం క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. మేయర్‌ను కలవడానికి వచ్చేవారు ఇప్పుడున్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇరుకైన సౌకర్యాలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుసుకున్న అధికారులు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తేవాలని యోచించి ఆ మేరకు రెండు గెస్ట్‌హౌస్‌లను పరిశీలించారు. గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ ముందు జరుగుతున్న మెట్రోపనులు వల్ల కొంత వరకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులతోపాటు మేయర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం గెస్ట్‌హౌస్‌ను క్యాంపు ఆఫీస్ కోసం తీసుకోవాలా? కొన్ని గదులు మాత్రమే సరిపోతాయా అన్నదానిపై కూడా ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మొత్తానికి రెండు మూడు రోజుల్లో మేయర్క్యాంపు ఆఫీస్‌పై తుది నిర్ణయం వెలువడనుంది. -
ఎంపీ రాయపాటి కార్యాలయంలో చోరీ
విజయవాడ : ఎంపీ రాయపాటి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో చోరీ జరిగిన సంఘటన నగరంలో సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. భారతినగర్ సమీపంలో ఉన్న శ్రీనగర్ కాలనీలో ఎంపీ రాయపాటి క్యాంపు కార్యాలయం ఉంది. సిబ్బంది రోజులాగానే శుక్రవారం రాత్రి ఆఫీసుకు లాక్ చేసి ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది ప్రధాన ద్వారం తెరచి ఉండడం గమనించారు. దీంతో లోనికి వెళ్లి చూడగా కార్యాలయంలోని బీరువా తెరచి ఉంది. సిబ్బంది కార్యాలయ మేనేజర్ శాస్త్రికి సమాచారం అందించారు. ఆయన వెంటనే కార్యాలయానికి చేరుకుని పరిశీలించగా ల్యాప్‌టాప్, బీరువాలో ఉండవలసిన రూ.5 లక్షల నగదు కనిపించలేదు. దీంతో ఆయన పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఏడీసీపీ రామకోటేశ్వరరావు, ఏఎస్ఐ శేషారెడ్డి, క్లూస్‌టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బంది వద్ద నుంచి వివరాలు సేకరించారు. క్లూస్‌టీమ్ వేలిముద్రలు సేకరించారు. కార్యాలయంలో సీసీ కెమెరాలు అమర్చి ఉండడంతో పోలీసులు సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కార్యాలయం ఎంపీ రాయపాటి సాంబశివరావుది కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారిదని, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు మాత్రమే జరుగుతాయని సిబ్బంది చెబుతున్నారు. -
కేసీఆర్‌ను కలిసిన చంద్రబాబు
-
త్వరలో అన్న సంజీవని క్యాంటీన్లు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో అన్న సంజీవని ఫుడ్ క్యాంటీన్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఈ-మహిళను అక్షరాస్యులిగా మార్చాలని, 2019 నాటికి డ్వాక్రా మహిళల్లో నూరు శాతం అక్షరాస్యతను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖపై జరిపిన సమీక్షలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మహిళా నెలసరి ఆదాయం రూ.10 వేలకు పెరగాలన్నారు. అక్టోబర్ 2 నుంచి మహిళా సాధికార యాత్రలు చేపట్టాలన్నారు. వారికి శిక్షణ ఇచ్చి వారు బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా మారేలా చూడాలన్నారు. పర్యాటక కేంద్రంగా లంబసింగి.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధం గా ముందుకెళ్లాలని క్రీడలు, సాంస్కృతి శాఖ సమీక్షలో అధికారులను చంద్రబాబు ఆదేశించారు. లంబ సింగిని ప్రత్యేక అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని, అరకులో ప్రభుత్వ ఆర్చరీ అకాడమీలను ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి, చిత్తూరు, కర్నూలు, విజయవాడ, కాకినాడ, విశాఖలను అర్బన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాలన్నారు. సీఎంను కలిసిన బ్రిటానియా ఎండీ చిత్తూరు జిల్లాలో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ సానుకూలత వ్యక్తం చేసింది. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ.. యూనిట్ ఏర్పాటుకు అవకాశాలపై చర్చించారు. రూ.125 కోట్లతో ఏర్పాటుచేయనున్న యూనిట్ తొలి దశ నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా ప్రారంభిస్తామని ఆయన సీఎంకు చెప్పినట్లు కార్యాలయం పేర్కొంది. 20న సింగపూర్‌కు పయనం సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్‌గా స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేయనున్న సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్‌తోపాటు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తదితరులతో చర్చించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రుల, అధికారుల బృం దం ఈ నెల 20వ తేదీ రాత్రి బయలుదేరి వెళ్లనుంది. ఈ బృందం నాలుగు రోజులపాటు అక్కడ పర్యటించనుంది. దీనిపై సీఆర్డీఏ అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం. దీనికి గాను అసెండాస్ కంపెనీ ఏం కోరుకుంటోందనే అంశంపై సీఆర్డీఏ ఇటీవలే ఒక నోట్‌ను తయారు చేసింది. మాస్టర్ డెవలపర్‌గా ఉండేందుకు అది కొన్ని షరతులను విధించింది. వీటిపై నేరుగా సీఎం బృందం చర్చించనుంది. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించిన ఖర్చుపోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం, అసెండాస్ పంచుకోవాలని కంపెనీ షరతు విధించింది. -
పోలీస్ బాస్ వచ్చేశారు
ఇక నెలలో 15 రోజులు ఇక్కడే క్యాంపు కార్యాలయం ప్రారంభం దశలవారీగా ఇతర విభాగాల రాక ఇకపై డీజీపీ జె.వి.రాముడు కూడా నెలలో సగం రోజులు నగరంలోనే మకాం వేస్తారు. బుధవారం ఆయన తన క్యాంపు ఆఫీసును ప్రారంభించి పనుల పురోగతిని పరిశీలించారు. విజయవాడ సిటీ : పోలీస్ బాస్ డీజీపీ జె.వి.రాముడు ఇకపై నెలలో 15 రోజులు ఇక్కడే ఉంటారు. ఇదే విషయాన్ని బుధవారం నగరానికి వచ్చిన ఆయన స్పష్టం చేశారు. వారంలో కొన్ని రోజులు తాను ఇక్కడే అందుబాటులో ఉంటానని వెల్లడించారు. తన క్యాంప్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎస్ఐ ఎదురుగా ఉన్న ఇరిగేషన్ శాఖ ఎస్ఈ బంగళాను డీజీపీ నివాస భవనంగా తీర్చిదిద్దుతున్నారు. పక్కనే ఉన్న ఆఫీసర్స్ క్లబ్ స్థలంలో పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేయాలనేది అధికారుల నిర్ణయం. అనంతరం డీజీపీ క్యాంపు కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు. చేయలేని పక్షంలో మరొకరికి అప్పగిస్తామని హెచ్చరించారు. ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి, ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో వారికి వివరించారు. వెంటనే ఆయా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. తొలి అడుగు... ఇది తొలి అడుగని, రానున్న రోజుల్లో అన్ని విభాగాలూ దశలవారీగా ఇక్కడికి తరలి వస్తాయని డీజీపీ రాముడు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయం ప్రారంభించిన తర్వాత పోలీసు అతిథి గృహంలో కొద్దిసేపు ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి కమిషనరేట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఎప్పుడో పంపామని, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళతామని చెప్పారు. రాజధాని పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో వీటిని అధిగమించనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసింగ్... స్మార్ట్ సిటీల నిర్మాణంలో పోలీసు శాఖ నుంచి భద్రత కల్పించటం ప్రధాన అంశమని డీజీపీ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పోలీసింగ్‌కు చర్యలు చేపడతామన్నారు. ఇందులో భాగంగా సీఆర్డీఏ కమిషనర్‌తో చర్చించనున్నట్టు చెప్పారు. డీజీపీ వెంట నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్, ఐజీలు రాజీవ్‌కుమార్ మెహతా, సంజయ్, డీసీపీలు ఎల్.కాళిదాస్, జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విజయకుమార్, రైల్వే ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్ తదితరులున్నారు. -
త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు
అధికారులకు సీఎం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. వెబ్ ఆధారితంగా బదిలీలు చేయాలని సీఎం సూచించారని, ఈ మేరకు త్వరలోనే విధివిధానాలు, షెడ్యూల్ విడుదలవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతిభ, పనితీరు, ఫలితాల ఆధారంగా బదిలీలు జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు నెల రోజుల్లో ల్యాప్‌టాప్‌లు అందించాలన్నారు. ఫలితాల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గ్రేడింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వాలని వెల్లడించారు. రాష్ట్రంలో వంద శాతం స్వచ్ఛ విద్యాలయాలు ప్రధానమంత్రి న రేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ విద్యాలయాల లక్ష్యాన్ని రాష్ట్రంలో వందశాతం పూర్తి చేశామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. షెడ్యూల్ విడుదల చేయాలి: ఎస్టీయూ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ను జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కత్తి నరసింహారెడ్డి, సుధీర్‌బాబు బుధవారం ఓ ప్రక టనలో ప్రభుత్వాన్ని కోరారు. -
ఈడ్చి పారేశారు..
-
ఈడ్చి పారేశారు..
సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిని భగ్నం చేసిన పోలీసులు సాక్షి, విజయవాడ బ్యూరో: కడుపుమండి కదం తొక్కిన మున్సిపల్ కార్మికులపై ఖాకీలు క్రౌర్యం ప్రదర్శించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలన్న ప్రయత్నాన్ని భగ్నంచేసి దొరికినవారిని దొరికినట్టు వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళలనే కనికరం చూపకుండా పిడిగుద్దులు గుద్దుతూ ఈడ్చిపారేశారు. పోలీసుల ప్రతాపానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, బొచ్చు సుబ్బలక్ష్మి మరో ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వేలాదిమంది మున్సిపల్ కార్మికులు శుక్రవారం విజయవాడకు తరలివచ్చి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లీలామహల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న కార్మికుల్ని, జేఏసీ నేతలపై పోలీసులు ఒక్కసారిగా దాడిచేశారు. వేలమంది కార్మికులను అరెస్టు చేసి వన్‌టౌన్, ఇబ్రహీంపట్నం, భవానీపురం, కృష్ణాలంక, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. జేఏసీ నేతలు, కార్మికులు అక్కడ కూడా ధర్నాలు, రాస్తారోకోలను కొనసాగించారు. మున్సిపల్ కార్మిక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర నేతలు ఎంఏ గఫూర్, జి.ఓబులేసు, కె.ఉమామహేశ్వరరావు, సీహెచ్.బాబూరావు, వి.ఉమామహేశ్వరరావులు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆరుబయట నేలపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. కుమారి అనే పారిశుధ్య కార్మికురాలు సొమ్మసిల్లి పడిపోవడంతో 108అంబులెన్స్ సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. జేఏసీ నేతలపై చంద్రబాబు కన్నెర్ర.. ముఖ్యమంత్రితో స్థానిక హోటల్లో మున్సిపల్ కార్మిక, ఉద్యోగ జేఏసీ నేతలు జరిపిన చర్చలు ఫలించలేదు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి పీఆర్సీ వర్తించదని సీఎం తేల్చిచెప్పారు. తెలంగాణ వాళ్లు చేస్తే మేము చేయాలని ఉందా? అని చిరాకు ప్రదర్శించారు. తెలంగాణ సీఎంతో తనకు పోలికేమిటని ప్రశ్నించారు. 9వ పీఆర్సీ సందర్బంగా ఔట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం రూ.6,700ఇచ్చిన విషయాన్ని జేఏసీ నేతలు సీఎం దృష్టికి తెచ్చారు. అతితక్కువ పట్టణ జనాభా కోసం ఆదాయమంతా ఖర్చుచేయాలా? అంటూ సీఎం వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎటువంటి హామీ ఇవ్వకుండానే జేఏసీ నేతల్ని బయటకు పంపేశారు. దీంతో సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. ‘ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది’ శాంతియుత ఉద్యమం చేస్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ,సీపీఐ నేత రామకృష్ణ ధ్వజమెత్తారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఆందోళన కొనసాగించిన జేఏసీ నేతలు, కార్మికులను వారు పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. కార్మికులపై లాఠీచార్జి దారుణం: వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్: దుర్భర పరిస్థితుల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై లాఠీచార్జి చేయించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కార్మికులకు మద్దతుగా నిల్చిన రాజకీయ నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరింది. పది రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న పట్టించుకోవడంలేదని ఆక్షేపించింది. వారు దళితులనే పట్టించుకోవడంలేదు * ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజం సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల్లో ఎక్కువ శాతం దళితులు ఉన్నందునే వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. శుక్రవారం ఇందిర భవన్లో పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, కొండ్రు మురళీ మోహన్‌లు విలేకర్లతో మాట్లాడారు. కనీస వేతనాల కోసం ఆందోళన చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సరికాదన్నారు. మున్సిపల్ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించేందుకు నిధులు లేవంటూ పురపాలక శాఖ మంత్రి నారాయణ చేసిన ప్రకటనను వారు తీవ్రంగా ఖండించారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి, ఉద్రిక్తత
విజయవాడ: తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎమ్ఎస్, ఐఎన్టీయూిసీ సంఘాల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా నిరసన తెలపుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను అరెస్టు చేశారు. -
నీతి ఆయోగ్ నుంచి నిధులివ్వండి
* నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియాకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి * మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాలకు ప్రశంస సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నుంచి నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను కోరారు. ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన అరవింద్ పనగరియా గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలి శారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పథకాల నిర్వహణ, ప్రభుత్వవిధానాలు తది తర అంశాలపై చర్చ జరిగింది. గతంలో నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం నిధులు మంజూరు చేసేదని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నిధులివ్వాలని, మళ్లీ వాటిని వడ్డీతోపాటు రాష్ట్రాల నుంచి తీసుకోవాలని సూచించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, హరితహారం పథకాలను సీఎం వివరించారు. కొత్త పారిశ్రామిక విధానంతోపాటు రాష్ట్రం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ లాంటి కార్యక్రమాలను అరవింద్ పనగరియా ప్రశంసించారు. ముఖ్యమంత్రి చేసిన వినతులపట్ల పనగరియా సానుకూలంగా స్పందించారు. సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు ప్రదీప్‌చంద్ర, బీపీ ఆచార్య, నర్సింగ్‌రావు, ఎంజీ గోపాల్, సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎంతో సమావేశానికి ముందు పనగరియా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కిషన్నగర్ను సందర్శించారు. -
ఈ ప్రభుత్వం ఇంతే
సాక్షి, కడప : ‘జనం ఇక్కట్లను ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ప్రజల సమస్యలంటే బుట్టదాఖలే. తాగునీటి సమస్యకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపండ’ని వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో తాగునీటి సమస్యపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, అధికారులకు సూచించారు. పులివెందులలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను పులివెందుల మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, కమిషనర్ విజయసింహారెడ్డి, వైస్ చెర్మైన్ చిన్నప్ప, పలువురు కౌన్సిలర్లు కలిసి మాట్లాడారు. పులివెందుల మున్సిపాలిటీకి అవసరమైన నీరు సీబీఆర్ నుంచి నక్కలపల్లె వరకు రావడం గగనంగా మారిందని వివరించారు. సమస్య తీవ్ర రూపం దాల్చకుండా సీబీఆర్ నుంచి ఎస్ఎస్ ట్యాంకు వరకు పైపులైన్ ఏర్పాటు చేయాలని వారు జగన్ దృ ష్టికి తీసుకొచ్చారు. అందుకు దాదాపు రూ.5 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని వివరించారు. ఈ విషయంపై జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని ప్రతిపాదనలు పంపినా బుట్టదాఖలు చేయడం తప్ప స్పందించదన్నారు. పైపులైన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. అవసరమైతే తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృ షి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు 11 ఎంఎల్డి నీటిని తీసుకుంటూ 9 ఎంఎల్డి సరఫరా చేస్తున్నారని, మిగిలిన నీటిని మున్సిపాలిటీకి కేటాయిస్తే వేసవి నుంచి గట్టెక్కవచ్చని వారు వివరించగా.. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. నూతన వధూవరులకు ఆశీర్వాదం పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీలో నివసిస్తున్న దేవిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, పద్మాలత కుమారుడు జగదీశ్వరరెడ్డి, భార్గవిల వివాహం పులివెందులలో రెండు రోజుల క్రితం జరిగింది. అప్పట్లో వివాహానికి హాజరు కాలేకపోయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం వారి ఇంటికి వెళ్లి నూతన జంటను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అంతకు ముందు అభిమానులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. తర్వాత కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు బయలుదేరిన జగన్‌కు పలుచోట్ల ఘన స్వాగతం లభించింది. పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీలో బాణాసంచా పేల్చుతూ స్వాగతం పలకగా.. ముద్దనూరులో నల్లబల్లె ఎంపీటీసీ సభ్యుడు వరదారెడ్డి, జమ్మలమడుగు వైఎస్ఆర్ సీపీ నాయకులు హనుమంతురెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముద్దనూరు నాలుగు రోడ్ల సర్కిల్‌కు చేరిన భారీ జన సందోహానికి అభివాదం చేసిన అనంతరం.. మహిళలు, వృద్ధులను ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. అనంతరం ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, దువ్వూరులో అభిమానులు జగన్ కాన్వాయ్‌ను ఆపి కరచాలనం చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం కడప ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తదితరులు కలిసి వైఎస్ జగన్‌తో చర్చించారు. తర్వాత అందరూ జగన్ వెంట ఆళ్లగడ్డకు వెళ్లి శోభా నాగిరెడ్డి ప్రథమ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘మిషన్’కు నాబార్డు అభయం
- ఆర్థిక సాయంపై సీఎంకు నాబార్డు చైర్మన్ హామీ - గ్రీన్హౌస్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితరాలకు కూడా... సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకానికి నిధులపై నాబార్డు అభయమిచ్చింది. ఈ పథకానికి ఆర్థికసాయం అందిస్తామని నాబార్డు చైర్మన్ హర్షకుమార్ భన్వాలా హామీ ఇచ్చారు. మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ గురించి కేసీఆర్ ఆయనకు సమగ్రంగా వివరించారు. చెరువుల పునరుద్ధరణకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయకు నిధులు మంజూరు చేయాలని కోరగా నాబార్డు చైర్మన్ అందుకు అంగీకరించారు. అలాగే వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత, గ్రీన్హౌస్ సాగు, గ్రామాల్లో వంతెనల అనుసంధానం, ప్రాథమిక పాఠశాలలు, తాగునీరు, పారిశుద్ధ్యం, సహకార బ్యాంకులు, సూక్ష్మసేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, భూసార పరీక్షలు, నదులు, ఉప నదుల కింద చెక్ డ్యాంల నిర్మాణం, గ్రామీణ రోడ్లు, జిల్లాల్లో గోదాముల నిర్మాణం వంటి ప్రాజెక్టులకూ ఆర్థికసాయం అందించేందుకు సిద్ధమన్నారు. ఫార్మా సిటీ కోసం వీలైతే నిధులు కేటాయించాలని సీఎం కోరగా అందుకు నాబార్డు చైర్మన్ అంగీకరించారు. రాష్ట్ర సహకార బ్యాంకు విభజన అయ్యాక తెలంగాణ సహకార బ్యాంకుకు రూ. 800 కోట్ల నుంచి రూ. 900 కోట్ల మేరకు ఆర్థిక సాయం చేస్తుందన్నారు. తెలంగాణ సహా దేశంలో 10 రాష్ట్రాల్లో త్వరలో స్వయం సహాయక సంఘాల డిజిటలైజేషన్‌ను ప్రారంభిస్తామని హర్షకుమార్ భన్వాలా పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాబార్డు డిప్యూటీ ఎండీ ఆర్.అమలార్ ఫర్వనతన్, నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగరావు, ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షి, ఖమ్మం : వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఉదయం 11 గంటలకు మధిర మండలంలోని దేశినేనిగూడెం, కుర్నవల్లి, తల్లాడ, వైరా గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఖమ్మంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాలేజ్ డే వేడుకలకు హాజరవుతారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. అలాగే ఖమ్మం నగరంలో జరిగే వివాహ వేడుకలకు ఎంపీ హాజరవుతారు. -
బెజవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్
-
ఇరిగేషన్ భవనంలో సీఎం క్యాంప్ ఆఫీస్
నివేదికలు కోరిన ఇరిగేషన్ కార్యదర్శి సీఎం ఉండేందుకు గెస్ట్‌హౌస్ ఏర్పాటు విజయవాడ : భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు క్యాంపు కార్యాలయం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంగా మారనుంది. సీఎం విజయవాడలో వారానికి ఐదురోజులు ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన క్యాంపు కార్యాలయాన్ని నగరానికి మధ్యలో ఉన్న ఇరిగేషన్ భవనం ప్రాంగణంలో ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి. తాజాగా ఇరిగేషన్ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఈ మేరకు నివేదికను పంపాలని జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌ను కోరినట్లు సమాచారం. దీంతో ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు కావాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ దృష్టి సారించి ఒక నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వాస్తు బాగా లేనందున ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ రాత్రి పూట బస చేయడం లేదు. భవిష్యత్తులో ఆయన రాత్రిళ్లు నగరంలోనే బస చేయాల్సి వస్తే ఇందుకోసం గెస్ట్హస్ను ఇరిగేషన్ కార్యాలయాల ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పై అంతస్తులోకి ఇరిగేషన్ మంత్రి కార్యాలయం ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా క్యాంపు కార్యాలయంలో ఇప్పటికే కింద అంతస్తులో కొన్ని రూములను సీఎం కోసం కేటాయించారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలన్నీ ఇక్కడ నుంచే నిర్వహించన్నుట్లు తెలిసింది. దీంతో మొదటి అంతస్తులోని ఉమా చాంబర్‌ను సీఎంకు కేటాయించి, మిగిలిన రూములను ఇతర అధికారులకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో భవనంలో పైన మరో అంతస్తు నిర్మించి అక్కడ ఉమా క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎస్ఈ, ఈఈ కార్యాలయాలు తరలింపు! ప్రస్తుతం నీటిపారుదల శాఖ ప్రాంగణంలో ఎస్ఈ కార్యాలయంతోపాటు ఈస్ట్రన్, సెంట్రల్, స్పెషల్ డివిజన్ ఈఈలు, డీఈలు కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడికి సీఎం క్యాంపు కార్యాలయం వస్తే సెక్యూరిటీ పెరుగుతుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న రెండు గేట్లు ఆయన రాకపోకలకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మిగిలిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడ నుంచి పనిచేసే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. దీంతో ఎస్ఈ, ఈఈ కార్యాలయాలను ఇక్కడ నుంచి తరలిస్తారా? లేదా వారికి వేరే మార్గం ఏర్పాటుచేసి ఇక్కడే కొనసాగిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇరిగేషన్ శాఖకు చెందిన ఆఫీసర్స్ క్లబ్ ఉన్న స్థలాన్ని ఇప్పటికే డీజీపీ క్యాంపు కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రధాన ప్రాగణం సీఎం క్యాంపు కార్యాలయంగా మారబోతోంది. -
జిల్లాలో నేటి నుంచి పొంగులేటి పర్యటన
సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నపురెడ్డిపల్లిలో నిర్వహించనున్న పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆదివారం కూసుమంచి మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
భారమైతే మాకివ్వండి
ప్రగతినగర్ : ‘పసి మొగ్గలను తుంచేయొద్దు.. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులెవరైనా మాకు అప్పగిస్తే కంటికి రెప్పలా కాపాడు కుంటాం..కానీ వారిని చెత్తకుప్పల్లో.. నాళాల్లో వేసి వారి ప్రాణాలు తీయండి. అది మానవతకే చెరగని మచ్చ’. అంటూ కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని బాల సదనంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.అనాథ శిశువులను ముద్డాడారు. అమ్మా, నాన్నలు లేరనే దిగులు రానీయకుండా చిన్నారులను చూసుకోవాలని కలెక్టర్ సిబ్బందికి ఉద్బోధించారు. కేక్‌కట్ చేసి కలెక్టర్ చిన్నారులకు తినిపించారు. అనంతరం బాలసదనంలో ఉన్న 80 మంది చిన్నారులకు కొత్త దుస్తులతో పాటు, దుప్పట్లు,స్వెటర్లు హెల్పింగ్ హార్ట్స్ సబ్యులు అందజేశారు. కార్యాక్రమంలో ఆర్బీఓ యదిరెడ్డి,హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు రమణారెడ్డి, మహేశ్, శ్రీనివాస్, కార్తిక్, వేణు, డీఎం సివిల్ సప్లై దివాకర్, ఏఎస్ఓ లక్ష్మీభవాని, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాష్, సుధాకర్, ప్రభాకర్,తహశీల్దార్లు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. క్యాంప్ ఆఫీసులో కొత్త సంవత్సర వేడుకలు నిజామాబాద్ క్రైం : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరిగాయి.అన్ని సబ్ డివిజన్ల పోలీసు అధికారులు హాజరు కాగా ఎస్పీ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కేక్‌కట్ చేశారు. ఎస్పీని కలిసిన వారిలో జిల్లా అదనపు ఎస్పీ పాండునాయక్, స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ ప్రసాద్‌రావు, నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ డీఎస్పీలు ఆనంద్‌కుమార్, ఎ భాస్కర్, ఆకుల రాంరెడ్డి, రాంకుమార్, ఎన్ఐబీ డీఎస్పీ రవీందర్, హోంగార్డు డీఎస్పీ సులోమాన్, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ గులాం గౌస్ మెయినోద్దీన్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్పాష తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ‘తెలంగాణ హరిత హారం’
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా వ్యాప్తంగా తెలంగాణ హరిత హారాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయూలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ‘తెలంగాణ హరిత హారం’పై జిల్లాస్థాయి పర్యవేక్షక, సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఈ పథకం కింద జిల్లాలో 2014-15 సంవత్సరానికి గాను 5.60కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇది వరకే ప్రతిపాదనలు పంపామని, వెంటనే ప్రణాళికలు సిద్దం చేయూలని ఆదేశించారు. ఇందుకుగాను 530 నర్సరీలలో ముందుగా మొక్కలు పెంచిన అనంతరం వాటిని గుర్తించిన స్థానాల్లో నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సరీలలో మొక్కలు పెంచేందుకు అటవీశాఖతో పాటు, డీఆర్డీఏ డ్వామా, వ్యవసాయ శాఖలు బాధ్యతలు తీసుకోవాల్సి ఉందన్నారు. మొక్కల పెంపకానికి గాను ఆయా ఏజెన్సీలు రూపొందించిన అంచనాలను సమర్పించేలా చూడాలన్నారు. అనుకున్న సమయం ప్రకారం మొక్కల పెంపకంతో పాటు, మొక్కలు నాటే కార్యక్రమాలన్ని కూడా పూర్తి చేయాలని కోరారు. రహదారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, గృహాలు, గట్లపై మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. మొక్కలను పెంచేందుకు నర్సరీలను గుర్తించి పక్రియను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓలు వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవీందర్, వ్యవసాయశాఖ జేడీ భగవత్ స్వరూప్, ఉద్యాన శాఖ ఏడీ సోమిరెడ్డి, సాంఘీక సంక్షేమాధికారి శ్రీనివాస్‌రావు, ఏపీడీ మల్లికార్జున్ పాల్గొన్నారు. పురాతన కట్టడాలను పరిర క్షణకు కృషి జిల్లా చరిత్ర, సంస్కృతి, పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం స్థానిక ఇండియన్ రెడ్‌క్రాస్ సమావేశమందిరంలో జిల్లా ఇంటాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లాకు ప్రకృతిపరంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. జిల్లాలో కళాకారులు, కళలకు కొద వ లేదని, చరిత్ర, సంస్కృతిపరంగా పా లమూరు పేద జిల్లాకాదన్నారు. ఇంటాక్ కన్వీనర్ నాగేంద్రస్వామి మాట్లాడు తూ జిల్లా చరిత్ర, సంస్కృతి, పురాతన సంప్రదాఆల పరిరక్షణకు 1988లో ఇంటాక్ ఏర్పాటు చే శారన్నారు. -
క్యాంపు ఆఫీసు వద్ద రైతులపై లాఠీచార్జీ
-
బాబు క్యాంపు కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం