మహబూబ్‌నగర్ టౌన్:
జిల్లా వ్యాప్తంగా తెలంగాణ హరిత హారాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయూలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ‘తెలంగాణ హరిత హారం’పై జిల్లాస్థాయి పర్యవేక్షక, సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఈ పథకం కింద జిల్లాలో 2014-15 సంవత్సరానికి గాను 5.60కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇది వరకే ప్రతిపాదనలు పంపామని, వెంటనే ప్రణాళికలు సిద్దం చేయూలని ఆదేశించారు.
ఇందుకుగాను 530 నర్సరీలలో ముందుగా మొక్కలు పెంచిన అనంతరం వాటిని గుర్తించిన స్థానాల్లో నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సరీలలో మొక్కలు పెంచేందుకు అటవీశాఖతో పాటు, డీఆర్‌డీఏ డ్వామా, వ్యవసాయ శాఖలు బాధ్యతలు తీసుకోవాల్సి ఉందన్నారు. మొక్కల పెంపకానికి గాను ఆయా ఏజెన్సీలు రూపొందించిన అంచనాలను సమర్పించేలా చూడాలన్నారు. అనుకున్న సమయం ప్రకారం మొక్కల పెంపకంతో పాటు, మొక్కలు నాటే కార్యక్రమాలన్ని కూడా పూర్తి చేయాలని కోరారు. రహదారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, గృహాలు, గట్లపై మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు.
మొక్కలను పెంచేందుకు నర్సరీలను గుర్తించి పక్రియను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓలు వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకటరమణ, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవీందర్, వ్యవసాయశాఖ జేడీ భగవత్ స్వరూప్, ఉద్యాన శాఖ ఏడీ సోమిరెడ్డి, సాంఘీక సంక్షేమాధికారి శ్రీనివాస్‌రావు, ఏపీడీ మల్లికార్జున్ పాల్గొన్నారు.
పురాతన కట్టడాలను
పరిర క్షణకు కృషి
జిల్లా చరిత్ర, సంస్కృతి, పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం స్థానిక ఇండియన్ రెడ్‌క్రాస్ సమావేశమందిరంలో జిల్లా ఇంటాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లాకు ప్రకృతిపరంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. జిల్లాలో కళాకారులు, కళలకు కొద వ లేదని, చరిత్ర, సంస్కృతిపరంగా పా లమూరు పేద జిల్లాకాదన్నారు. ఇంటాక్ కన్వీనర్ నాగేంద్రస్వామి మాట్లాడు తూ జిల్లా చరిత్ర, సంస్కృతి, పురాతన సంప్రదాఆల పరిరక్షణకు 1988లో ఇంటాక్ ఏర్పాటు చే శారన్నారు.
పకడ్బందీగా ‘తెలంగాణ హరిత హారం’
Published Sat, Nov 1 2014 5:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement