
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు.
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు.
