నెలన్నర రోజుల్లో మూడోసారి
రాజకీయ కారణాలతో ఉద్యోగాలు తొలగించొద్దని వినతి
నాలుగు నెలల వేతన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్
సాక్షి, అమరావతి: ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్‌లలో పనిచేసే చిరుద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఎదుట మరో విడత ఆందోళన చేపట్టారు. 15–20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి.. వారి స్థానంలో తాము చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూటమి ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తీసుకొస్తుండటంతో చిరుద్యోగులు ఇప్పటికే సెపె్టంబర్ 13, అక్టోబర్ 6 తేదీల్లో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు.
తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. చిరుద్యోగుల ఆందోళన విషయాన్ని కార్యాలయ అధికారులు చిరుద్యోగుల సంఘ ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. ఉద్యోగులెవరినీ తొలగించకుండా శాఖాపరంగా చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ తన కార్యాలయ అధికారుల ద్వారా హామీ ఇచ్చినట్టు ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ లే»ొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో వివిధ చోట్ల తొలగించిన ఉద్యోగుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని.. రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు చెప్పారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment