వైఎస్సార్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి
అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి
వైఎస్సార్ ఉమ్మడి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో నిర్ణయం
గుంటూరు, సాక్షి: ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నదానిపై వారితో చర్చలు జరిపారు. దీంతోపాటు రాబోయే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిత్వంపైనా వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
పార్టీ సూచనల మేరకు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిని నియమించారు. అలాగే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు.
వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ సమావేశం జరిగింది. తొలుత వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. రేపు(గురువారం)కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆర్నెలలపాటు సమయం ఇవ్వాలని తొలుత జగన్ భావించారు. ఆ తర్వాతే చంద్రబాబు సర్కార్‌ను నిలదీయాలని భావించారు. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో అరాచకం మొదలైంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో.. బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు & నారా లోకేష్ ప్రొత్సహిస్తూ వస్తున్నారు.
సూపర్ సిక్స్ అమలు, అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. వైఎస్సార్‌సీపీపై ప్రతీకార దాడులు, అంతటా నేతల అధికార జులుం, వివిధ విభాగాలు.. వాటి అధిపతులు ఆఖరికి క్షేత్ర స్థాయి ఉద్యోగులపైనా వేధింపులు కొనసాగుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వంపై తక్షణ పోరును ప్రారంభించారు జగన్. మరోపక్క.. దాడులతో ఆందోళన చెందుతున్న పార్టీ కేడర్‌కు అధైర్య పడొద్దంటూ భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజులపాటు(ఇవాళ, రేపు) పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment