Tadepalle
-
శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్‌తో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డిశాంతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
సూపర్ సిక్స్.. సెవెన్ ఏదీ లేదు.. బాబు బాదుడే మొదలైంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదు.. ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల పార్టీల అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించారు. ప్రజా ఆందోళనలకు కార్యాచరణపై వైఎస్ జగన్ సూచనలు చేశారు. సమావేశం సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపతీరంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేక ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదు. ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి, దిగజారిపోయాయి. మొట్టమొదటి సారిగా మూడు త్రైమాసికాలుగా ఫీజు రియింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉంది. జనవరి వస్తే ఏకంగా రూ.2800 కోట్లు పెండింగ్ అవుతుందన్నారు.అలాగే, వసతీ దీవెనకూ రూ.1100 కోట్లు పెండింగ్. ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని చెప్తున్నారు. పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా ఉన్నాయి. దాదాపు తొమ్మిది నెలల బిల్లులు పెండింగులో ఉన్నాయి. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. 108, 104 ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదన్నారు.బాబు బాదుడు చరిత్రలోనే ఫస్ట్.. రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధరలు లభించడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో ఈ-క్రాప్ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేసేవాళ్లు. ప్రతీ రైతుకూ మద్దతు ధర వచ్చేది. జీఎల్టీ ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. అదనంగా ప్రతీ ఎకరాకు అదనంగా రూ.10వేలు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ పూర్తిగా రైతులు దెబ్బతిన్నారు. వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు మొదలైంది. ఇప్పటికే రూ.6వేల కోట్ల వడ్డన ప్రారంభమైంది. మరో రూ.9వేల కోట్ల వడ్డన వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయి బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరని ఎద్దేవా చేశారు... ఎవ్వరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. కేసులు మాన్యుఫ్యాక్చర్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రం అంతటా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎవ్వరూ ఆందోళన చేయకూడదని ఇలా చేస్తున్నారు. అవినీతి విచ్చలవిడిగా నడుస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారని ఆరోపించారు.అంతటా బెల్టు షాపులే..ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులు ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. గ్రామంలో వేలం పాటలు పెట్టి బెల్టు షాపులు ఇస్తున్నారు. బెల్టు షాపులు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్టుషాపునకు రూ.2-3లక్షల వేలం పాట పెడుతున్నారు. ఏ పని జరగాలన్నా, ఏ పరిశ్రమ నడుపుకోవాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామ్మూళ్ల కోసం వసూలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.సమయం వచ్చింది..నెల్లూరు క్వార్ట్జ్ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్ చేశారు. ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దాని కంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది. జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలి. కరెంటు ఛార్జీలు పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కకపోవడం, ఫీజు రియింబర్స్‌మెంట్ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బందిపెడుతున్నాయి. మండలం, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మూడు స్థాయిల్లో ఆందోళనలపై కార్యాచరణ చేపట్టాలి’ అని సూచించారు. -
దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా?.వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : ‘కరెంట్ చార్జీలు పెంచడమేనా, ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక’ అంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ‘కరెంట్ ఛార్జీలు పెంచడమేనా, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక.. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే విద్యుత్ ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో మీరిచ్చిన హామీ ఏమైంది చంద్రబాబు? టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్తు ఛార్జీలను తగ్గించే వాళ్లం అని చెప్పిన మీరు ప్రజలు ఎంత వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా చంద్రబాబూ? ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు, ఈ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది. ప్రజలపై అదనపు ఛార్జీలను వేయడమేనా మీ విజన్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెంచి మాట తప్పడమే మీ నైజమని మరోసారి రుజువు చేశారు.’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు ఛార్జీలు పెంచడమేనా @ncbn pic.twitter.com/cDwrehq2N3— YS Jagan Mohan Reddy (@ysjagan) October 27, 2024 -
ఇచ్చిన హామీలేంటి?.. బాబు చేస్తున్నదేంటి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు వైఎస్ జగన్.వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నేడు పార్టీ నేతలతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుంది. పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంది. ప్రతిపక్షంగా, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగా పార్టీ కొనసాగుతోంది. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగింది. కాకపోతే మనం ఆర్గనైజ్డ్గా యుద్ధంచేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పుడే మనం రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎఫెక్టివ్‌గా ఉంటాం.బూత్ కమిటీలపై ఫోకస్..జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్గా ఉంటే మన సన్నద్ధంగా ఉంటాం. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల వరకూ కమిటీలు ఎలా ఉన్నాయి? అన్నదానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతీ ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశమయ్యే నాటికి గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. అనుబంధ విభాగాలకు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. కమిటీలు ఏర్పాటు అన్నది కాగితాలకే పరిమితం కాకూడదు. దానివల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటపై పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్ వన్ పార్టీగా మనం ఎదుగుతాం.గ్రామస్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. అప్పుడు మనం ఇచ్చిన పిలుపునకు ఉద్ధృతమైన స్పందన వస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అంశాలపై స్పందించాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై మాట్లాడాలి. బాధితులకు అండగా నిలవాలి.ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అని ప్రజలు చెప్పే పరిస్థితి నెలకొంది. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే చెప్తారు. ఇప్పటికీ మనం ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలం. ఎన్నికల మేనిఫెస్టోకు అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. బడ్జెట్‌తోపాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసేవాళ్లం. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా మనం వెనకాడం కాని, అబద్ధాలు చెప్పలేం. నేను ఈ మాటలు చెప్తే ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. విలువలు, విశ్వసనీయ అనే పదాలకు అర్థం ఉండాలి.అధికారం శాశ్వతం కాదు..అధికారం ఉండొచ్చు.. పోవచ్చు. కానీ, మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకువచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ప్రజలు మనం చేసిన మంచి పనుల గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పివన్నీ జగన్ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతాం. టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా?. టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు. ప్రతీ కుటుంబానికి మంచి చేసే కార్యక్రమాలు మనం చేశాం. కానీ, చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు. ప్రతీ ఇంటికీ మన నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. మనం అమలు చేసిన హామీలే మనకు శ్రీరామ రక్ష. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రిపేర్‌గా ఉండాల్సిన సమయం వచ్చింది.పథకాలు నిర్వీర్యం..ఆరోగ్య శ్రీ పూర్తిగా నీరుగారిపోయింది, ఆరోగ్య ఆసరా లేదు. ఆస్పత్రులు నిర్వీర్యం అయిపోయాయి. మూడు త్రైమాసికాలు వచ్చినా.. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లీష్ మీడియం లేదు, సీబీఎస్ఈ లేదు, టోఫెల్ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఉచిత ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. పంటలకు ఎంఎస్పీలు రాని పరిస్థితి నెలకొంది. ఇంటివద్దకు సేవలు నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలి. లక్షన్నర పెన్షన్లు ఇప్పటికే తొలగించారు. లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఉంది. దిశ యాప్ కూడా ఏమైందో తెలియదు. దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు దొంగ కేసులకు పరిమితం అయ్యారు. డ్యూటీ మరిచిపోయి మూడు సింహాలకు సెల్యూట్ కాకుండా, రాజకీయనాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి.ఇసుక టెండర్లకు రెండు రోజులే గడువు. కనీసం టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ కూడా పోని పరిస్థితి ఉంది. ఇసుక రేటు మన హయాంకన్నా డబుల్ రేటు, ట్రిపుల్ రేటు. మన హయాంలో ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది. అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టేవాళ్లం. అంత పకడ్బందీగా మనం అమలు చేశాం. ఇప్పుడు ఇసుక దోచుకోవడానికి పాలసీని మార్చారు. స్టాక్ యార్డులు, రీచ్‌లు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఖాళీ చేసేశారు.లిక్కర్ పాలసీ అక్రమమే..లిక్కర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్స్ పెట్టి, టైమింగ్స్ తేసేసి, బెల్టుషాపులు లేకుండా చూసి, వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేసేలా చూశాం. ఎమ్మెల్యేలు కమీషన్ల కోసం భయభ్రాంతులకు గురిచేయడం, కిడ్నాపులు చేయడం చేస్తున్నారు. లిక్కర్ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీపడుతున్నారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామన్నారు, ఇప్పుడు రేట్లు అలానే ఉన్నాయి. పర్మిట్ రూమ్స్ తీసుకువస్తున్నారు. బెల్టు షాపులు పెడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. వీరికి, వీళ్ల మనుషులకూ ఇస్తున్నారు.ప్రతి నియోజకవర్గంలో 10 పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారు. నాలుగు నెలల్లో ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండం. ఇలాంటి సమయంలో మనం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తిస్తారు. మన యుద్ధం వీరందరితో..ఇప్పుడున్నది సోషల్ మీడియా కాలం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు, చెడిపోయిన వ్యవస్థలతో యుద్ధం చేస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లతో, టీడీపీ తప్పుడు సోషల్‌మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మనం అంతకన్నా బలంగా తయారు కావాలి. పార్టీ కమిటీలన్నీ కూడా సోషల్ మీడియాకు అనుబంధం కావాలి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. మీ పేజీలను మీరే నడపాలి. అన్యాయాలను మనం ఎండగట్టాలి. పార్టీ సందేశాలు కూడా గ్రామస్థాయికి వెళ్లాలి. ఇదంతా సోషల్ మీడియా ద్వారా జరగాలి. వచ్చే రోజుల్లో దీనిపై బాగా దృష్టిపెట్టాలి. దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైఎస్సార్సీపీ తయారు చేయాలి.జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని వారు మీ పనితీరు ఆధారంగా మీ ప్రమోషన్లు ఉంటాయి. మీరు ప్రూవ్ చేసుకోండి.. తప్పకుండా ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తాం. మీకు ప్రమోషన్ ఇచ్చే బాధ్యత మాది. మీలో ఎక్కువ మంది మనం అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో ఉండాలని ఆశిస్తున్నాం. జిల్లా అధ్యక్షులకు ఇదొక సువర్ణావకాశం. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీ జగన్ మీ కష్టాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాడు. అనుబంధ సంఘాల అధ్యక్షులకూ మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరుపై పరిశీలన, మానిటరింగ్ ఉంటుంది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల పనితీరుపైనా మదింపు ఉంటుంది. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు కూడా ఉంటాయి. బాగా పనిచేసే వారికీ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం దాడి
సాక్షి, అమరావతి/భవానీపురం: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు రెచ్చిపోయారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై ఆదివారం దాడికి తెగబడ్డారు. రాళ్లు, రంగు డబ్బాలు విసురుతూ భయోత్పాతాన్ని సృష్టించారు. ఉన్మాదులను తలదన్నే రీతిలో వీరంగమాడారు. నిలువరించబోయిన పోలీసులు, భద్రతా సిబ్బందిపై సైతం దాడికి యత్నించి పోలీసు ఔట్ పోస్టు అద్దాలను ధ్వంసం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి విదితమే. తాము కూడా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తామని.. తమకంటూ సిద్ధాంతాలు లేవనే రీతిలో బీజేవైఎం కార్యకర్తలు ఉదయం 11.30 గంటల సమయంలో వైఎస్సార్సీపీకి ప్రధాన కార్యాలయంపైకి దాడికి సాహసించారు.చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవాలను గ్రహించకుండా గుంపు కట్టి నినాదాలు చేస్తూ రాళ్లు విసిరారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యాలయ గోడలు, తలుపులపై రంగు ప్యాకెట్లు చల్లారు. మూసివున్న గేట్లు ఎక్కి లోపలకు దూకేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రధాన గేటు ముందు కూర్చుని పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగు ప్యాకెట్లను పార్టీ కార్యాలయం లోపలకు విసరగా అవి లోపల వైపున ఉన్న సెక్యూరిటీ గదికి సమీపంలో పడ్డాయి.సుమారు 20 మందికిపైగా యువమోర్చా కార్యకర్తలు దాడికి యత్నించడంతో పాటు కార్యాలయం దగ్గర వైఎస్సార్సీపీ ఫ్లెక్సీని చించి తగులపెట్టారు. దీంతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం తాపీగా వచ్చిన పోలీసులు ఆందోళనకారుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.టీడీపీ దారిలోనే బీజేవైఎంగడచిన వంద రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరి స్థాయిలో వారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుండటంతో బీజేవైఎం కూడా అదే దారిపట్టింది. ఈ దాడులు చూస్తేంటే ఏపీలో ఉన్నామా? బీహార్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పోలీసులకు ఫిర్యాదువైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన దాడిపై తాడేపల్లి పోలీసులకు వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బీజేవైఎం కార్యకర్తలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఈశ్వర్, ఆర్ఎస్ఐ వీరేష్, కానిస్టేబుల్ రవీంద్రరెడ్డి, డి.ఖాజాలను దుర్భాషలాడుతూ పార్టీ కార్యాలయంలోకి చొరబడేందుకు విశ్వప్రయత్నం చేసినట్టు తెలిపారు.బీజేవైఎం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన బీజేవైఎం కార్యకర్తల ఉన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాశ్, పోతిన మహేష్‌తో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తల దాడిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని కోరారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఇళ్లపై దాడులు చేసేస్థాయి నుంచి పార్టీ కార్యాలయంపై దాడులు చేసే స్థాయికి రాష్ట్రంలో పరిస్థితి దిగజారిందన్నారు. చంద్రబాబు డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక భావం ఉందని, అందుకే దళితులను ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారన్నారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేయడం ప్రపంచమంతా చూసిందని, దీనిని పవన్ ఖండించకపోగా ప్రాయశ్చిత దీక్ష చేస్తుండటం సిగ్గుచేటన్నారు. కాగా, బీజేపీ ముసుగులో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్‌రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడి సరికాదు: సీపీఎంతిరుమల లడ్డూ సమస్యను ఆసరాగా చేసుకుని బీజేపీ అనుబంధ బీజేవైఎం కార్యకర్తలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగాఖండించింది. ఈ మేరకు పార్టీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘ్ పరివార్ శక్తులు ఒక పథకం ప్రకారం తిరుపతి లడ్డూ సమస్యను ఆసరాగా చేసుకుని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. -
పార్టీ కార్యాలయంపై దాడికి యత్నం.. పోలీసులకు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: బీజేవైఎం కార్యకర్తల దాడికి యత్నం ఘటనపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు.ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ గ్రీవెన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నాగ నారాయణ మూర్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాడి ఘటనకు సంబంధించిన ఆధారాల్ని పోలీసులకు అందించారు. కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడులకు యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరిన బీజేవైఎం కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిని బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు.చదవండి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం -
జయభేరి సంస్థ మమ్మల్ని మోసం చేసింది
-
కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. తాడేపల్లి పోలీసుల ఓవరాక్షన్
గుంటూరు, సాక్షి: తాడేపల్లి పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌ను ఈ ఉదయం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్టు విషయంలో వెంకటరామిరెడ్డికి కోర్టు ఇదివరకు ఊరట ఇచ్చింది. ఆయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయినా ఆ గడువు ఆదేశాలను పట్టించుకోకుండా ఈ ఉదయం 11గం.కే ఆయన్ని ఇంటి నుంచి తాడేపల్లి పోలీసులు తీసుకెళ్లారు. ఆయన్ని ఎక్కడి తీసుకెళ్లారు? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పార్టీ నేతలతో సమావేశం.. వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు
గుంటూరు, సాక్షి: ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నదానిపై వారితో చర్చలు జరిపారు. దీంతోపాటు రాబోయే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిత్వంపైనా వారి అభిప్రాయాలు తీసుకున్నారు.పార్టీ సూచనల మేరకు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిని నియమించారు. అలాగే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు.వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ సమావేశం జరిగింది. తొలుత వైఎస్సార్సీపీ జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. రేపు(గురువారం)కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆర్నెలలపాటు సమయం ఇవ్వాలని తొలుత జగన్ భావించారు. ఆ తర్వాతే చంద్రబాబు సర్కార్‌ను నిలదీయాలని భావించారు. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో అరాచకం మొదలైంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో.. బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు & నారా లోకేష్ ప్రొత్సహిస్తూ వస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు, అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. వైఎస్సార్సీపీపై ప్రతీకార దాడులు, అంతటా నేతల అధికార జులుం, వివిధ విభాగాలు.. వాటి అధిపతులు ఆఖరికి క్షేత్ర స్థాయి ఉద్యోగులపైనా వేధింపులు కొనసాగుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వంపై తక్షణ పోరును ప్రారంభించారు జగన్. మరోపక్క.. దాడులతో ఆందోళన చెందుతున్న పార్టీ కేడర్‌కు అధైర్య పడొద్దంటూ భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజులపాటు(ఇవాళ, రేపు) పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతుండడం విశేషం. -
YSRCP ఆఫీసు కూల్చివేతపై అధికారులకు హైకోర్టు మొట్టికాయలు
-
వైఎస్సార్సీపీ ఆఫీస్ కూల్చివేత.. అధికారులకు హైకోర్టు నోటీసులు
అమరావతి, సాక్షి: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనలో ఏపీ హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. కోర్టు ధిక్కరణ కేసులో సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌తో పాటు తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.కూల్చివేతకు సంబంధించి.. కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. గురువారం పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయ భవనం అక్రమ కట్టడం అని సీఆర్డీయే పేర్కొంది. అయితే దానిని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైఎస్సార్సీపీ హైకోర్టును కోర్టును ఆశ్రయించింది. దీంతో.. చట్టాన్ని మీరి వ్యవహరింవద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది కూడా. అయినా కూడా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సాయంతో సీఆర్డీయే జూన్ 22వ తేదీ వేకువజామున కూల్చివేతలు జరిపింది. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. దీంతో సీఆర్డీఏ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ వైఎస్సార్సీపీ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. -
నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
-
చంద్రబాబు కుట్రకు హైకోర్టు బ్రేక్..
-
చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదు
గుంటూరు, సాక్షి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు.. తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘‘చంద్రబాబు నాయుడు ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావొచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు.. ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు... అయినా ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్సీపీ తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను’’ అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024 -
Updates: టీడీపీ విధ్వంస పాలన.. వేడెక్కిన ఏపీ రాజకీయం
గుంటూరు, సాక్షి: తెల్లవారక ముందే ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ.. ప్రతీకార రాజకీయాలు దిగిందనే చర్చ మొదలైంది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేతపై ఆ పార్టీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. చంద్రబాబు దమనకాండ మరో స్థాయికి చేరిందంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై వైఎస్సార్సీపీ నేతల స్పందనఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?: పొన్నవోలు సుధాకర్రెడ్డిచట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తోంది.హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారుగుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీస్‌లు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారుపాలకులు మారొచ్చు.. కానీ చట్టం మారదున్యాయవ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారుతెలుగుదేశం పార్టీ 340 ప్రకారం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు భూములు తీసుకుందిఎకరాకు వెయ్యి రూపాలకే తెలుగుదేశం భూములు పొందింది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే ప్రకారం రెండు ఎకరాలు చట్టపరంగా తీసుకుందిపర్మిషన్ తీసుకోలేదని ఏడురోజుల్లో తొలగించాలని ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చారుమేము సవాల్ చేస్తూ.. లంచ్ మోషన్ వేశాం.కూల్చేస్తున్నారని కోర్టుకు చెప్పాండ్యూ ప్రాసెస్ ఫాలో అవుతామని చట్టానికి లోబడి పనిచేస్తామని కోర్టుకు తెలిపారుకన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంతవరకు కూల్చకూడదని చట్టం చెబుతుందిచట్టం 115 సీఆర్డీఏ యాక్ట్ కింద వివరణ అడగాలి, వివరణ కూడా ఇచ్చాముకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారుకోర్టు ఆదేశాల విషయం సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్, వాట్సప్ ద్వారా తెలిపాంరాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?కక్షసాధింపు తప్ప చంద్రబాబు పాలనలో ఇంకేమైనా ఉందా?ఏపీలో వైఎస్సార్సీపీ ఆఫీసులే ఉండకూడదన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందిచంద్రబాబు పాలన తొలిరోజు నుండే దారుణాలు జరుగుతున్నాయినియంతృత్వ వైఖరితో చంద్రబాబు పని చేస్తున్నారుక్రమశిక్షణతో పని చేయాలని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారుతెల్లవారేపాటికి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారుచంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట నివాసం అక్రమందాన్ని కూల్చుతామని గతంలోనే దేవినేని ఉమా చెప్పారుఅధికంగా బూతులు మాట్లాడేదెవరని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అయ్యన్నపాత్రుడినే చూపిస్తోందిఅలాంటి వ్యక్తిని స్పీకర్‌గా నియమించారంటేనే సభను ఎలా జరపాలనుకుంటున్నారో అర్థం అవుతోందిఇలాంటి మనస్తత్వం ఉన్న స్పీకర్.. వైఎస్సార్సీపీ సభ్యులను మాట్లాడనిస్తారా?జగన్‌ను అవమానించటానికీ, ఆయన ఆస్తులను ధ్వంసం చేయడానికే చంద్రబాబు సీఎం అయ్యారా?:::టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యేనాడు లేని సమస్య.. నేడు ఎందుకు?చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు లేదంటూనే కక్ష సాధింపు చేపడుతోందిగతంలో 12 చోట్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థలాలు లీజుకు తీసుకుందిఅప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది?చట్టబద్ధంగా లీజుకి తీసుకున్న స్థలంలో కార్యాలయం నిర్మిస్తే తప్పేంటి..జరిగిన సంఘటన అందరూ ఖండించాలి:::మాజీ ఎంపీ మార్గాని భరత్, తూర్పుగోదావరి చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరించాలికూల్చివేతలకు మేము వ్యతిరేకంకక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దుప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించాలిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(ఢిల్లీ)పార్టీ ఆఫీస్‌లు మాకు దేవాలయాలు.. రక్షించుకుంటాంఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయిప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ద్వసం చేస్తున్నారుతాడేపల్లిలో కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని నేలమట్టం చేశారుకోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్న పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారుచంద్రబాబు లోకేష్ వెళ్ళేటపుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయం కనిపిస్తుందని కూల్చేశారుఅంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారుమేము మీలాగే దాడులు చేసి ఉంటే టీడీపీ కార్యాలయాలు ఉండేవా?మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఒక వాగులో ఉందిచాలా జిల్లాల్లో 2015 నుంచి 2019 నుంచి టీడీపీ కార్యాలయాలు కోసం ప్రభుత్వ భూములు తీసుకున్నారు.కేబినెట్ నిర్ణయం మేరకు వైఎస్ఆర్సీపీ వైజాగ్ ఎండాడలో 2 ఎకరాల స్థలం తీసుందిపార్టీ కార్యాలయం కోసం ప్లాన్ అప్రూవల్ తీసుకొని నిర్మాణం చేపట్టాముఫిబ్రవరి నెల 2023 తేదీన ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం15 లక్షలు రూపాయలు ప్లాన్ అప్రూవల్ కోసం చెల్లించాంనిబంధనలు ప్రకారం బిల్డింగ్ నిర్మించాంగజాల్లో ఉంటే gvmc పరిధిలో కి వస్తుంది.. ఎకరాల్లో ఉంటే vmrda అనుమతి తీసుకోవాలిఏడాది క్రితమే అనుమతి తీసుకున్నాంఆ మాటకొస్తే.. వైజాగ్ లో టీడీపీ కార్యాలయానికి 15 ఏళ్ల వరకు ప్లాన్ అప్రూవల్ లేనేలేదుఅధికారంలో ఉన్నాము కాబట్టి ఏదైనా చేస్తామంటే చెల్లదుమీ రెడ్‌బుక్ పాలన చేస్తామంటే కుదరదు.పద్ధతి ప్రకారం చేస్తే పార్టీ కార్యాలయం ఉండడానికి వీళ్లేదా?టీడీపీ నిర్మించిన అన్ని కార్యాలయాలకు అనుమతులు ఉన్నాయా?వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు మాకు దేవాలయాలులాంటివిచట్టప్రకారం మా దేవాలయాలను కాపాడుకుంటాం::: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(విశాఖపట్నం)ఇది అప్రజాసామ్విక చర్యతాడేపల్లి వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయాన్ని అన్యాయం కూల్చేయడం చట్ట వ్యతిరేక చర్యప్రజలకు అభివృద్ధి పాలన అందిస్తాన్న చంద్రబాబు ఇలాంటి చర్యలు చేపట్టడం వలన ప్రజలు భయాందోళనలు చెందుతున్నారుఅనుమతులు అన్నీ తీసుకుని చట్టపరిధిలో నిర్మాణం చేస్తుంటే వాటిని కూల్చేయడం దారుణంఇది అప్రజాసామ్వికం , ఇది హైకోర్టు ధిక్కార చర్య:::మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమఅనకాపల్లి కార్యాలయానికీ నోటీసులుఅనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులుఅనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఉన్న కార్యాలయంఅక్రమ కట్టడమని పేర్కొంటూ నోటీసులు ఏడాది క్రితం ప్లాన్ అప్రూవల్ కోసం చేసిన దరఖాస్తు.. ఇంకా పెండింగ్‌లోనే ఉందన్న అధికారులువారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయని నోటీసుల్లో స్పష్టీకరణనెల్లూరు వైఎస్సార్సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతనెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ ఆఫీస్ అనుమతులు చూపాలంటూ మున్సిపల్ అధికారుల జులుం.. ఉద్రిక్తతహుటాహుటిన కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిబిల్డింగ్కు అన్ని అనుమతులు తీసుకున్నామని వివరణ అయినా తగ్గని అధికారులు రెండు రోజులు గడువు కోరిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇదేనా చట్టబద్ధమైన పరిపాలన?ఇది ప్రభుత్వ స్థలమే ప్రభుత్వ స్థలం అయినా.. లీజ్‌కు తీసుకున్నాంకేబినెట్ ఆమోదం పొందాకే స్థలం తీసుకున్నాంఒక పద్ధతి ప్రకారమే నిర్మాణాలు చేపట్టాంటీడీపీకి మమ్మల్ని అనే హక్కు లేదుఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ స్థలాల్లో పార్టీ నిర్మాణాల్ని చేపట్టిందినోటీసులు ఇచ్చాక పదిహేను రోజుల టైం ఉంటుందికోర్టు చెప్పినా పట్టించుకోకుండా ఆగమేఘాల మీద రెండున్నర గంటల్లోనే, అదీ వేకువజామున భవనం కూల్చేశారునిర్మాణంలో ఉన్న భవనాన్ని నిర్దాక్షిణ్యంగా.. కక్ష పూర్వకంగా చేసిన ఈ పనిని ఖండించాలని ప్రజాస్వామ్య వాదుల్ని కోరుతున్నాఅధికారం శాశ్వతం కాదు.. ఇలా కూల్చేయడం ధర్మం కాదుమాది రాజకీయ పార్టీ కాదా?.. కార్యకలాపాలు నిర్వహించుకోకూడదా?చంద్రబాబుగారూ.. ఇదేనా చట్టబద్ధమైన పరిపాలన?ప్రజలు ఇవన్నీ ఆలోచించరని అనుకుంటున్నారా? అసలు ప్రజలు టీడీపీ ప్రభుత్వ చర్యను క్షమిస్తారా?::: అంబటి రాంబాబుసీతానగరంలో కూల్చిన ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో అంబటి రాంబాబు వైఎస్సార్సీపీ ఉనికి లేకుండా చేయాలన్నదే టీడీపీ ప్రయత్నంవైఎస్సార్సీపీ కార్యాలయానికి ధ్వంసం చెయ్యడం.. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టటీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు ప్రారంభం అయ్యాయి..వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారుతోటపల్లి గూడూరు మండలం కోడూరులో అక్వా రైతు రంగారెడ్డికి సంబందించిన 50 లక్షలు విలువ చేసే రొయ్యల సామాగ్రిన్ని తగలబెట్టారు..పోలీసులకు పిర్యాదు చేసినా.. బాధితులనే ఇబ్బంది పెడుతున్నారు..వైఎస్సార్సీపీ నేతలకు ఆర్థికంగా నష్టం కల్గిస్తున్నారు..కొన్ని చోట్ల నోటీసులు ఇవ్వకుండా.. ప్రభుత్వ జోక్యం లేకుండానే.. ప్రవేట్ వ్యక్తులు వైఎస్సార్సీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు..టీడీపీ నేతలు చేస్తున్న పాపాలే.. భవిష్యత్తులో వారికి శాపాలుగా మారుతాయి..వైఎస్సార్సీపీ ఉనికి లేకుండా చెయ్యాలని టీడీపీ చూస్తోంది ప్రజలు అన్నింటిని గమనిస్తూ ఉన్నారు:::మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరుతెలుగుదేశం పతనానికి ఇదే నాందివైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాన్ని దురుద్దేశం పూర్వకంగా కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా కూల్చివేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోతుందిగతంలో కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అక్రమంగా నిర్మించినప్పటికీ కూడా మా ప్రభుత్వం కూల్చి వేయలేదురాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థని లెక్కచేయకుండా చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ పతనానికి ఇదే నాందిటీడీపీ అధికారంలోకి వచ్చిన అప్పటినుంచి YSRCP నేతలపై దాడులు చేస్తున్నారు.. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు:::మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, శ్రీకాకుళంప్రజలే గుణపాఠం చెబుతారువైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేయడం దుర్మార్గమైన చర్యకోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ కూల్చివేయడం హేయమైన చర్యకూటమినేతలుప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేయడం,వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకుల పై దాడులు ప్రజలు గమనిస్తున్నారుచంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఇలాగే కూల్చి వేస్తారనీ హెచ్చరిస్తున్నాంవారి పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉండటాన్ని ఓర్చుకోలేక ఇలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టారుప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటిచర్యలు గొడ్డలి పెట్టు లాంటివిప్రజలు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేశామా? అనిబాధపడే పరిస్థితులు వచ్చాయిసంక్షేమ పథకాలు అమలు అవుతాయి అనున్న ప్రజలకు.. రాష్ట్రాన్ని బీహార్ల మార్చేసి చూపిస్తున్నారుచంద్రబాబుకు తప్పకుండా ప్రజలు గుణపాఠం చెబుతారు:::కంభం విజయరాజు, చింతలపూడి వైఎస్సార్సీపీ కన్వీనర్ (ఏలూరు)సంబంధిత వార్త: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేతటీడీపీ దుర్మార్గాలపై న్యాయ పోరాటంరాజకీయ కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదుతాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాంసూపర్ సిక్స్ అమలకన్నా కక్ష సాధింపు చర్యలకే చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారుటిడిపి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాల కోసం అనేక స్థలాలను తీసుకుందిమేము ఏ రోజు వాటి జోలికి వెళ్లలేదు వాటిని ధ్వంసం చేయలేదుటీడీపీ దుర్మార్గాలపై న్యాయ పోరాటం చేస్తాం::కొండా రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి(విశాఖపట్నం)విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులుఎండాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్దకు జీవీఎంసీ అధికారులుపార్టీ కార్యాలయానికి పట్టణ ప్రణాళిక అధికారులు నోటీసులుఅనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారంటూ నోటీసులో పేర్కొన్న అధికారులువారం గడువు.. వివరణ ఇవ్వాలని ఆదేశాలునోటీసుల సంగతి తెలిసి ఆఫీస్‌కు చేరుకున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ఆగ్రహంతో నోటీసుల్ని చించిపడేసిన అమర్నాథ్దొంగల్లాగా కూల్చేశారుచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసకాండ అరాచక తీరు బాధాకరం. తెలుగుదేశం సభ్యులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు చేసే 24 గంటలు గడవకముందే విధ్వంసకాండ కు తరలేపారుకోర్టు ఆదేశాలు ఉన్నా సరే వాటిని బేఖాతరు చేశారుపార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం వారి అరాచక పాలనకు నిదర్శనందొంగల్లాగా తెల్లవారుజామున పోలీసుల పహారాలో కూల్చివేయడం బాధాకరంజరుగుతున్న విధ్వంసకాండను టీవీ ఛానల్ లో కూడా రానివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించారుఒకపక్క డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కక్ష సాధింపు రాజకీయాలు ఉండవంటారు.. మరోవైపు చంద్రబాబేమో ఇలా కూల్చివేతలకు ఆదేశాలిస్తారు!:::ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, నంద్యాలమరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకి చురకలు అంటించారు. సూపర్ సిక్స్ అమలు కన్నా.. వైఎస్సార్సీపీ ఆఫీసులను కూల్చడమే ఆయన ముఖ్యమని భావిస్తున్నారా?. ఇంతకీ చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా? అని ఎక్స్‌లో అంబటి సందేశం ఉంచారు.ఇదీ చదవండి: చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదుమరోవైపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇంఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి ఈ అంశంపై ట్వీట్ చేశారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేతఉదయం 5:30 గంటల సమయంలో పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత.శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు.కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న… pic.twitter.com/zCeLpHiZPE— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) June 22, 2024ఏం జరిగిందంటే.. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకి వెళ్లేదారిలో ఉంది. అయితే ఇది అక్రమ కట్టడం అంటూ గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు సీఆర్డీఏ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్(MTMC)లకు ఫిర్యాదు చేశారు. సీఆర్డీఏ చర్యలకు సిద్ధం అవ్వగా.. ఆ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ న్యాయవాది సీఆర్డీఏ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్డీఏ వైఎస్సార్సీపీ న్యాయవాది చెప్పిన అంశాన్ని పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తూ.. ఎంటీఎంసీకి కూల్చివేత ఆదేశాలిచ్చింది. దీంతో ఆ ఆదేశాలతో ఆరు బుల్డోజర్లను పట్టుకుని మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు. కేవలం రెండున్నర గంటల్లో నిర్మాణంలో ఉన్న పోర్షన్‌ను కూల్చేశారు. YSRCP రియాక్షన్టీడీపీ ప్రభుత్వ పెద్దలు రోజూ ఈ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి వస్తుందనే ఈ కూల్చివేతకు పాల్పడ్డారని, ఏపీని మరో బీహార్ గా మారుస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగినా.. కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరొద్దని అత్యున్నత న్యాయస్థానం సూచించినా.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని మండిపడుతోంది. ఏపీలో కూటమి విధ్వంస పాలనపై న్యాయపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది.ఏపీలో మొదలైన @JaiTDP కూటమి విధ్వంస పాలన! తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత ఉదయం 5:30గంటల సమయంలో కూల్చివేత ప్రారంభం. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులుకూల్చివేతకు… pic.twitter.com/x8cEiPlGYo— YSR Congress Party (@YSRCParty) June 22, 2024 -
తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేత
గుంటూరు, సాక్షి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, టీడీపీ విధ్వంసపాలన మొదలైందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. తాజాగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే(CRDA) అధికారులు కూల్చేశారు. శనివారం వేకువ జాము నుంచే పోలీసుల పహారాలో ఈ ప్రభుత్వ దమనకాండ కొనసాగింది.తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకి వెళ్లేదారిలో ఉంది. అయితే ఈ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తై.. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. రెండే రెండు గంటల్లో మొత్తం కూల్చివేత జరిగింది. అదే సమయంలో ఆ ప్రాంతానికి నేతలు, కార్యకర్తలు ఎవరినీ వెళ్లనివ్వకుండా గేట్లు వేసి మరీ భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలా ఉంటే.. నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైఎస్సార్సీపీ హైకోర్టును కోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో చట్టాన్ని మీరి వ్యవహరింవద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది కూడా. ఇదే విషయాన్ని సీఆర్ఏ కమిషనర్ దృష్టికి వైఎస్సార్సీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినా కూడా మున్సిపల్ అధికారుల సాయంతో సీఆర్డీయే ఈ కూల్చివేతలు జరిపింది. మరోవైపు సీఆర్డీఏ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. టీడీపీ ప్రభుత్వ పెద్దలు రోజూ ఈ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి వస్తుందనే ఈ కూల్చివేతకు పాల్పడ్డారని, ఏపీని మరో బీహార్ గా మారుస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, పైగా ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, కచ్చితంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ చెబుతోంది. -
YSRCP: జగన్ అధ్యక్షతన కీలక సమావేశం
గుంటూరు, సాక్షి: భవిష్యత్ కార్యచరణతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.వాస్తవానికి జగన్ రెండ్రోజుల పులివెందుల పర్యటన తర్వాత ఈ సమావేశం నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే ఈలోపే 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్న వైఎస్ జగన్ పార్టీ సమావేశాన్ని 20నే నిర్వహించాలని నిర్ణయించారు.తాడేపల్లిలోని తన కార్యాలయంలో రేపు జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేస్తారని సదరు ప్రకటన తెలిపింది. -
నా వయసు చిన్నదే.. మళ్లీ అధికారంలోకి వస్తాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని పార్టీ ఎంపీలకు ఆయన ధైర్యం చెప్పారు.వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్.. ‘‘గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదు. చాలా చిత్తశుద్ధితో పనిచేసి, మేనిఫెస్టోను అమలు చేశాం. ఏ నెలలో ఏం ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశాం. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ, ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశాం... విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజల ఇంటివద్దకే పరిపాలనను తీసుకెళ్లాం. అవినీతికి చోటులేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశాం. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించాం. విద్యారంగంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూనలదిశగా అడుగులు వేశాం. .. భవిష్యత్తు తరాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకు ఇంగ్లిషు మీడియం, టోఫెల్, ఆరో తరగతి నుంచి డిజిటల్ టీవీలు, ఎనిమిదో తరగతి నుంచి ట్యాబులు అందించాం. ఐబీ సిలబస్‌ని కూడా తీసుకు వచ్చాం. ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను విద్యార్థులకు అందించాం. నాణ్యమైన విద్యాను శాశ్వతంగా అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేదిశగా ఐదేళ్లలో అడుగులు వేశాం. .. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా ఎప్పుడూ చూడవిధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశాలు కల్పించాం. ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. శకుని పాచికలు మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తోంది. ఏం జరిగిందో దేవుడికే తెలియాలి’’ అని అన్నారారయన.వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్.. ‘‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోకూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికింది. అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ప్రశంసలు కురిపించింది. కానీ, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి… టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయి. నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయి. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టంవల్ల వస్తాయి. చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఈ పత్రాల విషయంలో తప్పులు జరిగితే… సదరు వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం ఇస్తుంది. టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుంది... వైఎస్సార్సీపీని నమ్మకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కొన్ని లక్షలమంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారు. కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారు. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో మనకు 40శాతం ఓట్లు వచ్చాయి. గడచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయి. రానున్న రోజుల్లో ఈ 10శాతం ప్రజలే… మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ప్రతి ఇంట్లోకూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదు. మనలో పోరాటపటిమ తగ్గకూడదు... నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంది. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి’’ అని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.‘‘పార్లమెంటులో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు. టీడీపీకి 16 మంది ఉన్నారు. అందువల్ల మన పార్టీకూడా చాలా బలమైనదే. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాటంచేయాలి. 2019-24 మధ్య ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మన పరిపాలనాకాలం ముగిసిందో తెలియదు. ఈసారికూడా అంతే. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి.... పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలి. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతు ఉంటుంది. ఎవరికైనాగాని, అంశాలవారీగానే మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి. ప్రజలముందు తలెత్తుకునేలా పార్లమెంటులో ఎంపీలు ముందుకుసాగాలి. రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికం.YSRCP పార్లమెంటరీ నేతగా వైవీ సుబ్బారెడ్డిపార్టీ తరఫున పార్లమెంటరీ నేతగా వైవీ సుబ్బారెడ్డి(రాజ్యసభ ఎంపీ) ఎన్నుకుంటున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు’’ అని వైఎస్ జగన్ తెలిపారు. ‘‘అందరికీ నేను అందుబాటులో ఉంటాను. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలి. పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోండి. ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలి.మన పార్టీకి ఒక సిద్ధాంతం, గుర్తింపు ఉన్నాయి. పార్టీకోసం మీరు కష్టపడండి. పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది అని ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇదీ చదవండి: నిబ్బరంతో నిలబడదాం.. భవిత మనదే: వైఎస్ జగన్ -
టీడీపీ-జనసేన హనీమూన్ నడుస్తోంది.. కొంతటైమిచ్చి పోరాడుదాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఎవరెన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్.. ‘‘40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారు అనేది మరిచిపోవద్దు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు వుంది. ఎన్నికలు ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలు పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ,బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోంది. మరి కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దాం.. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్‌లా, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి… ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ… ఇది అమలు జరిగిందా? లేదా? అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజూ ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో… ప్రతి సంవత్సరం కాలెండర్ విడుదలచేసి, ఆమేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకు వచ్చాం. ఇవన్నీ మనం చేసి, చూపించి… ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాం. కాని, ఎన్నికల్లో ఏమైందో తెలియదు.2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా ఇదేళ్లు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏమాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికీ మనంచేసిన మంచి బ్రతికే ఉంది. మనంచేసిన పాలనమీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మనపట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది. గడపగడపకూ మనంచేసిన మంచి ఇంకా బతికే ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.రాజకీయాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్. విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నదికూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయి. కానీ, ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ.. ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలి.అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగాలేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు. కాని మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏంచేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్లముందే చంద్రబాబుగారి పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూశాం.మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది చూడకుండా.. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని.. ప్రతి పథకం ప్రతి ఇంటికే అందించాం. అలాంటి పాలన మనదైతే.. ఈ రోజు కేవలం వాళ్ల పార్టీకి ఓటువేయకపోవడమే పాపం అన్నట్టుగా… రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు. ఆస్తులకు నష్టంచేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అవమానిస్తున్నారు. అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇవన్నీకూడా శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి.ఇంకోవైపు మనం మనకు ఓటు వేయకపోయినా వివక్ష చూపకుండా పథకాలకు ప్రతి ఇంటికీ డోలివరీ చేశాం. ఇప్పుడు వారు చేసిన పాపాలు ఊరికే పోవు. చంద్రబాబు రెండో పాపంకూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు. కేంద్రంలో 240 సీట్లకు అధికారపార్టీ పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్యరావడం, ఎన్టీయేలో కీలకంగా ఉన్న పరిస్ధితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకహోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోతే… రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు.మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్ ప్రకారం అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతిదీవెన, మత్స్యకారభరోసా వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి. ఇవి ఇప్పుడు వస్తాయో, రావో తెలియని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయి.ఈ పాపాలన్నీ పండేదాకా.. మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం గట్టిగా నిలబడి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కేవలం గుర్తు మాత్రమే చేస్తున్నాను. కష్టాలు రావడం సర్వ సహజం. ఎదుర్కొని నిలబడ్డం అన్నది మన చేతుల్లో అంశం.అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే. ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో… మనుషులు మీద దాడులు చేస్తున్న సమయంలో, ఆస్తులు నష్టంచేస్తున్నపరిస్థితుల్లో,అవమానిస్తున్న సమయంలో… ఉన్న ఒకే ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే.హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ వారికి టైం ఇద్దాం. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రజల్లోనే ఉంటాం.. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు ఇవ్వాళ్టికీ నాకు ఉంది. ఆ సత్తువ నాకు ఈ రోజుకీ ఉంది. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలి.జగన్ రాష్ట్ర పర్యటనత్వరలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని నిన్నటి నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీల భేటీలో ఆయన ఆ విషయాన్ని ధృవీకరించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను ఆయన పరామర్శిస్తారని తెలుస్తోంది. -
చంద్రబాబు చెప్తేనే పవన్‌కు సీటు: అడపా శేషు
తాడేపల్లి: పవన్‌ను నమ్మిన వారికి గతంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక్క సీటు కూడా జనసేన తీసుకోలేదని చెప్పారు. కాపులను పవన్ మోసం చేస్తున్నాడని తెలిపారు. ఒక పార్టీకి అధినేత ఎలా ఉండాలో జగన్ ను చూసి పవన్ నేర్చుకోవాలని అడపా శేషు అన్నారు. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. 'పవన్ పనైపోయింది. కాపు సోదరులారా మేల్కొనండి. లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్ ఉండదు. కాపులారా పవన్ ను చూసి మోసపోకండి. చంద్రబాబు,పవన్ మాటలు నమ్మకండి. తమ నాన్నే సీఎం అన్న లోకేష్ మాటలు పవన్ కు ఈ రోజు గుర్తొచ్చాయి. చంద్రబాబు ప్రొడ్యూసర్ ఐతే...ఆ సినిమాకు పవన్ ప్యాకేజ్ స్టార్. పవన్ కు తోడుగా ఇప్పుడు కొత్త ప్యాకేజ్ స్టార్ షర్మిలమ్మ వచ్చింది. కొత్త ప్యాకేజ్ స్టార్ వచ్చింది.. కాబట్టే పవన్ మాట్లాడటం లేదు. పవన్ ను చంద్రబాబు పక్కన పెట్టేశాడు. కాబట్టే టీడీపీ సీట్లు ప్రకటించుకుంటున్నాడు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ మీకు ఒక్క సీటు కూడా ఇప్పించలేడు.' అని అడపా శేషు అన్నారు. జనసేనలోకి ఎవరొచ్చినా పవన్ ప్రేమగా చూసుకుంటానంటున్నాడు కానీ.. సీట్లిస్తానని చెప్పడం లేదని అడపా శేషు తెలిపారు. చంద్రబాబు పాదాల దగ్గర కాపులను పవన్ తాకట్టు పెడుతున్నాడని దుయ్యబట్టారు. పవన్ కు సీటు ఎక్కడో ఈరోజుకీ చంద్రబాబు చెప్పలేదని విమర్శించారు. చంద్రబాబు వదిలేసినా.. పవన్ వదిలిపెట్టేలా లేడని వ్యంగ్యస్త్రాలు సందించారు. చంద్రబాబు చెప్తేనే పవన్ కు సీటు వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దోచుకోవడానికి అవకాశం లేదు.. కాబట్టే చంద్రబాబు, పవన్‌కు జగన్ మోహన్ రెడ్డి శత్రువులా కనిపిస్తున్నారని విమర్శించారు. ఇదీ చదవండి: తమ్ముడు పవన్ ఇది తెలుసుకో..: మంత్రి అంబటి -
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(65) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల అనంతరం.. గవర్నర్‌కు అపెండిసైటిస్‌గా వైద్యులు ధృవీకరించారు. గవర్నర్ అస్వస్థత గురించి రాజ్‌భవన్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు తొలుత విజయవాడకే వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని ఆయనకు సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం.. అపెండిసైటిస్‌గా తేల్చారు. వెంటనే గవర్నర్ నజీర్‌కు రోబోటిక్ విధానం ద్వారా సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రేపు డిశ్చార్జ్ ఆయన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై.. సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ అస్వస్థత సమాచారం అందుకున్న వెంటనే.. సీఎం జగన్ అధికారులతో మాట్లాడారు.గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
భూమి లేని పేదలకు అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. భూమి లేని పేదలకు సైతం తమ ప్రభుత్వం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారాయన. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా తొలి విడుత నిధుల జమ కార్యక్రమం జరిగింది. ‘‘దేవుడి దయతో ఇవాళ రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. అందులో మొదటిది కౌలు రైతులకు సంబంధించి.. వారితో పాటు దేవాదయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు కూడా 2023-24 తొలివిడత పెట్టుబడి సాయం రూ.7,500 అందిస్తున్నాం. రెండో మంచి కార్యక్రమం.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని.. ఆ సీజన్ ముగిసేలోపే పరిహారం రైతన్నల చేతులో పెడుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా లేదేమో. ఏ వ్యవసాయ భూమి లేని నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. ప్రతీ వాళ్లకు నా అని సంభోదిస్తూ అందరికీ అండగా నిలబడుతున్న ప్రభుత్వం ఇది. అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రైతులకు అండగా నిలబడుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా అరణ్యభూములు సైతం సాగు చేసుకునే గిరిజనులకు తోడుగా ఉండే కార్యక్రమం ఇది’’ అని సీఎం జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో.. 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే.. దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు సాయం పంపిణీ చేస్తోంది. 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇది అని తెలియజేశారాయన. ఇప్పటివరకు.. 50 నెలల కాలంలో 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించింది(నేటి సాయంతో కలిపి). ఇక మొత్తంగా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేయగలిగామని అందించామని సీఎం జగన్ తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్రంలో అర హెక్టారులోపు ఉన్న రైతులు దాదాపు 60 శాతం ఉన్నారు. ► ఒక హెక్టారు దాకా దీన్ని తీసుకుపోతే 60 శాతా కాస్తా 70 శాతం పైచిలుకు దాకా పోతోంది. ► రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. ఈ సొమ్ము 60 శాతం మంది రైతులు అందరికీ 80 శాతం పంటలకు 80 శాతం పెట్టుబడి సాయంగా అందుతోంది. ► దీని వల్ల వాళ్లు బయట అప్పులు చేసుకోవాల్సిన అవసరం రాదు. కరెక్టుగా మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇస్తున్నాం. ► పంట వేసే టయానికి, కోసేటప్పుడు వాళ్ల చేతిలో డబ్బులు పడే సరికి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి నష్టపోకుండా వ్యవసాయం చేయగలిగే పరిస్థితి వచ్చింది. ► వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఒక్క కార్యక్రమం ద్వారా రూ.13,500 అన్నది హెక్టారులోపు ఉన్న 70 శాతం మంది రైతులకు ఎంతో మేలు చేస్తోంది. ► ఇన్‌పుట్‌సబ్సిడీకి సంబంధించి మొన్న వర్షాల వల్ల గోదావరి, భారీ వరదలు వచ్చాయి. ► ఈ సీజన్ ముగిసేలోగానే 4,879 హెక్టార్లలో రకరకాల పంటలు ఆగస్టులోపు నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీగా ఈరోజు రూ.11 కోట్లు వాళ్ల చేతిలో కరెక్టుగా సమయానికి పెట్టడం జరుగుతోంది. ► ఈ గొప్ప కార్యక్రమం ద్వారా రూ.1,977 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా ఇస్తూ రైతు నష్టపోకుండా చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం. దాంతోపాటు ఇప్పటికే 38 కోట్లు ఫ్లడ్ రిలీఫ్‌లో భాగంగా వాళ్లందరికీ సాయం చేశాం. ► వరదల వల్ల నష్టపోయిన రైతన్నలకు నారుమడులు, నాట్లు వేసిన పొలాల రైతులందరికీ వెనువెంటనే వారిని ఆదుకుంటున్నాం. ► పంటలు వేసుకొనేందకు 80 శాతం రాయితీతో వరి విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇప్పటికే సరఫరా చేసి తోడుగా నిలబడగలిగాం. ► రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలోనే ఎలాంటి విప్లవాత్మక మార్పులు మన రాష్ట్రంలో చూడగలిగాం అని గమనిస్తే.. ► కళ్ల ఎదుటనే కనిపించే కొన్ని విషయాలు మీ అందరికీ అర్థమయ్యేట్లుగా చెప్పదలచుకున్నా. ► ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ మన కళ్లెదుటే కనిపిస్తోంది. ► గ్రామ స్థాయిలో సచివాలయం, పక్కనే 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. ► అక్కడే అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఉంటారు. సహాయ సహకారాలు అందిస్తూ, చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. ► బ్యాంకింగ్ సేవలు, కియోస్క్ అక్కడే ఉంది. కల్తీ లేని విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే గొప్ప వ్యవస్థ. ► ఈక్రాప్ వ్యవస్థ అమలవుతోంది. ఏ పంట ఎవరు వేశారనే ఫిజికల్ డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ తెస్తున్నాం. ► సోషల్ ఆడిట్లో డిస్ప్లే అవుతోంది. మంచి జరగకుంటే ఎలా కంప్లయింట్ చేయాలనేది అక్కడే రాసుంది. ► వెంటనే రీ వెరిఫై చేసి నష్టం జరగకుండా చేసే కార్యక్రమం జరుగుతోంది. ► ఆర్బీకేలో కనీస గిట్టుబాటు ధర డిస్ప్లే చేసి తక్కువ ధరకు పడిపోతే ఆర్బీకేలు ఇంటర్ఫియర్ అయ్యి రైతుకు సాయంగా పంట కొనుగోలు చేస్తున్నారు. ► ధాన్యం కొనుగోలు అయితే ఎంఎస్పీ రాని పరిస్థితి నుంచి ఎంఎస్పీ ఇవ్వడమే కాకుండా, గన్నీ బ్యాగ్స్, లేబర్ ట్రాన్స్‌పోర్టు ఖర్చు ఎకరాకు రూ.10 వేల చొప్పున అదనంగా రైతుల చేతుల్లోకి అందుబాటులోకి వస్తోంది. ► పంట నష్టపోయిన అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే అడుగులు నాలుగేళ్లలో పడ్డాయి. ► ఏ పంట వేసినా ఈ క్రాప్, ఇన్సూరెన్స్ నమోదవుతోంది. ► రైతులు కట్టాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతోంది. ► రైతులకు ఉచిత పంటల బీమా 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ► మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పగటిపూటే 9 గంటలు కరెంటు ఇవ్వాలంటే రూ.1,700 కోట్లు పెట్టి ఫీడర్లు అప్‌గ్రేడ్ చేయాలని డిపార్ట్మెంట్ చెబితే ఆ డబ్బు పెట్టి ఫీడర్లను అప్‌గ్రేడ్ చేసి పగటిపూటే కరెంటు ఇస్తున్నాం.. ఇవన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ► రైతుకు సాగు ఒక్కటే కాకుండా అదనపు ఆదాయం రావాలంటే వ్యవసాయం ఒక్కటే కాకుండా గేదెలు, ఆవులు కూడా రైతులకు తోడుగా ఉండాలి. ► వాటిలోంచి వచ్చే ఆదాయం మెరుగ్గా ఉండాలని, సహకార రంగంలో గొప్ప మార్పు తెస్తూ అమూల్‌ను తీసుకొచ్చాం. ► ఏకంగా 8 సార్లు అమూల్ వచ్చిన తర్వాత రేటు పెరిగింది. ► లీటరు గేదె పాలు రూ.22, ఆవు పాలు లీటరుకు రూ.11 పెరిగింది. కేవలం ఈ నాలుగు సంవత్సరాల మనందరి ప్రభుత్వంలో జరిగిన మార్పులకు తార్కాణం. ఈరోజు చేస్తున్నవి కూడా అందులో భాగంగా కొనసాగిస్తున్నాం. రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని బటన్ నొక్కి నిధుల్ని విడుదల చేశారు సీఎం జగన్. -
యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకున్నారేమో!: సజ్జల
సాక్షి, గుంటూరు: గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీకి గుడ్‌బై ప్రకటించడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని.. యార్లగడ్డ మాటలు చూస్తుంటే ఆయన ముందే నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేయాలి. అవకాశం కోసం ఎదురు చూడాలి. ఎవరిని అవమానించడం.. బాధించడం అనేది ఉండదు. ఏ పార్టీలోనైనా ఇలాంటివి సహజం. ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఏ పార్టీలోనైనా ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండాలనే కోరుకుంటాం. సమస్యలుంటే అంతర్గతంగా మాట్లాడాలే తప్పా.. వేదికలపై ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. ‘‘యార్లగడ్డ గతంలో మాపార్టీ నుంచి పోటీ చేశారు. టికెట్ ఆశించేవాళ్లు ఎంతమంది ఉన్నా టికెట్ ఒకరికే వస్తుంది. ఆ విషయమే నేను యార్లగడ్డ కి చెప్పాను. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే పార్టీలో మాట్లాడవచ్చు. కానీ, పబ్లిక్ గా మీడియాతో మాట్లాడతానంటే ఎలా?. వరుసగా మీటింగులు పెట్టి అలా మాట్లాడుతున్నారు. ముందే పార్టీ మారాలనే ఇలా మాట్లాడుతున్నారేమో?. ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నిరాదరణ అయినట్టు కాదు. సీఎంని కలవాలని ఆయన అనుకుంటే ప్రాపర్ వేలో కలవచ్చు. లేదా నాయకులను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీడియా ద్వారా మాట్లాడతానంటే అది కరెక్టు కాదు.’’ పార్టీ కోసం పని చేసేవారికి గుర్తింపు ఉంటుంది. బలమైన పార్టీ కాబట్టి చాలామంది భవిష్యత్తును ఆశిస్తారు. కానీ, ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని సజ్జల తెలిపారు. యార్లగడ్డ ఎపిసోడ్లో మీడియా వక్రీకరించిన దాఖలాలు ఉన్నాయని సజ్జల ప్రస్తావించారు. యార్లగడ్డను నేను అవమానించినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. యార్లగడ్డను పోతేపోనీ అని నేను అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అలా నేను ఎందుకు అంటాను. నేనే కాదు మా పార్టీలో ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరు. యార్లగడ్డను ఎవరూ అవమానించలేదు. యార్లగడ్డకు మంచి భవిష్యత్తు ఉంటుందని నా వాళ్లు చెప్పారు అని సజ్జల చెప్పారు. పవన్, చంద్రబాబు ఒక్కటే ఆర్కెస్ట్రా సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమని పవన్ చెబుతూ వస్తున్నాడు. దీనికోసం పవన్ ఎవరితోనైనా కలుస్తారు. చంద్రబాబు ఏం చెబితే అది పవన్ చేస్తారు. పవన్, చంద్రబాబు ఎప్పుడూ కలిసే ఉన్నారు. పవన్ కల్యాణ్ ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయి. చంద్రబాబుకు ఆర్కెస్ట్రా లాగా పవన్ వ్యవహరిస్తున్నారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించాం కాబట్టి.. సీఎం జగన్ వైజాగ్ వెళ్తున్నారు కాబట్టి.. పవన్ ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు చంద్రబాబు పాలనకు సరిగ్గా సరిపోతుంది. విశాఖలో క్రైం పెరిగిందంటూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారు ఎన్ని చేసినా అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తుంది. పిట్టలదొరల్లాగా.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గం ప్రశాంతంగా బతకలేదు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రజలకు ఏం ఏశారు?. చంద్రబాబు విజనరీలాగ మాట్లాడుతున్నారా?. ఇలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఈ రాష్ట్రం ఏం కావాలి?. సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ తానే కనిపెట్టానంటుంటే ఆయన మానసిక స్థితి ఏంటి?. ఈయన్ని సీఎం సీట్లో కూర్చోపెట్టాలనుకునే పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి?. అసలు వీరిని పగటివేషగాళ్లు అనాలా? ప్రతిపక్ష నేతలు అనాలా?. పిట్టలదొరలు లాగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా.. సంక్షేమ పథకాలను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ఆ ఫలితం రేపు ఎలక్షన్లలో కనిపిస్తుంది అని సజ్జల విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఓ ముసలి నక్క ఆంధ్రజ్యోతిలో అవాస్తవాలు రాయిస్తోంది! -
వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
-
CM Jagan: రెట్టించిన స్పీడ్‌తో పనిచేయాలి
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా.. నేడు(సోమవారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చింది మార్చి 16వరకూ కోడ్ కొనసాగింది తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్ వచ్చిందిమళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి రాష్ట్ర చరిత్రే కాదు… దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది అర్బన్ ప్రాంతంలో 84శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు 87శాతం కుటుంబాలను గమనించినట్టైతే… అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసిన మరీ… వారికి పథకాలు అందిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం: బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ… గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు 21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి: ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది రాష్ట్రంలో ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపిల్ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం… మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు దానికితోడు ఈనాడు రాయడం, ఆంధ్రజ్యోతి రాయడం, టీవీ-౫ చూపడం రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం వారంతా గజ దొంగల ముఠా దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి వాటిని తిప్పికొట్టాలి సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి గృహసారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తిచేసుకోవాలి ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలి వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలి వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వంచేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలి దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశాం ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలి నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారంచుడదాం ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు ఈ అడుగులన్నీ కూడా దానికోసమే కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నాకు ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది నేను చేయాల్సింది.. నేను చేయాలి మీరు చేయాల్సిది మీరు చేయాలి ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే… అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం ఇదీ చదవండి: బోధనాస్పత్రుల బలోపేతం