సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్బావ దినోత్వవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ పార్టీ జెండాను ఎగురవేసి నేతలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక, తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్ జగన్. అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణ తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు.
మహిళలకు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు రిజర్వేషన్లను తీసుకువచ్చిన పార్టీ మరొకటి లేదు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ ఓ రోల్ మోడల్. వైఎస్సార్‌సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరు అని కామెంట్స్ చేశారు. ఇక, పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్, మేరుగ నాగార్జున.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, పోతుల సునీత, ఇతర నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment