foundation day
-
నేడు సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా బలగాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ పాత్ర అత్యంత కీలకమని అభివర్ణించారు. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌లో.. దేశం పట్ల సీఆర్పీఎఫ్ జవాన్ల అంకితభావం, అవిశ్రాంత సేవ నిజంగా అభినందనీయమన్నారు. వారు ఎల్లప్పుడూ ధైర్యం, నిబద్ధతలతో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి పాటుపడుతున్నారన్నారు.ఇదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఆర్పీఎఫ్ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఆర్పీఎఫ్ ప్రారంభమైనప్పటి నుంచి జాతీయ భద్రతను తన మిషన్‌గా తీసుకుంది. దళంలోని వీర సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయక దేశరక్షణకు తమ శక్తిమేరకు కృషి చేసి, విజేతలుగా నిలుస్తున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన సీఆర్పీఎఫ్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.1939లో బ్రిటిష్ వారు సీఆర్పీఎఫ్ను స్థాపించారు. నాడు ఈ దళం పేరు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈ దళం పేరును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మార్చారు. జునాగఢ్, హైదరాబాద్, కతియావార్, కశ్మీర్ రాచరిక రాష్ట్రాలను భారతదేశంలోకి చేర్చడంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించింది. అలాగే రాజస్థాన్, కచ్, సింధ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడంలోనూ సీఆర్పీఎఫ్ ముఖ్యపాత్ర పోషించింది. Greetings to CRPF personnel and their family members on their Raising Day.Since its inception, the @crpfindia has taken national security as its mission. The brave soldiers of the force have exerted all their might to accomplish this goal without ever caring for their lives and… pic.twitter.com/NhbmeRZvi3— Amit Shah (@AmitShah) July 27, 2024 -
కళామందిర్ ఫౌండేషన్ డే వేడుకలో ప్రముఖుల సందడి.. (ఫోటోలు)
-
SBI: కస్టమర్లకు మరిన్ని సేవలే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురష్కరించుకుని తన కస్టమర్లకు సేవలను మరింత విస్తృతం చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పదకొండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు వివరించింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లను మెరుగుపరచడం, తన వ్యవసాయ రుణ పోర్ట్‌ఫోలియోలో నష్టాలను తగ్గిండానికి 35 కొత్త వ్యవసాయ కేంద్రీకృత ప్రాసెసింగ్ సెల్‌లను ప్రారంభించడం ఇందులో ఉన్నాయి. కస్టమర్ల బ్యాంకింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడానికి, సేవల విస్తృతికి ఈ 11 చొరవలు దోహదపడతాయని బ్యాంక్ ప్రకటన ఒకటి పేర్కొంది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. → తన డిజిటల్ చెల్లింపుల సౌలభ్యతను గణనీయంగా మెరుగుపరచుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. బీహెచ్ఐఎం ఎస్బీఐ పే యాప్‌లో ట్యాప్–అండ్–పే, అలాగే యోనో యాప్‌లో మ్యూచువల్ ఫండ్స్‌పై ఎండ్–టు–ఎండ్ (పూర్తిస్థాయి) డిజిటల్ లోన్లు వంటి రెండు అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొంది. → ఎస్బీఐ సూర్య ఘర్ లోన్ విషయంలో పూర్తి డిజిటలైజేషన్ మరో కీలకమైన చొరవగా బ్యాంక్ వివరించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్‌లను ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారులు రుణాలను పొందవచ్చని పేర్కొంది. 10 కేవీ సామర్థ్యం వరకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి. ఎంఎన్ఆర్ఈ/ఆర్ఈసీ పోర్టల్‌లో దరఖాస్తుదారుల నమోదు నుండి లోన్ పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ ఎస్బీఐ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపింది. → దేశం వృద్ధి చక్రాన్ని రూపొందించడంలో భారతీయ ప్రవాసుల గణనీయమైన సహకారాన్ని గుర్తించిన బ్యాంక్... పంజాబ్‌లోని పాటియాలాలో రెండవ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంటర్ (జీఎన్సీ) ప్రారంభించింది. ఎన్ఆర్ఐ ఖాతాదారుల కు సేవలను మెరుగుపరచడానికి బ్యాంక్ డే రోజున పాటియాలాలో ఈ రెండవ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంటర్‌ను చైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. ఈ సెంటర్లు గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీతో బ్యాంక్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయి. ఎక్సలెన్స్ హబ్‌లుగా పనిచేస్తాయి. ఎన్ఆర్ఐ కస్టమర్లకు ప్రత్యేక సేవలను అందిస్తాయి. భారతదేశంలో 434 ప్రత్యేక ఎన్ఆర్ఐ శాఖల నెట్వర్క్, 29 దేశాలలో విదేశీ కార్యాలయాలు, జీసీసీ ఆరు దేశాలలో (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్– బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 45 ఎక్సే్ఛంజ్ హౌస్‌లు, 5 బ్యాంకులతో భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎన్ఆర్ఐ ఖాతాదారులకు సమగ్ర సేవలను అందించడానికి బ్యాంక్ సన్నద్దమైంది. → న్యాయవాదుల కోసం సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో పూర్తి సదుపాయాలతో కూడిన హైకోర్టు శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. న్యాయవాదులు, న్యాయ నిపుణుల అవసరాలను ప్రత్యేకంగా తీర్చడానికి ఈ శాఖలు దోహదపడతాయి. → గృహ రుణాలకు సంబంధించిన ప్రాసెస్ మరింత పారదర్శకం కానుంది. గృహ రుణ గ్రహీతలు ఇప్పుడు వివిధ ప్రాసెసింగ్ దశల్లో వారి రుణ దరఖాస్తు స్థితికి సంబంధించి ఆటోమేటెడ్ ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు అందుకుంటారు. → వినియోగదారు పూర్తి సంతృప్తి, సౌలభ్యత లక్ష్యంగా ఆధునికీకరించిన ఈ నూతన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు బ్యాంక్ వివరించింది. -
పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీయే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇన్నాళ్ళూ తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్ తెలిపారు. నేడు మన @YSRCParty 14వ వ్యవస్థాపక దినోత్సవం. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. అప్పుడు నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీ మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇన్నాళ్ళూ నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృద… pic.twitter.com/rdk4qXVilV — YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2024 -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఖాయం
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల తర్వాత ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కాలం చెల్లిన మందులాంటి (ఎక్స్పైర్డ్ మెడిసిన్)వారని, ఆయన వచ్చే ఎన్నికల తర్వాత షెడ్డుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ 150 రోజులు, దాదాపు 4 వేలకు పైగా కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేశారని, ఆ స్ఫూర్తితోనే కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో రాహుల్ ప్రవేశించారని, వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పార్టీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ బీజేపీ డబుల్ ఇంజిన్ అని పదేపదే చెబుతోందని, డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని రేవంత్ విమర్శించారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్లో అదానీ గురించి నోరు విప్పగానే ఆ ఇంజిన్ ఆగిపోయిందని ఎద్దేవా చేశారు. మోదీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారని, కానీ ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోక్‌సభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ‘మోదీ జీ..మీరు ఒక సామాన్య వ్యక్తిని పార్లమెంట్‌లోకి రాకుండా ఆపలేకపోయారు. రేపు ఎర్రకోట మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరకుండా ఆపడం కూడా మీతరం కాదు..’ అని అన్నారు. జనవరి 14 నుంచి రాహుల్‌గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కొనసాగుతుందని, దీనితో మోదీ ఇంజిన్ షెడ్డుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందామని, పార్టీ శ్రేణులు వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. -
‘దళితబంధు’లో ఎమ్మెల్యేల అవినీతి.. కేసీఆర్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలన్నారు. లేకుంటే నష్టపోతారని, సరిగా పని చేయని ఎమ్మెల్యేల తోక కత్తిరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో గురువారం పార్టీ ఆవిర్భావ వేడుకలతోపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు ఏడుగంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. నేతలకు క్లాస్‌పీకిన కేసీఆర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే.. నేతలకు క్లాస్ పీకారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని పేర్కొన్నారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. నియోజవర్గంలో టికెట్ల పంచాయతీ ఎందుకు వస్తుందని.. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని అన్నారు. పార్టీలో గ్రూప్ తగాదాలను పరిష్కరింగే బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. చదవండి: వారికే టికెట్లు.. ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ! అవినీతిపై సీరియస్ కాగా పని తీరు సరిగా లేని ఎమ్మెల్యే జాబితా తన వద్ద ఉందన్నారు సీఎం కేసీఆర్. కానీ ఇప్పుడు వారి పేర్లను బహిర్గతం చేయదలచలేదన్నారు.. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని, అంతా బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయమన్న సీఎం కేసీఆర్.. మీరు పనులతో సంతృప్తి పరచకపోతే చేసేదేమి లేదన్నారు. అదే విధంగా డబుల్‌బెడ్ రూం, దళితబంధులో అవినీతి జరుగుతుందంటూ కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు వార్నింగ్ కొందరు ఎమ్మెల్యేలు దళిత బంధు పథకం కింద మూడు లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వారి చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఇదే చివరి వార్నింగ్ అంటూ ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించారు. మళ్లీ వసూలు చేస్తే గనుక టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా పార్టీ నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. వారి అనుచరులు డబ్బులు తీసుకున్నా సరే ఎమ్మెల్యేలదే బాధ్యత అని స్పష్టం చేశారు. తలెవరూ అవినీతికి పాల్పడకుండా.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. చదవండి: Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్ -
సెబీ కొత్త లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించింది. సెబీ మాజీ చైర్మన్సహా ప్రస్తుత, మాజీ పూర్తికాల సభ్యుల సమక్షంలో సరికొత్త లోగోను విడుదల చేసింది. గణాంకాలు, టెక్నాలజీ, కన్సల్టేషన్, పార్టనర్షిప్ తదితరాల వినియోగం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో అత్యుత్తమ నిర్వహణను కొనసాగిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్థకుగల అత్యుత్తమ సంప్రదాయాలు, డేటా, టెక్నాలజీ ఆధారిత కార్యాచరణ, సెక్యూరిటీ మార్కెట్ల అభివృద్ధి, నియంత్రణ, ఇన్వెస్టర్ల పరిరక్షణ కొత్త లోగోలో ప్రతిఫలిస్తున్నట్లు చైర్‌పర్శన్ మాధవి పురీ బచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెబీ 1988 ఏప్రిల్‌లో ఏర్పాటైంది. పరిశ్రమతో చర్చలు, భాగస్వామ్యం తదితరాలను చేపడుతూ సత్సంప్రదాయాలను పాటిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం: పార్టీ పురోగతిలో ఎన్నో త్యాగాలు: ప్రధాని
ఢిల్లీ: నేడు బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈరోజు ఉదయం 9.00 గం.లకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత.. బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘బీజేసీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి. హనుమాన్ మాదిరిగా కార్యకర్తలు పని చేయాలి. ప్రజాస్వామ్యానికి బారత్ ఓ మాతృక’ అని మోదీ పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు బెంగాలీ మార్కెట్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్‌ను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. కాగా, లోక్‌సభలో రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించి అత్యధికంగా 303 సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించింది బీజేపీ. ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయ వాదం ఎజెండాతో తొలుత జన్‌సంఘ్‌గా ప్రస్థానం ప్రారంభించింది. దేశంలో ఎమెర్జెన్నీ అనంతరం 1980, ఏప్రిల్ 6వ తేదీన బీజేపీగా రూపాంతరం చెందింది. -
ఊరూరా సందడే సందడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నేతలు పండగలా నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించి.. వైఎస్సార్సీపీ జెండాలనూ ఊరూరా ఆవిష్కరించారు. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి.. పార్టీ కార్యాలయాల్లో భారీ కేక్‌లు కట్ చేశారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసి.. అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా.. ప్రజాభ్యుదయమే ధ్యేయంగా 2011 మార్చి 12న వైఎస్సార్సీపీని సీఎం వైఎస్ జగన్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రస్థానంలో 12 ఏళ్లు పూర్తి చేసుకుని ఆదివారం 13వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సాగిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనను గుర్తుచేస్తూ యువకులు జై జగన్ నినాదాలు చేశారు. ♦విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ♦ అనంతపురం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. తిరుపతిలోని తన నివాసంలో మంత్రి పెద్దిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. నగరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి ఆర్కే రోజా కేక్ కట్ చేశారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి జెండా ఎగురవేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కేక్ కట్ చేశారు. ♦గుంటూరులో పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి, కేక్‌ను కట్‌చేశారు. 500 మీటర్ల వైఎస్సార్సీపీ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ పతాకం రెపరెపలాడింది. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి, ఏలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని వేడుకల్లో పాల్గొన్నారు. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి వేణు, హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్ పాల్గొన్నారు. ♦ విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరులో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పార్టీ జెండాను ఎగురవేశారు. -
ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్బావ దినోత్వవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ పార్టీ జెండాను ఎగురవేసి నేతలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక, తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్ జగన్. అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణ తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు. మహిళలకు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు రిజర్వేషన్లను తీసుకువచ్చిన పార్టీ మరొకటి లేదు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్. వైఎస్సార్సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరు అని కామెంట్స్ చేశారు. ఇక, పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్, మేరుగ నాగార్జున.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, పోతుల సునీత, ఇతర నేతలు పాల్గొన్నారు. -
‘నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు సీఎం జగన్’
Updates.. ►విజయవాడ భవానిపురం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జండా ఎగరవేసి కేక్ కటింగ్ నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి పాలకొండ మండల చైర్మన్ కరటం రాంబాబు పార్టీ నాయకులు డివిజన్ కార్పొరేటర్లు తదితరులు ► నెల్లూరు పార్టీ ఆఫీసులో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. ► వైవీ సుబ్బారెడ్డి.. 12 ఏళ్ల ప్రస్థానంలో వైఎస్సార్సీపీ ప్రయాణం ఓ చరిత్ర. వైఎస్సార్ మరణంతో కుంగిపోయిన 570 కుటుంబాలను ఆదుకోవాలని తపనపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం పాటుపడ్డారు. రెండేళ్లలో 67 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలను గెలుపించుకున్న నాయకుడు సీఎం జగన్. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినప్పడు మళ్లీ మెజార్టీతో వస్తానని చెప్పి గెలిచిన నాయకుడు సీఎం జగన్. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, అంబేడ్కర్ సామాజిక న్యాయం ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేసి చూపించారు. ► ఎంపీ విజయ సాయిరెడ్డి.. మహానేత అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు. లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా, అంతకు మించి ఆయన మరో నాలుగు అడుగులు ముందుకు వేయటమే కనిపిస్తోంది. మహానేత అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో జగన్‌గారు వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు! లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా, అంతకు మించి ఆయన మరో నాలుగు అడుగులు ముందుకు వేయటమే కనిపిస్తోంది! 1/5 — Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2023 ఇది గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేసిన నాయకుడి పార్టీ. ఇది ప్రాంతాలకు న్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ. ఇది తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నాందీపలుకుతున్న దార్శనికుడి పార్టీ. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 98.5 శాతం వాగ్దానాన్ని అమలు చేసిన నాయకుడి పార్టీ. నేడు ఈ పార్టీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీ నిరుపేదల పార్టీ! ఈ పార్టీ సామాజిక న్యాయానికి, మహిళా–విద్యా–రాజకీయ–ఆర్థిక సాధికారతలకు దేశంలోనే చుక్కాని! 2/5 — Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2023 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వానికి అర్థం.. మారిన గ్రామం, మారుతున్న సామాజిక చిత్రం, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికీ అండ. ఆయన నేటి తరానికి ఆలంబన, భావితరానికి భరోసా. ఇది గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేసిన నాయకుడి పార్టీ! ఇది ప్రాంతాలకు న్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ. ఇది తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నాందీపలుకుతున్న దార్శనికుడి పార్టీ! 4/5 — Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2023 ► వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసిన సజ్జల. ► సజ్జల మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్ జగన్. విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణ తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్. వైఎస్సార్సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరు. ►వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్, మేరుగ నాగార్జున.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, పోతుల సునీత, ఇతర నేతలు. సాక్షి, తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించి, పలు సేవా కార్యక్రమాలతో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపునిచ్చింది. పలు సేవా కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించింది. ► అలాగే, వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇక, తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు అమలు చేయడమే కాక, చెప్పని వాటితో పాటు, అనేక సంక్షేమ – అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారంజక పరిపాలన సాగిస్తోంది. -
శాంతిభద్రతల కోసం బీజేపీని తిరస్కరించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మతవిద్వేషాల వ్యాప్తికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, శాంతిభద్రతలు వెల్లివిరియాలంటే కమలనాథులను తిరస్కరించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో రావాలని పగటికలలు కంటోందని దుయ్యబట్టారు. గురువారం హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో జరిగిన ఏఐఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇక్కడే జీడీపీ ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు లేవని, శాంతి, అభివృద్ధి రెండూ ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి, రాజ్యాంగం కావాలో లేక బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగినట్లేనని, పార్టీ బాధ్యులు ఎన్నికలకు సంసిద్ధం కావాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, కర్ణాటకలో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్‌కు నమస్కారం పెట్టండి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మహిళలు తమ ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లకు నమస్కారం పెట్టి వెళ్లాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. వంటగ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఖదీర్‌ఖాన్ కుటుంబాన్ని తమ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒవైసీ ప్రకటించారు. భారతదేశానికి చాయ్‌వాలా, చౌకీదార్ అవసరం లేదని, దేశ సరిహద్దులను రక్షించగల బలమైన ప్రధాని అవసరమని ఏఐఎంఐఎం శాసన పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ పాషా ఖాద్రీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, కౌసర్ మోహియుద్దీన్, అహ్మద్ బలాలా, మోజంఖాన్, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎన్ఐఆర్డీపీఆర్ 64వ వ్యవస్థాపక దినోత్సవం
ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థ 64వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడం సమగ్రాభివృద్ధికి చాలా అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో పోటీపడుతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో భారతదేశం బెంచ్‌మార్క్‌లను సాధించిందన్నారు. ఉపాంత రంగాలకు చెందిన ప్రజలకోసం ఎన్ఐఆర్డీపీఆర్ జాతీయ స్థా యి మేళాలను నిర్వహించడం ద్వారా దేశవ్యా ప్తంగా కళాకారులను ప్రొత్సహిస్తుందన్నారు. -
Singareni: బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం..
సింగరేణి(కొత్తగూడెం): దక్షిణ భారతదేశానికి తలమానికంగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఆవిర్భవించి నేటికి 134 సంవత్సరాలు కావస్తోంది. ప్రారంభంలో బొగ్గు తవ్వకానికే పరిమితమైన సింగరేణి.. క్రమంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో విద్యుత్, సిమెంట్, పేపర్‌తో పాటు మరెన్నో పరిశ్రమలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటు తోడ్పాటునందిస్తోంది. లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సింగరేణి ఖాళీ స్థలాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజుకు 10 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసి ప్రభుత్వ గ్రిడ్‌కు అందిస్తూ ఏడాదికి రూ.120 కోట్లు ఆర్జిస్తోంది. అంతేకాక అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. నూతన టెక్నాలజీతో ఉత్పత్తి.. 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సుమారు 59 సంవత్సరాల పాటు మ్యాన్ పవర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 1948లో జాయ్ లోడర్ షటిల్ కార్‌ను, 1950లో క్యాప్ ల్యాంప్‌లు, 1951లో ఎలక్ట్రికల్ కోల్ డ్రిల్స్, 1953లో ఎలక్ట్రిక్ క్యాప్ ల్యాంప్స్, 1954లో ప్లేమ్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లను వినియోగిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. 1975లో ఓపెన్‌కాస్ట్ గనులు, 1961లో రెస్క్యూ టీమ్‌ల ఏర్పాటు, 1979లో సైడ్ డిశ్చార్జ్ లోడర్, 1981లో లోడ్ హ్యాండ్ డంపర్స్ 1983లో లాంగ్ వాల్మైనింగ్, 1986లో వాకింగ్ డ్రాగ్‌లైన్, 1989లో ఫ్రెంచ్ బ్లాస్టింగ్ గ్యాలరీ మెథడ్ ఏర్పాటు చేసుకుంది. గనుల్లో కార్మికుల నడకను తగ్గించేందుకు 1990లో మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ పద్ధతిని కొత్తగూడెం ఏరియాలోని వీకె–7షాఫ్ట్‌లో ఏర్పాటు చేసింది. 1994లో ఇన్పుట్ క్రషింగ్ కన్వేయర్ యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఇలా అనేక రకాల నూతన టెక్నాలజీని వినియోగించి కార్మికులకు రక్షణతో పాటు అధిక బొగ్గు ఉత్పత్తికి అడుగులు వేసింది. బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం.. ►ఫేస్ వర్కర్లు: బొగ్గు తీసే ప్రదేశంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో ఆపరేటర్లు, కోల్ కట్టర్లు, సపోర్ట్మెన్లు ఉంటారు. ► లైన్మెన్లు: ఉత్పత్తిలో ప్రధానమైన ఎస్డీఎల్, సీఎమ్మార్ యంత్రాలు నడిచేందుకు వీలుగా ట్రాక్‌లు వేయడం వీరి ప్రధాన విధి. ► కన్వేయర్ ఆపరేటర్లు: బొగ్గును బయటికి తీసేందుకు అవసరమైన బెల్ట్‌ను నడుపుతారు. ► పంప్ ఆపరేటర్లు: బొగ్గుతీసే క్రమంలో భూమి పొరల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తారు. ► ఫిట్టర్లు: పని చేస్తున్న క్రమంలో మోటార్లు, యంత్రాలు మరమ్మతులకు గురైతే తక్షణమే రిపేర్ చేసి, పని ఆగకుండా చూస్తారు. ► ఎలక్ట్రీషియన్లు: గనుల్లో 24 గంటలూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడడం వీరి ప్రధాన విధి. పంపులకు, మోటార్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండాలి. ► టెండాల్స్: బరువైన యంత్రాల విడి భాగాలను గనిలోకి చేర్చి, వాటిని బిగించే సమయంలో ఫిట్టర్లకు సహాయపడుతుంటారు. ► హాలర్ డ్రైవర్లు: బొగ్గు ఉత్పత్తికి, గనిలోని యంత్ర విభాగాలకు అంతరాయం కలగకుండా చూస్తుంటారు. ► జనరల్ మజ్దూర్లు: టెక్నికల్ సిబ్బంది ఎవరైనా విధులకు హాజరు కాకుంటే వారి స్థానంలో పనిచేసే వారికి వీరు తోడుగా ఉంటూ సహకరిస్తుంటారు. ► ఎలక్ట్రికల్, మైనింగ్ సూపర్వైజర్లు: గనిలో ఉత్పత్తికి సంబంధించిన పనులకు కార్మికులను పురమాయించడం, రక్షణ నిబంధనలను కార్మికులకు వివరిస్తూ, ఉత్పత్తికి అవసరమైన మెటీరియల అందిస్తుంటారు. వీరిని జూనియర్ అధికారులు అంటారు. ► సూపర్వైజర్లు, ఎలక్ట్రిక్ మెకానిక్‌లు: గనిలో ఎలక్ట్రికల్, యంత్రాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పని సమయంలో అవి ఆగకుండా చూడాల్సిన బాధ్యత వీరిదే. ► మైనింగ్ సర్దార్, ఓవర్మెన్లు: బొగ్గు పొరల్లో డ్రిల్లింగ్ వేసి, వాటిలో పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేస్తేనే బొగ్గు వస్తుంది. ఆ తరువాత రూఫ్ సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత వీరిదే. అక్కడ పనిచేసే కార్మికులకు సైతం వీరే విధులు కేటాయిస్తుంటారు. ► అసిస్టెంట్ మేనేజర్లు: గనిలో అవసరమైన పనులను పర్యవేక్షించేవారు. ► ఇంజనీర్లు: యంత్రాల పర్యవేక్షణ, పనితీరు, రక్షణ చర్యలు, పనుల పర్యవేక్షణ, పనులకు సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించేవారు. ► రక్షణాధికారి : గనుల్లో కార్మికులు, ఉద్యోగుల రక్షణ వీరి విధి. ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపడతారు. ► వెంటిలేషన్ ఆఫీసర్: గనుల్లో గాలి, వెలుతురు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం, ప్రమాదాలు జరుగకుండా చూడడం వీరి బాధ్యత. ► సర్వేయర్: గనిని ప్రణాళిక ప్రకారం నడిపించి, బొగ్గు నిక్షేపాల గుర్తింపు, వాటిని ఏవిధంగా తీస్తే కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుందో గమనించి అధికారులకు వివరించడం, కార్మికులకు పనులు పురమాయించడం వీరి విధి. ► ఆన్ షెట్టర్: గనిలోకి కార్మికులు, అధికారులను సిస్టమ్ ప్రకారం లోనికి పంపే యంత్రాన్ని(కేజీ) ఆపరేట్ చేస్తుంటారు. ► వైండింగ్ ఇంజన్ ఆపరేటర్: గనిలో అత్యంత ముఖ్యమైన వారు వైండింగ్ ఇంజన్ ఆపరేటర్లు. కేజీ గనిలోకి వెళ్లాలన్నా.. లోనికి వెళ్లిన కేజీ బయటకు రావాలన్నా వీరే కీలకం. ► గని మేనేజర్: గని మొత్తం ఈ అధికారి ఆధీనంలో ఉంటుంది. గనికి కావాల్సిన ప్రతి మెటీరియల్‌ను ఏరియా స్టోర్స్ నుంచి తెప్పించడం, వాటి కేటాయింపు బాధ్యతలను పర్యవేక్షించడం, కార్మికులకు విధులు కేటాయించడంతో పాటు గని పర్యవేక్షణంతా ఈ అధికారిదే. గుండెకాయలా కార్పొరేట్ సింగరేణి సంస్థకు కార్పొరేట్ కార్యాలయం గుండెకాయలా పనిచేస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదుగురు డైరెక్టర్లు, 53 మంది జీఎంలు విధులు నిర్వహిస్తుంటారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, డిపార్ట్మెంట్లను మానిటరింగ్ చేస్తుంటారు. మొత్తంగా చూస్తే సంస్థలో 43 వేల మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. మరో 10 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. (క్లిక్ చేయండి: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు) -
హకీంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30వ వార్షికోత్సవం (ఫోటోలు)
-
వ్యాపార వైవిధ్యంపై ఎల్ఐసీ దృష్టి
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ సెప్టెంబర్ 1వ తేదీకి 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తన వ్యాపార వైవిధ్యంపై దృష్టి సారించింది. నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. జీవిత బీమా రంగంలో ఎల్ఐసీకి సుమారు 65 శాతం మార్కెట్ వాటా ఉన్న విషయం తెలిసిందే. 17 ఇండివిడ్యువల్ పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్లు 17 ఇండివిడ్యువల్ (వ్యక్తుల విభాగంలో) నాన్‌పార్టిసిపేటింగ్ ఉత్పత్తులు, 11 గ్రూపు ప్లాన్లను ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లలో బోనస్‌లు రావు. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారాన్నిచ్చే అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లుగా చెబుతారు. తమ ఏజెంట్లు ఇక ముందూ ఉత్పత్తుల పంపిణీకి మూలస్తంభాలుగా కొనసాగుతారని కుమార్ తెలిపారు. ఇండివిడ్యువల్ బీమా ఉత్పత్తుల వ్యాపారంలో 95 శాతం ప్రీమియం తమకు ఏజెన్సీల ద్వారానే వస్తున్నట్టు చెప్పారు. ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా 13.3 లక్షల ఏజెన్సీలు ఉండడం గమనార్హం. బ్యాంకు అష్యూరెన్స్ (బ్యాంకుల ద్వారా) రూపంలో తమకు వస్తున్న వ్యాపారం కేవలం 3 శాతంగానే ఉంటుందని కుమార్ తెలిపారు. ‘‘జీవితావసరాలకు బీమా కావాలన్న అవగాహన గరిష్ట స్థాయికి చేరింది. కస్టమర్ల మారుతున్న అవసరాలకు తగ్గట్టు కొత్త విభాగాల్లోకి ప్రవేవిస్తాం’’అని వెల్లడించారు. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లను మరిన్ని తీసుకురావడం ద్వారా తాము అనుసరించే దూకుడైన వైవిధ్య విధానం తగిన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్ అష్యూరెన్స్‌ను మరింత చురుగ్గా మారుస్తామన్నారు. -
Vishva Hindu Parishad: ధార్మిక సేవా అక్షౌహిణి!
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) .... ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం! అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీం కోర్టులో విజయం సాధించిన 2019 నవంబర్ 9 నుంచి మొన్నటి రామమందిర నిర్మాణ భూమిపూజ (ఆగస్టు 5, 2020) నాటికి అన్ని వర్గాల్లో చర్చకు మూలమైంది విశ్వహిందూ పరిషత్. 1964లో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రెండవ చీఫ్ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ పురుడు పోసుకుంది. ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమం వేదికగా సంస్థకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదట స్వామి చిన్మయానంద సరస్వతి అధ్యక్షులుగా వీహెచ్‌పీ కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది. అనేకమైన సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో వీహెచ్‌పీ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉంటూ ధార్మిక, సామాజిక, సేవా రంగాల్లో కార్యకలాపాలు విస్తరించింది. దాదాపు 17 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ నిస్వార్థ కృషి సల్పు తున్నది. 1983లో వీహెచ్‌పీ ప్రతిష్ఠాత్మకంగా ‘ఏకాత్మకం యజ్ఞం’ నిర్వ హించింది. 1983 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకూ సామాజిక సమరసతా భావం నింపేందుకు... అంటరానివారు, దళితులు అనే భావన విడనాడి ‘సకల హైందవ జాతి ఒక్కటే’ అని చాటి చెప్పింది. సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తోంది. ఏకాత్మక యజ్ఞం, అయోధ్య రామమందిర ఉద్యమ నిర్వహణలో విజయం సాధించి హిందువులకు ఆత్మవిశ్వాసం భరోసాను కల్పించింది. మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించే ‘ఘర్ వాపసీ’ ఉద్యమాన్నీ నిర్వహిస్తోంది. (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) – పగుడాకుల బాలస్వామి, వీహెచ్‌పీ తెలంగాణ ప్రచార సహ ప్రముఖ్ (వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) -
ఆత్మనిర్భర్ భారత్‌కు ఐఐసీటీ సాయం
సాక్షి, హైదరాబాద్: దేశం ఆత్మనిర్భరత సాధించే విషయంలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) గణనీయమైన సాయం చేస్తోందని డీఆర్డీవో చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ టీకాలకు అవసరమైన కీలక రసాయనాలు మొదలుకొని అనేక ఇతర అంశాల్లోనూ విదేశాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని ఐఐసీటీ తప్పించిందని ఆయన అన్నారు. ఐఐసీటీ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సతీశ్‌రెడ్డి దేశం ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరాన్ని... అందుకు చేస్తున్న ప్రయత్నాలను సోదాహరణంగా వివరించారు. ప్రభుత్వం ప్రకటించక ముందు కూడా ఐఐసీటీ పలు అంశాల్లో రక్షణ శాఖ అవసరాలను తీర్చిందని ఆయన గుర్తుచేశారు. నావిగేషనల్ వ్యవస్థల్లో కీలకమైన సెన్సర్ల విషయంలో దేశం స్వావలంబన సాధించడం ఐఐసీటీ ఘనతేనని కొనియాడారు. ప్రస్తుతం అత్యాధునిక బ్యాటరీలు, ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రోలైట్ల విషయంలోనూ ఇరు సంస్థలు కలసికట్టుగా పనిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌కు ముందు దేశంలో ఏడాదికి 47 వేల పీపీఈ కిట్లు మాత్రమే తయారయ్యేవని.. ఆ తరువాత కేవలం నెల వ్యవధిలోనే ఇది రోజుకు 6 లక్షలకు పెరిగిందని చెప్పారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ తయారీ విషయాల్లోనూ ఇదే జరిగిందని, అనేక సృజనాత్మక ఆవిష్కరణల కారణంగా దేశం వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతోపాటు ఉత్పత్తి చౌకగా జరిగేలా కూడా చేశామని వివరించారు. డిజైన్‌తో మొదలుపెట్టి... ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారం కావాలంటే దేశానికి అవసరమైనవన్నీ ఇక్కడే తయారు కావాలని డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ ఉత్పత్తుల డిజైనింగ్ మొదలుకొని అభివృద్ధి వరకు అవసరాలకు తగ్గట్టుగా భారీ మోతాదుల్లో వాటిని తయారు చేయగలగడం, ఆధునీకరణకు కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం కూడా ఆత్మనిర్భర భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. అతితక్కువ ఖర్చు, మెరుగైన నాణ్యత కూడా అవసరమన్నారు. అదే సమయంలో దేశం కోసం తయారయ్యేవి ప్రపంచం మొత్తమ్మీద అమ్ముడుపోయేలా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం కారణంగా ఇప్పుడు దేశంలోని యువత రాకెట్లకు అవసరమైన ప్రొపల్షన్ టెక్నాలజీలు, గ్రహగతులపై పరిశోధనలు చేస్తున్నాయని... స్టార్టప్ కంపెనీలిప్పుడు దేశంలో ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయని ప్రశంసించారు. సృజనాత్మక ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద అన్ని రకాల మద్దతు లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, మాజీ డైరెక్టర్లకు ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఐఐసీటీలో ప్రతిభ కనపరిచిన సిబ్బంది, శాస్త్రవేత్తలకు మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అవార్డులు అందజేశారు. -
Kakani Govardhan Reddy: ఏపీ వైపు దేశం చూపు..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఏపీని మోడల్‌గా తీసుకుని విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకునేందుకు ముందుకొస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు నాబార్డు అందిస్తోన్న చేయూత ప్రశంసనీయమన్నారు. ఇదేబాటలో మిగిలిన బ్యాంకులన్నీ సహకరించాలని కోరారు. విజయవాడలో సోమవారం జరిగిన నాబార్డు 41వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి కాకాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2021–22 సీజన్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల కోసం రూ.39,708 కోట్ల రుణాలు నాబార్డు అందించడం నిజంగా అభినందనీయమన్నారు. నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి రైతుకు పీఎంఎఫ్‌బీవై వర్తింపజేయాలని సూచిస్తే పట్టించుకోకుండా.. వెబ్‌ల్యాండ్ ఆధారంగా అమలు చేస్తామని కేంద్రం చెప్పడంతోనే ఆ పథకం నుంచి వైదొలిగామన్నారు. నాబార్డు సహకారం వలనే 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేయగలిగామని, మిగిలిన చెల్లింపుల కోసం సోమవారం మరో రూ.1,600 కోట్లు విడుదల చేయడం అభినందనీయమన్నారు. సహకార శాఖ రిజిస్ట్రార్ (ఆర్సీఎస్) అహ్మద్‌బాబు, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, ఎస్బీఐ జీఏం ఓం.నారాయణ్ శర్మ తదితరులు మాట్లాడుతూ సంస్థాగత అభివృద్ధి, విధాన రూపకల్పనలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నాబార్డు సీజీఎం ఎం.ఆర్ గోపాల్ మాట్లాడుతూ రూ.4,500 కోట్లతో ప్రారంభమైన నాబార్డు నేడు రూ.7.6లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరిందన్నారు. నాబార్డు జీఎంలు బి.ఉదయభాస్కర్, ఎన్ఎస్ మూర్తి, ఆప్కాబ్ ఎండీ ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి -
ABVP Foundation Day: దేశ పునర్నిర్మాణం కోసం...
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో... దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం, సమాజ సేవ వంటి భావాలతో విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కేంద్రాలుగా చేసుకుని కొందరు యువకులు తాము చదువుతున్న ప్రాంతం నుంచే పని మొదలుపెట్టారు. వీరి లక్ష్యాలలో దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం, జాతీయ భావన కల్పనకై కృషిచేయడం అత్యున్నతమైనవి. ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు అధికారికంగా 1949 జూలై 9న ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్’ (ఏబీవీపీ) స్థాపితమైంది. అప్పటి నుండి నేటి వరకూ ‘విద్యా రంగం’ అంటే ఒకే కుటుంబం అనే భావనతో పనిచేసింది. కళాశాలల్లో మౌలిక వసతుల లేమి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సహా అనేక ఫీజులకు సంబంధించిన సమస్యలపై పోరాడింది. ఉపకార వేతనాల పెంపుదల, మెరుగైన హాస్టల్ వసతులు, గ్రామీణ ప్రాంతాలకు బస్ సౌకర్యం వంటి వాటి కోసం ఉద్యమాలు నిర్వహించింది. అంతేకాదు, ‘జాతీయత మా ఊపిరి – దేశభక్తి మా ప్రాణం’ అంటూ దేశంలో ఎక్కడ విచ్ఛిన్నకర సంఘటన జరిగినా అనుక్షణం స్పందిస్తూ దేశ రక్షణలో ఒక వాచ్ డాగ్ లాగా నిమగ్నమై ఉంది. కశ్మీర్లో వేర్పాటువాదుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ దేశభక్తిని రగిలించడంలో ఈ సంస్థది మరపురాని పాత్ర. మొదట్లో కొద్దిమందితో ప్రారంభమైన ఏబీవీపీ యాత్ర ఎక్కడా ఆగలేదు. విద్యారంగ సమస్యలతో పాటు జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తూ ఉంది. జాతీయ పునర్నిర్మాణం వ్యక్తి నిర్మాణం ద్వారానే సాధ్యమనేది ఏబీవీపీ నమ్మకం. జాతీయ పునర్నిర్మాణం అంటే చిట్టచివరి వ్యక్తికి కూడా గూడు, గుడ్డ, విద్య, వైద్యం వంటి ప్రాథమిక వసతులు అందించాలి. వ్యక్తిగత జీవన ప్రమాణాలు, సంస్కృతిని కాపాడుకుంటూనే ‘వసుధైక కుటుంబం’ అనే భావనతో పనిచేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ఈ ఏడు దశాబ్దాల ప్రయాణంలో విభిన్న వ్యవస్థలలో ఏబీవీపీ కార్యకర్తలు మంచి మార్పుల కోసం, సానుకూల దృక్పథంతో కృషిచేస్తూ వస్తున్నారు. – అంబాల కిరణ్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, వరంగల్ (జూలై 9న ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం) -
విద్యుత్ ఉత్పత్తిలో మేటిగా నిలిచి.. మహారత్న బిరుదు
పరవాడ(పెందుర్తి): అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో 1997లో ఏర్పాటు చేసిన సింహాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఈ నెల 8న 26వ ఏటలో అడుగుపెట్టబోతుంది. పరవాడ సమీపంలో 3,283 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,700 కోట్ల వ్యయంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2007 నుంచి రెండు విడతలుగా రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాయికి చేరుకుంది. బొగ్గు ఆధారంగా నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మేటిగా నిలిచి మహారత్న బిరుదును సార్థకం చేసుకున్న ఘనత సింహాద్రి ఎన్టీపీసీకే దక్కుతుంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు సద్వినియోగం చేసుకొంటున్నాయి. నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు 2020లో శ్రీకారం చుట్టింది. సింహాద్రి ఆధ్వర్యంలో స్థానిక రిజర్వాయర్‌పై రూ.110 కోట్ల వ్యయంతో 25 మెగావాట్ల తేలియాడే సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి.. 2021 ఆగస్టు 21 నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించింది. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను సింహాద్రి ఎన్టీపీసీ తన సొంత అవసరాలకు వినియోగించుకుంటోంది. దీపాంజిలినగర్ టౌన్షిప్లో సముద్రిక అతిథి గృహం ప్రాంగణంలో గతేడాది 30న రూ.9కోట్ల వ్యయంతో హరిత హైడ్రోజన్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే తొలి పైలట్ ప్రాజెక్ట్‌కు భూమి పూజ జరిగింది. 50 కిలోవాట్ల సామర్థ్యం గల స్టాండ్‌లోన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత హరిత హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన బ్లూమ్ ఎనర్జీ సంస్థకు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరఫరా కానున్న విద్యుత్‌ను సముద్రిక అతిథి గృహం అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. త్వరలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్లాంట్ ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన రెండు కూలింగ్ టవర్ల కాల పరిమితి తీరిన నేపథ్యంలో వాటిని తొలగించి.. నూతనంగా మరో రెండు కూలింగ్ టవర్ల నిర్మాణానికి రెండేళ్ల కిందట సంస్థ శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణానికి రూ.186 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం కూలింగ్ టవర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సింహాద్రిలో 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 30 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. ఈ బొగ్గు నిల్వల ను ఒడిశాలోని తాల్చేరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును మండించే క్రమంలో విడుదలవుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సంస్థలో 600 మంది శాశ్వత ఉద్యోగులు, రెండు వేలకు పైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ నాణ్యమైన విద్యుదుత్పాదనకు తమ వంతు కృషి చేస్తున్నారు. బాలికా సాధికారతకు కృషి సింహాద్రి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బాలిక సాధికారత కోసం ఈ ఏడాది రూ.45 లక్షలు ఖర్చు చేశాం. నిర్వాసిత గ్రామాల నుంచి 125 మంది బాలికలను ఎంపిక చేసి వారికి దీపాంజిలినగర్ టౌన్షిప్లో ప్రత్యేక వసతి కల్పించి.. ఆరు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వారిలో ఉత్సాహవంతులైన 10 మంది బాలికలను ఎంపిక చేసి టౌన్‌షిప్‌లోని బాలభారతి పబ్లిక్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు ఉచితంగా విద్యనందించేందుకు ఏర్పాట్లు చేశాం. నిర్వాసిత గ్రామాల్లో రహదారులు, తాగునీరు, వైద్యం, విద్య వంటి అభివృద్ధి పనులకు సీఎస్సార్ ద్వారా అత్యధిక నిధులను కేటాయిస్తున్నాం. భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. – జి.సి.చౌక్సే, సీజీఎం, సింహాద్రి ఎన్టీపీసీ -
14న చికాగోలో ఓయూ ఫౌండేషన్ డే
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని చికాగో నగరంలో ఈ నెల 14న ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఓయూ అలూమ్ని ఆఫ్ చికాగో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అమెరికా పర్యటనలో ఉన్న వీసీ ప్రొఫెసర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. శనివారం ఉత్తర అమెరికా ఉస్మానియా అలూమ్ని బోస్టన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ రవీందర్ పాల్గొని 21 అంశాలతో ఓయూలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించినట్లు అధికారులు విడుదల చేసి ప్రకటనలో పేర్కొన్నారు. (క్లిక్: పంచతత్వ పార్కు.. ఆకర్షణ, ఆరోగ్యం దీని ప్రత్యేకత) -
కరోనా ముప్పు తొలగలేదు
అహ్మదాబాద్: కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోయిందని అనుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రూపుమార్చుకుని మళ్లీ అది ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు. మహమ్మారిపై జరిగే పోరాటంలో ఏమరుపాటు తగదని ప్రజలను ఆయన హెచ్చరించా రు. గుజరాత్‌లోని వంతలిలో ఉన్న ‘మా ఉమియా ధామ్’ఆలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఆదివారం వర్చువల్‌గా ప్రసంగించారు. దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటి వరకు 185 కోట్ల టీకా డోసులు వేసినట్లు చెప్పారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమయిందన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సేద్యంతో భూమాతను కాపాడాలని ప్రధాని కోరారు. భూగర్భ నీటి మట్టాన్ని పెంచేందుకు, జల వనరులను కాపాడేందుకు జిల్లాకు 75 చొప్పున చెరు వులను తవ్వి, పరిరక్షించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం, అనీమియాతో బా ధపడే చిన్నారులు, మహిళల కోసం కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. చిన్నారుల ఆరోగ్యంగా ఉం టేనే, సమాజం, దేశం బాగుంటాయని చెప్పారు. బలమైన రైతులతో సుసంపన్న భారతం రైతులు బలంగా ఉంటేనే నవీన భారతం మరింత సంపన్నవంతమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశంలోని 11.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.1.82 లక్షల ఓట్లను నేరుగా బదిలీ చేసినట్లు ఆదివారం ఆయన ట్విట్టర్లో తెలిపారు. ప్రికాషన్ డోస్ షురూ న్యూఢిల్లీ: 18 ఏళ్లు పైబడ్డ వాళ్లకు కరోనా ప్రికాషన్ డోస్ టీకా పంపిణీ ఆదివారం దేశవ్యాప్తంగా మొదలైంది. రెండో డోస్ తీసుకుని 9 నెలలైన వారంతా ప్రైవేట్ సెంటర్లలో ప్రికాషన్ డోస్ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. టీకా డోస్ ఖరీదుకు అదనంగా రూ.150 సేవా రుసుము కింద కేంద్రాలు తీసుకుంటాయని తెలిపింది. మొదటి రెండు డోసుల్లో వేసిన టీకానే ప్రికాషన్ డోస్‌గా ఇస్తారని కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం తెలిపింది. అర్హులైన వారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. -
భారతీయ భాషలతోనే పరిపాలన
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: పరిపాలన భాషగా భారతీయ భాషలే ఉండాలని, మాతృ భాషే ఏ రాష్ట్రానికైనా పాలన భాష కావాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రాంతీయ భాషల్లోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వలస పాలకులు మన భాషపై ముందుగా దాడి చేశారని, వారి భాషలను బలవంతంగా మనపై రుద్దారన్నారు. భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను అర్థం చేసుకుని ఉమ్మడిగా జీవించడమే నిజమైన విద్యని పేర్కొన్నారు. ప్రపంచీకరణ ఎల్లలు చెరిపేసిన మనిషి తన గతాన్ని, పెరిగిన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకూడదన్నారు. ఆంగ్ల భాష మోజులో తెలుగును చులకన చేయొద్దని హితవు పలికారు. తనతో సహా దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారంతా తెలుగులోనే చదువుకున్నారని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేసిన కృషిని శ్లాఘించారు. ఈ యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని కోరారు. సాంకేతిక పదాలకు సమానమైన తెలుగు అర్థాలతో నిఘంటువు తీసుకురావాలన్నారు. కొత్త విద్యా విధానం ప్రాంతీయ భాషలోనే ఉన్నత విద్య చదివే అవకాశం కల్పిస్తోందన్నారు. అనంతరం తెలుగువాణి పత్రికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రి మహ్మద్ అలీ, యూనివర్సిటీ వీసీ ఆచార్య కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. పురస్కారాల ప్రదానం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు (2018వ సంవత్సరానికి), ప్రముఖ నృత్య కళాకారుడు కళాకృష్ణకు (2019వ సంవత్సరానికి) విశిష్ట పురస్కారాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్ ఛాయా చిత్ర ప్రదర్శన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఏర్పాటు చేసిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’(ఈబీఎస్బీ)పై నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈబీఎస్బీ కింద జత చేసిన హరియాణా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళా రూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడల విశిష్టతను తెలియజేసేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఛాయాచిత్ర ప్రదర్శన ఈ నెల 12 నుంచి 14 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. -
దేశ నిర్మాణంలో భారత విద్యార్థి పాత్ర
భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశంలోని విద్యార్థి యువకుల శక్తిని సంఘటిత పరిచేందుకు పురుడు పోసుకుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమని స్వామి వివేకానంద స్ఫూర్తితో అంచె లంచెలుగా విస్తరిస్తూ, 73 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో నేడు ప్రపంచంలోనే శక్తిమంతమైన విద్యార్థి సంస్థగా వెలుగొందుతోంది. దేశం పేరు భారత్ ఉంచాలన్న తొలి డిమాండ్, వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా గుర్తించా లనే రెండవ డిమాండ్ చేస్తూ, జ్ఞాన్, శీల్, ఏకతా అని నినదిస్తూ, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విరాజిల్లుతూ, పొరుగు దేశం నేపాల్లోనూ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దేశంలోని అనేక మంది కీలక రాజకీయ నాయకులు ఒక ప్పుడు ఏబీవీపీ కార్యకర్తలే అని గమనిస్తే, అది యువతలో నాయకత్వ లక్షణాలను నింపే కర్మా గారం అన డంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా కళాశాల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు 4,500 నగరాలు, పట్టణాల్లో 33 లక్షల సభ్యత్వం కలిగివుండటంతో పాటు, ప్రపంచ దేశాల నుండి భారత్ వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం డబ్ల్యూఓఎస్‌వై, సామాజిక స్పృహతో పని చేయడానికి ఎస్ఎఫ్డీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకై రాష్ట్రీయ కళామంచ్, కేంద్రీయ విద్యా సంస్థల్లో థింక్ ఇండియా... ఇలా ప్రజాస్వామ్య ప్రపం చంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ అవతరించింది. కశ్మీరీ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా 1990 సెప్టెంబర్ 11న చేపట్టిన చలో కశ్మీర్ యువతను చైతన్యపరిచిన ఒక మహోద్యమం. అస్సాం చొరబాటు దారులకు వ్యతిరేకంగా అస్సాంను కాపా డండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో 1983 అక్టోబర్ 2న గౌహతిలో భారీ ప్రదర్శన జరిపింది. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా చలో చికెన్‌నెక్ పేరుతో 2008 డిసెంబర్ 17న బెంగాల్ సరిహద్దుల్లో 40 వేల మంది విద్యార్థులతో భారీ ఆందోళన నిర్వహించింది. భారతీయులను బానిస లుగా మార్చే మెకాలే విద్యా విధానాన్ని మార్చి జాతీయ విద్యా విధానం–2020 కార్యరూపం దాల్చేలా పోరాడింది. మహమ్మారి ఆపత్కాలంలో మేమున్నామంటూ పరిషత్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా తరలిన కార్యకర్తల సేవాభావం వెలకట్టలేనిది. కరోనా సోకి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాలకు వైద్య సహాయం, భోజనాలు అందించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఏడాదిన్నర నుండి తరగతి గది అభ్యసనానికి దూరమైన విద్యార్థులకు ఎక్కడికక్కడ పరిషత్ పాఠశాల పేరుతో ట్యూషన్స్ చెప్పడంలాంటి అనేక కార్య క్రమాలను ఏబీవీపీ చేపట్టింది. - ప్రవీణ్‌రెడ్డి రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, తెలంగాణ