ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు | YSRCP Foundation Day Celebration In All Over Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

Published Thu, Mar 12 2020 11:26 AM | Last Updated on Thu, Mar 12 2020 11:50 AM

YSRCP Foundation Day Celebration In All Over Andhra Pradesh - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించి గురువారానికి పది సంవత్సవరాలు అవుతోంది. ఈ సందర్భంగా అన్ని జిల్లాలలోని పార్టీ కార్యాలయాల్లో వేడకలు నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 10 వ ఆవిర్భావ వేడుకలు జరిపారు. పార్టీ జండాను ఎగురవేసిన నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అంజాద్ బాషా, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి, నరెన్ రామంజుల రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. 

విజయవాడ : భవానిపురం బ్యాంకు సెంటర్‌లో వైఎస్సార్సీపీ పది వసంతాల వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.. దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి కేట్‌ కట్‌ చేశారు. ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు.

పశ్చిమ గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండి పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి పీవీఎల్‌ నరసింహరాజు జండా ఎగురవేసి, కేకును కట్ చేశారు.  ఈ వేడుకలో గులిపల్లి అచ్చారావు, రణస్తల మహంకాళి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

► పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా తణుకు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు..  వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 

► నరసాపురం వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు..  వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరించారు. 

తూర్పు గోదావరి : కాకినాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ వేడకల్లో నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చంద్రకళా దీప్తీ,పెద్దిరెడ్డి రామలక్ష్మి, కార్పోరేర్లు సత్యనారాయణ, మీసాల ఉదయ కుమార్,సంగాడి నందం పాల్గొన్నారు.

అనంతపురం : తాడిపత్రి వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

► కదిరి ఎమ్మెల్యే డా. సిద్ధారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. 

ప్రకాశం : దర్శిలో వైఎ‍స్సార్‌ కాంగ్రెస్ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మద్ధిశెట్టి వేణుగోపాల్‌ జెండా ఎగరేసి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

గుంటూరు : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు నగర పార్టీ కార్యాలయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిధర్ హాజరయ్యారు. 

శ్రీకాకుళం : నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి పార్టీ జండాను ఎగరవేసి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, సీఈసీ మెంబర్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవీ పద్మావతి, అందవరపు వరం పాల్గొన్నారు. 

 నరసన్నపేట పార్టీ కార్యలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.
 టెక్కలి నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేడాడ తిలక్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరేసి కేక్ కట్ చేసి కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు

విశాఖపట్నం : అనకాపల్లి లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఎంపీ వెంకట సత్యవతి.. పట్టణ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో  కేక్‌ కట్‌ చేశారు. పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, డాక్టర్ కె విష్ణు మూర్తి, డాక్టర్ రామూర్తి, జాజుల రమేష్, రమణ అప్పారావు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement