
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీయే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇన్నాళ్ళూ తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్ తెలిపారు.
నేడు మన @YSRCParty 14వ వ్యవస్థాపక దినోత్సవం. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. అప్పుడు నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీ మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇన్నాళ్ళూ నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృద… pic.twitter.com/rdk4qXVilV
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2024