
నేడు 15వ ఆవిర్భావ దినోత్సవం
సవాళ్లే సోపానాలుగా తిరుగులేని శక్తిగా అవతరించిన పార్టీ
సాక్షి, అమరావతి : సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఒక్కడితో మొదలైన వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. రాజకీయంగా వైరి పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై.. చంద్రబాబు, సోనియా గాంధీ కుట్ర చేసి అక్రమ కేసులు బనాయించి.. 16 నెలలు అక్రమంగా జైల్లో నిర్బంధించినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లెక్క చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా.. విలువలు, విశ్వసనీయతతో ప్రజలకు పార్టీని చేరువ చేశారు.
2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. 14 నెలలపాటు 3,648 కి.మీల దూరం యాత్ర సాగింది. ఫలితంగా టీడీపీ దుర్మార్గపు పరిపాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ.. 2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని అందించారు. 50 శాతానికిపైగా ఓట్లు, 151 శాసన సభ (87 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు జమ చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కట్టడం.. సూపర్ సిక్స్‌తోపాటు 143 హామీలు ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయింది. అయినా పది నెలలుగా వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ వైఎస్సార్‌సీపీ విధానం ప్రజా పక్షమని చాటి చెబుతున్నారు.

నేడు పార్టీ జెండాను ఆవిష్కరించనున్న వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే మార్గాలను పార్టీ రంగులతో తోరణాలుగా తీర్చిదిద్దారు. బుధవారం ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా వైఎస్సార్‌సీపీ జెండా ఎగర వేయాలని పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు పిలుపునిచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment