వైఎస్సార్, సాక్షి: టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. శనివారం జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. కడప రిమ్స్‌కు వెళ్లి బాధితుడు అజయ్‌ను కలిసి నేనున్నాను అని ధైర్యం చెప్పారు.
వేంపల్లెలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్యకర్త దాడి గురించి తెలుసుకున్న జగన్.. నేరుగా ఎయిర్‌పోర్ట్ నుంచి రిమ్స్‌కు వెళ్లారు. దాడి జరిగిన విధానం గురించి తెలుసుకున్న ఆయన.. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఎయిర్‌పోర్టు వద్ద కోలాహలం
అంతకు ముందు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్ రాకతో ఎయిర్‌పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, మేయర్ సురేష్ బాబు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి, అర్టీసీ మాజీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి స్వాగతం పలికిన వాళ్లలో ఉన్నారు.
ఇక.. తన పర్యటనలో సొంత నియోజకవర్గం పులివెందులలో ఉండనున్న జగన్.. పలువురు కార్యకర్తలు, నేతల్ని కలవనున్నారు. ఈ నెల 8వ తేదీన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే వేడుక కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment