YS Rajasekhara Reddy Jayanthi
-
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలకు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు హాజరయ్యారు. మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు. ప్రవాసులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని పలువురు ప్రశంసించారు. అలాగే.. పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన సాగించారని కొనియాడారు.వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యం లో వైయస్ఆర్ 75వ జయంతి వేడుకలు న్యూ జెర్సీ, మన్రో లోని థాంప్సన్ పార్కులో ఆహ్లాద కర వాతావరణంలో నిర్వహించారు. ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైస్సార్ ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 కి పైగా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయం లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బాగ్స్, కంప్యూటర్ లాబ్స్, మెడికల్ కిట్స్ మరియు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.డాక్టర్ రాఘవ రెడ్డి గోసల మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికే గర్వకారణం అని తెలియచేసారు. రాజేశ్వర్ రెడ్డి గంగసాని మాట్లాడుతూ ఫీజు రీయింబర్సుమెంట్ ఉపయోగించుకొని ఎంతోమంది ఈ రోజు అమెరికా లో వున్నారు అంటే అంతా కూడా రాజశేఖర రెడ్డి ముందుచూపే కారణం అని తెలియచేసారు. శ్రీకాంత్ పెనుమాడ మాట్లాడుతూ నదులను అనుసంధానం చేయడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.అలాగే భానోజీ రెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, రమణా రెడ్డి తో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ వైఎస్సార్ మనమధ్య లేకపోయినా, ఇన్ని సంవత్సరాలు అయినా ఈవిధం గా అందరూ కలసి వనభోజనాలతో వైఎస్సార్ జయంతి జరుపుకోడం ఆయన ప్రజల గుండెల్లో వున్నాడు అనటానికి చిహ్నం అని తెలియ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, నాగి రెడ్డి ఉయ్యూరు, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, భానోజీ రెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మూలె గారిని పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హరి వేల్కూర్, రాజేశ్వర్ రెడ్డి గంగసాని, శివ మేక, శరత్ మందపాటి, శ్రీకాంత్ పెనుమాడ, శ్రీకాంత్ గుడిపాటి, ప్రభాకర్ చీనేపల్లి, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి , లక్ష్మీనారాయణ రెడ్డి, అన్నా రెడ్డి, సహదేవ్ రాయవరం, సంతోష్ పాతూరి, రమణా రెడ్డి దేవులపల్లి, శ్రీధర్ తిక్కవరపు, అంజన్ కర్నాటి, శరత్ వేముల, బాలకృష్ణ భీమవరపు, భానోజీ రెడ్డి, నాగి రెడ్డి ఉయ్యూరు, పద్మనాభ రెడ్డి, వెంకట రెడ్డి కాగితాల, విజయ్ గోలి, వినోద్ ఏరువ, వంశి బొమ్మారెడ్డి, ఉష చింత, రమేష్ చంద్ర, శ్రీనివాస రెడ్డి యన్నం, రాజా బొమ్మారెడ్డి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మూలె, బత్తుల శ్రీనివాస రెడ్డి, రఘు అల్లూరి, మనోజ్ చింత, అరుణ్ అయ్యగారి, ప్రణీత్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, పరంధామ రెడ్డి, భీమిరెడ్డి సాంబి రెడ్డి , ఆర్ వీ రెడ్డి (చికాగో) తోపాటు 300 మందికి పైగా వైఎస్సార్‌ఆర్ అభిమానులు పాల్గొని మహానేతకు నివాళుర్పించారు. -
మహానేత వైఎస్సార్‌కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు జనవాహిని పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన అభిమానులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, మేనత్త వైఎస్ విమలమ్మ, చిన్నాన్న వైఎస్ సుధీకర్‌రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలసి ఇడుపులపాయలో వైఎస్సార్‌కు నివాళులర్పించారు. సమాధి ఘాట్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ కాసేపు అక్కడే మోకాళ్లపై కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. నివాళులర్పించే సమయంలో వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.ప్రత్యేక ప్రార్థనలు..సమాధి ఘాట్ వద్ద వైఎస్ జగన్, వైఎస్సార్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రానున్న కాలంలో కొన్ని సమస్యలు ఎదురైనా రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో జగన్ ధైర్యంగా ఎదుర్కొనేలా దేవుడు ఆశీర్వదించాలని మేనత్త విమలమ్మ ప్రార్థన చేశారు. కష్టాలు తాత్కాలికమేనని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్లడం ద్వారా ఎదిరించే శక్తిని ప్రసాదిస్తాడని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రస్తావించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రమేష్, హేమ దంపతులు వైఎస్ జగన్‌ను కలిసి తమ మూడు నెలల చిన్నారికి పేరు పెట్టాలని కోరగా విజయశ్రీగా నామకరణం చేశారు.వైఎస్సార్ విగ్రçహం వద్ద నివాళులు..ఇడుపులపాయలోని ఘాట్ ప్రాంగణంలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కొద్దిసేపు అక్కడే నిలబడి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి, విమలమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అరకు, తిరుపతి ఎంపీలు తనూజారాణి, గురుమూర్తి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీల అధ్యక్షులు కె.సురేష్‌బాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధ, టి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శారదాదేవి, పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డి సతీమణి వైఎస్ మాధవి, వైఎస్సార్సీపీ నాయకులు యువరాజ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమారుడు థామస్‌రెడ్డి, స్టాన్లీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అందరికీ అభివాదం.. అభిమానులతో సెల్ఫీఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి ఘాట్ ప్రాంగణానికి తరలి వచ్చిన జనవాహినికి వైఎస్ జగన్ అభివాదం చేశారు. వైఎస్సార్ అమర్‌రహే, వైఎస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలతో ఘాట్ ప్రాంగణం హోరెత్తింది. పలువురి వద్దకు స్వయంగా వెళ్లి పలుకరించిన వైఎస్ జగన్ అడిగిన వారందరితో సెల్ఫీ దిగారు. భారీగా వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మూడు రోజుల జిల్లా పర్యటన ముగించుకుని అనంతరం అక్కడి నుంచి ఉదయం 11.10 గంటలకు గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్‌కు విమానాశ్రయంలో పలువురు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, గౌడ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మాదు శివరామకృష్ణ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. గొల్లపూడి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొమ్మ కోటేశ్వరరావు(కోట్లు), జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసాని, విజయవాడ రూరల్ ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జడ్పీటీసీ కాకర్లమూడి సువర్ణరాజు, నిడమానూరు సర్పంచి శీలం రంగారావు, పార్టీ నాయకులు దేవభక్తుని చక్రవర్తి, అశోక్, మేచినేని బాబు, కాట్రు శేషు, రామిశెట్టి వెంకటేశ్వరరావు, సమ్మెట సాంబశివరావు, నిడమర్తి రామారావు, పలువురు విజయవాడ కార్పొరేటర్లు, కార్యకర్తలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు. -
పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ, సాక్షి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా.. పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. వైయస్సార్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలి. ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇదే నిజమైన నివాళి. పేద ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాధికారత కోసం వైఎస్ఆర్ తన జీవితాంతం పనిచేశారు అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. -
మెల్బోర్న్లో వైఎస్సార్ జయంతి.. వర్చువల్‌గా హాజరైన కాకాణి, మోదుగుల
మెల్బోర్న్: ప్రజల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తే.. తండ్రిని మించి పాలనను వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు వర్చువల్‌గా హాజరయ్యారాయన. ‘‘వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. అయితే వైఎస్ జగన్ తండ్రిని మించిన పాలన అందించారు. వ్యవసాయం, విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదు’’ అని కాకాణి అన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం. వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచిన కుటుంబాలకు కృతజ్ఞతలు. ప్రజాసేవకులుగా ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా.. అండగా నిలుస్తాం. ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటాం. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో.. జూమ్ కాల్ ద్వారా పార్టీ నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక.. వైఎస్సార్ జయంతి సందర్భంగా మెల్బోర్న్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, మరియు నాగార్జున పాల్గొన్నారు. -
షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు!: సీపీఐ నారాయణ
హైదరాబాద్, సాక్షి: రాజకీయాల్లో జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్ దివంగత మాజీ సీఎం డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, అయితే ఆయనకు ఆ గుర్తింపు ఊరికే రాలేదని అన్నారు సీపీఐ నారాయణ. సోమవారం (జులై 8న) వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొన్న నారాయణ.. వైఎస్సార్ రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీలోనూ వైఎస్సార్‌ను చాలామంది ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆ ఇబ్బందులు కొనసాగాయి. సొంత పార్టీ, బయటి పార్టీల నుంచి రాజశేఖర్‌రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఆ కష్టాలు ఎదుర్కొని నిలపడ్డారు కాబట్టే ‘జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్’ అయ్యారు’’ అని నారాయణ అన్నారు. ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న వైఎస్సార్ తనయ షర్మిలపైనా నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలమ్మకి ఇంకా అన్ని కష్టాలు రాలేదు. ఒకవేళ షర్మిలకు ఏమైనా కష్టాలు వస్తే.. అవి ఆమె సొంత పార్టీ నుండే వస్తాయి. కాబట్టి ‘షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు..’ అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు? -
నిను మరువం రాజన్నా.. ఏపీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు (ఫొటోలు)
-
సాక్షి ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు (ఫోటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్సార్ 75వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాయి. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ సిద్ధం: సజ్జల వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ‘‘ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారు. హామీలు ఇచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్‌కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే జగన్ పరిపాలన తెచ్చారు. అందరం కలిసి ముందుకు సాగుదాం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దాం. రాష్ట్రానికి, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటుంది’’విశాఖపట్నం: వైఎస్సార్ జయంతి సందర్భంగా బీచ్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మేయర్ హరి వెంకట కుమారి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు వంటి గొప్ప పథకాలను మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టారన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు వైఎస్సార్‌ను ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకున్నారు. పేదల కోసం పరితపించిన వ్యక్తి వైఎస్సార్. వైఎస్ ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్ గత ఐదేళ్లు అమలు చేశారన్నారు.‘‘రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రజల గుండెల్లో నుంచి ఆయనను వేరు చేయలేరు. టీడీపీ నేతలు ధ్వంసం చేసిన విగ్రహాలన్నీ తిరిగి ఏర్పాటు చేస్తాం. ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ నిలబడుతుంది. కూటమి నేతల దాడులను ప్రతిఘటిస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.పార్లమెంట్లో వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి: ఎంపీ విజయసాయిరెడ్డి‘డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) సామాజిక న్యాయం, సాధికారత, పేదల పక్షపాతిగా కోట్లాది మందికి చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ రోజు వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా పార్లమెంట్లో డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని స్పీకర్ ఓంబిర్లాకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్సార్ శాశ్వత వారసత్వానికి నివాళి అర్పించినట్లు అవుతుంది’ అని ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.Dr. Y.S. Rajasekhara Reddy (YSR) will forever be remembered by crores as a champion of social justice, and empowerment, and an advocate for the poor. On the occasion of his 75th birth anniversary today, I earnestly appeal to the Hon. Speaker, @ombirlakota ji to install a statue…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 8, 2024 తిరుపతి: వైఎస్సార్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నివాసం వద్ద వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.హైదరాబాద్: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు, దానం నాగేందర్, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా వికోటలో చిత్తూరు జిల్లా చైర్మన్ జీ శ్రీనివాసులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ, సర్పంచ్ పీఎన్ లక్ష్మమ్మ, ఎంపీపీ యువరాజు, రాష్ట్ర కార్యదర్శి పిఎన్ నాగరాజు, వైస్ ఎంపీపీ తమ్మీఖాన్ , వైస్ సర్పంచ్ అక్మల్ , వికోట మహిళా అధ్యక్షురాలు శశికళ, మంజుల, సరస్వతి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.తూర్పుగోదావరి జిల్లా: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో ఎమ్మెల్సీ అనంతబాబు రాజానగరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రక్తదానం చేశారు. ఈ కార్యక్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.అల్లూరి సీతారామరాజు: రాజవొమ్మంగిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించారు.జనగామ: స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్ర పటానికి కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు కేక్ కట్ చేశారు. -
వైఎస్సార్ జయంతి: జనహృదయ నేతకు వైఎస్ జగన్ నివాళి (ఫోటోలు)
-
రాజన్నా.. ఈ నేల నిను మరవదన్నా.. వైఎస్సార్ పాదయాత్ర ఫోటోలు
-
నాన్న మీ మార్గం శిరోధార్యం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు.ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2024 -
ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్‌కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమం అనంతరం అరకు ఎంపీ తనూజ రాణి మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారని.. ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ప్రజల్లో గుండెల్లో వైఎస్ ఎప్పటికీ ఉంటారని ఆమె అన్నారు. పోడు భూములు విషయం లో గిరిజనులకు చేసిన మేలు మరిచి పోలేము. గిరిజనుల ఆరాధ్య దైవం మోద కొండమ్మ చిత్ర పటంతో పాటు , మా గిరిజనుల ప్రతి ఇంటిలో వైఎస్సార్ చిత్ర పటం ఉంది.. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన మా గిరిజన గ్రామాల్లో, ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తనూజ రాణి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. -
మహోన్నత నాయకత్వం
విలక్షణ నాయకుడు వై.ఎస్.ఆర్. విపక్షాలు సైతం కొనియాyì న వ్యక్తిత్వం ఆయనది! ఇచ్చిన మాట తప్పని నైజం. ‘పేదల కోసమే పాలన’ అన్నది ఆయన సిద్ధాంతం. అన్నదాతకు ఆపద్బాంధవుడు. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి తెచ్చి, అసమానతలను రూపుమాపిన క్రాంతదర్శి. జన జీవితంతో ఆయన మమేకం అయ్యారు. జయాపజయాలకు అతీతంగా పాలన సాగించారు. ఏం చేసినా అది ప్రజల కోసమే! ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అది ప్రజా సంక్షేమం కోసమే! తెలుగు నేలను సస్యశ్యామలం చేయటానికి జలయజ్ఞం తలపెట్టారు. విశ్వసనీయతే తన సైన్యంగా విమర్శలను తిప్పికొట్టారు. తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ఆదర్శప్రాయుడైన ప్రజా నాయకుడిగా నిలబడ్డారు. నేడు ఆయన జయంతి.అధికారం కోసం వెన్నుపోటుకైనా వెనుకాడని నేతలుండొచ్చు. పదవి కోసం ఎలాంటి వంచనకైనా నిస్సిగ్గుగా సిద్ధపడే పార్టీలుండొచ్చు. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా, జన జీవితంతోనే పెనవేసుకున్న నాయకత్వాన్ని వైఎస్ రక్తంలోనే చూస్తాం. అందుకే వైఎస్ఆర్ అనే మూడక్షరాలు తెలుగువాడి గుండె గొంతుకయ్యాయి. దశాబ్దకాలం దాటినా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోని పున్నమి వెలుగులే పేదవాడి చిరునవ్వుగా మారాయి. ఎంత పెద్ద ఆపదొచ్చినా పెద్దాయన ఉన్నాడనేది వైఎస్ పాలనలో ప్రజలకు ఉన్న నమ్మకం. మాటిస్తే మడమ తిప్పడనేది వైఎస్‌పై జనానికి ఉన్న విశ్వాసం. మేలు చేసేటప్పుడు వైఎస్ రాజకీయాలు చేయడనేది విపక్షాలే ఒప్పుకున్న నిజం. ఓ బ్యూరోక్రాట్‌గా నేను ఆయన్ని దగ్గర్నుంచీ చూశాను. ప్రజల కోసమే బతికిన విలక్షణ నాయకుడే వైఎస్ఆర్లో నాకు కన్పించాడు. కార్యకర్తలే కుటుంబం అనుకున్న గొప్ప వ్యక్తిత్వం వైఎస్‌లోనే చూశాను. దశాబ్దాల రాజకీయ అనుభవం కావచ్చేమో... ప్రజలకు ఏం కావాలో నిక్కచ్చిగా నిర్ణయించే సామర్థ్యం వైఎస్‌కే సొంతం. ఆయన పాలనలో ఎన్నో ఘటనలు... ఇంకెన్నో జ్ఞాపకాలు... మరెన్నో మరపురాని ఘట్టాలు..!విన్నాడు... ఉన్నానని ధైర్యమిచ్చాడు!పాదయాత్ర వైఎస్‌ను పూర్తిగా ప్రజల పక్షానికి చేర్చింది. ఊరూవాడా జనం గుండె చప్పుళ్ళు విన్నాడు. అప్పుడే ‘నేనున్నా’ననే భరోసా ఇచ్చాడు. వాళ్ళ కోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఆయనలో బహుశా అప్పుడే మొదలైందేమో! పాలనలో అది స్పష్టంగా కన్పించింది. పేదవాడికి పెద్ద జబ్బొస్తే ఊపిరి పోవడమే వైఎస్ వచ్చే నాటికి ఉన్న పరిస్థితి. ముద్ద పెట్టే పొలం, తలదాచుకునే ఇల్లు అమ్మేసి వైద్యం చేయించుకునే దయనీయ పరిస్థితి అది. ఇది వైఎస్ మనసును చలించేలా చేసింది. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఈ పరిస్థితే ఉండకూడదని ఆశించారు. చిన్న అర్జీ తీసుకొస్తే చాలు ఎన్ని లక్షలైనా వైద్యం కోసం ఇవ్వాలని ఆదేశించారు. ఇలా రోజుకు రూ. 1.20 కోట్లు ఖర్చయ్యేది. ఇదంతా ఖజానాకు భారం అని బ్యూరోక్రాట్స్ చెప్పబోతే వారించారాయన. ‘పేదవాడి ఆపద తీర్చలేకపోతే ఎందుకయ్యా? బేవరేజ్ మీద సెస్ 1 నుంచి 2 శాతానికి పెంచితే సరిపోదా?’ అంటూ తేలికగా చెప్పేవారు. పనుల్లో బిజీగా ఉండి, రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చినా.. ‘సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులన్నీ క్లియర్ అయ్యాయా?’ అని అడిగేవారు. పేదవాడిపై ఇంత ప్రేమ ఎంతమందికి ఉంటుంది? గ్రేట్ అన్పించేది. ఇలా ఎంతకాలం సీఎం ఆఫీసుకు పేదవాళ్ళు అర్జీలు పట్టుకుని రావాలి? శాశ్వత పరిష్కారం లేదా? వైఎస్ వేసిన ఈ ప్రశ్నల్లోంచే ‘ఆరోగ్య శ్రీ’ పథకం ఆవిర్భవించింది. దీనిపైనా విపక్షాలు విమర్శలు చేశాయి. విషయం ఏమిటంటే విమర్శించిన విపక్ష నేతలే ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం! వాళ్ళే వైఎస్ తమకు ప్రాణ భిక్ష పెట్టారని చెప్పటం!తప్పు చేయను... ఏం చేసినా మీ కోసమే!ఇది వైఎస్ గట్టిగా నమ్మిన సిద్ధాంతం. జలయజ్ఞం పేరుతో భారీగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రతీ ప్రాజెక్టుపైనా విపక్షాలు రాద్ధాంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అనుసరించిన విధానం విపక్షాల నోటికి తాళం వేసింది. ప్రతీ ప్రాజెక్టు దగ్గరకు విపక్ష నేతలను పిలిపించి, వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పే ఏర్పాటు చేయడం వైఎస్ విజ్ఞతకు నిలువుటద్దం. ‘‘నేను తప్పు చేయనయ్యా... ఏం చేసినా ప్రజలకోసమేనయ్యా...’’ అని వైఎస్ చెప్పిన ఈ మాటలను ప్రజలు విశ్వసించారు. కాలగర్భంలో కలిసిన పోలవరం ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసినా... పోతిరెడ్డిపాడుతో వరద జలాలు వాడుకునే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజాభిష్టమే లభించింది. ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ‘ఇక మిమ్మల్ని విమర్శించలేను’ అంటూ జి. వెంకటస్వామి కృతజ్ఞతా పూర్వకంగా అనడం ఇప్పటికీ చాలామంది గుర్తు చేస్తారు. ఒక ప్రాంతం కాదు... ఒక పార్టీ కాదు... ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేసి తీరాల్సిందే అనేది వైఎస్ సిద్ధాంతం. అద్భుతమైన తెలివితేటలుండీ ఆర్థిక ఇబ్బందులతో చదవలేని పేదలకు ఫీజు రీ–ఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన వైఎస్ వల్ల... డాక్టర్లు, ఇంజనీర్లు అయిన పేదవాళ్ళున్నారు. అలా కొత్త వెలుగులు విరజిమ్ముతున్న జీవితాలు ఎన్నో! పేదవాడి నోటికాడికి ముద్ద చేర్చాలన్న లక్ష్యంతో రూ. 5.30 కిలో బియ్యం ధరను రూ. 2కు తగ్గించాలని భావించారు. దీన్ని బ్యూరోక్రాట్స్ వ్యతిరేకించారు. ‘‘మీ అభ్యంతరాలు మీరు చెప్పండి... కానీ ఇది అమలు చేయడం నా బాధ్యత’’ అంటూ... నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ గొప్ప వ్యక్తి వైఎస్ అనడం అతిశయోక్తేమీ కాదు.తిరుగులేని నిర్ణయాలువైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అంతర్జాతీయ పరిణామాల వల్ల మిర్చి ధర ఒక్కసారిగా పడిపోయింది. ఆ సమయంలో మిర్చి రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. జిల్లాల నుంచి అందిన ఈ సమాచారంతో వైఎస్ అప్పటికప్పుడే అధికారులను సమావేశపర్చారు. మార్కెట్లో రూ. 800 క్వింటాలున్న మిర్చిని, రూ.1500కు కొనాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయంతో కొన్ని వేల మంది మిర్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూశాం. ఇలాంటిదే మరో ఘటన. నిజామాబాద్‌లో రైతులు పండించే ఎర్ర జొన్నలు పంజాబ్, హర్యానాలకు సరఫరా అవుతాయి. వీటిని సేకరించే దళారులకు కేజీకి రూ. 12 వస్తే, రైతుకు వచ్చేది రూ. 4. రైతులకు ఎక్కువ ధర చెల్లించే ఓ దళారికి అవసరమైన బ్యాంకు లోన్ ఇప్పించడంలో అధికారులు కాదన్నా, వైఎస్ఆర్ నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేయడాన్ని ఇప్పటికీ అక్కడి రైతులు మరిచిపోరు. మరొక సందర్భం – వైఎస్ఆర్ హయాంలో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రతీ సిలిండర్‌కు రూ. 50 సబ్సిడీ ప్రకటించారు. రూ. 50 సబ్సిడీ ఇవ్వడం మామూలు విషయమేమీ కాదు. ఆర్థిక భారం పడుతుందని అధికారులు, ఆర్థిక మంత్రి చెప్పినా ‘ప్రతీ ఇంట్లో మేలు జరుగుతుంది కదా’ అని తన నిర్ణయంతో ముందుకు వెళ్లారు వైఎస్ఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వేసేప్పుడు స్వపక్షం నుంచే అనేక రకాల ఒత్తిడి వచ్చింది. ఇవేవీ లెక్క చేయలేదు. 150 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును అంత ధైర్యంగా చేపట్టడం వల్ల రాజధాని రూపురేఖలే మారాయి. హైదరాబాద్ విమానాశ్రయం పరిశీలనకు వెళ్ళినప్పుడు ఓ ముఖ్య విషయం ఆయన దృష్టికి వచ్చింది. విమానాల హబ్ ఏర్పాటు వల్ల అనేక రకాల అభివృద్ధి ఉంటుంది, దీనికి టాక్స్‌ను 14 నుంచి ఒక్క శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తి అది. అప్పటికప్పుడే ఆయన దానిపై అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల విమానాశ్రయం ఆర్థిక పురోగతే మారింది.విశ్వసనీయతే ఆయన సైన్యంఇంటిలిజెన్స్ కన్నా ముందే వైఎస్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలిసేది. ఒకసారి గుంటూరు దగ్గర రైలు ప్రమాదం జరిగితే అధికారుల కన్నా ముందే ఆయన అప్రమత్తమయ్యారు. ఆయనే అందరికీ ఫోన్లు చేసి బాధితులకు అండగా ఉండమని చెప్పారు. ప్రతీ ఊళ్ళో ఆయనకు నెట్వర్క్ ఉండేది. ఏ జిల్లాకు వెళ్ళినా కనీసం 40 మంది కార్యకర్తలతో ఆయన విడిగా మాట్లాడేవారు. ఏ అర్ధరాత్రయినా ఆయనకు వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు. విషయం చెప్పేవాళ్లు. ఆయన కూడా వినేవాడు. దీంతో కచ్చితమైన సమాచారం వచ్చేది. చుట్టూ ఉన్న కోటరీపై ఆయన ఎప్పుడూ ఆధారపడేవాడే కాదు. ఎంత పెద్ద ఆందోళన జరిగినా రైతులు, ప్రజలపై తుపాకులు ఎక్కు పెట్టొద్దని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేవాడు. నిజామాబాద్‌లో ఎర్రజొన్నల వివాదం సందర్భంగా, ముదిగొండలో కాల్పుల సందర్భంగా... ‘రైతులకు ఏమైనా జరిగిందా?’ అంటూ ఆయన పడ్డ కంగారు మాటల్లో చెప్పలేనిది. విపక్ష నేతలను అసెంబ్లీలోనూ పేర్లు పెట్టి పిలిచే స్వతంత్రం... చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా– మళ్ళీ సెక్యులర్ మాటలు చెప్పినా తేలికగా కొట్టిపారేసే ధైర్యం... ఓడిపోయినా ప్రతీ క్షణం ప్రజా క్షేత్రంలోనే ఉండే గొప్ప నైజం... వైఎస్ ఉన్నతిని పెంచాయి. ఈనాటికీ ఏ నేతకూ లేని ప్రజాదరణను తెచ్చి పెట్టింది. వైఎస్ మన మధ్య లేకపోవచ్చు. సడలని విశ్వాసం... చెదిరిపోని ప్రజల కలల స్వప్నంలో పథకాల రూపంలో ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి(వై.ఎస్.ఆర్. సీఎంగా ఉన్నప్పుడు సీఎంవో కార్యదర్శి) -
వైఎస్సార్.. తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
ఆ పేరే ఒక స్ఫూర్తి వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తూ.. రూ.1,100 కోట్ల సేద్యపు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి.. వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. రూ.లక్ష కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి.. ఐదేళ్లలోలోనే 41 ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించి.. 3 పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చిన ప్రగతిశీలి. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పిన ఆర్థికవేత్త. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత.. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు వైఎస్సార్సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలే. ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ రుణాలు, అర్హులందరికీ ఇళ్లు వంటి విప్లవాత్మక పథకాలు.. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. మహానేత మరణించి 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన చిరస్మరణీయుడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు జీవం అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైఎస్సార్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను, అటు కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాదయాత్రలో ఇచి్చన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు. వైఎస్సార్ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం.ప్రజారోగ్యం, విద్యకు పెద్దపీట⇒ 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను విడుదల చేశారు. ఆ సమయంలో పేదలు పడిన వేదన గమనించారు. జబ్బునపడ్డ పేద కుటుంబాలు ఆ ఆపత్కాలంలో సహాయం కోసం సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచి్చంది. 108, 104 అంబులెన్స్ సరీ్వసులను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్‌ను చేపట్టింది. ⇒ కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతోసహా 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు. ⇒ కొన్ని ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం సంచలనం సృష్టించింది. మన రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా పొదుపు సంఘాల (డ్వాక్రా) వ్యవస్థలో విప్లవం తీసుకొచి్చంది. ⇒ 2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైఎస్సార్ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధన ప్రవాహం కొనసాగేలా చేశారు. 2009 ఎన్నికల్లోనూ మరోసారి రాష్ట్రంలో, కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ⇒ పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదువులు దక్కేలా చేశారు⇒ పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. శ్రీసిటీ సెజ్తోసహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడంలో భాగంగా గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి. -
నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. -
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) ఇడుపులపాయలో పర్యటించనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం తాడేపల్లికి రానున్నారు.కాగా, వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు(ఆదివారం) పార్టీ నేతలను, కార్యకర్తలను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. పులివెందులలో పాముకాటుకు గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్. చిన్నారికి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
నేనున్నా.. వైఎస్సార్సీపీ కార్యకర్తకు జగన్ పరామర్శ
వైఎస్సార్, సాక్షి: టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. శనివారం జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. కడప రిమ్స్‌కు వెళ్లి బాధితుడు అజయ్‌ను కలిసి నేనున్నాను అని ధైర్యం చెప్పారు. వేంపల్లెలో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్యకర్త దాడి గురించి తెలుసుకున్న జగన్.. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి రిమ్స్‌కు వెళ్లారు. దాడి జరిగిన విధానం గురించి తెలుసుకున్న ఆయన.. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎయిర్‌పోర్టు వద్ద కోలాహలంఅంతకు ముందు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్ రాకతో ఎయిర్పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, మేయర్ సురేష్ బాబు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి, అర్టీసీ మాజీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి స్వాగతం పలికిన వాళ్లలో ఉన్నారు. ఇక.. తన పర్యటనలో సొంత నియోజకవర్గం పులివెందులలో ఉండనున్న జగన్.. పలువురు కార్యకర్తలు, నేతల్ని కలవనున్నారు. ఈ నెల 8వ తేదీన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే వేడుక కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. -
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలి
సాక్షి, అమరావతి: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడా ఘనంగా నిర్వహిద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ జయంతి రోజైన జూలై 8 (సోమవారం)న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో రామకృష్ణారెడ్డి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి వైఎస్సార్ 75వ జయంతి అయినందున రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమాలపై ఇప్పటికే సమాచారం అందించామని తెలిపారు. విగ్రహాలను సిద్ధం చేసి కింది స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. మళ్లీ పార్టీ చైతన్యవంతమై, ప్రజల్లోకి దూసుకుపోయేందుకు ఇది తొలి అడుగులా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఆదేశించారని తెలిపారు.వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్వైఎస్సార్ మరణించి 15 సంవత్సరాలైనా ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఆయన ఆలోచనలనే సిద్ధాంతాలుగా చేసుకుని వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని, ప్రజల్లో మమేకమైన నాయకుడు ఎలా ఉండాలో ఆయన ద్వారా నేర్చుకున్నామని తెలిపారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్ ప్రజలతోనే మమేకమై ఉన్నారని, పార్టీ కూడా ఎప్పుడూ ప్రజలతోనే నడిచిందని వివరించారు. వైఎస్సార్ మొదలు పెట్టిన పథకాలకు వైఎస్ జగన్ గత 5 ఏళ్లలో పూర్తి రూపం ఇవ్వడమే కాకుండా, వాటికి మరిన్ని జోడించి వ్యవస్థల్లో మంచి మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో తొలిసారి వైఎస్ జగన్ పేదరికాన్ని పారదోలి, అందరికీ సమాన అవకాశాలను కలిగించేలా పేదలను చేయి పట్టుకుని నడిపిస్తూ, సుస్థిరమైన అభివృద్ధి, అభ్యుదయం దిశగా రాష్ట్రాన్ని నడిపిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదన్నారు. మనం చేసిన మంచి పనుల వల్ల వచ్చిన మార్పులు కళ్ల ముందే కనపడుతున్నాయని తెలిపారు. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం ఆదర్శంగా తీసుకుందని, ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. ఎప్పటికీ ప్రజలతో మమేకమై ఉంటాంపథకాల లబ్ధిదారులంతా ఓటు రూపంలో మనకు అండగా నిలుస్తారనుకున్నామని, కానీ టీడీపీ మోసపూరిత, అమలు సాధ్యం కానీ హామీలను ప్రజలు నమ్మి ఉండొచ్చని, ఇతర కారణాలు కూడా తోడై ఈ ఫలితాలు వచ్చాయని సజ్జల అభిప్రాయపడ్డారు. పోలింగ్ అయిన వెంటనే టీడీపీ రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. -
YSR Birth Anniversary: రేపు వైఎస్సార్ జిల్లాకు వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు శుక్రవారం ఉదయం వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయల్దేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
అమెరికాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. అమెరికాలో పర్యటిస్తోన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్‌రహే’’ అంటూ నినదించారు. మహానేత అందించిన పథకాలను గుర్తుచేసుకున్నారు. గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పరిపాలనలో వైఎస్సార్ తన దైన ముద్ర వేశారు. తనకు ఇచ్చిన అధికారం పేదలకు సేవ చేసేందుకే తప్ప.. దర్పం ప్రదర్శించేందుకు కాదని చేతల్లో చూపించారు వైఎస్సార్. చరిత్రలో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారు. తన నడవడిక, గొప్ప మనసు, మంచి నిర్ణయాలతో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో మేలు జరిగింది. రేషన్ షాపుల్లో రెండు రూపాయలకే కిలో బియ్యంతోపాటు, ఇతర నిత్యావసరాల్ని కూడా తక్కువ ధరకే అందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందించారు. ఇళ్లు లేని పేదల కోసం ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కడప రత్నాకర్, అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విశ్వసనీయతకు చిరునామా వైఎస్సార్ మాత్రమే. ఇచ్చిన ఏ హామీ అయినా తీర్చేవరకు విశ్రమించలేదు వైఎస్సార్. అయిదున్నర కోట్ల మంది ప్రజలకు పేదవాళ్లకు అందాల్సిన పథకాలు 99% అమలు చేసిన ఘనత నాడు వైఎస్సార్‌ది, నేడు వైఎస్ జగన్‌ది. భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసిన ఘనత వైఎస్సార్‌ది, వైఎస్ జగన్‌దే. రైతులు బావుండాలంటే పంటలు పండాలి. ప్రతి పంటకూ నీరు అందాలంటే ప్రాజెక్టులు కట్టాలన్న తప్పనతో జలయజ్ఞాన్ని ప్రారంభించి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి ఫలితాలు చూపించిన మహానేత వైఎస్సార్. మేడపాటి వెంకట్, ఏపీ NRT అధ్యక్షులు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక రంగాలపై దృష్టి సారించి వాటిని అమల్లోకి తెచ్చి చూపించిన నాయకుడు వైఎస్సార్. రైతుల కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ దాని వల్ల లక్షలాది మంది అన్నదాతలకు మేలు జరిగి ఆత్మహత్యలు తగ్గిపోయాయి. పేదలకు ఆర్థిక స్తోమత లేక వైద్య చికిత్స పొందలేకపోయిన వారిని పాదయాత్రలో చూసి ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందేలా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యం అందేందుకు తెచ్చిన 108 అంబులెన్స్ పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు ప్రతీ చోట కనిపిస్తోందంటే అది వైఎస్సార్ ఘనతే. రమేష్ రెడ్డి వల్లూరి, వైఎస్సార్సిపి కన్వీనర్, ఉత్తర అమెరికా నాయకుడు ఎవరైన.. పార్టీ ఏదైనా.. రాజకీయాలు చేయండి. ఒక హామీ ఇవ్వండి కానీ దాన్ని మరిచిపోవద్దు. అది అమలు అయ్యేవరకు అంతే స్థాయిలో కష్టపడండి. మీరిచ్చే హామీలు ఓట్ల కోసం కాదని తమ పరిపాలనతో గుర్తుచేసిన నాయకులు ఇద్దరు. ఒకరు మహానేత, ఉమ్మడి రాష్ట్రానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్. మరొకరు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్సార్. అలాంటి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పుణ్యం. 2003-04లో పాదయాత్ర ద్వారా నాడు వైఎస్సార్, అలాగే 2018-19లో వైఎస్ జగన్ ప్రజల కోసం నడిచారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చారు. 2024లో వైఎస్ జగన్ పెట్టుకున్న 175/175 లక్ష్యాన్ని వంద శాతం చేరుకుంటారని, ప్రజలు మరోసారి అద్భుత విజయాన్ని కట్టబెడతారని బలంగా నమ్ముతున్నాం. వాషింగ్టన్ డీసీలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల వీడియో ఈ కింద చూడవచ్చు -
కువైట్‌లో ఘనంగా రాజన్న 74వ జయంతి వేడుకలు
మహానేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి వేడుకలు కువైట్ మాలియా ప్రాంతంలో పవన్ ఆంధ్ర రెస్టారెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి, ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. బాలిరెడ్డి, కమిటీ సభ్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గారి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలి రెఢ్డి గారు మాట్లాడుతూ.. అపర భగీరథుడు రాజన్న తన పరిపాలనలోపేద బడుగు బాలహీన వర్గాల, ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ, రైతులకు రుణ మాఫీ పథకం, ఉచిత విధ్యుత్ పథకం,పేద విద్యార్ధుల చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పధకం ఇలా ఎన్నో సంక్షేమ పధకాలను కుల మతాలకు అతీతంగా అందించి రాష్ట్ర ప్రజల మనస్సులో సంక్షేమ సారధిగ నిలిచి పోయారని కొనయాడారు. ప్రస్తుతం రాజన్న భౌతికంగా మన మధ్య లేకపోయిన నింగిన సూర్యచంద్రులు ఉన్నంత వరకు.. భూమిపై జీవరాసులు ఉన్నంత వరకు ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతి తెలుగు ప్రజల గుండెలలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శాశ్వతంగా ఉంటారని తెలిపారు. గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్ యం వీ నరసారెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ వైఎస్స్ రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉండుంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉండేదన్నారు. ఐనా రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ ఉన్నా.. కూడా తండ్రి ఆశయ సాధన కొరకు రాజకీయాలలో వచ్చిన ముఖ్యమంత్రి అయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత గొప్పగా సంక్షేమ పథకాలను అందించి ప్రజల మనుసును గెలుచుకున్నారు. ఆయన తన తండ్రి కన్నా పది అడుగు ముందుకేసి కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సంక్షేమ పధకాలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పారిపాలన చూసి.. నేను కన్న కలలు నా వారసుడు.. నా ముద్దు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నాడని స్వర్గంలో ఉన్న మహా నాయకుడు వైఎస్సార్ గారి ఆత్మ సంబరపడి ఉంటుందన్నారు. మైనారిటీ నాయకులు షేక్ రహమతుల్లా, బీసీ ఇన్చార్జ్ రమణ యాదవ్ మాట్లాడుతూ.. మహా నేత వైఎస్సార్ గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే,, ఒక అడుగు ముందుకేసి రాజన్న బిడ్డ రాజకీయలలో కూడా 4 శాతం అవకాశం కల్పించి.. ముస్లిం సోదరులు రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వడమేగాక ఏకంగా 5 మందికి శాసనసభ టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో నలుగురు గెలవడం.. ఒకరికి ఏకంగా ఉప ముఖ్యంత్రిగా అవకాశం కల్పించి.. తాను తన తండ్రిలాగే మైనారిటీ ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి, యువజన విభాగం ఇన్చార్జ్ మర్రి కల్యాణ్, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అబ్ తురబ్, అన్నాజీ శేఖర్, ఎస్సీ ఎస్టీ విభాగం ఇన్చార్జ్ బీబియన్ సింహ, వైనార్టీ నాయకులు షా హుస్సేన్, మహుబ్ బాషా, సీనియర్ నాయకులు వైఎస్ లాజరస్, ఏవీ సుబ్బా రెడ్డి, యువజన విభాగం సభ్యులు సయ్యద్ సజ్జాద్, షేక్ సబ్దర్, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు లక్ష్మి ప్రసాద్, యన్.వీ సుబ్బారెడ్డి, జగనన్న సైన్యం అధ్యక్షుల బాషా, అరవ సుబ్బారెడ్డి, గజ్జల నరసా రెడ్డి,మణి, ప్రభాకర్ యాదవ్, నాధముణి, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గోన్నారు. (చదవండి: లండన్‌లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ) -
అమరత్వం అంటే అదే!..చనిపోయిన ప్రజల గుండెల్లోనే..
దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డిగారి 74వ జయంతిని పురష్కరించుకుని సింగపూర్ లోని ఎన్నారైలు సింగపూర్ వైఎస్సార్సీపీ అడ్వైసర్ కోటి రెడ్డి, సింగపూర్ వైఎస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ ఆద్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైన వైఎస్సార్ అభిమానులు పాలుపంచుకొన్నారు. వైస్సార్ గారు చేసిన మంచి పనులను నెమరు వేసుకున్నారు. ఎంత మంది సీఎం లు పాలించిన కూడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైనారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. (చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు) -
రైతు రాజ్యమా? తోడేళ్ల పాలనా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రైతుల మీద మమకారం ఉన్న పాలకుడు ఉంటే దేవుడి కరుణ కూడా ఉంటుంది. వర్షాలు కూడా బాగా కురుస్తాయి. పాడి పంటలు బాగుంటాయి. వర్షాలు లేని సంవత్సరాల్లో రైతులకు అండగా నిలబడే మనసే లేకపోతే రాబందులకు, నక్కలకు విందు భోజనం దొరుకుతుంది. అలా జరగకుండా మనకు పాడి పంటలు పుష్కలంగా ఉండే నాయకత్వం కావాలా? లేక నక్కలు, తోడేళ్లు ఉండే పాలన కావాలా? అన్నది మీరే ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను కోరారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని, ఎవరిని గెలిపించాలో ఆలోచించాలని ప్రతి రైతును, అక్కచెల్లెమ్మను, పేద వాడిని, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలను కోరుతున్నానన్నారు. ఇప్పటికే మీ బిడ్డ జగన్ బటన్ నొక్కుతూ ఎలాంటి లంచాలకు తావులేకుండా రూ.2.25 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా డీబీటీ ద్వారా జమ చేశారన్నారు. ఇలాంటి ప్రభుత్వం కావాలా? లేక చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగా రైతుల్ని, పేదల్ని, సామాజిక వర్గాల్ని మోసం చేసి దోచుకోవడం, పంచుకోవడం, తినుకొనే డీపీటీ పద్ధతి కావాలా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వారికి మంచి చేసిన చరిత్రే లేదు ► మనకు రైతు రాజ్యం కావాలా? లేక రైతును మోసం చేసే.. వ్యవసాయం దండగ అన్న పాలన కావాలా? రైతుకు తోడుగా ఉండే ఆర్బీకే, సచివాలయ, వలంటీర్ వ్యవస్థ కావాలా? గత ప్రభుత్వంలో మాదిరిగా దళారీ వ్యవస్థ కావాలా? మారుతున్న స్కూళ్లు, ఇంగ్లిష్ మీడియం.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న పేదల ప్రభుత్వం కావాలా? లేక పెత్తందార్ల ప్రభుత్వం కావాలా? మనకు దేవుడి దయతో వర్షాలు కావాలా? లేక చంద్రబాబు ఐరెన్ లెగ్‌తో కరువు కావాలా? మాట తప్పని ప్రభుత్వం కావాలా? వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు పాలన కావాలా? ► పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు వెళ్లి పైశాచిక ఆనందం పొందే పెత్తందార్లు కావాలా? ఆరోగ్యశ్రీ, 104, 108, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన అందించే మనందరి ప్రభుత్వం కావాలా? పేదలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎక్కడా టార్చ్ లైట్ వేసి చూసి వెతికినా కనిపించని పెత్తందార్ల ప్రభుత్వం కావాలా? ► అప్పుడు, ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్, పైగా అప్పులు అప్పుడే ఎక్కువ. అయితే అప్పుడు ఇన్ని కార్యక్రమాలు, పథకాలు ఎందుకు లేవు? ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఇవాళ మీ బిడ్డ ఏ విధంగా మీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాడు? ఎలాంటి ప్రభుత్వం కావాలో ఆలోచించండి. ► వాళ్ల దగ్గర ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఓ దత్తపుత్రుడు ఉన్నాడు. వీళ్లంతా కలిసి తోడేళ్ల మాదిరి ఏకమై ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెప్పిందే చెప్పి మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. నాకు వీళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చేత కాదు. నేను నమ్ముకుంది దేవుడి దయను, మీ చల్లని దీవెనలను. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ప్రారంభం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం రూ.213.27 కోట్ల వ్యయంతో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 10 పరీక్ష ల్యాబొరేటరీలు, 4 రీజనల్ కోడింగ్ సెంటర్ల నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా మొదటి దశలో 75 ల్యాబ్‌లను ప్రారంభించారు. శనివారం కళ్యాణదుర్గం సభావేదికగా మరో 52 ల్యాబ్‌లకు సీఎం జగన్ ప్రారంభోత్సవం చేశారు. దీంతో మొత్తం 127 ల్యాబ్‌లను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రారంభించిన 52 టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ.63.96 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 1,238 బహుళ ప్రయోజనాల గోదాముల నిర్మాణం కోసం రూ.777.04 కోట్లు వెచ్చించనున్నారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే వీటిని నిర్మిస్తారు. వీటికి కూడా సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. మీరు చల్లగా ఉండాలి సర్.. నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఐదు ఎకరాల్లో వేరుశనగ, ఐదు ఎకరాల్లో మామిడి పంటలు సాగుచేస్తున్నా. పంటలకు ఈ క్రాప్, ఈ కేవైసీ చేయించాను. ప్రభుత్వమే ఉచితంగా బీమా ప్రీమియం కట్టింది. ఇప్పుడు నాకు రూ.57,500 పరిహారం మంజూరైంది. గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే నెలలోపే ఇన్పుట్ సబ్సిడీ రూ.52,500 వచ్చింది. టీడీపీ హయాంలో రైతులు దారుణంగా మోసపోయారు. ఇప్పుడు మీరు (సీఎం) చెప్పిన దాని కంటే ఎక్కువగా లబ్ధి చేకూరుస్తున్నారు. ఆర్బీకేలు, వైఎస్సార్ యంత్రసేవా పథకం వల్ల రైతులకు కష్టాలు తప్పాయి. మీ నాలుగేళ్ల పాలనలో నా కుటుంబానికి రూ.7 లక్షల లబ్ధి చేకూరింది. మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి. – కురబ భీమేష్, రైతు, రాళ్ల అనంతపురం -
ఈ పాయింట్‌తో యాత్ర 2 ఉంటుంది: మహీ వి. రాఘవ్
'యాత్ర’కి, ‘యాత్ర 2’కి కథ పరంగా సంబంధం ఉండదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి జీవితంలోని ఎత్తుపల్లాలనే ‘యాత్ర 2’లో చూపిస్తాం' అన్నారు డైరెక్టర్ మహీ వి. రాఘవ్. ఆయన దర్శకత్వంలో శివ మేక నిర్మించనున్న చిత్రం ‘యాత్ర 2’. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భగా మహీ వి. రాఘవ్ మాట్లాడుతూ–'యాత్ర 2’లో 2009 నుంచి 2019 వరకు జగన్‌గారి జీవితాన్ని, ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైమ్‌లో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైమ్‌లో 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఏపీ ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు. ‘యాత్ర 2’తో ఓటర్లు ప్రభావితం అవుతారనుకోవద్దు. మా సినిమా చూసి ఎమోషనల్ అవుతారు. కానీ, వాళ్లకు నచ్చినవాళ్లకు ఓటు వేస్తారు. ‘యాత్ర 2’ని వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని అనుకున్నా పర్లేదు' అన్నారు. 'నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ‘యాత్ర’ను అందరూ సపోర్ట్ చేశారు.. ‘యాత్ర 2’ మూవీని కూడా ఆదరించాలి' అన్నారు శివ మేక. -
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు (ఫొటోలు)
-
Idupulapaya YSR Ghat: వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళులు (ఫొటోలు)
-
Idupulapaya YSR Ghat: వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు. ఈరోజు(శనివారం) అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ నేపథ్యంలో తన అనంత పర్యటన ముగిసిన వెంటనే.. వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ -
వైఎస్ రాజశేఖర రెడ్డి వాయిస్‌తో .. యాత్ర-2 పోస్టర్ వచ్చేసింది
2019లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ్ సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే ఆయన విడుదల చేశారు. ఆ పోస్టర్లో మహి వి.రాఘవ్ ఇలా చెప్పుకొచ్చాడు.. 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్. రాజశేఖరరెడ్డి కొడుకుని' అనే లైన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నేడు (జులై 8) వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా యాత్ర-2కు సంబంధించి మోషన్ పోస్టర్‌ను ఉదయం 11:35 గంటలకు దర్శకులు మహి వి.రాఘవ్ విడుదల చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాటలతో మోషన్ పోస్టర్ ప్రారంభం అవుతుంది. 'నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే...' అంటూ ఆ నాడు ఆయన మాట్లాడిన గొంతును డైరెక్టర్ మహి వి.రాఘవ్ నేడు మళ్లీ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 'నేను విన్నాను... నేను ఉన్నాను' అనే మాటలతో వీడియో ముగుస్తుంది. వీరిద్దరూ చెప్పిన ఈ మాటలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంతగానో దగ్గరకు చేరాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, వైఎస్సార్ సీపీ ఆవిర్భావం, ఆపై 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం తదితర అంశాలను యాత్ర 2 లో ఉండనుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. -
వైఎస్సార్‌ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, వైఎస్సార్ ఇప్పుడు సీఎం జగన్ రూపంలో ఉన్నారని, ఆయన ప్రతి లక్షణాన్ని సీఎం జగన్ పుణికిపుచుకున్నారన్నారు. ‘‘ఈ రోజు ప్రతి కార్యకర్త గర్వంగా జగనన్న మనుషులం అని చెప్పుకునేవిధంగా పాలిస్తున్నారు. వైఎస్సార్ ఆత్మ శాంతి కలిగేలా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈ తరానికి సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ అని గర్వంగా చెప్పుకునేలా పాలిస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు. చదవండి: ఆపదొస్తే నేనున్నా.. మనసున్న మారాజు మా రాజన్న ‘‘రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతున్నారు. జగనన్న సురక్షతో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత వేగంగా సమస్య కి పరిష్కారం చూపిస్తున్నారు. వైఎస్సార్ దార్శనికతను ఈరోజు సీఎం జగన్ ఆచరణలో చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన 70 నుండి 80 శాతం మంది జగనన్నే కావాలని ప్రజలు చెప్తున్నారు. చంద్రబాబు ఒక్కటి కూడా చెప్పుకోవడానికి లేదు. 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు ఏం చేసాడో చంద్రబాబు చెప్పుకోలేని పరిస్థితి. అన్ని వ్యవస్థలను సీఎం జగన్ రిపేర్ చేసి దేశానికి ఆదర్శంగా మలిచారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..: రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఇండిపెండెంట్‌గా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తూ కేంద్రం నుంచి నిధులు తీసుకు రాగలుగుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం పై అయినా అవసరం అయినప్పుడు అభిప్రాయాలను నిర్భయంగా చెబుతున్నారు. సీఎంగారికి రాష్ట్ర ప్రయోజనాలు అత్యధిక ప్రాధాన్యం. వారిది అదేపనిగా దుష్ప్రచారం సీఎంగారు తన కేసుల కోసమే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. దాన్నే వారి అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. వారు ఏ పాట పాడినా ఏ కూత కూసినా ప్రచారం చేయడానికి రెండు పత్రికలు, నాలుగు ఛానళ్లో ఉన్నాయి. అందుకే వారలా మాట్లాడుతుంటారు. నిజానికి విపక్షనేత, ఆయన కుమారుడి సభలకు ప్రజా స్పందన లేకపోతే, తడికలు కట్టి దానిలో జనాన్ని నింపుకుని వాటిని చిత్రీకరించి ప్రచారం చేసుకుంటున్నారు. లోకేష్, చంద్రబాబు జూమ్ మీటింగ్‌లు.. కెమెరా ఎదుట చేసే విన్యాసాలను వారి అనుకూల టీవీలు, పత్రికలలో వేస్తుంటారు. అలా రోజూ ఏదో ఒకటి వేస్తుంటారు. మరేదో మాట్లా్లడుతుంటారు. కానీ ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. ఆనాడు ఒక్కటైనా సాధించారా? 2014 నుంచి కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న చంద్రబాబు, ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు, వారితో ఉంటే ప్రాబ్లమ్ అనుకుని బయటకు వచ్చేశారు. అంతకు ముందు చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకే ప్రయత్నించారు తప్ప, ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయలేదు.ప్రత్యేక హోదా విషయంలో చూస్తే.. పోలవరం కాంట్రాక్ట్ ఇవ్వగానే ప్యాకేజికి సంతకాలు పెట్టి వచ్చారు. ఎన్డీఏలో భాగస్వామిగా తాను సాధించుకుని వచ్చింది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అదే ఈరోజు జగన్‌గారు చూస్తే ఇండిపెండెంట్‌గా కేంద్రంతో మంచి సంబంధాలు నెరుపుతూ అన్నీ సాధించుకు వస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సినవి గతంలో తీసుకు రాలేనివి.. ఈరోజు ఎలా తీసుకురాగలుగుతున్నారు. అదీ జగన్‌గారి ఘనత. మా స్టాండ్ మారలేదు ఉచిత పథకాల వల్ల రాష్ట్రం అప్పులపాలవుతోందని పదే పదే విమర్శిస్తున్న చంద్రబాబు, అవే పథకాలు అమలు చేస్తానని చెబుతున్నారు. దాన్ని ఎల్లో మీడియాలో రాస్తున్నారు. ఇంకా రాష్ట్రానికి నిధులు రాకుండా, రుణాలు దక్కకుండా కుట్రలు చేస్తున్నారు. అందుకోసం బ్యాంకులకు లేఖలు రాస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్నారు. అయినా రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తున్నాయి. అలా అని చెప్పి, వాటి కోసం మా వైఖరి మార్చుకోలేదు కదా? మా ఇండిపెండెంట్ స్టాండ్ వదిలేశామా?. లేదే?. రాజీ లేని ప్రయత్నం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి వస్తే వేగంగా స్పందిస్తున్నాం. స్టేక్ హోల్డర్స్‌తో చర్చించాల్సినవి ఏమైనా ఉంటే వెంటనే అందరికి చెబుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఎక్కడా రాజీ పడడం లేదు. ఆ విషయంలో నిర్భయంగా వ్యవహరిస్తున్నాం. ఎక్కడ, ఏం మాట్లాడాలో అక్కడ అలా వ్యవహరిస్తున్నాం. అలా నిరంతరం పని చేస్తూ, రాష్ట్రానికి అవసరమైన వాటిని సాధిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలతో పాటు, పొరుగు రాష్ట్రాల వారికి కూడా తెలుసు. అందుకే సీఎం శ్రీ వైయస్ జగన్ ఒక్కరే సక్సెస్‌ఫుల్‌గా హౌ టూ మెయిన్‌టెయిన్ ది బ్యాలెన్స్ విత్ సెంటర్ విత్ అవుట్ లూజింగ్ ఐడెంటిటీ.. అని చర్చించుకుంటున్నారు. దిక్కు తోచక పిచ్చి మాటలు: చంద్రబాబుకు ఎలాంటి ఐడెంటిటి లేదు. ఆయన మామను తిట్టి తిట్టి ముంచాడు. కాంగ్రెస్‌ను అంతే. కేంద్రంతో కలిసి ఉన్నన్ని రోజులు పొగిడి, కూటమి నుంచి బయటకు రాగానే ప్ర«ధాని మోదీని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. మళ్లీ ఈరోజు ఉనికి కోసం, మోదీ బ్రహ్మాండమైన నాయకుడు అంటున్నాడు. అయినా అనుకున్నది సాధించలేక పోతున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబుకు ఎటూ విలువ లేదు. ఇప్పుడు ఆయన కొడుకుది కూడా అదే పరిస్థితి. లోకేష్‌కు కూడా ఏ మాత్రం విలువ లేదు. తండ్రీ కొడుకులు ఇద్దరిపై ప్రజల్లో నమ్మకం లేదు. అందుకే దిక్కు తోచక నిత్యం మా ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా పిచ్చి విమర్శలు చేస్తున్నారు. ముగ్గురు పిల్లలున్నా తల్లికి వందనం (అమ్మ ఒడి పథకం)లో ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. వారు చెప్పేవన్నీ వాస్తవాంశాలని, ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. అందుకే సీఎంగారి కంటే ఇంకా ఎక్కువ ఏమేమో చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు. అది మోసం కాదా?: మేం ఇటీవల ఒకటి గమనించాం. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఏ హామీలైతే ఇచ్చాడో.. వాటినే నేడు తిరిగి చెబుతున్నారు. 2014లో చెప్పిన వాటినే 2024 ఎన్నికలకు ముందు కూడా చెబుతున్నాడంటే.. 2014 నుంచి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా, వాటిని నెరవేర్చనట్లే కదా? అంటే అది ప్రజలను మోసం చేయడమే కదా? మీ కరపత్రిక ఈనాడులో అప్పట్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ చూసే మాట్లాడుతున్నాం. చంద్రబాబుది అరిగిపోయిన రికార్డు. 2029లో కూడా మళ్లీ అవే మాటలు మాట్లాడతాడు. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నైజం. కాబట్టే చంద్రబాబు మాటలను ప్రజలు అస్సలు నమ్మడం లేదు. జగన్ ఏనాడూ మాట తప్పలేదు: రైతుల రుణాలు మాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చిన చంద్రబాబు, వారిని నమ్మించి అధికారంలోకి వచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఆ రుణమాఫీ సాధ్యం కాదని గట్టిగా నమ్మిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఆనాడు ఆ హామీ ఇవ్వలేదు. తనకు అధికారం కావాలనుకుంటే, తాను కూడా ఆనాడు ఆ హామీ ఇచ్చి ఉండేవారు. కానీ ఆచరణ సాధ్యం కాని వాటిపై ఆయన ఏనాడూ మాట ఇవ్వలేదు. అప్పుడు మా పార్టీ కేవలం ఒక్క శాతం ఓటు తేడాతో ఓడిపోయింది. అధికారం కోసం జగన్‌గారు ఏనాడూ అడ్డదారులు తొక్కలేదు. అలాగే ఇచ్చిన మాట తప్పలేదు. చేసేదే చెప్పారు. చెప్పిందే చేశారు. అదీ జగన్‌గారి వ్యక్తిత్వం. విధానం. పిలవని పేరంటానికి ఆరాటం ఎన్డీఏ పాతమిత్రులను పిలుస్తోందనుకుంటూ, తమకూ పిలుపు వస్తుందని తెలుగుదేశం పార్టీ ఆరాట పడుతోంది. నిజానికి బీజేపీ పిలవకపోయినా మళ్లీ కూటమి (ఎన్డీఏ)లోకి వెళ్లాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకే చంద్రబాబు ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నట్లు ఉన్నారు. అయితే అది ఆ రెండు పార్టీలకు సంబంధించిన అంశం. మేము దానిపై పట్టించుకోము. ప్రజల్లో పూర్తి ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ, ఎలాగోలా ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అధికారం కోసమే కలిసే ప్రయత్నం చేస్తే ఆ కూటమికి రంగు, రుచి, వాసన ఉండదు అని అన్నారు. మా పార్టీ అలా వ్యవహరించదు పార్టీ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం మా పార్టీ సిద్ధాంతం కాదు. మేము ఏనాడూ అలా వ్యక్తిగత విమర్శలకు దిగం. నిజానికి ఆ అలవాటు తెలుగుదేశం, జనసేన పార్టీలకే ఉంది. వైయస్‌గారి కుటుంబం విలువలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే మా పార్టీ కార్యకర్తలు కూడా ఏనాడూ ఆ విధంగా వ్యవహరించరు. రాజకీయాలు ప్రజలలో తేల్చుకోవాలనేది మా పార్టీ సిద్ధాంతం. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి వాస్తవానికి గతంలో చూస్తే ఎన్టీఆర్ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతీనే అక్రమంగా ఉంచుకున్నారని ఆనాడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ముద్ర వేశారు. అలాంటి వికృతమైన ఆలోచనలు వారివే. వ్యక్తిత్వ హననం చేసే అలవాటు టీడీపీకే ఉంది. రాజకీయాన్ని బురదగా మార్చిన వ్యక్తి చంద్రబాబు. అందుకే వారు దీని గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. పవన్‌కళ్యాణ్ కూడా ఆ తానులోని ముక్కే అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
వైఎస్సార్ జయంతి.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్వీట్
సాక్షి, ఢిల్లీ: మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. ‘‘వైఎస్సార్ తన చివరి శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేశారు. ప్రజలంటే ఎనలేని ప్రేమ కలిగిన నాయకుడు వైఎస్సార్. ప్రజలు, కాంగ్రెస్‌కు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిది’’ అంటూ ఖర్గే ట్వీట్ చేశారు. చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ 74వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా వైఎస్సార్‌కు వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. మహానేత జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి.. మహానేత సేవలను స్మరించుకున్నారు. A compassionate leader of the people, he steered the development and welfare of Andhra Pradesh till his last breath. Our homage to Former Chief Minister of Andhra Pradesh, Y. S. Rajasekhara Reddy on his birth anniversary. His contribution to public life and to the Congress… pic.twitter.com/oT4xh2mn31 — Mallikarjun Kharge (@kharge) July 8, 2023 -
వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, షర్మిల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 74వ జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. ►పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ అవినాష్‌రెడ్డి పూలమాల వేసి నివాళర్పించారు. ►దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో అనంతపురం జిల్లా నిర్వహించే వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల భీమా పరిహారాన్ని అందించనున్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ► అనంతపురం జిల్లాలో కార్యక్రమం అనంతరం వైఎస్సార్ జిల్లా పర్యటనకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పిస్తారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
రైతు బాంధవుడు వైఎస్సార్
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయం దండగ.. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసువాల్సిందే.. వ్యవసాయానికి సబ్సిడీలు, రాయితీలు వృథా అంటూ రైతులను చిన్నచూపు చూశారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికి తోడు ప్రకృతి కరుణ లేక 1995 నుంచి 2003 వరకు కరువు కరాళ నృత్యం చేయడంతో ‘అనంత’ రైతులు పొట్టచేత పట్టుకొని వలస బాట పట్టారు. సరిగ్గా అలాంటి సమయంలోనే నేనున్నానంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశాకిరణమయ్యారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా చేశారు. రైతును రాజుగా చేసిన వైఎస్సార్ జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా నిర్వహిస్తూ ఆ మహనీయున్ని స్మరిస్తోంది. ►బీమాతో ధీమా.. చంద్రబాబు హయాంలో లోపభూయిష్టంగా ఉన్న పంటల బీమాలో సమూలంగా మార్పు చేసి రైతులకు భరోసా ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందించారు. 2004–2009 మధ్య వైఎస్ హయాంలో వేరుశనగ రైతులకు పంటల బీమా కింద ఏకంగా రూ.1138 కోట్లు పరిహారం ఇచ్చారు. పంటకోత ఫలితాల ఆధారంగా పెద్ద ఎత్తున బీమా ఇవ్వడంతో అప్పట్లో రైతులు పండుగ చేసుకున్నారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద మరో రూ.100 కోట్లు ఇచ్చారు. ►అనుబంధ రంగాలకు పెద్దపీట.. ఒక్క వ్యవసాయానికే పరిమితం కాకుండా అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్ల తోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూతను అందించడంతో ఈ రంగాలు కూడా గాడినపడ్డాయి. రూ.25 కోట్లు ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీరవిప్లవానికి నాంది పలికారు. రూ.80 కోట్లు మేర సబ్సిడీ ఇవ్వడంతో 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో కొత్తగా పండ్లతోటలు విస్తరించాయి. రైతులకు బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. ఎస్సీ ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో సూక్ష్మసేద్యాన్ని భారీగా విస్తరించారు. వైఎస్ ఆరేళ్లకాలంలో రూ.280 కోట్లు బడ్జెట్ ఇవ్వడంతో కొత్తగా 1.13 లక్షల హెక్టార్లకు సరిపడా డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేశారు. మొత్తమ్మీద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ఏకంగా రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. ►రుణమాఫీతో అండ.. 2008లో కరువు పరిస్థితులు ఉండటంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వైఎస్సార్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్లు రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకాల కింద 3,61,269 మంది రైతులకు రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద రుణమాఫీ కింద 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్ల లబ్ధిచేకూరింది. ►రాయితీ విత్తనాలతో లబ్ధి.. ఏటా ఖరీఫ్, రబీలో రైతులు ఇబ్బంది పడకుండా లక్షల క్వింటాళ్లు వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. 2004 నుంచి 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్లు వేరుశనగ పంపిణీ చేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్సార్‌ను మరువలేం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలను రైతులెవరూ మరువలేరు. ఆయన పాలనలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పంటలు పండాయి. పండకపోయినా నష్టపరిహారం ఇచ్చి ఆదుకుని కరువు కాటకాలను గట్టెక్కించిన గొప్ప నాయకుడు. అనుకున్న సమయానికి రాయితీతో విత్తనాలు, ఎరువులు, డ్రిప్ పరికరాలు ఇచ్చారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఇప్పుడు వైఎస్ జగన్ ఇంకా ఎక్కువగానే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. – గొంచికారి కరియన్న, కై రేవు, శెట్టూరు. -
ఆపదొస్తే నేనున్నా.. మనసున్న మారాజు మా రాజన్న
జననేత వైఎస్సార్ ఏ నాయకుడైనా దశాబ్దాల తరబడి ప్రజల మనసులలో గూడు కట్టుకుంటే ఆయన గొప్ప నాయకుడు అవుతారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనసులలో తన తండ్రితో పాటు తను గుర్తుండిపోవాలని కోరుకుంటుంటారు. నిజమే! జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల స్మృతిలో ఎలా ఉండిపోగలిగారు? ఒక ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు కారణమా? ఆయనలోని మానవత్వ కోణం కారణమా? తనను కలిసి సాయం అభ్యర్ధించినవారందరికి ఏదో రూపంలో సహాయపడాలని భావించే వ్యక్తి కావడం కారణమా? వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా అనేక రూపాలలో జనం గుండెల్లో నిలిచిపోయారు. ఆయన ప్రాతినిద్యం వహించిన రాజకీయ పార్టీపై భిన్నాభిప్రాయం కలిగినవారైనా, ఆయన వ్యక్తిత్వం గురించి పాజిటివ్ గా మాట్లాడుకోవడం గొప్ప విషయం అని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకువచ్చిన కొన్ని స్కీములు చిరకాలం నిలిచిపోయాయి. ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు సైతం వాటిని కొనసాగించవలసి రావడమే వాటి గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు అప్పట్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ను ఆయన ప్రతిపాదించి అమలు చేసినప్పుడు తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు ఖర్చు పెడితే సరిపోతుందని వాదించేది. పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం కాని వైఎస్ ఆర్ పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని తలపెట్టి ఆ స్కీమ్ ను కొనసాగించారు. అప్పట్లో కొన్ని సన్నివేశాలను మాబోటి వాళ్లం చూసి ఆశ్చర్యపోయామంటే అతిశయోక్తి కాదు. ఒకసారి ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తూ అక్కడే ఉన్న మెడికల్ షాప్ కు వెళ్లాను. అక్కడ ఒక పేద వృద్దురాలు ఒక కార్డును కౌంటర్ లో ఇచ్చి కొన్ని మందులు తీసుకుంది. ఇంత వృద్దురాలు, అంతగా చదువు లేని ఈ మనిషి ఇంత పెద్ద ఆస్పత్రికి ఎలా వచ్చిందా? అన్న ఆసక్తి కలిగి ఆరా తీశాను. వైఎస్ ప్రభుత్వం అందించిన ఆరోగ్యశ్రీ కార్డు ఆధారంగా ఆమె వచ్చి డాక్టర్ కు చూపించుకుని మందులు కూడా తీసుకువెళుతోంది. ఆ రకంగా నిరుపేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నేతగా వైఎస్ ఆర్ నిలిచిపోయారు. (చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్) బాబుకు ఆనాడే చెప్పారు ఆయనకు నీటిపారుదల ప్రాజెక్టులంటే ప్రాణం. ఈ మాట ఏదో ఇప్పుడు చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఒకసారి హైదరాబాద్ జూబ్లిహాల్ లో ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం జరిగింది. లోక్ సభ సభ్యుడిగా అప్పట్లో వైఎస్ ఉండేవారు. ఆ సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ పోలవరం తదితర భారీ ప్రాజెక్టులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ, అలా చేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతావని హెచ్చరించారు. అయినా చంద్రబాబు ఆ మాటను సీరియస్ గా తీసుకోలేదు. కాకపోతే ఎన్నికల ముందు ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటూ హడావుడి చేసేవారు. 1999 ఎన్నికల తర్వాత వైఎస్ శాసనసభలో ప్రతిపక్ష నేత అయ్యారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో వైఎస్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు వేసిన శంకుస్థాపన రాళ్ల వద్ద పూలు పెట్టి నిరసన తెలిపేవారు. తదుపరి 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ప్రాదాన్యత క్రమంలో ఇరిగేషన్ కు సంబందించి ఒక అధికారిక సమావేశం మంత్రులతో నిర్వహించారు. ఆ సందర్భంగా శర్మ అనే సీనియర్ ఐఎఎస్ అధికారి ఉండేవారు. ఆయన ఆ సమావేశంలో ఒక నివేదిక ఇచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. నలభైఆరువేల కోట్ల రూపాయల వ్యయం చేస్తే ఇరవైతొమ్మిది ప్రాజెక్టులను చేపట్టవచ్చని వివరించారు. అప్పట్లో జెసి దివాకరరెడ్డి కూడా వైఎస్ క్యాబినెట్ లో ఉండేవారు. ఇంత పెద్ద నివేదికను చంద్రబాబుకు చూపించలేదా అని అడిగారు. దానికి ఆ అధికారి సమాధానం ఇస్తూ తాము చూపించామని, కాని అంత ఆసక్తి కనబరచలేదని, దాంతో దానిని పక్కనపెట్టామని చెప్పారు. ప్రభుత్వం చూపే శ్రద్దను బట్టే తాము నివేదికలు ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇది వాస్తవమే. చంద్రబాబు సి.ఎమ్. గా ఉన్న రోజుల్లో పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల గురించి ఎవరైనా అడిగినా సీరియస్ గా తీసుకునేవారు కారు. అవి అయ్యే ప్రాజెక్టులు కావని ఆయన భావించేవారు. ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని వైఎస్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేశారు. ఆ రోజు అధికారిక సమావేశం నుంచి బయటకు వచ్చి లిప్ట్ లో కిందకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న పాత్రికేయులను ఆయనే వాట్ సర్ అంటూ పలకరించారు. (చదవండి: అన్నదాత కలల పండుగ!) అలా మాట్లాడడం ఆయనకు అలవాటు. ఆ క్రమంలో నా వద్దకు కూడా ఆయన వచ్చారు. పోలవరం, పులిచింతల పూర్తి చేస్తారా? సార్ ? అని నేను ప్రశ్నించాను. అవును చేసి చూపిస్తాం సార్ అని జవాబు ఇచ్చారు. అదే విషయాన్ని ఆ తర్వాత తిరుపతి మీడియా సమావేశంలో కూడా వెల్లడించారు. పట్టు వదలని వైఎస్సార్ అయినా అవి అంత తేలికగా అవుతాయా అన్న సంశయం ఉండేది. కాని వైఎస్ ఆర్ మాత్రం పట్టు వదలిపెట్టలేదు. చంద్రబాబు టైమ్ లో పులిచింతల ప్రాజెక్టును నల్గొండ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నేతలు వ్యతిరేకించేవారు. దాంతో ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టిడిపి నేతలు ఈ ప్రాజెక్టు గురించి అడిగినా, ఇప్పుడు మాట్లాడవద్దంటూ వారిని వారించేవారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం సంబంధిత నాయకులను పిలిచి మాట్లాడి ఎవరైనా సహకరించాల్సిందేనని స్పష్టం చేసి పనులు ఆరంభించారు. అదే ఈరోజు కృష్ణా,గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు వరదాయిని అయింది. ఈ ఏడాది జూన్ మొదట్లో ఆశించిన మేర వర్షాలు పడలేదు. అయినా పులిచింతల ప్రాజెక్టులో నిల్వచేసిన నీటిని సాగునీటి అవసరాలకోసం ప్రభుత్వం విడుదల చేయగలిగింది. మహానేత ముందు చూపు పోలవరం ప్రాజెక్టు ఈ రోజు ఈ స్వరూపం సంతరించుకోవడానికి కారణం వైఎస్ ఆర్ అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఆయన పోలవరంపై అఖిలపక్షం పెట్టి దాని ఆనుపానులను చర్చించారు. అంతేకాదు. ఖమ్మం జిల్లాలో, పశ్చిమగోదావరి జిల్లాలో ముంపు ప్రాంతవాసులకు, నిర్వాసితులకు అప్పట్లో మంచి ప్యాకేజీ ప్రతిపాదించి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత కేంద్రం నుంచి ప్రాజెక్టుకు రావల్సిన అనుమతులు సంపాదించడంలో నిర్విరామకృషి చేశారు. అవన్ని ఒక రూపానికి వచ్చిన దశలో, ప్రాజెక్టు పనులు ఆరంభించబోయే టైమ్ కు ఆయన దురదృష్టవశాత్తు కన్నుమూశారు. అయినా ఆయన కలలు కన్న పోలవరం ఇప్పుడు సాకారం అవుతోంది. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా రాష్ట్ర విభజన సమయంలో ఒప్పుకోవడానికి అప్పటికే అన్ని అనుమతులకు ఓకే కావడం కూడా కారణం అని చెప్పాలి. అప్పట్లో పోలవరం కుడి, ఎడమ కాల్వల తవ్వకం చేపట్టి విశాలమైన కాల్వలను నిర్మించారు. ప్రాజెక్టు లేకుండా కాల్వలేమిటని అప్పట్లో టిడిపి విమర్శించేది. కాని వైఎస్ దూరదృష్టి ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు టైమ్ లో పట్టిసీమ లిప్ట్ ను చేపట్టగలిగారంటే దానికి కారణం వైఎస్ తవ్వించిన కాల్వే. ఈ రోజుల్లో ఈ కాల్వలకు భూ సేకరణ చేయాలంటే ఎంతో కష్టం అయ్యేది. ఈ రకంగా ఆయన చేసిన మేలును విభజిత ఆంద్రప్రదేశ్ ఎన్నటికి మరవదు. అదే కాదు. వెలిగొండ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ.. వాటన్నిటిపై ఎన్నో రకాలుగా విపక్షాలు అడ్డు తగలడానికి ప్రయత్నించినా ఆయన లెక్క చేయలేదు. అవే ఇప్పుడు ఎపికి ప్రాణపదంగా మారాయి. హైదరాబాద్ అభివృద్దికి అవుటర్ రింగ్ రోడ్డు ఎంతగా ఉపకరిస్తోందో చెప్పనవసరం లేదు. దానికి పునాదిరాయి వేసింది వైఎస్ ఆరే. భూ సేకరణ జరిపించింది ఆయనే. ప్రధానిని ఒప్పించిన వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని వాదించి ఆనాటి ప్రధానిని ఒప్పించిన ఘనత కూడా వైఎస్ దే. చంద్రబాబు నాయుడు టైమ్ లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం నిర్మించి మొత్తం హైదరాబాద్ నగరాన్ని తానే కట్టానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ హయాంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో సహా అనేక ఐటి పరిశ్రమలు ఆయన టైమ్ లో వచ్చాయి. కాని కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో విఫలం అయింది. అంతేకాక సోనియాగాంధీ మాట వినలేదన్న కక్షతో ఏకంగా వైఎస్ కుమారుడైన జగన్ స్థాపించిన పరిశ్రమలలో పెట్టుబడులపై పిచ్చి ఆరోపణలతో కేసులు పెట్టించి జైలులోకూడా నిర్భందించారు. దాని ఫలితమే ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది. రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారం లేకుండా పోయింది. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావాలని చాలా కష్టపడుతోంది. ఎపిలో అయితే ఆ ఆశ కూడా లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పట్టణాలలో రాజీవ్ గృహకల్ప వంటి స్కీములు చేపట్టారు. జిల్లా కేంద్రాలన్నిటిలో రోడ్లకు ఒక షేప్ తెచ్చి అందంగా తయారు చేయించడంలో ఆయన ప్రభుత్వ కృషి ఎంతగానో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అడిగితే కాదనని నేత వ్యక్తులుగా తనను కలిసినవారిపట్ల ఆయన ఎంతో ఆదరణ చూపించేవారు. ఉదాహరణకు పులివెందుల నుంచి నీరుకావి పంచె కట్టిన ఒక సామాన్య రైతు వచ్చి సెక్రటేరియట్ లో వైఎస్ ను కలిశారు. ఆయన తన ఇంటిలో పెళ్లికి ఆర్ధికసాయం అడిగారు. వెంటనే వైఎస్ ఎవరికో పోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఒక స్టార్ హోటల్ వద్దకు వెళ్లి డబ్బు తీసుకోవాలని సిబ్బంది చెప్పారు. ఆ రైతు అక్కడకు వెళ్లారు. ఆయన వెళ్లి ఒక పారిశ్రామికవేత్తను కలిసి సార్ వెళ్లమన్నారని చెప్పగా ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ఈ వ్యక్తికి ఐదు లక్షలు ఇవ్వడమా అని అనుకున్నారు. అసలు ఎందుకు ఈ డబ్బు వాడాలని అనుకుంటున్నది అడిగాడు. దానికి తన ఇంటిలో పెళ్లి గురించి ఆ రైతు చెప్పగానే చాలా సంతోషంగా ఆ పారిశ్రామికవేత్త డబ్బు అందచేశాడు. ఈ విషయాన్ని ఆ తర్వాత రోజుల్లో ఒక ప్రముఖుడు నాకు చెప్పారు. ఇలా ఒకటికాదు. ఉదయాన్నే ప్రజాదర్బార్ లో విన్నపాలు ఇవ్వడానికి వచ్చేవారందరిని పలకరించి వారి సమస్యలు వినేవారు. ఒకసారి ఒక వ్యక్తిని చూసి ఇదేమిటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగారు. మిమ్మల్ని కలవడానికే వచ్చానని అతను చెప్పారు. వెంటనే ఆయనను క్యాంప్ ఆఫీస్ లోని ఒక గదిలో కూర్చోబెట్టమన్నారు. దర్బార్ ముగిసిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆయన ఆర్దికసాయం కోసం వచ్చారు. ఆ వివరాలు తెలుసుకుని తను చేయదగిన సాయం చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే వైఎస్ కు క్లాస్ మేటే. తెనాలి నుంచి వచ్చిన ఆయనను అంత ఆదరంగా చూసి పంపించారు. ఇలా ఎన్నో ఘట్టాలు వైఎస్ చరిత్రలో ఉన్నాయి. ఆ 30 సీట్లు ఎంతో కీలకం ఇక రాష్ట్ర విభజనపై ఆయన అభిప్రాయాలు అందరికి తెలిసినవే. అందులో రాజకీయ కోణాలు ఎలా ఉన్నా, వైఎస్ జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నది ఎక్కువ మంది నమ్మకం. 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి మొత్తం బాధ్యతను తన భుజ స్కందాల మీద వేసుకుని పార్టీని గెలిపించారు. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రాగలిగిందంటే ఎపి నుంచి వచ్చిన ముప్పైకి పైగా లోక్ సభ సీట్లు ఎంత కీలకం అయ్యాయో చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ కి వచ్చేసరికి కాంగ్రెస్ కు 156 సీట్లే వచ్చాయి. అధికారం వచ్చినా ఆ సీట్ల సంఖ్య తనకు సంతృప్తి కలిగించలేదు. అందుకే తనకు ప్రజలు పాస్ మార్కు మాత్రమే ఇచ్చారని, వచ్చేసారి ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేలా పాలన చేస్తానని నిజాయితీగా తన అభిప్రాయాన్ని వైఎస్ ఆర్ చెప్పారు. ఒక నేత లేకుంటే రాష్ట్రం ఎన్ని గండాలను ఎదుర్కుంటుందో చెప్పడానికి ఆ రోజుల్లో చాలా మంది వైఎస్ లేని లోటు గురించి ఉదహరించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ప్రస్తుతం విభజిత ఎపిలో అంతకు మించిన పాలన అందించడమే కాదు. వైఎస్ ఆర్ ను నిత్యం జనం గుండెల్లో ఉండేలా చేస్తూ, ఆయన జయంతిని ఒక పండగలా మార్చారు. ఏ కుమారుడు తన తండ్రికి ఇంతకన్నా గొప్ప నివాళి అర్పించలేడని రుజువు చేసుకుంటున్నారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
జెడ్పీలో కారుణ్య నియామకాలు
కడప సెవెన్‌రోడ్స్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్‌లో జూనియర్ సహాయకులుగా, ఆఫీసు సబార్డినేట్‌గా కారుణ్య నియామకాలు కల్పించారు. శుక్రవారం జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారు తమ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతూ మరోవైపు ఉద్యోగ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు. జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైళ్లు ఆలస్యం లేకుండా క్లియర్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా కారుణ్య నియామకాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పదోన్నతులు జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న ఏడుగురికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినట్లు జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అంకాలమ్మ గూడూరులో పని చేస్తున్న ఎస్.రాంప్రతాప్‌ను బి.మఠం ఎంపీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. కలసపాడు ఎంపీపీలో ఉన్న బి.గుర్రప్పను బి.కోడూరుకు, వల్లూరు ఎంపీపీలో ఉన్న వి.చంద్రకళను కడప జెడ్పీకి, కడప డీఎండబ్ల్యూఓ కార్యాలయంలో పని చేస్తున్న ఎస్.కరీముల్లాను చెన్నూరు ఎంపీపీకి, బద్వేలు ఎంపీపీలో పని చేస్తున్న ఓ.శారదమ్మను అక్కడే నియమించారు. ఎర్రగుంట్ల ఎంపీపీలో పని చేస్తున్న పి.శేఖర్‌ను జమ్మలమడుగు, వేంపల్లె జెడ్పీ హైస్కూలులో పని చేస్తున్న బి.రఘునాథరెడ్డిని పులివెందులకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షులు బాలయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి, ఏఓ రంగాచార్యులు, పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు లంకా మల్లేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ ఆకేపాటిని వారు ఘనంగా సత్కరించారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డిగారి 74వ జయంతిని పురష్కరించుకుని ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో వైఎస్ర్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రధాన నగరాల్లో కేకులు కట్ చేసి ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఎన్ఆర్ఐ కార్యవర్గ సభ్యులు ఆయా నగరాల్లో పాల్గొన్నారు. వైసీపీ పార్టీ నాయకులూ వెంకట్ మేడపాటి, చల్లా మధు, శిల్పా రవి, మల్లాది విష్ణు, మోదుగుల వేణుగోపాల రెడ్డి, అబ్బయ్య చౌదరి, గంగుల బ్రిజేంద్రలు ఈ సందర్భంగా జూమ్ కాల్ ద్వారా మాట్లాడి వైస్సార్ గారు చేసిన పనులను మరొక్కసారి గుర్తు చేసుకుని, జగన్ గారు తండ్రిని మించిన పాలన అందిస్తున్నారని, అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసీపీ నాయకులు రాజశేఖర్ లంకెల, శ్రీధర్ గూడ,ఇన్నారెడ్డి, విజయ్ కర్నాటి , బిజివేముల రఘు రెడ్డి, యుగంధర్ అల్లం, వంశి చాగంటి,నర్రెడ్డి ఉమా శంకర్, మర్రి కృష్ణ రెడ్డి, కందుల భరత్, గాయం శ్రీనివాస్ రెడ్డి, లెక్కల బ్రహ్మానంద రెడ్డి, బొమ్మిరెడ్డి జస్వంత్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. (చదవండి: వైఎస్సార్ జయంతికి అమెరికాలో భారీ ఏర్పాట్లు) -
మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు’’ అని సీఎం ట్విటర్లో పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక… pic.twitter.com/KsdlyNd2uM — YS Jagan Mohan Reddy (@ysjagan) July 7, 2023 చదవండి: మరపురాని మహానేత -
ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ విజయమ్మ, షర్మిల
వైఎస్సార్: ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, కుటుంబ సభ్యులు అంజలి, రాజారెడ్డిలు శుక్రవారం ఇడుపులపాయ చేరుకున్నారు. షర్మిల సాయంత్రం 4.30గంటలకు కడప ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అంతకుమునుపే వైఎస్ విజయమ్మ వచ్చారు. నేడు (శనివారం) వైఎస్సార్ జయంతి సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 7.30గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. కార్యక్రమంలో వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఆర్ఎల్వీ ప్రసాద్‌రెడ్డి, బంకా సోమేశ్వరరెడ్డి, రామగంగిరెడ్డి, శ్రీనివాసులు, ఎస్టేట్ మేనేజర్ భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత కలల పండుగ!
సాక్షి ప్రతినిధి, కడప : ప్రజల సంక్షేమం, సమాజ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను శనివారం జిల్లా వాసులు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగానే అన్నదాతలకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన డాక్టర్ వైఎస్సార్ రైతులు, కార్మికులతోపాటు అన్ని వర్గాల వారి అభ్యున్నతికి అహర్నిశలు పనిచేశారు. రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుందని నమ్మి వ్యవసాయరంగం అభివృద్ధికి చర్యలు చేపట్టారు.2004లో ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని పరుగులు పెట్టించారు. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గా, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చారు. జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, పశువైద్యవిద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ ఆస్పత్రి, దంత వైద్యకళాశాల నిర్మించారు. ట్రిపుల్ ఐటీ, ఐజీ కార్ల్ (పశు పరిశోధన కేంద్రం), దాల్మియా సిమెంటు కర్మాగారం, గోవిందరాజా స్పిన్నింగ్ మిల్స్, భారతి సిమెంటు కర్మాగారం, సజ్జల పాలిమర్స్ లాంటి పరిశ్రమలను నెలకొల్పారు. సుమారు రూ.12 వేల కోట్లతో జలయజ్ఞంలో భాగంగా గాలేరు–నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నల్, గండికోట వరద కాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలు వైఎస్సార్ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వరాయసాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, పైడిపాళెం, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే తెలుగుగంగ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలతో బ్రహ్మంసాగర్‌ను నింపి ఆయకట్టుకు ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ చేతుల మీదుగా నీటిని విడుదల చేయించారు. జిల్లాలో విశాలమైన రోడ్లు వేయించారు. ఎవరు ఏది అడిగినా కాదనకుండా పనిచేసిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో అభివృద్ది పథకాలతోపాటు సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేశారు. నేడు జిల్లాలో వైఎస్సార్ జయంతి వేడుకలు శనివారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు పార్టీలకతీతంతగా సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్లో దివంగత నేతకు నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేపట్టనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పాలాభిషేకాలు, వివిధ ఆస్పత్రులల్లో రోగులకు సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. తండ్రి బాటలో తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తూ అదేబాటలో పయనిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని ప్రకటించి, తూచ తప్పకుండా నాలుగేళ్లుగా నాలుగు అడుగులు ముందుకు వేశారు. బీడు భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడే రైతులకు విత్తనాలు, ఎరువులు, పనిముట్లను అందజేస్తున్నారు. వ్యవసాయ పరమైన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రైతుల ముంగిట్లోకి తెచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా ద్వారా జిల్లాలో 2019–20లో 2,06,708 మంది రైతులకు రూ.279.93 కోట్లు, 2020–21లో 2,08,747 మందికి రూ.280 కోట్లు,2021–22లో 1,99,344 మందికి రూ.269.11 కోట్లు అందించారు. అలాగే 2022–23 ఏడాదిలో 1,90,074 మంది రైతులకు రూ.192.96 కోట్లు మొత్తంగా జిల్లాలోని రైతులకు రూ.1,022 కోట్లు అందజేశారు. భూములు లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు సైతం ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన ఉద్యాన, వ్యవసాయ రైతులను ఆదుకునేందుకు డాక్టర్ వైఎస్సార్ పంటల బీమా అమలు చేస్తున్నారు. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలోని 3,80,475 మంది రైతులకు రూ.1,063.22 కోట్లు బీమా వర్తించింది. జిల్లాలో ఖరీఫ్, రబీలలో కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు స్థానికంగానే అందిస్తున్నారు. రైతులకు అవసరమైన అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూ రైతు రాజ్యాన్ని నెలకొల్పారు. రైతులతోపాటు అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. మరోవైపు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తద్వారా నిరుద్యోగ చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. మొత్తంగా రాజన్న రాజ్యాన్ని మరిపించే రీతిలో సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. -
గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహా మనిషి వైఎస్సార్: సీఎం జగన్
Updates: ►తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహా మనిషి వైఎస్సార్: సీఎం జగన్ ►వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం ►ఏ పథకం చూసిన గుర్తుకొచ్చే నేత వైఎస్సార్ ►వైఎస్సార్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు గుర్తొస్తాయి. ►దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంటబీమా పరిహారం జమ చేస్తున్నాం ►2022 ఖరీఫ్ బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం ►రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుంది. ►ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు ►మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు ►గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నాం. ►అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీఎం జగన్ చేరుకున్నారు. వైఎస్సార్ రైతు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారాన్ని అందించారు. ►అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. కాసేపట్లో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొనున్నారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించే వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొననున్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 2022– ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 10.2 లక్షల మందికి రైతులకు లబ్ధి కలిగిస్తూ రూ.1,117 కోట్ల బీమా పరిహారం విడుదల చేస్తారు. తద్వారా ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,36,950 మంది రైతులకు రూ.212.94 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. అనంతరం సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని మహానేతకు నివాళులర్పిస్తారు. 9న గండికోటకు సీఎం జగన్ ఈనెల 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని, రాణితోపులో నగరవనాన్ని, గరండాల రివర్ ఫ్రెంట్ వద్ద కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్–1 పనులను, పులివెందులలో నూతనంగా నిర్మించిన (వైఎస్సార్ ఐఎస్‌టీఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏపీ కార్ల్‌లో న్యూటెక్ బయో సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమికి ప్రారం¿ోత్సవం చేస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు కడపలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కొప్పర్తిలో పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తొలి సంతకం.. చరిత్రాత్మకం.. రైతులకు ‘పవర్’
(ఎస్.పి.యూసుఫ్ – కర్నూలు రాజ్‌విహార్/ సాక్షి, అమరావతి) : రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకం లక్షలాది మంది అన్నదాతల తలరాతలు మార్చింది. 2004కు ముందు చంద్రబాబు పాలనలో రైతులు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకొని, అందుకు సంబంధించిన డబ్బు చెల్లించి ఏళ్లు గడిచినా కనెక్షన్ మంజూరు అయ్యేది కాదు. అప్పుడు.. ఇప్పుడు అంటూ జాప్యం చేసేవారు. వర్షం పడి, నాటుకున్న పంట ఎండిపోయే దశలో ‘డబ్బు కట్టాను.. పంటను కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న స్తంభం నుంచి తీగలు పెట్టుకొని మోటర్ ఆన్ చేసుకొని నీళ్లు పెట్టుకుందామంటే కేసుల పేరుతో బెదిరించే వాళ్లు. పంటలు రాక, మద్దతు ధరలు లేక బిల్లులు చెల్లించని పక్షంలో బిల్లుల బకాయిలపై జరిమానాలు విధించేవారు. రాత్రి కరెంటుతో ఎన్నో కష్టాలు పడ్డారు. బావి, బోర్లలో నీళ్లు ఉన్నా.. విద్యుత్ సమస్యలు తప్పేవి కావు. భార్య బిడ్డలకు దూరంగా పొలంలో రాత్రంతా జాగరణ చేసినా పోలాన్ని తడుపుకోలేక సతమతమయ్యేవారు. మెయిన్ సప్లై ఆఫ్, బ్రేక్ డౌన్లు, ట్రిప్పింగ్ల కారణంగా అంతరాయం ఏర్పడితే ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు. దీంతో రైతులు రాత్రంతా పొలాల్లో నిద్ర మేలుకుని పడిగాపులుపడేవారు. ‘అసలు వ్యవసాయమే దండగ’ అని నాటి పాలకుడు చంద్రబాబు రైతులను చులకనగా చూశారు. తొలి సంతకం.. చరిత్రాత్మకం రైతు కష్టాలను నాడు పాదయాత్రలో కళ్లారా చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి 7 గంటల పాటు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారు. ఈ హమీపై అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు ‘ఉచిత విద్యుత్ కాదు.. తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’ అంటూ హేళన చేశారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పైనే వైఎస్సార్ తొలి సంతకం పెట్టి సాహసోపేతంగా ఆ హామీని ఆచరణలో పెట్టారు. అప్పటి వరకు ఉన్న విద్యుత్ కనెక్షన్ల రూ.కోట్ల బకాయిలు రద్దు చేయడంతో పాటు ప్రతి ఏటా దరఖాస్తు చేసుకున్న రైతులకు ఉచిత కనెక్షన్లు ఇస్తూ వచ్చారు. ఏటా కోటాను పెంచారు. 2014లో 9 గంటల హామీ ఇచ్చి.. నీరుగార్చిన బాబు 2014 ఎన్నికలకు ముందు వ్యవసాయానికి 9 గంటల హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా అటకెక్కించారు. రైతులు భార్య పిల్లలను పట్టించుకోకుండా అస్తమానం పొలాల్లో జాగరణ చేసేవారు. కటిక చీకట్లో విష పురుగుల మధ్య గడపాల్సి వచ్చేది. ఎందరో పాము కాట్లకు బలయ్యారు. రాత్రి కరెంటుతో ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడ్డారు. ఒక్కో రోజు కనీసం మూడు నాలుగు గంటలు కూడా కరెంట్ సరఫరా అయ్యేది కాదు. పైగా ఫీడర్లు బాగా దెబ్బతిన్నా పట్టించుకోలేదు. నేడు పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చంద్రబాబు హయాంలో రాత్రి కరెంటు వల్ల ఇబ్బందులు పడిన రైతుల వేదన విన్న వైఎస్ జగన్ పగలే 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామని పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 7 గంటల నుంచి 9 గంటలకు సరఫరా పెంచి అమల్లోకి తెచ్చారు. అందుకు దాదాపు రూ.1800 కోట్లు ఖర్చు చేసి సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు, ఫీడర్ల సంఖ్యను పెంచడంతో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో నాలుగేళ్లుగా వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందుతుండడంతో రైతులు నిశ్చితంగా ఉన్నారు. మరింత మెరుగ్గా సరఫరా కోసం స్మార్ట్ మీటరింగ్ వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది. వ్యవసాయ సరఫరా, మోటారు వాడకాన్ని బట్టి కొంత విద్యుత్ (లైన్‌లాస్) వృధా అవుతుంది. దీనిని నివారిస్తే విద్యుత్ ఆదా కావడంతో పాటు మెరుగైన విద్యుత్ అందుతుంది. కనెక్షన్ వద్ద మీటరు ఏర్పాటు చేస్తే ఆ రైతు నెలకు ఎన్ని యూనిట్లు వాడుతున్నాడో తెలియడంతో పాటు నెల నెలా ఆ యూనిట్లకు అయ్యే సొమ్మును ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుంది. ఆ డబ్బును తిరిగి విద్యుత్ పంపిణీ సంస్థకు రైతు చెల్లిస్తాడు. దీని వల్ల రైతుకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోగా.. విద్యుత్ సంస్థకు జవాబుదారీతనం, బాధ్యత పెరుగనుంది. రైతన్నకు అన్ని విధాలా భరోసా ►దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూముల సాగుదారులకు ‘వైఎస్సార్ రైతు భరోసా‘ కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. ► విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నకు అన్ని సేవలు గ్రామంలోనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)లను తీర్చిదిద్దారు. వీటి ద్వారా ధృవీకరించిన, కల్తీలేని నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల పంపిణీతో పాటు ఈ – క్రాప్ నమోదు చేస్తున్నారు. ►అర్హులైన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, పంట నష్ట పరిహారం వంటి సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా ఈ–క్రాప్ ప్రామాణికంగా ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ►ఆర్బీకేల ద్వారా కల్లాల వద్దే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా జీఎల్టీ (గోనె సంచులు, ధాన్యం లోడింగ్‌కు హమాలీ ఖర్చులు, ధాన్యాన్ని కల్లం నుంచి కేటాయించిన మిల్లుకు చేర్చే వరకు రవాణా చార్జీలు) రూపేణా క్వింటాల్‌కు మద్దతు ధరకు అదనంగా రూ.300 అందిస్తోంది. యంత్ర సేవా కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబ్స్ ►రూ.2,016 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ►దళారులు, కమీషన్ ఏజెంట్లకు స్వస్తి పలుకుతూ మహిళా డెయిరీ సహకార సంఘాల ద్వారా పాలు సేకరిస్తున్నారు. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు లీటర్ గేదె పాలకు రూ.22 వరకు, ఆవు పాలకు రూ.11 వరకు అదనపు లబ్ధి చేకూర్చారు. ►విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం రూ.213.27 కోట్ల వ్యయంతో నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 10 పరీక్ష ల్యాబొరేటరీలు, 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు నిర్మిస్తోంది. తొలి దశలో 75 ల్యాబ్‌ల సేవలు అందుబాటులోకి రాగా, నేడు మరో 52 ల్యాబ్‌లను ప్రారంభిస్తున్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 127 ల్యాబ్‌ల సేవలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం రూ.1,70,769.23 కోట్ల మేర రైతులకు లబ్ధి కలిగించింది. ఇదివరకెన్నడూ లేనంతగా పరిహారం ►దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ►వరుసగా నాలుగో ఏడాది 10.20 లక్షల మందికి రూ.1,117.21 కోట్ల బీమా పరిహారాన్ని నేడు జమ చేయనుంది. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందించింది. ►రైతుల తరఫున ప్రభుత్వమే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తోంది. అలాంటప్పుడు వీలైనంత ఎక్కువగా పరిహారం రావాలని కోరుకుంటుంది. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా కొంత మంది టీడీపీ నేతలు పరిహారానికి ప్రభుత్వం కొర్రీ వేసిందని ఆరోపించడం.. వాటిని పచ్చ పత్రికలు పతాక శీర్షికన వండి వార్చడం దుర్మార్గం. దటీజ్ వైఎస్ జగన్ ►కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన హరిజన బడేసావు 2018 జూలై 9వ తేదీన ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకొని, అందుకు సంబంధించిన డబ్బు చెల్లించాడు. సీనియారిటీ పేరుతో విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయలేదు. వైఎస్ జగన్ వచ్చాక కనెక్షన్ మంజూరైంది. ఇలా ఒక్క సి.బెళగల్ మండలంలోనే 37 మంది రైతులకు కనెక్షన్లు ఇచ్చారు. ► ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వేల దరఖాస్తులు క్లియర్ చేశారు. ప్రస్తుతం రైతు దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో అంచనా (ఎస్టిమేట్లు) వేస్తున్నారు. ఒక్కో రైతుకు సుమారు రూ.65 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు వెచ్చించి నెల రోజుల్లో విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. ►ఈ పథకం కింద 2023 మే 30 నాటికి రాష్ట్రంలో 19,11,032 కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ల కోసం మాత్రమే రూ.2,205.79 కోట్లు ఖర్చు చేసింది. 1.69 లక్షలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. రోజుకు 6.30 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ప్రతి ఏటా ఉచిత విద్యుత్ కోసం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వెచ్చిస్తోంది. ►వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు రూ.1,700 కోట్లతో ఫీడర్లు, సబ్ స్టేషన్లను ఆధునీకరించారు. రానున్న 30 ఏళ్ల పాటు రైతన్నలకు ఉచిత వ్యవసాయ విద్యుత్తుకు ఢోకా లేకుండా ఎస్ఈసీఐతో ఒప్పందం చేసుకుని 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నిమ్మ తోటను పొయ్యి కింద కట్టెల్లా అమ్మి.. ఈ రైతు పేరు గొడ్డేటి నారాయణరెడ్డి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు గ్రామం. దశాబ్దాలుగా నిమ్మతోట సాగు చేస్తూ జీవిస్తున్నాడు. 2004కు ముందు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక, బిల్లులు చెల్లించలేక ఒక పర్యాయం ఎండిపోయిన తోటను వంట చెరకుగా అమ్ముకున్నాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉచిత విద్యుత్ అందిచడంతో తిరిగి నిమ్మ మొక్కలు నాటుకుని, తోట నుంచి రాబడి పొందుతున్నాడు. ఈ పథకం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు. చంద్రబాబు హయాంలో రాత్రి పూట అరకొర విద్యుత్‌తో ఇబ్బందులు పడ్డాడు. నాలుగేళ్లుగా పగటి పూటే కరెంట్ ఇస్తుండటంతో ఆనందంగా సాగులో నిమగ్నమయ్యాడు. శోకం.. ఆనందం.. పరిమళం కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు ఎస్.మునిస్వామి. తనకున్న పొలంలోని బోరులో రెండు ఇంచుల నీరు ఉండడంతో పత్తి, ఇతర పంటలు పండించుకుంటున్నాడు. 2004 ఏప్రిల్ నాటికి తన విద్యుత్ కనెక్షన్ల బకాయి రూ.24 వేలకు చేరింది. కట్టేందుకు డబ్బు లేక, విద్యుత్ సిబ్బంది ఒత్తిళ్లు తట్టుకోలేక తన రెండెకరాల పొలం అమ్ముకుందాం అనుకున్నాడు. నాడు అతని పొలం ఎకరం ధర రూ.10 వేల వరకు మాత్రమే ఉండేది. రెండెకరాలు అమ్మినా బకాయి తీరదని ఆందోళన చెందుతున్న సమయంలో మహానేత ఇచ్చిన ‘ఉచిత విద్యుత్’ హామీ అతనిలో ధైర్యం నింపింది. ఆ తర్వాత వైఎస్సార్ సీఎం కాగానే రూ.24 వేల బకాయి మాఫీ అయ్యింది. మహానేత తదనంతరం ఎప్పుడు కరెంట్ వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక ఇక్కట్లు పడ్డాడు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పగలే 9 గంటలు సరఫరా చేస్తుండడంతో మల్లెపూలు, కూరగాయలు పండించుకుంటున్నాడు. మల్లె పంట మంచి లాభాలు తెచ్చిపెడుతోందని సంబరపడుతున్నాడు. రాత్రి కరెంటు కష్టాలు తీరాయని, మెరుగైన విద్యుత్ అందించేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే తప్పేమీలేదని, పైగా జవాబుదారీతనం పెరుగుతుందని చెబుతున్నాడు. -
జలయజ్ఞం చేసిన అపర భగీరథుడు
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పలు రకాలుగా వారి సేవలను తెలుగు ప్రజలు స్మరించుకుంటు న్నారు. ఒక వ్యక్తి గొప్పదనం వారి తదనంతరం వారిని గుర్తు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదే ప్రజానేత అయితే వారు తీసుకునే నిర్ణయాల సార్వజనీనతను బట్టి ఉంటుంది. ఆ కోణంలో చూసినప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా చేసిన పోరాటాలూ, తీసుకున్న నిర్ణయాలూ ఆంధ్రప్రదేశ్ రాజకీ యాలలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రస్థానంలో వారిని చిరస్థాయిగా నిలిచిపోయేట్లు చేశాయి. ఎందరో మహానుభావులు రాయలసీమ ఉద్యమాన్ని నడి పారు. దాన్ని ప్రజా ఉద్యమంగా మలచడంలో వైఎస్ విజయం సాధించారు. జాతీయ పార్టీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న వైఎస్ ఒక ప్రాంత సమస్యపై పోరాటంలో పాల్గొనడం సాహసం. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అంటారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే 294 నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే 52 నియో జక వర్గాలు ఉన్న రాయలసీమ అంశాలపై ఎందుకు మాట్లాడ తారు? రాయలసీమ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన కారణంగా... కేవలం చెన్నై నగరానికి త్రాగు నీరు కోసం రూపొందించిన ‘తెలుగు గంగ’ తిరుపతి వరకూ రాగలిగింది. కీలకమైన పోతిరెడ్డిపాడు సమస్య సమాజం ముందుకువచ్చింది. రాయలసీమ ఉద్యమంలో వైఎస్ ప్రస్థాన ఫలితమే ‘జల యజ్ఞ’ రూపకల్పన. వెనుకబడిన ప్రాంత అస్తిత్వ ఉద్యమంలో కీలక అంశంగా నీటి సమస్య ఉంటుంది. వైఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నది జలయజ్ఞం. ఏపీలోని అన్ని ప్రాంతాలకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం రూపొందించారు. పోలవరం, దుమ్ముగూడెం టేల్ పాండ్, పులిచింతల, గాలేరు– నగరి, హంద్రీనీవా, పోతిరెడ్డి పాడు, సిద్ధేశ్వరం లాంటి ప్రాజెక్టులు నేడు ప్రజల ముందు ఉన్నాయి అంటే అది వైఎస్ దూర దృష్టి ఫలితమే. ఆధునిక కాలంలో ఆంగ్లేయుల తర్వాత మొత్తం తెలుగు ప్రజలకు శాశ్వత నీటి పరిష్కారం కోసం దూర దృష్టితో ఆలోచించింది రాజశేఖర రెడ్డి అనే చెప్పాలి. జలయజ్ఞం పేరుతో అన్ని ప్రాజెక్టుల నిర్మాణం ఒకేసారి చేపట్టడం సరికాదని చాలా మంది వాదించారు. అలాంటి వాదనలకు వైఎస్ చెప్పిన సమాధానం ‘రాష్ట్ర నీటి సమస్య పరిష్కారానికి నేడు రూపొందించిన ప్రాజెక్టులు మన హయాంలో పూర్తి కాకపోయినా ప్రజలు పోరాడి సాధించుకుంటారు.’ అది వైఎస్ ఆలోచన. అలా ఆయన ఆలోచన చేయకుండా ఉంటే పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌గా మారి ఉంటుందా? వారు ఊహించిన విధంగా నేడు ప్రజలు ప్రాజెక్టులు పూర్తి చేయాలని పోరాడుతున్నారు. ప్రభుత్వాలు తమ ప్రాధాన్యత అంశంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్న వైఎస్. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యమ డిమాండ్లకుఅత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. అందులో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వెడ ల్పునూ, శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టాన్నీ పెంచాలని నిర్ణయించడం వంటివి కొన్ని మాత్రమే. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వెడల్పు పెంచడం అవసరం. వరద సమయంలో నీటి హక్కు లేని ప్రాజెక్టులకు నీరు విడుదల చేయడానికి వీలుగా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వెడల్పును 12 వేల క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 44 వేల క్యూసెక్కుల సామ ర్థ్యానికి పెంచారు. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా జీఓ ఇచ్చినా రాజకీయ కుట్రల కారణంగా దాని అమలు సాధ్యం కాలేదు. దాని ఫలితం నేడు రెండు రాష్ట్రాల సమస్యగా మారింది. గండికోట ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడంతో బాటు కుందూ నదిపై జోలదరాసికీ, రాజోలుకూ శంకుస్థాపన చేశారు. అలాగే సిద్ధేశ్వరం అలుగు ఆలోచన చేశారు. కానీ వారి మరణాంతర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇవి సాకారం కాకపోవడంతో నేటికీ రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కాలేదు. గోదావరిపై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చిరకాల వాంఛ. ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఓ కొలిక్కి రాలేదు. కానీ నీటి సమస్య గురించి అవగాహన కలిగిన వైఎస్ అత్యంత వ్యయంతో కూడిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూను కున్నారు. కేంద్రాన్ని ఒప్పించి అన్ని అనుమతులూ మంజూరు చేయించుకొని కుడి ఎడమ కాల్వల నిర్మాణం చేపట్టారు. ‘ప్రాజెక్టు పూర్తి కాకుండానే కాల్వల నిర్మాణం’ అంటూ విప క్షాలు చేసే విమర్శలకు వెరవలేదు. విభజన సమయంలో పోలవరానికి జాతీయ హోదా లభించింది అంటే అది వైఎస్ కృషి ఫలితమే. అదీ నీటి ప్రాజెక్టులపై వైఎస్‌కున్న నిబద్ధత, దూరదృష్టి. అదే సమయంలో అపార నీటి వనరులు ఉన్న గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వినియోగించే ప్రయ త్నంలో భాగంగా దుమ్ముగూడెం పథకాన్ని రూపొందించి 500 కోట్లతో ప్రాథమిక పనులు పూర్తి చేశారు. విభజన సమయంలో పోలవరంలో భాగంగా 165 టీఎమ్సీల సామర్థ్యం కలిగిన దుమ్ముగూడేనికి జాతీయ హోదా వచ్చి ఉంటే తెలంగాణలో కొంత భాగం, కృష్ణా, గోదావరి డెల్టాలకు గోదావరి నీళ్లూ; వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, దక్షిణ తెలంగాణ ప్రాజె క్టులకు కృష్ణ నీటినీ వినియోగించే అవకాశం ఉండేది. వైఎస్ మరణం, విభజన సమయంలో దూరదృష్టి లేని నేతల కార ణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. శంకుస్థాపనకే పరిమితం అయిన గాలేరు–నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. ఫలితంగా నీటి హక్కులు లేకపోయినా మూడు ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన విధంగా నిర్మాణం చేసుకోవచ్చని విభజన చట్టంలో అనుమ తించారు. వైఎస్ ఆశించిన శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెంపు, సిద్దేశ్వరం, గుండ్రేవుల, కుందూపై నిర్మాణాలు... ముఖ్యంగా దుమ్ముగూడెం పథకం పూర్తి అయితే రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. విపక్ష నేతగా సీమ హక్కుల కోసం పోరాటం, అధికారంలోకి వచ్చిన తర్వాత సాకారం కోసం ప్రయత్నాలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ ప్రస్థానంలో ఎప్పటికీ చిరస్మరణీయులు. వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త ‘ 94904 93436 -
విశాఖపై చెరగని సంతకం
ఆయన చూపులు... సుదీర్ఘ పరిచయపు చిరునవ్వును చిందిస్తూ, అందరి వైపూ ఆత్మీయంగా ప్రసరిస్తాయి. ఆయన చేతులు... సదా ఏదో ఇవ్వడానికే తామున్నట్టు ఓ ఆత్మీయ స్పర్శో, చల్లని దీవెనో కురిపిస్తుంటాయి. ఆయన పాదాలు.. ఆపన్నుల్ని ఆదుకునేందుకు, బడుగుల బతుక్కి కొత్త భరోసా ఇచ్చేందుకు నిరంతరం తపిస్తుంటాయి. ఆయన తెలుగునాట గుండె కింద ఆరని తడి.. ఏళ్లు గడిచినా మరపురాని జ్ఞాపకాల జడి... సాక్షి, విశాఖపట్నం : మహానేత వైఎస్సార్ మానస పుత్రికగా విశాఖ నగరం ఉజ్వలంగా వెలుగొందింది. ప్రతి రంగంలోనూ ప్రగతికి బాటలు వేసి.. పల్లె, పట్టణమని తేడా లేకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో అభివృద్ధికి నాంది పలికారాయన. లెక్కలేనన్ని ప్రతిపాదనలకు కార్యరూపమిచ్చారు. అభ్యున్నతికి ఆలంబనగా సాగిన వైఎస్సార్ పాలనలో విశాఖ.. సరికొత్తగా ఆవిష్కృతమైంది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యపు కోరల్లో పాలన సాగించడంతో.. ప్రగతి గతి తప్పి.. విశాఖ వైభవానికి చెదలు పట్టాయి. ముఖ్యమంత్రిగా 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. విశాఖ నగరం విశ్వనగరంగా దూసుకుపోతోంది. త్వరలో పరిపాలనా రాజధాని కానుంది. శనివారం వైఎస్సార్ జయంతి సందర్భంగా రాజన్న చేపట్టిన అభివృద్ధి.. సంక్షేమాలను గుర్తు చేసుకుందాం. దేశంలోని టాప్ నగరాల్లో ఒకటిగా దేశంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం అమలైన 63 నగరాల్లో వైజాగ్‌ను చేర్చిన ఘనత వైఎస్సార్‌దే. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ని ర్మాణ పథకం (జెఎన్ఎన్యూఆర్ఎం)లో విశాఖ నగరాన్ని చేర్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో నగరానికి రూ.1,885 కోట్ల విలువైన పనులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 శాతం కూడా ఎప్పటికప్పుడు జీవీఎంసీకి అందజేసేలా చర్యలు తీసుకున్నారు. సింహాచలం, పెందుర్తి బీఆర్టీఎస్ కారిడార్లు, ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్, విలీన గ్రామాలకు తాగునీటి సౌకర్యంతోపాటు భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన 20 ప్రాజెక్టులను వైఎస్సార్ తీసుకొచ్చారు. సెంట్రల్ సిటీలో రూ.244 కోట్లతో 750 కి.మీ మేర యూజీడీ పనులు చేపట్టారు. యువతకు ఉపాధి... భవితకు పునాది 2008 జనవరి 2వ తేదీన ఉపాధి పథకాన్ని వైఎస్సార్ ప్రారంభించారు. రూ.5 కోట్లను కేటాయిస్తూ 18–35 ఏళ్ల మధ్య వయసున్న యువతకు 13 అంశాల్లో శిక్షణ ఇచ్చి, ఆ శిక్షణ సంస్థల ద్వారానే 70 శాతం వరకూ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్స్, సర్ఫేస్ ఆర్నమెంట్స్.. మొదలైన అంశాల్లో శిక్షణ తీసుకొని ఉపాధి పొందిన వారెందరో ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా విస్మరించేశారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే.. సచివాలయ వ్యవస్థను రూపొందించి 4 లక్షలకు పైగా ఉద్యోగాలను అందించారు. అంతర్జాతీయ హోదా ఆయన ఘనతే... హైదరాబాద్‌కే పరిమితమైన అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులను విశాఖ ప్రజలకూ పరిచ యం చెయ్యాలని వైఎస్సార్ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా రూ.100 కోట్లు వెచ్చించి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో విమానయాన సంస్థలకు అందించాల్సి న రాయితీలు చెల్లించకపోవడంతో అనేక సర్వీసులు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో మళ్లీ సర్వీసులు మొదలయ్యాయి. అంతే కాకుండా మొదటి సారిగా.. విశాఖ నుంచి సరకు రవాణా కోసం కార్గో సర్వీసు కూడా ప్రారంభమైంది. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కూడా చేశారు. విశాఖ ఐటీకి జీవం.. ఐటీ ప్రగతి ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వికేంద్రీకరణ జరగాలని వైఎస్సార్ భావించారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టా రు. విశాఖలో మూడు కొండల్ని, కొండల కింద ఉన్న సుమారు 100 ఎకరాల పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. కనీసం 100 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఐటీ కంపెనీలకు మాత్రమే అవకాశమిచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్లాట్లుగా డివైడ్ చేసి అందించారు. వైఎస్ ఆలోచనలను మెచ్చి సుమారు 200 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందులో కొద్ది కాలంలోనే 70 శాతం కంపెనీలు కార్యకలాపాల్ని ప్రారంభించాయి. సత్యం, విప్రో కంపెనీలూ విశాఖలోనూ శాఖలను విస్తరించాయి. వైఎస్సార్ మరణం తర్వాత.. ఆయనతోపాటే ఐటీ గ్రాఫ్ కూడా కనుమరుగైపోయింది. ఎగుమతులు పడిపోయాయి. టీడీపీ హయాంలో ఒక్కొక్క కంపెనీ వెనక్కు వెళ్లిపోయాయి. దాదాపు పదేళ్లు విశాఖ ప్ర‘గతి’ తప్పింది. మళ్లీ 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఐటీ రంగం పరుగులు పెడుతోంది. విశాఖ నగరంలో ఇన్ఫోసిస్ కార్యకాలపాలకు సిద్ధమైంది. డేటా ఆదాని సెంటర్ శంకుస్థాపన జరిగింది. దీంతో విశాఖ ఐటీ కళ సంతరించుకుంది. విమ్స్ ఆయన చలవే.. ఉత్తరాంధ్ర ప్రజలకు హైదరాబాద్ నిమ్స్ తరహాలో అత్యుత్తమ సేవలు అందించేందుకు విమ్స్‌కు 2006లో వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. 1,130 పడకలు, 21 సూపర్ సెషాలిటీ బ్లాకులతో రూ.250 కోట్లతో విమ్స్ ఆస్పత్రికి 2007లో శంకుస్థాపన చేశారు. 2009 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. వైఎస్సార్ మృతిచెందాక విమ్స్‌ని ఆ తరువాత వచ్చిన ప్రభు త్వాలు పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం విమ్స్‌ని ప్రైవేట్ పరం చేసేందుకు కుయుక్తులు పన్నింది. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ ఈ ప్రయతాన్ని అడ్డుకుంది. గతంలో కోవిడ్ సమయంలో విమ్స్‌ని స్టేట్ కోవిడ్ హాస్పిటల్‌గా మార్చింది. ప్రస్తుతం అటు విమ్స్, ఇటు కేజీహెచ్ రోగులకు అత్యుత్తమ సేవలందిస్తున్నాయి. గ్రేటర్ హోదా కల్పించి.. ఏళ్ల తరబడి వాయిదాలు పడిన మహా విశాఖ ప్రతిపాదనలు వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫలించాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2005 నవంబర్ 22న జీవీఎంసీకి గ్రేటర్ హోదా కల్పిం చారు. అప్పటి వరకూ 111 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న విశాఖ 540 చ.కి.మీ విస్తీర్ణంతో మహా విశాఖగా అవతరించింది. 2013లో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలని విలీనం చేయగా ప్రస్తుతం 681.96 చ.కి.మీ.లకు విస్తరించింది. 72 వార్డులతో ఉన్న జీవీఎంసీని విస్తరిస్తూ 81 వార్డులు ఏర్పాటు చేస్తామంటూ టీడీపీ ప్రభుత్వం హడావుడి చేసి విస్మరించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. జీవీఎంసీ వార్డుల విస్తరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. మరో 10 పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేస్తూ.. ప్రస్తుతం 98 వార్డులుగా మార్చారు. మహా నగరంలో పర్యటించిన ప్రతిసారీ.. నిరుపేదలను చూసి చలించిపోయిన వైఎస్సార్.. వారికో గూడు కల్పించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్ గృహకల్ప ఇళ్లకు శ్రీకారం చుట్టారు. విశాఖ నగర పరిధిలో సుమారు లక్షకుపైగా పునరావాస, పూర్ సెటిల్మెంట్ కాలనీలు నిర్మించారు. రాజీవ్ గృహకల్ప ద్వారా రూ.650 కోట్లతో 15,320 ఇళ్లు, జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా 600 కోట్లతో 15 వేల గృహాలు, వాంబే కింద రూ.400 కోట్లతో 9 వేల ఇళ్ల నిర్మించారు. మధురవాడలో గృహ సముదాయాలు ఆయన చేతుల మీదుగానే ప్రారంభమయ్యాయి. -
నెట్టింట అభిమానం.. మహానేత మురిసిపోయిన వేళ..
ఈరోజు.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారాయి. ఏ గ్రామంలో చూసినా సచివాలయం కనిపిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా కూడా 50 మందికి ఒక వాలంటీర్ కనిపిస్తాడు. మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో రూపురేఖలు మారిపోయిన ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తున్నాయి.. ఇంకో నాలుగు అడులేస్తే.. విలేజ్ క్లినిక్ కనిపిస్తోంది.. ఆ విలేజ్ క్లినిక్‌లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆధారంగా అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించే డాక్టర్ కనిపిస్తున్నాడు.. దేశానికి రైతన్న వెన్నెముక అయితే.. ఆ రైతన్న చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థకు పల్లెలే కేంద్రాలయ్యాయి జగనన్న ప్రభుత్వం వేసే ప్రతీ అడుగుతోనూ పల్లె మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాడు జాతిపిత మహాత్మా గాంధీ.. మొన్న తండ్రి వైఎస్సార్ కలగంది.. నేడు జగనన్న సాధించిన గ్రామ స్వరాజ్యం ఇది! ‘‘గ్రామాలు అన్నింటా గణతంత్రంగా వ్యవహరించగలగాలి. సొంత అవసరాలకోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాధించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది’.. మహాత్ముడు చెప్పిన మాటల్ని ఆ మహానేత కలగన్నాడు. కానీ, అది పూర్తిస్థాయిలో జరగలేదు. అయితే ఆ గ్రామ స్వరాజ్యం ఇప్పుడు.. తన బిడ్డ పాలనలో కనిపిస్తోంది. అందుకే ఆ దివంగత నేత మురిసిపోతున్నారు!. పల్లెలు దేశానికి పట్టుకోమ్మలు. గ్రామాలు బాగుంటేనే ఆ రాష్ట్రం.. దేశం బాగుంటాయి. అందుకే పల్లె ప్రగతి ప్రధానంగా ప్రతీ అడుగు వేయాలని మహానేత తలిచారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగారు. కానీ, గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చేయడం మాత్రం ఆ మహానేత బిడ్డ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే సాధ్యమయ్యింది. జులై 8వ తేదీన వైఎస్సార్ జయంతి. కానీ, అంతకంటే ముందుగానే అభిమానుల కోలాహలం నెట్టింట కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘‘నేను కన్నకల.. నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ’’.. అంటూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరిట ఆ ఫొటో వైరల్ అవుతోంది. పల్లె ప్రగతిని కోరుకున్న వైఎస్సార్‌కు గౌరవ సూచీగా.. ఆయన జయంతిని ‘గ్రామీణ స్వరాజ్య దినోత్సవం’గా ప్రకటిస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిమానులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతుండడం గమనార్హం. అధికారంలోకి రాగానే గ్రామ స్థాయిలో సచివాలయం ఏర్పాటుకు చేస్తాను-వైఎస్ జగన్ #YSR8thVardanthi #YSRKutumbam — YSR Congress Party (@YSRCParty) September 2, 2017 సీఎం వైఎస్ జగన్.. చెప్పాడంటే చేస్తాడంతే.. మాట ఇస్తే మడమ తప్పని నైజం.. పేరుతో పలకరింపు.. అన్నదాతల కోసం తాపత్రయం.. జనసంక్షేమమే ధ్యేయం.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమాగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం. ఇవన్నీ కలగలిపిన రూపం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. ఆయన గుణాలు పుణికిపుచ్చుకున్న బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు జనానికి పెద్ద బిడ్డ అయ్యాడు. జగనన్న సంక్షేమ పాలనలో ఆ మహానేత.. జనం చిరునవ్వు రూపంలో ఇంకా మనమధ్యే ఉన్నాడు. -
నాకు తెలిసిన వైఎస్సార్...|
నాకు తెలిసిన వైఎస్సార్...| ప్రజలకు సేవకుడు పేదలకు దేవుడు రాజకీయాలకు రాజనీతిజ్నుడు తెలుగునేలకు యుగపురుషుడు అన్నదాతలకు ఆపద్భాంధవుడు అక్కాచెల్లెమ్మలకు తోడబుట్టినవాడు బీళ్లలో నీళ్లు నింపిన భగీరథుడు కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడిచిన కారణజన్ముడు కష్టకాలంలో వెంటున్నవారికి కాపాడుకున్న నాయకుడు తరతరాలకు ఆదర్శప్రాయుడు నడకలో నవతరానికి మార్గదర్శకుడు నడతలో దార్శనికుడు సంక్షేమ రాజ్యం సైనికుడు అభివృద్ధి కాముకుడు YSR it is not a name it is a emotion of Millions of Hearts.💓#YSRJayanthi #LegacyLivesOn @ysjagan @realyssharmila pic.twitter.com/tsOIgAbZl2 — Johar YSR (@raviredss) July 7, 2023 నేను చూసిన వైఎస్సార్...| నిలువెత్తు సంస్కారం, విలువెత్తు ఆకారం గుడిలేని దైవం, గుండె గుండెను కదిలించే గుణం ఆదర్శమైన వ్యక్తిత్వం, పేదలంటే మమకారం నడిచొచ్చే నమ్మకం, పడిలేచిన కెరటం పంచెకట్టిన పోరాటం, రాజీపడని రాజసం తలెత్తుకు తిరిగే తెలుగు తేజం, తలదించడం తెలియని ధైర్యం మట్టిని ప్రేమించే మానవత్వం, మరణం లేని రూపం మరపురాని అభిమాన శిల్పం ప్రతీ తెలుగువాడి గుండె చప్పుడు YSR pic.twitter.com/pT8DDp2xXj — Rmkr Pegs (@rmkr_pegs) July 3, 2023 నేను మరవని వైఎస్సార్..| ఆకలిలేని ఆంధ్రను ఆవిష్కరించారు అక్షర జ్ఞానం అందరికీ అందించారు కరువు నేలపై వరుణుడిని కురిపించారు కర్షకుల కళ్లల్లో నీళ్లు తుడిచారు ఆరోగ్యశ్రీతో ప్రాణం పోశారు అభాగ్యులకు ఆరోగ్య భరోశానిచ్చారు పసిగుండెలను పదిలంగా కాపాడారు పాడిపంటలను పరవశింపజేశారు పరిపాలనలో కీర్తి శిఖరమై నిలిచారు గుండెతో పాలించారు పాలనతో ప్రతి గుండెను చేరారు చెమటజీవుల చీకట్లలో వెలుగు నింపారు బడుగు జీవుల పాలిట వేగుచుక్కలా నిలిచారు పావలా వడ్డీతో పరపతిని పెంచారు ఉపాధి హామీతో ఊతమై నిలిచారు నిలువనీడలేని నిరుపేదలకు నీడనిచ్చారు నాలాంటివారెందరికో జీవితాన్నిచ్చారు ఆకాశమంత ఎత్తుకి ఎదిగారు ఆకాశ మార్గాన మాయమైపోయారు ఆశయాన్ని వారసునికి వదిలారు కర్తవ్యాన్ని కార్యసాధకునికి విడిచారు ఆయనొక విజన్.. ఆయన జీవితం ఒక ఆదర్శం ! YSR ముందు.. YSR తరువాత అనేలా పాలించిన ఘనత ఆయన సొంతం.#YSRJayanthi #LegacyLivesOn pic.twitter.com/m3Yd0AyL2M — Johar YSR (@raviredss) July 7, 2023 ఆంధ్రుల గుండెల్లో.. తెలుగు ప్రజల ఆలోచనల్లో.. తెలుగునేల చరిత్ర పుటల్లో వెయ్యేళ్లు వర్థిళ్లు రాజన్నా....| ఇట్లు.. YSR అభిమాని నిద్దాన సతీష్ -
వైఎస్సార్ జయంతికి అమెరికాలో భారీ ఏర్పాట్లు
చెదరిపోని గుండె బలం... నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు మన వైయస్ రాజశేఖరుడు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జులై 8, 1949న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి, సెప్టెంబర్ 2, 2009న అనూహ్యంగా హెలికాప్టర్ కూలిన ఘటనలో కన్నుమూశారు. ఆయన జయంతిని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్సిపి నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జులై 8, 2023 శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు 13869 పార్క్ సెంటర్ రోడ్, హెర్న్‌డన్, వర్జీనియాలో ఈ కార్యక్రమం జరగనుంది. అమెరికాలో పర్యటిస్తోన్న YSRCP సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్‌ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అమెరికాలోని వైఎస్సార్సిపి కన్వీనర్లు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాతో డా.వైఎస్సార్‌కు అనుబంధం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అమెరికాలోని ప్రవాసాంధ్రులతో ప్రత్యేక అనుబంధం ఉంది. మే 6, 2007న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అమెరికాలో పర్యటించారు. నాడు ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముఖ్య అతిథిగా డా.వైఎస్సార్‌ను ఆహ్వానించింది. షికాగో వేదికగా ఎన్నారైలను ఉద్దేశించి వైఎస్సార్ చేసిన ప్రసంగం.. ఇప్పటికీ చాలామంది ఎన్నారైల మదిలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలు, సంక్షేమం, అభివృద్ధి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మహానేత వైఎస్సార్‌ను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాం. హాజరు కావాలనుకుంటున్న వారు తప్పనిసరిగా ఆన్లైన్లో ఈ ఫాం పూరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ►ఫాం పూరించడానికి ఇక్కడ క్లిక్ చేయండి నాటి గవర్నర్ అర్నాల్ ష్క్వార్జ్ నెగ్గర్ తో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫైల్: డా.వైఎస్సార్ అమెరికాలో పర్యటించినప్పటి దృశ్యం -రత్నాకర్, అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వైఎస్సార్సీపీ -
వైఎస్సార్ జయంతికి ఆస్ట్రేలియాలో భారీ ఏర్పాట్లు
ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అన్ని ప్రధాన నగరాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు జూమ్ ద్వారా ఆస్ట్రేలియాలోని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. -
NATA Convention : అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
డల్లాస్, అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి జూన్ 30 నుంచి జులై 2 వరకు డల్లాస్‌లో జరిగిన నాటా తెలుగు మహాసభల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. పెద్దసంఖ్యలో హాజరైన రాజన్న అభిమానులు, నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని కొనియాడారు ప్రవాసాంధ్రులు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. (నాటా పూర్వ అధ్యక్షులు రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి) ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ & ట్రైనింగ్ చల్లా మధుసూధన్ రెడ్డి, నాటా పాస్ట్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, నాటా సభ్యులు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల, ఏపీ ఎన్ఆర్టీ మేడపాటి వెంకట్, అమెరికా వైస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి, వైస్సార్సీపీ నేతలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ చేసిన సేవల్ని, ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజాసేవ వైపు అడుగులు వైఎస్సార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎం.ఆర్.మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లోనూ హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (నాటా వేదికగా జరిగిన వైఎస్సార్ జయంతికి హాజరైన ప్రముఖులు) ఓటమి ఎరుగని నేత 1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. ఉత్తాన పతనాలు వైఎస్సార్ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 1980లో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ తిరిగి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో వైఎస్సార్ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పార్టీని విజయపథం వైపు నడిపించిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లోనూ వైఎస్సార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు. వైఎస్సార్ సిపి @ నాటా వేడుకల కన్వెన్షన్ నాటా వేడుకల సందర్భంగా విచ్చేసిన అతిథులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేకంగా స్వాగతం పలికింది. డాలస్ లోని కన్వెన్షన్ సెంటర్ వద్ద తోరణాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ పరిపాలన ముఖ్యాంశాలను ప్రదర్శించింది. (అమెరికా డాలస్ లోని నాటా వేదిక) అమెరికాతో డా.YSRకు అనుబంధం మే 6, 2007న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారిక కార్యక్రమం కోసం అమెరికాలో అడుగుపెట్టారు. ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముఖ్య అతిథిగా డా.వైఎస్సార్‌ను ఆహ్వానించింది అమెరికా ప్రభుత్వం. మే 8న మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం ఎలా వెన్నెముకగా నిలవాలన్న విషయాన్ని చర్చించారు. షికాగో వేదికగా ఎన్నారైలను ఉద్దేశించి వైఎస్సార్ చేసిన ప్రసంగం.. ఇప్పటికీ చాలామంది ఎన్నారైల మదిలోనే ఉంది. తెలుగుదనం ఉట్టిపడేలా రాజసమైన పంచెకట్టులో ఎన్నారైలపై చెరగని ముద్ర వేశారు రాజశేఖరరెడ్డి. తన చిరకాల మిత్రుడు ప్రైమ్ హాస్పిటల్స్ అధినేత ప్రేమ్‌సాగర్ రెడ్డితో కలిసి వివిధ వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. (చదవండి: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం: నాటా తెలుగు మహా సభలనుద్దేశించి సీఎం జగన్) -
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు: మహానేతకు ఘన నివాళి
న్యూ జెర్సీ: డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో మన్రోలో థాంప్సన్ పార్కులో వైస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జులై పదిన జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆళ్ళ రామిరెడ్డి, డాక్టర్ రాఘవ రెడ్డి , హరి వెళ్కూర్, అన్నారెడ్డి, రఘురామి రెడ్డి, ప్రభాకర్ చీనేపల్లి, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, సత్య పాతపాటి, ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, భానోజీ రెడ్డి, నగేష్ ముక్కమల్లతో పాటు పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలలో వైఎస్సార్ జయంతి జరుపుకోవడం ఆయనకిచ్చే ఘన నివాళి అని ఆళ్ళ రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ ఫౌండేషన్ తరపున వాటర్ ప్లాంట్స్, హెల్త్ క్యాంప్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్స్, కూరగాయల సరఫరా లాంటి ఎన్నో కార్యక్రమాల నిమిత్తం వైస్సార్ అభిమానులు ఈ రెండేళ్లలో రెండు కోట్లకు పైగా సహాయం చేశారన్నారు. నాటా ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవ రెడ్డి గోసల మాట్లాడుతూ వైఎస్సార్ పధకాలు ఎంతో మంది పేదలకు ఉపయోగపడితే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలతో పాటుగా ‘నాడు నేడు’, ఇంగ్లీష్ మీడియం మరింత సమర్ధ వంతంగా అమలుచేయడం గర్వకారణమన్నారు. వైఎస్సార్ అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్నారని అందుకు ఉదాహరణే ఇక్కడకు వచ్చిన అభిమానులని ప్రభాకర్ చీనేపల్లి పేర్కొన్నారు. డా.మూలే రామమునిరెడ్డి రాసిన కవితను కృష్ణమోహన్ రెడ్డి చదివి వినిపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మనోహర్ కడివెటి, అనిల్ రెడ్డి, బాలకృష్ణ బోడిరెడ్డి, ఆళ్ళ బసివి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి పాల్వాయి, చంద్ర రెడ్డి, ఇందిరా శ్రీరామ్ రెడ్డి, కోటి రెడ్డి, కృష్ణ కళ్ళం, లక్ష్మారెడ్డి, నాగరాజా రెడ్డి, నాగేంద్ర ముక్కమల్ల, నాగిరెడ్డి భీమవరపు, నాగిరెడ్డి ఉయ్యురు, నరేష్ అన్నం, పద్మనాభ రెడ్డి, రామ్ వేమిరెడ్డి, సంజీవ రెడ్డి బెక్కం, శ్రీధర్ గుడేటి, శ్రీనివాస్ గుండేటి, సూరి తాడి, తాతా రెడ్డి, తిమ్మా రెడ్డి, విజయ్ గోలి, వీర ప్రతాప్ రెడ్డి, వెంకటరెడ్డి కాగితాల, వెంకట శివ మద్దిగపు, ఆళ్ళ వికాస్ రెడ్డి, వినయ్ వాసిలి, వినోద్ ఎరువతో పాటు 300కి పైగా అభిమానులు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు. -
సియాటెల్‌లో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు: స్పెషల్ ఫుడ్ డ్రైవ్
వాషింగ్టన్: జులై 8న మహానేత డా.వైయస్సార్ 73వ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైయస్సార్ అభిమానులు ఫుడ్ డ్రైవ్ సేవాకార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలనతో, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన చెరగని ముద్రవేసి ప్రజలగుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానేత డా. వైఎస్సార్ అని కొనియాడారు. ఈ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైఎస్సార్ అభిమానులు రెండు వేల డాలర్లతో ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సేవాకార్యక్రమాలలో పాల్గొని స్వయానా ఫుడ్ డ్రైవ్ డ్రాప్ బాక్సులు, ఫుడ్ డ్రైవ్ ప్యాకెట్లు తయారు చేసివాటిని ఆకలితో ఉన్నవారికి అందించి మహానేత జయంతిని ఘనంగా నిర్వహించారు. మహానేత సువర్ణపాలన, గొప్ప నాయకత్వ లక్షణాలు, ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ పలువురు అభిమానులు వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు. ఆయన గొప్పతనం తెలుసుకున్న స్థానిక అమెరికన్లు సైతం అబ్బురపోవడం విశేషం. అలాంటి నాయకులను పొందడం అదృష్టం అని పేర్కొన్నారు. ఆ మహానేత పేరుతో క్రమం తప్పకుండా తమ ప్రాంతాలలో ఫుడ్ డ్రైవ్‌లు, సేవా కార్యక్రామాలు ఏర్పాటు చేస్తున్న అభిమానులని అభినందించి కృతజ్ఞతలు తెలియజేసారు.. ఈ వేడుకలలో భాగంగా ఫుడ్ డ్రైవ్ & సేవాకార్యక్రమాలలో తమ సహాయసహకారాలు అందించిన విక్రమ్ రెడ్డి గార్లపాటి సువీన్ రెడ్డి గారికి, చెన్నా రెడ్డి మహీధర్ రెడ్డి రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు జేసి రెడ్డిమునీశ్వర్ రెడ్డి , దామోదర్ అన్నకు, రామ్ , లోకనాథ్ , శేఖర్ గుప్త, విన్నకోట, భాస్కర్ రావికంటి , Dr వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ - USA అండ్ ఆళ్ళ రామిరెడ్డితోపాటు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయసహకారాలు అందించిన అందరికీ వైఎస్సార్ అభిమాని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు -
కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
కాలిఫోర్నియా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.వైఎస్‌రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జులై 10వ తేదీ ఉదయం,ఆహా ఇండియన్ హోటల్లో జయంతి వేడుకలను నిర్వహించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం,. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మహానేత అని వైఎస్సార్సీపీ అమెరికా గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కేవీరెడ్డి గుర్తు తెచ్చుకున్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విద్యార్థుల సంక్షేమం కోసం ఫీజు రీ ఎంబర్సుమెంట్, రైతులకు రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన అన్నారు . వైఎస్సార్ స్పూర్తి, ఆశయాలతోవారి కుమారుడు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్స పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్సీపీ అమెరికా కమిటీ ముఖ్య సభ్యులు సురేంద్ర అబ్బవరం, కిరణ్ కూచిభట్ల , సహదేవ్ బోడె , తిరుపతిరెడ్డి , వెంకట్ , అంకిరెడ్డి , ఆనంద్ బందార్ల, అశోక్, ప్రశాంతి, అమర్ బడే తదితరులు వైఎస్సార్ సేవలను, సంక్షేమ పాలనను వారితో గల అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. వారి తనయుడు ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమలో బే ఏరియా వైస్సార్ అభిమానులు హరి, కొండారెడ్డి , త్రోలోక్ , సుబ్బారెడ్డి , రామిరెడ్డి , నరేంద్ర కొత్తకోట, వినయ్, ఇతర వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం నాయకులూ పాల్గొన్నారు. -
సియాటెల్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
సియాటెల్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డెబ్భై మూడవ జన్మదిన వేడుకలు సియాటెల్ నగరంలో వైఎస్సార్సీపీ యూఎస్ఏ సియాటెల్ అండ్ పోర్ట్లాండ్ రీజియన్ టీం , దుష్యంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్సార్ అభిమానులు, సీఎం జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ యూఎస్ఏ(సీటెల్ అండ్ పోర్ట్లాండ్) టీం మునీశ్వర్‌రెడ్డి, ప్రకాష్ కొండూరు, అనిల్‌రెడ్డి, పృథ్వీరాజ్, సువీన్రెడ్డి, జయంద్రారెడ్డి, అజయ్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, చంద్రసేన, సునీల్ బలభద్ర, కృష్ణారెడ్డి, బాలరెడ్డి, మధురెడ్డి, శివ వెదురుపర్తి, సుమన్‌రెడ్డి, ప్రణీత్ మరియు వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి వైఎస్సార్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దుష్యంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తన పరిపాలనలో ప్రవేశపెట్టిన పథకాలైన వైఎస్సార్ జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలతో ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని, ఆ మహానేత ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని స్మరించుకున్నారు. ప్రకాశ్ కొండూరు మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్‌తో తనకున్న మొదటి పరిచయాన్ని నెమరువేసుకున్నారు. -
ఏపీ భవన్లో ఘనంగా వైఎస్ జయంత్యుత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి, రైతు దినోత్సవ ఉత్సవాలను శుక్రవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత రైతు సమాఖ్య కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ అని ఆయన కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఇది కూడా చదవండి: 2024 తర్వాత బాబు ఏమైపోతాడోనని భయమేస్తోంది -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు!
అమెరికాలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా వైఎస్సార్ అభిమానులు అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించారు నార్త్ వెస్ట్ అమెరికా సియాటెల్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకల్ని ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన వంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి,సువీన్ రెడ్డి, చెన్నా రెడ్డి, మహీధర్ రెడ్డి, రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు,జేసి రెడ్డి, మునీశ్వర్ రెడ్డి, దామోదర్, రామ్, లోకనాథ్, శేఖర్ గుప్త విన్నకోట, భాస్కర్ రావికంటి, ఆళ్ళ రామిరెడ్డిలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్లీనరీ: పోటెత్తిన అభిమానం
-
జనం ఎత్తిన జెండా
ఈ జెండా... అయాచితంగా అందుకున్నది కాదు. కుట్రలతో లాక్కున్నదీ కాదు. ఇది... ఇచ్చిన మాట కోసం... వ్యవస్థలన్నిటినీ గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేశ అత్యున్నత నాయకత్వాన్ని ఢీకొట్టి నిలిచిన ఓ యువకుడికి జనమిచ్చిన గౌరవం!. ఒక్కడిగా మొదలుపెట్టి ఈ రాష్ట్రంలోని ప్రతి ఊళ్లోనూ తన సైన్యాన్ని సృష్టించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం!. అందుకే ఇది జనం ఎత్తిన జెండా!!. పన్నెండేళ్లుగా ఇంతకు ఇంతై ఎదుగుతూ... ఎగురుతున్న వైఎస్సార్సీపీ జెండా... శుక్రవారం ప్లీనరీ పండగలో పులకించిపోయింది. మూడేళ్ల కిందట ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ జగన్... కష్టాల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తూ ప్లీనరీని ఆరంభించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచీ హాజరైన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు జై జగన్నినాదాలతో ప్లీనరీని హోరెత్తించేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఒంటరి పోరాటం సాగిస్తున్న తన కుమార్తెకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది కనక... తాను వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్ష పదవిని వీడుతానని వై.ఎస్. విజయమ్మ ప్రకటించగానే వద్దు వద్దంటూ శ్రేణులు నినదించాయి. కానీ ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఆమె భావోద్వేగపూరితంగా వివరించిన మీదట... అంతా ఆమె నిర్ణయానికే జై కొట్టారు. ప్రజా సేవలో 45 ఏళ్ల తమ బాంధవ్యాన్ని గుర్తుచేస్తూ... వైఎస్ జగన్ గెలుపు మళ్లీ తథ్యమనే విశ్వాసం వ్యక్తం చేశారామె. ఇక ప్రతి ఊళ్లో బడి, ఆసుపత్రి బాగుపడుతూ భవిష్యత్తు మెరుగుపడుతుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని, ప్రజలకు సంక్షేమం చేకూర్చడమంటే అభివృద్ధి కాదని ఎవరైనా చెప్పగలరా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షాలను నిలదీశారు. సీఎం స్ఫూర్తిదాయకమైన స్వాగతోపన్యాసం కార్యకర్తలలో ఫుల్‌జోష్‌ను నింపగా నాలుగు తీర్మానాలపై తొలిరోజు నేతలు చేసిన ప్రసంగాలు ఆలోచింపజేశాయి.... రెండో రోజు కోసం ఎదురు చూసేలా చేశాయి. వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్సీపీ ప్లీనరీ అంటే.. ఆ పార్టీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఎంతగానో ఎదురుచూసే కార్యక్రమం. ఇంకో మాటలో చెప్పాలంటే అత్యంత ఇష్టమైన పండుగ. ఈ వేదికపై గతాన్ని మననం చేసుకుని, వర్తమానాన్ని విశ్లేషించుకుని.. భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసుకోవడం జరుగుతుంది. మూడేళ్ల క్రితం అధికారాన్ని చేపట్టాక తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో.. తొలి రోజున ప్రతినిధుల సభకు అంచనాలకు మించి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలోని 26 జిల్లాల నుంచి కార్యకర్తలు ప్లీనరీకి పోటెత్తారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గావించి.. శుక్రవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్.. అనంతరం తల్లితో కలిసి ప్లీనరీ జరిగే వైఎస్సార్ ప్రాంగాణానికి చేరుకున్నారు. ఉరిమే ఉత్సాహం.. చిరు జల్లుల ఆహ్వానం వైఎస్సార్ ప్రాంగణానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోక ముందే లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. శ్రేణుల ఉరిమే ఉత్సాహం నడుమ.. చిరు జల్లుల మధ్య.. ఆహ్లాదకర వాతావరణంలో వైఎస్సార్సీపీ జెండాను పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత శ్రేణుల హర్షధ్వానాల నడుమ ప్లీనరీ వేదికపైకి చేరుకున్న సీఎం.. తల్లి విజయమ్మ, పార్టీ నేతలతో కలిసి మహానేత వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కష్టాలు గుర్తు చేసుకుంటూ.. చేసిన మేలును వివరిస్తూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మహాభినిష్క్రమణం నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అవమానాలను సహిస్తూ.. కష్టాలను భరిస్తూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నా అంటూ సీఎం వైఎస్ జగన్ ప్లీనరీ ప్రారంభోపన్యాసాన్ని ఆరంభించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడానికి.. అందరి ఆత్మాభిమానం కోసం ఆవిర్భవించిన పార్టీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ప్రజలకు చేస్తున్న మంచిని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగానికి శ్రేణుల నుంచి విశేష రీతిలో స్పందన లభించింది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. అధికారమంటే ప్రజల మీద మమకారం చూపించడమేనని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నామని శ్రేణులకు గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేయడం ద్వారా పరిపాలనలో.. ప్రజల జీవన ప్రమాణాల్లో.. సామాజిక, విద్య, ఆర్థిక న్యాయం చేయడమంటే ఇలా అని.. మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేయడమంటే ఇలా అని నిరూపించామని సీఎం వివరించారు. ప్రజలకు మేలు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక.. అసూయతో చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం, దత్తపుత్రుడితో జాయింట్‌గా ఏర్పడిన గజ దొంగల ముఠా సాగిస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టారు. ప్రజల ఇంట ఉన్న మన గెలుపు ఆపటం వారి వల్ల కాదు కాబట్టే రాక్షస గణాలన్నీ ఒక్కటవుతున్నాయన్న పదునైన విమర్శలకు శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. గజదొంగల ముఠా దాష్టీకాలపై మనమంతా ఆలోచన చేసి.. ప్రజలకు ఆలోచన కలుగజేసేలా చేసేందుకు ప్లీనరీలో తీర్మానాలు ఉపయోగపడతాయని చెప్పారు. మొత్తంగా వైఎస్ జగన్ ప్రసంగం శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది. వైఎస్ విజయమ్మ ఉద్వేగపూరిత ప్రసంగం.. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశానని తాను లేఖ రాయకున్నా, రాసినట్లు సృష్టించడం.. ఎవరి కుటుంబంపైనా వేయని రీతిలో తమ కుటుంబంపై నిందలేస్తూ ఎల్లో మీడియా దుష్ఫ్రచారం చేస్తోందని వైఎస్ విజయమ్మ ఉద్వేగ పూరితంగా ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘షర్మిలమ్మ తెలంగాణలో పోరాటం చేస్తోంది. ఆమెకు నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది. సంతోషంలో ఉన్నప్పుడు కొడుకుతో ఉంటే అక్కడ నా రక్తం పంచుకున్న బిడ్డకు అన్యాయం చేసిన దాన్నవుతా. అది నా మనస్సాక్షికి నచ్చడం లేదు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నా.. ఇందుకు క్షమించాలి’ అంటూ శ్రేణులను విజయమ్మ కోరారు. ‘వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు అండగా ఉన్నా, తల్లిగా జగన్‌కు, రాష్ట్ర ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాను’ అని విజయమ్మ స్పష్టత ఇవ్వడం శ్రేణులను ఆకట్టుకుంది. పోటెత్తిన పార్టీ శ్రేణులు ప్లీనరీ తొలి రోజున ప్రతినిధుల సభ.. మహిళా సాధికారత–దిశ చట్టం, విద్య, నవరత్నాలు–డీబీటీ, వైద్య రంగాల్లో గత మూడేళ్లలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై చర్చించింది. ఆ నాలుగు అంశాలపై తీర్మానాలను ఆమోదించింది. ప్రతినిధుల సభకు 1.50 లక్షల మంది వస్తారని వైఎస్సార్సీపీ నేతలు అంచనా వేయగా, అంతకంటే ఎక్కువగా శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ప్రాంగణంలో వేసిన కుర్చీలన్నీ నిండిపోవడంతో పెద్ద సంఖ్యలో జనం వెలుపల.. గుంటూరు–విజయవాడ జాతీయ రహదారి వరకు మైదానంలో కిక్కిరిసిపోయారు. వేదిక చుట్టూ ఇసుకేస్తే రాలనంతగా కార్యకర్తలు పోటెత్తడంతో వేదిక మీదకు నాయకులు చేరుకోవడం కష్టమైంది. అంచనాలకు మించి ప్రతినిధుల సభకే వైఎస్సార్సీపీ శ్రేణులు పోటెత్తడంతో పార్టీలో నూతనోత్సాహం నింపింది. తొలిరోజు ప్లీనరీ ఇలా.. (వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి): వైఎస్సార్సీపీ 3వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఉదయం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్సిటీ సమీపంలోని వైఎస్సార్ ప్రాంగణం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా మొదటి రోజు కార్యక్రమాలు ఇలా సాగాయి.. ఉదయం 7.00 : వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు వేదిక వద్దకు చేరుకోవటం ప్రారంభమైంది. 8.00: పార్టీ ప్రతినిధుల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున క్యూ కట్టారు. 9.00 : సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. 11.36: వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిలను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం వారిరువురూ చేతులు జోడించి సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం చేశారు. 11.39: మహానేత వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగన్‌కి వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆకుపచ్చ కండువా కప్పారు. పార్టీ మహిళా నేతలు, మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, మాజీమంత్రి పాముల పుష్పశ్రీవాణి సీఎం జగన్‌కు శాలువ కప్పారు. అనంతరం బాలికలు వందేమాతరగీతం ఆలపించారు. 11.42: పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్లీనరీని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారని ప్రకటించారు. 11.45: పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య సీఎం జగన్ ఉద్వేగపూరిత ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు ఈలలు, చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. 12.13: సీఎం జగన్ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. 12.15: పార్టీ గౌరవాధ్యక్షురాలు హోదాలో వైఎస్ విజయమ్మ తన ప్రసంగం ప్రారంభించారు. హ్యాపీబర్త్‌డే.. హ్యాపీబర్త్‌డే వైఎస్సార్ అని ఆమె అన్నప్పుడు సభలో ఈలలు, కేకలు ప్రతిధ్వనించాయి. 12.50: విజయమ్మ బాధాతప్త హృదయంతో తన గౌరవాధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తన స్థానంలో ఆశీనులయ్యారు, ఈ సమయంలో కన్నీటిపర్యంతమైన తన తల్లి విజయమ్మను సీఎం వైఎస్ జగన్ సముదాయించి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పార్టీ జమా ఖర్చుల ఆడిట్ స్టేట్మెంట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్సీపీ సిద్ధాంతం–రాజ్యాంగ నిబద్ధత అనే అంశంపై ప్రసంగించారు. ఆ తర్వాత వివిధ అంశాలపై సాయంత్రం వరకు చర్చలు జరిగాయి. నాలుగు అంశాలపై తీర్మానాలు చేశారు. కార్యకర్తలకు పేర్ని నాని సముదాయింపు వేదికపైకి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారనగా.. కార్యకర్తలు పెద్దఎత్తున వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో మాజీమంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి ఒక్కొక్కరిని బుజ్జగిస్తూ గ్యాలరీలకు తరలించారు. కార్యకర్తల కోరిక మేరకు వారితో ఒక సెల్ఫీ దిగటం వారిని చేయిపట్టుకుని గ్యాలరీలలో వదలటం ఆసక్తికరంగా మారింది. -
73వ వైఎస్ఆర్ జయంతి వేడుకలపై స్పెషల్ స్టోరీ
-
జన సంద్రమైన వైఎస్సార్సీపీ ప్లీనరీ (ఫొటోలు)
-
మన పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం పుట్టిన పార్టీ
-
అభినవ అల్లూరి జగనన్న.. అది చంద్రబాబు జలగల సమూహం
-
రాజన్న రాజ్యం అది రామ రాజ్యం
-
ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది: పెద్దిరెడ్డి
-
కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యారంగంలో మార్పులు
-
వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు (ఫొటోలు)
-
ఈ యువ నాయకుడి స్పీచ్‌కు దద్దరిల్లిన ప్లీనరీ ప్రాంగణం..
-
పేదింటి తల్లిదండ్రులు, పిల్లల అభిలాషకు విలువనిచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్
-
విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్
-
ఇదే ఉత్సాహంతో 2024లో కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం
-
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు
-
ప్రతి పేదవాడికి అండగా నిలబడటమే వైఎస్ఆర్ సీపీ సిద్ధాంతం
-
ఆశయం కోసం పోరాడే పులివెందుల పులి సీఎం వైఎస్ జగన్
-
మహోజ్వల భారతి: ప్రజల మనిషి
నేడు వై.ఎస్.ఆర్ జయంతి. 1949 జూలై 8న ఆయన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా 2004–2009 లో పని చేశారు. 2003లో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి మూడు నెలల పాటు నిరంతరాయంగా చేపట్టిన పాదయాత్ర చరిత్రాత్మకమైనది. మండే ఎండల్లో ఆయన 1,475 కి.మీ. నడిచి ఊరూరా తిరిగారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక హామీలను నెరవేర్చారు. ప్రజా సంక్షేమ, ప్రజారోగ్య పథకాలను ప్రవేశపెట్టి, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్రానికి కూడా ఆదర్శంగా నిలిచారు. చదవండి: (దార్శనిక శ్రమజీవి: సత్యజిత్ రాయ్ / 1921–1992) -
యువతకు జగన్ రోల్ మోడల్: వైఎస్ విజయమ్మ
-
ప్రాణమున్నంత వరకు మీ అప్యాయతను మరిచిపోం: వైఎస్ విజయమ్మ
-
YSR Jayanthi: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.. జిల్లా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) స్థాయిల్లో వేడుకలు నిర్వహిస్తోంది. వీటిలో పెద్ద ఎత్తున రైతులను భాగస్వాములను చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా గత మూడేళ్లుగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శాఖల వారీగా ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తొలుత వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించాక వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ యంత్ర సేవా పథకం వంటి వాటి ద్వారా లబ్ధి పొందిన రైతులను భాగస్వాములను చేస్తున్నారు. రైతన్నల సంక్షేమానికి ఎన్నో మేళ్లు.. వివిధ పథకాల ద్వారా రైతన్నలకు నేరుగా రూ.1,27,633.08 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన విషయాన్ని రైతులకు వివరించనున్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి, వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్, అమూల్ ద్వారా పాడి రైతులకు అదనంగా లబ్ధి, ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రభుత్వం లబ్ధి కలిగిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థిక సాయం, వైఎస్సార్ జలకళ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించి, మోటార్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. వీటన్నింటిపై రైతు దినోత్సవ వేడుకల్లో అవగాహన కల్పించనున్నామని వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. -
మన జెండా తమ గుండెగా మార్చుకున్న కోట్ల మందికి సెల్యూట్: సీఎం జగన్
-
ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు: వైఎస్ విజయమ్మ
సాక్షి, తాడేపల్లి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. మహానేత వైఎస్సార్ 73వ జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్నారు. ప్లీనరీ సమావేశాలకు హాజరైన వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి అందరివాడు. మీ అందరి హృదయాల్లో వైఎస్సార్‌గారు సజీవంగా ఉన్నారని అన్నారు. ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు ఆనాడు అధికార శక్తులన్నీజగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. 2011లో కాంగ్రెస్ పొమ్మనలేక పొగపెట్టింది. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉద్దండ నాయకులకే వైఎస్ జగన్ గొంతు ఎండిపోయేలా చేశారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. మీ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చాను. ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్సీపీ పుట్టింది. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాన్ని తెచ్చారు. జగన్ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారు. యువతకు రోల్‌మోడల్ వైఎస్ జగన్ వైఎస్ జగన మాస్ లీడర్. జగన్ యువతకు రోల్‌మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది. మీ బిడ్డల్ని జగన్ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్ అందిస్తారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా వైఎస్సార్ బిడ్డగా షర్మిల వైఎస్సార్టీపీ పెట్టుకుంది. తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుంది. వైఎస్సార్ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఇక్కడ అవసరం. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో ఉండాలనుకుంది. తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్సార్ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. దేవుడి అండతో, ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా జగన్ గెలుస్తారు అని వైఎస్ విజయమ్మ అన్నారు. తల్లిగా జగన్‌కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు ప్రస్తుతం నా అవసరం ఉంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలనే ఈనిర్ణయం తీసుకుంటున్నాం. ప్రజలకు నా ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారు, మీ మద్దతు వారికి కావాలి. తల్లిగా జగన్‌కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది అని వైఎస్ విజయమ్మ తెలిపారు. చదవండి: (CM YS Jagan Speech: మన పార్టీ సంఘర్షణ 13ఏళ్ల కింద మొదలైంది) -
వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు (ఫోటోలు)
-
మహానేత వైఎస్సార్ జయంతి.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కోట్లాది మంది చిరునవ్వుల్లో మీ రూపం కనిస్తూనే ఉంటుందని తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘నాన్నా.. మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం’ అని సీఎం జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అలాగే గుంటూరులోని నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. మరోవైపు వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. చదవండి: జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు: వైఎస్ విజయమ్మ నాన్నా.. మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2022 -
మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా..
‘పావురాలగుట్టలో 13 ఏళ్ల క్రితం.. అంటే 2009 సెప్టెంబరు 25న ఈ సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకుని, 2011 మార్చిలో వైఎస్సార్సీపీగా ఆవిర్భవించింది. 11 ఏళ్ల క్రితం నాన్న గారి ఆశయాల సాధన కోసం.. మనందరి ఆత్మాభిమానం కోసం ఈ పార్టీ పుట్టింది. మీరంతా అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించారు. ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, అక్కకు, చెల్లెమ్మకు, అవ్వా తాతలకు, ప్రతీ కార్యకర్తకు, ప్రతి అభిమానికి.. మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్సార్సీపీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమ పూర్వకంగా, హృదయ పూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగంతో అన్నారు. వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: శుక్రవారం విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీకి ప్రభంజనంలా తరలివచ్చిన శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసి.. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేయడమంటే ఇలా అని చాటిచెప్పామన్నారు. మనం ప్రజలకు చేస్తున్న మంచిని చూసి జీర్ణించుకోలేకే అసూయతో ప్రతిపక్షం మనపై నిందలేస్తోందని మండిపడ్డారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నా గుండె బెదరలేదు.. సంకల్పం చెదర లేదు ►2009 నుంచి ఈ రోజు వరకు అంటే ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎన్ని ముళ్లున్నా, మన మీద ఎన్ని రాళ్లు పడినా, ఎవరు పగబట్టినా, ఎన్ని వ్యవస్థలు మన మీద కత్తి కట్టినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు.. నా గుండె బెదరలేదు. నా సంకల్పం చెదరలేదు. ►నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడూ నా చేయి విడవలేదు. తోడుగా నిలబడ్డారు. అడుగులు వేయడంలో బలాన్నిచ్చారు. కాబట్టే 2019లో అంటే మూడేళ్ల క్రితం చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా మెజారిటీ వచ్చింది. దేవుడి దయ, మీ అందరి అండతో పాటు, ప్రజలు గొప్పగా ఆశీర్వదించారు. ఆ ఆశీస్సులు, దేవుడి దయతో 175 స్ధానాలకుగాను ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు. ►ఒకవైపు 175 స్థానాలకు 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారం ఇవ్వగా.. మరోవైపు ఆ దేవుడి దయ చూడండి.. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొన్న వారిని 23 ఎమ్మెల్యే స్థానాలకు, మూడు ఎంపీ స్థానాలకు పరిమితం అయ్యేటట్టు చేశారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ ►అధికారం అంటే అహంకారం కాదు. అధికారం అంటే ప్రజల మీద మమకారం అని నిరూపిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారం వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో అయినా ప్రజల కోసమే బతికాం. పేదల కోసం, సామాన్యూల కోసం, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారి కోసమే బతికాం. అనుబంధాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతిక్షణం తపిస్తూ బతికాం. ►గతంలో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేవారు. ఆ తర్వాత దానిని చెత్తబుట్టకే పరిమితం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో చూశాం. అటువంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి ఈ మూడేళ్లు పాలన సాగించాం. ఈ పరిస్థితిలో తన మేనిఫెస్టోను చూపించడానికి టీడీపీ భయపడి.. యూట్యూబ్ నుంచి, వారి వెబ్సైట్ నుంచి తీసేయించింది. మన మేనిఫెస్టోను చూసి భయపడుతోంది. ►మనం ఈ మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేశాం. ఈ మేనిఫెస్టోను చూపిస్తూ.. గడప గడపకూ వెళ్లి మనిషి, మనిషినీ కలుస్తున్నాం. అక్కా, అన్నా.. అవ్వా.. తాతా.. ఈ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ మీకు అందాయా అని అడుగుతుంటే.. వారు చిరునవ్వుతో అందాయని ఆశీర్వదిస్తుండటం కనిపిస్తోంది. ప్రతి రంగంలోనూ మనదైన ముద్ర ►ప్రతి రంగంలో మనదైన ముద్ర వేయగలిగాం. మూడేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా సవాల్ విసిరినా.. ఆర్థికంగా అంతకు ముందు పాలకుడు, గత ప్రభుత్వంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేసిపోయినా.. వారు పెట్టిన బకాయిలు మనమే కట్టాల్సి వచ్చినా చెల్లించాం. నవరత్నాల పాలనను అందిస్తామని చెప్పిన మాటను తప్పకుండా అమలు చేస్తానని మీ అన్నదమ్మునిగా తెలియజేస్తున్నాను. ►2009 నుంచి 2019 వరకు కానివ్వండి.. 2019 నుంచి 2022 వరకు కానివ్వండి.. ఇక మీదట జరగబోయే ప్రయాణం కానివ్వండి.. ఒక మాట కోసం, నిబద్ధత కోసం, విలువల వ్యవస్థ సాధించడం కోసం మన పాలన, మన ప్రయాణం సాగుతుంది. ఒక్క పథకానికీ చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ కాదు ►మూడేళ్లలోనే నవరత్నాలులో ప్రతి పథకాన్ని అమలు చేసిన మన పార్టీ మీద, మన ప్రభుత్వం మీద.. 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ.. ఆయన పేరు చెబితే ఏ ఒక్క పథకానికీ కేరాఫ్ అడ్రస్ కాని వ్యక్తి నోరు పారేసుకుంటున్నాడు. ఆ విమర్శలు, కట్టుకథలు, పచ్చి బూతులకు అబద్ధాలు జోడించి ప్రచారం చేసే వాళ్లు ఈ రోజు పత్రికలు, టీవీలు నడుపుతున్న పరిస్థితి. మన కర్మ కొద్దీ చూస్తున్నాం. ►వీరంతా అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని బాగా మెక్కేసారు. బాగా నొక్కేశారు. బాగా దోచుకుని పంచుకున్నారు. ఇప్పుడు ఆ పంచుకోవడం ఆగిపోయింది. ఈ గజ దొంగల ముఠాకు అందుకే నిద్ర పట్టడం లేదు. అందుకే వీరికి కడుపు మంట ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. ఎన్ని జలిసిల్ మాత్రలు ఇచ్చినా వీళ్ల కడుపు మంట తగ్గదు. నాకు వాళ్ల తోడు ఉండకపోవచ్చు.. ►నాకు ఈ చంద్రబాబు మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. వాళ్ల మాదిరిగా దత్తపుత్రుడి అండా ఉండకపోవచ్చు. కానీ నాకు ఉన్నది మీ తోడు ►ఈ విషయాలన్నింటిపై మనతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆలోచించేలా ఈ ప్లీనరీలో తీర్మానాలు, చర్చలు, ప్రసంగాలు ఉపయోగపడతాయని ఆకాంక్షిస్తున్నా. రేపు (శనివారం) సాయంత్రం విస్తృత స్థాయిలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన, వస్తున్న కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి మరోసారి మాట్లాడతాను. గజ దొంగల ముఠాకు చేతలతోనే సమాధానం ►ఎలాంటి అడుగులు వేశాం, చరిత్రలో ఎప్పుడైనా గతంలో ఇలాంటి అడుగులు పడ్డాయా? ఇంతటి మార్పు ఎప్పుడైనా చూశామా? అన్నది కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తున్నా, అసూయతో గిట్టని వారు విమర్శిస్తూ నిందలు వేస్తున్నారు. మంచి చేసిన చరిత్రగానీ, మాటకు విలువ ఇచ్చిన నైతికతగానీ ఏనాడైనా ప్రతిపక్షానికి ఉన్నాయా? అని ఇవాళ నేను సవాల్ విసురుతున్నా. ►దుష్ట చతుష్టయం అంటే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికితోడు వీరికొక దత్తపుత్రుడు. ఈ ఎల్లో మీడియా, ఎల్లో పార్టీల జాయింట్ గజ దొంగల ముఠా రాతలు, పైశాచిక మాటలకు మనం చేతల్లోనే సమాధానమిస్తాం. ►అన్ని రకాలుగా ఇంటింటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి చేసిన మంచి ద్వారా మనం సమాధానమిస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఇప్పటికే 95 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ. చెప్పిన ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిన వారు ఈ రోజు విమర్శలు చేస్తున్నారు. మాటకు కట్టుబడిన పార్టీ వైఎస్సార్సీపీ ►మన పార్టీ అంటే వైఎస్సార్సీపీ ఆడిన మాటకు కట్టుబడి ఉన్నామనే దానికి అర్థం తెచ్చిన పార్టీ అని సగర్వంగా తెలియజేస్తున్నా. ఈ మూడేళ్ల పరిపాలన, అంతకు ముందు మన ప్రయాణంలో చేసిన యుద్ధం.. అన్నింటిలో కూడా దేవుడి దయ మనకు పుష్కలంగా ఉంది. ►ఈ రోజు మన ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏమిటో చూపించింది. ఇది గ్రామాన్ని, గ్రామ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అనుకూలంగా, పారదర్శకంగా అవినీతి, వివక్ష లేకుండా ఎలా చేయగలమో, ఎలా మార్చామో చూపించింది. ►రైతుల మీద మమకారం.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం, పరిపాలనా సంస్కరణలు, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వా తాతల మీద మమకారం, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యా విధానం, ఆరోగ్య రంగంపై ప్రేమ, పేదల సొంతింటి కలను నిజం చేయడం, అవినీతికి తావు లేకుండా, లంచాలు అడిగే పరిస్థితి లేకుండా పారదర్శక పాలన అంటే ఈ మాదిరిగా ఉంటుందని ఈ మూడేళ్లలో చేసి చూపించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్సీపీ ప్లీనరీ పండగ
-
YSRCP Plenary 2022: అభిమాన సంద్రం.. వెయ్యికార్లతో ప్లీనరీకి..
సాక్షి, అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తోన్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్నారు. ప్లీనరీ మొదటి రోజున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వెయ్యికార్లతో భారీ ర్యాలీగా తరలివచ్చారు. దీంతో గుంటూరు-విజయవాడ జాతీయ రహదారి అభిమాన సంద్రమైంది. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. కాగా, 2017 జూలై 8-9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశమైన నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగానే మూడో ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. చదవండి: (వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు) డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ప్లీనరీ ప్రాంగణాన్ని పర్యవేక్షించారు. ప్లీనరీ భద్రతా విధుల కోసం దాదాపు 3,500 మంది పోలీసులను నియమించినట్లు తెలిపారు. ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. -
సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ విజువల్స్
-
ప్లీనరీ కోసం వంటలు ఎలా చేస్తున్నారో చూడండి
-
YSR Jayanthi 2022 : మరపురాని మహానేత.. వైఎస్సార్ అరుదైన ఫొటోలు
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
సాక్షి, కడప జిల్లా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ప్లీనరీ.. ముగిసిన తొలిరోజు సమావేశాలు
-
YSRCP Plenary 2022: కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. అందరికీ ఒకే మెనూ ► ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటిని తయారు చేయడానికి అవసరమైన వంట సామగ్రి, కూరగాయలు, సరుకులను భారీ ఎత్తున సిద్ధం చేశారు. ► ఇందుపల్లి, ద్రాక్షారామం తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వంట వాళ్లను రప్పించారు. గురువారం సాయంత్రం నుంచే వారు పని ప్రారంభించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల సంప్రదాయ వంటకాలతో వేడి వేడిగా టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించనున్నారు. ► ఇడ్లీ, పొంగల్, ఉప్మా, మైసూర్ బజ్జీలను శుక్ర, శనివారం ఉదయం టిఫిన్లుగా అందిస్తారు. 25 రకాల వంటకాలతో భోజనాలు అందించనున్నారు. శాఖాహారం, మాంసాహార భోజనాలను వేర్వేరుగా సిద్ధం చేస్తున్నారు. చదవండి: (దారులన్నీ ప్లీనరీ వైపే) -
YS Rajasekhara Reddy: దశాబ్దాల రాజకీయం... శతాబ్దాల కీర్తి
జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి! ఎన్నికల్లో ఏనాడూ ఓటమి ఎరుగని నేత! రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతుజన బాంధవుడు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు. నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం సరికొత్త ప్రయోగం. ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్. ఆయన ఆశయాల కొనసాగింపునకు ఆవిర్భవించిన వైసీపీ నేటి నుంచి జరిగే ప్లీనరీలో అందుకు పునరంకితమవుతోంది. విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన విలక్షణ వ్యక్తిత్వం వై.ఎస్.రాజశేఖరరెడ్డి సొంతం. కడప జిల్లా జమ్మల మడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత, రూపాయికే వైద్యం అందించారు. నాడి చూసి ప్రజల జబ్బులను పసిగట్టి చికిత్స చేసిన ఆయన... 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగుర వేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అమలు చేయడంలోనూ అధికారులకు వైఎస్ పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఉదాహరణకు ఒకసారి కొందరు ఎమ్మెల్యేలు వచ్చి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, తమ వారికి ఇప్పించాలనీ అడిగారు. అప్పుడు వెంటనే సంబంధిత వర్సిటీ వీసీకి ఫోన్ చేసి, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలనీ, ఎమ్మెల్యేలు చెప్పిన వారికి అర్హతను బట్టి పోస్టులు ఇవ్వాలనీ సూచించారు. అయితే వీసీ 14 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారున్నారనీ, ముందు వారికి అవకాశం ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందనీ అన్నారు. ‘ఓకే! అలాగే కానివ్వండి. వీసీగా మీరే యూనివర్సిటీకి బాస్. మేం చెప్పిన వారికే ఇవ్వాలనేం లేదు’ అని వైఎస్ ఆయనకు స్పష్టం చేశారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదే సమయంలో ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించేవారు. ఆలస్యం చేస్తే సహించేవారు కాదు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వైఎస్ఆర్ హయాంలో ఆరేళ్ళ పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. తాను ఆ పదవిలో పనిచేసిన ఆరేళ్లలో ఎన్నడూ, ఏ సందర్భంలోనూ వైఎస్సార్ ‘వీరికి ఈ ఫేవర్ చేయండి’ అని చెప్పలేదనీ, పూర్తి స్వేచ్ఛ తమకిచ్చారనీ చెప్పారు. ఇటువంటి అధికారుల సహకారంతోనే వైఎస్ పాలనలో అద్భుతాలను ఆవిష్కరించారు. అనుక్షణం జనహితమే లక్ష్యంగా పనిచేసే వైఎస్సార్... రైతు పక్షపాతి. ౖరైతు బాగుంటేనే దేశం బాగుంటుందనీ, లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే తన లక్ష్యమనీ చెప్పేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘జలయజ్ఞం’ పేరిట సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీటి సౌకర్యం కల్పించారు. రైతులకు ‘ఉచిత విద్యుత్’ చారిత్రక అవసరమని వైఎస్ ఉద్ఘాటించారు. ఢిల్లీలో పార్టీ పెద్దలు, కొందరు ఆర్థికవేత్తలు ఈ పథకాన్ని అమలు చేయగలరా అని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేని నాడు నేను సీఎం పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగను’ అని తేల్చిచెప్పారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారాయన. అనంతర కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2007లో అమెరికాలో జరిగిన ‘ప్రపంచ వ్యవసాయ వేదిక’ సమావేశంలో భారత్ ఏకైక ప్రతినిధిగా వైఎస్ పాల్గొన్నారు. అక్కడ ఓ బహుళజాతి విత్తన కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఆ కంపెనీకి చెందిన పత్తి విత్తనాల ధరపై అప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు నడుస్తోంది. వారు ఆ కేసును వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరారు. అది అంతర్జాతీయ కంపెనీ అనీ, కాస్త పట్టూ విడుపూ ప్రదర్శించమనీ ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా సూచించారు. అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. అనంతర కాలంలో సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. తద్వారా ఏటా రూ 3,000 కోట్ల చొప్పున గత 16 ఏళ్లలో రైతాంగానికి దాదాపు రూ 48,000 కోట్లు ఆదా కావటం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఆనాడు ఐదు వందల గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ ధర దాదాపు 1,600 రూపాయలు ఉంటే, అందులో దాదాపు వెయ్యి రూపాయలు రాయితీగా ఉండేది. విత్తనాల ధరను 750 రూపాయలకు తగ్గిస్తూ వైఎస్ ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు నిర్ణయించే చట్టాన్ని తీసుకొచ్చింది. దాదాపు ఐదు రాష్ట్రాలు ఆ చట్టాన్ని అనుకరించడంతో ఆ చట్టం దేశం దృష్టిని ఆకర్షిం చింది. ఆ విషయాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ వైఎస్‌ను ఎంతగానో ప్రశంసించింది. వైఎస్ రైతుల కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఒక్క ఉదంతమే ఉదాహరణ. ఐదేళ్ల వైఎస్ పాలనలో చేపట్టిన పథకాలన్నీ జనరంజకమైనవే. 2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1,450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ ప్రతి కుటుంబాన్నీ కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత పేదలకు కూడు, గూడు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యాన్ని నెర వేర్చారు. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందిం చడం వైఎస్ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం ఫీజు రీయింబర్స్మెంట్. బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన విశిష్ట పథకం. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీనిపై పెద్ద చర్చ జరి గింది. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. మార్కెట్లో ధరలు, ముఖ్యంగా సోనా మసూరీ ధర తగ్గేవరకూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులూ 2 రూపాయలకు కిలో బియ్యం రకాన్నే వాడారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలనీ, గుండె జబ్బులు సహా ఇతర వ్యాధులతో ఎవరూ మరణించకూడదనీ వైఎస్ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రారంభించారు. సామాన్యులకు ఈ పథకం అపర సంజీవనిలా మారింది. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు కూడా ఆయన ప్రారంభించిందే. 104 కాల్ సెంటర్ ఏర్పాటు గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే వైద్య చికిత్సను అందించేందుకు చేపట్టిన మరో బృహత్తర పథకం. పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రుణ మాఫీ, భూపంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు... ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారు. ఆయన ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. వైఎస్ హయాంలో పాడి పంటలే కాదు, ఐటీ ఎగుమతులు కూడా గణ నీయంగా వృద్ధి చెందాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా తుది శ్వాస వరకూ పనిచేసిన వైఎస్ పుట్టిన రోజైన జూలై 8ని ‘రైతు దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో వైఎస్ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. చివరికి ప్రజల కోసం వెళుతూ, హెలికాప్టర్ ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక మనిషి గొప్పతనం ఆయన చనిపోయినప్పుడు తెలుస్తుందంటారు. అది వైఎస్ విషయంలో అక్షర సత్యమైంది. భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన చేసిన సేవ, ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. ఎ. చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈఓ, వైఎస్సార్‌కు నాటి ప్రెస్ సెక్రెటరీ -
YSR Kadapa: వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనల్లో వీరు పాల్గొంటారు. వీరికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి సాదర స్వాగతం పలికారు. కొంత మంది అభిమానులు వారితో సెల్ఫీలు దిగారు. అనంతరం గజమాలతో సత్కరించారు. తరువాత వారు రోడ్డు మార్గాన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు వేంపల్లె : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు షర్మిల సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయ ఎస్టేట్ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ ఆప్యాయ పలకరింపు) -
YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి
పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ముందుచూపు, చకచకా అభివృద్ధితో ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచారు. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన ఆ వైతాళికుడే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని అజేయుడి 73వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇదీ.. (రామగోపాల్ ఆలమూరు – సాక్షి, అమరావతి): ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఐదేళ్ల మూడు నెలలపాటు మాత్రమే పని చేశారు. కానీ.. ఆ కొద్ది కాలంలోనే పాలకుడికి మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సమగ్రాభివృద్ధివైపు ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. రూపాయి డాక్టర్‌గా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. అపర భగీరథుడు ‘1978లో శాసనసభలో తొలిసారి అడుగు పెట్టాక కోస్తా పర్యటనకు వెళ్లినప్పుడు కాలువల్లో గలగలా పారుతున్న నీటిని చూసి కరువుతో తల్లడిల్లుతున్న ప్రాంతాలకు కూడా జలధారలు అందించాలనే సంకల్పం నాలో ఏర్పడింది. కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని కోరితే.. ‘‘దోసిలి పట్టు.. పోస్తా’’ అని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజు నా సంకల్పం మరింత బలపడింది’ అని 2004లో సీఎంగా సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే సమయంలో వైఎస్సార్ గుర్తు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం తలపెట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరానికి శ్రీకారం చుట్టారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు. ఆరోగ్యశ్రీతో ప్రజారోగ్యానికి భరోసా.. 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. అనారోగ్యం పాలైన పేద కుటుంబాలు ఆపత్కాలంలో సాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాల్సిన ప్రయాసలకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎనలేని భరోసా ఇచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. పేదరికానికి విద్యతో విరుగుడు.. పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్సార్ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని ధృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం రాష్ట్రంపై పడకుండా వివిధ పనుల కల్పన ద్వారా వైఎస్సార్ నివారించగలిగారు. ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేశారు. అజేయుడు.. రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. వారిలో దివంగత వైఎస్సార్ ముందు వరుసలో నిలుస్తారు. పులివెందుల నియోజకవర్గం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో అసెంబ్లీకి, కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో పార్లమెంట్‌కి, ఆ తర్వాత మళ్లీ పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా వైఎస్ రాజశేఖరరెడ్డి విజయాలు సాధించారు. రైతును రాజు చేసిన మారాజు.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్ అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు. వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. నేడు రైతు దినోత్సవం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) స్థాయిల్లో వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిలో పెద్ద ఎత్తున రైతులను భాగస్వాములను చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా గత మూడేళ్లుగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శాఖల వారీగా ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తొలుత వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించాక వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ యంత్ర సేవా పథకం వంటి వాటి ద్వారా లబ్ధి పొందిన రైతులను భాగస్వాములను చేస్తున్నారు. రైతన్నల సంక్షేమానికి ఎన్నో మేళ్లు.. వివిధ పథకాల ద్వారా రైతన్నలకు నేరుగా రూ.1,27,633.08 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన విషయాన్ని రైతులకు వివరించనున్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి, వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్, అమూల్ ద్వారా పాడి రైతులకు అదనంగా లబ్ధి, ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రభుత్వం లబ్ధి కలిగిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థిక సాయం, వైఎస్సార్ జలకళ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించి, మోటార్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. వీటన్నింటిపై రైతు దినోత్సవ వేడుకల్లో అవగాహన కల్పించనున్నామని వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. -
YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రం నలు మూలల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తరలి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో.. వర్షం వచ్చినా ప్లీనరీకి హాజరయ్యే వారు తడవకుండా భారీ విస్తీర్ణంలో వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. మూడేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్, పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులను గుర్తు చేస్తూ నమూనా ఏర్పాటు చేశారు. విద్యుత్ దీప కాంతులతో ప్రాంగణం ధగధగలాడుతోంది. రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేశారు. కాగా, కాలర్ ఎగరేసుకుని తిరిగేలా సీఎం వైఎస్ జగన్ పరిపాలిస్తుండటంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ క్రమంలో ప్లీనరీకి భారీ స్థాయిలో శ్రేణులు తరలి వస్తున్నాయి. 3 వేల మంది వలంటీర్లు వైఎస్సార్సీపీ ప్లీనరీలో 3 వేల మంది వలంటీర్లు పాల్గొంటున్నారని ప్లీనరీ వలంటీర్స్ కమిటీ కన్వీనర్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్లీనరీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే వారు ఇక్కడికి చేరుకున్నారని చెప్పారు. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ మొక్కవోని దీక్షతో ప్లీనరీ ప్రాంగణంలో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారి పొడవునా వైఎస్సార్సీపీ పతాకాలు, కటౌట్లు, బెలూన్లు వంటశాలలో విజయసాయిరెడ్డి తదితరులు ‘జననాయక’ సీడీల ఆవిష్కరణ వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘జన నాయక’ పేరిట రూపొందించిన పాటల సీడీలను పార్టీ నేతలు, మంత్రులు కలసి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్సనారాయణ, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ సీడీని రూపొందించారు. ప్లీనరీలో కార్యక్రమాలు ఇలా.. ► వైఎస్సార్సీపీ ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుల సమావేశం జరుగుతుంది. అనంతరం సీఎం వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్లీనరీ వేదికపైకి సీఎం వైఎస్ జగన్‌ను, ప్రధాన నాయకులను ఆహ్వానిస్తారు. ► వందేమాతరం గీతాలాపనతో ప్లీనరీ మొదలవుతుంది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైఎస్ జగన్, నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తారు. ప్రార్థన పూర్తయ్యాక పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందేశం ఇస్తారు. ► పార్టీ ఆడిట్ ఖర్చుల స్టేట్మెంట్ను పి.కృష్ణమోహన్‌రెడ్డి ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా నియమావళికి సవరణలు ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. ఆ తర్వాత మహిళా సాధికారత – దిశ చట్టం, విద్య, నవరత్నాలు – డీబీటీ, వైద్యం, పరిపాలన – పారదర్శకత అంశాలపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశపెడతారు. ► శనివారం సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు – ఎంఎస్ఎంఈలు – ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా – దుష్టచుతుష్టయంపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశపెట్టి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. అధ్యక్ష ఎన్నికను ప్రకటించి అభినందనలు తెలుపుతారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత వందన సమర్పణతో ప్లీనరీ ముగుస్తుంది. -
ప్రజలకు మేలు చేయడమే అజెండాగా ప్లీనరీ
సాక్షి, అమరావతి: ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా, ప్రజలకు మేలు చేయడమే ఏకైక అజెండాగా ప్లీనరీ నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017 జూలై 8, 9వ తేదీల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రెండో ప్లీనరీలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నవరత్నాలను ప్రకటించి.. ప్రజలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిందని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేశారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సజ్జల ఇంకా ఏమన్నారంటే.. చెప్పినదాని కంటే అధికంగా మేలు ► నవరత్నాల్లో ఇచ్చిన హామీల కంటే సీఎం జగన్ అధికంగా మేలు చేశారు. పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో అమ్మ ఒడి ప్రకటించారు. నాడు–నేడు కింద రూ.16,450 కోట్లతో పాఠశాలలను ఆధునికీకరించారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ► 2014 ఎన్నికల్లో చంద్రబాబు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళలను మోసం చేస్తే.. సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో చెప్పిన దాని కంటే ఎక్కువగా సాయం చేస్తున్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ► 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 % పైగా స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించారు. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 2019లో వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీతో గెలిపించారు. ► రెండో ప్లీనరీలో ఇచ్చిన హామీలను సమీక్షించి.. వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడంపై మూడో ప్లీనరీలో చర్చిస్తాం. వచ్చే ఎన్నికలలోగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తాం. సామాజిక న్యాయానికి కట్టుబడే.. ► మంత్రివర్గంలో దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయంలో దేశానికే దిక్సూచిలా నిలిచారు. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా.. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని స్వాగతించి, మద్దతు ఇచ్చాం. ► ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మద్దతు ఇచ్చేవారు కాదా? రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు ఇవ్వడంపై చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారు? దానిపై ఎల్లో మీడియా ఎందుకు నిలదీయడం లేదు? ► రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడిన అంశాలపైనే ఎన్టీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశాలపై బీజేపీని వ్యతిరేకించాం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం. -
తుది దశకు వైఎస్సార్సీపీ ప్లీనరీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2017 జూలై 8, 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే.. విజయవాడ–గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానాన్ని ప్లీనరీ నిర్వహణ కోసం అందంగా ముస్తాబు చేస్తోంది. ప్లీనరీకి ప్రతినిధులను ఆహ్వానించడం దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ 20 కమిటీలు ఏర్పాటు చేశారు. ప్లీనరీకి హాజరయ్యే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 20 కమిటీలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. బుధవారం ప్లీనరీ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, హోం మంత్రి తానేటి వనతి, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ తదితరులు పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఐటీ త్రివిక్రమ వర్మతో కలిసి బందోబస్తును, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. ప్రతి ఊరికీ ప్రాతినిధ్యం ప్రతి ఊరికీ ప్లీనరీలో ప్రాతినిధ్యం కల్పిస్తూ శ్రేణులకు వైఎస్సార్సీపీ ఆహ్వానాలు పంపింది. గ్రామ, వార్డు సభ్యుడి నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ ప్లీనరీకి ఆహ్వానిస్తూ పేరు పేరునా సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. తమను ప్లీనరీకి ఆహ్వానిస్తూ సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఫ్రేమ్ కట్టించుకుని మురిసిపోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విస్తృతంగా శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారిపై నుంచి చూసినా స్పష్టంగా కన్పించేలా వంద అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 మీటర్ల ఎత్తుతో అత్యంత భారీ వేదిక నిర్మాణాన్ని పూర్తి చేశారు. భారీ వర్షం కురిసినా ఏ ఒక్కరూ తడవకుండా భారీ టెంట్ నిర్మించారు. టిఫిన్లు, భోజనాల తయారీ కోసం భారీ ఎత్తున వంట శాలల ఏర్పాట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కసారి ఎనిమిది వేల మందికిపైగా టిఫిన్లు, భోజనాలు చేయడానికి వీలుగా భారీ టెంట్‌ను నిర్మించారు. ► దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో సమాధి వద్ద మహానేతకు సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు. తొలి రోజున ప్రతినిధులతో సభను నిర్వహించనున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ► ప్రతి ఐదేళ్లకు ఓ సారి ప్లీనరీ నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భాంచాక తొలి సారిగా 2011 జూలై 8–9న ఇడుపులపాయలో ప్లీనరీ నిర్వహించింది. 2017 జూలై 8–9న నిర్వహించిన ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించి ప్రజలకు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అదే వేదికపై నుంచి చరిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రకటించారు. ► ప్లీనరీ వేదికగా ఇచ్చిన భరోసాకు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘన విజయాన్ని అందించారు. అధికారంలోకి వచ్చాక ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశారు. మూడేళ్లలో ఏ దశలోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. తద్వారా వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి ఘన విజయాలు కట్టబెట్టారు. ప్రజల జీవన ప్రమాణాల్లో పెను మార్పులు ► రెండో ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను అమలు చేయడం వల్ల ఈ మూడేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటాన్ని మదింపు చేసి.. ప్లీనరీలో వివరించనున్నారు. ► విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, పారిశ్రామికాభివృద్ధి–ఉపాధి కల్పనకు చేపట్టిన చర్యలు, సామాజిక న్యాయం–సాధికారత, మహిళా సాధికారత–భద్రతలో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా తీసుకున్న చర్యలు, నవరత్నాలు–డీబీటీ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన తీరుపై చర్చించనున్నారు. ► ప్రజలు మెచ్చేలా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లతో కూడిన దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ పిలుపునివ్వనున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
ఆ రోజు నవ్వులే నవ్వులు!
ఎప్పుడో పుష్కరకాలం క్రితం ముఖ్యమంత్రి దివంగత రాజ శేఖర రెడ్డి పాల్గొన్న ఒక కార్య క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సత్యం ఫౌండేషన్, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సంయుక్త ఆధ్వ ర్యంలో హెచ్ఎంఆర్ఐ రూప కల్పన చేసిన 104 కాల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సీఎం రాజశేఖర రెడ్డి వచ్చారు. ముందుగా అసలు ఏమిటీ కాల్ సెంటర్ అనే విషయం గురించి కొంత చెప్పడం సముచితంగా ఉంటుంది. ఎక్కడో మారుమూల ఉండే పల్లెలతో పాటు పట్టణవాసులకు సైతం 24 గంటలూ వైద్య సలహాలు, సేవలూ అందించడానికి ఏర్పాటు చేసిందే ఈ కాల్ సెంటర్. జనానికి అనేక ఆరోగ్య సమస్యలు ఎప్పుడు పడితే అప్పుడు తలెత్తుతూ ఉంటాయి. అటు వంటి సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉంటే సరే... లేకపోతే పరిస్థితి ఎంత ఆందోళన కరంగా ఉంటుందో చాలామందికి అనుభవమే. ఈ ఆందోళనను దూరంచేయడానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అత్యవసర వైద్యసేవలకోసం సంప్రదించ డానికి ఒక టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. అదే 104. రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా ఈ నంబరుకు ఉచితంగా ఫోన్ చేయవచ్చు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన సమస్త సమాచారం కంప్యూ టర్లలో నిక్షిప్తం చేసి కాల్ సెంటర్లో ఉంచుతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డ్యూటీలో వున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలు, దగ్గరలో వున్న ఎక్స్‌రే, రక్త పరీక్షా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు, మందుల షాపులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు... ఇలా అన్ని వివరాలూ సిద్ధంగా ఉండటం వల్ల ఫోను చేసిన వారు ఏ సమాచారం అడి గినా క్షణాల్లో వారికి అందించడానికి వీలుపడుతుంది. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో డాక్టర్లు సెలవులో ఉన్నదీ; ఎక్స్‌రే, స్కానింగ్ వంటి పరికరాలు మరమ్మత్తుల్లో ఉన్నదీ; ఎక్కడ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోతలు ఉన్నదీ... వంటి వివరాలు అన్నింటినీ ప్రభుత్వ విభాగాలతో ఏర్పరచుకున్న సమన్వయం ద్వారా సేకరించి ఉంచుకుంటారు. మొదటిసారి ఫోను చేసినప్పుడు వైద్య సలహా అవసరం ఉన్న వ్యక్తుల వివరాలను, పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా అన్నింటినీ రికార్డు చేసు కుని ఒక నంబరు ఇస్తారు. తరువాత ఎప్పుడు అవసరం వచ్చి మళ్ళీ ఫోనుచేసినా ఈ వివరాలన్నీ కాల్ సెంటర్లో కంప్యూటర్ తెరపై సిద్ధంగా ఉంటాయి కనుక, డాక్టరు కాలయాపన లేకుండా రోగికి తగిన వైద్య సలహా సూచించడానికి వీలుం టుంది. ఈ కేంద్రంలో వైద్యులు రాత్రింబవళ్ళు వైద్య సలహాలు ఇవ్వడానికి సంసిద్ధంగా వుంటారు. పెద్దగా చికిత్స అవసరం పడని సందర్భాలలో డాక్టర్లు అప్పటి కప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్సలు సూచించి ఉపశమనం లభించేలా చూస్తారు. మందులు ఎక్కడ లభిస్తాయో ఆ షాపుల వివరాలు సిబ్బంది తెలియ పరుస్తారు. ఒకవేళ చికిత్స అవసరమని భావిస్తే 108కి తెలియపరచి అంబులెన్స్ పంపిస్తారు. స్థూలంగా ఇవీ 104 సేవాకేంద్రం నిర్వహించే ఉచిత సర్వీసులు. ఇక అసలు విషయం చెప్పుకుందాం. ముఖ్య మంత్రి రాజేఖరరెడ్డి ఈ పథకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రారంభ సూచకంగా సభావేదిక మీద నుంచే 104 నంబరుకు స్వయంగా ఫోన్ చేశారు. అవ తల నుంచి కాల్ సెంటర్ ఉద్యోగిని క్షణాల్లో స్పందించింది. ‘‘104కు స్వాగతం. దయచేసి మీ పేరు చెబుతారా?’’ ముందు కంగు తిన్న ముఖ్యమంత్రి తన పేరు చెప్పారు. హాజరైన సభికులు అందరూ అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద టీవీ తెరలపై ఇదంతా వీక్షిస్తున్నారు. సీఎం తన పేరు చెప్పగానే, కాల్ సెంటర్ ఉద్యోగిని తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా రెండో ప్రశ్నను సంధించింది. ‘ఎక్కడ వుంటారు, ఏం చేస్తుంటారు, మీ చిరునామా చెబుతారా?’ వైఎస్ ఇక నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశారు. ఆయన నవ్వడంతో సభాప్రాంగణం కూడా నవ్వు లతో నిండిపోయింది. భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు (జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి) -
అమ్మ, నాన్నల తర్వాత వైఎస్సారే నాకు స్ఫూర్తి: పంచ్ ప్రభాకర్
జీవితంలో నేను ఏది చేసినా తల్లిదండ్రుల తర్వాత వైఎస్సార్ స్ఫూర్తితోనే అని ఎన్ఆర్ఐ ప్రభాకర్‌రెడ్డి (పంచ్ ప్రభాకర్) అన్నారు. యూఎస్ఏలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రేమకు మూడు అక్షరాలు ఉన్నాయనుకుంటే అది వైఎస్సారే. ఆయన ప్రతి అడుగులో మానవత్వం, దాతృత్వం, సమానత్వం కనిపిస్తాయి. వైఎస్సార్ ఒక గొప్ప మానవతావాది. శత్రువును కూడా అక్కున చేర్చుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెడితే.. సీఎం జగన్ వాటిని కొనసాగిస్తూ, నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపు రేఖలను మారుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తి, బెండపూడి పాఠశాల ఉపాధ్యాయుడు చేసే కార్యక్రమాలు, పడుతున్న కష్టం చూసి ఆ స్కూల్‌ను దత్తత తీసుకోవడం జరిగింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నాతో పాటు, ఇక్కడి అనేక మంది మిత్రులు ముందుకొచ్చారు. ఇప్పటిదాకా పేద విద్యార్థులకు, రైతులకు నా వంతు మేర సహాయపడుతూ వచ్చాను. వాటన్నింటికి మహానేత వైఎస్సారే నాకు స్ఫూర్తి. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ప్రతిభ ఉండి.. పేదరికంతో ముందుకెళ్ల లేని స్థితిలో ఉంటారో వారిని ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తాం. అందుకోసం మేడపాటి వెంకట్‌తో కలిసి కార్యాచరణను కూడా రూపొందిస్తాం. గ్రామీణ ప్రాంత యువతకు రూరల్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసి వారి భవిష్యత్‌కు తోడ్పాటునందిస్తామని' పంచ్ ప్రభాకర్ తెలిపారు. చదవండి: (CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, పులివెందుల/కడప: జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ 9.30కి బయలుదేరి 10.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.30కి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.55కు పులివెందులలోని బాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10.55కు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు పులివెందులలోని ఆర్అండ్బి అతిథి గృహానికి చేరుకుంటారు. ►11.05 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ప్రజలు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. 1.05కు ఆర్అండ్బి గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 1.15కు పులివెందులలోని ఏపీకార్ల్ చేరుకుంటారు. అక్కడ 1.30వరకూ ఉండి క్షేత్రస్థాయి పర్యటన చేస్తారు. 1.30కి ఏపీకార్ల్ నుంచి బయలుదేరి 1.35కు ఏపీకార్ల్ ప్రధాన భవనానికి చేరుకుని న్యూటెక్ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్ మీటింగ్‌లో పాల్గొంటారు. ►2.35కు ఏపీకార్ల్ నుంచి బయలుదేరి 2.45కు బాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 2.50కు అక్కడి నుంచి బయలుదేరి 3.05కు వేంపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 3.20వరకూ స్థానిక నేతలతో మాట్లాడుతారు. 3.20కి రోడ్డు మార్గాన బయలుదేరి 3.30కి డా. వైఎస్సార్ స్మారక పార్కుకు చేరుకొని పార్కును ప్రారంభిస్తారు. 3.50కి అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్‌కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ 4.50 వరకూ విద్యార్థినీ, విద్యార్థులతో ముచ్చటిస్తారు. 4.50కి వేంపల్లి జెడ్పీ స్కూల్ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు వేంపల్లి హెలీప్యాడ్ చేరుకుంటారు. 5.05కు హెలికాప్టర్లో బయలుదేరి 5.15కు ఇడుపులపాయ చేరుకుంటారు. 5.20కి హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 5.25కు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. చదవండి: (YSRCP Plenary 2022: పార్టీ పండుగ ‘ప్లీనరీ’) ►8వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.05కు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకొని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 8.45కు వైఎస్సార్ ఘాట్ నుంచి బయలుదేరి 8.50కు ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 8.55కు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.10కి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.20 గంటలకు కడప విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 10.20కి రోడ్డు మార్గాన బయలుదేరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొంటారు. వేంపల్లెలో సీఎం పర్యటనా ప్రాంతాలను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్ 8 సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు వేంపల్లె: ఈనెల 7, 8వ తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వి.విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీటీసీ ఎం.రవికుమార్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి పర్యటనా ప్రాంతాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ►కడప – పులివెందుల బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న అధికారులకు భద్రతపై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ మెమోరియల్ పార్కు, రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల నూతన భవనాలు, కంప్యూటర్ ల్యాబ్స్, ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంటును పరిశీలించారు. వీటిని 7వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ►కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మ, అడిషనల్ ఎస్పీ మహేష్‌కుమార్, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాసులు, ఎంపీపీ ఎన్.లక్ష్మీగాయత్రి, మండల ఉపాధ్యక్షుడు బాబా షరీఫ్, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, ఈఈ సిద్ధారెడ్డి, ఏపీఈడబ్లు్యఐడీసీ డీఈ సుబ్రమణ్యకుమార్, విద్యుత్ శాఖ డీఈ శ్రీకాంత్, స్పెషలాఫీసర్ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ ఎన్.చంద్రశేఖరరెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అధికారులకు సూచనలు పులివెందుల: సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్న దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు మంగళవారం పరిశీలించారు. పులివెందులలోని భాకరాపురంలోని హెలీప్యాడ్, ఆర్అండ్బీ అతిథి గృహం, ఏపీ కార్ల్‌ను వారు పరిశీలించారు. అధికారులకు పర్యటనా ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలు, భద్రతకు సంబంధించి పలు సూచనలు, సలహాలను అందించారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఏపీ కార్ల్‌లో రైతులతో సమావేశం ఉన్నందున అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయాలపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. ►పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఈఈ సిద్ధారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డి, సీఐలు రాజు, బాలమద్దిలేటి, ఎస్ఐలు గోపినాథరెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. -
ఆటా సభల్లో మహానేత డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 1 నుండి 3 తేదీ వరకు వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని ఏపీ ఆధికారిక భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రావు గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియం మీద కొన్ని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని యార్లగడ్డ మండిపడ్డారు. ప్రతి పేద వాడి పిల్లలకు ఇంగ్లీష్ చదువులు కావాలని ఎందరో పాదయాత్రలో తమ కోరికను వెల్లడించారని చెప్పారు. అలాగే 98శాతం ఇంగ్లీష్ మీడియం కావాలాని సర్వేలో చెప్పారని తెలిపారు. కేవలం సీఎం జగన్‌కు క్రెడిట్ వస్తుందన్న దుగ్ధతోనే ఇంగ్లీషు మీడియంను తప్పు బట్టారని విమర్శించారు. మీ పిల్లలకు ఇంగ్లీషులు చదువులు కావాలి గానీ, మరి పేదల పిల్లలు ఇంగ్లీషులు చదువుకోవద్దా ? అని విమర్శిస్తున్నవారినుద్దేశించి ప్రశ్నించారు. వైఎస్సార్ చిరకాలం అందరి గుండెల్లో నిలిచిపోయారని వైజాగ్ ఎంపీ సత్య నారాయణ మహానేతకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. అమెరికాలో ఏ ముఖ్యమైన తెలుగు కార్యక్రమం జరిగినా వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటారన్నారు. జులై 8 కంటే ముందే అమెరికాలో జయంతి వేడుకలు జరపడం ఎంతో సంతోషకరమని ఆటా సెక్రెటరీ హరి లింగాల వెల్లడించారు. డా. వైఎస్సార్ తన పాలనతో చెరగని ముద్ర వేశారనీ, తన ప్రసంగాలతో అసెంబ్లీకి వన్నె తెచ్చారంటూ నాటా అధ్యక్షుడు రాఘవ రెడ్డి గోసాల వైఎస్సార్ సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ను మరిపించేలా జగన్ పాలన దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ ప్రశంసించారు. అంతేకాదు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మాట్లాడుతూ సామాన్యులకు చేరువైన వ్యక్తి వైఎస్సార్ అనీ, ఆయన మనకు దూరమై 12 ఏళ్లు గడిచినా అందరి మనసుల్లో సజీవంగా నిలిచే ఉన్నారని పేర్కొన్నారు. డా. వైఎస్సార్ చేసిన సంక్షేమంతో ఎంతోమంది ఉన్నత విద్యనభ్యసించి అమెరికా వరకు చేరుకున్నారని అన్నారు. మహానేత వైఎస్సార్ పాలనను ఆయన తనయుడు జగన్ కొనసాగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ సేవా కార్యక్రమాలు జరిగినా వైఎస్సార్ ఫౌండేషన్ స్పందించి తనవంతు సాయాన్ని అందిస్తుందనీ వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ ఫౌండేషన్‌కు సంబంధించి అమెరికాలో ఎంతోమంది తమవంతుగా ముందుకు వచ్చారన్నారు. మానవత్వం, దార్శనికత కలగలిసిన వ్యక్తి మహా మనిషి వైఎస్సార్, మన మధ్య లేరు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంటూ అమెరికా వైస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి ఆ మహానేతను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిమిక్రి రమేష్ తన అద్భుతమైన గళంతో వైఎస్సార్‌ను అనుకరించి సభికులను అలరించారు. - వాష్టింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్సీపీ ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో ప్లీనరీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2011 జూలై 8న ఇడుపులపాయలో జరిగిన మొదటి ప్లీనరీ, 2017 జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన రెండో ప్లీనరీకంటే మూడో ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీకీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారికి పశ్చిమాన, తూర్పునకు అభిముఖంగా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మిస్తున్నారు. వేదికపై కూర్చున్నవారు, ప్రసంగించే వారు జాతీయ రహదారిపై నిలబడిన వారికి కూడా కనబడేలా నిర్మాణం జరుగుతోంది. వేదికకు ఎదురుగా లక్షలాది మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినా ఒక్కరూ తడవకుండా భారీ టెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీకి వేలాది వాహనాల్లో శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ జరిగే రెండు రోజులూ ముఖ్యమంత్రి అధికారిక విధులు నిర్వర్తించడానికి వేదిక వెనుకవైపు తాత్కాలిక కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. సంప్రదాయ వంటకాలతో విందు ప్లీనరీకి హాజరయ్యే లక్షలాది పార్టీ నేతలు, కార్యకర్తలకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర సంప్రదాయ వంటకాలతో జూలై 8, 9న టిఫిన్, విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం భారీ వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వంటల బాధ్యతను దేశంలోనే ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లాఇందుపల్లి వాసులకు అప్పగించారు. దీనికి సమీపంలోనే విశాలమైన భోజనశాలలు నిర్మిస్తున్నారు. ఇక్కడ వేడి వేడిగా ఫలహారాలు, కాఫీలు, భోజనాలు వడ్డిస్తారు. ప్లీనరీ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూలై 7 నాటికి ప్లీనరీ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని రఘురాం చెప్పారు. -
17వ ఆటా మహాసభలు: వారధిగా ‘ఆటా’
వాషింగ్టన్ డీసీ: వాషింగ్టన్ డీసీ వేదికగా అమెరికన్ తెలుగు అసొసియేషన్ నిర్వహించబోతున్న వేడుకలు రెండు రాష్ట్రాలకు, ప్రవాసాంధ్రులకు మధ్య వారధిగా నిలవబోతు న్నాయి. ఈ వేడుకలకు రెండు రాష్ట్రాల నుంచి 60 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఆటా వేదికగా పొలిటికల్ డిబేట్లు జరగనున్నాయి. వీటితో పాటు వివిధ రంగాలకు సంబంధించి నిష్ణాతులైన వారితో డీసీ కన్వెన్షన్‌లోని వేర్వేరు వేదికలపై చర్చా కార్యక్రమాలు విడివిడిగా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక చిరునామా పుట్టి పెరిగిన మాతృభూమిపై మమకారం చూపించేలా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీకి అయిదు స్టాళ్లు, తెలంగాణకు అయిదు స్టాళ్లు ఇందులో ఉంటాయి. రెండు ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ కీలక అంశాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రవాసాంధ్రులకు వివరించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం స్టూడెంట్ అవేర్నెస్ డెస్క్, అలాగే మెడికల్, టూరిజం, రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలందిస్తారు. ఈ స్టాళ్లలో ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాల్లో ప్రవాసులు తమ వంతుగా భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ‘నాడు-నేడు’, ‘మన బడి’ లాంటి కార్యక్రమాలకు విరాళాలను అందించడంలో ముందుంటున్నారు. ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం మరింత పెంచేలా అధికారులు ఈ స్టాళ్లలో వివరాలందించ నున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు హరి లింగాల, రత్నాకర్ పండుగాయల తదితరులు వీటికి తోడ్పాటు అందిస్తున్నారు. ముఖ్య విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు ఈ స్టాళ్లలో అందుబాటులో ఉండి ప్రవాసాంధ్రుల విజ్ఞప్తులను పరిశీలిస్తారు. మొత్తమ్మీద ప్రభుత్వానికి, అలాగే ప్రవాసాంధ్రులకు ఆటా కన్వెన్షన్ వారధిగా నిలవనుంది. జోహార్ వైఎస్సార్ ఆటా వేడుకల్లో భాగంగా డీసీ కన్వెన్షన్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం అమెరికాలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. మరి కొంత మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చే రెండు రోజుల్లో అమెరికా రానున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
జూలై 8, 9న వైఎస్సార్సీపీ ప్లీనరీ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు వైఎస్సార్సీపీ ప్లీనరీని నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహించే పార్టీ ప్లీనరీని గుంటూరు – విజయవాడ రహదారిపై నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన ప్రాంగణంలో నిర్వహించనున్నారు. 2017 జూలై 8, 9న జరిపిన ప్రదేశంలోనే ఇప్పుడు కూడా ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ : విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జూలై 8వ తేదీన ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం వరకు ప్లీనరీ జరుగుతుందన్నారు. పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అతిథులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అందరూ సమష్టిగా పనిచేయాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని చెప్పారు. ఐకమత్యానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, వర్గాలను ప్రోత్సహించే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. దీనిని గుర్తించి నేతలందరూ ఐకమత్యంతో ముందుకు నడవాలని చెప్పారు. పార్టీ కమిటీలకు పేర్లు సూచించండి పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలకు పేర్లు సూచించాలని చెప్పారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేసే వారికి స్ధానం లభిస్తుందని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ శాసన సభ్యులు, నియోజకవర్గాల ఇన్చార్జిలు పార్టీ పటిష్టత కోసం పాటు పడే వారిని సూచించాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని వివరించారు. ఈ పేర్లను జూన్ పదో తేదీ నాటికి జిల్లా అధ్యక్షుల ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ కమిటీలపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను సమావేశపరిచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలని తెలిపారు. అనంతరం కమిటీల నిర్మాణం చూడాలన్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు కూడా వారి పరిధిలోని జిల్లా అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నూతన కమిటీలను ప్లీనరీలో ప్రకటిస్తారని వివరించారు. సచివాలయాల సందర్శన కార్యక్రమం అనంతరం బూత్ కమిటీలకు కూడా పేర్లను పంపాలని కోరారు. జగన్ పాలన పట్ల ప్రజల్లో అచంచల విశ్వాసం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారనే విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమెందన్నారు. సీఎం జగన్ నాయకత్వం పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసంతో ఉన్నారనేది కూడా స్పష్టమైందన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యిందని తెలిపారు. ప్రజల్లో సీఎం జగన్, వైఎస్సార్సీపీకి ఉన్న ఆదరణను ఈ బస్సు యాత్ర కళ్లకు కట్టిందని తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌కు పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. -
1న వైఎస్సార్ పురస్కారాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు 59 అవార్డులను ప్రకటించింది. వీటిల్లో 29 వైఎస్సార్ జీవిత సాఫల్య, 30 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలున్నాయి. అయితే కోవిడ్ కారణంగా పురస్కారాల ప్రదానం వాయిదా పడిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీటిని ప్రదానం చేయనున్నారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసినట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్‌తో పాటు అసామాన్య ప్రతిభ కనబరచిన సామాన్యులను సైతం గుర్తించి హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఈ అవార్డులకు ఎంపిక చేశామన్నారు. వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ అందజేయనున్నారు. వైఎస్సార్ సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ బహూకరిస్తారు. -
కాలిఫోర్నియా, బే ఏరియాలో వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72 వ జయంతి వేడుకలు అమెరికాలో కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా జరిగాయి. బ్లూ ఫాక్స్ ఇండియన్ హోటల్ లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. యూఎస్ఏ వైస్సార్సీపీ కన్వినర్, ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల సలహాదారు చంద్రహాస్ పెద్దమల్లు ,యూఎస్ఏ వైఎస్సార్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరిగింది. వైఎస్సార్సీపీ యూఎస్ఏ కమిటీకి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ప్రతనిధులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు . యూఎస్ఏ వైఎస్సార్సీపీ కన్వినర్, ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల సలహాదారు చంద్రహాస్ పెద్దమల్లు మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం, ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా, వైఎస్సార్సీపీ యూఎస్ఏ, డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ "కమ్యూనిటీ సేవ" సంస్థ ద్వారా సుమారుగా 500 కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్యూనిటీ సేవ సంస్థ ఫౌండర్ చైర్మన్ నాథన్ గణేశన్ వైఎస్సార్సీపీ యూఎస్ కమిటీ, డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ వారికి కృతఙ్ఞతలు తెలియచేశారు వైఎస్సార్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కేవీరెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన అన్నారు. వైఎస్సార్ స్పూర్తితో , వారి ఆశయాలను వారి కుమారుడు నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారు అని కొనియాడారు. వైస్సార్సీపీ యూఎస్ కమిటీ ముఖ్య సభ్యులైన సురేంద్ర అబ్బవరం, సుబ్రహ్మణ్యం రెడ్డివారి , హరిద్ర శీలం , కిరణ్ కూచిభట్ల త్రిలోకనంద రెడ్డి ఆరవ, మహేశ్వర్ రెడ్డి, వంశి ఏరువారం, పుల్లారెడ్డి లు మాట్లాడుతూ వైఎస్సార్ సంక్షేమ పాలనను వారితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజన్న రాజ్యం తిరిగి వారి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమలో బే ఏరియా వైఎస్సార్ అభిమానులు అంకిరెడ్డి , గోపాల్, వీరారెడ్డి, హారిన్ద్ర శీలం, కొండారెడ్డి, సుగుణ, సుబ్బారెడ్డి, ప్రశాంతి, రామిరెడ్డి, నరేంద్ర కొత్తకోట, వినయ్, సుబ్బారెడ్డి ,తిరుపతిరెడ్డి పేరం, అమర్, రామిరెడ్డి , సురేష్ తనమల , అంకిరెడ్డి, వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం నాయకులు పాల్గొన్నారు. -
నార్త్ కరోలినాలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు
అమెరికాలో జననాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఉత్సవాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం సామూహిక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేకా సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్స్, హెల్త్ క్యాంప్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్స్ ను అందించినట్లు చెప్పారు. అదే విధంగా వైఎస్సార్ అభిమానులు జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, వైఎస్సార్ ఫౌండేషన్ సేవల్ని వినియోగించుకోమని తెలియచేసారు. రాధాకృష్ణ కాలువాయి వైఎస్సార్ సేవల్ని కొనియాడుతూ వైఎస్సార్ అభిమానులకు ఘన స్వాగతం పలికారు. సునీత రెడ్డి మాట్లాడుతు వైఎస్సార్ రైతుల పక్షపాతి అని, ఎప్పుడు రైతుల గురించి వారి భరోసా గురించి ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ రైతులకు స్ఫూర్తిగా వైఎస్సార్ జయంతి నాడు వనభోజనాలు ఏర్పాటుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు వక్తలు వై ఎస్సార్ గారు చేసిన సేవలను కొనియాడారు. కేక్ కట్ చేసి, వై ఎస్సార్ గారి పుట్టినరోజు ని ఘనంగా జరుపుకొన్నారు. ఫుడ్ డ్రైవ్ దాతలకు, వాలంటీర్లకు పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియచేశారు. ఫుడ్ డ్రైవ్ చేయడం, ఆనందం గా వనభోజనాలు నిర్వహించినందుకు వై ఎస్సార్ అభిమానులు నిర్వాహకులను అభినందించారు. వాతావరణంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బా రెడ్డి మేకా, రాధాకృష్ణ కాలువాయి, సునీత రెడ్డి, సురేష్ దేవిరెడ్డి, సంజీవ రెడ్డి, మస్తాన్ రెడ్డి, బాజీ షేక్, ప్రసన్న కూసం, అశోక్ మోర ల సారధ్యంలో పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. దాతలు రాజశేఖర రెడ్డి సున్నం, రామి రెడ్డి కైపు, శ్రీనివాస్ సింగళరెడ్డి, అశోక్ మోర, రౌనక్ రెడ్డి, నారాయణ్ దొంతు, బాజీ షేక్, జగదీష్, సునీత రెడ్డి, రఘునాథ్ కొత్త, రాధాకృష్ణ కలువాయి సుబ్బా రెడ్డి మేకా సహకారం చేశారు. వాలంటీర్లు సురేష్ దేవిరెడ్డి, సునీత రెడ్డి, బాజీ షేక్, మస్తాన్ రెడ్డి, రామి రెడ్డి కైపు, శ్రీనివాస్ సింగళరెడ్డి, చందు రెడ్డి , నారాయణ్ దొంతు, సంజీవ రెడ్డి, దుశ్యంత్ రెడ్డి, జగదీష్ , అశోక్ మోర, ప్రసన్న కూసం, హరినాథ్ చేజెర్ల, వెంకట్ జమ్ముల , శ్రీధర్ రామిరెడ్డి, కిరణ్ అంకిరెడ్డి, వీర రెడ్డి గొట్టివీటి, శంకర్ రెడ్డి తమ్మాలు సేవలందించారు. -
టెక్సాస్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
అమెరికాలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో టెక్సాస్ రాష్ట్రం లో ఆస్టిన్ నగరంలో ప్రవాసాంధ్రులు వైఎస్సార్ జయంతి జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఫౌండేషన్ ప్రతినిధులు ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గండ్ర నారాయణ రెడ్డి, మురళీధర్ రెడ్డి బండ్లపల్లి,ప్రవర్ధన్ చిమ్ముల , మల్లిక్ ఆవుల, కొండా రెడ్డి ద్వారసాల, వెంకట శివ నామాల, రవి బల్లాడ, పుల్లా రెడ్డి, పరమేష్ రెడ్డి, వసంత్ రెడ్డి, వెంకటేష్ భాగేపల్లి, చంద్ర గురు ద్వారసాల, అశోక గూడూరు, నర్సి రెడ్డి, బ్రహ్మేంద్ర లక్కు, హేమంత్ బల్ల, విజయ్ రెడ్డి ఎద్దుల, ప్రదీప్ లక్కిరెడ్డి, అనంత్ రెడ్డి తో పాటు పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
మిన్నసోటాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రం మిన్నియాపాలిస్ నగరంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు వైఎస్సార్ తెలుగు ప్రజలకు చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా అశేష అభిమానులు కేక్ కట్ చేసి వైఎస్సార్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేలా కృషి చేసిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్లా రామి రెడ్డి, బేలీఫ్ రెస్టారెంట్ యజమాని శ్రీనివాస్ రెడ్డికి ప్రవాస భారతీయులు కృజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట రామిరెడ్డి చింతం, శంకర్ బండి, సాయినాథ్ రెడ్డి ఎర్రి, నారాయణ్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస రెడ్డి వాకా, మైసూరా రెడ్డి, ఎం రామాంజి , గంగి రెడ్డి, మోహన్ మార్చేట్టి, శ్రీనివాస రెడ్డి (రోబో), వీర కిశోర్ రెడ్డి, రామాంజన రెడ్డి మోటాటి, తానేశ్వర్ రెడ్డి తో పాటు పలువురు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
పెన్సిల్వేనియా లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
పెన్సిల్వేనియా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రము లో హ్యర్రీస్ బర్గ్ నగరంలో జులై 11న ఘనంగా జరిగాయి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన అధ్యాయం లిఖించారని అమెరికాలోని పెన్సిల్వేనియాలో హ్యర్రీస్ బర్గ్ నగరం లో ఉన్న ప్రవాస భారతీయులు అభిప్రాయ పడ్డారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అమెరికా స్టూడెంట్ కన్వీనర్ పెన్సిల్వేనియా రీజనల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ సాత్విక్ రెడ్డి గోగులమూడి, హ్యర్రీస్ బర్గ్ ఇంచార్జి తేజ అధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో అనుబంధాన్ని ప్రవాస భారతీయులు గుర్తుచేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అమెరికా స్టూడెంట్ కన్వీనర్ పెన్సిల్వేనియా రీజనల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ సాత్విక్ రెడ్డి గోగులమూడి మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు డాక్టర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందారని చెప్పారు. మాట తప్పని..మడమ తిప్పని నేతగా ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. హ్యర్రీస్ బర్గ్ ఇంచార్జి తేజ మాట్లాడుతూ... అందరికీ మంచి చేయాలనే తపనతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ వైఎస్సార్ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ తపనతో ఉందన్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌కు అభిమానులు ఉన్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అమెరికా స్టూడెంట్ కన్వీనర్ పెన్సిల్వేనియా రీజనల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ సాత్విక్ రెడ్డి గోగులమూడి, హ్యర్రీస్ బర్గ్ ఇంచార్జి తేజ, మల్లికార్జున రెడ్డి కసిరెడ్డి , విభూషణ్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, వాకా కృష్ణ, రవీందర్ రెడ్డి శీలం, రాజేష్ ఊతకోళ్ళు , వెంక రెడ్డి సుంకర , ప్రకాష్ మిరియాల, వెంకట్ దంగేటి, అన్వేష్ ముత్యాల, సుజీత్ అనుగు లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ 72వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని నార్త్ వెస్ట్ వైఎస్ఆర్సీపీ సీటెల్ (వాషింగ్టన్) - పోర్ట్ ల్యాండ్ విభాగం, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) అధ్వర్యంలో సీటెల్ హిల్లైర్ పార్క్ లో ఘనంగా నిర్వాహించారు. ఈ వేడుకల్లో సీటెల్ లో ఉన్న వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వైఎస్సార్ కు నివాళులర్పించారు. అనంతరం అశేష అభిమానులు కేక్ కట్ చేసి వైఎస్సార్ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల జ్యోతి ప్రజల్వన అందర్ని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీ రీజినల్ కో ఆర్డినేట్ దుశ్యంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తన హయాంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన ఆరోగ్యశ్రీ,108,104, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో చరిత్రలో చిరస్మరనీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ " తండ్రి ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగు వేస్తా అని" వైఎస్సార్ ఆదర్శాలను పునికి పుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. -
రావి ఆకుపై వైఎస్సార్ చిత్రం
సాక్షి, అల్వాల్: తన అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాన్ని రావి ఆకుపై చిత్రించి అబ్బురపరిచాడు ఓ వ్యక్తి.. దివంగత నేత వైఎసరాజశేఖర్రెడ్డి జయంత్రి సందర్భంగా అల్వాల్‌కు చెందిన మెక్రో స్వర్ణకారుడు పూన ప్రదీప్ కుమార్ గురువారం రావి ఆకుపై వైఎస్సార్ చిత్రాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు -
పేదల గుండె చప్పడు వైఎస్సార్: ఆవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం : పేదల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్డర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిఉంటారన్నారు. గురువారం మద్దిలపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి జీవితం అందరికీ అదర్శమన్నారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా సేవాదళ్ నగర మహిళా అధ్యక్షరాలు, రజక కార్పొరేషన్ చైర్మన్ ఈగలపాటి యువశ్రీ నిర్వహణలో పలువురు రక్తదానం చేశారు. బీచ్‌రోడ్డులో... బీచ్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి నగర మేయర్ హరివెంకట కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు. వైఎస్సార్ జయంతిని ‘రైతు దినోత్సవం’గా రాష్ట్ర ప్రజలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించారని, ఒక మహిళను హోమ్ మినిస్టర్ చేసిన ఘనత ఆయనదేనన్నారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షడు వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి చేసిన మేలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ లేని ఆంధ్రప్రదేశ్‌ను ఊహించుకోలేమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కేకే రాజు, అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, ఎస్ఏ రెహమాన్, తిప్పల గురుమూర్తిరెడ్డి, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేషన్ చైర్మన్లు కోలా గురువులు, మధుసూదన్‌రావు, పి.సుజాత నూకరాజు, పి.సుజాత సత్యనారాయణ, పార్టీ అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, మొల్లి అప్పారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, పార్టీ ముఖ్యనాయకులు పీవీఎస్ రాజు, అల్లంపల్లి రాజుబాబు, ద్రోణంరాజు శ్రీవాత్సవ, సతీష్‌వర్మ, మంత్రి రాజశేఖర్, కాశీవిశ్వనాథం, పేడాడ రమణికుమారి, కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, శశికళ, బర్కత్ అలీ, మొల్లి లక్ష్మి, చిన్న జానికీరామ్, కెల్లా సత్యనారాయణ, అప్పలరత్నం, విల్లూరి భాస్కరరావు, కార్పొరేషన్ డైరెక్టర్లు బి.పద్మావతి, పేర్ల విజయచందర్, షబీర్ బేగం, జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు జి. శ్రీధర్‌రెడ్డి, బి.కాంతారావు, బోని శివరామకృష్ణ, షరీఫ్, బాకి శ్యాంకుమార్‌రెడ్డి, మారుతిప్రసాద్, పైడి రత్నాకర్, మైకల్రాజ్, చొక్కర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ పథకాలు దేశ చరిత్రలో ఓ అధ్యాయం
న్యూఢిల్లీ, జూలై 8: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన పథకాలు దేశ చరిత్రలో ఓ అధ్యాయంగా నిలిచాయని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఢిల్లీలోని బాల్ సహయోగ్‌లో గురువారం వైఎస్సార్ 72వ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ చిత్రపటం వద్ద ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గా ని భరత్‌రామ్ జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. చిన్నారులతో కేక్ కట్‌చేయించారు. బాల్ సహయోగ్‌లోని అనాథ బాలురకు, అక్కడ పనిచేసే మహిళలకు వస్త్రాలు, మిఠాయిలు పంపిణీ చేసి, అన్నదానం చేశారు. -
జనహృదయాల్లో రాజన్న సుస్థిరం
సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి, సంక్షేమబాటలో నడిపించిన చరితార్థుడని కీర్తించారు. ఆ తండ్రి వారసుడిగా, ఆయన ఆశయాలే ఊపిరిగా వైఎస్ జగన్ ప్రజల ముందుకొచ్చారని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. బందెల కిరణ్‌రాజు ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కడపకు చెందిన తేజశ్రీ బాలకృష్ణ పెన్సిల్‌తో ప్రత్యేకంగా గీసిన వైఎస్ కుటుంబసభ్యుల ఫొటో ఎగ్జిబిషన్‌ను సజ్జల ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి రచించిన ‘మరువలేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడే తమ వైఖరేంటో స్పష్టంగా చెప్పామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, దీనికి అడ్డం వచ్చే దేన్నీ వైఎస్ జగన్ స్వాగతించరని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణ్ణమూర్తి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఊరూవాడా రైతుల పండుగ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. వ్యవసాయ, సాగునీటి రంగాలకు మహానేత చేసిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్రస్థాయి రైతు దినోత్సవం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరగగా.. జిల్లా, నియోజకవర్గస్థాయిల్లోనే కాదు.. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) స్థాయిల్లో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. జిల్లాస్థాయి వేడుకల్లో మంత్రులు, నియోజకవర్గస్థాయి వేడుకల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన ఆర్బీకే భవనాలతో పాటు వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్, ఆక్వా ల్యాబ్స్, సీఏడీడీఎల్‌లు, ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాలు (సీహెచ్‌సీలు), వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రైతుబజార్లను స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పాడిరైతుల కోసం దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ టెలీమెడిసిన్ కాల్ సెంటర్‌ను విజయవాడలో ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైతుబజార్లతో పాటు ఆర్బీకేలకు అనుబంధంగా గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం, మార్కెట్ యార్డులు ఆధునికీకరణ, అదనపు సౌకర్యాల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్బీకేల వద్ద కోలాహలం వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఆర్బీకేలను పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఆర్బీకేల్లో జరిగిన వేడుకల్లో పెద్దఎత్తున రైతులు పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఆర్బీకేల్లోని స్మార్ట్‌టీవీల ద్వారా ముఖ్యమంత్రి పాల్గొన్న రైతుదినోత్సవాన్ని వీక్షించారు. రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చదివి వినిపించారు. జిల్లా, మండల స్థాయిల్లో ఆదర్శరైతులను నగదు ప్రోత్సాహకాలతో ఘనంగా సత్కరించారు. ఆర్బీకేల్లో చేప, రొయ్యల ఫీడ్ పంపిణీతోపాటు పాడిరైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, పశువుల దాణా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విశ్వవిద్యాలయాల్లో.. డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్, ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీల ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో జరిగిన వేడుకల్లో ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకీరామ్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. గిరిజన రైతులకు జాజికాయ, మిరయం మొక్కలను పంపిణీ చేశారు. ఉద్యానపంటల్లో సేంద్రియ సాగుపద్ధతులు అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అభ్యుదయ రైతులను సత్కరించారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో వీసీ ప్రొఫెసర్ వి.పద్మనాభరెడ్డి మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. పాడిరైతులను సత్కరించి పశువిజ్ఞాన కరదీపికను పంపిణీ చేశారు. గుంటూరులోని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ దంపతులు
-
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ దంపతులు
వైఎస్ఆర్ జిల్లా: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్ 72వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ అంజలి ఘటించి నివాళులు అర్పించారు. సీఎం జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు రాత్రి సీఎం జగన్ ఇక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. అంతకుముందు వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ కోసం రూ.154 కోట్లు కేటాయించామని తెలిపారు. పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నామని, రూ.30 కోట్లతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. -
వైస్ఆర్ లాంటి నాయకుడు కాంగ్రెస్ లో లేడు : కోమటిరెడ్డి
-
పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, పులివెందుల: పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ కోసం రూ.154 కోట్లు కేటాయించామని తెలిపారు. పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నామని, రూ.30 కోట్లతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ చేరుకొని మహానేత వైఎస్ఆర్కు సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. -
కర్నూలు జిల్లా పాణ్యంలో ఘనంగా వైస్ఆర్ జయంతి వేడుకలు
-
నీటిని రాజకీయాలకు వాడుకోవద్దు: సీఎం జగన్
రాయదుర్గం: నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంతోనూ విబేధాలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని, అన్ని రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలుపెట్టలేదని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తుచేశారు. తెలంగాణలో కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని.. ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిపియని సీఎం తెలిపారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావని, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవని ఆయన చెప్పారు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లకు 800 అడుగులలోపే నీళ్లు తీసుకుంటున్నారని సీఎం జగన్ అన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగుల్లోపు తెలంగాణ వాడుకున్నప్పుడు ఏపీ వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అయ్యా చంద్రబాబు ఆనాడు ఏం చేశావ్? అయ్యా చంద్రబాబు ఇవాళ మాటలు మాట్లాడుతున్నావు. అయ్యా? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు తెలంగాణలో ప్రాజెక్ట్‌లు కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా ’ అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి, దిండి.. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీకూడా కడుతూ ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా? అని చంద్రబాబుని సీఎం జగన్ నిలదీశారు. రైతులు ఏ ప్రాంతంలో ఉన్నా రైతులేనని, రైతుల కోసం అందరూ కలిసి రావాలని సీఎం అన్నారు. నీటిని రాజకీయాలకు వాడుకోవద్దని సీఎం జగన్ సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ తన పాలనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్ ఆశయాలను అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం బాల సహయోగ్‌లో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వైఎస్సార్ తన పాలనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్ పాలన చేశారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా, ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతించారు. -
వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సాక్షి, జాగిత్యాల: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మహానేత జయంతి సందర్భంగా జాగిత్యాలలో ఆయన జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ''తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహా నాయకుడు వైఎస్సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బాట వేసిన నాయకుడు. ఏపీ, తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్సార్. వైఎస్సార్‌కు భారతరత్న ప్రకటించేలా ఏపీ, తెలంగాణ సీఎంలు కేంద్రాన్ని కోరాలి'' అని తెలిపారు -
పీసీసీ రానందుకు బాధగా ఉంది: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి : తనకు పీసీసీ అధ్యక్ష పదవి రానందుకు బాధగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం భువనగిరిలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ చాలా పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా పోలేదు. నాకు పార్టీ మారే అవసరం లేదు. నాకు కొత్త గ్రూపులు కట్టే అవసరం లేదు. నాకు ఏ పదవి అవసరం లేదు. గాంధీ భవన్లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రజలతో మమేకమై గ్రూప్‌లు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం’’ అని అన్నారు. -
సంక్షేమ శేఖరుడు.. రాజన్న
‘పోలవరం’ కోసం పరితపించారు.. డెల్టా ఆధునికీకరణకు నడుం బిగించారు.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టారు.. ఉద్యాన వర్సిటీని స్థాపించి ఉద్యాన రైతులకు ఆసరాగా నిలిచారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం తీసుకువచ్చారు.. ఆరోగ్యశ్రీ, 108లతో ప్రాణదాతగా నిలిచారు.. నీటిపారుదల, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ ‘పశ్చిమ’పై ఎనలేని ప్రేమను చూపించారు. అడుగడుగునా తన గురుతులతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. గురువారం ఆయన జయంతి సందర్భంగా మహానేతా.. అందుకో మా జోత అంటూ పశ్చిమవాసులు నివాళులర్పిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు/బుట్టాయగూడెం: పశ్చిమగోదావరి సమృద్ధిగా ఉండాలి. అన్నదాతకు సాగు కష్టాలు తీరితేనే అంతా బాగుంటుంది. అవసరాలకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వగలితే అంతా చేసినట్టే ఇది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నమ్మినమాట. దానిని ఆచరణలో పెట్టడంతో ‘పశ్చిమ’ ముఖ చిత్రం మారేలా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి శాశ్వతంగా తన ముద్ర ఉండేలా మేలు చేశారు. రాష్ట్ర జీవనాడి పోలవరం కోసం వైఎస్సార్ పరితపించారు. అన్ని అనుమతులూ తీసుకువచ్చి కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 80 శాతానికిపైగా పనులు పూర్తి చేయించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఈస్థాయిలో పరుగులు పెట్టడానికి వైఎస్సార్ చూపిన చొరవే కారణం. తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు ఆయన చలువతోనే రూపుదిద్దుకున్నాయి. ఏలూరుకు తమ్మిలేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం చూపారు. 2005లో రూ.17 కోట్లతో మరమ్మతులకు నిధులు మంజూరు చేసి శాశ్వత ప్రాతిపదికన రూ.90 కోట్లతో తమ్మిలేరు కరకట్టను పరిపుష్టి చేశారు. ఏజెన్సీలోని కొండ కాలువలపై హైలెవెల్ బ్రిడ్జిని రూ.25 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసాపురం వద్ద వశిష్ట వంతెన నిర్మాణానికి రూ.194 కోట్ల నిధులు మంజూరు చేసినా ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ వంతెనను కలగా మిగిల్చాయి. జిల్లాకు అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ.20 కోట్లతో రివిట్మెంట్ నిర్మించడానికి చొరవ చూపడంతో ఆ ప్రాంత ప్రజలు ముంపు నుంచి బయటపడ్డారు. జిల్లాలో అర్హులైన పేదలకు 30 వేల ఎకరాలు భూ పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. ఉచిత విద్యుత్ అందించడంతో పాటు ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసి రైతు బాంధవుడిగా నిలిచిపోయారు. గిరిజనులకు పట్టాలు జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులకు సుమారు 30 వేల ఎకరాల పోడు భూములకు గాను వైఎస్సార్ పట్టాలిచ్చారు. గిరిజన ప్రాంతంలోని సుమారు 1,700 మంది గిరిజన పోడు భూమి రైతులకు 6,500 ఎకరాలకు పట్టాలను అందించడంతో పాటు భూములను సాగులోకి తీసుకువచ్చేలా బోర్లు వేయించి విద్యుత్ సదుపాయం కల్పించారు. ఉద్యాన’ వెలుగులు తాడేపల్లిగూడెంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఉద్యాన సాగు అభివృద్ధితో పాటు యువతకు విద్యావకాశాలు కల్పించేలా ఆయన తీసుకున్న చొరవ చిరస్మరణీయం. పోగొండ జలాలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పోగొండ రిజర్వాయర్ నిర్మాణం పూర్తికావడంలో వైఎస్సార్ చొరవ ఉంది. ప్రస్తుతం సుమారు 7,600 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందంటే అది ఆయన చలువే. -
గాంధీభవన్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో దివంగత మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట వ్యవహరాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, చైర్మన్లు దామోదర్ రాజనర్సింహ, మహేశ్వర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్, మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. -
వైఎస్సార్ జయంతి.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్..
సాక్షి, అమరావతి: తన తండ్రి వైఎస్సార్ 72వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం.. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా... పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా’’ అంటూ సీఎం జగన్ తన తండ్రిని స్మరించుకున్నారు. చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం నీ ఆశయాలే నాకు వారసత్వం ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా... పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.#YSRJayanthi — YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2021 -
రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన
వైఎస్సార్...రైతును రాజుగా చేసిన నేత. అందుకే ఆయన భౌతికంగా దూరమై దశాబ్దం దాటినా జనం గుండెల్లో మాత్రం నేటికీ కొలువై ఉన్నారు. కరువు జిల్లా అనంతలో ఏ చెట్టును కదిపినా...ఏ ప్రాజెక్టును పలకరించినా వైఎస్సార్ పేరే వినిపిస్తుంది. ఇక రైతన్నతో వైఎస్సార్ గురించి ప్రస్తావిస్తే స్వర్ణయుగం కళ్లముందు కనిపిస్తుంది. ఆయన తనయుడు, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్ జయంతి (జూలై 8వ తేదీ)ని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తోంది. సాక్షి,అనంతపురం: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సువర్ణపాలనను తలపించేలా ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. గత రెండేళ్లుగా అడుగడుగునా అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. రెండేళ్లలోనే రూ.2,700 కోట్ల జమ రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న పథకాలతో వ్యవసాయం, అనుబంధ శాఖలు పురోభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి. ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ కింద ఏటా ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం కింద రెండేళ్ల కాలంలో రూ.1,938.72 కోట్లు జమ చేశారు. ‘వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు’ పథకం కింద రెండేళ్లలో రూ.61.55 కోట్లు జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి రూ.25.17 కోట్లు జమ చేశారు. ‘ఉచిత పంటల బీమా’ పథకం కింద రూ.628 కోట్లు ఇన్సూరెన్స్ మొత్తాన్ని నేరుగా చెల్లించారు. ఉద్యాన రైతులకు పంటల బీమా కింద రూ.51 కోట్ల పరిహారం ఇచ్చారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి రెండేళ్ల కాలంలో 181 బాధిత కుటుంబాల ఖాతాల్లోకి రూ.10.59 కోట్ల మేర పరిహారం జమ చేశారు. కనీస మద్దతు ధరతో రైతుల నుంచి రూ.250 కోట్ల విలువైన పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ‘వైఎస్సార్ పశునష్ట పరిహారం పథకం’ కింద గత రెండేళ్లలో 3 వేల మందికి పైగా బాధితుల ఖాతాల్లోకి రూ.9 కోట్ల వరకు జమ చేశారు. మొత్తమ్మీద రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలోనే వ్యవసాయ, అనుబంధ రంగాల కింద లబ్ధిదారులకు రూ.2,700 కోట్ల మేర బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇక రైతు భరోసా కేంద్రాల వేదికగా రైతులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. -
‘అనంత’ వాసులకు అరుదైన గౌరవం
సాక్షి,అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులు ఈ సారి అనంత వాసులు నలుగురితో పాటు రెండు సంస్థలకు దక్కాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు బండి నారాయణస్వామి, డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (వైఎస్సార్ జిల్లా తరఫున), పాత్రికేయ రంగంలో కదలిక సంపాదకులు ఇమామ్, కళాకారుల విభాగంలో దళవాయి చలపతి, స్వచ్ఛంద సంస్థల విభాగంలో ఆర్డీటీ, సత్యసాయి ట్రస్ట్‌కు లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులు దక్కగా, ఉద్యానంలో తాడిపత్రికి చెందిన ఎంసీ రామకృష్ణారెడ్డి, వైద్య రంగంలో స్టాఫ్ నర్సు జ్యోతి మేరీ ఎచీవ్మెంట్ అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకంతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహంతో సత్కరించనుంది. సేవే పరమావధిగా... పుట్టపర్తి అర్బన్: సేవే పరమావధిగా భావించే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌కు ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. 1972 సెప్టెంబర్ 2న ఈ ట్రస్ట్‌ను సత్యసాయిబాబా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బాబా ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పేదప్రజలకు అత్యాధునిక వైద్యం చేరువ చేసేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 153 దేశాల్లో సత్యసాయి భక్తులు సేవా ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానాలు, ఇళ్ల నిర్మాణాలు, ఎల్కేజీ నుంచి ఉన్నత విద్య వరకూ ఉచిత విద్యాబోధనను అందజేసేలా పాఠశాలలు, కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీని నెలకొల్పారు. కోవిడ్ –19 విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.5 కోట్ల చొప్పున విరాళాన్ని అందజేశారు. మరో రూ.5 కోట్ల వ్యయంతో మందులు కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. స్థానికంగా కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసి, వేలాది మందిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులను తరలించేందుకు ఉచితంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సత్యసాయి తాగునీటి పథకంలో భాగంగా 700కు పైగా గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. విలక్షణత స్వామి సొంతం ‘స్వామి’ అంటూ అందరూ గౌరవంగా పిలుచుకునే ‘అనంత’ కథకుడు బండి నారాయణస్వామి జీవితం చాలా విలక్షణమైనది. తొలుత కవిత్వంలో ఈదులాడిన స్వామి తదనంతర కాలంలో బాలసాహిత్యంలోకి వచ్చారు. నవలలు రాశారు. ఏకకాలంలో కరువు కథలు రాశారు. మధ్యతరగతి ద్వందాల్ని విమర్శిస్తూ రచనలు చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన 1987లో పరుగు కథతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘గద్దలాడుతాండాయి, మీ రాజ్యం మీరేలండి, నిసర్గమ్, రెండు కలల దేశమ్’ నవలలు రచించారు. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్ కథా కోకిల, కొలకలూరి ఇనాక్, ఎన్టీఆర్ పురస్కారాలను అందుకున్నారు. సాహిత్యానికి ‘రాచ’బాట కవిగా, విమర్శకునిగా, వ్యాసకర్తగా కరువు సీమ సమష్టి జీవన చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రాచపాలెం చంద్రశేఖరరెడ్డిది సాహితీ రంగానికి పరిచయం అక్కరలేని సుప్రసిద్ధమైన పేరు. స్వతహాగా చిత్తూరు జిల్లాకు చెందిన వారైనా.. వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డును వైఎస్సార్ జిల్లా తరఫున అందుకుంటున్నారు. నాలుగు దశాబ్ధాలుగా ఆయన అనంతను తన సాహితీ క్షేత్రంగా మార్చుకుని సాహిత్య యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ‘శిల్ప ప్రభావతి (పరిశోధనా గ్రంథం), మన నవలలు–మన కథానికలు (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గ్రంథం), కొన్ని కావ్యాలు – కొందరు కవులు, ప్రతిఫలనం (విమర్శనాత్మక గ్రంథం)’ తదితర పుస్తకాలను రచించారు. 2012లో గురుజాడ పురస్కారం, 2016లో తెలుగు భాషా పురస్కారం, 2017లో గుర్రం జాషువా అవార్డును అందుకున్నారు. పాత్రికేయ రంగంలో ‘కదలిక’ ఇమామ్... ‘కదలిక’ పత్రిక ద్వారా సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలా అక్షరీకరణ చేశారు. సీమ వేదికగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరువు పరిస్థితులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గాలను చూపెట్టారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు ప్రజా నాయకుడు తరిమెల నాగిరెడ్డితో కలిసి పనిచేస్తూ జనశక్తి పత్రికకు అనేక వ్యాసాలు రాశారు. 1983లో కదలిక పత్రికను ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డికి సన్నిహితునిగా ఉంటూ అనేక ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. అనేక సందర్భాలలో గౌరవ సత్కారాలందుకున్న ఇమామ్‌కు పాత్రికేయ రంగంలో వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారం దక్కడంపై పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దళవాయికి మరో పురస్కారం ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారుడు దళవాయి చలపతికి వైఎస్సార్ లైప్‌టైం అచీవ్మెంట్ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. వారసత్వంగా వచ్చిన తోలుబొమ్మలాటను తొలుత గ్రామాలలో ప్రదర్శించే ఆయన అనంతరం దేశ విదేశాలకు విస్తరించారు. ఎన్నో రాష్ట్ర జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. పరిఢవిల్లిన ఉద్యానం.. ఉద్యాన తోటల్లో నాణ్యమైన దిగుబడులు సాధించినందుకు తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు ఎంసీ రామకృష్ణారెడ్డికి వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 1995లోనే ట్రెల్లీస్ పద్ధతిలో ఎఫ్1 హైబ్రీడ్ రకం టమాట సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఉద్యాన పంటలు విస్తరించారు. 10 ఎకరాల్లో సాత్‌గుడి రకం చీనీ, 10 ఎకరాల్లో టిష్యూకల్చర్ భగువ రకం దానిమ్మ, 5 ఎకరాల్లో సూపర్సొనాకా రకం ద్రాక్ష, మరో 5 ఎకరాల్లో అలగార్ రకం మునగ సాగు చేస్తున్నారు. కేవలం పదో తరగతి వరకు చదువుకున్న అతను ఆధునిక సాగు పద్ధతులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ఉద్యాన దిగుబడులతో ఏటా రూ.కోటికి పైగా టర్నోవర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్డీటీ సిగలో మరో కలికితురాయి జిల్లాలో 1969 నుంచి సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో బడుగు, బలహీన, నిమ్నజాతులు, గిరిజనుల అభ్యున్నతికి సంస్థ ఫౌండర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎనలేని కృషి చేశారు. ఆయన స్ఫూర్తితో ఆ సేవా కార్యక్రమాలు నేటికీ కొనసాగుతున్నాయి. విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, ఉద్యానం, మహిళాభ్యున్నతి, గృహ నిర్మాణ రంగాల్లో విశేష కృషి చేస్తోంది. దివ్యాంగులు, అనాథల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామీణస్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దినందుకు రెండేళ్ల క్రితం ఆర్డీటీ సంస్థకు భారతీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్‌ను భారత ప్రభుత్వం అందించింది. తాజాగా సేవా రంగానికి సంబంధించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారానికి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వృత్తే దైవంలా.. వృత్తినే దైవంగా భావిస్తూ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న అనంతపురం సర్వజనాస్పత్రి స్టాఫ్ నర్సు కె.జ్యోతిమేరీకి కోవిడ్ వారియర్స్ విభాగంలో వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డును ప్రభుత్వం ఎంపిక చేసింది. 2006లో కర్నూలు జిల్లా పత్తికొండ పీహెచ్సీలో స్టాఫ్‌నర్సుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె 2012 నుంచి అనంతపురం సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కోవిడ్ బారిన పడి, 20 రోజుల తర్వాత కోలుకుని సూపర్ స్పెషాలిటీ కోవిడ్ ఆస్పత్రిలో 5 నెలల పాటు రోగులకు సేవలందించారు. ఈ ఏడాది సెకెండ్ వేవ్‌లోనూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కోవిడ్ ఓపీ, ఈఎన్టీ, ఐసోలేషన్, చెస్ట్ ఐసీయూ, తదితర కోవిడ్ వార్డుల్లో వరుసగా పని చేశారు. -
మహానేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు: సజ్జల
సాక్షి,తాడేపల్లి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ శ్రేణులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..'' మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. తొలి నుంచి వైఎస్ఆర్తో అడుగులు వేసిన వాళ్లమే. వైఎస్సార్ జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించుకోవటం ద్వారా వైఎస్ ఆశయాలను పునశ్చరించుకుని పునరంకితం అవుతాం. వైఎస్‌కు పచ్చదనం అంటే చాలా ఇష్టం. అందుకే ఈసారి మొక్కలు నాటడం కూడా చేస్తున్నాం షర్మిల వైస్సార్ కూతురు ఆశీర్వచనం తీసుకున్నారు.పార్టీ పేడతానని షర్మిల గతంలోనే చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఉండాలనే అక్కడ పార్టీ విస్తరించలేదు. షర్మిల పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రెవేటికరణ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసాం. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి.ప్రెవేటికరణ వ్యతిరేకంగా ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తాం.'' అని తెలిపారు. -
పేద ప్రజల దైవం మా బావగారు: మోహన్‌బాబు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం మహానేత జయంతిని పురస్కరించుకుని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. మరికొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రాజన్నకు నివాళులర్పిస్తున్నారు. ‘స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు ట్వీట్ చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, రచయిత కోన వెంకట్, దర్శకుడు గోపిచంద్ మలినేని ట్విటర్ వేదికగా వైఎస్సార్‌కు నివాళులర్పించారు. Remembering former chief minister of #AndhraPradesh Shri YSR garu on his birth anniversary. #YSR 🙏#YSRJayanthi #YSRajasekharaReddy pic.twitter.com/XYYDHDD2TV — BANDLA GANESH. (@ganeshbandla) July 8, 2021 Remembering Dynamic leader #YSRajasekharaReddy Garu on his birth anniversary 🙏🙏 pic.twitter.com/yJczHRjBXo — Gopichandh Malineni (@megopichand) July 8, 2021 Dr. Y.S.R 🙏 A legendary leader who became immortal with his services to the people through various innovative schemes and welfare programs. Let’s remember him on his Birth Anniversary 🙏#YSRJayanthi pic.twitter.com/mGQ0cFYXpH — Kona Venkat (@konavenkat99) July 8, 2021 -
కరువు నేలపై జలసిరి..
ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే.. ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే బీడువారిన నేల తల్లికి జలసిరులందించిన భగీరథునిలా.. కరువు నేలపై హరిత సంతకమయ్యాడు .దగాపడిన బడుగు జీవికి.. లయ తప్పిన పేద గుండెకు ఊపిరిలూదిన దైవంలా నిలిచాడు చదువు ‘కొనలేక’ పేదింటి అక్షరం చిన్నబోతే.. వయసుడిగిన నాడు ఆసరా లేక వృద్ధాప్యం ఉసూరుమంటే ఇంటికి పెద్దకొడుకై ఆపన్న హస్తం అందించాడు. మహానేత దూరమైనా ఆయన ఇచ్చిన అభివృద్ధి ఫలాలు నిత్యం గుర్తుచేస్తూనే ఉన్నాయి నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ రాజశేఖరుని స్మరించుకుంటున్నారు. సాక్షి,ప్రకాశం: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై పుష్కర కాలం కావస్తున్నా జిల్లా ప్రజలు మాత్రం ఆయన జ్ఞాపకాలను గుండెల్లో పదిలం చేసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరుపుతోంది. గురువారం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుందాం.. నిత్యం కరువుతో అల్లాడే జిల్లా రూపు రేఖలు మార్చేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. జిల్లాలో ఆయన ఆలోచనలతో జీవం పోసుకున్న ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం.... యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ రూపొందించిందే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టును రూపొందించారు. వైఎస్సార్ అకాల మరణం తరువాత పనులు నిలిచిపోయాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మళ్లీ పనులు వేగం పుంజుకున్నాయి. ►పాలేరు రిజర్వాయర్‌ను కూడా వైఎస్సార్ మంజూరు చేశారు. కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం పాలేరుపై చెన్నుపాడు వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును మధ్యలో టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయటానికి రూ.210 కోట్లతో కొత్తగా వ్యయ అంచనాలను మార్చి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ►జిల్లాలో సాగర్ ఆయకట్టు దాదాపు 4.40 లక్షల ఎకరాల్లో ఉంది. సాగు, తాగునీరు సక్రమంగా వచ్చేందుకు కాలువల మరమ్మతులు ఏళ్ల తరబడి చేపట్టకపోవటంతో సాగర్ నుంచి రావాల్సిన వాటా నీటిని కూడా వినియోగించుకునే పనిలేకుండా పోయింది. దీంతో అప్పట్లో రూ.400 కోట్లు ఖర్చు చేసి సాగర్ కాలువల అభివృద్ధిని చేపట్టారు. ► జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేకపోవటాన్ని గుర్తించిన వైఎస్సార్ జిల్లా కేంద్రం ఒంగోలులో రిమ్స్ మెడికల్ కళాశాలను మంజూరు చేయించారు. మెడికల్ కాలేజి నిర్మాణానికి రూ.250 కోట్లు మంజూరు చేశారు. ► కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను తీర్చేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజీ(ఎస్ఎస్) ట్యాంకును మంజూరు చేశారు. సాగర్ నీటితో రామతీర్థం జలాశయాన్ని నింపి తద్వారా కందుకూరు ఎస్ఎస్ ట్యాంకుకు తాగునీటిని సరఫరా చేయించేందుకు పూనుకున్నారు. ► రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి నీటిని రాళ్లపాడుకు మళ్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధికి పూనుకున్నారు. ► ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడిపోతున్న కనిగిరి ప్రాంత ప్రజల తాగునీటి అవస్థలు తీర్చేందుకు రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ► వీటితో పాటు మార్కాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు జిల్లాలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటానికి వైఎస్సార్ 2004 నుంచే పూనుకున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని రెండు మండలాల పరిధిలోని 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. అదేవిధంగా 15.25 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లు మార్చారు. అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి నీరు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గమనించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలో 84 వేల ఎకరాలకు సాగు నీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. -
ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు
విశాఖపట్నం: జిల్లాలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి. తెలుగువారికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో రాజశేఖరరెడ్డి నిలిచిపోతారు. దేశంలో సంక్షేమ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్. తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నారు. సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే సీఎం జగన్ వంద అడుగులు ముందుకు వేస్తున్నారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి, పార్టీ కన్వీనర్ కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, అక్రమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల, చింతలపూడి, తైనాల విజయ్ కుమార్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వైయస్సార్ జిల్లా: రాజంపేట మండలంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకముందు ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, అకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట పాత బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. గుంటూరు: నగరంపాలెంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. కృష్ణా: దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా.. ఉంగుటూరు మండలం తేలప్రోలులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వింత శంకర్ రెడ్డి, వాసు రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, తోట వెంకయ్య పాల్గొన్నారు. కడప: వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాష వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, మేయర్ సురేష్ బాబు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, ఏపీ ఏనార్టీ డైరెక్టర్ ఇలియస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిష్ణారెడ్డి కమలాపురం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహమండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రాజుపాలెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ ఉత్తమారెడ్డి పాల్గొన్నారు. కర్నూలు: జిల్లా వ్యాప్తంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, కర్నూలు మేయర్ బి.వై. రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుకా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా దేవరపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ: ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి వెల్లంపల్లి, మల్లాది విష్ణు. ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని.. వైఎస్ఆర్ అడుగు జాడల్లో సీఎం జగన్ వెళ్తున్నారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. పేదలందరి జీవితాల్లో వైఎస్ఆర్ వెలుగులు నింపారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నెల్లూరు: గాంధీబొమ్మ సెంటర్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి అనిల్‌కుమార్. ''తండ్రి ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. అన్నివర్గాల సంక్షేమాన్ని చూస్తూ జనహృదయనేతగా ఎదుగుతున్నారు'' అంటూ అనిల్ తెలిపారు. -
వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, షర్మిల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను, తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రజల గుండెల్లో వైఎస్సార్ స్థానం సుస్థిరం..
సాక్షి, శ్రీకాకుళం: ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఆ అభిమానం చెక్కు చెదరలేదు. క్యాలెండర్లు మారిపోతున్నాయి. ఆయనపై పెంచుకున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు. సంక్షేమం అంటే గుర్తుకువచ్చేది ఆయనే. అభివృద్ధి అంటే జ్ఞాప కం వచ్చేది ఆయన పేరే. వైఎస్సార్ మూడే అక్షరాలు. కానీ అభిమానుల పాలిట ఇవి మంత్రాక్షరాలు. వరుస సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆ పథకాలతో చిరంజీవిగా మార్చేశారు. అంతటి గొప్ప నేత జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో రాజన్న జ్ఞాపకాలు ►శ్రీకాకుళానికి ఓ పెద్దాస్పత్రి ఉండాల్సిందేనని భావించి ప్రజలు కోరకుండానే ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. మంజూరు ప్రకటన చేయడమే కాకుండా రూ. 119 కోట్లు కేటాయించారు. 300 పడకల జిల్లా కేంద్ర ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశా రు. ఏటా జిల్లా నుంచి వందల మంది వైద్యులను తయారు చేసే కళాశాలను జిల్లాలో పెట్టారు. శంకుస్థాపన, ప్రారంభో త్సవం రెండూ ఆయన చేతుల మీదుగానే జరిగాయి. ►జిల్లాకు యూనివర్సిటీని అందించిన ఘనత వైఎస్సార్‌దే. ఎచ్చెర్లలో 2008 జూలై 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడీ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతోంది. రైతు పక్షపాతిగా.. రైతులను ఆదుకున్న ఏౖకైక నేత వైఎస్సారే. 2.50 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశా రు. అప్పటికే రుణాలు చెల్లించేసిన వారికి రూ. 5వేలు చొప్పున ప్రోత్సాహం అందించారు. అంతటితో ఆగకుండా ప్రతి చుక్కనీటిని అందిపుచ్చుకుని, రైతుకు అందించాలని అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 2005మే నెలలో వంశధార స్టేజ్ 2, ఫేజ్2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20 మండలాల్లో 2.55లక్షల ఎకరాల కు సాగునీరందించేందుకు తలపెట్టారు. ఇప్పు డా కార్యక్రమంలోనే భాగంగానే నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాలోని హిరమండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19టీఎంసీల నీటి నిల్వకోసం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. తోటపల్లి ఫేజ్ 2 ప నుల ఘనత ఆయనకే దక్కుతుంది. సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కా రం కోసం రూ. 123.25కోట్లతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తయితే 2.55 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వైఎస్సార్ అప్పట్లో పనులకు శ్రీకారం చుట్టారు. 12500ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్ 1పనులను రూ. 57.87కోట్లతో చేపట్టారు. నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి నుంచి పంట పొలాలను, ఆవాసాలను రక్షించేందుకు రూ. 300కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు. సీతంపేట ఏజెన్సీలో 14 వేల ఎకరాల్లో 5వేల మందికి గిరిజన రైతు లకు పట్టాలు ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లక్షా 80వేల 817ఇళ్లు మంజూరు చేసి అందులో లక్షా 63వేల 140ఇళ్లను పూర్తిచేశారు. ఆరోగ్య ప్రదాతగా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ తో వేలాది మందికి జీవం పోశారు. 938 రకాల వ్యాధులకు కార్పొరేట్ వైద్యం అందించారు. ప్రమాద బాధితులకు అత్యవసర సమయంలో ఆస్పత్రికి చేర్పిస్తే ప్రాణం నిలబెట్టవచ్చని 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. గ్రామీణులకు ప్రతి నెలా వైద్యం అందించడానికి 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్లతో పేదలకు కార్పొరేట్ చదువులను చేరువ చేశారు. వైఎస్సార్ బాటలో సీఎం జగన్ తండ్రి బాటలోనే కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారు. రాష్ట్రానికి వైఎస్సార్ అందించిన సేవలను స్మరించుంటూ ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుతున్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నడుం బిగించారు. నేరడి బ్యారేజీ వివాదాన్ని కొలిక్కి తెచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద వేల కోట్ల రూపాయలను రైతులకు అందించారు. రైతు దినోత్సవం సందర్భంగా జిల్లాలో రైతులకు సంబంధించిన అగ్రీ ల్యాబ్, ఆక్వా ల్యాబొరేటరీ, రైతు భరోసా కేంద్రాలు తదితర ప్రారంభిస్తున్నారు. -
నేడు మహానేత జయంతి
సాక్షి, అమరావతి: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించటంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం, ద్విచక్ర వాహనాలు, నిత్యావసర సరుకుల పంపిణీ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఫొటోల ప్రదర్శన, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
తెలుగు ప్రజల ప్రియమైన నేత వైఎస్సార్
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అణగారిన ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడంతో పాటు పేద, అణగారిన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా సందేశమిస్తూ ప్రజల సంతృప్త స్థాయి వరకు సంక్షేమాన్ని అమలు చేయడం ఆ మహానేత సంకల్పమని గవర్నర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే తెలుగువారి ప్రియమైన నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. నేల తల్లిని నమ్మిన భూమిపుత్రుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ‘రైతు దినోత్సవం’గా పాటించడం సముచితమని గవర్నర్ చెప్పారు -
మరపురాని మహానేత.. మా రాజన్న
వైఎస్సార్ మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు.. కానీ, తనదైన పాలనతో ప్రతి ఒక్కరి హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేశారు. ఆయన రూపకల్పన చేసిన సంక్షేమం రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి బాటలు వేసింది. ఆయన పేరు తలుచుకోగానే స్వచ్ఛమైన చిరునవ్వు కళ్ల ముందు మెదలుతుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. నమస్తే.. నమస్తే.. అన్న మాటలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్’.. తెలుగువాడి హృదయాల్లో చెక్కు చెదరని పేరు.. ఆ అక్షరాలు వింటే తెలుగు నేల పులకిస్తుంది.. పచ్చని పైరు నాట్యం చేస్తుంది.. పేదోడి మనసు ఉప్పొంగుతుంది.. అక్క చెల్లెమ్మల్లో కొత్త ఆనందం కనిపిస్తుంది.. రైతు మోములో తొలకరి సాక్షాత్కరిస్తుంది.. బడుగు బలహీనులకు కొండంత ధైర్యం వస్తుంది.. దగాపడ్డ గుండె గొంతుకకు భరోసా దక్కుతుంది.. ప్రజల గుండెల్లో ‘రాజ’న్నగా ముద్రవేసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతీక్షణం ప్రజలకే అంకితం చేశారు. ప్రజల పక్షాన్నే పోరాడారు. ప్రజాసంక్షేమమే పునాదిగా పనిచేశారు. ‘రాజన్న’ మాట చెబితే తప్పడు.. ఎన్ని అడ్డంకులెదురైనా మడమ తిప్పడు.. అన్నది ప్రజలు చెప్పే మాట. ఢిల్లీని సైతం ధిక్కరించి తన జనం కోసం నిలబడ్డ ధీరుడు. ఆయనే ఓ ధైర్యం రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలు రాక్షస క్రీడ ఆడుతున్న తరుణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో విపక్ష నేతగా జనం వాణి గట్టిగా వినిపించారు. అప్పటి టీడీపీ దోపిడీ పాలనపై నిప్పులు చెరిగారు. ఆ చీకటి పాలనతో నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు రాజన్న జనం బాటపట్టారు. మండుటెండలో ఆయన సాగించిన 1,475 కిలోమీటర్ల పాదయాత్రలో జనం గుండె తలుపుతట్టారు. నేనున్నానని కొండంత భరోసా కల్పించారు. అలాగే, ‘వ్యవసాయం దండగ’ అని పరిహసించిన ఆనాటి పాలకుల చేష్టలకు దిగాలు పడ్డ రైతును ఓదార్చారు. జబ్బు చేస్తే ఇల్లూ వాకిలీ అమ్ముకునే సామాన్య జనం దయనీయ స్థితికి చలించిపోయారు. చదువు కోసం అప్పులపాలయ్యే కుటుంబాల దీనగాధలు విన్నారు. ఇలా నడిచొచ్చిన నాయకుడికి యావత్ తెలుగు జాతి నీరాజనాలు పట్టింది. 2004లో అత్యధిక మెజారిటీతో అక్కున చేర్చుకుని అందలం ఎక్కించింది. రాజన్నే ‘గుండె’బలం పేదోడికి జబ్బొస్తే ఇల్లూ వాకిలీ అమ్ముకోవడమే రాజన్న సీఎం అయ్యే వరకూ ఉన్న పరిస్థితి. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం దక్కే విప్లవాత్మక పథకం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. లక్షల మంది జీవితాల్లో ఈ పథకం వెలుగు నింపింది. క్యాన్సర్, గుండె జబ్బులు, న్యూరో, గర్భకోశ వ్యాధులు.. ఇలా 942 జబ్బులను ఈ పథకంలో చేర్చారు. రూ.1,400 కోట్లు పథకానికి వెచ్చించారు. చిన్నారుల్లో వినికిడి లోపం సరిచేసేందుకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ కోసం ఒక్కొక్కరికీ రూ.6.5 లక్షలు వెచ్చించిన ఘనత ఆయనదే. కాల్ చేస్తే ‘కుయ్.. కుయ్.. కుయ్..’ మంటూ ప్రత్యక్షమయ్యే 108 అంబులెన్స్‌లు.. 104 వైద్య సేవలు.. ఇవన్నీ ఆయన తెచ్చిపెట్టినవే. పేదోడి ఇంట్లో మహానేత ముద్ర సొంతిల్లు కల వైఎస్వల్లే సాధ్యమైందని చాలామంది చెప్పుకుంటారు. 2004 వరకూ కేవలం రూ.500 కోట్లున్న గృహ నిర్మాణ బడ్జెట్‌ను 2009 నాటికి ఆయన రూ.5వేల కోట్లకు తీసుకెళ్లారు. కేవలం ఐదేళ్లలోనే 47 లక్షల ఇళ్లు నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. వృద్ధాప్యం భారమన్న వాదనను వైఎస్ దూరం చేశారు. పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చారు. 16 లక్షలున్న పెన్షన్లను 71 లక్షలకు పెంచి అర్హులందరికీ అందేలా చేశారు. అక్షర భిక్ష పెట్టిన నేత డాక్టర్, ఇంజనీర్ వంటి పెద్ద చదువులు పేదవాడి సొంతమైతేనే ఆర్థిక దుస్థితి మారుతుందని వైఎస్ బలంగా నమ్మారు. ఈ నేపథ్యంలోనే విప్లవాత్మకమైన ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. 11 లక్షల మంది బీసీలకు, 5 లక్షల ఎస్సీ, 1.8 లక్షల ఎస్టీలకు, 7.5 లక్షల మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం పెద్ద చదువులకు అవకాశం కల్పించింది. ఈ పథకంవల్ల ఎంతోమంది పెద్ద చదువులకు వెళ్లారు. ఇదే కాదు.. అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ నిజమైన అన్నగా నిలబడ్డారు. ఆర్థిక స్వావలంబన దిశగా పావలా వడ్డీ రుణ పథకాన్ని దిగ్విజయంగా అమలుచేశారు. ఆయన హయాంలో 85 లక్షల మందికి రూ.7 వేల కోట్లు అందాయి. ఫలితంగా స్వయం సహాయ సంఘాలు వైఎస్ కాలంలో బలమైన శక్తులుగా అవతరించాయి. స్వర్ణయుగానికి నాంది మే 14, 2004న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుక్షణమే రైతు పక్షపాతిగా ముద్ర వేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేశారు. అప్పటి నుంచి దాదాపు 35 లక్షల పంపుసెట్లకు పైగా ఉచిత విద్యుత్ అమలైంది. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ సబ్సిడీ క్రమంగా ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచితం హామీ చెక్కుచెదరలేదు. కరెంట్ చార్జీలు కట్టలేమన్న రైతుపై టీడీపీ ప్రభుత్వం పాశవికంగా పెట్టిన కేసులన్నీ ఎత్తేశారు. రూ.1,100 కోట్ల రైతు విద్యుత్ బకాయిలు ఒక్క సంతకంతో మాఫీ చేశారు. అప్పులపాలైన రైతన్నను రుణ విముక్తుల్ని చేశారు. నాణ్యమైన విత్తు, ఎరువు కోసం దిగ్గజ కంపెనీలతో రైతు కోసం పోరాడిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. రాజన్న పాలనలో మద్దతు రేటు పెరిగింది. తక్కువ వడ్డీ రుణాలతో దళారుల చెర నుంచి రైతు విముక్తి పొందాడు. -
నైపుణ్యం దిశగా తొలి అడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నైపుణ్యం దిశగా తొలి అడుగు పడుతోందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో నైపుణ్య శిక్షణ అకాడమీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో 7 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ఈ అకాడమీని నిర్మించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నైపుణ్య కల సాకారానికి వైఎస్సార్ జయంతి నాడు మొదటి అడుగు పడటం శుభపరిణామమని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరో 5 మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. స్కిల్ ఏపీ మిషన్– నైపుణ్య విశ్వవిద్యాలయం ధ్రువీకరించిన టెక్నికల్ అండ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వంటి పరిశ్రమలకు అవసరమైన గ్లోబల్ నమూనా తరహా అత్యాధునిక కోర్సులతో యువతకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. పులివెందుల అకాడమీ నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాలశాఖకు అప్పగిస్తూ ఇప్పటికే నైపుణ్య శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. -
తెలుగు వెలుగుల రేడు వైఎస్సార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కొంతమంది ముఖ్యమంత్రులది ప్రత్యేక స్థానం. సీఎంలుగా పనిచేసిన వారిలో రాష్ట్రాన్ని ప్రజారంజకంగా, ప్రమోదభరితంగా, ప్రగతిదాయకంగా పరిపాలించిన వారు చరితార్థులవుతారు. వారి పేర్లను జిల్లాల పేర్లగా ప్రకటించి, గౌరవించుకోవటం ఆనవాయితీ. ఆ ఘనత దక్కించుకున్న ముఖ్యమంత్రులు ఇద్దరే ఇద్దరు. వారు ప్రకాశం పంతులు, డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ప్రతిపక్షాలకు చెందినవారైనా సరే.. కోరి వచ్చి సాయం అడిగినవారిని, ఆయన నిరాశ పరి చింది ఎన్నడూ లేదు. ముఖ్యమంత్రి సహాయనిధిని నిజ మైన సేవానిధిగా మార్చింది ఆయనే. తనను కలిసారంటే వారి కోరిక క్షణాల్లో నెరవేరేది. క్యాంపు కార్యాలయం సామాన్య ప్రజలతో బారులు తీరి, నిత్యం కిటకిటలాడేది. బడుగు బలహీన వర్గాలవారూ, వ్యాపారులూ, ఉద్యోగులూ ప్రతీ ఒక్కరూ ఆనందంగా జీవించిన కాలమది. ‘మా ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టిన రోజులు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవైతే, అవి పూర్తయిన రోజే నాకు నిజమైన పుట్టినరోజు’’ తన జన్మదినం రోజున వైఎస్సార్ స్పందన ఇది. తెలుగు ప్రజలపైన, రాష్ట్ర భవితవ్యం పైన ఆయనకున్న మమకారం తాలూకు నిలువెత్తు విశ్వరూపం ఇది. గుండెలోతుల్లో నిక్షిప్తమైన ప్రేమాభిమానాలకు నిజరూప దర్శనమిది. ‘‘ప్రతీ పథకాన్నీ ప్రారంభించేముందు లేదా రూపకల్పన చేసేముందు ఈ పనివలన పేదవాడి ముఖంలో వెలుగు నిండుతుందా, వారికి ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుందా అని నన్ను నేను ప్రశ్నించుకుని, తర్వాతే అమలు చేస్తానన్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనా విధానాన్నే వైఎస్ కూడా ఆచరించారన్నది సుస్పష్టం. తన ప్రతీ పథకం ప్రయోజనకరంగా రూపుదిద్దుకుని, ప్రజల మన్ననలను పొందిందంటే అదే కారణం. ఈ రకంగా పుట్టుకొచ్చినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి వినూత్న పథకాలు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు! కడుపు నిండకుండానే ఎవరికైనా ఓ పూట గడవచ్చేమో కానీ వైఎస్సార్ పేరు తలవకుండా ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ఒక్కరోజు కూడా గడవదు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన, ఏదో ఒక సందర్భాన ప్రతి వ్యక్తీ ఆయన ప్రస్తావన తెస్తూనే ఉంటారు. ప్రజలు ఆయన్ని ఎంతగా ఆరాధిస్తున్నారో, ఆయన ఆకస్మిక అదృశ్యాన్ని ఎంతటి దుఃఖంగా భావిస్తున్నారో దీన్నిబట్టి అవగతమవుతుంది. వైఎస్సార్‌ని అర్థంతరంగా కోల్పోయి, వేదనలో ఉన్న ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విశిష్ట పరిపాలనతో సాంత్వన చేకూరుస్తూ ఆ లోటును తీరుస్తున్నారు. భౌతికంగా ఆయన దూరమైనా, రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుని మానసికంగా మన చెంతనే ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాల పేర్లతో వైఎస్సార్ పేరు కలిసి వుండడం, మరింత శోభనిస్తూ ప్రజల ప్రయోజనాల్ని నెరవేరుస్తూ ఉండటం, మరణించినా ఆయన బ్రతికి ఉన్నారన్నట్లుగా భావిస్తూ, నిరంతరం గుర్తుకు తెచ్చుకోవటం ఆ మహామనిషి సేవాస్ఫూర్తికి మనమిచ్చే ఘనమైన నివాళి. డా. ఎమ్.వి.జె. భువనేశ్వరరావు, ప్రముఖ కథారచయిత -
పండుగలా రైతు దినోత్సవం
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా రైతు దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయి మొదలు ఆర్బీకే స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల అనంతరం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. రెండో రోజు శుక్రవారం బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని, ఆ తర్వాత కడప నగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా.. – రూ.413.76 కోట్లతో నిర్మించిన 1,898 రైతు భరోసా కేంద్రాలు – రూ.79.50 కోట్లతో ఏర్పాటైన 100 వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, ఆక్వా ల్యాబ్‌లు, సీఏడీడీఎల్‌లు – ఆర్బీకేలకు అనుసంధానంగా రూ.96.64 కోట్లతో 611 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల (సీహెచ్‌సీలు)తో పాటు పాడిరైతుల కోసం ప్రత్యేకంగా 34 సీహెచ్‌సీల ప్రారంభోత్సవం – రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 కొత్త వెటర్నరీ ఆసుపత్రుల ప్రారంభం – రూ.400.30 కోట్ల వ్యయంతో 1,262 గోదాముల నిర్మాణానికి శంకుస్థాపనలు – రూ.200 కోట్లతో పోస్ట్ హార్వెస్టింగ్ వసతుల కల్పన – రూ.212 కోట్లతో మార్కెట్ యార్డ్‌లలోనూ నాడు– నేడు పనులు – రూ.7.53 కోట్లతో విజయవాడలో పాడిరైతుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ – రూ.45 కోట్లతో 45 కొత్త రైతు బజార్లకు శంకుస్థాపనలు, 6 రైతు బజార్ల ప్రారంభోత్సవం – రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నగదు ప్రోత్సాహకాలతో రైతులకు సత్కారం 9వ తేదీ సీఎం పర్యటన ఇలా.. – 10.40 గంటలకు బద్వేలు చేరుకుంటారు. – 11.10 –12.45 వరకు బద్వేలు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. – మధ్యాహ్నం 1.45 గంటలకు కడప చేరుకుంటారు. – 2.05 గంటలకు సీపీ బ్రౌన్ గ్రంథాలయం చేరుకుని సీపీ బ్రౌన్ విగ్రహాన్ని, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. – 2.40 – 3.25 గంటలకు కడప మహావీర్ సర్కిల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. – 3.50– 4.20 గంటలకు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరిస్తారు. – సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం బయలుదేరతారు. నేడు సీఎం పర్యటన ఇలా.. ► ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. ► 10.40 గంటలకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం 74 –ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ యూనిట్స్ పరిశీలిస్తారు. ► 11.20 గంటలకు రాయదుర్గం మార్కెట్ యార్డులో వైఎస్సార్ ఇంటిగ్రెటెడ్ అగ్రి ల్యాబ్ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడతారు. ► 11.45 – 1.10 గంటలకు విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ► 2.10 గంటలకు వైఎస్సార్ జిల్లా పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. ► 2.50 – 3.20 గంటలకు పులివెందులలోని ఇంటిగ్రెటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ► 3.55 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ చేరుకుంటారు. ► 4.10 – 4.55 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. -
ఆరోగ్యశ్రీ... ఏపీ భాగ్యం
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రూపుదిద్దుకున్న ఎన్నో సంక్షేమ, అభివృధ్ది పథకాలకు... అంతకు ముందు ఆయన సుదీర్ఘ ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఎదురైన అనుభవాలు, జనం అగచాట్లు స్వయంగా గమనించి చేసిన ఆలోచనలే మూలం. ఆయనను ప్రధానంగా కలచివేసిన అంశం, జబ్బుల బారిన పడిన పేద జనానికి మెరుగైన వైద్యం అందక ఆస్తులు అమ్ముకుని ప్రాణం కాపాడుకోవడానికి బడుగు జీవి పడిన పాట్లు ఒక డాక్టరుగా ఆయనలో సరికొత్త పథకానికి నాంది పలికింది. డబ్బులు ఉన్నవాడికే కార్పొరేట్ వైద్యం, లేనివాడు ఆరోగ్యం కోసం అప్పులపాలైనా కావాలి లేదా ప్రాణం మీద ఆశ వదులు కోవాలి. ఈ పరిస్థితిలో సమూల మార్పు తీసుకువచ్చి సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించే ధన్వంతరి మంత్రంగా ఆరోగ్యశ్రీ అమలులోకి వచ్చింది. వాస్తవానికి వైఎస్సార్ సీఎంగా రోజులో ఎక్కువ సంతకాలు చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య సాయం కోసం దరఖాస్తుల ఫైళ్లపైననే. 14.05.2004 నుంచి 26.06.2007 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 168.52 కోట్ల నిధులు విడుదల చేశారంటే పేదల ఆరోగ్యంపై ఎంతగా శ్రద్ధవహించేవారో అర్థం చేసుకోవచ్చు. జబ్బుపడ్డ పేదవాడి కుటుంబం ఆ ఆపత్కాలంలో సీఎం కార్యాలయం వరకు కలిగే ప్రయాసకు స్వస్తి చెప్పదల్చుకున్నారు వైఎస్సార్. డబ్బులు లేక వైద్యం అందని దుర్భర పరిస్థితులకు శాశ్వత పరిష్కారంగా ఆరోగ్యశ్రీని ప్రిస్క్రైబ్ చేసి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు డాక్టర్ వైఎస్సార్ చేసిన ప్రయత్నం, సాధించిన తక్షణ ఫలితాలు యావద్దేశం ఆరోగ్యశ్రీ వైపు దృష్టిపెట్టేట్టు చేశాయి. దేశంలో తొలిసారిగా బీపీఎల్ కుటుంబాలకు ఉచిత కార్పొరేట్ వైద్య సౌకర్యం కల్పిస్తూ ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. నేషనల్ హెల్త్ బిల్లులో, 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పేర్లు ఉన్నా ఆరోగ్యశ్రీ స్పూర్తిగా పేదలకు ఉచిత వైద్య బీమా పధకాలు అమలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోదీ హెల్త్ కేర్ వైఎస్సార్ తెచ్చిన ఆరోగ్యశ్రీ కోవలోనిదే. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని 229.11 లక్షల కుటుంబాలలో వైఎస్సార్ హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 198.25 లక్షల కుటుంబాలు (87 శాతం) ప్రయోజనం పొందడానికి అర్హత కలిగి ఉండేవి. తన సొంతఊరు పులివెందులలో ఒక రూపాయి ఫీజు తీసుకునే డాక్టరుగా పేరొందిన వైఎస్సార్.. ఆరోగ్యశ్రీతో పాటు వైద్య సేవారంగంలో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసును వైఎస్సార్ 2007 ఆగష్టు 15న ప్రారంభించారు. వైఎస్సార్ 108 సర్వీసును ప్రవేశపెట్టిన పదిరోజుల్లోగానే ఆగష్టు 29న అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ తమ రాష్ట్రంలో ఈ సర్వీసును అమలులోకి తీసుకువచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మార్చి అమలు చేస్తూ ఈ స్కీంను మరింత విస్తృతం చేసి రాష్ట్ర జనాభాలో 90 శాతం పైగా ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అందుకోవడానికి వీలు కల్పించారు. తన హయాంలో వైఎస్సార్ 940 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే, వైఎస్ జగన్ జనరల్ సర్జరీ నుంచి సైక్రియాట్రీ వరకు లెక్కకు మించిన వైద్య చికిత్సలను ఈ స్కీంలో చేర్చి తండ్రికి తనయుడు అనిపించుకుంటున్నారు. కరోనా బారిన పడిన వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద అన్ని హాస్పిటల్స్‌లో ఉచిత చికిత్స అందించేందుకు ఆదేశాలిచ్చిన వైఎస్ జగన్.. దేశంలో కరోనా చికిత్సను ఫ్రీ హెల్త్ సర్వీస్ కిందకు తెచ్చిన తొలి ముఖ్యమంత్రి. బీఎస్ రామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ -
అన్నం పెట్టడానికి ఆర్థిక ఇబ్బందులా?
సమాజానికి ఏదో చేయాలనే ఆకాంక్ష, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడాలనే కృత నిశ్చయం, సమస్యలపై ధైర్యంగా పోరాడే తత్వం, అన్నింటినీ మించి మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం... ఇవన్నీ కలగలిసిన జన నాయకుడు ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు మిషనరీ ఆసుపత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి, పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టి, రూపాయి ఫీజుకే వైద్యం అందించారు. 28 ఏళ్ల పిన్న వయసులోనే శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లుగా ఎంపీగా గెలిచారు. ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలిసిన సంస్కారవంతుడు వైఎస్. ఆయన దగ్గరకు వెళ్లిన ఏ ఒక్కరూ ఎన్నడూ అసంతృప్తికి లోను కాలేదు. 2009 ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తనదే బాధ్యత అని బహిరంగంగా, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రకటించిన నిఖార్సయిన నాయకుడు. ఓటమి లేకుండా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. తన హయాంలో సుమారు 10 వేల మంది పేద పిల్లలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించారు. ‘‘మీ పిల్లలకు పునర్జన్మనిచ్చే అవకాశం నాకు, నా ప్రభుత్వానికి కల్పించారు. నా జీవితం ధన్యమైంది’’ అని వినయంగా ప్రకటించారు. 2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి కుటుంబాన్ని కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తున్నట్లుగానే, అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ కూడా ఠంచనుగా అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుం బాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్. లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం ఒక సరికొత్త ప్రయోగం. ‘‘మేం 20 రాష్ట్రాల్లో పర్యటించాం. ఇలాంటి పథకం ఎక్కడా చూడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ సహా పలు సంక్షేమ పథకాలతో ఈబీసీలను ప్రోత్సహించడం, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించడం మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది’’ అని నాటి ఈబీసీ కమిషన్ ఛైర్మన్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రశంసించారు. దానికి వైఎస్ స్పందిస్తూ.. ‘అది మా ప్రభుత్వ బాధ్యత’ అని వినమ్రంగా సమాధానమిచ్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా వైఎస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంలో సీఎంగా ఉన్న వైఎస్.. బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. అప్పుడు సమయం రాత్రి 11గంటలు. గిరిజన గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం, కాన్సెప్ట్ స్కూళ్లపై వైఎస్ తో మాట్లాడారు. గిరిజన, పేద విద్యార్థులకు సరైన విద్య అందితే అద్భుతాలు సృష్టిస్తారని.. దేశ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తారని కలాం చెప్పారు. గిరిజన గురుకులాలు, ఆంగ్ల మాధ్యమంలో బోధన వంటి అంశాలను చేపట్టడంలో మీరు దేశానికే రోల్ మోడల్ అని ప్రశంసించారు. అప్పుడు వైఎస్.. ‘మీ ఆశీర్వాదాలు కావాలి సర్’ అంటే.. ఆయన ‘గాడ్ బ్లెస్ యు రాజశేఖర్’ అని దీవించారు. డాక్టర్ వైఎస్సార్‌కు రైతులంటే ఎనలేని అభిమానం. రైతులను నిర్లక్ష్యం చేస్తే కన్నతల్లిని నిర్లక్ష్యం చేసినట్లేనని చెప్పేవారు. రైతులకు నీళ్లిస్తే వారు ఎవరి మీదా ఆధారపడరని, రైతు బాగుం టేనే దేశం బాగుంటుందని స్పష్టం చేసేవారు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగునీరందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందం చూడడమే తన ఆకాంక్ష అన్నారు. జలయజ్ణం పేరిట రాష్ట్ర సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీటి వసతి కల్పించారు. వైఎస్ పాలించిన ఐదేళ్లూ రాష్ట్రంలో వర్షాలకు లోటు లేదు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రమంతటా జలాశయాలన్నీ నిండు కుండల్లా మారాయి. ‘వాన దేవుడు ఆంధ్రప్రదేశ్‌ను ఆశీర్వదించాడు’ అని వైఎస్ తరచూ చెప్పేవారు. దాదాపు 200 లక్షల టన్నుల ధాన్యం దిగుబడితో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఆవిర్భవించింది. ‘‘అధికారంలోకి వచ్చి, నేను సీఎం అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా విద్యుత్తును అందించలేని నాడు నేను ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కూడా కొనసాగను’’ అని ఢిల్లీ పెద్దలకు తేల్చిచెప్పిన ధీశాలి వైఎస్సార్. 2004లో సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వైఎస్ తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలుపైనే చేశారు. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అంతకముందు సచివాలయంలో జరిగిన చర్చలో కొందరు ఆర్థిక భారం అన్నారు. ‘‘పారిశ్రామికవేత్తలకు కోరినన్ని రాయితీలు ఇస్తారు. పేదవాడికి అన్నం పెట్టడానికి మనకు ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తాయా? ఇదేం పద్ధతయ్యా? ఇంతవరకు నేను ప్రారంభించిన పథకం ఏదైనా ఆగిపోయిందా? లేదు కదా?’’ అని వైఎస్ స్పష్టం చేశారు. పావలా వడ్డీ, అభయహస్తం, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి ప్రతి పథకాన్ని గొప్పగా అమలు చేశారు. ప్రతి పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. బీహెచ్ఈఎల్ ప్రాజెక్టును ఒక కేంద్రమంత్రి 2009లో రాజ స్తాన్ తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ‘‘దేశంలో మళ్లీ యూపీఏ అధికారంలోకి రావడానికి ఏపీనే కారణం. 30కి పైగా ఎంపీ సీట్లు ఇచ్చాం. ఈ ప్రాజెక్టు గనుక రాజస్తాన్ తీసుకెళ్తే నేను ఢిల్లీలో అడుగుపెట్టను. ఇది నా మాటగా ప్రధానికి చెప్పండి’’ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్‌కు చెప్పగా ‘‘రాజశేఖర్ చెప్పింది అక్షరాలా నిజం. మన్నవరం ప్రాజెక్టును ఏపీకే ఇద్దాం. నేనే శంకుస్థాపన చేయడానికి వెళ్తా. ఈ విషయాన్ని ఆయనకు చెప్పండి’’ అని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో హాలీవుడ్ నటుడు, నాటి కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్ ‘మిస్టర్ చీఫ్ మినిస్టర్, మీరు ఇంత ఫిట్‌గా ఉన్నారు. 9 కోట్ల జనాభా గల ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని ఒత్తిడిలో ఉండే మీకు ఇది ఎలా సాధ్యం?’ అని అడిగారు. ‘పాజిటివ్ థింకింగ్’ అని వైఎస్ చిరునవ్వుతో బదులిచ్చారు. ఎ. చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త వైఎస్ మాజీ మీడియా కార్యదర్శి -
రైతును రాజును చేసిన రాజన్న
ఏదైనా ఇవ్వడానికైనా, చేయడానికైనా మనసుండాలి. ఆ మంచి మనసున్న మారాజు కాబట్టే వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ముఖ్యమంత్రీ చేయలేనివి చేయగలిగారు, ఇవ్వలేనివి ఇవ్వగలిగారు. ఒక తార్కిక ఆలోచనతో రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా ఇచ్చారా? మహత్తరమైన ఆరోగ్యశ్రీ ఆలోచన అంతకుముందు ఎవరికైనా వచ్చిందా? కలలో కూడా సంకల్పించలేని జలయజ్ఞానికి ఏ నాయకుడైనా శ్రీకారం చుట్టారా? అందుకే రైతు సంక్షేమం కోసం అహరహం తపించిన ఆ మహా నాయకుడి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సముచితం. రైతు నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిగా, దేశ ఆర్థికమంత్రిగా, ప్రధానిగా రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాల రూప కర్త అయిన చౌదరి చరణ్‌సింగ్ జయంతి డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పేదవాడి పౌష్టికాహారం అయిన చేపల ఉత్పత్తిని పెంచడం కోసం హేరాలాల్ చౌదరి, కె.హెచ్.అలీ కున్హి శాస్త్ర వేత్తల బృందం 1957 జూలై 10న కృత్రిమ పద్ధతి ద్వారా చేప పిల్లల ఉత్పత్తి పెంచే విధానాన్ని కనుక్కొంది. నీలి విప్లవ విజయానికి కారణమైన ఆ పరిశోధన విజయవంతమైన రోజును జాతీయ మత్స్య రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున ఆయన జయంతి అయిన జూలై 8ని ప్రతి సంవత్సరం రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రైతు సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రీ చేయలేని పనులు చేశారు. 2004లో ఆయన సీఎంగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. వర్షాలు పడక, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల కాక, ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయి, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎగతాళిగా మాట్లాడారు అప్పటి ముఖ్య మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లుంటే 18 బ్యాంకులు దివాలా తీసిన పరిస్థితి. సీఎంగా వైఎస్ మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్ ముఖ్య మంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారు 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని జలయజ్ఞం ప్రారంభించారు. జలయజ్ఞంలో మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. మొదట పూర్తయ్యింది నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ ప్రాజెక్టు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పేర్లు పెట్టి ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ– నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టును చేపట్టి దానికి కమ్యూనిస్టు నాయకుడైన పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్ గర్వించే ఇంజనీర్ కె.ఎల్.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి, రాష్ట్రానికే వరమైన పోలవరంను మొదలు పెట్టడమే కాదు, సీఎంగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్పతనం ఆయనది. సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజెక్టులయితే, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వా లంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. కాల్వల నిర్వహణ ప్రభుత్వమే భరించాలి. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. సొంత ఖర్చుతో మోటార్లు కొనుక్కుంటున్నాడు. రైతు ఒక ఎకరంలో పంట పండించడం ద్వారా 40–60 పని దినాలు కల్పిస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాడు. కాబట్టి వ్యవసా యానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ఆయన సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. అయినా సంకల్ప బలం గెలిచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆదర్శమై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతోంది. వ్యవసాయ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. రైతుకు ఆదాయం తాను పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. ఉదాహరణకు 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో ఎక్కువగా సాగు జరిగే ధాన్యానికి పెరిగిన మద్దతు ధర రూ. 490 నుండి 550. అంటే 12.5 శాతం పెరుగుదల. అదే 2004 నుండి 2009 వరకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 550 నుండి 1,000 రూపాయలకు పెరిగింది. అంటే 82.5 శాతం పెరుగుదల. రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. అదీగాక కేంద్రం ప్రకటించిన రుణమాఫీలో సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతు సంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షల మంది రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున రూ. 1,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. దేశంలో ఇలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్. సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అమలు చేశారు. రాష్ట్రంలో సరాసరి 65 శాతం మంది రైతుల భూకమతాల పరి మాణం 1.05 సెంట్లు. మరో 22 శాతం మంది రైతుల పరిమాణం 3.45 ఎకరాలు మాత్రమే. అంటే 87 శాతం మంది రైతులకు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, బలహీన వర్గాల గృహాలు కేటా యించి ఈ వర్గాలను కాపాడటం జరిగింది. 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు ఇచ్చారు. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యలేదు. సంక్షేమ పథ కాలన్నీ అర్హులందరికీ అందాయి. భూములు అమ్ముకోవలసిన అవ సరం రాలేదు. రైతులకు ఆదాయం పెరగడంతో వ్యవసాయ కార్మి కులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలనగావించారు వైఎస్. నాన్న ఒక అడుగు వేస్తే, ఆయన వారసుడిగా తాను రెండు అడుగులు వేస్తానని ప్రకటించారు ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి. రైతు లకు ఉత్పత్తి వ్యయం తగ్గాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రెండేళ్లలోనే రైతులకు రూ. 13,101 కోట్లు అందించిన పథకానికి వైఎస్సార్. రైతు భరోసా –పీఎంకిసాన్గా నామకరణం చేయడం జరి గింది. అలాగే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం, వైఎస్సార్ కాపరి బంధు పథకాలను రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తోంది. పశు నష్ట పరిహారం పథకం, జలకళ పథకం, ఆసరా పథకం, చేయూత పథకం, కాపునేస్తం పథకం, వాహనమిత్ర పథకం, లా నేస్తం పథకం, కల్యాణ కానుక పథకం, కంటి వెలుగు పథకం, సంపూర్ణ పోషణ పథకం, గిరి పుత్రిక పథకం, ఈబీసీ నేస్తం లాంటివాటిని వైఎస్సార్ పేరుతో కొనసాగిస్తూ ప్రభుత్వం ఆ మహానేత పరిచిన బాటలో నడుస్తోంది. ఎం.వి.ఎస్. నాగిరెడ్డి వ్యాసకర్త వైస్ చైర్మన్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ -
వైఎస్సార్టీపీ ఆవిర్భావం నేడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను, తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని జూమ్‌లో ప్రత్యక్షంగా వీక్షించేలా లింక్‌ను పార్టీ యంత్రాంగం ఇప్పటికే దాదాపు పదివేల మంది వరకు షేర్ చేసినట్లు వెల్లడించింది. పార్టీకి సంబంధించి పాలపిట్ట, నీలం రంగుతో కూడిన జెండాను రూపొందించారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల రోడ్‌మ్యాప్ ఖరారైంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్కు నివాళులు.. గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి షర్మిల ఆశీర్వాదం తీసుకుంటారని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. అనంతరం ఉదయం 10.30కు ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానం లో బేగంపేటకు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి జేఆర్సీ కన్వెన్షన్‌కు రానున్నారు. మధ్యలో పంజగుట్ట చౌరస్తాలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పార్టీ ఆవిర్భావ వేడుక జరుగుతుందని అన్నారు. -
కుటుంబమే బలం... చెరగని రాజన్న స్మృతులు
-
నాయకులతో అధినాయకుడు రాజన్న
-
వైఎస్సార్ అరుదైన చిత్రాలు.. స్పెషల్ వీడియో
-
వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య అవార్డుల ప్రకటన
-
సంక్షేమ సంతకం.. చెదిరిపోని జ్ఞాపకం..
వెబ్‌డెస్క్: వైఎస్సార్.. ఆయన ఓ మరిచిపోలేని జ్ఞాపకం.. అభివృద్ధికి నడక నేర్పించడమే కాదు.. ప్రతీక్షణం పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాల మారాజుగా నిలిచిపోయారు. మహానేత తన ఐదేళ్ల మూడు నెలల అద్భుత పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఏం చేసినా సాహసోపేతమే.. కనిపించని, కనీవినీ ఊహించని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారు. శత్రువును సైతం ప్రేమించే గుణం వైఎస్సార్‌ది. పదవులు ఉన్నా, లేకున్నా.. పార్టీలకతీతంగా అందరిని ఆప్యాయంగా పలకరించేవారు. అందరితోనూ ఒకేలా వ్యవహరించేవారు.. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఆయనది. రాజన్నగా తన పేరును ప్రజల పిలుపుగా మార్చుకున్నారు. ప్రజల కలల సాకారానికి నిలువెత్తు సాక్షిగా నిలిచిన పాలకుడు రాజన్న. 1978లో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికైన తర్వాత ఆయన విజయపరంపర చివరి క్షణం వరకు విజయ పథం వైపు నడిపించింది. వ్యవసాయానికి ఊపిరినిచ్చి అన్నదాతల్లో ఆత్మ విశ్వాసం నింపారు. ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలు రద్దు, మద్దతు ధరలు, విత్తనాలు, ఎరువుల ధరలపై నియంత్రణ వంటి చర్యలతో అన్నం పెట్టే రైతుకు అండగా నిలిచారు. నిలువ నీడలేని పేదలందరికీ లక్షలాది ఇళ్లు కట్టించారు. ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకంతో రైతుల్లో ఆనందం నింపారు. ఉన్నత చదువులు అందని ద్రాక్ష అని దిగులు చెందుతున్న పేద విద్యార్థులను ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆదుకున్నారు. రైతుల కష్టాల తీర్చడానికి జలయజ్ఞంతో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు అంకురార్పణ చేసి అపర భగీరథడయ్యారు. పేదవాడికి రోగమొస్తే ఆస్తులమ్ముకునే దుస్థితిని ‘ఆరోగ్యశ్రీ’తో తప్పించి, కొండంత అండగా నిలిచారు. 108తో ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడారు. 104తో పల్లెలకు వైద్యం అందించారు. ఏ ఒక్కరు కూడ తిండికి ఇబ్బంది పడకూడదనే పెద్ద మనస్సుతో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. అర్హులైన పేదలకు ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ పథకాలను ప్రవేపెట్టారు. మహిళా సాధికారితకు ఇందిరా క్రాంతి పథకం రూపొందించారు. అభయహస్తం పేరుతో 60 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకూ పింఛన్ ఇచ్చారు. ఎన్ని సమస్యలు వచ్చినా.. తండ్రి బాటలో నడుస్తూ.. తండ్రి బాటలో నడుస్తూ... తండ్రికి తగ్గ తనయుణ్ని అనిపించుకుంటున్నారు సీఎం జగన్... తండ్రి గుర్తొచ్చేలా పరిపాలన సాగిస్తున్నారు. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్రజలకు చెప్పారు. తండ్రి ఫొటో పక్కన తన ఫొటో పెట్టుకునేలా పరిపాలిస్తానని.. ఎన్ని సమస్యలు వచ్చినా.. సహనం, ఓర్పుతో తనదైన మార్కు పాలన అందిస్తున్నారు. నవరత్నాలతో పాటు మరిన్ని అవసరాలను గుర్తించి, తాను అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వాటిని నెరవేర్చేందుకు సీఎం జగన్ పడుతున్న కష్టం ఎవరికీ తెలియంది కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్ పని చేస్తున్నారు. -
వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య అవార్డుల ప్రకటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులను 2021 ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్థలు, వ్యక్తులకు కలిపి 62 అవార్డులు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు (కమ్యునికేషన్స్), వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు జీవీడీ కృష్ణమోహన్ మీడియా సమావేశంలో అవార్డుల వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఈ అవార్డులను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసి ఈ ఏడాది ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పలు రంగాల్లో వివిధ సంస్థలు, వ్యక్తులు సమాజానికి అందించిన సేవలను గుర్తించి పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈ అవార్డులకు ఎంపిక చేశామని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖాధికారులు, పలు సంస్థలు, పలువురు వ్యక్తుల భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేశామని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. సామాన్యుల్లో అసామాన్యులను గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. సుదీర్ఘ కసరత్తుతో ఎంపిక తెలుగు వారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక రంగాల్లో విశేష సేవలందిస్తున్నారని కృష్ణమోహన్ తెలిపారు. వైఎస్సార్, సీఎం జగన్‌లది పేదవాడికి మేలు చేయాలనే ఫిలాసిఫీ అన్నారు. తెలుగువాడు అంటే నిండైన వ్యక్తిత్వం కలిగిన వారిలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు తగిన అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ కొద్ది నెలలుగా విస్తృతమైన కసరత్తు చేసిందన్నారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ కింద 50 అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, 62 అవార్డులను ఇస్తోందని చెప్పారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షలు నగదు, జ్ఞాపిక, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5 లక్షలు నగదు, జ్ఞాపికను అందించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆగస్టు 14 లేదా 15వ తేదీన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని అయన పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి(రాజకీయ) ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవార్డులను ఇస్తున్నారని తెలిపారు. 6 కేటగీరీల కింద మొత్తం 62 అవార్డులను ప్రదానం చేయనున్నారని చెప్పారు. సంస్థలు (అన్నింటికీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు) 1) ఎంఎస్ఎన్ ఛారిటీస్ ట్రస్ట్ - కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 2) సీపీ బ్రౌన్ లైబ్రరీ - వైఎస్సార్ జిల్లా 3) సారస్వత నికేతన్ లైబ్రరీ - వేటపాలెం, ప్రకాశం జిల్లా 4) శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ - అనంతపురం జిల్లా 5) ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ - వైఎస్సార్ జిల్లా 6) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ - అనంతపురం 7) గౌతమి రీజినల్ లైబ్రరీ - రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా 8) మహారాజాస్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ - మ్యూజిక్ - విజయనగరం --------------------------------------------- రైతులు 1) స్వర్గీయ పల్లా వెంకన్న (లైఫ్ టైమ్) - కడియం నర్సరీల వ్యవస్థాపకుడు 2) మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ - శ్రీకాకుళం 3) ఎం.సి.రామకృష్ణారెడ్డి - అనంతపురం 4) కొట్యాడ శ్రీనివాసరావు - విజయనగరం 5) విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ - కృష్ణా 6) ఎం.బలరామిరెడ్డి - వైఎస్సార్ జిల్లా 7) ఎస్.రాఘవేంద్ర - చిత్తూరు 8) సెగ్గె కొండల్రావు - విశాఖపట్నం 9) ఆంధ్ర కశ్మీర్ ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ - విశాఖపట్నం 10) వల్లూరు రవికుమార్- కృష్ణా 11) శివ అభిరామరెడ్డి - నెల్లూరు --------------------------------------------- కళాకారులు 1) పొందూరు వస్త్రాలు - ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం - శ్రీకాకుళం - లైఫ్ టైం 2) జానపద గేయం - దివంగత వంగపండు ప్రసాదరావు- విజయనగరం - లైఫ్ టైం 3) బొబ్బిలి వీణ - బొబ్బిలి వీణ కేంద్రం (అచ్చుత నారాయణ)- విజయనగరం - లైఫ్ టైం 4) రంగస్థలం - పొన్నాల రామసుబ్బారెడ్డి - నెల్లూరు - లైఫ్ టైం 5) సురభి నాటకం - (శ్రీ వినాయక నాట్య మండలి) - సురభి డ్రామా - వైఎస్సార్ జిల్లా - లైఫ్ టైం 6) లెదర్ పప్పెట్రీ - దాలవాయి చలపతి -అనంతపురం - లైఫ్ టైం 7) కూచిపూడి నాట్యం - సిద్ధేంద్రయోగి కళా క్షేత్రం - కూచిపూడి, కృష్ణా జిల్లా - లైఫ్ టైం 8) «ధింసా నృత్యం- కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం - విశాఖపట్నం 9) సవర పెయింటింగ్స్ - సవర రాజు - శ్రీకాకుళం 10) వీధి నాటకం - మజ్జి శ్రీనివాసరావు - విశాఖపట్నం 11) డిజాస్టర్ మేనేజ్మెంట్ - ధర్మాడి సత్యం- తూర్పు గోదావరి 12) హరికథ- సర్వారాయ హరికథా పాఠశాల (మహిళ) - తూర్పు గోదావరి 13) బుర్రకథ- మిరియాల అప్పారావు - పశ్చిమ గోదావరి 14) కొండపల్లి బొమ్మలు - కూరెళ్ల వెంకటాచారి- కృష్ణా 15) డప్పు కళాకారుడు - గోచిపాత గాలేబు-కృష్ణా 16) వెంకటగిరి జమదానీ చీరలు - జి.రమణయ్య- నెల్లూరు 17) కలంకారీ పెయింటింగ్స్- శివప్రసాదరెడ్డి- కర్నూలు 18) ఉడ్ కార్వింగ్స్ - బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్జిజాన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ - చిత్తూరు 19) నాదస్వరం - డాక్టర్ వి.సత్యనారాయణ - చిత్తూరు 20) కేలిగ్రఫీ - పూసపాటి పరమేశ్వరరాజు - విజయనగరం ------------------------------------------------------------------ రచయితలు (అందరికీ లైఫ్ టైం) 1) స్వర్గీయ కాళిపట్నం రామారావు (కారా మాస్టర్)- శ్రీకాకుళం 2) కత్తి పద్మారావు - అభ్యుదయ సాహిత్యం - గుంటూరు 3) రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి- సాహిత్యం - వైఎస్సార్ జిల్లా 4) బండి నారాయణస్వామి - సాహిత్యం- అనంతపురం 5) కేతు విశ్వనాథరెడ్డి - సాహిత్యం - వైఎస్సార్ జిల్లా 6) కొనకలూరి ఇనాక్ - సాహిత్యం, గుంటూరు 7) శ్రీమతి లలితకుమారి (ఓల్గా) - సాహిత్యం- గుంటూరు ---------------------------------------------------------- పాత్రికేయులు (అందరికీ లైఫ్ టైం) 1) పాలగుమ్మి సాయినాథ్ - చెన్నై 2) ఏబీకే ప్రసాద్ - కృష్ణా 3) దివంగత పొత్తూరి వెంకటేశ్వరరావు - గుంటూరు 4) దివంగత షేక్ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ) - గుంటూరు 5) దివంగత కె.అమర్నాథ్ - పశ్చిమ గోదావరి 6) సురేంద్ర - కార్టూనిస్ట్ - కడప 7) తెలకపల్లి రవి - కర్నూలు 8) ఇమామ్ - అనంతపురం ------------------------------------------- కోవిడ్ వారియర్స్ 1) డాక్టర్ నీతిచంద్ర - ప్రొఫెసర్ పల్మనాలజీ - నెల్లూరు 2) డాక్టర్ కె.కృష్ణకిషోర్ - ప్రొఫెసర్ ఈఎన్టీ - కాకినాడ 3) లక్ష్మి - స్టాఫ్ నర్స్ - జీజీహెచ్, విజయవాడ 4) కె.జ్యోతిర్మయి - స్టాఫ్ నర్స్ - అనంతపురం 5) తురుబిల్లి తేజస్వి - స్టాఫ్ నర్స్ - విశాఖపట్నం 6) ఎం.యోబు - మేల్ నర్సింగ్ - నెల్లూరు 7) అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ - గుంటూరు 8) ఆర్తి హోమ్స్ - వైఎస్సార్ కడప ఎచివ్‌మెంట్ అవార్డుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మహానేత సాయం: ఆ ఉత్తరం విద్యార్థి జీవితాన్ని మార్చేసింది
సాక్షి, విశాఖపట్పం: ప్రతి మనిషి పుట్టడం కాలం చెల్లించడం ఖాయం. కానీ ఆ మధ్య కాలంలో చేసిన పనులు చిరస్థాయిగా నిలుస్తాయి. మంచి పనులు చేసిన వారు మహానుభావులుగా నిలుస్తారు. ఆ కోవలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మేలు ఓ కుటుంబాన్ని సమూలంగా మార్చేసింది. ఇంటర్మీడియట్ చదవడానికి వైఎస్ చేసిన సహాయంతో ఎంటెక్ పూర్తి చేసి ఒక ఉన్నత ఉద్యోగిగా మారిన ఓ యువకుడి పై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామానికి చెందిన మజ్జి శంకర్రావు, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శాంతి కుమార్ 2003 గుడిలో పదవ తరగతి 476 మార్కులతో పాసయ్యారు. ఇంటర్ చదవడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిభ పురస్కారం ఐదు వేల రూపాయలు పొందడానికి అవకాశం ఉన్నప్పటికి అతడికి ఆ సాయం లభించలేదు. ఎన్నిసార్లు విద్యాశాఖకు లేఖ రాసిన స్పందన లేదు. ఆ సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి తమ సమస్య విన్నవించుకున్నారు. వెంటనే వైఎస్సార్ ప్రభుత్వానికి లేఖ రాసి ప్రతిభ పురస్కారం అందేలా చేశారు. ఆ తర్వాత శాంతి కుమార్ బాగా చదువుకుని మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత ఎంటెక్ పూర్తి చేసి.. విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్‌లో డిప్యూటీ మేనేజర్‌గా ఎంపికయ్యారు. మహా నేత చేసిన సహాయం వృధా కాకూడదని అందరికీ సహాయపడటమే కాక ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని శాంత కుమార్ విధులు నిర్వహిస్తున్నారు.