సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నేతలు కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, వైఎస్సార్ ఇప్పుడు సీఎం జగన్ రూపంలో ఉన్నారని, ఆయన ప్రతి లక్షణాన్ని సీఎం జగన్ పుణికిపుచుకున్నారన్నారు. ‘‘ఈ రోజు ప్రతి కార్యకర్త గర్వంగా జగనన్న మనుషులం అని చెప్పుకునేవిధంగా పాలిస్తున్నారు. వైఎస్సార్ ఆత్మ శాంతి కలిగేలా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈ తరానికి సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ అని గర్వంగా చెప్పుకునేలా పాలిస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.
చదవండి: ఆపదొస్తే నేనున్నా.. మనసున్న మారాజు మా రాజన్న
‘‘రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతున్నారు. జగనన్న సురక్షతో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత వేగంగా సమస్య కి పరిష్కారం చూపిస్తున్నారు. వైఎస్సార్ దార్శనికతను ఈరోజు సీఎం జగన్ ఆచరణలో చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన 70 నుండి 80 శాతం మంది జగనన్నే కావాలని ప్రజలు చెప్తున్నారు. చంద్రబాబు ఒక్కటి కూడా చెప్పుకోవడానికి లేదు. 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు ఏం చేసాడో చంద్రబాబు చెప్పుకోలేని పరిస్థితి. అన్ని వ్యవస్థలను సీఎం జగన్ రిపేర్ చేసి దేశానికి ఆదర్శంగా మలిచారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..:
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఇండిపెండెంట్‌గా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తూ కేంద్రం నుంచి నిధులు తీసుకు రాగలుగుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం పై అయినా అవసరం అయినప్పుడు అభిప్రాయాలను నిర్భయంగా చెబుతున్నారు. సీఎంగారికి రాష్ట్ర ప్రయోజనాలు అత్యధిక ప్రాధాన్యం.
వారిది అదేపనిగా దుష్ప్రచారం
సీఎంగారు తన కేసుల కోసమే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. దాన్నే వారి అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. వారు ఏ పాట పాడినా ఏ కూత కూసినా ప్రచారం చేయడానికి రెండు పత్రికలు, నాలుగు ఛానళ్లో ఉన్నాయి. అందుకే వారలా మాట్లాడుతుంటారు. నిజానికి విపక్షనేత, ఆయన కుమారుడి సభలకు ప్రజా స్పందన లేకపోతే, తడికలు కట్టి దానిలో జనాన్ని నింపుకుని వాటిని చిత్రీకరించి ప్రచారం చేసుకుంటున్నారు. లోకేష్, చంద్రబాబు జూమ్ మీటింగ్‌లు.. కెమెరా ఎదుట చేసే విన్యాసాలను వారి అనుకూల టీవీలు, పత్రికలలో వేస్తుంటారు. అలా రోజూ ఏదో ఒకటి వేస్తుంటారు. మరేదో మాట్లా్లడుతుంటారు. కానీ ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు.
ఆనాడు ఒక్కటైనా సాధించారా?
2014 నుంచి కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న చంద్రబాబు, ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు, వారితో ఉంటే ప్రాబ్లమ్ అనుకుని బయటకు వచ్చేశారు. అంతకు ముందు చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకే ప్రయత్నించారు తప్ప, ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయలేదు.ప్రత్యేక హోదా విషయంలో చూస్తే.. పోలవరం కాంట్రాక్ట్ ఇవ్వగానే ప్యాకేజికి సంతకాలు పెట్టి వచ్చారు. ఎన్డీఏలో భాగస్వామిగా తాను సాధించుకుని వచ్చింది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అదే ఈరోజు జగన్‌గారు చూస్తే ఇండిపెండెంట్‌గా కేంద్రంతో మంచి సంబంధాలు నెరుపుతూ అన్నీ సాధించుకు వస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సినవి గతంలో తీసుకు రాలేనివి.. ఈరోజు ఎలా తీసుకురాగలుగుతున్నారు. అదీ జగన్‌గారి ఘనత.
మా స్టాండ్ మారలేదు
ఉచిత పథకాల వల్ల రాష్ట్రం అప్పులపాలవుతోందని పదే పదే విమర్శిస్తున్న చంద్రబాబు, అవే పథకాలు అమలు చేస్తానని చెబుతున్నారు. దాన్ని ఎల్లో మీడియాలో రాస్తున్నారు. ఇంకా రాష్ట్రానికి నిధులు రాకుండా, రుణాలు దక్కకుండా కుట్రలు చేస్తున్నారు. అందుకోసం బ్యాంకులకు లేఖలు రాస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్నారు. అయినా రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తున్నాయి. అలా అని చెప్పి, వాటి కోసం మా వైఖరి మార్చుకోలేదు కదా? మా ఇండిపెండెంట్ స్టాండ్ వదిలేశామా?. లేదే?.
రాజీ లేని ప్రయత్నం
రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి వస్తే వేగంగా స్పందిస్తున్నాం. స్టేక్ హోల్డర్స్‌తో చర్చించాల్సినవి ఏమైనా ఉంటే వెంటనే అందరికి చెబుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఎక్కడా రాజీ పడడం లేదు. ఆ విషయంలో నిర్భయంగా వ్యవహరిస్తున్నాం. ఎక్కడ, ఏం మాట్లాడాలో అక్కడ అలా వ్యవహరిస్తున్నాం. అలా నిరంతరం పని చేస్తూ, రాష్ట్రానికి అవసరమైన వాటిని సాధిస్తున్నాం.
ఇది రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలతో పాటు, పొరుగు రాష్ట్రాల వారికి కూడా తెలుసు. అందుకే సీఎం శ్రీ వైయస్ జగన్ ఒక్కరే సక్సెస్‌ఫుల్‌గా హౌ టూ మెయిన్‌టెయిన్ ది బ్యాలెన్స్ విత్ సెంటర్ విత్ అవుట్ లూజింగ్ ఐడెంటిటీ.. అని చర్చించుకుంటున్నారు.
దిక్కు తోచక పిచ్చి మాటలు:
చంద్రబాబుకు ఎలాంటి ఐడెంటిటి లేదు. ఆయన మామను తిట్టి తిట్టి ముంచాడు. కాంగ్రెస్‌ను అంతే. కేంద్రంతో కలిసి ఉన్నన్ని రోజులు పొగిడి, కూటమి నుంచి బయటకు రాగానే ప్ర«ధాని మోదీని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. మళ్లీ ఈరోజు ఉనికి కోసం, మోదీ బ్రహ్మాండమైన నాయకుడు అంటున్నాడు. అయినా అనుకున్నది సాధించలేక పోతున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబుకు ఎటూ విలువ లేదు. ఇప్పుడు ఆయన కొడుకుది కూడా అదే పరిస్థితి. లోకేష్‌కు కూడా ఏ మాత్రం విలువ లేదు. తండ్రీ కొడుకులు ఇద్దరిపై ప్రజల్లో నమ్మకం లేదు. అందుకే దిక్కు తోచక నిత్యం మా ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా పిచ్చి విమర్శలు చేస్తున్నారు.
ముగ్గురు పిల్లలున్నా తల్లికి వందనం (అమ్మ ఒడి పథకం)లో ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. వారు చెప్పేవన్నీ వాస్తవాంశాలని, ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. అందుకే సీఎంగారి కంటే ఇంకా ఎక్కువ ఏమేమో చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు.
అది మోసం కాదా?:
మేం ఇటీవల ఒకటి గమనించాం. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఏ హామీలైతే ఇచ్చాడో.. వాటినే నేడు తిరిగి చెబుతున్నారు. 2014లో చెప్పిన వాటినే 2024 ఎన్నికలకు ముందు కూడా చెబుతున్నాడంటే.. 2014 నుంచి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా, వాటిని నెరవేర్చనట్లే కదా? అంటే అది ప్రజలను మోసం చేయడమే కదా? మీ కరపత్రిక ఈనాడులో అప్పట్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ చూసే మాట్లాడుతున్నాం. చంద్రబాబుది అరిగిపోయిన రికార్డు. 2029లో కూడా మళ్లీ అవే మాటలు మాట్లాడతాడు. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నైజం. కాబట్టే చంద్రబాబు మాటలను ప్రజలు అస్సలు నమ్మడం లేదు.
జగన్ ఏనాడూ మాట తప్పలేదు:
రైతుల రుణాలు మాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చిన చంద్రబాబు, వారిని నమ్మించి అధికారంలోకి వచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఆ రుణమాఫీ సాధ్యం కాదని గట్టిగా నమ్మిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఆనాడు ఆ హామీ ఇవ్వలేదు. తనకు అధికారం కావాలనుకుంటే, తాను కూడా ఆనాడు ఆ హామీ ఇచ్చి ఉండేవారు. కానీ ఆచరణ సాధ్యం కాని వాటిపై ఆయన ఏనాడూ మాట ఇవ్వలేదు. అప్పుడు మా పార్టీ కేవలం ఒక్క శాతం ఓటు తేడాతో ఓడిపోయింది.
అధికారం కోసం జగన్‌గారు ఏనాడూ అడ్డదారులు తొక్కలేదు. అలాగే ఇచ్చిన మాట తప్పలేదు. చేసేదే చెప్పారు. చెప్పిందే చేశారు. అదీ జగన్‌గారి వ్యక్తిత్వం. విధానం.
పిలవని పేరంటానికి ఆరాటం
ఎన్డీఏ పాతమిత్రులను పిలుస్తోందనుకుంటూ, తమకూ పిలుపు వస్తుందని తెలుగుదేశం పార్టీ ఆరాట పడుతోంది. నిజానికి బీజేపీ పిలవకపోయినా మళ్లీ కూటమి (ఎన్డీఏ)లోకి వెళ్లాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకే చంద్రబాబు ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నట్లు ఉన్నారు. అయితే అది ఆ రెండు పార్టీలకు సంబంధించిన అంశం. మేము దానిపై పట్టించుకోము. ప్రజల్లో పూర్తి ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ, ఎలాగోలా ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అధికారం కోసమే కలిసే ప్రయత్నం చేస్తే ఆ కూటమికి రంగు, రుచి, వాసన ఉండదు అని అన్నారు.
మా పార్టీ అలా వ్యవహరించదు
పార్టీ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం మా పార్టీ సిద్ధాంతం కాదు. మేము ఏనాడూ అలా వ్యక్తిగత విమర్శలకు దిగం. నిజానికి ఆ అలవాటు తెలుగుదేశం, జనసేన పార్టీలకే ఉంది. వైయస్‌గారి కుటుంబం విలువలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే మా పార్టీ కార్యకర్తలు కూడా ఏనాడూ ఆ విధంగా వ్యవహరించరు. రాజకీయాలు ప్రజలలో తేల్చుకోవాలనేది మా పార్టీ సిద్ధాంతం.
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి
వాస్తవానికి గతంలో చూస్తే ఎన్టీఆర్ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతీనే అక్రమంగా ఉంచుకున్నారని ఆనాడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ముద్ర వేశారు. అలాంటి వికృతమైన ఆలోచనలు వారివే. వ్యక్తిత్వ హననం చేసే అలవాటు టీడీపీకే ఉంది. రాజకీయాన్ని బురదగా మార్చిన వ్యక్తి చంద్రబాబు. అందుకే వారు దీని గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. పవన్‌కళ్యాణ్ కూడా ఆ తానులోని ముక్కే అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment