సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమం అనంతరం అరకు ఎంపీ తనూజ రాణి మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారని.. ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ప్రజల్లో గుండెల్లో వైఎస్ ఎప్పటికీ ఉంటారని ఆమె అన్నారు. పోడు భూములు విషయం లో గిరిజనులకు చేసిన మేలు మరిచి పోలేము. గిరిజనుల ఆరాధ్య దైవం మోద కొండమ్మ చిత్ర పటంతో పాటు , మా గిరిజనుల ప్రతి ఇంటిలో వైఎస్సార్ చిత్ర పటం ఉంది.. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన మా గిరిజన గ్రామాల్లో, ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తనూజ రాణి అన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment