సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 74వ జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు.
►పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ అవినాష్‌రెడ్డి పూలమాల వేసి నివాళర్పించారు.
►దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో అనంతపురం జిల్లా నిర్వహించే వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల భీమా పరిహారాన్ని అందించనున్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు.
► అనంతపురం జిల్లాలో కార్యక్రమం అనంతరం వైఎస్సార్ జిల్లా పర్యటనకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పిస్తారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment