
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ ఏర్పాట్లు
ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment