
వైఎస్ఆర్ జిల్లా : కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
గతంలో డబ్బులు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వాహిద్ పలువురు యువతుల్ని మోసం చేశాడు. ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యాలయానికి వెళితే.. బాధుతుల్ని తమ చెల్లెళ్లుగా పరిచయం చేసేవాడు. ఇలా గత ఏడాది డిసెంబర్‌లో ఓ యువతికి డబ్బులు, ఉద్యోగం ఎరగా చూపించాడు వాహిద్. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం అడిగితే మోహం చాటేసినట్లు తెలుస్తోంది.
తాజాగా పీఏ వాహిద్ మాటలకు మోసపోయామని గుర్తించిన ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పీఏ వాహిద్ అంగబలం, ఆర్ధిక బలం ముందు బాధితులకు న్యాయం జరగలేదు. పైగా, న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని మహిళ ఆరోపిస్తోంది.

బాధిత మహిళ తమ గోడువెళ్ల బోసుకునేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్లారు. తాను వాహిద్ మాటలు నమ్మి మోసపోయామని,న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.