సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీలో మైనింగ్ ఆధిపత్య పోరు సాగుతోంది. వేముల మండలంలో చింతల జూటూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మైనింగ్ నిర్వహిస్తుండగా.. ఈ మైనింగ్‌లో తనకు 50 శాతం వాటా ఇవ్వాలంటూ మరో టీడీపీ నేత తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల టిఫిన్ బైరటీస్ కంపెనీకి చెందిన దాదాపు 15 కోట్ల ముగ్గురాయిని ఆ నేత తరలించినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మరింత రెచ్చిపోతున్న సదరు నేత.. తాజాగా సొంత పార్టీ నేతలు నిర్వహిస్తున్న మైనింగ్‌లోను వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నాడు. తమ మైనింగ్‌లో వాటా ఇచ్చేందుకు మరో వర్గం నాయకులు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆ నాయకుల మైనింగ్ పనులు తన అనుచరుల ద్వారా సదరు నేత నిలిపివేయించాడు. దీంతో ఆ నేతపై చింతల్ జూటూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ముందస్తు సమాచారంతో పోలీసులు చింతల్ జూటూరు గ్రామానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment