MLA Madhava reddy
-
పెరిగిపోతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు
వైఎస్ఆర్ జిల్లా : కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో డబ్బులు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వాహిద్ పలువురు యువతుల్ని మోసం చేశాడు. ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యాలయానికి వెళితే.. బాధుతుల్ని తమ చెల్లెళ్లుగా పరిచయం చేసేవాడు. ఇలా గత ఏడాది డిసెంబర్లో ఓ యువతికి డబ్బులు, ఉద్యోగం ఎరగా చూపించాడు వాహిద్. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం అడిగితే మోహం చాటేసినట్లు తెలుస్తోంది. తాజాగా పీఏ వాహిద్ మాటలకు మోసపోయామని గుర్తించిన ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పీఏ వాహిద్ అంగబలం, ఆర్ధిక బలం ముందు బాధితులకు న్యాయం జరగలేదు. పైగా, న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని మహిళ ఆరోపిస్తోంది.బాధిత మహిళ తమ గోడువెళ్ల బోసుకునేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్లారు. తాను వాహిద్ మాటలు నమ్మి మోసపోయామని,న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన’
నల్లబెల్లి : తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని నందిగామలో శనివారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రంగయ్యచెరువు రిజర్వాయన్ నిర్మాణం చేపట్టి నర్సంపేట నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దివాళాకోరు తనంతో అడ్డుకుంటోందని ఆరోపించారు. ఇకనైనా హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం నందిగామ ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్ను సందర్శించిన ఆయన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మైలగాని కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డితో పాటు కె.శ్రీనివాస్, హిం గె మురళీధర్, ఎర్రబెల్లి రఘుపతిరావు, ఎన్.రాజారాం, జంగిలి శంకరయ్య, జె.మోహన్ పాల్గొన్నారు. -
క్రీడాభివృద్ధికి ప్రభుత్వ సహకారం పెంచాలి
ఘనంగా ఎస్జీఎఫ్ఐ క్రీడలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట : దేశ కీర్తిని పెంపొందించడంలో క్రీడలు ముఖ్య భూమిక పోషిస్తున్నందువల్ల క్రీడలకు ప్రభుత్వాల సహకారం పెంచాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని బాలుర హైస్కూల్లో మంగళవారం 62వ ఎస్జీఎఫ్ఐ క్రీడలను ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నత విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు క్రీడాకారులకు మెరుగైన వసతులు ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తాయన్నారు. ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో మహిళలు కూడా రాణిస్తున్నందున పాఠశాలల స్థాయి నుంచే బాలికలు క్రీడా విభాగంలో శిక్షణ పొందాలన్నారు. డిప్యూటీ డీఈఓ రవీందర్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో కలసి కబడ్డీ ఆడారు. డిప్యూటీ డీఈఓ, ఎమ్మెల్యే ఇరుజట్లకు కెప్టెన్లుగా వ్యవహరించి అలరింపజేసారు. కార్యక్రమంలో ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావు, కౌన్సిలర్ పాలాయి శ్రీనివాస్, పుల్లూరి స్వామి, ఎంఈఓ సారయ్య, గుడిపూడి రాంచందర్రావు, పుల్లూరి శ్రీనివాస్, ఎర్ర జగన్మోహన్రెడ్డి, వంగేటి అశోక్, పీఈటీలు బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాభివృద్ధికి ప్రభుత్వ సహకారం పెంచాలి
ఘనంగా ఎస్జీఎఫ్ఐ క్రీడలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట : దేశ కీర్తిని పెంపొందించడంలో క్రీడలు ముఖ్య భూమిక పోషిస్తున్నందువల్ల క్రీడలకు ప్రభుత్వాల సహకారం పెంచాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని బాలుర హైస్కూల్లో మంగళవారం 62వ ఎస్జీఎఫ్ఐ క్రీడలను ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నత విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు క్రీడాకారులకు మెరుగైన వసతులు ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తాయన్నారు. ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో మహిళలు కూడా రాణిస్తున్నందున పాఠశాలల స్థాయి నుంచే బాలికలు క్రీడా విభాగంలో శిక్షణ పొందాలన్నారు. డిప్యూటీ డీఈఓ రవీందర్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో కలసి కబడ్డీ ఆడారు. డిప్యూటీ డీఈఓ, ఎమ్మెల్యే ఇరుజట్లకు కెప్టెన్లుగా వ్యవహరించి అలరింపజేసారు. కార్యక్రమంలో ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావు, కౌన్సిలర్ పాలాయి శ్రీనివాస్, పుల్లూరి స్వామి, ఎంఈఓ సారయ్య, గుడిపూడి రాంచందర్రావు, పుల్లూరి శ్రీనివాస్, ఎర్ర జగన్మోహన్రెడ్డి, వంగేటి అశోక్, పీఈటీలు బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.