‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన’
నల్లబెల్లి : తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని నందిగామలో శనివారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రంగయ్యచెరువు రిజర్వాయన్ నిర్మాణం చేపట్టి నర్సంపేట నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దివాళాకోరు తనంతో అడ్డుకుంటోందని ఆరోపించారు.
ఇకనైనా హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం నందిగామ ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మైలగాని కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డితో పాటు కె.శ్రీనివాస్, హిం గె మురళీధర్, ఎర్రబెల్లి రఘుపతిరావు, ఎన్.రాజారాం, జంగిలి శంకరయ్య, జె.మోహన్ పాల్గొన్నారు.